అత్తా కోడళ్ల గొడవలనేవి తెగని పంచాయితీ.. ప్రతి ఇంట్లోనూ అత్తా కోడళ్ల మధ్య గొడవలు సర్వ సాధారణం. కొన్నిసార్లు ఈ గొడవలు పెద్దవై భార్యభర్తలు విడిపోవడం, లేదా వేరే కాపురం పెట్టే వరకు పోయిన సందర్భాలూ చాలానే ఉన్నాయి. అయితే అత్తా కోడళ్ల గొడవలోకి మగాళ్లు వెళ్లే సాహసం చేయరని అందరికీ తెలిసిందే. ఒకవేళ వెళ్లినా.. లేదా అటు తల్లికి, భార్యకు మధ్య సర్దిచెప్పలేక, వాళ్ల సమస్యలు పరిష్కరించలేక తలలు పట్టుకోవాల్సిందే.
తాజాగా ఇద్దరు అత్తా కోడళ్లు గొడవపడిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే ఇది అట్టాంటి ఇట్టాంటి పంచాయితీ కాదు. అత్తా కోడళ్లు ఇద్దరూ ఒకరిపై ఒకరు భయంకరంగా దాడి చేసుకునే వరకు పోయింది. వంటింట్లో కూర్చొని ఒకరు జుట్టు ఒకరు పట్టుకొని దారుణంగా కొట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో జరిగింది.
అరవింద్ కుమార్, ప్రీతి దేవి కొన్నాళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అరవింద్ తన తల్లిదండ్రులు భూప్ ప్రకాష్, రాణి దేవితో కలిసి గాంధీ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివిసిస్తున్నారు. అరవింద్ నిరుద్యోగి కావడంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. గతంలో ప్రీతి తన అత్త రాణి దేవిపై దాడి చేసిందని ఆరోపణలు వచ్చాయి.
అయితే ఈసారి రాణి కోడలపై దాడి చేసింది. ఆమెను తలను నేలకేసి కొట్టడం, కాలితో తన్నడం, గోడకేసి నెట్టడం వీడియోలో కనిపిస్తోంది. కోడలు ఏడుస్తూ అత్తను ఆపడం కూడా చూడవచ్చు. ఇక విచిత్రం ఏంటంటే ఈ తంతంగాన్ని మొత్తం మహిళా కొడుకే వీడియో తీయడం కొసమెరుపు. అంతేగాక దీనిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
కాగా వంట పేరుతో అత్త రోజు దూషించేదని, మగ పిల్లాడిని కనలేదనే కారణంతో వేధించేదని కోడలు ప్రీతి ఆరోపించింది. అయితే అత్త వర్షన్ ఇందుకు విరుద్దంగా ఉంది. తనకు ఒక్కడే కొడుకు కావడం, ఇతర సంతానం ఏం లేకపోవడంతో వారు నివసించే ఇంటిని తన పిల్లల పేరు మీద రాయాలని కోడలు బలవంతం చేస్తుందని రాణి ఆరోపిస్తుంది. ఇక దీనికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేని పోలీసులు చెబుతున్నారు. వైరల్ అయిన వీడియో ఆధారంగా సదరు మహిళలపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
#उत्तरप्रदेश : #अलीगढ़ में बहू के तीन बेटियां पैदा होने पर नाराज सास ने बहू से की मारपीट#Violence #fightvideos #viralvideo #UttarPradesh #DelhiRains #OperationVijay #Gadar2Trailer #Haryanaclerk35400 #KargilVijayDiwas #अध्यात्म_के_शिरोमणि pic.twitter.com/XDLtOPeNs6
— NCR Samachar (@ncrsamacharlive) July 26, 2023
Comments
Please login to add a commentAdd a comment