ఇంద్రాణి కస్టడీ పొడిగింపు | Sheena case: Judicial custody of accused extended till Oct 5 | Sakshi
Sakshi News home page

ఇంద్రాణి కస్టడీ పొడిగింపు

Published Mon, Sep 21 2015 4:35 PM | Last Updated on Sat, Sep 29 2018 5:33 PM

ఇంద్రాణి కస్టడీ పొడిగింపు - Sakshi

ఇంద్రాణి కస్టడీ పొడిగింపు

ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాని నిందితురాలు షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జియా కస్టడీ మరింత పొడిగించారు. ఆమెతోపాటు ఆమె భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యాం రాయ్కు అక్టోబర్ 5 వరకు స్థానిక కోర్టు కస్టడీ విధించింది. 2012 ఏప్రిల్ నెలలో తన కన్న కూతురుని ఇంద్రాణి ముఖర్జీ దారుణంగా చంపేసి అనంతరం రాయఘడ్ అడవుల్లో పాతిపెట్టిన విషయం తెలిసిందే.

ఈ విషయం ఇటీవల వెలుగులోకి రావడంతో ఈ నెల ఓ రెండు రోజులపాటు సుధీర్ఘంగా ప్రశ్నించిన పోలీసులు అనంతరం ఆమెను సెప్టెంబర్ 7న స్థానిక కోర్టులో హాజరుపరిచారు. దాంతో కోర్టు ఈ నెల 21 వరకు కస్టడీ విధించగా అది నేటితో పూర్తయింది. దీంతో మరోసారి కోర్టుకు హాజరుపరిచి అక్టోబర్ 5 వరకు కస్టడీకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement