పక్కింటి మహిళతో సంబంధం.. సొరంగం తవ్వి మరీ.. | Mexican Man Constructs A Long Passageway To His Married lover Home | Sakshi
Sakshi News home page

‘సొరంగ’ సంబంధం.. ప్రియురాలిని కలిసేందుకు ఏకంగా.

Published Sun, Jan 10 2021 7:13 PM | Last Updated on Sun, Jan 10 2021 7:29 PM

Mexican Man Constructs A Long Passageway To His Married lover Home - Sakshi

పొరుగింటి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న  ఓ వ్యక్తి.. ఆమెను రహస్యంగా కలుసుకునేందుకు భలే ప్లాన్‌ వేశాడు. తన ఇంట్లో నుంచి నేరుగా ప్రియురాలి బెడ్‌ రూంలోకి వెళ్లేలా ఏకంగా ఒక సొరంగాన్నే తవ్వాడు. అయితే  ఆ సొరంగం ఆమె భర్త కంటపడడంతో గుట్టు రట్టయింది.

వివరాల్లోకి వెళితే.. మెక్సికోలోని టిజువానాకు చెందిన అల్బెర్టో అనే భవన నిర్మాణ కార్మికుడికి తన పొరుగింటి మహిళ పమెలాతో వివాహేతర సంబంధం ఉంది. పమెలా భర్త జోర్గే ఉద్యోగానికి వెళ్లగానే అల్బెర్ట్‌ సొరంగం ద్వారా ఆమె బెడ్‌ రూమ్‌లోకి వెళ్లేవాడు.  ఇలా కొంతకాలంగా అక్రమసంబంధాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఒకరోజు జోర్గే.. ఆఫీస్‌ నుంచి  ముందుగా ఇంటికి వచ్చేసరికి.. పమెలా, అల్బెర్ట్‌ల గదిలో కనిపించాడు. జోర్గేను చూడగానే భయంతో సోఫా వెనక నక్కిన అల్బెర్ట్‌.. అక్కడ ఉన్న సొరంగం గుండా తన ఇంట్లోకి వెళ్లిపోయాడు. అతడు సోఫా వెనుక దాక్కోవడాన్ని కళ్లారా చూసిన జోర్గే.. అక్కడికెళ్లి చూడగా.. మనిషి కనిపించలేదు. సోఫాను కొంచెం జరిపి చూడగా దాని కింద సొరంగం ఉంది. అది చూసి జోర్గే షాకయ్యాడు. . దాని గుండా వెళ్లగా అల్బెర్ట్‌ ఇంటి లోపలికి అది దారి తీసింది.
(చదవండి : ఆరేళ్ల చిన్నారిపై విద్య వలంటీర్‌ అఘాయిత్యం)

మరోవైపు వివాహితుడైన అల్బెర్టో తన ఇంటి నుంచి వెళ్లిపోవాలని జార్జ్‌ను ప్రాధేయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో ఈ  విషయం కాస్తా పోలీసులకు వరకు వెళ్లింది. తన భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్న అల్బర్టోపై భర్త ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు అల్బర్టోను అదుపులోకి తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement