woman fights
-
పిచ్చిపిచ్చిగా కొట్టుకున్న అత్తా కోడళ్లు .. వీడియో తీసిన కొడుకు
అత్తా కోడళ్ల గొడవలనేవి తెగని పంచాయితీ.. ప్రతి ఇంట్లోనూ అత్తా కోడళ్ల మధ్య గొడవలు సర్వ సాధారణం. కొన్నిసార్లు ఈ గొడవలు పెద్దవై భార్యభర్తలు విడిపోవడం, లేదా వేరే కాపురం పెట్టే వరకు పోయిన సందర్భాలూ చాలానే ఉన్నాయి. అయితే అత్తా కోడళ్ల గొడవలోకి మగాళ్లు వెళ్లే సాహసం చేయరని అందరికీ తెలిసిందే. ఒకవేళ వెళ్లినా.. లేదా అటు తల్లికి, భార్యకు మధ్య సర్దిచెప్పలేక, వాళ్ల సమస్యలు పరిష్కరించలేక తలలు పట్టుకోవాల్సిందే. తాజాగా ఇద్దరు అత్తా కోడళ్లు గొడవపడిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే ఇది అట్టాంటి ఇట్టాంటి పంచాయితీ కాదు. అత్తా కోడళ్లు ఇద్దరూ ఒకరిపై ఒకరు భయంకరంగా దాడి చేసుకునే వరకు పోయింది. వంటింట్లో కూర్చొని ఒకరు జుట్టు ఒకరు పట్టుకొని దారుణంగా కొట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో జరిగింది. అరవింద్ కుమార్, ప్రీతి దేవి కొన్నాళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అరవింద్ తన తల్లిదండ్రులు భూప్ ప్రకాష్, రాణి దేవితో కలిసి గాంధీ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివిసిస్తున్నారు. అరవింద్ నిరుద్యోగి కావడంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. గతంలో ప్రీతి తన అత్త రాణి దేవిపై దాడి చేసిందని ఆరోపణలు వచ్చాయి. అయితే ఈసారి రాణి కోడలపై దాడి చేసింది. ఆమెను తలను నేలకేసి కొట్టడం, కాలితో తన్నడం, గోడకేసి నెట్టడం వీడియోలో కనిపిస్తోంది. కోడలు ఏడుస్తూ అత్తను ఆపడం కూడా చూడవచ్చు. ఇక విచిత్రం ఏంటంటే ఈ తంతంగాన్ని మొత్తం మహిళా కొడుకే వీడియో తీయడం కొసమెరుపు. అంతేగాక దీనిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కాగా వంట పేరుతో అత్త రోజు దూషించేదని, మగ పిల్లాడిని కనలేదనే కారణంతో వేధించేదని కోడలు ప్రీతి ఆరోపించింది. అయితే అత్త వర్షన్ ఇందుకు విరుద్దంగా ఉంది. తనకు ఒక్కడే కొడుకు కావడం, ఇతర సంతానం ఏం లేకపోవడంతో వారు నివసించే ఇంటిని తన పిల్లల పేరు మీద రాయాలని కోడలు బలవంతం చేస్తుందని రాణి ఆరోపిస్తుంది. ఇక దీనికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేని పోలీసులు చెబుతున్నారు. వైరల్ అయిన వీడియో ఆధారంగా సదరు మహిళలపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. #उत्तरप्रदेश : #अलीगढ़ में बहू के तीन बेटियां पैदा होने पर नाराज सास ने बहू से की मारपीट#Violence #fightvideos #viralvideo #UttarPradesh #DelhiRains #OperationVijay #Gadar2Trailer #Haryanaclerk35400 #KargilVijayDiwas #अध्यात्म_के_शिरोमणि pic.twitter.com/XDLtOPeNs6 — NCR Samachar (@ncrsamacharlive) July 26, 2023 -
షాకింగ్ వీడియో.. మెట్రో రైలులో మహిళపై పిడిగుద్దులు!
హాంకాంగ్: ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైలులో ఓ వ్యక్తి మహిళపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. ఇరువురి మధ్య ఫైటింగ్ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ సంఘటన హాంకాంగ్‌లోని ఎంటీఆర్ ట్రైన్లో జరిగింది. 13 సెకన్ల నిడివిగల ఈ వీడియోలో బ్లాక్ డ్రెస్‌లో ఉన్న మహిళపై ఓ వ్యక్తి పిడిగుద్దులు కురిపిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మరో వ్యక్తి వారిని విడిపించేందుకు కలుగజేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆ మహిళ తిరిగి దాడి చేసేందుకు యత్నించింది. రద్దీగా ఉన్న ట్రైన్లో ఒక్కసారిగా గొడవ జరిగి గందరగోళ పరిస్థితులు తలెత్తడంపై పలువురు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ఇరువురు హోరాహోరీగా గొడవపడడం వల్ల పలువురు ప్రయాణికులు కిందపడిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ వీడియోను ‘టుడే రీవ్యూ67’ అనే ఫేస్బుక్ పేజీలో డిసెంబర్ 18న పోస్ట్ చేశారు. ఇప్పటికే ఈ వీడియోను 2లక్షల మందికిపైగా వీక్షించారు. అయితే, ఈ గొడవకు గల కారణాలు తెలియరాలేదు. ఇదీ చదవండి: కోవిడ్ కొత్త వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన! -
ఇదెక్కడి గొడవరా బాబూ.. సీటు కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలు
ముంబై: మహిళల మధ్య జరిగే గొడవలు చాలా విచిత్రంగా ఉంటాయి. చిన్న చిన్న విషయాలను పెద్దగా చేసుకుని చూస్తుంటారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంటారు. అచ్చం ఇలాగే ఓ చిన్న విషయంపై కొందరు మహిళలు గొడవ పడ్డారు. ముంబై లోక్‌ల్ ట్రైన్లో మహిళా ప్రయాణికులు కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబైలోని థానే నుంచి పన్వేల్ వెళ్తున్న లోకల్ రైలు మహిళల కంపార్ట్మెంట్లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే పోలీస్ అధికారి శంభాజీ కటారే తెలిపిన వివరాల ప్రకారం.. తుర్భే స్టేషన్ వద్ద రైలు ఆగడంతో కొందరు మహిళలు ట్రైన్ ఎక్కారు. ట్రైన్లో ఒక్క సీటు మాత్రమే ఖాళీగా ఉండటంతో ఓ మహిళ అందులో కూర్చొని మరో మహిళకు కూడా సీట్ ఇచ్చేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో మూడో మహిళ వచ్చి ఆ సీటులో కూర్చుంది. దీంతో ఒక్క సీటు కోసం ముగ్గురు మహిళా ప్రయాణికుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. పెద్దపెద్దగా అరుస్తూ ఒకరిపైఒకరు చేయిచేసుకున్నారు. చదవండి: వామ్మో.. ఈ వాచ్ విలువ ఇన్ని కోట్లా? పోలీసులకు చిక్కడంతో..! అందరూ చూస్తుండగానే జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. మహిళలు గొడవ పడుతుండటంతో అక్కడున్న మిగతా ప్రయాణికులు దూరంగా వెళ్లియారు దీంతో కొద్దిసేపు ట్రైన్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ కొట్లాటలో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. వీరిని ఆపేందుకు ప్రయత్నించిన మహిళ అధికారికి సైతం గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై వాషి గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ) పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. Fight between two female passengers over a seat in Mumbai Local Train. #MumbaiLocal #Fight #ViralVideo #Mumbai pic.twitter.com/A7GiedIUvJ — AH Siddiqui (@anwar0262) October 6, 2022 -
ఇద్దరు మహిళల ఘర్షణ; వీడియో వైరల్
లక్నో : మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో బుధవరం ఘర్షణ చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలు పరస్పరం కొట్టుకున్నారు. వీరిలో ఒకరు లాయర్ కాగా మరోకరు స్థానిక మహిళగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరి ఘర్షణ మధ్యలో మరో వ్యక్తి(లాయర్) కల్పించుకొని ఇద్దరు మహిళలను చితకబాదాడు. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గొడవలకు కారణం ఏంటనే దానిపై క్లారిటీ రాలేదు. అయితే పాత కక్షల కారణంగానే ఈ ఘర్షణ జరగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. -
పట్టపగలు.. తల్లి చూస్తుండగానే..!
పట్టపగలు తల్లి కళ్లెదుటే ఆమె కూతుర్ని కిడ్నాప్ చేయడానికి ఓ వ్యక్తి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఆమె చూస్తుండగానే మైనర్ బాలికనుఈడ్చుకెళ్తున్నాడు. అక్కడే ఉన్న తల్లి చాలా కష్టపడి కూతుర్ని రక్షించుకుని ఊపిరి పీల్చుకుంది. పోలీసులు త్వరగానే స్పందించి సీసీటీవీ ఫుటేజీ సహాయంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఓ తల్లి, కూతురు కిరాణా సామాన్లు కొనేందుకు ఫ్లోరిడాలోని హెర్నాడోలో షాపింగ్ మాల్ కు వెళ్లారు. ఇంతలో అక్కడికి క్రేయిగ్ బొనెల్లో అనే కిడ్నాపర్ వచ్చాడు. షాపింగ్ చేయడానికి వచ్చినట్లుగా కాసేపు నటించాడు. చుట్టుపక్కల అటూఇటూ చూసి ఓ బాలికను కిడ్నాప్ చేయడానికి డిసైడ్ అయ్యాడు. ఆ వెంటనే బాలికను ఈడ్చుకెళ్లడం మొదలుపెట్టాడు. అక్కడే ఉన్న బాలిక తల్లి కూతురి అరుపులతో అప్రమత్తమైంది. మొదట షాక్ తిన్నా, వెంటనే తేరుకుని కూతుర్ని రక్షించుకుంది. చిన్నారిని కిడ్నాపర్ ఈడ్చుకెళ్తుంటే కూతురిని గట్టిగా పట్టుకుని అతడి ప్రయత్నాన్ని అడ్డుకుంది. ఆమె గట్టిగా అరవడంతో క్రెయిగ్ అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు బుధవారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను కిడ్నాప్ చేసేందుకు నిందితుడు ప్రయత్నించిన వీడియోను సిట్రస్ కౌంటీ షెరిఫ్ ఆఫీస్ అధికారిక ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ఇక అంతే ఆ వీడియోకు భారీ స్పందన వస్తోంది. ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్న ఈ వీడియో కేవలం 30 గంటల వ్యవధిలోనే 2.37 లక్షల మంది వీడియోను వీక్షించగా, లక్షల మంది వీడియోను షేర్ చేశారు. గత పదేళ్లలో ఇలాంటి తరహా కిడ్నాప్ ప్రయత్నం తాను చూడలేదని, అతడు ఉద్దేశపూర్వకంగానే స్టోర్ లో అందరూ చూస్తుండగానే చిన్నారిని ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించాడని ఫేస్ బుక్ యూజర్ క్రెయిగ్ కల్లాహన్ అభిప్రాయపడ్డాడు. తల్లి కళ్లెదుట, పట్టపగలు అందరూ చూస్తుండగానే ఈ దుర్మార్గానికి ఒడిగట్టిన విషయంపై వీడియో చూసిన తర్వాత తాను నిజంగానే భయపడ్డానని మరో యూజర్ మారీ బ్రూక్స్ కామెంట్ చేసింది. -
మొసలితో పోరాడి...కుమార్తెను రక్షించుకుంది
వడోదరా: ఓ మహిళ ధైర్య సాహసాలు ప్రదర్శించి మొసలి బారిన పడిన కుమార్తెను రక్షించిన సంఘటన గుజరాత్లో శుక్రవారం చోటు చేసుకుంది. వడోదరాలోని పడ్రా పట్టణ సమీపంలోని తికారియంబరక్ గ్రామ సమీపంలోని విశ్వామిత్ర నది ప్రవహిస్తుంది. ఆ నదిలో బట్టలు ఉతుకునేందుకు కంతా వాంకర్ (19) ఎప్పటిలాగే శుక్రవారం కూడా నది వద్దకు చేరుకుని... బట్టలు ఉతకడం ప్రారంభించింది. అంతలో నదిలోని మొసలి ఆమె కాలును నోట కరచి అమాంతంగా నదిలోకి లాగింది. దీంతో అక్కడే ఉన్న ఆమె తల్లి దీపాలి వెంటనే స్పందించి.... బట్టలు ఉతికే బ్యాట్ (క్రికెట్ బ్యాట్ ఆకారంలో ఉంటుంది) తో మొసలి తలపై దాదాపు 10 నిమిషాలు ఏకధాటిగా బలంగా కొట్టింది. దాంతో మొసలి కుమార్తె కాంత వాంకర్ కాలు వదిలి నదిలోకి జారుకుంది. దీపాలి వెంటనే కుమార్తెను ఆసుపత్రికి తరలించింది. వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. విశ్వామిత్ర నదిలో దాదాపు 260 మొసళ్లు ఉన్నట్లు ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన గణాంకాల ద్వారా తెలిందని అటవీ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. నదిలో పరివాహాక ప్రాంతంలో బట్టలు ఉతకవద్దని గ్రామస్తులకు అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.