
న్యూఢిల్లీ: ఆవు మాంసం తినే వారిది తప్ప..దేశ ప్రజలందరి డీఎన్‌ఏ ఒక్కటేనంటూ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ)నేత సాధ్వి ప్రాచి వ్యాఖ్యానించారు. శనివారం సాధ్వి ప్రాచి రాజస్తాన్‌లోని దౌసాలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ..‘ఆవు మాంసం తినేవారిది మినహా అందరి డీఎన్‌ఏ ఒక్కటే’అని పేర్కొన్నారు. దేశంలో జనాభా పెరుగుదలను ఆపేందుకు కఠిన చట్టాలు తీసుకురావాలన్నారు.
ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానాన్ని కలిగిన వారికి ప్రభుత్వ సేవలు బంద్ చేయాలన్నారు. వారికి ఓటు హక్కు కూడా లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. రాజస్తాన్‌లో లవ్ జిహాద్ ముసుగులో జరుగుతున్న మత మార్పిడులను ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఐక్యత లేకుండా అభివృద్ధి సాధ్యం కాదనీ, దేశంలోని అన్ని మతాల ప్రజల డీఎన్‌ఏ ఒక్కటేనని ఇటీవల జరిగిన ముస్లిం రాష్ట్రీయ మంచ్ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment