Sadhvi Prachi
-
లవ్ జిహాద్‌కు మదర్సాలే కేంద్రాలు
బరేలీ: ’లవ్ జిహాద్, ప్రపంచ కలహాలకు కేంద్రాలకు మారిన మదర్సాలను మూసివేయాలని వీహెచ్‌పీ నేత సాధ్వి ప్రాచి వ్యాఖ్యానించారు. ‘హిందువులు డబ్బు సంపాదన గురించే ఆలోచిస్తారు. ఒక ప్రత్యేకవర్గం మాత్రం భారత్‌ను పాలించాలని ఆలోచిస్తుంటుంది. వెయ్యేళ్లు భారత్‌ను పాలించడమే వారి ఎజెండా’అని యూపీలోని బరేలీలో ఆదివారం ఆమె మీడియాతో అన్నారు. ‘లవ్ జిహాద్ మదర్సాల నుంచే మొదలవుతోంది. అక్కణ్నుంచే వ్యాప్తి చెందుతుంది. దేశంలో మదర్సాలు మూసేసిన రోజున లవ్ జిహాద్ ఉనికిలోనే ఉండదు. అప్పుడు ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచం మొత్తంలో శాంతి సామరస్యాలు వెల్లివిరుస్తాయి’అని ఆమె మీడియాతో అన్నారు. -
స్వరభాస్కర్ పెళ్లిపై సాధ్వి ప్రాచి వివాదాస్పద వ్యాఖ్యలు..
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి స్వర భాస్కర్.. సమాజ్‌వాదీ పార్టీ నేత ఫాహద్ అహ్మద్‌ను పెళ్లి చేసుకోవడంపై పలువురు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తాజాగా విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) నేత సాధ్వి ప్రాచి వీరి వివాహంపై తీవ్రంగా స్పందించారు. శ్రద్ధ వాకర్‌కు పట్టిన గతే స్వర భాస్కర్‌కు పడుతుందని హెచ్చరించారు. బాహుశా పెళ్లికి ముందు స్వర భాస్కర్ ఒక్కసారైనా ఫ్రిడ్జ్‌ను చూడాల్సిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'శ్రద్ధవాకర్‌ను ఆమె ప్రియుడే 35 ముక్కలుగా నరికి ఫ్రిడ్జిలో దాచిన వార్తను స్వర భాస్కర్ ఎక్కువగా పట్టించుకోనట్లు ఉంది. పెళ్లి చేసుకోవాలనే పెద్ధ నిర్ణయం తీసుకునే ముందు స్వరభాస్కర్ ఒక్కసారైనా ఫ్రిడ్జ్‌ను చూడాల్సింది. ఇది ఆమె వ్యక్తిగత నిర్ణయం. నేనేమీ ఎక్కువగా చెప్పలేను. కానీ శ్రద్ధ వాకర్‌కు ఏం జరిగిందో స్వర భాస్కర్‌కు కూడా అదే జరుగుతుంది.' అని సాధ్వి ప్రాచి వ్యాఖ్యానించారు. ఫాహద్ అహ్మద్‌తో తన పెళ్లి విషయాన్ని ఫిబ్రవరి 16న ప్రకటించింది స్వరభాస్కర్. వీరి వివాహం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో అన్న అని పిలిచిన వ్యక్తిని ఎలా పెళ్లిచేసుకుంటున్నావ్ అంటూ స్వర భాస్కర్‌పై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ప్రత్యేక వివాహం చట్టం కింద వీరిద్దరూ కోర్టులో పెళ్లి చేసుకున్నారు. అయితే ఇస్లామిక్ చట్టం ప్రకారం ఈ పెళ్లి చెల్లదని మతపెద్దలు పేర్కొన్నారు. ఢిల్లీలో శ్రద్ధవాకర్ హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. తనతో సహజీవనం చేసిన అఫ్తాబ్ పూనావాలానే ఆమెను దారుణంగా హత్య చేశాడు. మృతదేహాన్ని 35 ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో దాచాడు. అనంతరం వాటిని తీసుకెళ్లి అడవిలో పడేశాడు. చదవండి: పెళ్లైన రెండో రోజే విగతజీవులైన నవ దంపతులు.. రిసెప్షన్‌కు ముందే.. -
‘క్యాడ్ బరీ సిగ్గుపడాలి.. మా మోదీనే అవమానిస్తారా’!
ప్రముఖ చాక్లెట్ తయారీ దిగ్గజం క్యాడ్బరీ ఒకేసారి రెండు వివాదాల్లో చిక్కుకుంది!. జంతువుల నుంచి సేకరించిన జెలటిన్ అనే ప్రొటీన్‌తో చాక్లెట్‌ను తయారు చేస్తుందని.. ఆ సంస్థను భారత్‌లో బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్లు వినిపించాయి. దీంతో ట్విటర్లో ‘బాయ్‌కాట్ క్యాడ్బరీ’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ‘మంచిని ఆశిద్దాం తియ్యని వేడుక చేసుకుందాం’ అంటూ దీపావళి సందర్భంగా క్యాడ్బరి సంస్థ ఓ చాక్లెట్ యాడ్‌ను ప్రమోట్ చేసింది. అయితే ఇప్పుడు ఆ యాడ్ వివాదంగా మారింది. ఆ యాడ్‌లో సంభాషణలు ఇలా జరిగాయి. డాక్టర్: దీపావళి సందర్భంగా ఓ డాక్టర్ ప్రమిదెలు అమ్మే వ్యక్తి కోసం అంగట్లో చూస్తుంటాడు. అదే సమయంలో ప్రమిదెలు అమ్మే వ్యక్తి డాక్టర్‌కు తారసపడడంతో దామోదర్ అని పిలుస్తాడు. ఆ పిలుపుతో ప్రమిదెలు అమ్మే వ్యాపారి : డాక్టర్ సార్ డాక్టర్: ఎక్కడున్నావ్.. రెండు రోజుల నుంచి నీ కోసం చూస్తున్నాను. వ్యాపారీ: అయినా మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నార్ సార్. మీకు ఏమైనా కావాలా? అని అడుగుతాడు. డాక్టర్: కాదు, కాదు నేను మీకు ఒకటి ఇవ్వాలని అనుకుంటున్నా. అంటూ తన బ్యాగ్‌లో నుంచి క్యాడ్బరీ చాక్లెట్ ప్యాకెట్‌ను వ్యాపారికి అందిస్తాడు. వ్యాపారీ: అందుకు కృతజ్ఞతగా మీకు దీపావళి శుభాకాంక్షలు అని రిప్లయి ఇస్తారు. అంతటితో యాడ్ పూర్తవుతుంది. ఇప్పుడీ యాప్‌పై విశ్వహిందూ పరిషత్ నేత సాధ్వి ప్రాచి అభ్యంత్రం వ్యక్తం చేశారు. తోపుడు బండిపై ప్రమిదెలు విక్రయించే వ్యక్తి పేరు దామోదర్. ఆ యాడ్‌లో దామోదర్ అనే పేరును వినియోగించడంపై విశ్వహిందూ పరిషత్ నేత సాధ్వి ప్రాచి మండిపడ్డారు. ‘‘మీరు క్యాడ్బరీ చాక్లెట్ యాడ్‌ను పరిశీలించారా? షాపు లేని ఓ నిరు పేద ల్యాంప్ విక్రేత పేరు దామోదర్. ప్రధాని మోదీ తండ్రి పేరును తక్కువ చేయడానికి చేసిన ప్రయత్నం ఇది. ఈ అంశంలో క్యాడ్ బరీ సంస్థ సిగ్గుపడాలి. బాయ్ కాట్ క్యాడ్ బరీ’’ అంటూ సాధ్వి ప్రాచి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు నెటిజన్లు స్పందిస్తున్నారు. బాయ్‌కాట్ క్యాడ్బరీ అంటూ వరుసగా రీట్వీట్లు చేస్తున్నారు. Have you carefully observed Cadbury chocolate's advertisement on TV channels? The shopless poor lamp seller is Damodar. This is done to show someone with PM Narendra Modi's father's name in poor light. Chaiwale ka baap diyewala. Shame on cadbury Company #BoycottCadbury pic.twitter.com/QvzbmOMcX2 — Dr. Prachi Sadhvi (@Sadhvi_prachi) October 30, 2022 -
వారిది తప్ప.. అందరి డీఎన్ఏ ఒక్కటే
న్యూఢిల్లీ: ఆవు మాంసం తినే వారిది తప్ప..దేశ ప్రజలందరి డీఎన్ఏ ఒక్కటేనంటూ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ)నేత సాధ్వి ప్రాచి వ్యాఖ్యానించారు. శనివారం సాధ్వి ప్రాచి రాజస్తాన్‌లోని దౌసాలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ..‘ఆవు మాంసం తినేవారిది మినహా అందరి డీఎన్ఏ ఒక్కటే’అని పేర్కొన్నారు. దేశంలో జనాభా పెరుగుదలను ఆపేందుకు కఠిన చట్టాలు తీసుకురావాలన్నారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానాన్ని కలిగిన వారికి ప్రభుత్వ సేవలు బంద్ చేయాలన్నారు. వారికి ఓటు హక్కు కూడా లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. రాజస్తాన్‌లో లవ్ జిహాద్ ముసుగులో జరుగుతున్న మత మార్పిడులను ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఐక్యత లేకుండా అభివృద్ధి సాధ్యం కాదనీ, దేశంలోని అన్ని మతాల ప్రజల డీఎన్ఏ ఒక్కటేనని ఇటీవల జరిగిన ముస్లిం రాష్ట్రీయ మంచ్ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్న విషయం తెలిసిందే. -
నెహ్రూపై సాధ్వీ సంచలన వ్యాఖ్యలు..
భోపాల్: దేశతొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నాయకురాలు సాధ్వీ ప్రాచీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో అందరికంటే నెహ్రూనే అతిపెద్ద రేపిస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యాచార కేసులను చూస్తుంటే ప్రపంచ ‘అత్యాచారాలకు రాజధాని’గా భారతదేశం మారిపోతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ప్రకటనపై సాధ్వీ ఈ విధంగా స్పందించారు. ‘భారత్ తొలినాళ్లలో మంచి దేశంగా గుర్తింపు పొందింది. ఈ దేశం రాముడు, కృష్ణుడు పుట్టిన దేశం. కానీ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాతనే అత్యాచార సంస్కృతిని తీసుకువచ్చారు. దానికి ప్రధాన కారణం తొలి ప్రధాని నెహ్రూనే. ఎందుకంటే ఆయనే పెద్ద రేపిస్ట్. టెరరిజం, నక్సలిజం, రేపిజం అన్నీ నెహ్రూ కుంటుంబం నుంచి వచ్చినవే. కాంగ్రెస్ నాయకులే దేశాన్ని సర్వనాశనం చేశారు’ అంటూ వివాదాస్పద రీతిలో మాట్లాడారు. కాగా ఉన్నావ్ ఘటనపై రాహుల్ తీవ్ర స్థాయిలో స్పందించిన విషయం తెలిసిందే. దేశంలో పెరుగుతున్న అత్యాచార కేసులను చూస్తుంటే ప్రపంచ ‘అత్యాచారాలకు రాజధాని’గా భారతదేశం మారిపోతోందని అయన అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితిని చూసి అంతర్జాతీయ సమాజం భారత్‌ను ఎగతాళి చేస్తోందన్నారు. ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్నా.. మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రాహుల్ వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. -
డిసెంబర్ 6న రామ మందిర నిర్మాణం ప్రారంభం : సాధ్వి ప్రాచి
న్యూఢిల్లీ : ఈ ఏడాది డిసెంబర్ 6న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి పునాది వేస్తానంటూ విశ్వ హిందూ పరిషత్ నేత సాధ్వి ప్రాచి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తనకు ఎవరి ఉద్దేశాలతో, తీర్పులతో పని లేదని సాధ్వి ప్రాచి తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘భారతదేశంలోని హిందువులందరికి ఇదే నా ఆహ్వానం. రామ మందిర నిర్మాణంలో పాల్గొనండి. ఈ డిసెంబర్ 6న ధూమ్ ధామ్‌గా వెళ్లి అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని ప్రారంభిద్దాం. ఇందుకు మనకు ఎవరి ఆదేశాలు అవసరం లేదని తేల్చి చెప్పండి’ అంటూ పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ మాత్రమే రామ మందిర నిర్మాణానికి కట్టుబడి ఉందని తెలిపారు. -
సాధ్వి ప్రాచి సంచలన వ్యాఖ్యలు
లక్నో : విశ్వ హిందూ పరిషత్ నేత సాధ్వి ప్రాచి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ట్రిపుల్ తలాఖ్, నిఖా హలాల వంటి దురాచారాల నుంచి తప్పించుకోవాలంటే ముస్లిం మహిళలు హిందూ యువకులను పెళ్లి చేసుకోవాలంటూ వివాదానికి తెరలేపారు. మథురలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నిఖా హలాల, ట్రిపుల్ తలాఖ్ వంటి దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలపై మౌల్వీలు ఫత్వాలు జారీ చేసి, ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రాచి పేర్కొన్నారు. ఇటువంటి అరాచకాలను అరికట్టాలంటే ముస్లిం యువతులు హిందూ యువకులను పెళ్లి చేసుకోవాలంటూ సలహా ఇచ్చారు. నిఖా హలాలాకు వ్యతిరేకంగా పోరాడుతున్న నీదా ఖాన్(బరేలీ) సహా పలువురు ముస్లిం మహిళలతో సమావేశమై, వారందరినీ హిందూ మతంలో చేరాల్సిందిగా కోరతానంటూ సాధ్వి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా సోమవారం గోరఖ్‌నాథ్ ఆలయాన్ని దర్శించిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన సాధ్వి ప్రాచి.. ‘ఈ ఆలయానికి తరచుగా వస్తుంటా. కానీ, ఈ సారి ప్రత్యేక కోరిక కోరా. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీకి కావాల్సిన మెజారిటీ(బహుమత్) ఈసారి కూడా రాకుంటే కనీసం రాహుల్‌కు భార్య అయినా రావాలని కోరుకున్నా’ అంటూ వ్యాఖ్యానించారు. సాధ్వి వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ నేతలు.. ‘కాంగ్రెస్ అగ్రనేతలపై వ్యాఖ్యలు చేయడం ఓ ట్రెండ్‌గా మారింది. ఇలా మాట్లాడి వారు తమ అస్థిత్వాన్ని కాపాడుకుంటున్నారు. సాధ్వి అయి ఉండి ఇలాంటి మాటలు మాట్లాడటం ఆమె స్థాయిని తెలియజేస్తోంది’ అంటూ మండిపడ్డారు. చదవండి : నిఖా హలాల పేరిట నరకం... -
రాహుల్‌గాంధీకి పెళ్లి కావాలని!
గోరఖ్‌పూర్: రాహుల్ గాంధీకి జీవితభాగస్వామి రావాలని భగవంతుడిని వేడుకున్నానని హిందుత్వ నేత సాధ్వి ప్రాచి సోమవారం వ్యాఖ్యానించారు. ఉత్తరభారతంలో తొలి శ్రావణ సోమవారం సందర్భంగా సాధ్వి గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయాన్ని దర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘ఈ ఆలయానికి తరచుగా వస్తుంటా. కానీ, ఈ సారి ప్రత్యేక కోరిక కోరా. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి ఈసారి కాంగ్రెస్ పార్టీకి కావాల్సిన మెజారిటీ(బహుమత్) రాకుంటే కనీసం రాహుల్‌కు భార్య అయినా రావాలని కోరుకున్నా’ అని సాధ్వి వ్యాఖ్యానించారు. సాధ్వి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ‘కాంగ్రెస్ అగ్రనేతలపై వ్యాఖ్యలుచేయడం ఇలాంటి వ్యక్తులకు ఓ ట్రెండ్‌గా మారింది. ఇలా మాట్లాడే వారు తమ అస్థిత్వాన్ని కాపాడుకుంటున్నారు. సాధ్వి అయి ఉండి ఇలాంటి మాటలు మాట్లాడటం ఆమె స్థాయిని తెలియజేస్తోంది’ అని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అశోక్ సింగ్ వ్యాఖ్యానించారు. -
'మరో పాకిస్తాన్ కాకుండా కాపాడారు'
సంభాల్: ఉత్తరప్రదేశ్ ను మరో పాకిస్తాన్ కాకుండా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాపాడారని ఫైర్ బ్రాండ్ హిందూత్వ నాయకురాలు సాధ్వి ప్రాచి అన్నారు. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కావడం పట్ల యూపీ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రిగా ఆయన పనితీరును ఆమె ప్రశంసించారు. గత ప్రభుత్వం జరిగిన కుంభకోణాలపై విచారణ జరపాలన్న ప్రజల ఆకాంక్ష త్వరలో నెరవేరుతుందని జోస్యం చెప్పారు. సమాజ్ వాదీ పార్టీ నాయకులకు ఇక నిద్ర కరువవుతుందని ఎద్దేవా చేశారు. యూపీలో మద్యపాన నిషేధం విధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. -
పెరుగుతున్న జకీర్ తల వెల
న్యూఢిల్లీ: వివాదాస్పద ఇస్లాం బోధకుడు జకీర్ నాయక్ తలకు వెల పెరుగుతూ వస్తోంది. షియా వర్గానికి చెందిన హుస్సేనీ టైగర్స్ మంగళవారం జకీర్ పై రూ.15 లక్షల రివార్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా.. వివాదాస్పద హిందూ నేత సాధ్వి ప్రాచీ.. జకీర్ ను హతమార్చిన వారికి రూ.50 లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఉత్తరాఖండ్ లోని రూర్కీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రాచీ ఈ వ్యాఖ్యలు చేశారు. జకీర్ ఇస్లాం బోధకుడు కాదని ఉగ్రవాది అంటూ ధ్వజమెత్తారు. ఈ రివార్డును తాను వ్యక్తిగతంగా ప్రకటిస్తున్నానని తెలిపారు. మదర్సాల్లో పని చేస్తున్న ఇటువంటి బోధకులపై విచారణ జరిపించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. కాగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని రెస్టారెంట్ లో అతి కిరాతకంగా 22 మందిని చంపిన ఉగ్రవాదులు జకీర్ బోధనలతో ప్రభావితమయ్యాని ఆదేశ పోలీసు వర్గాలు నిర్ధారించిన విషయం తెలిసిందే. జకీర్ పై మహారాష్ట్ర ప్రభుత్వం సైతం విచారణకు ఆదేశించింది. -
'వారిని గెంటేసి జైల్లో పెట్టాలి'
కోల్‌కతా: బీజేపీలో కొందరిని బయటకు గెంటేసి వారిని జైలులో పెట్టాలని ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ అన్నారు. ముఖ్యంగా యోగి ఆధిత్యానాథ్, సాద్వి ప్రాచి నాన్సెన్స్గా తయారయ్యారని వారిని వెంటనే పార్టీ నుంచి బయటకు పంపించాలని, కటకటాల్లో పెట్టాలన్నారు. 'బీజేపీలో కొందరు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. వారికి జాఢ్య మనస్తత్వం ఉంది. సాధ్వి, యోగిలాంటి వారిని పార్టీ నుంచి తొలగించి జైలులో పెట్టాలి' అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది చెత్త విషయాలు మాట్లాడుతున్నారని అది నీచమైన పని అన్నారు. తాను ఎవరూ నీచంగా మాట్లాడినా వెనుకేసుకొచ్చేది లేదని, అలాంటివారిని విమర్శిస్తూనే ఉంటానని అన్నారు. ఈ దేశంలో సంపన్నులు, ప్రఖ్యాతి చెందిన వారే అసహనం గురించి మాట్లాడుతున్నారని, వీధిలో వెళ్లే సామాన్యుడు ఈ విషయాన్ని ఎప్పుడూ మాట్లాడడని అన్నారు. వారు రెండు పూటల తమకు భోజనం సరిపోతే చాలని అనుకుంటారని గుర్తు చేశారు. -
కోర్టులో లొంగిపోయిన సాధ్వి
వీహెచ్‌పీ నాయకురాలు సాధ్వి ప్రాచి ముజఫర్‌నగర్‌లోని ఓ కోర్టులో లొంగిపోయారు. 2013 నాటి ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో ఆమె కోర్టుకు హాజరు కాకపోవడంతో వరుసగా వారంట్లు రావడంతో ఆమె కోర్టుకు వెళ్లి రూ. 20వేల బాండును సమర్పించి, తదుపరి విచారణకు వస్తానని హామీ ఇవ్వడంతో ఆమెపై జారీచేసిన బెయిలబుల్ వారంటును కోర్టు ఉపసంహరించుకుంది. ఇంతకుముందు డిసెంబర్ 18న ఓసారి, జనవరి 23న మరోసారి సాధ్వి ప్రాచిపై కోర్టు వారంట్లు జారీచేసింది. ఇదే కేసులో గత సంవత్సరం డిసెంబర్ నెలలో కేంద్రమంత్రి సంజీవ్ బలియాన్, బీజేపీ ఎమ్మెల్యే సురేష్ రాణా, బీజేపీ ఎంపీ భరతేందు సింగ్, మరో నలుగురు కోర్టులో లొంగిపోయారు. మరో ఎమ్మెల్యే సంగీత్ సోమ్ జనవరి 19న లొంగిపోయారు. కేసు తదుపరి విచారణను కోర్టు ఈనెల 23వ తేదీకి వాయిదా వేసింది. నిషేధాజ్ఞలను ఉల్లంఘించడం, ప్రభుత్వోద్యోగులను విధులు నిర్వర్తించకుండా అడ్డుకోవడం లాంటి కేసులు ఈ నేతల మీద ఉన్నాయి. 2013 ఆగస్టు నెలలో ముజఫర్‌నగర్‌లో జరిగిన ఓ సమావేశంలో వీళ్లు పాల్గొని, తమ ప్రసంగాల ద్వారా హింసను రెచ్చగొట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జరిగిన మతఘర్షణలలో 60 మంది మరణించగా, 40 వేల మంది నిర్వాసితులయ్యారు. -
షారుఖ్‌ఖాన్ పాకిస్ధాన్ ఏజెంట్:సాధ్వీ
-
షారుక్ ఖాన్ పాకిస్తాన్ ఏజెంట్!
లక్నో: విశ్వహిందూ పరిషత్ నేత, బీజేపీ మహిళా నాయకురాలు సాద్వీ ప్రాచీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ దేశం నుంచి వెళ్లిపోవచ్చంటూ ఆమె విరుచుకుపడ్డారు. దేశంలో ప్రజ్వరిల్లుతున్న మత ఘర్షణలను షారూక్ ఖండించిన నేపథ్యంలో సాద్వీ ప్రాచీ ...షారుక్‌పై మండిపడ్డారు. ఆయనో పాకిస్తాన్ ఏజెంట్ అంటూ స్వాధ్వీ నిన్న ఇక్కడ ఆవేశంతో ఊగిపోయారు. అక్కడితో ఈ ఫైర్ బ్రాండ్ ఆగ్రహం చల్లారలేదు. కావాలంటే షారూక్ ఖాన్ పాక్ వెళ్ళిపోవచ్చంటూ ధ్వజమెత్తారు. అనుచిత వ్యాఖ్యానాలు చేస్తున్న షారూక్ ఖాన్‌ను కఠినంగా శిక్షించాలన్నారు. దీంతో పాటుగా పద్మశ్రీ సహా, వివిధ ప్రతిష్ఠాత్మక అవార్డులను వెనక్కి ఇస్తున్న వారిపై కఠినంగా శిక్షించాలని సాద్వీ ప్రాచీ డిమాండ్ చేశారు. 50వ పుట్టిన రోజు జరుపుకున్న షారూక్ ఖాన్‌పై విఎస్పీ నేత విమర్శలపై బాలీవుడ్లో దుమారం రేగింది. అయితే గతంలో కూడా కూడా షారూక్ పై స్వాధ్వీ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. బాద్ షా సినిమాలు చూడ్డానికి వీల్లేదంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. షారుక్ సినిమాల వల్ల యువత పెడతోవ పడుతోందన్నారు. కాగా సృజన, మతాలపై అసహనం దేశానికి హానికరమని షారుక్ ఖాన్ వ్యాఖ్యానించిన విషయం విదితమే. సోమవారం తన 50వ పుట్టినరోజు సందర్భంగా కింగ్‌ఖాన్.. ప్రస్తుతం దేశంలో తీవ్ర అసహనం నెలకొందన్నారు. సినీరంగానికి చెందిన వారు, శాస్త్రవేత్తలు, రచయితలు అవార్డులు వెనక్కి ఇవ్వడాన్ని సమర్థించారు. వెనక్కి ఇవ్వడానికి తనకు జాతీయ ఫిల్మ్ అవార్డు ఏమీ లేనప్పటికీ, అలా చేసిన సినీ ప్రముఖులు దివాకర్ బెనర్జీ, ఆనంద్ పట్వర్ధన్‌ల నిర్ణయాన్ని తాను గౌరవిస్తానన్నారు. సృజన పట్ల, మతం పట్ల అసహనం ప్రదర్శిస్తున్నామంటే దేశం వేసిన ప్రతి ముందడుగు మనం వెనక్కి లాగుతున్నట్లేనన్నారు. దీంతో షారుక్ వ్యాఖ్యలను సాద్వీ ప్రాచీ తీవ్రంగా ఖండించారు. -
'పార్లమెంట్లో ఒకరిద్దరు ఉగ్రవాదులు'
రూర్కీ: 'భారత పార్లమెంట్లో ఒకరిద్దరు ఉగ్రవాదులు ఉన్నారు. దురదృష్టమేమంటే ప్రస్తుతం వారు ఎంపీలుగా కొనసాగుతున్నారు. పదేపదే న్యాయవ్యవస్థను ధిక్కరించేలా కల్లోలపూరితంగా మాట్లాడతారు' అని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నేత సాధ్వి ప్రాచీ.. తనకు అలవాటైన మాదిరే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో పట్టుబడ్డ పాక్ ఉగ్రవాది మహమ్మద్ నవేద్ యాకూబ్‌ను హిందూ సంస్థల చేతికి అప్పగించాలని డిమాండ్ చేశారు. రూర్కీలో గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు. యాకూబ్ మెమన్ ఉరితీతపై విలేకరుల ప్రశ్నలకు బదులిస్తూ.. ముంబై పేలుళ్ల కేసులో దోషిగా రుజువైనందునే యాకూబ్ మెమన్‌కు అత్యున్నత న్యాయస్థానం మరణశిక్ష విధించిందని, కొందరు ఎంపీలు మాత్రం న్యాయవ్యవస్థను ధిక్కరించేలా యాకూబ్ ఉరిపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 'నా దృష్టిలో ఉగ్రవాదులకు మద్దతుగా మాట్లాడేవారు కూడా ఉగ్రవాదులే. పార్లమెంట్లో అలాంటి వాళ్లు ఒకరిద్దరు ఉన్నారు. ఇక కశ్మీర్లో పట్టుబడ్డ ఉగ్రవాది విషయంలో మోదీ ప్రభుత్వానికి నేనొక మనవి. దర్యాప్తు సంస్థల విచారణ పూర్తికాగానే ఉగ్రవాది నవేద్‌ను హిందూ సంస్థలకు అప్పగించాలి. వాడికి తగిన బుధ్ది చెప్తాం' అని సాధ్వి ప్రాచీ అన్నారు. ప్రాచీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ప్రజాస్వామ్యానికి దేవాలయంలాంటి పార్లమెంట్ పట్ల సాధ్వి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవని, ఎంపీలను ఉగ్రవాదులతో పోల్చడం దారుణమని, స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ విషయంలో జోక్యం చేసుకుని సాధ్వి ప్రాచీపై చర్యలకు ఆదేశించాలని కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారి డిమాండ్ చేశారు. -
'అలాంటోళ్లు పాకిస్థాన్ కు పోవాలి'
న్యూఢిల్లీ: విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) నాయకురాలు సాధ్వి ప్రాచీ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. యోగాను వ్యతిరేకించే వారంతా పాకిస్థాన్ కు వెళ్లాలని అన్నారు. యోగాను వ్యతిరేకించే వారికి ఈ దేశంలో ఉండే అర్హత లేదని ఆమె వ్యాఖ్యానించారు. యోగా చేయడాన్ని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంఎపీఎల్బీ) వ్యతిరేకించిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మొట్టమొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఉపరాష్ట్రపతి హమిద్ అన్సారీ పాల్గొనకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు. ఆహ్వానం పంపడానికి ఇదేమి రాజకీయ నాయకుడి కుమార్తె వివాహం కాదని వ్యంగ్యంగా అన్నారు. సూర్య నమస్కారాలు వ్యతిరేకించే వారంతా సముద్రంలో దూకాలని అంతకుముందు బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
సల్మాన్ ముస్లిం కాబట్టే బెయిల్ వచ్చిందా?
న్యూఢిల్లీ: విశ్వహిందూ పరిషత్ నేత, బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రాచి మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. హిట్ రన్ కేసులో సల్మాన్ ఖాన్.. ముస్లిం కాబట్టే బెయిల్ వచ్చిందంటూ వ్యాఖ్యానించి సంచలనానికి తెరలేపారు. అంతేకాదు వీధి కార్మికులకు వ్యతిరేకంగా ట్వీట్ చేసి, సల్మాన్‌ఖాన్‌కు వత్తాసు పలికిన బాలీవుడ్ సింగర్‌ను అరెస్టు చేయాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. సల్మాన్ ముస్లిం కాకపోయి వుంటే బెయిల్ లభించేది కాదని సాధ్వి ప్రాచీ అభిప్రాయాపడ్డారు. చట్టం దృష్టిలో అందరూ సమానమని, బాధితులైన నిరుపేదలకు కూడా న్యాయం జరగాలని ఆమె సూచించారు. అలాగే మాలేగావ్ పేలుళ్ల కేసులో జైల్లో ఉన్న సాధ్వి ప్రగ్యాను విడుదల చేయాలని సాధ్వీ ప్రాచి డిమాండ్ చేశారు. హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను దోషిగా తేల్చిన ముంబై సెషన్స్ కోర్టు అయిదేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం రెండురోజుల తాత్కాలిక బెయిల్ ను మంజూరు చేసింది. అనంతరం శుక్రవారం సెషన్స్ కోర్టు తీర్పును నిలుపుదల చేసిన ముంబై హైకోర్టు సల్లూ భాయ్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే సాధ్వీ ప్రాచీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా సాధ్వీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు. ప్రతి హిందూ మహిళ నలుగురు పిల్లల్ని కనాలంటూ ఇటీవల వ్యాఖ్యానించి వివాదం రేపారు. పైగా తానేమీ తప్పు మాట్లాడలేదనీ..30,40 మందిని కనమన్నానా అంటూ సమర్ధించుకున్నారు. పైగా ఎక్కువమంది పిల్లల్ని కన్న హిందూ మహిళలకు అవార్డులు ఇచ్చి సత్కరించాలని సూచనలు చేశారు. -
'వారి సినిమాల్నిబహిష్కరించాలి'
డెహ్రాడూన్: నిత్యం వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బీజేపీ నేత సాథ్వీ ప్రాచీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ సంస్థలు ఖాన్ సినిమాల్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఆదివారం డెహ్రాడూన్ లో జరిగిన వీహెచ్ పీ కార్యక్రమంలో ప్రాచీ మాట్లాడారు. బాలీవుడ్ నటులు అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు ముగ్గురూ సినిమాల ద్వారా హింసాత్మక సంస్కృతిని పెంపొందిస్తున్నారని, యువత దానికి దూరంగా ఉండాలని ఆమె సూచించారు.'మీరట్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ యువకుణ్ని ప్రశ్నించాను. జీవితంలో ఏమవ్వాలని అనుకుంటున్నావని అడిగాను. దానికి ఆ యువకుడు అమీర్, షారుఖ్ , సల్మాన్ ఖాన్ తరహాలో నటుణ్ని అవ్వాలనుకుంటున్నాఅని బదులిచ్చాడు. ఎందుకు అలా అవ్వాలని అనుకుంటున్నావని అడిగితే.. వారు స్టంట్స్ బాగా చేస్తారని ఆ యువకుడి తల్లి తెలిపింది. దీన్ని బట్టి చూస్తే వారు హింసను ప్రోత్సహిస్తున్నారని అర్ధమవుతోంది.అందుకే యువత వారికి ఆకర్షితులవ్వకూడదని సూచిస్తున్నా'అని ప్రాచీ తెలిపారు. -
'లవ్ జీహాద్‌తో ఉచ్చులో పడేస్తున్నారు'
బదాయూ(యూపీ): విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) నాయకురాలు సాధ్వి ప్రాచీ 'లవ్ జీహాద్' ఇతర మత అంశాలపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలతో వివాదం రాజేశారు. 'లవ్ జీహాద్‌తో వారు మన కూతుళ్లను ఉచ్చులో పడేస్తున్నారు. 35-40 మంది పిల్లలను కనే వారు.. లవ్ జీహాద్‌ను విస్తరిస్తున్నారు. హిందుస్థాన్ ఉదారుల్ ఇస్లాంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నలుగురు పిల్లల విషయంపై వ్యాఖ్యలతో వివాదం రేపానని మీడియా అంది. నేను హిందువులకు నలుగురు పిల్లలు కావాలన్నేనే కానీ 40 మంది కావాలనలేదు. హిందువులకు నలుగురు పిల్లలు దేశానికి అవసరం' అని ఆమె అన్నారు. ప్రాచీ ఆదివారమిక్కడ వీహెచ్‌పీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. నలుగురికంటే ఎక్కువ మంది పిల్లలున్న 20 మంది హిందువులను ఆమె సత్కరించారు. కుటుంబ నియంత్రణను హిందువులకే ఎందుకు అమలు చేయాలని ప్రాచీ ప్రశ్నించారు. దేశంలో 1,400 ఏళ్ల కిందట ప్రతి ఒక్కరూ హిందువులేనని, ఢిల్లీ జమా మసీదు అధిపతి ఇమామం బుఖారీ, పాక్ మాజీ అధ్యక్ష, ప్రధానులు ముషార్రఫ్, గిలానీలు తిరిగి హిందూ మతంలోకి రావాల అన్నారు. కాగా, ప్రాచీ వ్యాఖ్యలు సరికాదని, వాటితో తమకు సంబంధం లేదని బీజేపీ యూపీ కమిటీ చీఫ్ లక్ష్మీకాంత్ వాజ్‌పేయి అన్నారు.