ముంబై: ముంబై బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు హిట్ అండ్ రన్ కేసు నిందితుడు మిహిర్ షాకు మంగళవారం ముంబై కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కోర్డు ఆదేశాల మేరకు నిందితుడు జూలై 30 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉంటారు. హిట్ అండ్ రన్ కేసులో నిందితుడు మిహిర్ షాను పోలీసులు జూలై 9న అరెస్ట్ చేశారు.
ఇక ఇదే కేసులో మిహిర్ షా డ్రైవర్ అరెస్ట్ పోలీసులు అరెస్ట్ చేయగా జూలై 11వ తేదీన అతనికి కూడా కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న నిందితుడి తండ్రి రాజేశ్ షాను పోలీసులు జూలై 7న అరెస్ట్ చేయగా.. ఆయన జూలై 8న కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
జులై 7 ఆదివారం ఉదయం 5.30 గంటలకు ముంబైలోని వర్లీ ప్రాంతంలో మిహిర్ షా మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును వేగంగా నడుపుతూ ముందువెళ్తున్న స్కూటీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో 45 ఏళ్ల కావేరీ నఖ్వా మృతి చెందగా.. ఆమె భర్త ప్రదీప్ నక్వా తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం నిందితుడు పరారయ్యాడు. నిందితుడు తండ్రి మహరాష్ట్ర పాల్ఘర్ ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన డిప్యూటీ లీడర్‌గా ఉన్న రాజేష్ షా కావడంతో ఈ ప్రమాదంపై విమర్శలు వెల్లువెత్తాయి.
దీంతో మహరాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే రంగంలోకి దిగారు. నేరస్తులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో అతడి ఆచూకీ కోసం 11 పోలీస్ శాఖ ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రమాదం జరిగిన 72 గంటల అనంతరం ప్రధాన నిందితుడు మిహిర్ షాను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment