కాబోయే అల్లుడితో అత్త జంప్‌ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌.. ఎందుకిలా చేసిందంటే.. | Interesting Twist In UP Woman And Daughter Fiance Episode, See More Details Inside | Sakshi
Sakshi News home page

కాబోయే అల్లుడితో అత్త జంప్‌ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌.. ఎందుకిలా చేసిందంటే..

Published Thu, Apr 17 2025 7:47 AM | Last Updated on Thu, Apr 17 2025 10:35 AM

Interesting Twist In UP Woman And Daughter Fiance Episode

లక్నో: తన కూతురికి కాబోయే భర్తతో సంబంధం పెట్టుకున్న పరారీ అయిన అత్త ఘటన వ్యవహారంలో మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఏది ఏమైనా తాను రాహుల్‌తో జీవిస్తానని, అతడిని పెళ్లి చేసుకుంటానని సప్న తెలిపింది. అలాగే, తాను ఇంట్లొ నుంచి వెళ్లేటప్పుడు డబ్బు, బంగారం ఎత్తుకెళ్లినట్లు తన భర్త చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపింది. మరోవైపు.. తనతో సంబంధానికి ఒప్పుకోకుంటే చనిపోతాను అని సప్న బెదిరించడంతోనే తాను ఆమెతో పారిపోడానికి ఒప్పుకున్నట్లు రాహుల్ కుమార్ చెప్పాడు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల ఇలా ఉన్నాయి. అలీఘర్‌లోని దాదోన్‌కు చెందిన సప్న, జితేంద్ర కుమార్ భార్యాభర్తలు. వీరికి శివానీ అనే ఓ కూతురు ఉంది. శివానీకి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ క్రమంలో రాహుల్ కుమార్ అనే యువకుడితో శివానీకి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. మరో 10 రోజుల్లో పెళ్లి జరుగుతుంది అనగా ఏప్రిల్ 6, 2025న 40 ఏళ్ల సప్న.. తనకు కాబోయే అల్లుడు రాహుల్ కుమార్‌తో పరారీ అయ్యింది. దీంతో, ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం తెలిసిన వారంతా ముక్కునవేలేసుకున్నారు.

అయితే, తాజాగా వారిద్దరూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసు స్టేషన్‌లో లొంగిపోయారు. ఈ క్రమంలో తాను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో సప్న పోలీసులకు వివరించింది. ఈ తన భర్త జితేంద్ర కుమార్ పెద్ద తాగుబోతు అని, తరుచూ తాగొచ్చి తనను కొట్టేవాడని.. తన కూతురు కూడా తరచూ తనతో గొడవలు పెట్టుకునేదని.. అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపింది. ఏది ఏమైనా తాను రాహుల్‌తో జీవిస్తానని, అతడిని పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది. అలాగే, తాను ఇంటి నుంచి వెళ్లేటప్పుడు డబ్బు, బంగారం ఎత్తుకెళ్లినట్లు తన భర్త చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని.. తాను ఇంటి నుంచి వెళ్లేటప్పుడు తన దగ్గర కేవలం ఓ మొబైల్ ఫోన్, రూ.200 మాత్రమే ఉన్నట్లు తెలిపింది.

మరోవైపు.. తనను సప్న బెదిరించడంతోనే తాను ఆమెతో పారిపోడానికి ఒప్పుకున్నట్లు రాహుల్ కుమార్ చెప్పాడు. అలీఘర్ బస్ స్టాప్‌లో కలవకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటాను అని సప్న తనకు ఫోన్ లో చెప్పిందని.. దీంతో తాను అక్కడికి వెళ్లానని.. ఆ తర్వాత ఇద్దరూ కలిసి లక్నో వెళ్లినట్టు తెలిపాడు. పోలీసులు తమ కోసం గాలిస్తున్నారు అని తెలియడంతో తామే వచ్చి లొంగిపోయినట్లు చెప్పాడు. అయితే ఇప్పుడు సప్నని పెళ్లి చేసుకుంటావా అని అడినప్పుడు.. తాను సిద్దంగానే ఉన్నట్టు చెప్పుకొచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement