ముంబై: మహారాష్ట్రలో హిట్ అండ్ రన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఓ మైనర్ బాలుడు మద్యం సేవించి కారు నడిపి.. బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ప్రమాద ఘటనలో కారు నడిపిన మైనర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల ప్రకారం.. ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున మైనర్(17) ఎస్‌యూవీ కారును రాంగ్ రూట్‌లో నడుపుతూ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టాడు. ఈ క్రమంలో బైక్‌పై ఉన్న నవీన్ వైష్ణవ్(24) తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం, కారు పక్కనే ఉన్న కరెంట్ స్థంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న మైనర్ గాయపడటంతో కిందపడిపోయాడు. ప్రమాదం జరిగిన తర్వాత మైనర్ అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయడంతో స్థానికులు అతడిని పట్టుకున్నారు.
స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని నవీన్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే నవీన్ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కాగా, నవీన్ వైష్ణవ్ ఆ ఏరియాలో పాలు అమ్మే వ్యక్తిగా గుర్తింంచారు. ఇక, ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మైనర్‌ను అరెస్ట్ చేశారు. మైనర్‌ను ముంబైకి చెందిన ఇక్బాల్ జివానీ కుమారుడిగా గుర్తించారు. ఈ సందర్భంగా ఇక్బాల్‌పై కూడా కేసు నమోదు చేశారు. మరోవైపు.. ప్రమాదం సమయంలో నిందితుడు మద్యం సేవించి ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment