
'బీఫ్ తిన్నారని చంపడం క్రూరమైన నేరం'
తిరువనంతపురం: బీఫ్ తిన్నారని చంపడం అసహనం కాదని, అత్యంత క్రూరమైన నేరమని ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలతో భారత్‌లో అసహనం పెరిగిపోయిందని భావించరాదన్నారు. కొందరు ఎక్కడున్నా అసహనం సృష్టిస్తారు.. చట్టం పక్కాగా అమలైతే ఆ పదానికి చోటు ఉండదని చెప్పారు.
అసహనంపై పెద్దెత్తున లౌకికవాదులు నిరసన వ్యక్తం చేయడం మంచి పరిణామమేనని తస్లీమా పేర్కొన్నారు. తాను భారత్ పౌరసత్వం కోరుకుంటే మోదీ ప్రభుత్వం తటస్థంగా, లౌకికవాదంతో పనిచేస్తుందని చెబుతానని ఆమె వివరించింది.