diffrences
-
2001- 2023.. అదే డిసెంబరు 13.. పార్లమెంట్ దాడుల్లో తేడా ఏమిటి?
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతుండగా ఇద్దరు ఆగంతకులు లోక్‌సభలో విజిటర్ గ్యాలరీ నుంచి దూకి, వెల్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇది పార్లమెంటు భద్రతా లోపాన్ని ప్రశ్నించేదిగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 22 ఏళ్ల క్రితం డిసెంబరు 13న జరిగిన దాడికి.. ఇప్పుడు జరిగిన దాడికి తేడా ఏమిటి? ఈ రెండింటినీ ఒకే రకమైన దాడిగా పరిగణించవచ్చా? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. 2023, డిసెంబర్ 13.. బుధవారం.. పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతుండగా ఇద్దరు ఆగంతకులు భద్రతా వలయాన్ని ఛేదించి, లోక్‌సభలోకి ప్రవేశించడంతో సభలో గందరగోళం నెలకొంది. అయితే వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుంది. పట్టుబడినవారిలో ఓ యువకుడు, ఓ యువతి ఉన్నారు. ఆ యువకుడు పొగను స్ప్రే చేయడంతో పాటు పలు నినాదాలు చేశాడు. యువకుడి వయసు 25 ఏళ్లు కాగా, మహిళ వయసు 42 ఏళ్లు. 2001లో కూడా డిసెంబర్ 13నే పార్లమెంటుపై దాడి జరిగింది. నాడు ఉగ్రవాదులు పాత పార్లమెంట్ మెయిన్ గేటును బద్దలు కొట్టి, లోపలికి ప్రవేశించారు. ఈ నేపధ్యంలో జరిగిన కాల్పుల్లో తొమ్మిది మంది సైనికులు వీరమరణం పొందారు. అనంతరం దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదులను పార్లమెంట్ వెలుపల భద్రతా సిబ్బంది హతమార్చారు. ఈ రెండు దాడుల మధ్య తేడా ఏమిటంటే, 2001లో పాత పార్లమెంట్లో దాడి జరగ్గా, ఈసారి కొత్త పార్లమెంట్లో భద్రతా వలయాన్ని ఛేదించారు. 2001లో జరిగిన దాడిలో పార్లమెంటు వెలుపలి నుంచే దాడి జరిగింది. ఈసారి జరిగిన దాడిలో ముందుగా పార్లమెంట్‌లోకి ప్రవేశించి వారిద్దరూ భద్రతా వలయాన్ని దాటారు. 2001లో జరిగిన దాడిలో ఐదుగురు ఉగ్రవాదులు ఆయుధాలతో దాడి చేయడాన్ని భద్రత పరమైన లోపంగా భావించారు. నాడు ఉగ్రవాదులు నేరుగా ఆయుధాలతో దాడి చేశారు. అయితే ఈసారి పార్లమెంట్ హౌస్‌లోకి ప్రవేశించిన యువకుడు స్ప్రే ఉపయోగించాడు. ఇది కూడా చదవండి: ఆ మాజీ సీఎంల పని ఏమిటి? జేపీ నడ్డా ఏమన్నారు? -
దక్షిణాఫ్రికాలో ప్రజల లెక్క
గత ఏడాది అంటే 2022 నాటికి దక్షిణాఫ్రికా జనాభా పెరిగింది. మొత్తం జనాభా 60.6 మిలియన్లకు చేరింది. వీరిలో ఎక్కువ మంది (సుమారు 49.1 మిలియన్లు) నల్లజాతి ఆఫ్రికన్లు ఉన్నారు. భారతీయ లేదా ఆసియా నేపథ్యం కలిగిన వ్యక్తులు అతి చిన్న జనాభా సముదాయంగా ఏర్పడ్డారు. వీరి జనాభా సుమారు 1.56 మిలియన్లుగా ఉంది. దక్షిణాఫ్రికా సరిహద్దు ప్రాంతాలలో దాదాపు 59.3 మిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. దక్షిణాఫ్రికా.. ఆఫ్రికా ఖండంలో అత్యధిక జనాభా కలిగిన ఆరు దేశాలలో ఒకటిగా నిలిచింది. అతిపెద్ద జనావాస ప్రావిన్సుల విషయానికొస్తే గౌటెంగ్ ( రాజధాని నగరం జోహన్నెస్‌బర్గ్), క్వాజులు-నాటల్ (రాజధాని నగరం పీటర్‌మారిట్జ్‌బర్గ్) ఉన్నాయి. ఇక్కడి జనాభా వరుసగా దాదాపు 15.9 మిలియన్లు, 11.7 మిలియన్లుగా ఉంది. కేప్ టౌన్, డర్బన్, జోహన్నెస్‌బర్గ్ అతిపెద్ద కమ్యూనిటీలను కలిగిన నగరాలుగా నిలిచాయి. గృహాల సంఖ్యలో పెరుగుదల 2001- 2022 మధ్య కాలంలో దేశంలో మొత్తం గృహాల సంఖ్య మరింతగా పెరిగింది. ఈ కాలంలో దక్షిణాఫ్రికా దాదాపు 60 శాతం గృహాల పెరుగుదలను నమోదు చేసింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో (30.7 శాతం) కంటే పట్టణ ప్రాంతాలలో (38.2 శాతం) ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులతో కూడిన కుటుంబాలు అధికంగా ఉన్నాయని తేలింది. మరోవైపు ఆరు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు కలిగిన గృహాలు గ్రామీణ ప్రాంతాల్లో 20.5 శాతంగా ఉన్నాయి. 2021లో కుటుంబాల సంఖ్య దాదాపు 17.9 మిలియన్లకు చేరుకుంది. దాదాపు ప్రతి మూడు ఇళ్లలో ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులు ఉన్నారు. దక్షిణాఫ్రికా ప్రజలలో అత్యధికులు అధికారిక గృహాలలో నివసిస్తున్నారు. 2018 నాటికి దక్షిణాఫ్రికాలో అత్యధికంగా మాట్లాడే భాష ఇసిజులు(isiZulu). తరువాతి స్థానంలో ఇసిక్సోసా (isiXhosa), అనంతరం ఇంగ్లీషు వస్తాయి. అత్యధిక ఆదాయ అసమాన దేశం ఆఫ్రికన్ దేశాలు ఆదాయ పంపిణీకి సంబంధించి గణనీయమైన అసమానతలను కలిగి ఉన్నాయి. ఈ విషయంలో దక్షిణాఫ్రికా.. ప్రపంచ ఆదాయ అసమానత ఇండెక్స్‌లో 63 శాతంగా ఉంది. అయితే కొన్ని సంవత్సరాలుగా ఈ సూచికలో మెరుగుదల కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో మరింత అసమానత నెలకొంది. దేశంలో నెలవారీ జాతీయ ఆహార దారిద్య్ర రేఖ 663 దక్షిణాఫ్రికా రాండ్లు కావడం గమనార్హం. 2019లో దక్షిణాఫ్రికాలోని అత్యధిక కుటుంబాలు జీతాలు లేదా గ్రాంట్లను ప్రధాన ఆదాయ వనరుగా కలిగి ఉన్నాయి. దాదాపు 10.7 మిలియన్ల ప్రజలు వేతనాల ద్వారానే ఆదాయాన్ని పొందుతున్నారు. 7.9 మిలియన్ల కుటుంబాలు ప్రభుత్వం చెల్లించే సామాజిక గ్రాంట్లను అందుకుంటున్నాయి. 2022లో ఆఫ్రికన్ ఖండంలో సగటు ఆయుర్దాయం మహిళలకు 64 సంవత్సరాలు. పురుషులకు 61 సంవత్సరాలు. దేశంలో పురుషుల కంటే మహిళల జనాభానే అధికం. 2021 నాటికి, దక్షిణాఫ్రికాలో సంతానోత్పత్తి రేటు 2.37. ఇది 2019 నుండి తగ్గుతోంది. శిశు మరణాల రేటు కూడా తగ్గుతోంది. ఇది మెరుగైన ఆరోగ్య సంరక్షణకు సూచిక. దేశంలో మరణాలకు ప్రధాన కారణం క్షయవ్యాధి, తరువాత మధుమేహంగా గుర్తించారు. ఇది కూడా చదవండి: దక్షిణాఫ్రికా రాజకీయాలు హింసకు దారి తీస్తున్నాయా? -
ప్రభుత్వం కాళ్లలో కట్టెలు పెడుతున్నారు!
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రకటనకు ప్రతిగా విడుదలైన ‘అనధికారిక’ లీక్‌లో తీవ్ర విమర్శలే ఉన్నాయి. ప్రభుత్వాన్ని గవర్నర్ కావాలనే ఇబ్బంది పెడ్తున్నారని, కాళ్లలో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అందులో ఆరోపణలు గుప్పించారు. అందులోని అంశాలు ఇవీ.. ‘‘సాధారణంగా గవర్నర్లు, రాజ్యాంగబద్ధ సంస్థలకు అత్యంత విలువ, గౌరవం ఇచ్చే సీఎం కేసీఆర్‌తో గవర్నర్ తమిళిసైకి ఎక్కడ విభేదాలు వచ్చాయన్న దానిపై అనేక చర్చలున్నాయి. గవర్నర్ నరసింహన్ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నపుడు కేసీఆర్‌తో విభేదించారు. కేసీఆర్ సీఎం అయ్యాక కూడా ఆయనే గవర్నర్‌గా కొనసాగారు. అయినా ఇద్దరి మధ్య సఖ్యత ఉండేది. రాష్ట్ర పాలనా యంత్రాంగానికి, సీఎంకు గవర్నర్ వ్యవస్థ ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చింది. సీఎం కూడా గవర్నర్ వ్యవస్థకు తగిన గౌరవమిచ్చారు. రెండు వ్యవస్థల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండేది. ఇప్పుడది లేకపోవడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. గవర్నర్ ఉద్దేశ పూర్వకంగా తెలంగాణ ప్రభుత్వ కాళ్లలో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ► రాష్ట్ర మంత్రివర్గం కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సిఫార్సు చేసింది. వాటిని గవర్నర్ ఆమోదించలేదు. అలాగని తిరస్కరించకుండా చాలా కాలం దగ్గర పెట్టుకున్నారు. దానిని ఆమోదించాలని ప్రభుత్వ వర్గాలు కోరినపుడు.. కౌశిక్‌రెడ్డిపై కేసులున్నాయని చెప్పారు. అలా భావిస్తే సిఫార్సును తిరస్కరించాలని కోరినా గవర్నర్ స్పందించలేదు. ప్రభుత్వ మాటకు విలువ ఇవ్వలేదు. కౌశిక్‌రెడ్డిపై కేసులున్నా.. శిక్షపడితే మాత్రమే అనర్హుడు అనొచ్చు. కానీ గవర్నర్ ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ సిఫార్సును తొక్కిపెట్టారన్న వాదన రాజకీయ వర్గాల్లో ఉంది. ► శాసనమండలికి ప్రొటెం చైర్మన్‌గా ఎంఐఎం ఎమ్మెల్సీ అమీనుల్ జాఫ్రీని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. దీనిపైనా గవర్నర్ నాన్చివేత ధోరణితో వ్యవహరించారు. ప్రొటెం చైర్మన్ ఎందుకు, నేరుగా చైర్మన్ ఎన్నిక పెట్టాలంటూ ఉచిత సలహా ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో 13 నెలలపాటు ప్రొటెం చైర్మనే ఉన్నారని ప్రభుత్వ వర్గాలు చెప్పినా గవర్నర్ వినలేదు. రాష్ట్ర ప్రభుత్వం చివరికి దేశంలో ఏయే రాష్ట్రాల్లో ప్రొటెం చైర్మన్లుగా ఎన్నినెలలు, ఎంత కాలం ఉన్నారన్న సమాచారాన్ని సేకరించి గవర్నర్‌కు అందజేసింది. రాజ్యాంగం ఏం చెప్తున్నదో వివరించింది. ఆ తర్వాతే జాఫ్రీని ప్రొటెం చైర్మన్‌గా నియమించే ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ► గవర్నర్ అసెంబ్లీ, మండలిని ఉద్దేశించి ప్రసంగించినా.. జనవరి 26 నాడు జెండా ఎగురవేసి మాట్లాడినా.. ప్రభుత్వం (మంత్రి మండలి) ఆమోదించిన ప్రసంగాన్ని మాత్రమే చదవాలి. సొంతంగా ప్రసంగాలు చేయడానికి వీల్లేదు, రాజ్యాంగం ఒప్పుకోదు. ప్రభుత్వం ఈసారి జనవరి 26న గవర్నర్‌కు ప్రసంగాన్ని పంపలేదు. కానీ గవర్నర్ సొంత ప్రసంగాన్ని చదివారు. వాస్తవానికి జనవరి 26కు సంబంధించి ప్రభుత్వం గవర్నర్‌తో చర్చలు జరిపింది. కరోనా నేపథ్యంలో బహిరంగ సభ లేదు కాబట్టి ఎలాంటి ప్రసంగాలూ వద్దనుకున్నా.. గవర్నర్ ప్రసంగించారు. ఇది ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే చర్యగానే రాజ్యాంగ నిపుణులు భావిస్తున్నారు. ► 2021–22 బడ్జెట్ ప్రసంగంలో మంత్రిమండలి ఆమోదించని కొన్ని పేరాలను గవర్నర్ సొంతంగా చదివారు. అప్పుడు ప్రభుత్వం కూడా సీరియస్‌గా పరిగణించలేదు. ► దేశంలో, మన రాష్ట్రంలో గవర్నర్లకు, ప్రభుత్వాలకు మధ్య ఘర్షణాత్మక వైఖరి తలెత్తిన సందర్భాలు అనేకం ఉన్నాయి. గతంలో రాంలాల్ గవర్నర్‌గా ఉన్నపుడు నాటి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు. తర్వాత ఆయన అవమానకరంగా రాష్ట్రం నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. కృష్ణకాంత్ గవర్నర్‌గా ఉన్నప్పుడూ అలాగే జరిగింది. ఇటీవల మహారాష్ట్ర గవర్నర్ తన అతి వల్ల శాసనసభ నుంచి అవమానకరంగా సభ జరుగుతుండగానే నిష్క్రమించాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి, రాజ్యాంగబద్ధంగా నడుచుకునే ధోరణి గవర్నర్లకు ముఖ్యం. కేంద్ర ప్రభుత్వాలకు తోలుబొమ్మలుగా మారిన ఏ గవర్నర్ కూడా ఎక్కువ కాలం రాష్ట్రాల్లో పనిచేయలేకపోయారు. అయినా ఇప్పటికీ తెలంగాణలో పరిస్థితి చేయిదాటిపోలేదని.. గవర్నర్ సవరించుకుంటేనే మంచిదని రాజ్యాంగ, రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు’’ అని లీక్‌లో విమర్శలు ఉన్నాయి. -
''సెంట్రల్' బొండా ఉమా జాగీర్ కాదు'
విజయవాడ(కృష్ణలంక) : వినాయకచవితి ఉత్సవాల్లో వాదాదం చోటుచేసుకోవడం, అధ్యాత్మిక కార్యక్రమాల్లో తలదూర్చి సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా ఎకపక్షంగా వ్యవహరించి కోగంటి సత్యంను అరెస్ట్ చేయించడం తగదని బీజేపీ యువమోర్చా నగర అధ్యక్షుడు చిన్నపురెడ్డి రవీంద్రరెడ్డి పేర్కొన్నారు. కృష్ణలంకలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గం బొండా ఉమా జాగీర్ కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గణేష్ మహోత్సవానికి గౌరవ అధ్యక్షుడిగా భాద్యలు నిర్వహిస్తున్న కోగంటి సత్యంపై అసత్య ఆరోపణలు చేసి ఆరెస్టు చేయించడం సరైన చర్యకాదన్నారు. అధికారాన్ని అడంపెట్టుకుని ఒక లైసెన్స్ ఉన్న రౌడీలా బొండా ఉమా వ్యవహరిస్తున్నరని విమర్శించారు. బొండా ఉమా ముందుగా తన కుమారులను అదుపులో పెట్టుకోవాలని, వారు మంచి బాటలో నడిచేవిదంగా చూడాలని హితవుపలికారు. ఈ సమావేశంలో స్థానిక నాయకులు కర్రి సాంబయ్య, రఘు, గుంజా బాబాలాల్ పాల్గొన్నారు. -
‘గణ’తంత్రం.. రాజకీయ మంత్రం
– డూండీ గణేశ్ సేవా సమితి ఉత్సవాల్లో రాజకీయ జోక్యం – రెండుగా చీలిన సమితి – అంతా తానై చక్రం తిప్పుతున్న ప్రజాప్రతినిధి – పాత సభ్యుల తొలగింపు – అనుయాయులకే పగ్గాలు – ఇరువర్గాల మోహరింపుతో ఉద్రిక్తంగా ఘంటసాల సంగీత కళాశాల భక్తితో చేయాల్సిన గణపతి పూజకు రాజకీయ భ్రుష్టు పట్టిస్తున్నారు. డూండీ గణేశ్ సేవాసమితి ఆధ్వర్యంలో ఏటా విజయవాడలోని ఘంటసాల సంగీత కళాశాలలో జరిగే వినాయక నవరాత్రోత్సవాలకు ఈసారి రాజకీయ రంగు పులుముతున్నారు. స్వార్థ ప్రయోజనాలకు భక్తుల మనోభావాలను పణంగా పెడుతున్నారు. ఉత్సవాలు నిర్వహించే పాత కమిటీని పూర్తిగా పక్కకునెట్టి.. స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు తన అనుయాయులను చేర్చి చక్రం తిప్పుతున్నారు. దీంతో కళాశాల ప్రాంగణం ప్రస్తుతం ఉత్సవ శోభను కోల్పోయి ఉద్రిక్తంగా మారింది. విజయవాడ కల్చరల్ : డూండీ గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడ దుర్గాపురంలోని ఘంటసాల సంగీత, నృత్య కళాశాలలో ఖైరతాబాద్ వినాయక ఉత్సవాలను తలపించేలా ఏటా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఈసారి ఉత్సవాల నిర్వహణపై రాజకీయ జోక్యం ఎక్కువై వివాదాస్పదమైంది. కళాశాలలో గత ఏడాది భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఆ సమయంలో భక్తుల నుంచి పెద్దగా స్పందన ఉండదనుకున్న రాజకీయ నాయకులు వేడుకల నిర్వహణపై పెద్దగా జోక్యం చేసుకోలేదు. అయితే, వారి అంచనా తప్పింది. ఈ ఉత్సవాలకు భారీ సంఖ్యలో 15లక్షలకు పైగా భక్తులు తరలివచ్చారు. దీంతో ఈ ఏడాది ఉత్సవాలపై రాజకీయ కన్ను పడింది. ఈ సంవత్సరం 72 అడుగుల భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో ఈసారైనా తన అధిపత్యం కొనసాగించడానికి స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. పాత కమిటీకి చెక్.. అనుయాయులతో కొత్త కమిటీ ఉత్సవాల్లో తన బలాన్ని ఎలాగైనా చూపించాలనుకున్న ప్రజాప్రతినిధి పావులు కదిపి పాత కమిటీని పూర్తిగా పక్కన పెట్టారు. గత ఏడాది జరిగిన ఉత్సవాల్లో కమిటీ వ్యవహారాలు, జమా ఖర్చులు, జీవిత సభ్యుల పదవీకాలంపై ప్రశ్నించిన కమిటీ పెద్దలను పక్కనపెట్టి కొత్త కమిటీని నియమించారు. ఈ మొత్తం వ్యవహారంలో పాత కమిటీకి చెందిన కొందరు పెద్దల హస్తం కూడా ఉందని తెలుస్తోంది. అయితే, సేవా సమితిని కాపాడుకోవటానికి పాత సభ్యులు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కాగా, సమితిలో అధ్యక్షుడిగా ఉన్న తొండెపు హనుమంతరావు ఈ వివాదం నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో కమిటీ నిర్వహణపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాత సభ్యుల తొలగింపు గత బుధవారం సంగీత కళాశాలలో ప్రముఖ హైకోర్టు న్యాయవాది, వేద గంగోత్రి వ్యవస్థాపకుడు వరప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించి కమిటీని రిజిస్టర్ చేయకుండా ఉత్సవాలు నిర్వహిస్తున్నారని, ఆగమశాస్త్ర ప్రకారం పూజాదికాలు నిర్వహించాలని, సంబంధిత అధికారులు దృష్టి సారించాలని కోరటంతో నిర్వాహకులు కొందరు స్థానిక ప్రజాప్రతినిధిని కలిశారు. దీంతో అన్నీ తానై చక్రం తిప్పుతున్న ఆ ప్రజాప్రతినిధి కొత్త కమిటీలో తన అనుచరులను చేర్చి ఆది నుంచి నిర్మాణ వ్యవహారాలు చూస్తున్న డూండీ గణేశ్ సేవాసమితి గౌరవాధ్యక్షుడు కోగంటి సత్యం, వ్యవస్థాపక సభ్యుడు పోతిన రాము తదితరులకు స్థానం లేకుండా చేశారు. సీఎం దృష్టికి..? కమిటీలో స్థానం లేకుండా చేయడంతో సదరు ప్రజాప్రతినిధి వ్యవహారం నచ్చని సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలావుంటే.. ఉత్సవాలను సొంతం చేసుకోవాలని ఆ ప్రజాప్రతినిధి అనుచరులంతా కళాశాల చుట్టూ తిరుగుతున్నారు. పాత కమిటీ సభ్యులు కూడా తమ అనుచరులతో అక్కడే పహారా కాస్తున్నారు. -
భార్య గొంతుకోసి హత్య
కాపురానికి రాలేదని ఘాతుకం రెడ్డిగూడెం : కాపురానికి రావడం లేదంటూ భార్య గొంతు కత్తితో కొసి హత్య చేసిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. రుద్రవరం తండా లో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న లాకవత్ జయలక్ష్మి మూడు నెలల క్రితం భర్తతో గొడవపడి భర్తకు దూరంగా ఉంటోంది. కేంద్రం సమీపంలో జయలక్ష్మి ఉండగా జమలయ్య వెళ్లి ఇంటికి వెళ్దామని పలిచాడు. అందుకు నిరాకరించడంతో ఆగ్రహం చెందిన భర్త గొంతు కోసి, పోడిచి పరారయ్యాడు. స్థానికులు మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కె.రమేష్ తెలిపారు. జయలక్ష్మి తమ్ముడు జరబల లక్ష్మణరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సంఘటన స్థలాన్ని సీఐ వెంకటరమణ పరిశీలించారు. -
భార్య గొంతుకోసి హత్య
కాపురానికి రాలేదని ఘాతుకం రెడ్డిగూడెం : కాపురానికి రావడం లేదంటూ భార్య గొంతు కత్తితో కొసి హత్య చేసిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. రుద్రవరం తండా లో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న లాకవత్ జయలక్ష్మి మూడు నెలల క్రితం భర్తతో గొడవపడి భర్తకు దూరంగా ఉంటోంది. కేంద్రం సమీపంలో జయలక్ష్మి ఉండగా జమలయ్య వెళ్లి ఇంటికి వెళ్దామని పలిచాడు. అందుకు నిరాకరించడంతో ఆగ్రహం చెందిన భర్త గొంతు కోసి, పోడిచి పరారయ్యాడు. స్థానికులు మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కె.రమేష్ తెలిపారు. జయలక్ష్మి తమ్ముడు జరబల లక్ష్మణరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సంఘటన స్థలాన్ని సీఐ వెంకటరమణ పరిశీలించారు. -
ఆ ఎమ్మెల్యే పేరు రాకూడదంతే!
విజయవాడ కల్చరల్: దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాలలో డూండీ గణేష్ సేవాసమితి ఆధ్వర్యంలో 72 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహ నిర్మాణంలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. గత ఏడాది చవితి నిర్వహణలో రూ.30 లక్షలకు పైగా అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆ సంస్థ గౌరవ అధ్యక్షుడు కోగంటి సత్యం బహిరంగగా విమర్శించడం తెలిసిందే. దీంతో కొంతమంది సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధిని ఆశ్రయించారు. ఇక ఆ ప్రజాప్రతినిధి మొత్తం తన చేతుల్లోకి తీసుకున్నారు. సంగీత కళాశాలలో తన అనుచరులతో నిఘా పెట్టి అనుక్షణం ఏం జరుగుతోందో ఆరా తీస్తున్నారు. తాజాగా మరో వివాదం వెలుగులోకి వచ్చింది. కళాశాల ప్రాంగణంలో భారీగా విరాళాలు ఇచ్చిన వారిపేర్లను బహిరంగంగా ప్రదర్శించారు. గతంలో మాదిరే ఈ ఏడాది కూడా ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లక్షరూపాయలను విరాళంగా అందజేశారు. అయితే విరాళాల పట్టికలో మాత్రం ఎమ్మెల్యే పేరు కనిపిం చడం లేదు. స్థానిక ప్రజాప్రతినిధి మంత్రాంగమే దీనికి కారణమని వినిపిస్తోంది. భారీగా చందాల వసూళ్లు.. విగ్రహ నిర్మాణం కోసం నిర్వాహకులుసెంట్రల్ నియోజక వర్గపరిధిలోని దుకాణాల నుంచి భారీగా చందాలు వసూలు చేస్తున్నారు. చందాలకు రసీదులు కూడా ఇవ్వటం లేదని కొందరు దాతలు చెబుతున్నారు. కాగా, కమిటీలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు తిష్టవెయ్యటం విమర్శలకు తావిస్తోంది. -
డూండి పరువు తీయొద్దు
విజయవాడ(మ«ధురానగర్) : డూండి గణేష్ సేవా సమితికి విరాళంగా వచ్చిన ప్రతి రూపాయిని సద్వినియోగం చేసి లెక్కలు ఉన్నాయని, ఇటీవల కోగంటి సత్యం గత సంవత్సరం లెక్కలలో రూ.30 లక్షలు తేడాలన్నాయంటూ అసత్య ఆరోపణలతో సంస్థ పరువుతీస్తున్నారని సేవాసమితి కోర్ కమిటీ సభ్యులు దర్శి వెంకట సుబ్బారావు, పీ రాకేష్, వీ శ్రీనివాసరావు, పీ రవి పేర్కొన్నారు. ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాలలో శనివారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ గత ఏడాది డూండి గణేష్ సేవాసమితి ఆధ్వర్యంలో 63 అడుగుల మహాశివ నాట్యగణపతిని ఏర్పాటు చేశామన్నారు. డూండీ గణేష్ సేవాసమితికి అధ్యక్షుడిగా కోగంటి సత్యం, కార్యదర్శిగా దర్శి వెంకట సుబ్బారావు, కోశాధికారిగా విస్సంశెట్టి వెంకట శ్రీనివాసరావు, పారేపల్లి రాకేష్ ను ఫౌండర్‌గా చేసి కమిటీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. కమిటీకి కోగంటి సత్యం అధ్యక్షతన మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయన్నారు. ఈ సంవత్సరం ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా గౌరవ అధ్యక్షుడిగా కోగంటి సత్యం, అధ్యక్షుడిగా తొండెపు హనుమంతరావు, కార్యదర్శిగా గడ్డం రవి, కోశాధికారిగా దర్శి వెంకట సుబ్బరావులను ఎన్నుకున్నట్లు వివరించారు. గత సంవత్సరం ఆయన తాలూకా నుంచి ఇనుము, సర్వేబాదులు, కరెంటు సామగ్రి, చందాలు నుంచి సుమారు రూ.20 లక్షలు రావాల్సి ఉందన్నారు. ఇవ్వాల్సిన సొమ్ము సంస్థకు ఇవ్వకుండా సంస్థ పరువును పాడుచేసే విధంగా మాట్లాడటం సరికాదన్నారు. విరాళాలలో లెక్కలపై దాతలకు ఎటువంటి అనుమానాలున్నా తమను సంప్రదించవచ్చునన్నారు. -
రూ.30 లక్షలకు లెక్కల్లేవు
విజయవాడ కల్చరల్: డూండీ గణేష్ సేవా సమితిలో విభేదాలు భగ్గుమన్నాయి. గతేడాది ఉత్సవాల పేరుతో రూ.1కోటి పది లక్షలు వసూలు కాగా అందులో రూ.30 లక్షలు పక్కదారి పట్టాయంటూ సేవా సమితి గౌరవాధ్యక్షుడు కోగంటి సత్యం ఆరోపించారు. బుధవారం సంగీత కళాశాల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సేవాసమితి తీరుపై ఆయన నిప్పులు చెరిగారు. గత సంవత్సరం నిర్మించిన భారీ వినాయక విగ్రహం జమాఖర్చుల విషయంలో ఆవకతవకలు జరిగాయని సంచలన వ్యాఖ్యలుచేశారు. చందాల వసూళ్ల నుంచి విగ్రహనిర్మాణం, లడ్డూప్రసాదాలు, నిర్వహణ వరకు అన్నింటా భారీఎత్తున అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఇందుకు సంబంధించిన పక్కా ఆధారాలు తన వద్ద ఉన్నాయని స్పష్టం చేస్తూ లెక్కలు అడుగుతుంటే నిర్వాహకులు తప్పించుకు తిరుగుతున్నారని చెప్పారు. తాజా పరిణామాలు సేవా సమితి పేరుతో జరిగిన దోపిడీని బహిర్గతం చేస్తోందనే వ్యాఖ్యలు బలం పుంజుకున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ కోగంటి ఆధిపత్య పోరు సంగీత కళాశాల కళావేదికపై ఆధిపత్యం కోసం గత కొద్ది రోజులుగా కోల్డ్‌వార్ నడుస్తోంది. ఒక టీడీపీ ఎమ్మెల్యే, కోగంటి సత్యం మధ్య పోరుసాగుతుందన్నది బహిరంగ రహస్యం. ఈ క్రమంలో సత్యంను దెబ్బతీసేందుకు సేవా సమితిలో ఎమ్మెల్యే తన అనుచరగణాన్ని రంగంలోకి దించారు. ఆరుగురికి స్థానం కల్పించారు. దీనిపై సత్యం గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అక్రమాలను గుట్టు రట్టు చేయడం ద్వారా ఇటు సేవాసమితికి అటు ఎమ్మెల్యేకు చెక్ పెట్టొచ్చన్నది సత్యం ఎత్తుగడగా తెలుస్తోంది. సత్యంను కమిటీ నుంచి సాగనంపేందుకు ఎమ్మెల్యే వర్గం కుయుక్తులు పన్నుతోంది. సత్యంకు ఎలాంటి సమాచారం లేకుండానే కొందరు సభ్యులు తరచూ విలేకర్ల సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ దఫా చవితి విజయవంతమయ్యేనా ఆర్థిక కుంభకోణాలు, రాజకీయ విభేదాల నేపథ్యంలో డూండీ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఏడాది గణపతి నవరాత్రుల వేడుక సజావుగా సాగేనా అన్న సందేహాలు భక్తులకు కలుగుతున్నాయి. గతేడాది నిర్వహించిన ఉత్సవాలకు అనూహ్య స్పందనవచ్చింది. కీచులాటల క్రమంలో సమితి ప్రతిష్ట రోడ్డున పడ్డట్లైంది. భక్తి ముసుగులో సేవా సమితి సభ్యులు కొందరు చేస్తున్న ఆగడాలపై భక్తులు చీదరించుకుంటున్నారు. గతేడాది ఉత్సవాలకు సంబంధించి జమాఖర్చుల్ని బయటపెట్టి నిజాయితీని నిరూపించుకోవాలని కోరుతున్నారు.