సీఎం కేసీఆర్‌.. ఇంటర్నేషనల్‌  కేడీ.. టీఆర్‌ఎస్‌ వీఆర్‌ఎస్‌ తప్పదు | Congress Renuka Chowdary Fires On Trs Cm Kcr | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌.. ఇంటర్నేషనల్‌  కేడీ.. టీఆర్‌ఎస్‌ వీఆర్‌ఎస్‌ తప్పదు

Published Sun, Oct 30 2022 8:39 AM | Last Updated on Sun, Oct 30 2022 2:47 PM

Congress Renuka Chowdary Fires On Trs Cm Kcr - Sakshi

సంస్థాన్‌ నారాయణపురం, చండూరు: టీఆర్‌ఎస్‌ నుంచి బీఆర్‌ఎస్‌ మార్చిన కేసీఆర్‌కు ప్రజలు వీఆర్‌ఎస్‌ ఇవ్వనున్నారని, ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రానుందని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌.. ఇంటర్నేషనల్‌  కేడీ అంటూ  తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని గెలిపించాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం మహ్మదాబాద్, నల్లగొండ జిల్లా గట్టుప్పల మండలంలోని శేరిగూడెం గ్రామాల్లో శనివారం రేణుకాచౌదరి ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ’’కేసీఆర్‌.. నీకు కాంగ్రెస్‌ పార్టీ భిక్ష పెట్టిందన్న విషయం గుర్తుపెట్టుకో.. పిచ్చి వేషాలు మా దగ్గర కాదు.. నీ పప్పులు ఉడకవు’’ అంటూ హెచ్చరించారు.

పాల్వాయి స్రవంతి చేతికి ఉన్నవి గాజులు కావని విష్ణు చక్రాలని అన్నారు. మునుగోడు నియోజకవర్గం తమ్ముడి కోసం అంట.. అన్నదమ్ములిద్దరూ కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని కోమటిరెడ్డి బ్రదర్స్‌ని ఉద్దేశించి విమర్శించారు.
చదవండి: సుప్రీం జడ్జి పర్యవేక్షణలో విచారణ జరపాలి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement