
అమ్మా..! సుధా(పేరు మార్చాం) బాగా చదువుకున్నావు. మంచి ఉద్యోగం చేస్తున్నావు. మా వయసు మీద పడిపోతుంది. నిన్ను ఓ అయ్య చేతిలో పెట్టాలని మీ నాన్న కంగారు పడుతున్నారు. నీకు ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పు. సంబంధాలు వెతుకుతాం అంటూ జానకి తన కూతురికి విజ్ఞప్తి చేసింది. తల్లి విజ్ఞప్తితో ఏమో అమ్మా.. మీకు ఎలా నచ్చితే అలా చేయండి. నా పెళ్లి నీ ఇష్టం అని చెప్పడంతో నా బంగారు తల్లి అనుకుంటూ భర్త భూషణ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లింది.
ఏవండోయ్ సుధా పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంది.. మనోళ్లు ఉన్నారు కదా మంచి సంబంధం చూసి పెట్టమనండి అంటూ వంటింట్లోకి వెళ్లిన జానకి గుక్కెడు పంచదారను భర్త భూషణం నోట్లు కుమ్మరించింది. భార్య జానకి మాటలకు సంబరపడిపోయిన భర్త నాగభూషణం కుమార్తె సుధాకు పెళ్లి సంబంధాలు చూసేందుకు పక్కూరు తన పెద్దమ్మ పార్వతమ్మ ఇంటికి బయల్దేరాడు. ఈ స్టోరీ వినడానికి ఎంత బాగుంది.
కానీ అదే సుధని పెళ్లి సంబంధాలు చూస్తాం. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పమ్మా అంటూ అడిగిన తల్లిదండ్రులకు ఎలాంటి కోరికలు లేవంటూనే తనకు కాబోయే వరుడిలో 18 రకాల కోరికలు ఉండాలంటూ తన కోరికల చిట్టా విప్పితే ఎలా ఉంటుంది. ప్రస్తుతం ఓ యువతి విషయంలో అలానే జరిగింది. పేరు, ఊరు వెలుగులోకి రాలేదు. కానీ ఆమె కోరికల చిట్టా వెలుగులోకి వచ్చింది. ఆ కోరికల చిట్టా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
జీతం ఏడాదికి 3లక్షల డాలర్ల సంపాదించాలి (మన కరెన్సీలో దాదాపు రూ.2.5 కోట్లు!)
జెనరస్, స్పాయిల్‌గా ఉండాలి. అంటే భోజనం, ప్రయాణం, ఫ్యాషన్ ఇలా ప్రతీది కాస్ట్లీగా ఉండాలి
- లగ్జరీ లైఫ్ ఇష్టపడాలి (ఫైన్ డైనింగ్, ట్రావెలింగ్, వైన్ టేస్టింగ్, ఆర్ట్ ఎగ్జిబిషన్స్)
- నన్ను నిజంగా ప్రేమించాలి. అన్ని విషయాల్లో నాకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి
- ఎమోషనల్ ఇంటెలిజెంట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌గా ఉండాలి
- నైట్ ఎప్పుడైనా బయటికి వెళితే షాడోలా నన్ను వెన్నంటే ఉండాలి
- ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించడానికి నిరంతరం, దూర దృష్టితో కష్టపడి పనిచేసే వ్యక్తి కావాలి
- కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇష్టమైన వారితో గడపడం. తరచుగా కుటుంబ విలువలు, సంప్రదాయాలు బాధ్యతలకు ప్రాముఖ్యత ఇవ్వాలి
- సోషల్ మీడియాలో షో ఆఫ్ వద్దు. ప్రైవసీ ఇష్టం
- శృంగారం విషయంలో నమ్మకంగా ఉండాలి.
- నాకు పిల్లలు వద్దు .. ఆవిషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి
- ఇంటి పని,వంట పని ఇలా అన్నింట్లో సహాయపడే వ్యక్తే జీవిత భాగస్వామి కావాలని పోస్టులో పేర్కొంది.
She sent me a list of her requirements. One of them includes a salary of $300k+
byu/New_Ambassador2442 inTinder