committe
-
ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన.. విచారణకు కమిటీ
న్యూఢిల్లీ: ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ సెంటర్ ఘటనపై కేంద్రప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై విచారణ కోసం కమిటీని నియమించింది. ఢిల్లీ రాజేంద్రనగర్‌లోని రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో వరద పోటెత్తి సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దుమారం రేగడంతో కేంద్ర ప్రభుత్వం విచారణకు తాజాగా కమిటీని నియమించింది. -
పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో పేరు లేకపోవడంపై కొండా సురేఖ అలక
-
మంత్రుల కమిటీపై ఆక్వా రైతుల హర్షం
కైకలూరు: రాష్ట్రంలో ఆక్వా రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలవడంతో ఆ రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించడంపై శనివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన సీఎం.. ఆ తర్వాత ముగ్గురు మంత్రులు, సీనియర్ అధికారులతో సాధికారత కమిటీని ఏర్పాటుచేయడం, వారం రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశించడాన్ని వారు స్వాగతిస్తున్నారు. నిజానికి.. ఆక్వా ఉత్పత్తుల విక్రయ ప్రక్రియలో సిండికేట్లు చెప్పిందే రేటు. రొయ్యల సాగును చంటి బిడ్డల్లా సాకిన రైతుల కష్టానికి వీరి చర్యలతో తగిన ప్రతిఫలం దక్కడంలేదు. సిండికేట్లు ఎంత చెబితే అంత రేటుకు రైతు అమ్ముకోవాల్సి వస్తోంది. వాస్తవానికి అంతర్జాతీయ మార్కెట్ రొయ్యల ధరను నిర్ణయిస్తోంది. ఏపీలో ఆ రేట్లు అమలుకావడంలేదు. మరోవైపు మేతల ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. సిండికేట్లు ఇలా దోపిడీ చేస్తుండడంతో రైతులు, రైతు సంఘాల నేతలు శనివారం సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకురాగా.. ఆయన వెంటనే తక్షణ చర్యలు తీసుకోవడంపై ఆక్వా రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం ఆక్వా రంగాన్ని సీఎం జగన్ అన్ని విధాలా ఆదుకుంటున్నారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో సైతం ఉత్పత్తుల రవాణాకు అవకాశం కల్పించారు. ఆక్వా సాగులో మేతల రేట్లు పెరిగి, విక్రయ రేట్లు తగ్గాయి. మేతల ధరల పెంపుపై సీఎం కమిటీని ఏర్పాటు చేయడం అభినందనీయం. ఆయనకు రుణపడి ఉంటాం. – బలే నాగరాజు, ఏలూరు జిల్లా ఉత్తమ ఆక్వా రైతు, కొవ్వాడలంక, మండవల్లి మండలం ఆక్వాకు సర్కార్ అధిక ప్రాధాన్యం ఆక్వా రంగం ఆటుపోట్ల మధ్య సాగుతోంది. ముఖ్యంగా రొయ్యల సాగులో గిట్టుబాటు ధర రావడంలేదు. రేట్ల నిర్ణయంలో ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. ప్రభుత్వం ఆకా>్వ రంగానికి అధిక ప్రాధాన్యం కల్పిస్తోంది. రేట్లు, మేతల ధరల నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారించాలి. – మంగినేని రామకృష్ణ, రొయ్యల రైతు, కైకలూరు -
ఎంఎస్పీ కమిటీ తొలి భేటీకి 40 రైతు సంఘాలు దూరం
న్యూఢిల్లీ: కనీస మద్దతు ధరపై కేంద్రం నియమించిన కమిటీ ఆగస్టు 22న తొలిసారి సమావేశం కానుంది. అయితే, ఈ తొలి సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) మంగళవారం ప్రకటించింది. కమిటీని తామిప్పటికే తిరస్కరించామని గుర్తు చేసింది. త్వరలో భావిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని ఎస్కేఎం నేత హనుమాన్ మొల్లా తెలిపారు. మరోవైపు ఎస్కేఎం నేతలను కనీస మద్దతు ధర కమిటీ భేటీకి రప్పించేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా ఈ ప్రకటన చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. 26 మందితో ఎంఎస్పీ కమిటీని జూలై 18న కేంద్రం నియమించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు ఆజాద్ షాక్.. ఆ బాధ్యతలకు నిరాకరణ.. కీలక పదవికి రాజీనామా! -
111 జీవో ఎత్తేస్తే నగరానికి ముప్పు
సాక్షి,బంజారాహిల్స్: హైదరాబాద్ నగరానికి వరదల నివారణ కోసం నిర్మించిన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలను కాపాడుకోకపోతే భవిష్యత్తులో భాగ్యనగరానికి ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరించారు. జలాశయాల పరిరక్షణకు తెచ్చిన 111 జీవోను ఎత్తేయడం వల్ల రాబోయే రోజుల్లో నగరానికి ముప్పు పొంచి ఉన్నట్లేనని అభిప్రాయపడ్డారు. 111 జీవో ఎత్తివేతపై శుక్రవారం బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో త్రిసభ్య పీపుల్స్ కమిటీ సమావేశం జరిగింది. ఐఐసీటీ హైదరాబాద్ రిటైర్డ్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబూరావు కలపాల, సుప్రీంకోర్టు కమిటీ సభ్యుడు సాగర్ దార, ఎన్జీఆర్ఐ రిటైర్డ్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బి. రామలింగేశ్వర్రావు, వాటర్ రిసోర్సెస్ కౌన్సిల్ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ లుగ్నా సార్వత్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబూరావు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మేలు చేకూర్చేందుకే 111 జీవో ఎత్తేశారనే విమర్శలు వినిపిస్తున్నాయన్నారు. ఈ జీవో ఎత్తివేత వల్ల జంట జలాశయాలు హుస్సేన్‌సాగర్‌లాగా మారబోతున్నాయని చెప్పారు. మల్లన్న సాగర్ నుంచి పంప్‌ల ద్వారా ఉస్మాన్‌సాగర్, హిమాయత్సాగర్లకు నీళ్లు నింపుతామని చెబుతున్నారని.... అయితే ఈ నీటిని తీసుకొచ్చేందుకు ఎంత విద్యుత్ అవసరమవుతుందో తెలుసా అని ప్రశ్నించారు. 90 శాతం ఓపెన్ ఏరియాను కాపాడతామని ప్రభుత్వం చెబుతున్నదని... తీరా నిర్మాణాలు జరిగాక బీఆర్ఎస్ పేరుతో వాటిని రెగ్యులరైజ్ చేయడానికి ఏ మాత్రం వెనుకాడబోదని మరో హైదరాబాద్‌గా 111 జీవో ప్రాంతమంతా మారబోతున్నదని హెచ్చరించారు. వాతా వరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రత పెరుగుతుందని.. రాబోయే రోజుల్లో హైదరాబాద్‌కు ఈ ప్రమాదం పొంచి ఉందని సాగర్ ధార పేర్కొన్నారు. -
కరోనా కట్టడి, వ్యాక్సిన్‌పై ఏపీ కీలక నిర్ణయం
విజయవాడ: విజృంభిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ను కట్టడి చేయడంతో పాటు దానికి విరుగుడుగా చేపట్టిన వాక్సినేషన్ నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన తీసుకుంది. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ నిర్వహణ కోసం సీనియర్ ఐఏఎస్‌లతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం గురువారం నియమించింది. మొత్తం ఈ కమిటీలో 21 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్వహణ, 13 జిల్లాలకు 13 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు అదనంగా కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పరీక్షలు, కోవిడ్ వచ్చినవారు పర్యవేక్షణ,104 కాల్ సెంటర్ నిర్వహణ, ఆస్పత్రుల్లో బెడ్లు, వైద్య సేవల ఈ కమిటీ పర్యవేక్షణ చేయనుంది. కోవిడ్ వాక్సినేషన్‌ని ముమ్మరంగా నిర్వహించేలా బాధ్యతలు అప్పగించింది. తక్షణం కోవిడ్ బాధితులకు వైద్య సహాయం అందేలా నిరంతరం కమాండ్ కంట్రోల్ పర్యవేక్షించానుంది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ చర్యలతో పాటు రాష్ట్రంలో కరోనా కట్టడిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ కరోనా వ్యాప్తి నివారణకు చర్యలు చేపడుతున్నారు. -
సీఎం కేసీఆర్‌కు నివేదిక అందజేసిన సునీల్ శర్మ కమిటీ
-
ఉన్నత విద్య సంస్కరణలపై కమిటీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యావ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ప్రొఫెసర్ ఎన్.బాలకృష్ణన్ చైర్మన్‌గా 12 మందితో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఉన్నత విద్యాశాఖ) జేఎస్వీ ప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొఫెసర్ ఎన్.బాలకృష్ణన్ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో సభ్యులుగా ప్రొఫెసర్ దేశాయ్ (ఐఐటీ డైరెక్టర్, హైదరాబాద్), ప్రొఫెసర్ జంధ్యాల బీజీ తిలక్ (మాజీ వీసీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్), ప్రొఫెసర్ నళిని జునేజా (ఎన్‌ఐయూపీఏ, ఢిల్లీ), ఆర్.వెంకటరెడ్డి (ఎంవీ ఫౌండేషన్), శ్రీమతి సుధా నారాయణమూర్తి (చైర్పర్సన్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్), డాక్టర్ ఎన్.రాజశేఖరరెడ్డి, (మాజీ వీసీ, ఉన్నత విద్యామండలి), ఎస్.రామకృష్ణంరాజు (సామాజిక సేవా కార్యకర్త, భీమవరం), ఆలూరి సాంబశివారెడ్డి (విద్యాసంస్థల ప్రతినిధి), పాఠశాల విద్యాశాఖ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, కన్వీనర్, బి.ఈశ్వరయ్య (రిషివ్యాలీ, ఏనుములవారిపల్లి), డీవీఆర్కే ప్రసాద్ (ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్) ఉంటారు. జీవోలో పేర్కొన్న అంశాలివీ ప్రస్తుతం వేర్వేరు ప్రభుత్వ యాజమాన్యాల కింద నడుస్తున్న విద్యా సంస్థలకు సంబంధించి ఒకే రకమైన సమగ్ర పారదర్శక విధానాల అమలుకు సూచనలు చేయాలి. విద్యా సంస్థల్లో సుస్థిర ప్రమాణాల సాధనకు మౌలిక సదుపాయాల ఏర్పాటు, మానవ వనరుల కల్పన అంశాలపై సలహాలివ్వాలి. కేంద్ర మానవ వనరుల శాఖ నూతన విద్యావిధానం–2019 ముసాయిదాను అనుసరించి పాఠశాల విద్యలో కే–12 విధానంపై సూచనలు చేయాలి. ఓకేషనల్ విద్య మెరుగుదలకు సూచనలివ్వాలి ఎస్సీఈఆర్టీ సహా వివిధ సంస్థల పనితీరు మెరుగుపరిచేందుకు అవసరమైన సలహాలు ఇవ్వాలి. ఆరువారాల్లో ఈ కమిటీకి అవసరమైన సమాచారం, ఇతర అంశాలను సమకూర్చి, అది అందించే సూచనల మేరకు ’క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్టు’ కింద యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. 2019–20 విద్యాసంవత్సరంలోనే దీని ప్రభావంతో మార్పులు కనిపించాలి. -
ఇంటర్మీడియట్ గ్రేడింగ్‌పై కమిటీ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్లో గ్రేడింగ్‌పై కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ప్రస్తుతం ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మార్చిలో జరిగే పరీక్షల్లో గ్రేడింగ్ ఎలా అమలు చేయాలి? జేఈఈ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో మార్కులను పరిగణనలోకి తీసుకుంటున్న నేపథ్యంలో గ్రేడింగ్ సాధ్యాసాధ్యాలు ఏంటన్న అంశంలో మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు త్వరలోనే కమిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కమిటీ ఏర్పాటయ్యాక 15 రోజుల్లో నివేదిక అందజేస్తుందని, ఆ తరువాత తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. -
బీచ్ ఫెస్టివల్ నిర్వహణపై కమిటీ ఏర్పాటు
విజయవాడ: విమర్శలు, నిరసనల నేపథ్యంలో విశాఖ బీచ్ లవ్ ఫెస్టివల్‌పై రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఫెస్టివల్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలా వద్దా అనే దానిపై ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్, ఉడా వైస్ చైర్మన్, మున్సిపల్, టూరిజం శాఖ కమిషనర్లు సభ్యులుగా ఉన్నారు. కాగా బీచ్ లవ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని, ఇందుకు సంబంధించి ఓ ప్రయివేట్ సంస్థ ప్రభుత్వాన్ని సంప్రదించిన మాట వాస్తవమే అని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. అయితే సంస్కృతి సంప్రదాయాలకు భంగం కలిగించే ఏ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వదని ఆయన స్పష్టం చేశారు. ఫెస్టివల్ నిర్వహణకు పాజిటివ్ గ్లోబల్ సర్వీసెస్ సంస్థ గత నెల 15వ తేదీన దరఖాస్తు చేసుకుందని ఆయన తెలిపారు. అన్ని పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రేమికుల రోజులను పురస్కరించుకుని ఫిబ్రవరిలో విశాఖలో బీచ్ లవ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసిన విషయం తెలిసిందే. అయితే పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం ఓ కమిటీ వేసి నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది. -
ఆ ఎమ్మెల్యే పేరు రాకూడదంతే!
విజయవాడ కల్చరల్: దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాలలో డూండీ గణేష్ సేవాసమితి ఆధ్వర్యంలో 72 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహ నిర్మాణంలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. గత ఏడాది చవితి నిర్వహణలో రూ.30 లక్షలకు పైగా అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆ సంస్థ గౌరవ అధ్యక్షుడు కోగంటి సత్యం బహిరంగగా విమర్శించడం తెలిసిందే. దీంతో కొంతమంది సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధిని ఆశ్రయించారు. ఇక ఆ ప్రజాప్రతినిధి మొత్తం తన చేతుల్లోకి తీసుకున్నారు. సంగీత కళాశాలలో తన అనుచరులతో నిఘా పెట్టి అనుక్షణం ఏం జరుగుతోందో ఆరా తీస్తున్నారు. తాజాగా మరో వివాదం వెలుగులోకి వచ్చింది. కళాశాల ప్రాంగణంలో భారీగా విరాళాలు ఇచ్చిన వారిపేర్లను బహిరంగంగా ప్రదర్శించారు. గతంలో మాదిరే ఈ ఏడాది కూడా ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లక్షరూపాయలను విరాళంగా అందజేశారు. అయితే విరాళాల పట్టికలో మాత్రం ఎమ్మెల్యే పేరు కనిపిం చడం లేదు. స్థానిక ప్రజాప్రతినిధి మంత్రాంగమే దీనికి కారణమని వినిపిస్తోంది. భారీగా చందాల వసూళ్లు.. విగ్రహ నిర్మాణం కోసం నిర్వాహకులుసెంట్రల్ నియోజక వర్గపరిధిలోని దుకాణాల నుంచి భారీగా చందాలు వసూలు చేస్తున్నారు. చందాలకు రసీదులు కూడా ఇవ్వటం లేదని కొందరు దాతలు చెబుతున్నారు. కాగా, కమిటీలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు తిష్టవెయ్యటం విమర్శలకు తావిస్తోంది. -
గోడలు, కిటికీలను విచారిస్తారా?
యూనివర్సిటీలో ఉన్నప్పుడే కమిటీని పంపాలి: ప్రొ. కోదండరాం వరంగల్: సెంట్రల్ యూనివర్సిటీలో వేముల రోహిత్ మృతికి కారుకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థులు ఈనెల 23న ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టారని, అయితే కేంద్ర ప్రభుత్వం ఆ రోజే విచారణ కమిటీని హైదరాబాద్‌కు పంపించడం ఏమిటని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్నించారు. విద్యార్థులు లేనప్పుడు విచారణ ఎలా జరుపుతారన్నారు. వరంగల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో తెలంగాణ ఉద్యమ అమరుడు పిల్లి గిరిబాబు వర్ధంతి సభను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. 23న సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులంతా ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద దీక్ష చేపడుతున్నారని, ఆ రోజు విచారణకు వచ్చి గోడలు, కిటికీలను విచారిస్తారా? అని ఎద్దేవా చేశారు. రోహిత్ మృతిపై వాస్తవాలు మరుగనపడేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈనెల 23న కాకుండా.. విద్యార్థులు యూనివర్సిటీలో ఉండే.. మరో రోజు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.