రిషికేశ్‌–కర్ణప్రయాగ్‌ రైల్‌ సొరంగం.. అత్యంత పొడవైన టన్నెల్‌ | Uttarakhand Gets India Longest Transport Tunnel Rishikesh-karnaprayag Rail Project, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

రిషికేశ్‌–కర్ణప్రయాగ్‌ రైల్‌ సొరంగం.. అత్యంత పొడవైన టన్నెల్‌

Published Thu, Apr 17 2025 7:22 AM | Last Updated on Thu, Apr 17 2025 10:24 AM

Rishikesh-Karnaprayag rail project longest transport tunnel

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని 125 కిలోమీటర్ల పొడవైన రిషికేశ్‌– కర్ణప్రయాగ్‌ రైలు మార్గం పనులు శరవేగంగా సాగుతున్నాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా సాగుతున్న రెండో రైల్‌ టన్నెల్‌ ప్రాజెక్టుగా ఇది నిలిచిందన్నారు. కాగా, రెండు వైపుల్నించి తవ్వుకుంటూ వచ్చిన టన్నెల్‌ అనుసంధాన పనులను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ బుధవారం స్వయంగా పర్యవేక్షించారు. ఇందుకోసం ఆయన 3.5 కిలోమీటర్ల మేర ఆయన.. సీఎం పుష్కర్‌సింగ్‌ ధామితో కలిసి సొరంగంలో ప్రయాణించారు.

ఈ నేపథ్యంలో ఇది చారిత్రక సందర్భమన్నారు. సరిగ్గా ఇదే రోజున 1853 ఏప్రిల్‌ 16న బ్రిటిష్‌ జమానాలో మన దేశంలో రైలు సేవలు మొదలయ్యాయని గుర్తు చేశారు. జంట టన్నెళ్లకు గాను మరోటి జూలైలో పూర్తవుతుందని, ఈపనులను ఎల్‌ అండ్‌ టీ కంపెనీ చేపట్టిందన్నారు. స్పెయిన్‌లో డబుల్‌ షీల్డ్‌ టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌(టీబీఎం) 9.69 డయామీటర్ల కబ్రెరా టన్నెల్‌ను నెలకు 423 మీటర్ల చొప్పున తొలచగా, దేవ్‌ప్రయాగ్‌–జనాసు మధ్య సింగిల్‌ షీల్డ్‌ టీబీఎం నెలకు 413 మీటర్ల చొప్పున టన్నెల్‌ తవ్వకాన్ని పూర్తి చేసిందని ఆయన వివరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పూర్తయిన రెండో టన్నెల్‌గా నిలిచిందన్నారు. ప్రారంభమయ్యాక ఇది దేశంలో అత్యంత పొడవైన రవాణా టన్నెల్‌గా నిలువనుందన్నారు.

మొత్తం 14.58 కిలోమీటర్ల నంబర్‌ 8 టన్నెల్‌కు గాను జర్మనీ నుంచి తెప్పించిన ప్రత్యేక టీబీఎం సాయంతో 10.47 కిలోమీటర్ల మేర తవ్వకం జరిపామన్నారు. మిగతాది సాధారణ డ్రిల్, బ్లాస్ట్‌ విధానంలోనే పూర్తి చేసినట్లు చెప్పారు. మొత్తం 125 కిలోమీటర్ల ఈ మార్గంలో 105 కిలోమీటర్ల మేర టన్నెళ్లలోనే ఉండటం దీని ప్రత్యేకతని చెప్పారు. పర్వత ప్రాంతంలో రైలు ప్రాజెక్టు కోసం టీబీఎంలను వాడటం ఇదే మొదటిసారన్నారు. సంప్రదాయ డ్రిల్, బ్లాస్ట్‌ విధానంలో అయితే నెలకు 60 నుంచి 90 మీటర్ల మేర సొరంగం పనులు మాత్రమే పూర్తయ్యేవన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement