ఆ ఎమ్మెల్యే పేరు రాకూడదంతే!
ఆ ఎమ్మెల్యే పేరు రాకూడదంతే!
Published Fri, Aug 26 2016 11:13 PM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM
విజయవాడ కల్చరల్:
దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాలలో డూండీ గణేష్ సేవాసమితి ఆధ్వర్యంలో 72 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహ నిర్మాణంలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. గత ఏడాది చవితి నిర్వహణలో రూ.30 లక్షలకు పైగా అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆ సంస్థ గౌరవ అధ్యక్షుడు కోగంటి సత్యం బహిరంగగా విమర్శించడం తెలిసిందే. దీంతో కొంతమంది సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధిని ఆశ్రయించారు. ఇక ఆ ప్రజాప్రతినిధి మొత్తం తన చేతుల్లోకి తీసుకున్నారు. సంగీత కళాశాలలో తన అనుచరులతో నిఘా పెట్టి అనుక్షణం ఏం జరుగుతోందో ఆరా తీస్తున్నారు. తాజాగా మరో వివాదం వెలుగులోకి వచ్చింది. కళాశాల ప్రాంగణంలో భారీగా విరాళాలు ఇచ్చిన వారిపేర్లను బహిరంగంగా ప్రదర్శించారు. గతంలో మాదిరే ఈ ఏడాది కూడా ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లక్షరూపాయలను విరాళంగా అందజేశారు. అయితే విరాళాల పట్టికలో మాత్రం ఎమ్మెల్యే పేరు కనిపిం చడం లేదు. స్థానిక ప్రజాప్రతినిధి మంత్రాంగమే దీనికి కారణమని వినిపిస్తోంది.
భారీగా చందాల వసూళ్లు..
విగ్రహ నిర్మాణం కోసం నిర్వాహకులుసెంట్రల్ నియోజక వర్గపరిధిలోని దుకాణాల నుంచి భారీగా చందాలు వసూలు చేస్తున్నారు. చందాలకు రసీదులు కూడా ఇవ్వటం లేదని కొందరు దాతలు చెబుతున్నారు. కాగా, కమిటీలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు తిష్టవెయ్యటం విమర్శలకు తావిస్తోంది.
Advertisement