Dalit family
-
దళిత కుటుంబంతో కలిసి భోజనం చేసిన రాహుల్
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ మహారాష్ట్రంలో ఓ దళిత కుటుంబాన్ని సందర్శించారు. కొల్హాపూర్‌లోని అజయ్ తుకారాం సనాదే, అంజనా తుకారాం సనాదే ఇంట్లో వారితో కలిసి వంట చేయడమే కాకుండా భోజనం కూడా చేశారు.వారి ఇంట్లో భోజనం చేయాల్సిందిగా.. రాహుల్ గాంధీని ఆ జంట ఆహ్వానించారు. దీంతో కాంగ్రెస్ ఎంపీ సోమవారం వారి వద్దకు వెళ్లారు. వారితో పాటు వంటగదిలో వివిధ వంటకాలు వండటం నేర్చుకున్నారు. దళితుల సంప్రదాయాల్లోని వివిధ వంటకాలను రాహుల్ గాంధీ రుచిచూశారు. దళితుల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. దళితుల సంస్కృతి, ఆచార సంప్రదాయాలు కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉందని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా సూచించారు.दलित किचन के बारे में आज भी बहुत कम लोग जानते हैं। जैसा शाहू पटोले जी ने कहा, “दलित क्या खाते हैं, कोई नहीं जानता।”वो क्या खाते हैं, कैसे पकाते हैं, और इसका सामाजिक और राजनीतिक महत्व क्या है, इस जिज्ञासा के साथ, मैंने अजय तुकाराम सनदे जी और अंजना तुकाराम सनदे जी के साथ एक दोपहर… pic.twitter.com/yPjXUQt9te— Rahul Gandhi (@RahulGandhi) October 7, 2024 కాగా షాహు పటోలే సనాదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన దలిత్ కిచెన్ ఆఫ్ మరాఠ్వాడా అనే పుస్తకాన్ని కూడా రాశారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్ తన ఎక్స్‌లో షేర్ చేశారు.‘ఈనాటికీ దళితుల వంటశాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. షాహూ పటోలే జీ చెప్పినట్లు, దళితులు ఏమి తింటారో ఎవరికీ తెలియదు. వాళ్లు ఏం తింటారు, ఎలా వండుతారు, దాని సామాజిక, రాజకీయ ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలంతో అజయ్ తుకారాం సనదే, అంజనా తుకారాం సనదేతో మధ్యాహ్నం గడిపాను.తను నన్ను మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లోని తన ఇంటికి చాలా గౌరవంగా ఆహ్వానించాడు. వంటగదిలో అతనికి సహాయం చేయడానికి నాకు అవకాశం ఇచ్చాడు. పటోలే ఇంట్లో హర్భర్యాచి భాజీ, పాలకూర, వంకాయలతో తుపర్ పప్పు తయారు చేశాం. దళితలుకు రాజ్యాంగ అనేక హక్కులను కల్పించింది. అయితే ప్రతి భారతీయుడు సోదర భావాన్ని కలిగి ఉన్నప్పుడే సమానత్వం సాధ్యమవుతుంది’ అని పేర్కొన్నాడు. -
ఘోరం.. దళిత కుటుంబంపై కాల్పులు
దామోహ్: తన భార్య వైపు చూస్తున్నాడనే ఆగ్రహంతో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఓ దళితుడు, అతడి తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోగా అతడి ఇద్దరు సోదరులు గాయపడ్డారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం దామోహ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. దేవ్‌రన్ గ్రామానికి చెందిన దళిత వ్యక్తి(32) తరచూ తన భార్య వైపు చూస్తున్నాడంటూ అదే గ్రామానికి చెందిన జగ్దీశ్ పటేల్ ఆగ్రహంతో ఉన్నాడు. ఇదే కారణంతో మంగళవారం ఉదయం గ్రామానికే చెందిన మరికొందరితో కలిసి తుపాకీతో కాల్పులు జరిపాడు. కాల్పుల్లో సదరు దళితుడు, అతని తల్లిదండ్రులు(60, 52) చనిపోగా సోదరులు (30, 28) గాయపడ్డారు. క్షతగాత్రులిద్దరూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పోలీసులు జగదీశ్ పటేల్‌ను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఐదుగురు నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు ఎస్పీ డీఆర్ తేనివార్ చెప్పారు. నిందితులపై అట్రాసిటీ కేసు సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. చదవండి: టీఎంసీ యువనేతపై కాల్పులు.. బైక్‌పై వచ్చి క్షణాల్లో.. -
అలుపెరగని అగ్గిబరాటా
వెనుకబడిన దళిత కుటుంబం. కటిక పేదరికం. తోబుట్టువుల్లో ఐదో నంబర్ తనది. సౌకర్యవంతమైన ఇల్లులేదు, కడుపునిండా తినేందుకు లేదు. ఇంతటి దుర్భర పరిస్థితులనూ ఎదుర్కొని నేడు వేలమంది విద్యార్థులకు పాఠాలు చెబుతూ రెండు సార్లు బెస్ట్ టీచర్ అవార్డును అందుకోవడమేగాక, దళిత మహిళల సమస్యలపై పోరాటాలు చేస్తోంది. మరోపక్క తన రచనలతో దళిత మహిళలను జాగృతపరుస్తున్నారు అనితా భారతి. కృషితో నాస్తి దుర్భిక్షం అనే సూక్తికి ఉదాహరణగానూ, పేదరికంలోనూ నిజాయితీగా కష్టపడితే పైకి ఎదగవచ్చని నేటి యువతరానికి ప్రేరణగా నిలుస్తున్నారు అనిత. అది 1965.. ఢిల్లీలోని సీలమ్‌పూర్‌లో నిరుపేద దళిత కుటుంబంలో పుట్టింది అనితా భారతి. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి. అనితకేమో బాగా చదువుకోవాలని కోరిక. తామెలాగూ చదువుకోలేదు. కనీసం పిల్లలనైనా చదివించాలన్న ఆశతో తల్లిదండ్రులు పిల్లల్ని బాగా చదువుకోమని ప్రోత్సహించేవారు. స్కూలుకు వెళ్లడానికి యూనిఫాం గానీ చెప్పులు గానీ లేవు సరికదా... రాసుకునేందుకు పుస్తకాలు కూడా ఉండేవికావు. అయినా అలాగే స్కూలుకు వెళ్లి తనకున్న ఒక నోట్ బుక్లోనే పెన్సిల్‌తో పాఠాలు రాసుకుని అది పూర్తయిన తరువాత ఎరేజర్‌తో తుడిపేసి మళ్లీ కొత్త పాఠాలను రాసుకునేది. పాతబట్టలతో బ్యాగ్ కుట్టుకుని ఎంతో మప్పితంగా స్కూలుకు వెళ్లేది. క్రమం తప్పకుండా స్కూలుకు వెళ్తూనే .. స్కూలు అయ్యాక ఇంటికొచ్చి ఎన్వలప్‌ల తయారీలో తల్లికి సాయపడేది. పనిపూర్తయ్యాక కొవ్వొత్తి వెలుతురులో చదివి తరగతిలో తొలి రెండు స్థానాల్లో నిలిచేది. అయితే అనితా వీటన్నింటిని శ్రమపడి అధిగమించినప్పటికీ, చిన్నప్పటి నుంచి తోటి విద్యార్థుల చేసే కుల దూషణలు తనని తీవ్రంగా బాధించేవి. తొమ్మిదో తరగతికి వచ్చేసరికి కులవివక్ష ఎక్కువ అయ్యింది. ఆ సమయంలో సమాజం, జీవితం పట్ల అవగాహన ఏర్పడిన అనిత అలాంటి వాటిని పట్టించుకోకుండా చదువు మీద దృష్టి పెట్టి, పన్నెండో తరగతి పూర్తిచేసింది. అప్పులు... పోరాటాలు ఇంటరీ్మడియట్ తరువాత అప్పులు చేసి కాలేజీ చదువులు పూర్తిచేసింది. తొలుత బీఏ హిందీ హానర్స్‌లో చేరింది. తరువాత బిఈడీ చేసింది. అయితే కుల వివక్షని అధిగమించడానికి కాలేజీ యూనియన్లలో చురుకుగా పాల్గొనేది. ఇందులో భాగంగా దళిత విద్యార్థులందరితో కలిసి ‘ముక్తి’ సంస్థను స్థాపించి దళిత విద్యార్థుల హక్కులను కాపాడడానికి ప్రయతి్నంచేది. అంతేగాక ఒక స్కూలును ఏర్పాటు చేసి మురికివాడల్లోని దాదాపు వందమంది పిల్లలకు పాఠాలు చెప్పేది. మరోపక్క ఢిల్లీ యూనివర్శిటీలో ఎం.ఏ హిందీ పూర్తి చేసింది. 1992లో గవర్నమెంట్ స్కూల్లో హిందీ పండిట్ ఉద్యోగం వచ్చింది. దీంతో టీచర్‌గా పనిచేస్తూనే సామాజిక కార్యక్రమాలు చేపట్టేది. అనిత మెరుగైన పనితీరుకు గుర్తింపుగా రాధా కృష్ణన్ బెస్ట్ టీచర్ అవార్డు, ఇందిరా గాంధీ అవార్డు, ఢిల్లీ స్టేట్ టీచర్ అవార్డు, సావిత్రబాయి ఫూలే అవార్డు ఆమెను వరించాయి. భర్తతో కలిసి... ఉద్యోగం వచి్చన ఏడాదిలో కులాంతర వివాహం చేసుకుంది. భర్త ప్రోత్సాహంతో ‘కదమ్’ దళిత సెంటర్‌ను ప్రారంభించారు. దీని ద్వారా దళిత మహిళల సమస్యలను పరిష్కారానికి కృషిచేస్తున్నారు. అంతేగాక దళిత్ రైటర్స్ అసోసియేషన్‌కు ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తూ దళితులను చైతన్యవంతుల్ని చేస్తున్నారు. అంతేగాక దళిత మహిళల సమస్యలపై పోరాడే థియేటర్ గ్రూపు ‘అలటిపు’లో కూడా భాగస్వామిగా మారి, ఈ గ్రూపులోని మహిళలు తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించేలా ప్రోత్సహిస్తున్నారు. దళిత మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయడమేగాక వారి హక్కులపై అవగాహన కలి్పంచేందుకు 2003లో దళిత్ ఉమెన్ పేరిట రచనలు చేయడం ప్రారభించింది. 2012లో హిందీలో ‘కాంటెంపరరీ ఫెమినిస్ట్ అండ్ దళిత్ ఉమెన్స్ రెసిస్టెన్స్’ బుక్‌ను విడుదల చేసింది. ఈ పుస్తకం బీబీసీ టాప్–10 పుస్తకాలలో ఒకటిగా నిలవడం విశేషం. ఎక్కువమంది బుక్‌ను ఇష్టపడడంతో మరింత ఉత్సాహంతో పుస్తకాలు రాయడం, దళిత మహిళలు, బాలికలు, అమ్మాయిలపై జరిగిన దాడులకు న్యాయం చేయాలని ఇప్పటికీ పోరాడుతున్నారు. ప్రస్తుతం రూప్‌నగర్ నంబర్ వన్ స్కూల్‌కు వైస్ ప్రిన్స్‌పాల్‌గా పనిచేస్తూ నిరుపేద పిల్లల అభ్యున్నతికి కృషిచేస్తున్నారు. -
భయంతో బతకలేం.. ఊరొదిలి పోతాం!
హాథ్రస్: దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన, హాథ్రస్ దళిత యువతిపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో బాధితురాలి కుటుంబ సభ్యులు, ఇప్పుడు ఊరు విడిచి వెళ్ళే దయనీయమైన పరిస్థితి ఏర్పడింది. తమ బిడ్డకి ఈ దారుణం జరిగిన తరువాత తాము భయంగుప్పిట్లో బతుకుతున్నామని, ఊరు విడిచి వెళ్ళిపోవడం తప్ప మరో గత్యంతరం లేదని బాధితురాలి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటన తరువాత తమ కుటుంబానికి సాయం చేసేందుకు గ్రామంలోని ఏ ఒక్కరూ ముందుకు రాలేదని బాధితురాలి తండ్రి, సోదరుడు మీడియా ముందు వాపోయారు. తమ కుటుంబాన్ని గ్రామస్తులు పదే పదే నిందిస్తోన్నారని, అందుకే భోల్గరీ గ్రామాన్ని వీడి వెళ్ళిపోనున్నట్టు వారు వెల్లడించారు. ఈ ఘటన తరువాత గత కొద్ది రోజులుగా తాము భయంతో బతుకుతున్నామని, ఇక ఇక్కడ బతికేందుకు అవకాశమేలేదని, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి, ఎవరైనా తమ బంధువుల ఇంట్లో తలదాచుకోవాలని భావిస్తున్నట్టు బాధితురాలి తండ్రి తెలిపారు. పరిస్థితులు భయంకరంగా ఉన్నాయని అందుకే గ్రామం వీడిపోవాలనుకుంటున్నట్టు బాధితురాలి కుటుంబసభ్యులు చెప్పారు. గ్రామంలోని ఎవ్వరూ తమ కుటుంబాన్ని పట్టించుకోలేదని ఆమె సోదరుడు ఆవేదన వ్యక్తం చేశారు. -
దళిత కుటుంబానికి భూమిపూజ తొలి ప్రసాదం
అయోధ్య: అయోధ్యలో రామ మందిర భూమి పూజకు సంబంధించిన ప్రసాదాన్ని తొలిగా ఒక దళిత కుటుంబం అందుకుంది. లడ్డూలు, రామచరిత మానస్ పుస్తకం, తులసిమాల ఉన్న ప్రసాదాన్ని యూపీ సీఎం ఆదేశాల మేరకు అయోధ్యలోని మేస్త్రీ వృత్తిలో ఉన్న మహావీర్ కుటుంబానికి అధికారులు పంపించారు. మహావీర్ అయోధ్యలోని సుతాటి ప్రాంతంలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. 2019 ఎన్నికల సందర్భంగా మహావీర్ ఇంట్లో ఆదిత్యనాథ్ భోజనం చేశారు. ‘అలి– బజరంగ బలి’ వ్యాఖ్యల కారణంగా అంతకుముందే సీఎం యోగిని మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ‘నన్ను గుర్తుంచుకుని ప్రసాదం పంపినందుకు ఆయనకు కృతజ్ఞతలు’ అని మహావీర్ పేర్కొన్నారు. -
టీడీపీకి ఓటేయలేదని ఐదేళ్లుగా బహిష్కరణ..!
సాక్షి, అమలాపురం : తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో టీడీపీ నేతలు అధికార మదంతో రెచ్చిపోయారు. రాజ్యాంగ నిర్మాత అబేంద్కర్ ఆశయాలకు నిలువునా తూట్లు పొడిచారు. తమకు నచ్చిన వారికి ఓటు వేసే స్వేచ్ఛను హరించారు. గత (ఏపీ అసెంబ్లీ-2014) ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని ఓ దళిత కుటుంబంపై పచ్చనేతలు కన్నెర్రజేశారు. అగ్రకుల దరహంకారంతో ఆ కుటుంబాన్ని గత ఐదేళ్లుగా సామాజికంగా బహిష్కరించారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఆ కుంటుంబాన్ని వేధింపులకు గురిచేశారు. ఓటు వేయొద్దని హెచ్చరించారు. ఒకవేళ ఓటు వేసినా టీడీపీకి కాకుండా ఇతర పార్టీలకు వేస్తే అంతు చూస్తామని బెదిరింపులకు దిగారు. అయితే, పోలీసుల సహకారంతో ఆ కుటుంబం ఓటు హక్కును వినియోగించుకోవడంతో వేధింపులు ఎక్కువయ్యాయి. ఊరొదిలి వెళ్లిపోవాలని టీడీపీ నేతలు ఒత్తిడి చేస్తుడంటంతో దిక్కుతోచని ఆ కుటుంబం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీని మంగళవారం కలిసింది. తమకు న్యాయం చేయాలని వారు సీఈఓకు విన్నవించుకున్నారు. ఇక స్థానిక అధికారులు టీడీపీ నేతల ఆగడాలకు సాక్షులుగా మాత్రమే మిగిలారు. -
వైఎస్సార్సీపీకి ఓటేశారని ఐదేళ్లుగా బహిష్కరణ
-
టీడీపీ మాజీ సర్పంచ్ దౌర్జన్యం
రామవరప్పాడు : టీడీపీకి చెందిన ఎనికేపాడు మాజీ సర్పంచ్ వరికూటి కోటేశ్వరరావు తన అనుచరులతో ఓ దళిత కుటుంబంపై దౌర్జన్యానికి దిగాడు. వర్షం కురుస్తున్నా కనికరించకుండా, చిన్న పిల్లలని కూడా చూడకుండా ఇంటి నుంచి బయటికి పంపి తాళం వేశాడు. చంకలో చంటి బిడ్డతో బాధిత కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురయింది. చేసేదిలేక వారు పటమట పోలీసులను ఆశ్రయించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... ఎనికేపాడు దళితవాడలో జి. నాగరాజు, అంజలి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి, వీరి కుటుంబ సభ్యుల మధ్య ఎప్పటి నుంచో ఆస్తి తగాదాలు ఉన్నాయి. నాగరాజు దంపతులు ఉమ్మడి ఆస్తి తాలుకా డబ్బు చెల్లించే విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంపై ఆదివారం ఉదయం మాజీ సర్పంచ్ వరికూటి కోటేశ్వరరావు తన అనుచరులతో నాగరాజు ఇంట్లోకి ప్రవేశించి దంపతులతో పాటు వారి పిల్లలను బలవంతంగా బయటకు గెంటేశారు. ఇంటికి తాళాలు వేసి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి.. డబ్బులు చెల్లిస్తేనే తాళాలు తీసేది అంటూ హడావుడి చేశాడు. బాధితుడు చేసేదిలేక పటమట పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించాడు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో ఘటనా స్థలానికి కానిస్టేబుల్ చేరుకుని ఇరుపక్షాలతో మాట్లాడి ఇంటికి వేసి ఉన్న తాళాలను తీయించారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తా నాగరాజు మాట్లాడుతూ ఆస్తికి సంబంధించి వివాదాలు ఉంటే కోర్టులోనో, పెద్ద మనుషుల మధ్యనో తెల్చుకోవాలి గాని ఇలా ఇళ్లపై పడి చిన్నపిల్లలు ఉన్నారని కూడా చూడకుండా వర్షంలో బయటకు తోసేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపాడు. -
కులాంతర వివాహం చేసుకున్నాడని..
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఓ దళిత యువకుడు కులాంతర వివాహం చేసుకున్నందుకు అతని కుటుంబాన్ని గ్రామ పెద్దలు తీవ్రంగా అవమానించారు. బులంద్హహర్కు చెందిన ఓ దళితుడు యువకుడు ముస్లిం యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. గ్రామ కట్టుబాట్లకి వ్యతిరేకంగా కులాంతర వివాహం చేసుకున్నాడని, గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టి అతని తండ్రి చేత నేలపై ఉమ్మించి నోటితో నాకించారు. అంతటితో ఆగని గ్రామస్థులు అతని భార్యని, కుతుర్ని పంచాయతీలో నగ్నంగా నిలుచోపెట్టారు. తన కుమారుడు ముస్లిం యువతిని వివాహం చేసుకున్నందుకు తమను తీవ్రంగా అవమానించి గ్రామం నుంచి వెలివేశారని యువకుడి తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితులకు న్యాయం జరిగేలా ఈ ఘటనకు కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని స్థానిక ఎస్పీ డెహత్ తెలిపారు. కాగా, గత ఏడాది బులంద్హహర్కు చెందిన ఇద్దరు అక్కచెల్లెళ్లు గ్రామస్థుల చేతిలో పరువు హత్యకు గురైన విషయం తెలిసిందే. -
మనుగొండలో కుల బహిష్కరణ
ఆత్మకూరు(పరకాల): వీఆర్ఏ కొలువు విషయంలో నెలకొన్న వివాదం ఓ దళిత కుటుంబం కుల బహిష్కరణకు దారితీసింది. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం మనుగొండ గ్రామానికి చెందిన తుప్పరి సమ్మయ్య కొంత కాలంగా కుల పరంగా వీఆర్ఏగా విధులు నిర్వర్తి స్తున్నాడు. గతంలో ఏటా అదే కులంలోని ఒకరు ఈ విధులు నిర్వర్తించేవారు. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఎవరు ఆ విధుల్లో ఉంటే వారికే ఆ ఉద్యోగం వచ్చింది. దీంతో వీఆర్ఏ ఉద్యోగం విషయమై గొడవలు మొదలయ్యాయి. సమ్మయ్యతోపాటు అతడి భార్య యశోద, కూతురు పవిత్ర, కుమారుడు ఉదయ్‌శంకర్‌ను సదరు కులం పెద్దలు శనివారం బహిష్కరించారు. వారితో ఎవరైనా మాట్లాడితే రూ.500 జరిమానా విధిస్తామని తీర్మానించారు. ‘తమను హోటళ్లకు కూడా వెళ్లనీయడం లేదు.. కుల పెద్దలు తమను గతం నుంచి ఇబ్బందులకు గురి చేస్తున్నారు.. గతంలో తమ చేలను ధ్వంసం చేశారు.. పెళ్లిళ్లు.. చావులకు రానీయడం లేదు.. పొదుపు సంఘం నుంచి తొలగించారు..’అంటూ బాధిత కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. -
దళిత మహిళ కుటుంబాన్ని పరామర్శించిన విజయసాయి రెడ్డి
-
దళిత మహిళ కుటుంబానికి విజయసాయి రెడ్డి పరామర్శ
సాక్షి, విశాఖపట్టణం : టీడీపీ నేతల దాడికి గురైన దళిత మహిళను ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబానికి వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని చెప్పారు. ప్రజాసంకల్పయాత్ర ద్వారా వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్ర జెర్రిపోతులవారిపాలెం ద్వారా వెళ్లేలా చూస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి తనయుడు అప్పలనాయుడు దాడికి పాల్పడినట్లు బాధిత మహిళ చెప్పినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే, ఆయన కుమారుడు అప్పలనాయుడులను ఏ1, ఏ2లుగా చేరుస్తూ వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ముదపాకలోని ఎస్సీ భూములను కూడా కబ్జా చేసేందుకు ఎమ్మెల్యే బండారు యత్నించినట్లు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి ఓటేయడమే దళితులు చేసిన తప్పా? అని ప్రశ్నించారు. జెర్రిపోతులవారిపాలెం ఘటనలో దళిత మహిళలకు రూ.8 లక్షల పరిహారం ఇవ్వాల్సివుండగా.. ఒకరికి రూ. లక్ష, మరొకరికి రూ.25 మాత్రమే ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు. 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమికి సంబంధించి పట్టా ఇవ్వకుండా పొజిషన్ సర్టిఫికెట్‌ను మాత్రమే అందజేశారని తెలిపారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పారు. బాధిత కుటుంబానికి పార్టీ తరఫు రూ. లక్ష ఆర్థిక సాయాన్ని చేశారు. దళిత కుటుంబాన్ని పరామర్శించిన విజయసాయి రెడ్డి వెంట వైఎస్ఆర్ సీపీ నేతలు మేరుగ నాగార్జున, గుడివాడ అమర్నాథ్, మల్లా విజయప్రసాద్, సైనాల విజయ్‌కుమార్, వరుదు కల్యాణి తదితరులు ఉన్నారు. -
దళిత కుటుంబంపై దాడి
చిక్కమంగళూరు: గుజరాత్ లోని ఉనా, బిహార్ లో దళితులపై దాడి మరువకముందే కర్ణాటకలోని చిక్ మంగళూరులో ఆవుమాంసం వండారని ఓ దళిత కుటుంబంపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జులై 17 న 30 మంది రైట్ వింగ్ కార్యకర్తలు బీఫ్ వండారనే కారణంతో దళిత కుటుంబంపై దాడి చేశారు. ఎస్సీ,ఎస్టీ ఆక్ట్ చట్టం ప్రకారం ఏడుగురు నిందితులపై కేసును నమోదు చేసిన పోలీసులు కేసును విచారిస్తున్నారు. -
దళితుల ఇంట్లో అమిత్ షా లంచ్ ఎందుకు?
వారణాసి: ఉత్తరప్రదేశ్‌లో ఎట్టి పరిస్థితుల్లో పాగా వేయాలని బీజేపీ గట్టిగానే తలపిస్తోంది. ఎలాంటి హడావుడి లేకుండా మెల్లగా అన్ని వర్గాలను ఆకట్టుకునే పనిలో పడింది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో అధికారం దక్కించుకుంటే దేశంలోని ఇతర రాష్ట్రాల్లో తమ ప్రభావం బలంగా చూపించవచ్చన్న తలంపుతో ముందుకు వెళుతోంది. ఇందుకు అనుగుణంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహాలు రచిస్తునే ఉన్నారు. మంగళవారం ప్రధాని నరంద్రమోదీ నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించనున్న ఆయన మధ్యాహ్నం ఓ దళితుల ఇంట్లో భోజనం చేయనున్నారు. అలహా బాద్ నుంచి వారణాసి విమానాశ్రాయానికి వెళ్లే మార్గంలో సేవాపురి అనే గ్రామంలో గిరిజాప్రసాద్ బింద్, ఇక్బాల్ బింద్ అనే దళిత దంపతుల ఇంట్లో ఆయన లంచ్ చేయనున్నట్లు యూపీ బీజేపీ మీడియా ఇంఛార్జీ సంజయ్ భరద్వాజ్ చెప్పారు. దీంతో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేనట్లుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
చిన్నారి కన్నీరు
► కబ్జాదారులకు కొమ్ముకాస్తున్న నాయుడుపేట సీఐపై ► చర్యలు తీసుకోవాలని దళితకుటుంబం వేడుకోలు ► కష్టం గుర్తుకొచ్చి కంటతడి పెట్టిన చిన్నారి ► న్యాయం చేయాలని పోలీస్ అధికారులకు దళిత కుటుంబం వేడుకోలు నెల్లూరు (బృందావనం) : తమ స్థలాన్ని కాజేసిన వడ్డీ వ్యాపారికి కొమ్ముకాస్తు తమకు అన్యాయం చేస్తున్న నాయుడుపేట సీఐ రత్తయ్యపై చర్యలు తీసుకోవాలని నాయుడుపేట పొగగొట్టం కాలనీకి చెందిన దళిత కుటుంబం పోలీసు ఉన్నతాధికారులను కోరారు. కాలనీకి చెందిన పిగిలం లక్ష్మమ్మ, ఆమె కుమారుడు నాగార్జున, కోడలు ప్రతిమ స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో తమ గోడు వెళ్లబోసుకున్నారు. లక్ష్మమ్మ మాట్లాడుతూ తన భర్త తాగుడుకు బానిస కావడంతో అవకాశంగా తీసుకుని అతనికి స్థానిక వడ్డీ వ్యాపారి కొండూరు పొండురాజు తమకు తెలియకుండా రూ.15 వేల వరకు ఇచ్చారన్నారు. అప్పుకు తన భర్తతో కొన్ని కాగితాలపై సంతకాలు చేయించుకుని తనకు 2008లో ప్రభుత్వం ఇచ్చిన విలువైన ఇంటి స్థలాన్ని కాజేసేందుకు పాండు రాజు యత్నిస్తున్నాడని తెలిపారు. 2009లో ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించారన్నారు. ఈ విషయమై ఫిర్యాదు చేస్తే అప్పటి ఎస్ఐ తమకు న్యాయం చేయలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించగా కమిషన్ ఆదేశాల మేరకు గూడూరు డీఎస్పీ విచారణ జరిపి పాండురాజును తమ జోలికి వెళ్లదంటూ హెచ్చరించారన్నారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 22న కొందరు రౌడీలతో వచ్చి నా ఇంటి తాళం పగులగొట్టి సామాన్లు వీధిలో వేశారన్నారు. అడ్డుకున్న తనను, తన కోడలు ప్రతిమ, మనుమరాళ్లు సుప్రజ,సుప్రియలపై దాడి చేశారన్నారు. ఈ విషయమై సీఐ రత్తయ్యకు ఫిర్యాదు చేస్తే ఆయన నిందితులకు కొమ్ముకాస్తూ కోర్టుకెళ్లమని చెబుతున్నాడని ఆరోపించారు. జరిగిన సంఘటనలు వివరిస్తుండగా చిన్నారి సుప్రజ కన్నీటి పర్యంతమైంది. కొంతసేపు స్తబ్ధత నెలకుని, వాతావరణం గంభీరంగా మారింది. -
పోలీసులే కొట్టి, నగ్నంగా ఊరేగించారు..
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని దన్కౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. తమ ఇంట్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేయటానికి వెళ్లిన ఓ దళిత కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. యూపీ రాజధాని లక్నోకు కూతవేటులో దూరంలోనే ఈ అమానుషం చోటు చేసుకుంది. ఆ దళిత దంపతుల పట్ల పోలీసులు అతి కిరాతకంగా ప్రవర్తించారు. స్టేషన్ నుంచి బయటకు ఈడ్చుకొచ్చి... నడి రోడ్డు మీద వారిపై తమ ప్రతాపం చూపారు. వారిని వివస్త్రలను చేసి చితకబాదిన సంఘటన కలకలం రేపుతోంది. ఈ దారుణాన్ని ఓ వ్యక్తి తన సెల్ ఫోన్లో చిత్రీకరించి ఆన్లైన్లో పెట్టడంతో.. పోలీసుల వైఖరిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్‌లోని దన్కౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సునీల్ గౌతమ్ అనే వ్యక్తి ఇంట్లో బుధవారం రాత్రి దొంగతనం జరిగింది. ఆ విషయంపై ఫిర్యాదు చేయడానికి అతడు తన భార్య, మరి కొందరు బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అయితే విధుల్లో ఉన్న స్టేషన్ ఆఫీసర్ ప్రవీణ్ యాదవ్ కేసు నమోదు చేయడానికి నిరాకరించాడు. అంతేకాకుండా వారిపట్ల నిర్లక్ష్యంగా , అవహేళనగా మాట్లాడాడు. దీంతో తమ ఫిర్యాదును స్వీకరించి... కేసు నమోదు ఎందుకు చేయరో చెప్పాలని సునీల్ తదితరులు ఆ పోలీస్ అధికారిని నిలదీశారు. అంతే.... ఖాకీ అధికారికి ఎక్కడలేని కోపమొచ్చింది. నన్నే ఎదిరించి మాట్లాడతావా అంటూ చెలరేగిపోయాడు. ఆగ్రహంతో ఊగిపోతూ వారిపై దాడికి దిగాడు. స్టేషన్లో ఉన్న మరికొందరు ఖాకీలు ఆ అధికారికి తోడయ్యారు. పోలీసులందరూ కలిసి ఒక్కసారిగా సునీల్ కుటుంబ సభ్యులు, బంధువులపై దాడి చేసి.... వారిని కొట్టుకుంటూ రోడ్డు మీదికి ఈడ్చుకొచ్చారు. అంతేకాకుండా సభ్య సమాజం నివ్వెరపోయేలా దారుణానికి ఒడిగట్టారు. అంతా చూస్తుండగానే చేతిలో చంటిబిడ్డతో ఉన్న సునీల్ భార్య చీరను లాగి పడేశారు. ఈ చర్యను అడ్డుకున్నవారిని చితక్కొట్టారు. అడ్డుపడిన సునీల్ బట్టలను కూడా చించేశారు. ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టిన పోలీసులు అంతటితో ఊరుకోకుండా సునీల్ పై, అతని భార్య, బంధువులపై క్రిమినల్ కేసులు బనాయించినట్టు సమాచారం. అటు ఒక్క పక్క చంటిబిడ్డను, మరోపక్క తన దేహాన్ని, ఇంకో పక్క తన భర్తను కాపాడుకోవడానికి ఆ దళిత మహిళ పడిన ఆరాటం ..చేసిన పోరాటం ఇపుడు సోషల్ మీడియాలో పలువురిని దిగ్భ్రాంతికి, విస్మయానికి గురి చేసింది. షేమ్ ఇండియా అంటూ విరుచుకుపడుతున్నారు. ఒక పసిబిడ్డ తన అమ్మానాన్నల అభిమానాన్న, గౌరవాన్ని కాపాడిందంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు. ఇదేనా మన డిజిటల్ ఇండియా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ఈ ఘటనపై యూపీ సర్కారు అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా స్పందించింది. మీడియాలో వస్తున్న వార్తలకు భిన్నంగా వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయని పేర్కొంది. మరోవైపు బాధితుడు సునీల్ కూడా పోలీసుల చర్యను నిరసిస్తూ తామే నగ్నంగా మారి నిరసన తెలియ చేశామని తెలిపినట్టు తెలుస్తోంది. -
ఆశలకూ, ఆచరణకూ లంగరు అందేనా?
త్రికాలమ్ ఒక్కొక్క దళిత కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున భూమి ఇవ్వాలన్న కార్యక్రమం గొప్ప సామాజిక స్పృహతో రూపొందించినట్టిది. వాటర్ గ్రిడ్ నిర్మించి ప్రతి పల్లెకూ, ప్రతి ఇంటికీ మంచినీరు అందించాలన్న ప్రణాళికలో ఆక్షేపించేందుకు ఏమీలేదు. ఈ పథకానికి ఫ్లోరైడ్ సమస్యతో తల్లడిల్లుతున్న నల్లగొండ జిల్లాలో శ్రీకారం చుట్టాలని నిర్ణయించడం సంతోషకరమైన వార్త. సుదీర్ఘమైన ఉద్యమం ఫలితంగా ఆవిర్భవించిన కొత్త రాష్ట్రం ప్రజలకు కోటి ఆశలుంటాయి. సత్వరం పరిష్క రించవలసిన అనేక సమస్యలుంటాయి. ఉద్యమానికి సారథ్యం వహించి వందల హామీలు ఇచ్చిన పార్టీ, ఆ పార్టీ అధినాయకుడు రాష్ట్రావతరణ తర్వాత అధికార పార్టీగా, ప్రభుత్వ సారథిగా విధులు చేపట్టిన క్షణం నుం చి ప్రజల కలల సాకారానికి కృషి ఆరంభం అవుతుంది. ప్రభుత్వ హృదయాన్ని ఆవిష్కరించేది వార్షిక బడ్జెట్; అందులోని ప్రాథమ్యాలు, కేటాయింపులు, ప్రత్యేక పథ కాలు, కొత్త చొరవలు. ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ఈ నెల 5వ తేదీన తెలంగాణ శాసనసభకు సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదనలలో కనిపించిన కొత్త చొరవలలో ముఖ్యమైనవి చెరువుల పునరుద్ధరణ, దళితులకు భూమిపంపిణీ, ప్రతిపల్లెకూ మంచినీటి సదుపాయం కల్పించడానికి ఉద్దేశించిన వాటర్ గ్రిడ్, విద్యుచ్ఛక్తి కొర తను అధిగమించాలన్న ఆకాంక్ష. అర్థవంతంగా సాగిన బడ్జెట్ చర్చ బడ్జెట్ రూపకల్పనలో ప్రభుత్వ లక్ష్యం ఆచరణలో సంపూర్ణంగా నెరవేరుతుందా లేదా అన్నది శాసనసభా వేదికపైన చర్చనీయాంశం కావాలి. చర్చ మొత్తం మీద ప్రయోజనకరంగానే సాగింది. తెలుగుదేశం పార్టీ (తెదేపా) సభ్యులను సస్పెం డ్ చేయడం ఒక్కటే అపశ్రుతి. తెదేపా సభ్యులపైన సభాపతి తీసుకున్న చర్యకూ, బడ్జెట్ ప్రతిపాదనలపైన చర్చకూ ప్రత్యక్ష సంబంధం లేదు. ఆ పార్టీ ప్రయోజనాలకీ, ఆ పార్టీ సభ్యుల సంచలనాత్మక ప్రవర్తనకూ సంబంధం ఉంది. తెదేపా నాయకుడు రేవంత్‌రెడ్డి కొండంతరెడ్డిగా ఎదిగేందుకు శాసనసభను వేదిక చేసుకోవడంలో తప్పు లేదు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపైనా, ఆయన కుటుంబ సభ్యుల పైనా పదునైన విమర్శనాస్త్రాలు సంధించడం సైతం ప్రజాస్వామ్యబద్ధమే. వాక్చాతు ర్యం కలిగిన యువనాయకుడికి ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నిర్ణయించుకోవడానికి తగిన సామాజిక, రాజకీయ కారణాలు ఉండవచ్చు. అది ఎర్రబె ల్లి దయాకర్ వంటి నాయకులు తేల్చు కోవలసిన అంశం. బడ్జెట్ ప్రతిపాదనల మంచిచెడ్డలకూ, తెలుగుదేశం పార్టీ సభ్యు లు ప్రస్తావించిన అంశాలకూ పెద్దగా పొంతనలేదు. ఇందుకు భిన్నంగా ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి చేసిన ప్రసంగంలో ప్రభుత్వానికి సూటిగా తగిలే విమర్శలూ, నిర్మాణాత్మకమైన సూచనలూ ఉన్నాయి. కాంగ్రెస్ సభ్యులతోపాటు భారతీయ జనతాపార్టీ, కమ్యూనిస్టు పార్టీ సభ్యులు చేసిన విమర్శలకు కూడా కేసీఆర్, ఈటెల ప్రసంగాలలో సమాధానాలు కనిపిస్తాయి. చట్టసభలలో జరిగే వాగ్యుద్ధాలలో నోరూ, అధికారం ఉన్నవారు పైచేయి సాధించడం సర్వసామాన్యం. ఫ్లోరోసిస్ ప్రాంతాలపై కరుణ దీనికంటే ప్రధానమైనవి బడ్జెట్ ప్రతిపాదనల ద్వారా ప్రభుత్వం వెల్లడించిన సందేశం, తలబెట్టిన పథకాలూ, కార్యక్రమాలూ, కేటాయించిన నిధులూ, స్వప్నించే భవిష్యత్ చిత్రపటం, ఏ తీరాలకు ఈ ప్రతిపాదనలు నడిపిస్తాయో శాసనసభ్యులు చర్చించి నిగ్గుతేల్చాలి. ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకూ, పోరా టం చేసిన కళాకారులకూ, జర్నలిస్టులకూ, న్యాయవాదులకూ, వైద్యులకూ, ఇతర అనేక వర్గాలవారికి మేలుచేయాలన్న విధానాన్ని అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్క దళిత కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున భూమి ఇవ్వాలన్న కార్యక్రమం గొప్ప సామాజిక స్పృహతో రూపొందించినట్టిది. వాటర్‌గ్రిడ్ నిర్మించి ప్రతిపల్లెకూ, ప్రతి ఇంటికీ మంచినీరు అందించాలన్న ప్రణాళికలో ఆక్షేపించేందుకు ఏమీలేదు. ఈ పథకానికి ఫ్లోరైడ్ సమస్యతో తరతరాలుగా తల్లడిల్లుతున్న నల్లగొండ జిల్లాలో శ్రీకా రం చుట్టాలని నిర్ణయించడం సంతోషకరమైన వార్త. ఆదివాసీల, మైనారిటీల రిజర్వేషన్ల విషయంలో ఇచ్చిన హామీలు నెరవేరితే ఆనందదాయకమే. దళిత యువ తుల కోసం ప్రకటించిన కల్యాణలక్ష్మి పథకాన్ని బీసీలకు కూడా విస్తరించడం ఆహ్వా నించదగినదే. వెనుకబడినవర్గాల సంక్షేమంకోసం ప్రభుత్వం సంకల్పించిన చర్య లను ఖండించేవారు ఎవ్వరూ ఉండరు. ప్రభుత్వం ప్రకటించే పథకాలు ఆచరణ సాధ్యమా, కాదా అన్న కోణం నుంచి మాత్రమే ప్రశ్నించాలి. విపక్ష వాదనలూ సబబే లోటు బడ్జెట్ భవిష్యత్తుమీద నమ్మకానికి నిదర్శనం. ప్రణాళికా వ్యయం ప్రణా ళికేతర వ్యయానికి దాదాపు సమానంగా (48 శాతం) ఉండటం చిత్తశుద్ధికి సంకేతం. అంతమాత్రాన జానారెడ్డి లేవనెత్తిన అంశాలకు ప్రాధాన్యం లేదని చెప్పజాలం. ఊహాగానాలూ, ఆశలపల్లకీ అంటూ ప్రతిపక్ష నేత చేసిన హెచ్చరికలు పెడచెవిన పెట్టవలసినవి కావు. లోటు ఏ విధంగా పూరిస్తారు? రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మూడు శాతం కంటే అధికంగా రుణాలు తీసుకోరాద నే నిబంధనను ఎట్లా అధిగమిస్తారు? కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూ.21వేల కోట్లు వస్తుందని రాజేందర్ అంచనా కూడా నమంజసంగా కనిపించదు. 2012-13లో రూ.7500 కోట్లు, 2013-14లో రూ.9000 కోట్లు ఉన్న గ్రాంట్ ఇన్ ఎయిడ్ (కేంద్ర సాయం) 2014-15లో రెట్టింపు కంటే ఎక్కువ అవుతుందని ఆశించగలమా? అందులోనూ తెరాస ప్రభుత్వానికి, భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్కీ మధ్య సఖ్యత అంతంత మాత్రమేనని అనుకుంటున్న దశలో అంత ఉదారంగా సాయం అందుతుందనుకోవడం అవాస్త విక దృష్టి కాదా? ఇంతకంటే ఆసక్తికరమైనది ఎం.ఐ.ఎం. నాయకుడు అక్బరుద్దీన్ అడిగిన ప్రశ్న. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నాలుగు మాసాలలో లక్షకోట్లు ఎట్లా ఖర్చు చేస్తారు? లక్ష కోట్లు ఎట్లా సమీకరిస్తారనే ప్రశ్న ఇందులోనే ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంవత్సరానికి రూ.80 వేల కోట్ల ఆదాయం ఉంటుందని అంచనా వేసినప్పటికీ అంత ఆదాయాన్ని వచ్చే నాలుగు మాసాలలో సమీకరిం చగలరా? ప్రభుత్వ భూములు విక్రయించి రూ.6500 కోట్లు సంపాదించడం అయ్యే పనేనా? ఇది ఫక్తు నేలవిడిచి సాము చేయడం కాదా? విద్యుత్‌పై అంచనాలు వాస్తవికమేనా? ఖరీఫ్ తరుణంలో రాష్ట్రం మునుపెన్నడూ కనీవినీ ఎరుగని స్థాయిలో విద్యుత్ సంక్షోభం ఎదుర్కోబోతోంది. జూలై నాటికి అదనంగా 1500 మోగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి వస్తుందని ఏ అంచనాపై, ఏ హామీపై ముఖ్యమంత్రి చెబుతు న్నారో తెలియదు. కొత్త ప్రాజెక్టు ఏదీ నిర్మాణంలో లేదు. ఈ సంవత్సరం మేలో ఉమ్మడి రాష్ట్రం టెండర్లు ఖరారు చేసి దక్షిణాది విద్యుదుత్పత్తిదారుల నుంచి మొత్తం 1800 మెగావాట్లు కొనుగోలు చేయడానికి బేరం కుదుర్చుకున్నది. అందులో భాగంగా రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణ వాటాకింద 950 మెగావాట్ల విద్యుత్తు అందుతోంది. ఇది వచ్చే సంవత్సరం మే 31వరకూ కొనసాగుతుంది. ఆ తర్వాత వినియోగం కోసం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు సకాలంలో చేసుకోవ డంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. టెండర్లు పిలవడంలో జాప్యం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్వరం టెండ ర్ల ప్రక్రియ పూర్తిచేసి 2100 మెగా వాట్ల విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకున్నది. అందుకే ఏపీలో రోజుకు 24 గంటల విద్యుత్తు సరఫరా ఉంటుందని చంద్రబాబునాయుడు సింగపూరులో ధీమాగా ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం జాప్యం కారణంగా 120 మెగావాట్ల విద్యుత్తు కొనుగోలుకు మాత్రమే బేరం కుదుర్చుకోగలిగింది. అంటే వచ్చే జూన్ ఒకటో తేదీ నుంచి ఇప్పుడు వస్తున్న 950 మెగావాట్లు నిలిచి పోయి 120 మెగావాట్ల విద్యుత్తు మాత్రమే కొత్తగా అందుబాటులోకి వస్తుంది. పైగా అప్పటికి విద్యుత్తు అవసరం ఇప్పటికంటే వేయి మెగావాట్లు పెరుగుతుంది. ఇప్పటి స్థాయితో పోల్చితే కొరత 1830 మెగావాట్ల మేరకు ఉంటుంది. కృష్ణపట్నం 1600 మెగావాట్ల విద్యుత్ కేంద్రం నుంచి తెలంగాణకు రావలసిన వాటా కింద 900 మెగావాట్లు కేంద్రం సహా యంతోనో, ఏపీ సర్కార్ సద్భావనతోనో తెచ్చుకోగలిగితే కొంతమేరకైనా గట్టెక్కే అవకాశం ఉంటుంది. కేంద్ర విద్యుచ్ఛక్తి మంత్రి పీయూష్ గోయల్‌ను కలుసుకొని పరిస్థితిని వివరించడానికి తెరాస ఎంపీలు సిద్ధం అవుతున్నారని వినికిడి. ప్రధాని నరేంద్రమోదీతో మాట్లాడి విద్యుత్ సమస్యను పరిష్కరించాలంటూ కొత్తగా మంత్రి మండలిలో చేరిన బండారు దత్తాత్రేయకు సన్మానం చేస్తూ కేసీఆర్ విజ్ఞప్తి చేయడం విడ్డూరం. ముఖ్యమంత్రి స్వయంగా ఢిల్లీ వెళ్ళి ప్రధానితో చర్చించవలసిన ముఖ్య మైన అంశమిది. ఏపీ అవ రోధాలు సృష్టించకుండా నిరోధించాలన్నా, వచ్చే రెండు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా వ్యవసాయరంగానికి కోత లేకుండా విద్యుత్తు సర ఫరా చేయాలన్నా పీయూష్ గోయల్ నిర్ణయం తెలంగాణలో కూడా అమలు జరగా లన్నా కేసీఆర్ మోదీతో, గోయల్‌తో సాధ్యమైనంత వివరంగా చర్చించవలసి ఉంటుంది. సౌర విద్యుత్తు ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం, యూనిట్‌కు రూ.6.72 చొప్పున కొనుగోలు చేయడానికి బేరం కుదుర్చుకోవడం మంచి పరిణామమే. ఇటువంటి అనేక చర్యలు సత్వరం తీసు కుంటే తప్ప ఖరీఫ్‌లో, ఆ తర్వాత రబీలో విద్యుత్ సంక్షోభాన్ని నివారించడం సాధ్యం కాదు. నిధుల సమీకరణే ప్రస్తుత కర్తవ్యం బడ్జెట్ అంచనాలలో చూపించిన లోటు పూడ్చలేని పక్షంలో ఏ పద్దుకు కోత పెడతారోనన్నది ఆసక్తికరమైన అంశం. పంచాయతీరాజ్ రోడ్ల కోసం మునుపె న్నడూ లేని విధంగా రూ.2000 కోట్లు కేటాయించాలన్న నిర్ణయాన్ని సవరిస్తారా లేక ఇతర సంక్షేమ పద్దులకు గండి పెడతారా? ఉమ్మడి రాష్ట్రం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కి రూ.5000 కోట్లు కేటాయించడమే కష్టమైనప్పుడు తెలంగాణ రూ.12000 కోట్లు కేటా యించడం సాధ్యమా అన్న జానారెడ్డి ప్రశ్న కూడా సవ్యమైనదే. ఒక వేళ అంత మొత్తం కేటాయించి, విడుదల చేసినప్పటికీ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం కింద అనుసరించవలసిన విధివిధానాలూ, మార్గదర్శక సూత్రాలూ ఖరారు చేయకపోతే, ప్రభుత్వ శాఖలకు నిధులు అప్పజెప్పితే పాత కథే పునరావృత్తం అవుతుంది. నిధుల న్నిటినీ కలగలిపి (పూల్ చేసి) పద్ధతి ప్రకారం ఖర్చు చేయాలన్న కేసీఆర్ సంకల్పం నెరవేరదు. బడ్జెట్‌పైన చర్చ ముగిసింది కనుక అనంతరం తీసుకోవలసిన అనేక సత్వర చర్యలపైన ప్రభుత్వం అవశ్యం దృష్టి సారించాలి. ముఖ్యంగా విద్యుచ్ఛక్తి రంగంపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామన్న సంతోషం ప్రజలకు మిగలాలంటే ఆచరణసాధ్యమైన ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఇచ్చి తక్కిన వాటిని పక్కకు పెట్టాలి. నిధుల సమీకరణకు నిరంతరం కృషి చేయాలి. కె. రామచంద్రమూర్తి -
పంపిణీకి భూమేదీ?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: భూపంపిణీపై సందిగ్ధం నెలకొంది. పేద దళిత కుటుంబానికి మూడెకరాల చొప్పున సాగుకు యోగ్యమైన భూమి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 15న భూపంపిణీ చేస్తామని ప్రకటించారు. ఈనేపథ్యంలో చర్యలకు ఉపక్రమించిన రాష్ట్రస్థాయి యంత్రాంగం.. లబ్ధిదారుల ఎంపికపై కసరత్తు చేపట్టాలని సూచించారు. దీంతో హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలో భూపంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే జిల్లాలో సాగుకు యోగ్యమైన ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోవడంతో సమస్య తలెత్తింది. దీంతో సర్కారు నిర్దేశించిన సమయానికి భూపంపిణీ జిల్లాలో సాధ్యంకాదని తెలుస్తోంది. అంతా గందరగోళమే.. టీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల భూపంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ దిశగా హడావుడి చేస్తున్నప్పటికీ.. జిల్లాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అంతా అయోమయంగా మారింది. జిల్లాలోని 17 మండలాలు ఔటర్ రింగురోడ్డు పరిధిలో ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ పరిధిలో భూ పంపిణీని నిషేధించారు. దీంతో అవి మినహా.. 20 మండలాలకు సంబంధించి ఒక్కో గ్రామం చొప్పున, ఆయా గ్రామాల్లో 30 మంది లబ్ధిదారుల చొప్పున గుర్తించి.. మొదటి దశలో భూమి పంపిణీ చేసేలా జిల్లా యంత్రాంగం ప్రాథమికంగా నిర్ధారించింది. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా మూడు ఎకరాలు ఇవ్వాల్సి ఉంది. దీంతో ఆరు వందల కుటుంబాలకు 1,800 ఎకరాలు అవసరం. కానీ ఇంత పెద్ద మొత్తంలో భూమి అందుబాటులో లేకపోవడంతో ఈ అంశం జఠిలమైంది. ఒకవైపు భూమి కొనుగోలు చేసైనా పంపిణీ చేస్తామంటున్న సర్కారు.. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు మార్గదర్శకాలు జారీ చేయలేదు. ఒకవైపు సర్కారు భూపంపిణీకి నిర్దేశించిన గడువు దగ్గరపడుతుండగా.. భూమి లభ్యతపై జిల్లా యంత్రాంగానికి స్పష్టత లేకపోవడంతో అంతా గందరగోళంగా మారింది. భూ పంపిణీకి జిల్లా యంత్రాంగం ఇప్పటివరకు లబ్ధిదారులను ఎంపిక చేయలేదు. తొలివిడతలో భాగంగా ఆరువందల కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా ప్రాథమిక ప్రణాళిక తయారు చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఎంపికపై అధికారులకు స్పష్టత రాలేదు. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి సర్వే నిర్వహించాలని యంత్రాంగం నిర్ణయించింది. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితంవరకు సిబ్బందికి శిక్షణ ఇచ్చిన యంత్రాంగం.. తాజాగా ఎంపీడీఓలు, తహసీల్దార్లకు శిక్షణ ఇచ్చేందుకు ఉపక్రమించింది. మొత్తంగా ఈ శిక్షణ కార్యక్రమాలు ఈనెలాఖరు వరకు కొనసాగనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అనంతరం క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి సమగ్ర నివేదిక తయారు చేస్తారు. ఈ ప్రక్రియ ఆగస్టు 10తేదీ వరకు కొనసాగున్నట్లు అధికారులు చెబుతున్నా.. మరింత సమయం పట్టే అవకాశం ఉంది. మండలానికో గ్రామం ఎంపిక చేసుకోవాలని సర్కారు స్పష్టం చేసినప్పటికీ.. జిల్లాలో మాత్రం ఇప్పటివరకు గ్రామాల ఎంపిక పెండింగ్‌లోనే ఉంది. ఇలా పలురకాల అంశాల్లో అస్పష్టత నెలకొనడంతో ఆగస్టు15 నాటికి లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసి భూమి పంపిణీ చేయడం అంత సులువుకాదని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో పేర్కొన్నారు.