marrital affair
-
భర్త నిద్రలో చనిపోయినట్లు నమ్మించింది..చివర్లో కూతురు షాకింగ్ ట్విస్ట్
సాక్షి, యశవంతపుర: తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, భర్తను హత్య చేసిన కేసులో పోలీసులు భార్యతో పాటు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. నందిని లేఔట్ పోలీసుల వివరాల మేరకు ... సంజయ్ నగరకు చెందిన ఆంజనేయ (45), అనిత దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉంటే గార్మెంట్స్ పరిశ్రమలో పనిచేస్తున్న అనితకు రాకేశ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం ఆంజనేయకు తెలియడంతో ఆయన మానుకోవాలని పలుమార్లు హెచ్చరించినా అనిత పెడచెవిన పెట్టింది. చివరకు ప్రియుడు రాకేశ్ గత ఏడాది జూన్ 18న ఇంటికి పిలిపించింది. నిద్రలో ఉన్న ఆంజనేయుడిని ఇద్దరు గొంతు పిసికి చంపేశారు. గుండెపోటుతో చనిపోయినట్లు అందరిని నమ్మించారు. అమ్మే చంపింది ఇదిలా ఉంటే రాకేశ్ కూతురు ఇటీవల బంధువులకు అమ్మే నాన్నను చంపిందని తెలిపింది. దీంతో బంధువులు ఈనెల 4న నందిని లేఔట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అనితను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా అక్రమ సంబంధం విషయమై తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు విచారణలో తెలింది. దీంతో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. (చదవండి: బిర్యానీ తిని యువతి మృతి) -
భర్తపై హత్యాయత్నం కేసులో వీడిన ట్విస్ట్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఓ వ్యక్తిపై తుపాకితో కాల్పులు జరిపిన సంఘటన స్థానికంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే నిందితులు ఈ కేసులో పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులు ఈ కేసును చేధించగా విస్తుపోయే విషయాలు వెలుగు చుశాయి. వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణమని పోలీసులు వెల్లడించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. భీమ్రాజ్(45) అనే వ్యక్తి చిరాగ్ ఢిల్లీలో భార్య భాటియా(41)తో కలిసి నివసిస్తున్నాడు. భీమ్రాజ్ బీఎస్ఈఎస్లో పవర్ కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతడి భార్య భాటియాకు 23 ఏళ్ల రోహన్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరిద్దరి విషయం తెలుసుకున్న భీమ్రాజ్ పలుమార్లు భార్యను మందలించాడు. అయినా ఆమె మారలేదు. ఈ విషయాన్ని ప్రియుడు రోహన్‌తో చెప్పి భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో రోహన్ తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని ఓ దేశీయ తుపాకి కొని, బైకు నెంబర్‌ను మార్చాడు. బుధవారం భీమ్ రాజ్ కారులో వెళ్తుండగా బైక్‌పై వెంబడించి భీమ్రాజ్పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ భీమ్రాజ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా సంఘటనకు సంబంధించిన దృశ్యం కాస్తా సీసీ కెమెరాల్లో రికార్డయింది. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసుల ఆ బైక్‌ను కనుగొనె ప్రయత్నం చేశారు. అయితే నంబర్ ప్లెట్ మార్చడంతో పోలీసు బైక్ ఎవరిదో, నిందితుడు ఎవరో తెలుసుకోవడం కష్టంగా మారింది. దీంతో ఈకేసును ఢిల్లీ పోలీసులు సవాలుగా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. చివరికి సాంకేతిక ఆధారాలతో నిందితుడు రోహన్‌ను బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. రోహన్ విచారించగా కొద్ది రోజుల కిందట జరిగిన ఓ చిన్న యాక్సిడెంట్లో తనకు, భీమ్ రాజ్‌కు మధ్య గొడవ జరిగిందని, అందుకే అతడిని చంపాలనుకున్నాను అంటూ ఓ కథ అల్లి ప్రియురాలిని తప్పించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ విషయంలో పోలీసులకు అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. తనకు, భాటియాకు మధ్య వివాహేతర సంబంధం ఉందని, ఆమె తన భర్త అడ్డు తొలగించాలని కోరడంతో ఈ దారుణానికి పాల్పడినట్టు స్పష్టం చేశాడు. దీంతో ఆమెను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో భీమ్ రాజ్ చికిత్స తీసుకుంటున్నాడు. అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. -
పక్కింటి మహిళతో సంబంధం.. సొరంగం తవ్వి మరీ..
పొరుగింటి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి.. ఆమెను రహస్యంగా కలుసుకునేందుకు భలే ప్లాన్ వేశాడు. తన ఇంట్లో నుంచి నేరుగా ప్రియురాలి బెడ్ రూంలోకి వెళ్లేలా ఏకంగా ఒక సొరంగాన్నే తవ్వాడు. అయితే ఆ సొరంగం ఆమె భర్త కంటపడడంతో గుట్టు రట్టయింది. వివరాల్లోకి వెళితే.. మెక్సికోలోని టిజువానాకు చెందిన అల్బెర్టో అనే భవన నిర్మాణ కార్మికుడికి తన పొరుగింటి మహిళ పమెలాతో వివాహేతర సంబంధం ఉంది. పమెలా భర్త జోర్గే ఉద్యోగానికి వెళ్లగానే అల్బెర్ట్ సొరంగం ద్వారా ఆమె బెడ్ రూమ్‌లోకి వెళ్లేవాడు. ఇలా కొంతకాలంగా అక్రమసంబంధాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఒకరోజు జోర్గే.. ఆఫీస్ నుంచి ముందుగా ఇంటికి వచ్చేసరికి.. పమెలా, అల్బెర్ట్‌ల గదిలో కనిపించాడు. జోర్గేను చూడగానే భయంతో సోఫా వెనక నక్కిన అల్బెర్ట్.. అక్కడ ఉన్న సొరంగం గుండా తన ఇంట్లోకి వెళ్లిపోయాడు. అతడు సోఫా వెనుక దాక్కోవడాన్ని కళ్లారా చూసిన జోర్గే.. అక్కడికెళ్లి చూడగా.. మనిషి కనిపించలేదు. సోఫాను కొంచెం జరిపి చూడగా దాని కింద సొరంగం ఉంది. అది చూసి జోర్గే షాకయ్యాడు. . దాని గుండా వెళ్లగా అల్బెర్ట్ ఇంటి లోపలికి అది దారి తీసింది. (చదవండి : ఆరేళ్ల చిన్నారిపై విద్య వలంటీర్ అఘాయిత్యం) మరోవైపు వివాహితుడైన అల్బెర్టో తన ఇంటి నుంచి వెళ్లిపోవాలని జార్జ్‌ను ప్రాధేయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో ఈ విషయం కాస్తా పోలీసులకు వరకు వెళ్లింది. తన భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్న అల్బర్టోపై భర్త ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు అల్బర్టోను అదుపులోకి తీసుకున్నారు. -
దారుణం: భర్తపై భార్య విషప్రయోగం
సాక్షి, కాటారం(జయశంకర్ భూపాలపల్లి): మూడుమూళ్లు, ఏడు అడుగుల బంధానికి కళంకాన్ని తెచ్చింది ఓ మహిళ. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తన భర్తను ప్రియుడితో కలిసి కడతేర్చింది. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం రేగులగూడెంలో చోటు చేసుకుంది. ఆగస్టు 19న ఈ ఘటన చోటుచేసుకోగా అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు ఎట్టకేలకు మిస్టరీని చేధించారు. కాటారం సీఐ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ బి.హతీరాం కేసు వివరాలను వెల్లడించారు. రేగులగూడెం గ్రామానికి చెందిన మారుపాక దేవేందర్(40), మారుపాక స్వప్నకు 12 ఏళ్ల క్రితం వివాహం జరగగా, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ఇదే క్రమంలో 2017లో మహాముత్తారం గ్రామానికి చెందిన లింగమళ్ల కళ్యాణ్‌తో స్వప్నకు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం దేవేందర్‌కు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. దీంతో ఆయనను అడ్డు తొలగించాలని స్వప్న, ఆమె ప్రియుడు కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం కళ్యాణ్ పురుగుమందు విషపు గుళికలు స్వప్నకు అందించగా, ఆమె మద్యంలో కలిపి దేవేందర్‌కు ఆగస్టు 19న తాగించింది. మరుసటి రోజు ఉదయం దేవేందర్ వాంతులు, విరోచనాలు చేసుకొని మృతి చెందాడు. అయితే, తన కొడుకు మృతిపై అనుమానం ఉందని దేవేందర్ తండ్రి నర్సయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. కాటారం సీఐ హతీరాం నేతృత్వంలో దర్యాప్తు చేపట్టగా, రసాయనిక పరీక్షల ఆధారంగా మృతుడిపై విషప్రయోగం జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు స్పప్నపై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించగా నిజం ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు. దీంతో బుధవారం స్వప్న, కల్యాణ్‌లపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. -
తమిళనాడులో నడిరోడ్డుపై మహిళపై కత్తితో దాడి
-
వరంగల్ జిల్లాలో ముగ్గురు సజీవ దహనం
-
భర్త అక్రమ సంబంధం..రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య
-
భర్తను ప్రియుడితో హత్య చేయించిన భార్య
-
భార్య భర్త మధ్యలో ప్రియుడు!
-
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
ఆదిలాబాద్ : వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. వివాహితను హత్య చేసిన యువకుడు తానూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం ధంపూర్ శివారులో చోటు చేసుకుంది. ఎస్సై కిరణ్‌కుమార్ కథనం ప్రకారం.. మండలంలోని కొలాంగూడకు చెందిన వివాహిత మడావి సునీత(41), ఇదే గ్రామానికి చెందిన టేకం గోవింద్(26)కు మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 21న ఇద్దరూ కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయారు. సునీత భర్త నాగోరావ్ శుక్రవారం స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. శనివారం ఉదయం వారిద్దరి మృతదేహాలు కొలాంగూడ గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పత్తిచేనులోని గుడిసెలో కనిపించాయి. సునీత, గోవింద్ శుక్రవారం రాత్రి చేను వద్దకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇంటికి వెళ్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయోననే భయంతో వీరు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సునీత చీరతో చేరో వైపు ఉరేసుకోవాలని ఏర్పాటు చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. ఉరికి సునీత అంగీకరించకపోవడంతో అక్కడే ఉన్న గొడ్డలితో ఆమె గొంతుపై నరికి ఆ తర్వాత గోవింద్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. సునీతకు కూతురు, కుమారుడు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
కాదన్నందుకు కడతేర్చాడు..
నిజామాబాద్, వర్ని(బాన్సువాడ): వివాహేతర సంబంధం హత్యకు దారి తీసింది. కోరిక తీర్చలేదనే కోపంతో గొడ్డలితో హతమార్చాడు. అడ్డువచ్చిన భర్తపైనా దాడి చేసి పారిపోయాడు.. కలకలం రేపిన ఈ ఘటన వర్ని మండలం జాకోరాలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జాకోరా గ్రామానికి చెందిన కుంచెపు సాయవ్వ(40) భర్త నాగయ్య జీవనోపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన మాగని చిన్నసాయిలుతో సాయవ్వకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆరునెలల క్రితం నాగయ్య దుబాయ్ నుంచి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. నెలరోజుల క్రితం పెద్ద కుమారుడు సురేశ్ వివాహం చేశారు. ఈ నేపథ్యంలో సాయవ్వ సాయిలుతో దూరంగా ఉంటూ వచ్చింది. శుక్రవారం రాత్రి సాయిలు మద్యం సేవించి సాయవ్వ ఇంటికి వచ్చి తన కోరిక తీర్చాలని పట్టుబట్టాడు. ఆమె నిరాకరించడంతో వెళ్లిపోయాడు. రాత్రి 11 గంటల సమయంలో ఆరు బయట భర్త నాగయ్యతో పాటు నిద్రిస్తున్న సాయవ్వ వద్దకు వచ్చి గొడ్డలితో మెడపై, చాతిపై కొట్టి దారుణంగా హతమార్చాడు. అడ్డువచ్చిన సాయవ్వ భర్తపై గొడ్డలితో దాడి చేశాడు. అలికిడికి చుట్టుపక్కల వారు నిద్రలేవడంతో పారిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ అంజయ్య ఘటనా స్థలానికి వచ్చి క్షతగాత్రుడిని నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేశారు. శనివారం ఉదయం బోధన్ రూరల్ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో చుట్టు పక్కల వారిని ప్రశ్నించి హత్య వివరాలు తెలుకున్నారు. హంతకుడు సాయిలు గతం నుంచే నేర ప్రవత్తి కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. సొంత భార్యతో తరుచూ గొడవపడే వాడని స్థానికులు పేర్కొన్నారు. దీంతో పదేళ్ల క్రితం ఆమె పుట్టిళ్లు మొగిలిపేట వెళ్లగా, అక్కడికి వెళ్లి భార్య గొంతు కోసి హత్యాయత్నం చేసినట్టు తెలిపారు. అనంతరం