VRS
-
భార్య కోసమే వీఆర్ఎస్, భర్త గుండె పగిలిన వైనం, వీడియో వైరల్
కేన్సర్‌తో బాధపడుతున్న భర్తను రక్షించుకునేందుకు నేపాలీ యువతి పడిన వేదన, ప్రేమతో అతనికి సేవలు, చివరకు అతను కన్నుమూసిన తీరు పలువురి హృదయాలను కదిలించింది. భార్యభర్తల ప్రేమ అంటే ఇలా ఉండాలి అంటూ చాలామంది అభిప్రాయపడ్డారు. దాదాపు ఇలాంటి మరో విషాద ఘటన గురించి తెలిస్తే కళ్లు చెమర్చక మానవు. రాజస్థాన్‌లోని కోటాలో ఈ ఘటన జరిగింది.జైపూర్‌కు చెందిన దేవేంద్ర సందాల్ కోటాలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో మేనేజర్‌గా పని చేసేవారు.. అతని భార్య టీనా అనారోగ్యం బారిన పడింది. దీంతో ఆమెను కంటికి రెప్పలా కాపాడుకువాలనే లక్ష్యంతో మూడేళ్ల పదవీకాలం ఉండగానే ముందస్తు రిటైర్మెంట్ ( వీఆర్ఎస్) తీసుకున్నారు. ఈ సందర్బంగా దేవంద్ర సహోద్యోగులు వీడ్కోలు పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో భార్యాభర్తలిద్దరూ ఉత్సాహంగా, నవ్వుతూ కనిపించారు. దండలు, శాలువాలు, స్నేహితులిచ్చిన పూల బొకేలతో ఫోటోలకు ఫోజులిచ్చారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా అక్కడి పరిస్థితి మారిపోయింది.नियति का खेल !पत्नी की तबीयत को देखते हुए पति ने लिया था VRS, रिटायरमेंट पार्टी में ही पत्नी की मौत,बीमार पत्नी की सेवा के लिए नौकरी छोड़ी, विदाई पार्टी में पत्नी ने हीं दुनिया छोड़ दी ।pic.twitter.com/yUn0xAGFch— राहुल चेची 🇮🇳 (@Rahulchechi26) December 25, 2024కళ్లు తిరుగుతున్నాయంటూ టీనా కుర్చీలో కూలబడింది. భార్య వీపుపై రుద్దుతూ సపర్యలు చేస్తూ మంచినీళ్లకు కోసం అడిగాడు. ఇంతలోనే పరిస్థితి మరింత విషమంగా మారిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు ధవీకరించారు.భర్తతో నవ్వుతూ, సంతోషంగా ఉన్న టీనా ఒక్కసారిగా గుండెపోటుతో మరణించిన దృశ్యాలు సంబంధించిన వీడియోలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పటివరకూ హాయిగా నవ్వుతూ, అందర్నీ పలకరిస్తూ ఫొటోలు దిగిన ఆమెకు అవే చివరి క్షణాలవుతాయని ఎవరనుకుంటారు. అందరూ చూస్తుండగానే క్షణాల్లో టీనా ఈ ప్రపంచం నుంచి శాశ్వత వీడ్కోలు తీసుకోవడం విషాదాన్ని నింపింది. -
వీఆర్ఎస్, వీఎస్ఎస్ ప్రకటించిన ఎయిరిండియా
ఎయిరిండియా స్వచ్ఛంద విభజన పథకం(వాలెంటరీ సెపరేషన్ స్కీమ్)తో పాటు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (వీఆర్ఎస్) రూపొందించింది. కంపెనీలో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులకు వీఆర్ఎస్ స్కీమ్ అందుబాటులో ఉంటుందని, ఐదేళ్ల లోపు సర్వీస్ ఉన్నవారికి వీఎస్ఎస్ వర్తిస్తుందని పేర్కొంది. ఈ పథకాలను నాన్ ఫ్లైయింగ్ పర్మనెంట్ స్టాఫ్ కోసం తయారుచేసినట్లు చెప్పింది. అయితే వీటికి సంబంధించిన నిర్దిష్ట వివరాలను మాత్రం వెల్లడించలేదు.ఎయిరిండియాను ప్రైవేటీకరణ చేసిన తర్వాత శాశ్వత ఉద్యోగుల కోసం స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రవేశపెట్టడం ఇది మూడోసారి. విస్తారా ఎయిర్‌లైన్స్ టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియాలో విలీనానికి సిద్ధమవుతున్న తరుణంలో ఇలాంటి పథకాలు రావడం గమనార్హం. ఈ నెల ప్రారంభంలో రెండు ఎయిర్‌లైన్స్‌లోని దాదాపు 600 మంది ఉద్యోగులపై ఈ విలీనం ప్రభావం చూపుతుందని కొన్ని సంస్థలు నివేదికలు తెలిపాయి. ఎయిరిండియా, విస్తారాలో కలిపి సుమారు 23,000 మంది ఉద్యోగులు ఉన్నారు.ఇదీ చదవండి: కంపెనీలు వెళ్లిపోతాయ్..!విలీన ప్రక్రియలో భాగంగా ఫిట్మెంట్ విధానాలు, ఉద్యోగ స్థానాల కేటాయింపు పూర్తయిన తర్వాత విస్తారా కూడా ఇలాంటి స్కీమ్‌లను ప్రకటించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విస్తారా సింగపూర్ ఎయిర్‌లైన్స్, టాటా గ్రూప్ మధ్య జాయింట్ వెంచర్‌గా ఉంది. రెండు సంస్థల విలీనం పూర్తయితే ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు 25.1 శాతం వాటా దక్కుతుంది. -
డీఆర్ఎస్ కాస్త వీఆర్ఎస్ అయ్యింది.. గురువును మించిన శిష్యుడు
-
ఉద్యోగులకు షాక్..వీఆర్ఎస్పై హీరోమోటోకార్ప్ కీలక ప్రకటన!
ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రకటించింది. మోటో కార్ప్ సంస్థ టూవీలర్ల తయారీలో రోబో టెక్నాలజీని వినియోగించాలని, తద్వారా మరింత ఉత్పాదకత సాధించాలని కంపెనీ భావిస్తోంది. ఇందులో భాగంగానే గత కొంత కాలంగా సంస్థలో ఉద్యోగ సమస్యలు పరిష్కరించేందుకు హీరో మోటోకార్ప్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో హీరో మోటోకార్ప్ ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించింది. ఉద్యోగులకు వన్‌టైమ్ సెటిల్మెంట్, వేరియబుల్ పే, మెడికల్ కవరేజ్, కంపెనీ అందించే కారుకు అద్దె చెల్లింపులు వంటి వాటితోపాటు ఇతర ప్రోత్సహాకాలు ఉంటాయని హీరో మోటోకార్ప్ తెలిపింది. ఇక గత రెండేళ్లలో మార్కెటింగ్, ఆర్అండ్డీ, హెచ్ఆర్, ఎలక్ట్రిక్ వాహనాలు విభాగాలకు కొత్త సీఈవోలను సంస్థలోని వారిని ఎంపిక చేసింది. ఫైనాన్స్, ఎలక్ట్రిక్ వాహన విభాగానికి బయటి వ్యక్తులను సీఈవోలుగా నియమించింది. తాజాగా వీఆర్ఎస్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. -
సీఎం కేసీఆర్.. ఇంటర్నేషనల్ కేడీ.. టీఆర్ఎస్ వీఆర్ఎస్ తప్పదు
సంస్థాన్ నారాయణపురం, చండూరు: టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మార్చిన కేసీఆర్‌కు ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వనున్నారని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్.. ఇంటర్నేషనల్ కేడీ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని గెలిపించాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం మహ్మదాబాద్, నల్లగొండ జిల్లా గట్టుప్పల మండలంలోని శేరిగూడెం గ్రామాల్లో శనివారం రేణుకాచౌదరి ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ’’కేసీఆర్.. నీకు కాంగ్రెస్ పార్టీ భిక్ష పెట్టిందన్న విషయం గుర్తుపెట్టుకో.. పిచ్చి వేషాలు మా దగ్గర కాదు.. నీ పప్పులు ఉడకవు’’ అంటూ హెచ్చరించారు. పాల్వాయి స్రవంతి చేతికి ఉన్నవి గాజులు కావని విష్ణు చక్రాలని అన్నారు. మునుగోడు నియోజకవర్గం తమ్ముడి కోసం అంట.. అన్నదమ్ములిద్దరూ కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని కోమటిరెడ్డి బ్రదర్స్‌ని ఉద్దేశించి విమర్శించారు. చదవండి: సుప్రీం జడ్జి పర్యవేక్షణలో విచారణ జరపాలి -
ఆర్టీసీలో కనిష్టంగా రూ. వెయ్యి పెన్షన్
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణ వ్యవహారంలో ఆర్టీసీ వేగాన్ని పెంచింది. ఇటీవలే దాదాపు 3100 మంది వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోవడం తెలిసిందే. వీఆర్ఎస్ తీసుకుంటే, వచ్చే ఆర్థిక ప్రయోజనాలను స్పష్టం చేస్తూ ఆర్టీసీ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. చెల్లింపులు ఇలా... ►వీఆర్ఎస్ తీసుకున్న రోజు వరకు అర్హత ఉన్న గ్రాట్యుటీ వడ్డీతో కలిపి చెల్లిస్తారు. ►పీఎఫ్‌కు సంబంధించి ఉద్యోగి వితరణ, యాజమాన్యం వితరణ మొత్తాలను వీఆర్ఎస్ తీసుకునే నాటికి లెక్కించి జత చేసి చెల్లిస్తారు. ►పదేళ్లకు పైగా సర్వీసు ఉన్న వారికి కనిష్టంగా రూ.వేయి చొప్పున పెన్షన్ చెల్లిస్తారు. ►స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీం, స్టాఫ్ బెన్వెలెంట్ కమ్ థ్రిఫ్ట్ స్కీం కింద ఉద్యోగి అప్పటివరకు చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో కలిపి అందిస్తారు. ►300 ఆర్జిత సెలవులకు రావాల్సిన మొత్తం లేదా వాస్తవంగా ఖాతాలో క్రెడిటైన అసలు ఈఎల్స్ మొత్తం రెంటిలో ఏది తక్కువో అది చెల్లిస్తారు. ►నోటీసు కాలానికి సంబంధించిన వేతనం చెల్లిస్తారు. వీఆర్ఎస్ తీసుకున్నాక మిగిలిపోయిన సర్వీసు కాలం ఐదేళ్లలోపు ఉంటే వేతనం + చివరిసారి పొందిన కరువు భత్యం ఇంటూ 15/26 ఇంటూ మిగిలిన సర్వీసు ఫార్ములాతో చెల్లిస్తారు. ఐదేళ్లకు పైబడి–పదేళ్లలోపు సర్వీసు ఉంటే పే + చివరిసారి పొందిన కరువుభత్యం ఇంటూ 20/26 ఇంటూ మిగిలిన సర్వీసు ఫార్ములా ప్రకారం చెల్లిస్తారు. పదేళ్లకుపైబడి సర్వీసు ఉంటే పే +చివరి డీఏ ఇంటూ 25/26 ఇంటూ పదేళ్ల మిగిలిన సర్వీసు ఫార్ములా ప్రకారం లెక్కించి చెల్లిస్తారు. ఇక నోషనల్ గ్రాట్యుటీకి సంబంధించి ఐదేళ్ల గరిష్ట మొత్తం లేదా మిగిలిన సర్వీసు కాలానికి లెక్కించిన మొత్తం.. వీటిలో ఏది తక్కువో అది చెల్లిస్తారు. ఉద్యోగి వాటా నోషనల్ పీఎఫ్‌కు.. ఐదేళ్ల గరిష్ట సర్వీసు లేదా మిగిలిన సర్వీసు.. ఏది తక్కువో అది లెక్కించి చెల్లిస్తారు. బస్‌పాస్: సిటీలో మెట్రో ఎక్స్ప్రెస్వరకు, జిల్లా సర్వీసుల్లో డీలక్స్ కేటగిరీ వరకు ఉచితంగా ప్రయాణించొచ్చు. సూపర్ లగ్జరీ ఆపై కేటగిరీల్లో 50 శాతం రాయితీతో ప్రయాణించొచ్చు. ఉద్యోగి మరణించాక ఇదే రాయితీ స్పౌజ్‌కు వర్తిస్తుంది. 2013 వేతన సవరణకు సంబంధించి బకాయి ఉన్న బాండ్స్ మొత్తాన్ని వడ్డీతోపాటు చెల్లిస్తారు. -
ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సంచలన నిర్ణయం: ఐపీఎస్ పదవికి రాజీనామా
RS Praveen Kumar Resignation: సాక్షి, హైదరాబాద్: సంచలనాలు, సంస్కరణలకు చిరునామా అయిన సీనియర్ ఐపీఎస్ అధికారి, అడిషనల్ డైరెక్టర్ జనరల్ రేపల్లె శివ ప్రవీణ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ– మెయిల్ ద్వారా సమాచారం అందించారు. సోమ వారం ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. 1995 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. మరో ఆరేళ్ల సర్వీసు మిగిలి ఉండగానే ఆయన ఈ నిర్ణయం తీసు కోవడంపై పోలీస్ శాఖ, ప్రస్తుతం ఆయన కార్యదర్శిగా ఉన్న గురుకుల సొసైటీల్లో కలకలం రేపుతోంది. వ్యక్తిగత కారణా లతో ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన పేర్కొన్నారు. సోమవారం ఏడీజీ హోదాలో యూసఫ్‌గూడ బెటాలియన్‌లో ఉన్న కొందరు ఆత్మీయులు, ఐపీఎస్ మిత్రులను కలుసుకున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయంలో బయటికొచ్చారు. తర్వాత కొద్దిసేపటికే తన వీఆర్ఎస్ నిర్ణయాన్ని వెలువరించారు. రాష్ట్రవ్యాప్త గుర్తింపు.. ఉమ్మడి రాష్ట్రంలో ప్రవీణ్‌కుమార్ కరీంనగర్, అనంతపూర్ జిల్లాలకు ఎస్పీగా, హైదరాబాద్‌లో డీసీపీ (క్రైమ్), జాయింట్ సీపీ (స్పెషల్ బ్రాంచ్), తర్వాత గురుకుల సొసైటీకి కార్యదర్శిగా పనిచేశారు. కరీంనగర్ ఎస్పీ (2001 నుంచి 2004)గా పనిచేయడం ఆయనకు చాలా గుర్తింపు తెచ్చింది. మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేస్తూనే, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు పనిచేస్తున్న గ్రామంలోనే ఉండాలంటూ ఆయన ఇచ్చిన నినాదం గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, తల్లిదండ్రులను ఎంతగానో ప్రభావితం చేసింది. ‘గురువా మా ఊర్లోనే ఉండు..’అన్న నినాదం జిల్లావ్యాప్తంగా ఉద్యమంగా మారింది. భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీ చేయడంలోనూ కీలక పాత్ర పోషించారు. ఇదీ ఆయన నేపథ్యం.. పూర్తిపేరు: రేపల్లె శివ ప్రవీణ్‌కుమార్ పుట్టింది: ఆలంపూర్, 1967 తల్లిదండ్రులు: ప్రేమమ్మ, బీఆర్ సవరన్న విద్యార్హతలు: వెటర్నరీ సైన్స్‌లో రాజేంద్రనగర్ అగ్రికల్చర్ వర్సిటీ నుంచి మాస్టర్స్, హార్వర్డ్, మసాచుసెట్స్ వర్సిటీల్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ అవార్డులు: పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంటరీ, ప్రెసిడెంట్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్, సెక్యూరిటీ మెడల్ (కేంద్ర హోం శాఖ), యునైటెడ్ నేషన్స్ పోలీస్ మెడల్ (వార్ క్రైం ఇన్వెస్టిగేటర్) సమీప బంధువులు: మాజీ ఎమ్మెల్యే సంపత్, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పోలీసు వెబ్సైట్ సృష్టికర్త హైదరాబాద్‌లో డీసీపీ (క్రైమ్), జాయింట్ సీపీ (స్పెషల్ బ్రాంచ్)గా పనిచేసిన సమయంలో పోలీస్ శాఖలో ఆయన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. సైబర్ నేరాలు పెరుగుతుండటంతో సీసీఎస్‌లో సైబర్ క్రైమ్ సెల్ ఏర్పాటు చేయడంతో పాటు ఓ ఠాణా కావాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటి ఆధారంగానే ఆ తర్వాతి కాలంలో హైదరాబాద్, సైబరాబాద్‌లకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు మంజూరయ్యాయి. నగర పోలీస్ వెబ్సైట్, ట్రాఫిక్ పోలీస్ వెబ్సైట్, ఆన్లైన్ పాస్‌పోర్ట్ వెరిఫికేషన్, ఫారినర్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తదితరాలకు శ్రీకారం చుట్టారు. పోలీసుల మధ్య ఎస్ఎంఎస్ల రూపంలో సమాచార మార్పిడికి హోషియార్, సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ డిలీట్ దెమ్ కార్యక్రమాలు ఆయన ఆలోచనల నుంచి పుట్టినవే. హుజూరాబాద్‌లో పోటీ చేసే ఉద్దేశం లేదు హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని, రాజకీయ ప్రవేశంపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని ప్రవీణ్‌కుమార్ స్పష్టంచేశారు. సోమవారం సాయంత్రం కుందన్‌బాగ్‌లోని తన నివాసం వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. వ్యక్తిగతంగా కొంత విశ్రాంతి కావాలని, 26 ఏళ్లు ప్రభుత్వ సర్వీసులోనే గడిచిపోయాయని, మిగిలిన విషయాలను పట్టించుకోలేదన్నారు. ఇకపై పూర్తిస్థాయిలో పేదలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే పదవీ విరమణ చేశానని వెల్లడించారు. తాను వెళ్లిపోయినంత మాత్రాన గురుకులాల విద్యా సంస్థలకు వచ్చే ఇబ్బందేమీ లేదని వివరించారు. స్వేరోస్ తన సృష్టి కాదని, దాన్ని పూర్వ విద్యార్థులు స్థాపించారని, అందులో తాను అనుకోకుండా చేరానని చెప్పారు. స్వేరోస్‌లో లక్షలాదిమంది ఉన్నారని, దాంట్లో ప్రవీణ్ ఒకడని, తాను ఉన్నా లేకున్నా స్వేరోస్ ముందుకు సాగుతుందదని స్పష్టం చేశారు. pic.twitter.com/AnaEek8baJ — Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) July 19, 2021 -
ఆ బ్యాంకు ఉద్యోగులకు వీఆర్ఎస్..
న్యూఢిల్లీ: ప్రైవేటీకరణ జాబితాలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో(పీఎస్బీ) ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) పథకం అమలు అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆకర్షణీయమైన ప్యాకేజీ అమలు చేయడం ద్వారా సిబ్బంది సంఖ్యను తగ్గించగలిగితే .. బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించాలనుకునే ప్రైవేట్ సంస్థలు వాటిని టేకోవర్ చేసేందుకు మరింత ఆసక్తి చూపవచ్చని భావిస్తోంది. ఆప్షనల్ వీఆర్ఎస్ వీఆర్ఎస్ అనేది ఉద్యోగులకు ఐచ్ఛికంగా ఉంటుందే తప్ప బలవంతంగా సాగనంపే కార్యక్రమం కాదని సంబంధిత వర్గాలు తెలిపాయి. మంచి ప్యాకేజీ లభిస్తే ముందస్తుగా రిటైర్ కావాలనుకునే వారికి ఇది ఆకర్షణీయంగా ఉండగలదని వివరించాయి. కొన్ని పీఎస్‌బీల విలీనం సందర్భంగా గతంలోనూ ఇలాంటి పథకాలు అమలు చేసినట్లు పేర్కొన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు పీఎస్‌బీలు, ఒక సాధారణ బీమా కంపెనీని ప్రైవేటీకరించే యోచనలో ఉన్నట్లు 2021–22 బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. లిస్టులో సెంట్రల్ బ్యాంక్, ఐవోబీ.. ప్రైవేటీకరించే పీఎస్‌బీలను గుర్తించే బాధ్యతను తీసుకున్న నీతి ఆయోగ్.. ఇటీవలే కొన్ని పేర్లను క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా సారథ్యంలోని అత్యున్నత స్థాయి కమిటీకి (సీజీఎస్) సిఫార్సు చేసింది. ఈ లిస్టులో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి ఉన్నాయి. ప్రధానంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. చదవండి: నిధుల సేకరణకు బ్యాంకులు బలి -
టాటా మోటార్స్ ఉద్యోగులకు షాక్!
సాక్షి, ముంబై: అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన ఉద్యోగులకు చేదు వార్త అందించింది. అమ్మకాలు లేక ఆదాయాలు క్షీణించి ఇబ్బందులు పడుతున్న సంస్థ టర్నరౌండ్ ప్రణాళిక, ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (విఆర్ఎస్) ప్రకటించింది. దాదాపు 42,597 మంది ఉద్యోగులను ఇంటికి పంపించనుంది. సంస్థ మొత్తం ఉద్యోగులలో సగం మంది వీఆర్ఎస్ పథకానికి అర్హులని తాజా అంచనా ద్వారా తెలుస్తోంది. నాలుగేళ్లలో మూడోసారి వీఆర్ఎస్ పథకాన్ని టాటా మోటార్స్ ప్రకటించడం గమనార్హం. తాజాప్రకటన ప్రకారం ఐదేళ్ళు లేదా అంతకంటే ఎక్కువ కాలం సంస్థలో పనిచేసినవారు ఈ పథకానికి అర్హులు. ఉద్యోగి వయసు, సంస్థలో వారి సర్వీసు ఆధారంగా పరిహారాన్ని లెక్కించునున్నారు. అర్హతగల ఉద్యోగులు డిసెంబర్ 11 నుండి జనవరి 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. (చైనాకు షాక్ : వేలకోట్ల పెట్టుబడులు ఇండియాకు) కాగా గత కొన్ని సంవత్సరాలుగా తన ఉద్యోగుల వ్యయాన్ని తగ్గించడానికి టాటా మోటార్స్ ప్రయత్నిస్తోంది. 2017లో మొదట వీఆర్ఎస్ పథకాన్ని ప్రారంభించింది. ఆ రువాత 2019 నవంబర్‌లో 1,600 మంది ఉద్యోగులకు వీఆర్ఎస్ అందించింది. 2019 నుండి ఆటో పరిశ్రమ మందగమనం మధ్య, ఇతర ఆటో మేజర్లైన హీరో మోటోకార్ప్ లిమిటెడ్, టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, అశోక్ లేలాండ్ లిమిటెడ్ ఇలాంటి పథకాలను అమలు చేశాయి. 2020, సెప్టెంబర్ 30తో ముగిసిన రెండవ త్రైమాసికంలో 314.5 కోట్ల రూపాయల నష్టాన్ని కంపెనీ నివేదించింది. అంతకు ముందు ఏడాది కాలంలో కంపెనీ రూ .216.56 కోట్ల నష్టాన్ని నమోదు చేయగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో 8,437.99 కోట్లు రూపాయలను నష్టపోయింది. ఆటో సంక్షోభానికి తోడు కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో డిమాండ్ పడిపోవడంతో ఆటో సంస్థలు మరింత కుదేలైన సంగతి తెలిసిందే. -
వీకే సింగ్ వీఆర్ఎస్కు టీ సర్కార్ బ్రేక్
సాక్షి, హైదరాబాద్ : సీనియర్ ఐపీఎస్ అధికారి వినోయ్‌కుమార్ సింగ్(వీకే సింగ్) వీఆర్ఎస్కు తెలంగాణ సర్కార్ బ్రేక్ వేసింది. రెండు కేసుల్లో శాఖపరమైన పెండింగ్‌లో ఉన్న కారణంగా వీఆర్ఎస్ను రద్దు చేస్తున్నట్లు వీకే సింగ్‌కు ప్రభుత్వం తెలిపింది. కాగా జూన్ 26న వీకే సింగ్ వీఆర్ఎస్ అభ్యర్థన పెట్టుకున్నారు. అయితే వీకే సింగ్ పెట్టుకున్న వీఆర్ఎస్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్టు అక్టోబర్ 2న తెలంగాణ సర్కార్ ఆయనకు నోటీస్ పంపించింది. ఈ ఏడాది నవంబర్ 30న వీకే సింగ్ సర్వీసు ముగియనుంది. అయితే తనకు అక్టోబర్ 2న ప్రీ రిటైర్మెంట్ ఇవ్వాలని ఆయన తన లేఖలో కోరారు. జైళ్లశాఖ డీజీగా పనిచేసిన ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. (చదవండి : డీజీపీగా పదోన్నతి ఇవ్వకుంటే రాజీనామా) అయితే కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వటం లేదని ప్రభుత్వంపై కినుక వహించారు. తన సేవలకు తగిన గుర్తింపు లేదంటూ వీకే సింగ్ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. కాగా వీకే సింగ్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలోనే జూన్ 26న వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీఆర్ఎస్ పెట్టుకున్న కొద్దిరోజుల్లోనే ఆయనను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. స్టేట్ పోలీస్ అకాడమీ నుంచి డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలంటూ వీకే సింగ్‌కు అప్పట్లో ప్రభుత్వం ఆదేశించింది. కానీ దీనికి ఒప్పుకోని వీకే సింగ్ రాజీనామాకు కూడా సిద్దపడ్డారు. -
ఎస్బీఐ ఉద్యోగులకు 'స్వచ్ఛంద షాక్'
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మరోసారి ఉద్యోగులకు షాకివ్వనుంది. ఖర్చులను తగ్గించే లక్ష్యంతో రెండవ విడత స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (విఆర్ఎస్) అమలు చేయనుంది. ఇందులో భాగంగా దాదాపు 30,190 మంది ఉద్యోగులను ఇంటికి పంపించనుంది. వీఆర్ఎస్ కోసం ముసాయిదా పథకం సిద్ధం చేసి బోర్డు అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్లు పీటీఐ వర్గాలు తెలిపాయి. ప్రతిపాదిత పథకం 'సెకండ్ ఇన్నింగ్స్ ట్యాప్ వీఆర్ఎస్-2020' పేరుతో ఒక డ్రాఫ్ట్ సిద్ధం చేసిందనీ, బోర్డు ఆమోదం అనంతరం ఆచరణకు సిద్ధమవుతోందన్న ఆందోళన బ్యాంకు వర్గాల్లో నెలకొంది. డిసెంబర్ 1న ప్రారంభమై, ఫిబ్రవరి వరకు మాత్రమే అర్హులైన వారినుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. కటాఫ్ తేదీ నాటికి 25 ఏళ్ల సర్వీసు లేదా 55 ఏళ్ల వయస్సు నిండిన పర్మినెంట్ ఆఫీసర్లు, సిబ్బందికి ఇది వర్తిస్తుంది. మొత్తం 11,565 మంది అధికారులు,18,625 మంది సిబ్బంది వీఆర్ఎస్కు అర్హులు. వారిలో 30 శాతం మంది ముందుకొస్తారని అంచనా. తద్వారా సుమారు 2,170 కోట్ల రూపాయలను ఆదా చేయాలని బ్యాంక్ ఆశిస్తోంది. పరిహారం, ప్రయోజనాలు విఆర్ఎస్ కింద పదవీ విరమణ ఎంచుకున్నసిబ్బందికి మిగిలిన 18 నెలల చివరి వేతనానికి లోబడి, మిగిలిన కాలానికి (సూపరన్యుయేషన్ తేదీ వరకు) 50 శాతం జీతం చెల్లించాలి. వీఆర్ఎస్ను ఎంచుకునే ఉద్యోగులకు గ్రాట్యుటీ, పెన్షన్, ప్రావిడెంట్, మెడికల్ బెనిఫిట్స్ వంటి ఇతర ప్రయోజనాలను కూడా అందించనుంది. ఈ పథకం కింద పదవీ విరమణ చేసిన సిబ్బంది పదవీ విరమణ చేసిన తేదీ నుండి రెండేళ్ల కూలింగ్ ఆఫ్ కాలం తర్వాత బ్యాంకులో తిరిగి ఉద్యోగం పొందటానికి, లేదా సర్వీసులు అందించేందుకు అర్హులు. కాగా ఎస్బీఐ 2020 మార్చి చివరినాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.49 లక్షలు. గత ఏడాది ఇదే కాలంలో వీరి సంఖ్య 257,000. -
సుదీర్ఘ అనుబంధానికి... స్వచ్ఛందంగా స్వస్తి..!
సాక్షి, హైదరాబాద్: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)తో ఏర్పరచుకున్న సుదీర్ఘ్ఘ అనుబంధాన్ని ఆ సంస్థ మెజార్టీ ఉద్యోగులు శుక్రవారం స్వచ్ఛందంగా తెంచుకున్నారు. బీఎస్ఎన్ఎల్ స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్ఎస్) ప్రవేశపెట్టడంతో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ శ్రేణికి చెందిన ఐదు పదుల వయసు దాటిన ఉద్యోగులందరూ పదవీ విరమణ చేశారు. హైదరాబాద్ నగరంలోని టెలికం ఉద్యోగుల్లో సుమారు 77% మంది వీఆర్ఎస్ తీసుకున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సంస్థలో కొత్తగా చేరిన ఉద్యోగులు మినహా మిగిలిన వారంతా వీఆర్ఎస్ తీసుకున్నారు.ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు సంస్థ ఆస్తుల్లో కొన్నింటిని లీజులు, అద్దెలకు ఇచ్చింది. తాజాగా ఉద్యోగుల వీఆర్ఎస్తో మిగిలిన భవన సముదాయాలు సైతం ఖాళీ ఆయ్యాయి. బీఎస్ఎన్ఎల్ భవన్ మూడొంతులు ఖాళీ నగరంలోని ఆదర్శనగర్‌లో గల టెలికం ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ (పీజీఎం) కార్యాలయమైన బీఎస్ఎన్ఎల్ భవన్ మూడొంతులు ఖాళీ అయింది.ఉన్నతాధికారుల నుంచి నాల్గోవ తరగతి సిబ్బంది వరకు పదవీ విరమణ చేయడంతో పలు సెక్షన్లు బోసిపోయాయి. బీఎస్ఎన్ఎల్ భవన్‌లోని కొన్ని అంతస్తులను జీఎస్టీ శాఖకు అద్దెకివ్వగా ఖాళీ అయిన మిగిలిన అంతస్తులు సైతం అద్దెకు ఇచ్చేందుకు ఇప్పటికే టెండర్లు ఆహ్వానించారు. అదేవిధంగా నగరంలోని లింగంపల్లి, చార్మి నార్, చాంద్రాయణగుట్ట, నాచారం, గౌలిగూడ, తిరు మలగిరి, చర్లపల్లి, అమీర్‌పేట, ఎర్రగడ్డలోని టెలికం భవనాల్లో వివిధ అంతస్తులు, సరూర్‌నగర్‌లోని ఏరియా మేనేజర్ ఆఫీసు, ఎస్‌డీఓటీ ఆఫీసు, తిరుమలగిరిలోని సిబ్బంది నివాస సమదాయంలోని వివిధ అంతస్తులు అద్దెకు ఇచ్చేందుకు సిద్ధమైంది. వీటితో పాటు ఎర్రగడ్డ, కేపీహెచ్‌బీ, నాచారం, కాచిగూడ, ఖైరతాబాద్, సరూర్‌నగర్, పద్మారావు నగర్, గౌలిగూడ, గచ్చిబౌలి, మాదాపూర్, కుషాయిగూడలలోని టెలికం భవనాల్లో, కోటిలోని నివాస సముదాయాల్లో, సైఫాబాద్‌లోని టెలికం భవన్‌ల్లో ఏటీఎంలకోసం 100 ఎస్ఎఫ్టీ వంతున అద్దెకు ఇస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. నగరంలో ఇలా... హైదరాబాద్ టెలికం జిల్లా పరిధిలో మొత్తం 3,500 మంది ఉద్యోగులకు గాను అందులో 2,613 మంది ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఎగ్జిక్యూటివ్ కేడర్‌కు చెందిన వారిలో 17 మంది డీజీఎంలు, 80 ఎజీఎంలు, 100 మంది ఎస్‌డీవోలు, 80 మంది జేటీవోలు ఉన్నారు. మిగతా వారిలో నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్‌కు చెందిన వారున్నారు.హైదరాబాద్ సర్కిల్ సీజీఎం పరిధిలోకి వచ్చే మరో 284 మంది ఉద్యోగులు సైతం వీఆర్ఎస్ తీసుకున్నారు. -
ఆ ఉద్యోగులు రూ. 90 లక్షలు పొందనున్నారా ?
న్యూఢిల్లీ : బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకం కింద 50 సంవత్సరాలు పైబడిన కొంత మంది ఉద్యోగులు రూ. 90 లక్షలు ప్యాకేజీ పొందే అవకాశం ఉంది. దీంతో 50 సంవత్సరాలు దాటిన ఉద్యోగులు పెద్ద మొత్తంలో వీఆర్ఎస్ను ఎంచుకునే అవకాశం ఉంది. బీఎస్ఎన్ఎల్ ఇటీవల చేపట్టిన స్వచ్ఛంద పదవి విరమణ పథకం ప్రకారం 50 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న ఉద్యోగులు పదవి విరమణను ఎంచుకోవడానికి అర్హులుగా ప్రకటించింది. దీంతో బీఎస్ఎన్లో పని చేస్తున్న 1.6 లక్షల మంది ఉద్యోగుల్లో కనీసం 63శాతం అంటే లక్ష మంది వీఆర్ఎస్ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రెండు వారాల్లోనే ఈ పథకానికి దాదాపు 80వేల మంది ఎన్రోల్ చేసుకున్నారు. డిసెంబరు 3వ తేదీ వరకు అవకాశం ఉండడంతో వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే బీఎస్ఎన్లో ఉద్యోగులకు ప్రస్తుత పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలు కాగా, 55 ఏళ్లు నిండిన వారికి వీఆర్ఎస్ పథకం కింద మిగిలిన ఐదేళ్ల కాలానికి జీతం చెల్లించాల్సి ఉంటుంది. ప్రసుత్తం వీఆర్ఎస్ పొందే ఉద్యోగులు జీతంతో పాటు అదనంగా పొందనున్న పదవీ విరమణ ప్యాకేజీతో లక్షాధికారులుగానే రిటైర్ అవ్వనున్నట్లు తేలింది. ఎందుకంటే బీఎస్ఎన్ఎల్ నెలవారీ జీతం బడ్జెట్ సుమారు రూ .1,200 కోట్లు ఉండగా, పదవీ విరమణకు దగ్గరగా ఉన్న వ్యక్తులు నెలకు కనీసం 75,000 రూపాయల జీతం అందుకుంటున్నట్లు తెలుస్తుంది.ఈ పథకాన్ని ఎంచుకున్న 50 సంవత్సరాల వయస్సులో ఉన్న కొంతమంది ఉద్యోగులు రూ .90 లక్షల విరమణ ప్యాకేజీని పొందే అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక 50 ఏళ్ల బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి సుమారు 75,000 రూపాయలు సంపాదిస్తున్నారని అనుకున్నా, వీఆర్ఎస్ తీసుకుంటే ఇంకా 10 సంవత్సరాల సేవ మిగిలి ఉంటుంది. దీంతో సదరు ఉద్యోగికి ఆ మొత్తం కాలానికి వేతనంతో పాటు ప్యాకేజీ లభించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా, 59 సంవత్సరాల వయస్సు గల ఉద్యోగి వీఆర్ఎస్ను ఎంచుకుంటే సుమారు రూ.9 లక్షల రూపాయలు పొందుతారు. అయితే పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగుల జీతానికి రక్షణ ఉంటుందని, కేబినెట్ నిర్ణయం ప్రకారం వారికి పూర్తి జీతం లభిస్తుందని బీఎస్ఎన్ఎల్ వర్గాలు తెలిపాయి. -
బీఎస్ఎన్ఎల్ వీఆర్ఎస్ దరఖాస్తులు 77 వేల పైనే..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్లో స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్ఎస్) కింద ఇప్పటికి 77,000 మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. సంస్థ సీనియర్ అధికారి ఒకరు మంగళవారం ఈ విషయాన్ని తెలిపారు. నవంబర్ 5 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం డిసెంబర్ 3 వరకూ అమల్లో ఉం టుంది. సంస్థలో దాదాపు 1.50 లక్షల మంది పనిచేస్తున్నారు. వీరిలో లక్ష మంది ఈ పథక ప్రయోజనం పొందడానికి అర్హులు. 70,000– 80,000 మంది వీఆర్ఎస్ను ఎంచుకుంటారని, దీనివల్ల రూ.7,000 కోట్ల వేతన బిల్లు భారం తగ్గుతుందని బీఎస్ఎన్ఎల్ భావిస్తోంది. -
ఉద్యోగులకు వీఆర్ఎస్, సాహసోపేత విలీన నిర్ణయం
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విలీనానికి ఆమోదం లభించింది. ప్రైవేటు రంగం దిగ్గజాల నుంచి పోటీ కారణంగా సంక్షోభంలో పడిపోయిన బీఎస్ఎన్ఎల్ను గట్టెక్కించేలా కేంద్ర కేబినెట్ ఎట్టకేలకు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ఉద్యోగుల కోసం ఆకర్షణీయమైన స్వచ్ఛంద విరమణ పథకం(వీఆర్ఎస్)ప్యాకేజీ 4జీ స్పెక్ట్రం కేటాయింపులకు కూడా క్యాబినెట్ ఆమోదించింది. పునరుజ్జీవనం కోసం రూ. 15,000 కోట్లు సార్వభౌమ బాండ్ల జారీకి సూత్రప్రాయంగా ఆమోదం ఇచ్చింది. అయితే 4జీ స్పెక్ట్రం కేటాయింపు 2016 ధరల కనుగుణంగా ఉంటుందని కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్‌ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. అలాగే వీటి ఆస్తుల మానిటైజ్ ద్వారా రూ.38,000 కోట్ల రూపాయల డబ్బునున ఆర్జించనున్నట్టు చెప్పారు. వీఆర్ఎస్ ప్యాకేజీని రెండు కంపెనీలకు వర్తింపచేస్తామని కేంద్రమంత్రి వివరించారు. 53 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సున్న ఉద్యోగి వీఆర్ఎస్ను ఎంచుకుంటే, 60 సంవత్సరాల వయస్సు వరకు జీతం, పెన్షన్, 125 శాతం గ్రాట్యుటీ అందిస్తామన్నారు. జాతీయ ప్రయోజనాలకోసం సాహసోపేతమైన పునరుద్ధరణ ప్యాకేజీతో బీఎస్ఎన్ఎల్,ఎంటీఎన్ఎల్ విలీన నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన ఆయన ఈ సంస్థలను లాభదాయకంగా మార్చడానికి రెండు సంస్థల ఉద్యోగులు తీవ్రంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. #Cabinet has decided to offer an attractive Voluntary Retirement plan to the employees of BSNL and MTNL. pic.twitter.com/jaAsIvByrJ — Ravi Shankar Prasad (@rsprasad) October 23, 2019 -
ఐఏఎస్ అధికారి మురళి రాజీనామా
సాక్షి, హైదరాబాద్ : ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి రాజీనామా చేశారు. సర్వీస్ నుంచి స్వచ్ఛందంగా వైదొలుగుతున్నాన్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి స్వచ్ఛంద పదవీ విరమణ లేఖను అందజేశారు. మరో 10 నెలల సర్వీస్ ఉండగానే మురళీ విధులను నుంచి తప్పుకుంటున్నారు. మురళీ ప్రస్తుతం పురావస్తు శాఖ సంచాలకులుగా ఉన్నారు. భూపాలపల్లి కలెక్టర్‌గా ఉన్న మురళిని తెలంగాణ ప్రభుత్వం ఆప్రాధాన్యత గల పురావాస్తు శాఖ సంచాలకులుగా బదిలీ చేసింది. దీంతో మనస్తాపం చెంది రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. తన 38 ఏళ్ల సర్వీసులో ఎన్నడూ లేనంత ఖాళీగా ఉన్నానని.. అందుకే రాజీనామా చేస్తున్నానని మురళి పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారిగా తాను పేదల కోసం కష్టపడ్డానని చెప్పారు. మారుమూల ప్రాంతాల అభివృద్ధి కోసం కృషిచేశానన్నారు. ఏడాది కాలంగా సరైన పనిలేనందున తనకు అసంతృప్తిగా ఉందన్నారు. చాలామంది ఎస్సీ, బీసీ, ఎస్టీ ఐఏఎస్, ఏపీఎస్ అధికారులను ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని ఆరోపించారు. తనలాగే చాలా మంది అసంతృప్తితో ఉన్నారని వెల్లడించారు. అందువల్ల బయటకు వచ్చి ఏదోఒకటి చేద్దామనే ఉద్దేశంతోనే తానీ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. -
పేరుకు సిక్.. రాజకీయ కిక్కు!
సాక్షి, అనంతపురం సెంట్రల్: తాను రాజకీయాల్లోకి వెళ్తున్నాను స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) ఆమోదించండి అని సీఐ గోరంట్ల మాధవ్ ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నారు. ఆమోదించకుండా ముప్పుతిప్పలు పెట్టారు. న్యాయపోరాటం చేయడంతో చివరకు వీఆర్ఎస్ను ఆమోదించారు. కేవలం ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం వలనే పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అదే అధికారపార్టీతో అంటకాగితే పోలీసు ఉన్నతాధికారుల తీరు మరోలా ఉంటుందనేందుకు ఈ కానిస్టేబులే నిదర్శనం. కానిస్టేబుల్ నరసింహమూర్తి. ఈ పేరు వింటే పోలీసుశాఖలో ఎవరైనా గుర్తుపడుతారు. ప్రస్తుతం అనంతపురం రూరల్ పోలీసుస్టేషన్లో పోస్టింగ్ ఉంది. ఏనాడూ ఆయన మాత్రం స్టేషన్ మెట్లెక్కడు. నాలుగేళ్లుగా ఖాకీ వదిలి (అనధికారికంగా) ఖద్దరు తొడుక్కున్నాడు. అధికార టీడీపీతో అంటకాగుతుండడంతో అధికారులకు తెలిసినా కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. నాలుగేళ్లుగా డిపార్ట్మెంట్కు దూరంగా.. అధికారపార్టీకి దగ్గరగా ఉంటున్నాడు. కొద్దిరోజులు రావడం.. మళ్లీ సిక్లో వెళ్లిపోవడం జరుగుతోంది. ఓ వైపు ఉద్యోగం కాపాడుకుంటూనే మరో వైపు రాజకీయాల్లో రాణిస్తున్నాడు. అంతేకాదండోయ్ ఇటీవల హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందేందుకు కూడా అర్హత సాధించాడు. ఇటీవల శిక్షణ తీసుకొని వచ్చి మళ్లీ సిక్లో వెళ్లిపోయాడు. తాజాగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో చాలా బిజీగా గడుపుతున్నాడు. అయితే రహస్యంగా కాదు. బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుండడం గమనార్హం. తాజాగా గురువారం పుట్టపర్తిలో సీఎం చంద్రబాబునాయుడును కలవడం పోలీసుశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై అదనపు ఎస్పీ చౌడేశ్వరిని వివరణ కోరగా సిక్లో ఉన్న ఉద్యోగులు రాజకీయపార్టీల కార్యక్రమాల్లో పాల్గొనడం చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. -
ఖాకీలే శత్రువులు !
సాక్షి, అనంతపురం : ‘గోరంట్ల మాధవ్.. ఇతను ఓ ప్రత్యేక పోలీసు.. ఎస్ఐగా ఉన్నపుడు ‘శివమణి’.. సీఐగా అయ్యాక ‘గబ్బర్‌సింగ్’... ‘అనంత’ వాసులు పెట్టిన ముద్దు పేర్లు ఇవి. సినిమా పేర్లలాగే ఇతని విధినిర్వహణ కూడా సినిమాటిక్‌గా ఉంటుంది. సర్కిల్‌తో పనిలేదు. వ్యక్తులస్థాయితో అసలు సంబంధం లేదు. మాధవ్ మనసుకు ఏది మంచి అనిపిస్తే అదే మంచి. చెడు అనిపిస్తే అదే చెడు. ఇదే అతనికి తెలిసిన ‘లా అండ్ ఆర్డర్’. మాధవ్ తీరు నచ్చి అతనికి అభిమానులుగా మారినవారూ కోకొల్లలు. శైలితో విభేదించి ధ్వేషించే వారూ ఉన్నారు. ఇవన్నీ తెలిసినా ‘నేనేరా పోలీస్’ అంటూ ‘మోనార్క్‌లా, ‘మొండిఘటం’లా డ్యూటీ చేశారాయన. ఇదే అతనికి స్పెషల్ క్రేజ్ తెచ్చిపెట్టింది. మరోవైపు ఇదే అతని కెరీర్లో మైనస్ కూడా అయింది. ధర్మవరంలో ఎస్ఐగా తనదైన శైలిలో డ్యూటీ చేశారు. అతనికి తొలి గుర్తింపు వచ్చింది అక్కడే. అప్పట్లో అక్కడ భరించలేక చిత్తూరుకు బదిలీ చేయించారు కొందరు రాజకీయనేతలు. ఆ తర్వాత మళ్లీ గుత్తి ఎస్ఐగా వచ్చారు. ఇక్కడా అదే తీరు. ఉన్నతస్థాయి లీడర్లపై కూడా చేయిచేసుకుని రచ్చ చేశారు. అక్కడా బదిలీ తప్పలేదు. ఆపై పరిగి ఎస్ఐగా బెల్ట్‌షాపులపై బీభత్సం చేసి షాపులను మూయించారు. రాజకీయనేతలంతా మాధవ్‌పై కన్నెర్ర చేశారు. కానీ మహిళలు మాత్రం స్టేషన్‌కు వచ్చి రెండు చేతులెత్తి ‘నువ్వు మా దేవుడివయ్యా!’ అంటూ మొక్కారు. కానీ ‘ఎక్సైజ్’ దెబ్బకు అనంతపురం ట్రాఫిక్‌లోకి వచ్చి పడ్డారు. తర్వాత సీఐగా ప్రమోషన్ వచ్చింది. వన్‌టౌన్ ఏరియాలో మద్యం దుకాణాలకు సరికొత్త నిబంధనలు రూపొందించి సీసీ కెమెరాలు పెట్టించారు. ఇది మద్యం సిండికేట్ జీర్ణించుకోలేకోయింది. ‘స్వచ్ఛ భారత్’ అంటూ టీబీ ఆస్పత్రి శుభ్రం చేయించి హోంమంత్రి చినరాజప్పతో సన్మానం అందుకున్నారు. ఇంతలోనే ‘అనంత’లో కేబుల్ ఇష్యూకూ సంబంధించి పరిటాల శ్రీరాంకు వార్నింగ్ ఇచ్చారు. హౌసింగ్‌బోర్డులోని ఓ స్థలానికి సంబంధించి జెడ్పీ చైర్మన్ చమన్‌ను హెచ్చరించారు. వారి దెబ్బకు ఏకంగా సీఐడీకి వెళ్లాడు. దాదాపు ఏడాదిపాటు మాధవ్ మాట ‘అనంత’లో వినిపించలేదు. తర్వాత త్రీటౌన్ సీఐగా మళ్లీ ‘అనంత’కు వచ్చాడు. ఇక్కడా అదే తీరు. ఏం మారలేదు. త్రీటౌన్ పరిధే కాదు... జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఎవరు స్టేషన్‌కు వచ్చినా సమస్య విని జోక్యం చేసుకున్నారు. ఇది ఇతర పోలీసులకు మింగుడు పడలేదు. డీఎస్పీ, ఎస్పీ వరకూ దీనిపై ఫిర్యాదులు వెళ్లాయి. ఈ క్రమంలో నోట్లరద్దు ఘటన సమయంలో ఎస్ఐపై చేయి చేసుకున్నారని మాధవ్ ఓ వ్యక్తిపై చేయిచేసుకున్నారు. అప్పటికే అతని ఇమేజ్ తట్టుకోలేని పోలీసులు మాధవ్‌ను బాధ్యున్ని చేస్తూ వీఆర్‌కు పంపారు. తర్వాత కదిరి సీఐగా వచ్చిన తర్వాత కూడా ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి డీఎస్పీని, జిల్లా ఎస్పీని ఏకంగా పోలీసుశాఖను కొజ్జాలు అంటే రాష్ట్రవ్యాప్తంగా ఎవరూ స్పందించలేదు. కానీ మాధవ్ విలేకరుల సమావేశం పెట్టిమరీ ‘డిపార్ట్మెంట్ జోలికి వస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ‘అనంత’లోనే కాదు... ఎస్ఐగా కడప జిల్లాలో కూడా ఇదే తరహా డ్యూటీ చేశారు. ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి... ప్రజాస్వామ్యయుతంగా రాజకీయాల్లోకి రావాలని మాధవ్ తన ఉద్యోగానికి వీఆర్ఎస్ ఇచ్చారు. వైఎస్సార్సీపీలో చేరారు. కానీ అప్పటి వరకూ మాధవ్‌కు అండగా నిలిచి పోలీసులు ఒక్కసారిగా సహాయ నిరాకరణ చేశారు. కారణం ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలు కావడమే. కనీసం అరే.. మనోడు ఇన్నేళ్లు పోలీసుశాఖలో పనిచేశాడు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత గెలుపోటములు దైవాదీనం, కానీ కష్టపడి సంపాదించిన ఉద్యోగాన్నే త్యాగం చేస్తున్నాడు. కనీసం మనం రాజీనామా ఆమోదించేందుకు సహకరిద్దామని ఉన్నతాధికారులు ఆలోచించలేదు. ఎంతసేపు ఎలా మాధవ్ నామినేషన్‌ను ఆపాలని మాత్రమే ఆలోచిస్తున్నారు. పైకి గంభీరంగా కన్పిస్తున్న మాధవ్ లోలోల చాలా బాధపడుతున్నారు. ‘నేను – నా ఖాకీ చొక్కా.. అంటూ 22ఏళ్లకుపైగా నిక్కచ్చిగా డ్యూటీ చేశా. నా ఉద్యోగాన్ని నేను వదలుకుంటానన్నా ప్రభుత్వం అడ్డుపడుతోందని వేదనపడుతున్నారు. అతనిపై కుట్రలు ఎందుకు? రాజీనామా ఆమోదించండి? నామినేషన్‌కు అడ్డంకులు తొలగించండి అని న్యాయం స్థానం ఉత్తర్వులిచ్చినా పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పుడు పోలీసులు పనిచేస్తోంది ప్రభుత్వం కనుసన్నల్లో కాదు. ఎలక్షన్ కమిషన్ అజమాయిషీలో. నిర్ణయాధికారం ప్రభుత్వానిది కాదు... ఎన్నికల కమిషన్‌దే. ప్రభుత్వ ఒత్తిడి ఉన్నన్ని రోజులు రాజీనామా ఆమోదించకుండా ఉన్న అధికారులు కనీసం ఇప్పుడైనా రాజీనామా ఆమోదించాలని మాధవ్‌తో పాటు ఆయన అభిమానులు కోరుతున్నారు. -
‘రాష్ట్రంలో ఉన్నవి బ్రోకర్, భజన సంఘాలే’
సాక్షి, విజయవాడ: ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షడు అశోక్‌బాబు వీఆర్ఎస్ను ప్రభుత్వం ఆమోదించడంపై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అశోక్ బాబు సంతకాలు పోర్జరి చేసి తప్పుడు డిగ్రీ సర్టిఫికేట్ సమర్పించాడని ఆరోపించారు. శాఖ పరమైన చర్యల్లో భాగంగా అతనిపై చర్యలు తీసుకోవాలని సహచర ఉద్యోగులు కోరిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ విషయంలో 2018వరకు విచారణ చేయకుండా జాప్యం చేశారని మండిపడ్డారు. డిగ్రీ ఉన్నట్టు సర్వీసు రిజిష్టర్‌లో అశోక్ బాబు దొంగ ఎంట్రీ చేశారని తెలిపారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం అశోక్‌బాబు క్లీన్ చీట్ ఇవ్వడంపై అభ్యంతరం తెలిపారు. ఇదే రకమైన అభియోగాలు ఉద్యోగులందరికీ క్లీన్ చిట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అశోక్‌బాబు ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీసుకువచ్చి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారని విమర్శించారు. స్వచ్ఛందంగా పదవి విరమణ చేయాలంటే మూడు నెలల ముందు శాఖకు తెలియజేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు లేవని.. బ్రోకర్, భజన సంఘాలు మాత్రమే ఉన్నాయని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం అపాయింట్మెంట్ కొన్ని ఉద్యోగ సంఘాల నాయకులకు మాత్రమే లభిస్తోందని తెలిపారు. విలువలు లేని అశోక్‌బాబును ఏ పార్టీలో చేర్చుకున్న వారికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అశోక్‌బాబు వీఆర్ఎస్కు ప్రభుత్వం అమోదం.. ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు వీఆర్ఎస్ గురువారం ఏపీ ప్రభుత్వం అమోదించింది. ప్రస్తుతం సహా అధ్యక్షుడిగా కొనసాగుతున్న పురుషోత్తం నాయుడు తాత్కాలిక అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, త్వరలో జరగబోయే ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో నూతన అధ్యక్షుడి ఎంపిక జరగనుంది. నూతన అధ్యక్షుడిగా ఏపీ ఎన్జీవో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న చంద్రశేఖర్ రెడ్డిని ఎన్నుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. -
రవీందర్‌రెడ్డి వీఆర్ఎస్కు ఓకే
సాక్షి, హైదరాబాద్: మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ సంచలన తీర్పు ఇచ్చిన న్యాయాధికారి కె.రవీందర్‌రెడ్డి స్వచ్ఛంద పదవీ విరమణకు హైకోర్టు శుక్రవారం ఆమోదం తెలిపింది. మే 31వ తేదీ నుంచే ఆయన వీఆర్ఎస్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఆయన నిర్వర్తించిన హైదరాబాద్ నాలుగో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి బాధ్యతలను.. 8వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జికి అప్పగించాలని సూచించింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీ) సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్ఎస్ దరఖాస్తు నోటీసు కాలం ముగియక ముందే హైకోర్టు ఆమోదం తెలపడం విశేషం. తీర్పు వెంటనే రాజీనామా కలకలం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం జడ్జిగా ఉన్న రవీందర్‌రెడ్డి.. మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తీర్పు ఇచ్చిన గంటలోపే ఆయన తన న్యాయాధికారి పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి (ఎంఎస్‌జే)కి లేఖ పంపడం కలకలం సృష్టించింది. అవినీతి ఆరోపణల వల్లే రవీందర్‌రెడ్డి రాజీనామా చేశారంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే రాజీనామా చేస్తే పదవీ విరమణ ప్రయోజనాలేవీ దక్కవని సన్నిహితులు చెప్పడంతో రవీందర్‌రెడ్డి పునరాలోచన చేశారు. తన పదవీ విరమణకు కొద్ది నెలలే గడువు ఉండటం, సర్వీసు పొడిగించే అవకాశాలు లేకపోవడంతో రాజీనామాకు బదులుగా... వీఆర్ఎస్ కోసం హైకోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని కమిటీ ఇటీవల సమావేశమై.. దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు రవీందర్‌రెడ్డి వీఆర్ఎస్ను ఆమోదిస్తూ.. ఉత్తర్వులు వెలువడ్డాయి. -
బ్యూరోక్రాట్ల వీఆర్ఎస్ నిబంధనల్లో మార్పులు
న్యూఢిల్లీ: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)కు సంబంధించిన నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. వీఆర్ఎస్ కోసం బ్యూరోక్రాట్లు పెట్టుకున్న విజ్ఞప్తిని ఎక్కువ కాలం పెండింగ్‌లో పెట్టకుండా, నిర్దేశిత గడువులోగా పరిష్కరించేలా మార్పులు తెచ్చింది. ఒకవేళ నిర్దేశిత గడువులోగా దరఖాస్తులను పరిష్కరించకపోతే.. అప్పట్నుంచే వారి స్వచ్ఛంద పదవీ విరమణ అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. కొత్త నిబంధనలను డీఓపీటీ విడుదల చేసింది. -
మాజీ సింగరేణి కార్మికుల ఆందోళన
మందమర్రి-బెల్లంపల్లి: సింగరేణిలో వీఆర్ఎస్ తీసుకున్న కార్మికులకు, డిస్మిసల్ కార్మికులకు అన్యాయం జరుగుతోందంటూ ఆదిలాబాద్ జిల్లా మందమర్రి, బెల్లంపల్లి పట్టణాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. మందమర్రి పట్టణం యాపల్లోని వాటర్ ట్యాంక్ 20 మంది ఎక్కారు. మొత్తం 3,100 మంది వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోగా 100 మందికే తిరిగి ఉద్యోగాలు దక్కుతాయని వారన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటన తమకు తీవ్ర నిరాశ కలిగించిందని వారు తెలిపారు. ఏళ్లుగా తాము పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని తెలిపారు. అలాగే, బెల్లంపల్లిలో ఓ మాజీ కార్మికుడు సెల్‌టవర్ ఎక్కి దూకుతానని బెదిరిస్తున్నాడు. సింగరేణి డిస్మిసల్ కార్మికుడు సమ్మయ్య స్థానిక బజార్ ఏరియాలోని వాగ్దేవి జూనియర్ కళాశాల భవనంపై ఏర్పాటు చేసిన సెల్‌టవర్‌పైకి ఎక్కాడు. తనలాంటి వందలాది డిస్మిసల్ కార్మికులకు తిరిగి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇదిలా ఉండగా, ఆదిలాబాద్ జిల్లా రెబ్బనలోని సింగరేణి ప్రాంతం గోలేటి టౌన్షిప్లో కార్మికులు కేసీఆర్ చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు. తమకు అత్యధిక పండుగ బోనస్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. -
సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు
• నియామక విధానం పునరుద్ధరణకు కేసీఆర్ నిర్ణయం • కార్మికులకు దీపావళి బోనస్ రూ.54 వేలు, లాభాల్లో 23 శాతం వాటా • మొత్తంగా ఒక్కో కార్మికుడికి అందే అదనపు మొత్తం రూ.97 వేలు సాక్షి, హైదరాబాద్: సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల నియామక విధానాన్ని పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి పొందిన లాభాల్లో 23 శాతాన్ని కార్మికులకు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛంద పదవీ విరమణ పథకం(వీఆర్ఎస్) ద్వారా లబ్ధిపొందిన వారి కి కూడా డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని సూచించారు. సింగరేణి బొగ్గు గని కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎంపీ కవిత ఆధ్వర్యంలో సింగరేణి ప్రాంతానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్మిక సంఘాల నేతలు గురువారం హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. మంత్రి హరీశ్‌రావు, సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, విప్ నల్లా ఓదెలు, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎంపీలు వినోద్, బాల్కసుమన్, సీతారాం నాయక్, మాజీ ఎంపీ జి.వివేక్, ఎమ్మెల్యేలు కనకయ్య, దివాకర్ బాబు, దుర్గం చిన్నయ్య, టీబీజీకెఎన్ నాయకులు వెంకట్రావు, కింగర్ల మల్లయ్య, రాజిరెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. డిపెండెంట్ ఉద్యోగాలు, బోనస్, లాభాల్లో వాటా తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. కుటుంబంలో కోరిన వారికి ఉద్యోగం సరిహద్దుల్లో ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న సైనికులు, దినదిన గండంగా విధు లు నిర్వహిస్తూ జాతి సంపదను సృష్టిస్తున్న గని కార్మికులు సమానమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సైనికుల పట్ల ఎంత గౌరవభావం కలిగి ఉంటామో కార్మికుల పట్ల అంతే సహృదయత ప్రదర్శించాలన్నారు. ఎన్నో ఏళ్లుగా గనుల్లో బొగ్గును వెలికితీసి అనారోగ్యం పాలైన కార్మికుల కుటుంబ సంక్షేమాన్ని ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలన్నారు. అనారోగ్యం పాలైన, గాయపడిన, వీఆర్ఎస్ తీసుకున్న కార్మికుల కుటుంబాల్లో వారు కోరిన వారికి ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. ఏళ్ల తరబడి కార్మికులు చేసిన సేవలకు గుర్తింపుగా వారు కోరిన వారికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ప్రభుత్వం, యాజ మాన్యం మానవత్వంతో వ్యవహరించాలని పేర్కొన్నారు. సింగరేణిలో 1998లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం డిపెండెంట్ ఉద్యోగాల నియామక విధానాన్ని రద్దు చేసింది. లాభాల్లో 23 శాతం వాటా సింగరేణి సంస్థ 2015-16లో రూ.1,066.13 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇందులో 23 శాతం వాటాను కార్మికులకు చెల్లించాలని సీఎం ఆదేశించారు. అంటే కార్మికులకు రూ.245.21 కోట్లు ఇవ్వనున్నారు. సగటున ఒక్కో కార్మికుడికి రూ.43,078 అందుతాయి. గతేడాది కూడా ప్రభుత్వం లాభాల్లో 21 శాతం వాటాను కార్మికులకు పంచింది. అదే సమైక్య రాష్ట్రంలో అయితే 2012-13లో ఇచ్చిన 18 శాతం వాటానే అత్యధికమని సీఎంవో పేర్కొంది. ఇక సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్‌గా రూ.54 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. ఈ లెక్కన సింగరేణి కార్మికులకు ఈ నెలలో రూ.97 వేల చొప్పున అందనున్నాయి. సీఎండీకి ప్రశంసలు తెలంగాణవారికి పాలన, నిర్వహణ చేతకాదని విమర్శించిన వాళ్ల నోళ్లు మూయించేలా తెలంగాణలో పాలన సాగుతోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అందుకు సింగరేణి లాభాలు ఓ ఉదాహరణ అని.. సింగరేణిని తెలంగాణ అధికారులే గాడిన పెట్టారని చెప్పారు. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్.నర్సింగ్‌రావు సీఎండీగా ఉన్నప్పుడు సింగరేణి బాగుపడిందని.. ఇప్పుడు ఎన్.శ్రీధర్ నేతృత్వంలో గరిష్ట లాభాలు ఆర్జించిందని ప్రశంసించారు. కార్మికులు, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. -
చెన్నూరు చక్కెర లేదిక
చెన్నూరు : చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీని శాశ్వతంగా మూ సి వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పద వీ విరమణ చేసిన కార్మికులకు ఇవ్వాల్సిన బకాయి లు, విధుల్లో ఉన్న వారికి వీఆర్ఎస్ ఇచ్చి పంపాలని పాలకులు, అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్‌లో బుధవారం మంత్రులు, చక్కర పరిశ్రమల శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీల నిర్వహణపై నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. రాష్ట్రంలోని 10 చెక్కర ఫ్యాక్టరీలు నష్టాల్లో ఉంటే వాటన్నింటికి నిధులిచ్చి నడపాలని నిర్ణయించి, ఒక్క చెన్నూరు ఫ్యాక్టరీపైనే వివక్ష చూపారు. దీనిని సహకార, ప్రైవేటు రంగాల్లో సైతం నడపడం సాధ్యం కాదంటూ తేల్చారు. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 19 మంది పర్మినెంటు, 51 మంది సీజనల్ కార్మికులు పనిచేస్తున్నారు. వీరందరికీ 42నెలలుగా వేతనాలుఅందలేదు. చంద్రబాబు పాలనలోనే.. కాంగ్రెస్ ప్రభుత్వం 1977లో ఈ ఫ్యాక్టరీని ప్రారంభించింది. పరిస్థితులు అనుకూలించక ఒడిదుడుకుల మధ్య నెట్టుకొస్తున్న ఫ్యాక్టరీకి నిధులు విడుదల చేయకపోవడంతో 1995లో చంద్రబాబు పాలనలో మూత పడింది. రూ.కోటి బకాయి చెల్లించకపోవడంతో బ్యాంకులు ఈ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకున్నాయి. పదేళ్ల పాటు ఖాయిలా పడ్డ పరిశ్రమ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో 2006 నుంచి మూడేళ్ల పాటు సవ్యంగా నడిచింది. వైఎస్ అప్పట్లో రూ.27 కోట్లు నిధులిచ్చి ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తెచ్చారు. ఆయన మరణంతో మళ్లీ మూత పడింది. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం.. పెట్టుబడులు పెట్టాలంటూ విదేశాలు తిరుగుతున్న సీఎం చంద్రబాబునాయుడు ఈ ఫ్యాక్టరీని తెరిపించాల్సింది పోయి శాశ్వతంగా మూయాలనుకోవడం తగదని ఈ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కథ ముగియనుంది రాష్ట్రంలో రెండు చక్కర ఫ్యాక్టరీలు మినహా అన్నీ నష్టాల్లో ఉన్నప్పటికీ చెన్నూరు ఫ్యాక్టరీని మాత్రమే శాశ్వతంగా మూయాలనుకోవడం అధికార పార్టీ నాయకుల కుట్ర అని ప్రజలు, రైతులు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫ్యాక్టరీకి అన్ని రకాలుగా అనువైన పరిస్థితులున్నాయి. నిర్వహణ లోపం వల్లే నష్టాల్లోకి వెళ్లింది. ప్రభుత్వం నడపలేకపోతే ప్రైవేటు రంగానికైనా అప్పగించాలని కార్మిక నేతలు కోరినా ప్రయోజనం లేకపోయింది. 42 నెలలుగా వేతనాలు అందని కార్మికుల పరిస్థితి ఏమిటనేది ప్రభుత్వం వెల్లడించలేదు. జిల్లాపై వివక్ష ఫ్యాక్టరీని శాశ్వతంగా మూత వేయాలని నిర్ణయించారు. ఈ ఫ్యాక్టరీ ప్రారంభిస్తే వేలాది మందికి ప్రయోజనం కల్గుతుందని ఏన్నో ఏళ్లుగా పోరాటం చేశాం. రాష్ట్రంలో అన్ని చక్కెర ఫ్యాక్టరీలు నడపాలంటూ నిధులిచ్చిన ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీని నడపడం సాధ్యం కాదనడానికి జిల్లాపై వివక్షే కారణమనిపిస్తుంది. జిల్లాలోని నాయకులు చొరవ చూపకపోవడం వల్లే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రైతు సంఘాలు నామ మాత్రంగా స్పందించాయి. ప్రభుత్వం.. రైతులు, కార్మికులకు తీవ్ర అన్యాయం చేసింది. - పి.కృష్ణ, చెక్కర ఫ్యాక్టరీల రాష్ట్ర కార్యదర్శి ప్రైవేట్ వారికి ఇస్తుందనుకున్నాం పరిశ్రమలు స్థాపించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటూ చెబుతున్న ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీని మూత వేస్తుందనుకోలేదు. ప్రైవేటులోనైనా నడిపి ఉంటే, రైతులు, కార్మికులకు ప్రయోజనం కలిగి ఉండేది. నిరుద్యోగులకు ఉపాధి లభించేది. ఇంత దారుణ నిర్ణయం తీసుకోవడం అన్యాయం. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. - వేణుగోపాల్‌రెడ్డి, చక్కెర ఫ్యాక్టరీ పర్మినెంట్ కార్మికుడు -
అయితే బదిలీ.. లేదంటే వీఆర్ఎస్!
కర్నూలు(జిల్లా పరిషత్): జిల్లా అధికారుల ఒత్తిళ్లే డీఎంహెచ్ఓ వీఆర్ఎస్ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. రెండున్నరేళ్ల సర్వీసు ఉండగానే ఆమె ఆ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం అదేనని సన్నిహితుల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే జిల్లాలో అధికారులుగా పనిచేయడం కత్తి మీద సాముగా మారింది. అయితే బదిలీ.. మిగతా 2వ పేజీలో ఠ అయితే బదిలీ.. లేదంటే వీఆర్ఎస్! 22 కెఎన్ఎల్ 43ఎ - జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం లేదంటే వీఆర్ఎస్ తీసుకోవాల్సిందేనని, అందుకు సిద్ధమైతేనే ఇక్కడ అధికారులుగా ఉండగలమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కోవలోనే ఒత్తిళ్లు తట్టుకోలేక ఒక్కొక్కరుగా బదిలీపై వెళ్తున్నారు. తాజాగా జిల్లా వైద్యాధికారి తీసుకున్న నిర్ణయం సైతం అందులో భాగమేనని సమాచారం. గత నవంబర్‌లో డీఎంహెచ్‌వోగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ నిరుపమ ఐదు నెలల్లోనే వీఆర్ఎస్కు వెళ్లడం చర్చనీయాంశమవుతోంది. గైనకాలజిస్టుగా ఆమెకు ఇప్పటికీ మంచి ప్రాక్టీస్ ఉంది. ఆమె భర్త డాక్టర్ సుదర్శన్ కర్నూలులో బిజీ ప్లాస్టిక్ సర్జన్‌గా ఉన్నారు. జిల్లాకు ఏదో చేద్దామని వచ్చిన తనకు విధి నిర్వహణలో ఇలాంటి ఒత్తిళ్లు ఉంటాయని ఊహించలేకపోయానని ఆమె సన్నిహితులతో వాపోతున్నారు. ఐదు కీలక పోస్టులు ఖాళీగా ఉంటే.. ఏ అధికారి అయినా ఏం చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ప్రస్తుతం ఐదు కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెండు నెలల క్రితం తగిన మర్యాదలు చేయలేదనే కారణంతో అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ యు.రాజాసుబ్బారావును సస్పెండ్ చేశారు. ఆయన స్థానంలో ఇప్పటి వరకు ఎవరినీ నియమించలేదు. ఆయన లెప్రసీ, ఎయిడ్స్ కంట్రోల్ అధికారిగా కూడా పని చేశారు. దీంతో ఆ రెండు పోస్టులు ఖాళీ అయ్యాయి. అదేవిధంగా ఆరు నెలల క్రితం డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ అధికారిగా పనిచేసిన డాక్టర్ అనిల్‌కుమార్ బదిలీ అయ్యారు. ఈ పోస్టు కూడా ఇప్పటికీ భర్తికి నోచుకోలేదు. యేడాదికి పైగా మాస్‌మీడియా అధికారి పోస్టు సైతం ఖాళీగా ఉంది. దీనికితోడు పీసీ పీఎన్డిటి యాక్ట్ అమలు చేసే అధికారి డాక్టర్ ధనుంజయ అకాల మరణంతో మూడు నెలలుగా ఆ పోస్టులోనూ ఎవరినీ నియమించలేదు. దీంతో పాటు పలు క్లస్టర్ అధికారుల పోస్టులు సైతం ఖాళీగా ఉండిపోయాయి. ఫలితంగా జిల్లాలో ఏ మూలన ఏం జరిగినా డీఎంహెచ్‌వోకు ఫోన్లు వస్తున్నాయి. సమయపాలన లేకుండా వచ్చే ఫోన్లు.. సమస్యల గురించి ఏకరువు పెట్టినా వాటిని పరిష్కరించే అవకాశం లేకపోవడం డీఎంహెచ్‌వో డాక్టర్ నిరుపమను తీవ్రంగా మనస్తాపానికి గురిచేసినట్లు చర్చ జరుగుతోంది. జిల్లాలో పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేదంటూ ఉన్నతాధికారుల నుంచి వేధింపులు అధికం కావడంతో జనవరి నెలలోనే ఆమె వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీపై వివాదం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని రౌండ్ ది క్లాక్ హాస్పిటల్స్‌లో స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీకి జరిగిన తతంగం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాను సంతకం చేసి వారం రోజులవుతున్నా మెరిట్ జాబితాను ఎందుకు ప్రకటించలేదంటూ గత సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ నిరుపమపై జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీకి మెరిట్ జాబితా ప్రకటించే పత్రికా ప్రకటనపై జిల్లా కలెక్టర్ చేసిన సంతకం వద్ద వేసిన తేదీ వివాదాస్పదంగా మారింది. వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం వారు ఆ ప్రకటనను 20వ తేదీన టైప్ చేసి తీసుకెళ్లగా జిల్లా కలెక్టర్ మాత్రం దానిపై సంతకం చేసిన చోట పదవ తేదీగా పేర్కొనడం చర్చనీయాంశమైంది. జిల్లా కలెక్టర్ పదిరోజుల ముందుగా తేదీ ఎందుకు వేశారని కార్యాలయంలో చర్చ జరుగుతోంది. తాము రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నా జిల్లా కలెక్టర్ దూషించడం తట్టుకోలేకపోతున్నానని ఆమె సన్నిహితుల వద్ద చెప్పుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇటీవల కర్నూలుకు వచ్చిన చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యంను కలిసి తాను దరఖాస్తు చేసుకున్న వీఆర్ఎస్ను ఆమోదించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ నిరుపమ కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయమై ఆమెకు ఎల్వీ సుబ్రహ్మణ్యం నచ్చజెప్పాలని చూసినా వీఆర్ఎస్కే మొగ్గు చూపినట్లు సమాచారం.