దళిత కుటుంబంపై దాడి
Published Sun, Jul 24 2016 2:26 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM
చిక్కమంగళూరు: గుజరాత్ లోని ఉనా, బిహార్ లో దళితులపై దాడి మరువకముందే కర్ణాటకలోని చిక్ మంగళూరులో ఆవుమాంసం వండారని ఓ దళిత కుటుంబంపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జులై 17 న 30 మంది రైట్ వింగ్ కార్యకర్తలు బీఫ్ వండారనే కారణంతో దళిత కుటుంబంపై దాడి చేశారు. ఎస్సీ,ఎస్టీ ఆక్ట్ చట్టం ప్రకారం ఏడుగురు నిందితులపై కేసును నమోదు చేసిన పోలీసులు కేసును విచారిస్తున్నారు.
Advertisement
Advertisement