సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పర్యటనలో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అమిత్ షాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్, బండి సంజయ్ స్వాగతం పలికారు.
సత్యనారాయణ ఇంట్లో అమిత్ షా టీ తాగి, స్వీట్ ఆరగించారు. అక్కడే కొంతసేపు ఇంటి సభ్యులతో ముచ్చటించారు. ఈ సందర్బంగా అమిత్ షా మాట్లాడుతూ ప్రతీ కార్యకర్త పార్టీ గెలుపు కోసం బలంగా పోరాడాలని సూచించారు. పార్టీ ప్రతీ ఒక్కరికీ గౌరవం దక్కుతుందని అమిత్ షా హామీ ఇచ్చారు.
అనంతరం.. అమిత్ షా.. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్లి.. అమ్మవారిని దర్శించుకున్నారు. దేవాలయంలో అమిత్ షా, బీజేపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం నుంచి అమిత్ షా.. నేరుగా బీజేపీ కార్యకర్త సత్యనారాయణ ఇంటికి వెళ్లనున్నారు.
అనంతరం, అక్కడి నుంచి అమిత్ షా మళ్లీ.. బేగంపేట్ ఎయిర్‌పోర్టు చేరుకున్నారు. కాగా, విమానాశ్రయంలో రైతులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రైతులతో వరి కొనుగోలు, రుణమాఫీ, ఫసల్ బీమా యోజనపై అమిత్ షా చర్చించనున్నారు.
ఇది కూడా చదవండి: ఊహించని ట్విస్ట్.. అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ.. హీటెక్కిన పాలిటిక్స్?
Comments
Please login to add a commentAdd a comment