husband killed
-
ల్యాబ్ టెక్నీషియన్ క్రూరత్వం?
యశవంతపుర: అత్తింటిలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా దేవవృందంలో జరిగింది. వివరాలు... మూడేళ్ల క్రితం శ్వేత (31), దర్శన్ వివాహం జరిగింది. బాగా కట్నకానుకలు ఇచ్చారు. దర్శన్ బెంగళూరులో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులేవు. నాలుగు రోజుల క్రితం ఇద్దరు బెంగళూరు నుంచి దేవవృందంకు చేరుకున్నారు. సోమవారం రాత్రి శ్వేత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శ్వేతకు గుండెపోటు వచ్చి చనిపోయిందని దర్శన్ అత్తమామలకు సమాచారం ఇచ్చాడు. అత్తమామలు వచ్చేలోపు దర్శన్ కుటుంబం శ్వేతకు అంత్యక్రియలకు సిద్ధం చేశారు. అంత్యక్రియలను అడ్డుకున్న బంధువులు అంత్యక్రియలు ఎందుకు అంత త్వరగా ముగించాలని చూస్తున్నారని మృతురాలి బంధువులు ప్రశ్నించటంతో దర్శన్ కుటుంబంలో భయం నెలకొంది. దీంతో మృతురాలి తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. ఆమెకు విషపూరిత ఇంజక్షన్ ఇచ్చి హత్య చేసినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని పట్టుబట్టి ఆస్పత్రికి తరలించారు. దర్శన్ అక్రమ సంబంధం మోజులో పడి శ్వేతను అడ్డు తొలగించటానికి ఇంజక్షన్ ఇచ్చి హత్య చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శ్వేత మృతదేహాన్ని చిక్కమగళూరు మల్లేగౌడ జిల్లా ఆస్పత్రికి తరలించారు. గోణిబీడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యాపిల్లలను చంపి వ్యక్తి సూసైడ్..కారణమిదే..
లక్నో: కుటుంబ తగాదాల కారణంగా ఓ వ్యక్తి తన భార్య ఇద్దరు కొడుకులను దారుణంగా చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో జరిగింది.‘భార్యతో గొడవలతో మనస్తాపం చెందిన శ్రవణ్‌రామ్(35) అనే వ్యక్తి తనభార్య శశికల(30) ఇద్దరు కొడుకులు సూర్యారావ్(7),మిట్టు(4)లను పదునైన ఆయుధంతో పొడిచి హత్య చేశాడు. ‘శ్రవణ్రామ్కు ఆయన భార్యకు మధ్య ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తోంది. ఆదివారం కూడా వారిరువురి మధ్య గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత శ్రవణ్‌రామ్ తన భార్యా పిల్లలను చంపి ఇంటికి సమీపంలోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ తగాదాల వల్లే భార్యాపిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసిన లేఖ శ్రవణ్‌రామ్ జేబులో దొరికింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం’ అని పోలీసులు తెలిపారు. ఇదీచదవండి..జార్ఖండ్ సీఎం సోరేన్‌కు ఆరోసారి ఈడీ సమన్లు.. -
మరిదితో వదిన వివాహేతర సంబంధం.. భర్తకు తెలియడంతో..
జడ్చర్ల టౌన్: కట్టుకున్న భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటం చూసి తట్టుకోలేకపోయిన భర్త కత్తితో పొడిచి ఆమెను హతమార్చడంతో పాటు.. ఆమె ప్రియుడి గొంతు కోశాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భూత్పూర్ మండలం భట్టుపల్లికి చెందిన శేఖర్‌గౌడ్‌కు అదే మండలం మొల్గరకు చెందిన అనూషతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు మగ సంతానం ఉన్నారు. బతుకుదెరువు నిమిత్తం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని పద్మావతి కాలనీలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. కాలనీ సమీపంలో అనూష లేడీస్ టైలర్ నిర్వహిస్తోంది. శేఖర్ జడ్చర్లలో కారు మెకానిక్‌గా పనిచేస్తున్నారు. శేఖర్‌కు సోదరుడి వరుస అయ్యే భట్టుపల్లికి చెందిన ప్రదీప్‌గౌడ్ భూత్పూర్లో జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో వరసకు మరిది అయ్యే ప్రదీప్‌గౌడ్‌తో అనూషకు సన్నిహితం ఏర్పడి వివాహేతర సంబంధం కొనసాగింది. కాగా.. టైలర్ షాపునకు పక్కన కూతురితో ఉంటున్న ఒంటరి మహిళతో అనూష స్నేహం చేసింది. తరుచూ ఆ మహిళ ఇంట్లోని వాష్‌రూం (మరుగుదొడ్డి)ని వినియోగించుకుంటుంది. ఇదే క్రమంలో బుధవారం సదరు ఒంటరి మహిళ ఓ పని నిమిత్తం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లగా.. అనూష తన ప్రియుడు ప్రదీప్గౌడ్కు ఫోన్ చేసి అక్కడికి పిలుపించుకుంది. ఒంటరి మహిళ కుమార్తెను టైలర్ షాపులో కూర్చొబెట్టి.. ప్రియుడితో కలిసి వారి ఇంట్లోకి వెళ్లింది. అదే సమయంలో టైలరింగ్ దుకాణం వద్దకు చేరుకున్న శేఖర్‌గౌడ్ అక్కడ తన భార్య కనిపించకపోవడంతో అక్కడే ఉన్న బాలికను ప్రశ్నించాడు. తమ ఇంట్లో ఉన్న వాష్‌రూంకు వెళ్లిందని బాలిక చెప్పడంతో భర్త అక్కడికి వెళ్లాడు. ఈ సమయంలో అనూష, ప్రదీప్‌గౌడ్ సన్నిహితంగా ఉండడం చూసి తట్టుకోలేక ఆగ్రహంతో అదే గదిలో ఉన్న కత్తితో దాడి చేశాడు. భార్యను కత్తిపోట్లు పొడవగా.. ప్రదీప్‌గౌడ్ గొంతు కోశాడు. ఆ సమయంలో అలజడి వినిపించి ఇంటి యజమానురాలు అక్కడికి వచ్చి.. ఇలా చేశావేంటని శేఖర్‌ను నిలదీసింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో భార్య, ప్రదీప్‌ను ఆయన మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే అనూష మృతి చెందిందని డాక్టర్లు వెల్లడించారు. ప్రదీప్‌ను ఆస్పత్రిలో చేర్పించి.. భార్య మృతదేహాన్ని మొల్గరకు తీసుకెళ్లి జరిగిన విషయం మొత్తం కుటుంబసభ్యులకు చెప్పారు. దీంతో వారు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే భూత్పూర్ పోలీసులు గ్రామానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నాడు. అనూష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ప్రదీప్‌గౌడ్ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. జడ్చర్ల సీఐ రమేష్‌బాబు ఘటన జరిగిన ఇంటిని పరిశీలించి.. పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఒకరినొకరు ప్రేమించుకున్నారు.. భర్తను నరికి చంపిన భార్య
మహబూబ్‌నగర్: ఒకరినొకరు ప్రేమించుకున్నారు.. కులాలు వేరైనా కలిసి జీవించాలనుకున్నారు. ఈ క్రమంలో పెద్దలను ఎదురించి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం సైతం కలిగారు. అలా సాఫీగా సాగిపోతున్న వీరి సంసారంలో మద్యం చిచ్చురేపింది. తాగుడుకు బానిసైన భార్యాభర్తలు ఇద్దరూ మద్యం మత్తులో తరుచుగా గొడవపడేవారు. దీంతో విసిగివేసారిన భార్య క్షణికావేశానికి లోనై.. పిల్లలు వద్దని వారిస్తున్నా.. నిద్రిస్తున్న భర్తను గొడ్డలితో నరికి చంపేసింది. ఈ విషాదకర సంఘటన ఇటిక్యాల మండలంలోని మొగిలిరావులచెర్వులో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఇటిక్యాల ఏఎస్ఐ అయ్యన్న, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దేవరాజు అలియాస్ దేవదాసు(35) వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం చెల్లెపాడుకు చెందిన అలివేలును 15 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరు మద్యం మత్తులో తరుచుగా గొడవపడేవారు. ఈ క్రమంలో శనివారం రాత్రి దేవదాసు మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. దీంతో అర్ధరాత్రి పడుకున్న భర్తను పిల్లలు చూస్తుండగానే గొడ్డలితో విచక్షణారహితంగా నరకడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. దేవదాసుకు భార్య అలివేలుతోపాటు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై దేవదాసు సోదరుడు రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. సంఘటనా స్థలాన్ని అలంపూర్ సీఐ సూర్యనాయక్ సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. -
భర్త నిద్రలో చనిపోయినట్లు నమ్మించింది..చివర్లో కూతురు షాకింగ్ ట్విస్ట్
సాక్షి, యశవంతపుర: తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, భర్తను హత్య చేసిన కేసులో పోలీసులు భార్యతో పాటు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. నందిని లేఔట్ పోలీసుల వివరాల మేరకు ... సంజయ్ నగరకు చెందిన ఆంజనేయ (45), అనిత దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉంటే గార్మెంట్స్ పరిశ్రమలో పనిచేస్తున్న అనితకు రాకేశ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం ఆంజనేయకు తెలియడంతో ఆయన మానుకోవాలని పలుమార్లు హెచ్చరించినా అనిత పెడచెవిన పెట్టింది. చివరకు ప్రియుడు రాకేశ్ గత ఏడాది జూన్ 18న ఇంటికి పిలిపించింది. నిద్రలో ఉన్న ఆంజనేయుడిని ఇద్దరు గొంతు పిసికి చంపేశారు. గుండెపోటుతో చనిపోయినట్లు అందరిని నమ్మించారు. అమ్మే చంపింది ఇదిలా ఉంటే రాకేశ్ కూతురు ఇటీవల బంధువులకు అమ్మే నాన్నను చంపిందని తెలిపింది. దీంతో బంధువులు ఈనెల 4న నందిని లేఔట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనితను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అక్రమ సంబంధం విషయమై తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు విచారణలో తెలింది. దీంతో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. (చదవండి: బిర్యానీ తిని యువతి మృతి) -
వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని.. ప్రియుడితో కలిసి
గద్వాల క్రైం (జోగులాంబ గద్వాల): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసిన సంఘటన శుక్రవారం గద్వాలలో కలకలం రేపింది. సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. పెబ్బేరు మండలం బూడిదపాడు గ్రామానికి చెందిన ఎండీ అబ్దుల్ (35) గద్వాల పట్టణానికి చెందిన మహబూబ్‌బీని 12 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరు గద్వాల పట్టణంలోని నల్లకుంట కాలనీలో అద్దె ఇంట్లో ఉంటూ కూరగాయాల వ్యాపారం చేస్తున్నారు. దంపతులకు తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే భార్య అదే కాలనీకి చెందిన రఫీతో కొన్ని రోజులుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయంపై వారం రోజుల క్రితం భార్యతో గొడవపడ్డాడు. అయితే తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి గురువారం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ప్రియుడితో కలసి చున్నీతో గొంతుకు బిగించి ఊపిరాడకుండా హత్య చేశారు. ఇక భర్త తరఫు బంధువులకు భార్య ఫోన్ చేసి ఫిట్స్ వచ్చి మృతి చెందాడని చెప్పింది. విషయం తెలుసుకున్న బంధువులు మృతదేహాన్ని పరిశీలించి మహబూబ్‌బీపై అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పట్టణ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా.. హత్య చేసినట్లు అంగీకరించారు. మృతుడి సోదరుడు మహ్మద్ హాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. భార్యను అదుపులోకి తీసుకున్నామని, ప్రియుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. -
Crime News: ఈ సుత్తితోనే నా మొగుడ్ని చంపేయ్!
తప్పనిసరి పరిస్థితుల్లో ఆ మానవమృగంతో తాళి కట్టించుకుంది ఆమె. తప్పుడు దోవలో వెళ్తుంటే వద్దని బతిమాలుకుంది. వినలేదు సరికదా.. మరింత ఘోరంగా ప్రవర్తించబోయాడు. లాభం లేదనుకుని వదిలేయబోయింది. కానీ, తాను వదిలేసినా.. మొగుడి బుద్ధి మారదని అనుకుంది. చివరకు.. సుపారీ ఇచ్చి ఆ భర్తని ఈ లోకంలోనే లేకుండా చేసింది. ఢిల్లీలో కలకలం సృష్టించిన వికాస్ నగర్ హత్య కేసు ఓ కొలిక్కి వచ్చింది. మృతుడి రెండో భార్య చంద్ర కళ(28).. సుపారీ రౌడీతో ఈ హత్య చేయించినట్లు పోలీసులు వారం తర్వాత నిర్ధారించారు. అంతేకాదు పక్కా ప్లాన్‌తో మొగుడ్ని హత్య చేయించి.. దోపిడీహత్యగా చిత్రీకరించే యత్నం చేసినట్లు తెలిపారు. ఈ సుత్తితోనే చంపేయ్ మృతుడు వీర్ బహదూర్ వర్మ(50) వికాస్ నగర్లో ఓ బట్టల దుకాణం నడుపుతున్నాడు. కొన్నినెలల కిందట ఆ షాపులోనే పని చేసే చంద్రకళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాధితురాలి కుటుంబంతో రాజీ చేసుకున్న వర్మ.. ఆమెను వివాహం చేసుకున్నాడు. అప్పటికే పెళ్లై పిల్లలు ఉన్న వర్మను గత్యంతరం లేని పరిస్థితుల్లో భర్తగా అంగీకరించింది ఆమె. చెల్లిపై కన్నేశాడు.. అయితే పెళ్లి అయ్యాక తనతో సవ్యంగా ఉంటాడని భావించిన ఆమెకు.. నిరాశే ఎదురైంది. పైగా వ్యభిచార గృహాల చుట్టూ తిరగడం, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం.. వర్మ ప్రవర్తనతో విసిగిపోయింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు సైతం జరిగాయి. కొన్నివారాల కిందట.. కళ సోదరి ఆమె ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ఆమెపైనా కన్నేశాడు వర్మ. ఇది పసిగట్టిన కళ.. భరించలేకపోయింది. కిరాయి హంతకుడి సాయంతో మొగుడ్ని చంపేందుకు ప్లాన్ వేసింది. సుపారీతో పాటు సుత్తి కూడా! రణ్‌హోలాకు చెందిన రౌడీ షీటర్ జుమ్మాన్‌ను కలిసి తన వ్యధను చెప్పింది చంద్రకళ. హత్య కోసం లక్షన్నర డబ్బుతో పాటు ఓ సుత్తిని కూడా అందించింది. ఆ సుత్తితోనే మొగుడ్ని చంపేయాలని కోరింది ఆమె. ఈ క్రమంలో.. మే 18వ తేదీన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో చంద్రకళ సాయంతో.. సుత్తితో వర్మపై దాడి చేశాడు జుమ్మాన్. అనంతరం శవాన్ని రోడ్డు మీద పడేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న వర్మను.. డీడీయూ ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. చంపి.. దొంగతనంగా. భర్త హత్యను దోపిడీగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది చంద్రకళ. ఇందుకోసం ఇంట్లోని డబ్బు, నగదును జుమ్మాన్‌కు ఇచ్చి పంపించి వేసింది. మొగుడి ప్రాణం పోయినా.. తాను జైలు పాలయినా.. తన చెల్లితోపాటు ఎంతోమంది జీవితాలు నిలబడ్డాయని కన్నీళ్లతో చెబుతోంది చంద్రకళ. -
బెడ్రూమ్లో పక్కింటి వ్యక్తితో భార్య అలా చేస్తూ..
వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాలను బజారుకీడుస్తున్నాయి. కొన్ని సంబంధాలు హద్దులు దాటడంతో అవి చివరకు హత్యలకు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. దీంతో వారి పిల్లలు, కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. తాజాగా ఇలాంటి ఘటనే బీహార్‌లో చోటుచేసుకుంది. ఆమెకు పదేళ్ల క్రితం పెళ్లై ఇద్దరు పిల్లలుగా పక్కింటి వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని నడిపించింది. తీరా ఆమె ప్రియుడితో బెడ్ రూమ్‌లో రాసలీలలు కొనసాగిస్తూ భర్త రెడ్ హ్యాండెడ్‌గా దొరికింది. అనంతరం దారుణానికి ఒడిగట్టింది. వివరాల ప్రకారం.. పుర్నియ జిల్లా చకర్పద గ్రామానికి చెందిన పోషిత్ కుమార్‌కు సావిత్రిదేవితో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, సావిత్రిదేవి వారి ఇంటి పక్కనే ఉండే మరోవ్యక్తి అరవింద్ మహల్దార్‌తో కొద్ది రోజులుగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. కాగా, ఓరోజు కుమార్ పని నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి సావిత్రి బెడ్రూమ్లో తన ప్రియుడితో రాసలీలలు కొనసాగిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం తమ బండారం బయటపడటంతో ప్రియుడు మహల్దార్‌తో కలిసి సావిత్రి.. కుమార్ మెడకు తాడు బిగించి దారుణంగా హత్య చేశారు. ఈ క్రమంలో కుమార్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సావిత్రి, అరవింద్ మహల్దార్ను అరెస్ట్ చేశారు. ఇది చదవండి: హైదరాబాద్‌లో కొత్తరకం సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. -
వివాహేతర సంబంధం: గుంటూరులో చంపి.. మృతదేహం మార్టూరులో వేసి..
సాక్షి, ఒంగోలు: జిల్లాలోని మార్టూరు వద్ద మూడు రోజుల క్రితం వెలుగుచూసిన హత్యోందంతంలో కిరాయి హంతకుల పాత్ర ఉందని గుర్తించి వారిని అరెస్టు చేసినట్లు ఎస్పీ మలికాగర్గ్ తెలిపారు. మంగళవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం.. ఈ నెల 4వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో మార్టూరు మండలం కోనంకికి చెందిన ఓ రైతు పొలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఘటన వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని పరిశీలించి అది హత్యగా పోలీసులు నిర్ధారించారు. అయితే మృతుడు ఎవరనేది తెలియరాలేదు. కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని 72 గంటల్లోనే ఛేదించి నిందితులను కటకటాల వెనక్కు నెట్టారు. కేసు వివరాలు మీడియాకు వెల్లడిస్తున్న ఎస్పీ మలికాగర్గ్, పక్కన ఇతర పోలీసు అధికారులు ఇదీ..కథ మృతుడు గుంటూరు కొత్తపేట మంగళదాస్‌నగర్‌కు చెందిన గోగులపాటి బెన్నీ(41)గా గుర్తించారు. ఆయన సతీమణి బుజ్జికి అన్నం సుబ్బరామయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ వ్యవహారంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. చంపుతానంటూ పలుమార్లు భార్యను బెన్నీ హెచ్చరించేవాడు. 2021 సెప్టెంబర్ 1న భార్యతో గొడవపడి ఆమెను చంపేందుకు యత్నించాడు. కత్తిపోటు పక్కింటి వ్యక్తికి తగిలి అతను మృతి చెందాడు. ఈ కేసులో అతడు జైలుకు వెళ్లి ఇటీవల బెయిల్‌పై తిరిగి వచ్చాడు. సుబ్బరామయ్యకు చెందిన అట్టల పరిశ్రమలో రూ.5 లక్షల విలువైన అట్టలు, ఆటోను తగలబెట్టాడు. ఎప్పటికైనా సుబ్బరామయ్యను చంపుతానని భార్యను అతడు బెదిరించాడు. ఈ విషయాన్ని ఆమె అన్నం సుబ్బరామయ్యకు చెప్పింది. ఇద్దరికీ ప్రాణహాని ఉందని సుబ్బరామయ్య భావించి బెన్నీని అడ్డు తొలగించుకునేందుకు పథక రచన చేశాడు. గుంటూరు వెంకటప్పయ్య కాలనీకి చెందిన చల్లా గోపీతో లక్ష రూపాయలకు బెన్నీని హత్య చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. సుబ్బరామయ్య, గోపీ, గుంటూరు సంగడిగుంటకు చెందిన దొడ్డి వెంకట ప్రసాద్, సాయిబాబా కాలనీకి చెందిన ఇక్కుర్తి ఓంకార్, మంగళదాస్ నగర్‌కు చెందిన గోగులపాటి బుజ్జి, నల్లచెరువుకు చెందిన దుగ్గిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మరో మైనర్ బాలుడు కలిసి ముందుగా ఒక కారును అద్దెకు తీసుకున్నారు. కారులో బెన్నీ ఇంటికి వెళ్లి కత్తితో పొడిచి, ఇనుప రాడ్‌తో విచక్షణారహితంగా కొట్టి ముఖంపై దిండు ఉంచి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని కారులో వేసుకుని కోలలపూడి రోడ్లో కోనంకి సమీపంలో పడేసి వెళ్లిపోయారు. ముఠాగా ఏర్పడిన నిందులు పోలీసులు అరెస్టు చేసిన వారిలో దొడ్డి వెంకట ప్రసాద్ అలియాస్ ప్రసాద్ గతంలో దొంగతనాలు, దోపిడీ, హత్యలు, కిడ్నాప్ కేసుల్లో నిందితుడు. లాలాపేట పోలీసుస్టేషన్ పరిధిలో హిస్టరీ షీట్ కూడా ఉంది. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి కిరాయి హత్యకు పాల్పడ్డారు. హత్యకు ఉపయోగించిన టవేరా కారు, ఇరన్రాడ్, కత్తి, పది ఫోన్లు, రూ.21 వేల నగదును పోలీసులు సీజ్ చేశారు. కేసును ఛేదించడంలో కృషి చేసిన చీరాల డీఎస్పీ శ్రీకాంత్, ఇంకొల్లు సీఐ సుబ్బారావు, మార్టూరు, ఇంకొల్లు, జె.పంగులూరు ఎస్ఐలు ఎస్వీ రవీంద్రారెడ్డి, ఎన్సీ ప్రసాద్, పున్నారావు, ఫింగర్ ప్రింట్స్ బ్యూరో ఎస్ఐ పి.శరత్‌బాబు, హెడ్ కానిస్టేబుళ్లు కోటేశ్వరరావు, జి.సుధాకరరావు, జి.పాపారావు, కానిస్టేబుళ్లు కె.శ్రీను, కె.అనీల్‌కుమార్, సీహెచ్ రత్నరాజు, బీవీ రమణ, బి.అవినాష్, ఎస్కే మొహ్మద్ రఫీ, హోంగార్డులు ఎం.ప్రభాకర్, టి.నాగరాజులను ప్రశంసపత్రాలు, రివార్డులతో ఎస్పీ మలికాగర్గ్ అభినందించారు. -
మద్యానికి డబ్బులివ్వలేదని భార్యపై గొడ్డలితో దాడి
నిడమనూరు: మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి భార్యను దారుణంగా కడతేర్చాడు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండల పరిధిలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. మండల పరిధిలోని బొక్కమంతులపాడ్ గ్రామానికి చెందిన ధర్మారపు రుద్రయ్య, విజయరాజేశ్వరి (36) దంపతులు. వీరి కుమారుడు గణేశ్ (12) అనారోగ్య కారణాలతో ఏడాది క్రితం మృతిచెందాడు. రుద్రయ్య హైదరాబాద్‌లోని ఓ అపార్ట్మెంట్లో వాచ్‌మన్‌గా పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నారు. రుద్రయ్య సోద రుడి కుమార్తె నిశ్చితార్థం ఆదివారం బొక్కమంతులపాడ్‌లో నిర్వహించారు. ఈ శుభకార్యానికి హాజరయ్యేందుకు రుద్రయ్య, రాజేశ్వ రి ఉదయం స్వగ్రామానికి వచ్చారు. కాగా, మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని రుద్ర య్య భార్యపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆమె నిరాకరించడంతో కోపంతో ఇంట్లో ఉన్న గొడ్డ లితో ఆమె తలపై వేటువేసి పరారయ్యాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఆమెను ఇరుగుపొరుగు వారు మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మా ర్గమధ్యలోనే మృతిచెందింది. సీఐ గౌరీనాయు డు ఘటనా స్థలాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. -
ప్రియుడిని కలవడానికి భర్త అడ్డు.. ఏం చేయాలా అని ఆలోచించి..
సాక్షి, అనంతపురం క్రైం: ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తనే హతమార్చిన వైనం పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. ఘటనకు సంబంధించి ప్రియుడితో పాటు మహిళనూ అరెస్టు చేశారు. అనంతపురం రూరల్ సీఐ మురళీధర్‌రెడ్డి తెలిపిన మేరకు... ఆలమూరు గ్రామానికి చెందిన చియ్యేడు రవీంద్ర (40), బోయ విజయలక్ష్మి దంపతులు. తొమ్మిదేళ్ల క్రితం వివాహమైన వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా తమ సమీప బంధువు చియ్యేడు సందీప్‌తో విజయలక్ష్మి వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వస్తోంది. ఈ క్రమంలో తరచూ కలుసుకునేందుకు భర్త రవీంద్ర అడ్డు వస్తుండడంతో ఎలాగైనా అంతమొందించాలని భావించారు. పథకం ప్రకారం ఈ నెల 3న అర్ధరాత్రి తలదిండుతో రవీంద్రకు ఊపిరి అందకుండా చేసి హతమార్చారు. అనంతరం పాముకాటుతో మృతి చెందినట్లుగా నమ్మించారు. అయితే రవీంద్ర ఊపిరి అందక పోవడంతో చనిపోయాడని, శరీరంపై గాయాలు కూడా ఉన్నట్లుగా పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేసింది. దీంతో పోలీసులు కూపీ లాగడంతో అసలు విషయం వెలుగు చూసింది. విజయలక్ష్మి, సందీప్‌ను అరెస్టు చేసి న్యాయమూర్తి ఆదేశం మేరకు ఆదివారం రిమాండ్‌కు తరలించారు. చదవండి: (మరో మహిళతో వివాహేతర సంబంధం.. సుపారీ ఇచ్చి భర్తను) -
కాపురానికి రానందని కాటికి..
మంథని: కట్టుకున్న భార్యను అతికిరాతంగా చంపాడో భర్త. వేధింపులతో వేగలేకపోతున్నానని.. కలిసి కాపురం చేయడం కుదరదని పంచాయితీలో పెద్దమనుషుల సమక్షంలో చెప్పి భార్య ఇంటికి వెళ్తుండగా వెంటపడి బండ రాయితో మోది హతమార్చాడు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్ల గ్రామంలో శనివారం జరిగిందీ దారుణ సంఘటన. తల్లీకూతుర్లను వేధిస్తుండటంతో.. గ్రామంలోని కాసిపేట బానయ్య.. అదే గ్రామానికి చెందిన కాసిపేట రేణుక (35)ను 17 ఏళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి కూతురు ధనలక్ష్మి (16) ఉంది. దంపతుల మధ్య గొడవలు రావడంతో రేణుక మూడు నెలల క్రితం హైదరాబాద్‌కు వెళ్లిపోయింది. ఘట్కేసర్లో పనిచేసుకుంటూ జీవిస్తోంది. కూతురును కాటారం మండలం దామెరకుంటలోని వసతి గృహంలో ఉంచింది. బానయ్య కూతురు వద్దకు వెళ్లి వేధిస్తుండేవాడు. రేణుకనూ వేధించేవాడు. దీంతో ఆమె మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్యకు తన ఆవేదనను చెప్పుకుంది. ఈ క్రమంలో శనివారం సర్పంచ్‌తో పాటు గ్రామ పెద్దలతో కలిసి పంచాయితీ పెట్టారు. వేగలేకపోతున్నానన్న రేణుక భర్తతో వేగలేకపోతున్నానని, తన బతుకు తాను బతుకుతానని పెద్ద మనుషుల ముందు రేణుక వాపోయింది. కలిసి ఉందామని బానయ్య బతిమిలాడినా.. ఒప్పుకోలేదు. దీంతో పెద్ద మనుషులు ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. కూతురుతో కలిసి రేణుక వెళ్లిపోతుండగా బానయ్య వెంబడించిన భర్త బండ రాయి విసిరాడు. అది రేణుక తలకు తగిలి కిందపడిపోయింది. వెంటనే మరో రాయితో తలపై మోదడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఘటనా స్థలాన్ని మంథని సీఐ సతీశ్, ఎస్సై చంద్రకుమార్ సందర్శించి వివరాలు సేకరించారు. మృతురాలి కూతురు ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. భరించలేకనే.. ‘నన్ను, మా అమ్మను డాడీ వేధిస్తున్నాడు. అతడి నుంచి దూరంగా వెళ్లిపోదా మనుకు న్నాం. వెనకాలే వచ్చి తలపై బండతో కొట్టాడు. నేను పోలీసులకు సమాచారం ఇచ్చేలోపే కొట్టి చంపాడు. అతడి టార్చర్ భరించలేక 3 నెలల క్రితమే అమ్మ హైదరాబాద్‌కు వెళ్లిపోయింది. అడ్రస్ తెలుసుకుని అక్కడకూ వెళ్లి టార్చర్ పెట్టాడు. నాకు విషయం చెప్పడంతో నేను హాస్టల్ నుంచి మూడ్రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లిపోయాను. మాట్లాడుకుందామని అమ్మను గ్రామానికి పిలిపించారు. అతడితో ఉండలేనని అమ్మ చెప్పింది. దాన్ని దృష్టిలోపెట్టుకుని కొట్టి చంపాడు..’ అంటూ ధనలక్ష్మి రోదిస్తూ తెలిపింది. -
వివాహేతర సంబంధం.. భార్య ప్రియుడు గ్రామానికి వచ్చాడని తెలిసి..
సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): కన్యాకుమారి జిల్లా తక్కలైలో నడిరోడ్డుపై భార్య ప్రియుడిని భర్త తన మిత్రులతో కలిసి కత్తులతో దాడి చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బుధవారం మధ్యాహ్నం 1.15 గంటలకు ఈ దాడి జరిగింది. గాయపడిన అతన్ని స్థానికులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఆస్పత్రికి వెళ్లగా పారిపోయాడు. విచారణలో తక్కలై సమీపంలోని తిరువిదాంగోడుకు చెందిన పూజారి (45)కి భార్య (34), ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యకు వేరొకరితో వివాహేతర ఏర్పడడంతో 8 నెలల కిత్రం అతనితో పారిపోయింది. దీనిపై తక్కలై పోలీస్‌స్టేషన్‌లో భర్త ఫిర్యాదు చేశాడు. భార్య ప్రియుడు తక్కలైకి వచ్చినట్లు సమాచారం తెలియడంతో మిత్రులతో కలిసి కత్తులతో దాడి చేసినట్లు తెలిసింది. -
పెళ్లైన నెలకే మెడ కోసి..
నిజాంపేట్(హైదరాబాద్)/కామారెడ్డి: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే సైకోగా మారాడు. పెళ్లి తర్వాత భార్యపై అనుమానం పెంచు కున్నాడు. మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా ఆమె మెడ కోసి దారుణంగా హత్య చేశాడు. ఆపై తానూ మెడ, చేతులపై కోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. ఈ ఘటన బాచుపల్లి పోలీ స్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌కు చెందిన సుధారాణి.. అదే జిల్లా శివయ్యపల్లి గ్రామానికి చెందిన ఎర్రోల కిరణ్‌కుమార్ ఏడెనిమిది నెలలుగా ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి గత నెల 27న వివాహం చేసుకున్నారు. ఎన్నో ఆశలతో అత్తారింటికి వస్తే భర్త అనుమానాలతో ఆమె ఆందోళనకు గురైంది. దీంతో ఆమె తల్లిదండ్రులకు విషయం చెప్పింది. బంధువులతో కలసి మాట్లాడి సర్దిచెప్పి పంపించారు. కిరణ్‌కుమార్ సాప్ట్వేర్ ఉద్యోగి కావడంతో ప్రగతినగర్‌లోని శ్రీసాయిద్వారకా అపార్ట్మెంట్లో ఫ్లా ట్ తీసుకున్నారు. ఈ క్రమంలో శనివారం హై దరాబాద్ రావాలని కిరణ్ కుటుంబం నుంచి సుధారాణి తల్లిదండ్రులకు సమాచారం వెళ్లింది. రక్తం మడుగులో సుధారాణి... సుధారాణి తల్లిదండ్రులు శనివారం మధ్యా హ్నం 3:30 గంటల సమయంలో ప్రగతినగర్ కు వచ్చారు. కాలింగ్ బెల్ కొట్టినా, ఇద్దరికీ ఫోన్లు చేసినా స్పందన లేదు. అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బెడ్రూమ్ తలుపు పగులగొట్టారు. సుధారాణి రక్తం మడుగులో చనిపోయి ఉండగా, కిరణ్‌కుమార్ కొన ఊపిరితో ఉన్నాడు. పోలీసులు వెంటనే కిరణ్‌ను ఆసుపత్రికి తరలించారు. కూరగాయలు కోసే కత్తితో సుధారాణి గొంతు, కాళ్లు, చేతులను కోశాడు. అపార్ట్మెంట్లోకి 2 వారాల క్రితమే వచ్చారని, అప్పటి నుంచీ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడలేదని చుట్టుపక్కల వారు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల సమయంలో సుధారాణిని హత్యచేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కిరణ్‌కుమార్ మెడ, చేతులపై కత్తితో కోసుకోవడంతో అధిక రక్తస్త్రావం అయ్యిం దని, పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారని పోలీసులు వెల్లడించారు. అతను స్పృహలోకి వస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశముందన్నారు. బంధువుల ఆందోళన భర్త, అత్తమామలే సుధారాణిని హతమార్చారని ఆగ్రహంతో ఆమె బంధువులు కామారెడ్డి శ్రీరాంనగర్ కాలనీలోని కిరణ్‌కుమార్ ఇంటిపై దాడిచేశారు. తమకు న్యాయం చేయాలంటూ ఉదయం నుంచి రాత్రి వరకు ఆందోళన కొనసాగించారు. -
తల్లీకూతుళ్ల దారుణ హత్య.. అనుమానంతో భర్తే..
రుద్రూర్ (వర్ని): భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను హతమార్చాడు. తల్లికి మద్దతిస్తోందనే కారణంగా కూతుర్ని కూడా కడతేర్చాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. బోధన్ మండలం పెద్ద మావందికుర్దు గ్రామానికి చెందిన మల్లీశ్వరికి రుద్రూర్‌కు చెందిన బోజేడి గంగాధర్‌తో సుమారు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కూతురు రుత్విక ఉంది. కొన్నేళ్ల పాటు సజావుగా సాగిన వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న గంగాధర్ ఆమెను వేధించేవాడు. ఈ నేపథ్యంలో ఇటీవల పెద్దల సమక్షంలో నిర్వహించిన పంచాయితీలో కూతురు రుత్విక తల్లికి మద్దతుగా మాట్లాడింది. దీంతో తల్లీకూతుళ్లపై గంగాధర్ పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారు జామున నిద్రిస్తున్న భార్య మల్లీశ్వరి (30), కూతురు రుత్విక (13)ను గొడ్డలితో నరి కి హత్య చేశాడు. ఇంటికి తాళం వేసి పోలీస్‌స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు. బోధన్ ఏసీపీ రామారావు, రుద్రూర్ సీఐ అశోక్ రెడ్డి, ఎస్సై రవీందర్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృ తురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్టు బోధన్ ఏసీపీ తెలిపారు. -
‘పోలీస్ అంకుల్ మా అమ్మే నాన్నను కత్తితో పొడిచింది’
ముంబై: పో‘‘పోలీస్ అంకుల్.. పోలీస్ అంకుల్ మా అమ్మ, ఎవరో ఒక అంకులు కలసి మా నాన్నని కత్తితో పొడిచారంటూ ఆరేళ్ల చిన్నారి అమాయకంగా చెప్పడంతో పోలీసులు చలించిపోయారు. చిన్నారి చెప్పిన వివరాల ఆధారంగా నిందితురాల్ని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ముంబై పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ గోండా జిల్లాకు చెందిన భార్య భర్తలు షాహిదా షేక్, రీస్ షేక్. వాళ్లిద్దరికి ఆరేళ్లు కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే ఉపాధి నిమిత్తం కుటుంబంతో కలిసి ముంబైకి వచ్చిన భర్త రీస్ షేక్.. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. అదే సమయంలో భార్య షాహిదా షేక్ ఇంటి పక్కనే ఉన్న అమిత్ మిశ్రాతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన షాహిదా.. భర్తను ప్రియుడితో కలిసి ఆరేళ్లు కుమార్తె ఎదుట అత్యంత కిరాతంగా హత్య చేసి, ఎవరికీ తెలియకుండా ఇంట్లోనే పూడ్చిపెట్టింది. అనంతరం తన భర్త కనిపించడం లేదంటూ దహిసర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె రీస్‌షేక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో రీస్‌షేక్ సోదరుడు తన వదిన తీరుపై అనుమానం వ్యక్తం చేశాడు. తన అన్న అదృశ్యంలో వదిన పాత్ర ఉందని, అన్న గురించి అడుగుతుంటే ఆమె పొంతనలేని సమాధానాలు చెబుతోందని దహిసర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు షాహిదాను అదుపులోకి తీసుకొని ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆరేళ్ల కుమార్తెతో మాట్లాడిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. ‘పోలీస్ అంకుల్.. మా నాన్నను మా అమ్మ ఆ తీగతో మెడకు చుట్టేసింది. ఆ తర్వాత కత్తితో పొడిచింది. ఎవరికైనా చెబితే మా నాన్నకి చేసినట్లుగానే నాక్కూడా చేస్తానంది’ అని చిన్నారి పోలీసులకు అమాయకంగా తెలిపాడు. దీంతో పోలీసులు చిన్నారి చెప్పిన వివరాల ఆధారంగా ఇంట్లో మృతి చెందిన రీస్ షేక్ శరీర భాగాల్ని వెలికి తీశారు. హత్యకేసులో ప్రధాన నిందితురాలైన రీస్ షేక్ భార్య షాహిదా, ఆమె ప్రియుడు అమిత్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యకేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసున్నామని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: పోలీసుల కాల్పుల్లో గాయపడ్డ గ్యాంగ్‌రేప్ నిందితుడు -
తునిలో ఎన్నారై సురేశ్ మృతి కలకలం.. భార్యే..!
సాక్షి, తూర్పుగోదావరి: తునిలో ఓ ఎన్నారై అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యే భర్తను హత్య చేసిందని ఎన్నారై సురేశ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకెళ్తే.. ఒడిశా రాష్ట్రం పెంటకోట గ్రామానికి చెందిన వంకా సురేశ్.. తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన ప్రమీలను 13 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. సురేశ్ జపాన్‌లో ఉద్యోగం చేస్తుండగా.. కరోనా కారణంగా ఇండియాకు తిరిగొచ్చి గత నాలుగు నెలలుగా భార్యతో కలిసి తునిలో ఉంటున్నాడు. అయితే ఈ మధ్యనే సురేశ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గుండెపోటుతో మృతి చెందాడని సురేశ్ భార్య అతడి తల్లిదండ్రులకు తెలియజేయడంతో అంత్యక్రియలు పూర్తి చేశారు. (నంద్యాల కుటుంబం ఆత్మహత్య: సీఐ, హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్) అయితే అంత్యక్రియలు ముగిసిన రెండు రోజుల తర్వాత కుటుంబ సభ్యులు అంత్రక్రియలకు సంబంధించిన ఫొటోలలో కొన్ని గాయాలు గుర్తించారు. గాయాలు చూసి సురేశ్ కుటుంబ సభ్యులు తుని పట్టణ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సురేశ్ భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని, అందుకే తన తమ్ముడిని చంపేసిందని సురేశ్ సోదరుడు ఆరోపించాడు. హత్యకు అత్తామామలు కూడా సహకరించారని సురేశ్ సోదరుడు వంకా జగన్నాథం ఫిర్యాదులో పేర్కొన్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే సురేశ్ భార్యే తమ కుమారుడని హత్యచేసిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో పూడ్చి పెట్టిన మృతదేహాన్ని వెలికి తీసి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
బావతో వివాహేతర సంబంధం పెట్టుకుని..
సాక్షి, గుంటూరు: బావతో వివాహేతర సంబంధం పెట్టుకుని బావతో కలసి భర్తను హత్యచేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మానవ విలువలను మంటగలిపే ఈ ఘటన మంగళగిరి మండలం, నవులూరు గ్రామం, ఉడా కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... గత నెల 26న మంగళగిరి మండలం నవులూరు గ్రామ పరిధిలోని క్రికెట్ స్టేడియం వెనుక ముళ్ల పొదల్లో గుర్తు తెలియని పురుషుని మృతదేహం ఉన్నట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మంగళగిరి రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహం పక్కన లభించిన ఆధార్ కార్డు ఆధారంగా మృతుడు సీతారామాంజనేయులుగా గుర్తించిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో మృతుని భార్య లక్ష్మి, సోదరుడు దుర్గా ప్రసన్న, అతని స్నేహితులు పరారీలో ఉన్నట్టు గుర్తించారు. అనుమానంతో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా దుర్గా ప్రసన్న, లక్ష్మిల మధ్య కొనసాగుతున్న వివాహేతర సంబంధం తెలిసింది. తన సోదరునితో భార్య వివాహేతర సంబంధం తెలిసి సీతారామాంజనేయులు తరచూ గొడవకు దిగుతుండటంతో భర్తను అడ్డు తొలగించుకోవటానికి ఒక పథకం ప్రకారం గత నెల 21వ తేదీ రాత్రి 8.15 గంటల సమయంలో స్టేడియం వద్ద ఆటోలో ఒంటరిగా కూర్చున్న సీతారామాంజనేయుల్ని భార్య లక్ష్మి, అన్న దుర్గాప్రసన్న, అతని స్నేహితులు తోడేటి నాగరాజు, పసుపులేటి హరికృష్ణ కలసి బలవంతంగా బయటకు లాగి గొంతు నులిమి, పిడి గుద్దులు గుద్ది చంపారు. అనంతరం శవాన్ని స్టేడియం వెనుక ఉన్న ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి తుమ్మచెట్టుకి టవల్‌తో ఉరి వేశారు. ముళ్లపొదల్లో మృతదేహాన్ని పోలీసులు గత నెల 26 న గుర్తించి గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. మృతుని వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా చేసిన దర్యాప్తులో హత్య విషయం వెల్లడైంది. వెలుగులోకి రెండో హత్య సీతారామాంజనేయులు హత్య కేసులో నిందితులను విచారించగా మరో హత్య కేసు వెలుగులోకి వచ్చింది. పిడుగురాళ్లకు చెందిన చిన్నాతో కలసి మృతుడు సీతారామాంజనేయులు, తోడేటి నాగరాజు గతంలో కొన్ని నేరాలు చేశారు. వీరి మధ్య మనస్పర్థలు రావడంతో చిన్నా నాగరాజును చంపుతానని బెదిరించేవాడు. ఈ నేపథ్యంలో గత నెల 18న గుంటూరు నగరంలోని ఆర్టీవో కార్యాలయం సమీపంలోని ఓ రూమ్‌కు పిలిపించి నాగరాజు, సీతారామాంజనేయులు కలసి చిన్నాను హత్య చేశారు. చిన్నా మృతిపై నల్లపాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హత్యకు సాయం చేసిన సీతారామాంజనేయులు ఎక్కడ భయపడి విషయం బయటపెడతాడోనని అతన్ని హతమార్చడానికి నాగరాజు సీతారామాంజనేయులు అన్న దుర్గా ప్రసన్నకు సహకరించాడు. జిల్లా పోలీస్ కార్యాయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టారు. చిన్నా మృతదేహాన్ని వెలికితీసి రెవెన్యూ అధికారుల సమక్షంలో రీపోస్టుమార్టం నిర్వహిస్తామన్నారు. విచారణలో ప్రతిభ కనపరిచిన సీఐ పి.శేషగిరిరావు, ఎస్ఐ, ఇతర సిబ్బందిని అభినందించి, రివార్డులు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ గంగాధరం, డీఎస్పీ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
సాక్షి, నకిరేకల్: మండల పరిధిలోని చిత్తలూరు గ్రామానికి చెందిన గెండెబోయిన మల్లేష్(29)కి సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల పరిధిలోని జాజిరెడ్డిగూడేనికి చెందిన చీమల లింగయ్య కుమార్తె మమతతో తొమ్మిది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం మల్లేష్‌కు భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మల్లేష్ తనకున్న రెండెకరాల వ్యవసాయ భూమిలో పంటలు సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అడ్డు తొలగించుకోవాలని.. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అంతమొందించాలని మమత నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని తన ప్రియుడు సోమయ్యకు చెప్పింది. మల్లేష్ మద్యం మత్తులో ఉండగా తమ వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. వారు అనుకున్నట్టుగానే మంగళవారం అర్వపల్లి సంతకు పోయిన మల్లేష్ పూటుగా మద్యం సేవించి తిరిగి వచ్చే క్రమంలో జాజిరెడ్డిగూడెంలోని అత్తగారింటికి వెళ్లాడు. అనంతరం రాత్రి 10 గంటల సమయంలో మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. తలదిండుతో అదిమి.. ఊపిరాడకుండా చేసి.. ఇదే అదునుగా భావించిన భార్య మమత భర్త మద్యం మత్తులో ఉన్నాడనే విషయాన్ని ప్రియుడు సోమయ్యకు చేరవేసింది. మల్లేష్ టీవీ పెట్టుకొని చూస్తూ ఇంటి హాలులోని బెడ్‌పై నిద్రించే క్రమంలో వాంతులు చేసుకుంటూ బెడ్‌పైనుంచి జారి కిందపడ్డాడు. గమనించిన అతని భార్య మల్లేష్‌ను శభ్రపరచి నేలపైనే పడుకోబెట్టింది. రాత్రి 11.30 గంటల సమయంలోనే మల్లేష్ ఇంటికి వచ్చిన సోమయ్య ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు బయటకు రాకుండా బెడ్రూం గడియపెట్టి నడుస్తున్న టీవీ సౌండ్ పెంచారు. మద్యం మత్తులో స్పృహతప్పి ఉన్న మల్లేష్ ముఖంపై తలదిండుతో సోమయ్య బలంగా అదిమిపట్టగా, మమత మల్లేష్ కదలకుండా గట్టిగా కాళ్లు పట్టుకుంది. దీంతో కొద్దిసేపట్లోనే మల్లేష్ మృతిచెందాడు. మల్లేష్ ప్రాణం పోయిన విషయాన్ని నాడి ద్వారా గుర్తిం చిన మమత ఆ పురుగుల మందును మల్లేష్ నోట్లో పోయగా, సోమయ్య శరీరంపై పోశాడు. అనంతరం గుట్టుచప్పుడుకాకుండా సోమయ్య మల్లేష్ ఇంట్లోనుంచి వెళ్లిపోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడని.. భర్త మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకున్న మమత తెల్లవార్లు్ల నిద్రపోలేదు. బుధవారం తెల్లవారుజా మున ఏమీ తెయనట్లు మల్లేష్ పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడంటూ విషయాన్ని సమీపంలో ఉన్న అత్తమామ, బావ కుటిం బీకులకు తెలిపింది. లబోదిబోమంటూ మల్లేష్ తల్లిదండ్రులు, సోదరుడు వచ్చి చూసేసరికి శరీ రంపై పురుగులమందు పోసి ఉండటంతో వారికి అనుమానం వచ్చింది. మల్లేష్ మృతి చెందిన విషయం గ్రామంలో దావనంలా వ్యాపిం చడంతో గ్రామస్తులు తండోపతండలుగా తరలివచ్చారు. ఆత్మహత్య కాదని, హత్యేనంటూ నిర్ధారణకు వచ్చిన మల్లేష్ కుటుంబీకులు, సమీపబంధువులు, గ్రామస్తులు మమతపై దాడిచేసేందుకు ప్రయత్నించారు. మల్లేష్ హత్య విషయాన్ని తెలుసుకున్న ఎస్ఐ రాజు సిబ్బందితో చిత్తలూరుకు చేరుకుని ఏలాంటి దాడులు, ఘర్షణలు జరుగకుండా నియంత్రించారు. సంఘటనా స్థలాన్ని సీఐ క్యాస్ట్రోరెడ్డి పరిశీలించారు. మృతుడి భార్య మమతను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను రహస్య ప్రదేశానికి తరలించి విచారించడంతో నేరం అంగీకరించినట్టు తెలిసింది. అందరూ చూస్తుండగానే.. తన సన్నిహితుడైన గుండెబోయిన మల్లేష్‌ను హత్య చేసిన పూల సోమ య్య అలియాస్ సోమన్న మంగళవా రం రాత్రి ఇంట్లోను ఉండి బుధవారం ఉదయం సుమారు 6.00 గంటల సమయంలో భార్య, పిల్లలతో కలిసి ఊరువిడిచి తుడిమిడి రోడ్డుమీదుగా ద్విచక్రవాహనంపై పరారయ్యా డు. గ్రామంలో ప్రధాన రాజకీయపార్టీ నాయకుడుగా ఉన్న సోమయ్యకు నకిరేకల్‌కు చెందిన ఓ మాజీ ఎంపీపీ సమీప బంధువు. ఊరువిడిచి పరారైన సోమయ్య ఎక్కడ తలదాచుకున్నాడో గుర్తించే క్రమంలో పోలీసులు ఉన్నారు. పూల సోమయ్య స్వగ్రామం నకిరేకల్ మండలంలోని మంగళపల్లి . రెండు దశాబ్దాల క్రితం సోమయ్య తల్లిదండ్రులు పిల్లలతో కలిసి చిత్తలూరుకు వలసవచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. -
ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య
గుడుపల్లె : మండలంలోని అగరం గ్రామంలో శుక్రవారం వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్తే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ భాస్కర్ కథనం మేరకు.. మండలంలోని అగరం గ్రామానికి చెందిన నాగభూషణంకు అదే మండలం మల్దేపల్లెకు చెందిన సోమప్ప కుమారై అశ్విని(23)ని ఇచ్చి రెండేళ్ల క్రితం వివాహం చేశారు. వీరి కాపురం సజావుగా సాగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం నాగభూషణం పొలం పనులకు వెళ్లాడు. అనంతరం ఏమి జరిగిందో కాని అశ్విని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెందింది. స్థానికులు గమనించి భర్తకు, మృతురాలి బంధువులకు సమాచారం అందించారు. బంధువులు అక్కడికి చేరుకుని తమ కూతురిని భర్తే చంపేశాడని ఆరోపిస్తూ ఇంటిని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ భాస్కర్ అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత హత్యగా తేలితే చర్యలు తీసుకుంటామని మృతురాలి బంధువులకు హామీ ఇచ్చారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లయి రెండేళ్లకే కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో బంధువులు బోరును విలపించారు. -
ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది
ఇరగవరం : మండలంలోని రేలంగిలో ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడితో కలిసి భార్యే అతనిని హతమార్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రేలంగి గ్రామానికి చెందిన పసుపులేటి కృష్ణ(30) ఈ ఏడాది జనవరి 8వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా మృతుని తండ్రి బలరామ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పెనుగొండ సీఐ వానపల్లి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసును ఛేదించారు. మృతుడు కృష్ణకు పదేళ్ల క్రితం దేవరపల్లి మండలం బంధపురం గ్రామానికి చెందిన సత్యవతితో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె ఉంది. తొలుత భార్య సత్యవతికి స్వగ్రామం బంధపురంలో పీఎంపీ వైద్యుడితో పరిచయం ఏర్పడి అతనితో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆమె కుటుంబ సభ్యులు పీఎంపీ వైద్యుడిని పిలిపించి విచారించగా అతను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తిరిగి సత్యవతి రేలంగి గ్రామంలో దాసిరెడ్డి ఆంజనేయ రాజు(పుల్లయ్య)తో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. భార్య ప్రవర్తనతో కృష్ణ మద్యానికి బానిసై వారి సంతోషానికి అడ్డుతగులుతున్నాడు. భర్త అడ్డు తొలగించుకోవాలని భావించిన సత్యవతి, ఆంజనేయ రాజుతో కలిసి హత్యకు పథకం రూపొందించింది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో భర్త నిద్రిస్తుండగా ప్రియుడి సహాయంతో మెడకు తువాలు బిగించి హతమార్చారు. పోలీసుల విచారణలో నిందితులిద్దరూ నేరాన్ని అంగీకరించారు. వారిని మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. కేసు దర్యాప్తునకు హెచ్‌సీ ఆర్.కొండలరావు, ఎస్.ప్రదీప్ కుమార్ సహకరించారు.