Munugode Politics
-
మునుగోడు ఓట్ల వివరాలు ఇవే.. అలాగే మెజారిటీ ఓట్లు వీరివే..
మునుగోడు నియోజకవర్గం జిల్లా: నల్గొండ లోక్ సభ పరిధి: భువనగిరి రాష్ట్రం: తెలంగాణ మొత్తం ఓటర్ల సంఖ్య: 248,524 పురుషులు: 124,473 మహిళలు: 123,996 ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం ఏడు మండలాలు ఉన్నాయి: నల్గొండ జిల్లా మునుగోడు చందూర్ మర్రిగూడ నాంపల్లి ఘాటుప్పల్ యాదాద్రి భువనగిరి జిల్లా సమస్థాన్ నారాయణపూర్ చౌటుప్పల్ నియోజకవర్గం ముఖచిత్రం సీపీఐ సిట్టింగ్ స్థానమైన మునుగోడులో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డి ఇక్కడి నుంచి ఐదుసార్లు విజయం సాధించారు. ఇప్పటి వరకు మునుగోడులో పదకొండుసార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ ఐదుసార్లు, సీపీఐ ఐదుసార్లు విజయం సాధించాయి. 1967 వరకు ఈ స్థానం చిన్నకొండూరుగా ఉంది. తెలంగాణ ప్రముఖ పోరాటయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గతంలో ఇక్కడ నుంచి రెండు సార్లు విజయం సాధించారు. మునుగోడులో కాంగ్రెస్ ఐ పార్టీ అభ్యర్దిగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాదించారు. 2009లో ఆయన ఎంపిగా గెలిచారు. 2014లో ఓటమి చెందినా, ఆ తర్వాత ఎమ్మెల్సీగా గెలుపొందారు. తిరిగి ఈసారి మునుగోడు నుంచి అసెంబ్లీకి పోటీచేసి విజయం సాదించారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్ది కె. ప్రభాకరరెడ్డిపై 22,552 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి 97239 ఓట్లు రాగా, ప్రభా కరరెడ్డికి 74687 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన జి.మనోహర్‌రెడ్డికి 12700 ఓట్లు వచ్చాయి. రాజగోపాలరెడ్డి సామాజిక పరంగా రెడ్డి వర్గానికి చెందినవారు. 2014లో మునుగోడు నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధి కె.ప్రబాకరరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి కుమార్తె స్రవంతిని 38055 ఓట్ల తేడాతో ఓడిరచారు. స్రవంతి కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయారు. 2009లో పాల్వాయి గోవర్దనరెడ్డి పోటీచేసి ఓటమి పాలైతే, 2014లో ఆయన కుమార్తె ఓడిపోవలసి వచ్చింది. అయితే పాల్వాయి 2009లో ఓటమి తర్వాత కాంగ్రెస్ ఐ పార్టీ ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చింది. 2014లో కాంగ్రెస్ పార్టీ ,సిపిఐతో పొత్తు పెట్టుకోవడాన్ని ఆయన వ్యతిరేకించారు. సిపిఐ పోటీచేసినా సమీప ప్రత్యర్ధిగా కూడా ఉండలేకపోయింది.సిపిఐ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డికి 20952 ఓట్లు వచ్చాయి. సీనియర్ సిపిఐ నాయకుడు ఉజ్జిని నారాయణరావు మూడు సార్లు గెలుపొందితే, ఆయన కుమారుడు యాదగిరిరావు ఒకసారి గెలుపొందారు. పాల్వాయి గోవర్ధనరెడ్డి మునుగోడులో ఐదుసార్లు గెలిచారు. ఒకసారి ఎమ్మెల్సీ అయ్యారు. ఒకసారి రాజ్యసభ సభ్యుడయ్యారు. ఈయన గతంలోమంత్రి పదవి నిర్వహించారు. మునుగోడులో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఆరుసార్లు, సిపిఐ ఐదుసార్లు గెలిచాయి. టిఆర్ఎస్ ఒకసారి గెలిచింది. స్వయంగా టిడిపి ఇక్కడ నుంచి గెలవలేదు.సిపిఐ మిత్ర పక్షంగా ఉన్నప్పుడు బలపరిచింది. మునుగోడులో తొమ్మిది సార్లు రెడ్లు, రెండుసార్లు బిసి(పద్మశాలి)నాలుగుసార్లు వెలమ, ఒకసారి ఇతరులు గెలుపొందారు. -
నల్గొండ జిల్లా: మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అరెస్ట్
-
మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అరెస్ట్
సాక్షి, నల్గొండ జిల్లా: ఉప ఎన్నిక ముగిసి వారం రోజులు దాటినా కానీ మునుగోడులో రాజకీయ కాక మాత్రం తగ్గలేదు. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధర్నాకు దిగారు. గొర్రెల పంపిణీ డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన రెండు గంటలకుపైగా రోడ్డుపై బైఠాయించారు. దీంతో రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు వాహనంలో ఆయనను తీసుకెళ్తుండగా బీజేపీ కార్యకర్తలు వాహనానికి అడ్డుపడ్డారు. ఉద్రిక్తత నడుమ రాజగోపాల్‌రెడ్డిని పోలీస్ స్టేషన్ తరలించారు. కాగా, గెలుపు తర్వాత మొదటిసారిగా నియోజకవర్గానికి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా చండూరులో టీఆర్ఎస్ భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. అలాగే చౌటుప్పల్‌లో భారీ స్వాగత కార్యక్రమంతో పాటు బైక్ ర్యాలీ కూడా నిర్వహించారు. అదే సమయంలో మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గొల్లకురుమలకు సబ్సిడీ డబ్బులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. ఉప ఎన్నిక సందర్భంగా నేరుగా లబ్ధిదారులకు సబ్సిడీ ఇస్తామన్న ప్రభుత్వం.. ఇప్పుడు తాత్సారం చేస్తోందని రాజగోపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరుపార్టీల కార్యకర్తల నినాదాలతో మునుగోడులో రాజకీయ వేడి రాజుకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల నినాదాలతో మునుగోడులో ఉద్రిక్తత నెలకొంది. చదవండి: కోమటిరెడ్డి కంపెనీ కార్యాలయాల్లో సోదాలు -
మునుగోడు ఉప ఎన్నికను రద్దుచేయాలి: కేఏ పాల్
నల్గొండ (చండూరు): మునుగోడు ఉప ఎన్నికను రద్దుచేసి బ్యాలెట్ పేపర్‌తో తిరిగి ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు, స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్ అన్నారు. ఆయన మంగళవారం చండూరులో విలేకరులతో మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ఈవీఎంలు లేకుండా బ్యాలెట్ పేపర్ పెట్టమని చెప్పినా అధికారులు పట్టించుకోలేదన్నారు. అవి నీతి, అక్రమాలు జరగనప్పుడు.. పోలింగ్ ముగిసిన మరుసటి రోజే ఎందుకు కౌంటింగ్ చేయలేదన్నారు. ఉప ఎన్నికలో ఎన్నికల అధికారులు మొత్తం ముఖ్యమంత్రి కేసీఆర్‌కి తొత్తులుగా పనిచేశారని ఆయన ఆరోపించారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలలో బిగించిన సీసీ కెమెరాలకు సంబంధించిన లింక్ తమకు ఎందుకు ఇవ్వలేదన్నారు. స్ట్రాంగ్ రూమ్‌కు వేసిన సీల్ మారిందని చెప్పారు. టీఆర్ఎస్ ఏజెంట్లు కండువాలు కప్పుకుని కౌంటింగ్ హాల్లో తిరుగుతున్నా ఎందుకు బయటకు పంపించలేదని ఆయన ప్రశ్నించారు. పోలింగ్ స్టేషన్లలో అధికారులు వృద్ధులతో రెండో నంబర్‌కు ఓటు వేయించారని ఆయన ఆరోపించారు. ఓటుకు డబ్బులు పంచడం అనేది ఎన్నికల అధికారులతో పాటు అందరికి తెలిసినా కూడా ఈ ఎన్నికను ఎందుకు రద్దుచేయలేదో చెప్పాలన్నారు. మునుగోడు ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చీకొడుతున్నారని, తనను అభిమానిస్తున్నారని పాల్ చెప్పారు. -
ఎన్నికల్లో ఓడినా బీజేపీకి బిగ్ ప్లస్.. ఎలాగో తెలుసా?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడినా తమకు ఓట్లను గణనీయంగా పెంచుకోగలిగింది. దీంతో నియోజకవర్గంలో బీజేపీ బలం పెరిగింది. 2018 ఎన్నికల్లో మునుగోడులో బీజేపీ అభ్యర్థి గంగిడి మనోహర్ రెడ్డికి 12,725 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రస్తుత ఉప ఎన్నికల్లో మాత్రం భారీగా ఓట్లు పెరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన రాజగోపాల్‌రెడ్డికి 86,697 ఓట్లు లభించాయి. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లతో పోల్చితే 73,972 ఓట్లు పెరిగాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడులో ప్రత్యామ్నాయం బీజేపీ అనే అంశం ప్రజల్లోకి వెళ్లినట్లయింది. ఉప ఎన్నికల్లో హోరాహోరీ ప్రచారం చేసిన బీజేపీ తమ బలాన్ని పెంచుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డితో సహా పలువురు రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలు ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఉధృతంగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల స్టీరింగ్ కమిటీ కన్వీనర్ వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్, కమిటీ సమన్వయకర్త గంగిడి మనోహర్‌రెడ్డి దగ్గరుండీ ప్రచారాన్ని పర్యవేక్షించారు. అన్ని మండలాలకు ఇన్‌ఛారీ్జలను నియమించి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా బహిరంగ సభతో పాటు, సునీల్ బన్సల్, తరుణ్‌చుగ్ వంటి అగ్రనేతలు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైనా నియోజకవర్గంలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని మూడో స్థానంలోకి నెట్టింది. ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదు. భారీ మెజారిటీతో గెలుస్తామని టీఆర్ఎస్ భావించినా మెజారిటీని తగ్గించగలిగింది. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజగోపాల్‌రెడ్డి ఓడిపోయినప్పటికీ మునుగోడులో ఆ పార్టీ మరింత పుంజుకుంది. వచ్చే అసెంబ్లీ అన్నికల్లో మరింతగా దూసుకెళ్లవచ్చన్న అంచనాకు వచ్చింది. -
బిగ్ క్వశ్చన్ : మునుగోడు ఓటమి బీజేపీకి నేర్పిన పాఠం ఏంటి ..?
-
టీఆర్ఎస్ కు ఇంకా భారీ మెజారిటీ రావాల్సింది : కేటీఆర్
-
మునుగోడు లో టీఆర్ఎస్ విజయం.. కార్యకర్తల సంబరాలు
-
మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం
-
మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ గెలుపొందడంతో మంత్రి మల్లారెడ్డి మాస్ స్టెప్పులు
-
13వ రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం
-
ప్రజలు కేసీఆర్‌తోనే ఉన్నారని మరోసారి రుజువైంది : మంత్రి జగదీష్ రెడ్డి
-
మద్యం, డబ్బు పంచి టీఆర్ఎస్ గెలిచింది : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
-
11వ రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం
-
తెలంగాణ భవన్ వద్ద టీఆర్ఎస్ కార్యకర్తల సంబరాలు
-
10వ రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం
-
మునుగోడు ఎవరిది ..?
-
Munugode: లెక్కల్లో నిమగ్నమైన బీజేపీ..2, 3వేల మెజారిటీతో విజయఢంకా!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక లెక్కలు, విశ్లేషణల్లో కమలదళం తలమునకలైంది. ఈ నియోజకవర్గంలోని 7 మండలాలు, 2 మున్సిపాలిటీల వారీగా ఓటింగ్ సరళిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ముఖ్యనేతలు బీజేపీకి పడిన ఓట్లపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి రెండు, మూడు వేల మెజారిటీతో విజయఢంకా మోగిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని వివిధ బీసీ వర్గాల ఓట్లతో పాటు హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్, వనస్థలిపురం పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారి ఓట్లు కమలానికే పడ్డాయని అంచనా వేస్తున్నారు. ఉప ఎన్నికలో అత్యధిక శాతం ఓటింగ్ నమోదు కావడం రాజగోపాల్‌రెడ్డి గెలుపునకు సూచికగా భావిస్తున్నారు. గ్రామాలు, పోలింగ్ బూత్‌ల వారీగా ఆయా వర్గాల ఓటింగ్ తీరుపై పోలింగ్ బూత్‌స్థాయి నుంచి ఎన్నికల ప్రకియలో నిమగ్నమైన పార్టీ యంత్రాంగం నుంచి సమాచారాన్ని సరి చూసుకుంటున్నారు. బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై టీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యక్షంగా రాళ్ల దాడితో పాటు భౌతికదాడులకు ప్రయత్నించడం వంటి పరిణామాలు టీఆర్ఎస్పై వ్యతిరేకత పెరిగేందుకు దోహదం చేశాయంటున్నారు. అయితే టీఆర్ఎస్కు వామపక్ష అనుకూల ఓటింగ్‌తో పాటు మైనారిటీల ఓట్లు, ఎస్సీలో కొంతశాతం ఓట్లు పడ్డాయని బీజేపీ నాయకులు అంచనా వేస్తున్నారు. మండలాలు, మున్సిపాలిటీల వారీగా.. చౌటుప్పల్, చండూర్ (గ్రామీణ, పట్టణ ప్రాంతాలు కలిపి)లో బీజేపీ హవా బాగా కనిపించి, ఇక్కడి నుంచే అధిక శాతం ఓట్లు పడ్డాయని చెబుతున్నారు. మునుగోడు మండలంలోనూ బీజేపీకే మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నారాయణపూర్‌లో బీజేపీ, టీఆర్ఎస్కు దాదాపు సమానంగా ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. మర్రిగూడ, నాంపల్లిలో బీజేపీ కంటే టీఆర్ఎస్ స్వల్పంగా ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. మిగతా చోట్ల కూడా బీజేపీకే మొగ్గు ఉంటుందనే విశ్వాసంలో బీజేపీ నేతలున్నారు. పొద్దున పోలింగ్ మొదలయ్యాక టీఆర్ఎస్కు మద్దతుదారులుగా ఉన్న ఆసరా, ఇతర రూపాల్లో పింఛన్లు పొందుతున్న వృద్ధులు, ఇతర వర్గాల వారు ఎక్కువగా ఓటింగ్ రావడంతో భిన్నమైన అంచనాలు వచ్చాయంటున్నారు. మధ్యాహ్నం తర్వాత యువత అధికంగా పోలింగ్ బూత్‌లకు రావడం, హైదరాబాద్ శివార్లలోని ఓటర్లు బూత్‌లకు చేరుకోవడంతో ఒక్కసారిగా ఓటింగ్ శాతం పెరుగుదలతో మొత్తం వ్యవహారంలో మార్పులు చోటుచేసుకుని బీజేపీ వైపు మొగ్గు స్పష్టమైందని చెబుతున్నారు. -
Munugode ByElection: ఫలితాన్ని నిర్ణయించే ఆ ఓట్లు ఎవరికో..?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలో చివరి కొన్ని గంటల్లో పోలైన ఓట్లు ఎవరికి పడ్డాయన్నది ఆసక్తికరంగా మారింది. ఆ ఓట్లే గెలుపోటములను ప్రభావితం చేస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతుండటంతో ఆ ఓట్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గురువారం సాయంత్రం 5 గంటల తరువాత 37,665 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి పోలింగ్ ఊపందుకున్నా సాయంత్రం 5 గంటల తరువాత అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు. అవి తమకు పడ్డాయంటే తమకే పడ్డాయంటూ అభ్యర్థులు, ఆయా పార్టీల వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసే వరకు లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో కొన్నిచోట్ల రాత్రి 9 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. యువత, మహిళలే ఎక్కువ.. గురువారం ఉదయం వేళలో ఎక్కువ మంది వృద్ధులు, మధ్య వయస్కులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల తరువాతే ఎక్కువ మంది మహిళలు, యువత, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు పోలింగ్‌లో పాల్గొన్నారు. 5 గంటల సమయంలో కూడా ఎక్కువ మంది మహిళలు, యువతే వచ్చి లైన్లలో నిల్చున్నారు. రాత్రి 9 గంటల వరకు కూడా వారే పోలింగ్‌లో పాల్గొన్నారు. వీరంతా ఎవరికి ఓట్లు వేశారన్నది ఆసక్తికరంగా మారింది. ఆలస్యం అందుకే.. సాధారణంగా ఇతర ప్రాంతాల వారు ఉదయమే వచ్చి పోలింగ్‌లో పాల్గొని వెళ్లిపోతారు. అయితే చాలామంది ఆలస్యంగా నియోజకవర్గానికి చేరు కోగా, ఉదయమే వచ్చినవారిలో కూడా చాలామంది సాయంత్రం వరకు వేచి ఉన్నట్లు తెలిసింది. మరోవైపు రెండో విడత డబ్బులు పంచుతారన్న ఆలోచనతో చాలా మంది గ్రామాల్లోనే ఆగిపోయినట్లు సమాచారం. అవి అందాకే పోలింగ్ కేంద్రాల బాట పట్టారు. ఇంకోవైపు కొందరు ఓటర్లు ఒక పార్టీ నుంచి తమకు డబ్బులు అందలేదంటూ గొడవలకు దిగారు. అవి అందిన తర్వాత సాయంత్రం ఒక్కసారిగా పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. టీఆర్ఎస్, బీజేపీల మధ్య ప్రధాన పోటీ ఉంటుందనుకుంటే.. ఏ పార్టీ అభ్యర్థికైనా లక్ష ఓట్లు మించి పోలైతేనే గెలుపొందే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తే మాత్రం అంత అవసరం లేదని, 90 వేల వరకు వచ్చిన అభ్యర్థి గెలుపొందే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. రూ.10 వేల నుంచి లక్షల్లో.. ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉప ఎన్నికలో గెలిచేదెవరన్నదానిపై బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఒక పార్టీకి అనుకూలంగా ఉండటం, పోలింగ్ రోజు సాయంత్రం మహిళలు, యువత అధిక సంఖ్యలో వచ్చి ఓట్లు వేయడాన్ని పరిగణనలోకి తీసుకుని బెట్టింగ్‌లను కొనసాగిస్తున్నారు. కొంతమంది టీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తారని, మరికొంత మంది బీజేపీ అభ్యర్థి గెలుస్తారని పందేలు కాస్తుండగా.. మరికొందరు కాంగ్రెస్ అభ్యర్థి కూడా గెలవచ్చనే అంచనాలతో బెట్టింగ్ కాస్తున్నారు. రూ.10 వేలు మొదలుకొని రూ.లక్షల్లో బెట్టింగ్‌లు కాస్తున్నట్లు తెలిసింది. తెల్లవారుజామున స్ట్రాంగ్ రూమ్‌లకు.. పోలింగ్ రాత్రి 9 గంటల వరకు కొనసాగిన నేపథ్యంలో చివరి ఈవీఎంలు శుక్రవారం తెల్లవారుజామున 4.55 గంటలకు స్ట్రాంగ్ రూమ్‌లకు చేరుకున్నాయి. నల్లగొండ ఆర్జాలబావిలోని ఎఫ్‌సీఐ గోదాముల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ల్లో ఈవీఎంలను భద్రపరిచారు. చదవండి: మునుగోడు ఉప ఎన్నిక: ఎంత పనైపాయే.. అయ్యో కళ్యాణ్! -
బిగ్ క్వశ్చన్ : పోలింగ్ ముగిసినా తగ్గని పొలిటికల్ హీట్
-
మునుగోడు ఎగ్జిట్‌పోల్స్ సర్వేలో ఆ పార్టీదే హవా..!
-
మునుగోడులో ఓటమి భయంతో తనపై బీజేపీ తప్పుడు ప్రచారం : కర్నె ప్రభాకర్
-
కేసీఆర్‌ను కలిసినట్లు స్రవంతి ఫేక్ వీడియో వైరల్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు పోలింగ్ వేళ ప్రత్యర్థులపై పార్టీలు ఫేక్ ప్రచారానికి తెరలేపాయి. నిన్నటి నుంచి అన్ని పార్టీల మీద ఫేక్ వీడియోలు ప్రచారంలోకి వచ్చాయి. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మండిపడ్డారు. ఫేక్ న్యూస్‌పై ఈసీకి ఫిర్యాదు చేశానని ఆమె పేర్కొన్నారు. మార్ఫింగ్ ఫొటోతో సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసున్నారని తెలిపారు. దుష్ప్రచారం చేసినవారికి నోటీసులు పంపిస్తానని స్రవంతి తెలిపారు. పాల్వాయి స్రవంతి సీఎం కేసీఆర్‌ను కేసీఆర్‌ను కలిశారంటూ నకిలీ వీడియో ప్రచారం అయ్యింది. చదవండి: పోతరాజు అవతారమెత్తిన రాహుల్.. కొరడాతో విన్యాసం మునుగోడు ఉపఎన్నికల్లో తోడుదొంగలు, మాయా మారీచులు, తెరాస బీజేపీ కలిసి విడుదల చేసిన ఫేక్ న్యూస్ పై విరుచుకు పడ్డ పాల్వాయి స్రవంతి గారు @PalvaiINC ఫేక్ న్యూస్ చేసి విడుదల చేసిన వారి పై లీగల్ యాక్షణ్! సిగ్గు విడిచిన కేసీఆర్, బీజేపీలు! గెలవలేక దొంగ నాటకలు! pic.twitter.com/Xpo2Rz01Jk — Telangana Congress (@INCTelangana) November 3, 2022 -
బీజేపీ చిల్లర ప్రయత్నాలు మానుకోవాలి : కేటీఆర్
-
మునుగోడు ఉపఎన్నికపై ఈసీ డేగ కన్ను
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికను సజావుగా నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. రేపటి పోలింగ్‌పై ఈసీ డేగ కన్ను వేసింది. హైదరాబాద్ ఎన్నికల కమిషన్ ఆఫీస్‌లో వెబ్ కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశారు. 298 కేంద్రాల్లో సీసీ కెమెరాలతో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. పోలింగ్ సరళిని దగ్గరుండి ఎన్నికల ప్రధానాధికారి పర్యవేక్షించనున్నారు. ఎలాంటి సమస్య వచ్చిన తక్షణం స్పందించేలా ఏర్పాట్లు చేశారు. ఈవీఎంలలో టెక్నికల్ సమస్యలు వెంటనే తొలగించేలా టెక్నికల్ టీమ్‌ను అధికారులు అప్రమత్తం చేశారు. ఉప ఎన్నికకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. రేపు ఉదయం 6 గంటలకే మాక్ పోలింగ్ జరుగుతుందన్నారు. ప్రలోభాలు జరగకుండా ప్రతి గ్రామంలో తనిఖీలు చేపట్టామన్నారు. ఇప్పటివరకురూ.8 కోట్లు సీజ్ చేశామన్నారు. చదవండి: లెక్క తప్పొద్దు.. పట్టు వీడొద్దు.. టీఆర్ఎస్ నేతలకు అధిష్టానం ఆదేశం -
లెక్క తప్పొద్దు.. పట్టు వీడొద్దు.. టీఆర్ఎస్ నేతలకు అధిష్టానం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ప్రచార గడువు ముగిసిన నేపథ్యంలో ఈసీ నిబంధనల మేరకు స్థానికేతర నేతలు, శ్రేణులంతా మునుగోడు నియోజకవర్గం బయటకు వచ్చినా ఈ నెల 3న పోలింగ్ ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఓటర్లపై పట్టు సడలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో యూనిట్ ఇన్చార్జిలుగా వ్యవహరించిన ముఖ్య నేతలు కొందరు జిల్లా కేంద్రం నల్లగొండలో, మరికొందరు హైదరాబాద్ శివార్లలో మకాం వేసి చివరి నిమిషం వరకు మునుగోడు పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయాలని నిర్ణయించారు. ప్రతి వంద మంది ఓటర్లకు ఒకరు చొప్పున ఇన్చార్జిలుగా పనిచేసిన నేతలు కూడా సంబంధిత ఓటర్ల ఫోన్ నంబర్లను సేకరించి, వారితో పోలింగ్ ముగిసేంత వరకు టచ్‌లో ఉండాలని పార్టీ ఆదేశించింది. గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో హైదరాబాద్ శివారు, ఇతర ప్రాంతాల్లో ఓటర్లు ఉండటంతో.. పోలింగ్ రోజున వారు స్వస్థలాలకు తరలివెళ్లి తమకు అనుకూలంగా ఓటు వేసేలా టీఆర్ఎస్ జాగ్రత్తలు తీసుకుంటోంది. నేడు సీఎం టెలీ కాన్ఫరెన్స్ సుమారు 20 రోజులు ప్రచార సరళిని విశ్లేషించుకున్న టీఆర్ఎస్.. ఇప్పటికే నియోజకవర్గం పరిధిలోని 298 పోలింగ్ బూత్‌ల పరిధిలో తమ అభ్యర్థికి పడే అవకాశమున్న ఓట్ల సంఖ్యపై ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. అయితే ప్రలోభాల పర్వం జోరుగా సాగుతుండటంతో పార్టీ అంచనాలు, లెక్కలు తప్పకుండా ఉండేందుకు గురువారం పోలింగ్ ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించింది. వివిధ సంస్థలు, నిఘా వర్గాల నుంచి అందిన నివేదికల ఆధారంగా సీఎం కేసీఆర్ బుధవారం మునుగోడు ప్రచారంలో కీలకంగా వ్యవహరించిన నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశముందని తెలిసింది. పక్షం రోజులుగా నియోజకవర్గంలోనే మకాం వేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్డీ కేడర్ కలుపుకొని సుమారు మూడు వేల మంది ప్రచారంలో పాల్గొన్నట్లు టీఆర్ఎస్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. చదవండి: మునుగోడును ముంచెత్తారు.. చివరిరోజు హోరెత్తించిన ప్రధాన పార్టీలు -
రైతుబంధు కావాలా.. రాబందు రాజ్యం కావాలా? నిర్ణయం మీదే..
సాక్షి, యాదాద్రి, మునుగోడు: మునుగోడు ఉపఎన్నిక పోరు టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య కాదని.. ఇది రెండు భావజాలాల మధ్య జరగనున్న యుద్ధమని మంత్రి కె.తారకరామారావు అన్నారు. రైతులను ట్రాక్టర్లతో తొక్కించే ఆ గట్టున (బీజేపీ) ఉంటారో లేక రైతు సంక్షేమాన్ని కోరుతున్న సీఎం కేసీఆర్ గట్టున ఉంటారో మునుగోడు ఓటర్లు తేల్చుకోవాలన్నారు. అలాగే రైతుబంధు రాజ్యం కావాలో లేక రాబంధు రాజ్యం కావాలో నిర్ణయించుకోవాలని ప్రజలను కోరారు. ఉపఎన్నిక చివరిరోజు ప్రచారంలో భాగంగా మంగళవారం మంత్రి కేటీఆర్ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం, పుట్టపాక, నల్లగొండ జిల్లా మునుగోడులో జరిగిన రోడ్డు షోలలో ప్రసంగించారు. ఫ్లోరిన్ సమస్య లేకుండా చేశాం.. మునుగోడులో ఫ్లోరిన్ సమస్యతో అనేక మంది అనారోగ్యానికి గురవుతుంటే సీఎం కేసీఆర్ చలించి మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ సురక్షిత తాగునీటిని సరఫరా చేశారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. నేడు నియోజకవర్గంలో ఫ్లోరిన్ సమస్య లేకుండా తరిమికొట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని దండుమల్కాపురం వద్ద టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేసి త్వరలో 35 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నియోజకవర్గంలోని చెర్లగూడెం, కిష్టారాయింపల్లి ప్రాజెక్టులను పూర్తిచేసి 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. శివన్నగూడెం, లక్ష్మణాపురం రిజర్వాయర్లను పూర్తి చేస్తామని, రాచకొండలో లిఫ్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకొని 14 నెలల్లోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. బీజేపీకి డిపాజిట్ రాకుండా బుద్ధి చెప్పాలి.. మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు గ్యాస్ సిలిండర్ ధర రూ. 400 ఉండగా ప్రస్తుతం రూ. 1,200కు చేరుకుందని.. భవిష్యత్తులో ఇది రూ. 4 వేలకు పెరిగే ప్రమాదం ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ను గెలిపిస్తే సంక్షేమం పరుగులు పెడుతుందని, మరిన్ని పథకాలు వస్తాయన్నారు. ‘మనది పేదల ప్రభుత్వం.. కేంద్రంలోని బీజేపీది పెద్దల ప్రభుత్వం. మోదీ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది. ఆ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు, రైతుబీమాతోపాటు ఉచిత కరెంట్‌ను రద్దు చేస్తుంది. దాన్ని గుర్తుపెట్టుకొని ఆ పార్టీకి డిపాజిట్ రాకుండా బుద్ధిచెప్పాలి’ అని ప్రజలను మంత్రి కేటీఆర్ కోరారు. తూతూ ప్రమాణం చేసి డబ్బులు తీసుకోండి.. కేంద్రం ఇచ్చిన రూ. 18 వేల కోట్లకు అమ్ముడుపొయి రాజ గోపాల్‌రెడ్డి మునుగోడు ఉపఎన్నిక తెచ్చారని కేటీఆర్ ఆరో పించారు. బీజేపీ అభ్యర్థిగా తిరిగి పోటీ చేసి రూ. 5 వేల కోట్లకుపైగా వచ్చే లాభంలో రూ. 500 కోట్లు ఖర్చుచేసి గెలిచేందుకు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇంటికి తులం బంగారం చొప్పున ఇచ్చి ఆయనకే ఓటేసేలా రాజ గోపాల్‌రెడ్డి ప్రమాణం చేయించుకోజూస్తారని.. కానీ ఏదో తూతూ ప్రమాణం చేసి ఆ బంగారం, డబ్బు తీసుకొని ఓటు మాత్రం టీఆర్ఎస్కే వేయాలని కేటీఆర్ కోరారు. చదవండి: మునుగోడును ముంచెత్తారు.. చివరిరోజు హోరెత్తించిన ప్రధాన పార్టీలు -
మునుగోడును ముంచెత్తారు.. చివరిరోజు హోరెత్తించిన ప్రధాన పార్టీలు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఆరోపణలు .. ప్రత్యారోపణలు, వ్యూహాలు.. ప్రతి వ్యూహాలు, వ్యక్తిగత విమర్శలు.. దాడులు, ప్రలోభాలు .. పంపకాలు. మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేశాయి. ముఖ్య నేతలంతా నియోజకవర్గంలోనే మోహరించారు. సభలు, సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలతో జోరుగా ప్రచారం కొనసాగించారు. ఇక ప్రచార పర్వం చివరిరోజు మంగళవారం మునుగోడు జనసంద్రాన్ని తలపించింది. నియోజకవర్గానికి పోటెత్తిన వివిధ పార్టీల ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు.. ర్యాలీలు, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తించారు. ఎవరికి వారు తమ పార్టీకే ఓట్లు వేసి గెలిపించాలంటూ అభ్యర్థించారు. ఒకటీ రెండుచోట్ల జరిగిన భౌతిక దాడులు, ఘర్షణలు పోలింగ్‌కు ముందు ఒకింత ఉద్రిక్తతకు తావిచ్చాయి. నియోజకవర్గంలోనే మకాం వేసి.. ఉప ఎన్నిక ప్రభావం రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందన్న భావనతో అధికార టీఆర్ఎస్తో పాటు బీజేపీ, కాంగ్రెస్‌లు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. షెడ్యూల్ వెలువడక ముందే ప్రచారం ప్రారంభించిన పార్టీలు ఆ తర్వాత ఇక పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాయి. స్థానిక నేతలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు నియోజకవర్గాన్ని వీడకుండా ఆయా పార్టీల అధిష్టానాలు చివరిరోజు వరకు కట్టడి చేశాయి. దీంతో నాయకులు ఏకంగా ఆయా గ్రామాల్లోనే గదులు అద్దెకు తీసుకుని ప్రచార వ్యూహాలకు పదును పెట్టారు. ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలు ఉప్పు, నిప్పులా తలపడ్డాయి. అక్టోబర్ 26వ తేదీ రాత్రి బయటకు వచ్చిన ‘ఎమ్మెల్యేలకు ఎర’అంశం రాష్ట్రంలో మరింత రాజకీయ వేడిని రాజేసింది. సంక్షేమ మంత్రం .. ఎదురుదాడి యత్నం ప్రచార పర్వంలో అధికార టీఆర్ఎస్ రాష్ట్రంలో ముఖ్యంగా మునుగోడులో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రస్తావనతో పాటు, తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందంటూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, అవినీతి, కుటుంబ పాలన వంటి ఆరోపణల ఎదురు దాడితో కాషాయ దళం కాక పుట్టించింది. ఇక బీజేపీ, టీఆర్ఎస్ ఒకటే అంటూ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేసింది. హోరెత్తిన ప్రచారం మంగళవారం చివరిరోజు కావడంతో అన్ని పార్టీల ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావుతో పాటు మంత్రులు టి.హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలోని వేర్వేరు మండల కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. సంస్థాన్ నారాయణపురం, మునుగోడులో కేటీఆర్, జగదీశ్‌రెడ్డిలు కలిసి ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. నాంపల్లి మండలంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, చండూరులో ఎర్రబెల్లి, చౌటుప్పల్‌లో శ్రీనివాస్‌గౌడ్, మలారెడ్డి ర్యాలీలకు నేతృత్వం వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాంపల్లి నుంచి మర్రిగూడ మీదుగా చండూరు వరకు వేలాది బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. బండి సంజయ్‌తో పాటు పార్టీ నాయకులు ఈటల రాజేందర్, జితేందర్‌రెడ్డి, వెంకటస్వామి, సునీల్ బన్సల్ తదితరులంతా నియోజకవర్గంలోనే మకాం వేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక కాంగ్రెస్ మునుగోడులో మహిళా గర్జన నిర్వహించింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రేణుకాచౌదరి, గీతారెడ్డి, సీతక్క తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేలు ప్రచారం ముగియడంతో.. గురువారం జరిగే పోలింగ్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి. డబ్బు, మద్యం పంపిణీ మొదలుపెట్టాయి. ప్రధాన పార్టీలు ఒక్కో ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఇవ్వడంతో పాటు భారీయెత్తున మద్యం పంపిణీ చేస్తున్నట్టు తెలిసింది. పోలింగ్‌కు ముందు బుధవారం ఒక్కరోజే మిగిలి ఉండటంతో అన్ని ఏర్పాట్లూ పకడ్బందీగా చేసే ప్రయత్నాల్లో పార్టీలు నిమగ్నమయ్యాయి. డబ్బు, మద్యం పంపిణీతో పాటు కుల సమీకరణలకు ప్రాధాన్యతనిస్తూ తమవైపు తిప్పుకోవడంపై దృష్టి సారించాయి. ప్రచార గడువు ముగియడంతో నియోజకవర్గాన్ని విడిచిపెట్టిన స్థానికేతర నేతలు ఆ చుట్టుపక్కలే మకాం వేశారు. నియోజకవర్గం బయట ఉన్న ఓటర్లను గురువారం పోలింగ్ కేంద్రాలకు రప్పించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీల అభ్యర్థులతో పాటు మొత్తం 47 మంది ఉప ఎన్నిక బరిలో ఉన్న విషయం తెలిసిందే. కాగా 6వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. చదవండి: ఆ గట్టున ఉంటారా? ఈ గట్టున ఉంటారో తేల్చుకోండి: కేటీఆర్ -
ముగిసిన మునుగోడు ఉపఎన్నికల ప్రచారం
-
ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీ ఇలాంటి దాడులు చేయడం సహజం : మంత్రి జగదీష్ రెడ్డి
-
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఊరట..
-
ఈ ఉద్రిక్తతకు కారణం మీరే.. కాదు మీరే!
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ-టీఆర్ఎస్ శ్రేణులు రణరంగం సృష్టించాయి. మునుగోడు మండలం పలివెలలో ఇరు పార్టీ శ్రేణులు కర్రలతో దాడులు చేసుకుని పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చాయి. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. కాగా, తాజా ఘటనపై ఇరు పార్టీ నేతలు మాటల యుద్ధానికి తెరలేపారు. తప్పంతా టీఆర్ఎస్దేనని బీజేపీ ఆరోపిస్తుండగా, బీజేపీనే రెచ్చగొట్టిందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీజేపీ కార్యకర్తలే రెచ్చగొట్లాని చూశారని మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శించారు. ఈ తరహా రెచ్చగొట్టే చర్యలకు టీఆర్ఎస్ శ్రేణులు దూరంగా ఉండి ఎన్నికలపైనే దృష్టిపెట్టాలని సూచించారు. మరొవైపు మంత్రి హరీష్‌రావు సైతం ఈ ఘటనపై స్పందించారు. ఓటమి భయంతోనే బీజేపీ దాడులు చేస్తుందన్న హరీష్‌రావు.. టీఆర్ఎస్ కార్యకర్తలు సంయమనం పాటించాలన్నారు. బీజేపీకి అబద్ధాలు చెప్పడం అలవాటేనని, ఆ పార్టీ కార్యకర్తలే తమపై దాడి చేశారని టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్కు ఓటమి భయం పట్టుకునే దాడికి తెరలేపిందని బీజేపీ నాయకురాలు డీకే అరుణ పేర్కొన్నారు. అందుకే తమ పార్టీ శ్రేణులపై దాడులు చేస్తుందని ఆమె ఆరోపించారు. ఓటమి భయం కారణంగానే టీఆర్ఎస్ దాడులు చేసిందని బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించగా, తమ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చాలా సౌమ్యుడని, ఆయనపైనే టీఆర్ఎస్ దాడులు చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఇది కూడా చదవండి: ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల ఘర్షణ -
...సైగలతో ఓటు అడుక్కుంటున్నాడు!
...సైగలతో ఓటు అడుక్కుంటున్నాడు! -
మునుగోడుపై కేసీఆర్‌ది కపటప్రేమ.. అల్లుడు వెన్నుపోటు పొడుస్తాడనే..
మునుగోడు/ చండూరు: మునుగోడు ఉప ఎన్నికలో లబ్ధిపొందాలనే చండూరు సభలో సీఎం కేసీఆర్ కపటప్రేమ ప్రదర్శించారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. తొమ్మిదేళ్లుగా అధికారంలో కొనసాగుతూ చేయని పనులు పక్షం రోజుల్లో ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. సోమవారం ఆయన మునుగోడు, చండూరులలో విలేకరులతో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే చండూరులో 100 పడకల ఆస్పత్రిని 15రోజుల్లో ఏర్పాటు చేస్తానని చెప్పడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్న రోడ్లను అద్దంలా మారుస్తానని, చెర్లగూడెం రిజర్వాయర్‌ను త్వరలోనే పూర్తి చేస్తానని చెప్పడం కపటప్రేమలో భాగమేనని ఆరోపించారు. మునుగోడుపై అంతప్రేమే ఉంటే ఇంతకాలం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గంలోని 1.72లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తానని చెప్పి నేటికీ ఒక్క ఎకరాకూ ఇవ్వలేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ మునుగోడు అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కేసీఆర్ కాళ్ల వద్ద నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని విమర్శించారు. జీఎస్టీ వాటా ఎందుకు తిరిగి ఇవ్వడం లేదు? రూ.40 లక్షల వ్యాపారం దాటిన చేనేతలకు మాత్రమే కేంద్రం 5 శాతం జీఎస్టీ విధించేలా ఒప్పుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం నేడు దానిని ఎలా వ్యతిరేకిస్తుందని కిషన్‌రెడ్డి అన్నారు. నిజంగా సీఎం కేసీఆర్‌కు చేనేత కార్మికులపై ప్రేమ ఉంటే జీఎస్టీలో రాష్ట్రానికి వచ్చే 2.5 శాతం వాటా ఎందుకు తిరిగి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ కుట్ర చేసిందని ఆరోపిస్తున్న సీఎం ఆ ఎమ్మెల్యేల్లో ముగ్గురు కాంగ్రెస్ నుంచి గెలిచారని, వారిని టీఆర్ఎస్ ఎంతకు కొనుగోలు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే సీబీఐ విచారణ జరగకుండా 51 జీఓ తెచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలన్న కుట్రలో భాగంగానే సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌తోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు అని ఆరోపించారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం రూ.800కోట్లను నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినట్లు కిషన్‌రెడ్డి చెప్పారు. మహమ్మారి విముక్తికి రాష్ట్ర ప్రభుత్వం కంటే కేంద్రమే ఎక్కువ నిధులు ఖర్చు చేసినా కేసీఆర్ తొమ్మిదేళ్లు ఆ విషయాన్ని దాచిపెట్టారని విమర్శించారు. అల్లుడు వెన్నుపోటు పొడుస్తాడనే.. తెలంగాణలో కేసీఆర్ పాలన పోతేనే పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, పంటలకు సాగునీరు వస్తుందని కిషన్‌రెడ్డి చెప్పారు. నాడు ఎన్టీఆర్‌కు అల్లుడు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని, అదే మాదిరిగా అల్లుడు హరీశ్‌రావు వ్యవహరిస్తారనే భయంతోనే కేసీఆర్ సచివాలయానికి రాకుండా ఫాం హౌస్‌కే పరిమితం అయ్యారని ఎద్దేవాచేశారు. కొడుకును ముఖ్యమంత్రి చేయాలనే కల కేసీఆర్‌కు ఎప్పటికీ నెరవేదన్నారు. ఆయా సమావేశాల్లో మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఎత్తిపోసే పనిలో మేం.. ఎత్తుకెళ్లే పనిలో బీజేపీ! -
మైక్ కట్.. మునుగోడులో ప్రచారానికి నేటి సాయంత్రం 6 గంటలకు ముగింపు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగియనుంది. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు రాజకీయ నేతల బహిరంగ ప్రచారానికి తెరపడనుంది. నెలరోజులుగా ఉధృతంగా సాగిన ఈ ప్రచారంలో ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్రులు కూడా గ్రామాలన్నీ చుట్టివచ్చారు. గెలుపే ధ్యేయంగా ప్రచారం సాగించారు. ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చిన ఈ ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో సీఎం కేసీఆర్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీఎస్పీ నేత ఆర్ఎస్. ప్రవీణ్‌కుమార్‌తో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ముఖ్య నాయకులు విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తమ పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం సాగించారు. ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేస్తున్న కె.ఎ. పాల్ కూడా తన వినూత్న ప్రచారంతో ఓటర్లలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. సభలు... సమావేశాలు... ఇంటింటి ప్రచారాలు మునుగోడు ఉప ఎన్నిక వేడి రెండున్నర నెలల క్రితమే ప్రారంభమైంది. రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటి నుంచే అన్ని ప్రధాన పార్టీలు మునుగోడుపై దృష్టి సారించాయి. కాంగ్రెస్ ఆగస్టులోనే అక్కడ సభ నిర్వహించి కేడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేసింది. తర్వాత ఆగస్టు 20న మునుగోడులో జరిగిన బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరు కావడంతో టీఆర్ఎస్ పూర్తిస్థాయి ప్రచారాన్ని ప్రారంభించింది. మళ్లీ అక్టోబర్ 30న చండూరులో జరిగిన సభకు కేసీఆర్ వచ్చేంతవరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలకు అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి తరఫున ప్రచార బాధ్యతలు అప్పగించారు. బీజేపీ అగ్రనేత అమిత్‌షా ఆగస్టు 21న మునుగోడు నియోజకవర్గానికి వచ్చి రాజగోపాల్‌రెడ్డిని పార్టీలో చేర్చుకున్నప్పటి నుంచే కమలం పార్టీ ప్రచార ఢంకా మోగించింది. బీజేపీ ఢిల్లీ నేతలు, ఇతర రాష్ట్రాలకు చెందిన మంత్రులు, రాష్ట్ర స్థాయి ముఖ్యనేతలు ఇక్కడే మకాం వేసి రాజగోపాల్‌రెడ్డి గెలుపు కోసం కృషి చేశారు. ఇక, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌తో పాటు ఉత్తమ్, భట్టి, శ్రీధర్‌బాబు, సీతక్క, జగ్గారెడ్డి లాంటి నేతలంతా కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి విజయం కోసం గ్రామగ్రామాన ప్రచారం నిర్వహించారు. బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి శంకరాచారి గెలుపు కోసం ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్. ప్రవీణ్‌కుమార్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు పనిచేశాయి. స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ శక్తి మేరకు ఇంటింటికి వెళ్లి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. చివరి రోజు ఇలా...! ప్రచారంలో చివరి రోజైన మంగళవారం సాయంత్రం వరకు మునుగోడు దద్దరిల్లనుంది. టీఆర్ఎస్ పక్షాన మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు చివరి రోజున రోడ్‌షోల్లో పాల్గొననున్నారు. బీజేపీ ముఖ్య నేతలు, రాష్ట్ర నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షులు.. 7 మండలాలు, 2 మున్సిపాలిటీల్లో బైక్‌ర్యాలీలు, రోడ్డుషోల్లో పాల్గొననున్నారు. ఇక, కాంగ్రెస్ మునుగోడులో మంగళవారం జరిపే ‘మహిళా గర్జన’సభకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. ఇక, ప్రచారం ముగియనున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి నుంచే అన్ని పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పోలింగ్ ఘట్టంపై దృష్టి సారించనున్నారు. చివరి నిమిషంలో ఓటర్లను ఆకర్షించేందుకు ‘అన్ని రకాల’ప్రయత్నాలను చాపకింద నీరులా చేయనున్నారు. చదవండి: టీఆర్ఎస్తో జోడీ లేదు -
మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు కన్ఫర్మ్: మంత్రి హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ చెప్పేవన్నీ అబద్ధాలేనని మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అబద్ధాలు చెప్పడం బీజేపీ డీఎన్ఏగా మారిందని దుయ్యబట్టారు. చదవండి: Hyderabad: ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ రూట్లలో వెళ్లొద్దు.. ఇదిగో ఇలా వెళ్లండి.. ‘‘ప్రజలపై భారం మోపిందెవరో ప్రజలకు తెలుసు. దొడ్డిదారిన ప్రభుత్వాలను కూలగొట్టిన చరిత్ర బీజేపీది. రాజ్యసభ ఎంపీలను బీజేపీ విలీనం చేసుకోలేదా?. కిషన్‌రెడ్డి, బండి సంజయ్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. నిన్నటి సీఎం కేసీఆర్ సభ తర్వాత మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు కన్ఫర్మ్ అయిందంటూ హరీష్‌రావు వ్యాఖ్యానించారు. -
మునుగోడు ఉప ఎన్నిక: జూనియర్ కేసీఆర్ హంగామా (ఫోటోలు)
-
ఆపరేషన్ బొగ్గు.. డాక్యుమెంట్ విడుదల చేసిన మధుయాష్కీ గౌడ్
సాక్షి, హైదరాబాద్: ఆపరేషన్ బొగ్గు పేరుతో డాక్యుమెంట్ విడుదల చేశారు కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్. రాజగోపాల్ రెడ్డికి బీజేపీ చంద్రగుప్త బొగ్గు గనుల టెండర్ ఇచ్చిందని సెటైర్లు వేశారు. నష్టాల్లో ఉన్న కంపెనీకి రూ.18వేల కోట్ల కాంట్రాక్ట్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. తన కంపెనీ అభివృద్ధి కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని ఆరోపించారు. ఆయన రాజకీయమంతా బ్యాక్‌డోర్ లాబీయింగ్ అని విమర్శలు గుప్పించారు. చదవండి: సీఎం కేసీఆర్.. ఇంటర్నేషనల్ కేడీ.. టీఆర్ఎస్ వీఆర్ఎస్ తప్పదు -
సీఎం కేసీఆర్.. ఇంటర్నేషనల్ కేడీ.. టీఆర్ఎస్ వీఆర్ఎస్ తప్పదు
సంస్థాన్ నారాయణపురం, చండూరు: టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మార్చిన కేసీఆర్‌కు ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వనున్నారని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్.. ఇంటర్నేషనల్ కేడీ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని గెలిపించాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం మహ్మదాబాద్, నల్లగొండ జిల్లా గట్టుప్పల మండలంలోని శేరిగూడెం గ్రామాల్లో శనివారం రేణుకాచౌదరి ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ’’కేసీఆర్.. నీకు కాంగ్రెస్ పార్టీ భిక్ష పెట్టిందన్న విషయం గుర్తుపెట్టుకో.. పిచ్చి వేషాలు మా దగ్గర కాదు.. నీ పప్పులు ఉడకవు’’ అంటూ హెచ్చరించారు. పాల్వాయి స్రవంతి చేతికి ఉన్నవి గాజులు కావని విష్ణు చక్రాలని అన్నారు. మునుగోడు నియోజకవర్గం తమ్ముడి కోసం అంట.. అన్నదమ్ములిద్దరూ కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని కోమటిరెడ్డి బ్రదర్స్‌ని ఉద్దేశించి విమర్శించారు. చదవండి: సుప్రీం జడ్జి పర్యవేక్షణలో విచారణ జరపాలి -
మునుగోడు ఎన్నికల మూడ్ ఏంటీ?
మూడు పార్టీలకు మునుగోడు టెన్షన్ పట్టుకుంది. అభ్యర్థులతో పాటు నాయకులకు కూడా బీపీ పెరుగుతోంది. పైకి ధీమాగా కనిపిస్తున్నా.. లోలోన ఆందోళనకు గురి చేస్తోంది. డబ్బు మంచినీళ్ళలా ఖర్చవుతోంది. కాని ఓటర్ల మనోగతం ఎలా ఉందో ఎవరికీ అంతుపట్టడంలేదు. చివరికి ఏమవుతుందో అన్న ఆతృత అందరినీ వెంటాడుతోంది. ఇంతకీ ఓటర్లు ఏమనుకుంటున్నారు? ఏ పార్టీలోనూ కనిపించని గెలుపు ధీమా మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలకు చావో రేవో అన్న పరిస్థితి సృష్టించింది. రెండు నెలలుగా అక్కడ జరుగుతున్న రాజకీయం, పార్టీల మార్పిళ్ళు, డబ్బు ఖర్చు, ఓటర్ల కోసం ఇస్తున్న ఆఫర్లు వంటివి తలపండిన రాజకీయ విశ్లేషకులను సైతం దిగ్ర్బాంతికి గురి చేస్తున్నాయి. మరోవైపు పోటీ చేసే అభ్యర్థులకు, అక్కడ ఎన్నికల బాధ్యతలు తీసుకున్న ఆయా పార్టీల సీనియర్ నాయకులకు టెన్షన్ రోజు రోజుకూ పెరుగుతోంది. సస్పెన్స్, క్రైం థ్రిల్లర్‌ను తలపించే విధంగా మునుగోడు రాజకీయాలు అనేక రికార్డులను బద్దలు కొడుతున్నాయి. ఒక నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక కంటే... రాష్ట్రం భవిష్యత్‌ను నిర్దేశించే ఎన్నికగా ప్రచారం జరుగుతోంది. కాని ప్రజల నాడి పట్టుకోవడంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయి. మంచినీళ్ళలా డబ్బును ఖర్చు పెడుతున్నా.. చివరికి ఓటరు దేవుడు ఎవరిని కరుణిస్తాడో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు నాయకులు. అస్త్రశస్త్ర ప్రయోగం ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన కీలక నేతలంతా నియోజకవర్గంలో మకాం వేశారు. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు మరోసారి జరగకుండా గులాబీ పార్టీ నాయకత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంది. రాష్ట్ర మంత్రులందరినీ నియోజకవర్గంలోనే మోహరించి ప్రచారం సాగిస్తోంది. బీజేపీ కూడా ఇప్పటి వరకు ఇద్దరు కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇతర కీలక నేతలంతా ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పీసీసీ చీఫ్ రేవంత్, ఉత్తమ్, జానా రెడ్డితో పాటు మాజీ మంత్రులను రంగంలోకి దించి ప్రచారం సాగిస్తోంది. అన్ని పార్టీలకు సంబంధించిన ఇంత మంది నేతలు నియోజకవర్గంలోనే ప్రచారం నిర్వహిస్తున్నా గెలుపుపై ఏ పార్టీలోనూ అంత ధీమా కనిపించడం లేదని ఆయా పార్టీల నేతలే అంటున్నారు. తింటారా.. తాగుతారా? ఓటర్లను ఆకర్షించేందుకు నాయకులు అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. ఓటర్ల అవసరాలను గుర్తించి వాటిని తీర్చి తమవైపుకు తిప్పుకునే యత్నం చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన ఓటర్ల వద్దకు కూడా వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. పార్టీలు చేస్తున్న పోటా పోటీ ఖర్చును చూస్తున్న ఓటరు కూడా నేతలకే ఆఫర్ ఇస్తున్నాడంట. ఇంతవరకు నేతలే వచ్చి.. గెలిపిస్తే ఇది చేస్తా అది చేస్తానంటూ ఆఫర్లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు తలకిందులు అయ్యాయని అంటున్నారు. ఎప్పుడు మీరేనా ఆఫర్లిచ్చేది? ఈసారి మేం మీకు ఆఫర్ ఇస్తామంటున్నారట. మేం ఇంతమంది ఓటర్లం ఉన్నాం ఇంత కావాలి.. ఇస్తే ఓటు మీకే అని నాయకులకు ఆఫర్లు ఇస్తున్నారట. చేసేదేం లేక అడిగినంత ముట్టజెప్పేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయని టాక్. -
KTR: బీజేపీపై టీఆర్ఎస్ ఛార్జ్‌షీట్.. ఏ ప్రధాని చేయని తప్పు మోదీ చేశారు..
సాక్షి, హైదరాబాద్: బీజేపీపై ఛార్జ్‌షీట్ విడుదల చేశారు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్. మునుగోడులో అసాధారణ పరిస్థితులు కన్పిస్తున్నాయని చెప్పారు. 8 ఏళ్లలో తాము చేసిన అభివృద్ధి పనుల గురించి చెప్పి ఉపఎన్నికలో ప్రజలను ఓట్లు అడుగుతున్నామన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ 8 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమి లేదని కేటీఆర్ విమర్శించారు. ఫ్లోరోసిస్ సమస్యపై ఆ పార్టీ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. కమలం పార్టీ ఏం చేసిందో, ఏం చేస్తుందో చెప్పకుండా సీఎం కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. దేశంలో ఏ ప్రధాని చేయని తప్పు మోదీ చేశారని ఆరోపించారు. చేనేత, ఖాదీపై పన్ను వేసిన తొలి ప్రధాని ఆయనే అని విమర్శలకు ఎక్కుపెట్టారు. ఫ్లోరిసిస్ సమస్యపై మొదటి ఛార్జ్‌షీట్, చేనేత, ఖాదీపై జీఎస్టీకి వ్యతిరేకంగా రెండో ఛార్జ్‌షీట్, రైతుల మోటార్లకు మీటర్లపై మూడో ఛార్జ్‌షీట్, నీటి పంపకాల్లో తెలంగాణకు అన్యాయంపై నాలుగో ఛార్జ్‌షీట్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై ఐదో ఛార్జ్‌షీట్ వేస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. మునుగోడు ప్రజలందరి తరఫున బీజేపీపై ఈ ఛార్జ్‌షీట్‌ను వేస్తున్నట్లు తెలిపారు. మోదీ మోసం చేశారు.. ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి మోదీ యువతను మోసం చేశారని కేటీఆర్ విమర్శించారు. ఉచిత పథకాలంటూ దాడి చేసి సంక్షేమ పథకాలకు సమాధి కడతారా అని ప్రశ్నించారు. కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీపై కేంద్రం నయవంచన చేసిందని ధ్వజమెత్తారు. ధాన్యం కొనకుండా కుటిల రాజకీయం చేసిన మోదీ రైతు విరోధి అని మండిపడ్డారు. మోదీ హయాంలో రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పతనమైందని కేటీఆర్ ఆరోపించారు. బేచో ఇండియా అంటూ ప్రభుత్వ రంగ సంస్థల్ని క్లియరెన్స్ సేల్ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. కార్పోరేట్లకు కానుకలు ఇస్తూ సామాన్యులను పన్నులతో బీజేపీ వేధిస్తోందన్నారు. చదవండి: ఈ టైంలో వద్దు.. మునుగోడులో జేపీ నడ్డా సభ రద్దు..! -
ఈ టైంలో వద్దు.. మునుగోడులో జేపీ నడ్డా సభ రద్దు..!
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 31న మునుగోడులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొనాల్సిన బహిరంగసభను రద్దు చేసుకున్నారు. అయితే దీనిపై రాష్ట్ర పార్టీ ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదని ముఖ్యనేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో తాజాగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే ఈ సభ ఆలోచనను విరమించుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలకు పెద్దమొత్తంలో డబ్బు ఎర చూపి ప్రలోభపరిచేందుకు బీజేపీ నాయకత్వం ప్రయత్నించిందంటూ టీఆర్ఎస్ నేతలు ఆరోపించడం, దీనికి సంబంధించిన ఆడియో టేపులు కూడా బయటకు రావడం రాష్ట్రరాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఎన్నికల ప్రచారసభకు రావడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదనే నిర్ణయానికి పార్టీ నాయకత్వం వచ్చినట్టు సమాచారం. ఈ సభ నిర్వహణకు చేసే వ్యయాన్ని ఎన్నికల ప్రచారానికి మళ్లించి మరింత ప్రభావవంతంగా చేయాలని నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. గతం నుంచే మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొనడానికి నడ్డా అంతగా సుముఖత చూపలేదని తెలుస్తోంది. కొన్నిరోజుల క్రితం మునుగోడు పరిధిలో మల్కాపురంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు నడ్డాకు సమాధిని కట్టడంతో బీజేపీ నాయకత్వం తీవ్రస్థాయిలో స్పందించింది. ఈ నేపథ్యంలో 31న మునుగోడు సభలో పాల్గొనడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీలకు నడ్డా గట్టి జవాబిస్తారని పార్టీ నాయకులు భావించారు. 9 చోట్ల సభలు...: 31న నడ్డా సభకు బదులుగా మునుగోడు పరిధిలోని ఏడు మండల కేంద్రాలు, రెండు మున్సిపాలిటీల్లో నిర్వహించే సభల్లో పలువురు కేంద్రమంత్రులు, జాతీయ నేతలు పాల్గొననున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా ఎక్కడికక్కడ బైక్ ర్యాలీలు, ఎన్నికల ప్రభలు నిర్వహించి వీలైనంత ఎక్కువమంది ప్రజలను కలుసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్ 1న జాతీయ, రాష్ట్రపార్టీ ముఖ్యనేతల రోడ్‌షోలతో పార్టీ ప్రచార కార్యక్రమాలకు ముగింపు పలకనున్నారు. చదవండి: కేసీఆర్ రాజకీయ జీవితం సమాధి... -
అర్ధ రూపాయికి కూడా అమ్ముడుపోని వారికి రూ.100 కోట్లా?
సాక్షి, చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ పట్టణంలో గురువారం నిర్వహించిన గౌడ ఆత్మీయ సమావేశంలో మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ సహా పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్‌కు మతి భ్రమించి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని, ఎన్నికలు వస్తే డబ్బు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మొయినాబాద్ ఫామ్‌హౌజ్ బేరసారాలు టీఆఎస్ చేసిన డ్రామాగా పేర్కొన్నారు. నెత్తి మీద రూపాయి పెడితే అర్థ రూపాయికి కూడా అమ్ముడుపోని వారికి రూ.100 కోట్లా పెడతారా? వాళ్ళను మేము కాదుకదా ఎవరు ఏ పార్టీలోకి రానివ్వరు అని ధ్వజమెత్తారు. ‘ 8 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల బతుకులు బాగుపడలేదు. ఎన్నికలు వస్తే డబ్బు రాజకీయం చేస్తున్నారు. దుర్మార్గమైన పాలన నడుస్తుంది. ప్రశ్నించే గొంతు లేకుండా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు కేసీఆర్. ఇటువంటి ముఖ్యమంత్రికి సరైన జవాబు చెప్పాలి. ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం లేదు. టీఆర్ఎస్ పార్టీలో రాజకీయాలు చేసే వారివి బానిస బతుకులు. అవమానాలు భరించలేక బూర నర్సయ్య గౌడ్ బయటకు వచ్చారు. ఎంతోమంది ఉద్యమకారులు ఇప్పుడు ఆ పార్టీలో లేరు. దురహంకార పాలనకు చరమగీతం పాడాలి. ఒక ఎమ్మెల్యేని ఓడ కొట్టడానికి ఆలీబాబా 40 దొంగల ముఠా దిగింది. పోలీస్ జీపులో, ఎస్కార్ట్ జీపులల్లోనే డబ్బులు తీసుకెళుతున్నారు. నీ డబ్బు, నీ అధికారం కంటే ప్రజాశక్తి గొప్పదని హుజూరాబాద్ ప్రజలు నిరూపించారు.’ అని టీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ వచ్చింది బడుగు బలహీన వర్గాల కోసమని, ప్రస్తుతం పేదవాడు ప్రభుత్వ ఆసుపత్రికి పోయే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి. ఇదీ చదవండి: ఫాంహౌస్ డీల్‌పై వెలుగులోకి షాకింగ్ విషయాలు.. రోహిత్‌రెడ్డి ఫిర్యాదులో ఏముంది? -
కేసీఆర్ కుటుంబంతో ఆ ముగ్గురికి సంబంధాలు.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, నల్లగొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ పాలనపై బీజేపీ చార్జ్ షీట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ, ఎన్నికల్లో గెలవడానికి టీఆర్ఎస్ డ్రామాలాడుతోందని మండిపడ్డారు. చదవండి: ఫాంహౌస్ డీల్‌పై వెలుగులోకి షాకింగ్ విషయాలు.. రోహిత్‌రెడ్డి ఫిర్యాదులో ఏముంది? ‘‘పోటీ చేసే అభ్యర్థి ఏం చేశారు ఏం చేయబోతున్నారు అనేది మాట్లాడాలి. తెలంగాణలో మూర్ఖత్వంగా సాగిస్తున్న కేసీఆర్ పాలన అంతం చేసేందుకే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. మునుగోడును అభివృద్ధి చేయలేదు. కనీస అవసరాలు తీర్చలేదు. రాజగోపాల్ రెడ్డి ప్రశ్నిస్తే అసెంబ్లీ నుంచి బయటకు గెంటారు. మునుగోడు ప్రజల కోసం రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు’’ అని బండి సంజయ్ అన్నారు. ‘‘సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారు. కేవలం బీజేపీ, మోదీని తిట్టడమే పని పెట్టుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిని పక్కన ఉంచుకుని తిప్పుకోవడమే నేతలు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ముందుకుపోతున్నాం. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక ఇది. మునుగోడు ప్రజలకు వాస్తవాలను వివరించేందుకే ఈ చార్జ్‌షీట్ విడుదల చేశాం’’ అని బండి సంజయ్ అన్నారు. ఫాంహౌస్ ఎపిసోడ్ అంతా డ్రామా. కేసీఆర్ కుటుంబంతోనే ఆ ముగ్గురికి సంబంధాలు. ఆడియో టేపులు ఇంకా రెడీ కాలేదట. ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ఇంత అవసరమా. ఢిల్లీలో కేసీఆర్‌ను ఎవరెవరు కలిశారో వివరాలు బయటపెట్టాలి. కేసీఆర్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ ఘటనపై హైకోర్టును ఆశ్రయిస్తాం. సీబీఐ విచారణ కూడా జరగాల్సిందే’’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. -
ఫామ్‌హౌస్ డీల్‌పై కేసు నమోదు
-
ఫాంహౌస్ డీల్‌పై వెలుగులోకి షాకింగ్ విషయాలు.. రోహిత్‌రెడ్డి ఫిర్యాదులో ఏముంది?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మొయినాబాద్ ఫాంహౌస్‌ను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. పట్టుబడ ముగ్గురిని ఫౌంహౌస్‌లోనే ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేల బేరసారాల వెనుక ఎవరున్నారనే దానిపై విచారణ చేపట్టారు. పట్టుబడ్డ ముగ్గురి ఫోన్ల కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. చదవండి: ఫామ్ హౌస్‌లో ఏం జరిగింది?.. ఆ ఫోన్లలో అవతల ఎవరు? కాగా, టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. డీల్‌లో భాగంగానే స్వామీజీ, నందు, సతీష్ ఫాంహౌస్‌కు వచ్చారని, బీజేపీలో చేరాలని ఒత్తిడి తెచ్చినట్లు రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీలో చేరకుంటే క్రిమినల్ కేసులు పెడతామని.. ఈడీ,సీబీఐ దాడులు జరుగుతాయని బెదిరించారని రోహిత్ రెడ్డి అన్నారు. బీజేపీలో చేరేందుకు రూ.100 కోట్లు ఆఫర్ చేశారన్నారు. ఎమ్మెల్యేలను తీసుకొస్తే ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఇస్తామని డీల్ నడిచినట్లు ఫిర్యాదులో రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. -
ఫామ్ హౌస్‌లో ఏం జరిగింది?.. ఆ ఫోన్లలో అవతల ఎవరు?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేలా ప్రలోభాలకు ప్రయత్నించిన ముగ్గురూ చేసిన ఫోన్ కాల్స్ ఇప్పుడు కీలకంగా మారాయి. ఎవరికి ఫోన్ చేశారు? అనే అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. దాదాపు గంటన్నర పాటు సాగిన వీరి మంతనాలను నిఘా వర్గాలు, పోలీసు అధికారులు ప్రత్యేక కెమెరాల ద్వారా రికార్డు చేశారు. చదవండి: ఎమ్మెల్యేలకు ఎర? హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, పైలెట్ రోహిత్ రెడ్డిలను ప్రలోభ పెట్టడానికి రంగంలోకి దిగినట్టుగా చెబుతున్న సింహయాజులు స్వామి, రామచంద్ర భారతి, నంద కుమార్‌లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి, ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించడానికి పోలీసులు భారీ స్కెచ్ వేశారు. రోహిత్ రెడ్డి ద్వారానే ఈ సమావేశం మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్‌లో ఉన్న అతడి ఫామ్ హౌస్‌లో జరిగేలా కథ నడిపారు. బుధవారం సాయంత్రం సమావేశం కావాలని వీళ్లు మంగళవారం ఉదయమే నిర్ణయించుకున్నారు. వేచి చూసి దాడి చేశారు..: ఎమ్మెల్యేల ద్వారా విషయం తెలుసుకున్న నిఘా అధికారులు, పోలీసులు మంగళవారం సాయంత్రమే ఫామ్ హౌస్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అందులో సమావేశం జరిగేందుకు ఉద్దేశించిన హాల్‌తో పాటు ఆరుచోట్ల అత్యాధునికమైన రహస్య కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో ఎక్కడ సమావేశం జరిగినా ఆద్యంతం రికార్డు అయ్యేలా సిద్ధం చేశారు. బుధవారం ఉదయం నుంచి పోలీసులు, నిఘా వర్గాలు మారు వేషాల్లో ఫామ్ హౌస్ చుట్టూ ఉన్నా.. సాయంత్రం ఈ సమావేశం మొదలైన వెంటనే దాడి చేయలేదు. దాదాపు గంటన్నర పాటు సమావేశం జరిగేవరకు, వారి మాటలతో పాటు అక్కడ జరిగే ప్రతి వ్యవహారం రికార్డు కావడం కోసం వేచి చూశారు. ఆపై దాడి చేసి ముగ్గురితో పాటు డ్రైవర్ తిరుపతిని అదుపులోకి తీసుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తులకు ఫోన్లు!: సమావేశం జరిగిన హాలులోని ఓ పక్కగా ఉన్న డైనింగ్ టేబుల్ వద్ద ఆ ముగ్గురూ, సోఫాల్లో ఎమ్మెల్యేలు నలుగురూ కూర్చున్నారు. ఈ మీటింగ్ నేపథ్యంలో రామచంద్ర భారతి మూడుసార్లు గుర్తుతెలియని వ్యక్తులకు ఫోన్లు చేసి ఎమ్మెల్యేలతో మాట్లాడించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అయితే అవతలి వ్యక్తి అందుబాటులోకి రాకపోవడంతో వీలు కాలేదు. అలాగే ఆ ముగ్గురూ ఢిల్లీలో ఉన్న ఓ కేంద్ర పెద్దతో మాట్లాడించాలని ప్రయతి్నంచారని, అయితే ఆయన అందుబాటులో లేరని సహాయకుడు చెప్పిన అంశాలు రికార్డు అయినట్లు తెలిసింది. 3 రోజులు..70 మంది పోలీసులు: ఈ ఆపరేషన్ కోసం నిఘా, పోలీసు వర్గాలకు చెందిన దాదాపు 70 మంది 3 రోజులు పని చేశారు. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌తో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో 84 సీక్రెట్ కెమెరాలను ఏర్పాటు చేశారు. గంటన్నర పాటు సాగిన భేటీ ఈ కెమెరాల్లో రికార్డు అయ్యింది. పీఠాధిపతిగా ప్రకటించుకున్న సింహయాజులు: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల పర్వంలో కీలకంగా వ్యవహరించిన సింహయాజులు స్వామి తిరుపతి వాసి. అన్నమయ్య జిల్లా చిన్న మండ్యం మండలంలో శ్రీమంత్రరాజ పీఠం ఏర్పాటు చేసుకొని, తనను తాను పీఠాధిపతిగా ప్రకటించుకున్నారు. అది లక్ష్మీ నరసింహ స్వామికి చెందిన పీఠంగా చెబుతూ పలుకుబడి పెంచుకున్నాడు. ఇతడికి తిరుపతిలో సొంత ఇల్లు ఉన్నట్లు తెలుస్తోంది. డబ్బు తెచ్చింది నందూయేనా..?: రామచంద్ర భారతి ఢిల్లీ ఫరీదాబాద్‌లోని ఓ ఆలయ పూజారి కాగా.. కర్ణాటకకు చెందిన నందకుమార్ నగరానికి వలసవచ్చి చైతన్యపురి ప్రాంతంలో నివసిస్తున్నాడు. గతంలో బంజారాహిల్స్ ప్రాంతంలో సదరన్ స్పైస్ పేరుతో ఓ రెస్టారెంట్ నడిపాడు. ఫిల్మీ జంక్షన్ అనే రెస్టారెంట్ నిర్వహణ సమయంలో దాని స్థల యజమాని అయిన సినీ ప్రముఖుడితో విభేదాలు తలెత్తాయి. ఆపై అవినాష్ అనే వ్యక్తితో కలిసి మాణిక్‌చంద్ పాన్ మసాలా వ్యాపారం చేశాడు. తర్వాత మాణిక్ చంద్ బ్రాండ్‌ను తన ఆ«దీనంలోకి తీసుకున్నాడు. ప్రస్తుతం తెలంగాణతో పాటు ఏపీలోనూ సౌత్ పేరుతో రెస్టారెంట్లు నిర్వహిస్తున్నాడు. వీటితో పాటు నగరంలోని అనేక పబ్బులు, రెస్టారెంట్లు, బార్లలో భాగస్వామ్యం ఉంది. పలువురు ప్రముఖులు ఇతడి వద్ద పెట్టుబడులు పెట్టారని, కొందరు ప్రజాప్రతినిధులు, పోలీసులతో ఇతడికి స్నేహం ఉందని, హవాలా ఆపరేటర్ అని కూడా తెలిసింది. బుధవారం నందు పుట్టిన రోజు కావడంతో ఈ ఫామ్ హౌస్‌లో పార్టీ కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. హవాలా ఆపరేటర్ కావడంతో డబ్బు తీసుకువచ్చింది నందూయేనా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా నిందితులు ముగ్గుర్నీ పోలీసులు ఫామ్‌హౌస్ నుంచి తరలించారు. -
‘హుజురాబాద్, దుబ్బాక మాదిరిగా మునుగోడులోనూ డ్రామాలు షురూ’
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గర పడుతున్న క్రమంలో ఈ రోజు నుంచి డ్రామాలు మొదలయ్యాయని బీజేపీపై విమర్శలు గుప్పించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాజగోపాల్ రెడ్డికి జ్వరం అని వార్తల్లో చూశానని, హుజురాబాద్, దుబ్బాకలో అభ్యర్థులకు జరిగినట్లే ఇక్కడా జరుగుతోందని ఎద్దేవా చేశారు. తాము ముందు నుంచే ఇలా జరుగుతుందని ఊహించామని, మునుగోడు ప్రజలు దీనిని గమనించాలని సూచించారు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు మంత్రి తలసాని. ‘మునుగోడులో జరుగుతున్న ఎన్నికల్లో ఇవాళ్టి నుంచి డ్రామాలు స్టార్ట్ అయ్యాయి. రాజగోపాల్ రెడ్డికి జ్వరం అని వార్తల్లో చూశాను. హుజురాబాద్, దుబ్బాక లో అభ్యర్థులకు జరిగినట్టే జరుగుతుంది. ఇవాళ జ్వరం వచ్చింది, రేపు గుండె నొప్పి రావొచ్చు. ఇలాగే కుటుంబం రోడ్డు మీదికి వచ్చి నిరసనలు చేసి సింపతి క్రెయేట్ చేసే ఏడుపులు మొదలవుతాయి. మేము ముందు నుంచి ఇదే చూస్తున్నాం. మేము ఊహించిందే జరిగింది. మునుగోడు ప్రజలు గమనించాలి. మునుగోడు అభివృద్ధి ఏ మేరకు చేసామో గమనించండి. మనకు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. ఈ డ్రామాలను మునుగోడు ప్రజలు నమ్మకండి. జ్వరం ఒక్కటే కాదు, రేపు తన పైన దాడి చేయించుకొని చేతులు కాళ్ళు విరగొట్టుకుంటాడు. మేము స్పష్టమైన మెజారిటీతో గెలుస్తున్నాం’ అని తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇదీ చదవండి: Munugode Bypoll 2022: ఎల్బీ నగర్లో ఏం జరుగుతోంది?.. మునుగోడు ఎన్నికకు సంబంధమేంటీ? -
Telangana: రాజకీయాల దిశను మార్చబోతున్న మునుగోడు!
ఒక ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల దిశను మార్చబోతోందా? ఎన్నిక జరుగుతున్న ప్రాంతం రాజధానిగా మారిపోయిందా? కేంద్ర, రాష్ట్ర మంత్రులు పెద్ద ఎత్తున అక్కడే కేంద్రీకరించారా? పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మంత్రులతో అధికారిక వాహనాలు అక్కడ దుమ్ము రేపుతున్నాయా? ఇంతకీ మునుగోడులో ఏం జరుగుతోంది? ప్రచారం.. ఆపై అధికారుల హడావుడి నల్గొండ జిల్లా మునుగోడు ఇప్పుడు తెలంగాణకు మరో రాజధానిగా మారిపోయిందన్నట్టుగా పరిస్థితి ఉంది. ఉప ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్ర యంత్రాంగమంతా అక్కడే తిష్ట వేసింది. రాష్ట్ర కేబినెట్ మొత్తం అక్కడే ఉంది. వారి కోసం అధికారులు వచ్చి వెళుతున్నారు. దీంతో మునుగోడులో ఒకవైపు ఎన్నికల ప్రచారం.. మరోవైపు అధికారుల రాకపోకలతో నానా హడావుడిగా తయారైంది. ఏ ఎన్నికల్లోనూ ఇంత హడావుడి చూడలేదంటున్నారు స్థానిక ప్రజలు. ఎన్నిక కోసం ఢిల్లీ నుంచి నాయకులు ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా తక్కువేం తినలేదు. ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో సహా పలువురు కేంద్ర నాయకులు మునుగోడులో ప్రచారం చేస్తున్నారు. కొద్ది రోజుల్లో కేంద్ర పెద్దల్లో ఒకరు బీజేపీ అభ్యర్థి కోసం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థి కోసం భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఏడాదిలో సాధారణ ఎన్నికలు రాబోతున్నందున అన్ని పార్టీలు మునుగోడు ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని చావో రేవో అన్నట్లుగా పోరాడుతుండటంతోనే ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. 15 మంది మంత్రులు, 71 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్ర పరిపాలన అంతా మునుగోడు నుంచే సాగుతున్నట్లుగా కనిపిస్తోంది. 15 మంది రాష్ట్ర మంత్రులు, 71 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు ప్రచారంలో తలమునకలయ్యారు. కేటీఆర్, హరీష్ రావు సహా అనేక మంది సీనియర్ మంత్రులు మునుగోడులోనే తిష్ట వేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ అక్కడే ఉన్నారు. కాంగ్రెస్ కూడా బాగానే ఫైట్ చేస్తోంది. నిత్యం హైదరాబాద్‌లోనే కనిపించే కాంగ్రెస్ సీనియర్లంతా ఇప్పుడు మునుగోడులోనే ప్రచారం చేస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, రాష్ట్ర ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్ సహా మునుగోడు ప్రచారంలో పూర్తిగా మునిగిపోయారు. పాపం ఖాకీలు కీలక నేతల పర్యటన, ప్రచారంతో పోలీస్ యంత్రాంగానికి కంటి మీద కునుకు కరువైంది. స్థానిక పోలీసులకు తోడుగా ఇతర జిల్లాల నుంచి కూడా వేలాదిగా పోలీసులను అక్కడ మోహరించారు. వాహనాల తనిఖీలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. పోలీస్ చెక్‌పోస్టులు, బారీకేడ్లు పెట్టి వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాము చూడని పెద్ద పెద్ద కార్లు రావడం, ఇరుకు రోడ్లలో ట్రాఫిక్ జామ్‌లతో మునుగోడు ప్రజలు సతమతమవుతున్నారు. మొత్తం మీద మునుగోడు ఉప ఎన్నిక అనేక రకాలుగా చరిత్ర సృష్టించబోతోంది. -
కామ్రేడ్.. అసెంబ్లీకి ఎప్పుడు వెళ్దాం? కమ్యూనిస్టు నేతల్లో కొత్త ఉత్సాహం
మునుగోడు ఉప ఎన్నిక ఖమ్మం జిల్లా గులాబీ నేతల చావుకొచ్చింది. మునుగోడులో టీఆర్ఎస్కు వామపక్షాల మద్దతు ఇస్తున్నాయి. ఈ మద్దతు వచ్చే ఎన్నికల్లో కూడా పొత్తు కొనసాగబోతోందని మూడు పార్టీల నుంచి సంకేతాలు వచ్చాయి. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు చాలా ఉత్సాహంగా ఉన్నాయి. ముఖ్యంగా రెండు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు ఖమ్మం జిల్లాకే చెందినవారు కావడంతో ఆ ఇద్దరూ కూడా అత్యంత ఉత్సాహంగా కనిపిస్తున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావులు వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పొత్తుతో ఈ జిల్లా నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఉవ్విళ్ళూరుతున్నారని ప్రచారం సాగుతోంది. మునుగోడుతో ముహూర్తం టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కమ్యూనిస్టు పార్టీలతో సంబంధాలు ఒక్కోసారి ఒక్కోలా ఉంటున్నాయి. అయితే మునుగోడులో గులాబీకి ఎర్రపార్టీలు మద్దతు ప్రకటించాయి. మూడు పార్టీల నేతలు కలిసి ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు ఖమ్మం జిల్లాలో తమకు బలమున్న సీట్లపై ఖర్చీఫ్ వేసేశారట. ఘన చరిత్ర.. పేలవ వర్తమానం పాతికేళ్ళ నాడు ఒకసారి ఎంపీగా గెలిచిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం 2004లో ఖమ్మం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు 2009లో ఒకసారి కొత్తగూడెం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రస్తుతం రెండు పార్టీలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేదు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల రీత్యా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కచ్చితంగా వామపక్షాలతో కలిసి పోటీ చేస్తుందనేది రాజకీయ వర్గాల్లో గట్టిగా ఉన్న అభిప్రాయం. అందుకు మూడు పార్టీలు కూడా సిద్ధంగానే ఉన్నాయి. మునుగోడు ఉప ఎన్నికే అందుకు ఉదాహరణ అంటున్నారు. ఈ సారి తగ్గేదేలే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో జనరల్ సీట్లు ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు మాత్రమే. మిగిలినవన్నీ రిజర్వుడు సీట్లే. అగ్రకులాలకు చెందిన నేతలు ఎంతమంది ఉన్నా అక్కడ ఉన్నది మూడు సీట్లు మాత్రమే. ఇప్పటికే ఆ జిల్లాలో టీఆర్ఎస్ నుంచి నలుగురు సీనియర్ నేతలు పని చేస్తున్నారు. ఇప్పుడు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావులు పాలేరు, కొత్తగూడెం సీట్లపై ఖర్ఛీఫ్ వేసుకున్నారట. వామపక్షాల అగ్రనేతలు తమ స్థానాల్లో సెటిలైతే తమ పరిస్థితేం కావాలంటూ గులాబీ పార్టీ ఆశావహుల్లో గుబులు మొదలైందట. మునుగోడు ఉప ఎన్నిక తమ సీట్లకు ఎసరు తెచ్చిందని గాబరా పడుతున్నారట ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీనియర్ గులాబీ నేతలు. గెలిచిందే ఒక్కరు, ఆ తర్వాత కారు ఎక్కేశారు ఒకప్పుడు ఖమ్మం జిల్లా కమ్యూనిస్టులకు కంచుకోట. ఇప్పటికీ కమ్యూనిస్టు పార్టీలంటే అభిమానించేవారు ఉన్నప్పటికీ...రెండు పార్టీల నేతల తీరుతో కాలక్రమంలో అసలు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కొక్క సీటు మాత్రమే సాధించుకోగలిగింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అక్కడ బలంగానే ఉంది. అయితే కాంగ్రెస్ నుంచి గెలిచిన పాలేరు, కొత్తగూడెం ఎమ్మెల్యేలు కారెక్కడంతో జనరల్ సీట్లు మూడు ఇప్పుడు గులాబీ పార్టీ ఖాతాలోనే ఉన్నాయి. మరోవైపు జిల్లా రాజకీయాల్లో పట్టున్న ఇద్దరు కామ్రేడ్లు కొత్తగూడెం, పాలేరు సీట్లపై ఖర్చీఫ్ వేసుకోవడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. కర్చీఫ్ మిషన్ 2023 టీఆర్ఎస్కు వామపక్షాలతో పొత్తు కుదిరితే గనుక మిగిలిన సీట్ల సంగతెలా ఉన్నా తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావులు తమకు కావాల్సిన సీట్లపై గట్టిగా ఒత్తిడి తెస్తారని జిల్లాలో టాక్. అదే నిజమైతే గులాబీ శ్రేణులు ఎంతవరకు సహకరిస్తాయో చూడాలి. ఇటీవల ఖమ్మం జిల్లాలో సంభవించిన రాజకీయ పరిణామాలు అటు టీఆర్ఎస్కు, ఇటు సీపీఎంకు కూడా కొంత ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఈ వ్యతిరేకతను సానుకూలంగా మార్చుకోగలిగితే పొత్తుల వల్ల ఫలితం ఉంటుందని, కమ్యూనిస్టు పార్టీల నాయకులిద్దరికీ ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు. చదవండి: పదవి అంటే పరారే.! కాంగ్రెస్‌కు ఎందుకీ పరిస్థితి? -
ఎల్బీ నగర్లో ఏం జరుగుతోంది?.. మునుగోడు ఎన్నికకు సంబంధమేంటీ?
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం హైదరాబాద్ ఎల్బీ నగర్లో జరుగుతోందా? ఎల్బీ నగర్‌కు మునుగోడుకు సంబంధం ఏంటి? మునుగోడులో ఎవరు గెలిచేది ఎల్బీ నగర్ నిర్దేశించబోతోందా? మునుగోడు వెళ్లాల్సిన మూడు పార్టీల ముఖ్య నేతలంతా ఎల్బీనగర్లోనే ఎందుకు మకాం వేశారు? హైదరాబాద్ శివార్లపై దృష్టి తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నికలో విజయం కోసం మూడు ప్రధాన పార్టీలు చావో రేవో అన్నట్లుగా ప్రయత్నిస్తున్నాయి. ఒక్క ఓటు కూడా పోకూడదన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. అంది వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని జారవిడుచుకోవడానికి సిద్ధంగా లేవు రాజకీయ పార్టీలు. అందుకే మునుగోడు ఓటర్లు దేశంలో ఎక్కడెక్కడ ఉన్నారో గాలిస్తున్నారు. వెతికి పట్టుకుంటున్నారు. ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఆశలు రేకెత్తిస్తున్నారు. తాయిలాలు ఎరగా వేస్తున్నారు. నియోజకవర్గానికి చెందిన వేలాది మంది ఓటర్లు ఉపాధి కోసం హైదరాబాద్ నగర శివార్లలోని పలు ప్రాంతాలకు వలస వచ్చారు. వీరిలో ఎక్కువ మంది ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలోనే ఉంటూ ప్రయివేటు ఉద్యోగాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఉంటున్నవారి అడ్రస్, ఫోన్ నెంబర్లు మునుగోడులోని వారి బంధు, మిత్రుల నుంచి సేకరించి వారితో భేటీలు నిర్వహిస్తున్నాయి రాజకీయ పార్టీలు. 25వేల మంది@ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో మునుగోడు ఓటర్లు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. దాదాపు 25 వేల మంది వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వీరంతా మునుగోడు ఓటర్లే. దీనిపై పక్కా సమాచారం సేకరించిన కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ నేతలు వలస ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు మందు, విందు ఏర్పాటు చేసి తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారట. నాగార్జున సాగర్ రోడ్లో ఇబ్రహీం పట్టణం సహారా ఎస్టేట్స్ నుంచి ఎల్బీ నగర్ వరకు ఉన్న కాలనీల్లో మూడు పార్టీల నాయకులు ప్రచారం చేస్తున్నారని టాక్. ఎవరికి వారు తమ పార్టీకే ఓటేసేవిధంగా వారితో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఓటర్ల కోసం ముంబైలో గాలింపు పార్టీల ప్రచారం చూస్తున్న స్థానికులు ఎన్నిక జరుగుతోంది.. మునుగోడు లోనా ఎల్బీనగర్ లోనా అని చర్చించుకుంటున్నారట. ఇటువంటి పరిస్థితి ఒక ఎల్బీనగర్ కు మాత్రమే పరిమితం కాలేదు. ఉపాధి వెతుక్కుంటూ ముంబాయి వెళ్లినటువంటి వలస కూలీల వద్దకు కూడా ఒక పార్టీ కీలక నేత వెళ్లి నవంబర్ మూడున ఓటు వేసేందుకు రావలసిందిగా కోరారట. అందుకు అవసరమైన ఖర్చు కూడా తామే భరిస్తామని.. ఏదైనా కోరితే కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చి వచ్చారట. కొంత అడ్వాన్స్ కూడా చెల్లించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి: Munugode Bypoll: జరిగే మేలు ఎవరికి?.. చీలే ఓట్లెవరివి.. -
బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి నిరసన సెగ
సాక్షి, నల్గొండ జిల్లా: పోలింగ్ సమీపించే కొద్దీ మునుగోడులో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఎన్నికల ప్రచారం ఘర్షణలకు దారి తీస్తుంది. దాడులు, ప్రతి దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణతో చౌటుప్పల్ మండలం జైకేసారం మండలంలో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. చదవండి: మునుగోడు వేళ బీజేపీకి మరో షాక్.. టీఆర్ఎస్లోకి మాజీ ఎంపీ రాపోలు.. సీఎంతో భేటీ కాగా, నాంపల్లి మండలంలో ఆదివారం.. కాంగ్రెస్, బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుకున్న సంగతి తెలిసిందే. తన కాన్వాయికి దారి ఇవ్వకుండా అడ్డుపడిన బీజేపీ నాయకులను అరెస్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఆదివారం కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. బీజీపీకి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెండు గంటల పాటు ధర్నా నిర్వహించడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఎన్నికల ప్రచారం కోసం నాంపల్లికి వస్తున్న సమయంలో బీజేపీ దుండగులు తన కాన్వాయికి దారి ఇవ్వకుండా వాహనం నడిపారన్నారు. దారి ఎందుకు ఇవ్వడం లేదని అడిగినందుకు తన కారు డ్రైవర్‌ను, మహిళా కార్యకర్తలను బీజేపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడారని ఆరోపించారు -
ప్రచారంలో టెన్షన్ టెన్షన్
-
కాంగ్రెస్, బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ.. పాల్వాయి స్రవంతి ధర్నా
సాక్షి, నాంపల్లి (నల్లగొండ జిల్లా): తన కాన్వాయికి దారి ఇవ్వకుండా అడ్డుపడిన బీజేపీ నాయకులను అరెస్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఆదివారం కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. బీజీపీకి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెండు గంటల పాటు ధర్నా నిర్వహించడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. చదవండి: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి హైకమాండ్ షోకాజ్ నోటీస్ ధర్నాలో పాల్వాయి స్రవంతి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం కోసం నాంపల్లికి వస్తున్న సమయంలో బీజేపీ దుండగులు తన కాన్వాయికి దారి ఇవ్వకుండా వాహనం నడిపారన్నారు. దారి ఎందుకు ఇవ్వడం లేదని అడిగినందుకు తన కారు డ్రైవర్‌ను, మహిళా కార్యకర్తలను బీజేపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడారని ఆరోపించారు. ఎన్నికల్లో ఏ పారీ్టకైనా ప్రచారం చేసుకునే హక్కు ఉందని, కాంగ్రెస్ కార్యకర్తలను భయాందోళనకు గురి చేస్తే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. నమ్మిన కాంగ్రెస్ పార్టీని ముంచి, బీజేపీలో చేరి తప్పుడు ప్రచారాలు, కార్యకర్తలపై దాడులు చేయడం తగదని హితవు పలికారు. -
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి హైకమాండ్ షోకాజ్ నోటీస్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ కాల్ రికార్డ్ లీక్ వ్యవహారంపై కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్ అయ్యింది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వెంకట్‌రెడ్డి ఆడియో లీక్‌పై క్రమశిక్షణ కమిటీ వివరణ కోరింది. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. మాణిక్యం ఠాగూర్ ఫిర్యాదుతో వెంకట్‌రెడ్డికి ఏఐసీసీ డిసిప్లినరీ కమిటీ నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల క్రితం మునుగోడు ఓటర్‌తో బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరిన వెంకట్‌రెడ్డి ఆడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. చదవండి: మునుగోడులో పోస్టర్ వార్ కాగా, మునుగోడు ఉప ఎన్నిక వేళ.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆడియో లీక్ వ్యవహారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయాలని సూచించారు. కాంగ్రెస్ ఓడితే.. ఈ దెబ్బతో పీసీసీ చీఫ్ అవుతానంటూ వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మునుగోడులో నేతల సిత్రాలు..
-
దీపావళి తర్వాతే దంగల్.. మునుగోడులో మారుతున్న పాలిటిక్స్!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మద్యం, డబ్బు, విందు వినోదాలతో దీపావళి పండుగ తరువాత పూర్తి స్థాయిలో మునుగోడు ఓటర్లను ఆకర్షించేందుకు కసరత్తు జరుగుతోంది. దీపావళి పండుగ కోసం ఇతర ప్రాంతాల నుంచి మునుగోడు నియోజకవర్గంలోని స్వగ్రామాలకు వచ్చే ప్రతి ఓటరును వీలైతే పోలింగ్ వరకు అక్కడే స్వగ్రామాల్లోనే ఉండేలా ఒప్పించడం, కుదరకపోతే కచ్చితంగా పోలింగ్ రోజున వచ్చేలా అవసరమైన మొత్తాన్ని అందజేసి ఓటర్లను తమ అధీనంలోకి తెచ్చుకునే లక్ష్యంతో ప్రధాన పార్టీలు కదులుతున్నాయి. ఇప్పటికే కులాల వారీగా నియోజకవర్గం బయట, హైదరాబాద్‌లో ఉన్న కుటుంబాలకు దీపావళి క్రాకర్స్, ప్రత్యేక గిఫ్ట్ బాక్సులు వంటి తాయిలాలను అందిస్తున్నాయి. బూత్ స్థాయినుంచే.. పండుగ తర్వాత ప్రత్యేక వ్యూహంతో బూత్ స్థాయిలోనే ఓటర్లను ఆకర్షించే విధంగా వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. ప్రతి బూత్ పరిధిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు.. వారు ఎవరు చెబితే వింటారు. వారికి ఏం కావాలి.. వారికున్న అవసరాలేంటి? ఎలా తమ వైపునకు తిప్పుకోవాలన్న దానిపై ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో బూత్ స్థాయిలో మరింత పకడ్బందీ ప్రణాళికతో డబ్బు పంపిణీ చేసి తమ వైపు తిప్పుకునేలా స్కెచ్ వేస్తున్నాయి. ఇప్పటికే ఓ పార్టీకి చెందిన డబ్బు క్షేత్ర స్థాయికి చేరిపోయింది. మరో పార్టీ డబ్బును ఎలా చేరవేయడం అన్న విషయంలో ఆలోచనలు చేస్తోంది. ఇంకో పార్టీ బూత్‌ల వారీగా నియమితులైన ఇన్‌చార్జీలకే ఆ పనుల బాధ్యతలను అప్పగించింది. ఈ నెలాఖరులో భారీ ఎత్తున బహిరంగ సభలు, రోడ్‌షోల నిర్వహణకు అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఈ నెల 30న సీఎం కేసీఆర్ బహిరంగ సభను నిర్వహించేలా టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే కేటీఆర్, హరీష్‌రావుల రోడ్‌షోలను భారీగా నిర్వహించింది. బీజేపీ కూడా 29వ తేదీన లేదంటే 31వ తేదీన అమిత్‌షా లేదా జేపీ నడ్డాతో బహిరంగ సభ నిర్వహించేలా కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క వంటి నేతలతో బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది. మొత్తానికి అన్ని పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు మొదలుకొని కిందిస్థాయి నాయకులంతా మునుగోడులోనే మోహరించనున్నారు. -
బీజేపీకి మరో షాక్.. స్వామిగౌడ్ రాజీనామా.. టీఆర్ఎస్లో చేరిక
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటివరకు బీజేపీలోకి క్యూ కట్టిన నేతలు ఇప్పుడు టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. కొద్ది రోజుల క్రితం బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యా గౌడ్, దాసోజ్ శ్రవణ్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఇప్పుడు మరో కీలక నేత తిరిగి టీఆర్ఎస్లో గూటికి చేరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ కన్వీనర్‌గా కీలక పాత్ర పోషించిన స్వామిగౌడ్ బీజేపీకి రాజీనామా చేశారు. బండి సంజయ్‌కు ఈ మేరకు రాజీనామా లేఖను పంపారు. అనంతరం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత కాసేపటికే దాసోజు శ్రవణ్‌తో పాటు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బీజేపీ గౌరవించడం లేదని, అది తనకు బాధ కల్గించిందని స్వామిగౌడ్ ఆరోపించారు. ముఖ్యంగా బీసీల పట్ల ఆ పార్టీ తీరు ఆక్షేపణీయమని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా ఉన్న స్వామిగౌడ్.. 2013లో టీఆర్ఎస్లో చేరారు. 2014లో జరిగిన కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కూడా పని చేశారు. అయితే 2020లో టీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. కానీ ఆ పార్టీలో ఇమడలేక రెండేళ్లకే బయటకు వచ్చారు. చదవండి: తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. టీఆర్ఎస్లోకి తిరిగి వలసలు -
టీఆర్ఎస్లో చేరిన భిక్షమయ్య గౌడ్.. కండువా కప్పిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: బీజేపీకి రాజీనామా చేసిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్.. టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం జరిగింది. మంత్రి జగదీశ్వర్ రెడ్డితో పాటు ఇతర టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. టీఆర్ఎస్లో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడారు భిక్షమయ్య గౌడ్. నల్లగొండ రాజకీయాలను కోమటిరెడ్డి బ్రదర్స్ భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. మునుగోడు ఉపఎన్నిక ఎందుకు వచ్చిందో ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. కోమటిరెడ్డి సోదరులను రాజకీయంగా సమాధి చేయాలన్నారు. అయితే కొద్ది రోజుల క్రితమే బీజేపీలోకి వెళ్లిన భిక్షమయ్య గౌడ్.. ఆ పార్టీలో ఎక్కువ రోజులు ఇమడలేకపోయారు. కమలం పార్టీ తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి అన్యాయం చేస్తోందని ఆరోపిస్తూ రాజీనామా చేశారు. ఆ తర్వాత కొన్ని గంటలకే కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. చదవండి: బీజేపీపై భిక్షమయ్య ఘాటు విమర్శలు.. అందుకే రాజీనామా చేశారా? -
మునుగోడు ఉపఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీపై కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాజ్యంగ వ్యవస్థలను బీజేపీ ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందో తెలిపేందుకు ఇది మరో తార్కణమన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యస్ఫూర్తికి అద్దం పట్టే విధంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘంపై బీజేపీ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 2011లోనే సస్పెండ్ చేసిన రోడ్డు రోలర్ గుర్తును తిరిగి పెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేయడమే అని కేటీఆర్ ధ్వజమెత్తారు. గతంలో తమ అభ్యర్థన మేరకు రోడ్డు రోలర్ గుర్తును తొలగించి, మరోసారి తిరిగి ఈ ఎన్నికల్లో ఆ గుర్తును తేవడం ఎన్నికల స్ఫూర్తికి విరుద్ధమన్నారు. తమ పార్టీ కారు గుర్తును పోలిన గుర్తులతో అయోమయానికి గురిచేసి దొడ్డిదారిన ఓట్లు పొందేందేకు బీజేపీ కుటిల ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల సంఘం చర్య.. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలన్న రాజ్యంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోందని కేటీఆర్ అన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలను బీజేపీ తన స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. నిబంధనల మేరకు పని చేసిన రిటర్నింగ్ అఫీసర్‌ను బదిలీ చేస్తూ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: మునుగోడు ఉపఎన్నికలో మరో ట్విస్ట్.. రిటర్నింగ్ అధికారి బదిలీ.. -
యుగతులసి పార్టీకే రోడ్డు రోలర్ గుర్తు?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక బరిలో నిలిచిన యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్‌కే రోడ్డు రోలర్ గుర్తును కేటాయించనున్నట్లు తెలిసింది. ఈ నెల 17 రాత్రి జరిగిన నామినేషన్ల ఉపసంహరణ తరువాత రోడ్డు రోలర్ గుర్తు లాటరీ పద్ధతిలో యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్‌కు వచ్చినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని ఆయన మీడియాకూ వెల్లడించారు. అయితే 18న బయటకు వచ్చిన జాబితాలో మాత్రం ఆయనకు బేబీ వాకర్ గుర్తును కేటాయించినట్లుగా ఉంది. దీంతో శివకుమార్ రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. గుర్తుల కేటాయింపు రోజున తనకు రోడ్డురోలర్ కేటాయించిన అధికారులు.. మరుసటిరోజు జాబితాలో ఆ గుర్తు లేకుండా చేశారని, తన గుర్తును మార్చేశారని ఫిర్యాదు చేశారు. తమ కారు గుర్తును పోలి ఉన్న రోడ్డురోలర్, క్యాప్, చపాతి రోలర్ వంటి గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని టీఆర్ఎస్ పార్టీ 17వ తేదీ రాత్రి ఆందోళన చేసింది. దీంతో తెల్లారేసరికి గుర్తులు మారిపోయాయని, దీనిపై వివరణ కోసం తాను ఎన్నికల రిటర్నింగ్ అధికారిని సంప్రదించేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదని శివకుమార్ ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం భారత ఎన్నికల సంఘం వద్దకు కూడా వెళ్లడంతో, వారు పరిశీలన జరిపి రోడ్డు రోలర్ గుర్తును శివకుమార్‌కే కేటాయించేలా చర్యలు చేపట్టినట్లు సమాచారం. అయితే అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు గుర్తుల విషయంలో రిటర్నింగ్ అధికారిపైనా చర్యలకు ఎన్నికలకు సిద్ధం అవుతున్నట్లు, ఆయన్ని ఆ బాధ్యతల నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లు ఉన్నత స్థాయి వర్గాల సమాచారం. -
బీజేపీలో చేరిన టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరారు. తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ఆయనకు కుండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ బూర నర్సయ్యకు పార్టీ సభ్యత్వం ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, రాజ్యసభ ఎంపీ డా.లక్ష్మణ్, ఈటెల రాజేందర్, రాంచందర్ రావు పాల్గొన్నారు. అనంతరం కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో సీఎం కేసీఆర్ నియంతృత్వ పోకడలకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ విజయం ఖాయం అన్నారు. తెలంగాణలో ఈసారి బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్‌దే అధికారమని జోస్యం చెప్పారు. బీజేపీలో చేరిన అనంతరం బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 'సబ్ కా సాత్ - సబ్ కా వికాస్' నినాదం తనను ఆకర్షించిందని చెప్పారు. అందుకే కమలం గూటికి వచ్చినట్లు పేర్కొన్నారు. తెలంగాణ కేవలం ఒక్కరిది కాదని అందరిదీ అని వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి కోసం పని చేయడమే తన లక్ష్యం అన్నారు. చదవండి: కార్మిక సంఘం నాయకుడి నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడిగా.. ఖర్గే ప్రస్థానం.. -
మునుగోడులో ధనప్రభావం
-
చల్మెడ చెక్‌పోస్ట్ వద్ద పోలీసుల వాహన తనిఖీలు
-
మునుగోడు పోరు: కారులో ‘కోటి’ స్వాధీనం.. ఎవరిది ఆ డబ్బు?
సాక్షి,నల్గొండ: ఉప ఎన్నిక సమీపిస్తున్నకొద్దీ మునుగోడులో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఓటర్లను ప్రలోభా పెట్టడానికి పార్టీ నేతలు భారీ నగదు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మునుగోడు మండలం చల్మెడ చెక్‌పోస్టు వద్ద పోలీసులు సోమవారం వాహన తనిఖీలు చేపట్టారు. తనిఖీలో భాగంగా నంబర్ ప్లేట్లోని టాటా సఫారీ కారులో అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి వాహనంగా గుర్తించారు. కారులో దొరికిన నగదు బీజేపీ నేతకు చెందినదిగా పోలీసులు తెలిపారు. కరీంనగర్ 13 డివిజన్ కార్పొరేటర్ భర్త సొప్పరి వేణు..డబ్బును విజయవాడ నుంచి మునుగోడుకి తరలిస్తుండగా పట్టుబడినట్లు పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన డబ్బుపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. చదవండి: మళ్లీ మొదటికొచ్చిన పీసీసీ సమస్య.. స్లాట్ బుకింగ్‌కే 3 వారాలు -
Munugode Bypoll: నామినేషన్ టైమ్‌లో వెంటుండి.. అంతలోనే ఢిల్లీకి వెళ్లి బీజేపీలోకి?
బీజేపీలోకి బూర నర్సయ్యగౌడ్! నేడు లేదా రేపు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీకి అవకాశం మునుగోడు టికెట్ ఆశించి భంగపడ్డ బూర నర్సయ్యగౌడ్ పార్టీ ప్రచార కార్యక్రమాల సమాచారం ఇవ్వడం లేదని అసంతృప్తి జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో విభేదాలూ కారణమంటున్న పార్టీ వర్గాలు... సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: టీఆర్ఎస్ సీనియర్ నేత, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ బీజేపీలో చేరనున్నట్టు తెలిసింది. మునుగోడు ఉప ఎన్నికలో టికెట్ ఆశించినా పార్టీ పట్టించుకోకపోవడం, పైగా ప్రచా ర కార్యక్రమాలకు దూరంగా పెట్టడంతో నర్సయ్యగౌడ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ను వీడేందుకు సిద్ధమయ్యారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచే ఆయన టీఆర్ఎస్ ముఖ్యనాయకులకు ఎవరికీ అందుబాటులో లేకుండా వెళ్లారని.. ఆ యన బీజేపీలో చేరడం లాంఛనమేనని రాజ కీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. శనివారంగానీ, ఆదివారంగానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలతో బూర నర్సయ్యగౌడ్ భేటీ అయ్యే అవకాశం ఉందని ఢిల్లీ బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనే ఆయన చేరిక ఉంటుందని అంటున్నాయి. టికెట్ నిరాశ.. పట్టించుకోలేదనే అసంతృప్తి తెలంగాణ ఉద్యమ సమయంలో డాక్టర్స్ జేఏసీ కన్వీనర్‌గా బూర నర్సయ్యగౌడ్ కీలకపాత్ర పోషించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున భువనగిరి ఎంపీగా గెలిచారు. 2019లోనూ పోటీ చేసినా ఓడిపోయారు. తర్వాత మునుగోడు నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. వచ్చేసారి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని భావించారు. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసినప్పటి నుంచే బూర నర్సయ్యగౌడ్ టీఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. మునుగోడులో బీసీ సామాజికవర్గ ఓట్లు అధికంగా ఉండటం.. కాంగ్రెస్, బీజేపీల తరఫున రెడ్డి వర్గం అభ్యర్థులే బరిలో దిగడంతో టికెట్ తనకే దక్కుతుందని ఆశించారు. కానీ టీఆర్ఎస్ టికెట్ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ఇవ్వడంతో తీవ్రంగా అసంతృప్తికి గురయ్యారు. ఆ తర్వాత మునుగోడు ఉప ఎన్నిక ప్రచార కార్యక్రమ వివరాలను తనకు ఏమాత్రం చెప్పడం లేదంటూ జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డిపైనే బహిరంగంగానే విమర్శలు చేశారు. బూర నర్సయ్యగౌడ్ అసంతృప్తిని గమనించిన టీఆర్ఎస్ పెద్దలు బుజ్జగించేందుకు ప్రయత్నించారు. ఈ నెల 7న తన అనుచరులతో కలిసి మంత్రి కేటీఆర్, హరీశ్‌రావులతో భేటీ అయిన బూర నర్సయ్యగౌడ్.. కూసుకుంట్ల తీరుపై ఫిర్యాదులు చేశారు. సొంతపార్టీ నేతలను రాజకీయంగా, ఆర్థికంగా ఇబ్బందిపెట్టారని వివరించారు. రెండు రోజుల్లో ఆయా అంశాలపై సర్దుబాటు నిర్ణయాలు చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు కూడా. దీనితో బూర నర్సయ్యగౌడ్ మెత్తబడినట్టు కనిపించారు. ఈ నెల 13న కూసుకుంట్ల నామినేషన్ కార్యక్రమానికి కేటీఆర్‌తో కలిసి హాజరయ్యారు. నామినేషన్ తర్వాత నిర్వహించిన ర్యాలీలో కేటీఆర్ నిలబడ్డ వాహనంపైకి బూర నర్సయ్యగౌడ్‌ను పిలవకపోవడంతో మళ్లీ అసంతృప్తికి గురయ్యారని సమాచారం. మరోవైపు ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో ఏర్పడిన విభేదాలు, జిల్లా పార్టీలో అవమానాలు కూడా ఆయన పార్టీ వీడటానికి కారణంగా చెబుతున్నారు. ఢిల్లీ వెళ్లడంతో.. బూర నర్సయ్యగౌడ్ శుక్రవారం ఉదయం నుంచి టీఆర్ఎస్ నేతలెవరికీ అందుబాటులో లేకుండా పోయారు. ఇదే సమయంలో ఆయన ఢిల్లీకి వెళ్లడంతో బీజేపీలో చేరుతున్నారని వార్తలు వెలువడ్డాయి. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్‌ను, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారనే ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ జరగలేదని బీజేపీ వర్గాలు తెలిపాయి. శనివారంగానీ, ఆదివారంగానీ బూర నర్సయ్యగౌడ్ బీజేపీ పెద్దలను కలిసే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. చదవండి: ఎమ్మెల్యే రాజాసింగ్లో ప్రవహించేది కాషాయ రక్తమే.. -
మునుగోడు దంగల్.. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, నల్గొండ: కేసీఆర్ పెన్షన్లు పెంచితే.. మోదీ పెద్దోళ్లకు దోచిపెడుతున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా బంగారిగడ్డ నుంచి చండూరుకు టీఆర్ఎస్ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో కేటీఆర్ మాట్లాడుతూ, దేవుళ్లను కూడా రాజకీయాలకు వాడుకుంటారని దుయ్యబట్టారు. చదవండి: మునుగోడు వార్: అన్ని పార్టీలు ఆయనపైనే ఫోకస్ కాంట్రాక్టర్ అహంకారానికి మునుగోడు ప్రజల ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నిక. మునుగోడు ప్రజలపై బలవంతంగా రుద్దబడిన ఎన్నిక అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. తిరుమలకు ధీటుగా యాదాద్రిని కేసీఆర్ అభివృద్ధి చేశారు. పాకిస్తాన్, హిందూస్తాన్ తప్ప, పనికొచ్చే ముచ్చట్లు చెప్పరు. కేసీఆర్ కంటే మోదీ పెద్ద హిందువా?. కూసుకుంట్లను గెలిపిస్తే.. మునుగోడును దత్తత తీసుకుంటా.. ప్రతి మూడు నెలలకోసారి అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తానని కేటీఆర్ అన్నారు. -
మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్
సాక్షి, నల్గొండ: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా బంగారిగడ్డ నుంచి చండూరుకు టీఆర్ఎస్ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో మంత్రులు కేటీఆర్, జగదీష్‌రెడ్డి, వామపక్ష నేతలు పాల్గొన్నారు. చదవండి: మునుగోడు వార్: అన్ని పార్టీలు ఆయనపైనే ఫోకస్ రాజగోపాల్‌రెడ్డి రూ.18వేల కోట్లకు అమ్ముడుపోవడం వల్లే ఉప ఎన్నిక అని, అమ్ముడుపోయిన వారికి బుద్ధి చెప్పాలని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. అమ్ముడుపోయే వాళ్లను డెకాయిట్స్, 420 గాళ్లు అంటారు. కరోనా కంటే విషమైంది బీజేపీ, మతోన్మాద శక్తులను ఓడించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. దేశ శ్రేయస్సుకోసం మునుగోడులో టీఆర్ఎస్ను గెలిపించాలని ఆయన కోరారు. -
Munugode Bypoll: 10 వేలకు పైగా ఓటరు దరఖాస్తుల తిరస్కరణ
సాక్షి, నల్లగొండ: మునుగోడు నియోజకవర్గంలో కొత్త ఓటర్ల వివాదం నెలకొంది. మునుగోడులో ఉప ఎన్నికలు వస్తాయన్న ప్రచారం మొదలైననాటినుంచి దరఖాస్తులు మొదలయ్యాయి. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారూ ఇక్కడ ఓటు కోసం నమోదు చేసుకున్నారు. ఎన్నికల సంఘం కొత్త ఓటరు నమోదుకు ఎప్పటికప్పుడు అవకాశం ఇస్తోంది. దాన్ని అవకాశంగా చేసుకొని మునుగోడు నియోజకవర్గంలో ఓటర్లు పెద్ద ఎత్తున కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు. వాటన్నింటిని పరిశీలిస్తున్న అధికారులు అనర్హులకు ఓటు తిరస్కరిస్తున్నారు. ఇప్పటివరకు 10వేలకుపైగా ఓట్లు తొలగించినట్లు సమాచారం. రెండు మాసాల్లోనే 24,881 మంది.. మునుగోడు నియోజకవర్గంలో ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 4 వరకు 24,881 మంది కొత్తగా ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకున్నారు. 18 ఏళ్లు నిండినవారు కొత్తగా ఓటు కోసం నమోదు చేసుకున్నారు. వీరితోపాటు ఇతర ప్రాంతాలకు వెళ్లినవారూ నమోదు చేసుకోవడంతో దరఖాస్తులు భారీగా వచ్చాయి. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఓటుకోసం దరఖాస్తు చేసుకున్నవారి ఇళ్ల వద్దకు వెళ్లి సిబ్బంది పరిశీలిస్తున్నారు. ఇళ్లు లేకపోయినా, నివాసం ఉండకపోయినా, అలాంటి దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. అర్హులైనవారి దరఖాస్తులనే ఓకే చేస్తున్నారు. వేరే ప్రాంతంలో ఓటు ఉండి, తిరిగి ఇక్కడ ఓటు నమోదు చేసుకున్నవారి దరఖాస్తులను పరిశీలించి రిజెక్టు చేస్తున్నారు. దీంతో ఇప్పటివరకు 12వేల దరఖాస్తులు మాత్రమే ఓకే అయ్యాయి. ఈ నెల 14 వరకు దరఖాస్తులు పరిశీలించి తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. కాగా, మునుగోడులో అనర్హులు ఓటు నమోదు చేసుకున్నారని బీజేపీ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇంకా దీనిపై తీర్పు రావాల్సి ఉంది. -
Munugode Bypoll: తగ్గేదేలే..!.. ఇప్పటికే రూ.150 కోట్లు ఖర్చు
సాక్షి, యాదాద్రి: మునుగోడు ఉపఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆరు నూరైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నాయి. ఇదిలా ఉండగా.. రెండు పార్టీల అభ్యర్థులు మాత్రం ఎంత ఖర్చయినా పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రలోభాలు తారాస్థాయికి చేరాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి డబ్బుల పంపిణీ జోరందుకుంది. మద్యం విక్రయాలు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి. కుల, మహిళా, యువజన సంఘాలను మచ్చిక చేసుకునేందుకు అడిగినంత ముట్టచెబుతున్నాయి. మరోవైపు విందులు, వినోదాలు, రాజకీయ పార్టీలు పెద్దఎత్తున ఇస్తున్న తాయిలాలు ఓటర్లతోపాటు ఇతర ప్రాంతాల్లో ఆసక్తి రేకేత్తిస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల ఖర్చు రూ.150 కోట్లు దాటిందని ఓ సర్వే లెక్క కట్టింది. అయితే ధన ప్రవాహాన్ని అదుపు చేయాల్సిన ఎన్నికల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. బతుకమ్మ పండగకు భారీ ఖర్చు ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి సతీమణి బతుకమ్మ పండగ కోసం మహిళలను సమీకరించారు. చౌటుప్పల్, మునుగోడులో జరిగిన బతుకమ్మ పండగ కోసం వచ్చిన మహిళలు ఒక్కొక్కరికి రూ.500 చెల్లించారు. ఒక్కో చోట సుమారు 4 వేల మందితో బతుకమ్మ పండుగ నిర్వహించారు. మున్సిపాలిటీలు, మండలాల్లో టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో ప్రతి చోట సుమారు 8వేల మందికి విందు ఏర్పాటు చేశారు. ఇందుకోసం లక్షలు ఖర్చు చేశారు. చండూరులో నామినేషన్ వేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి రూ.500, బిర్యానీ ప్యాకెట్, క్వార్టర్ లిక్కర్ కోసం లక్షల్లో ఖర్చు చేశారు. ఇలా ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీలు చేరో రూ.75 కోట్లు ఖర్చు చేసినట్లు రాజకీయ పరిశీలకుల అంచనా. నామమాత్రంగా ఎన్నికల పరిశీలకులు ఎన్నికల కమిషన్ పరిశీలకులు నామమాత్రంగా వ్యవహరిస్తున్నారని, కోట్లలో డబ్బు ఖర్చు అవుతున్నా ఎక్కడా పట్టుకున్న జాడలు కన్పించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. మొక్కుబడిగా లెక్కలు రాస్తున్నారని విమర్శిస్తున్నారు. రూ. కోట్లలో మద్యం అమ్మకాలు ఎన్నికల వేళ మద్యం అమ్మకాలు తారాస్థాయికి చేరాయి. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా రూ. కోట్లల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోకి వచ్చే చౌటుప్పల్, నారాయణపురం, రామన్నపేట మండలాల్లోనే రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 10 వరకు రూ.44,54,01,197 కోట్ల లిక్కర్, బీర్ల అమ్మకాలు జరిగాయి. మీటింగులకే కోట్లలో ఖర్చు మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా ప్రధాన పార్టీల సభలకే కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. సెప్టెంబర్ 20న మునుగోడులో కేసీఆర్, 21 అమిత్‌షా సభల కోసం దాదాపు రూ.60 కోట్లకుపైగా ఖర్చయినట్లు సమాచారం. అలాగే చేరికల కోసం ఒక్కో సర్పంచ్‌కు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులకు రూ.10లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఇచ్చి చేరికలను ప్రోత్సహిస్తున్నారు. దసరా పండుగ రోజు నియోజవకర్గంలోని 298 బూత్‌లకు బీజేపీ ప్రతి బూత్‌కు రూ.20 నుంచి 20 వేలు ఖర్చు చేసినట్లు సమాచారం. టీఆర్ఎస్ ప్రతి బూత్‌కు రూ.10 వేలు ఇచ్చినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ ప్రతి ఎంపీటీసీ స్థానానికి ఒక ఎమ్మెల్యే స్థాయినుంచి మంత్రి వరకు ఇన్చార్జ్ లను నియమించింది. అయితే ఒక్కొక్కరి వెంట 25 మంది నుంచి 30 మంది వచ్చి ఆ పరిధిలో ప్రచారం చేస్తున్నారు. వీరికి భోజనాలు, రవాణ ఖర్చులు భారీగానే అవుతున్నాయి. కుల సంఘాల సమావేశాలకు అంచనాలకు మించి లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు, వనభోజనాలను మున్సిపాలిటీలు, మండలాల వారీగా లక్షలు ఖర్చు చేశారు. -
Munugode Bypoll: గూగుల్ పే ఓకేనా.. ఫోన్ పే చేయాలా?
సాక్షి, నల్లగొండ/చౌటుప్పల్‌రూరల్: ఓట్ల కొనుగోళ్లలోనూ డిజిటల్ లావాదేవీలు వచ్చేస్తున్నాయి. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీల నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎత్తులకు పైఎత్తులువేస్తూ ఓటర్లను తమ వైపునకు తిప్పుకునే యత్నం చేస్తున్నారు. ఓటర్లకు గతంలో మద్యం, డబ్బులు ఆశగా చూపి తమవైపు మళ్లించుకునే పార్టీలు ఈ ఉపఎన్నికలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. ఓ ప్రధాన పార్టీ బూత్ వారీగా నియమించిన ఇన్చార్జులు తమకు కేటాయించిన 100 మంది ఓటర్లను కలుస్తూ డిజిటల్ లావాదేవీలవైపు మళ్లిస్తున్నారు. నియోజకవర్గంలో ఓటర్లను కలుస్తున్న బూత్ ఇన్చార్జులు, సహ ఇన్చార్జులు.. రోజువారీ గా ఎంత మంది ఓటర్లను కలిశారు.. ఎవరెవరిని కలిశారన్న వివరాలను రాష్ట్ర పార్టీకి చేరవేస్తున్నారు. వారితో ఫొటోలు దిగి వాట్సాప్ ద్వారా పంపుతున్నారు. స్మార్ట్ ఫోన్ ఎవరెవరికి ఉంది.. గూగుల్ పే ఎవరికి ఉంది.. ఫోన్ పే ఎవరికి ఉందన్న వివరాలనూ పంపుతున్నారు. తమకు కేటాయించిన ఓటర్ల చుట్టూ తిరుగుతూ వారు అడగకముందే హామీలిచ్చి తమవైపు మళ్లించుకుంటున్నారు. చౌటుప్పల్ ప్రచారంలో ఈ సందడి నెలకొంది. ఫోన్‌పే, గూగుల్‌పే లేదంటే... ఫోన్‌పే, గోగుల్ పే లేనివారికి నగదు రూపంలోనే డబ్బులు అందించేలా ఆ పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. అవి రెండు ఉన్నవారికి మాత్రం ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసేలా వారి ఫోన్ నంబర్లను రాసి పెట్టుకుంటున్నారు. ఇతర ఊళ్లు, జిల్లాలు, రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లను ఓటింగ్‌కు రప్పించేలా వారితో ఫోన్లో మాట్లాడి ఒప్పిస్తున్నారు. అలాంటి వారికి ముందుగానే ఆన్లైన్లో డబ్బు జమ చేసి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. గోవా ట్రిప్ కోసం.. యువతను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. చౌటుప్పల్ మండలంలోని ఓ గ్రామంలో ఓ పార్టీ గోవా ట్రిప్‌కు ప్లాన్ చేస్తోందని సమాచారం. 10మంది యువకులు ఉండి, పార్టీ కండువాలు కప్పుకుంటే రూ.10 వేల చొప్పున ఖర్చులకు ఇచ్చి, విమానంలో వెళ్లి వచ్చేలా టికెట్లు ఇప్పించనున్నారని తెలిసింది. ఈ ఆఫర్‌కు 2గ్రూపులు ముందుకు వచ్చాయని సమాచారం. వచ్చే నాలుగైదు రోజుల్లో గోవాకు వెళ్లొచ్చేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. నగదు రూపంలో అడ్వాన్స్‌లు ఓటర్లకు ఓ పార్టీ నగదు రూపంలో అడ్వాన్స్‌లిస్తోంది. ఇటీవల పార్టీలో చేరిన లీడర్లు తమ ఊళ్లలో అధిక ఓట్లను సాధించి, అభ్యర్థి మెప్పుపొందేందుకు ఓ గ్రామంలో ఓటర్లకు అడ్వాన్స్‌లు ఇస్తున్నారు. దసరా పండుగ రోజు కొన్ని కుటుంబాలకు రూ.2వేల చొప్పున ఇచ్చిన నాయకులు.. ఎన్నికలప్పుడు అవతలి పార్టీ వారు ఇచ్చిన దానికంటే ఎక్కువే ఇస్తామని చెప్పినట్లు తెలిసింది. తటస్థంగా ఉంటేనే మేలని.. పార్టీ కండువా కప్పుకొని తిరిగితే ఒక పార్టీ వారే డబ్బులు ఇస్తారని అదే తటస్థంగా ఉంటే మూడు పార్టీలు ఇస్తాయనే ఆలోచనల్లో కొంతమంది చోటామోటా నాయకులున్నారు. చౌటుప్పల్ మండలంలోని జైకేసారం గ్రామంలో ఇప్పటిదాకా రాజకీయాల్లో తిరిగిన ఓ చోటా నాయకుడు ఇప్పుడు ఆ పార్టీ వైపు వెళ్లడం లేదు. రూ.5 లక్షలిస్తే పార్టీలో తిరుగుతా అని చెబుతున్నాడట. ఇది తెలిసిన ఓ పార్టీ రూ.2 లక్షలు ఇచ్చేందుకు ముందుకొచ్చిందని సమాచారం. -
Munugode Bypoll: ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా ఆ ఇద్దరు..
సాక్షి, నల్గొండ: మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీలు, ఎంపీలుగా పని చేశారు. పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి మునుగోడు నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2007 నుంచి 2009 వరకు ఎమ్మెల్సీగా పని చేశారు. తర్వాత ఆయన 2017 వరకు కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2018లో మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్‌రెడ్డి తొలుత 2009లో భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా పోటీ చేసి బూర నర్సయ్యగౌడ్ చేతిలో ఓడిపోయారు. తర్వాత 2016 నుంచి 2018 వరకు నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పని చేశారు. ఎమ్మెల్సీ పదవీకాలం ఉండగానే ఆ పదవికి రాజీనామా చేసి 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా మునుగోడులో పోటీ చేసి గెలుపొందారు. చదవండి: రాజాసింగ్ పీడీయాక్ట్ కేసు.. తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం -
Munugode Bypoll: కాస్ట్లీ ఓటు కుటుంబానికి రూ.40 వేలు!
పారదర్శక టెండర్ల ద్వారానే కాంట్రాక్టు దక్కింది. రాజకీయంగా ఎదుర్కోలేకే అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నేను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా. లేకపోతే టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు రాజీనామా చేయాలి. తడిబట్టలతో యాదాద్రి ఆలయం గర్భగుడికి రండి ప్రమాణం చేద్దాం. – బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు ఛాలెంజ్ చేస్తున్న. ఆ రూ.18 వేల కోట్లు మునుగోడు, నల్లగొండ అభివృద్ధికి ఇవ్వండి. ఉప ఎన్నికల బరి నుంచి తప్పుకుంటాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రాధేయపడైనా ఒప్పిస్తా. ఒక వ్యక్తి కోసం రూ.18 వేల కోట్లు ఇవ్వడం ఏంటి. ఆయన సొంతానికి ఇచ్చే సొమ్ము జిల్లా అభివృద్ధికి ఇవ్వండి. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఎనిమిది సంవత్సరాల్లో కనీసం రోడ్డు వేయలేని వారు ఓటు అడగడానికి వస్తున్నారు. బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి డిండి ప్రాజెక్టుకు రూ.5 వేల కోట్లు నిధులు ఇప్పించాకే మునుగోడులో ఓటు అడగాలి. టీఆర్ఎస్ సర్కారు భీమనపల్లికి కనీసం రోడ్డు కూడా వేయలేదు. – టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంది. రెండు రోజుల నుంచి నియోజకవర్గం మొత్తం ప్రధాన పార్టీల అభ్యర్థులు, ముఖ్య నాయకుల ప్రచారాలతో మారుమోగిపోతోంది. ఎక్కడ చూసినా ప్రచార కార్యక్రమాలే. పోటాపోటీగా సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షోలతో హోరెత్తుతోంది. వాటిల్లో పాల్గొన్న పార్టీల ముఖ్య నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ నేతలు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నారు. సోమవారం నియోజకవర్గంలో మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వíßహించారు. ఓవైపు మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, మరోవైపు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సవాల్.. ప్రతి సవాల్ చేసుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇటు బీజేపీ, అటు టీఆర్ఎస్ను టార్గెట్ చేశారు. పోటాపోటీగా విమర్శలు ప్రచారంలో పాల్గొంటున్న నేతలు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటూ ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రచార పర్వంలో రాజగోపాల్‌రెడ్డి టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ కుటుంబ పాలనను టార్గెట్ చేస్తే.. రాగోపాల్రెడ్డిని టార్గెట్ చేసి మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శల బాణం ఎక్కు పెట్టారు. పరస్పర విమర్శలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సోమవారం నామినేషన్ వేశాక రాజగోపాల్‌రెడ్డి సీఎం కేసీఆర్ కుటుంబ పాలన, చూపుతున్న వివక్షను ఎత్తిచూపుతూ తనపై చేస్తున్న అసత్య ఆరోపణలను నిరూపించాలంటూ తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి కొరటికల్ గ్రామంలో నిర్వహించిన రోడ్ షోలో రాజగోపాల్‌రెడ్డికి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చారని, ఆ ని«ధులేవో మునుగోడు, జిల్లా అభివృద్ధికి ఇస్తే పోటీ నుంచే తప్పుకుంటామని, అందుకు సిద్ధమేనా? అని ఛాలెంజ్ చేశారు. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ పార్టీలను, నేతలను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. శివన్నగూడెం నిర్వాసితులకు న్యాయం జరగాలని, వారి తరఫున ఉండి కొట్లాడతామని, తమకు ఒక్కసారి అవకాశం ఇచ్చి స్రవంతిని గెలిపించాలని శివన్నగూడెంలో జరిగిన రోడ్‌షోలో ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గానికి తరలివస్తున్న నోట్ల కట్టలు మునుగోడులో భారీగా డబ్బు కుమ్మరించేందుకు రంగం సిద్ధమైంది. ఇన్నాళ్లుగా నియోజకవర్గంలో, మండలాలు, గ్రామాల్లో ప్రభావం చూపగలిగే నాయకులు, ఓటర్లకు ఎర వేసి చేరికలను జోరుగా చేరికలను ప్రోత్సహిస్తున్న పార్టీలు ఇప్పుడు ఓటర్లను తమవైపు తిప్పుకునే పనిలో పడ్డాయి. పొద్దంతా ప్రచారం కొనసాగిసూ్తనే పగలు వీలు చిక్కినప్పుడు, రాత్రంతా మంతనాలు సాగిస్తున్నాయి. వారికి మట్టుజెప్పేందుకు అవసరమైన డబ్బును నియోజకవర్గానికి తరలిస్తున్నట్లు తెలిసింది. నలుగురు సభ్యులు ఉన్న ఒక్కో కుటుంబానికి రూ. 40 వేలు ఇస్తామని ఇంటి యజమానులను, బంగారం ఇస్తామంటూ మహిళలను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. -
రాజగోపాల్‌రెడ్డి ఆస్తుల విలువ.. రూ.274 కోట్లు
సాక్షి, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన ఆస్తులు, అప్పులతో పాటు పోలీస్ కేసుల వివరాలతో కూడిన ఎన్నికల అఫిడవిట్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. సోమవారం ఆయన చండూరులో నామినేషన్ వేశారు. అఫిడవిట్లో పేర్కొన్న ప్రకారంగా ప్రస్తుతం రాజగోపాల్‌రెడ్డి పేరుపైన ఉన్న ఆస్తుల విలువ రూ.152 కోట్ల 69లక్షల 94వేలు కాగా, ఆయన భార్య లక్ష్మి పేరున రూ.48,55,25,250 కోట్ల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయి. నల్లగొండ జిల్లా బ్రాహ్మణ వెల్లంల, సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో వ్యవసాయ భూములు, రంగారెడ్డి జిల్లా కోకాపేట, ఇతర ప్రాంతాల్లో వ్యవసాయేతర భూములు, హైదరాబాద్‌లో ప్లాట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. రాజగోపాల్‌రెడ్డి పేరుపై ఉన్న చరాస్తుల విలువ రూ.69,97,70,142, ఆయన భార్య పేరుపైన రూ.3,89,63,167 విలువైన చరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడున్న స్థిర, చరాస్తుల విలువ సుమారు రూ.274 కోట్లు. బ్యాంకులో అప్పు రూ.61,84,80,220 ఉన్నట్లు చూపారు. కాగా, 2014లో మునుగోడు నుంచే పోటీ చేసినప్పుడు రాజగోపాల్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న స్తిరాస్తుల విలువ రూ.47కోట్లు కాగా, చరాస్తుల విలువ రూ.265 కోట్లు ఉంది. అదేవిధంగా 2018 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయనతో పాటు కుటుంబ సభ్యుల పేరుపై ఉన్న స్థిర, చరాస్తుల విలువ సుమారు రూ.198 కోట్లుగా ఆఫిడవిట్లో పేర్కొన్నారు. స్రవంతి ఆస్తుల విలువ రూ.40 కోట్లు మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరఫున డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్బంగా రిటర్నింగ్ అధికారికి ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేశారు. అఫిడవిట్లో పేర్కొన్న ప్రకారం స్రవంతి పేరుపైన రూ.25,71,52,390 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా.. ఆమె భర్త పేరుపై రూ.15,13,25,804 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు లెక్కలు చూపించారు. బ్యాంకులో స్రవంతి పేరున రూ.6 లక్షలు, భర్త పేరున రూ.55 లక్షల అప్పులు చూపించారు. -
ప్రధాని మోదీ, అమిత్‌షాకు మంత్రి జగదీష్‌రెడ్డి సవాల్
-
కారు గుర్తును పోలి 8 గుర్తులు.. ఈసీని కలిసిన టీఆర్ఎస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను టీఆర్ఎస్ నేతలు కలిశారు. కారు గుర్తును పోలి ఉన్న 8 గుర్తులను మార్చాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్‌పై క్షుద్ర పూజల ఆరోపణలు చేస్తున్న బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఎన్నికల అధికారిని కలిసినవారిలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ భాను ప్రసాద్, పార్టీ జనరల్ సెక్రటరీ సోమ భరత్ ఉన్నారు. చదవండి: చిక్కుల్లో మంత్రి మల్లారెడ్డి.. బయటపడిన వీడియో.. ఆయన స్పందన ఇదే.. కాగా, కేసీఆర్ చాలా రోజుల నుంచి తాంత్రిక పూజలు చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. తనకు ఉన్న సమాచారం మేరకు తాంత్రికుడు చెప్పడం వల్లే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని, ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) అన్న పేరుకు కాలం ముగిసిందని, ఆ పేరుతో వెళ్తే తలకిందులేసి తపస్సు చేసినా పార్టీ గెలవదని తాంత్రికుడు చెప్పాడని, అందుకే తాంత్రికుల సూచనతో బీఆర్ఎస్గా పేరు మార్చారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్కు జెండా లేదు.. ఎజెండా లేదు. దేశాన్ని ఉద్ధరించడానికి బీఆర్ఎస్ పెట్టలేదని.. కేవలం దెయ్యాలు, రాక్షస పూజలు చేస్తున్నాడు కాబట్టే వారి మాటలు విని పార్టీ పేరు మార్చాడని బండి సంజయ్ ఘాటు విమర్శలు చేశారు. -
రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి కాంట్రాక్టరే: బండి సంజయ్
సాక్షి, నల్గొండ: మునుగోడు ప్రజలు కేసీఆర్‌కు తగిన బుద్ది చెబుతారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో బండి సంజయ్ మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నిక తీర్పు కోసం రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తోందని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తును ఈ ఉప ఎన్నిక నిర్ణయిస్తుందన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి కాంట్రాక్టరేనని, ఎంతోమందికి ఆర్థిక సాయం చేశారని ప్రస్తావించారు. ముందుగా రాజగోపాల్‌రెడ్డి కుటుంబం గురించి తెలుసుకోవాలని బండి సంజయ్ హితవు పలికారు. రాజగోపాల్‌రెడ్డి మీద ఫిర్యాదు చేయడానికి టీఆర్ఎస్కు సిగ్గుండాలని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ను ఫాంహౌజ్ నుంచి మారుమూల లెంకలపల్లికి తీసుకొచ్చిన ఘనత రాజగోపాల్ రెడ్డిదేనని అన్నారు. కేసీఆర్‌కు సొంత విమానం కొనేంత డబ్బు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశాకే గట్టుప్పల్ మండలం వచ్చిందన్న బండి సంజయ్.. ఆయన రాజీనామా తర్వాతే మునుగోడు అభివృద్ధి జరుగుతోందన్నారు. టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు ‘కేసీఆర్ కుటుంబం లిక్కర్ స్కాం లో ఇరుక్కుంది నిజం కాదా? దమ్ముంటే కేసీఆర్ చర్చకు సిద్ధమా. ఓటుకు నలభై వేలు ఖర్చు చేసి కొనుగోలు కార్యక్రమానికి టీఆర్ఎస్ తెరలేపింది. టీఆర్ఎస్ పంచుతున్న డబ్బులు మనవే. అవి తీసుకుని బీజేపీకి ఓటు వేయండి. చండూరు రావాలంటే రెండు గంటలు పట్టింది. అందరి చేతుల్లో జెండా కనిపిస్తుంది. టీఆర్ఎస్ కార్యకర్తల చేతుల్లో మాత్రం మందు గ్లాసులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తున్నారు. సింహం ఒక్కడే పోటీ చేస్తున్నాడు. గుంపులుగా ఎన్ని కలిసి వచ్చిన గెలిచేది బీజేపీనే. హుజూర్నగర్, నాగార్జున సాగర్ లలో ఇచ్చిన హామీలు ఒక్కటన్నా అమలు చేశారా. దుబ్బాక, హుజూరాబాద్ ఫలితాలే ఇక్కడా రిపీట్ అవుతాయి.’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు -
మోదీ, అమిత్‌షాకు మంత్రి జగదీష్‌రెడ్డి చాలెంజ్
సాక్షి, నల్గొండ: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల వేడి పెరుగుతోంది. పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య పరస్పరం మాటల తూటాలు పేలుతున్నాయి. మునుగోడు మండలం కొరటికల్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి జగదీష్‌రెడ్డి.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాకు చాలెంజ్ విసిరారు. ‘‘రూ.18 వేల కోట్లు మునుగోడు, నల్లగొండ అభివృద్ధికి ఇవ్వండి.. ఉప ఎన్నికల నుంచి తప్పుకుంటాం’’ అని మంత్రి అన్నారు. ఒక వ్యక్తి కోసం రూ.18 వేల కోట్లు ఇవ్వడమేంటి?. పార్టీ మారినందుకే రాజగోపాల్‌రెడ్డికి రూ.18వేల కోట్లు ఇచ్చారని జగదీష్‌రెడ్డి దుయ్యబట్టారు. చదవండి: చిక్కుల్లో మంత్రి మల్లారెడ్డి.. బయటపడిన వీడియో.. ఆయన స్పందన ఇదే.. మరో వైపు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి.. సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మునుగోడు ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారంటూ మండిపడ్డారు. తనపై కావాలనే అపనిందలు వేస్తున్నారు. తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. లేకపోతే ఆరోపణలు చేసేవారు రాజీనామా చేయాలి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కనీసం అపాయిమెంట్ ఇవ్వకుండా అవమానించారంటూ రాజగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. -
మరోసారి చిక్కుల్లో పడ్డ మంత్రి మల్లారెడ్డి
-
చిక్కుల్లో మంత్రి మల్లారెడ్డి.. బయటపడిన వీడియో.. ఆయన స్పందన ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మరోసారి చిక్కుల్లో పడ్డారు. బహిరంగంగా మద్యం తాగుతూ కెమెరాలకు చిక్కారు. మునుగోడు నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లిన మల్లారెడ్డి ప్రచారం తర్వాత తన అనుచరులతో కలిసి మందు తాగుతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఫుల్ బాటిల్ పట్టుకుని గ్లాస్లో మందు పోస్తున్న మల్లారెడ్డి విజివల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చౌటప్పల్ మండలంలో ఆరెగూడెం గ్రామానికి ఎన్నికల ఇంఛార్జ్‌గా మల్లారెడ్డి ఉన్నారు. ఆదివారం గ్రామానికి వెళ్లిన ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి రోజంతా ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం తన అనుచరులతో కలిసి పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: అందుకు మీరు సిద్ధమా?.. రాజగోపాల్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్ దీనిపై మంత్రి మల్లారెడ్డి స్పందిస్తూ.. కావాలనే మందు బాటిల్ చేతిలో ఉన్న ఫోటో వైరల్ చేస్తున్నారన్నారు. మా కుటుంబ సభ్యులకు ఇస్తున్న బాటిల్ మాత్రమే. నేను తాగలేదంటూ వివరణ ఇచ్చారు. మునుగోడు ఎన్నికల్లో తాను కొన్ని గ్రామాలకు ఇంఛార్జ్‌గా ఉన్నానన్నారు. ప్రచారం తర్వాత అక్కడే ఉన్న మా బంధువులు ఇంటికి వెళ్లాను. నా కన్నా పెద్దవాళ్లు ఉన్నారు. మందు సర్వ్ చేశాను. తెలంగాణ సంప్రదాయం ఇది.. తప్పేముంది. నా చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మా బంధువులు. అది రహస్యంగా చేసిన పని కాదు.. ఊర్లో బంధువుల ఇల్లు అది. అది నా పర్సనల్ పని.. భోజనం చేయడాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని మంత్రి అన్నారు. -
ఎంపీటీసీ ఇన్చార్జ్ బాధ్యతలు తీసుకున్న సీఎం కేసీఆర్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్రంలో ఇప్పుడు ఏ నోట విన్నా మునుగోడు ఉప ఎన్నిక మాటే వినపడుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్‌గా మారిన ఈ ఎన్నికలు జరుగుతున్న తీరును రాజకీయ పరిశీలకులు, నిపుణులతో పాటు అన్ని రాజకీయ పక్షాల నేతలు, సామాన్యులు నిశితంగా గమనిస్తున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి క్రమంగా వేడెక్కుతూ వస్తున్న మునుగోడు రాజకీయం నామినేషన్ల దాఖలు సమయానికి మరింత హీటెక్కింది. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఖరారు కావడం, అన్ని పార్టీలు పోటీలు పడి సభలు, సమావేశాలు నిర్వహించడం, ఆయా పార్టీల ముఖ్య నేతలు మునుగోడు నియోజకవర్గంలోనే మకాం వేయడంతో నియోజకవర్గ వ్యాప్తంగా రాజకీయ సందడి నెలకొంది. సాక్షాత్తూ సీఎం కేసీఆర్ మునుగోడు నియోజకవర్గంలోని ఓ గ్రామానికి ఇన్చార్జ్ బాధ్యతలు తీసుకున్నారంటేనే ఈ ఎన్నికను రాజకీయ పక్షాలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో అర్థమవుతోంది. కదన రంగంలోకి పార్టీలు.. మునుగోడు ఉప ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. దీంతో అన్ని ప్రధాన పార్టీలు కదనరంగంలోకి దూకాయి. టీఆర్ఎస్ నుంచి మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతిరాథోడ్, పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్‌కుమార్, జయపాల్‌యాదవ్, మర్రి జనార్దన్‌రెడ్డి, మాణిక్యరావు, చిరుమర్తి లింగయ్య, రవిశంకర్‌లతో పాటు పలు నియోజకవర్గాల ఇన్‌చార్‌్జలు గ్రామాల్లో తిరుగుతున్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇన్చార్జ్ గా ఉన్న గట్టుప్పలలో సిరిసిల్ల టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ నాగయ్యతోపాటు గంప గోవర్ధన్ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి ఇప్పటికే ప్రచారంలో చురుకుగా పాల్గొంటుండగా ఆ పార్టీ నేతలు వివేక్, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్ ఎప్పటికప్పుడు వచ్చి కేడర్‌ను ఎన్నికల కోసం సిద్ధం చేస్తున్నారు. ఆదివారం కేంద్ర మంత్రి భూపేందర్‌యాదవ్, ఎంపీ లక్ష్మణ్ కూడా వచ్చారు. త్వరలోనే బీజేపీ అగ్రనేతలు అమిత్‌షా, నడ్డాలు కూడా రానున్నారు. ఇక, కాంగ్రెస్ నుంచి పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఇప్పటికే గ్రామాలను చుట్టివస్తున్నారు. మండలానికి ముగ్గురు ఇన్చార్జ్ ల చొప్పున టీపీసీసీ నేతలు, స్థానిక నాయకులు గ్రామాల్లో టీఆర్ఎస్, బీజేపీలకు దీటుగా ప్రచారం చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఉత్తమ్ ఆదివారం సాయంత్రం చౌటుప్పల్ సభలో పాల్గొన్నారు. ఐదు రోజులపాటు నియోజకవర్గంలోనే రేవంత్‌రెడ్డి మకాం వేయనున్నారు. మరోమారు సభలు.. మూడు ప్రధాన రాజకీయపక్షాలు మరోమారు బహిరంగ సభలకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ నెల 29 లేదా 30 తేదీల్లో సీఎం కేసీఆర్ బహిరంగసభ ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అమిత్‌షా, నడ్డాలతో ఒకటి లేదంటే రెండు సభలు ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా, భారత్‌జోడో యాత్రలో భాగంగా తెలంగాణకు వస్తున్న రాహుల్‌గాంధీ పాల్గొనేలా నియోజకవర్గానికి సమీపంలో ఉన్న శంషాబాద్‌లో సభ ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. పార్టీలు బీసీ సామాజిక వర్గాలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ సామాజిక వర్గాల వారీగా నేతలను రంగంలోకి దింపాయి. బీజేపీ తరఫున కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ నియోజకవర్గంలోని యాదవ సామాజికవర్గంతో సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం పర్యవేక్షణ.. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపు కోసం సీఎం కేసీఆర్ స్వయంగా ఓ ఎంపీటీసీ స్థానం ఇన్చార్జ్ బాధ్యతలను తీసుకోవడం విశేషం. ఆ గ్రామానికి సంబంధించిన పరిస్థితి ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ ఫోన్లో పర్యవేక్షిస్తున్నారని గులాబీ శ్రేణులంటున్నాయి. మొత్తంమీద మూడు పార్టీల ముఖ్యనేతలు, పార్టీ శ్రేణులతో మునుగోడు నియోజకవర్గ పొలిటికల్ థియేటర్లో అన్ని షోలు హౌజ్‌ఫుల్ కావడం గమనార్హం. సెమీఫైనల్లో సత్తా చాటేందుకు రాబోయే అసెంబ్లీ ఎన్నిలకు మునుగోడు ఉప ఎన్నిక సెమీ ఫైనల్ లాంటిదనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. అనూహ్యమైన సంఘటనలు జరిగితే తప్ప 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఈ ఎన్నికల్లో గెలుపోటములు, ఆయా పార్టీలకు లభించే ఓట్లను బట్టి రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్ ఉంటుందని ప్రధాన రాజకీయ పక్షాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా తెలంగాణలో తామే టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయమని చాటుకునేందుకు బీజేపీ, మునుగోడులో గెలవడం ద్వారా రాష్ట్రంలో టీఆర్ఎస్ను మాత్రమే ప్రజలు ఆదరిస్తారని చెప్పుకునేందుకు గులాబీ పార్టీ, సిట్టింగ్ స్థానంలో గెలుపు ద్వారా తమపై ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ టీఆర్ఎస్ను ఓడించే శక్తి తమకు మాత్రమే ఉందని నిరూపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ మూడు పార్టీల్లో గెలిచిన పార్టీకి 2023 ఎన్నికలకు వెళ్లడం సులువవుతుందని, ఓడిన పార్టీలు మాత్రం ఓటమి భారంతోనే ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుందనేది రాజకీయ వర్గాల అభిప్రాయంగా కనిపిస్తోంది. -
వారం, తిథి బాగుందా!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నికలో నామినేషన్ల దాఖలుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ముహూర్తం చూసుకుంటున్నారు. నామినేషన్ల చివరి తేదీ ఈ నెల 14కావడంతో ఈలోపే నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. మంచి రోజుతోపాటు తిథులను చూసుకుంటున్నారు. తమ పేరు, జాతకం ప్రకారం ఏ రోజు నామినేషన్ వేస్తే బాగుంటుందని పండితులతో సమాలోచనలు చేస్తున్నారు. ఈ నెల 10, 12, 13, 14 తేదీల్లో వారాలతోపాటు తిథులు కూడా బాగున్నాయని, అయితే అభ్యర్థి జాతకాన్ని బట్టి కలిసివచ్చే రోజును ఎంచుకుంటుంటారని ఓ పండితుడు పేర్కొన్నారు. ఈ నెల 10 సోమవారంతోపాటు పాడ్యమి ఉంది. 12వ తేదీ బుధవారం కావడంతోపాటు తదియ అవుతోంది. 13వ తేదీ గురువారం అయినా చవితి అవుతోంది. 14వ తేదీ శుక్రవారం మంచిరోజు కావడంతోపాటు ఆరోజు పంచమి ఉంది. కాబట్టి వారం, తిథి రెండూ బాగున్నాయి. 11వ తేదీ విదియ అయినా మంగళవారం కావడంతో ఆరోజు నామినేషన్ వేసేందుకు ఇష్టపడే పరిస్థితి కనిపించడం లేదు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి 10వ తేదీన నామినేషన్ వేసేందుకు సిద్ధం కాగా, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి 13వ తేదీ లేదా 14న, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి 14వ తేదీన నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
రూ. 22 వేల కోట్లకు రాజగోపాల్‌రెడ్డి అమ్ముడుపోయారు: మంత్రి జగదీష్
సాక్షి, హైదరాబాద్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. మంత్రిగా జగదీష్ రెడ్డి వేల కోట్లు సంపాదించారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించగా.. తన కుటుంబ స్వార్థం కోసం రాజగోపాల్‌రెడ్డి రూ.22వేల కోట్ల కాంట్రాక్ట్‌కు అమ్ముడుపోయారని జగదీష్ రెడ్డి కౌంటర్ అటాక్ చేశారు. కాంట్రాక్టులు తీసుకున్నట్లు రాజగోపాల్‌రెడ్డి ఒప్పుకున్నారని ప్రస్తావించారు. అమ్ముడుపోయిన వ్యక్తికి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా అని ప్రశ్నించారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్వార్థం వల్లే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని మంత్రి ధ్వజమెత్తారు. మూడేళ్ళుగా బీజేపీతో టచ్‌లో ఉన్నానని చెప్పి బీజేపీలో చేరాడని విమర్శించారు. దొరికిన దొంగ రాజగోపాల్ రెడ్డి అని, అతని వ్యవహారంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రాజగోపాల్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. త్యాగాలు చేసినం అని చెప్పటం అంటే సిగ్గుమాలిన చర్య ఇంకొకటి ఉండదని దుయ్యబట్టారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల ఆయా కారణాల వల్ల వచ్చాయని, కానీ ఇక్కడ ఏ కారణం వల్ల వచ్చిందని నిలదీశారు. అభివృద్ధి కోసం రాజీనామా చేశాను అంటున్న రాజగోపాల్ రెడ్డి.. బీజేపీలో చేరితే ఏ అభివృద్ధి జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. ‘పెద్ద పార్టీ వదిలి చిన్న పార్టీలోకి ఎందుకు వెళ్ళాడు అని మునుగోడు ప్రజలు అడుగుతున్నారు. తెలంగాణ ఎదుగుతుంటే ఓర్వలేక, బాగుపడుతున్న తెలంగాణాను చూసి తట్టుకోలేక బీజేపీ ఓ వ్యక్తిని కొనుక్కొని తెచ్చుకున్న ఉపఎన్నిక. రాజగోపాల్ చేసింది నీచమైన, నికృష్టమైన పని. మూడేళ్ళుగా కాంగ్రెస్ లో ఉండి, మోసం చేసి బీజేపీ లో చేరాడు. రాజగోపాల్‌ను ప్రజలు క్షమించరు. బీజేపీకి ఓటేస్తే బావుల దగ్గర మీటర్లు వస్తాయి. బీజేపీకి ఓటేస్తే కరెంట్ సంస్కరణలు, గ్యాస్ ధర ఇంకో వంద పెరుగుతుంది’ అని మంత్రి జగదీష్‌రెడ్డి నిప్పులు చెరిగారు. చదవండి: అభిమాని లేఖకు మంత్రి హరీశ్ రావు ఫిదా.. ఫోన్ చేసి ధన్యవాదాలు -
ఉప ఎన్నికల వ్యూహకర్త.. రెండుసార్లు పార్టీని గెలిపించిన మంత్రి
సాక్షి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు ఉప ఎన్నికల్లో విజయవంతంగా పార్టీని గెలిపించిన విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డికే మునుగోడు ఉప ఎన్నికల బాధ్యతను అధిష్టానం అప్పగించింది. రాష్ట్రంలో జరిగిన మిగతా ఉప ఎన్నికల్లో మంత్రి హరీష్‌రావును ఇన్‌చార్జీగా నియమించిన గులాబీ బాస్ మునుగోడు ఎన్నికల బాధ్యతలను మాత్రం జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డిపైనే పెట్టారు. 2018 తరువాత ఉమ్మడి జిల్లాలో మూడో ఉప ఎన్నిక అయిన మునుగోడులో పార్టీ అభ్యర్థిని గెలిపించి తీసుకురావాలని గులాబీ బాస్ ఆదేశించడంతో మంత్రి జగదీశ్‌రెడ్డి తన వ్యూహాలను అమలు చేస్తున్నారు. మూడో ఉప ఎన్నిక నాగార్జునసాగర్ నుంచి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన నోముల నర్సింహయ్య అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. 2021లో జరిగిన ఆ ఉప ఎన్నికలో అక్కడి నేతలందరిని మంత్రి జగదీశ్‌రెడ్డి సమన్వయం చేసి నర్సింహయ్య తనయుడు భగత్‌ను గెలిపించారు. హుజూర్‌నగర్‌కు 2019లో ఉప ఎన్నిక జరిగింది. అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు. దీంతో ఆయన హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయగా అదే సంవత్సరం జరిగింది. అందులో ఆయన సతీమణి పద్మావతిపై టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి పోటీ చేశారు. అక్కడ 2018 ఎన్నికల్లో కోల్పోయిన స్థానాన్ని 2019లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరిగి దక్కించుకునేలా మంత్రి పనిచేశారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక వచ్చింది. సాధారణ ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డినే ఇప్పుడు అక్కడ పోటీలో దింపింది. ఈ ఎన్నికల బాధ్యతను కూడా అధిష్టానం జగదీశ్‌రెడ్డిపైనే పెట్టింది. టీఆర్ఎస్ గెలిస్తే హ్యాట్రిక్ సాధించినట్లే నియోజకవర్గంలో మొదట్లో తలెత్తిన అన్ని విభేదాలను అధిష్టానం సహకారంతో పరిష్కరించి, జిల్లాలోని అన్ని వర్గాల నేతలను ఏకతాటిపై తెచ్చి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పని చేసేలా ప్రణాళికతో మంత్రి ముందుకు సాగుతున్నారు. అందరూ ఆయన నేతృత్వంలో సమన్వయంతో పనిచేసేలా అధిష్టానం చర్యలు చేపట్టింది. సీపీఎం, సీపీఐలను సమన్వయం చేస్తూ జగదీశ్‌రెడ్డి మంత్రాంగం నడుపుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యూహకర్తగా హ్యాట్రిక్ సాధించినట్లే. చదవండి: మునుగోడులో విజయం నాదే : మారం వెంకట్‌రెడ్డి మండలాలకు చేరుకున్న ఇన్చార్జీలు టీఆర్ఎస్ అధిష్టానం మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి ఎంపీటీసీ స్థానానికి నియమించిన ఇన్చార్జీలు చాలా మంది తమ స్థానాలకు చేరుకుని ప్రచారంలోకి దిగారు. ఆయా మండలాల్లో పార్టీ శ్రేణులతో సమావేశాలు పెట్టారు. చౌటుప్పల్‌లో మంత్రి మల్లారెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, నకిరేకల్ ఎమెల్యే చిరుమర్తి లింగయ్య తదితరులు పార్టీ కార్యకర్తల సమావేశాల్లో నిమగ్నమయ్యారు. సాక్షి, నల్లగొండ: మోదీ, అమిత్ షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపును ఆపలేరని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వచ్చి ఇక్కడ అడ్డా వేసినా బీజేపీకి దక్కేది మూడో స్థానమేనని స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో మునుగోడు నియోజకవర్గానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మర్రిగూడ మండలం సరంపేట గ్రామానికి చెందిన బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు యశ్వంత్ కుమార్, మర్రిగూడ మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి రావుల మధుతో పాటు ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జ్ రావుల రమేష్, బీజేపీ సీనియర్ నేత జగన్, నరేష్, బుర్రాసైదులు, బచ్చనగోని సైదులు, రావుల సతీష్ టీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ పార్టీకీ చెందిన ఎన్ఎస్యూఐ జిల్లా నాయకుడు చాపల పెద్ద సైదులు, చాపల చిన్న సైదులు, యాదయ్య, రావుల రాజు, తాటికొండ సతీష్, చాపల సైదులు తదితరులు టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రితో పాటు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ ఇన్చార్జ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మునిగి పోయే పడవగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పెరుగుతున్న విశ్వసనీయతకు టీఆర్ఎస్లోకి వలసలే నిదర్శనమన్నారు. రాష్ట్ర అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యం అవుతుందన్న నమ్మకం ప్రజల్లో బలపడిందన్నారు. దాంతో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు టీఆర్ఎస్లో చేరుతున్నారని పేర్కొన్నారు. -
మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడులైంది. నామినేషన్లు తక్షణమే ప్రారంభమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం పేర్కొంది. ఈ నెల 14 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చని, 15న నామినేషన్ల పరిశీలిస్తామని తెలిపింది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 17 వరకు గడువు ఉంటుందని వెల్లడించింది. ఇక నవంబర్ 3న మునుగోడు ఉపఎన్నిక పోలింగ్, 6న కౌంటింగ్ నిర్వహించనున్నారు. చండూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. శని, ఆదివారం నామినేషన్ల దాఖలుకు సెలవు ఉంటుంది. ఈనెల 14వ తేదీ వరకు జరగనున్న నామినేషన్ల స్వీకరణకు 30 మంది పోలీసులు సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు. చండూరు పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉంటుంది. నామినేషన్ వేసే అభ్యర్థుల వెంట అయిదుగురికి మాత్రమే రిటర్నింగ్ కార్యాలయంలోకి అనుమతి ఉంటుంది. టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు మరోవైపు మునుగోడు ఉపఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేయనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల పేరును సీఎం కేసీఆర్ ప్రకటించారు. 2014లో మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల గెలుపొందగా. 2018 ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు.. ప్రస్తుంగా మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జిగా ప్రభాకర్‌రెడ్డి కొనసాగుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ నుంచి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి పోటీ చేస్తున్నారు. అక్టోబర్ 10న బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. 14న కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేయనున్నారు. 13 లేదా 14వ తేదీన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి దాఖలు చేసే అవకాశం ఉంది. -
మునుగోడుతో చేతికి అగ్నిపరీక్ష.. ఓ పక్క ఆశ, మరో పక్క కలవరం
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కాంగ్రెస్‌ను అన్నీ కష్టాలే వెంటాడుతున్నాయి. తాజాగా మునుగోడు గండం గట్టెక్కేదెలా అని పీసీసీ నాయకులు టెన్షన్ పడుతున్నారు. ఎలాగైనా గెలవాలని తెగ తంటాలు పడుతున్నారు. ఓటర్లే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి..హస్తం పార్టీ ఉట్టి కొడుతుందా? బోర్లా పడుతుందా? అనుకోకుండా వచ్చి పడ్డ మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్‌ను టెన్షన్ పెడుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏనాడూ ఉప ఎన్నికల్లో నెగ్గిన చరిత్ర కాంగ్రెస్‌కు లేదు. పైగా సిటింగ్ సీట్లు కూడా పోగొట్టుకుంటోంది. పీసీసీ చీఫ్ రేవంత్ వ్యవహారం కారణంగా కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇప్పుడు బీజేపీ తరపున అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. సిటింగ్ సీటు గనుక తప్పక గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. బయటకు ఎంత ధీమాగా చెప్పినా లోలోన ఆందోళన కనిపిస్తోంది. మునుగోడును మళ్లీ గెలుచుకోవాలన్న పట్టుదల, ఓడిపోతామేమో అన్న భయంతో ఈసారి ముందుగానే మేల్కొన్నారు టీ.కాంగ్రెస్ నేతలు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే... ఇతర పార్టీలు అభ్యర్థిని ప్రకటించకముందే కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించారు. అదే విధంగా ఎన్నికల కోసం మండలాలు, గ్రామాల వారిగా ఇంఛార్జ్ లను నియమించుకుంది. పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ నేతలంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ ఇంఛార్జ్ లుగా వ్యవహరిస్తున్న నేతలు ప్రచారం పర్యవేక్షిస్తున్నారు. టిక్కెట్ ఆశించి భంగపడ్డ నేతలు కూడా అభ్యర్థి పాల్వాయి స్రవంతి ప్రచారంలో పాల్గొంటూ ఐక్యతను చాటుతున్నారు. ఇంత కష్టపడుతున్నా.. గెలుపు ధీమా కాంగ్రెస్ పార్టీలో కనిపించడం లేదు. రేవంత్ రెడ్డి వరుస పర్యటనల తర్వాత క్షేత్ర స్థాయి పరిస్థితులపై పీసీసీకి అవగాహన కలిగింది. దీంతో వ్యూహాన్ని మార్చాలని కాంగ్రెస్ డిసైడయింది. పోలింగ్ బూత్ టార్గెట్ గా కాకుండా ఓటర్ టార్గెట్ గా ప్రచారం చేస్తే తప్ప పోటీలో ఉండలేమన్న నిర్ణయానికి వచ్చింది. అందుకే ప్రతి 30 ఓటర్లకు ఓక ఇంఛార్జ్ ను నియమించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందించేందుకు ఇంఛార్జ్ మానిక్కం ఠాగూర్ రాష్ట్రానికి రావాల్సి ఉన్నా.. ఢిల్లీలో పార్టీ కార్యక్రమాల రీత్యా వాయిదా పడింది. ఈనెల 30న మునుగోడులో బూత్, క్లస్టర్ మీటింగ్ నిర్వహించనున్నారు కాంగ్రెస్ నేతలు. అక్కడే ఓటర్ కేంద్రం గా ఇంఛార్జ్ లను నియమిస్తారు. ఇంఛార్జ్ లకు కేటాయించిన 30మంది ఓటర్లతో నిత్యం సంబంధాలు నెరుపుతూ..వారంతా కాంగ్రెస్ కు ఓటేసేలా చూసుకోవాల్సిన బాధ్యత ఇంచార్జ్‌లదే. ఓటర్ల అవసరాలు తీర్చే ఆర్థిక బలమున్న నేతలనే ఇంఛార్జ్ లుగా నియమించేలా గాంధీభవన్‌లో బ్లూ ప్రింట్ సిద్దమవుతుంది. గడచిన 8 సంవత్సరాల చరిత్ర చూసుకుంటే ఏ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ విజయం సాధించలేదు. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నందునే.. మునుగోడును ఇంత సీరియస్‌గా తీసుకుంటున్నారు హస్తం పార్టీ నాయకులు. మునుగోడులో విజయం సాధిస్తే.. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అనుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నారు. అందుకే అన్ని రకాల అస్త్రాలు ఉపయోగిస్తున్నారు. మహిళా సెంటిమెంట్, పాల్వాయి గోవర్థనరెడ్డిపై ఉన్న సానుభూతిని ఉపయోగించుకోవడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు గుర్తు చేస్తూ ఓట్లు అడగాలని ప్లాన్ చేశారు. అందుకే 30 మందికి ఒక ఇన్‌చార్జ్‌ను నియమించి కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లు చేజారకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న హస్తం పార్టీకి ఏమాత్రం సానుకూల ఫలితం వస్తుందో చూడాలి. -
నమ్మకానికి, అమ్మకానికి మధ్య యుద్ధం
సాక్షి, హైదరాబాద్: ‘మునుగోడు ఉపఎన్నిక నమ్మకానికి, అమ్మకానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో నిజాయితీపక్షాన ఉండాలని ఓటర్లను కోరదాం’అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, టీ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పార్టీ నేతలకు సూచించారు. మహిళా సెంటిమెంట్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళదామని చెప్పారు. రాష్ట్రంలో 2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన నాలుగు ఉపఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్లను రెండేసి స్థానాల్లో ప్రజలు గెలిపించినా వారి జీవితాల్లో మార్పు రాలేదని.. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే బలమైన ప్రతిపక్షంగా పనిచేస్తామని హామీ ఇద్దామని పిలుపునిచ్చారు. మునుగోడు ఉపఎన్నికలో గెలుపే ధ్యేయంగా ముందుకెళ్లాలని, పార్టీ నేతలంతా పరస్పర సహకారంతో అభ్యర్థి పాల్వాయి స్రవంతి విజయం కోసం కృషి చేయాలన్నారు. ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో మంగళవారం గాంధీ భవన్లో కీలక సమావేశం జరిగింది. దాదాపు 3 గంటలకుపైగా సాగిన ఈ భేటీలో మాణిక్యం ఠాగూర్, రేవంత్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటివరకు మునుగోడులో పార్టీ పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణ, ఇన్చార్జీల పనితీరుపై చర్చించారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో సామాజిక కోణంలో ముందుకెళ్లాలని నిర్ణయించారు. గతంలో కాంగ్రెస్ ఏం చేసిందో, భవిష్యత్తులో సామాజిక వర్గాలకు ఏం చేస్తుందో చెప్పి ఓట్లు అభ్యర్థించాలని సూచించారు. అందరూ సహకరిస్తామన్నారు.. ►కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధే నన్ను విజయపథంలో నడిపిస్తుంది. పార్టీ నేతలంతా సహకరిస్తామన్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా త్వరలోనే ప్రచారానికి వస్తానన్నారు. – భేటీ అనంతరం మీడియాతో పాల్వాయి స్రవంతి భేటీలో తీసుకున్న నిర్ణయాలివి... ►ఈ నెల 9 నుంచి నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన 14 వరకు రేవంత్ సహా ముఖ్య నేతలంతా మునుగోడులోనే మకాం వేసి ప్రచారం నిర్వహించాలి. ►శంషాబాద్‌లో రాహుల్ గాంధీతో జరిగే సభకు మునుగోడు ప్రజలను సమీకరించాలి. ►వీధి మలుపు సమావేశాలు, మోటార్‌సైకిల్ ర్యాలీలతో ప్రచారాన్ని ముమ్మరం చేయాలి. ►అభ్యర్థి స్రవంతికి స్వేచ్ఛగా ప్రచారం చేసుకొనే అవకాశం కల్పించాలి. వీలున్నప్పుడు ఆమెతో కలిసి ప్రచారంలో పాల్గొనే ఇన్చార్జి నాయకులందరూ ఎవరికి వారే ప్రచారంలో నిమగ్నం కావాలి. ►ఇన్‌చార్జీలుగా పనిచేస్తున్న వారు రాహుల్‌గాంధీ పాదయాత్రకు రావాల్సిన అవసరం లేదు. ఏదో ఒకరోజు వచ్చి వెళ్లవచ్చు. ►ఉప ఎన్నిక ఇన్‌చార్జీలుగా నియమితులైన వారిలో ఎవరు, ఎలా పనిచేస్తున్నారు? ఎన్నిసార్లు నియోజకవర్గానికి వెళ్లి ప్రచారం నిర్వహించారనే అంశంపై ఎప్పటికప్పుడు నివేదికలు అందుతున్నాయి. మునుగోడు ఉపఎన్నికలో పనిచేయని నేతలు ఎంతటివారైనా ఇంటికి వెళ్లాల్సిందే. ►ఈనెల 11న 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేసి చివరి రోజైన 14న భారీ జనసమీకరణతో చివరి సెట్ నామినేషన్ దాఖలు చేయాలి. -
నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక
నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక -
Munugode Bypoll: మునుగోడు వార్.. బీజేపీకి మద్దతుగా వారు రంగంలోకి..
సాక్షి, నల్లగొండ: మునుగోడులో ఇక అన్ని ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించనున్నాయి. గురువారం నుంచి ఇంటింటి వెళ్లి ఓటర్లను కలిసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తుండగా కాంగ్రెస్ పార్టీ కూడా స్పీడ్ పెంచింది. అన్ని పార్టీలకు చెందిన వివిధ జిల్లాలకు చెందిన నాయకులు నియోజకవర్గంలో మోహరించనున్నారు. రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటి నుంచే టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గంలో పర్యటనలకు శ్రీకారం చుట్టింది. నియోజకవర్గంలోని ప్రతి మండంలో మంత్రి జగదీష్‌రెడ్డి పర్యటిస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత వలసలపైనా ఫోకస్ పెట్టారు. ఆత్మీయ సమ్మ్ళేనాలు, ఆత్మీయ వనభోజనాల వంటి కార్యక్రమాలను కూడా టీఆర్ఎస్ నిర్వహించింది. వివిధ పథకాల లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించింది. 6వ తేదీ నుంచి ప్రచారం మరింత పదునెక్కనుంది. ఒక్కో యూనిట్లో 20 మంది నేతలు సీఎం కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి తక్కళ్లపల్లి రవీందర్రావు, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో భేటీ అయ్యారు. ప్రచార కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ప్రతి ఎంపీటీసీ స్థానాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని 86 యూనిట్లలో ఇంటింటికి వెళ్లేలా ప్లాన్ చేశారు. మంత్రులు హరీష్‌రావు మర్రిగూడలో, కేటీఆర్ గట్టుప్పల్‌లో రంగంలోకి దిగనున్నారు. సీఎం కేసీఆర్ లెంకలపల్లి యూనిట్‌కు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి సమన్వయం చేయనున్నారు. మొత్తానికి ఒక్కో యూనిట్లో 20 మంది నేతలతో ప్రచార బృందాలు పని చేయనున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేరును బుధవారం ప్రకటించే అవకాశం ఉంది. ఇంటింటి ప్రచారంలో.. తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. పెద్ద ఎత్తున చేరికలకు శ్రీకారం చుట్టారు. ప్రచార వ్యూహంపై ఇటీవలే నియోజవర్గ ఎన్నికల సమన్వయ కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ గత నెలలోనే మండల ఇన్చార్జీలను నియమించింది. 27వ తేదీన సమావేశమై కార్యాచరణ రూపొందించింది. పాత, కొత్త నేతలను సమన్వయం చేసుకొని ముందుకు సాగేందుకు మండల సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు. బూత్కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. 6వ తేదీలోగా ఆ ప్రక్రియను పూర్తి చేయడంతోపాటు ఇంటింటి ప్రచారం చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటికే ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి, గంగిడి మనోహర్‌రెడ్డి వంటి నేతలు నియోజకవర్గంలో ఉండి పనిచేస్తున్నారు. బీజేపీకి మద్దతుగా ఆర్ఎస్ఎస్ కూడా ప్రచార రంగంలోకి దిగింది. దసరా తర్వాత ఆర్ఎస్ఎస్కు చెందిన దాదాపు 800 మంది స్వయం సేవకులు నియోజకవర్గంలోనే ఉండి పని చేసే విధంగా ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలిసింది. హస్తం.. ప్రచారంలో వేగం రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన వెంటనే అన్ని పార్టీల కంటే ముందే కాంగ్రెస్ పార్టీ భారీఎత్తున బహిరంగ సభ నిర్వహించింది. ఇటీవల పాల్వాయి స్రవంతిని అభ్యర్ధిగా ప్రకటించడంతో ఆమె తన ప్రచారంలో వేగం పెంచారు. ప్రతి గ్రామానికి ఓటర్లను కలుస్తున్నారు. పండుగ తరువాత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు ముఖ్య నేతలంతా ప్రచారంలోకి దిగనున్నారు. ఇప్పటికే ఆ పార్టీ మండల ఇన్చార్జీలను నియమించింది. పండుగ తర్వాత వారంతా ప్రచారంలోకి దిగనున్నారు. రేవంత్‌రెడ్డితోపాటు భట్టివిక్రమార్క, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి తదితర నేతలంతా మునుగోడులోనే మకాం వేయనున్నారు. -
మునుగోడులో కాంగ్రెస్‌కు బూస్ట్.. ఆయన ఎంట్రీతో సీన్ మారుతుందా?
సాక్షి, మునుగోడు: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల హీట్ కొనసాగుతోంది. గెలుపుపై అన్ని రాజకీయ పార్టీల నేతలు వ్యూహాలు రచించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మునుగోడులో విజయమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కాగా, మునుగోడు ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ మంగళవారం సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా సమీక్ష కోసం ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాకూర్‌తో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మునుగోడు అభ్యర్ధి పాల్వాయి స్రవంతిరెడ్డితో పాటు ఇతర కీలక నేతలు హాజరయ్యారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మాట్లాడుతూ.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు ప్రచారానికి వస్తారని స్రవంతి రెడ్డి తెలిపారు. కోమటిరెడ్డి ప్రచారానికి వస్తారని తనకు మాటిచ్చారని చెప్పుకొచ్చారు. దీంతో, కాంగ్రెస్ పార్టీకి కొంత మేలు జరిగే అవకాశముంది. మునుగోడులో కాంగ్రెస్ చేసిన అభివృద్ధే మమ్మల్ని గెలిపిస్తుంది. రెండు రోజుల్లో మరోసారి సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. కాగా, ఉప ఎన్నికల్లో భాగంగా ఈ నెల 14న తాను నామినేషన్ వేస్తున్నట్లు స్రవంతి ప్రకటించారు. మరోవైపు.. ఉప ఎన్నికల్లో గెలుపు కోసం రేవంత్ రెడ్డి.. మునుగోడు సభలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. -
రెండు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు.. మూడోసారి విజయం ఎటువైపో..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి జిల్లాలో 2018 సాధారణ ఎన్నికల తర్వాత మూడో ఉప ఎన్నిక జరుగుతుంది. ఇప్పటికి హుజూర్నగర్, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగగా ఆ రెండు చోట్ల టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. 2019లో నల్లగొండ పార్లమెంట్ స్థానానికి పోటీచేశారు. ఎంపీగా గెలుపొందిన ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్ సతీమణి పద్మావతి పోటీచేయగా.. టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి బరిలో నిలిచి విజయం సాధించారు. చదవండి: మునుగోడుపై టీఆర్ఎస్ ఫుల్ ఫోకస్! రంగంలోకి కేటీఆర్, హరీశ్ కూడా? అక్కడ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ కోల్పోయింది. నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి 2018లో గెలుపొందిన నోముల నర్సింహయ్య అనారోగ్యంతో మృతిచెందగా.. 2021లో ఉప ఎన్నిక జరిగింది. నర్సింహయ్య తనయుడు భగత్ టీఆర్ఎస్ నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఇక్కడ గులాబీ పార్టీ తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంది. మునుగోడులో 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో నాలుగేళ్లలో జరిగే మూడో ఉప ఎన్నిక ఇది. రాజగోపాల్‌రెడ్డి ప్రస్తుతం బీజేపీ నుంచి బరిలో ఉంటున్నారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇందులో ఏ పార్టీ విజయం సాధిస్తుందో నవంబర్ 6న తేలనుంది. -
Munugode Bypoll: 1952 నుంచి మునుగోడు.. పన్నెండవది
సాక్షి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1952 నుంచి అసెంబ్లీ స్థానాలకు ఇప్పటి వరకు 11 ఉప ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు మునుగోడులో 12వ ఉప ఎన్నిక జరుగబోతోంది. ఇందులో భువనగిరి, హుజూర్నగర్ స్థానాలకు రెండు సార్లు ఉపఎన్నికలు జరగడం గమనార్హం. 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత హుజూర్నగర్, నాగార్జునసాగర్ ఉప ఎన్నిలు జరుగగా, మునుగోడుతో మూడో ఉప ఎన్నిక అవుతుంది. ఇవీ ఉప ఎన్నికల వివరాలు.. ►1952 సాధారణ ఎన్నికల్లో కమ్యూనిస్టు నాయకుడు, పీడీఎఫ్ అభ్యర్థి రావి నారాయణరెడ్డి భువనగిరి అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల నుంచి ఏకకాలంలో గెలుపొందారు. దీంతో ఆయన అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయగా.. అదే సంవత్సరం ఉప ఎన్నిక జరిగింది. ►భువనగిరి శాసనసభ స్థానానికి మళ్లీ 2000 సంవత్సరంలో ఉప ఎన్నిక జరిగింది. 1999 సాధారణ ఎన్నికల తర్వాత ఎలిమినేటి మాధవరెడ్డి నక్సల్స్ చేతిలో హత్యకు గురయ్యారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికలో మాధవరెడ్డి భార్య ఉమామాధవరెడ్డి పోటీచేసి గెలుపొందారు. ►హుజూర్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి 1952లో పీడీఎఫ్ అభ్యర్థి జయసూర్య గెలుపొందారు. అదే సమయంలో ఆయన మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి కూడా విజయం సాధించారు. దీంతో జయసూర్య హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయగా.. అదే సంవత్సరం ఉప ఎన్నిక జరిగింది. చదవండి: (Munugode Bypoll: నల్లగొండ, యాదాద్రిలో ఎన్నికల కోడ్) ►హుజూర్‌నగర్‌కు మళ్లీ 2019లో ఉప ఎన్నిక జరిగింది. 2018 సాధారణ ఎన్నికల్లో అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసి ఎంపీగా విజయం సాధించారు. దీంతో ఆయన హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయగా అదే సంవత్సరం జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించింది. ►మిర్యాలగూడ నియోజకవర్గం ఏర్పడకముందు పెదమునగాల కేంద్రంగా నియోజకవర్గం ఉండేది. ఆ స్థానానికి 1952లో ఉప ఎన్నిక జరిగింది. ►మునుగోడు నియోజకవర్గం ఏర్పడకముందున్న చిన్నకొండూరు అసెంబ్లీ స్థానానికి 1965లో ఒకసారి ఉప ఎన్నిక జరిగింది. ►2004 ఎన్నికల వరకు కొనసాగిన రామన్నపేట నియోజకవర్గానికి 1974లో ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడ 1972లో జరిగిన సాధారణ ఎన్నికల్లో గెలుపొందిన వడ్డేపల్లి కాశీరాం మృతిచెందడంతో బైఎలక్షన్ వచ్చింది. ►నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1985 సాధారణ ఎన్నికల్లో ఎన్టీ రామారావు గెలుపొందారు. ఆయన నల్లగొండతో పాటుమరో మూడు స్థానాల్లో పోటీచేసి విజయం సాధించారు. దీంతో నల్లగొండ సీటుకు రాజీనామా చేయగా అదే సంవత్సరం జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి గడ్డం రుద్రమదేవి గెలుపొందారు. ►దేవరకొండ నుంచి 1999లో గెలుపొందిన కాంగ్రెస్ నేత ధీరావత్ రాగ్యానాయక్ 2001 డిసెంబర్లో నక్సల్స్ కాల్పుల్లో మరణించారు. ఈ స్థానానికి 2002లో ఉప ఎన్నిక నిర్వహించగా రాగ్యానాయక్ భార్య భారతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ►ఆలేరు నియోజకవర్గానికి 2004 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నగేష్ గెలుపొందారు. అయితే, మళ్లీ సాధారణ ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు.. కేసీఆర్ పిలుపులో భాగంగా రాష్ట్రంలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేశారు. అందులో నగేష్ కూడా ఉన్నారు. తెలంగాణ నినాదం బలంగా ఉందని చాటడం కోసం టీఆర్ఎస్ పార్టీ ఈ వ్యూహం అమలు చేసింది. 2008లో జరిగిన ఉప ఎన్నికలో మళ్లీ నగేష్ విజయం సాధించారు. ►నాగార్జునసాగర్ నుంచి 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన నోముల నర్సింహయ్య అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. 2021లో జరిగిన ఉప ఎన్నికలో నర్సింహయ్య తనయుడు భగత్ గెలుపొందారు. ►రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఇప్పుడు మునుగోడులో ఉప ఎన్నికలు వచ్చాయి. -
తప్పని ఎన్నిక.. మునుగోడులో తొలి ఉపపోరు.. మొదటిసారి గెలిచిందెవరు?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి తొలిసారిగా ఉపఎన్నిక జరుగనుంది. తాజామాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గం 1967లో ఏర్పడింది. 2018 వరకు ఈ నియోజకవర్గానికి 12 సార్లు సాధారణ ఎన్నికలు జరగగా, ఆరుసార్లు కాంగ్రెస్, ఐదుసార్లు సీపీఐ, ఒకసారి (2014లో) టీఆర్ఎస్ గెలిచాయి. 1967కు ముందు మునుగోడు నియోజకవర్గంలోని కొంతభాగం చిన్నకొండూరు, మిగిలిన ప్రాంతం నల్లగొండ నియోజకవర్గంలో ఉండేవి. మునుగోడు ప్రాంతం చిన్నకొండూరు నియోజకవర్గంలో ఉన్నప్పుడు 1965లో ఒకసారి ఉపఎన్నిక జరిగింది. చిన్నకొండూరు నుంచి 1962 సాధారణ ఎన్నికల్లో సీసీఐ అభ్యర్థి కొండవీటి గురునాథరెడ్డి విజయం సాధించగా, ఆ ఎన్నిక సక్రమంగా జరగలేదంటూ ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీనేత, మాజీమంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ కోర్టులో కేసు వేశారు. ఆ ఎన్నికను రద్దు చేస్తూ కోర్టు మూడేళ్ల తర్వాత తీర్పు చెప్పింది. దీంతో 1965లో చిన్నకొండూరు నియోజకవర్గానికి ఉపఎన్నిక జరిగింది. ఆ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి కొండా లక్ష్మణ్ బాపూజీ గెలుపొందారు. ఆరుసార్లు గెలిచిన కాంగ్రెస్ మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థులే ఆరుసార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 1967, 1972, 1978, 1983, 1999లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున గెలుపొందారు. ఇక సీపీఐ అభ్యర్థులు ఐదుసార్లు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. 1985, 1989లో, 1994లో ఉజ్జిని నారాయణరావు, 2004లో పల్లా వెంకట్‌రెడ్డి, 2009లో ఉజ్జిని యాదగిరిరావు సీపీఐ అభ్యర్థులుగా గెలుపొందారు. 2014లో టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రభాకర్‌రెడ్డిపై 2018 ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించారు. -
Munugode Bypoll: నల్లగొండ, యాదాద్రిలో ఎన్నికల కోడ్
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియామవళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి వచ్చింది. నల్లగొండ, యాదాద్రి భువనగిరి రెండు జిల్లాల్లోనూ ఇది అమల్లో ఉండనుందని నల్లగొండ కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగకుండా చూడాలని ఎస్పీ రెమా రాజేశ్వరికి లేఖ రాశారు. మోడల్ కోడ్ అమల్లోకి వచ్చినందున ప్రభుత్వ ఆస్తులు, కార్యాలయాలపై ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఎలాంటి రాతలు ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయకూడదని పేర్కొన్నారు. నవంబర్ 8న ఎన్నికల ప్రక్రియ ముగింపు వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందని పేర్కొన్నారు. చండూరులో నామినేషన్ల స్వీకరణ ఉప ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈనెల 7వ తేదీన ప్రారంభం కానుంది. చండూరులోని తహసీల్దార్ కార్యాలయంలో 14వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 15వ తేదీన ఉప సంహరణలు ఉంటాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ (ఏఎంఆర్పీ) జగన్నాథరావు పేరునే ప్రతిపాదించారు. దీంతో ఆయన రిటర్నింగ్ అధికారిగా కొనసాగనున్నారు. మరోవైపు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల కోసం చండూరు డాన్‌బాస్కో స్కూల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యాక ఈవీఎంలను ఆర్జాలబావిలోని గోడౌన్‌కు తరలించనున్నారు. కౌంటింగ్ కూడా ఆర్జాలబావిలోనే నిర్వహిస్తారు. అదనపు కలెక్టర్ సమీక్ష జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు కోసం అదనపు కలెక్టర్ ఎ.భాస్కర్‌రావు సోమవారం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నల్లగొండ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, ఈఆర్ఓ జగన్నాథరావు, ఎన్నికల విభాగం అధికారులతో కోడ్ అమలుపై ఆయన సమీక్షించారు. ప్రత్యేక బృందాలు చేపట్టాల్సిన కార్యాచరణపై ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలకు సంబంధించిన వీడియోగ్రఫీపై సూచనలు చేశారు. -
మునుగోడుపై టీఆర్ఎస్ ఫుల్ ఫోకస్! రంగంలోకి కేటీఆర్, హరీశ్ కూడా?
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడటంతో పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. జాతీయ పార్టీగా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో సర్వశక్తులూ ఒడ్డి అయినా మునుగోడులో విజయం సాధించాలని భావిస్తోంది. ఇందుకోసం పార్టీ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించి, ప్రచారాన్ని వేడెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాన రాజకీయ పక్షాలు బీజేపీ, కాంగ్రెస్ ఇప్పటికే మునుగోడు అభ్య ర్థులను ప్రకటించినా టీఆర్ఎస్ అధికా రికంగా వెల్లడించలేదు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికే అవకాశమిస్తారని.. ఈనెల 5న తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కొత్త జాతీయ పార్టీగా ఎన్నికల సంఘం దగ్గర దరఖాస్తు చేసుకున్నాక.. పేరు పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ తదితర ప్రక్రియల కోసం ఈసీ దాదాపు నెలరోజుల సమయం తీసుకుంటుందని.. అందువల్ల టీఆర్ఎస్ పేరుతోనే ఉప ఎన్నికకు వెళ్లనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సీపీఎం, సీపీఐలతో ‘స్టీరింగ్ కమిటీ’ మునుగోడు ఉప ఎన్నికలో సీపీఎం, సీపీఐ రెండూ టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో.. ఆ పార్టీల నేతల సమన్వయంతో ప్రచారాన్ని నిర్వహించేందుకు ‘స్టీరింగ్ కమిటీ’ఏర్పాటు చేయనున్నారు. ఇక మునుగోడు నియోజకవర్గాన్ని 90 యూనిట్లుగా విభజించి 70 మంది ఎమ్మెల్యేలు, మరో 20 మంది ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, ఇతర ము ఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించేలా టీఆర్ఎస్ ఇప్పటికే ప్రణాళిక రూపొందించింది. ఇన్చార్జులుగా నియమితులైన నేతలు ఈ నెల 7నుంచి తమకు నిర్దేశించిన యూనిట్ (ఎంపీటీసీస్థానం) పరిధిలో ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ప్రచారంలో భాగంగా చివరి దశలో అంటే అక్టోబర్ చివరి వారంలో సీఎం కేసీఆర్ చండూరులో జరిగే బహిరంగ సభకు హాజరుకానున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రతి ఓటర్ను చేరేలా ప్రణాళిక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన నాటి నుంచి ఇప్పటివరకు బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి 35 మందికిపైగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక ఆత్మీయ సమ్మేళనాల పేరిట ఇప్పటికే 75 వేల మంది ఓటర్లను ప్రత్యక్షంగా కలిసినట్టు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. నియోజకవర్గానికి చెందిన ఏడున్నర వేల మంది గిరిజనులను ప్రత్యేక బస్సుల ద్వారా హైదరాబాద్ బంజారా భవన్‌కు తీసుకొచ్చి పది శాతం గిరిజన రిజర్వేషన్లు, గిరిజన బంధు పథకాలపై అవగాహన కల్పించారు. ఇలా ప్రభుత్వ పథకాలపై ప్రతీ ఓటరుకు అవగాహన కల్పిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామని పార్టీ నేతలు పేర్కొన్నారు. అక్కడక్కడా సద్దుమణగని అసమ్మతి మునుగోడు ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ సర్వశక్తులూ ఒడ్డుతుండగా.. పార్టీలో అంతర్గత అసమ్మతి పూర్తిస్థాయిలో సద్దుమణగడం లేదు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన అసంతృప్తులు.. తర్వాత కొంతమేర స్వరాన్ని తగ్గించారు. మునుగోడు ఉప ఎన్నిక బాధ్యతలను మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు సమన్వయం చేస్తున్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి తమను కలుపుకొనిపోవడం లేదంటూ బీసీ సామాజికవర్గానికి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, కొందరు నేతలు అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. మునుగోడుకు కేటీఆర్, హరీశ్ కూడా? మునుగోడు టీఆర్ఎస్ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు మంత్రి హరీశ్‌రావును కూడా కేసీఆర్ రంగంలోకి దింపనున్నట్టు తెలిసింది. వారు తమకు కేటాయించిన యూనిట్లలో బాధ్యతలు చూసుకుంటూనే.. సమన్వయ బృందా నికి మార్గనిర్దేశం చేస్తారని సమాచారం. -
మునుగోడు దంగల్: కమలదళ కదనోత్సాహం.. ఫుల్‌జోష్‌తో బీజేపీ రెడీ
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఎన్నికల సమరానికి కమలదళం ఫుల్‌జోష్‌తో సిద్ధమవుతోంది. ఎన్నికల ప్రచారానికి బీజేపీ అగ్రనేత, కేంద్రహోం మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. బహిరంగసభల్లో వారు పాల్గొంటారు. వీరితో పాటు రాష్ట్రానికి చెందిన పార్టీ జాతీయ నాయకులు ఇక్కడ విస్తృతంగా పర్యటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్‌కు సరిగ్గా 30 రోజులే ఉండడంతో దసరా తర్వాత శుక్రవారం నుంచే మునుగోడులోని 6 మండలాలు, 2 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం పార్టీ యంత్రాంగాన్ని మోహరించనుంది. ఎన్నికల సమన్వయానికి జి.వివేక్ వెంకటస్వామి చైర్మన్‌గా జాతీయ కార్యవర్గ సభ్యులు, ముఖ్యనేతలతో బీజేపీ ఎలక్షన్ స్టీరింగ్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పర్యవేక్షణలో పనిచేసేందుకు 6 మండలాలు, 2 మున్సిపాలిటీలకు మొత్తం 24 మంది మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను నియమించింది. వీటి పరిధిలోని అన్ని గ్రామాలు, పట్టణాలకు ఇన్‌చార్జీలుగా పార్టీనాయకులు, కార్యకర్తలను ఏర్పాటు చేసింది. ఈ నియోజకవర్గంలోని 298 పోలింగ్‌బూత్‌లకు గాను ఒక్కో దాంట్లో ఇద్దరు, ముగ్గురు చొప్పున ఇన్చార్జీ బాధ్యతలు అప్పగించింది. అయితే.. మునుగోడు ఎన్నికల ప్రచారంలో బహిరంగసభల కంటే ప్రతి ఓటర్ను కలుసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎన్నికల స్టీరింగ్ కమిటీ సమన్వయకర్త డా.గంగిడి మనోహర్‌రెడ్డి తెలిపారు. నియోజకవర్గ పరిధిలో చిన్న చిన్నసభలు అధికంగా నిర్వహించాలని భావిస్తున్నామన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ఇక్కడ చేపట్టాల్సిన బైక్ర్యాలీపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. -
అటు రాహుల్‌యాత్ర.. ఇటు ఉప ఎన్నిక.. కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి
సాక్షి, హైదరాబాద్: అటు రాహుల్‌గాంధీ పాదయాత్ర, ఇటు మునుగోడు ఉప ఎన్నిక.. రెండూ ఒకేసారి తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయి. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగే సమయంలోనే ఉప ఎన్నిక జరగనుండటం ఆ పార్టీ నేతలకు సవాల్‌గా మారనుంది. ఈ రెండింటి ఫలితాలు, పరిణామాలు భవిష్యత్తులో రాష్ట్ర కాంగ్రెస్‌పై కీలక ప్రభావం చూపించే అవకాశముందని నేతలు చెబుతున్నారు. యాత్రను విజయవంతంగా నిర్వహించడం, మునుగోడులో గెలవడం ద్వారా పట్టు పెంచుకోవాలని భావిస్తున్నారు. కీలక తరుణంలో.. అక్టోబర్ చివర్లో రాహుల్ పాదయాత్ర తెలంగాణలో ప్రవేశించనుంది. షెడ్యూల్ ప్రకారం మునుగోడులో అప్పటికి నామినేషన్ల ఘట్టం పూర్తయి.. ప్రచారం ఉధృత స్థాయికి చేరుతుంది. రాహుల్ తెలంగాణలో ఉన్నప్పుడే పోలింగ్తోపాటు ఉప ఎన్నిక ఫలితం కూడా రానుంది. ఈ నేపథ్యంలో రాహుల్ యాత్ర ప్రభావం ఉప ఎన్నికపై ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉప ఎన్నిక కోసం క్షేత్రస్థాయిలో చేస్తున్న ప్రచారానికితోడుగా రాహుల్ యాత్రకు జనంలో వచ్చే స్పందన, ప్రచారం కూడా కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. రెండూ అంటే అగ్ని పరీక్షే! మరోవైపు రాజకీయ కోణంలోనే రాహుల్ పాదయాత్ర తెలంగాణలో ఉన్నప్పుడు ఉప ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చారని.. కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేందుకే నవంబర్ 3న ఎన్నికలు నిర్వహిస్తున్నారని కొందరు కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. రాహుల్ తెలంగాణలో ఉన్న సమయంలో మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు ప్రతికూలంగా వస్తే ఆ ప్రభావం తీవ్రంగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తంమీద మునుగోడు బైపోల్ కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్షగా మారనుందని అంటున్నారు. అయితే రెండింటినీ సమన్వయం చేసుకుని విజయవంతంగా పూర్తి చేస్తామన్న ధీమా కూడా కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. మునుగోడుపై సమావేశం మునుగోడు ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ పార్టీ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించనుంది. మంగళవారం ఉదయం 10 గంటలకు గాంధీభవన్‌లో జరగనున్న ఈ సమావేశానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌లతోపాటు మునుగోడు నియోజకవర్గంలోని మండలాల ఇన్చార్జులు హాజరై చర్చించనున్నారు. -
‘మునుగోడు’లో పోటీ ఎవరి మధ్య ?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీ ఎవరి నడుమ అంటూ టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కె.తారకరామారావు ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ‘ఫ్లోరోసిస్ భూతాన్ని నల్లగొండ బిడ్డలకు శాపంలా ఇచ్చిన కాంగ్రెస్, ఫ్లోరోసిస్ నిర్మూలనకు నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా మిషన్ భగీరథకు పైసా ఇవ్వని మానవత్వం లేని బీజేపీ, ఫ్లోరోసిస్ నుంచి శాశ్వతంగా మిషన్ భగీరథ ద్వారా శాపవిముక్తి చేసిన టీఆర్ఎస్ పార్టీల మధ్య పోటీనా?’అని ట్వీట్ చేశారు. ప్రధాని మోదీని విశ్వగురుగా పేర్కొంటూ మహాత్మాగాంధీని కించపరిచేలా జరుగుతున్న ప్రచారంపైనా కేటీఆర్ మండిపడ్డారు. ‘ప్రపంచమంతా ముక్తకంఠంతో విశ్వగురుగా గుర్తించిన ఏకైక భారతీయుడు మహాత్మా గాంధీ. లక్షల సంవత్సరాల పాటు స్వయం ప్రకటిత విశ్వగురు, గాడ్సేను ఆరాధించే ఆయన శిష్యులు మహాత్ముడిని ఎంతగా అవమానించినా, ఆయన భావజాలాన్ని కించపరిచేందుకు ప్రయత్నించినా విజయం సాధించలేరు’అని పేర్కొన్నారు. కాగా, యూ ట్యూబ్స్టార్ గంగవ్వను కలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొంటూ త్వరలో ‘మై విలేజ్ షో’లో గెస్ట్‌గా పాల్గొంటానని కేటీఆర్ మరో ట్వీట్లో ఆమెను కలిసిన ఫొటోను ట్యాగ్ చేస్తూ హామీ ఇచ్చారు. -
‘మునుగోడులో బీజేపీదే విజయం.. సర్వేలన్నీ మాకే అనుకూలం’
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్‌తో తెలంగాణలో పొలిటికల్ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మునుగోడులో గెలుపే లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. కాగా, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి.. మునుగోడు బరిలో నిలవగా.. అధికార టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పోటీలో ఉంటే అవకాశం ఉంది. కాగా, మునుగోడు ఎన్నికల నోటిఫికేషన్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్‌ను స్వాగతిస్తున్నాము. మునుగోడు ఉప ఎన్నికకు బీజేపీ సర్వసన్నద్ధంగా ఉంది. మునుగోడులో భారీ మెజార్టీతో బీజేపీ విజయం సాధిస్తుంది. మునుగోడు ప్రజలు చాలా చైతన్యవంతులు. ఎవరికి మొదటి స్థానం.. ఎవరికి మూడో స్థానం ఇవ్వాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలన్నదే మా నిర్ణయం. మునుగోడులో చేపట్టిన సర్వేలన్నీ బీజేపీనే గెలుస్తుందని చెబుతున్నాయి. విజయం మాదే’ అని కామెంట్స్ చేశారు. మరోవైపు.. మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. కాగా, తెలంగాణలో బీజేపీ బలోపేతం కోసం బండి సంజయ్ పాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ఆయన చేపట్టిన పాదయాత్ర నాలుగు విడతలను పూర్తి చేసుకుంది. ఈ నెల 15 నుంచి ఐదో విడత పాదయాత్రను చేపట్టాలని బండి సంజయ్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. -
మునుగోడు బైపోల్ సమయంలో తెలంగాణలో రాహుల్ జోడో యాత్ర
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా చేపడుతున్న భారత్ జోడో యాత్ర ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజానీకాన్ని విశేషంగా ఆకర్షిస్తున్నది. అయితే, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ప్రస్తుతం తీవ్ర ప్రభావితం చేస్తున్న మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం జోరుగా ఉన్న సమయంలో రాహుల్ గాంధీ ఇక్కడే యాత్ర చేస్తూ ఉండటం కాంగ్రెస్‌కు కలసి వచ్చే అవకాశంగా కనిపిస్తోంది. ఇదే విషయంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంచనాలు పెంచుకుంటున్నారు. మునుగోడు ఉప ఎన్నిక జరిగే నవంబర్ 3వ తేదీన రాహుల్ గాంధీ హైదరాబాద్ సరిహద్దులోని ముంతంగి నుంచి సంగారెడ్డి మధ్య ఉంటారని భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్ సిద్ధం చేసిన నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మునుగోడుపై రాహుల్ గాంధీతో ఏదైనా ప్రకటన చేయిస్తారని పార్టీలో చర్చ జరుగుతుంది. ఈ అంశంపై తమ రాజకీయ లబ్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
ఉప ఎన్నికతో సంబంధం లేదు.. తగ్గేదేలే అంటున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మునుగోడు ఎన్నికల హీట్ మొదలైంది. ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇక, గెలుపే లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం అఫిషీయల్‌గా అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటీకీ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డినే బరిలో నిలిపే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. జాతీయ పార్టీ ప్రకటనపై సీఎం కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్.. మునుగోడులో జాతీయ పార్టీతో బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే తాజాగా సీఎం కేసీఆర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జాతీయ పార్టీపై కసరత్తులో భాగంగా దసరా(అక్టోబర్ 5న) రోజున జరగాల్సిన సర్వసభ్య సమావేశం యథావిధిగాఘ జరుగుతుందని స్పష్టం చేశారు. ఉప ఎన్నికతో సమావేశానికి సంబంధం లేదన్నారు. కాగా, బుధవారం ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం ప్రారంభంకానుంది. మరోవైపు.. మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మా పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ను గెలిపిస్తాయి. కేంద్రం దుర్మార్గాలకు మునుగోడు ప్రజలు బుద్ధి చెబుతారు అని కామెంట్స్ చేశారు. ఇక, ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 3న మనుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. 6న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 7న విడుదల కానుంది. అక్టోబర్ 14 వరకు నామినేషన్ల స్వీకరణ ఉండగా.. నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ 17గా ఉంది. 15న నామినేషన్ల పరిశీలన జరుగనుంది. -
నవంబర్ 3న మునుగోడు దంగల్: ఆ మూడు పార్టీల గేమ్ ప్లాన్ ఇదే
సాక్షి, నల్గొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు నెల రోజులు మాత్రమే ఉంది. నవంబర్ 3 పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో మూడు ప్రధాన పార్టీలు తల మునకలయ్యాయి. మునుగోడు ముఖచిత్రాన్ని పరిశీలిస్తే మునుగోడులో మొత్తం ఓటర్లు 2 లక్షల 27 వేల 101. సామాజిక వర్గాల వారీగా అధికంగా ఉన్న ఓటర్లు గౌడ, ముదిరాజ్, యాదవ, పద్మ శాలి, ఎస్సీలు, రెడ్డి. మొత్తం మండలాలు ఏడు. మునుగోడు, చండూరు, నాంపల్లి, మర్రిగూడ, చౌటుప్పల్, నారాయణపురం, గట్టుప్పల. నియోజకవర్గంలో మొత్తం రెండు మున్సిపాలిటీలు. చండూరు, చౌటుప్పల్. చదవండి: మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులుగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పాల్వాయి స్రవంతిలను ఆ పార్టీలు ప్రకటించాయి. టీఆర్ఎస్ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. టీఆర్ఎస్ నుంచి అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లపై 22552 మెజారిటీతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో కోమటిరెడ్డికి వచ్చిన ఓట్లు 97239, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి వచ్చిన ఓట్లు 74687. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గంగిడి మనోహర్ రెడ్డికి వచ్చిన ఓట్లు 12725 ఓట్లు. మొత్తం మునుగోడులో ఉన్న గ్రామాల సంఖ్య 159. మునుగోడు లో ఉన్న బూతుల సంఖ్య 294. రెండు గ్రామాలకు ఒక ఇంఛార్జ్‌గా ఎమ్మెల్యేను నియమించే వ్యూహంలో టీఆర్ఎస్ ఉంది. ప్రతీ వంద మంది ఓటర్లకు ఒక ఇంచార్జ్‌ని నియమించేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. లక్ష ఓట్లు కొల్లగొట్టేవిధంగా బీజేపీ ప్రణాళిక రచిస్తోంది. రెండు బూత్లకి ఒకరి చొప్పున 150 మంది ఇంచార్జులను కాంగ్రెస్ నియమించింది. 76 వేల ఓట్లను టార్గెట్‌గా కాంగ్రెస్ పెట్టుకుంది. -
Munugode By Polls: మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3న మనుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. 6న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 7న విడుదల కానుంది. ♦ఈ నెల 14 వరకు నామినేషన్ల స్వీకరణ ♦నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ 17 ♦15 న నామినేషన్ల పరిశీలన మునుగోడులో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇప్పటికే అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి, బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలను ఆ పార్టీలు ప్రకటించాయి. టీఆర్ఎస్ తమ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి వైపే అధిష్టానం మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
మునుగోడులో సారా, కూర, ఖారతో ప్రలోభాలు
మర్రిగూడ: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార పార్టీ సారా, కూర, ఖార ఇచ్చి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ఆదివారం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని మర్రిగూడ, యరగండ్లపల్లి, తిరగండ్లపల్లి, లెంకలపల్లితోపాటు మరికొన్ని గ్రామాల్లో బహుజన రాజ్యాధికారయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. 70 రోజులుగా 23 వేల మంది వీఆర్ఏలు శాంతియుతంగా సమ్మె చేస్తుంటే లాఠీచార్జి చేయించి అణచివేసే ప్రయత్నం చేస్తూ.. ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడడం అమానుషమన్నారు. కాగా, మర్రిగూడ మండలంలోని పీహెచ్‌సీని ప్రవీణ్‌కుమార్ సందర్శించారు. అదే సమయంలో నడవలేక ఇబ్బంది పడుతున్న ఓ వృద్ధుని కుటుంబీకులు మోసుకెళ్తున్న దృశ్యం చూసి తాను కూడా చేయివేసి సాయం చేశారు. చదవండి: బీజేపీకి కొత్త పేరు చెప్పిన కేటీఆర్ -
‘వచ్చే నెలలోనే మునుగోడు ఉప ఎన్నిక.. ఇన్ఛార్జ్లు రెడీగా ఉండండి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్‌లో మునుగోడు ఉప ఎన్నిక వేడి ఇంకా కొనసాగుతోంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ఇక, ఉప ఎన్నికల షెడ్యూల్‌పైనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత సునీల్ బన్సల్.. మునుగోడు ఉప ఎన్నికపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, శనివారం సునీల్ బన్సల్.. మునుగోడు బీజేపీ ఇన్‌చార్జ్‌లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సునీల్ బన్సల్.. పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. బన్సల్ మాట్లాడుతూ.. ‘మునుగోడు ఎన్నికను సీరియస్‌గా తీసుకోవాలి. నవంబర్ మొదటి లేదా రెండో వారంలో ఉప ఎన్నిక ఉంటుంది. మునుగోడులో బీజేపీ గెలుస్తుంది. ఇన్ఛార్జ్లు మునుగోడులోనే ఉండాలి’ అని తెలిపారు. -
‘మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమే’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్.. తన అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నాల్లో భాగంగానే జాతీయ పార్టీ అంటున్నాడు. కేసీఆర్.. తన కుటుంబంపై వచ్చిన అవినీతి కేసుల నుండి తప్పించుకునే పనిలో ఉన్నాడని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా, మధుయాష్కీ గురువారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను మోసం చేయడంలోనే భాగంగానే జాతీయ పార్టీ ప్రకటన అని కేసీఆర్ అంటున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టినా ఒరిగేదేమీ లేదు. కేసీఆర్ రాజకీయంగా వేసే అడుగులన్నీ బీజేపీకి ఉపయోగపడేలా ఉన్నాయి. జాతీయ పార్టీ అంటూ కేసీఆర్.. యూపీఏ భాగస్వామ్య పార్టీల నాయకులనే కలుస్తున్నాడు. బీజేపీకి మద్దతుగా ఉన్న పార్టీలను, నాయకులను కలవడం లేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ లేకుండా ఎటువంటి రాజకీయ కూటమి సాధ్యం కాదు. కేసీఆర్ తన అవినీతిని కప్పి పుచ్చుకునే ప్రయత్నాల్లో భాగంగానే జాతీయ పార్టీ అంటున్నాడు. లిక్కర్ స్కామ్ నుంచి తప్పించుకునేందుకు బీజేపీకి కేసీఆర్ అంతర్గతంగా సహకరిస్తున్నాడు. తన కుటుంబంపై వచ్చిన అవినీతి కేసుల నుండి తప్పించుకునే పనిలో కేసీఆర్ బిజీగా ఉన్నాడు. టీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు అనే బీజేపీ ప్రచారం కూడా తెలంగాణలో కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టేందుకే చేస్తున్నారు. టీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు ఉండదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక కూడా బీజేపీ-టీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమే. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేశాడు. జాతీయ స్థాయిలో కేసీఆర్‌ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. దేశంలో అత్యంత మోసపూరిత ముఖ్యమంత్రి కేసీఆర్ అని శరద్ పవార్ నాతో అన్నాడు. కేసీఆర్ ఎనిమిదేళ్ళ పాలనలో రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ నిజమైతే కేసీఆర్ అవినీతిపై ఇప్పటి వరకూ ఎందుకు చర్యలు లేవు. లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ కుటుంబానికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు. చెట్లతో వేల కోట్లు సంపాదించిన వ్యక్తి కూడా లిక్కర్ స్కామ్‌లో ఉన్నాడు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి రేపో ఎల్లుండో అరెస్ట్ అవుతారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇల్లు కూల్చి.. ఎనిమిది ఏండ్ల తర్వాత విగ్రహం పెట్టారు. విగ్రహం పెట్టడానికి ఎనిమిది ఏండ్లు పట్టిందా..? కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం పెట్టాం అని కేటీఆర్ గొప్పగా చెప్పుకుంటున్నారు. తమ్ముడు తారక రామారావు.. స్టోరీ లు చెప్పడం మానుకో. తెలంగాణ ప్రజలు తిరుగు బాటుకి సిద్ధం అవ్వండి అంటూ వ్యాఖ్యలు చేశారు. -
మునుగోడులో ఇదే ట్రెండూ! బీరువాలు తెరుస్తున్న కార్యకర్తలు
ఖద్దరు బట్టల దర్పమే వేరు.. ధగ ధగా మెరుస్తూ..నిలబడి ఉండే ఖద్దరంటే అందరూ మోజు చూపిస్తారు. అయితే రాజకీయ నాయకులకు ఖద్దరు అనేది బ్రాండ్‌గా మారింది. కొందరైతే పండుగప్పుడో... ఏదైనా ఫంక్షన్‌కో ఖద్దరు ధరిస్తారు. నాయకులైతే ఎక్కువగా ఖద్దరులోనే కనిపిస్తారు. అయితే ఖద్దరు ధరించేవారికి ఉన్న డిమాండ్, విలువ ఇతరులకు ఉండదనేది వాస్తవం. ఇప్పుడు మునుగోడులోని అన్ని పార్టీల కార్యకర్తలు బీరువాలో దాచిన ఖద్దరు దుస్తులు బయటకు తీస్తున్నారట. ఒక ఉప ఎన్నిక అనేక విచిత్రాలకు వేదికవుతోంది. అనేక రాజకీయ పరిణామాలకు దారి తీస్తోంది. భవిష్యత్ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయో రాజకీయ పార్టీలకు మునుగోడు ఉప ఎన్నిక ఓ పాఠంగా మారబోతోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని పార్టీల నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు ఆ నేతల్ని ప్రసన్నం చేసుకోవడం కోసం కొందరు చోటామోటా నేతలు కూడా అదే స్థాయిలో కష్టాలు పడుతున్నారు. నేతల్ని ఆకట్టుకునేందుకు ఇన్నాళ్లు బీరువాల్లో దాచుకున్న తెల్లటి ఖద్దరు బట్టల్ని బయటకు తీస్తున్నారు. ఫలితంగా ఇప్పుడు మునుగోడు రోడ్లపై ఎక్కడ చూసిన తెల్లటి ఖద్దరు ధగధగలే కనిపిస్తున్నాయి. మునుగోడులో ఖద్దరు మెరవడానికి కూడా ఓ కారణం ఉందంటున్నారు. తెల్లటి బట్టలు వేసుకుని వెళ్తేనే లీడర్లం అని చెప్పుకోవడానికి అనువుగా ఉంటుందనే కారణం ఒకటైతే... ప్రస్తుత ఉప ఎన్నిక నేపథ్యంలో దర్పం ప్రదర్శించి నా వెనుక ఇన్ని ఓట్లు ఉన్నాయని..నేతల్ని నమ్మించాలన్నా నాలుగు రూపాయలు సంపాదించాలన్నా ఖద్దరే ముద్దు అనే ఆలోచనతో చోటా నేతలంతా ఖద్దరు బాట పట్టారు. దీంతో మునుగోడులో ఎక్కడ చూసినా ఖద్దరు బట్టలు ధరించిన వారే కనిపిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని వస్త్ర దకాణాల్లో ఇప్పుడు తెల్లని ఖద్దరు వస్త్రాలకు గిరాకీ భారీగా పెరిగింది. మునుపెన్నడు లేని విధంగా ఖద్దరు కొనుగోళ్లు బాగా పెరిగినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇక్కడ దొరక్కపోతే పక్క ఊళ్ళ నుంచి ఖద్దరు తెప్పించుకుంటున్నారట. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీలకు కత్తి మీద సాములా మారింది. తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఎత్తులు, పై ఎత్తులతో నాయకులు సతమతమవుతుంటే.. చోటామోటా లీడర్లు మాత్రం తమకు పైసలు వచ్చే టైమొచ్చిందని సంబరపడుతున్నారు. -
Munugode Bypoll: అభివృద్ధి చేస్తానంటే రూ.లక్ష కోట్లు ఇస్తా
సాక్షి, నల్గొండ: అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న మునుగోడు నియోజకవర్గాన్ని ఆరు నెలల్లో అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇస్తే తాను లక్ష కోట్ల రూపాయలు ఇస్తానని ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.ఏ పాల్ అన్నారు. ఆదివారం కేఏపీల్ తన 59వ జన్మదిన వేడుకలను మునుగోడులో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసినా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయినా నేటికీ సామాజిక న్యాయం ఎక్కడా కన్పించడం లేదన్నారు. మునుగోడులో బడుగు, బలహీన వర్గాల ప్రజలను అభివృద్ధి చేసేందుకే ఉప ఎన్నికల బరిలో నిలుస్తున్నానన్నారు. ప్రజా యుద్ధ నౌక, గాయకుడు గద్దర్ మాట్లాడుతూ ఓటు అనేది ఓ వజ్రాయుధం, దానిని అమ్ముకుంటే ఎప్పటికీ బానిసలుగా బతకాల్సిందే అని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు తన ఓటు హక్కుని సమర్థుడైన నాయకుడికి వేయాలి తప్పా, డబ్బు, మద్యం ఇచ్చేవాడికి వేయవద్దన్నారు. ఈ సందర్భంగా పాడిన పాటలు, చేసిన నృత్యాలు సమావేశానికి వచ్చిన ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. -
మునుగోడులో టీఆర్ఎస్కు భారీ షాక్.. రాజగోపాల్ మాస్టర్ ప్లాన్స్ సక్సెస్!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ స్పీడ్ పెంచింది. ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బలం పెంచుకునేందుకు పూర్తిగా చేరికపైనే దృష్టి పెట్టారు. వారం రోజుల నుంచి ప్రజా ప్రతినిధులను, నాయకులను రాజగోపాల్ రెడ్డి పెద్ద ఎత్తున పార్టీలో చేర్చుకుంటున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులపైనే దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశంను, మరికొంత మంది నేతలను బీజేపీలో చేర్చుకున్నారు. వారం రోజులుగా పలువురు సర్పంచ్‌లను, వార్డు సభ్యులను, ఇతర పార్టీ కార్యకర్తలను పదుల సంఖ్యలో రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. గత ఆదివారం హైదరాబాద్ ఔటర్‌రింగ్‌రోడ్డు సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన చేరికల్లో ఎలుకలగూడెం గ్రామానికి చెందిన 30 మంది , మునుగోడు నుంచి 11 మంది, మరో గ్రామానికి చెందిన 20 మంది బీజేపీలో చేరారు. అదేవిధంగా చౌటుప్పల్ మండలంలోని అల్లాపురం, అంకిరెడ్డిగూడెం, గుండ్లబావి గ్రామాల సర్పంచ్‌లు బుధవారం రాత్రి హైదరాబాద్‌లో రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. గురువారం ఎల్లంబావి శివారులోని హోటల్ వద్ద కోయలగూడెం, నాగారం, పంతంగి గ్రామాలకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. టీఆర్ఎస్కు షాక్.. ఇటీవల చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజగోపాల్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ కంగుతింది. దీంతో మిగతా క్యాడర్ పార్టీని వీడకుండా నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శవయాత్రలు చేసి వలసలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కర్నాటి వెంకటేశంతోపాటు గట్టుప్పల్‌కు చెందిన ఇద్దరు ఎంపీటీసీలు అవ్వారు గీతాశ్రీనివాస్, చెరుపల్లి భాస్కర్, ఉడతలపల్లి సర్పంచ్ తులసయ్యలు కూడా బీజేపీలో చేరారు. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు పెరగడంతో మరింత ఉత్సాహంతో బీజేపీ నాయకులు ముందుకు పోతున్నారు. కార్యాచరణపై నిర్ణయం మాజీ ఎంపీ వివేక్ చైర్మన్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి కోఆర్డినేటర్‌గా 14 మంది సభ్యులతో నియమించిన స్టీరింగ్ కమిటీ శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భేటీ అయ్యింది. ఈ క్రమంలో మునుగోడులో బీజేపీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహం, కమిటీలు చేపట్టాల్సిన కార్యాచరణపై స్టీరింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. -
Munugode Politics: మునుగోడుపై కమలనాథుల వ్యూహమేంటీ?
సాక్షి, హైదరాబాద్/నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి స్టీరింగ్ కమిటీ చైర్మన్‌గా వివేక్‌ను నియమిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. 16 మందితో స్టీరింగ్ కమిటీని ప్రకటించారు. స్థానికుడైన గంగిడి మనోహర్‌రెడ్డికి కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పగించారు. చదవండి: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల! సభ్యులుగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాజీ ఎంపీలు ఏపీ జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, విజయశాంతి, రవీంద్ర నాయక్, రాపోలు ఆనంద్ భాస్కర్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ స్వామి గౌడ్, మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీ నారాయణ, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, మాజీ నేషనల్ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారి, దాసోజు శ్రవణ్‌ను నియమించారు. దుబ్బాక, హుజురాబాద్ తరహాలో ఉప ఎన్నిక ఇంచార్జీ అని కాకుండా స్టీరింగ్ కమిటీ అని ప్రకటించడం బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఉప ఎన్నిక ఇంచార్జ్ కోసం నేతలు పోటీ పడ్డారు. కానీ బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి మాత్రం వివేక్ పేరు ప్రతిపాదించారు. ఇతర నేతలను నారాజ్ చేయకుండా స్టీరింగ్ కమిటీ పేరుతో 16 మంది టీం ప్రకటించారు. మరో రెండు మూడు రోజుల్లో మునుగోడు నియోజకవర్గంలో మండలాల వారీగా ఇంచార్జ్‌లను ప్రకటించనున్నారు. వచ్చే వారంలో ప్రతి గ్రామానికి ఇంచార్జ్‌ని నియమించి బూత్ స్థాయిలో పోల్ మేనేజ్మెంట్ చేయడానికి బీజేపీ పటిష్ట కార్యాచరణ రూపొందిస్తోంది. -
మునుగోడు ఎన్నికతో టీఆర్ఎస్ సైలెంట్! ఉనికేలేని బీజేపీకి ఇది ప్లస్?
ఉమ్మడి ఖమ్మం జిల్లాపై బీజేపీ ఫోకస్ పెట్టిందా? అందివచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టదలచుకోలేదా? ప్రత్యర్థి పార్టీ కార్యకర్త చనిపోయినా తమకు అనుకూలంగా మలుచుకుంటుందా? ఖమ్మం జిల్లాలో అసలు కమలనాథుల వ్యూహం ఏంటి? తెలంగాణలో బీజేపీ ఉనికి లేని జిల్లా ఏదంటే ఖమ్మం అనే చెప్పాలి. ఈ జిల్లాలో కాషాయ సేనకు చెప్పుకోదగ్గ నాయకులు ఎవరూ లేరు. దీంతో ఇక్కడ కమలం పార్టీ పుంజుకోవడం సాధ్యం కావడంలేదు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. అదేవిధంగా వామపక్షాలు, టీఆర్ఎస్ పార్టీల హవా కూడా నడుస్తోంది. వామపక్షాలకు సీట్లు లేకపోయినా ఓట్ బ్యాంక్, కేడర్ బలం అయితే ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఒక్కొక్క సీటులో మాత్రమే విజయం సాధించింది. కాషాయ నేతల హడావుడి ఖమ్మం జిల్లాలో నాలుగో ప్లేస్‌లో ఉన్న కమలం పార్టీ పుంజుకోవడానికి నానా తంటాలు పడుతోంది. అందుకే రాజకీయంగా రచ్చ జరిగిన ఏ ఘటనను వదిలిపెట్టడంలేదు. సొంత పార్టీ కార్యకర్త చనిపోతే ఎంత హడావుడి చేశారో.. టీఆర్ఎస్ కార్యకర్త హత్యకు గురైన సందర్భంలో కూడా అంతే హడావుడి చేస్తున్నారు కమలం పార్టీ నాయకులు. ఆగస్టు 15వ తేదీన ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనపై టీఆర్ఎస్ నాయకత్వం, ప్రభుత్వం స్పందించిన తీరుపై ఆ పార్టీ కేడర్లోనే అసంతృప్తి వెల్లడవుతోంది. ఇక్కడే బీజేపీ నాయకులు తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య ఘటనలో టిఆర్ఎస్ను టార్గెట్ చేసుకుని బీజేపీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. అధికార టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. అదే సమయంలో సొంత పార్టీ కార్యకర్త కృష్ణయ్య హత్యకు గురైతే అధికారంలో ఉండి కూడా టీఆర్ఎస్ సరిగా స్పందించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మునుగోడు కారణమని ప్రచారం ఇదే అంశాన్ని బీజేపీ రాష్ట్ర నేతలు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమ్మినేని కృష్ణయ్య హత్య ఘటనలో టిఆర్ఎస్ సైలెంట్ గా ఉండటానికి ప్రదాన కారణం మునుగోడు ఉప ఎన్నికనే అనే విషయాన్ని జనంలోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కమలం నాయకులు. కృష్ణయ్య హత్యలో సీపీఎం నాయకుల పాత్ర ఉండటంతో.. కేసు నుంచి బయట పడటానికి మునుగోడులో టిఆర్ఎస్కు మద్దతు ప్రకటించిందనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతోంది. కృష్ణయ్య హత్యపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కమలనాథులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే కేంద్ర మంత్రి బీఎల్ వర్మ స్వయంగా కృష్ణయ్య ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణయ్య హత్య విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానని కేంద్ర మంత్రి వర్మ వారికి మాటిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పరామర్శకు ప్లాన్ చేశారు. చనిపోయింది టీఆర్ఎస్ నాయకుడే అయినా మానవత్వంతో అయినా ఆ ఫ్యామిలీకి అండగా ఉంటామని బీజేపీ నేతలు చెబుతున్నారు. టీఆర్ఎస్ నేతలకు బీజేపీ గాలం! కొన్ని నెలల క్రితం ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఇష్యూ కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చల్లోకి వచ్చింది. టిఆర్ఎస్ నాయకులు, పోలీసుల వేధింపుల వల్లే తాను చనిపోతున్నానని ప్రకటించి సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా మృతుని అమ్మమ్మ, చెల్లితో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పడం, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు పలువురు ముఖ్య నేతలు ఖమ్మం వచ్చి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం చేయడంతో.. కల్ గా బీజేపీకి కొంత మైలేజ్ వచ్చింది. ఈ ఘటన బీజేపీ కార్యకర్తల్లో ఎంతో మనో ధైర్యాన్ని నింపిందన్న అంశాన్ని గుర్తుచేస్తూ... కృష్ణయ్య హత్యను టీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎందుకు లైట్ గా తీసుకుంటున్నారన్న చర్చ సైతం ఖమ్మం జిల్లాలో మొదలైంది. మరో వైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతం కోసం ఇతర పార్టీల ముఖ్యనేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. టిఆర్ఎస్ లో అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతలకు గాలం వేస్తోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుతో పాటు మరికొందరు నేతలను బీజేపీలోకి రప్పించుకునేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లాలో రాజకీయ సమీకరణాలు మార్చేందుకు కమలం పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. -
మునుగోడు నిరుద్యోగులకు కేఏ పాల్ బంపర్ ఆఫర్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ప్రకటన చేశారు. మునుగోడు నిరుద్యోగ యువతకు బంఫర్ ఆఫర్ ఇస్తున్నట్టుగా తెలిపారు. తన 59వ జన్మదినం సందర్భంగా మనుగోడు నియోజకవర్గంలోని 59మంది నిరుద్యోగులను లాటరీ పద్ధతిన ఎంపిక చేసి వారికి పాస్‌పోర్ట్, అమెరికా వీసా ఉచితంగా ఇప్పించనున్నట్లు తెలిపారు. మునుగోడు నిరుద్యోగ యువత రెజ్యూమ్‌లు తీసుకుని సెప్టెంబర్ 25న (ఆదివారం) మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య శ్రీవారి హోమ్స్ గ్రౌండ్స్‌కు రావాలని సూచించారు. తన 59వ పుట్టినరోజు కానుకగా వచ్చిన ప్రతి ఒక్కరిలో లాటరీ ద్వారా 59 మందిని ఎంపిక చేసి.. వారికి పాస్ పోర్టు చేయించి, అమెరికా వీసా స్పాన్సర్ షిప్ చేయించి ఇస్తానని వెల్లడించారు. తన జన్మదిన కానుకగా అందిస్తున్న సదావకాశాన్ని మునుగోడు యువత అందిపుచ్చుకోవాలని కోరారు. ఈ మేరకు కేఏ పాల్ మంగళవారం వీడియో రిలీజ్ చేశారు. -
మునుగోడు ఉప ఎన్నిక.. వ్యూహం మార్చిన కాంగ్రెస్
సాక్షి, నల్లగొండ: మునుగోడులో కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాన్ని మార్చుకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించిన తరువాత పార్టీ శ్రేణులు రంగంలోకి దిగాయి. రాష్ట్ర స్థాయి నాయకులు, ముఖ్య నేతలంతా మండలాల్లో పర్యటిస్తుండడంతో కాంగ్రెస్ క్యాడర్లో కదలిక మొదలైంది. ఈ దూకుడును పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ వ్యూహరచన, ప్రచార కమిటీ కన్వీనర్‌గా టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డిని నియమించింది. ఆ బాధ్యతల నుంచి మాజీ ఎంపీ మధుయాస్కీగౌడ్‌ను తప్పించింది. అన్నింటికంటే ముందుగానే.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వెంటనే అన్ని పార్టీల కంటే ముందే చండూరులో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించింది. అందులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ముఖ్య నాయకులంతా పాల్గొన్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. తరువాత కొద్దిరోజులకు గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమం చేపట్టినా తరువాత మిన్నకుండిపోయింది. టికెట్ విషయంలో ఆశావహుల నుంచి పోటీ పెరగడంతో వారితో చర్చించింది. ఎవరికి టికెట్ ఇచ్చినా అంతా కలిసి పని చేసేలా, అభ్యర్థి గెలుపునకు కృషి చేసేలా ఒప్పించింది. మాజీ మంత్రి పాల్వాయి గోవర్దన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి పేరును ఖరారు చేసింది. ఆ తరువాతే పార్టీ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అన్ని మండలాలకు రాష్ట్ర స్థాయి నాయకులను ఇన్ఛార్జీలుగా నియమించింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇప్పటికే రెండుసార్లు నియోజకవర్గంలో పర్యటించారు. ఆయన నారాయణపూర్ మండలం ఇన్ఛార్జిగా ఉండగా, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, శ్రీధర్‌బాబు వంటి నేతలు మండలాల ఇన్‌చార్జీలుగానే కాకుండా, ఇతర మండలాల్లోనూ పర్యటిస్తున్నారు. ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఎత్తుగడలను ముఖ నేతలకు చెబుతూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో కేడర్‌లో కదలిక వచ్చింది. చదవండి: గిరిజన రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన పూర్తి స్థాయిలో ఉండేందుకే దామోదర్‌రెడ్డికి బాధ్యతలు నవంబరు లేదా డిసెంబరులో ఉప ఎన్నికలు ఉండనున్న నేపథ్యంలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ వ్యూహరచన, ప్రచార కమిటీ కన్వీనర్‌ను అధిష్టానం మార్చింది. ఈ మార్పును రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ ప్రకటించారు. ఇప్పటివరకు కమిటీకి కన్వీనర్‌గా ఉన్న మధుయాస్కీ గౌడ్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించి టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డిని నియమించింది. దీంతో ఆయన స్థానికంగా ఉండి పూర్తి స్థాయిలో దృష్టి సారించి పని చేసేలా ఈ మార్పు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర అక్టోబరు 24వ తేదీన రాష్ట్రంలో ప్రారంభం కానుంది. అప్పటికి మునుగోడులో ఎన్నికల జోరు పెరగనుంది. ఆ సమయంలో మధుయాస్కీగౌడ్ రాహుల్ యాత్రకు సంబంధించిన వ్యవహారాల్లో ఉంటే మునుగోడులో కార్యక్రమాలకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉండటంతో ఆయన్ని తప్పించినట్లు తెలిసింది. -
‘గులాబీ’ బాస్‌కు తలనొప్పిగా మారిన ‘డాక్టర్’!
సాక్షి, నల్గొండ: పార్టీకి నమ్మకస్తుడిగా పేరున్న బూర నర్సయ్య అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే నేతల్లో ఒకరుగా పేరుంది. అయితే ఇప్పుడు ఆ డాక్టరే పార్టీకి తలనొప్పిగా మారాడన్న విమర్శలు వస్తున్నాయి. మూడేళ్లుగా ఖాళీగా ఉంటోన్న మాజీ ఎంపీ చూపు ఇప్పుడు మునుగోడు అసెంబ్లీ సీటు మీద పడిందా? సౌమ్ముడిగా పేరున్న ఈ నేత పార్టీ పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడానికి కారణం ఏంటి? కాంట్రవర్సీకి కేరాఫ్‌గా ఎందుకు మారాడు? చదవండి: కేసీఆర్ సర్కార్‌ను గవర్నర్ ఇరుకున పెట్టారా? మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్కు పెద్ద తలనొప్పిగా మారింది. నల్లగొండ జిల్లాలో ఎక్కడా లేనంత మంది ఆశావాహులు మునుగోడులోనే ఉన్నారు. అందరినీ ఒప్పించి ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకే పార్టీ నాయకత్వానికి తలబొప్పి కట్టింది. అంతా సర్దుకుందని అనుకుంటున్న తరుణంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ రూపంలో కొత్త తలనొప్పి వచ్చి పడింది. పార్టీ నిర్ణయాల ప్రకారమే నడుచుకుంటానంటూనే పార్టీ ఇబ్బందుల్లో పడేలా ఆయన వ్యవహార శైలి ఉందంటున్నారు. మునుగోడులో బీసీ సామాజిక వర్గానికే మెజార్టీ ఓటు బ్యాంకు ఉందని.. ఆ వర్గాల నుంచి తాను టికెట్ అడగడంలో తప్పేంటని ఆయన వ్యాఖ్యానించడం హాట్ టాపిక్‌గా మారింది. నెల క్రితం చౌటుప్పల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మునుగోడులో ఎప్పుడూ రెడ్లు, వెలమలే ఎమ్మెల్యేలు కావాలా.. బీసీలకు అవకాశం ఇవ్వరా అంటూ చేసిన కామెంట్స్ తీవ్ర కలకలం రేపాయి. ఆ తర్వాత సైలెంట్ అయినట్లు కనిపించినా మరోసారి మునుగోడు నియోజకవర్గంలోనే ప్రెస్ మీట్ పెట్టీ మరి తన మనసులో మాట బయట పెట్టారు. టికెట్ అడగడంతో పాటు ఏకంగా పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ ఘాటైన విమర్శలు చేయడంతో ఒక్కసారిగా కాకరేగింది. ఈ వ్యాఖ్యలు జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డిని ఉద్దేశించే అన్నారని చర్చ కూడా జరుగుతోంది. తనను పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయడం లేదని... ఇలా ఎందుకు జరుగుతుందో జిల్లా మంత్రే వివరించాలనడాన్ని బట్టి చూస్తే ఓ ప్రణాళిక ప్రకారమే ఆయన పార్టీపై అసంతృఫ్తిని వెళ్లగక్కినట్లుందని టీఆర్ఎస్లోనే చర్చ సాగుతోంది. భువనగిరి ఎంపీగా 2014లో గెలిచిన బూర గత ఎన్నికల్లో ఓటమి చెందారు. మూడేళ్ళుగా ఖాళీగా ఉన్న ఆయన చూపు ఇప్పుడు అసెంబ్లీ మీద పడింది. అందుకే తన సామాజిక వర్గ ఓట్లు అధికంగా ఉన్న సొంత నియోజకవర్గం మునుగోడులో పోటీచేయాలని భావిస్తున్నారు. టీఆర్ఎస్ టికెట్ కూసుకుంట్లకే ఇస్తున్నారన్న వార్తలు బయటకు రావడంతో నెల రోజుల క్రితం కూసుకుంట్ల వ్యతిరేకులంతా చౌటుప్పల్‌లో సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశం వెనుక అసలు సూత్రధారి నర్సయ్యేననే ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం బూరతో మంతనాలు సాగించినట్లు జోరుగా ప్రచారం సాగింది. పార్టీలోకి వస్తే టికెట్ ఇస్తామనే హామీ కూడా ఇచ్చినట్లు గుసగుసలు వినిపించాయి. ఆయనతో పాటు కర్నె ప్రభాకర్ తో కూడా కాంగ్రెస్ చర్చలు జరిపినట్లు టీఆర్ఎస్ వర్గాలే మాట్లాడుకున్నాయి. అయితే కాంగ్రెస్‌లో చేరితే గెలుస్తామో లేదో అనే సందేహంతోనే టీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారు. మరోవైపు బూర నర్సయ్య చేసిన వ్యాఖ్యలను అధిష్టానం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బూర నర్సయ్య వ్యవహారం మునుగోడు టీఆర్ఎస్లో మరింత హీట్‌ను పెంచినట్లైంది. ఇదే సమయంలో పార్టీలో ఉన్న బీసీ నేతలు కూడా బూర నర్సయ్య వ్యాఖ్యలను తప్పుబడుతున్నట్లు తెలుస్తోంది. -
తెలంగాణ: ఆ ఏడు మండలాల్లో నాటు కోళ్ళు గాయబ్
అక్కడి వూళ్ళలో కోళ్ళు మాయం అవుతున్నాయి. మాయం అవుతున్నాయంటే వూళ్ళలో దొంగలేమీ పడి ఎత్తుకుపోలేదు. పోనీ ఏ రోగమో వచ్చి నాటు కోళ్ళన్నీ చనిపోలేదు. కానీ, ఏడు మండలాల్లో నాటు కోళ్ళు కనిపించడంలేదంట. ఎందుకిలా జరిగింది. ఇంతకీ ఆ వూళ్ళు ఎక్కడున్నాయి? పల్లెటూళ్ళలో నాటు కోళ్ళకు గిరాకీ ఎక్కువ. చాలా మంది ఇళ్ళలో పెంచుకుంటారు. బ్రాయిలర్ కోళ్ళు తిని విసుగు చెందినవారు కచ్చితంగా నాటు కోడిని తినాలనుకుంటారు. ఎంత రేటు పెట్టైనా కొనాలనుకుంటారు. సహజసిద్ధంగా పెరిగే నాటుకోడిలో పోషకాలు కూడా ఎక్కువే ఉంటాయి. కానీ ఇప్పుడు అదే నాటుకోడి ఉన్నట్లుండి నెల రోజుల్లోనే ఓ ప్రాంతం నుంచి కనిపించకుండా పోయింది. దాని ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకు ఇలా జరిగింది? అక్కడేమన్నా కోళ్లకు రోగాలు వచ్చాయా అంటే అదేం లేదు. అక్కడ ఉప ఎన్నిక వస్తోంది. అదేంటి ఉప ఎన్నిక వస్తే నాటు కోళ్లు మాయం కావడం ఏంటనుకుంటున్నారా? విషయం అంతా అక్కడే ఉంది మరి.. నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఎక్కడ చూసినా ఎనికల వాతావరణమే కనిపిస్తోంది. ఎన్నికల తేదీ అయితే రాలేదు గాని ..మూడు ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి. ప్రచారానికి వచ్చే పార్టీల కార్యకర్తలు, నేతలు, జనాలకు మందు, విందు ఏర్పాటు చేస్తున్నాయి పార్టీలు. విందులో బ్రాయిలర్ కోళ్ళ కంటే నాటు కోళ్ళకే మక్కువ చూపిస్తున్నారట. అందుకే నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో నాటు కోళ్ళన్నీ అక్కడికొచ్చేవారికి ఆహారంగా మారిపోతున్నాయి. ఇప్పుడక్కడ నాటు కోళ్ళ కోసం దుర్భిణీ వేసి వెతికినా కనిపించడంలేదంటున్నారు. ఎక్కడైనా కనిపించినా..దాని ధర బంగారం స్థాయికి చేరిపోయిందని చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో నియోజకవర్గంలో మటన్‌కు కూడా విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. ఇంతకు ముందుకు గొర్రెలు, మేకలు విరివిగా దొరికేవి. వాటి రేట్లు కూడా అంతో ఇంతో అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు వాటికి కూడా డిమాండ్ పెరిగి మటన్ ధరలు కూడా బాగా పెరిగిపోయాయి. మరోవైపు ప్రచార సభలు నిర్వహించే రాజకీయ పార్టీల నేతలకు కొత్త తలనొప్పులు వస్తున్నాయి. మీటింగులకు వచ్చేవారికి నాన్ వెజ్ భోజనం పెట్టకపోతే వారు నారాజ్ అవుతున్నారట. ఒకవేళ ముక్క భోజనం పెట్టకపోతే మనసులో పెట్టుకుని ఎక్కడ ఓటు వేయరోనన్న ఆందోళన కూడా నేతల్లో కనిపిస్తోందట.. మొత్తానికి మునుగోడులో మటన్ ముక్కతో పాటు నాటుకోడికి కూడా తిప్పలొచ్చాయి. ఉప ఎన్నిక ఏమో గాని మాకు నాటు కోళ్ళు దొరకడంలేదని మునుగోడు నియోజకర్గ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అభ్యర్థిని ప్రకటించే స్థితిలో టీఆర్ఎస్ లేదు: రేవంత్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. రాజకీయ నేతలు పొలిటికల్ విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్, బీజేపీపై విరుచుకుపడ్డారు. కాగా, రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్ఎస్ అకారణంగా ఉప ఎన్నిక తెచ్చాయి. టీఆర్ఎస్ ఇప్పటికీ అభ్యర్థిని ప్రకటించలేని స్థితిలో ఉంది. కేసీఆర్‌ను సంతోషపెట్టేందుకు ఆ పార్టీ నాయకులు జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నట్లుంది. ఇక్కడ ఏం చేయలేని వాడు.. దేశ రాజకీయాల్లో వెళ్లి ఏం చేస్తారు. కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలను చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీకి మద్దతు ఇస్తున్న మాయావతి, నవీన్ పట్నాయక్‌తో కేసీఆర్ ఎందుకు చర్చలు జరపడం లేదు. బీజేపీకి మేలుచేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడు. బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీలు బొమ్మా బొరుసు లాంటివి. దేవుడు నిమజ్జనానికి వచ్చిన వ్యక్తి రాజకీయాలు మాట్లాడడం ఏంటి?. ఇదంతా టీఆర్ఎస్, బీజేపీ గేమ్ ప్లాన్. వెస్ట్ బెంగాల్ ప్లాన్‌ను బీజేపీ, టీఆర్ఎస్ అమలు చేస్తున్నాయి. లిక్కర్ స్కాంపై బీజేపీ బుద్దిలేని ప్రచారం చేస్తోంది. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు పదేపదే ఈ అంశంపై మాట్లాడుతున్నారు. సూదిని సృజన్ ఎవరితో కలిసి వ్యాపారం చేస్తున్నారో విచారణ చేయండి. ఆయనకు ఎవరితో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయో తీయండి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ఇంట్లో ఇప్పటి వరకు ఎందుకు సోదా చేయలేదని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: టీఆర్ఎస్లో ముసలం.. కేసీఆర్, కేటీఆర్‌కు లేఖలు -
మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి.. ఆమె స్పందన ఇదే..
సాక్షి, నల్గొండ జిల్లా: మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా తనను ఏఐసీసీ ప్రకటించడంతో పాల్వాయి స్రవంతి స్పందించారు. ఆమె ‘సాక్షి’ మీడియాతో ఫోన్లో మాట్లాడుతూ, టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం, సీనియర్ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని పూర్తిగా నిలబెట్టుకుంటానన్నారు. సిట్టింగ్ స్థానంలో గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. కార్యకర్తలు కోరుకున్నట్లుగానే అధిష్టానం తనకు టికెట్ ఇచ్చిందన్నారు. అండగా ఉన్న ప్రతీ కార్యకార్తకి ధన్యవాదాలు తెలిపిన ఆమె.. నమ్మకాన్ని నిలబెడుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చేసిన అభివృద్ధి పనులే తనను మునుగోడులో గెలిపిస్తాయన్నారు. చదవండి: రేవంత్ ఆ వైపు నిలిచినా.. పంతం నెగ్గించుకున్న సీనియర్లు కాగా, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని మునుగోడు అభ్యర్థిగా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ముఖుల్ వాస్నిక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతకుముందు టీపీసీసీ నలుగురు అభ్యర్థుల జాబితాను ఢిల్లీకి పంపించింది. అందులో పాల్వాయి స్రవంతి, కృష్ణారెడ్డి, కైలాష్ నేత, పల్లె రవి పేర్లు ఉన్నట్లు తెలిసింది. వీరిలో కాంగ్రెస్ అధిష్టానం పాల్వాయి స్రవంతి వైపే మొగ్గుచూపింది. మునుగోడు నియోజకవర్గంలో మంచి పేరు ప్రతిష్టలు ఉండటం కూడా ఆమెకు కలిసొచ్చింది. గతంలోనూ స్రవంతి అక్కడ నుంచి పోటీచేసి చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించారు. -
రేవంత్ ఆ వైపు నిలిచినా.. పంతం నెగ్గించుకున్న సీనియర్లు
సాక్షి, నల్లగొండ: అనేక తర్జన భర్జనల అనంతరం ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ మునుగోడు అభ్యర్థిని ప్రకటించింది. యావత్ తెలంగాణ రాష్ట్రం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మునుగోడు ఉప ఎన్నికకు పాల్వాయి స్రవంతి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ముఖుల్ వాస్నిక్ శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉంటే, పాల్వాయి స్రవంతికి టికెట్ దక్కడంలో నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కీలకంగా వ్యవహరించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చలమల్ల కృష్ణారెడ్డి వైపు నిలిచినా జిల్లా సీనియర్ నాయకులు అధిష్టానం వద్ద తమ పంతం నెగ్గించుకున్నారు. అయితే అభ్యర్థి రేసులో ఉన్న పున్న కైలాష్ని డీసీసీగా నియమించే అవకాశం ఉంది. చదవండి: (మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్) Congress President Smt Sonia Gandhiji decision will always works for Telangana. Hope @INCTelangana team take it forward with the same spirit and win Mungode again 💪🏻 . pic.twitter.com/WPPDgw6Ogu — Manickam Tagore .B🇮🇳✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) September 9, 2022 -
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిని ఏఐసీసీ ఖరారు చేసింది. పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ముఖుల్ వాస్నిక్ ప్రకటించారు. కాగా, అంతకుముందు టీపీసీసీ నలుగురు అభ్యర్థుల జాబితాను ఢిల్లీకి పంపించింది. అందులో పాల్వాయి స్రవంతి, కృష్ణారెడ్డి, కైలాష్ నేత, పల్లె రవి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో కాంగ్రెస్ అధిష్టానం పాల్వాయి స్రవంతి వైపే మొగ్గుచూపింది. మునుగోడు నియోజకవర్గంలో మంచి పేరు ప్రతిష్టలు ఉండటం కూడా ఆమెకు కలిసొచ్చింది. గతంలోనూ స్రవంతి అక్కడ నుంచి పోటీచేసి చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించారు. చదవండి: (జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ గ్రాండ్ ఎంట్రీ.. ముహూర్తం ఫిక్స్!) -
మునుగోడు ఉప ఎన్నిక.. మరో జిల్లాపై ప్రభావం చూపనుందా?
ఒక జిల్లాలో ఉప ఎన్నిక జరుగుతుంటే.. మరో జిల్లాలో ప్రభావం ఉంటుందా? ఇప్పుడలాంటి పరిస్థితే ఉందంటున్నారు టీఆర్ఎస్ వర్గాలు. బీజేపీని ఓడించే లక్ష్యంతో మునుగోడులో టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చింది సీపీఐ. ఆ మేరకు మునుగోడు సభకు సీపీఐ నేతలు హాజరయ్యారు. దీంతో ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, వైరా శాసనసభ్యులకు, వచ్చే ఎన్నికల్లో అక్కడ సీట్లు ఆశిస్తున్న నేతలకు బెంగ మొదలైంది. ఇవే సమీకరణాలు వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడ ఉంటే ఖమ్మం ఉమ్మడి జిల్లాలో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో వామపక్షాలకు పట్టుంది. ఇక్కడ గెలుపోటములు నిర్ణయించగల స్థాయిలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు బలం ఉంది. వారికి సొంతంగా గెలిచే శక్తి లేకపోయినా...ఎవరినో ఒకరిని ఓడించడానికి సహాయపడగలరు. మునుగోడులో పొత్తు విజయవంతమైతే...వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సీపీఐ, టిఆర్ఎస్ మధ్య పొత్తు పొడిస్తే ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, వైరా సీట్లను సీపీఐ అడిగే అవకాశం ఉంది. ఇప్పటికే కొత్తగూడెం సీటు పొత్తుల్లో భాగంగా సీపీఐకి వెళ్లుతుందన్న ప్రచారం కొంతకాలంగా జిల్లాలో సాగుతోంది. దీంతో కొత్తగూడెం, వైరా టిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లోనే కాకుండా ఆశావహుల్లో సైతం గుబులు మొదలైంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు వచ్చే ఎన్నికల్లో కూడా టికెట్ తనకే వస్తుందన్న దీమాతో ఉంటున్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు సైతం వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం టికెట్ తనకే వస్తుందని తన అనుచరులతో చెప్పుకుంటున్నారు. దీంతో ఇద్దరిలో టికెట్ ఎవరికి వస్తుందా అన్న చర్చ టీఆర్ఎస్ శ్రేణుల్లో నడుస్తోంది. అటు వైరా నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ టికెట్ పై ఆశలు పెట్టుకోగా..మాజీ ఎమ్మెల్యేలు మదన్ లాల్, బానోత్ చంద్రావతి కూడ టికెట్ కోసం ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు... రెండు నియోజకవర్గాల్లో సిటింగులు, ఆశావహులు మునుగోడు దెబ్బకు కుదేలవుతున్నారు. సీపీఐ కారణంగా తమకు నష్టం జరిగే అవకాశం కనిపిస్తోందని ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో గనుక నిజంగా సీపీఐతో పొత్తు కుదిరితే తమ పరిస్థితేంగాను అంటూ కంగారు పడుతున్నారు. ఇప్పటికైతే సీపీఐ మాత్రమే గులాబీ పార్టీతో టచ్‌లో ఉంది. సీపీఎం కూడా ఇదే దారిలోకి వస్తే మరికొన్ని సీట్లకు కూడా ప్రమాదం ముంచుకొస్తుందనే ఆందోళన టీఆర్ఎస్ శ్రేణుల్లో, నాయకుల్లో కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలనాటికి టీఆర్ఎస్తో వామపక్షాల పొత్తుల అంశం ఎటువంటి ప్రభావం చూపిస్తుందన్న టెన్షన్ మాత్రం ఆ రెండు నియోజకవర్గాల గులాబీ నేతల్లో కనిపిస్తోంది. చివరి నిమిషంలో పొత్తుల అంశం టిఆర్ఎస్లో ఎటువంటి అసంతృప్తి రాజేస్తుందో చూడాలి. -
అప్పుడేమో పెళ్లై పిల్లలు పుట్టాక.. ఇప్పుడేమో అప్లికేషన్ పెడ్తేచాలు..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు దరఖాస్తు చేసుకున్న వెంటనే మంజూరవుతోంది. వివాహమైన ఏడాదికో రెండేళ్లకో, పిల్లలు పుట్టాక వచ్చే కల్యాణలక్ష్మి చెక్కులు.. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వెంటనే వాటికి సంబంధించిన చకచకా సాగిపోతోంది. ఉప ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రతిపాదనలు వేగంగా సిద్ధం చేస్తుండగా, ఇప్పుడు సంక్షేమ పథకాల మంజూరును జిల్లా యంత్రాంగం వేగంగా చేపడుతోంది. త్వరలోనే నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. నియోజకవర్గంలో దరఖాస్తుల వివరాలు.. ►ఆగస్టు నెలలో చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల్లో కల్యాణలక్ష్మి పథకం కోసం 268 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అవి మంజూరయ్యాయని చెక్కులు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. ►చౌటుప్పల్ మండలంలో ఈ నెలలో ఇప్పటి వరకు 30 మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటన్నింటి మంజూరు కోసం ఉన్నతాధికారులకు పంపించారు. ►నారాయణపూర్ మండంలో జూలై నెలలో 10 దరఖాస్తులు రాగా, ఆగస్టు నెలలో 78 దరఖాస్తులు, ఈ నెలలో ఇప్పటివరకు 12 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అవి మంజూరయ్యాయని, త్వరలోనే చెక్కుల పంపిణీకి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ►మునుగోడు మండలంలో ఆగస్టు 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 19 దరఖాస్తులు వచ్చాయి. వాటిని ప్రాసెస్ చేసిన రెవెన్యూ అధికారులు.. ఆమోదం కోసం నల్లగొండ ఆర్డీవో కార్యాలయానికి పంపించారు. త్వరలోనే చెక్కులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ►మర్రిగూడ మండలంలో జూలై నెలలో కల్యాణలక్ష్మి కోసం 25 దరఖాస్తులు రాగా, ఆగస్టు నెలలో 27 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెలలో ఇప్పటివరకు 4 దరఖాస్తులు వచ్చాయి. వాటిన్నింటిని ఆమోదం ఆర్డీవో కార్యాలయానికి పంపించారు. ►నాంపల్లి మండలంలో ఆగస్టు నెలలో 36 దరఖాస్తులు రాగా, ఈ నెలలో మరో 2 దరఖాస్తులు వచ్చాయి. వాటిని ఆమోదం కోసం ఆర్డీవో కార్యాలయానికి పంపించారు. ►చండూరు మండలం పరిధిలో జూలైలో 3 దరఖాస్తులు, ఆగస్టులో 16 దరఖాస్తులు రాగా, ఈ నెలలో ఇప్పటి వరకు 3 దరఖాస్తులు వచ్చాయి. వాటిని ఆమోదం కోసం నల్లగొండ ఆర్డీవో కార్యాలయానికి పంపినట్లు అధికారులు చెబుతున్నారు. మండల స్థాయిలో పెండింగ్ లేకుండా.. నియోజకవర్గంలోని రిజర్వాయర్ల నిర్మాణంతో నిర్వాసితులైన వారికి పెండింగ్‌లో ఉన్న పునరావాస ప్యాకేజీని ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. రోడ్ల మరమ్మతులు, విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతోంది. ఇటీవలే దాదాపు 10 వేల కొత్త పెన్షన్లను మంజూరు చేసింది. గొర్రెల పంపిణీకి కసరత్తు చేస్తోంది. చండూరు మండలంలోని గొల్లగూడెం, శేరిగూడెం, మునుగోడు మండలంలోని బీరెల్లిగూడెం, గంగోరిగూడెం, గుండ్లోరిగూడెం, రావిగూడెం గ్రామాలకు రేషన్ దుకాణాలను మంజూరు చేసింది. ఇప్పుడు కల్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపజేసే ప్రక్రియను వేగంగా చేస్తోంది. ఇందుకోసం వచ్చివ దరఖాస్తులను వెంట వెంటనే తహసీల్దార్లు ప్రాసెస్ చేస్తున్నారు. దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా, ఎప్పటికప్పుడు పరిశీలించి ఉన్నతాధికారుల ఆమోదం కోసం పంపిస్తున్నారు. ప్రస్తుతం వాటన్నింటిని మంజూరు చేసే పనిలో జిల్లా యంత్రాంగం ఉంది. -
మునుగోడులో అందర్నీ కలుపుకొనిపోతాం
సాక్షి, నల్లగొండ: మును గోడు ఉపఎన్నికలో చిన్నా పెద్దాఅనే తేడా లేకుండా కార్యకర్తలు, నాయకులను కలుపుకొనిముందుకు పోతామని విద్యుత్ శాఖమంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ పట్టణంలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. తనను మంత్రి జగదీశ్‌రెడ్డి మునుగోడులో సమావేశాలకు పిలవడం లేదంటూ మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా.. మంత్రి పైవిధంగా సమాధానం చెప్పారు. సమాచార లోపాలను సరిచేసుకుంటామని, నర్సయ్యగౌడ్‌ను కూడా కలుపుకొని ముందుకుపోతామని చెప్పారు. చదవండి: మునుగోడు ఉప ఎన్నిక జనవరిలో అయితే బెటర్! -
కేసీఆర్‌కు కౌంటర్.. మునుగోడు ఎన్నికలపై తరుణ్‌చుగ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల వార్ నడుస్తోంది. కాగా, ఉప ఎన్నికల్లో 200 శాతం టీఆర్ఎస్ పార్టీదే విజయమని సీఎం కేసీఆర్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. తాజాగా తరుణ్‌చుగ్ మునుగోడు ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తరుణ్‌చుగ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కారు స్టీరింగ్ ఒవైసీ చేతిలో ఉంది. మునుగోడులో బీజేపీ విజయం ఖాయం. రెండో స్థానం కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంది. రిటైర్మెంట్ కోసమే కేసీఆర్ రాష్ట్రాల పర్యటనలు చేస్తున్నారు అని ఎద్దేవా చేశారు. ఇది కూడా చదవండి: అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం కండి -
20 రోజులు ఓపిక పట్టా.. మునుగోడులో అడుగుపెట్టవ్: రేవంత్‌కు వార్నింగ్
సాక్షి, నల్గొండ : తెలంగాణలో పొలిటికల్ లీడర్ల మధ్య మాటల వార్ నడుస్తోంది. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాటల దాడి చేస్తున్నారు. హస్తం నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగుతున్నారు.ఈ క్రమంలోనే తాజాగా రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పెద్ద బ్లాక్ మెయిలర్. నా జోలికొస్తే నీ చరిత్ర మొత్తం బయట పెడతాను. నీకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో అన్ని తెలుసు. వాటిని బయట పెడితే ముఖం చూపించుకోలేవు. పోయేకాలం వచ్చిందా రేవంత్? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నోరు అదుపులో పెట్టుకోకపోతే మునుగోడులో కూడా అడుగు పెట్టవ్. సమాచార హక్కు చట్టాన్ని అడ్డం పెట్టుకుని వందల కోట్లు వెనకేసుకున్నది నువ్వు కాదా?. హైదరాబాద్‌లో వంద మందిని బ్లాక్ మెయిల్ చేసి ఒక్కొక్కరి దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేశావు. డబ్బులిచ్చి పీసీసీ పదవి తెచ్చుకున్నావు. నీలాంటి మనిషిని పీసీసీ చేయడమా?. నీది నేర, అవినీతి చరిత్ర నీకు పార్టీ జెండా కావాలి. నేను ఇండిపెండెంట్‌గా పోటీచేసినా గెలుస్తాను. మునుగోడుకు వచ్చి అడ్డగోలుగా మాట్లాడుతున్నావు. పోనీలే అని ఇరవై రోజులుగా ఓపికపడుతున్నా. నా మంచితనాన్ని చేతగానితనంగా అనుకోవద్దు. నేను అమ్ముడుపోయినట్లు నీ దగ్గర పత్రాలు ఉంటే మీడియాకు ఇవ్వు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక సోషల్ మీడియాలో పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నావు. నీకు లాస్ట్ వార్నింగ్ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్‌లో గోల్మాల్.. గోవాలో సీక్రెట్‌గా పరీక్షలు! -
గులాబీ నేతలకు కామన్ సెన్స్ లేదు.. టీఆర్ఎస్ మాజీ ఎంపీ హాట్ కామెంట్స్
సాక్షి, నల్గొండ: టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. కొందరు టీఆర్ఎస్ నేతలకు కామన్ సెన్స్ లేదని మండిపడ్డారు. మునుగోడులో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన పదవి ఉన్నా లేకపోయినా ఎప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలపై తనకు సమాచారం ఇవ్వడంలేదన్నారు. బీసీ అనే కాకుండా పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు నర్సయ్య గౌడ్ చెప్పారు. మునుగోడులో బీసీ సామాజిక వర్గం బలంగా ఉందని, ఆ ఈక్వేషన్స్‌తోనే టికెట్ ఆశిస్తున్నట్లు చెప్పారు. బలమైన బీసీ నేతనని తెలిసినా తనను పార్టీ కార్యక్రమాలకు దూరం పెడుతున్నారని ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నికను మంత్రి జగదీశ్వర్ రెడ్డి దగ్గరుండి చూస్తున్నారని, ఎందుకు సమాచారం ఇవ్వడం లేదో ఆయన్నే అడగాలని పేర్కొన్నారు. ఎవరికి టికెట్ వచ్చిన ఈ ప్రాంతం అభివృద్ధి కి తన వంతు కృషి చేస్తాన్నారు.మునుగోడుఎన్నికపై దేశం మొత్తం చర్చ జరగుతోందని, సర్వేలపరంగా టీఆర్ఎసే గెలుస్తుందని చెప్పారు. అభ్యర్థి ఎవరైనా కేసీఆర్ ముఖ చిత్రం మీదే ఈ ఎన్నిక ఉండబోతుందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీలో లాభియింగ్ నడవదని, ముఖ్యమంత్రి నిర్ణయమే తుది నిర్ణయని వెల్లడించారు. 'మునుగోడు పేరులొనే గోడు ఉంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి. మునుగోడును కేసీఆర్ దత్తత తీసుకునే అవకాశం ఉంది.రాష్ట్రంలో కొత్తగా 33 గురుకుల పాఠశాల ఏర్పాటు చేశారు. మునుగోడు కు జూనియర్ కళాశాల లేదు. గురుకుల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసుకోవాలి. మునుగోడు నియోజకవర్గ కేంద్రం అయినప్పటికీ అభివృద్ధిలో వెనుకంజలో ఉంది. నాకు పదవులు ముఖ్యం కాదు. టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతాం. ఎవరు చెప్పిన చెప్పకున్నా ముఖ్యమంత్రి దిశానిర్దేశంతోనే పని చేస్తా' అని బూర నర్సయ్య గౌడ్ అన్నారు. చదవండి: ఆ అవకాశం ఎవరికో? పోటీలో రఘునందన్ రావు, ఈటల -
Munugodu: కసరత్తు పెంచిన టీఆర్ఎస్.. 88 మంది ఎమ్మెల్యేలు ఇక్కడే
సాక్షి, నల్లగొండ : మునుగోడులో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ భారీ వ్యూహం అనుసరించబోతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 88 ఎమ్మెల్యేలకు మునుగోడులో బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమవుతోంది. హైదరాబాద్‌లో శనివారం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో మునుగోడు నియోజకవర్గంలోని 176 గ్రామాల్లో రెండు ఊర్లకు ఒకరు చొప్పున 88 మంది ఎమ్మెల్యేలను రంగంలోకి దించాలని నిర్ణయించింది. గ్రామాల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమించి ఆ జాబితాను జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డికి త్వరలోనే అందజేస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గానికి వెళ్లే ప్రతి ఎమ్మెల్యే తన వెంట 15 మంది కరడుకట్టిన పార్టీ కార్యకర్తలను వెంటబెట్టుకొని గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ నేతలతో మమేకమై పనిచేసేలా కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. సెప్టెంబరు 17న జాతీయ సమైక్యతా దినం నిర్వహణతోపాటు వజ్రోత్సవ కార్యక్రమాల తర్వాత వారంతా పూర్తిస్థాయిలో మకాం వేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు నిర్వహించిన అన్ని సర్వేల్లోనూ తమకే పరిస్థితి అనుకూలంగా ఉందని పేర్కొన్న సీఎం.. ఎట్టి పరిస్థితుల్లోనూ మునుగోడులో గెలిచి తీరాలని స్పష్టం చేసినట్లు సమాచారం. ఉప ఎన్నిక నేపథ్యంలో... రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునే వారు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల మందికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడటంతో నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి కొంత మేలు జరుగుతుందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మునుగోడు నియోజకవర్గంలోనూ 3 వేల మందికి ప్రయోజనం కలుగనుంది. మరోవైపు ప్రతి నియోజకవర్గంలో దళితబందు 100 కుటుంబాలకు ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం మరో 500 కుటుంబాలకు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో మునుగోడులో 600 దళిత కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. పోడు భూములపైనా కదలిక వచ్చింది. ప్రతి జిల్లాలో మంత్రుల నేతృత్వంలో సమన్వయ సమావేశాలను నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. దీంతో మునుగోడు నియోజకవర్గంలోని నారాయణపూర్ మండలంలో పోడు భూముల రైతులకు ప్రయోజనం చేకూరుతుందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
మునుగోడు మనదే.. ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ ధైర్యం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రగతి భవన్లో జరిగిన టీర్‌ఎస్‌ఎస్పీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో భాగంగా సీఎం కేసీఆర్.. ఎమ్మెల్యేలు, ఎంపీలకు, నేతలకు కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా కేసీఆర్.. ఎన్నికల విషయంలో సర్వేలు అన్ని టీఆర్ఎస్కే అనుకూలంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో 96 సీట్లు పక్కా వస్తాయి. ఎమ్మెల్యేలంతా ధైర్యంగా పనిచేసుకోండి. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్దే గెలుపు. 200 శాతం టీఆర్ఎస్దే గెలుపు. ఎమ్మెల్యేలను ఇంచార్జ్‌లుగా పంపిస్తా. మునుగోడులో రెండు గ్రామాలకు ఒక ఎమ్మెల్యే ఇంచార్జ్‌గా ఉంటారు. మునుగోడులో కాంగ్రెస్, బీజేపీలు గెలిచే అవకాశమే లేదు. మునుగోడులో రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంది. బీజేపీ మత పిచ్చి రాజకీయాలు చేస్తోంది. దాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి. బీజేపీ బెదిరింపులను పట్టించుకోవద్దు. బీజేపీ మత పిచ్చి రాజకీయాలు చేస్తోంది. దాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి. ఇతర రాష్ట్రాల్లో చేసినట్టు ఇక్కడ కుదరదు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు భయపడేది లేదు. వాళ్లు అవకాశమిచ్చే ఏ పనులు చేయవద్దు. శివసేన, ఆర్జేడీ, ఆప్‌ను ఇప్పటికే దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేశాయి అని తెలిపారు. -
మోసాలను మర్చిపోవద్దు... మోసగాళ్లను విడిచిపెట్టొద్దు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా ఇంటింటి ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ ‘చార్జిషీట్’ వేసింది. రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్, కేంద్రంలోని అధికార బీజేపీ వైఫల్యాలతోపాటు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఎండగడుతూ 2 పేజీల కరపత్రాన్ని రూపొందించింది. మునుగోడులో పరిష్కారంకాని సమ స్యలు, రాష్ట్రంలో టీఆర్ఎస్ హామీల వైఫల్యం, బీజేపీ, రాజగోపాల్‌రెడ్డి చేసిన మోసాలంటూ అనేక అంశాలను ప్రస్తావించింది. ఈ కరపత్రంలో రాజ గోపాల్‌రెడ్డితోపాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్, జగదీశ్ రెడ్డి ఫొటోలను కూడా ప్రచురించింది. మన మును గోడు–మన కాంగ్రెస్ పేరుతో ‘ఈ మోసాలను మర్చిపోవద్దు... ఈ మోసగాళ్లను విడిచి పెట్టొద్దు’ అంటూ ముద్రించింది. కేంద్రంలో, రాష్ట్రంలో కుమ్మ క్కయి ఒకరినొకరు కాపాడుకుంటున్న కేసీఆర్, మోదీ మోసాల్లో మచ్చుకు కొన్ని అంటూ కరపత్రంలో కాంగ్రెస్ పేర్కొన్న అంశాలివే... స్థానిక సమస్యలు ► అసంపూర్తిగా డిండి, చర్లగూడెం, కిష్టరాయిని పల్లి, బ్రాహ్మణవెల్లెంల, రాచకొండ ఎత్తిపోతలు ► ప్రాజెక్టుల పేరుతో గుంజుకున్న భూములకు పరిహారం ఇవ్వని కేసీఆర్ ► చౌటుప్పల్‌లో డిగ్రీ కాలేజీ, మినీ ట్యాంక్‌బండ్, మునుగోడులో జూనియర్ కాలేజీ ఏర్పాటు ► నారాయణపురంలో పోడు భూములకు పట్టాలు ► నియోజకవర్గంలోని పేదలు, విలేకరులకు డబుల్ బెడ్రూం ఇళ్లు.. చండూరు–నాంపల్లి రోడ్‌ను డబుల్‌రోడ్డుగా మార్చే హామీ ► ఫ్లోరోసిస్ బాధితులకు పింఛన్ రాష్ట్ర స్థాయి సమస్యలు ► దళిత సీఎం, దళితులకు మూడెకరాల భూమి, దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ► ప్రతి రైతు కుటుంబంపై రూ.1.52 లక్షల అప్పు భారం.. 8వేల మందికిపైగా రైతుల ఆత్మహత్య ► అమ్మహస్తం రద్దు, రేషన్ బియ్యంతో సరిపెడు తున్న కేసీఆర్.. విద్యుత్, బస్సు చార్జీల పెంపు రాజగోపాల్‌రెడ్డి మోసాలు... ► బీజేపీతో రూ. 22 వేల కోట్ల మైనింగ్ డీల్ కుదు ర్చుకొని నియోజకవర్గ ప్రజలకు వంచన ► టీఆర్ఎస్తో దోస్తీ చేసి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కాంట్రాక్టులు తెచ్చుకున్న స్వార్థపరుడు ► పింఛన్ రాని వాళ్లకు సుశీల ఫౌండేషన్ నుంచి పింఛన్ ఇస్తానన్న హామీ అమల్లో విఫలం ► ప్రతి మండలంలో సొంత డబ్బుతో పాఠశాల, కళాశాల ఏర్పాటు హామీ బుట్టదాఖలు ► నియోజకవర్గంలోని 10 వేల మంది యువతకు ఉపాధి అంటూ మోసం.. చర్లగూడెం రిజర్వా యర్ ముంపు బాధితులకు గెలిచిన 100 రోజుల్లో పరిహారం ఇప్పించకపోతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధమన్న ప్రకటన మోసమే ► గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు ఉన్నత చదువులు పూర్తి చేయిస్తానన్న హామీ కంచికి. బీజేపీ మోసాలు.. ► చేనేత కార్మికులపై 5 శాతం జీఎస్టీ బండ ► ఫ్లోరోసిస్ నివారణ కోసం చౌటుప్పల్‌లో కాంగ్రెస్ మంజూరు చేసిన రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయకపోవడం ► పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, డిండి ప్రాజెక్టుకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడంలో వైఫల్యం ► లీటర్ పెట్రోల్ రూ. 71.41 నుంచి రూ.109కి, డీజిల్ రూ. 55.49 నుంచి రూ. 97.82కు, వంట గ్యాస్ సిలిండర్ రూ.410 నుంచి రూ.1,055కి పెంపు ► పన్నులతో సామాన్యుడిపై భారం మో పి కార్పొరేట్లకు రూ.10 లక్షల కోట్ల రుణమాఫీ ► ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా ఎత్తేసే యత్నం. 16 కోట్ల ఉద్యోగాలకుగాను 7 లక్షల ఉద్యోగా లిచ్చి నిరుద్యోగులను మోసం చేయడం ► గిరిజన వర్సిటీ, ఐఐఐటీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బీబీ నగర్ ఎయిమ్స్ లాంటి విభజన హామీల అమల్లో విఫలం చదవండి: మునుగోడు వరకే టీఆర్ఎస్కు మద్దతు -
మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై క్లారిటీ వచ్చేసిందా..? ప్రకటన అప్పుడేనా?
సాక్షి, హైదరాబాద్/నల్గొండ: మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక సాఫీగా జరుగుతుందా? టిక్కెట్ రాని ఆశావహుల్ని దారికి తెచ్చుకోగలుగుతారా? గాంధీభవన్‌లో ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. అభ్యర్థి ఎంపికపై అనేకసార్లు మీటింగులు జరుగుతున్నాయి. నలుగురు ఆశావహులతో కూడా భేటీలు నిర్వహించారు. అభ్యర్థి ఎంపికపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఇక పీసీసీ స్థాయిలో తేలదని తేలిపోయింది. ఎంపిక బాధ్యతను హైకమాండ్ మీదికి నెట్టేసి కూల్ అయిపోయారు టీ కాంగ్రెస్ నాయకులు.. చదవండి: మునుగోడులో బీజేపీకి బూస్ట్ ఎప్పుడు ప్రకటిస్తారు? మునుగోడు ఉప ఎన్నికపై అందరికంటే ముందే స్పందించింది కాంగ్రెస్ పార్టీ.. ఉప ఎన్నికకు సిద్ధం అవుతున్నామంటూ రేవంత్ రెడ్డి ఇతర పార్టీల నేతలకంటే ముందే ప్రకటించారు.. ఆ తర్వాత మునుగోడు నియోజకవర్గ పార్టీ మీటింగ్ నిర్వహించి ఎన్నికకు శంఖారావం కూడా పూరించారు. అభ్యర్థిని కూడా ఈ నెలాఖరుకు ప్రకటిస్తామని టీపీసీసీ తెలిపింది. నెలాఖరు అయిపోయింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇండియాలోనే లేరు. చికిత్స కోసం మొత్తం కుటుంబం అంతా విదేశాలకు వెళ్ళింది. ఇంతకీ అభ్యర్థిని ఎప్పుడు ప్రకటిస్తారు? ఎటూ తేల్చుకోలేక.. మునుగోడు అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఇప్పటికే పదుల సార్లు గాంధీభవన్‌లో సమీక్షలు నిర్వహించింది హస్తం పార్టీ. మరో వైపు నేతలందరి అభిప్రాయమూ సేకరించారు. ఇంకో వైపు సునీల్ కనుగోలు సర్వే రిపోర్ట్ ఇచ్చినా అభ్యర్థిని తేల్చే విషయంలో కాంగ్రెస్ తర్జనభర్జనలు పడుతోంది. అభ్యర్థిని ప్రకటించకపోవడం వల్ల మునుగోడులో పార్టీ క్యాడర్ చే జారిపోతుందనే ఆందోళన అక్కడి పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ఓ వైపు బీజేపీ, మరోవైపు టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌కు దిగుతున్నాయి. దీంతో కాంగ్రెస్ క్యాడర్ అంతా చెల్లా చెదురు అవుతోంది. అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఆశావాహ నేతలంతా తమకేమీ పట్టనట్లుగా ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో మునుగోడులో కాంగ్రెస్ క్యాడర్ ఖాళీ అవుతుందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికిప్పుడు ప్రకటించినా.. మరోవైపు వ్యూహాత్మకంగానే అభ్యర్థిని ప్రకటించడం లేదనే చర్చ కాంగ్రెస్‌లో నడుస్తోంది. టిక్కెట్ రాని నేతల్ని చేర్చుకునేందుకు టీఆర్ఎస్, బీజేపీ రెడీగా ఉన్నాయి. దీంతో ఎన్నికల షెడ్యూల్ రాకముందే అభ్యర్థిని ప్రకటిస్తే అసంతృప్తి చాలా కాలం కొనసాగి పరిస్థితి చేజారి పోయే ప్రమాదం ఉందని, అందుకే టీఆర్ఎస్ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించిన తర్వాతే కాంగ్రెస్ అభ్యర్ధిని ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ప్రకటించినా.. కొద్ది రోజుల తర్వాత ప్రకటించినా పెద్ద తేడా ఏమీ ఉండదని, కేంద్రం, రాష్ట్రంలోని రెండు అధికార పార్టీలు నయానో, భయానో తమ నేతల్ని, కార్యకర్తల్ని లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆశావాహుల్లో టెన్షన్.. ఇప్పటికే టిక్కెట్ ఆశిస్తున్న నలుగురు ఆశావహ నేతలతో గాంధీభవన్‌లో సమావేశం నిర్వహించారు. తమ అభిప్రాయాలను సీల్డ్ కవర్లో ఢిల్లీకి పంపించారు టీపీసీసీ నేతలు. మంగళవారం నాడు గాంధీ భవన్లో పార్టీ ముఖ్యనేతలు, మునుగోడు మండల ఇంఛార్జ్‌లతో కూడా సమావేశం నిర్వహించారు. అభ్యర్థిని ప్రకటించే బాధ్యత హైకమాండ్‌దే అంటున్నారు టీపీసీసీ మాజీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి. అయితే ఆశావాహుల్లో మాత్రం టెన్షన్ కొనసాగుతోంది. వీలైనంత తొందరగా అభ్యర్థిని ప్రకటించి క్యాడర్‌ను కాపాడుకోవాలని కోరుతున్నారు. -
Munugode: మునుగోడులో బీజేపీకి బూస్ట్
Munugode Politics.. సాక్షి, యాద్రాద్రి భువనగిరి: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. అన్ని రాజకీయ పార్టీలు మునుగోడుపైనే ఫోకస్ పెట్టాయి. అధికార టీఆర్ఎస్ మునుగోడు ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో గులాబీ నేతలు ప్లాన్స్ రచిస్తున్నారు. మరోవైపు.. బీజేపీ సైతం మునుగోడులో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. బీజేపీ గెలుపు కోసం ప్రణాళికలు వేస్తున్నారు. ఇందులో భాగంగానే బీజేపీలోకి చేరికలపై దృష్టిసారించారు. కాగా, బుధవారం చౌటుప్పల్ మండలం, తుఫ్రాన్‌పేట్‌లో కార్యకర్తలు.. రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం, రాజగోపాల్ రెడ్డి.. గణేషుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ..‘నా రాజీనామా తర్వాత ప్రభుత్వం దిగి వచ్చి అందిస్తున్న సేవలను చూసి మునుగోడు నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉన్నారు. సీఎం కేసీఆర్ బూటకపు మాటలపైన ప్రజలకు నమ్మకం పోయింది. నా పదవి త్యాగంతో ప్రజలు నా వైపు ఉన్నారు. ప్రజలు డబుల్ ఇంజన్ సర్కారు వైపు మొగ్గుచూపుతున్నారు. మునుగోడు ప్రజల తీర్పు చరిత్ర సృష్టిస్తుంది. మునుగోడులో ఓటమి భయంతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్దమయ్యే అవకాశం ఉంది’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: ముగ్గురు మినహా మంత్రులంతా జీరోలే -
మునుగోడు ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లాలని, వినాయక చవితి తర్వాతి రోజు నుంచే టీఆర్ఎస్, బీజేపీలకు దీటుగా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి 90 రోజుల కార్యాచరణను ఆ పార్టీ చేపట్టింది. మంగళవారం మధ్యాహ్నం గాంధీ భవన్ నుంచి నిర్వహించిన జూమ్ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజులు పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని ఏడు మండలాలకు ఇన్చార్జులుగా నియమితులైన నేతలు, టికెట్ ఆశావహులు, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఉప ఎన్నికలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఇన్చార్జిలు నియోజకవర్గంలోనే ఉండాలి మండలాల ఇన్చార్జిలుగా నియమితులైన నేతలందరూ సెప్టెంబర్ 1 నుంచి ఉప ఎన్నిక ముగిసేంతవరకు నియోజకవర్గంలోనే మకాం వేయాలని రేవంత్, ఉత్తమ్ సూచించారు. స్థానికంగా ఉన్న పార్టీ కేడర్‌ను కాపాడుకోవడంతో పాటు టీఆర్ఎస్, బీజేపీలు ఎలా కుమ్మక్కై ఉప ఎన్నికను తీసుకువచ్చా యో, ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయ డంలో ఆ రెండు పార్టీలు ఎలా విఫలమయ్యాయో ఓటర్లకు వివరించాలని చెప్పారు. మండలాల ఇన్‌చార్జిలే రోజుకో గ్రామం చొప్పున బాధ్యత తీసుకుని ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సెపె్టంబర్ మొదటి వారంలోనే టీపీసీసీ ఆధ్వర్యంలో మండల స్థాయిలో కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఓటర్లారా .. ఆలోచించండి టీపీసీసీ రూపొందించిన 90 రోజుల కార్యాచరణలో భాగంగా.. ఓటు ఎవరికి వేయాలో ఆలోచించాల్సిందిగా ఓటర్లను కరపత్రాల రూపంలో కాంగ్రెస్ నేతలు అభ్యర్థించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి లాంటి హామీలు.. కేంద్రం ఇచ్చిన ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, ప్రతి పౌరుడి ఖాతాలో రూ.15 లక్షల జమ లాంటి అంశాలను కరపత్రంలో పొందుపరిచారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ఓటర్లను నేరుగా కలిసి అభ్యరి్థంచే బాధ్యతను మండల ఇన్‌చార్జిలే తీసుకోవాలని సమావేశంలో సూచించారు. తామే అభ్యర్థి అనే రీతిలో బాధ్యతలు తీసుకోవాలని స్పష్టం చేశారు. చదవండి: ఇక్కడ రాజకీయాలు కూడా అంతే రిచ్‌గా..! -
మునుగోడులో దూసుకుపోతున్న బీజేపీ, టీఆర్ఎస్.. మరి కాంగ్రెస్?
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక దాదాపు ఖరారైన నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీలు దూసుకుపోతుండగా, తాము వెనుకబడ్డామనే భావన కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మిగతా రెండు పార్టీలు నియోజకవర్గం, మండల స్థాయిల నుంచి గ్రామ స్థాయి వరకు వెళుతుండగా, కాంగ్రెస్ నేతలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నారనే చర్చ నియోజకవర్గ స్థాయిలో కూడా జరుగుతోంది. టీఆర్ఎస్, బీజేపీలు తమ బలాలను ఇప్పటినుంచే పూర్తిస్థాయిలో వినియోగించుకునే పనిలో నిమగ్నమై ఉండగా, కాంగ్రెస్ పార్టీ నేతలు నియోజకవర్గంలోని గ్రామాల వైపు కన్నెత్తి చూడడం లేదు. ఇందుకు అభ్యర్థి ఖరారు కాకపోవడంతో పాటు టికెట్ ఎక్కువ మంది ఆశిస్తుండడం, ఇప్పుడే ఎందుకులే అనే భావన, రాష్ట్ర స్థాయి నుంచి సరైన పర్యవేక్షణ, సమన్వయం లేకపోవడం కారణమనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. వేధిస్తున్న వలసలు మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల నడుమే పోరు సాగనుంది. ఇది కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడంతో పాటు ఆ పార్టీకి కేడర్ కూడా బాగానే ఉంది. కానీ ఇతర పార్టీలు దూకుడుగా వెళుతున్న నేపథ్యంలో ఉన్న కేడర్ నిస్తేజంలో మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇదే అదనుగా టీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు గాలం వేసి తమ శిబిరాల్లో చేర్చుకుంటున్నాయి. కాంగ్రెస్ వార్డు సభ్యుల నుంచి మండల పార్టీ అధ్యక్షులు, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, మున్సిపల్ పరిధిలోని నాయకులు టీఆర్ఎస్, బీజేపీల్లో ఏదో ఒక పార్టీలో చేరిపోతున్నారు. ఆలస్యం చేస్తే ప్రయోజనం ఉండదనే భావన స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల్లో కనిపిస్తుండడంతో ప్రతిరోజూ వలసల పర్వం కొనసాగుతోంది. దూసుకుపోతున్న కారు టీఆర్ఎస్ పక్షాన జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తూ పార్టీని ముందుకు తీసుకెళుతున్నారు. ఇప్పటికే పార్టీ సింబల్, కేసీఆర్ బొమ్మలున్న గోడ గడియారాలు, గొడుగులు నియోజకవర్గానికి చేరిపోయాయి. వీలున్నంత మేరకు ఇతర పార్టీల నేతలను చేర్చుకున్న ఆ పార్టీ.. ఇప్పుడు గ్రామాల అభివృద్ధి నిధుల ఖర్చుపై దృష్టి పెట్టింది. గ్రామానికి రూ.20 లక్షల చొప్పున నిధులు రానున్న నేపథ్యంలో గ్రామపంచాయతీల చేత తీర్మానాలు చేయించి ప్రతిపాదనలు కూడా పంపించారు. 2, 3 రోజుల్లో నిధులు వస్తాయని, పనులు కూడా ప్రారంభం అవుతాయనే చర్చ జరుగుతోంది. చదవండి: (మరింత కష్టపడాలి.. బీజేపీ నేతలతో జేపీ నడ్డా) రోజుకో గ్రామానికి రాజగోపాల్ బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా తనదైన శైలిలో నియోజకవర్గాన్ని చుట్టుముడుతున్నారు. పాత కాంగ్రెస్ కేడర్‌తో పాటు తనకున్న వ్యక్తిగత చరిష్మాను ఉపయోగించుకుంటూ.. పార్టీలో చేర్చుకున్న నేతలతో కలిసి రోజుకో గ్రామానికి వెళుతున్నారు. మరోవైపు బీజేపీ, టీఆర్ఎస్ ఇప్పటికే నియోజకవర్గంలో బహిరంగసభలు కూడా నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు గ్రామాలు, మండలాల్లో ఉత్తేజంగా తిరుగుతుండగా, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల్లో చురుకుదనం లోపించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయికి చేరని కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితిలో వీలైనంత త్వరగా మార్పు వస్తేనే ఫలితం దక్కే అవకాశం ఉంటుందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఈనెల 20న రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా నియోజకవర్గంలో హడావుడి చేసిన కాంగ్రెస్ నేతలు.. ఆ తర్వాత క్షేత్రస్థాయిలోకి వెళ్లలేకపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది తేలితే కానీ ప్రచారం ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు. ఇక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న పాల్వాయి స్రవంతి, పల్లె రవికుమార్, పున్నా కైలాశ్‌నేత, చల్లమల్ల కృష్ణారెడ్డిల్లో ఎవరూ పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. ఇప్పటినుంచే గ్రామాలకు వెళ్లి అంతా రెడీ చేసుకున్న తర్వాత టికెట్ రాకపోతే ఇబ్బంది అవుతుందనే భావనలో ఉన్న ఆశావహులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో వీలున్నంత త్వరగా అభ్యర్థి ఖరారు చేసే యోచనలో టీపీసీసీ నాయకత్వం ఉంది. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో కసరత్తు పూర్తి కాగా, ఆశావహుల జాబితా ఢిల్లీకి చేరింది. వినాయకచవితి తర్వాత ఏఐసీసీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. చదవండి: (‘మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ప్రభుత్వం పడిపోతుంది’) -
‘మునుగోడు’పై కసరత్తు ముమ్మరం చేసిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: మునుగోడులో ఉప ఎన్నిక ఖాయమని ముందుగానే అంచనాకు వచ్చిన టీఆర్ఎస్.. ఇతర పార్టీల కంటే ముందే క్షేత్రస్థాయి కార్యాచరణ మొదలుపెట్టింది. ఇందుకోసం ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు ఇతర జిల్లాల ఎమ్మెల్యేలనూ రంగంలోకి దింపుతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు కార్యాచరణ రూపొందించారు. ఒక్కో మండలానికి ఒక్కో ఎమ్మెల్యేను ఇన్చార్జిగా నియమించాలని.. గ్రామాలను కీలక నేతలకు అప్పగించాలని నిర్ణయించారు. ఇన్చార్జులుగా నియమితులయ్యే వారు.. తమకు అప్పగించిన చోటే ఉండి ప్రచారాన్ని, పనులను పర్యవేక్షించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఎవరెవరికి ఏయే మండలం, గ్రామం బాధ్యతలు అప్పగించేదీ త్వరలో ఖరారు చేయనున్నారు. తర్వాత వారం పది రోజుల్లో సదరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు ఆయా మండలాలు, గ్రామాలకు వెళ్లి పార్టీ కేడర్‌తో మమేకమై పనిచేయనున్నారు. సభ నాటి నుంచే.. ఈనెల 20న మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభతోనే పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నం చేశారు. హైదరాబాద్ నుంచి వేల వాహనాలతో మునుగోడు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు సభ బాధ్యతలు అప్పగించారు. తర్వాత మునుగోడులో టీఆర్ఎస్ కార్యకలాపాల్లో కొంత స్తబ్ధత నెలకొన్నా.. మంత్రి జగదీశ్‌రెడ్డి మునుగోడులో పర్యటిస్తూ ఇతర పార్టీల నుంచి నేతల చేరికలపై దృష్టిపెట్టారు. ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన కొందరు సర్పంచులు, ఎంపీటీసీలు, క్రియాశీల నేతలు మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ముఖ్యంగా ప్రజాదరణ ఉన్నవారిని చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చదవండి: Congress Party: కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ అసంతృప్త నేతలు దారికి.. మునుగోడులో టీఆర్ఎస్ అసంతృప్త కార్యకర్తలు, స్థానిక నేతలు మెల్లగా పార్టీలైన్లోకి వస్తున్నారు. చౌటుప్పల్ ఎంపీపీ వెంకట్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బుచ్చిరెడ్డి బీజేపీలో చేరగా.. ఇతర మండలాల నేతలు మాత్రం టీఆర్ఎస్లోనే కొనసాగుతామని ప్రకటించారు. 20న జరిగిన కేసీఆర్ సభ జన సమీకరణలోనూ వారు క్రియాశీలకంగా పనిచేశారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిగా పలువురి పేర్లు తెరపైకి వస్తున్నా.. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి అనుకూల పరిస్థితులు ఉన్నట్టు ఆ పార్టీవర్గాలు చెప్తున్నాయి. అయితే ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డాకే పార్టీ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. దసరాలోగా ఎన్నికల షెడ్యూల్ రావొచ్చని స్థానిక నేతలకు పార్టీ పెద్దల నుంచి సంకేతాలు అందినట్టు తెలిసింది. షెడ్యూల్ విడుదల కాగానే చండూరులో టీఆర్ఎస్ బహిరంగ సభ ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అందరికీ బాధ్యతలు పార్టీపరంగా మునుగోడు ఉప ఎన్నిక సన్నద్ధతను స్వయంగా పర్యవేక్షిస్తున్న సీఎం కేసీఆర్.. పెద్ద సంఖ్యలో మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలను నియోజకవర్గంలో మోహరించడంపై దృష్టి సారించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకూ మండలాలు, గ్రామాల వారీగా బాధ్యతలు అప్పగించనున్నారు. ఆయా మండలాలు, గ్రామాల్లో సామాజికవర్గాల వారీగా ఓట్ల లెక్కలను, స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని.. అందుకు తగినవారిని ఇన్చార్జులుగా నియమించనున్నారు. చదవండి: Telangana Politics: బీజేపీ ప్రచారానికి నితిన్, మిథాలి -
Munugodu Politics: మునుగోడు బరిలోకి వైఎస్సార్టీపీ!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల్లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ(వైఎస్సార్టీపీ) కూడా పోటీ చేయనుంది. ఈ ఎన్నికల్లో పోటీ ద్వారా ఉనికి చాటుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే రంగం సిద్ధం చేసిన ఆ పార్టీ.. బరిలో బీసీ అభ్యర్థిని దించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తమ అభ్యర్థిని పోటీలోకి దించాలని పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిర్ణయించారు. ఇదిలా ఉండగా.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు, పార్టీల బలాబలాలపై కూడా సర్వే చేయించారు. ఈ సర్వే నివేదికలు ఎలా ఉన్నప్పటికి ఉప ఎన్నికలో పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు పార్టీవర్గాలు తెలిపాయి. ప్రధాన పార్టీల ఎత్తుగడలను దీటుగా ఎదుర్కోవాలని భావిస్తున్న వైఎస్సార్టీపీ.. మునుగోడులో బీసీ అభ్యర్థి ప్రతిపాదనను తెరమీదకు తెచ్చింది. తద్వారా మూడు పార్టీలకు గట్టి పోటీ ఇవ్వవచ్చని అంచనా వేస్తోంది. ఈ మేరకు బలమైన అభ్యర్థి గురించి అన్వేషిస్తోంది. అభ్యర్థిని ఖరారు చేసేందుకు అంతర్గతంగా కమిటీ కూడా వేసింది. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన అభ్యర్థిని చేరదీయడం ద్వారా.. సులువుగా ప్రజల్లోకి వెళ్లవచ్చని ఆలోచన చేస్తోంది. చదవండి: (కాంగ్రెస్‌లో సీనియర్లు, పెద్దలు అంతా అక్కడే.. భీకర పోరు తప్పదా?) -
కాంగ్రెస్‌లో సీనియర్లు, పెద్దలు అంతా అక్కడే.. భీకర పోరు తప్పదా?
జిల్లాల విభజన తర్వాత నల్గొండలోకి ఆరు సెగ్మెంట్లు చేరాయి. కాంగ్రెస్‌లో సీనియర్లు, పెద్దలు అంతా ఈ జిల్లాలోనే ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ గెలుచుకున్న మూడింట్లో రెండు ఇందులోనే ఉన్నాయి. నకిరేకల్ ఎమ్మెల్యే కారెక్కగా, మునుగోడులో రాజగోపాలరెడ్డి కాషాయ కండువా కప్పుకున్నారు. ఇక ఉప ఎన్నికల్లో, ఆ తర్వాత వచ్చే సాధారణ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య పోరు భీకరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో పెద్ద తలకాయలుగా భావించే కుందూరు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాకు చెందినవారే. జిల్లా కేంద్ర నియోజకవర్గం నల్లగొండ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. మాజీ మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి నాలుగుసార్లు గెలిచారు. కానీ గత ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. నల్లగొండ నుంచి మరోసారి అసెంబ్లీకి పోటీ చేస్తానని కొమటిరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మరోసారి గెలిచేందుకు కంచర్ల ప్రణాళికలు రచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా గెలిస్తే తన రాజకీయ భవిష్యత్తుకు తిరుగుండదని కంచర్ల భావిస్తున్నారు. గులాబీ పార్టీలో చాలా మంది నల్గొండ సీటు ఆశిస్తున్నా కంచర్లకు మాత్రమే మంత్రి జగదీష్‌రెడ్డి అండ దండలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే గత అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగో స్థానంలో నిలిచిన పార్టీ ఈసారి గట్టి పోటీ ఇవ్వాలని తహతహలాడుతోంది. ఆ పార్టీ నుంచి కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డితో పాటు మాదగోని శ్రీనివాస్ గౌడ్ టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఈ ఇద్దరిని కాదని బలమైన ఆర్థిక పునాదులు ఉన్న ఓ వలస నేతను కూడా పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆ వలస నేతతో రాష్ట్ర నేతలు చర్చలు జరిపారని తెలుస్తోంది. మునుగోడు అసెంబ్లీ స్థానం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్‌సీట్‌గా మారింది. కాంగ్రెస్‌లో ఫైర్ బ్రాండ్ లీడర్ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఉప ఎన్నికకు తెర తీసారు. ఇప్పటికే కాషాయ కండువా కప్పుకుని కయ్యానికి సిద్ధమయ్యారు రాజగోపాల్‌రెడ్డి. ఇప్పటికి రెండు ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీకి చుక్కలు చూపించింది కాషాయ సేన. ఇప్పుడు మునుగోడులో కూడా కాషాయ జెండా ఎగరేస్తామంటున్నారు ఆ పార్టీ నాయకులు. సిట్టింగ్‌సీటును కాపాడుకోవడానికి కాంగ్రెస్, హుజురాబాద్అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీఆర్ఎస్అప్పుడే వ్యూహాలు పన్నుతున్నాయి. తన సీటు తాను గెలుచుకుని బీజేపీకి బహుమతిగా ఇవ్వాలని రాజగోపాల్‌రెడ్డి పట్టుదలతో ఉన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ల నుంచి ఎవరి బరిలోకి దిగుతారన్నదే ప్రశ్నార్థకంగా మారింది. టీఆర్ఎస్లో మునుగోడు టిక్కెట్ ఆశిస్తున్న వారి సంఖ్య అరడజను దాటింది. ఇప్పుడు ఇదే ఆ పార్టీని కలవరపెడుతోంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నారబోయిన రవి, కంచర్ల కృష్ణారెడ్డి, కర్నె ప్రభాకర్, కర్నాటి విద్యాసాగర్ కొత్తగా తెరపైకి వచ్చారు. వీరిలో కూసుకుంట్ల, గుత్తా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇద్దరిలో ఒకరికి టికెట్ వచ్చే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. మంత్రి జగదీష్‌రెడ్డి మాత్రం కూసుకుంట్ల వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కానీ ఆయనకు టిక్కెట్‌ఇస్తే తాము సహకరించబోమని 12 మంది నేతలు మంత్రి కేటీఆర్‌కి రాసిన లేఖ ఇప్పుడు గులాబీ పార్టీ నాయకత్వాన్ని కలవర పెడుతోంది. జిల్లాలో మిగిలిన ఏకైక స్థానంలో కాంగ్రెస్దాదాపు ఖాళీ అయింది. అందుకే ఇక్కడ పరువు నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. కాని రాష్ట్ర ముఖ్యనేతలు అనుసరిస్తున్న తీరుతో కాంగ్రెస్పరువు మిగిలేలా కనిపించడంలేదు. అనుచర వర్గం ఉన్న పాల్వాయి స్రవంతిని కాదని, చల్లమల్ల కృష్ణారెడ్డి అనే వ్యాపారిని రేవంత్‌రెడ్డి తెరపైకి తీసుకొచ్చారు. తాజాగా చెరుకు సుధాకర్పేరు కూడా వినిపిస్తోంది. ఇప్పుడు అదే కాంగ్రెస్‌లో గందరగోళానికి తెరలేపింది. టికెట్ తనకే అన్న ధీమాతో స్రవంతి వారం క్రితం జరిగిన సభకు కూడా భారీగా జనసమీకరణ చేశారు. టిక్కెట్రాకపోతే పాల్వాయి స్రవంతి ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేద్దామనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నకిరేకల్ టీఆర్ఎస్లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన చిరుమర్తి టీఆర్ఎస్లో చేరడంతో, ఓటమి బాధతో ఉన్న వీరేశం వర్గానికి ఈ వ్యవహారం మింగుడు పడటంలేదు. దీంతో రెండువర్గాల వైరం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరుకుంది. ఈసారి తమకే టిక్కెట్వస్తుందని రెండు వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇద్దరిలో ఒక్కరికే టిక్కెట్వస్తుంది గనుక..భంగపడ్డ నేత కచ్చితంగా పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. చిరుమర్తి లింగయ్య కారు పార్టీలో చేరడంతో కాంగ్రెస్క్యాడర్ను కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడటంతో... అన్న వెంకటరెడ్డి పరిస్తితి కూడా డైలమాలో పడినట్లయింది. ఎన్నికల నాటికి కాంగ్రెస్‌లో ఎవరుంటారో, ఎవరు ఫిరాయిస్తారో అన్న విషయం గందరగోళంగా మారింది. ఇక బీజేపీకి కొంతవరకు క్యాడర్ ఉన్నా సరైన లీడర్లేకపోవడంతో అయోమయంగా తయారైంది. దీంతో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామిని ఇక్కడ నుంచి బరిలో దింపాలని కమలం పార్టీ ప్లాన్చేస్తున్నట్లు తెలుస్తోంది. మిర్యాలగూడలో సీపీఎం, కాంగ్రెస్ దెబ్బతిని ప్రస్తుతం గులాబీ పార్టీ జెండా ఎగురుతోంది. అయితే కాంగ్రెస్కేడర్మాత్రం బలంగానే ఉంది. సిటింగ్‌ఎమ్మెల్యే ఉన్న అధికార పార్టీలో బయటపడిన వర్గపోరు ప్రకంపనలు సృష్టిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే భాస్కరరావు, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ మధ్య వర్గపోరు తీవ్రస్థాయికి చేరింది. తన కుమారుడిని రంగంలోకి దించాలనుకుంటున్న భాస్కరరావుకు భార్గవ్ తీరు ఆందోళన కలిగిస్తోందట. టిక్కెట్రేస్లో ఇద్దరూ తీవ్రస్థాయిలో పోటీ పడుతున్నారు. ఇక కాంగ్రెస్‌నేతలు పార్టీని గాలికొదిలేసి గ్రూప్కలహాల్లో మునిగి తేలుతున్నారు. సీనియర్‌నేత జానారెడ్డి తన కుమారుడిని రంగంలోకి దించాలని భావస్తున్నారు. బత్తుల లక్ష్మారెడ్డి జానారెడ్డి తనయుడిని వ్యతిరేకిస్తూ...తనకే టిక్కెట్ఇవ్వాలని కోరుతున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి ఇక్కడ సరైన నాయకుడే లేరు. నాగార్జున సాగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటలా ఉండేది. కానీ గత ఎన్నికల్లో జానారెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో సైతం భంగపాటు తప్పలేదు. వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారనేదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. మరోసారి జానారెడ్డి పోటీ చేస్తారా లేక ఆయన వారసుడు జైవీర్‌ను రంగంలోకి దించుతారా అనేది సస్పెన్స్‌గా ఉంది. మరోవైపు టీఆర్ఎస్లో గ్రూపుల గోల ఎక్కువైంది. ఎమ్మెల్యే నోముల భగత్‌కు ఎమ్మెల్సీ కోటిరెడ్డి మధ్య సఖ్యత లేదు. ఎమ్మెల్సీగా అవకాశం రాని తేరా చిన్నపరెడ్డి కూడా కాచుకుని ఉన్నారు. బీజేపీ వరుసగా పోటీ చేస్తున్నప్పటికీ కనీసం పోటీ ఇవ్వలేకపోతోంది. జిల్లాలో ఉన్న ఏకైక ఎస్టీ నియోజకవర్గం దేవరకొండ. ఒకప్పుడు కాంగ్రెస్, సీపీఐలకు కంచుకోటగా ఉండేది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్గెలిచినా..అధికార పార్టీలోను, కాంగ్రెస్‌లోను వర్గపోరు తీవ్రస్థాయిలో సాగుతోంది. బీజేపీ పరిస్థితి మాత్రం కేడర్లేదు నాయకులు లేరన్నట్లుగా తయారైంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒకసారి కాంగ్రెస్ నుంచి మరోసారి టీఆర్ఎస్ నుంచి గెలిచిన రవీంద్రకుమార్ హ్యాట్రిక్సాధించాలనుకుంటున్నారు. కాని దేవేందర్నాయక్టీఆర్ఎస్ టిక్కెట్కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. ఇక కాంగ్రెస్‌లో పోటీ చేయడానికి చాంతాడంత లిస్ట్తయారైంది. పార్టీ టిక్కెట్రాకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగడానికి ఇద్దరు ముగ్గురు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. ఇక బీజేపీలో కూడా రెండు వర్గాలు టిక్కెట్కోసం పరస్పరం పోటీ పడుతున్నాయి. -
మునుగోడులో ఏ పార్టీ బలమెంత?.. ‘గులాబీ’కి కష్టమేనా?.. బీజేపీ పరిస్థితి ఏంటి?
సాక్షి, నల్గొండ: నల్గొండ జిల్లా అంటే ఒకప్పుడు ఉద్యమాల ఖిల్లా. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది గతంలో. కాల క్రమంలో కమ్యూనిస్టు పార్టీలు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక పోటీ కారు, హస్తం గుర్తుల మధ్యే ఉంటోంది. ప్రేక్షక పాత్ర పోషిస్తున్న బీజేపీకి మునుగోడు రూపంలో బలం పరీక్షించుకునే ఛాన్స్ వచ్చింది. మునుగోడు ఫలితమే రాష్ట్ర భవిష్యత్‌ని, ఉమ్మడి జిల్లా భవిష్యత్‌ను తేల్చుతుందా? చదవండి: రాజాసింగ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో గులాబీ పార్టీ హవా కొనసాగుతోంది. గత ఎన్నికల్లో 12కి 9 స్థానాలు గెలుచుకోగా.. తర్వాత మరో రెండు కలిసాయి. ఎంపీగా గెలిచిన అప్పటి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి హుజూర్నగర్ అసెంబ్లీ సీటుకు రాజీనామా చేయగా ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నికలో ఉత్తమ్ నిలిపిన అభ్యర్థి ఓడిపోయి టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. మునుగోడు ఒక్కటే కాంగ్రెస్‌కి మిగిలింది. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా మునుగోడు అసెంబ్లీ సీటుకు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా సమర్పించారు. మునుగోడులో జరిగే ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలను అనేక మలుపులు తిప్పే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీకి గతంలో వచ్చినన్ని స్థానాలు రావనే టాక్ వినిపిస్తోంది. క్షేత్రస్థాయిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా కొంతమంది ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. ఇదే విషయం గులాబీ బాస్ దృష్టికి కూడా వెళ్లినట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. దీనికి తోడు నియోజకవర్గాల్లో వర్గపోరు కూడా టీఆర్ఎస్కు సంకటంగా మారింది. జిల్లాలో వర్గపోరు లేని సెగ్మెంట్ ఏదైనా ఉందంటే అది సూర్యాపేట మాత్రమే. తుంగతుర్తి, నల్లగొండ, హుజూర్ నగర్లో గ్రూప్ తగాదాలు ఉన్నా అవి బయటకి కనిపించే స్థాయిలో లేదు. ప్రతీ నియోజకవర్గంలో పార్టీ నేతలు వర్గాలుగా విడిపోయి వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని వినిపిస్తోంది. నల్లగొండలో కమలం జెండా ఎగరేస్తాం అని ఆ పార్టీ నేతలు చెప్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. మొత్తం పన్నెండు సెగ్మెంట్లలో నాలుగు స్థానాల్లో మాత్రమే కమలం పార్టీ అంతో ఇంతో పోటీ ఇస్తుంది కానీ అది గెలిచేందుకు సరిపోదనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఆలేరు, భువనగిరి, మునుగోడు, సూర్యాపేట మాత్రమే బీజేపీ కనీస పోటీనిచ్చే స్థితిలో ఉంది. నల్లగొండ జిల్లాలో కనీసం ఐదు స్థానాల్లో విజయం సాధించాలని రాష్ట్ర నేతలు ఆలోచిస్తూ తరచుగా పర్యటిస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో నేతలు అందుకు విరుద్ధంగా పనిచేస్తున్నారనే టాక్ ఉంది. కాని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూపంలో మునుగోడులో కమలం పార్టీ అదృష్టాన్ని పరిక్షించుకునే అవకాశం దక్కింది. నల్గొండ జిల్లాలో ఉన్న సీట్లను కాపాడుకోలేకపోతున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎన్నికల్లో అన్ని సీట్లూ తమవారికే కావాలని కోరుతున్నారు. గతంలో జిల్లాలోని మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచేది. కురువృద్ధులు ఆ పార్టీకి దన్నుగా ఉండేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ వైభవం గత చరిత్రగా మిగిలిపోతోంది. గత ఎన్నికల్లో మూడు సీట్లు గెలుచుకోగా ఉప ఎన్నికలో ఒకటి కోల్పోయింది. మరొకరు గులాబీ పార్టీలోకి జంప్ చేశారు. చివరికి మిగిలిన మునుగోడు ఎమ్మెల్యే పీసీసీ చీఫ్ రేవంత్ కారణంగా పార్టీకి, పదవికి గుడ్ బై చెప్పి.. కమలం తీర్థం తీసుకోబోతున్నారు. అంటే ప్రస్తుతం నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా మిగల్లేదని చెప్పాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఫలితాలు ఎదురైనా కాంగ్రెస్ పార్టీకి కేడర్ పటిష్టంగానే ఉంది. అసెంబ్లీ స్థానాలు పోయినా.. ఉమ్మడి జిల్లాలోని రెండు ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలుచుకోగలిగింది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భువనగిరి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీ సీట్లను కైవసం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకోవాలనే పట్టుదలగా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. అయితే రేవంత్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కమలం గూటికి చేరడం కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టే అంశమే. అయితే అన్ని సెగ్మెంట్లలో వర్గపోరుతో పాటు.. సీట్లు అడిగేవారి సంఖ్య కూడా కాంగ్రెస్‌లో ఎక్కువగానే ఉంది. ఉత్తమ్‌కుమార్, జానారెడ్డి తదితర సీనియర్ నాయకులు తమకు తమ కుటుంబానికి ఎక్కువ స్థానాలు కావాలని పట్టుబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
మునుగోడు హీట్.. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు!
సాక్షి, ఖమ్మం : నల్లగొండ జిల్లాలోని మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను నిర్దేశించనున్నాయా... అంటే అవుననే సమాధానమే వస్తోంది. పలు పార్టీల్లోని అసంతృప్త నేతలు తుది నిర్ణయం తీసుకునేందుకు ఈ ఎన్నికలనే గీటురాయిగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యాన నేతలు తమ భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మునుగోడు ఎన్నికల అనంతరం ప్రజాతీర్పు ఆధారంగా నిర్ణయాలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొందరు అసంతృప్త నేతలు ఈ విషయమై దృష్టి సారించినట్లు సమాచారం. టీఆర్ఎస్కు ప్రతిష్టాత్మకం.. అధికార టీఆర్ఎస్లో టికెట్ ఆశిస్తున్న నేతల సంఖ్య అధికంగానే ఉంది. పార్టీలో టికెట్లు ఆశిస్తున్న వారితోపాటు ఇతర నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల వ్యవహార శైలితో అసంతృప్తితో ఉన్న నేతలు ఇప్పటివరకైతే గుంభనంగానే ఉంటున్నారు. దాదాపు ప్రతీ నియోజకవర్గంలోనూ రెండేసి వర్గాలు ఉండగా... ఆయా వర్గాల నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు కొనసాగుతున్నాయి. కొందరు నేతలు బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తూ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. పాలేరు, వైరా, సత్తుపల్లి, ఇల్లెందు, పినపాక వంటి నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. దీంతో కొందరు నేతలు తమ దారి తాము చూసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మునుగోడు ఫలితాలు అనుకూలంగా రాకపోతే ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్లో భారీ కుదుపు ఉండొచ్చనే ప్రచారం మొదలైంది. కాంగ్రెస్‌కు ప్రాణసంకటం కాంగ్రెస్ పార్టీ జిల్లాలో పుంజుకోవాలంటే చెప్పుకోదగిన రీతిలో స్థానాలు దక్కించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పార్టీలో కూడా అంతర్గతంగా అసంతృప్తి రగులుతోంది. ప్రభుత్వంపై సహజంగా ఉండే వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునే శక్తియుక్తులు కలిగిన నేతల అవసరం ఉండగా... ప్రజావ్యతిరేక చర్యలపై నిరసనలు తెలుపుతున్నా నాయకులు ఏకతాటిపైకి రావడం లేదు. ఈక్రమాన జిల్లాలో పార్టీ మరింత బలోపేతం కావాలంటే మునుగోడు ఎన్నికల్లో ఆ పార్టీ ఫలితాలే ఆధారమని చెబుతున్నారు. పార్టీకి అనుకూలమైన వాతావరణం ఏర్పడితే జిల్లాలో ఇతర పార్టీల్లోని కొందరు నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు మార్గం సుగమమవుతుంది. లేకుంటే ‘హస్తానికీ’ గడ్డు రోజులు తప్పేలా లేవు. చదవండి: (Rangareddy Politics: మంత్రి సబిత ఇంటికి వెళ్తే.. ఆ పార్టీ నాయకులకు చిక్కులే!) వలసలపైనే దృష్టి జిల్లాలో చెప్పుకోదగ్గ బలం లేని భారతీయ జనతా పార్టీ వలసలను ప్రోత్సహించడం ద్వారా బలపడాలన్న ఆలోచనలో ఉంది. కానీ బీజేపీ పరిస్థితి జిల్లాలో అంతంత మాత్రంగానే ఉండటంతో ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. మునుగోడులో బీజేపీ విజయం సాధిస్తే రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడుతుందని.. అప్పుడే పార్టీలో చేరేందుకు ఎక్కువమంది నేతలు ఆసక్తి చూపుతారని ప్రచారం ఊపందుకుంది. రాష్ట్ర బీజేపీ నేతలు కూడా జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి వలసలను ప్రోత్సహించడంతోపాటు క్షేత్రస్థాయిలో కేడర్‌ను పెంచుకునేలా దిశానిర్దేశం చేస్తున్నారు. మునుగోడు ఎన్నిక ఫలితం అనుకూలంగా వస్తే.. ఆపై వలస నేతల చరిష్మాతో ఉమ్మడి జిల్లాలో మెజార్టీ అసెంబ్లీ స్థానాలు సాధించొచ్చన్న ధీమా ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. గెలిచిన పార్టీకే జై.. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచిన పార్టీకే జై కొట్టేందుకు పలు పార్టీల్లోని అసంతృప్త నేతలు సన్నద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ బలంగా ఉండగా... కమ్యూనిస్టులు కూడా కొంతమేర ప్రభావం చూపించే అవకాశముంది. అయితే భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీల్లోని అసంతృప్తులకు గాలం వేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆలోచనతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఈ పరిణామాలపై అసంతృప్త నేతలు దృష్టి సారించినందున మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారనుంది. అక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి అసంతృప్త నేతలు వెళ్లే అవకాశముండడంతో బలం మరింత పెరిగే ఆస్కారముందనే చర్చ జరుగుతోంది. ఆచితూచి కామ్రేడ్స్ బీజేపీని ఓడించే సత్తా ఉన్న పార్టీకే తమ మద్దతు ఉంటుందని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు పేర్కొంటున్నాయి. మునుగోడులో తాము టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక సీపీఎం మాత్రం నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు. అక్కడ కాంగ్రెస్ గెలిస్తే అసెంబ్లీ ఎన్నికల నాటికి కమ్యూనిస్టులు ఆ పార్టీకే మద్దతు ఇస్తారన్న ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో కామ్రేడ్లు కూడా మునుగోడు ఫలితాల ఆధారంగా అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎటు వైపు మొగ్గుచూపుతారో స్పష్టత రానుంది. వచ్చే ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టులు వేర్వేరుగా కాకుండా కలిసే ఇతర పార్టీలతో పొత్తుకే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇలా రకరకాల సమీకరణలతో మునుగోడు ఎన్నికల అనంతరం ఉమ్మడి జిల్లా రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండనుందో తేలనుంది. -
మునుగోడు లిస్టు ఫైనల్.. ఆ నలుగురిలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పాలిటిక్స్ రసవత్తరంగా సాగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్, బండి సంజయ్ పాదయాత్ర, రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు, మునుగోడు ఉప ఎన్నిక.. ఇలా రాజకీయాలు వీటి చుట్టే తిరుగుతున్నాయి. వీటిలో పొలిటికల్ లీడర్స్ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా.. మునుగోడుపై కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. కాగా, తెలంగాణ కాంగ్రస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్.. గాంధీభవన్‌కు మునుగోడు టికెట్ ఆశావహులను సమావేశానికి పిలిచారు. ఇక, మునుగోడులో టికెట్ ఆశిస్తున్న వారిలో పాల్వాయి స్రవంతి, కృష్ణారెడ్డి, పల్లె రవి, కైలాష్ నేత ఉన్నారు. కాగా, ఆశావహుల బలాబలాపై సునీల్ కనుగోలు ఇప్పటికే పీసీసీకి నివేదిక అందించారు. ఈ నేపథ్యంలో మరో రెండు, మూడు రోజుల్లో మునుగోడులో అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేయనుంది. మరోవైపు.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ప్రియాంక గాంధీతో భేటీ అయిన విషయం తెలిసిందే. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పుడున్న పరిస్థితులపై చర్చించామని వివరించారు. ఏ సమస్య ఉన్నా నేరుగా వచ్చి తనను కలవమన్నారన్నారు. తెలంగాణలో పార్టీని ఎలా పటిష్టం చేయాలనే అంశంపై చర్చించామన్నారు. అన్ని విషయాలు మాట్లాడుకున్నామని, తాను కొన్ని సలహాలు ఇచ్చానని ఆయన తెలిపారు. ఇది కూడా చదవండి: గులాబీ బాస్ మదిలో ఏముంది.. ఆ సీనియర్ నేతను పొమ్మనలేక పొగబెడుతున్నారా? -
డ్యామిట్ కథ అడ్డం తిరిగింది.. రేవంత్‌కు కష్టాలు.. తెలివిగా తప్పుకున్న కోమటిరెడ్డి
రాజకీయాలలో నోరు జారితే ఒక్కోసారి అది ప్రమాదకరంగా మారుతుంది. అందులోను ముఖ్యమైన స్థానాలలో ఉన్నవారు మరీ జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ పార్టీలు ఒకదానిపై ఒకటి పలు విమర్శలు చేసుకుంటూనే ఉంటాయి. అలాగే నేతలు పలు ఆరోపణలు గుప్పిస్తుంటారు. కొన్నిసార్లు హద్దులు కూడా దాటుతుంటారు. కానీ కొన్ని సందర్భాలలో అది పెద్ద సమస్య అవుతుందని చెప్పడానికి తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న ఉదంతాలనే ఉదాహరణలుగా తీసుకోవచ్చు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై పిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి, మరో నేత అద్దంకి దయాకర్‌లు చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపాయి. కోమటిరెడ్డి బ్రదర్స్‌గా పేరొందిన రాజగోపాలరెడ్డి, వెంకటరెడ్డిలు నల్లగొండ ఉమ్మడి జిల్లాలో కీలకంగా ఉన్న నేతలు. రాజగోపాలరెడ్డి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. ఈ సమయంలో ఆయన సోదరుడు ఎంపీ అయిన వెంకటరెడ్డి ఏమి చేస్తారన్న ప్రశ్న వచ్చింది. ఆయన కాంగ్రెస్‌ను వీడనని చెప్పారు. కానీ అదే సమయంలో ఆయన మునుగోడు శాసనసభ నియోజకవర్గానికి జరిగే ఉపఎన్నికలో ఎంతవరకు పార్టీకి సహకరిస్తారన్నదానిపై సందేహాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఎవరి వ్యూహాలు వారు అమలు చేస్తుంటారు. వెంకటరెడ్డి ఈ విషయంలో ఆచితూచి అడుగు వేస్తున్నప్పుడు కాంగ్రెస్ నేతలు ఎలా పడితే అలా విమర్శలు చేయడం వల్ల జరిగే నష్టాన్ని సరిగా అంచనా వేసుకున్నట్లు లేరు. రాజకీయ నేత ఎవరైనా తమకు ఎలా అవకాశాలు వస్తాయా? తద్వారా తాము అనుకున్నవైపు వెళ్లవచ్చని చూస్తుంటారు. రాజగోపాలరెడ్డి బిజెపిలోకి వెళ్లినా, వెంకటరెడ్డి ఇప్పటికిప్పుడు ఆ ఆలోచన చేయలేకపోతున్నారు. ఆయన కూడా కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసినా, పార్టీ మారతారా?లేదా అన్నదానిపై క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే తనను కాంగ్రెస్ నుంచి వెళ్లగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అలాంటి తరుణంలో మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక నిమిత్తం కాంగ్రెస్ ఆధ్వర్యంలో చండూరు వద్ద ఒక సభ నిర్వహించారు. రాజగోపాలరెడ్డి కి వ్యతిరేకంగా జరిగిన ఈ సభను తనకు తెలియకుండా పెడతారా అని వెంకటరెడ్డి నిరసన తెలిపారు. తాను ఆ సభకు వెళ్లనని కూడా స్పష్టం చేశారు. అయినా వీరి అండ లేకపోయినా, జన సమీకరణలో కాంగ్రెస్ నేతలు సఫలం అయ్యారు. కానీ ఆ సభలో వెంకటరెడ్డిని ఉద్దేశించి కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్య తీవ్ర కలకలం రేపింది. ఆయన ఒక అసభ్య పదాన్ని కూడా వాడారు. దాంతో వెంకటరెడ్డి మరింత మండిపడ్డారు. అలాగే రేవంత్ రెడ్డి కూడా మరో సందర్భంలో కాంగ్రెస్‌లో సీనియర్, జూనియర్ అన్న పాయింట్ పై మాట్లాడుతూ హోంగార్డు ఎంత సీనియర్ అయినా, ఐపిఎస్ కాలేరు కదా అని వ్యాఖ్యానించారు. సహజంగానే కాంగ్రెస్ సీనియర్లలో ఇది కాక పుట్టిస్తుంది. అసలే ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న వెంకటరెడ్డి వెంటనే దీనిని అందుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో హోంగార్డుల వంటి తాము ఎందుకని, ఐపిఎస్ హోదా ఉన్న నాయకులే గెలిపించుకుంటారులే అని బదులు చెప్పారు. అసలు సభ పోయి, ఈ వివాదమే మునుగోడులో ప్రధాన అంశం అయి కూర్చుంది. ఒక వైపు కాంగ్రెస్‌లో టికెట్ కోసం కొందరు నేతల మధ్య పోటీ, దానిని తేల్చుకోలేక సతమతమవుతున్న తరుణంలో వెంకటరెడ్డి వివాదం కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. అద్దంకి దయాకర్ , రేవంత్ రెడ్డిలు తమ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. అయినా వెంకటరెడ్డి శాంతించలేదు. దయాకర్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలన్న కొత్త డిమాండ్ పెట్టారు. అలాగే రేవంత్ వ్యాఖ్యలపై పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాందీ వద్దే తేల్చుకుంటానని ఆయన ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం కూడా అధిష్టానానికి కొందరు నేతలు రేవంత్‌పై పిర్యాదు చేయకపోలేదు. అందరిని కలుపుకుని వెళ్లాలని రేవంత్‌ను డిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఆదేశించారు. అయినా రేవంత్ తొందరపాటుతో నోరు జారారు. అదే వెంకటరెడ్డికి ఆయుధం అయింది. ఒక దశలో రాజగోపాలరెడ్డిపై వెంకటరెడ్డినే పోటీకి నిలబెట్టాలన్న ఆలోచన కూడా చేశారని అంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి అసలు తాను మునుగోడులో ప్రచారం చేయవలసిన అవసరం లేని దశకు వెంకటరెడ్డి వెళ్లారు. ఆయన భవిష్యత్తులో పార్టీలో ఉంటారో, ఉండరో కానీ, ఆయా అంశాలపై చికాకు సృష్టిస్తారన్న భావన కలుగుతుంది. వ్యూహాత్మకంగా వెంకటరెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేయవలసిన కాంగ్రెస్ నేతలు, అందుకు విరుద్దంగా ఆయన వ్యూహంతో సతమతమవుతున్నారు. ఇదే వెంకటరెడ్డి కొంతకాలం క్రితం రేవంత్ ను పిసిసి అధ్యక్షుడిగా ప్రకటించినప్పుడు తీవ్రమైన ఆరోపణ చేశారు. పార్టీ తెలంగాణ ఇన్ చార్జీ మాణిక్కం ఠాగూర్‌కు పాతిక కోట్లు ఇచ్చి పదవి కొనుకున్నారని ఆయన ఆరోపించారు. దానిపై తొలుత ఠాకూర్ సీరియస్ అయినా, ఆ తర్వాత సర్దుకుని, వెంకటరెడ్డికి స్టార్ కాంపెయినర్ హోదా ఇచ్చారు. ఆ సందర్భం అలాంటిది. పార్టీలో ఉన్నంతవరకు వెంకటరెడ్డితో తగాదా పెట్టుకుంటే వచ్చే ఇబ్బందులు ఏమిటో పార్టీ నేతలకు తెలుసు. ఎవరైనా నేత పార్టీకి దూరంగా ఉండాలని అనుకున్నా, పార్టీ నుంచి వైదొలగాలని అనుకున్నా, దాగుడుమూతల గేమే ఆడతారు. పరిస్థితి మొత్తం తనకు అనుకూలంగా ఉందని ఆయన భావించే వరకు రాజకీయం ఇలాగే ఉంటుంది. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాలరెడ్డి పార్టీని వీడడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక రాబోతోంది. అది కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకం అవుతుంది. ఇలాంటి సమయంలో ఈ రచ్చ పార్టీకి పెద్ద తలనొప్పి అవుతుంది. దయాకర్ ఒకప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్‌తో సన్నిహితంగానే ఉండేవారు. కానీ ఈ మధ్యకాలంలో రేవంత్‌కు దగ్గరైనట్లు ఉన్నారు. అయినా అనకూడని మాట అని వివాదంలో ఇరుకున్నారు. రేవంత్ మొదటి నుంచి దురుసుగా మాట్లాడే వ్యక్తే. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై గత కొద్ది సంవత్సరాలుగా ఆయన ఆరోపణలు గుప్పించడమే కాకుండా, కొంత అభ్యంతర భాషను కూడా వాడుతుంటారు. దానికి ప్రతిగా టిఆర్ఎస్ నేతలు కూడా అంతే ఘాటుగా మాట్లాడుతుంటారు. అది రాజకీయ వివాదంగానే ఉంటుంది. కానీ సొంత పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు సహజంగానే వాటికి ప్రాధాన్యత ఏర్పడుతుంది. అసలే అవకాశం కోసం ఎదురు చూస్తున్న వెంకటరెడ్డికి రేవంత్ వ్యాఖ్యలు కలిసి వచ్చాయి. దీనివల్ల బిజెపి పక్షాన పోటీచేయనున్న తన సోదరుడు రాజగోపాలరెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేయకుండా వెంకటరెడ్డి తప్పించుకునే అవకాశం వచ్చింది. ఉప ఎన్నికలో బిజెపి గెలిస్తే వెంకటరెడ్డి రాజకీయ నిర్ణయాలు ఒక రకంగా ఉండవచ్చు. అలాకాకుండా రాజగోపాలరెడ్డి ఓటమి చెందితే, ఆయనకు వచ్చే ఓట్ల ఆధారంగా పరిస్థితిని అంచనా వేసుకుని రాజకీయ నిర్ణయం తీసుకోవచ్చు. ఎటు వచ్చినా తమ రాజకీయ ప్రయోజనాలకు విఘాతం కలగకుండా కోమటిరెడ్డి చూసుకోగలుగుతారు. కాగా కాంగ్రెస్‌ను వీడడంపై రాజగోపాలరెడ్డి ద్రోహి అంటూ మునుగోడులో పోస్టర్లు వెలిశాయి. ఇది రేవంత్ కుట్ర అని ఆయన విమర్శిస్తున్నా, ఉప ఎన్నికలో విజయం సాధించేవరకు ఆయన ఇలాంటి చిక్కులు ఎదుర్కోక తప్పదు. కాగా టిఆర్ఎస్లో కూడా అసమ్మతి చికాకుగానే ఉంది. మాజీ ఎమ్మెల్యే కె.ప్రభాకరరెడ్డికి మళ్లీ టిక్కెట్ ఇవ్వాలని కెసిఆర్ ఆలోచిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఆయనకు పోటీగా కొందరు నేతలు జట్టుకట్టి కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. అయినా ఇంకా ప్రభాకరరెడ్డి వైపే కేసీఆర్ ఆలోచన చేస్తే, స్థానికంగా ఆయనను వ్యతిరేకించే నేతలు టిఆర్ఎస్ విజయానికి ఎంత కృషి చేస్తారన్న డౌటు వస్తుంది. టిఆర్ఎస్, బిజెపిలు పోటాపోటీ సభలు నిర్వహించాయి. అమిత్ షా సభకు ఒక రోజు ముందుగానే కెసిఆర్ సభ నిర్వహించి బిజెపికి సవాల్ విసిరారు. భావి తెలంగాణ రాజకీయానికి దిక్సూచి వంటి మునుగోడు ఉప ఎన్నికకు తేదీ ఇంకా రాకముందే రాజకీయం వేడెక్కింది. ఒకవైపు ప్రత్యర్ధి రాజకీయ పార్టీలతో పోరు, మరో వైపు సొంత పార్టీలో అసమ్మతి తలనొప్పులతో కాంగ్రెస్,టిఆర్ఎస్లు ఇబ్బంది పడుతున్నాయి. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
మునుగోడు కోసం తెలంగాణను తగలబెడతారా?: అసదుద్దీన్ ఒవైసీ ఫైర్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. మహ్మాద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో, మజ్లీస్ నేతల ఫిర్యాదులతో కేసు నమోదు చేసిన పోలీసులు రాజాసింగ్‌ను అరెస్ట్ చేశారు. పోలీసు వాహనంలో రాజాసింగ్‌ను స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎనిమిదేళ్లుగా తెలంగాణ ప్రశాంతంగా ఉంది. శాంతి భద్రతలను విఘాతం కలిగించాలని బీజేపీ కుట్ర చేస్తోంది. బీజేపీ అధిష్టానం ఆదేశాలతోనే అలజడి సృష్టిస్తున్నారు. లౌకికవాదాన్ని వ్యతిరేకించడమే బీజేపీ విధానం. ఉప ఎన్నికల కోసం తెలంగాణను తగలబెడతారా?. ఇస్లామ్‌కు, మహ్మాద్ ప్రవక్తకు వ్యతిరేకంగా మాట్లాడటం బీజేపీకి పాలసీగా మారిపోయింది. రాజాసింగ్ విచారణను పోలీసులు రికార్డు చేయాలి’’ అని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: బీజేపీ నేతలు అరెస్ట్.. కిషన్ రెడ్డి స్పందన ఇదే.. -
ప్రాణం పోయినా తప్పు చేయను: రాజగోపాల్‌రెడ్డి
-
ప్రాణం పోయినా తప్పు చేయను: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
సాక్షి, నల్గొండ: మునుగోడు సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలు రాబోయే రోజుల్లో ఇచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఈ ఉప ఎన్నిక వ్యక్తి కోసం స్వార్థం కోసం రాలేదని.. తెలంగాణ భవిష్యత్ కోసం, రాష్ట్రం ప్రజల ఆత్మగౌరవం వచ్చిందని తెలిపారు. ఈ మేరకు నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు ప్రజలు న్యాయం వైపే నిలుస్తారు. ధర్మాన్ని కాపాడతారు. ప్రాణం పోయినా తప్పు చేయను. నాపై అబద్ధపు ప్రచారాన్ని ప్రజలు నమ్మరు. ప్రపంచమంతా మునుగోడు వైపు చూస్తోంది. మునుగోడు ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా ధర్మం వైపు ఉంటారని నమ్మకం ఉంది. నాపై ఆరోపణలు చేసేవారికి ఆధారాలు చూపాలని అడుగుతున్నా. సభకు వచ్చే వేలాది మందిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రాణంపోయినా ప్రజలకు ఇబ్బంది కలిగే పనిచేయను ‘ఎంతోమంది నన్ను అమ్ముడుపోతుండు అంటున్నారు.. రాజీనామా ఎందుకు చేశానో, పార్టీ ఎందుకు మారానో మీకు తెలుసు, మీ అందరి ఆశీర్వాదం , నమ్మకం, విశ్వాసంతోనే రాజీనామా చేశాను’ అని బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. తన ప్రాణం పోయినా మునుగోడు ప్రజలకు ఇబ్బంది కలిగే పనిచేయనని చెప్పారు. తాను రాజీనామా చేస్తే ఫాం హౌజ్‌లో పండుకున్న కేసీఆర్ మునుగోడుకు వస్తాడని తాను ముందే చెప్పానని ఇప్పుడు అనుకున్నట్లుగానే కేసీఆర్ మునుగోడుకు వచ్చాడని తెలిపారు. మునుగోడులో ఇప్పుడు పెన్షన్లు వస్తున్నాయని, గట్టుప్పల్ మండలం వచ్చిందని వివరించారు. తనకు పదవులు ముఖ్యంకాదని, స్వార్థం కోసం రాజీనామా చేసినవాడిని అయితే ఇంట్లోనే ఉండేవాణ్ని ఉప ఎన్నికలకు ఎందుకు వస్తానని ప్రశ్నించారు. మీ భవిష్యత్, మీ పిల్లల భవిష్యత్, తెలంగాణ భవిష్యత్ కోసం పోరాడుతున్నానని చెప్పారు. బీజేపీ ద్వారానే తెలంగాణకు న్యాయం జరుగుతుందన్నారు. అభ్యర్థిని కూడా ప్రకటించలేని పరిస్థితి కేసీఆర్‌ది అని విమర్శించారు. కేసీఆర్ మూటలు పంపితే ఆయన మనుషులు నాయకులను కొనుగోలు చేస్తున్నారని, కానీ, ప్రజలంతా తమవెంటే ఉన్నారని తెలిపారు. ఈడీ , సీబీఐ అంటూ మాట్లాడుతున్నాడని, తప్పు చేయనప్పుడు కేసీఆర్ ఎందుకు భయపడుతున్నాడని పేర్కొన్నారు. తప్పు చేశావ్ కాబట్టే భయపడుతున్నావ్ అని అన్నారు. చదవండి: (మునుగోడులో భారీ సభకు కాంగ్రెస్ ప్లాన్.. ప్రియాంక గాంధీ హాజరు!) -
బీజేపీ ప్రచారం కోసమే ఎన్టీఆర్‌ను అమిత్ షా కలిశారు: కొడాలి నాని
సాక్షి, విజయవాడ: మునుగోడు బీజేపీ సభలో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా, పర్యటనలో భాగంగా అమిత్ షా.. నటుడు జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. వీరి భేటీపై ఇప్పటికే పలువురు.. పొలిటికల్ మీట్ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక, తాజాగా ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని.. అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీపై స్పందించారు. కొడాలి నాని సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ కారణాలు లేకుండా ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా ఎవరితోనూ మాట్లాడరు. బీజేపీని విస్తరించేందుకే అమిత్ షా.. జూనియర్ ఎన్టీఆర్‌ను కలిశారని నేను భావిస్తున్నాను. ఎన్టీఆర్‌తో దేశమంతా ప్రచారం చేయించే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ప్రయోజనం లేదనే.. మోదీ, అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వలేదు’’ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ఆర్ఆర్ఆర్లో నటన భేష్.. జూ.ఎన్టీఆర్‌ను అభినందించిన అమిత్‌షా -
మునుగోడులో భారీ సభకు కాంగ్రెస్ ప్లాన్.. ప్రియాంక గాంధీ హాజరు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మునుగోడు పాలిటిక్స్ పీక్స్‌కు చేరుకున్నాయి. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడక ముందే రాజకీయ పార్టీలు మునుగోడుకు క్యూ కడుతున్నాయి. మునుగోడులో బహిరంగ సభలు నిర్వహిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ భారీ బహిరంగ సభలు నిర్వహించగా.. కాంగ్రెస్ సైతం మునుగోడులో సభకు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ తొలి వారంలో మునుగోడులో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు చేస్తోంది. కాగా, కాంగ్రెస్ మునుగోడు సభలో పాల్గొనేందుకు ఆ పార్టీ కీలక నేత ప్రియాంక గాంధీ విచ్చేస్తున్నారు. ఇక, తెలంగాణకు ప్రియాంక గాంధీ రానున్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ కేడర్‌లో కొంత జోష్ వస్తుందని అధిష్టానం భావిస్తోంది. మరోవైపు.. ఇప్పటికే మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సభలో బీజేపీలో కేసీఆర్ విరుచుకుపడ్డారు. ఇక, ఆదివారం జరిగిన బీజేపీ సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా విచ్చేశారు. బీజేపీ సభలో అమిత్ షా.. కేసీఆర్ కుటుంబ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనపై కనుమరుగవుతుందని వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: మునుగోడు బాధ్యత అందరిదీ -
అమిత్ షాపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు బహిరంగ సభలో పాల్గొనేందుకు ఆదివారం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీ రామారావు ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ప్రముఖ క్రికెటర్ తండ్రి’అంటూ అమిత్ షాతో పాటు బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కుటుంబ రాజకీయ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘కేవలం తన ప్రతిభ ఆధారంగా అంచెలంచెలుగా ఎదిగి భారతీయ క్రికెట్ బోర్డ్ బీసీసీఐ కార్యదర్శి పదవిలో ఉన్న ఓ ‘ప్రముఖ క్రికెటర్ తండ్రి’ఈరోజు తెలంగాణకు వస్తున్నారు. ఓ సోదరుడు ఎంపీ, భార్య ఎమ్మెల్సీగా గతంలో పోటీ చేసిన నేపథ్యాన్ని కలిగిన ఓ పెద్దమనిషి తరపున ప్రచారం చేస్తారు. టీఆర్ఎస్ది కుటుంబ పాలన అంటూ ఉపన్యాసం దంచుతారు’అని అమిత్ షా, రాజగోపాల్‌రెడ్డి కుటుంబ రాజకీయ నేపథ్యాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘బిల్కిస్ బానోపై అత్యాచార కేసు దోషులుగా ఉన్న సంస్కారి రేపిస్టులను మీ ప్రభుత్వం ఎందుకు విడుదల చేసిందో తెలంగాణ ప్రజలు మీ నుంచి వినేందుకు అత్యంత ఆసక్తితో ఉన్నారు. ఎర్రకోట బురుజుల నుంచి మీ ప్రధాని చేసిన బోధనలకు వ్యతిరేకంగా బలాత్కార్ సమర్థన జరుగుతోంది. పీఎం గారిని గుజరాత్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదా?’అని ప్రశ్నించారు. ‘ఆవిష్కరణలు, మౌలిక వసతులు, సుస్థిరాభివృద్ధిపై సమష్టిగా దృష్టి పెడితేనే దేశాభివృద్ధి సాధ్యం. కానీ దేశ నాయకత్వం విభజన ఎగతాళి స్వప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టడం వంటి చర్యలకు పూనుకుంటోంది. 1987లో భారత్ చైనా జీడీపీ ఒకే రకంగా ఉన్నా, ఇప్పుడు గణాంకాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి’అని కేటీఆర్ మరో ట్వీట్లో బీజేపీ పాలనపై మండిపడ్డారు. The father of an “Ace cricketer” who rose through the ranks & became BCCI Secretary (purely on merit) is visiting Telangana today He will campaign for a gentleman whose brother is an MP & whose wife was an MLC contestant And he will lecture & enlighten us on Parivarvad 👏🤦♂️ — KTR (@KTRTRS) August 21, 2022 -
కుటుంబ పాలనకు చరమగీతం
మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి గెలుపు ద్వారా తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ పతనానికి నాంది పడుతుందని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. రాజగోపాల్‌రెడ్డిని బీజేపీలో చేర్చుకోవడమంటే.. కేవలం ఒక్క నాయకుడిని పార్టీలోకి తీసుకోవడం కాదని, ఇది కేసీఆర్ అవినీతి ప్రభుత్వ అంతానికి మార్గం వేయడమని చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేరిక సందర్భంగా ఆదివారం మునుగోడు పట్టణంలో బీజేపీ ‘మునుగోడు సమరభేరి’బహిరంగ సభ నిర్వహించింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన అమిత్‌షా.. రాజగోపాల్‌రెడ్డికి కాషాయ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ సర్కారు, సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఈ ప్రసంగం అమిత్‌షా మాటల్లోనే.. కేసీఆర్ సర్కారును కూకటివేళ్లతో పెకలిస్తాం.. ‘‘మునుగోడులో రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతి ప్రభుత్వం పతనానికి నాంది పడుతుంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. మోదీ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి గంగానది ప్రవాహంలా ముందుకు సాగుతుంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించడానికే రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతున్నారు. కేసీఆర్ మజ్లిస్‌కు భయపడుతున్నారు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ కారణంగా రజాకార్ల కబంధ హస్తాల నుంచి తెలంగాణకు విముక్తి లభించింది. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామన్న కేసీఆర్ మాట తప్పారు. మజ్లిస్ పార్టీకి భయపడే కేసీఆర్ ఈ హామీ అమలు చేయడం లేదు. తెలంగాణ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా, ఘనంగా నిర్వహిస్తాం. నిరుద్యోగ భృతి.. డబుల్ బెడ్రూం ఇళ్లు ఏవి? కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలేవీ అమలు చేయడం లేదు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇస్తామన్నారు.. ఇచ్చారా? ప్రతి జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అన్నారు. నల్లగొండలో నిర్మించారా? పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామన్నారు.. ఇచ్చారా? ఇళ్లు ఇవ్వకపోగా.. కేంద్ర ప్రభుత్వం నిర్మించే మరుగుదొడ్ల పథకాన్ని కూడా కేసీఆర్ అడ్డుకుంటున్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారా? మరోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. కేటీఆర్‌ను సీఎం చేస్తారే తప్ప దళితుడిని చేయరు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు దళిత బంధు కింద ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇస్తామన్నారు. ఎందరికి ఇచ్చారు? ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తామన్న హామీ ఏమైంది? గిరిజనులకు భూమి ఇస్తామన్న హామీ ఏమైంది? యువతకు ఉద్యోగాలు ఇస్తామని 2014 నుంచీ చెప్తూనే ఉన్నారు. కేసీఆర్ కొడుకు, కూతురు, అల్లుడు, ఇతర బంధువులకు మాత్రమే ఉపాధి కల్పించుకున్నారు. కేసీఆర్, ఆయన కుమారుడు, కుమార్తె, అల్లుడు పదవుల్లో ఉంటే మాకు బాధ లేదు. కానీ ఆ కుటుంబ అరాచక పాలన వల్ల ప్రజలు ఎందుకు బాధపడాలి, ఎందుకు నష్టపోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారింది. రాష్ట్రంలో పెట్రోల్ ధరలు తగ్గించరేం? కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను రెండు సార్లు తగ్గించినా కేసీఆర్ సర్కారు తగ్గించలేదు. పెట్రోల్, డీజిల్ ధరలు తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నాయి. మోదీ సర్కారు రూ.2 లక్షల కోట్ల సాయం అందించినా.. తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలోనే ఎందుకు ఉంది? టీఆర్ఎస్ సర్కారు సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే ఇతర రాష్ట్రాల్లాగే తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుంది. తెలంగాణలో కమలం వికసించేలా చేయాల్సిన బాధ్యత మునుగోడు ప్రజల చేతుల్లోనే ఉంది..’’అని అమిత్‌షా పిలుపునిచ్చారు. కాగా సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ పాలనను అంతం చేయాలని.. మునుగోడు ఉప ఎన్నికలే ఇందుకు నాంది పలకాలని పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర నాయకుడు గొంగిడి మనోహర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మునుగోడు సభలో పార్టీ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్‌చుగ్, నేతలు విజయశాంతి, వివేక్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అమిత్‌షా సభలో నేతలు కేసీఆర్ పతనం మునుగోడు నుంచే ప్రారంభమవుతుందని బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ నయవంచక కుటుంబం చేతిలో చిక్కి విలవిల్లాడుతోందని.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవిష్యత్తు, ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకే బీజేపీలో చేరానని.. ప్రజల మీద విశ్వాసంతోనే పదవికి రాజీనామా చేశానని ప్రకటించారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్నిసార్లు సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోరినా ఇవ్వలేదని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. ఈ ఉప ఎన్నిక వ్యక్తుల మధ్య జరిగేది కాదని.. కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధమని పేర్కొన్నారు. ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చి టీఆర్ఎస్ను బొందపెట్టాలని పిలుపునిచ్చారు. పార్టీలు మారేటప్పుడు చాలా మంది నేతలు నైతిక విలువలు వదిలేస్తున్నారని, తాను మాత్రం పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరానని గుర్తు చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారంటూ కేసీఆర్ ప్రతి ఎన్నిక సమయంలో బెదిరిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ‘హుజూరాబాద్, దుబ్బాకలలో బీజేపీ గెలిచింది, మరి ఏ ఒక్క మోటార్కైనా మీటరు పెట్టారా?’అని ప్రశ్నించారు. తెలంగాణలోని వెయ్యి గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్యను తీర్చేందుకు కేంద్రమే రూ.750 కోట్లు నిధులు ఇచ్చిందని.. అదేదో రాష్ట్ర ప్రభుత్వమే సమస్యను పరిష్కరించినట్టు చెప్పుకుంటోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ కుటుంబ, అవినీతి పాలనను అంతం చేయడానికే అమిత్‌షా మునుగోడుకు వచ్చారన్నారు. తాము రాజగోపాల్‌రెడ్డిని బీజేపీలో చేర్చుకునేందుకు తాము సభ పెట్టామని, మరి టీఆర్ఎస్ మునుగోడులో సభ ఎందుకు పెట్టిందో చెప్పాలని ప్రశ్నించారు. ‘కేసీఆర్ నీకు దురద పెడితే నువ్వే గోక్కో.. మమ్మల్ని గోకమనకు. కేసీఆర్‌కు సమాధానం చెప్పే సత్తా ప్రతి బీజేపీ కార్యకర్తకు ఉంది’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రూ.2 లక్షల కోట్ల సబ్సిడీ, ఫసల్ బీమా పథకంతో ప్రధాని మోదీ రైతులను ఆదుకుంటుంటే.. సీఎం కేసీఆర్ ఇష్టమొచ్చినట్టు విమర్శలు చేయడం ఏమిటని ఎంపీ కె.లక్ష్మణ్ మండిపడ్డారు. కేసీఆర్ ఎనిమిదేళ్లుగా ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేశారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించివేస్తామన్నారు. రాష్ట్రంలో చేనేత, గౌడ, ముదిరాజ్ తదితర అన్ని కులాల ప్రజలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మునుగోడు సభ జనం లేక వెలవెల బోయిందన్నారు. కేసీఆర్‌కు వామపక్షాల మద్దతు సిగ్గుచేటని.. కమ్యూనిస్టుల గొంతు నొక్కి ధర్నాచౌక్‌ను ఎత్తేసిన కేసీఆర్‌కు మద్దతు ఎలా ఇస్తున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నిలదీశారు. ‘‘సీపీఐ, సీపీఎం నేతలు ఎనిమిదేళ్లుగా ఏనాడైనా ప్రగతిభవన్‌లో అడుగు పెట్టారా? మీ కార్మిక సంఘాలు సమ్మెలు చేసినప్పుడు మిమ్మల్ని చర్చలకు పిలిచి మాట్లాడారా? కమ్యూనిస్టు పార్టీలకు, ట్రేడ్ యూనియన్లకు అడ్డా ఇందిరా పార్కు. అలాంటి చోట ధర్నాలు చేసే అధికారం లేదని చెప్పి.. చైతన్యం ఉండకూడదని, ట్రేడ్ యూనియన్లు ఉండకూడదని చెప్పి నిషేధించిన కేసీఆర్ ఈ రోజు ప్రగతికాముకుడిగా కనబడుతున్నారా? ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే.. బ్రహ్మదేవుడు కూడా ఆర్టీసీని కాపాడలేడని కేసీఆర్ బెదిరించి.. అనేక మంది డ్రైవర్లు, కండక్టర్ల ఆత్మహత్యలకు కారణమైనది మర్చిపోయారా? చివరికి ట్రేడ్ యూనియన్లు పెట్టుకోబోమని దండం పెట్టించుకున్న చరిత్రను మరిచిపోయారా?’’అని ఈటల ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు మద్దతిచ్చేవారిని, కేసీఆర్‌తో పొత్తు పెట్టుకునేవారిని తెలంగాణ ప్రజలు క్షమించబోరని వ్యాఖ్యానించారు. చదవండి: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జూ.ఎన్టీఆర్ భేటీ -
బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
సాక్షి, నల్గొండ జిల్లా: మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో ఆరాచక పాలన అంతమొందించాలని పిలుపునిచ్చారు. ‘‘అమ్ముడుపోయే వ్యక్తిని కాదు నేను. మునుగోడు ప్రజల తలదించుకునే పని ప్రాణం పోయినా చేయను’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో సమానత్వం కోసం యుద్ధం జరుగుతోందన్నారు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు. తప్పు చేసిన వారు భయపడతారు. నేను ఏ తప్పూ చేయలేదు. ఎన్నిసార్లు అడిగిన ముఖ్యమంత్రి అపాయిమెంట్ ఇవ్వలేదు. ఉప ఎన్నిక అనగానే సీఎం మునుగోడుకు వచ్చారు. నా రాజీనామాతో ప్రభుత్వం దిగి వచ్చింది’’ అని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. -
గ్యారంటీ ఇస్తున్నా.. కేసీఆర్ సర్కార్ మాయమవుతుంది: అమిత్‌షా
సాక్షి, నల్గొండ జిల్లా: కేసీఆర్ సర్కార్‌ను పడగొట్టేందుకు రాజగోపాల్‌రెడ్డి బీజేపీలోకి చేరారని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఉప ఎన్నికలో రాజగోపాల్‌రెడ్డి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. ‘మునుగోడు సమరభేరి’ పేరిట నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్ అవినీతి సర్కారు మాయం అవుతుందన్నారు. కేసీఆర్ సర్కార్.. అబద్ధాలకోరు ప్రభుత్వం అంటూ ఆయన దుయ్యబట్టారు. చదవండి: రైతులతో అమిత్ షా భేటీ.. కేసీఆర్ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు మజ్లిస్ భయంతోనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ జరపట్లేదని.. బీజేపీ అధికారంలోకి వస్తే విమోచన దినోత్సవాన్ని జరిపిస్తామని అమిత్‌షా ప్రకటించారు. ‘‘పేదవారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేసీఆర్ ఇచ్చారా?. నిరుద్యోగులు రూ.3వేలు ఇస్తామని కేసీఆర్ మాట తప్పారు. ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్నారు. నల్లగొండ జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ప్రారంభం అయ్యిందా’’ అంటూ అమిత్ షా ప్రశ్నించారు. ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి అందిందా?. గిరిజనులకు భూమి ఇస్తానని చెప్పి కేసీఆర్ ఇచ్చారా?. ఉద్యోగాలు కేసీఆర్ కుటుంబాలకు తప్ప ఎవరికీ దక్కలేదు’’ అంటూ ఆయన మండిపడ్డారు. కేసీఆర్ దళితుడ్ని ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పారు. టీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే కేసీఆర్ స్థానంలో కేటీఆర్ వస్తారంటూ’’ అమిత్‌షా ధ్వజమెత్తారు. బీజేపీలోకి చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి అమిత్‌షా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో ఆరాచక పాలన అంతమొందించాలని పిలుపునిచ్చారు. ‘‘అమ్ముడుపోయే వ్యక్తిని కాదు నేను. మునుగోడు ప్రజల తలదించుకునే పని ప్రాణం పోయినా చేయనని’’ ఆయన పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో సమానత్వం కోసం యుద్ధం జరుగుతోందన్నారు. కేసీఆర్ పాలనకు అంతం పలుకుతాం: విజయశాంతి రైతుల్ని, దళితుల్ని కేసీఆర్ మోసం చేశారని బీజేపీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. మునుగోడు నుంచే కేసీఆర్ పాలనకు అంతం పలుకుతామన్నారు. కేసీఆర్‌కు ఫ్రస్టేషన్ ఎక్కువైపోయిందన్నారు. తప్పు చేసిన వారే భయపడతారన్నారు. కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారు. కేసీఆర్ ఎన్ని ఎత్తులు వేసినా బీజేపీ నాయకుల్ని వేరు చేయలేదరని విజయశాంతి అన్నారు. కేసీఆర్ ద్రోహాలు వామపక్ష నేతలు మర్చిపోయారా?: ఈటల రాజేందర్ ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డి విజయం ఖాయమైందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పోవాలన్నదే తెలంగాణ ప్రజల ఆకాంక్ష అన్నారు. ఎనిమిదేళ్లుగా సీపీఐ, సీపీఎం నేతలు ప్రగతి భవన్లో అడుగుపెట్టారా? ధర్నా చౌక్‌ను నిషేధించిన కేసీఆర్‌కు లెఫ్ట్ పార్టీ మద్దతా అంటూ ఈటల మండిపడ్డారు. ఆర్టీసీ ట్రేడ్ యూనియన్లను రద్దు చేసినప్పుడు ఎక్కడున్నారు?. కేసీఆర్ ద్రోహాలు వామపక్ష నేతలు మర్చిపోయారా? అని ఈటల ప్రశ్నలు సంధించారు. -
అమిత్‌షాపై ఆ ప్రచారం తప్పు.. భయం వల్లే ఇలా చేస్తున్నారు: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసత్య ప్రచారం నమ్మొద్దని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మీటర్లపై రైతులు అమిత్‌షాను నిలదీశారనడం అవాస్తవం అన్నారు. సీఎం కేసీఆర్ లీకుల పార్టీ నాయకుడని ఆయన మండిపడ్డారు. చదవండి: కాషాయ పార్టీ కార్యకర్త ఇంట్లో అమిత్ షా.. కీలక హామీ ఇచ్చిన బీజేపీ బాస్! కేసీఆర్‌కు మునుగోడు భయం పట్టుకుందని.. నిన్న ఏం మాట్లాడారో ఆయనకే తెలియదని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. మునుగోడు వేదికగా ముఖ్యమంత్రి అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతామన్నారు. వామపక్షాలను సూది దబ్బునంతో పోల్చిన కేసీఆర్‌తో ఎలా జత కడతారని బండి సంజయ్ ప్రశ్నించారు. రైతులతో అమిత్ షా మునుగోడు బహిరంగ సభకు వెళ్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హైదరాబాద్‌లో రైతు సంఘాల నేతలతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగం ఏం కోరుకుంటోందని రైతులను ఆరా తీశారు. విద్యుత్ చట్టాన్ని మార్చాలని రైతు సంఘాల నేతలు అమిత్ షాను కోరగా.. ‘మార్చాల్సింది చట్టం కాదు. ఇక్కడి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని’ అని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై సోషల్ మీడియాలో ఓ చర్చ వైరల్‌గా మారింది. హోమంత్రి అమిత్‌షాను తెలంగాణ రైతు సంఘాల నేతలు ఇరుకున పెట్టారని కొందరు కామెంట్లు చేశారు. మరికొందరేమో టీఆర్ఎస్ కావాలనే దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. -
కాషాయ పార్టీ కార్యకర్త ఇంట్లో అమిత్ షా.. కీలక హామీ ఇచ్చిన బీజేపీ బాస్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పర్యటనలో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అమిత్ షాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్, బండి సంజయ్ స్వాగతం పలికారు. సత్యనారాయణ ఇంట్లో అమిత్ షా టీ తాగి, స్వీట్ ఆరగించారు. అక్కడే కొంతసేపు ఇంటి సభ్యులతో ముచ్చటించారు. ఈ సందర్బంగా అమిత్ షా మాట్లాడుతూ ప్రతీ కార్యకర్త పార్టీ గెలుపు కోసం బలంగా పోరాడాలని సూచించారు. పార్టీ ప్రతీ ఒక్కరికీ గౌరవం దక్కుతుందని అమిత్ షా హామీ ఇచ్చారు. అనంతరం.. అమిత్ షా.. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్లి.. అమ్మవారిని దర్శించుకున్నారు. దేవాలయంలో అమిత్ షా, బీజేపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం నుంచి అమిత్ షా.. నేరుగా బీజేపీ కార్యకర్త సత్యనారాయణ ఇంటికి వెళ్లనున్నారు. అనంతరం, అక్కడి నుంచి అమిత్ షా మళ్లీ.. బేగంపేట్ ఎయిర్‌పోర్టు చేరుకున్నారు. కాగా, విమానాశ్రయంలో రైతులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రైతులతో వరి కొనుగోలు, రుణమాఫీ, ఫసల్ బీమా యోజనపై అమిత్ షా చర్చించనున్నారు. ఇది కూడా చదవండి: ఊహించని ట్విస్ట్.. అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ.. హీటెక్కిన పాలిటిక్స్?