
ముంబయి:‘లవ్ జిహాద్’పై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రేమ పేరుతో మత మార్పిడులకు పాల్పడుతున్న ఘటనలను అడ్డుకోవడానికి డిసైడయింది.‘లవ్ జిహాద్’పై చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తాజాగా ఓ కమిటీ వేసింది. మహారాష్ట్ర డీజీపీ సంజయ్ వర్మ ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు. బలవంతపు మత మార్పిడులకు సంబంధించి వేర్వేరు రాష్ట్రాల్లో అమల్లో ఉన్న చట్టాలు, లవ్ జిహాద్ ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు న్యాయపరంగా ఉన్న అవకాశాలను ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదించనుంది.
కాగా, మహారాష్ట్రకు చెందిన శ్రద్ధా వాకర్‌ను ఆమె ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా 2022లో ముక్కలు ముక్కలుగా చేసి హత్య చేశాడు.దీంతో అప్పట్లో లవ్ జిహాద్ అంశం తెరపైకి వచ్చింది. ముఖ్యంగా హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో వివాహం చేసుకుని మత మార్పిడులకు పాల్పడుతున్నారన్న విమర్శలొచ్చాయి.
అప్పట్లో లవ్‌జిహాద్‌పై తీవ్రంగా చర్చ జరిగింది.దీంతో ఈ అంశంపై ఇటీవలే మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.అయితే, ఈ కమిటీ వేయడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. రాష్ట్రంలోని సమస్యలపై దృష్టి సారించాలని ఎన్సీపీ (శరద్ పవార్) నేత సుప్రియా సూలే సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment