'లవ్ జీహాద్‌తో ఉచ్చులో పడేస్తున్నారు'
బదాయూ(యూపీ): విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) నాయకురాలు సాధ్వి ప్రాచీ 'లవ్ జీహాద్' ఇతర మత అంశాలపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలతో వివాదం రాజేశారు. 'లవ్ జీహాద్‌తో వారు మన కూతుళ్లను ఉచ్చులో పడేస్తున్నారు. 35-40 మంది పిల్లలను కనే వారు.. లవ్ జీహాద్‌ను విస్తరిస్తున్నారు. హిందుస్థాన్ ఉదారుల్ ఇస్లాంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నలుగురు పిల్లల విషయంపై వ్యాఖ్యలతో వివాదం రేపానని మీడియా అంది. నేను హిందువులకు నలుగురు పిల్లలు కావాలన్నేనే కానీ 40 మంది కావాలనలేదు. హిందువులకు నలుగురు పిల్లలు దేశానికి అవసరం' అని ఆమె అన్నారు.
ప్రాచీ ఆదివారమిక్కడ వీహెచ్‌పీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. నలుగురికంటే ఎక్కువ మంది పిల్లలున్న 20 మంది హిందువులను ఆమె సత్కరించారు. కుటుంబ నియంత్రణను హిందువులకే ఎందుకు అమలు చేయాలని ప్రాచీ ప్రశ్నించారు. దేశంలో 1,400 ఏళ్ల కిందట ప్రతి ఒక్కరూ హిందువులేనని, ఢిల్లీ జమా మసీదు అధిపతి ఇమామం బుఖారీ, పాక్ మాజీ అధ్యక్ష, ప్రధానులు ముషార్రఫ్, గిలానీలు తిరిగి హిందూ మతంలోకి రావాల అన్నారు. కాగా, ప్రాచీ వ్యాఖ్యలు సరికాదని, వాటితో తమకు సంబంధం లేదని బీజేపీ యూపీ కమిటీ చీఫ్ లక్ష్మీకాంత్ వాజ్‌పేయి అన్నారు.