సాయవ్వతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే ఆమె వద్ద డబ్బులు డిమాండ్ చేసే వాడని తెలుస్తోంది. సాయవ్వ కుమారుడి పెళ్లి చేయడంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి రెండు రోజుల క్రితం పైపులు విక్రయించి వివాహం సమయంలో చేసిన ఉద్దెర బాకీలను తీర్చింది. ఈ డబ్బులు సైతం ఇవ్వాలని సాయిలు ఆమెను డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ విషయమై కూడా కక్ష కట్టిన సాయిలు హత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. -
కసాయి భార్య
♦ వివాహేతర సంబంధంతో భర్త హత్య ♦ సహజ మరణమని నమ్మించి దహన సంస్కారాల నిర్వహణ ♦ నెలలు గడుస్తున్నా కిరాయి రౌడీలకు డబ్బులివ్వని వైనం ♦ వాహన తనిఖీల్లో పట్టుబడి హత్య విషయం కక్కిన నిందితులు ♦ విలేకర్ల సమావేశంలో వెల్లడించిన ఏసీపీ భీమారావు ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): కట్టుకున్న భార్యే భర్తను కడతేర్చింది. సహజ మరణంగా అందర్నీ నమ్మించి దహన సంస్కారాలు చేయించింది. ఇది జరిగి నెలలు గడిచిపోయింది. అంతా సద్దుమణిగిపోయిందనుకున్న తరుణంలో నిందితులతో సహ మృతుడి భార్య కూడా పోలీసులకు చిక్కింది. ఎయిర్పోర్ట్ జోన్ పోలీస్ స్టేషన్లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈ కేసు వివరాలను ఏసీపీ భీమారావు వెల్లడించారు. విశాఖపట్నం ఎస్ఈ రైల్వేలో కలాసీగా పని చేస్తున్న డబ్బూరి సంతోష్‌కుమార్(30), నిందితురాలు డబ్బూరి కరుణ జ్యోతి కలసి రెడ్డి కంచరపాలెం సుభాష్‌నగర్‌లో నివాసముండేవారు. కరుణ జ్యోతికి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండేది. దీంతో పథకం ప్రకారం భర్తను తప్పించినట్లయితే ఆయన ఉద్యోగంతో పాటు ప్రియునితో సహజీవనం చేయొచ్చని భావించింది. అంతే పథకం ప్రకారం కిరాయి రౌడీలతో రూ.3 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. గతేడాది నవంబర్ 27 రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సంతోష్‌కుమార్‌ను కిరాయి రౌడీలు హతమార్చారు. తన భర్త మద్యం ఎక్కువగా తీసుకోవడంతో చనిపోయాడని కుటుంబ సభ్యులు, బంధువులను నమ్మించింది. సహజ మరణంగా నమ్మిన వారంతా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా దహన సంస్కరాలు నిర్వహించేశారు. పోలీసుల తనిఖీల్లో దొరికారు..: ఎన్ఏడీ కూడలిలో పోలీసులు శనివారం వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంగా తిరుగుతున్న ముసురి బాలరాజు, పిల్లా అప్పన్నను ప్రశ్నించారు. వారు పొంతన లేని వివరాలు చెబుతుండడంతో అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడంతో గతంలో హత్య చేసిన విషయాలు బట్టబయలు చేశారని ఏసీపీ తెలిపారు. తమతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వలేదని, హత్య చేసిన సమయంలో రూ.2 వేలు మాత్రమే ఇచ్చారని వారు చెప్పారన్నారు. ఇప్పుడు మిగతా సొమ్ము కోసం విశాఖ వచ్చినట్టు నిందితులు ఒప్పుకున్నారని వివరించారు. ఈ మేరకు కరుణ జ్యోతిని, డుంబ్రిగుడ మండలానికి చెందిన కిరాయి రౌడీలు ముసిరి బాలరాజు, గుజ్జల చిరంజీవి, పిల్లా అప్పన్నలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. చిరంజీవిపై ఇప్పటికే హత్య, అత్యాచారం కేసులతో పాటు రౌడీ షీట్ ఉందన్నారు. పరారీలో ఉన్న ప్రియుడితో పాటు మరికొందరు నిందితుల కోసం రెండు బృందాలు తిరుగుతున్నాయని ఏసీపీ వివరించారు. ఈ కేసు ఛేదనలో కీలక పాత్ర వహించిన ఎస్ఐ జె.సురేష్, సీఐ ప్రభాకర్‌లను ఆయన అభినందించారు. ఈ సమావేశంలో కంచరపాలెం సీఐ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.