Viral Video: Fight Between Two Women In Mumbai Local Train, Woman Cop Injured - Sakshi
Sakshi News home page

Viral Video: ఇదెక్కడి గొడవరా బాబూ.. సీటు కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలు

Published Fri, Oct 7 2022 11:29 AM | Last Updated on Fri, Oct 7 2022 12:23 PM

Viral Video: Fight Between Women On Mumbai Local, Woman Cop Injured - Sakshi

ముంబై: మహిళల మధ్య జరిగే గొడవలు చాలా విచిత్రంగా ఉంటాయి. చిన్న చిన్న విషయాలను పెద్దగా చేసుకుని చూస్తుంటారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంటారు. అచ్చం ఇలాగే ఓ చిన్న విషయంపై కొందరు మహిళలు గొడవ పడ్డారు. ముంబై లోక్‌ల్‌ ట్రైన్‌లో మహిళా ప్రయాణికులు కొట్టుకున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబైలోని థానే నుంచి పన్వేల్‌ వెళ్తున్న లోకల్‌ రైలు మహిళల కంపార్ట్‌మెంట్‌లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. 

రైల్వే పోలీస్ అధికారి శంభాజీ కటారే తెలిపిన వివరాల ప్రకారం..  తుర్భే స్టేషన్ వద్ద రైలు ఆగడంతో కొందరు మహిళలు ట్రైన్‌ ఎక్కారు. ట్రైన్‌లో ఒక్క సీటు మాత్రమే ఖాళీగా ఉండటంతో ఓ మహిళ అందులో కూర్చొని మరో మహిళకు కూడా సీట్‌ ఇచ్చేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో మూడో  మహిళ వచ్చి ఆ సీటులో కూర్చుంది. దీంతో ఒక్క సీటు కోసం ముగ్గురు మహిళా ప్రయాణికుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. పెద్దపెద్దగా అరుస్తూ ఒకరిపైఒకరు చేయిచేసుకున్నారు.
చదవండి: వామ్మో.. ఈ వాచ్‌ విలువ ఇన్ని కోట్లా? పోలీసులకు చిక్కడంతో..! 

అందరూ చూస్తుండగానే జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. మహిళలు గొడవ పడుతుండటంతో అక్కడున్న మిగతా ప్రయాణికులు దూరంగా వెళ్లియారు  దీంతో కొద్దిసేపు ట్రైన్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ కొట్లాటలో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. వీరిని ఆపేందుకు ప్రయత్నించిన మహిళ అధికారికి సైతం గాయాలయ్యాయి.  ఈ ఘటనలో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై వాషి గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్‌పీ) పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement