18వ లోక్‌సభలో ఎంపీల సీటింగ్ ఏర్పాట్లు ఖరారయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీటులో ఎలాంటి మార్పు లేదు. గతంలో మాదిరి ఆయన ముందు వరుసలోని తొలి సీట్లో కూర్చోనున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రెండో స్థానంలో, హోంమంత్రి అమిత్ షా మూడో సీట్ నెంబర్లో కూర్చోనున్నారు. గతంలో సీటు నెంబర్ 58లో కూర్చొనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇకపై 4వ స్థానానికి మారారు.
ఇక వయనాడ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రియాంక గాంధీ నాలుగో వరుసలో స్థానం కేటాయించారు. ఈ మేరకు సోమవారం సవరించిన సీటింగ్ జాబితాను విడుదల చేశారు.
గతంలో సీట్ నెంబర్ 4, 5 ఖాళీగా ఉండేవి. కానీ ఇప్పుడు వాటిని వేరే వారికి కేటాయించారు. అదే విధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆరోగ్య మంత్రి జెపి నడ్డా వంటి కీలక మంత్రులకు స్థిరమైన సీట్లు ఖాళీగానే ఉండనున్నాయి.
రాహుల్ గాంధీ 498వ స్థానంలో..
వీరితోపాటు సీనియర్ ప్రతిపక్ష నేతల సీట్లు మొదటి వరుసలో ఉంటాయి. కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 498వ స్థానంలో కూర్చుంటారు., సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ 355వ స్థానంలో కూర్చోనున్నారు. లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్ నేత సుదీప్ బందోపాధ్యాయకు 354వ సీటు కేటాయించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌కు రాహుల్ గాంధీ పక్కనే సీటు నంబర్ 497 కేటాయించారు.
సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అవధేష్ ప్రసాద్ కు లోక్ సభ రెండో వరుసలో స్థానం కల్పించారు. ఫైజాబాద్ నుంచి గెలిచిన ఆయన ఇప్పుడు సీటు నంబర్ 357లో కూర్చుంటారు. డింపుల్ యాదవ్ 358 సీటులో అతని పక్కన కూర్చుంటారు. ఇకప ప్రియాంక గాంధీ నాలుగో వరుసలో 517వ సీట్లో కూర్చోనున్నారు. కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు కేరళకు చెందిన అదూర్ ప్రకాష్, అస్సాంకు చెందిన ప్రద్యుత్ బోర్డోలోయ్ పక్కన ఆమె కూర్చుంటారు.
Comments
Please login to add a commentAdd a comment