పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతుండగా ఇద్దరు ఆగంతకులు లోక్‌సభలో విజిటర్ గ్యాలరీ నుంచి దూకి, వెల్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇది పార్లమెంటు భద్రతా లోపాన్ని ప్రశ్నించేదిగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 22 ఏళ్ల క్రితం డిసెంబరు 13న జరిగిన దాడికి.. ఇప్పుడు జరిగిన దాడికి తేడా ఏమిటి? ఈ రెండింటినీ ఒకే రకమైన దాడిగా పరిగణించవచ్చా? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం.
2023, డిసెంబర్ 13.. బుధవారం.. పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతుండగా ఇద్దరు ఆగంతకులు భద్రతా వలయాన్ని ఛేదించి, లోక్‌సభలోకి ప్రవేశించడంతో సభలో గందరగోళం నెలకొంది. అయితే వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుంది. పట్టుబడినవారిలో ఓ యువకుడు, ఓ యువతి ఉన్నారు. ఆ యువకుడు పొగను స్ప్రే చేయడంతో పాటు పలు నినాదాలు చేశాడు. యువకుడి వయసు 25 ఏళ్లు కాగా, మహిళ వయసు 42 ఏళ్లు.
2001లో కూడా డిసెంబర్ 13నే పార్లమెంటుపై దాడి జరిగింది. నాడు ఉగ్రవాదులు పాత పార్లమెంట్ మెయిన్ గేటును బద్దలు కొట్టి, లోపలికి ప్రవేశించారు. ఈ నేపధ్యంలో జరిగిన కాల్పుల్లో తొమ్మిది మంది సైనికులు వీరమరణం పొందారు. అనంతరం దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదులను పార్లమెంట్ వెలుపల భద్రతా సిబ్బంది హతమార్చారు.
ఈ రెండు దాడుల మధ్య తేడా ఏమిటంటే, 2001లో పాత పార్లమెంట్‌లో దాడి జరగ్గా, ఈసారి కొత్త పార్లమెంట్‌లో భద్రతా వలయాన్ని ఛేదించారు. 2001లో జరిగిన దాడిలో పార్లమెంటు వెలుపలి నుంచే దాడి జరిగింది. ఈసారి జరిగిన దాడిలో ముందుగా పార్లమెంట్‌లోకి ప్రవేశించి వారిద్దరూ భద్రతా వలయాన్ని దాటారు.
2001లో జరిగిన దాడిలో ఐదుగురు ఉగ్రవాదులు ఆయుధాలతో దాడి చేయడాన్ని భద్రత పరమైన లోపంగా భావించారు. నాడు ఉగ్రవాదులు నేరుగా ఆయుధాలతో దాడి చేశారు. అయితే ఈసారి పార్లమెంట్ హౌస్‌లోకి ప్రవేశించిన యువకుడు స్ప్రే ఉపయోగించాడు.
ఇది కూడా చదవండి: ఆ మాజీ సీఎంల పని ఏమిటి? జేపీ నడ్డా ఏమన్నారు?
Comments
Please login to add a commentAdd a comment