భార్య గొంతుకోసి హత్య
కాపురానికి రావడం లేదంటూ భార్య గొంతు కత్తితో కొసి హత్య చేసిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. రుద్రవరం తండా లో అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న లాకవత్ జయలక్ష్మి మూడు నెలల క్రితం భర్తతో గొడవపడి భర్తకు దూరంగా ఉంటోంది.
కాపురానికి రాలేదని ఘాతుకం
రెడ్డిగూడెం :
కాపురానికి రావడం లేదంటూ భార్య గొంతు కత్తితో కొసి హత్య చేసిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. రుద్రవరం తండా లో అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న లాకవత్ జయలక్ష్మి మూడు నెలల క్రితం భర్తతో గొడవపడి భర్తకు దూరంగా ఉంటోంది. కేంద్రం సమీపంలో జయలక్ష్మి ఉండగా జమలయ్య వెళ్లి ఇంటికి వెళ్దామని పలిచాడు. అందుకు నిరాకరించడంతో ఆగ్రహం చెందిన భర్త గొంతు కోసి, పోడిచి పరారయ్యాడు. స్థానికులు మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కె.రమేష్ తెలిపారు. జయలక్ష్మి తమ్ముడు జరబల లక్ష్మణరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సంఘటన స్థలాన్ని సీఐ వెంకటరమణ పరిశీలించారు.