దళిత కుటుంబంతో కలిసి భోజనం చేసిన రాహుల్‌ | Video: Rahul Gandhi enjoy meal with Dalit couple Maharashtra Kolhapur | Sakshi
Sakshi News home page

దళిత కుటుంబంతో కలిసి భోజనం చేసిన రాహుల్‌

Published Mon, Oct 7 2024 4:41 PM | Last Updated on Mon, Oct 7 2024 5:13 PM

Video: Rahul Gandhi enjoy meal with Dalit couple Maharashtra Kolhapur

కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ మహారాష్ట్రంలో ఓ దళిత కుటుంబాన్ని సందర్శించారు. కొల్హాపూర్‌లోని అజయ్‌ తుకారాం సనాదే, అంజనా తుకారాం సనాదే ఇంట్లో వారితో కలిసి వంట చేయడమే కాకుండా భోజనం కూడా చేశారు.

వారి ఇంట్లో భోజనం చేయాల్సిందిగా.. రాహుల్‌ గాంధీని ఆ జంట ఆహ్వానించారు. దీంతో కాంగ్రెస్‌ ఎంపీ సోమవారం వారి వద్దకు వెళ్లారు.  వారితో పాటు వంటగదిలో వివిధ వంటకాలు వండటం నేర్చుకున్నారు. దళితుల సంప్రదాయాల్లోని వివిధ వంటకాలను రాహుల్ గాంధీ రుచిచూశారు. దళితుల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. దళితుల సంస్కృతి, ఆచార సంప్రదాయాలు కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉందని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా సూచించారు.

 కాగా  షాహు పటోలే సనాదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన దలిత్ కిచెన్ ఆఫ్ మరాఠ్వాడా అనే పుస్తకాన్ని కూడా రాశారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్‌ తన ఎక్స్‌లో షేర్‌ చేశారు.‘ఈనాటికీ దళితుల వంటశాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. షాహూ పటోలే జీ చెప్పినట్లు, దళితులు ఏమి తింటారో ఎవరికీ తెలియదు. వాళ్లు ఏం తింటారు, ఎలా వండుతారు, దాని సామాజిక, రాజకీయ ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలంతో అజయ్ తుకారాం సనదే, అంజనా తుకారాం సనదేతో మధ్యాహ్నం గడిపాను.

తను నన్ను మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లోని తన ఇంటికి చాలా గౌరవంగా ఆహ్వానించాడు. వంటగదిలో అతనికి సహాయం చేయడానికి నాకు అవకాశం ఇచ్చాడు. పటోలే ఇంట్లో హర్భర్యాచి భాజీ, పాలకూర, వంకాయలతో తుపర్ పప్పు తయారు చేశాం. దళితలుకు రాజ్యాంగ అనేక హక్కులను కల్పించింది. అయితే ప్రతి భారతీయుడు సోదర భావాన్ని కలిగి ఉన్నప్పుడే సమానత్వం సాధ్యమవుతుంది’ అని పేర్కొన్నాడు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement