పెద్దలను కాదని ఆమెతో ప్రేమ పెళ్లి.. అతడి పరిచయంతో సీన్‌ రివర్స్‌.. | Navy Officer Saurabh Dead By Wife And Lover Episode At Meerut | Sakshi
Sakshi News home page

పెద్దలను కాదని ఆమెతో ప్రేమ పెళ్లి.. అతడి పరిచయంతో సీన్‌ రివర్స్‌..

Published Wed, Mar 19 2025 12:31 PM | Last Updated on Wed, Mar 19 2025 1:27 PM

Navy Officer Saurabh Dead By Wife And Lover Episode At Meerut

లక్నో: ఆమెను ఎంతో ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకోవడమే అతడి ప్రాణాలు తీసింది. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను భార్య దారుణంగా హత్య చేసింది. ప్రియుడితో కలిసి భర్తను ప్లాన్‌ ప్రకారం హత్య చేసి.. మృతదేహాన్ని ముక్కులుగా చేసి శరీర భాగాలను సిమెంట్‌తో కలిపిన ప్లాస్టిక్ డ్రమ్‌లో కప్పి పెట్టారు. ఈ క్రైమ్‌ సీన్‌ చూసి అక్కడికి వెళ్లిన పోలీసులే ఖంగుతిన్నారు. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. యూపీలోని మీరట్‌కు చెందిన సౌరవ్‌ కుమార్‌ మర్చంట్‌ నేవీలో పనిచేస్తున్నాడు. సౌరవ్‌.. ముస్కాన్‌ను ప్రేమించి 2016లో ఆమెను వివాహం చేసుకున్నాడు. వీరి ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో సౌరవ్‌కు, తన కుటుంబ సభ్యులకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో, మూడు సంవత్సరాల క్రితం, సౌరభ్ తన భార్య ముస్కాన్‌తో కలిసి ఇందిరానగర్‌లోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరికీ రెండో తరగతి చదువుతున్న 5 సంవత్సరాల కుమార్తె కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

చిగురించిన మరో ప్రేమ..
అయితే, నేవీలో పనిచేస్తున్న కారణంగా సౌరవ్‌.. విధులకు వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలోనే ముస్కాన్‌కు సాహిల్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా ప్రేమకు దారితీసింది. దీంతో, వారిద్దరి శారీరక సంబంధం కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలో వీరిద్దరికీ అడ్డుగా ఉన్న భర్త సౌరవ్‌ను అడ్డుతొలగించుకోవాలని భావించారు. దీని కోసం సౌరవ్‌ను హత్య చేయాలని ప్లాన్‌ చేశారు. ఈ సందర్బంగా సౌరవ్ మార్చి 4న మీరట్ ఇందిరానగర్‌లోని వచ్చిన వెంటనే అతడిని హత్య చేశారు. అనంతరం,  మృతదేహాన్ని ముక్కులుగా చేసి శరీర భాగాలను సిమెంట్‌తో కలిపిన ప్లాస్టిక్ డ్రమ్‌లో దాచిపెట్టారు.

పక్కా ప్లాన్‌తో హత్య..
మరోవైపు.. భర్తను హతమార్చేందుకు ప్లాన్ వేసిన ముస్కాన్.. భర్తతో కలిసి హిమాచల్ ప్రదేశ్ వెళ్తున్నానని పొరుగువారికి చెప్పింది. దీంతో, వారికి ఎలాంటి అనుమానం రాలేదు. తర్వాత ముస్కాన్ ఒక్కరే కనిపించడంతో సౌరవ్‌ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా.. ముస్కాన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. భార్య ముస్కాన్, ఆమె ప్రేమికుడు సాహిల్ కలిసి సౌరభ్‌ను హత్య చేసినట్లు తేలింది. అతని మృతదేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో ఉంచి, ఆపై సిమెంట్ ద్రావణాన్ని తయారు చేసి డ్రమ్ములో పోశారు. దీని కారణంగా మృతదేహం లోపల గడ్డకట్టిందని పోలీసులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement