కేన్సర్‌తో బాధపడుతున్న భర్తను రక్షించుకునేందుకు నేపాలీ యువతి పడిన వేదన, ప్రేమతో అతనికి సేవలు, చివరకు అతను కన్నుమూసిన తీరు పలువురి హృదయాలను కదిలించింది. భార్యభర్తల ప్రేమ అంటే ఇలా ఉండాలి అంటూ చాలామంది అభిప్రాయపడ్డారు. దాదాపు ఇలాంటి మరో విషాద ఘటన గురించి తెలిస్తే కళ్లు చెమర్చక మానవు. రాజస్థాన్‌లోని కోటాలో ఈ ఘటన జరిగింది.
జైపూర్‌కు చెందిన దేవేంద్ర సందాల్ కోటాలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌లో మేనేజర్‌గా పని చేసేవారు.. అతని భార్య టీనా అనారోగ్యం బారిన పడింది. దీంతో ఆమెను కంటికి రెప్పలా కాపాడుకువాలనే లక్ష్యంతో మూడేళ్ల పదవీకాలం ఉండగానే ముందస్తు రిటైర్‌మెంట్ ( వీఆర్ఎస్) తీసుకున్నారు. ఈ సందర్బంగా దేవంద్ర సహోద్యోగులు వీడ్కోలు పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో భార్యాభర్తలిద్దరూ ఉత్సాహంగా, నవ్వుతూ కనిపించారు. దండలు, శాలువాలు, స్నేహితులిచ్చిన పూల బొకేలతో ఫోటోలకు ఫోజులిచ్చారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా అక్కడి పరిస్థితి మారిపోయింది.
नियति का खेल !
पत्नी की तबीयत को देखते हुए पति ने लिया था VRS, रिटायरमेंट पार्टी में ही पत्नी की मौत,
बीमार पत्नी की सेवा के लिए नौकरी छोड़ी, विदाई पार्टी में पत्नी ने हीं दुनिया छोड़ दी ।
pic.twitter.com/yUn0xAGFch— राहुल चेची 🇮🇳 (@Rahulchechi26) December 25, 2024
కళ్లు తిరుగుతున్నాయంటూ టీనా కుర్చీలో కూలబడింది. భార్య వీపుపై రుద్దుతూ సపర్యలు చేస్తూ మంచినీళ్లకు కోసం అడిగాడు. ఇంతలోనే పరిస్థితి మరింత విషమంగా మారిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు ధవీకరించారు.
భర్తతో నవ్వుతూ, సంతోషంగా ఉన్న టీనా ఒక్కసారిగా గుండెపోటుతో మరణించిన దృశ్యాలు సంబంధించిన వీడియోలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పటివరకూ హాయిగా నవ్వుతూ, అందర్నీ పలకరిస్తూ ఫొటోలు దిగిన ఆమెకు అవే చివరి క్షణాలవుతాయని ఎవరనుకుంటారు. అందరూ చూస్తుండగానే క్షణాల్లో టీనా ఈ ప్రపంచం నుంచి శాశ్వత వీడ్కోలు తీసుకోవడం విషాదాన్ని నింపింది.
Comments
Please login to add a commentAdd a comment