husband
-
Sunandha Mala Setti: స్వర్ణగిరిని సందర్శించిన బుల్లితెర నటి (ఫోటోలు)
-
12 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి, ఇపుడు భార్యకు ప్రేమ పెళ్లి
'పురుషులందు పుణ్యపురుషులు వేరయా' అని వేమన అంటే, 'పురుషుల్లో మంచివారు నల్లహంసలంత అరుదు' అన్నాడు లాటిన్ కవి జువెనాల్. ఇపుడు నెటి జనులు మహాపురుషుడిగా అభివర్ణిస్తున్న కథ ఒకటి వైరల్‌గా మారింది. పెళ్లయ్యి ఇద్దరు బిడ్డలు పుట్టిన తరువాత మరొకవ్యక్తిని ప్రేమించిన భార్యకు దగ్గరుండి మరీ పెళ్లి చేశాడో భర్త. ట్విస్ట్ ఏంటంటే..12 ఏళ్ల క్రితం ఈమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏం మనస్పర్దలు వచ్చాయో, ఏమైందో ఏమో తెలియదు గానీ, అప్పటికే పెళ్లయ్యి ఇద్దరు బిడ్డలున్న వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది భార్య. ఇది తెలిసిన భర్త ఆమెకు అతనితో(భార్య ప్రియుడితో) వివాహం జరిపించడం నెట్టింట వైరల్‌గా మారింది. ఘర్ కా కాలేశ్ అనే యూజర్ ట్విటర్లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. బిహార్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలిపారు. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. Extra-Marital Affair (Mother of three children fell in love with the father of two children, the husband got his wife married to her boyfriend; they had love marriage 12 years ago) Saharsa Bihar pic.twitter.com/0QV5Trw8PS— Ghar Ke Kalesh (@gharkekalesh) December 19, 2024 ; -
Revathi Husband: నా భార్య మృతికి బన్నీకి ఎలాంటి సంబంధం లేదు.
-
వివాహేతర సంబంధం: భార్యా బిడ్డలపై భర్త దాడి
మైసూరు: వేరే మహిళతో కలిగిన తన అక్రమ సంబంధాన్ని ప్రశ్నించిన భార్య, కుమార్తెపై భర్త తన ప్రియురాలితో కలిసి దాడి చేసి హత్య బెదిరింపులకు పాల్పడిన ఘటన నగరంలోని ఎన్ఆర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. బెంగళూరుకు చెందిన శ్వేత అనే మహిళ తన భర్త సంతోష్‌కుమార్, అతని ప్రియురాలు శిల్పలపై ఎన్ఆర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్వేత, సంతోష్ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. వీరు బెంగళూరులోని కెంగేరి లింగదీరనహళ్లి బడావణెలో నివసిస్తున్నారు. వీరి అన్యోన్య దాంపత్య జీవితంలో సుడిగాలిలో శిల్ప ఎంట్రీ ఇచ్చింది. సుమారు ఆరు నెలల క్రితం సంతోష్ కుమార్ జీవితంలోకి శిల్ప ప్రవేశంతో శ్వేత దాంపత్య జీవితంలో కుదుపు ఏర్పడింది. తరచూ మొబైల్లో సంతోష్ కుమార్‌తో మాట్లాడుతూ అశ్లీల మెసేజ్‌లను పంపుతూ దగ్గరయిన శిల్ప క్రమంగా దంపతుల దాంపత్య జీవితానికి కంటకంగా మారారు. శిల్ప ప్రేరణతో సంతోష్ కుమార్ తరచు భార్య, పిల్లలపై దాడి జరిపి రగడ సృష్టించేవారు. ఈ విషయంపై గతంలో శ్వేత కెంగేరి పోలీసు స్టేషన్లో భర్తపై ఫిర్యాదు చేశారు. ఈ పరిణామం ఇద్దరు పిల్లలపై కూడా ప్రభావం చూపింది. చిన్న కుమార్తె మానసికంగా కుంగి మైసూరులో తల్లి ఇంటిలో ఉండిపోయింది. కుమార్తెను చూసేందుకు శ్వేత తన పెద్ద కుమార్తెతో కలిసి మైసూరుకు వచ్చినప్పుడు బన్నిమంటప ఎల్ఐసీ సర్కిల్ వద్ద సంతోష్ కుమార్, అతని ప్రియురాలు శిల్ప ఎదురై శ్వేత, ఆమె కుమార్తెపై దాడి చేసి హత్య చేస్తామని బెదిరించారు. దాడికి గురైన శ్వేత ఘటన నుంచి కోలుకున్న అనంతరం ఎన్ఆర్ పోలీసు స్టేషన్లో భర్త, ఆమె ప్రియురాలిపై ఫిర్యాదు చేసింది. -
క్షణికావేశంలో భార్యను బలిగొని.. పశ్చాత్తాపంతో ఆమె సమాధి వద్దే..
చిత్తూరు జిల్లా: క్షణికావేశంలో చేసిన తప్పునకు పశ్చాత్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం బైపరెడ్లపల్లికి చెందిన గంగిరెడ్డి(49), సుజాత భార్యాభర్తలు. ఇద్దరు కుమారులతో కలిసి పదేళ్ల కిందట బెంగళూరు వెళ్లి కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆరు నెలల కిందట ఘర్షణ పడ్డారు. గంగిరెడ్డి క్షణికావేశంలో భార్య సుజాతపై కత్తితో దాడి చేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. భార్యను తానే చంపేశానని గంగిరెడ్డి అక్కడి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ కేసులో 6 నెలల జైలు జీవితం గడిపి.. శనివారం బెయిల్‌పై విడుదలై స్వగ్రామంలో ఉన్న కుమారుల వద్దకు వచ్చాడు. రాత్రి వారితో కలిసి భోజనం చేశాడు. ఇకపై తనను అందరూ భార్యను చంపేశానన్న ఏహ్య భావంతో చూస్తారని, క్షణికావేశంలో భార్యను చంపుకొన్నానని.. తనకు బతకాలని లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. రాత్రి ఇంట్లో కుమారులతో కలిసి నిద్రించాడు. ఆదివారం తెల్లవారుజామున మెలకువ వచ్చిన కుమారులకు ఇంట్లో తండ్రి కనిపించలేదు. గ్రామంలో వెతికారు. గంగిరెడ్డి తన తండ్రి, భార్య సమాధుల వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండటాన్ని గమనించారు. మృతుడి కుమారుడు నవీన్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ వెంకటమోహన్ కేసు దర్యాప్తు చేన్నారు.చదవండి: ఏపీలో రెచ్చిపోతున్న ప్రేమోన్మాదులు.. యువతి మృతి, మరొకరికి గాయాలు -
పెళ్లి రోజు స్పెషల్.. భర్తతో హన్సిక లవ్లీ పోస్ట్ (ఫొటోలు)
-
హ్యాపీయెస్ట్ బర్త్‌డే మై బడ్డీ : గాయని బర్త్‌డే విషెస్ వైరల్ (ఫోటోలు)
-
విశాఖలోని సింగరాయకొండలో దారుణం
-
విశాఖలో దారుణం.. భార్యకు మత్తు మందు ఇచ్చి..
సాక్షి, విశాఖపట్నం: నగరంలో దారుణం జరిగింది. భార్యకు కూల్‌డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చి, ఆపై నిప్పంటించి భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మత్తులోకి జారుకున్న తర్వాత ఒంటిపై భర్త నిప్పు అంటించాడు. మంటలు అంటుకున్న కొద్దిసేపటికి బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. గ్యాస్‌స్టవ్ ప్రమాదమని చుట్టుపక్కల వారిని నమ్మించే ప్రయత్నం చేశాడు. చికిత్స పొందుతూ ఆమె కోలుకోవడంతో అసలు బండారం బయటపడింది. విశాఖలోని మురళీనగర్ సింగరాయ కొండపై నివసిస్తున్న వెంకటరమణ, కృష్ణవేణిలకు ఐదేళ్ల క్రితం పెళ్లయి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకటరమణకు మద్యం వ్యసనంతో పాటు భారీగా అప్పులున్నాయి. ఈ విషయంలో దంపతుల మధ్య తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్యను హత్య చేయాలని భావించిన వెంకటరమణ.. 16వ తేదీ రాత్రి మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్ తెచ్చి భార్యకు ఇచ్చాడు. అనంతరం నిప్పంటించాడు. మత్తుమందు ప్రభావం నుంచి కోలుకున్నాక.. కృష్ణవేణి కేకలు వేయడంతో స్థానికులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. -
భర్త బండారాన్ని.. బయటపెట్టిన భార్య
-
ఆమె.. ఆయనలో సగభాగం.. భర్తకు పునర్జన్మనిచ్చిన భార్య
సాక్షి, ఖమ్మం జిల్లా: వివాహం జన్మజన్మల అనుబంధమని, చెరోసగంగా భార్యాభర్తలు జీవనం సాగించడం అన్యోన్య దాంపత్యమని పెద్దలు చెబుతారు. ఈ తరహాలోనే ఓ మహిళ తన భర్తను బతికించుకునేందుకు కాలేయదానం చేసి ఆయనలో సగభాగంగా మారడమే కాదు.. కలకాలం కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని పెళ్లి రోజున చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి నిలిచినట్లయింది.రఘునాథపాలెం మండలం పెద్ద ఈర్లపూడికి చెందిన ధారావత్ శ్రీను ఖమ్మంలోని ఏపీజీవీబీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన భార్య లావణ్య ఎల్ఎల్బీ చివరి సంవత్సరం చదువుతుండగా వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్నాళ్ల క్రితం శ్రీను అనారోగ్యం బారిన పడడంతో ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు. కామెర్లు సోకగా కాలేయం సమస్య ఎదురైందని వైద్యులు గుర్తించారు.ఆపై హైదరాబాద్‌లో చికిత్స చేయించుకున్నా నయం కాలేదు. అంతేకాక వివిధ పరీక్షల అనంతరం కాలేయ మార్పిడి మాత్రమే శ్రీనును బతికిస్తుందని వైద్యులు తేల్చిచెప్పారు. దీంతో కాలేయదానం చేసే వారి కోసం ఆరా తీస్తుండగా లావణ్యే ముందుకొచి్చంది. తన భర్తను కాపాడుకోవడానికి లివర్ ఇస్తానని చెప్పడంలో పరీక్షలు చేసిన వైద్యులు సరిపోతుందని నిర్ధారించారు. ఈ మేరకు లావణ్య లివర్ నుంచి 65శాతం మేర తీసిన సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఈనెల 16న శస్త్రచికిత్స ద్వారా శ్రీనుకు అమర్చారు. ప్రస్తుతం దంపతులిద్దరూ ఆరోగ్యంగా ఉండగా కోలుకుంటున్నారని కుటుంబీకులు తెలిపారు.భర్తకు లివర్ దానం చేసి బతికించుకున్న భార్యఖమ్మం - పెద్ద ఈర్లపూడికి చెందిన ధారావత్ శ్రీను లివర్ సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లగా లివర్ మార్చాల్సిందేనని వైద్యులు చెప్పారు. కానీ, ఎంత వెతికినా డోనర్ దొరక్కపోవడంతో అతని భార్య లావణ్య ముందుకొచ్చింది. ఆమె… pic.twitter.com/Jh0mA4IyaM— Telugu Scribe (@TeluguScribe) November 21, 2024 -
ఆధ్యాత్మిక శోభ : భర్తతో కలిసి బిగ్‌బాస్ నటి సంప్రదాయపూజలు
-
అత్త, వారి బంధువుల వేధింపులు తాళలేక క్షోభ అనుభవిస్తున్నా
పంజగుట్ట: గత 10 నెలలుగా అత్త, అత్త తరపు బంధువులు పెట్టే వేధింపులను తట్టుకోలేకపోతున్నానని, తమ సమీపబంధువు గౌతంరెడ్డి, అత్త గుణపటి పార్వతి, భర్త ఆదాల దామోదర్ రెడ్డి నుంచి తనకు, తన కుటుంబానికి ఆపద ఉందని గ్రీన్‌పార్క్, మారీగోల్డ్, ఆవాసా హోటల్స్ డైరెక్టర్ ఆదాల దామోదర్ రెడ్డి సతీమణి రచనా రెడ్డి వాపోయారు. ఇంట్లో ఉన్న తనను ఈ నెల 6న 15మంది బౌన్సర్లు వచ్చి దాడిచేసి కిడ్నాప్ చేసేందుకు యతి్నంచారన్నారు.ఈ విషయమై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ చెయ్యలేదని ఆమె ఆరోపించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తన సోదరితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 2022 సంవత్సరంలో తనకు దామోదర్ రెడ్డికి వివాహం అయ్యిందని అప్పటినుండి కొద్దికాలం సజావుగానే తమ దాంపత్యం కొనసాగిందన్నారు. తన భర్త తన మాటవింటున్నాడు కానీ తన అత్త పార్వతి భర్తనుండి విడదీసేందుకు కుట్రలు పన్నిందన్నారు. తమ సమీపబంధువు గ్రీన్‌పార్క్, మారీగోల్డ్ హోటల్స్ సీఈఓ గౌతంరెడ్డి మా అత్త సాయంతో తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారన్నారు. తన భర్తనుండి విడాకుల నోటీసు ఇప్పించడంతో గత కొంతకాలంగా తాను ఇల్లు వదిలి వెల్లిపోయానని తిరిగి కోర్టు ఆదేశాలతో గత నెల ఫిల్మ్‌నగర్ లోని తన భర్త ఇంటికి వచ్చినట్లు తెలిపారు. అప్పటినుండి తనను ఇంట్లోవేసి తాళం వెయ్యడం, గదిలో బంధించడం తీవ్రమానసిక వేదనకు గురిచేశారని తెలిపారు. తన అత్త పార్వతి, భర్త దామోదర్ రెడ్డి, గౌతమ్ రెడ్డి నుండి తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని రచనా రెడ్డి వాపోయారు. -
న్యాయ సలహా : మిమ్మల్ని వెళ్లగొట్టే హక్కు వారికి లేదు!
నా వయసు 45 సంవత్సరాలు. మా పెళ్లి జరిగి పాతికేళ్లకు పైగా అయింది. పెళ్లయిన నాటినుంచి నాకు భర్త నుంచి ఆదరణ లేదు సరికదా, చీటికిమాటికీ నాపై చెయ్యి చేసుకోవడం, అత్తమామలు, ఆడబిడ్డల నుంచి ఆరళ్లు... పిల్లలు పుట్టి, పెద్దవాళ్లయినా నాకీ మానసిక, శారీరక బాధలు తప్పడం లేదు. అదేమంటే నన్ను ఇంటిలోనుంచి వెళ్లగొడతానని బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితులలో నేను ఏం చేయాలి? సలహా ఇవ్వగలరు. – కె. సుజాత, శంషాబాద్పెళ్ళైన తర్వాత భర్త ఇంటికి వెళ్ళి, గృహిణిగా వుండే స్త్రీలే మన సమాజంలో ఎక్కువ. అలా గృహిణిగా వుంటున్న స్త్రీలని ఏదో వారికి సేవ చేయటానికి మాత్రమే కట్నం ఇచ్చి మరీ పెళ్ళి చేశారు అనే పురుషాహంకార భావజాలాలు కల్గిన భర్తలు, అత్త–మామలూ కూడా ఎక్కువే! ఉద్యోగం వదిలేసి, తనకంటూ స్వంత ఆదాయం లేకుండా కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేశాక ‘‘నేను వదిలేస్తే నీకు జీవితం లేదు.. వుండటానికి నీడ కూడా దొరకదు.. నీకు విడాకులు ఇస్తాను, రోడ్డున పడతావ్’’ అంటూ బెదిరిస్తూ మహిళలపై అజమాయిషి చలాయించేవారిని తరచు చూస్తుంటాం. ముందూ వెనుకా ఎవరి సహాయం లేకుండా, పెద్దగా చదువుకోకుండా, ఉద్యోగంలో చాలా గ్యాప్ వచ్చి లేదా పుట్టినింటినుంచి పెద్దగా ఆదరణ లేదు అని అనుకున్న స్త్రీలైతే భర్త వదిలేస్తే వారి పరిస్థితి ఏమిటి అని భయపడుతూ, వారికి ఎదురయ్యే గృహహింసను కూడా మౌనంగా భరిస్తూ ఉంటారు.నిజానికి అలా భయపడవలసిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితులలో మహిళలకు ఎంతో బాగా ఉపయోగపడే, రక్షణ కల్గించే చట్టమే ‘గృహ హింస చట్టం, 2005’. ఈ చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం, భర్త (లేదా అత్త–మామలు) నివసిస్తున్న ఇంట్లోనే, విడాకుల కేసు లేదా మరేయితర కేసులు నడుస్తున్నప్పటికీ గృహహింసకు గురైన మహిళకు కూడా సమానంగా నివసించే హక్కు వుంటుంది. కొన్ని సందర్భాలలో ఐతే భార్య/ గృహ హింసకి గురవుతున్న స్త్రీ రక్షణ కొరకు భర్తను ఇంట్లోనుంచి వెళ్లిపోవాలి అని కూడా కోర్టులు ఆదేశాలు ఇచ్చాయి. భర్త పేరిట ఇల్లు ఉన్నా గాని, అలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం కల్పిస్తుంది ఈ చట్టం. అలా కుదరని పక్షంలో భర్త నివసించే ఇంటికి సమానమైన ప్రత్యామ్నాయ వసతిని కల్పించవలసి ఉంటుంది. అంతేకాక, మరలా గృహహింసకు పాల్పడే వీలు లేకుండా భర్త – తన కుటుంబ సభ్యులపై కూడా ఇంజక్షన్ ఇస్తూ కోర్టు ‘ ప్రొటెక్షన్ ఆర్డరు / రక్షణ ఉత్తర్వులు ’’ ఇవ్వవచ్చు. కాబట్టి, భర్త వదిలేస్తే ఇక తనకి జీవితం వుండదు అనుకునే ధోరణి అవసరం లేదు. గృహ హింసని భరించాల్సి అవసరం అంతకంటే లేదు. గృహహింస చట్టం, 2005 అనేది ఒక ప్రత్యేక చట్టం. ఇందుకుగాను మీరు నేరుగా మెజిస్ట్రేట్ ను గానీ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖను గానీ సంప్రదించ వచ్చు. ఐపీసీ 498అ (కొత్త చట్టం – సెక్షన్ 85 బీ.ఎన్.ఎస్) కు, గృహ హింస చట్టానికి సంబంధం లేదు. ఆరోపణలు, గృహహింస ఒకటే అయినప్పటికీ రెండు కేసులు వేర్వేరుగా పిర్యాదు చేయాలి. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.com కు మెయిల్ చేయవచ్చు. -
అవి రెండే.. కానీ ఒకటయిపోతాయి!
అతిథిని పూజించేవాడు ఒక్క గృహస్థు మాత్రమే. అలా గౌరవించడంలో ఎంత లీనమయి ఉంటారంటే అసలు భగవంతుడే స్వయంగా వచ్చినా ఏమరుపాటు పొందుతారు. సీతారాముల విగ్రహాలను అలంకరించడానికి తులసీదాసు గంధం తీస్తుంటాడు. రామలక్ష్మణులు స్వయంగా అతిథులుగా వస్తారు. వచ్చి ఆ గంధం తమకు పూయమంటారు. ఇది సీతారాములకే మీకు కాదు వెళ్ళండంటాడు. వారు వెళ్ళబోతుంటే.. హనుమ చిలకరూపంలో వచ్చి అసలు విషయం చెబుతాడు. రాజకుమారుల రూపంలో ఉన్న వారిని అప్పుడు చందనాదులతో సేవించి దర్శనం పొందుతాడు తులసీదాసు.ఇక్కడ నీకున్నదేదో ఇక్కడ శరీరం వదిలిపెట్టేయడంతోనే సరి. కానీ ఈ శరీరంతో ఉండగా నలుగురికి పనికివచ్చే మంచి పని చేసినప్పుడు అది మాత్రమే పుణ్యంగా నీ వెంట వస్తుంది. మనం ఈ శరీరాన్నిగానీ, ద్రవ్యాన్నిగానీ, శక్తినిగానీ దేనిని వాడకుండా దాచుకోవడం సాధ్యమయ్యేది కాదు. అది కాలంతో వెళ్ళి΄ోవలసిందే. మెరుపు ఎలా వచ్చిపోతుంటుందో అలా భోగాలు వచ్చి పోతుంటాయి తప్ప వాటి వలన ఏ ఫలితమూ ఉండదంటారు శంకరాచార్యుల వారు. సూర్యోదయాలు, చంద్రోదయాలు వస్తుంటాయి, పోతుంటాయి.. ఆయుర్దాయం కరిగిపోతుంటుంది. ఆయువు ఉన్న కాలంలో ఎవరు తమ జీవితాన్ని పండించుకుంటారో వారు గట్టెక్కుతారు. ఆ అదృష్టం అతిథిపూజ చేసిన గృహస్థుకు సులభంగా దక్కుతుంది. అతిథి కూడా ఏ అవసరం వచ్చినా గృహస్థుదగ్గరకే ΄ోతాడు తప్ప ఇతర ఆశ్రమాలవారిని ఆశ్రయించడు. మన దేశ ద్రవ్యం మన దేశంలోనే చెల్లుబాటవుతుంది కదా. ఇతర దేశాలకు ΄ోవాలంటే విదేశీమారక ద్రవ్యం అవసరం. అలాగే ఇక్కడ చేసిన మంచిపని .. మారక ద్రవ్యంలాగా శరీరం విడిచిపెట్టినా పుణ్యం రూపంలో నీ వెంట వస్తుంది.గృహస్థాశ్రమంలో మరో విశేషం ఉంది. దంపతుల మనసు ఏకీకృతమయితే పరమ సంతోషంగా, పరమ ప్రశాంతంగా జీవితం హాయిగా గడుస్తుంది. సాధారణంగా ఇద్దరున్నప్పుడు ఒకరు మరొకరితో ముఖాముఖి మాట్లాడితే తప్ప ఒకరి భావాలు మరొకరికి అర్థం కావు. కానీ దాంపత్యంలో అది పండిందని గుర్తు ఏమిటంటే – ఆయన ఆమెతో, ఆమె ఆయనతో నోరు విప్పి మాట్లాడనక్కరలేదు. అలా చూపులు చాలు భావ ప్రసరణకు,. ఆ స్థాయికి చేరుకోవడం అంటే రెండు మనసులు ఒకటి కావడం.సీతమ్య ఏ పని చేసినా దీనివలన మా ఆయన కీర్తినిలబడుతుంది గదా అని ఆలోచిస్తుందట. రాముడు ఏ పని చేసినా దీనివల్ల సీత సంతోషిస్తుంది గదా! అని ఆలోచిస్తుంటాడట. కొంతకాలం గడిచాక ఒకరికి ఏ అవసరం వచ్చినా మరొకరు అడగాల్సిన పనిలేకుండానే దానిని నెరవేరుస్తారు. పట్టాభిషేక ఘట్టం. అందరికీ అన్నీ ఇచ్చేసారు. చిట్టచివర సీతమ్మ తన మెడలోంచి హారం తీసి పట్టుకున్నది. నీ ప్రశాంతతకు, మన దాంపత్యానికి, మన కలయికకు కారుకులయిన వారికి దానిని అనుగ్రహించు అన్నాడు రాముడు. వెంటనే సీతమ్మ దానిని హనుమకు ఇచ్చేసింది. రాముడు ఫలానా అని పేరు చెప్పక΄ోయినా ఆమె గ్రహించేసింది. దాంపత్యం పండినప్పుడు ఆయన మనసు ఆవిడ దగ్గర, ఆవిడ మనసు ఆయన దగ్గర ఉంటాయి. కారణం – రెండంటూ ఉంటే కదూ.. ఉన్నది ఒకటే అయిపోతుంది. - చాగంటి కోటేశ్వరరావు -
దాడిలో భర్త మృతి.. గర్భిణి భార్య చేత బెడ్ శుభ్రం చేయించి..
దిండోరి: మధ్యప్రదేశ్‌లోని దిండోరిలో మానవత్వం మంటగలిగిన ఉదంతం చోటుచేసుకుంది. దాడిలో ఒక యువకుడు మృతి చెందగా, పుట్టెడు దు:ఖంలో మునిగిన అతని భార్యకు ఆస్పత్రిలో ఘోర అవమానం ఎదురయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ ఉదంతం దిండోరి జిల్లాలోని గడసరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాల్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే లాల్పూర్ గ్రామంలో చోటుచేసుకున్న భూ వివాదం రక్తాపాతానికి దారితీసింది. భూవివాదం కారణంగా ఓ వర్గం ఒక కుటుంబ సభ్యులపై పదునైన ఆయుధాలతో దాడికి తెగబడింది. ఆ కుటుంబ పెద్దతో పాటు అతని ముగ్గురు కుమారులపై నిందితులు దాడి చేశారు. ఈ దాడిలో వృద్ధ తండ్రితో పాటు అతని ముగ్గురు కుమారుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు.బాధిత కుటుంబానికి చెందిన సోదరులు శివరాజ్, రామరాజ్ పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని స్థానికులు గడసరాయ్లోని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే శివరాజ్ ఆరోగ్య కేంద్రంలోని మంచంపై చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన అనంతరం శివరాజ్ భార్య తన భర్త మృతిచెందిన బెడ్‌పై ఉన్న రక్తపు మరకలను శుభ్రం చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. దీంతో జిల్లా వైద్య యంత్రాంగంలో కలకలం చెలరేగింది. దీనిని తీవ్రంగా పరిగణించిన ఉన్నత వైద్యాధికారులు సదరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యునితో పాటు సిబ్బందికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఇది కూడా చదవండి: నేడు గంగోత్రి.. రేపు యమునోత్రి మూసివేత -
భార్య మీద అనుమానంతో దుబాయ్ నుంచి వచ్చి...
కరీంనగర్ (మల్లాపూర్): అనుమానం పెనుభూతమై భార్యను గొంతు నొక్కి అతికిరాతకంగా చంపేశాడోభర్త. ఈ దారుణం మండలంలోని వెంకట్రావ్‌పేటలో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని వేంపల్లి గ్రామానికి చెందిన వెల్మల రమేశ్‌కు రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన సునీతతో 2015లో వివాహం జరిపించారు. వీరికి కూతురు ఆద్య (8), కుమారుడు జయసూర్య(6) సంతానం. కొంతకాలంగా వెంకట్రావ్‌పేటలో ఉంటున్నారు. రమేశ్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి వస్తున్నాడు. నెలక్రితం దుబాయ్ నుంచి వచ్చిన రమేశ్‌కు సునీత వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానం కలిగింది. ఇదే విషయమై బుధవారం ఉదయం భార్యాభర్తలు గొడవపడ్డారు. దీంతో రమేశ్ క్షణికావేశంలో సునీత ముఖంపై బలంగా కొట్టాడు. గొంతు నులిమి హతమార్చి అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న సునీత కుటుంబసభ్యులు ఘటనాస్థలికి వెళ్లి బోరున విలపించారు. గ్రామస్తుల సమాచారం మేరకు ఎస్సై కిరణ్‌కుమార్ విచారణ చేపట్టారు. మెట్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వర్రావు, కోరుట్ల సీఐ సురేష్‌బాబు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతురాలు తండ్రి మందల గంగరాజం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఎంతకు తెగించింది..! భర్త రూ.8 కోట్లు ఇవ్వలేదని, ప్రియుడితో కలిసి
బెంగళూరు: 20 రోజుల క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు తాజాగా ఛేధించారు. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. లగ్జరీ జీవితానికి అలవాటుపడిన మహిళ.. సొంత భర్తనే డబ్బులు డిమాంఢ్ చేయడం.. అతడు నిరాకరించడంతో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు తేలింది. పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసి మరో రాష్ట్రంలో మృతదేహాన్ని పడేసి నిప్పంటించిన మహిళ.. చివరకు పోలీసుల దర్యాప్తులో అడ్డంగా దరికిపోయింది.పోలీసుల వివరాల ప్రకారం.. అక్టోబర్ 8న కొడగు జిల్లాలో అక్టోబరు 8న సగం కాలిపోయిన మృతదేహాన్నికర్ణాటక పోలీసులు గుర్తించారు. సొంటికొప్ప టౌన్ సమీపంలోని కాఫీ ఎస్టేట్‌లో లభ్యమైన మృతదేహం 54 ఏళ్ల రమేష్ అనే తెలంగాణ వ్యాపారిదిగా గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఎరుపు రంగు మెర్సిడెస్ బెంజ్ కారు అక్కడ అనుమానాస్పదంగా తిరిగినట్లు గుర్తించారు. ఆ కారు ఎవరిదో తెలుసుకునేందుకు తుమకూరు వరకు 500కుపైగా సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. చివరకు కారు నంబర్ ప్లేట్‌ను కనుగొన్నారు. హైదరాబాద్‌కు చెందిన 52 ఏళ్ల వ్యాపారవేత్త రమేష్ పేరుతో ఆ కారు రిజిస్టర్ అయినట్లు గుర్తించారు.రమేష్ అదృష్యమైనట్లు అతని భార్య నిహారిక(29) ఇటీవల మిస్సింగ్ ఫిర్యాదును నమోదు చేసింది. దీంతో పోలీసులు కారు రిజిస్టర్ అయిన తెలంగాణలోని పోలీసులను సంప్రదించారు. అయితే రమేష్ హత్యలో ఆమె పాత్ర ఉన్నట్లు కొడగు పోలీసులు అనుమానించారు. ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. రూ.8 కోట్ల ఆస్తి కోసం ప్రియుడైన వెటర్నరీ డాక్టర్ నిఖిల్, గతంలో జైలులో పరిచయమైన అంకుర్ సహాయంతో భర్త రమేష్‌ను హత్య చేసినట్లు ఆమె ఒప్పుకుంది. అక్టోబర్ 1న హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతంలో ఊపిరాడకుండా చేసి రమేష్‌ను చంపినట్లు కొడగు పోలీస్ అధికారి తెలిపారు.నిందితులు అతడి ఇంటికి చేరుకుని డబ్బు తీసుకున్నారని చెప్పారు. ఆ తర్వాత రమేష్ మృతదేహంతో అతడి కారులో బెంగళూరుకు ప్రయాణించారని పేర్కొన్నారు బంకులో పెట్రోల్ నింపుకున్న తర్వాత కొడగు జిల్లా సుంటికొప్ప సమీపంలోని కాఫీ తోటలో రమేష్ మృతదేహానికి నిప్పంటించారని పోలీస్ అధికారి తెలిపారు. ఆ తర్వాత ముగ్గురు నిందితులు హైదరాబాద్‌కు చేరుకున్నారని, మూడు రోజుల తర్వాత తన భర్త కనిపించడంలేదని నిహారిక ఫిర్యాదు చేసిందని చెప్పారు.కాగా, నిహారిక చిన్నప్పుడు పేదరికం వల్ల చాలా ఇబ్బందిపడినట్లు తెలిసిందని పోలీస్ అధికారి తెలిపారు. 16వ ఏటా ఆమె తండ్రి మరణించడంతో తల్లి రెండో పెళ్లి చేసుకుందని చెప్పారు. చదువులో రాణించిన నిహారిక ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరిందని అన్నారు. ఒక వ్యక్తిని పెళ్లాడిన ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చిందని, ఆ తర్వాత భర్త నుంచి విడిపోయిందని చెప్పారు. హర్యానాలో ఉన్నప్పుడు ఆర్థిక మోసానికి పాల్పడి జైలుకు కూడా వెళ్లిందని అన్నారు. జైలులో అంకుర్ పరిచయమైనట్లు వెల్లడించారు.జైలు నుంచి విడుదలైన తర్వాత హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త రమేష్‌తో నిహారికకు రెండో పెళ్లి జరిగినట్లు పోలీసులు తెలిపారు. అతడికి కూడా ఇది రెండో వివాహమని చెప్పారు. నిహారికకు రమేష్ విలాసవంతమైన జీవితాన్ని అందించాడని చెప్పారు. అయితే లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడిన ఆమె రమేష్‌ను రూ.8 కోట్లు అడిగిందని, అంత డబ్బు ఇచ్చేందుకు భర్త నిరాకరించడతో అతడి ఆస్తి కోసం హత్య చేయాలని ప్లాన్ వేసిందన్నారు. రిలేషన్షిప్లో ఉన్న వెటర్నరీ డాక్టర్ నిఖిల్, జైలులో పరిచయమైన అంకుర్‌తో కలిసి రమేష్‌ను హత్య చేసి 800 కిలోమీటర్ల దూరంలో మృతదేహాన్ని పడేసి కాల్చివేశారని పోలీస్ అధికారి వివరించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
భర్తను సూట్‌కేసులో దాక్కోమని చెప్పి ఊపిరి తీసింది..!
కొన్నిగంటలపాటు భర్తను సూట్‌కేసులో కుక్కి ఆయన చనిపోయేందుకు కారణమైన ఓ ఫ్లోరిడా మహిళను కోర్టు దోషిగా తేల్చింది. ఫ్లోరిడాలోని వింటర్పార్క్ అపార్ట్మెంట్లో సారా బూన్, భర్త జార్జ్ టోరెస్‌తో కలిసి ఉంటున్నారు. 2020లో టోరెస్ ఓ సూట్‌కేస్‌లో శవమై కనిపించాడు. అతని భార్య బూన్‌ను అనుమానించిన పోలీసులు ప్రశ్నించగా.. ‘ఇద్దరం మద్యం తాగి ఉన్నాం. ఆటలో భాగంగా అతను సూట్‌కేసులో దాక్కున్నాడు. అతని వేళ్లు బయటికి ఉన్న కారణంగా జిప్ తీసుకోగలడని భావించాను. నేను మేడపైకి వెళ్లి పడుకున్నా. నిద్రలేచి చూసే సరికి అతను ఇంకా సూట్‌కేసులోనే ఉన్నాడు. అప్పటికే అతని ఊపిరి ఆగిపోయింది’ అని వెల్లడించింది. కేసు విచారణ నాలుగేళ్లపాటు కొనసాగింది. చివరికి బూన్ ఫోనే ఆమెను పట్టించింది. తనను సూట్‌కేసులోంచి తీయాలని టోరెస్ వేడుకుంటుండగా, తాను నవి్వన దృశ్యాలను బూన్ తన ఫోన్లో బంధించింది. అంతేకాదు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని, బయటికి తీయాలని టోరెస్ బతిమాలుతుండగా ‘నీకు దక్కాల్సింది అదే.. నన్ను మోసం చేసినప్పుడు నాకు కూడా అలాగే అనిపించింది. నేను కూడా గట్టిగా ఊపిరి పీల్చుకోలేకపోయాను’ అంటూ బూన్ సమాధానం ఇవ్వడం వీడియోలో రికార్డు అయ్యింది. దీంతో కోర్టు బూన్‌ను దోషిగా తేల్చింది. డిసెంబర్లో శిక్ష ఖరారు చేయనుంది. – వాషింగ్టన్ -
మహిళపై సామూహిక అత్యాచారం.. ఏడుగురు అరెస్ట్
రేవా: మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో అత్యంత దారుణం చోటుచేసుకుంది. భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఓ మహిళపై ఎనిమిదిమంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఉదంతంలో పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. పరారైన మరో నిందితుని కోసం గాలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గూఢ్ తహసీల్‌లోని ఒక పర్యాటక ప్రాంతంలో ఈ సామూహిక అత్యాచార ఘటన అక్టోబర్ 21న చోటుచేసుకుంది. రేవా హెడ్‌క్వార్టర్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) హిమాలి పాఠక్ మీడియాకు ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ.. బాధిత మహిళకు ఇటీవలే వివాహం జరిగిందని, ఆమె, ఆమె భర్త వయస్సు 19 నుండి 20 ఏళ్ల మధ్య ఉంటుందని, వీరిద్దరూ ప్రస్తుతం కాలేజీలో చదువుకుంటున్నారని తెలిపారు.బాధితురాలిని పోలీసులు విచారించినప్పుడు.. ఆమె తనపై లైంగిక దాడికి పాల్పడిన ఎనిమిది మందిలో ఒకరికి చేతులు, ఛాతీపై టాటూలు ఉన్నాయని తెలిపింది. పోలీసులు ఈ కేసు విచారణలో భాగంగా పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేయకుండా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అన్నారు.బాధిత దంపతులు గూఢ్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటనపై ఫిర్యాదు చేశారని, వెంటనే ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నిపుణులు బాధితురాలికి వైద్య పరీక్షలు చేశారన్నారు. వెంటనే తాము ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు. గూఢ్ పారిశ్రామిక ప్రాంతంలోని ఒక దేవాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫౌంటెన్ వద్ద ఆ మహిళ, ఆమె భర్త గొడవ పడ్డారని డీఎస్పీ తెలిపారు. అదే ఫౌంటెన్ దగ్గర ఐదుగురు వ్యక్తులు తనపై వంతులవారీగా అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత మహిళ తన వాంగ్మూలంలో పేర్కొంది. ఈ కేసులో పోలీసులు గుర్హ్ నివాసి రామ్‌కిషన్ కోరి, దీపక్ కోరి, రవేష్ కుమార్ గుప్తా, రాంపూర్ బఘెలాన్ వాసి సుశీల్ కోరి, రాజేంద్ర కోరి, తరుణ్ కోరి, నైగర్హి వాసి లవకుష్ కోరిలను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న గూఢ్ నివాసి రజనీష్ కోరిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు.నిందితులు బాధితురాలి భర్తను బందించారని ఎస్పీ సింగ్ తెలిపారు. అలాగే వారు ఈ ఘటనకు సంబంధించిన వీడియోను రికార్డు చేశారన్నారు. కాగా ఈ ఘటనపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితూ పట్వారీ మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటన రెండు రోజుల వరకూ ఎవరికీ తెలియజేదని, ఇది ఆటవిక రాజ్యం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర హోంశాఖ పేరును జంగిల్ రాజ్ శాఖగా మార్చాలని ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్‌లో నేరాలు పెరిగిపోతున్నాయని, రాష్ట్రంలో ప్రతిరోజూ 18 నుంచి 20 మంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నారని ఆయన ఆరోపించారు. ఇది కూడా చదవండి: ఈ నెల 28న భూమి సమీపానికి భారీ గ్రహశకలం -
వైవాహిక అత్యాచారం కేసుల విచారణ వాయిదా
న్యూఢిల్లీ: వైవాహిక అత్యాచారం ఘటనల్లో భర్తపై నేరం మోపకుండా చట్టం కల్పిస్తున్న రక్షణలపై నమోదైన కేసుల విచారణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నాలుగు వారాలు వాయిదావేసింది. నవంబర్ పదో తేదీన సీజేఐ చంద్రచూడ్ పదవీవిరమణ నేపథ్యంలో ఇక ఈ కేసులను ఆయన విచారించబోరని తెలుస్తోంది. కోర్టుకు దీపావళి సెలవు దినాలు మొదలుకానున్న నేపథ్యంలో ఈ కేసుల వాదోపవాదనలను ముగించలేకపోతున్నానని ఆయన చెప్పారు. కేసులో తగిన పత్రాల దాఖలుకు సంబంధిత న్యాయవాదులకు తగు గడువు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం కాకుండా ఈ కేసుల తదుపరి విచారణను మరో ధర్మాసనం ఆలకించే వీలుంది. మైనర్కాని భార్యతో బలవంతంగా శృంగారం చేసిన భర్తకు భారతీయ శిక్షా స్మృతి, భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) చట్టాలు విచారణ నుంచి రక్షణ కల్పిస్తున్న విషయం తెల్సిందే. ఈ కేసుల విచారణ అక్టోబర్ 17న మొదలైంది. ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం 18ఏళ్లు దాటిన భార్యతో బలవంతగా భర్త సంభోగించినా అది రేప్‌గా పరిగణించబోరు. అలాగే బీఎన్ఎస్లోని సెక్షన్ 63(రేప్)(2) ప్రకారం చూసినా ఈ చర్యను అత్యాచారంగా పరిగణించరు. మారుతున్న సామా జిక పోకలు, ఆధునిక సమాజంలో భర్త సాన్నిహిత్య పరిస్థితుల్లో భార్య సమ్మతి ఉంది లేదు అనే అంశాన్ని నిరూపించడం అసంభవమని కేంద్రం గతంలో సుప్రీంకోర్టుకు తెలిపింది. చట్టాలను దుర్విని యోగం చేస్తూ ఈ మినహాయింపు రక్షణ నుంచి భర్తను పక్కకు జరిపితే భారతీయ సామాజిక, కుటుంబ వ్యవస్థలో కొత్త సమస్యలు ఉత్పన్నమ య్యే ప్రమాదముందని కేంద్రం పేర్కొంది. -
ట్రెండింగ్‌లో సాక్షి మాలిక్: ఆమె భర్త ఎవరో తెలుసా? అతడి బ్యాగ్రౌండ్ ఇదే! (ఫొటోలు)
-
ఐదు రోజులుగా భర్త అంత్యక్రియలను నిర్వహించని భార్య
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): ఆస్తి వివాదంతో జీవితంపై విరక్తి చెంది ఉరేసుకొని యువకు డు ఆత్మహ్యకు పాల్పడ్డాడు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సిందేనని మృతుడి భార్య, బంధువులు ఆందోళన చేపట్టడంతో ఐదు రోజుల తర్వాత అంత్యక్రియలు జరిగాయి. ఈ ఘటన సదాశివపేట మండల పరిధిలోని తంగడపల్లి గ్రామంలో మంగళవారం ఆలస్యంగా వెలు గులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన సిరిపురం మణయ్య, మణెమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు నవీన్, రాములు, కుమార్తె రజిత ఉన్నారు. గతేడాది చిన్న కుమారుడు నవీన్ మృతి చెందాడు. అతడి భార్యకు భూమి ఇవాల్సి వస్తుందని మణయ్య, మణెమ్మ దంపతులు తమ మూడెకరాల భూమిని అల్లుడు హోంగార్డ్ మల్లేశం పేరుపై సెల్ డీడ్ చేశారు. ఈ విషయం తెలిసి భూమిలో సగం వాటా తనకు ఇవ్వాలని పెద్దకుమారుడు రాములు(32) అడిగాడు. వారు ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురై 18న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని అదే రోజు రాత్రి సదాశివపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్తిలో తమకు వాటా ఇవ్వాలని మృతుడి భార్య, బంధువులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో మృతదేహం ఐదురోజులుగా ఆస్పత్రిలోనే ఉంది. మంగళవారం సమస్య సద్దుమణగడంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారి ఫిర్యాదు మేరకు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ మహేష్ గౌడ్ తెలిపారు. -
‘కర్వా చౌత్’ హామీని విస్మరించిన భర్తపై ఫిర్యాదు
ఆగ్రా: యూపీలోని ఆగ్రాలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. పుట్టింటిలో ఉన్న ఒక మహిళకు ఆమె భర్త ‘కర్వా చౌత్’ వ్రతానికి ముందురోజు తన ఇంటికి తీసుకువెళానని హామీనిచ్చాడు. అయితే దానిని భర్త నెరవేర్చకపోవడంతో భార్య నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.వివరాల్లోకి వెళితే మల్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక యువతికి ఏడాది క్రితం మధురలో వివాహం జరిగింది. ఆమె భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. పెళ్లయిన నాలుగు నెలల వరకూ వారి కాపురం సవ్యంగానే సాగింది. ఆ తర్వాత ఆమెకు భర్త, అత్తమామల నుంచి వేధింపులు మొదలయ్యాయి.దీనిని ఆమె వ్యతిరేకించడంతో అత్తామామలు ఆమెను ఇంటి నుంచి గెంటివేశారు. దీంతో ఆమె రెండు నెలలుగా తన పుట్టింటిలోనే ఉంటోంది. అలాగే ఈ విషయమై బాధితురాలు ఆగ్రా ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించింది. ఈ నేపధ్యంలో భర్త కర్వా చౌత్ వ్రతానికి ఒక రోజు ముందు తన భార్యను ఇంటికి తీసుకెళ్తానని కౌన్సెలర్ ఎదుట హామీనిచ్చాడు.అయితే భర్త ఈ హామీని విస్మరించాడు. దీంతో కౌన్సెలింగ్ అధికారులు భర్తను కేంద్రానికి పిలిపించారు. అక్కడికి వచ్చిన భర్త కౌన్సెలింగ్ అధికారులతో తన భార్య తన తల్లిదండ్రులతో అసభ్యకరమైన భాషలో మాట్లాడుతుంటుందని ఆరోపించాడు. ఉదయం 9 గంటల వరకు నిద్రపోతూనే ఉంటుందని, ఏ పనీ చేయదని పేర్కొన్నాడు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరికీ కౌన్సెలింగ్ జరుగుతోంది. ఇది కూడా చదవండి: నగరమంతా తిప్పి.. సెల్‌ఫోన్‌తో ఉడాయించి.. -
పెళ్లింట విషాదం.. భార్యకు పురుగులమందు కలిపి
సాక్షి, నల్లగొండ: పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. పురుగులమందు కలిపిన కూల్‌డ్రింక్‌ను భార్యకు తాగించి.. ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఏఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం మొసంగి గ్రామానికి చెందిన బడుగుల వెంకటయ్య(43)– జ్యోతి దంపతులు ఈనెల 16న కుమార్తె వివాహం జరిపించారు. ఆదివారం తమ కుమార్తెను అత్తగారి ఇంటి నుంచి తీసుకురావాల్సి ఉండగా, పురుగుల మందు కలిపిన కూల్ డ్రింక్‌ను భార్య జ్యోతికి ఇచ్చి, తాను గదిలోకి వెళ్లి తలుపులు వేసుకొని గడియ పెట్టుకున్నాడు. అప్పటికే కొంచెం కూల్‌డ్రింక్ తాగిన జ్యోతి పురుగుల మందు వాసన ఉండడంతో పారబోసింది. అనుమానం వచ్చి చుట్టుపక్కల వారిని పిలిచింది. వారు వచ్చి తలుపులు తెరిచారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన నల్లగొండకు తరలించారు. వెంకటయ్య మృతి చెందగా, జ్యోతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు అర్థం కావడంలేదని.. చిలుకూరు: ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు అర్థం కావడం లేదని, దీంతో మార్కులు తక్కువ వస్తున్నాయని ఇంటర్ విద్యార్థి మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిధిలోని కవిత జూనియర్ కళాశాలలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం సజ్జాపురానికి చెందిన బీమన శేఖర్ కుమారుడు బీమన వినయ్ (17) చిలుకూరు మండల పరిధిలోని కవిత జూనియర్ కళాశాలలో ఎంపీసీ గ్రూప్‌లో చేరాడు. 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివిన వినయ్.. ఇంటర్లో ఇంగ్లిష్ మీడియంలో సబ్జెక్టులు అర్థంకాక మార్కులు తక్కువగా వస్తున్నాయని కొంతకాలంగా బాధపడుతున్నాడు. ఈ క్రమంలో దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన వినయ్ తిరిగి కళాశాలకు వెళ్లడానికి ఇష్టపడలేదు. దీంతో తల్లిదండ్రులు సర్ది చెప్పి ఆదివారం అతడిని మేనమామ, బంధువులు తీసుకొని వచ్చి కళాశాలలో విడిచి పెట్టి వెళ్లారు. ఆ సమయంలో స్టడీ అవర్స్ నడుస్తుండటంతో విద్యార్థులు, అధ్యాపకులు తరగతి గదుల్లో ఉన్నారు. హాస్టల్ గదిలో లగేజీ పెట్టి వస్తానని వెళ్లిన వినయ్ అక్కడున్న ఫ్యాన్‌కు టవల్‌తో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అరగంట తరువాత గమనించిన తోటి విద్యార్థులు, అధ్యాపకులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం కోదాడలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వినయ్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాంబాబు తెలిపారు. దసరా సెలవులు ముగించుకుని తిరిగి వెళ్లిన రోజే ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.