beef
-
మాంసంతో బియ్యం తయారీ..!సరికొత్త హైబ్రిడ్ వరి వంగడం!
మాంసంతో బియ్యం తయారు చేయడం ఏంటిదీ! అనిపిస్తుంది కదూ. మీరు వింటుంది నిజమే గొడ్డు మాంసంతో సరికొత్త వరి వంగడాన్ని సృష్టించారు శాస్త్రవేత్తలు. రానున్న కాలంలో ఎదురయ్య ఆహార సమస్యను ఈ సరికొత్త వంగడం తీరుస్తుందని చెబుతున్నారు. చూస్తే బియ్యపు గింజల్లానే ఉంటాయట. తింటే మాత్రం మాంసం రుచిని పోలి ఉంటుందని చెబుతున్నారు. ఏంటా వరి వండగం? ఎలా తయారు చేశారంటే.. దక్షిణ కొరియాలోని యోన్సీ విశ్వవిద్యాలయ పరిశోధకులు బృందం ఈ సరికొత్త బీఫ్ హైబ్రిడ్ వరి వంగడాన్ని సృష్టించారు. వాళ్లు సృష్టించిన బియ్యపు గింజల్లో గొడ్డు మాంసంలో ఉండే కొవ్వు కణాలు ఉంటాయి. చూడటానికి గులాబీ రంగులో ఉంటాయి ఈ బియ్యం. ఫిష్ జెలటిన్‌లో సాంప్రదాయ బియ్యం గింజలను కప్పి, వాటిని అస్థిపంజర కండరం కొవ్వు మూలకణాలతో ప్రయోగాత్మకంగా ల్యాబ్‌లో సాగు చేశారు. అలా తొమ్మిది నుంచి 11 రోజుల పాటు కండరాలు, కొవ్వు, జెలటిన్-స్మోటెర్డ్ బియ్యాన్ని సాగు చేసిన తర్వాత, ధాన్యాలు అంతటా మాంసం, కొవ్వును ఉంటాయి. చివరిగా ఉత్పత్తి అయ్యే వరి వంగడం మంచి పౌష్టికరమైన బియ్యంగా మారుతుంది. ప్రయోగశాలలో తయారు చేసిన ఈ గొడ్డు మాంసం కల్చర్డ్ రైస్‌ను ప్రోఫెసర్ జింకీ హాంగ్ వండి రుచి చూశారు. చూడటానికి సాధారణ బియ్యం వలే గులాబీ రంగులో ఉంటాయి. కానీ మాంసపు లక్షణాన్ని కలిగి ఉందన్నారు. సువాసన కూడా ఉన్నట్లు తెలిపారు. ఈ హైబ్రిడ్ బియ్యం కొంచెం దృఢంగా పెళుసుగా ఉందని అన్నారు. అయితే ఇందులో 8% దాక ప్రోటీన్, 7% కొవ్వులు ఉంటాయని అన్నారు. ఈ బియ్యం గొడ్డు మాంసం, బాదం వంటి వాసనను కలిగి ఉంటుందన్నారు. వండిన తర్వాత వెన్న, కొబ్బరి నూనె కూడిన వాసన వస్తుందన్నారు. ఈ వరి వంగడాన్ని సృష్టించడానికి కారణం.. ఒకవైపు వనరులు తగ్గిపోతున్నాయి, మరోవైపు పెరుగుతున్న జనాభా దృష్ట్యా ఆ అవసరాలను తీర్చడం కోసం ఈ సరికొత్త వరి బియ్యాన్ని సృష్టించే ప్రయోగాలు చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. సాధారణంగా జంతువుల నుంచి మనకు అవసరమైన ప్రోటీన్‌ను అందుతుంది. అయితే జంతువులను పెంచడానికి చాలా వనరులు అవసరం. ఇది ఒకరకంగా వాతావరణంలో గ్రీన్హౌస్ వాయువు విడుదలను పెంచుతుంది. అలాగే వరి పండించటానికి ఎక్కువ నీరు, శ్రమ అవసరం అవుతాయి. బదులుగా తక్కువ శ్రమతో తక్కువ వనరులను ఉపయోగించి ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ కలయికలో ఆహారం ఉంటే అది అందరికీ వెసులుబాటుగా ఉంటుందన్నారు. అంతేగాదు ఈ సెల్-కల్చర్డ్ ప్రోటీన్ రైస్ నుంచి మనకు అవసరమైన అన్ని పోషకాలు పొందడం గురించి కూడా పరిశోధన చేయాల్సి ఉందన్నారు. పరిశోధకులు స్థానిక వధశాలలో వధించిన హన్వూ పశువుల నుంచి కండరాలు, కొవ్వు కణాలను తీసుకుని ఈ సరికొత్త వరి వండగాన్ని సృష్టించారు. ఇలా ఎక్కువ జంతువులు అవసరం లేకుండా ల్యాబ్‌లో నిర్వహించగల జంతు కణాలపై దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు.ఈ ప్రయోగంలో మరిన్ని మార్పులు చేసి.. చేపల వంటి వాటిని కూడా వినియోగించి వివిధ రుచులగల ఆహారాన్ని తయారు చేసే దిశగా పరిశోధనలు చేస్తున్నట్లు వెల్లడించారు శాస్త్రవేత్తలు. అయితే ఈ హైబ్రిడ్ బియ్యం అచ్చంగా మాంసం రుచిని పోలీ ఉంటాయి కాబట్టి మార్కెట్లోకి విడుదల చేస్తే ప్రజలు వీటిని ఇష్టపడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఏదీఏమైనా ఈ సరికొత్త వరి వంగడం భవిష్యత్తులో కరువు పరిస్థితులు తలెత్తినప్పుడు మంచి ఆహార వనరుగా ఉంటుంది. అలాగే సైనికులకు అవసరమైన పౌష్టికాహారంగానూ, అంతరిక్ష ఆహారంగానూ పనిచేస్తుందని పరిశోధకులు నమ్మకంగా చెబుతున్నారు. చెబుతున్నారు. (చదవండి: 1700 ఏళ్ల నాటి పురాతన గుడ్డు..ఇప్పటికీ లోపల పచ్చసొన..!) -
నేను కూడా బీఫ్ తింటా.. దానిపై ఆంక్షలేవు: బీజేపీ అధ్యక్షుడి సంచలన ప్రకటన
మేఘాలయలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార, ప్రతిపక్ష నాయకులు ఒకరిపై ఒకరు విమర్శల దాడికి దిగుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మేఘాలయ బీజేపీ అధ్యక్షుడు ఎర్నెస్ట్ మౌరీ సంచలన ప్రకటన చేశారు. మేఘాలయాలో దాదాపు ప్రతిఒక్కరూ గొడ్డు (బీఫ్) మాంసం తింటారని వెల్లడించారు. బీఫ్ తినడంపై రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపారు. ఇది తమ ఆహార అలవాటు, సంస్కృతిలో భాగమని పేర్కొన్నారు. రాష్ట్రంలో అందరూ తమకు కావాల్సింది తినే స్వేచ్ఛ ఉందని వ్యాఖ్యానించారు. దీనిని ఎవరూ ఆపలేరని అన్నారు. ఈ విషయంలో పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలు ఆమోదించిన తీర్మానంపై తనేం మాట్లాడదలుచుకోలేదని చెప్పారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘మేఘాలయలో ఉన్న వారందరూ బీఫ్ తింటారు. దానిపై ఎలాంటి నియంత్రణ లేదు. నేను కూడా తింటాను. మేఘాలయాలో బీఫ్‌పై నిషేధం లేదు. ఇది ప్రజల జీవనశైలి, దీనిని ఎవరూ ఆపలేరు. భారతదేశంలో కూడా అలాంటి నియమం లేదు. అయితే కొన్ని రాష్ట్రాలు కొన్ని చట్టాలను ఆమోదించాయి. మేఘాలయలో, మాకు కబేళా ఉంది. ప్రతి ఒక్కరూ ఆవు లేదా పందిని తీసుకొని మార్కెట్‌కు తీసుకువస్తారు. వీటిని పరిశుభ్రంగా ఉంచుతారు. అందుకే ఇక్కడి వారికి తినే అలవాటు ఉంది’ అని అన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చి తొమ్మిదేళ్లు అవుతోందని.. ఈ కాలంలో దేశంలో ఏ చర్చిపై కూడా దాడులు జరగలేదని ప్రస్తావించారు. అలాగే బీజేపీ అధికారంలోఉన్న గోవా, నాగాలాండ్‌లో కూడా చర్చిలపై అలాంటి ఘటనలేవి చోటుచేసుకోలేదని గుర్తు చేశారు. బీజేపీ క్రైస్తవ వ్యతిరేక పార్టీగా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్, టీఎంసీ చేస్తున్న ఆరోపణలు కేవలం ఎన్నికల ప్రచారం కోసమేనని మండిపడ్డారు.. మేఘాలయలో క్రిస్టియన్లే అధికంగా ఉంటారని అందరూ చర్చికి వెళ్తారని ఎర్నెస్ట్ తెలిపారు. ఈసారి తప్పకుండా బీజేపీ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఎన్నికల్లో తమ పార్టీ ప్రభుత్వానికి కావాల్సిన మెజార్టీ సాధిస్తుందన్నారు. కాగా మేఘాలయలో ఫిబ్రవరి 27న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. చదవండి: బిగుస్తున్న ఉచ్చు.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం -
వారిది లవ్ మ్యారేజ్.. బెదిరించి భార్య చేసిన పనికి భర్త..
వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగానే ఉన్నారు. కానీ, భార్య, బావమరిది చేసిన పనికి మనస్థాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు వారే కారణమని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషాద ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సూరత్‌కు చెందిన రోహిత్ ప్రతాప్ సింగ్, ముస్లిం మహిళ సోనమ్ కలిసి ఒకేచోట పనిచేశారు. ఈ క్రమంలో వీరి మధ్య పరిచయం ఏర్పడి.. ప్రేమగా మారింది. రోహిత్ హిందూ, సోనమ్ ముస్లిం కావడంతో వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. కానీ.. రోహిత్ మాత్రం ప్రేమించిన సోనమ్‌ను వదులుకోలేక వివాహం చేసుకున్నాడు. రోహిత్ వీరి వివాహ బంధం కొద్దిరోజులు సాఫీగానే సాగింది. ఇంతలో, అనుకోకుండా.. ఈ ఏడాది జూన్‌లో రోహిత్‌ను బీఫ్ తినాలని భార్య సోనమ్, ఆమె సోదరుడు అఖ్తర్ అలీ ఫోర్స్ చేశారు. దీంతో, ఇష్టం లేకపోయినా రోహిత్.. బీఫ్ తిన్నాడు. అనంతరం, దీనిని తట్టుకోలేని రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, రోహిత్ తన సూసైడ్‌కు ముందు ఫేస్బుక్లో పోస్ట్ చేసిన సూసైడ్ నోట్ ఇటీవల బయటపడింది. తన సూసైడ్ నోట్లో రోహిత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. నేను.. నా భార్య, ఆమె సోదరుడి కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నాను. నన్ను చంపేస్తానని బెదిరించి నాతో వాళ్లు బీఫ్ తినిపించారు. ఈ లోకంలో జీవించే అర్హత నాకు లేదు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా. నాకు న్యాయం చేయండి అని సూసైడ్ నోట్ రాసుకొచ్చాడు. అయితే, రోహిత్ ఫేస్బుక్ నోట్ అతడి ఫ్రెండ్స్ కంటపడటంతో ఈ విషయాన్ని అతడి తల్లి వీణా దేవికి చెప్పారు. ఈ క్రమంలో తన కొడుకు చావుకు భార్య సోనమే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నోట్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు తెలిపారు. Hindu man dies by suicide after Muslim wife, brother-in-law forcefully feed him beef in Surat https://t.co/L5OShL8w1V via @indiatoday — sekhar (@sekhar31000123) August 29, 2022 -
Beef Row: లంచ్‌లోకి బీఫ్.. ప్రధానోపాధ్యాయురాలి అరెస్ట్
దిస్పూర్: తిండి విషయంలో ఎవరి అలవాట్లు వాళ్లవి. పని చేసే చోట నలుగురూ కలిసి భోజనం చేయడం సహజం. అలా లంచ్ చేస్తున్న టైంలో.. తాను ఇంటి నుంచి తెచ్చిన వంటకాన్ని నలుగురికి పంచాలనుకుంది ఓ ప్రధానోపాధ్యాయురాలు. అదే ఆమె చేసిన తప్పు అయ్యింది..కటకటాల వెనక్కి నెట్టింది. అస్సాం గోల్పరా జిల్లా లఖిపూర్‌లోని ముర్కాచుంగి మిడిల్ ఇంగ్లీష్ మీడియం ప్రధానోపాధ్యాయురాలు దలిమా నెస్సా(56).. గొడ్డుకూరను లంచ్ బాక్స్‌లో తీసుకెళ్లింది. అయితే తాను తెచ్చిన వంటకాన్ని తోటి ఉపాధ్యాయులకు పంచాలనుకుంది ఆమె. ఇది కొందరికి నచ్చలేదు. అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మే 14న స్కూల్లో జరిగిన ఓ పంక్షన్ సందర్భంగా ఇది జరిగింది. బీఫ్‌ను పంచాలనుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కొందరు టీచర్లు ఆమెపై స్కూల్ కమిటీకి ఫిర్యాదు చేశారు. అటుపై ఈ వ్యవహారం పోలీసులకు చేరడంతో ఆ ప్రధానోపాధ్యాయురాలిని అరెస్ట్ చేశారు. మంగళవారం ఆమెను అరెస్ట్ చేసి..ఆ మరుసటి రోజు కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో ఆమెకు జ్యూడిషియల్ కస్టడీ విధించారు. ఐపీసీ 153ఏ(విద్వేషాలు రగిల్చే ప్రయత్నం), 295ఏ (మత మనోభావాలు దెబ్బతీయడం) కింద.. ఆమెను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. బీఫ్ తినొచ్చు, కానీ.. ఈశాన్య రాష్ట్రం, పైగా బీజేపీ పాలిత రాష్ట్రమైన అస్సాంలో గొడ్డు మాంసం క్రయవిక్రయాలు, తినడంపై ఎలాంటి అభ్యంతరాలు లేవు. కాకపోతే కిందటి ఏడాది ప్రభుత్వం ‘అస్సాం క్యాటల్ ప్రిజర్వేషన్ యాక్ట్’ తీసుకొచ్చింది. దీని ప్రకారం.. హిందువులు, జైనులు, గొడ్డు మాంసానికి దూరంగా ఉండే కమ్యూనిటీలు ఉన్న ఏరియాలకు, హిందూ ఆలయాలకు ఐదు కిలోమీటర్ల అవతల.. బీఫ్ సెంటర్లను నిర్వహించకోవచ్చు. ఆవు అందరికీ అమ్మ. గోమాతను పూజించే గడ్డపై.. గొడ్డు మాంసం తినకపోవడమే ఉత్తమం. అదే సమయంలో తిండి అలవాట్లను ఎవరూ మార్చుకోవాల్సిన అవసరమూ లేదు: అస్సాం సీఎం హిమంత గతంలో చేసిన కామెంట్లు చదవండి: జాతరలో బీఫ్, పంది బిర్యానీకి నో.. కలెక్టర్‌కు నోటీసులు -
వారిది తప్ప.. అందరి డీఎన్ఏ ఒక్కటే
న్యూఢిల్లీ: ఆవు మాంసం తినే వారిది తప్ప..దేశ ప్రజలందరి డీఎన్ఏ ఒక్కటేనంటూ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ)నేత సాధ్వి ప్రాచి వ్యాఖ్యానించారు. శనివారం సాధ్వి ప్రాచి రాజస్తాన్‌లోని దౌసాలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ..‘ఆవు మాంసం తినేవారిది మినహా అందరి డీఎన్ఏ ఒక్కటే’అని పేర్కొన్నారు. దేశంలో జనాభా పెరుగుదలను ఆపేందుకు కఠిన చట్టాలు తీసుకురావాలన్నారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానాన్ని కలిగిన వారికి ప్రభుత్వ సేవలు బంద్ చేయాలన్నారు. వారికి ఓటు హక్కు కూడా లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. రాజస్తాన్‌లో లవ్ జిహాద్ ముసుగులో జరుగుతున్న మత మార్పిడులను ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఐక్యత లేకుండా అభివృద్ధి సాధ్యం కాదనీ, దేశంలోని అన్ని మతాల ప్రజల డీఎన్ఏ ఒక్కటేనని ఇటీవల జరిగిన ముస్లిం రాష్ట్రీయ మంచ్ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్న విషయం తెలిసిందే. -
బీఫ్ ప్రకటనపై బీజేపీ, వీహెచ్‌పీ ఫైర్..
సాక్షి, న్యూఢిల్లీ : మకర సంక్రాంతి సందర్భంగా బీఫ్ డిష్‌పై కేరళ టూరిజం వివాదాస్పద ప్రకటనపై బీజేపీ, వీహెచ్‌పీలు భగ్గుమన్నాయి. ‘సుగంధ ద్రవ్యాలు, కొబ్బరి ముక్కలు మరియు కరివేపాకులతో కొద్దిగా కాల్చిన గొడ్డు మాంసం ముక్కలు... అత్యంత క్లాసిక్ డిష్, బీఫ్ ఉలార్తియాతు’ అంటూ ఈనెల 15న కేరళ టూరిజం ట్విటర్లో ఓ ప్రకటనను పొందుపరిచింది. గోవులను పూజించే వారి మనోభావాలను గాయపరిచేలా ఈ ప్రకటన ఉందని వీహెచ్‌పీ నేత వినోద్ బన్సల్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేరళ ప్రభుత్వంపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేరళ ట్విటర్ ప్రకటన ఆక్షేపించేలా ఉందని కేరళ ప్రభుత్వం జాతికి క్షమాపణ చెప్పాలని బన్సల్ కోరారు. ఇక కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం రాష్ట్రంలోని హిందువులపై యుద్ధం ప్రకటించిందని ఎంపీ, బీజేపీ నేత శోభా కరంద్లాజే ఆరోపించారు. మకర సంక్రాంతి నాడు బీఫ్‌పై ప్రకటనతో కేరళ ప్రభుత్వం హిందువల సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా కేరళలో ఆహారాన్ని ఏ ఒక్కరూ మతంతో ముడిపెట్టరని కేరళ టూరిజం మంత్రి కే సురేంద్రన్ స్పష్టం చేశారు. ఏ ఒక్కరి మత విశ్వాసాలను దెబ్బతీయాలని ప్రభుత్వం భావించడం లేదని అన్నారు. ఆహారంలోనూ మతాన్ని వెతికే వారే ఇలాంటి వివాదాలను సృష్టిస్తున్నారని ఆయన చెప్పారు. పంది మాంసంతో కూడిన ఆహారాన్ని కూడా ఉంచాలని వాటి చిత్రాలను కూడా పోస్ట్ చేయాలని కోరుతున్న వారు అలాంటి సమాచారం కూడా వెబ్సైట్లో ఉందని, వారు వాటిని చూడకపోయి ఉండవచ్చని మంత్రి పేర్కొన్నారు. చదవండి : ‘కుక్క మాంసం తినండి.. ఆరోగ్యంగా ఉండండి’ -
‘పిల్లలు బీఫ్ తినడం పెద్దల తప్పు’
సాక్షి, న్యూఢిల్లీ : విదేశాలకు వెళుతున్న భారతీయ యువత మన సంస్కృతి, సంప్రదాయాల గురించి పెద్దలు వివరించకపోవడంతో అక్కడ బీఫ్ తినడం మొదలుపెడుతున్నారని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ‘స్కూల్స్‌లో భగవద్గీతను కచ్చితంగా బోధించేలా చర్యలు చేపట్టాలి..మన పిల్లలను మిషనరీ స్కూల్స్‌కు పంపితే అక్కడ ఐఐటీ శిక్షణతో ఇంజనీర్లవుతూ విదేశాలకు వెళుతున్నారు. వారిలో చాలా మంది బీఫ్ తినడానికి అలవాటుపడుతున్నార‘ని వ్యాఖ్యానించారు. వారికి మన సంస్కృతి, సంప్రదాయాల గురించి మనం బోధించకపోవడమే ఇందుకు కారణమని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత పిల్లలు తమను సరిగ్గా చూసుకోవడం లేదని పెద్దలు వాపోతున్నారని అన్నారు. బెగుసరైలో భగవద్గీతకు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొంటూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. పాఠశాలల్లో భగవద్గీతను చిన్నారులకు బోధించాల్సిన అవసరం ఉందని అన్నారు. తాము చేపట్టిన సర్వేలో 100 ఇళ్లకు గాను కేవలం 15 ఇళ్లలోనే హనుమాన్ చాలీసా, భగవద్గీత, రామాయణ పుస్తకాలు ఉన్నాయని వెల్లడైందని చెబుతూ జరుగుతున్న పరిణామాలకు మనం పిల్లల్ని నిందించలేమని చెప్పుకొచ్చారు. మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకుంటేనే మన దేశం మనుగడ సాధిస్తుందని వ్యాఖ్యానించారు. -
‘కుక్క మాంసం తినండి.. ఆరోగ్యంగా ఉండండి’
కోల్‌కతా : గోమాంసం తినేవాళ్లందరూ కుక్క మాంసం కూడా తినాలంటూ పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మేధావులంతా రోడ్లపై బీఫ్ తింటున్నారని... ఇకపై వారు అన్ని రకాల జంతువులను కూడా ఇలాగే చంపి తింటే ఆరోగ్యం బాగుంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే రోడ్డుపై కాకుండా ఇంట్లోనే ఆ వంటకాలు తయారు చేసుకుని తినాలని సూచించారు. బుర్దావన్‌లో సోమవారం జరిగిన గోపా అష్టమి కార్యక్రమంలో దిలీప్ ఘోష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గో హత్య మహాపాతకమని పేర్కొన్నారు. ‘ గోవు మన తల్లి. ఆమె పాలు తాగి మనం ఈరోజు జీవిస్తున్నాం. కాబట్టి ఇటువంటి నా తల్లితో ఎవరైనా చెడుగా ప్రవర్తిస్తే నేను సహించను. పవిత్రమైన భారత భూమిపై గోవధ చేసి ఆ మాంసం తినటం క్షమించరాని నేరం. ఆవు పాలు బంగారం వంటివి. అందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఆవు మాంసం తింటే మంచిదంటూ రోడ్లపై పడి భోజనం చేస్తున్నవాళ్లు కుక్క మాంసంతో పాటు అన్ని రకాల జంతువుల మాంసం తింటే ఇంకా ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఏదైనా మీ ఇంట్లోనే తినండి. రోడ్లపై నానాయాగీ చేయకండి’ అని మేధావివర్గంపై విమర్శలు గుప్పించారు. కాగా దిలీప్ ఘోష్ గతంలోనూ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. దేశీ ఆవులు అమ్మతో సమానం గనుక.. వాటికి ప్రాధాన్యం ఇవ్వాలని.. విదేశీ ఆవు జాతులను పెంచడం శ్రేయస్కరం కాదని పేర్కొన్నారు. ఈ క్రమంలో విదేశీ వనితలను భార్యలుగా చేసుకున్న వారు ఎలాంటి సమస్యల్లో చిక్కుకుపోయారో గమనించాలని విఙ్ఞప్తి చేశారు. అంతేగాకుండా తూర్పు మిడ్నాపూర్‌లో తమ కార్యకర్తలపై దాడులను ప్రోత్సహిస్తున్నారంటూ.. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీసు ఉన్నతాధికారిని చంపుతానని బెదిరించారు. బీజేపీ కార్యకర్తలతో తప్పుగా ప్రవర్తిస్తే అంత్యక్రియలు చేసేందుకు శవం కూడా దొరకకుండా చేస్తామని ఆయనను హెచ్చరించారు. -
అదే నోటితో.. మటన్, బీఫ్ కూడా..
న్యూఢిల్లీ : చికెన్, గుడ్లను కూడా శాకాహార జాబితాలో చేర్చాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ రాజ్యసభలో లేవనెత్తిన వింతవాదనపై ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేలుతున్నాయి. ఆయుర్వేదంపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా సంజయ్ రౌత్ ఈ వింత వాదనను వినిపిస్తూ... చికెన్ శాఖాహారమో, మాంసాహారమో ఆయుష్ మంత్రిత్వ శాఖ తేల్చాలన్నారు. తాను నందుర్బర్ ప్రాంతంలోని ఓ కుగ్రామానికి వెళ్లినప్పుడు, అక్కడి ఆదివాసీ ప్రజలు తనకు భోజనాన్ని వడ్డించారని, అదేంటని వారిని అడగ్గా ‘ఆయుర్వేదిక్ చికెన్’ అని చెప్పినట్లు ఆయన సభలో గుర్తుచేసుకున్నారు. దాన్ని తినడం వల్ల అనారోగ్య సమస్యలన్ని నయమవుతాయని ఆదివాసీలు తనతో చెప్పారన్నారు. మీరట్‌కు చెందిన చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ ఆయుర్వేదిక్ ఎగ్స్‌పై పరిశోధన చేస్తున్నట్లు సంజయ్ ప్రస్తావించారు. సభలో ఆయన చేసిన ఈ తరహా వ్యాఖ్యలపై సభ్యులంతా విస్మయానికి గురయ్యారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట హల్ చేస్తుండగా.. నెటిజన్లు మాత్రం తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘అయ్యా..అదే చేత్తో మటన్, బీఫ్ కూడా శాకాహార జాబితాలో చేర్చి పుణ్యం కట్టుకోరాదు’ అని ఒకరు.. ‘కేవలం చికెన్,గుడ్డేనా, మటన్, బీఫ్ ఏ పాపం చేశాయి’ అని మరొకరు.. మటన్ బీఫ్‌పై ఇంత వివక్షా? అని ఇంకొకరు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. Shiv Sena leader Sanjay Raut demands Chicken And Eggs to be called Vegetarian. Beef and Mutton: Why this discrimination?? — Khushboo (@Khush_boozing) July 17, 2019 -
దారుణం.. నడిరోడ్డుపై రెచ్చిపోయిన గో రక్షకులు
ముంబై : మహారాష్ట్రలో గోరక్షకులు రెచ్చిపోయారు. ఎద్దు మాంసం తీసుకెళ్తున్నారనే అనుమానంతో ముగ్గురు ముస్లింలను చితక బాదారు. వీరిలో ఒక మహిళ ఉండటం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాలు.. ఇద్దరు ముస్లిం వ్యక్తులు, ఓ మహిళ కలిసి ఆటోలో ప్రయాణిస్తున్నారు. వారు ఎద్దు మాంసం తీసుకెళ్తున్నట్లు అనుమానించిన కొందరు వ్యక్తులు.. తమను తాము గోరక్షకులుగా చెప్పుకుని వారి మీద దాడి చేశారు. మహిళ అని కూడా చూడకుండా విచక్షణారహితంగా కొట్టారు. అంతేకాక జై శ్రీరాం నినాదాలు చేయాలంటూ వారిని బలవంతం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దాంతో ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేయడమే కాక ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటనపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. మోదీ ఓటర్లు తయారు చేసిన ఈ మూక ముస్లింలను ఎలా హింసిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుందంటూ ట్విట్ చేశారు. This is how Muslims are treated by Vigilantes created by Modi voters welcome to a New India which will Inclusive and as @PMOIndia said Secularism Ka Niqaab ...... https://t.co/Cy2uUUTirk — Asaduddin Owaisi (@asadowaisi) May 24, 2019 -
‘ఎద్దు మాంసం తిని మతానికి తీరని కళంకం తెచ్చావ్’
న్యూఢిల్లీ : ప్రముఖ చరిత్రకారుడు.. బీజేపీ పార్టీ విమర్శకుడు రామచంద్ర గుహను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ట్విట్టర్ యూజర్లు. వివరాలు.. శనివారం రామచంద్ర గుహ గోవాలో దిగిన ఓ ఫోటోను తన ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ‘పనాజీలో ఎద్దు మాంసం తింటూ ఎంజాయ్ చేస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. దాంతో ఆగ్రహించిన నెటిజన్లు గుహను విపరీతంగా ట్రోల్ చేయడమే కాక.. ఫోన్ చేసి మరి బెదిరించినట్లు తెలిపారు గుహ. విమర్శలు ఎక్కవ అవడంతో ఆ ఫోటోను డిలీట్ చేశానని తెలిపారు. ఈ విషయం గురించి గుహ మాట్లాడుతూ.. ఆర్కే యాదవ్ అనే మాజీ రా(రిసెర్చ్ అనాలసిస్ వింగ్) ఉద్యోగి ‘ఒక హిందువు ఎద్దు మాసం తినడమే కాక.. ఆ విషయం గురించి ప్రచారం చేసుకుంటూ మతానికి తీరని కళంకం తెచ్చావు. ఈ దారుణ చర్య ద్వారా నువ్వు హిందువులను బాధించావు. ఇందుకు తగిన సమాధానం చెప్తాం’ అంటూ ట్వీట్ చేశాడని వెల్లడించారు. This threatening tweet below is from a former official of the Research and Analysis Wing. I would like to place it on record, and will do with every subsequent threat received. https://t.co/MrG7AVL15U — Ramachandra Guha (@Ram_Guha) December 9, 2018 అంతేకాక ఢిల్లీకి చెందిన మరో వ్యక్తి ఫోన్ చేసి తనను, తన భార్యను బెదిరించారని పేర్కొన్నారు గుహ. తనకు వచ్చిన ఈ బెదిరింపు సందేశాలను, ఫోన్ కాల్స్‌ని రికార్డ్ చేసినట్లు ఆయన తెలిపారు. మరికొన్ని విమర్శలు కూడా రావడంతో ఆ ఫోటోను తొలగించారు. అనంతరం బీజేపీని విమర్శిస్తూ ట్వీట్ చేశారు గుహ. ‘నేను గోవాలో లంచ్ చేస్తున్నప్పటి ఫోటోను డిలీట్ చేశాను. ఈ సందర్భంగా ఎద్దు మాంసం పట్ల బీజేపీ సృష్టించిన హిపోకస్రీని మెచ్చుకుంటున్నాను. ఆహారం, దుస్తులు, ప్రేమ విషయంలో మనషులు తమ మనసుకు నచ్చినట్లు చేసే హక్కు ఉందని’ తెలిపారు. I have deleted the photo of my lunch in Goa as it was in poor taste. I do wish however to again highlight the absolute hypocrisy of the BJP in the matter of beef, and to reiterate my own belief that humans must have the right to eat, dress, and fall in love as they choose. — Ramachandra Guha (@Ram_Guha) December 9, 2018 ప్రస్తుతం దేశంలో రాజస్తాన్, హిమాచల్ ప్రదేశ్, వంటి రాష్ట్రాల్లో గొడ్డు మాంసాన్ని పూర్తిగా నిషేధించారు. కానీ కేరళ, పశ్చిమ బెంగాల్, గోవా వంటి రాష్ట్రాల్లో దీని మీద ఎటువంటి నిషేధం లేదు. -
గోవుల చట్టం కోసం 8 ఏళ్ల ఉద్యమం
సాక్షి, న్యూఢిల్లీ : ఆవులను ప్రేమించడంలో, గౌరవించడంలో బహూశ భారత్ తర్వాత ప్రపంచంలో రెండో దేశం స్విడ్జర్లాండే కావచ్చు. వారి జాతీయ చిహ్నం కూడా ఆవులే. ఆవుల విషయంలో అక్కడి రైతులకు ఓ ఆటవిక ఆనవాయితీ ఉంది. వారు ఓ దశలో ఆవుల కొమ్ములను నాటు పద్ధతిలో కత్తిరించి వేస్తారు. స్విడ్జర్లాండ్ మొత్తం మీద 80 శాతం ఆవులకు కొమ్ములుండవు. ఈ అనాచారం ఎందుకొచ్చిందో వారికి కూడా తెలియదుగానీ, కొమ్ములుండడం వల్ల గోశాలలకు స్థలం ఎక్కువ అవసరం పడుతుందని, కొమ్ముల వల్ల ఆవులు కోపతాపాలకు గురవుతాయని, పరస్పరం పొడుచుకుంటాయని, అప్పుడప్పుడు వాటిని సాదుతున్న రైతులనే పొడిచే ప్రమాదం ఉందని అక్కడి రైతులు చెబుతున్నారు. ఆవుల కొమ్ములను కత్తిరించడం క్రూరత్వమని నమ్మే ఆర్మిన్ కపాల్ అనే రైతు ఈ అనాచారానికి వ్యతిరేకంగా చట్టం తీసుకరావడానికి పెద్ద ఎత్తున సంతకాల ఉద్యమాన్ని చేపట్టారు. విజయం సాధించారు. ఫలితంగా ఆయన ప్రతిపాదించిన చట్టంపై రేపు (ఆదివారం) స్విడ్జర్లాండ్ ప్రభుత్వం ‘రిఫరెండమ్ (ప్రజాభిప్రాయ సేకరణ)’ నిర్వహిస్తోంది. రిఫరెండానికి అనుకూలంగా మెజారిటీ ప్రజలు ఓటేస్తే చట్టం ఖాయమవుతుంది. స్విడ్జర్లాండ్ ప్రత్యక్ష ప్రజాస్వామ్య దేశం అవడం వల్ల ఏ అంశంపైనైనా, ఏ పౌరుడైన చట్టాన్ని ప్రతిపాదించవచ్చు. అయితే అందుకు కనీసం లక్ష మంది ప్రజల సంతకాలను సేకరించాల్సి ఉంటుంది. మన రైతు ఆర్మిన్ కపాల్ లక్షా ఇరవై వేల మంది సంతకాలు సేకరించారు. అయితే ఆర్మిన్ ప్రతిపాదించిన చట్టంలో ఆవుల కొమ్ముల కత్తిరింపుపై నిషేధం కోరలేదు. ఆవుల కొమ్ములను కత్తిరించని రైతులకు, రాయితీగా రోజుకు ఒక్కో ఆవుకు ఒక్క స్విస్ ఫ్రాంక్ అంటే, దాదాపు 70 రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లించాలంటూ చట్టాన్ని ప్రతిపాదించారు. ఈ చట్టం కోసం ఆర్మిన్ దాదాపు ఎనిమిదేళ్లుగా పౌరుల సంతకాల కోసం కృషి చేస్తున్నారు. చట్టం కోసం చేసే ప్రతిపాదనపై స్విస్ పౌరులు గుడ్డిగా సంతకం చేయరు. ప్రతిపాదనతో పూర్తిగా ఏకీభవించినప్పుడే వారు సంతకాలు చేస్తారు. అందుకే లక్షా ఇరవై వేల సంతకాలు సేకరించేందుకు ఆయనకు అంతకాలం పట్టింది. ఆజానుభావుడిలా కనిపించే ఆర్మిన్కు ఇప్పుడు 67 ఏళ్లు. బవురు గడ్డంతో కనిపించే ఆర్మిన్ రకరకాల దుస్తులు, పలు రకాల టోపీలతో ఆకర్షణీయంగా కనిపిస్తాడు. ‘మేము ఆవులను ప్రేమిస్తాం, వాటిని తింటాం’ ‘ఆవు కొమ్ములను కత్తిరించడం క్రూరత్వమని నమ్మే మీరు, ఆవు మాంసాన్ని ఎలా తింటారు? అది క్రూరత్వం కాదా?’ అని జర్మనీ జర్నలిస్ట్ పీటర్ జాగ్గి (ఆమె భారత దేశంలో ఆవులను పవిత్రంగా చూడడంపై జర్మనీలో ఇటీవల ఓ పుస్తకం రాశారు) ప్రశ్నించగా ‘మేము ఆవులను ప్రేమించేమాట నిజమే. వాటి మాంసాన్ని ఇష్టంగా తినే మాట కూడా నిజమే. కొన్ని ఆవులను కబేళాలకు పంపించకపోతే నేడు స్విడ్జర్లాండ్‌లో మనుషులకన్నా ఆవులే ఎక్కువగా ఉండేవి. ఆవుల సంరక్షణను మనుషులమైన మనం బాగా చూసుకుంటాం కనుక, అవి ఆహారంగా మారి మన రుణం తీర్చుకుంటాయి. ఆవులను గౌరవించడం వల్లనే మా దేశస్థులు విమానాశ్రయాల్లో అతిథులను రికార్డు చేసిన ఆవు శబ్దాలతో ఆహ్వానిస్తారు’ అని ఆర్మిన్ అన్నారు. ఆయన మాటల్లో నిజాయతీ ఉందని, భారత దేశంలో గోమాంసాన్ని నిషేధించడంలో నిజాయితీ లేదని ఆమె ఈ సందర్భంగా ఓ మీడియాతో వ్యాఖ్యానించారు. ప్రపంచమంతా నేరం చేస్తోంది! ‘నా దష్టిలో ఆవులను అవసాన దశలో కబేళాలకు పంపించడం నేరం కాదు. ఆ దశలో అవి బతికి ఉండడం వల్ల ఎక్కువ బాధను అనుభవించాల్సి ఉంటుంది. గోమాంసాన్ని తినడాన్ని నేరంగా పరిగణించేవారు ఆవు పాలను తాగడం కూడా నేరమే అన్న విషయాన్ని గ్రహించాలి! ప్రకృతి సిద్ధంగా ఆవు పాలనిచ్చేది వాటి సంతానం కోసం. మనుషుల కోసం కాదు. ఈ లెక్కన ప్రపంచమంతా నేరం చేస్తోంది’ అని అమె ‘హోలి కౌవ్స్ ఇండియా (జర్మనీలో)’ పుస్తకంలో వ్యాఖ్యానించారు. -
ప్రేమ వ్యవహారం.. యువతికి వినూత్న శిక్ష
లండన్ : ప్రేమించినవాడు దక్కలేదన్న అక్కసుతో ఓ బ్రిటిష్ సిక్కు యువతి మూర్ఖంగా ప్రవర్తించి జైలు పాలయింది. దాదాపు అయిదేళ్లుగా మాజీ ప్రియుడినీ, అతని కుటుంబ సభ్యులను టార్చర్ చేస్తున్న అమన్‌దీప్ ముధార్ (26).. ఆమె ఫ్రెండ్ సందీప్ డోగ్రా (30)కు ఇంగ్లండ్‌లోని సీన్డన్ క్రౌన్ కోర్టు వినూత్నమైన శిక్ష విధించింది. జాతివివక్ష, మత విశ్వాసాలు, సామాజిక సంబంధాల పట్ల అనుచితంగా వ్యవహరించినందుకు వారిద్దరికీ రెండేళ్ల సస్పెండెడ్ జైలు శిక్ష అమలు చేయాలని స్వీన్డన్ క్రౌన్ కోర్టు మంగళవారం అధికారులను ఆదేశించింది. కోర్టు తెలిపిన వివరాలు.. ముధార్, కృపాకర్ (పేరుమార్చాం) అనే హిందూ యువకుడు 2012లో ప్రేమలోపడ్డారు. అయితే, కొన్నాళ్లపాటు కలిసున్న అనంతరం మతాలు, సంప్రదాయాల విషయంలో మనస్పర్థలతో వారిద్దరు విడిపోయారు. ఇక అప్పటినుంచి యువకుడిపై పగ పెంచుకున్న ముధార్ తన మిత్రుడు సందీప్‌తో కలిసి కృపాకర్‌పై కక్ష సాధింపు మొదలు పెట్టింది. అతని కుటుంబ సభ్యులను మతం, జాతి పేరుతో దూషిస్తూ.. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెట్టింది. కృపాకర్ చెల్లెల్లను రేప్ చేయిస్తానని బెదిరింపులకు గురిచేసింది. వారి మత విశ్వాశాలు దెబ్బతినేలా ప్రవర్తించింది. కృపాకర్ కుటుంబం వెళ్లే దేవుడి సన్నిధిలో సైతం దుర్భాషలాడింది. అంతటితో ఆగక వాళ్లింట్లో పశు మాంసం పారవేసింది. ఇంకా... కృపాకర్ చెల్లెలి కొడుకుని స్కూల్లో మరో పిల్లాడితో కలిసి వేధింపులకు గురిచేసింది. రెండేళ్ల సస్పెండెడ్ జైలు శిక్ష మాత్రమే కాకుండా.. మత విశ్వాశాలపై దాడి చేసినందుకు 100 గంటల ధార్మిక సేవ, కోర్టు ఫీజుల కింద 750 పౌండ్ల జరిమానా విధించింది. కాగా, ముధార్ చిన్నతనంలో ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగానే మొండితనం, పెంకితనం వచ్చాయనీ ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తల్లి సంరక్షణలో వేధింపులకు గురికావడంతోనే అలా తయారైందని విన్నవించారు. అతని వాదనలతో ఏకీభవించని కోర్టు ఈ వినూత్న శిక్షతో ముధార్ ప్రవర్తనలో మార్పు వస్తుందని వ్యాఖ్యానించింది. మరోవైపు.. లండన్‌లోని సిక్కు కమ్యునిటీ కూడా ముధార్, సందీప్ చర్యలపై మండిపడింది. వారికి ఎటువంటి సాయం చేయబోమని ప్రకటించింది. సస్పెండెడ్ జైలు శిక్ష అనగా.. సాధారణ జైలు శిక్ష విధించే క్రమంలో ముద్దాయిలకు ఒక అవకాశంగా సస్పెండెడ్ జైలు శిక్ష విధిస్తారు. ఈ శిక్షా కాలంలో ముద్దాయి ప్రవర్తనపై నిఘా ఉంచుతారు. విపరీత మనస్తత్వం కలిగిన సమూహంలో వారిని విడిచిపెడతారు. అక్కడ వారు మళ్లీ ఎలాంటి తప్పులు చేయకుండా సత్ప్రవర్తనతో శిక్షా కాలం పూర్తి చేసుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు. అలాకాకుండా సస్పెండెడ్ జైలు శిక్ష కాలంలో కూడా నేరాలకు, చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే వాటిపై విచారణ చేసి మునుపటి జైలు శిక్ష.. తాజా శిక్షను విధించి కటకటాల వెనక్కి పంపుతారు. -
బీఫ్ తినేవారికి సాయం చేయొద్దు!
న్యూఢిల్లీ: కేరళలో గొడ్డుమాంసం (బీఫ్) తిన్న వరదబాధతులకు సాయం చేయొద్దంటూ ఆలిండియా హిందూ మహాసభ నేత స్వామి చక్రపాణి మహారాజ్ పిలుపునిచ్చారు. భవిష్యత్తులో బీఫ్ తినమని అఫిడవిట్ ఇచ్చిన వారికే సాయం చేయాలని పేర్కొన్నారు. హిందూధర్మం ప్రకారం గోమాతను చంపడం మహాపాపమన్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే ఈ స్వామి చక్రపాణి మహారాజ్‌ను ఆలిండియా అఖాడా పరిషత్ ‘ఫేక్ బాబా’ల జాబితాలో చేర్చింది. ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం కారును స్వామి చక్రపాణి వేలంలో కొని తగులబెట్టిన సంగతి తెలిసిందే. -
గొడ్డుమాంసం తినడం మానేశారు!
సన్నటి మంట మీద ఆలివ్ ఆయిల్ చుక్కలతో ఉడికించిన గొడ్డుమాంసం ముక్కల్ని.. బన్ల మధ్యలో ఉంచి, దానికి కాస్త స్పెషల్ సాస్, అమెరికన్ చీజ్, పికిల్స్, ఆనియన్స్‌ను జతచేస్తే.. హాంబర్గర్ రెడీ అయినట్లే. ఇక ప్రఖ్యాత మెక్‌డోనాల్డ్స్‌లో తయారయ్యే బిగ్ మాక్ హాంబర్గరైతే.. ఎంత వరల్డ్ ఫేమసో చెప్పుకోవాల్సిన పనిలేదు. మెక్‌డోనాల్డ్స్ ఆహార ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తం కావడాన్ని క్యాపిటలిజం వ్యాప్తిగానూ అభివర్ణించే ఆర్థికవేత్తలు కొందరు.. ఏకంగా ఆకలి సూచికి ‘బిగ్ మాక్ ఇండెక్స్’ అని పేరు కూడా పేరుపెట్టారు. ఇక అమెరికాకే చెందిన ప్రఖ్యాత క్యాపిటలిస్టు, ప్రస్తుత దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం బిగ్ మాక్ అంటే నాలుక కోసుకుంటారు. ‘‘దాన్ని అలా అలా నోట్లో పెట్టుకుని కొరికితే.. వావాహ్.. ఆ టేస్టే వేరప్ప!’’ అనేది ఒకప్పటి ట్రంప్ మాట! ఇప్పుడాయన గొడ్డుమాంసం తినడం మానేశారు! ట్రంప్ ఫిట్‌నెస్‌పై ఆందోళన : పలు అనుమానాలు, విమర్శల నేపథ్యంలో కొద్ది రోజుల కిందట ట్రంప్ చేయించుకున్న సంపూర్ణ ఆరోగ్య పరీక్షలు ప్రాధాన్యం సంతరించుకున్న సంగతి తెలిసిందే. నాటి టెస్టుల్లో ఆయన ఆరోగ్యం భేషుగ్గా ఉందని తేలింది. అయితే ఫిట్నెస్ కాస్త ఆందోళనకరంగాఉంది. 6అడుగుల 3 అంగుళాల ఎత్తు, 71 ఏళ్ల వయసున్న ట్రంప్ 239 పౌండ్ల(108.4 కేజీల) బరువున్నారు. ఒబెసిటీ(అధికబరువు) కేటగిరీకి అతి చేరువలో ఉన్న ట్రంప్ డైట్ పాటించకుంటే ప్రమాదం ఎదుర్కోకతప్పదని వైట్‌హౌస్ ఫిజీషియన్ డాక్టర్ రోనీ జాక్సన్ సూచించారు. ఆ మేరకు గడిచిన రెండు వారాలుగా ట్రంప్ గొడ్డుమాంసం తినడం పూర్తిగా మానేశారు. అప్పటి నుంచి ఫిష్ శాండ్విచ్ (ఫిష్ ఓ ఫిలెట్), ఫ్రూట్ సలాడ్స్, చాక్లెట్ మిల్క్ షేక్‌లను మాత్రమే తీసుకుంటున్నారు. విషప్రయోగ భయం! : బడా రియల్టర్ పుత్రుడిగా బిజినెస్‌లోకి ప్రవేశించిన డొనాల్డ్ ట్రంప్.. అతికొద్ది కాలంలోనే వ్యాపార సామ్రాజ్యాన్ని శిఖరస్థాయికి చేర్చారు. శత్రువుల పట్ల నిత్యం అప్రమత్తంగా ఉండే ట్రంప్.. ఆహారం విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. బయటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి ఆహారాన్ని ముట్టనుగాక ముట్టరు! ప్రతి సందర్భంలోనూ మెక్‌డోనాల్డ్స్ నుంచి తెప్పించే బిగ్ మాక్‌ను మాత్రమే ఆరగించేవారు. తన ఎన్నికల ప్రచారంలోనూ ఆయన ఇలానే వ్యవహరించారు. ‘‘నాకు శుభ్రంగా ఉండటం చాలా ఇష్టం. పనిలో భాగంగా రకరకాల చోట్లకు వెళతాం. అయితే అక్కడ తయారుచేసిన ఆహారం శుభ్రంగా వండారా, లేదాని చెప్పలేం. మెక్‌డోనల్డ్స్ సురక్షిత ప్రమాణాలు పాటిస్తుంది కాబట్టే వాళ్ల బర్గర్లు మాత్రమే తింటా’’ అని ట్రంప్ ఓ సందర్భంలో చెప్పారు. అయితే ట్రంప్ జాగ్రత్తల వెనుక ‘విషప్రయోగం’ భయం కూడా ఉందని ప్రఖ్యాత జర్నలిస్టు మిచెల్ వూల్ఫ్ అంటారు. ఇటీవలే తాను రాసిన ‘ఫైర్ అండ్ ఫ్యూరీ’ పుస్తకంలో ట్రంప్ గురించిన అనేక రహస్య విషయాలను చెప్పుకొచ్చారాయన. ‘‘ఆహారంలో విషప్రయోగం జరగొచ్చనే ఆందోళన ట్రంప్‌లో చాలా కాలంగా ఉంది. అందుకే ఆయన బయటికెళ్లినప్పుడు.. సురక్షితంగా వండిన మెక్‌డోనాల్డ్స్ పదార్థాలను మాత్రమే తినడానికి ఇష్టపడతారు. ఇది ఎప్పుడు మొదలైందో చెప్పలేనుగానీ, దశాబ్ధాలుగా ట్రంప్ ఇలానే చేస్తున్నారు’’ అని మిచెల్ వూల్ఫ్ రాశారు. -
'మళ్లీ ఆ పదాల జోలికి వెళ్లకండి.. పవర్ రాదు'
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ, ఎలాగైనా కోల్పోయిన అధికారాన్ని పొందాలని బీజేపీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకోసం ప్రచారాల్లో కూడా ఎలాంటి లోపం జరగకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. రెండు పార్టీల్లో కూడా అగ్ర నాయకుల సూచనల ఆధారంగానే పార్టీ క్షేత్ర స్థాయి శ్రేణులు ముందుకెళ్లాలని హెచ్చరిస్తున్నాయి. ఏ ఒక్క వ్యక్తితోనో, వర్గంతో పెట్టుకోకుండా అందరినీ ఆకర్షించే ప్రయత్నాల్లో తలమునకలవుతున్నాయి. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో సమావేశమైన కాంగ్రెస్ పార్టీ కర్ణాటక నేతలకు ముందుగానే ఏం చేయాలో ఏం చేయకూడదో అనే అంశాలను ప్రత్యేకంగా హెచ్చరించి మరీ చెప్పారు. ముఖ్యంగా బీఫ్, హిందూ టెర్రర్ అనే పదాల జోలికి అస్సలు వెళ్లకూడదని, వీటిని ఉపయోగించకుండానే పెద్ద నేతల నుంచి చిన్నస్థాయి నేతల వరకు ప్రచారంలో ముందుకు వెళ్లాలని హెచ్చరించారు. ఈ రెండు అంశాలే అధికారాన్ని దూరం చేసే ప్రమాదం లేకపోలేదని కూడా ఆయన హెచ్చరించారు. ఎన్నికల ప్రధాన అంశాల నుంచి దృష్టిని మరల్చేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తుందని, ట్రాప్‌లో పడేయాలను చూస్తుందని, ఎట్టి పరిస్థితుల్లో అలా అవకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించారు. ఎవరూ ఏమనుకున్నా బీఫ్, హిందూ టెర్రరిజం అనే పదాలపై ఎలాంటి ప్రకటనలు ఆవేశాలకు పోవద్దని సూచించారు. -
మూడు టన్నుల పశుమాంసం సీజ్
థానె: మహారాష్ట్రలోని పడ్ఘా పోలీసుస్టేషన్ పరిధిలో మూడు టన్నుల పశుమాంసాన్ని పోలీసులు సీజ్ చేశారు. థానె నుంచి ముంబైకి పశుమాంసం లోడుతో వస్తున్న టెంపోను బుధవారం ఆజ్రోలి చెక్‌పోస్టు వద్ద పోలీసులు నిలిపివేసి సోదా చేశారు. టెంపోలోని పాత సామాన్ల అడుగున దాచి పెట్టిన బీఫ్‌ను వెలికి తీసి స్వాధీనం చేసుకున్నారు. దానిని లాబోరేటరీకి పంపి పరీక్షించగా పశుమాంసమేనని తేలింది. ఈ ఘటనలో టెంపో డ్రైవర్, క్లీనర్లను పోలీసులు అరెస్టు చేశారు. -
రోడ్డుపై చెల్లాచెదురుగా గోమాంసం ముద్దలు
సాక్షి, హైదరాబాద్: అక్రమంగా తరలిస్తున్న గోమాంసం గుట్టు రట్టయింది. అంబర్పేట్ వద్ద కంటైనర్ బోల్లాపడి.. రోడ్డుపై గోమాంసం ముద్దలు చెల్లాచెదురుగా పడిపోయాయి. విజయవాడ నుంచి కంటైనర్‌లో అక్రమంగా ఈ గోమాంసాన్ని తరలిస్తున్నారు. ఈ ఘటన గురించి తెలియడంతో బజరంగ్ దళ్ కార్యకర్తలు అక్కడికి చేరుకొని ఆందోళన నిర్వహిస్తున్నారు. అక్రమంగా గోమాంసం తరలిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
బీఫ్‌పై కొత్త కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: నరేంద్రమోదీ ప్రభుత్వంలో టూరిజం శాఖ సహాయమంత్రిగా చేరిన మాజీ బ్యూరోక్రాట్ కేజే ఆల్ఫోన్స్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి, క్రైస్తవులకు మధ్య తాను వారధిగా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. మోదీ సర్కారు అన్ని వర్గాలను కలుపుకొని పోతుందని, కేరళ, గోవాలో బీఫ్‌ను తినడంపై తమ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం, సమస్య లేదని ఆయన స్పష్టం చేశారు. ’మోదీ సర్కారు సమ్మిళిత దృక్పథంతో ముందుకుసాగుతోంది. మీరు ఏ విశ్వాసాన్నైనా కలిగి ఉండండి. మేం మిమ్మల్ని కాపాడుతామన్న విషయాన్ని ప్రధాని స్పష్టం చేశారు. మోదీ హయాంలో ఒక్క చర్చినిగానీ, మసీదుగానీ ఘటన లేదు. మోదీ అద్భుతంగా పనిచేస్తున్నారు’ అని ఆల్ఫోన్స్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నిజాయితీ గల అధికారిగా పేరుతెచ్చుకున్న కేజే ఆల్ఫోన్స్ కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టే తరుణంలోనూ తన దృఢవైఖరిని చాటుకున్నారు. కేంద్ర పర్యాటక శాఖ పూర్వపు మంత్రి మహేశ్ శర్మ నుంచి పగ్గాలు అందుకునేందుకు దాదాపు గంటసేపు వేచిచూసిన ఆయన.. లాంఛనంగా మంత్రిత్వశాఖ బాధ్యతలు చేపట్టేవరకు ఆ చైర్లో కూర్చోవడానికి కూడా నిరాకరించారు. బీఫ్ తినడం, గో రక్షకులపై కేంద్రంలోని బీజేపీ సర్కారు భిన్నంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. చాలా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పశువధపై కఠిన ఆంక్షలు ఉన్నాయి. గోరక్షకులు కొట్టిచంపేస్తున్నా.. ప్రభుత్వాలు తీవ్రంగా చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇటీవల గోవా సీఎంగా బాధ్యతలు చేపట్టిన మనోహరి పారికర్ రాష్ట్రంలో బీఫ్ కొరత లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. పారికర్ వ్యాఖ్యలను ప్రస్తావించిన ఆల్ఫోన్స్.. రాష్ట్రాల్లో ఆహార అలవాట్లపై ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పారు. -
బీఫ్ కాదని ఎంత చెప్పినా వినిపించుకోలేదు!
నాగ్‌పూర్: నాగ్‌పూర్‌లోని భార్‌సింగీలో దారుణంలో చోటుచేసుకుంది. బీఫ్ (పశుమాంసం) తీసుకెళుతున్నాడన్న నెపంతో 40 ఏళ్ల వ్యక్తిపై నలుగురు దాడి చేశారు. ఇస్మాయిల్ షా అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై వెళుతుండుగా నలుగురు వ్యక్తులు అటకాయించి.. బీఫ్ ఎందుకు తీసుకెళుతున్నావని బెదిరించారు. తాను తీసుకెళుతున్న మాంసం బీఫ్ కాదని షా ఎంత చెప్పినా వినిపించుకోలేదు. అతనిపై దాడి చేసి కొట్టారు. ప్రహార్ సంఘటనకు చెందిన వ్యక్తులు ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. దేశంలో బీఫ్ పేరిట దాడులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. బీఫ్ తీసుకెళుతున్నాడన్న నెపంతో హర్యానాలోని స్థానిక రైలులో 16 ఏళ్ల జునైద్‌ను కొట్టి చంపిన ఘటన దేశమంతటా ప్రకంపనలు రేపింది. 'నాట్‌ఇన్‌మైనేమ్' పేరిట గోరక్షక దాడులు, బీఫ్ దాడులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చోటుచేసుకున్నాయి. -
ఇక బీఫ్‌తో వెళితే బుక్కే.. కిట్లు రెడీ
ముంబయి: మహారాష్ట్రలో బీఫ్ నియంత్రణకు పోలీసులు మరో అడుగు ముందుకేశారు. తమ రాష్ట్రంలో విజయవంతంగా బీఫ్ బ్యాన్‌ను అమలుచేసేందుకు, ఎవరైనా అక్రమంగా ఎద్దుమాంసం తరలిస్తుంటే గుర్తించి అరెస్టు చేసేందుకు టెక్నాలజీ సాయంతో ముందుకెళ్లనున్నారు. బీఫ్‌ను కనిపెట్టే ప్రత్యేక కిట్ల కోసం పోలీసులు ఆర్డర్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులే నిర్ధారించారు. దేశ వ్యాప్తంగా గోమాంసంపై పెద్ద మొత్తంలో రగడ ఏర్పడుతున్న ప్రస్తుత తరుణంలో ముంబయి పోలీసులు ఈ విషయం బయటపెట్టడం మరింత ఉద్రిక్తతను నెలకొల్పే అవకాశం ఉంది. ఎవరికి నచ్చింది వారు తింటారని, తినే ఆహారం విషయంలో ఎవరూ నియంత్రణలు పెట్టడానికి వీల్లేదంటూ దేశ వ్యాప్తంగా పలువురు సామాజిక వేత్తలు, ఇతర పార్టీల వారు బీఫ్ విషయంలో చెబుతుండగా బీజేపీ పాలిత రాష్ట్రంలో మాత్రం బీఫ్ బ్యాన్‌ను గట్టిగానే అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మహారాష్ట్రలో పోలీసులు ఇలా ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. ‘45 బీఫ్ టిడెక్షన్ కిట్లకు ఆర్డర్లు ఇచ్చాం. వీటిని మొబైల్ వ్యాన్లలో ఉంచుతాం. వాటి ద్వారా ఆయా దుఖాణాల్లో విక్రయిస్తున్న మాంసాన్నిగాని, ఎవరైనా దొంగచాటుగా తరలిస్తున్న మాంసాన్నిగానీ ఈ కిట్ల సహాయంతో టెస్ట్ చేస్తాం. అందులో బీఫ్ ప్రొటీన్స్ గుర్తించడం ద్వారా అరగంటలో అది ఎద్దుమాంసమో కాదో తేలుస్తాం’ అని పోలీసులు చెప్పారు. ఇది గర్భ నిర్ధారణ పరీక్ష కిట్ మాదిరిగానే ఉండనుందట. దీని ఆధారంగానే ఇకపై కేసులు నమోదు చేస్తామంటూ చెబుతున్నారు. -
మోదీ చెప్పినా.. ఆగని హత్యలు!
రాంచీ: ‘గోరక్షను అడ్డం పెట్టుకుని ఓ వ్యక్తిని చంపే హక్కుందా? ఇదేనా గోభక్తి? ఇదేనా గోరక్ష?’ అని గోభక్తి పేరుతో జరుగుతున్న దాడులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా స్పందించి కొన్ని గంటలు గడవక ముందే జార్ఖండ్‌లో ఆ తరహా ఘటన కలకలం రేపింది. గిరిదిహ్ జిల్లాలోని బిరియబాద్ గ్రామానికి చెందిన డెయిరీ ఓనర్ అలీముద్దీన్ అలియాస్ అస్గర్ అన్సారి దారుణ హత్యకు గురయ్యాడు. గురువారం మారుతీవ్యాన్‌ను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుండగా రామ్‌ఘర్ జిల్లాలోని బజర్తండ్ వద్ద అన్సారిపై కొంతమంది దుండగులు దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అన్సారీని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మాంసం వ్యాపారం చేసే అన్సారీని పథకం ప్రకారం హతమార్చినట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయని సీనియర్ పోలీస్ అధికారి ఆర్కే మాలిక్ వెల్లడించారు. దాడి సమయంలో అన్సారీ బీఫ్ తీసుకెళ్తున్నాడా లేదా అనే విషయం తెలియాల్సి ఉందన్నాడు. జార్ఖండ్‌లోని గిరిదర్ జిల్లాలో సోమవారం ఉస్మాన్ అన్సారీ అనే వ్యక్తిపై సైతం ఇలాంటి దాడి జరిగిన విషయం తెలిసిందే. -
'బీఫ్ తినడం మా సంస్కృతి, సంప్రదాయం'
షిల్లాంగ్: దేశ వ్యాప్తంగా బీఫ్ అమ్మకాలు, కబేళాల విషయంలో బీజేపీ తీవ్ర నిర్ణయాలతో ముందుకెళ్తుండగా మేఘాలయాలో మాత్రం సొంత పార్టీ నేతలే తిరుగుబావుట ఎగురవేస్తున్నారు. గోమాసం(బీఫ్) పై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నేత ఇటీవల బెర్నార్డ్ మారక్ పార్టీని వీడగా.. తాజాగా మరో షాకిస్తూ మరో కీలకనేత బాచు మారక్ బీజేపీకి రాజీనామా చేశారు. అంటితో ఆగకుండా.. ఈ నెల 10న బెర్నార్డ్ మారక్ ఇచ్చే బీఫ్ పార్టీలో పాల్గొని తన నిరసన తెలియజేయనున్నట్లు చెప్పారు. నార్త్ గారో హిల్స్ జిల్లా అధ్యక్ష పదవిలో బాచు మారక్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. 'మా పద్ధతులు, ఆచారాలు, సంప్రదాయాలను బీజేపీ పట్టించుకోవడం లేదు. మా మనోభావాలు దెబ్బతిన్న కారణంగా నేను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. బీఫ్ (నకమ్ బిట్చి) మా సంప్రదాయ ఆహారమని' తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా 'బీర్ అండ్ బీఫ్' పార్టీ చేసుకోవాలని పిలుపునిస్తూ ఫేస్ బుక్ లో ఇటీవల చేసిన పోస్టుపై రాష్ట్ర బీజేపీ నేతలతో పాటు పార్టీ అధిష్టానం ఆయనపై గుర్రుగా ఉంది. పార్టీ అధిష్టానం ఆయన రాజీనామా లేఖను ఇంకా ఆమోదించలేదని సమాచారం. కబేళాలను కూడా చట్టబద్ధం చేస్తామంటూ మేఘాలయ బీజేపీ నేత బెర్నార్డ్ మారక్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన అనంతరం పార్టీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. '2018లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీఫ్‌పై నిషేధం ఉండదు. సాధారణ ధరలకే అందరికీ బీఫ్ అందేలా చూడటమే తమ విధి అని.. కబేళాలకు చట్టపరమైన గుర్తింపు ఇస్తామంటూ' బాచు మారక్ బీఫ్ నిషేధానికి వ్యతిరేకంగా ప్రచారం చేపట్టడం చర్చనీయాంశమైంది. మరోవైపు కేరళ, తమిళనాడు, కర్ణాటకలో బీఫ్ నిషేధంపై ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. -
బీఫ్‌పై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
షిల్లాంగ్: దేశ వ్యాప్తంగా బీఫ్ అమ్మకాలు, కబేళాల విషయంలో బీజేపీ చాలా సీరియస్‌గా ఉండగా అదే పార్టీకి చెందిన నేత మాత్రం బీఫ్‌కు అనుకూలంగా ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే చౌక ధరలకే బీఫ్ లభించేలా ఏర్పాట్లు చేస్తామని, కబేళాలను కూడా చట్టబద్ధం చేస్తామంటూ మేఘాలయ బీజేపీ నేత బెర్నార్డ్ మారక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మేఘాలయలో చాలామంది బీజేపీ నేతలు బీఫ్ తింటారు. మేఘాలయలాంటి రాష్ట్రంలో బీఫ్ బ్యాన్ అనే ప్రశ్నే తలెత్తదు. చారిత్రక నేపథ్యం ఏమిటో ఇక్కడి రాష్ట్ర బీజేపీ నేతలకు బాగా తెలుసు. రాజ్యాంగ పరంగా మా రాష్ట్రానికి వర్తించే అంశాలపై కూడా వారికి అవగాహన ఉంది. 2018లో బీజేపీ అధికారంలోకి వస్తే బీఫ్‌ను నిషేధించదు. దానికి బదులుగా దాని రేట్ల విషయంలో క్రమబద్దీకరణ చేస్తుంది. కబేళాలకు చట్టపరమైన గుర్తింపు ఇస్తాం. బీఫ్ అనేది ఇప్పుడు మా రాష్ట్రంలో బాగా ఖరీదైన పదార్ధంగా మారింది. దాని ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైంది. అందుకే మేం రాగానే ధరలను నియంత్రిస్తాం’ అని చెప్పారు. -
బీఫ్ వివాదంలో ప్రముఖ నటి
ముంబై: తనపై వచ్చిన విమర్శలపై బాలీవుడ్ నటి కాజోల్ స్పందించారు. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె ఓ వీడియో పోస్ట్ చేయగా.. నటి కాజోల్ గోమాంసం (బీఫ్) తిని పైగా ఆ వీడియోను అప్లోడ్ చేశారంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ నటి ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. 'మీరు ఊహించింది, ప్రచారం చేసింది తప్పు. ముంబైలో నా ఫ్రెండ్ రియాన్ స్టీఫెన్ ఇచ్చిన విందుకు వెళ్లిన మాట వాస్తవమే. వీడియోలో ఉన్న డిషెష్ లో మీరు చూసింది బఫెలో మాంసం (దున్నపోతు). ఆ మాంసంపై ఎలాంటి నిషేధం లేదు. ఈ విషయం చాలా సున్నితమైన అంశం. అందుకే నేను తప్పక వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుందని తెలుసు. దీనిపై సమాధానం చెప్పకపోతే ఇతరుల మత విశ్వాసాలు దెబ్బతినే అవకాశం ఉంది. నా చేతులు నరికివేయాలంటూ ఎందరో తీవ్రంగా విరుచుకుపడ్డారు. వారికి నా జవాబిదేనని చెబుతున్నా' అని కాజోల్ తేల్చిపారేవారు. బీఫ్ వండినందుకు మీ ఫ్రెండ్ చేతులు నరికివేయాలని కూడా కామెంట్లు రావడంతో తాను పోస్ట్ చేసిన వీడియోను, ఫొటోలను కూడా డిలీజ్ చేశారు కాజోల్. ఆదివారం జరిగిన ఈ పార్టీకి మలైకా ఆరోరా, దియామిర్జా, ఇతర సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఆమె ప్రస్తుతం తమిళ మూవీ వీఐపీ-2 లో ధనుష్‌తో కలిసి నటిస్తోంది. pic.twitter.com/U4oGqvhJBi — Kajol (@KajolAtUN) 1 May 2017 -
ఆవు అక్కడ 'మమ్మీ'.. ఇక్కడ 'యమ్మీ'!
గోవధ, పశుమాంసం విక్రయాల విషయంలో బీజేపీ 'ద్వంద్వ ప్రమాణాలను' పాటిస్తున్నదని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. 'బీఫ్ విషయంలో బీజేపీ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నది. ఉత్తరప్రదేశ్‌లో ఆవును మమ్మీ (అమ్మ)గా ప్రచారం చేస్తున్న ఆ పార్టీ.. ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం 'యమ్మీ' (రుచికరమైన మాంసం)గా చూస్తున్నది' అని ఎద్దేవా చేశారు. ఒకవైపు యూపీలో కొత్త సీఎం యోగి ఆదిత్యనాథ్ గోవధ, అక్రమ మాంసం విక్రయాలపై ఉక్కుపాదం మోపుతుండగా.. మరోవైపు ఆ ప్రభావం ఈశాన్య రాష్ట్రాలపై ఉండబోదని బీజేపీ చెప్తోంది. వచ్చే ఏడాది ఈశాన్య రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ అధికారంలోకి వస్తే పశుమాంసంపై ఎలాంటి నిషేధం విధించబోమని నాగాలాండ్ బీజేపీ చీఫ్ విససోలీ లౌంగు స్పష్టం చేశారు. -
అడవి పంది, గొడ్డు మాంసం తినండి
⇒ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మురళి వివాదాస్పద వ్యాఖ్యలు ⇒ ఆరోగ్యంగా ఉండాలంటే మాంసం తినాలి ⇒ బ్రాహ్మణిజం కల్చర్ వచ్చి దానిని బంద్ చేసింది ఏటూరునాగారం: రోగనిరోధక శక్తి పెరిగి, ఆరోగ్యంగా ఉండాలంటే అడవి పంది, గొడ్డు మాంసం తినాలంటూ జయశంకర్ భూపాల పల్లి జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి వివాదా స్పద వ్యాఖ్యలు చేశారు. బ్రాహ్మణిజం కల్చర్ వచ్చి మాంసం తినొద్దంటూ బంద్ చేసిందని, అదంతా వృథా అని వ్యాఖ్యానించారు. క్షయ వ్యాధి నివారణ దినం కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం ఏటూరునాగారం మండల కేంద్రంలో నిర్వహించిన ర్యాలీ, మానవహారం కార్యక్రమంలో కలెక్టర్ మురళి మాట్లాడారు. ఆరోగ్యంగా ఉండాలంటే మాంసం తినాలని సూచించారు. ‘‘మాంసం ఖరీదు అనుకుంటే పక్కనే అడవులు ఉన్నాయి. అడవి పందులను పట్టుకుని తినండి. ఎస్సీ, ఎస్టీలు పెద్ద (గొడ్డు) మాంసం తినేవాళ్లం. మధ్యలో మనకు దరిద్రపు బ్రాహ్మణ కల్చర్ ఒకటి వచ్చి పడింది. పెద్ద మాంసం తినొద్దు, అదీ ఇదీ అని చెప్పి బంద్ చేయించారు..’’ అని వ్యాఖ్యానించారు. తాను మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో రాత్రి నిద్రలు చేసినప్పుడు అక్కడి ముసిలివాళ్లు మాంసం విషయమై ఫిర్యాదు చేశారని చెప్పారు. తాము గొడ్డు కూర తిన్నప్పుడు ఆరోగ్యం బాగుండేదని.. ఇప్పుడు తమ ఊళ్లలో తిననివ్వడం లేదని, బంద్ చేసినప్పటి నుంచి ఒంట్లో సత్తా లేకుండా పోయిందని చెప్పారని కలెక్టర్ వెల్లడించారు. ఇక ‘పిచ్చి మాలలు (దీక్షలు) వేసుకుని పంది మాంసం తినడం మానేస్తున్నారని, అది శుద్ధ దండగ అని వ్యాఖ్యానించారు. ఏం తినాలో అది తినాలన్నారు. అడవి పందులను పట్టుకోవచ్చు, వాటిని తినవచ్చని అటవీ శాఖ ప్రకటించిందని.. వాటిని చంపినా నేరం కాదని, ఎలాంటి కేసులు ఉండవని పేర్కొన్నారు. ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు ఈ విషయాన్ని విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. అయితే నెమలి, దుప్పి వంటి వన్యప్రాణులను చంపవద్దని, వాటి మాంసం తినవద్దని హెచ్చరించారు. తాను ఒకసారి చైనాకు వెళ్లినప్పుడు కుక్క మాంసం తిన్నానని తన అనుభవాన్ని వివరించారు. బ్రాహ్మణులు క్షమించాలి: కలెక్టర్ ‘‘టీబీ బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండా లంటే పౌష్టికాహారం తీసుకోవాలని.. పంది, గొడ్డు మాంసం తినాలని సూచించాను. పేద ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడుతున్న సందర్భంగా దీక్షలు మానుకోవాలని, బ్రాహ్మణిజం అనే పదాన్ని ఉచ్చరించాను. ఈ విషయంలో బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతిని ఉంటే చింతిస్తున్నాను. ఆ పదం వాడినందుకు క్షమించాలి..’’ – జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి -
బీఫ్ తిన్నారని.. శిక్షగా గ్యాంగ్ రేప్
మేవత్: బీఫ్ తిన్నందుకు శిక్షగా తమపై లైంగికదాడి చేసినట్టు నిందితులు చెప్పారని హరియాణాలోని మేవత్ గ్యాంగ్ రేప్ బాధితురాలు చెప్పింది. 'బీఫ్ తింటారా అని నిందితులు అడిగారు. మేం లేదని చెప్పాం. అయితే బీఫ్ తిన్నందుకే శిక్ష (గ్యాంగ్ రేప్) వేశామని చెప్పారు' అని ఢిల్లీలో సామాజిక కార్యకర్త షబ్నం హష్మీ సమక్షంలో ఓ బాధితురాలు చెప్పింది. కాగా ఈ కేసుతో గోసంరక్షక దళం సభ్యులకు సంబంధంలేదని సీనియర్ పోలీసు అధికారులు చెప్పారు. రెండు వారాల క్రితం వరుసకు బంధువులైన ఇద్దరు మహిళల (20, 14)పై దుండగులు వారి ఇంట్లోనే సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితుల అత్తమామలను కట్టేసి విచక్షణరహితంగా కొట్టడంతో మరణించారు. పోలీసులు అత్యాచారం కేసు మాత్రమే నమోదు చేసి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. స్థానికులు నిరసన తెలిపిన తర్వాత నిందితులపై హత్యకేసు నమోదు చేశారు. -
బిర్యానీలో గొడ్డు మాంసం
బిర్యానీ శాంపిల్స్‌లో గొడ్డుమాంసం(బీఫ్) ఉన్నట్టు తేలింది. హర్యాణాలోని మెవాత్ జిల్లాలో సేకరించిన రెస్టారెంట్స్, ఫుడ్ స్టాల్స్ బిర్యానీలో బీఫ్‌ను గుర్తించినట్టు హిసార్‌లోని లాలా లజ్‌పత్ రాయ్ యూనివర్సిటీ ఆఫ్ వెటర్నిటీ, యానిమల్ సైన్సెస్ నిర్ధారించింది. సేకరించిన ఏడు బిర్యానీ శాంపిల్స్‌లో బీఫ్ ఉన్నట్టు యూనివర్సిటీ అధికార వర్గాలు చెప్పాయి. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శక్తికాంత్ శర్మ ఈ ల్యాబోరేటరీ రిపోర్టును ప్రభుత్వానికి పంపించినట్టు వెల్లడించారు. పలు హోటళ్లలో బీఫ్ బిర్యానీ తయారుచేస్తున్నట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో హర్యాణా ప్రభుత్వం బిర్యానీ శాంపిళ్లు సేకరించి పరిశీలించాలని ఆదేశాలను జారీచేసింది. ఈ ఆదేశాల మేరకు మెహతా పోలీసులు ఫుడ్ స్టాళ్లలో ఏడు బిర్యానీ నమూనాలను సేకరించి ల్యాబ్ టెస్ట్‌కు పంపారు. సేకరించిన ఈ ఏడింటిలోనూ బీఫ్ పాజిటివ్ అని తేలినట్టు ప్రభుత్వ ఆధ్వర్యంలోని వెటర్నిటీ ల్యాబ్ తెలిపింది. ఇది తీవ్రమైన నేరంగా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ ఇలాంటి ఫిర్యాదులే వెల్లువెత్తితే ఎక్కువ శాంపిళ్లను సేకరించి పరిశీలిస్తామని మెవాత్ పశుగణాభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరేందర్ కుమార్ తెలిపారు. ఈ విషయంపై పోలీసులు తదుపరి చర్యలకు సమాయత్తమవుతున్నారు. బిర్యానీల్లో గొడ్డు మాంసాన్ని నిరోధించేందుకు టాస్క్ ఫోర్స్ సహాయంతో హోటళ్లలో బిర్యానీలను పరిశీలిస్తామని నోడల్ ఆఫీసర్ భారతీ అరోరా తెలిపారు. అయితే మైనార్టీ కమ్యూనిటీని అవమానిస్తున్నారంటూ హర్యానా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అఫ్తాబ్ అహ్మద్ విమర్శిస్తున్నారు. -
పెద్దకూరనా? కోడికూరనా? బోల్ట్ ఏం తింటాడు!
పరుగుల వీరాధివీరుడు ఉసేన్ బోల్ట్ ఏం తింటాడు? పెద్దకూర (బీఫ్) తినడం వల్లే అతడు ఫిట్‌గా ఉన్నాడా?.. అన్నది దేశంలో పెద్ద చర్చనీయాంశమైంది. ఇప్పటికే దేశంలో బీఫ్‌పై పెద్ద చర్చే నడుస్తోంది. ఈ చర్చకు మరింత ఆజ్యం పోసేలా బీజేపీ దళిత ఎంపీ ఉదిత్ రాజ్ వ్యాఖ్యలు చేశారు. ఉసేన్ బోల్ట్ బీఫ్ తింటాడని, అందుకే అతను ఒలింపిక్స్‌లో తొమ్మిది స్వర్ణాలు సాధించాడని ఆయన చెప్పుకొచ్చారు. ( బోల్టు డైట్.. జరిగిన కల్పిత ప్రచారం ఇది! ) నిజానికి బోల్ట్ బీఫ్ తింటానని ఎక్కడా చెప్పుకోలేదు. కానీ, ఒక ఫేక్ మెమె మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమైంది. తాను పేద కుటుంబం నుంచి రావడం వల్ల శక్తిమంతమైన ఆహారం తీసుకునే అవకాశం ఉండేది కాదని, అందుకే తన కోచ్ గ్లెన్ మిల్స్ సూచన ప్రకారం రోజుకు రెండుసార్లు బీఫ్ తిన్నానని, మొదట్లో పెద్దకూరపై కొంత సందేహం ఉన్నా రానురాను దాని ప్రయోజనాలను గుర్తించానని, కాబట్టి ఆరోగ్యకరమైన జీవితం కోరుకునేవారు బీఫ్ తినాలని తాను సూచిస్తానని బోల్ట్ చెప్పినట్టు ఎవరో సోషల్ మీడియాలో కల్పిత ప్రచారానికి పూనుకున్నారు. ఈ కల్పిత ప్రచారం నిజమేనని నమ్మిన బీజేపీ ఎంపీ.. బీఫ్ వల్లే బోల్ట్‌కు పతకాలు వచ్చాయని పేర్కొని నాలుక కర్చుకున్నారు. రియో ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణాలు సాధించడం ద్వారా మొత్తం 9 స్వర్ణాలు తన ఖాతాలో వేసుకొని కెరీర్‌కు వీడ్కోలు చెప్పిన ఉసేన్ బోల్ట్ తాను బీఫ్ తిన్నట్టు ఎప్పుడూ చెప్పలేదు. సాధారణ జమైకా ఆహారమైన అన్నం, దుంపలు, చేపలను మొదట్లో అధికంగా తీసుకునేవాడినని బోల్ట్ మీడియాకు తెలిపాడు. ఇప్పుడు సొంతంగా చెఫ్‌ను అపాయింట్ చేసుకోవడంతో తనకు నచ్చిన ఆహారాన్ని, హై ప్రోటీన్, కార్బోహైడ్రెట్లు ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నట్టు చెప్పాడు. 'నేను మంచి డైట్‌ను ఫాలో అవుతాను. నాకు కావాల్సిన ఆహారాన్ని అందించడానికి సొంతంగా చెఫ్ ఉన్నాడు. చికెన్, రైస్, కూరగాయలు నేను అధికంగా తీసుకుంటాను. ఇది మంచి జమైకన్ ఆహారం. ఇందులో హైడ్రెటెడ్ పోషకాలు ఉండేలా చూసుకుంటాను. విదేశాలకు వెళ్లినప్పుడు కింగ్ బర్గర్, మెక్‌డొనాల్డ్ వంటకాలు తీసుకుంటాను. కానీ నా వెంట చెఫ్ ఉండటంతో నాకు కావాల్సిన ఆహారాన్ని అతడు సమకూరుస్తాడు' అని బోల్ట్ మీడియాకు తెలిపారు. ( బోల్ట్ తీసుకునే అసలైన ఆహారం ఇదే) -
మహిళలపై దాడి వీడియో కలకలం
-
మహిళలపై దాడి వీడియో కలకలం
మందసార్: అల్పసంఖ్యాక వర్గాలపై హిందూ అతివాద శక్తుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. గుజరాత్ లోని ఉనాలో జరిగిన అవమానవీయ ఘటన ఒకపక్క దేశాన్ని కుదిపేస్తుండగానే మధ్యప్రదేశ్ లో మహిళలపై ఇలాంటి దురాగతం చోటుచేసుకుంది. మందసార్ రైల్వేస్టేషన్ లో ఇద్దరు ముస్లిం మహిళలపై హిందూ దళ్ కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు. జయొరా ప్రాంతం నుంచి గోమాంసం తీసుకువచ్చారనే ఆరోపణలతో ఇద్దరు ముస్లిం మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగానే హిందూ దళ్ కార్యకర్తలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఇద్దరు మైనారిటీ మహిళలను నోటికొచ్చినట్టు దూషించి, విచక్షణారహితంగా కొట్టారు. బాధితులు కింద పడిపోయారు. ప్రత్యక్షసాక్షి ఒకరు వీడియో తీయడంతో ఈ దురాగతం వెలుగులోకి వచ్చింది. తీరిగ్గా మేలుకున్న పోలీసులు అరగంట తర్వాత ఇద్దరు మహిళలను స్టేషన్ కు తరలించారు. వీరి నుంచి 30 కిలోల మాంసం స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. దీన్ని పరిశీలించిన స్థానిక డాక్టర్లు గొడ్డుమాంసంగా ధ్రువీకరించారు. గొడ్డుమాంసం అక్రమ రవాణా చేస్తున్నారనే అభియోగాలపై ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేశారు. బహిరంగంగా వీరిపై విచక్షణారహితంగా దాడి చేసిన మహిళలు, పురుషులపై పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేయకపోవడం గమనార్హం. -
దళిత కుటుంబంపై దాడి
చిక్కమంగళూరు: గుజరాత్ లోని ఉనా, బిహార్ లో దళితులపై దాడి మరువకముందే కర్ణాటకలోని చిక్ మంగళూరులో ఆవుమాంసం వండారని ఓ దళిత కుటుంబంపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జులై 17 న 30 మంది రైట్ వింగ్ కార్యకర్తలు బీఫ్ వండారనే కారణంతో దళిత కుటుంబంపై దాడి చేశారు. ఎస్సీ,ఎస్టీ ఆక్ట్ చట్టం ప్రకారం ఏడుగురు నిందితులపై కేసును నమోదు చేసిన పోలీసులు కేసును విచారిస్తున్నారు. -
ఆవు మూత్రం తాగించి, పేడ తినిపించారు
న్యూఢిల్లీ: గో రక్షణ సమితి సభ్యుల అకృత్యం ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బీఫ్ ను ఎగుమతి చేస్తున్నారనే ఆరోపణలతో ఇద్దరు యువకుల చేత బలవంతంగా ఆవు మూత్రం తాగించి, ఆవు పేడ తినిపించిన వైనం విమర్శలకు తావిచ్చింది. అక్రమంగా బీఫ్ ను తరలిస్తున్నారని ఆరోపిస్తూ వారిపై భౌతికంగా దాడిచేసి పంచగవ్య తినిపించారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. గో రక్షణ సమితి అధ్యక్షుడు ధర్మేంద్ర యాదవ్, అతని సహచరులు గుర్గావ్ లో ఇద్దరు యువకులు రిజ్వాన్, ముక్తియర్ లపై ఈ దారుణానికి పాల్పడ్డారు. యువకులిద్దరు 'పంచగవ్య'తో కూర్చొని ఉండడం, దాన్ని సులభంగా మింగడానికి గో రక్షణ కార్యకర్తలు నీళ్లు ఇవ్వడం.. తినమని గద్దించడం ఈ వీడియోలో చూడవచ్చు. 'గోమాత కీ జై', 'జై శ్రీ రామ్' అంటూ నినాదాలు చేశార. అయితే రిజ్వాన్, ముక్తియర్ అక్రమంగా 7 వందల కేజీ గొడ్డు మాంసాన్ని రవాణా చేస్తున్నారని ధర్మేంద్ర ఆరోపించారు. మేవాత్ నుంచి ఢిల్లీకి తరలిస్తుండగా పట్టుకున్నామని చెప్పారు. అందుకే వారికి గుణపాఠం చెప్పాలనే పంచగవ్య (ఆవు మూత్రం.. పేడ. పాలు పెరుగు, నెయ్యిల మిశ్రమం) తినిపించామని తెలిపారు. దీని ద్వారా వారిని పరిశుద్ధులను చేశామన్నారు. దీన్ని వీడియో ఎవరు తీశారో, బయటికి ఎలా వచ్చిందో తమకు తెలియదన్నారు. 3 వందల కేజీల బీఫ్ ను స్వాధీనం చేసుకున్నామని ఫరీదా పోలీస్ అధికారి తెలిపారు. గోవధ నిషేధ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపామన్నారు. అయితే బలవంతంగా పేడ, మూత్రం తినిపించిన అంశం తమ దృష్టికి రాలేదన్నారు. -
‘గోవధపై నిషేధమే.. కానీ బీఫ్ తినొచ్చు’
ముంబై: మహారాష్ట్రలో నిషేధం ఉన్నందున గోవధ తప్పని.. అదే సమయంలో బీఫ్ తినడం తప్పుకాదని శుక్రవారం ముంబై హైకోర్టు శుక్రవారం విచిత్రమైన వ్యాఖ్యలు చేసింది. బీఫ్ అమ్మకాన్ని, గోవధను సంవత్సరం క్రితం మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. అన్ని మతాలు, కులాలు కలసి ఉన్న ముంబై మహానగరంలో ‘ఆహారం’పై నిషేధం విధించడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. -
బీజేపీ హయాంలో గోవధ పెరిగింది
మీరట్: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గోవధ పెరిగిందని, గోమాంసం ఎగుమతులూ ఎక్కువయ్యాయని శంకరాచార్య స్వామి స్వరూపానంద గురువారమిక్కడ అన్నారు. గోవధపై పూర్తి స్థాయి నిషేధం తేవాలని, అందుకోసం చట్టం కూడా తీసుకురావాలంటూ మీరట్‌లో డిమాండ్ చేశారు. -
అక్కడ బీఫ్ లేదు.. వారికి బెయిల్!
జైపూర్: రాజస్థాన్‌లోని మేవాడ్ యూనివర్సిటీలో తలెత్తిన బీఫ్ వివాదం సద్దుమణుగుతోంది. యూనివర్సిటీలోని తమ హాస్టల్ గదిలో ఆవుమాంసం వండుకొని తిన్నారనే ఆరోపణలతో అరెస్టయిన నలుగురు కశ్మీరీ విద్యార్థులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ విద్యార్థులు వండుకొని తిన్న మాంసం బీఫ్ కాదని నిపుణులు నిర్ధారించడంతో చిత్తర్‌గఢ్‌లోని సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ కోర్టుకు వారికి బెయిల్ మంజూరు చేసింది. మేవాడ్ వర్సిటీ డిగ్రీ చదువుతున్న కశ్మీరీ విద్యార్థులు షకీబ్ అష్రఫ్, హిలాల్ ఫరుఖ్, మహమ్మద్ మక్బూల్, షౌకత్ అలీ తమ హాస్టల్ గదిలో బీఫ్ వండుకున్నారని వదంతులు రావడం క్యాంపస్‌లో ఉద్రిక్తతలు సృష్టించింది. ఈ వదంతులతో కొందరు విద్యార్థులు, స్థానికులు కలిసి వారిని చితకబాదారు. ఆ విద్యార్థులపై చర్య తీసుకోవాలని మరికొందరు యూనివర్సిటీ ముందు ఆందోళన నిర్వహించారు. మేవాడ్ యూనివర్సిటీకి 100శాతం శాఖాహార విశ్వవిద్యాలయంగా పేరొంది. ఈ నేపథ్యంలో 21 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సున్న ఆ నలుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే స్థానికంగా లభించే 300 గ్రాముల మాంసాన్ని తెచ్చుకొని.. వారు వండుకున్నారని పోలీసులు విచారణలో ధ్రువీకరించారు. అయితే, ఆ విద్యార్థులు తెచ్చుకున్న మాంసం బీఫ్ కాదని నిపుణులు తేల్చారు. -
పశువుల మాంసం నుంచి నూనె తీస్తున్న ఇద్దరు అరెస్ట్
పశువుల మాంసంతో నూనె తయారు చేస్తున్న కార్మాగారం పై ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. నగరంలోని బహదూర్‌పుర ఇద్గా సమీపంలో నూనె తయారు చేస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన సౌత్‌జోన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. కర్మాగారంలో పని చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌చేశారు. ముఖ్య నిందితుడైన అతీఖ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
మళ్ళీ 'బీఫ్ బిర్యానీ' గొడవ
అలీగఢ్: దేశంలో మరోసారి బీఫ్ వంటకాల వివాదం వెలుగుచూసింది. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) క్యాంటీన్లో బీఫ్ బిర్యానీ వడ్డించారంటూ సోషల్ మీడియాలో ఫొటోలు కలకలం సృష్టించాయి. ఈ విద్యాసంస్థ తన స్వభావాన్ని బయటపెట్టేందుకు మరోసారి వివాదానికి తెర తీసిందంటూ ఆరోపణలు గుప్పుమన్నాయి. శుక్రవారం ఏఎంయూ మెడికల్ కాలేజీ క్యాంటీన్లో బీఫ్ బిర్యానీ వడ్డించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. వాట్సాప్ లో పోస్ట్ చేసిన ఫొటోలు తాజా వివాదానికి కారణమయ్యాయి. క్యాంటీన్లో వండినది ఆవు మాంసమే అయినా, గేదె మాంసంగా ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతోపాటు క్యాంటీన్ మెనూ కార్డులోని ఓ ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా వ్యాపించింది. అయితే బీఫ్ బిర్యానీ వడ్డన ఆరోపణను యూనివర్సిటీ ఖండించింది. తమ క్యాంటీన్లో అటువంటిదేమీ జరగలేదని తెలిపింది. -
'బీఫ్ తిన్నారని చంపడం క్రూరమైన నేరం'
తిరువనంతపురం: బీఫ్ తిన్నారని చంపడం అసహనం కాదని, అత్యంత క్రూరమైన నేరమని ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలతో భారత్‌లో అసహనం పెరిగిపోయిందని భావించరాదన్నారు. కొందరు ఎక్కడున్నా అసహనం సృష్టిస్తారు.. చట్టం పక్కాగా అమలైతే ఆ పదానికి చోటు ఉండదని చెప్పారు. అసహనంపై పెద్దెత్తున లౌకికవాదులు నిరసన వ్యక్తం చేయడం మంచి పరిణామమేనని తస్లీమా పేర్కొన్నారు. తాను భారత్ పౌరసత్వం కోరుకుంటే మోదీ ప్రభుత్వం తటస్థంగా, లౌకికవాదంతో పనిచేస్తుందని చెబుతానని ఆమె వివరించింది. -
ఖట్టర్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు
చంఢీగఢ్: లగ్జరీ హోటళ్లలో విదేశీయులకు సరఫరా చేసేందుకు గో మాంసాన్ని అనుమతిస్తామని, అందుకు ప్రత్యేక లెసైన్స్ విధానాన్ని తీసుకొస్తామంటూ హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ మరో వివాదానికి తెర తీశారు. మానవులకు భిన్న రుచులు ఉంటాయని, ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు గోమాంసం ఎక్కువగా తినే అలవాటు ఉంటుందని, అలాంటి వారి ఇష్టాయిష్టాలను ఎందుకు కాదనాలని, మద్యాన్ని నిషేధించిన గుజరాత్లో ప్రత్యేక అనుమతికింద విదేశీయులకు మద్యాన్ని అనుమతిస్తున్నప్పుడు తమ రాష్ట్రంలో మాత్రం గోమాంసాన్ని ఎందుకు అనుమతించరాదంటూ కూడా ఖట్టర్ మీడియా ముందు వ్యాఖ్యానించారు. గోవులను పవిత్ర జంతువుగా భావించే హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ కఠినమైన గోమాంస నిషేధ చట్టాన్ని తీసుకొచ్చిన బీజేపీ ముఖ్యమంత్రి ఖట్టర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతినవా, ఇది ద్వంద్వ ప్రమాణాలను పాటించడం కాదా? అంటూ వివిధ వర్గాల ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన నాలుక కరచుకున్నారు. ఇంకా ఈ విషయంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదని, ఈ అంశాన్ని ప్రభుత్వం అన్ని కోణాల నుంచి పరిశీలించాల్సిన అవసరం ఉందని ఖట్టర్‌కు ప్రత్యేకాధికారిగా పనిచేస్తున్న జవహర్ యాదవ్ సోమవారం వివరణ ఇచ్చారు. భారత్‌లో నివసించాలంటే ముస్లింలు గోమాంసం తినడాన్ని మానుకోవాలని, తినాలనుకుంటే దేశం విడిచి వెళ్లాలంటూ ఖట్టర్ గతంలో చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపిన విషయం తెల్సిందే. ఖట్టర్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం హర్యానాలో గోమాంసాన్ని ఎవరైనా విక్రయించినా, దాన్ని కొనుగోలు చేసినా, ఆహారంగా స్వీకరించినా లక్ష రూపాయల జరిమానా లేదా పదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. కబేళాకు గోవులను తరలించిన వారికి 30 నుంచి 70 వేల వరకు జరిమానా లేదా మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. -
గుండు కొట్టించి, గాడిదపై ఊరేగించారు
లక్నో: బలవంతంగా మతమార్పిడికి పాల్పడ్డాడనే ఆరోపణలతో ఓ వ్యక్తిని దారుణంగా అవమానించిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఒరాయ్ జిల్లాలో ప్రకంపనలు రేపింది. జలౌన్ జిల్లాకు చెందిన ఆద్వేష్ అనే వ్యక్తికి గుండు గీసి, చెప్పుల దండ మెడలో వేసి పట్టపగలు, నడి వీధుల్లో ఊరేగించారు. వివరాల్లోకి వెళితే ముగ్గురు హిందువులను క్రైస్తవ మతం లోకి మార్చి, వారితో బీఫ్ తినిపించారనే ఆరోపణలతో భజరంగ్ దళ్ కార్యకర్తలు రెచ్చిపోయారు. క్రిస్టియన్ మతంలోకి కన్వర్ట్ చేసి వారిని సత్సంగ్ కు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశాడంటూ వీరంగం సృష్టించారు. దాదాపు 200 మంది కార్యకర్తలు జలౌన్ జిల్లాలోని ఆద్వేష్ సవిత ఇంటిపై దాడి చేశారు. అతడిని బలవంతంగా బయటికి లాక్కొచ్చి, గుండు కొట్టించారు. కనుబొమ్మలు, మీసాన్ని సైతం తీసివేయించారు. అనంతరం గాడిదపై ఊరేగిస్తూ ఒరాయ్ జిల్లాకు తీసుకొచ్చారు. మరోవైపు బాధితుల ఫిర్యాదు మేరకు ఈ సంఘటపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. అయితే ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని సమాచారం. -
'మేం ఓడితే బీఫ్ మర్చిపోవాల్సిందే'
-
'మేం ఓడితే బీఫ్ మర్చిపోవాల్సిందే'
హైదరాబాద్: ఇటీవల కాలంలో సర్దుమణిగిన బీఫ్ వివాదం మరోసారి రాజుకునే అవకాశం ఏర్పడింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఈ అంశానికి మరోసారి తెరలేపినట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ 'మీకో విషయం చెప్తున్నాను.. ఈ ఎన్నికల్లో ఎంఐఎం ఓడిపోతే.. మైనార్టీ వర్గ ప్రజానీకమంతా బీఫ్ తినడం మర్చిపోవాల్సిందే' అని అన్నారు. అలా జరగకుండా ఉండాలంటే తమకు ఓటేసి గెలిపించాలని అన్నారు. ఇదే సమయంలో బీజేపీ సర్కార్ ను ఆయన టార్గెట్ చేశారు. మహారాష్ట్రలో పేద ముస్లింలను, దళితులను టార్గెట్ చేసి బీఫ్ నిషేధించిందని ఆరోపించారు. 'వారు మహారాష్ట్రలో బీఫ్ నిషేధించి ఉండొచ్చు. కానీ ప్రధాని నరేంద్రమోదీ అధికార బాధ్యతలు చేపట్టి నుంచి భారత్ నుంచి విదేశాలకు బీఫ్ మాంసం ఎగుమతి అమాంతం పెరిగింది, నాకు తెలిసిన సమాచారం మేరకు 17 శాతానికి బీఫ్ ఎగుమతి పెరిగింది. దీనిపై మోదీ ఏం చేస్తారు' అని ఆయన ప్రశ్నించారు. మోదీ సాధారణంగా ఎక్కడ మాట్లాడినా మిత్రో(స్నేహితులు) అనే పదాన్ని ఉపయోగిస్తారని, అయితే, ఆపదం ఎక్కడైనా పనిచేయోచ్చేమోగానీ, హైదరాబాద్‌లో మాత్రం బడా (బీఫ్) ఒక్కటే పనిచేస్తుందని గత వారంలో నిర్వహించిన ర్యాలీలో అన్న విషయం తెలిసిందే. -
తెరపైకొచ్చిన మరో బీఫ్ వివాదం
భోపాల్: 'బీఫ్' వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లో ఓ ముస్లింజంటపై గో రక్షణ సమతి సభ్యులు దాడికి దిగడం ఆందోళన రేపింది. బ్యాగులో బీఫ్ ఉందని ఆరోపిస్తూ రైల్లో ప్రయాణిస్తున్న ముస్లిం దంపతులపై సమితి కార్యకర్తలు దాడి చేసి ఘోరంగా అవమానించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ భోపాల్‌లోని హర్డా జిల్లాలో ఖిర్కియా రైల్వే స్టేషన్లో ఈనెల 13న ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం మహమ్మద్ హుస్సేన్ (43), అతని భార్య నసీమ్ బానో (38) కుషినగర్ ఎక్స్‌ప్రెస్ లో తమ సొంత గ్రామం హర్దాకి బయలుదేరారు. ఇంతలో కొంతమంది కార్యకర్తలు రైల్లోకి చొరబడి ఈ దంపతుల బ్యాగులను తనిఖీ చేయడం మొదలు పెట్టారు. దీన్నిఅడ్డుకున్న నజీమాను నెట్టేశారు. ఆవుమాంసం వున్న బ్యాగ్ ఏదంటూ గలాటా సృష్టించారు. అక్రమంగా గోమాంసం తీసుకెడుతున్నావంటూ ఆరోపించారు. ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నించిన తోటి ప్రయాణికులు కూడా అడ్డుకున్నారు. దీంతో వారు మరింత రెచ్చిపోయి ఆ దంపతులను చావ బాదారు. వారి బ్యాగులను విసిరి పారేశారు. చివరికి రైల్వే పోలీస్ ను కూడా తోసేసి బీభత్సం సృష్టించారు. ఒక నల్లబ్యాగును దొరకబుచ్చుకుని అందులో గో మాంసం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటు హుస్సేన్ కూడా తమ బంధువులకు సమాచారం అందించాడు. రెండు వర్గాల మధ్య ఘర్షణతో ఖిర్కియా రేల్వే స్టేషన్ లో పరిస్థతి ఉద్రిక్తంగా మారింది. సుమారు పదిహేనుమంది ప్లాట్ ఫాం దగ్గరకు చేరుకోని సమితి సభ్యులను ప్రశ్నించడంతో ఘర్షణ వాతారణం నెలకొంది. దీంతో రంగంలోకి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని పరీక్షల నిమిత్తం బ్యాగును ల్యాబ్ కు పంపారు. అయితే సదరు బ్యాగులో గో మాంసం లేదని పరీక్షల్లో తేలిందని పోలీసు అధికారి తెలిపారు. ముస్లిం జంట ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాజపుత్, సంతోష్ ను పోలీసులు అరెస్టు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసామని, మరో అయిదుగురి కోసం గాలిస్తున్నామన్నారు. మరోవైపు గుర్తు తెలియని బ్యాగ్ యజమానులపై కూడా కేసులు నమోదు చేశారు. తన భార్యను విచక్షణా రహితంగా కొట్టుకుంటూ తోసేసారని, అడ్డుకున్న తనపై దాడిచేశారని మొహమ్మద్ వాపోయాడు. తమ పట్ల అమానుషంగా ప్రవర్తించారన్నాడు. వారు చెపుతున్న బ్యాగు తమది కాదని హుస్సేన వాదిస్తున్నాడు. కాగా బీఫ్ తింటున్నాడనే ఆరోపణలతో ఓ ముస్లింవ్యక్తిని కొట్టి చంపిన 'దాద్రి' ఉదంతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. -
అది ఆవు మాంసం కాదు మేకమాంసమే!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాద్రి ఘటనపై విచారణలో సరికొత్త విషయాలు వెలుగుచూశాయి. మహమ్మద్ అఖ్లాక్ ఇంట్లోని ఫ్రిడ్జ్‌లో ఉన్నది మేకమాంసమే కానీ ఆవు మాంసం కాదని పశువైద్యాధికారుల నివేదికలో తేలింది. ఆవుమాంసం కలిగి ఉన్నాడని ఆరోపణలపై మహమ్మద్ అఖ్లాక్ నివాసంపై ఓ వర్గానికి చెందిన మూక దాడి చేసి.. ఆయనను కొట్టిచంపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఆయన కుమారుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని దాద్రి సెప్టెంబర్ 29న జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. కుటుంబసభ్యులు తమ ఇంట్లో ఆవుమాంసం లేదని, తాము గోమాంసాన్ని భుజించలేనది చెప్తున్నా వినకుండా కోపోద్రిక్త మూకలు అఖ్లాక్ను, ఆయన కొడుకును ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చి దాడి చేశారు. అఖ్లాక్ కుటుంబం ఓ ఆవుదూడను కోసేసి.. దాని ఆహారాన్ని తిన్నారంటూ స్థానికంగా ఉన్న ఓ ఆలయంలోని మైకుల్లో వెలువడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటికే దాదాపు 12మందిపై పోలీసులు కేసులు నమోదుచేశారు. కేసులు నమోదైన వారిలో స్థానిక బీజేపీ నేత కొడుకు కూడా ఉన్నాడు. అఖ్లాక్ నివాసంలో దొరికింది మేకమాంసమే కానీ ఆవుమాంసం కాదని యూపీ పశువైద్యశాఖ తన నివేదికలో స్పష్టంచేసింది. ఇందుకు సంబంధించిన ఫొరెన్సిక్ నివేదిక రావాల్సి ఉంది. -
విద్యార్ధులు కలిసి పోరాడాలి: ఆర్.కృష్ణయ్య
-
ఓయూలో బీఫ్ ఫేస్టివల్ టెన్షన్
-
'వాళ్లందరూ బీఫ్ తిన్నవాళ్లే'
హాలియా (నల్లగొండ): పశుమాంసం తినడంలో తప్పులేదని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కంచ ఐలయ్య అభిప్రాయపడ్డారు. ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. మంగళవారం నల్లగొండ జిల్లా హాలియాలో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల సాధన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు పశు పరిశ్రమ ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ ప్రాంతంలో పశుపరిశ్రమ అభివృద్ధికి ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు బీఫ్‌ఫెస్టివల్ ఏర్పాటు చేశారని తెలిపారు. దీనిని ఒక పండుగలా కాకుండా ఉద్యమంలా నిర్వహించాలని సూచించారు. ప్రపంచంలోని గొప్ప మేధావులు, శాస్త్రవేత్తలందరూ బీఫ్ తిన్నవారేనన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ అన్ని రకాల ఆహార పదార్థాలు తినేవారని ఈ సందర్భంగా కంచ ఐలయ్య గుర్తు చేశారు. -
గోవులను రక్షించాల్సిన బాధ్యత మనది
-
'బీఫ్, ఫోర్క్ ఇంట్లోనో, షాదీఖానాలోనో తినండి'
హైదరాబాద్: బీఫ్, ఫోర్క్ ఏమైనా తినండి కానీ, ఇంట్లోనో, షాదీఖానాలోనో తినండని తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. యూనివర్సిటీలో విద్యార్థులు ఉన్నది చదువుకునేందుకని తెలిపారు. యూనివర్సిటీలో రాజకీయాలు చేయడం సరికాదని ఆయన అన్నారు. మరో వైపు ఓయూ క్యాంపస్‌లో బీఫ్ ఫెస్టివల్, గోపూజలకు అనుమతి లేదని ఉస్మానియా యూనివర్శిటీ అధికారులు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఈనెల 10వ తేదీన 'బీఫ్ ఫెస్టివల్' తల పెట్టిన విషయం తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెస్టివల్‌ను నిర్వహిస్తామని కొన్ని వర్గాలు చెబుతుండగా... ఎలాగైనా అడ్డుకుని తీరుతామని మరో వర్గంవారు స్పష్టం చేస్తున్నారు. ఇందుకుగాను ఎవరికివారు మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. -
ఓయూలో ‘బీఫ్ ఫెస్టివల్’ రగడ
ఎలాగైనా చేపడతామంటున్న డీసీఎఫ్ అడ్డుకుని తీరుతామంటున్న హిందూత్వ సంస్థలు సాక్షి, హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో ఈనెల 10వ తేదీన నిర్వహించ తలపెట్టిన ‘బీఫ్ ఫెస్టివల్’ వేడి పుట్టిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెస్టివల్‌ను నిర్వహిస్తామని కొన్ని వర్గాలు చెబుతుండగా... ఎలాగైనా అడ్డుకుని తీరుతామని మరో వర్గంవారు స్పష్టం చేస్తున్నారు. ఇందుకుగాను ఎవరికివారు మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. అగ్రనేతలకు ఆహ్వానం.. దేశవ్యాప్తంగా మతోన్మాదం పేరుతో దళితులు, మైనారిటీలు, మహిళలపై దాడులు చేస్తున్నారని ప్రజాస్వామ్య సాంస్కృతిక వేదిక (డీసీఎఫ్) ఆరోపిస్తోంది. దళిత బహుజనులు తినే ‘పెద్ద కూర’పై ఆంక్షలు విధించడం సరికాదని పేర్కొంటూ, అందుకు నిరసనగా ఈనెల 10వ తేదీన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఓయూలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహణకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఈ నెల 5న వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు వామపక్ష విద్యార్థి సంఘాలతోపాటు ఎంఐఎం కూడా మద్దతు ఇస్తోంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఫెస్టివల్‌ను నిర్వహించి తీరుతామని, ఇప్పటికే ఫెస్టివల్‌పై విద్యార్థులతో చర్చించామని, మంగళవారం ఓయూ కవి సమ్మేళనం కూడా నిర్వహించాం. ఏడో తేదీన 5కే రన్ నిర్వహించనున్నట్లు డీసీఎఫ్ నేత దర్శన్ తెలిపారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతోపాటు కేర ళకు చెందిన పలువురు రాజకీయ నేతలతోపాటు రాష్ట్రంలోని వివిధ పార్టీల నేతలను కార్యక్రమానికి ఆహ్వానించామన్నారు. నవలా రచయిత అరుంధతి రాయ్ కూడా ఇందుకు హాజరుకానున్నట్లు సమాచారం. అడ్డుకుని తీరుతాం... ఇదిలా ఉండగా బీఫ్ ఫెస్టివల్‌ను ఎలాగైనా అడ్డుకుంటామని హిందూత్వ సంస్థల నేతలు, పలు విద్యార్థి సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. ఫెస్టివల్‌ను వ్యతిరేకిస్తూ పలు చోట్ల ఆందోళనలు సైతం నిర్వహించారు. ఓయూలో ఫెస్టివల్ నిర్వహణకు అనుమతి ఇవ్వొందంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, హిందూ జన జాగృతి సమితి ఆధ్వర్యంలో సోమవారం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, ఓయూ ఇన్‌ఛార్జి వీసీ రాజీవ్ ఆర్ ఆచార్యకు వినతి పత్రం అందజేశారు. అంతేగాక ఫెస్టివల్ జరిగే రోజున ‘చలో ఓయూ’కి ఎమ్మెల్యే పిలుపు నిచ్చారు. అయితే ఓయూలో ఫెస్టివల్ నిర్వహణకు ఇంతవరకు ఇన్చార్జి వీసీ, రిజిస్ట్రార్ సురేష్ కుమార్ అనుమతి లభించలేదు. ఈ విషయమై ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఈ అంశంపై వివరణ కోసం రిజిస్ట్రార్‌ని ‘సాక్షి’ పలుమార్లు ఫోన్ చేసినా.. ఆయన నుంచి స్పందన కరువైంది. -
గోవులను వధించకుండా కొత్త చట్టం
నార్నల్(హర్యానా): త్వరలో గోవు సంరక్షణ చట్టం రాబోతుందని, అది వచ్చిన తర్వాత ఎవరైనా గోవధకు పాల్పడినా, వాటిని అమ్మినా, తిన్నట్లు తెలిసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ అన్నారు. గో సంరక్షణ చట్టం చేసేందుకు బిల్లును రూపొందించామని, దానికి సంబంధించి ఈ నెల 19న నోటిఫికేషన్ కూడా ఇచ్చామని రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత దానిని ప్రవేశపెడతామని చెప్పారు. ఈ చట్టం అమలుచేసిన తర్వాత ఎవరైనా తప్పిదాలకు పాల్పడితే మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే బిల్లు 90 మందిచే అసెంబ్లీలో ఆమోదం పొందిందని, ఆ బిల్లును ఆమోదించినవారిలో ముస్లింలు కూడా ఉన్నారని ఆయన చెప్పారు. ఈ బిల్లు తీసుకురావడంలో ముస్లింలు కూడా ఎంతో సహకరించారని, బిల్లు రూపొందించే దశ నుంచి చట్ట సభలోకి తీసుకెళ్లే వరకు ఏ రకమైన సహాయమైనా తాము అందించేందుకు సిద్ధమని వారు చెప్పారని వివరించారు. ఇక నుంచి హర్యానాలో గోవధ మాత్ర ఉండదని చెప్పారు. -
మాజీ చీఫ్ జస్టిస్ వివాదాస్పద వ్యాఖ్యలు
గోమాంసం వివాదంతో దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు చల్లారక ముందే ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజిందర్ సచార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మధురలో 'వరల్డ్ సెక్యురిటీ అండ్ రాడికల్ ఇస్లాం' అనే అంశంపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సచార్ మాట్లాడుతూ.. ఇండియాలో గోమాంసం వ్యాపారం చేసే వారిలో ముస్లింల కంటే ఎక్కువగా హిందువులే ఉన్నారు, బీఫ్ వ్యాపారం చేసే వారిలో 95 శాతం మంది హిందువులే అని వ్యాఖ్యానించారు. ఆహారపు అలవాట్లకు, మతానికి ఎటువంటి సంబంధం లేదు. ఆ మాటకొస్తే నేను కూడా బీఫ్ తింటాను అని అన్నారు. ఇండియాతో పాటు కెనడా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌కు చెందిన పరిశోధక విద్యార్థులు పాల్గొన్న ఈ సదస్సులో సచార్ వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తమయ్యాయి. కొందరు విద్యార్థులు సచార్ ఉపన్యాసాన్ని ఆపాల్సిందిగా కోరాగా మరికొందరు హాల్ లోని లైట్లు, ఫ్యాన్లను ఆపేసి తమ నిరసన తెలిపారు. ముస్లిం రాడికల్ విధానాలపై జరుగుతున్న సదస్సును యాంటీ హిందూ సదస్సుగా మార్చాడంటూ సచార్పై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బీఫ్‌పై సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు
హరిద్వార్: గొడ్డుమాంసం, గోవధ చేసేవారిపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోవధ చేసేవారికి భారత్‌లో నివసించే హక్కులేదని హరీష్ రావత్ వ్యాఖ్యానించారు. 'గోవులను ఏ మతానికి చెందినవారు చంపినా సరే.. వాళ్లు భారత్‌కు అతిపెద్ద శత్రువు. అలాంటి వ్యక్తులకు దేశంలో నివసించే హక్కులేదు' అని ఓ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సీఎం అన్నారు. గోవులను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. గోవధ చేసేవారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. దేశంలో అసహనం పెరిగిపోతోందని నిరసన తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలో మార్చ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకే చెందిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదిలావుండగా, బీజేపీ పాలిత హరియాణ ముఖ్యమంత్రి ఎమ్ ఎల్ ఖట్టర్ ఇటీవల బీఫ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ముస్లింలు బీఫ్ తినడం మానేయాలని వ్యాఖ్యానించారు. -
బీఫ్ తిని వారికి బుద్ధి చెబుతా
బెంగళూరు : దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న 'బీఫ్' వివాదంలోకి తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా చేరారు. ఇప్పటివరకూ తాను గో మాంసాన్ని తినలేదని, అయితే బీజేపీ నాయకుల చర్యలను చూసి తాను ఇకనుంచి గోమాంసం తినాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో గురువారం సిద్దరామయ్య విలేకర్లతో మాట్లాడుతూ బీజేపీ నాయకులు గోమాంసం తినకూడదని ఒత్తిడి తేవడం సరికాదన్నారు. బీఫ్ తిన్నవారిపై దాడులకు పాల్పడుతూ బీజేపీ నాయకులు అనాగరికంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఫ్ తింటే తప్పేంటి అని సిద్ధరామయ్య సూటిగా ప్రశ్నించారు. ఏ ఆహారం తీసుకోవాలన్నది వారి వారి వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, అందుకు గోమాంసం అతీతం కాదన్నారు. ప్రశ్నించడానికి బీజేపీ నేతలు ఎవరని ఆయన అన్నారు. బీజేపీ ఈ విషయాన్ని అనవసర రాద్దాంతం చేస్తోందని సిద్దరామయ్య ధ్వజమెత్తారు. ఆ పార్టీ నాయకుల చర్యలను గమనిస్తే బీఫ్ తిని వారికి బుద్ధి చెప్పాలనుకుంటున్నాని ఆయన అన్నారు. బీజేపీ నాయకుల చర్యలతో దేశంలో అభద్రతా భావం పెరుగుతోందన్నారు. ఇకనైనా కేంద్రం దేశ అభివృద్ధిపై దృష్టి పెడితే మంచిదని సిద్ధరామయ్య హితవు పలికారు. -
'ఆప్ చెత్త రాజకీయాలకు పాల్పడుతోంది'
ఢిల్లీ: ఢిల్లీలోని 'కేరళ భవన్' బీఫ్ వివాదంలో ఆప్ తీరును వీహెచ్‌పీ తీవ్రంగా తప్పుపట్టింది. ఈ ఘటనలో ఆప్ వ్యవహరించిన తీరు దేశంలోని సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేదిలా ఉందని వీహెచ్‌పీ విమర్శించింది. బుధవారం వీహెచ్‌పీ జెనరల్ సెక్రటరీ సురేంద్ర జైన్ మాట్లాడుతూ ఆప్ తీరుపై మండి పడ్డారు. లౌకిక పరమైన రాజకీయాలను ఆప్ మతపరమైన వాటిగా మారుస్తుందన్నారు. ఈ తరహా రాజకీయ విధానాల ద్వారా ఆప్ దేశంలోని సామరస్య పరిస్థితులను దెబ్బతీయలేదన్నారు. ఢిల్లీ పోలీసులు కేరళ భవన్‌లోకి ప్రవేశించడాన్ని ఆప్ రాజకీయం చేయడం సరికాదన్న వీహెచ్‌పీ.. కేరళ భవన్ ఫారెన్ ఎంబసీ కాదని గుర్తు చేసింది. దేశంలోని ఏ ప్రభుత్వ కార్యాలయమైనా చట్టాలను గౌరవించాల్సిందేనని, కేరళ భవన్ ఇందుకు అతీతం కాదనీ వీహెచ్‌పీ తెలిపింది. ఢిల్లీలోని కేరళ భవన్‌లోని మెనూలో బీఫ్ వాడుతున్నారని ఓ వ్యక్తి ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడికి వెళ్లడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఢిల్లీలో పోలీసు అధికారాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాని డిమాండ్ చేస్తున్న ఆప్ ఈ వ్యవహారంలో ఢిల్లీ పోలీసుల తీరును తీవ్రంగా తప్పుపట్టింది. -
నోటి మాటతోనే..చంపేస్తారు
-
కశ్మీర్ ఎమ్మెల్యేపై సిరా దాడి
ఢిల్లీలో విలేకర్ల సమావేశంలో అబ్దుల్ రషీద్‌పై దుశ్చర్య ♦ గోమాతను అవమానిస్తే సహించబోమన్న దుండగులు ♦ అసెంబ్లీలో ఇదివరకే బీజేపీ ఎమ్మెల్యేల చేతిలో దాడికి గురైన రషీద్ న్యూఢిల్లీ: బీఫ్ విందు ఇచ్చి జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ఇటీవల బీజేపీ ఎమ్మెల్యేల చేతిలో దాడికి గురైన ఆ రాష్ట్ర స్వతంత్ర ఎమ్మెల్యే షేక్ అబ్దుల్ రషీద్‌పై సోమవారం దేశ రాజధానిలో సిరా దాడి జరిగింది. ఉధంపూర్ లో ట్రక్కు డ్రైవర్లపై జరిగిన దాడిని ఖండిస్తూ ప్రెస్‌క్లబ్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసిన రషీద్‌పై హిందూ అతివాదులుగా భావిస్తున్న దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. సమావేశం ముగిశాక గేటు వద్ద టీవీ జర్నలిస్టులతో మాట్లాడుతున్న ఆయనను దుండగులు తోసేసి, ముఖానికి నల్లరంగు, సిరా, ఇంజిన్ ఆయిల్ పులిమారు. ‘గోమాతను అవమానిస్తే హిందుస్తాన్ సహించదు’ అని నినాదాలు చేశారు. రషీద్‌ను దాడి నుంచి కాపాడబోయిన కొంతమంది జర్నలిస్టులు, పోలీసుల ముఖాలపైనా సిరా, ఆయిల్ పడ్డాయి. దాడికి సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అదనపు బలగాలు వచ్చేవరకు ఎమ్మెల్యేను ప్రెస్‌క్లబ్‌లో ఉంచి, తర్వాత బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఉధంపూర్‌లో దాడి బాధితుల బంధువు అషఫ్ప్రైనా సిరా మరకలు పడ్డాయి. తర్వాత రషీద్, ఆయన అనుచరులు తమను రేస్కోస్ రోడ్డులోని ప్రధానమంత్రి నివాసానికి వెళ్లేందుకు అనుమతించాలని చాణక్యపురిలోని జమ్మూకశ్మీర్ హౌస్ ముందు ధర్నాచేశారు. ‘దాడి చేసినవాళ్లు మానసిక రోగులు. కశ్మీరీల గొంతును ఎలా నొక్కుతున్నారో ప్రపంచానికి చెప్పాలకున్నా’ అని రషీద్ అన్నారు. అంతకు ముందు ప్రెస్ క్లబ్లో విలేకర్లతో మాట్లాడుతూ.. తన బీఫ్ విందుపై వివరణ ఇచ్చారు. తాను బీఫ్, మటన్, చికెన్ తిననని, అయితే మతవిషయాల్లో అధికారులు జోక్యం చేసుకోవద్దని చెప్పడానికి ఆ విందు ఇచ్చానన్నారు. ఉధంపూర్ ఘటనపై ప్రధాని క్షమాపణ చెప్పాలన్నారు. దాద్రీ ఘటనకు యూపీ ప్రభుత్వానికి బాధ్యత అయితే, ఉధంపూర్ ఘటనకు బీజేపీ, పీడీపీలది బాధ్యత అని అన్నారు. ఈ నెల 9న కశ్మీర్‌లోని ఉధంపూర్‌లో ఓ ట్రక్కుపై దుండగులు పెట్రోల్ బాంబు విసరడంతో అందులోని ఇద్దరు డ్రైవర్లు గాయపడ్డారు. వారిలో జహీద్(19) అనే యువకుడు ఢిల్లీ సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం చనిపోయాడు. రషీద్పైదాడిని పలు పార్టీలు తీవ్రంగా ఖండించాయి. భిన్నాభిప్రాయాలను గౌరవించాలని, దేశంలో అసహనం, హింస పెరుగుతున్నాయని కశ్మీర్ సీఎం ముఫ్తీ మొహమ్మద్ సయీద్, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తదితరులు పేర్కొన్నారు. కశ్మీర్లో బంద్.. జహీద్ అంత్యక్రియలను అనంత్‌నాగ్ జిల్లాలోని అతని స్వగ్రామం బతెంగూలో పూర్తి చేశారు. అంతిమయాత్రలో పాక్ జెండాలు ప్రదర్శించారు. జహీద్ మృతికి నిరసనగా వేర్పాటువాదులు కశ్మీర్ లోయలో బంద్ నిర్వహించారు. పలుచోట్ల నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.ఉధంపూర్ దాడిని ఖండిస్తూ రాష్ట్ర కేబినెట్ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. మృతుని కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంది. -
గోహంతకుల్ని చంపాలని వేదాలు చెప్పాయి
దాద్రిపై ఆరెస్సెస్ పత్రిక ‘పాంచజన్య’లో వ్యాఖ్యలు న్యూఢిల్లీ: ‘బీఫ్’పై చర్చకు ఆరెస్సెస్ పత్రిక ‘పాంచజన్య’ ఆజ్యం పోసింది. గోవధకు పాల్పడేవారిని చంపాలని వేదాల్లో ఉన్నదని వ్యాఖ్యానించింది. ‘హిందూ సమాజంలో గోవధ అనేది చాలా పెద్ద విషయం. హిందువుల్లో అనేకమందికి ఇది జీవన్మరణ సమస్య’ అని తన తాజా కవర్‌స్టోరీలో పేర్కొంది. దాద్రిలో ఇఖ్లాక్ అనే వ్యక్తి హత్య కారణం లేకుండా జరిగిందేమీ కాదని, వేదాల్లో సైతం గోవధకు పాల్పడిన వారిని చంపాలని నిర్దేశించినట్టు వ్యాఖ్యలు చేసింది. దాద్రి ఉదంతానికి నిరసనగా రచయితలు తమ అవార్డులను తిరిగివ్వడాన్ని తప్పుపట్టింది. దాద్రి గ్రామంలో గతంలో మతపరమైన ఉద్రిక్తతలు లేవని, అటువంటి గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన(ఇఖ్లాక్ హత్య) కారణం లేకుండా జరిగేందేమీ కాదన్న విషయాన్ని గమనించాలంది. ఇఖ్లాక్తోసహా ప్రస్తుతం భారత్‌లోని ముస్లిలు అందరూ కొన్ని తరాలకిందట హిందువులేనన్న ఆరెస్సెస్ వాదనను వ్యాసం పునరుద్ఘాటించింది. గోవధకు పాల్పడేవారిని శిక్షించే అనేకమంది ధైర్యశాలుల మాదిరిగానే ఇఖ్లాక్ పూర్వీకులు కూడా గోవుల రక్షకులేనని పేర్కొంది. వీరు గోసంరక్షకుల నుంచి గోవధకు పాల్పడేవారుగా మారడానికి మతమార్పిడులే కారణమంది. అయితే ఈ వ్యాఖ్యలు అవి రచయిత వ్యక్తిగతమైన అభిప్రాయాల సంపాదకుడు హితేశ్ శంకర్ అన్నారు. పాంచజన్యను నిషేధించాలి: అసదుద్దీన్ బిహార్‌లో ఉన్న ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పాంచజన్య వ్యాఖ్యలను ఖండించారు. పాంచజన్యను నిషేధించాలని, పత్రిక యజమాని, ప్రచురణకర్తలపై కేసులు నమోదు చేయాలని అన్నారు. హిందుత్వ సిద్ధాంతకర్త సావర్కర్ గోవును పవిత్రంగా భావించలేదని, ఆయన అభిప్రాయాలను కొందరు తమ అవసరాలకు అనుకూలంగా మార్చుకున్నారని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. ‘ఆవుతో ఉపయోగం తీరాక చంపి తినవచ్చు’ అని సావర్కర్ అన్నారని, దీన్ని ఆయన అనుచరులు ఆహ్వానించలేదని పేర్కొన్నారు. -
అనవసర వివాదాలొద్దు
దాద్రీ, బీఫ్ వ్యాఖ్యలపై పార్టీ నేతలకు అమిత్‌షా మందలింపు న్యూఢిల్లీ: దాద్రిలో వ్యక్తిని కొట్టి చంపటం, బీఫ్ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పలువురు పార్టీ నేతలను బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఆదివారం తన కార్యాలయానికి పిలిపించుకుని మందలించారు. ఆయా నేతల చర్యలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో హరియాణా ముఖ్యమంత్రి మనోహర్లాల్ఖట్టర్, కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి సంజీవ్ బల్యన్, ఉన్నావో ఎంపీ సాక్షి మహరాజ్, ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే సంగీత్ సోమ్లను అమిత్‌షా మందలించారని బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఉపాధి సృష్టి, పేదరికం తగ్గింపు, అభివృద్ధి వంటి మోదీ ప్రభుత్వం చేపట్టిన సానుకూల ఎజెండాను పట్టాలు తప్పించే ప్రమాదమున్న ఇటువంటి వ్యాఖ్యలు చేయరాదని షా వారిని హెచ్చరించారని పేర్కొన్నారు. అలాగే.. సంస్కృతి, పర్యాటక శాఖ మంత్రి మహేశ్‌శర్మకు కూడా ఫోన్ ద్వారా అసంతృప్తి తెలియజేయటం జరిగిందన్నారు. పార్టీ నాయకులు అనవసరమైన వివాదాన్ని సృష్టించే ప్రకటనలు చేయరాదన్న సందేశాన్ని పార్టీ శ్రేణులన్నిటికీ పంపించనున్నట్లు చెప్పారు. గత నెలలో బీఫ్ తిన్నాడన్న వదంతులతో దాద్రిలో ఒక ముస్లిం వ్యక్తిని కొట్టి చంపటం దేశానికి సిగ్గుచేటని.. ఆ తర్వాత వస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు ఎన్డీఏ, బీజేపీ, మోదీకి ఇతరులకన్నా ఎక్కువ చేటు చేస్తాయని.. బీజేపీ మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ శనివారం అభివర్ణించిన నేపథ్యంలో బీజేపీ నాయకత్వం తన పార్టీ నేతలను మందలించటం గమనార్హం. అయితే.. అమిత్‌షా మందలింపు వ్యవహారం అంతా ఒక గిమ్మిక్కని ప్రతిపక్ష కాంగ్రెస్ కొట్టివేసింది. మరో ఇద్దరు రచయితల అవార్డులు వెనక్కి న్యూఢిల్లీ: దాద్రీ, మత అసహనంపై రచయితల నిరసన సాగుతూనే ఉంది. హిందీ రచయిత కాశీనాథ్, ఉర్దూ రచయిత మునవ్వర్ రాణాలు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను వెనక్కి ఇస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. 150 దేశాల రచయితల మద్దతు వాషింగ్టన్: అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్న భారత రచయితలకు, కళాకారులకు 150 దేశాలకు చెందిన రచయితలు సంఘీభావం తెలిపారు. వారి హక్కులు, భావప్రకటన స్వేచ్ఛ రక్షణకు వెంటనే చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. ప్రపంచవ్యాప్తంగా సాహిత్య ప్రచారం, భావ స్వేచ్ఛ కోసం పోరాడుతున్న పెన్ ఇంటర్నేషల్ సంస్థ చీఫ్ జాన్ రాల్స్టన్ సాల్ శనివారం ఈమేరకు భారత రాష్ట్రపతి, ప్రధాని, సాహిత్య అకాడమీలకు లేఖ రాశారు. కల్బుర్గి, దభోల్కర్, పన్సారేల హంతకులను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. కెనడాలోని క్యూబెక్ సిటీలో భేటీ అయిన 150 దేశాల రచయితలు కల్బుర్గి హత్య, తర్వాతి పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని, ప్రతి ఒక్కరి హక్కుల రక్షణకు చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరాలని తనను అడిగినట్లు వెల్లడించారు. -
దేశంలో ఉండాలంటే బీఫ్ మానాలి
ముస్లింలపై హరియాణా సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు చండీగఢ్: హరియాణా ముఖ్యమంత్రి, బీజేపీ నేత మనోహర్‌లాల్ ఖట్టర్ ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ముస్లింలు నివసించాలనుకుంటే వారు గోమాంసం (బీఫ్) తినడం ఆపేయాలని ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ‘‘ముస్లింలు ఈ దేశంలో ఉండొచ్చు. కానీ అందుకోసం వారు గోమాంసం తినడాన్ని త్యజించాలి. ఎందుకంటే...ఇక్కడ(భారత్‌లో) గోవు మతవిశ్వాసానికి సంబంధించిన విషయం’ వ్యాఖ్యానించారు. గురువారం ఇచ్చిన ఇంటర్వ్యూ ను పత్రిక శుక్రవారం ప్రచురించింది. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్యానికి ఇదో దుర్దినమని కాంగ్రెస్ విమర్శించిందది. అయితే ఆ వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం లేదని ఆ పార్టీ నేత వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు. కాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, పత్రిక వక్రీకరించిందని ఖట్టర్ ఆరోపించారు. ఎవరి మనోభావాలైనా దెబ్బతినుంటే విచారం వ్యక్తం చేసానన్నారు. సీఎం సలహాదారూ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ముస్లింలు గోమాంసం వాడొద్దని మేవత్ జిల్లాలో గోశాలలు నడుపుతున్న ముస్లింలు కొందరు సీఎం గోశాలల సందర్శనలో అన్నారని, వారి వ్యాఖ్యలనే ఖట్టర్ ప్రస్తావించారన్నారు. -
'ముస్లింలను పాకిస్థాన్ పొమ్మనలేదు'
'ముస్లింలు ఈ దేశంలో ఉండాలంటే ఆవు మాంసం తినడం మానుకోవాల్సిందే. ఆవు ఇక్కడ విశ్వాసానికి ప్రతీక' అంటూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వెనుకకు తగ్గారు. ముస్లింల మనోభావాలు కించపరిచే వ్యాఖ్యలు తాను చేయలేదని, తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించారని పేర్కొన్నారు. అయినా, తన వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలైన గాయపడితే.. చింతిస్తున్నానని అన్నారు. ముస్లింలు భారత్‌లో ఉండొద్దని, వారు పాకిస్థాన్‌కు వెళ్లిపోవాలని తాను వ్యాఖ్యలు చేసినట్టు ప్రతిపక్షాలు దుష్ర్పచారం చేస్తున్నాయని, ఆ వ్యాఖ్యలు తాను చేయలేదని వివరణ ఇచ్చారు. ముస్లింలు భారత్‌లో ఉండాలంటే బీఫ్ తినొద్దంటూ ఖట్టర్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఆయన వ్యాఖ్యలకు సొంత పార్టీ బీజేపీ కూడా దూరం జరిగింది. బీఫ్ విషయమై దాద్రిలో ముస్లిం వ్యక్తి హత్య నేపథ్యంలో ఈ విషయమై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు కమలం అధినాయకత్వాన్ని తీవ్ర ఇరకాటంలో పడేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందిస్తూ ఖట్టర్ అభిప్రాయాలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆహార అలవాట్లు ప్రజల వ్యక్తిగతమని, దీనిని మతానికి ముడిపెట్టి చూడటం సరికాదని పేర్కొన్నారు. ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని నేతలు వ్యాఖ్యలు చేయాలని పేర్కొన్నారు. -
ప్రభుత్వాన్నైనా త్యాగం చేస్తాం
దాద్రీ బాధ్యులపై కఠిన చర్యలు: ములాయం ఓ పార్టీకి చెందిన ముగ్గురుఈ కుట్ర చేశారు ముజఫర్‌నగర్ అల్లర్లకూ వారే కారణం మతతత్వ శక్తుల ఆటలు సాగనీయబోమని వ్యాఖ్య లక్నో: గోమాంసం తిన్నారనే ఆరోపణతో మహమ్మద్ ఇఖ్లాక్ అనే వ్యక్తిని హత్యచేసిన ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. అవసరమైతే యూపీలో తమ ప్రభుత్వాన్ని సైతం త్యాగం చేస్తామని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయంసింగ్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం లక్నోలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘దాద్రీ ఘటన ముందస్తు ప్రణాళిక ప్రకారం చేసిన కుట్ర. బాధ్యుల పేర్లు త్వరలోనే బయటకు వస్తాయి. నాకున్న సమాచారం మేరకు ఒక పార్టీకి చెందిన ముగ్గురు వ్యక్తులు ఈ దారుణ హత్య వెనుక ఉన్నారు. పార్టీ బృందాన్ని దాద్రీకి పంపుతాం. అప్పుడు ఆ ముగ్గురు ఎవరనేది వెల్లడవుతుంది. బాధ్యులను గుర్తించగానే కఠిన చర్యలు చేపడతాం. ప్రభుత్వం నుంచి ఏ త్యాగమైనా చేస్తాం. అవసరమైతే మా ప్రభుత్వాన్నే త్యాగంచేస్తాం.’ అని ములాయం పేర్కొన్నారు. కాగా బిషదా గ్రామంలో ఐదు తరాలుగా నివసిస్తున్నామని, అక్కడి నుంచి తాము శాశ్వతంగా వలస వెళ్లిపోయే ఆలోచనేమీ లేదని ఇఖ్లాక్ సోదరుడు జమీల్ చెప్పారు. ఇక దాద్రీ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో పుకార్లను వ్యాపింపజేస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. -
బీఫ్ తరలిస్తున్న వాహనానికి నిప్పు
ముంబై : మహారాష్ట్రలో బీఫ్ నిషేధం వివాదం రోజురోజుకు ఉధృత రూపం దాలుస్తోంది. బీఫ్ ను తరలిస్తున్న వ్యాన్ కు నిప్పు పెట్టిన సంఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. అహ్మద్‌నగర్ నుంచి ఔరంగాబాద్‌కు బీఫ్‌ను తరలిస్తుండగా సావ్ఖేడా గ్రామం వద్ద కొంత మంది వ్యాన్‌ను ఆపి డ్రైవర్‌తో గొడవకు దిగారు. ఆ తర్వాత వాహనానికి నిప్పుపెట్టారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వ్యాన్‌లో బీఫ్ తరలిస్తున్న విషయాన్ని నిర్ధారించారు. సుమారు వంద కేజీల మాంసాన్ని తరలిస్తున్నట్టుగా ఔరంగాబాద్ ఎస్పీ నవీన్ చంద్ర రెడ్డి తెలిపారు. అయితే వ్యాన్ పాక్షికంగా తగులబడిన ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదన్నారు. ఇటూ బీఫ్ రవాణాపై నిషేధం ఉన్న నేపథ్యంలో అక్రమంగా బీఫ్‌ను తరలిస్తున్న డ్రైవర్‌పై, నిప్పు పెట్టిన ఆందోళనకారులపై కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. -
బిహార్ ఎన్నికల వేళ ‘బీఫ్’ వివాదం!
పశుమాంసం చుట్టూ దేశ రాజకీయాలు దేశంలో ఒక్కసారిగా ‘బీఫ్’ రాజకీయాలు ఊపందుకున్నాయి. గోసంరక్షణ వర్సెస్ గోమాంస భక్షణపై చర్చ మొదలైంది. బీఫ్నిర్వచనం, పశుమాంసం పరిధిలోకి ఏయే జంతువుల మాంసం వస్తుంది? అనే అంశాలూ చర్చకొచ్చాయి. బిహార్ ఎన్నికల్లోనూ అభివృద్ధి, అవినీతి పక్కకెళ్లి.. ప్రచార తెరపైకి ‘ఆవు’ వచ్చి చేరింది. ఈ అంశం ఇంత అకస్మాత్తుగా ప్రాధాన్యం సంతరించుకోవడం వెనుక అసలు కారణం కూడా బిహార్ ఎన్నికలేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మత ప్రాతిపదికన ఓట్లను చీల్చేందుకే ‘బీఫ్’ను తెరపైకి తెచ్చారని వారంటున్నారు. మరోవైపు, గోమాంసం తిన్నాడన్న ఆరోపణలపై గతవారం ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీలో ఓ వ్యక్తి హత్యకు గురవడం అక్కడ ఉద్రిక్తతలకు, దేశవ్యాప్త చర్చకు దారితీసింది. గోమాంసాన్ని నిషేధిస్తూ కశ్మీర్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సోమవారం సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా గోమాంస గొడవపై విశ్లేషణ.. - సెంట్రల్ డెస్క్ ఎగుమతుల్లో మొదటి స్థానం.. భారతదేశంలో గోమాంసం సహా పశుమాంస భక్షణ అనాదిగా చర్చనీయాంశమే. హిందువులు గోహత్య మహాపాతకంగా భావిస్తారు. గోవధ నిషేధానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాల్లోని ఆర్టికల్ 48లో పొందుపర్చారు. ఒకవైపు పవిత్ర గోమాతగా పూజలందుకుంటూనే, మరోవైపు, పెద్దఎత్తున దేశీయంగా, ఎగుమతులపరంగా గోమాంసం వినియోగమవుతోంది. దేశంలో సగటున 36.43 లక్షల టన్నుల పశుమాంసం ఉత్పత్తి అవుతుండగా, అందులో 19.63 లక్షల టన్నులు దేశీయంగా, 16.80 లక్షల టన్నులు ఎగుమతుల పరంగా వినియోగమవుతున్నాయి. పశుమాంస ఉత్పత్తిలో భారత్ బ్రెజిల్ తరువాత రెండో స్థానంలో ఉంది. దేశీయ వినియోగంలో ఏడవ స్థానంలో, ఎగుమతుల్లో 24 లక్షల టన్నుల ఎగుమతుల్తో(2014-15 ఆర్థిక సంవత్సరంలో) ప్రథమ స్థానంలో నిలుస్తోంది. అత్యధిక రాష్ట్రాల్లో గోవధ నిషేధం.. 2015 మార్చిలో బీజేపీ పాలిత మహారాష్ట్ర, హరియాణాలు బీఫ్ అమ్మకాలు నిషేధించడంతో వివాదం మొదలైంది. ఆ నిషేధాన్ని ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టల్ని మార్చారు. ఆ సమయంలో మహారాష్ట్ర పశుసంరక్షణ(సవరణ) బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఈ బిల్లును 1996లోనే శివసేన, బీజేపీ ప్రభుత్వ హయాంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. దీని ప్రకారం రాష్ట్రంలో దూడలు, ఎద్దులను చంపడమూ నిషేధమే. గోవధను మహారాష్ట్ర 1976లోనే నిషేధించింది. యూపీ, తమిళనాడు, రాజస్తాన్, పంజాబ్, ఒడిశా, పుదుచ్చేరి, మధ్యప్రదేశ్, కర్ణాటక, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, గుజరాత్, ఢిల్లీ, బిహార్ లలో గోవధ నిషేధ చట్టాలున్నాయి. అయితే వాటి అమలు ఆ రాష్ట్రాల రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటోంది. రాజస్తాన్, పంజాబ్, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో అన్ని రకాల పశువుల వధను నిషేధించే కఠిన చట్టాలున్నాయి. ఆవులు, ఆవుదూడలు, లేగదూడలు మినహా వ్యవసాయ, ఇతర అవసరాలకు ఉపయోగపడని, ‘వధకు అర్హమైనవి’ అన్న సర్టిఫికెట్ ఉన్న పశువులను వధించడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అనుమతి ఉంది. పశ్చిమబెంగాల్, కేరళ, మణిపూర్, నాగాలాండ్, మిజోరం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌ల్లో పశువధపై నిషేధం లేదు. విశేషమేమిటంటే.. బీఫ్ అమ్మకాన్ని, వినియోగాన్ని నిషేధించే జాతీయ చట్టమేమీ లేదు. రాష్ట్రాల్లో అమల్లో ఉన్న చట్టాల్లోనూ పశుమాంసం ఆహారంగా వాడడంపై నిషేధమూ లేదు. దేశ జనాభాలో గణనీయంగా ఉన్న ఎస్సీ, ఎస్టీలు పశుమాంసాన్ని ఆహారంగా తీసుకుంటారు. సాధారణంగా బీఫ్ వాడకం, వ్యాపారంలోనూ ముస్లింలది ప్రధాన పాత్ర. ఈ నేపథ్యంలోనే బీఫ్ బ్యాన్ మతం రంగు పులుముకుంటోంది. పశుమాంసానికి సంబంధించి ఇటీవల వివాదాస్పదమైన కొన్ని ఘటనలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే జరగడం ఈ వాదనకు బలాన్నిస్తోంది. పశువధ వల్ల వ్యవసాయం దెబ్బతింటుందన్న వాదనను కొందరు కొట్టేస్తున్నారు. వ్యవసాయంలో ప్రగతి సాధించిన బెంగాల్లో పశువధపై కఠిన నిషేధం లేదంటున్నారు. ఇటీవలి వివాదాస్పద ఘటనలు.. ►జైనుల పండగ వల్ల సెప్టెంబర్ 17, 18, 27 తేదీల్లో మాంసం, చేపల అమ్మకాలను నిషేధిస్తూ రాజస్తాన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ►జమ్మూకశ్మీర్‌లో బీఫ్ అమ్మకాలను నిషేధిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ►సెప్టెంబర్ 10 నుంచి 17 వరకు, వారం రోజుల పాటు ఆవు, గేదె, ఎద్దు, మేక.. తదితర జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వధించడాన్ని ముంబై పోలీసులు నిషేధించారు. అధికారిక వధశాల్లలో వాటిని చంపడాన్ని నిషేధించలేదు. ముంబై పోలీసుల నిర్ణయంపై బీజేపీ మిత్రపక్షం శివసేన, ప్రతిపక్షం ఎమ్ఎన్ఎస్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసి, నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. మతఘర్షణలపై కఠినంగా ఉండండి: కేంద్రం న్యూఢిల్లీ: మతసామరస్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించే వారిపట్ల, మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి లాభపడాలని చూసేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. దాద్రీ ఘటనతో పాటు దేశంలో పలుచోట్ల మతపరమైన ఘర్షణలు చోటుచేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు హోంశాఖ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. గెలిస్తే గోవధపై నిషేధం: బీజేపీ పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే గెలిస్తే రాష్ట్రంలో గోవధపై నిషేధం విధిస్తామని బీజేపీ సీనియర్ నేత సుశీల్‌కుమార్ మోదీ చెప్పారు. 14 ఏళ్లలోపు వయసున్న గోవులను వధించకూడదని ఇప్పటికే బిహార్‌లో చట్టం అమలులో ఉందని, గత ప్రభుత్వాలు దీన్ని సమర్థంగా అమలు చేయలేదని పేర్కొన్నారు. బిహార్ ఎన్నికలు గొడ్డుమాంసం తినడంలో తప్పులేదనే వారికీ, గోవధపై నిషేధం ఉండాలని కోరుకునే వారికీ మధ్య పోరాటంగా మారాయన్నారు. మోదీ ఓ ధృతరాష్ట్రుడు: లాలూ హాజీపూర్: యూపీలో జరిగిన దాద్రీ ఘటనపై ప్రధాని మౌనాన్ని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా ఆక్షేపించారు. మోదీని ధృతరాష్ట్రుడితో పోల్చారు. ‘హస్తినలో కూర్చొన్న ఈ కలియుగ ధృతరాష్ట్రుడు అంధుడే కాదు మూగ, చెవిటి కూడా. పైకే గంభీర ఉపన్యాసాలు. లోపల పిరికివాడు. మాట్లాడాల్సిన అవసరం ఉన్నపుడు మౌనాన్ని ఆశ్రయిస్తాడు. సమాజాన్ని అల్లకల్లోలం చేయడానికి ధుర్యోధనులకు బాహటంగా అనుమతిచ్చేశారు’ అని సోమవారం ఓ సభలో అన్నారు. -
ఉన్మాదానికి పరాకాష్ట
కళ్లెదుట ఉన్న మనిషిని కడతేర్చడానికి ఎన్ని కారణాలుంటాయి? కక్ష కావొచ్చు... డబ్బు కావొచ్చు...కులం, మతం, ప్రాంతీయత వంటివి కావొచ్చు. హత్యలకు ఇలాంటి కారణాలెన్నో నిత్యం మీడియాలో కనబడుతుంటాయి. కానీ తినే తిండి కారణంగా ఒకరి ఇంటిపై దాడిచేసి, ధ్వంసం చేసి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడం ఊహకందనిది. కానీ విద్వేషం అధికారమై ఊరేగుతున్నప్పుడు, వదంతులే దాని ఊపిరైనప్పుడు ఏదైనా సంభవించవచ్చు. మంగళవారం రాత్రి దేశ రాజధాని నగరానికి కేవలం 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిసారా అనే పల్లెటూళ్లో ఒక పేద కుటుంబంపై వందమందికిపైగా జనం రాళ్లు, కట్టెలు చేతబూని 52 ఏళ్ల మహమ్మద్ అఖ్లాఖ్ అనే వ్యక్తిని బయటకు ఈడ్చుకొచ్చి కొట్టి చంపేశారు. అడ్డొచ్చిన అతని 20 ఏళ్ల కొడుకు డానిష్‌ను తీవ్రంగా గాయపరిచారు. ఆ యువకుడు చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ కుటుంబం గోమాంసం (బీఫ్) తింటున్నదని ఒక గుడి పూజారి చెప్పిన మాటలు విని ఉన్మాదులు రెచ్చిపోయారని పోలీసులు అంటున్నారు. ఊళ్లో పెత్తనం చలాయించే ఠాకూర్లే ఇదంతా చేయించారని మరికొన్ని కథనాలు చెబుతున్నాయి. తానూ, తన కుమార్తె కాళ్లావేళ్లాపడినా ఆ ఉన్మాదులు కనికరించలేదని...పైగా అసభ్యంగా ప్రవర్తించారని, నోటికొచ్చినట్టు దూషించారని...ఇంట్లోని సమస్తమూ ధ్వంసం చేసి పోయారని, బంగారు నగలు అపహరించారని అఖ్లాఖ్ భార్య చెబుతున్నది. ఇరుగు పొరుగు ఇళ్లకు వెళ్లి ఈ దురంతాన్ని ఆపించమని వేడుకున్నా తనది అరణ్యరోదనే అయిందని ఆమె విలపిస్తున్నది. అఖ్లాఖ్ పెద్ద కుమారుడు సర్తాజ్ చెన్నైలోని వైమానిక దళంలో మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్న డానిష్ ప్రస్తుతం ఎన్టీపీసీలో వెల్డర్‌గా పనిచేస్తూ సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. కుమార్తె సజిదా నోయిడా యూనివర్సిటీలో చదువుకుంటున్నది. అఖ్లాఖ్ అంటే విచక్షణా జ్ఞానమని అర్థం. పేరుకు తగినట్టే అఖ్లాఖ్కు ఆ జ్ఞానం పుష్కలంగా ఉంది. కనుకనే తాను పెద్దగా చదువుకోక పోయినా, కమ్మరి పని చేస్తున్నా పిల్లల్ని ఎంతో బాధ్యతగా పెంచి ప్రయోజకుల్ని చేయగలిగాడు. ఎప్పుడూ ప్రశాంతంగా, సఖ్యతతో ఉండే తమ ఊరు ఎందుకో ఈమధ్య విద్వేషంతో రగులుతున్నదని అక్కడివారు అంటున్నారు. ముఖ్యంగా రెండేళ్లక్రితం ముజఫర్‌నగర్‌లో హిందూ, ముస్లిం ఘర్షణలు తలెత్తాక ఆ ఊరు తీరు మారిందట. కొన్ని ముస్లిం కుటుంబాలు భయంతో ఆ ఊరొదిలి వెళ్లిపోయాయట. అఖ్లాఖ్ ఇంత ఘోరాన్ని ఊహించి ఉండడు. తమ బతుకేదో తాము బతుకుతున్న తమపై ఎవరు దాడి చేస్తారన్న ధీమా కావొచ్చు. కానీ విద్వేషం ఊరకే ఉండదు. అది సంబంధం లేనివారిని కబళించడానికి కూడా వెనకాడదు. దీన్ని ఆలస్యంగా గ్రహించిన అఖ్లాఖ్ కుటుంబం ఆ ఊరు విడిచి వెళ్లడానికి సిద్ధపడుతోంది. ఉన్మాదంతో ఊగిపోయిన గుంపు సరే...యూపీ పోలీసులకు కూడా ఇంగిత జ్ఞానం కొరవడింది. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు హంతకులెవరో ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నించడంకంటే అఖ్లాఖ్ ఇంట్లో ఉన్న మాంసం ఎలాంటిదో తెలుసుకోవడానికి ఆసక్తి చూపారు. దాన్ని ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు! బీజేపీ అధికారంలో ఉన్న ఒకటి రెండు రాష్ట్రాల్లో మినహా ఎక్కడా బీఫ్ నిషిద్ధ పదార్థం కాదు. దాన్ని తెచ్చుకోవడం, తినడం నేరం కాదు. యూపీలోని గో పరిరక్షణ చట్టం ప్రకారం గోవధకు పాల్పడితే ఏడేళ్ల శిక్ష ఉంటుంది. ఒకవేళ అఖ్లాఖ్ కుటుంబం ఆ నేరానికి పాల్పడిందనుకున్నా అరెస్టు చేయాల్సిందీ...కేసు పెట్టాల్సిందీ ప్రభుత్వ యంత్రాంగమే తప్ప ఉన్మాదులు కాదు. అలాంటపుడు పోలీసులు ఆ మాంసాన్ని ఫోరెన్సిక్ పరీక్షకు పంపడంలోని ఔచిత్యమేమిటి? ఇది బాధితుల్నే నేరస్తులుగా అనుమానించడం కాదా? ముజఫర్‌నగర్ మత ఘర్షణల్లో ఇప్పటికే తమ చేతగానితనాన్ని చాటుకున్న యూపీ పోలీసుల నిర్వాకంలో ఇది మరో అధ్యాయం. ఇంత ఘోరం జరిగాక పరీక్షలో ఆ మాంసం మటనేనని నిర్ధారణ అయింది. తమ ఇంట్లో ఉన్నది మటన్ అని తేలితే మా నాన్నను తిరిగి తెచ్చిస్తారా అని సజిదా అడుగుతున్న ప్రశ్నకు ఇప్పుడు జవాబిచ్చేవారు లేరు. గత కొంతకాలంగా దేశంలో ఏర్పడిన పరిస్థితుల పర్యవసానంగానే బిసారా ఉదంతం జరిగింది. ముస్లింల విషయంలో విద్వేషపూరిత ప్రకటనలు పరాకాష్టకు చేరుకున్న దశలో స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని వాటిని ఆపవలసి వచ్చింది. వీటికి తోడు ఆహారపుటలవాట్లపై లేనిపోని చర్చ రేకెత్తించడంతోపాటు జైనుల పండగ సందర్భంగా మాంసం అమ్మకాలను నిషేధిస్తూ మహారాష్ట్ర, రాజస్థాన్, ఛత్తీస్గఢ్వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉత్తర్వులు జారీచేశాయి. ఈమధ్యే కేంద్ర సాంస్కృతిక మంత్రి మహేష్ శర్మ రాబోయే నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా తొమ్మిది రోజులపాటు మాంసం అమ్మకాలు నిలిపేయాలని సూచించారు. ఈ ఘోర దురంతం చోటు చేసుకున్న బిసారా గ్రామం ఆయన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనిదే. ఈ ఉదంతాన్ని చర్య-ప్రతిచర్యగా చూడాలి తప్ప దీని వెనక ఏదో పథకం ఉన్నదనుకోవడం సరికాదని ఆయన చెబుతున్నారు. భిన్న మతాలు, సంస్కృతులు, భాషల సమ్మేళనంగా ఉన్న మన దేశంలో వేర్వేరు ఆహారపుటలవాట్లున్నాయి. దేశ జనాభాలో దాదాపు 80 శాతంగా ఉన్న దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, క్రిస్టియన్లు, కొన్ని వెనకబడిన కులాలవారూ బీఫ్ తింటారు. పైగా ప్రపంచంలో గొడ్డు మాంసాన్ని అమెరికాకు ఎగుమతి చేసే దేశాల్లో మన దేశానిదే ప్రథమ స్థానం. ఆ తర్వాత బ్రెజిల్, ఆస్ట్రేలియాలుంటాయి. ప్రపంచంలో బీఫ్ ఎగుమతుల్లో మన దేశం వాటా 23.5 శాతం. ఇది నిరుటితో పోలిస్తే 3 శాతం అధికం. అత్యధికులు భుజించే...భారీయెత్తున వ్యాపారం జరిగే గొడ్డు మాంసంపై అనవసర చర్చ లేవనెత్తడం, దాన్ని తినరాదంటూ సుద్దులు చెప్పడం...నిషేధించడానికి పూనుకోవడం కపటత్వం అనిపించుకుంటుందని మన రాజకీయ నాయకులకు తోచకపోవడం విచిత్రం. పై స్థాయి నేతల్లో ఉండే ఈ తరహా ఆచరణ కిందికొచ్చేసరికి ఉన్మాద బృందాలను తయారుచేస్తోంది. జంతు ప్రేమ మంచిదే కావొచ్చు... వాటిని పూజించడంవల్ల పుణ్యం వస్తుందని అనుకోవచ్చు. కానీ తోటి పౌరుల్ని మనుషులుగా గుర్తించలేనివారూ, గౌరవించలేని వారూ సమాజానికి చీడపురుగులవుతారని తెలుసుకోవాలి. -
మరో రాష్ట్రంలో గోమాంసం నిషేధం!
శ్రీనగర్: రాష్ట్రంలో గోమాంసం అమ్మకాలను నిషేధించాలని జమ్మూకాశ్మీర్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా తమ తీర్పును పకడ్బందీగా అమలుచేసేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హామీ పూర్వకమైన వివరణ కూడా కోర్టుకు సమర్పించాలని సూచించింది. ఇప్పటికే జైనుల పవిత్ర కార్యక్రమం పర్యుషాన్ సందర్భంగా ముంబయిలో మాంసం నిషేధిస్తూ బీజేపీ తీసుకున్న నిర్ణయంపట్ల పలువర్గాల నుంచి అసంతృప్తి వస్తున్న నేపథ్యంలో హైకోర్టు ఈ తీర్పు వెలువరించడం మరింత చర్చనీయాంశమైంది. తమ రాష్ట్రంలో బీఫ్ మాంసం నిషేధించాలని, దాని వినియోగాన్ని నిలువరించాలని కొందరు వ్యక్తులు హైకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో ఆ మేరకు కోర్టు తీర్పునిచ్చింది. అయితే, జమ్మూకాశ్మీర్‌లో ఈ మాంసం ఉపయోగించేవారి సంఖ్య చాలా ఎక్కువ. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా పూర్తిగా మాంసం విక్రయాలను నిలువరించడం పూర్తిగా నిషేధించడం ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరమైన విషయమే. హైకోర్టు ఇచ్చిన మరుసటి రోజు కూడా అక్కడ బీఫ్ మాంసం దుకాణాలు తీసి ఉంచారు. హర్యానా, మహారాష్ట్ర రాష్ట్రాలు గోమాంసం విక్రయాలపై నిషేధించారు. -
గొడ్డుమాంసం రగడ.. పెడధోరణులు
గోవధ నిషేధం, గొడ్డుమాంసం నిషేధం, బీఫ్ బచావో వంటి విషయాల మీద చర్చ పాతదే. చిర కాలంగా తేలకుండా ఉండిపోయిన మహారాష్ట్ర జంతు సంరక్షణ బిల్లుకు ఈ మార్చి 2న రాష్ట్రపతి ఆమోదం తెలియచేయడంతో మరోమారు ఈ అంశం చర్చకొచ్చింది. మహారాష్ట్రలో ఇప్పుడు గొడ్డుమాం సం నిషిద్ధం. అయోధ్యలో రామాలయ నిర్మాణంతో పాటు, గోవధను నిషేధించాలని 2003లోనే బీజేపీ ప్రకటించింది. మరోవైపు హైదరాబాద్‌లో బీసీ కవులు, రచయితలు మే 24, 2015న సమావేశమై ‘బీఫ్ బచావో’ పేరుతో ఆందోళన చేపట్టినట్లు వార్త వచ్చింది. గత జనవరిలో జరిగిన హనుమకొండ విరసం సభల్లో బీఫ్ పలావ్ వడ్డించినట్లు, దాన్ని తిం టున్న వరవరరావు ఫొటో పత్రికలలో వచ్చింది. బీఫ్‌ను నిషేధించాలన్న వాదనకు బీజేపీ, హిందుత్వవాదులు‘పవిత్రత’ ఒక్కటే కారణంగా చూపు తున్నారు. తినేవారు చాలా కారణాలు చెబుతు న్నారు. అందులో కొన్ని - ఆది మానవుడు మాంసా హారిగా ఉండకపోతే పరిణామక్రమం ఆగిపోయుం డేది. గోమాంసం తినటం కారణంగా పాశ్చాత్యులు మేధాశక్తిలో ముందున్నారు. ఇది దళితులపైన, వారి ఆహారపు అలవాట్లపైన మనువాదుల దాడి. గొడ్డు మాంసం తింటున్న కారణంగా దళితుల్ని అస్పృశ్యు లుగా చూస్తున్నారు. గొడ్డు మాంసంలో చాలా పోష కాలున్నాయి. ఈ ఆహారానికి కూడా నెయ్యి, పాలు, పెరుగు, పప్పులతో సమాన గౌరవం ఇవ్వాలి. ఉస్మానియా బీఫ్ ఫెస్టివల్ సందర్భంలో మరి న్ని విపరీత ధోరణులు వ్యక్తమయ్యాయి. నలమాల కృష్ణ ఒక వ్యాసంలో ఇది కోస్తాంధ్ర దోపిడీ వర్గం తెలంగాణ ప్రజల ఆహారంపై చూపిస్తున్న వివక్ష అని పేర్కొనగా, శాకాహార సంస్కృతి బ్రాహ్మలది - మాంసాహార సంస్కృతి బహుజనులది అని డా॥గాలి వినోద్ అన్నాడు. దళితులు మాంసాహారులు, బ్రాహ్మణులు శాకాహారులు అని చెప్పటం ఎంత అసత్యమో! ఎంత అశాస్త్రీయమో! ఒక ఆహారపు అలవాటును నీచంగా భావించటం ఎంత తప్పో - ఆ అలవాటు లేనివాళ్లను ఎద్దేవా చేయటమూ తప్పే. మావోయిస్టు నాయకుడు మిడ్కో ఒక వ్యాసం లో ‘అటవీ ప్రాంతంలో గొడ్డు, పందితో పాటు ఎం డ్రకాయలు, ఎలుకలు, పందికొక్కులు, కప్పలు, పాములు, నత్తలు, చీమలు వంటివి తింటారు. అవి తినటం రాడికల్స్ ఒక ముఖ్యమైన అర్హతగా భావి స్తారు. అలా తినటం చైతన్యానికి ప్రతీక, డీక్లాసిఫై అయ్యారని చెప్పుకోవటానికి గీటురాయి. విప్లవోద్య మం ఒక్క గొడ్డు మాంసం తినే అలవాటునే కాదు, చాలా మంది నీచంగా భావించే పంది, మరెన్నో రకాల మాంసాలను, అట్టడుగు వర్గాలు తినే వేటి నైనా గౌరవించటమే కాదు సొంతం చేసుకుం టున్నది. కోడి, మేక మాంసాలను మాత్రమే తింటూ పంది, గొడ్డు వంటి మాంసాలను తినటానికి వెనుక బడటం డీక్లాసిఫై కావటంలో వెనుకబడటమే. ఈ మాంసాలను తినకపోవటం చైతన్యరాహిత్యమే అనేది తమ పార్టీలో స్థిరపడిపోయిందని చెప్పాడు. ‘డీక్లాసిఫై’ అవటం అంటే శ్రామిక జన సంక్షేమం కోసం పాటుపడటమే గాని అలవాటు లేని ఆహా రాన్ని తినటం కాదు. అడవుల్లో ఉన్నప్పుడు ఆహారం అందుబాటులో లేకుంటే, అప్పుడు దొరికే మాంసం తినటం అనివార్యం. వారు అనుభవించే బాధలు జ్ఞప్తికి తెచ్చుకోవటానికి బీఫ్ పలావ్ తింటున్నామని ఒక విప్లవ రచయిత చెప్పినట్లు (హనుమకొండ సభల్లో) పత్రికల్లో వచ్చింది. అదే నిజమైతే అడవుల్లో వారికి అందుబాటులో లేని అనేక సౌకర్యాలు ఇక్కడ అనుభవిస్తూ ఒక్క గొడ్డు మాంసం విషయం అనుస రిస్తే ఎలా సరిపోతుంది? వాటంగా ఉందని గొడ్డు మాంసం పలావ్ ప్లేట్లు ప్లేట్లు లాగించిన విప్లవ రచ యితలు మిడ్కో చెప్పిన పాములు, చీమలు, ఎలు కలు, పందికొక్కుల్ని మరిచారు. అవి కూడా తినగలి గితే మరింత ‘డీక్లాసిఫై’ అవచ్చుకదా! బీఫ్ నిషేధించాలని హిందుత్వశక్తులు ఒక వైపు, బీఫ్ సహపంక్తిలో వడ్డించాలని కుల సంఘా లు, రాడికల్స్ మరోవైపు విద్యాలయాల్లో శాంతియు త వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. ప్రజల ఆహారపు అలవాట్లు శాసనాల ద్వారా నియంత్రిం చాలనే ప్రభుత్వ ధోరణి - ఆందోళనల ద్వారా అల వాటు లేని వాళ్లని ఇబ్బంది పెట్టాలనే వారి ధోరణి రెండూ సముచితాలు కావు. ముస్లిం మైనారిటీల పక్కన కూర్చొని పందిమాంసం తినగల సాహసం లేనప్పుడు ఆవు మాంసం బ్రాహ్మణుల పక్కనో, అలవాటు లేని మాంసాహారి పక్కనో కూర్చొని తినా లనుకోవటంలో ఔచిత్యం ఉందా? - చెరుకూరి సత్యనారాయణ గుంటూరు మొబైల్: 98486 64587 -
మాంసాహారం పంపించిన వివాదంలో పాక్
కఠ్మాండు: సాయం చేసే విషయంలోనూ పాకిస్థాన్ వివాదంలోకి ఎక్కింది. అసలే భారీ భూకంపం సంభవించి పుట్టెడు దుఃఖంలో ఉన్న నేపాల్ ఉండగా అత్యధికంగా హిందువుల జనాభా ఉన్న ఆ దేశానికి పాక్ సాయంపేరిట భారీ మొత్తంలో మసాల దట్టించిన మాంసాహారాన్ని పంపించి వార్తల్లో నిలిచింది. దీనిపై చాలామంది నిరసనలు వ్యక్తం చేస్తున్నట్లు ది డెయిలీ మెయిల్ వెల్లడించింది. హిందువుల జనాభా ఎక్కువగా ఉన్న నేపాల్‌లో గోవులను పవిత్రమైనవిగా భావిస్తారు. గోవధను కొన్ని మత సంఘాలు ఒప్పుకోవు కూడా. రిపబ్లిక్ రాజ్యంగా అవతరించే వరకు కూడా ప్రపంచంలో ఏకైక హిందు దేశం కూడా అదే. అలాంటిది ప్రస్తుతం పాక్ చేసిన ఈ చర్య కారణంగాసార్క్ దేశాలమధ్య ఓ చర్చకు తావిచ్చి వివాదం నెలకొనే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. వైద్య సేవలు అందించేందుకు వెళ్లి ప్రస్తుతం బిర్ అనే ఆస్పత్రిలో నేపాల్ వారికి చికిత్స చేస్తున్న భారతీయ వైద్యులు ఈ విషయంపై మాట్లాడుతూ మంగళవారం పాక్ పంపించిన ఆహార పదార్థాల్లో బీఫ్ మసాల ప్యాకెట్లు ఉన్నాయని చెప్పారు. వాటిని తాము ముట్టుకోలేదని, ప్రారంభంలో అది తెలియని స్థానికులు తీసుకున్నా తర్వాత తెలుసుకొని పక్కన పడేశారని చెప్పారు. కాగా, ఈ విషయాన్ని ఇప్పుడప్పుడే అంతగా చర్చించకపోయినప్పటికీ తర్వాత జరిగే ద్వైపాక్షిక చర్చల సమయంలో నేపాల్ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
షిర్డీ సాయిపై మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు
వారణాసి: ద్వారకాపీఠ శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి మరోసారి షిర్డీ సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సాయిబాబా ముస్లిం అనీ, ఆయన గొడ్డు మాంసం తినేవారంటూ ఆయన నిన్న ద్వారకాపీఠంలో వ్యాఖ్యానించారు. సబ్ కామాలిక్ అన్న మాటలు సాయిబాబా చెప్పినవి కావని... అది గురు నానక్ సూక్తి అని శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి గుర్తు చేశారు. అంతేకాకుండా హిందూ దేవాలయాల్లో సాయిబాబా విగ్రహాలు పెట్టడాన్ని ప్రభుత్వాలు అడ్డుకోవాలని సూచించారు. సాయిబాబా ట్రస్ట్ ప్రజల్ని వెర్రివాళ్ళను చేస్తోందని ఆయన మండిపడ్డారు. ట్రస్ట్ పేరుతో వివిధ బ్యాంకుల్లో మూలుగుతన్న కోట్లాది రూపాయలను స్వాధీనం చేసుకోవాలని స్వరూపానంద డిమాండ్ చేశారు. ఆగ్రాలోని తాజ్ మహల్, అజ్మీర్ దర్గాల్లోని శివలింగాన్ని ధ్వంసం చేసి ముస్లిం పాలకులు సమాధులు కట్టారని ఆయన ఆరోపించారు. గతంలోనూ స్వామి స్వరూపానంద సరస్వతి ... ఇదే అంశంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. -
తిండికి, మతానికి ఎందుకు ముడి పెడతారు?
న్యూఢిల్లీ : తినే తిండికి, మతానికి ఎందుకు ముడి పెడతారో నాకు అర్థంకావడం లేదు. నేను హిందువునైనా ఆవు మాంసం తింటాను. ఆవు మాంసం తినే వారికి భక్తి ఉండదనా... తినని వారికి దేవుడంటే భక్తి ఉంటుందనా అర్థం అంటూ బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవధను మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిషేధించింది. ఇకమీదట రాష్ట్రంలో ఎక్కడైనా ఆవు మాంసాన్ని విక్రయించిన లేదా కలిగి ఉన్నా వాళ్లకు ఐదేళ్ల జైలుశిక్షతో పాటు రూ. 50 వేల రూపాయల జరిమానా విధించనున్నారు. అందుకు సంబంధించిన చట్టానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ ఏడాది మార్చి నెల మొదటి వారంలో ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిలందే. గోవధ నిషేధంపై మహారాష్ట్ర మార్గంలోనే హర్యానా అనుసరించింది. హర్యానా రాష్ట్రంలో గోవధ చేస్తే మూడేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ. 30 వేల నుంచి రూ. లక్ష జరిమాన విధించనుంది. అందుకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం గత సోమవారం హర్యానా అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో రిషికపూర్ ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని పై విధంగా వెల్లడించారు. -
'బీఫ్ నా ఫేవరెట్ ....కానీ నాన్న వద్దన్నారు'
మరో సినీనటి శాకాహారి జాబితాలో చేరిపోయింది. ఇంతకీ ఎవరా నటి అనుకుంటున్నారా?... కమల్ హాసన్ గారాల పట్టి శ్రుతి హాసన్. ఒకప్పుడు బీఫ్ తన ఫేవరెట్ అన్న ఈ చెన్నై చిన్నది ఇప్పుడు మాత్రం పక్కా వెజ్టేరియన్గా మారిపోయింది. నాన్న సలహాతో శ్రుతి నాన్ వెజ్‌ను పక్కన పెట్టేసింది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్లో స్వయంగా వెల్లడించింది. మా బాపూజీ (కమల్ హాసన్)కి థాంక్స్. ఆయన సలహాతో నేను వెజిటేరియన్‌గా మారాను. చాలా బాగుంది, కాని రొయ్యలు తింటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. అంటూ ట్వీట్ చేసింది. ఇక బీఫ్ తిని ఏడాదిన్నర అయినట్లు శ్రుతి తెలిపింది. ఇక టర్కిష్, జపనీస్ ఫుడ్‌కి అభిమానిని అని చెప్పుకొచ్చింది. ఫిట్నెస్ను దృష్టిలో పెట్టుకునే తాను ఇక నుంచి వెజ్టేరియన్గా అవతారం ఎత్తినట్లు శ్రుతి పేర్కొంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో శ్రుతి అగ్ర హీరోయిన్ల రేసులో ఉంది. దాంతో ఆరోగ్యం కాపాడుకోవటంతో పాటు, ఫిట్నెస్గా ఉండాలంటే నాన్ వెజ్ తినడం పూర్తిగా మానేయమని కమల్ కూతురికి సలహా ఇచ్చారట. దాంతో ఆమె ప్రస్తుతం అదే పనిలో ఉంది. శాకాహారిగా ఉండడం తననెంతో ఆరోగ్యంగా ఉంచుతోందని, ఒకప్పుడు ఏది పడితే అది తినేసేదాన్ని గానీ, ఇకనుంచి కాస్త బ్యాలెన్స్‌గా మెయిన్టైన్ చేస్తానంటూ చెప్పుకొచ్చింది. తన తండ్రి వెజిటేరియన్ కాకపోయినా ఆయన సలహా పాటిస్తానని శ్రుతి తెలిపింది. తండ్రి సలహాతో జిహ్వ చంపుకుంటున్న ఈ అమ్మడు ఇక నుంచి కొత్త లైఫ్ స్టయిల్‌ను ఎంజాయ్ చేస్తానంటోంది.