భ‍ర్త నిద్రలో చనిపోయినట్లు నమ్మించింది..చివర్లో కూతురు షాకింగ్‌ ట్విస్ట్‌ | Police Arrested Wife Her Boyfriend In Husband Killing Case At Karnataka | Sakshi
Sakshi News home page

భ‍ర్త నిద్రలో చనిపోయినట్లు నమ్మించింది..చివర్లో కూతురు షాకింగ్‌ ట్విస్ట్‌

Published Sun, Jan 8 2023 8:15 AM | Last Updated on Sun, Jan 8 2023 8:15 AM

Police Arrested Wife Her Boyfriend In Husband Killing Case At Karnataka - Sakshi

సాక్షి, యశవంతపుర: తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, భర్తను హత్య చేసిన కేసులో పోలీసులు భార్యతో పాటు ఆమె ప్రియుడిని అరెస్ట్‌ చేశారు. నందిని లేఔట్‌ పోలీసుల వివరాల మేరకు ... సంజయ్‌ నగరకు చెందిన ఆంజనేయ (45), అనిత దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉంటే గార్మెంట్స్‌ పరిశ్రమలో పనిచేస్తున్న అనితకు రాకేశ్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం ఆంజనేయకు తెలియడంతో ఆయన మానుకోవాలని పలుమార్లు హెచ్చరించినా అనిత పెడచెవిన పెట్టింది. చివరకు ప్రియుడు రాకేశ్‌ గత ఏడాది జూన్‌ 18న ఇంటికి పిలిపించింది. నిద్రలో ఉన్న ఆంజనేయుడిని ఇద్దరు గొంతు పిసికి చంపేశారు. గుండెపోటుతో చనిపోయినట్లు అందరిని నమ్మించారు.  

అమ్మే చంపింది 
ఇదిలా ఉంటే రాకేశ్‌ కూతురు ఇటీవల బంధువులకు అమ్మే నాన్నను చంపిందని తెలిపింది. దీంతో బంధువులు ఈనెల 4న   నందిని లేఔట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనితను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అక్రమ సంబంధం విషయమై తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు విచారణలో తెలింది. దీంతో పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. 

(చదవండి: బిర్యానీ తిని యువతి మృతి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement