begumpet airport
-
హైదరాబాద్ లో రాష్ట్రపతి
-
బేగంపేట ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బేగంపేట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు.వివరాల ప్రకారం.. బేగంపేట ఎయిర్‌పోర్టుకు సోమవారం ఉదయం బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. సదరు మెయిల్లో విమానాశ్రయంలో బాంబు ఉందని హెచ్చరించారు. దీంతో, అలర్ట్ అయిన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. ఎయిర్పోర్ట్ సహా పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా బాంబు లేదని గుర్తించారు. అనంతరం, సదరు మెయిల్ ఎవరు పంపారనే విషయంపై దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో దేశంలోని పలు విమానాశ్రాయలకు కూడా ఇలాగే బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ రావడం తెలిసిన విషయమే. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో బాంబు లేదని తెలిసి అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇక, ఇలాంటి కాల్స్, మెయిల్స్ పెడితే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. -
రేవంత్, బాబుల మధ్య అదే చర్చ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తన గురువు చంద్రబాబుతో రెండు గంటల పాటు బేగంపేట ఎయిర్ పోర్టులో చర్చలు జరిపారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. రేవంత్‌ను కలిసిన తర్వాతే చంద్రబాబు అమిత్ షాను కలిశారని వివరించారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్‌ను బీజేపీ వైపు తీసుకొస్తానని చంద్రబాబు అమిత్ షాకు హామీ ఇచ్చారని ఆరోపించారు. రేవంత్‌కు చంద్రబాబు ఎంత చెబితే అంతే అని వారు విశ్లేషించారు. తెలంగాణ భవన్లో శనివారం మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్ ,క్రాంతి కిరణ్, నన్నపనేని నరేందర్, బీఆర్ఎస్ నేతలు దేవీప్రసాద్, రాకేష్ కుమార్, గట్టు రాంచందర్ రావు మీడియాతో మాట్లాడారు. మోదీ వద్ద బీజేపీ సీఎంలకు దొరకని ప్రాధాన్యత కాంగ్రెస్ సీఎం రేవంత్‌కు దొరుకుతోందని, పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ బీజేపీతో జత కట్టడం ఖాయంగా కనిపిస్తోందని బీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడ్డారు. మోదీని రేవంత్ పెద్దన్నగా సంభోధించిన తర్వాత వారిద్దరి బంధం బలపడిందని, పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ మరో ఏక్ నాథ్ షిండే, హిమంత్ బిశ్వశర్మగా మారుతారని ఆరోపించారు. బాబు మాదిరిగానే రాష్ట్రంలో ఇప్పుడు మళ్లీ కరువు చంద్రబాబు సీఎంగా ఉండగా తెలంగాణలో కరువు ఉండేదని, ఇప్పుడు చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తెలంగాణలో మళ్ళీ కరువు వచ్చిందని వారు విమర్శించారు. రేవంత్ పత్రికల్లో ఇచ్చే అధికారిక ప్రకటనల్లో ఇప్పటికే మార్పు వచ్చిందనీ, ఉపముఖ్యమంత్రి భట్టి ఫొటో ప్రకటనల్లో అదశ్యమయ్యిందన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ ప్రకటనల్లో అమిత్ షా, చంద్రబాబు ఉంటారని ఆరోపించారు. గతంలో చంద్రబాబు ఆదేశాల మేరకే తెలంగాణ ఉద్యమంపై రేవంత్ రైఫిల్ ఎక్కు పెట్టారని గుర్తు చేశారు. రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నరేంద్రమోడీ చేతిలో పెడుతున్న తీరును కాంగ్రెస్ శ్రేణులు గమనించాలన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణలో ప్రభుత్వం మారుతుందని బీజేపీ నేతలు ఇస్తున్న ప్రకటనలు రేవంత్‌ను దష్టిలో పెట్టుకుని ఇస్తున్నవేనని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, నేతలు ఆరోపించారు. -
వీడ్కోలు సమయాన విన్నపాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తన రెండురోజుల పర్యటన ముగించుకుని ఒడిశాకు వెళ్తున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి సీఎం రేవంత్‌రెడ్డి తన విన్నపాల చిట్టా అందజే శారు. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో వేలకోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్న ప్రధాని మంగళవారం ఒడిశాకు బయలుదేరారు. సీఎం రేవంత్ బేగంపేట విమానాశ్రయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆయనకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మొత్తం 11 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ► ఎన్టీపీసీకి 4,000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉంది. అయితే గత ప్రభుత్వం 1,600 మెగావాట్లు మాత్రమే సా ధించింది. మిగిలిన 2,400 మెగావాట్ల ఉత్పత్తికి కేంద్రం సహ కరించాలి. రాష్ట్రం తరఫున అన్ని అనుమతులు ఇస్తాం. ► హైదరాబాద్‌లో మెట్రో విస్తరణకు, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి (ప్రక్షాళనకు) సహకరించాలి. ► తుమ్మిడిహెట్టి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భూసేకరణ, నీటి వాటాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేలా ప్రధాని జోక్యం చేసుకోవాలి. ► హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై అమ్రాబాద్ అటవీ ప్రాంతం మీదుగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సహకరించాలి. 2022–23లోనే కేంద్ర ప్రభుత్వం డీపీఆర్ తయారీకి రూ.3 కోట్లు మంజూరు చేసింది. రూ.7,700 కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును మంజూరు చేయాలి. ► రాష్ట్రంలో ఇంటింటికీ నల్లా నీరు నూటికి నూరు శాతం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలి. దాదాపు పది లక్షల కుటుంబాలకు ఇప్పటికీ నల్లాల ద్వారా నీటి సరఫరా జరగడం లేదు. సమీపంలోని నీటి వనరుల ద్వారా గ్రామాలకు రక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు జల జీవన్ మిషన్ నిధులు కేటాయించాలి. ► ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి హైదరాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో 178 ఎకరాలు, 10 టీఎంసీల కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణానికి పొన్నాల గ్రామ సమీపంలోని 1,350 ఎకరాల మిలటరీ డెయిరీ ఫామ్ ల్యాండ్స్ (తోఫెఖానా) రాష్ట్రానికి బదిలీ చేయాలి. లీజు గడువు ముగిసిన శామీర్‌పేటలో ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ భూములను (1,038 ఎకరాలు) తిరిగి అప్పగించాలి. ► నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమం రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తున్నాం. 5,259 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ప్రభుత్వం నిర్వహిస్తో్తంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర వాటాగా రాష్ట్రానికి రావాల్సిన రూ.347.54 కోట్లను విడుదల చేయాలి. ► భారత్ మాల పరియోజన జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా కల్వకుర్తి–కొల్లాపూర్, గౌరెల్లి–వలిగొండ, తొర్రూర్ – నెహ్రూనగర్, నెహ్రూనగర్–కొత్తగూడెం, జగిత్యాల–కరీంనగర్ ఫోర్‌లేన్, జడ్చర్ల–మరికల్ ఫోర్‌లేన్, మరికల్ – డియసాగర్ టెండర్ల ప్రక్రియకు అనుమతులివ్వాలి. ► ఇండియా సెమీ కండకర్ల మిషన్‌లో భాగంగా తెలంగాణలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం సహకరించాలి. అత్యవసరంగా 29 ఐపీఎస్ పోస్టులను కేటాయించాలి కేంద్ర హోంశాఖ 2016లో తెలంగాణకు 76 ఐపీఎస్ కేడర్ పోస్టులను మంజూరు చేసింది. ప్రస్తుతం పెరిగిన జిల్లాలు, పోలీస్ కమిషనరేట్ల సంఖ్యకు అనుగుణంగా ఐపీఎస్ క్యాడర్‌ను సమీక్షించాలి. అత్యవసరంగా 29 పోస్టులను కేటాయించాలి. ఐఐఎం కూడా ఏర్పాటు చేయండి ఐఐటీ, నల్సార్, సెంట్రల్ వర్సిటీతో పాటు ఎన్నో పేరొందిన పరిశోధన, ఉన్నత విద్యా సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయి. కేంద్రం ఐఐఎంను కూడా ఏర్పాటు చేస్తే అవసరమైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. మాకే ఓటేయండి.. మంగళవారం బేగంపేట విమానాశ్రయంలో ఓ సరదా సన్నివేశం చోటు చేసు కుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఏకంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్‌రెడ్డిని బీజేపీకి ఓటేయాలంటూ కోరారు. మంగళవారం ప్రధానికి వీడ్కోలు పలికే సమయంలో క్లిక్‌మనిపించిన ఈ ఫొటోలో మోదీ, రేవంత్‌రెడ్డితో పాటు మంత్రి పొన్నం, నాగర్‌కర్నూల్ ఎంపీ పి.రాములు ఉన్నారు. ఇటీవల బీజేపీలో చేరిన రాములు.. సీఎం రేవంత్ తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఓటరేనని ఈ సందర్భంగా మోదీకి చెప్పారు. అందుకు రేవంత్ కూడా అవునంటూ బదులిచ్చారు. వెంటనే స్పందించిన మోదీ ‘అయితే ఇంకేంటి.. ఈసారి మా కే ఓటేయండి..’ అంటూ సరదాగా వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే మోదీ సహా ఫొటోలో కనిపిస్తున్న నేతలు ఒక్కసారిగా ఘొల్లున నవ్వారు. – సాక్షి, హైదరాబాద్ -
Begumpet: గంటసేపు ఉత్కంఠ.. ఐఏఎఫ్ విమానం సేఫ్ ల్యాండ్
-
Begumpet: గంటసేపు ఉత్కంఠ.. ఐఏఎఫ్ విమానం సేఫ్ ల్యాండ్
సాక్షి, హైదరాబాద్: బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ఐఏఎఫ్ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. సాంకేతిక లోపంతో విమానం గాలిలో చక్కర్లు కొట్టింది. గంటకుపైగా ఎయిర్‌ఫోర్స్ విమానం గాలిలో చక్కర్లు కొట్టింది. ఎయిర్ ఫోర్స్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ హైడ్రాలిక్స్ వీల్స్ ఓపెన్ కావడంతో గంటకు పైగా విమానం ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. ప్రస్తుతం ఈ విమానంలో సిబ్బందితో సహా 12 మంది ఉన్నారు. సేఫ్ ల్యాండింగ్ కోసం ఏవియేషన్ సిబ్బంది ప్రయత్నించగా, ఉత్కంఠత కొనసాగింది. గంట సేపు ఉత్కంఠత తర్వాత చివరకు బేగంపేట ఎయిర్ పోర్టులో ఐఏఎఫ్ విమానం సురక్షితంగా ల్యాండింగ్ అయ్యింది. సేఫ్‌గా ల్యాండ్ కావడంతో విమానంలో ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. -
బేగంపేట్ ఎయిర్ పోర్టులో 2వ రోజు వింగ్స్ ఇండియా-2024 షో
-
Aviation Expo Wings India 2024: విమానయానం ఉజ్వలం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘మనుషులను, మనసులను విమానయాన రంగం అనుసంధానిస్తోంది. జీవితాల్లో మార్పు తెచ్చింది. సామాజిక, ఆర్థిక పురోగతిలో పాలుపంచుకుంటోంది. నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత విమానయాన పరిశ్రమ వెలుగులమయం’ అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గురువారం అన్నారు. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో రెండేళ్లకోసారి జరిగే వైమానిక ప్రదర్శన వింగ్స్ ఇండియా–2024 ప్రారంబోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. సామాన్యుడికీ విమానయాన అవకాశాన్ని అందించే ఉడాన్ 5.3 స్కీమ్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. దేశీయంగా 30 కోట్లకు.. పౌర విమానయాన రంగంలో ప్రపంచంలో అయిదవ స్థానంలో భారత్ నిలిచిందని జ్యోతిరాదిత్య తెలిపారు. ‘2014లో దేశీయంగా 6 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. 2023లో ఈ సంఖ్య 15.3 కోట్లకు ఎగసింది. 2030 నాటికి ఇది 30 కోట్లను తాకుతుంది. విమాన ప్రయాణికుల విస్తృతి ప్రస్తుతం కేవలం 3–4 శాతమే. ఏడేళ్లలో ఇది 10–15 శాతానికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. మిగిలిన 85 శాతం మేర అవకాశాలను అందుకోవడానికి కసరత్తు చేస్తున్నాం. అడ్డంకులు తొలగించడంతోపాటు మౌలిక వసతుల కల్పన చేపడుతున్నాం’ అని వివరించారు. కొత్త విమానాశ్రయాలు.. దేశవ్యాప్తంగా 2014 నాటికి 74 విమానాశ్రయాలు, హెలిప్యాడ్స్, వాటర్ డ్రోమ్స్ ఉన్నాయి. ఇవి రావడానికి 65 ఏళ్ల సమయం పట్టిందని సింధియా తెలిపారు. ‘గడిచిన 10 ఏళ్లలో 75 విమానాశ్రయాలు, హెలిప్యాడ్స్, వాటర్ డ్రోమ్స్ జోడించాం. దీంతో ఈ కేంద్రాల సంఖ్య 149కి చేరుకుంది. 2030 నాటికి ఇవి 200 దాటతాయి. ప్రతి జిల్లా కేంద్రంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలన్నది ప్రణాళిక. ప్రస్తుతం భారతీయ విమానయాన సంస్థల వద్ద 713 విమానాలు ఉన్నాయి. వచ్చే దశాబ్దిలో వీటి సంఖ్య 2,000 దాటుతుంది. విమానాల కొనుగోలులో యూఎస్, చైనా తర్వాతి స్థానాన్ని భారత్ కైవసం చేసుకుంది’ అని అన్నారు. రికార్డు స్థాయిలో మహిళా పైలట్లు.. ప్రయాణికుల వృద్ధి రేటు దేశీయంగా 15.3 శాతం, అంతర్జాతీయంగా 6.1 శాతం ఉంది. 15 ఏళ్లలో విమానాల్లో సరుకు రవాణా దేశీయంగా 60 శాతం, విదేశాలకు 53 శాతం అధికమైందని సింధియా గుర్తు చేశారు. ‘గతేడాది 1,622 మంది కమర్షియల్ పైలట్ లైసెన్స్ అందుకున్నారు. వీరిలో 18 శాతం మహిళలు కావడం విశేషం. భారత్‌లో ఉన్న పైలట్లలో మహిళల వాటా 15 శాతం ఉంది. ఇది ప్రపంచ రికార్డు. డ్రోన్స్ రంగంలో ప్రపంచ కేంద్రంగా భారత్‌ను నిలబెట్టేందుకు నిబంధనలు సరళీకరించాం, ప్రోత్సాహకాలు ప్రకటించాం’ అని చెప్పారు. కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ (రిటైర్డ్) వి.కె.సింగ్, తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో వింగ్స్ ఇండియా ఏవియేషన్ షో
-
Wings India 2024: బేగంపేట్ ఎయిర్పోర్ట్ వేదికగా ‘వింగ్స్ ఇండియా–2024’ (ఫొటోలు)
-
గగనంలో అద్భుత వీక్షణకు
సనత్‌నగర్ (హైదరాబాద్): గగనంలో గగుర్పొడిచే విన్యాసాలకు మరోసారి బేగంపేట విమానాశ్రయం వేదికైంది. వింగ్స్ ఇండియా–2024కు కౌంట్‌డౌన్ మొదలైంది. రెండేళ్లకోసారి జరిగే ఈ వేడుకను కేంద్ర పౌర విమాన శాఖ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సంయుక్తంగా ఈ నెల 18 నుంచి 21 వరకు నిర్వహిస్తున్నాయి. గురువారం ఉదయం 10 గంటలకు జరిగే వింగ్స్ ఇండియా–2024 ప్రారంబోత్సవానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. దాదాపు 25 విమానాలు, హెలికాప్టర్లను ప్రదర్శనకు ఉంచనున్నారు. తొలిసారి ప్రదర్శనకు వస్తున్న బోయింగ్‌తోపాటు ఎయిర్ ఇండియా మొదటి హెలికాప్టర్ ఏ350 లాంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మొదటి 2 రోజులు (18, 19 తేదీలు) వ్యాపార, వాణిజ్యవేత్తలను, ఆ తరువాత రెండు రోజులు (20, 21 తేదీలు) సామాన్యులను అనుమతిస్తారు. ఈ షోలో 106 దేశాల నుంచి 1500 మంది డెలిగేట్స్, 5,000 మంది బిజినెస్ విజిటర్స్ పాల్గొననున్నట్లు అంచనా. ఫ్లయింగ్ డిస్ప్లే సమయం పెరిగిందోచ్.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సారంగ్ టీమ్‌తోపాటు మార్క్ జాఫరీస్ బృందం చేసే వైమానిక విన్యాసాలను కళ్లు ఆర్పకుండా చూడాల్సిందే. గతంలో ఫ్లెయింగ్ డిస్ప్లే సమయాన్ని కేవలం 15 నిమిషాల చొప్పున రోజుకు రెండు పర్యాయాలు నిర్వహించగా, ఈసారి 45 నిమిషాల చొప్పున రోజుకు రెండు సార్లు విన్యాసాలు చేయనున్నారు. చివరి రోజు ఆదివారం సందర్శకులు ఎక్కువగా విచ్చేయనున్న దృష్ట్యా ఆ రోజు మూడుసార్లు విన్యాసాలు నిర్వహించనున్నారు. సారంగ్ టీమ్ వచ్చేసింది.. ముగ్గురు హైదరాబాదీలే.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సారంగ్ టీమ్ మరోసారి తమ వైమానిక విన్యాసాలు ప్రదర్శించేందుకు రెడీ అయ్యింది. ప్రపంచంలోనే ఏరోబాటిక్స్ చేసే ఏకైక జట్టుగా పేరొందిన ఈ టీమ్ ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకుంది. ఐదు హెలికాప్టర్లతో ఏరోబాటిక్స్ ప్రదర్శించే ఈ బృందానికి సీనియర్ గ్రూప్ కెపె్టన్ ఎస్కే మిశ్రా నేతృత్వం వహిస్తున్నారు. ఏరోబాటిక్స్ ప్రదర్శన చేసే ఐదుగురిలో ముగ్గురు హైదరాబాదీలే కావడం విశేషం. హైదరాబాదీలైన వింగ్ కమాండర్లు టీవీఆర్ సింగ్, అవినాష్ సారంగ్ టీమ్‌లో రాణిస్తున్నారు. దేశ, విదేశాల్లో ఈ టీమ్ 350 షోలకు పైగా నిర్వహించి రికార్డు సృష్టించింది. వైమానిక విన్యాసాల వేళలు 18వ తేదీన మధ్యాహ్నం 1 – 2 గంటల వరకు, 4.15–5 గంటల వరకు 19న ఉదయం 11.30–12.15 వరకు, మధ్యాహ్నం 3.30–4.15 వరకు. అనంతరం డ్రోన్ షో జరగనుంది. 20న ఉదయం 11.30–12.15 వరకు, మధ్యాహ్నం 3.30–4.15 వరకు.. 21న ఉదయం 11–11.45 వరకు, మధ్యాహ్నం 3–3.45 వరకు, సాయంత్రం 5–5.45 వరకు -
హైదరాబాద్‌లో వింగ్స్ 24 ఎగ్జిబిషన్ (ఫొటోలు)
-
సంజయ్ ఎలా ఉన్నావ్ ?
-
Wings India 2024: ఎయిర్ షో తేదీలు ఖరారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెండేళ్లకోసారి ప్రతిష్టాత్మకంగా జరిగే వింగ్స్ ఇండియా 2024 కార్యక్రమానికి తేదీలు ఖరారయ్యాయి. బేగంపేట విమానాశ్రయం వేదికగా జనవరి 18 నుంచి నాలుగు రోజులపాటు ఇది జరుగనుంది. పౌర విమానయాన శాఖ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, తెలంగాణ ప్రభుత్వం, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ (ఫిక్కీ) సంయుక్తంగా వింగ్స్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. పౌర విమానయాన రంగంలో ఆసియాలో ఇదే అతిపెద్ద ప్రదర్శన. 2022లో జరిగిన వింగ్స్ ఇండియా ప్రదర్శనలో 125 కంపెనీలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు గవర్నమెంట్ సమావేశాలు 364 జరిగాయి. 12 ఎయిర్‌క్రాఫ్ట్స్ కొలువుదీరాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సారంగ్ బృందం చేసిన ఎయిర్‌షో ప్రత్యేక ఆకర్షణ. -
ప్రధానిని అవమానించేలా ఫ్లేక్సీలు పెట్టారు: కిషన్‌రెడ్డి
-
ప్రధానిని ఆహ్వానించేందుకు కేసీఆర్‌కు మొహం చెల్లటం లేదు: డీకే అరుణ
-
రైతులతో అమిత్ షా భేటీ.. కేసీఆర్ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిజీ బిజీగా ఉన్నారు. నగరానికి చేరుకున్న వివిధ కార్యక్రమాల్లో పాల్గొని బేగంపేట విమానాశ్రయంలో రైతు సంఘాల నేతలతో అమిత్ షా భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు రైతులతో అమిత్ షా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా.. తెలంగాణ రైతాంగం ఏం కోరుకుంటోందని రైతులను ఆరా తీశారు. ఈ క్రమంలో విద్యుత్ చట్టాన్ని మార్చాలని రైతు సంఘాల నేతలు అమిత్ షాను కోరగా.. దానికి అమిత్ షా సమాధానమిస్తూ మార్చాల్సింది చట్టం కాదు. ఇక్కడి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సంచలన కామెంట్స్ చేశారు. ఇక, అమిత్ షాతో భేటీ ముగిసిన అనంతరం రైతు సంఘాల నేతలు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణలో అమలు చేయడంలేదు. దీని వల్ల తెలంగాణ రైతులు బీమా సౌకర్యాన్ని కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా భూసార పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రం నిధులు ఇస్తున్నా.. తెలంగాణలో మాత్రం భూసార పరీక్షలు జరగడంలేదు. ఇన్పుట్ సబ్సీడీ కూడా రావడంలేదని అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిపారు. అలాగే, సేంద్రీయ వ్యవసాయం పెరగాల్సిన అవసరం ఉందని చెప్పినట్టు స్పష్టం చేశారు. ఈ సందర్బంలోనే మోటర్లకు మీటర్లు అనే ప్రతిపాదన లేదని అమిత్ షా క్లారిటీ ఇచ్చారని అన్నారు. ఇదంతా కేసీఆర్ ఆడుతున్న పొలిటికల్ డ్రామా అని చెప్పారని రైతులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: కాషాయ పార్టీ కార్యకర్త ఇంట్లో అమిత్ షా.. కీలక హామీ ఇచ్చిన బీజేపీ బాస్! -
బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న అమిత్ షా
-
కాషాయ పార్టీ కార్యకర్త ఇంట్లో అమిత్ షా.. కీలక హామీ ఇచ్చిన బీజేపీ బాస్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పర్యటనలో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అమిత్ షాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్, బండి సంజయ్ స్వాగతం పలికారు. సత్యనారాయణ ఇంట్లో అమిత్ షా టీ తాగి, స్వీట్ ఆరగించారు. అక్కడే కొంతసేపు ఇంటి సభ్యులతో ముచ్చటించారు. ఈ సందర్బంగా అమిత్ షా మాట్లాడుతూ ప్రతీ కార్యకర్త పార్టీ గెలుపు కోసం బలంగా పోరాడాలని సూచించారు. పార్టీ ప్రతీ ఒక్కరికీ గౌరవం దక్కుతుందని అమిత్ షా హామీ ఇచ్చారు. అనంతరం.. అమిత్ షా.. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్లి.. అమ్మవారిని దర్శించుకున్నారు. దేవాలయంలో అమిత్ షా, బీజేపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం నుంచి అమిత్ షా.. నేరుగా బీజేపీ కార్యకర్త సత్యనారాయణ ఇంటికి వెళ్లనున్నారు. అనంతరం, అక్కడి నుంచి అమిత్ షా మళ్లీ.. బేగంపేట్ ఎయిర్‌పోర్టు చేరుకున్నారు. కాగా, విమానాశ్రయంలో రైతులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రైతులతో వరి కొనుగోలు, రుణమాఫీ, ఫసల్ బీమా యోజనపై అమిత్ షా చర్చించనున్నారు. ఇది కూడా చదవండి: ఊహించని ట్విస్ట్.. అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ.. హీటెక్కిన పాలిటిక్స్? -
‘సీఎం ఎవరు కౌన్ కిస్కా.. కేసీఆర్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలే తమకు బాస్‌లు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. తెలంగాణ సమాజానికి తమ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాధానం చెప్పారని పేర్కొన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. పర్యటన ముగిసిన నేపథ్యంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు వద్ద సోమవారం ప్రధాని మోదీకి బండి సంజయ్ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో బండి సంజయ్ మాట్లాడుతూ.. సీఎం ఎవరు కౌన్ కిస్కా.. కేసీఆర్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. ముందు తెలంగాణ ప్రజలకు కేసిఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ప్రజల వద్ద మొహం లేక రాష్ట్ర ముఖ్యమంత్రి పారిపోతున్నారు. మోదీని ఎదుర్కోడానికి ఫ్లెక్సీల కోసం పెట్టిన డబ్బులను ప్రజల కోసం ఖర్చు పెట్టు కేసిఆర్. నిన్నటి ప్రధాని సభకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జాతీయ కార్యవర్గ సమావేశాలను తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తున్నాం. కేసిఆర్ మీద ఉన్న వ్యతిరేకత నిన్నటి విజయ సంకల్ప సభతో మరోసారి బహిర్గతం అయింది. కేసీఆర్ తప్పుడు విధానాల పలితమే నిన్నటి సభ. తెలంగాణ ప్రజలకు మోదీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. -
విజయవంతంగా ముగిసిన ఏవియేషన్ షో (ఫొటోలు)
-
లోహ విహంగాల హంగామా.. 'వింగ్స్ ఇండియా' (ఫోటోలు)
-
WINGS INDIA 2022 : రెక్కలు తొడిగిన గగనం (ఫొటోలు)
-
వరుస సమావేశాలు.. పోటెత్తిన విజిటర్లు
బేగంపేట ఎయిర్‌పోర్టులో జరుగుతున్న వింగ్స్ ఆఫ్ ఇండియా 2022 ఏవియేషన్ షో రెండో రోజు సందండిగా సాగింది. ఏవియేషన్ సెక్టార్‌కి చెందిన కీలక కాన్ఫరెన్సులు రెండో రోజు జోరుగా కొనసాగాయి. మరోవైపు ఏవియేషన్ షో చూసేందుకు బిజినెస్ విజిటర్లు భారీగానే వచ్చారు. హెలికాప్టర్లు, హిందూస్తాన్ విమానాలు మొదలు ఎయిర్‌బస్ వరకు అనేక విహాంగాలను ఈ షోలో ప్రదర్శించారు. హర్యాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తిరుపతి ఎంపీ గురుమూర్తి తదితరులు ఈ షోకు హాజరయ్యారు. గ్లోబల్ ఏవియేషన్ సమ్మిట్‌లో భాగంగా రెండో రోజు ఫ్యూచర్ ఆఫ్ ట్రావెల్, ఎయిర్పోర్ట్ పర్స్పెక్టివ్, ఎయిరో మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ ఎంఆర్వో, ఇండో యూఎస్ రౌండ్ టేబుల్ తదితర అంశాలపై విస్త్రృత చర్చలు జరిగాయి. వింగ్స్ ఆఫ్ ఇండియా చివరి రెండు రోజులు సాధారణ సందర్శనకు అనుమతి ఇస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ షోకు రావాలనుకునే వారు వింగ్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్, బుక్ మై షో ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలు, సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక ఎయిర్‌షో ఉంటుంది. -
ఆకట్టుకున్న 'వింగ్స్ ఇండియా 2022' ఏవియేషన్ షో
-
హైదరాబాద్: రెండో రోజు వింగ్స్ ఇండియా ఎయిర్ షో
-
గగనమంత ఉత్సాహం: ఆకట్టుకున్న ‘వింగ్స్ ఇండియా’ ఏవియేషన్ షో (ఫొటోలు)
-
WINGS INDIA 2022 : నేటి నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టులో ఏవియేషన్ షో (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా 2022 ఏవియేషన్ షో
సాక్షి, హైదరాబాద్: ఆసియా దేశపు అతిపెద్ద ఏవియేషన్ షో... పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతిష్టాత్మక దైవార్షిక ప్రదర్శన.. వింగ్స్ ఇండియా 2022 నగరంలో కొలువుదీరనుంది. బేగంపేట ఎయిర్పోర్ట్ ఆవరణలో మార్చి 24 నుంచి 4 రోజుల పాటు జరుగనున్న ఈ భారీ ఏవియేషన్ షో కోసం సర్వం సిద్ధమైంది. కరోనా కారణంగా గత మార్చిలో ఈ షోను కేవలం బిజినెస్ మీట్‌గా మాత్రమే పరిమితం చేశారు. రెండేళ్ల కోవిడ్ కాటు నుంచి కోలుకుంటూ... నగరంలో వింగ్స్ ఇండియా పూర్తి స్థాయిలో సందడి చేయనుంది ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో పాటు పలు ప్రభుత్వ విభాగాలు పాలు పంచుకుంటుండగా, నగరానికి చెందిన ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) వింగ్స్ ఇండియా నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. రాజకీయ/ పరిశ్రమ ప్రముఖుల హాజరు... ఈ కార్యక్రమాన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ప్రారంభిస్తారు. మరో కేంద్రమంత్రి వికె సింగ్‌లు హాజరుకానున్నారు. చర్చలు.. సదస్సులు.. ఈ కార్యక్రమంలో హెలికాప్టర్ పరిశ్రమపై రౌండ్ టేబుల్ చర్చ జరుగనుంది. అదే విధంగా ఏవియేషన్ ఫైనాన్సింగ్– లీజింగ్ డ్రోన్స్, ఏవియేషన్ రివైవల్, ఏరో మాన్యుఫ్యాక్చరింగ్ భవిష్యత్తు, నిర్వహణ, మరమ్మతు, కార్యకలాపాలు తదితర అంశాలపై ప్యానెల్ చర్చ నిర్వహిస్తారు. సంబంధిత రంగంతో పాటు అనుబంధ రంగాలకు చెందిన పలు సంస్థలకు వింగ్స్ ఇండియా పురస్కారాలను మార్చి 25న ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమం హోటల్ తాజ్‌కృష్ణాలో జరుగుతుంది. చివరి 2రోజులూ సందర్శకులకు... ఈ ఈవెంట్లో తొలి 2 రోజులూ వ్యాపార కార్యకలాపాల కోసం పరిమితం చేశారు. చివరి 2 రోజులూ సాధారణ ప్రజలను అనుమతిస్తారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించాలనుకునేవారు ఆన్లైన్ ద్వారా మాత్రమే టిక్కెట్స్ కొనుగోలు చేయడానికి వీలుంటుంది. (క్లిక్: ఆకాశంలో నడక.. అక్కడే టీ, కాఫీ, స్నాక్స్ ) విహంగాలు.. విశేషాలు.. ఈసారి ఎయిర్ షోలో సరికొత్త ఎయిర్ బస్ 350 సందడి చేయనుంది. సుదీర్ఘ ప్రయాణాలకు వీలుగా అందుబాటులోకి తెస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ కావడంతో గత కొంతకాలంగా ఎయిర్ బస్ 350పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అదే విధంగా బ్రెజిల్ కు చెందిన ఎంబ్రార్స్ సంస్థ నుంచి అతిపెద్ద కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇ 195–ఇ2 కూడా ప్రదర్శనలో కొలువుదీరనుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న డిమాన్స్ట్రేషన్ టూర్లో భాగంగా ఇది నగర వాసులకు పరిచయం కానుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కు చెందిన సారంగ్ టీమ్ ఆధ్వర్యంలో ఏరోబ్యాటిక్స్ షో సమర్పిస్తారు. (క్లిక్: జీహెచ్ఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంపులు ఎప్పటి నుంచి అంటే..) -
బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్న గౌతమ్‌రెడ్డి పార్థివ దేహం
-
బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం
-
సీఎంతో భేటీ.. హాట్‌టాపిక్‌గా మారిన చిరంజీవి కామెంట్స్
Megastar Chiranjeevi Sensational Comments: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖుల సమావేశంపైనే ఇప్పుడు ఇండస్ట్రీ అంతా చర్చిస్తుంది. చిరంజీవి, మహేశ్‌బాబు, కొరటాల శివ, ప్రభాస్ సహా ఇతర ప్రముఖులు ఈ భేటీలో పాల్గొన్నారు. సినిమా టికెట్ల ధర సహా మొత్తం 17 అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా భేటికి హాజరుకానున్న నేపథ్యంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న చిరంజీవి ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 'నాకు సీఎంఓ నుంచి ఆహ్వానం అందింది. మిగతా ఎవరు వస్తారో తెలియదు. మీడియాలో చూసి తెలుసుకుంటున్నా' అని పేర్కొన్నారు. ఈ భేటీతో ఇండస్ట్రీ సమస్యలకు శుభం కార్డ్ పడుతుందని భావిస్తున్నా అని పేర్కొన్నారు. అయితే సినీ ప్రముఖుల భేటీ విషయంలో ఎవరెవరు పాల్గొంటారో తెలిదు అంటూ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. -
ఎంఆర్వో సేవలకు హబ్‌గా భారత్!
న్యూఢిల్లీ: మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో పౌర విమానయాన శాఖ నూతన ఎంఆర్వో విధానాన్ని ప్రకటించింది. విమానాల నిర్వహణ, మరమ్మతులనే ఎంఆర్వోగా పేర్కొంటారు. ఎంఆర్వో సేవల కోసం భూ కేటాయింపులకు టెండర్ విధానాన్ని అనుసరించనుంది. ఇందుకోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వసూలు చేసే రాయలీ్టని రద్దు చేసింది. అదే విధంగా భూమిని ప్రస్తుతం 3–5ఏళ్ల కాలానికే కేటాయిస్తుండగా.. ఇక మీదట 30 ఏళ్ల కాలానికి లీజ్ తీసుకోవచ్చు. భారత్‌ను ఎంఆర్వో సేవల కేంద్రంగా (హబ్) తీర్చిదిద్దటమే ప్రభుత్వ ధ్యేయంగా పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింథియా తెలిపారు. నూతన విధానంలోని అంశాలు.. ► భూమికి ప్రస్తుతం ఎంత అద్దె వసూలు చేయాలన్నది ఏఏఐ ముందుగా నిర్ణయిస్తోంది. కొత్త విధానంలో బిడ్డింగ్ ద్వారా దీన్ని నిర్ణయించనున్నారు. ► అలాగే, భూమిని లీజుకు తీసుకున్న సంస్థలు ప్రతీ మూడేళ్లకు 7.5–10 శాతం స్థాయిలో 15 శాతం చొప్పున అద్దెను పెంచి చెల్లించాల్సి ఉంటుంది. ► దరఖాస్తు చేసుకుంటే భూమిని కేటాయించే విధానం స్థానంలో.. టెండర్ ద్వారా కేటాయించే విధానం అమల్లోకి వస్తోంది. ► ఇప్పటికే తీసుకున్న లీజును రెన్యువల్ చేసుకునే సమయంలో చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ► ప్రస్తుత లీజు కాంట్రాక్టు ముగిసిపోతే టెండర్ విధానంలో కేటాయింపు ఉంటుంది. గరిష్ట బిడ్డర్‌కు 15 శాతం సమీపంలోనే పాత ఎంఆర్వో సంస్థ బిడ్ నిలిస్తే.. గరిష్ట బిడ్డర్ ఆఫర్ చేసిన ధరను చెల్లించడం ద్వారా కాంట్రాక్టును సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. జాబితాలో బేగంపేట ఎయిర్పోర్ట్ విమానాలు, హెలికాప్టర్ల ఎంఆర్వో సేవలను మరింత విస్తరించే లక్ష్యంతో.. పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా ఎనిమిది విమానాశ్రయాలను గుర్తించినట్టు మంత్రి జ్యోతిరాదిత్య సింథియా తెలిపారు. అందులో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంతోపాటు.. భోపాల్, చెన్నై, చండీగఢ్, ఢిల్లీ, జుహు, కోల్‌కతా, తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లు ఉన్నాయి. ఎనిమిది ఫ్లయిట్ శిక్షణ సంస్థలను తొలి దశలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) నమూనాలో ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఐదు విమానాశ్రయాలను ఉడాన్ పథకం కింద నిర్వహణలోకి తీసుకురానున్నట్టు చెప్పారు. ఇదే పథకం కింద ఆరు హెలిపోర్ట్‌లను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు. -
బేగంపేట ఎయిర్పోర్ట్ : ఆకాశవీధిలో ఆహా!
-
అద్భుతంగా ‘సారంగ్’ టీమ్ విన్యాసాలు
సనత్‌నగర్: బేగంపేట ఎయిర్పోర్ట్ వేదికగా వింగ్స్ ఇండియా–2020 గురువారం ప్రారంభమైంది. ఇందులో సారంగ్ టీమ్ వైమానిక విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. సారంగ్ టీమ్ నాలుగు రోజుల పాటు గురువారం నుంచి ప్రతిరోజూ ఉదయం 11.30 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 4.30 గంటల వరకు వైమానిక విన్యాసాలు చేయనున్నారు. ఈ టీమ్ ప్రధానంగా భారత వైమానిక దళం వైపు యువతను ప్రేరేపించే దిశగా ప్రదర్శనలు ఇస్తుంటుంది. సారంగ్ హెలికాప్టర్ 2003లో బెంగళూరులో అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్) ఎవాల్యుషన్ ఫ్లైట్ వారు రూపొందించారు. దీన్ని ‘ధ్రువ్’గా పిలుస్తారు. ఇది ఇండియన్ ఏవియేషన్ సెక్టార్‌కు మూల స్తంభంగా నిలబడింది. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)చే డిజైన్ చేయబడింది. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను ఛేదించే మల్టీ–మిషన్ సామర్థ్యం కలిగిన హెలికాప్టర్‌గా ఖ్యాతి గడించింది. భారతీయ వైమానిక దళం వృత్తి నైపుణ్యాన్ని, భారత విమానయాన పరిశ్రమ సాధించిన మైలురాళ్లను ప్రదర్శించే లక్ష్యానికి ఈ హెలికాప్టర్లు మార్గం సుగమం చేశాయి. ఈ హెలికాప్టర్ల బృందానికి సారంగ్ అని నామకరణం చేశారు. సారంగ్ అంటే సంస్కృతంలో నెమలి. ఈ బృందం భారతీయ వైమానిక దళం బ్రాండ్ అంబాసిడర్లుగా నిలుస్తోంది. 2004 ఫిబ్రవరిలో సింగపూర్‌లో జరిగిన ఆసియా ఏరోస్పేస్ ఎయిర్ షోలో సారంగ్ బృందం తన తొలి బహిరంగ ప్రదర్శన ఇచ్చింది. ఆ తరువాత అదే ఏడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆల్ ఐన్ గ్రాండ్ ప్రిక్స్, 2008 మేలో బెర్లిన్‌లో జరిగిన ఇండో–జర్మన్ ఎయిర్ షోలో పాల్గొని బెస్ట్ ఏరోబాటిక్ టీమ్‌గా పేరుతెచ్చుకుంది. రాజెడ్ 90వ వార్షికోత్సవం సందర్భంగా యునైటెడ్ కింగ్డమ్లో, ఆ తరువాత ఆర్ఏఎఫ్ ఫెయిర్పోర్ట్లోని రాయల్ ఇంటర్నేషనల్ ఎయిర్ టాటూలో ప్రదర్శనలు ఇచ్చారు. 2008లో ప్రఖ్యాత ఫార్న్‌బరో ఎయిర్‌షో, 2016 జవనరిలో అల్ సఖీర్ ఎయిర్‌బేస్ వద్ద జరిగిన బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ షో, 50వ జాతీయ దినోత్సవం సందర్భంగా 2018 మార్చిలో మారిషస్‌లో సారంగ్ టీమ్ ఎయిర్ షోలు చేసింది. అవే కాకుండా ఫోఖ్రాన్‌లో ఫైర్ పవర్ డిమానిస్ట్రేషన్ వంటి ఉత్సవ సందర్భాల్లో వైమానిక విన్యాసాలను చేయడంతో పాటు బెంగళూరులోని ఏరో ఇండియా ఎయిర్ షోలో ఈ బృందం క్రమం తప్పకుండా పాల్గొంటుంది. ప్రెసిడెన్షియల్ ప్లీట్ రివ్యూ, నేవీ డే, వరల్డ్ మిలటరీ గేమ్స్, కామన్వెల్త్ యూత్ గేమ్స్ వంటి ఉత్సవ సందర్భాల్లో ఎయిర్ షో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. షోల ప్రదర్శన మాత్రమే కాకుండా యువతను వైమానిక దళం వైపు మళ్లించేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది. బాధ్యతాయుతమైన పాత్ర 2006లో గుజరాత్లో వైబ్రంట్, 2008లో ముంబాయిలో మెరైన్ డ్రైవ్, 2014లో అరుణాచల్ ప్రదేశ్‌లోని పసిఘాట్, బిజు పట్నాయక్ శతాబ్ది ఉత్సవాల్లో ఈ బృందం తమ సందేశాలను అందించింది. వీరి విన్యాసాలు కేవలం వినోదం మాత్రమే కాకుండా జాతీయ శక్తిని నలుదిశలా చాటిచెప్పేందుకు ఒక సాధనంగా నిలుస్తాయి. సేవా ›కార్యక్రమాల్లో కూడా ఈ బృందం ముందంజలో ఉంది. 2013లో ఉత్తరాఖండ్‌లో వచ్చిన వరదల సమయంలో హెచ్ఏడీఆర్ మిషన్‌లో ఈ బృందం చురుగ్గా పాల్గొంది. ఈ బృందం వెయ్యి మందిని రక్షించింది. 10 వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో 12 టన్నుల సహాయక సామగ్రిని అందించాయి. అలాగే గత డిసెంబర్ 17న ఓఖీ తుఫాను, 2018 మార్చిలో తేనిలో జరిగిన అటవీ మంటల వ్యాప్తిని నిరోధించడంలో ఈ బృందం స్పందించిన తీరు అద్భుతం. 2018 ఆగస్టులో కేరళలో సంభవించిన వరదల సమయంలో తమ సామర్థ్యంతో 320 మందిని రక్షించారు. కేరళ ప్రజలకు సహాయంగా 77 టన్నుల సహాయక సామగ్రిని అందించారు. వరదలతో బాధపడుతున్న ప్రజలకు సహాయాన్ని అందించడంలో ఈ బృందం బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తూనే ఉంది. నాలుగు రోజులపాటు ఏవియేషన్ షో వింగ్స్ ఇండియా 2020 ఏవియేషన్ షో ఇవాళ్ట నుంచి నాలుగు రోజుల పాటు జరగనుంది. ఈ నేపథ్యంలో సరంగ్, మార్క్ జెఫ్రీ బృందాలు విమాన విన్యాసాల రిహార్సల్స్‌తో బుధవారం అలరించాయి. నింగిలో అబ్బురపరిచే విన్యాసాలతో కిరాక్ పుట్టించారు. బేగంపేట ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. నింగిలో విన్యాసాలను చూసేందుకు రహదారుల పైనే తమ వాహనాలను నిలిపి రిహార్సల్స్‌ను చూసి ఎంజాయ్ చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నింగిలో సయ్యాట
సనత్‌నగర్: నింగిలో అద్భుతానికి హైదరాబాద్ నగరం మరోసారి వేదికైంది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ), కేంద్ర పౌర విమానయాన సంస్థ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా రెండేళ్లకోసారి ‘వింగ్స్ ఇండియా’పేరిట నిర్వహించే ఏవియేషన్ షోకు బేగంపేట ఎయిర్పోర్ట్ ముస్తాబైంది. ఈ నెల 12 నుంచి 15 వరకు ఈ షో జరగనుంది. ఇందులో ప్రధానంగా సరంగ్ టీమ్, మార్క్ జెఫ్రీ బృందాల విన్యాసాలు హైలైట్‌గా నిలవనున్నాయి. హెలికాప్టర్, ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ కంపెనీల ఉత్పత్తుల ప్రదర్శన కూడా ఉండనుంది. గతంలో పోలిస్తే ఈసారి ఎయిర్ షోకు అధిక ప్రాధాన్యత కల్పించారు. గతంతో ఉదయం 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలే విన్యాసాలు జరిగేవి. మార్క్ జెఫ్రీ బృందం మాత్రమే విన్యాసాలు చేసేది. ఈసారి అదనంగా సరంగ్ టీం కూడా అదరగొట్టనుంది. ప్రతిరోజూ ఉదయం 11.30 నుంచి 12 గంటల వరకు సరంగ్ టీమ్, మధ్యాహ్నం 12 నుంచి 12.30 వరకు మార్క్ జెఫ్రీ టీం, తిరిగి మధ్యాహ్నం 3.30 నుంచి 4 గంటల వరకు సరంగ్ టీం, సాయంత్రం 4 నుంచి మార్క్ జెఫ్రీ బృందం విన్యాసాలు చేయనున్నాయి. ఈ రెండు బృందాలు గత రెండు రోజులుగా రిహార్సల్స్ చేస్తున్నాయి. సకల విమాన ఉత్పత్తుల ప్రదర్శన.. కమర్షియల్, రీజనల్, బిజినెస్, కార్గో ఎయిర్‌క్రాఫ్ట్స్‌తో పాటు హెలికాప్టర్స్, మోటార్ గ్లైడర్స్, బెలూన్స్ తయారీ కంపెనీలు తమ ఉత్పత్తులను ఎగ్జిబిషన్లో ప్రదర్శించనున్నాయి. ఎయిర్‌క్రాఫ్ట్ మిషనరీ, ముడి ఉత్పత్తుల కంపెనీలు, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంటీరియర్ ఉత్పత్తులు, ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కంపెనీలు, స్పేస్ ఇండస్ట్రీలు, డ్రోన్ ఉత్పత్తులు, ఎయిర్‌లైన్ సర్వీసెస్, కార్గో ఉత్పత్తులతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కంపెనీలు సైతం కొలువుదీరనున్నాయి. 13న సీఎం కేసీఆర్ సందర్శన మొదటిరోజు రిజిస్ట్రేషన్స్, చిన్నచిన్న సమావేశాలు, ఎగ్జిబిషన్ ప్రారంభంతో పాటు సరంగ్, మార్క్ జెఫ్రీ టీంలు నింగిలో సందడి చేయనున్నాయి. 13న ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్ ఈ షోకు హాజరవుతారు. ఐటీ మంత్రి కేటీఆర్, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ప్రదీప్‌సింగ్ ఖరోరలా, ఫిక్కీ చైర్మన్ ఆనంద్‌స్టాన్లీ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ అర్వింద్‌సింగ్ తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. సామాన్య ప్రజలకు నో ఎంట్రీ.. ప్రతిసారి చివరి రోజున ఏవియేషన్ షో వీక్షించేందుకు సామాన్యులకు అవకాశం కల్పించేవారు. అయితే ఈసారి కరోనా ప్రభావంతో సామాన్య ప్రజలను అనుమతించరన్న వార్తలు వస్తున్నాయి. వ్యాపార సంబంధ వ్యక్తులకు మాత్రమే అనుమతించనున్నట్లు తెలుస్తోంది. -
కూలిన శిక్షణ విమానం
బంట్వారం: ఓ ట్రైనీ విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలిన ఘటనలో పైలట్, కో–పైలట్ మృతిచెందారు. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం సుల్తాన్పూర్ శివారులో ఈ సంఘటన చోటుచేసుకుంది. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి శిక్షణ విమానం పైలట్ ప్రకాశ్ విశాల్ (25), కో– పైలట్ అమన్‌ప్రీత్‌కౌర్ (21) కర్ణాటకలోని గుల్బర్గాకు బయల్దేరారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో బంట్వారం మండలం సుల్తాన్పూర్ సమీపంలోని పత్తిపొల్లాల్లో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదం ధాటికి పైలట్, కో– పైలట్ల శరీరాలు తెగిపడ్డాయి. విమానం తునాతునకలై వాటి శకలాలు ఎగిరిపడ్డాయని విమాన ప్రమాద సమయంలో పొలంలో పనిచేసుకుంటోన్న ఓ వ్యక్తి చెప్పాడు. అలాగే, ఈ విషయాన్ని స్థానిక ఎస్సైకు సమాచారం ఇచ్చాడు. కలెక్టర్, ఎస్పీ పరిశీలన ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్, ఎస్పీ నారాయణ, తహసీల్దార్ లలిత ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ధారూరు సీఐ రాజశేఖర్, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, ఏడుకొండలు పంచనామా జరిపారు. ఎస్పీ అక్కడే ఉండి మృతదేహాలను మర్పల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే ఇండియన్ ఎయిర్‌లైన్స్ అధికారుల బృందం ఘటనా స్థలికి చేరుకుంది. పోలీసులు వారితో మాట్లాడి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. ప్రమాదంతో రెండెకరాల పత్తికి నష్టం వాటిల్లిందని బాధితులు బంటు బాలకృష్ణ, బంటు బాలమణి వాపోయారు. ప్రమాద సమాచారం తెలిసిన చట్టు పక్క గ్రామస్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. వాతావరణం అనుకూలించకేనా? ప్రమాదం జరిగిన సమయంలో భారీ వర్షం కురిసింది. ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వాతావరణం అనుకూలించకపోవడంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. -
గవర్నర్ నరసింహన్‌కు ఘనంగా వీడ్కోలు
-
గవర్నర్ దంపతులకు ఆత్మీయ వీడ్కోలు
-
గవర్నర్ దంపతులను సాగనంపిన ముఖ్యమంత్రి
సాక్షి, హైదరాబాద్ : బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్ దంపతులు శనివారం సాయంత్రం చెన్నై బయలు దేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ప్రభుత్వాధికారులు వారికి ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీసుల గౌరవ వందనాన్ని గవర్నర్ స్వీకరించారు. అంతకుముందు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌కు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. తెలంగాణ గవర్నర్‌గా తమిళసై సౌందర్ రాజన్‌ను కేంద్రం నియమించిన నేపథ్యంలో నరసింహన్ సొంత రాష్ట్రం తమిళనాడుకు వెళ్తున్నారు. ఇక తెలంగాణ గవర్నర్‌గా తమిళసై సౌందర్ రాజన్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నూతన గవర్నర్ ప్రమాణ స్వీకారానికి రాజ్‌భవన్‌లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. (చదవండి : మండపాల్లో కేసీఆర్ బొమ్మ చెక్కడంపై నిరసన) -
బేగంపేట్.. c\o వీఐపీ ఎయిర్పోర్ట్
ఈ ఎయిర్‌పోర్టులో విమానాలను సురక్షితంగా ల్యాండ్ చేసేందుకు వీలుగా, భద్రతా అవసరాల నిమిత్తం ప్రాంగణానికి సమీపంలో అంటే.. 5నుంచి 6కి.మీ దూరంలోఉన్న 18 మీటర్లకంటే ఎత్తయిన భవనాలపై ‘ఎయిర్ క్రాఫ్ట్ అబ్ స్ట్రక్షన్ వార్నింగ్ లైట్స్’ ఏర్పాటు చేసుకోవాలని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. ఈ లైట్ల ఏర్పాటుతో పైలెట్లు బేగంపేట్ విమానాశ్రయంలో ఫ్లైట్స్‌ను ల్యాండ్ చేసే సమయంలో వారికి అక్కడ అత్యంత ఎత్తయిన భవంతి ఉన్న విషయాన్ని పసిగట్టే అవకాశం ఉంటుందని, ఈ ఆదేశాలన్నీ భద్రతా కోణంలో జారీ చేసినవని విమానాశ్రయ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ సిటీ నడిబొడ్డున ఉన్న బేగంపేట్ విమానాశ్రయానికి మరింత క్రేజ్ పెరుగుతోంది. వీఐపీలు, వీవీఐపీలు, బిజినెస్ మ్యాగ్నెట్స్ వంటి ప్రముఖులు వినియోగించే చార్టర్ ఫ్లైట్స్ రాకపోకలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ప్రతినెలా ఈ విమానాశ్రయం నుంచి వందలాదిగా విమానాలు రాకపోకలు సాగిస్తున్నట్లు విమానాశ్రయ వర్గాలు చెబుతున్నాయి. ఈ విమానాశ్రయం నగరంలోని ప్రధాన ప్రాంతాలకు అత్యంత సమీపంలో ఉండడంతో వీఐపీలు, వీవీఐపీలు ఇక్కడి నుంచి ఇతర దూరప్రాంతాలకు బయలుదేరి వెళ్లేందుకు ఆసక్తి చూపుతుండడం విశేషం. అయితే, ఈ విమానాశ్రయానికి సమీపం (5–6 కి.మీ)లో సుమారు 18 మీటర్ల కంటే ఎత్తున్న బహుళ అంతస్తుల భవనాల యజమానులు ‘ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా’(ఏఏఐ) నుంచి ఆన్లైన్లో ఎన్ఓసీలు(నిరభ్యంతర పత్రాలు) పొందాలని తాజాగా ‘డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్’ ఆదేశాలిచ్చింది. రోజురోజుకు పెరుగుతోన్న రద్దీ బేగంపేట్ విమానాశ్రయం నుంచి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉప రాష్ట్రపతితో పాటు పలు వురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల ముఖ్యనేతలు రాకపోకలు సాగించేందుకు ఇది అనుకూలంగా ఉండడంతో వారంతా ఈ ఎయిర్‌పోర్టుపై ఆసక్తిచూపుతున్న నేపథ్యంలో ఈ విమానాశ్రయంలో విమానాల రద్దీ పెరుగుతోంది. ఇక నగరానికి వచ్చే దేశ, విదేశీ ప్రముఖులు, ప్రముఖ వ్యాపారవేత్తలు సైతం ఈ విమానాశ్రయంలోనే తమ చార్టర్ ఫ్లైట్స్‌ను ల్యాండ్ చేసేందుకు ఇష్టపడుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ విమానాశ్రయంలో నెలకు సుమా రు 300కు పైనే ప్రైవేట్ విమానాలు రాకపోకలు సాగిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ప్రైవేటు ఫ్లయింగ్ క్లబ్స్, డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ ను వినియోగించే రక్షణశాఖ సైతం ఈ విమానాశ్రయం సేవలను తరచూ వాడుకుంటుండడంతో రద్దీ పెరుగుతోంది. ఎన్ఓసీలకు దరఖాస్తు ఇలా.. విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఎత్తయిన భవంతుల యజమానులు భవనం ఎత్తు క్లియరెన్స్‌కు సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) పొందాల్సి ఉంటుంది. ఈ ఎన్ఓసీని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే పదిరోజుల్లో ఆన్లైన్లోనే జారీ చేస్తారు. దీని కాలపరిమితి ఎనిమిదేళ్ల వరకు ఉంటుంది. ఈఎన్ఓసీలను ఉచితంగానే జారీచేస్తామని ఏవియేషన్ అధికారులు తెలిపారు. ఆయా భవనాల యజమానులు తమ భవవతుల పూర్తి వివరాలు, జీహెచ్ఎంసీ జారీ చేసిన ఆక్యుపెన్సీ ధ్రువీకరణ తదితర వివరాలను ఆన్లైన్లోనే పూరించాల్సి ఉంటుంది. ఇందుకోసం హెచ్‌టీటీపీఎస్://ఎన్‌ఓసీఏఎస్2.ఏఏఐ.ఏఈఆర్ఓ/ఎన్‌ఓసీఏఎస్ వెబ్సైట్లో సంప్రదించాలి. -
హైదరాబాద్‌లో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అఖండ మెజార్టీ సాధించిన అనంతరం తొలిసారి హైదరాబాద్ వస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి పార్టీ నాయకులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన శనివారం మధ్యాహ్నం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. కాగా వైఎస్ జగన్‌ను అభినందిస్తూ నగరంలో పలుచోట్ల భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే లోటస్‌పాండ్‌లోని ఆయన నివాసం వద్ద పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. -
చంద్రబాబు మళ్లీ వేసేశారు..
సాక్షి, హైదరాబాద్: చరిత్రంటే నారా వారిదేనని మరోసారి రుజువుచేశారు చంద్రబాబు నాయుడు. నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడంలోనైనా, భరింపశక్యంకాని గప్పాలు కొట్టడంలోనైనా తమను మించిన వారు లేరని మరోసారి నిరూపించుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టడం.. విశిష్టులకు నోబెల్, ఆస్కార్లు ఇప్పించడం.. సత్య నాదెళ్లకు ఇంజనీరింగ్ సలహా ఇవ్వడం.. పీవీ సింధుచేత షటిల్ రాకెట్ పట్టించడంలాటి ఘనకార్యాలెన్నో చేసిన ఆయన హైటెక్ సిటీ కాకుండా ఓ బ్రహ్మాండ నిర్మాణాన్ని తాజాగా తన ఖాతాలో వేసేసుకున్నారు. అదే బేగంపేట్ ఎయిర్పోర్ట్! కట్టింది నేనే: తెలంగాణ టీడీపీ గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన మహానాడుకు సంబంధించి చంద్రబాబు ఒక ట్వీట్ చేశారు. ‘‘ఒకప్పుడు తాగునీరు లేని పరిస్థితి నుంచి హైదరాబాద్ నేడు మహానగరంగా మారిందంటే దాని వెనుక టీడీపీ ప్రభుత్వ శ్రమ, కష్టం ఎంతో ఉంది. దేశంలోనే నంబర్ వన్‌గా పేరొందిన బేంగంపేట విమానాశ్రయమూ టీడీపీ హయాంలోనే నెలకొల్పాం. భావితరాల భవిష్యత్తు కోసం హైటెక్ సిటీని నిర్మించాం’’ అని రాసుకొచ్చారు. అంతే, నెటిజన్లు ఒక్కసారిగా ఘొల్లున నవ్వుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ 1930లోనే నిజాం రాజు కట్టించారు. అప్పటికి మన సారు ఇంకా పుట్టనేలేదు! ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ కొందరు ‘అవునవును.. నిజాం రాజు మీ దోస్తే కదా..’’ అంటూ సెటైర్లు వేశారు. తప్పును గ్రహించిన చంద్రాలు సారు కొద్ది నిమిషాలకు ఆ ట్వీట్‌ను డిలిట్‌చేసి, ‘బేగంపేట’ ప్రస్తావన లేకుండా మరో ట్వీట్ చేశారు. కానీ అప్పటికే ఆ స్క్రీన్ షాట్లు వైరల్ అయిపోయాయి... (డిలిట్ చేసిన బాబు ట్వీట్ స్ర్కీన్‌షాట్) బ్రీఫ్‌గా బేగంపేట చరిత్ర: 1930లో తొలుత హైదరాబాద్ ఎయిరో క్లబ్ పేరుతో నిజాం ప్రభువు బేగంపేట విమానాశ్రయాన్ని నిర్మించారు. అనంతరం దక్కన్ ఎయిర్వేస్ లిమిటెడ్ పేరుతో అంతర్జాతీయ విమానాశ్రయంగా వర్ధిల్లింది. 1937లో తొలి టెర్మినల్, 1972లో కొత్త టెర్మినల్ భవనాలను నిర్మించారు. 2008లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమయ్యేనాటికి బేగంపేట ఎయిర్పోర్ట్ దేశంలోనే అత్యంత రద్దీగల ఆరో విమానాశ్రయంగా ఉండింది. ప్రస్తుతం హైదరాబాద్ ఓల్డ్ ఎయిర్ పోర్ట్‌గా పిలుస్తోన్న బేగంపేట విమానాశ్రయంను ఏవియేషన్, మిలటరీ ట్రైనింగ్ కోసం, అప్పుడప్పుడూ వీవీఐపీల రాకపోకల కోసం కూడా వినియోగిస్తున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ పాతఫొటోలు కొన్ని.. తప్పు తెలుసుకున్న తర్వాత సవరించిన ట్వీట్ ఇది.. -
ఆశ.. నిరాశే అన్నీ ఎగిరిపోయే!
సనత్‌నగర్: బేగంపేట్ ఎయిర్‌పోర్టులో నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా–2018 ఏవియేషన్ షోను తిలకించేందుకు ఎంతో ఆశతో వచ్చిన నగరవాసులకు నిరాశే ఎదురైంది. అసలే అంతంతమాత్రంగా విమానాలు ఉండడం... ఉన్న వాటి దగ్గరికి కూడా అనుమతించకపోవడంతో అసహనానికి గురయ్యారు. రన్‌వే మీద ఏర్పాటు చేసిన విమానాలు, హెలికాప్టర్ల దగ్గరికి వెళ్లకుండా గ్రిల్స్ ఏర్పాటు చేశారు. దూరం నుంచే చూడాలని ఆంక్షలు విధించారు. దీంతో చేసేదేమిలేక గ్రిల్స్ దగ్గర నిలబడే ఫొటోలు తీసుకొని సంబరపడ్డారు. మరోవైపు వైమానిక విన్యాసాలూ లేకపోవడంతో సందర్శకులు ఉసూరుమన్నారు. ఫొటో ఖరీదు రూ.2000 : నిజానికి శని, ఆదివారాలు సాధారణ సందర్శకులకు అనుమతి. వీరికి ఎంట్రీ పాస్ రూ.400. కానీ శనివారం వీరిని విమానాల దగ్గరికి వెళ్లకుండా గ్రిల్స్ ఏర్పాటు చేశారు. దీంతో కొందరు ఔత్సాహికులు తప్పని పరిస్థితుల్లో రూ.2000 వెచ్చించి బిజినెస్ పాస్ కొనుగోలు చేశారు. ఈ పాస్ ఆధారంగా లోపలికి వెళ్లి విమానాలను చూసి, అక్కడ ఫొటోలు దిగుతూ సందడి చేశారు. పెద్దగేంలేదు.. ఇక్కడ పెద్దగేం లేదు. ప్రత్యేక విమనాలేవీ లేవు. రూ.400 వెచ్చించి షోకు వస్తే విమానాలు లేకపోవడం నిరుత్సాహానికి గురి చేసింది. అయితే కొంతమేర మా స్టడీకి సంబంధించి సమాచారం దొరికింది. – తెలంగాణ ఏవియేషన్ అకాడమీవిద్యార్థులు ఏంటిది? వైమానిక విన్యాసాలు లేవు. కొన్ని విమానాలుంటే వాటి దగ్గరికి వెళ్లే పరిస్థితి కూడా లేదు. మరోవైపు ఫుడ్ ధరలేమో చుక్కల్లో ఉన్నాయి. ఏంటిది? ఇలా చేస్తే సందర్శకులు ఎలా వస్తారు. – అవినాష్, మోతీనగర్ ఐదారే... పెద్ద విమానాలు ఉంటాయని వచ్చాం. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఐదారు మాత్రమే ఉన్నాయి. అది కూడా వాటి దగ్గరకు అనుమతించకపోవడం పిల్లలకు నిరాశను కలిగించింది. – శివకుమార్, ఈసీఐఎల్ స్టాళ్లు.. సగం ఖాళీ ఎగ్జిబిషన్లో సగం స్టాళ్లు ఖాళీ అయ్యాయి. రన్‌వేపై మిగిలిన ఆరు విమానాలు, ఉన్న కొద్దిపాటి స్టాళ్లను తిలకించి సందర్శకులు సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఇక ఫుడ్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. వాటర్ బాటిల్ రూ.40, ఆహార పదార్థాలు రూ.50కి పైగా ఉండడంతో సందర్శకులకు చిర్రెత్తుకొచ్చింది. -
విహంగ షోకులు
-
బేగంపేట ఎయిర్‌పోర్టులో వింగ్స్ ఇండియా 2018
-
తెలుగులో మాట్లాడి.. ఆశ్చర్యంలో ముంచెత్తి
-
ఆశ్చర్యంలో ముంచెత్తిన ప్రధాని మోదీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయంలో బీజేపీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కాసేపు తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ‘సోదరా సోదరీ మణులారా.. హైదరాబాద్‌కు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్ అంటే సర్ధార్ వల్లభాయ్ పటేల్ గుర్తుకు వస్తారు. నిజాం సంస్థానాన్ని భారతదేశంలో కలిపిన పటేల్‌కు వీరభూమి నుంచి ప్రణమిల్లుతున్నాను. తెలంగాణ విమోచనంలో అమరులైన వీరులకు జోహార్లు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నా అభినందనలు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంద’ని మోదీ తెలుగులో ప్రసంగించారు. తర్వాత హిందీలో ప్రసంగాన్ని కొనసాగించారు. అభివృద్ధి విషయంలో ఎవరిపట్ల వివక్ష చూపబోమని, సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. నేడు ప్రపంచం దృష్టిని హైదరాబాద్ ఆకర్షించిందన్నారు. భారతమాత సేవకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించిందని, ఈ ఘనత కార్యకర్తలకే దక్కుతుందన్నారు. ‘జై మోదీ’ నినాదాలతో సభా ప్రాంగణం హోరెత్తింది. అంతకుముందు మోదీకి పుస్తకాలు బహుకరించి, శాలువాలు కప్పి బీజేపీ నేతలు సన్మానించారు. ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, మంత్రులు, బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. -
బేగంపేట ఎయిర్‌పోర్టులో హైసెక్యూరిటీ
సాక్షి, హైదరాబాద్ : బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో తెలంగాణ ప్రభుత్వం భారీ భద్రత ఏర్పాటు చేసింది. 28వ తేదీనుంచి ప్రారంభం కానున్న అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సుకు, మెట్రో రైలు ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ విచ్చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన బేగంపేట ఎయిర్‌పోర్టులో విమానం దిగనున్నారు. అందుకోసం బేగంపేట్ ఎయిర్‌పోర్టులో ఎస్పీజీ తనిఖీలు నిర్వహించింది. ధాని మోదీ ల్యాండింగ్, టేక్ ఆఫ్ ప్రాంతాలను పరిశీలించింది. ఇప్పటికే బేగంపేట్ ఎయిర్పోర్ట్ ఎస్పీజీ అధీనంలో ఉంది. బేగంపేట్ పరిసర ప్రాంతాల్లోనూ పోలీసులు నిఘా పెంచారు. భద్రతా ఏర్పాట్లను సీపీ వి.వి.శ్రీనివాస్ రావు పరిశీలించారు. -
ఆ విమానాన్ని ఐదు ముక్కలు చేసి...
సికింద్రాబాద్: బేగంపేట విమానాశ్రయం సమీపంలో కూలిపోయిన విమానాన్ని తరలించే చర్యలకు ఆటంకం ఏర్పడింది. భారీ క్రేన్, ఓ చిన్న క్రేన్ సాయంతో ఏడు గంటల పాటు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ప్రయత్నాలను నిలిపివేశారు. ఐదు భాగాలుగా విడగొట్టి ఫిరోజ్‌గూడ గోదాముకు తరలించాలని అధికారులు ప్రణాళిక రచించారు. కాగా, క్రేన్ నుంచి కిందపడిపోయి విరిగిపోయిన విమానం శకలాలను మూడురోజుల్లో తోలగిస్తామని ఎయిర్ ఇండియా సెంట్రల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ కు చెందిన కెప్టెన్ సోమన్ అతులా తెలిపారు. కూలిన విమానం మూడేళ్లుగా సర్వీసులో లేని విమానంగా చెప్పారు. తమ ఇనిస్టిట్యూట్‌లో డోర్ మెయింటనెన్స్, కాక్‌పిట్ మెయింటనెన్స్, అత్యవసర సమయాల్లో ప్రయాణికుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో శిక్షణలు ఇచ్చేందుకు మాత్రమే ఎయిర్‌బస్ బాడీని తీసుకెళ్లే ప్రయత్నం చేశామన్నారు. విమాన శకలాలను తరలించే వరకు ఓల్డ్ ఎయిర్‌పోర్టు రహదారిపై వాహనాలు, వ్యక్తుల రాకపోకల పట్ల ఆంక్షలు విధిస్తున్నట్టు చెప్పారు. విమానం తరలింపునకు మూడు రోజులుగా కసరత్తు బేగంపేట విమానాశ్రయంలో ఎయిర్ఇండియాకు చెందిన 320 ఎయిర్‌బస్ అనే భారీ విమానం మూడేళ్లుగా నిరుపయోగంగా ఉంది. ఈ విమానాన్ని బోయిన్పల్లి ఒల్డ్ ఎయిర్‌పోర్టు రోడ్డు నుంచి బాలానగర్ వెళ్లేదారిలోని బేగంపేట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ సమీపంలో ఉన్న ఎయిర్ ఇండియా సెంట్రల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (సీటీఐ)కు తీసుకువెళ్లేందుకు ఆదివారం చేసిన ప్రయత్నంలో ప్రమాదం జరిగింది. విమానం గోడపై కూలిపోయింది. ఎందుకోసం.... ఇక్కడి సెంట్రల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణలో ఉన్న ఎయిర్ ఇండియా సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కోసం ఈ విమానాన్ని తీసుకెళ్లాలనుకున్నారు. విమానంలోని సీట్లను, కాక్‌పిట్‌లోని ఇంజిన్లను విడదీశారు. ఖాళీగా ఉన్న బాడీని భారీ క్రేన్ ద్వారా సీటీఐకి తీసుకువెళ్లాలనుకున్నారు. ఇందుకు సీటీఐ అధికారులు మూడు రోజుల పాటు కసరత్తు చేశారు. విద్యుత్, ట్రాఫిక్ పోలీసుల అనుమతులు తీసుకుని వారిని అప్రమత్తం చేశారు. ఎయిర్‌పోర్టు ప్రహరీగోడను తొలగించారు. ఓల్డ్ఎయిర్పోర్టు రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్, కేబుల్, నెట్ వైర్లను యుద్దప్రాతిపదికన తొలగించారు. ముందు జాగ్రత్తగా విమాన తరలింపు జరుగుతున్న స్థలానికి కిలోమీటర్ దూరం వరకు పాదచారులను సైతం అనుమతించలేదు. ఈ జాగ్రత్తల ఫలితంగానే ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. -
బేగంపేటలో విమానం కూలిందిలా..
హైదరాబాద్: బేగంపేట విమనాశ్రయం నుంచి ఎయిర్ ఇండియాకు చెందిన కండీషన్లో లేని విమానాన్ని ఎయిరిండియా సెంట్రల్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్‌కు ఆదివారం తెల్లవారుజామున తరలించడానికి ఏర్పాట్లు చేశారు. ఎక్కువ బరువున్న విమానాన్ని తరలించడానికి ఒకే క్రేన్‌ను ఉపయోగించారు. దీంతో విమాన బరువుకు క్రేన్ కుంగిపోయింది. విమానం అక్కడున్న గోడ మీద పడగా క్రేన్ విమానం మీద పడిపోయింది. అయితే రోడ్డు పక్కనే విమానం కనబడటంతో కొందరు ఎంతో ఆసక్తితో దాన్ని వీడియో తీశారు. సరిగ్గా అదే సమయంలో క్రేన్ కుంగి విమానం కూలిపోవడం వీడియోలో రికార్డయింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతానికి సమీపంలో ఎవరు లేకపోవడంతో.. పెను ప్రమాదం తప్పింది. -
నింగి మెరిసె నేల మురిసె
రెండో రోజూ ఏవియేషన్ షో కిటకిట చిత్రకారులను స్ఫురింపజేసేలా ఆకాశంలో వి‘చిత్రాలు’... సందర్శకుల మది దోచేలా ప్రదర్శనలు... రూపంలోనూ... సౌకర్యాల్లోనూ ప్రతి విమానం.... దేనికదే ప్రత్యేకం. ఇదీ ‘ఇండియా ఏవియేషన్-2016’ స్పెషల్. విమానాల విన్యాసాలతో నింగి మెరిసింది. తిలకించిన సందర్శకుల సందడితో నేల మురిసింది. గురువారం ఏవియేషన్ షో ఉత్సాహంగా సాగింది. బేగంపేట విమానాశ్రయ పరిసరాలు బిజినెస్ విజిటర్స్‌తో కిటకిటలాడాయి. రాజహంస అందాల వీక్షణకు జనం ఎండను సైతం లెక్కచేయకుండా బారులు తీరారు. ఎమిరేట్స్ లగ్జరీ లుక్‌ని చూసి ముగ్దులయ్యారు. - సనత్‌నగర్ విన్యాసాల వీరులు పొగ చిమ్ముతూ విమానం దూసుకెళ్తుంటే.. వినువీధిలో చిత్రాలు ఆవిష్కరిస్తూ వింతలు చేస్తుంటే.. సందర్శకులు రెప్పవాల్చకుండా అంబరాన్ని సంబరంగా చూస్తుంటే.. విన్యాసాల వీరులు వి‘చిత్రాలు’ చేస్తున్నారు. ప్రచండ వేగంతో విమానాలను పల్టీలు కొట్టిస్తున్నారు. తిరిగి యథాస్థితికి చేరుస్తున్నారు. ఏవియేషన్ షోలో మార్క్ జెఫర్స్ బృందం విహంగ విన్యాసాలతో సందర్శకుల మదిదోచుకుంటోంది. ఈ బృంద సారథి జెఫర్స్‌ను ‘సాక్షి’ పలకరించింది. ఆ మాట ముచ్చట మీకోసం.. - సాక్షి, సిటీబ్యూరో లోహ విహంగాన్ని వినువీధిలో రివ్వుమని ఎగిరిస్తూ.. దాని పొగతో అద్భుత చిత్రాలను ఆవిష్కరించడమే సింక్రనైజ్డ్ స్మోక్ యాక్ట్స్. ఈ విన్యాసాలు చేయడంలో మార్క్ బృందం దిట్ట. ఇండియా ఏవియేషన్-2016లో విన్యాసాలు సృష్టించేందుకు రెండోసారి నగరానికి వచ్చిన ఈ బ్రిటీష్ బృందం.. వీక్షకుల మన్ననలు అందుకుంటోంది. 37 ఏళ్లుగా ఈ విన్యాసాల్లో విహరిస్తున్న మార్క్ వయసు 50కి పైనే. వైమానిక దళంతో ఏ మాత్రం సంబంధం లేని ఈయన విమానాలతో నింగిలో ఆటలాడుకోవడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. కేవలం విమానాల మీద ఉన్న ఆసక్తే తనను ఈ రంగంలోకి తీసుకొచ్చిందని చెబుతారు మార్క్. ఈయన ఔత్సాహికులైన మరో నలుగురితో కలిసి ‘గ్లోబల్ స్టార్ ఏరోబాటిక్ టీమ్’ను ఏర్పాటు చేశారు. ఈ బృందం సామూహిక విహంగాల విన్యాసాలతో పాటు వ్యక్తిగత ప్రదర్శనలు కూడా నిర్వహిస్తుంది. యువతలో స్ఫూర్తికి ‘ఎస్టీఈఎం’... ‘యువత ‘ఎస్టీఈఎం’ వైపు నడిచేలా మా విన్యాసాలతో స్ఫూర్తినిస్తున్నాం. ఎస్టీఈఎం అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెకానిక్స్. ఈ నినాదాన్ని మా విన్యాసాలతో యూత్‌లోకి తీసుకెళ్లి వారిని విమానయాన రంగం వైపు అడుగులు వేయించాలన్నదే మా అభిమతం. బ్రిటిష్ ఏరోబాటిక్ అకాడమీకి వేదిక లాంటి కేంబ్రిడ్జి షైర్లోని గ్రాన్స్డెన్లో మా ఏరోబాటిక్ శిక్షణ కేంద్రం ఉంది. దీని ద్వారా ఔత్సాహికులకు శిక్షణ అందిస్తున్నాం. గతేడాది భారత్‌లో 10, ఆస్ట్రేలియా, బహ్రెయిన్‌లో ఆరు ప్రదర్శనలిచ్చాం. ఈ షో ముగిశాక పుణెలో ప్రదర్శనకు వెళ్తామ’ని చెప్పారు మార్క్. ఐ లవ్ హైదరాబాద్... భారత్ అంటే చాలా ఇష్టం. ఐ లవ్ హైదరాబాద్. 2014 ఏవియేషన్ షోకి నా మిత్రుడు టామ్‌తో వచ్చాను. అప్పుడు ఇక్కడి సందర్శకుల నుంచి వచ్చిన స్పందన నేను ఇప్పటికీ మర్చిపోలేను. అదే ప్రోత్సాహం ఈ సారి మరో ఇద్దరు మిత్రులు మైకేల్ పికెన్, కేత్ టేయర్లను తీసుకొచ్చేలా చేసింది. గత ఏవియేషన్ షోలో రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌లతో ప్రదర్శనలిచ్చాం. ఈసారి నాలుగు క్రాఫ్ట్‌లతో విన్యాసాలు చేస్తున్నాం. - మార్క్ జెఫర్స్ లైవ్ రికార్డింగ్.. ఈ విన్యాసాల కోసం సొంతంగా ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఏర్పాటు చేసుకుందీ బృందం. ఈ ఎయిర్ క్రాఫ్ట్‌లో ఒకరు మాత్రమే కూర్చునే వీలుంటుంది. ఇందులో విన్యాసాలకు అవసరమైన ఎక్విప్మెంట్ ఉంటుంది. వీరు చేసే విన్యాసాలను రికార్డు చేసేందుకు లైవ్ కెమెరాలు ఉంటాయి. గల్లంతైన వ్యక్తులను గుర్తించే ‘కాప్టర్’ ప్రమాదకర పరిస్థితుల్లో గల్లంతైన వ్యక్తులను గుర్తించే ఆధునిక పరికరం అటానమస్ కాప్టర్‌ను చెన్నైకి చెందిన ఎస్ఆర్ఎం వర్సిటీ విద్యార్థులు రూపొందించారు. ల్యాప్‌టాప్ సహాయంతో గూగుల్ మ్యాప్‌లో పాయింట్లు సెట్ చేస్తే ఈ కాప్టర్ టేకాఫ్ అవుతుంది. అప్పటికే ఈ కాప్టర్‌పై ఏర్పాటు చేసిన కెమెరా లైవ్ వీడియో రికార్డు చేసి ఫొటోలు కూడా తీసేస్తుంది. పెట్రోల్ సహాయంతో నడిచే ఈ విహంగం సుమారు రెండు గంటల పాటు ఐదు కిలోమీటర్ల ఎత్తులో 240 కిలోమీటర్లు వరకు ప్రయాణిస్తుంది. ఫొటోలు తీసి సమాచారాన్ని వెంటనే కంట్రోల్ రూమ్‌కు చేరవేస్తుంది. దీంతో గల్లంతైన వ్యక్తుల సమాచారాన్ని తెలుసుకొని సహాయక చర్యలు చేపట్టేందుకు సిబ్బందిని అప్రమత్తం చేయొచ్చు. క్లిష్టమైన పరిస్థితుల్లో అదృశ్యమైన వ్యక్తులను గుర్తించడంలో కీలకపాత్ర పోషిస్తుందని విద్యార్థులు శ్రేయస్ వాసుదేవన్, భరుణ్, అరుణమ్ అంటున్నారు. రెండు నెలలు శ్రమించి ఫైబర్ గ్లాస్, వుడ్ ఉపయోగించి దీనిని తయారు చేశామన్నారు. విమానాలను లాగేస్తుంది.. బస్‌ను పార్క్ చేసిన చోటు నుంచి మరో చోటుకి మార్చాలంటే పెద్ద కష్టమేమీ కాదు. ఒకవేళ రోడ్డుపై బస్ ఆగిపోతే మరో వాహనంతో లాక్కెళ్లడం సాధారణ విషయమే. అదే విమానాల విషయానికొస్తే.. రన్‌వేపై పార్క్ చేసిన విమానాన్ని మరో చోటుకి మార్చాల్సి వస్తే పెద్ద మొత్తంలో ఇంధనం అవసరం. ఇక విమానం రన్‌వేపై ఆగిపోతే పరిస్థితేంటి? వీటికి సమాధానమే ఎయిర్‌సైడ్ సిమ్యులేటర్. పెద్ద విమానాలను అలవోకగా ముందుకు లాగడం లేదా వెనకకు తోయడం కోసం దీనిని వినియోగిస్తారు. పైగా విమానాలు వెనకకు ప్రయాణించే అవకాశం లేకపోవడంతో సైడ్ సిమ్యులేటర్ ఆధారంగా వెనకకు నెట్టి అవసరమైన చోట పార్క్ చేస్తారు. అనుభూతిని ‘కళ్లకు కడతారు’.. విమానం నడిపే అనుభూతిని పొందాలనుందా? ఫ్లైట్ ఇంజినీర్‌గా మారి ఆ అనుభూతిని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారా? విమానంలో ప్రయాణిస్తున్న ప్యాసింజర్ ఫీలింగ్ కావాలా.? వీటిలో ఏ అనుభూతిని పొందాలన్న మీరు విమానం ఎక్కాల్సిన అవసరం లేదు. ఏవియేషన్ ఎగ్జిబిషన్లో హానివెల్ టెక్నాలజీస్ ఏర్పాటు చేసిన స్టాల్‌ను సందర్శిస్తే చాలు.. ఆ మధురానుభూతులను సొంతం చేసుకోవచ్చు. ప్రత్యేక పరికరాన్ని కళ్లకు కట్టి, హెడ్‌ఫోన్స్‌ను చెవులకు అమరుస్తారు. అంతే మీ తలను అటూ ఇటూ తిప్పుతుంటే విమానంలో పైలట్, ఇంజినీర్, ప్యాసింజర్ స్థానాల్లో కూర్చుంటే ఎలా ఉంటుందో అచ్చం అలాంటి ఫీలింగ్‌ని పొందొచ్చు. మీరూ వెళ్లాలంటే... ♦ నేడు బిజినెస్ సందర్శకులకు మాత్రమే ప్రవేశం. టికెట్ ధర: రూ.700 ♦ 19, 20 తేదీల్లో సామాన్య సందర్శకులకు ప్రవేశం. టికెట్ ధర: రూ.300 ♦ వేళలు: ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. ♦ www.bookmyshow.comవెబ్సైట్లో టికెట్లు లభిస్తాయి. ♦ ఎయిర్ షో వేళలు: ఉదయం 11 నుంచి 11.15, మధ్యాహ్నం 3 నుంచి 3.15 ♦ పార్కింగ్ బేగంపేట విమానాశ్రయం కార్గో ఏరియాలో వాహనాలు పార్క్ చేయాలి. ♦ ఫుడ్ బయట నుంచి ఆహారం, మంచినీరు అనుమతించరు. ఎగ్జిబిషన్ ప్రాంగణంలోనే ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. -
ఇది ఎతిహాద్ ‘రేసు గుర్రం’!
♦ ఒకే ట్రిప్పులో 78 గుర్రాలను మోసుకెళుతుంది.. ♦ ఎయిర్ షోలో ప్రత్యేక ఆకర్షణ బేగంపేట విమానాశ్రయంలో జరుగుతున్న ఇండియన్ ఏవియేషన్ షోలో ఎతిహాద్ కార్గో స్పెషల్ అట్రాక్షన్. గంటకు పదివేల లీటర్ల ఇంధనం బర్న్ అయ్యే ఈ బోయింగ్ 777 ఫ్రైటర్‌కు ఏకంగా 78 గుర్రాలను అలవోకగా ఓ దేశం నుంచి మరో దేశానికి తరలించగలిగే సామర్థ్యముంది. ఈ ఫ్లైట్‌లో 550 క్యూబిక్ మీటర్ల స్పేస్ వుంది. గుర్రాలను తీసుకెళ్లేటప్పుడు వాటి కాళ్లను అటుఇటు కదలకుండా ఉండేందుకు లాక్ సిస్టమ్ కూడా ఉంది. గుర్రాలతో పాటు ఈ కార్గో ఫ్లైట్ ఫార్మాప్రొడక్ట్స్‌ను ఎక్కువగా రవాణా చేస్తుంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరులకు వారంలో 14 సర్వీసులను నిర్వహిస్తున్న ఈ విమానం ఏటా 1,20,000 టన్నుల సామగ్రిని భారత్ నుంచి తరలి స్తోంది. ఇండియన్ ఇంటర్నేషనల్ ఫ్రైట్ మార్కెట్లో దీనికి 9% వాటా ఉంది. మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
విమాన విలాసం.. అదరహో..!
ఆకాశాన్ని రంగుల తోరణాలతో అలంక రించినట్టుగా.. విను వీధిలో లోహ విహంగాల విహారం. విస్తుగొలిపే విన్యాసాల సమాహారం. విభిన్న రూపాలు... అత్యాధునిక సౌకర్యాలు... వినూత్న ఆవిష్కరణలు... దేశ ప్రథమ పౌరుడు ప్రణబ్ సైతం ముచ్చటపడేలా... అచ్చెరువొందేలా చేశాయి. ఇదీ బేగంపేట విమానాశ్రయంలో సాగుతున్న ‘ఇండియా ఏవియేషన్-2016’ ప్రత్యేకత. బుధవారం ఏవియేషన్ షో ప్రారంభం అదిరింది. దేశ ప్రథమ పౌరుడి రాకతో బేగంపేట విమానాశ్రయం మురిసిపోయింది. స్వదేశీ, విదేశీ ప్రతినిధులతో కళకళలాడింది. రాజహంసల రాచఠీవిని చూసి సందర్శకులు ముగ్దులయ్యారు. విమానయాన ప్రదర్శన అనుభూతుల్ని పదిలపరుచుకునేందుకు సెల్ఫీలు క్లిక్ మనిపించారు. ‘వినువీధి వీరుల’ గగుర్పాటు విన్యాసాల్ని ఉత్కంఠతో తిలకించారు. బుధవారం మొదలైన ఈ ఎగ్జిబిషన్ మరో నాలుగురోజుల పాటు జరగనుంది. గగన విన్యాసం మార్క్ జెఫర్స్ బృందం ఆకాశంలో చేసిన విన్యాసాలను సందర్శకులు ఉత్కంఠతో వీక్షించారు. అంతవరకు ఎగిరిన విమానం భూమివైపునకు అతివేగంగా దూసుకువచ్చేలా చేసిన విన్యాసం వీక్షకుల్ని అబ్బురపరిచింది. ఈ షో గురువారం నుంచి ఈ నెల 20 వరకు ఉదయం 11.35 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుంది. మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
నేటి నుంచి మెగా ఏవియేషన్ షో
వేడుకలు ప్రారంభించనున్న రాష్ర్టపతి ప్రణబ్ సాక్షి, హైదరాబాద్: మెగా ఏవియేషన్ షో నేటి నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఐదు రోజుల పాటు (ఈ నెల 20 వరకు) బేగంపేట విమానాశ్రయంలో జరిగే ఈ వేడుకల ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ రానున్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బయల్దేరి 2.50 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. మూడు గంటలకు జ్యోతి ప్రజ్వలన చేసి ఏవియేషన్ షోను ప్రారంభించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. గవర్నర్ నరసింహన్, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ నయన్, ఆ శాఖ జాయింట్ సెక్రటరీ అనిల్ శ్రీవాస్తవ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ హాజరవుతారు. కార్యక్రమం అనంతరం సాయంత్రం 4.10 గంటలకు రాష్ట్రపతి ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. రెండేళ్లకోసారి జరిగే ఈ వేడుకలను ఈసారి ‘ఇండియా సివిల్ ఏవియేషన్ రంగం, పొటెన్షియల్ యాజ్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్’ అనే అంశం ఇతివృత్తంగా నిర్వహిస్తున్నారు. 19, 20 తేదీల్లో సామాన్య ప్రజలు వీక్షించేందుకు అనుమతిస్తారు. గేటు 1(ఫస్ట్‌ఫ్లోర్)-వీఐపీలు, గేటు 1ఏ చాలెట్ ఎగ్జిబిటర్లు, గేటు 2 (గ్రౌండ్‌ఫ్లోర్)-కాన్ఫరెన్స్ ఎంట్రీ, గేటు 3- ఎగ్జిబిటర్ ఎంట్రీ, గేటు 4-బిజినెస్ విజిటిర్ ఎంట్రీ, గేటు 5, 6 బయటకు , గేటు 7 సామాన్య ప్రజలకు ప్రవేశం (19, 20 తేదీల్లో) ప్రవేశం కల్పిస్తారు. విమాన విన్యాసాల వేళలు బుధవారం మధ్యాహ్నం 3.50 నుంచి 04.15 వరకు విన్యాసాలు జరుగుతాయి. 17, 18, 19, 20 తేదీల్లో ఉదయం 11.35-11.45, మధ్యాహ్నం 3 నుంచి 3.15 వరకు 15 నిమిషాల చొప్పున రోజుకు రెండు సార్లు విమానాల విన్యాసాలు జరుగుతాయి. గ్లోబల్ ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల ఉత్పత్తులు ప్రదర్శనలో కొలువుదీరతాయి. పలు దేశాల నుంచి ప్రతినిధుల హాజరు.. అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం దేశాలకు చెందిన ప్రతినిధులతో పాటు గ్లోబల్ కంపెనీల సీఈఓలు, విమానయాన సంస్థలు, ఎమ్ఆర్వోలు, ఎయిర్‌క్రాఫ్ట్ తయారీదారులు, శిక్షణనిచ్చే సంస్థలు, ఇంజన్ తయారీ కంపెనీలు సీఎఫ్ఎం, యుటీసీ, జీఈలు, కార్గోలు ప్రదర్శనలో పాలుపంచుకుంటాయి. ఏ380, ఏ350, ఎయిర్‌బస్ 747, ఎయిర్‌బస్ 800, బోయిం గ్, డసాల్ట్, గల్ఫ్ స్ట్రీం, టెక్స్‌ట్రోన్ విమానాలు, అగస్టా వెస్ట్‌లాండ్, బెల్, రష్యన్ హెలికాప్టర్లు ప్రదర్శనలో ఉంటాయి. వివిధ దేశాలకు చెందిన 200 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొంటారు. కేంద్ర పౌర విమానయాన శాఖతో పాటు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) సంయుక్తంగా ఈ ఉత్సవాల ను నిర్వహిస్తున్నాయి. -
మేడారానికి హెలికాప్టర్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: మేడారం జాతరకు హెలికాప్టర్ సదుపాయం ప్రారంభమైంది. గురువారం నాలుగు సీట్లుండే హెలికాప్టర్ తొలిట్రిప్పును నడిపారు. అయితే తొలిరోజు సాధారణ భక్తులెవరూ బుక్ చేసుకోలేదు. దీంతో ముందు ప్రకటించినట్టుగా సేవలు ప్రారంభించాలన్న ఉద్దేశంతో అధికారులు, పర్యాటక శాఖ మంత్రి అందులో ప్రయాణించారు. శుక్రవారం వరంగల్ నుంచి రెండు ట్రిప్పులు బుక్ అయ్యాయి. దీంతో అధికారుల్లో ఉత్సాహం కనిపించింది. గురువారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరిన హెలికాప్టర్ వరంగల్ వెళ్లి అక్కడ మంత్రి చందూలాల్‌ను తీసుకుని మేడారం చేరుకుంది. తిరిగి మేడారం నుంచి సాయంత్రం వరంగల్‌కు వచ్చింది. శుక్రవారం వరంగల్ నుంచి రెండు ట్రిప్పులు ఉన్నందున దాన్ని వరంగల్‌లోనే నిలిపారు. శనివారం మరో మూడు ట్రిప్పులు తిరిగే అవకాశముందని పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
'బేగంపేట విమానాశ్రయాన్ని రక్షణ శాఖకు ఇవ్వొద్దు'
న్యూఢిల్లీ: బేగంపేట విమానాశ్రయాన్ని రక్షణ శాఖకు ఇవ్వకూడదంటూ కేంద్రమంత్రి అశోక గజపతిరాజును తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. సోమవారం మంత్రి తుమ్మల ఢిల్లీలో కేంద్రమంత్రి అశోకగజపతిరాజును కలిశారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోనూతన విమానాశ్రయం ఏర్పాటు చేయాలని కోరినట్టు సమాచారం. అశోక గజపతిరాజు దీనికి సమాధానంగా దేశం కోసం ఆర్మీ పని చేస్తోంది.. ఇవ్వకూడదంటే ఎలా అని తుమ్మలను ప్రశ్నించారు. అదే విధంగా ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని తుమ్మలను కోరారు. కొత్తగూడెంలో నూతన ఎయిర్ పోర్టు కోసం స్థలం సేకరిస్తే పరిశీలిస్తామని బదులిచ్చారు. అశోకగజపతిరాజుతో పాటు నితిన్ గడ్కరి, మేనకా గాంధీలను తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వేర్వేరుగా కలిశారు. జాతీయ రహదారుల విస్తరణలో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ వారికి వివరించారు. -
సీఎం చంద్రబాబు రేపు రాక
విశాఖపట్నం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 13వ తేదీన తలపెట్టిన విశాఖ నగర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 13వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టులో ప్రత్యేక విమానంలో బయల్దేరనున్న చంద్రబాబు మధ్యాహ్నం 3.30 గంటలకు విశాఖకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడ నుంచి రోడ్డుమార్గంలో నేరుగా బీచ్‌రోడ్‌లోని నోవొట ల్కు చేరుకుంటారు. నోవాటెల్ వి.కన్వెన్షన్‌లో జరుగనున్న కార్యక్రమంలో మౌలిక సదుపాయల మిషన్‌ను బాబు ప్రారంభించనున్నారు. ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్టిమెంట్ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో జరుగనున్న ఈ కార్యక్రమంలో తొలుత డిపార్టుమెంట్ సెక్రటరీ ఈ మిషన్ ప్రాధాన్యతను వివరిస్తారు. అనంతరం పోర్టు ఆధారిత అభివృద్ధి, మేకింగ్ ఆఫ్ ఏపీ, లాజిస్టిక్ హబ్, ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి, అసోసియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలిమెంట్స్‌పై చర్చిస్తారు. వివిధ సంస్థల సీఈవోలు ప్రసంగిస్తారు. అనంతరం మిషన్ కోసం..మేకింగ్ ఆఫ్ ఏపీ ప్రొగ్రామ్ కోసం ముఖ్యమంత్రిచ చంద్రబాబు కీలకోపన్యాసం చేస్తారు. చివరగా సీఈవోలతో చంద్రబాబు ముఖాముఖి చర్చల్లో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం ఏడుగంటలకు బయల్దేరి విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయల్దేరతారు. -
సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారు
ఏలూరు సిటీ : ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఈ నెల 18న జిల్లా పర్యటనకు రానున్నారు. స్మార్ట్ గ్రామాల్లో ఆయన పాదయాత్ర చేస్తారు. ఆదివారం ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 10 గంటలకు రాజ మండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో ఉదయం 10.10 గంటలకు నిడదవోలు మండలం వేలివెన్ను వస్తారు. 10.30 గంటలకు వేలివెన్నులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, 11.30నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్మార్ట్ గ్రామాల్లో పాదయాత్ర చేస్తారు. శెట్టిపేట, తాళ్లపాలెం, శింగవరం, నిడదవోలు పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ, గణేష్ చౌక్ మీదుగా చాగల్లు మండలం బ్రాహ్మణగూడెం వరకు పాదయాత్ర సాగుతుంది. అనంతరం చంద్రబాబు బ్రాహ్మణగూడెం నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తారు. -
‘బేగంపేట’కు ఎన్టీఆర్ పేరు పెట్టుకోండి: వీహెచ్
సాక్షి, న్యూఢిల్లీ: బేగంపేట విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు అన్నారు. ఢిల్లీలోని విజయ్‌చౌక్ వద్ద శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘చెన్నైలో విమానాశ్రయానికి రెండు పేర్లున్నాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెబుతున్నారు. అక్కడ అంతర్జాతీయ, దేశీయ టర్మినల్‌లు రెండూ వేర్వేరుగా ఉన్నాయి. కానీ శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలకు ఒకటే ద్వారం ఉంది. ఒక్క విమానాశ్రయానికి రెండు పేర్లెలా పెడతారు’’ అని ప్రశ్నించారు. -
నేడు సీఎం చంద్రబాబు రాక
విజయవాడ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడకు రానున్నారు. పార్టీ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన విచ్చేస్తున్నారు. ఉదయం 9.15 గంటలకు హైదరాబాదులోని బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 10.30కి విజయవాడ బందర్ రోడ్డులోని ఎ-కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుని, అక్కడ జరిగే టీడీపీ సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 6.30కి విజయవాడ నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి అక్కడినుంచి హైదరాబాద్ వెళతారు. పార్టీ సమావేశానికి కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, మంత్రులు యనమల రామకృష్ణుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, బి.గోపాలకృష్ణారెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, రావెల కిషోర్‌బాబు, కొల్లు రవీంద్ర తదితరులు హాజరుకానున్నారు. సీఎం రాకను పురస్కరించుకొని కమిషనరేట్ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. -
బేగంపేటలో విమానం మోత మోగింది
హైదరాబాద్ : బేగంపేట విమానాశ్రయంలో శనివారం ఒక్కసారిగా విమానం మోత మోగింది. ఓ విమానం పదుల సార్లు ల్యాండింగ్‌కు రావడం.. తిరిగి పైకి ఎగిరిపోవటం .... ఏం జరుగుతుందో అర్థం కాక స్థానికులు ఆందోళన చెందారు. ఈరోజు ఉదయం ఎయిర్ ఇండియాకు చెందిన ఓ విమానం సికింద్రాబాద్ చుట్టూ 20సార్లు చక్కర్లు కొట్టింది. ఎయిర్‌పోర్టుకు రావడం ల్యాండింగ్ అవుతున్నట్లు కిందికి దిగడం.. మళ్లీ తిరిగి పైకి ఎగరడంతో చుట్టుపక్కలవారికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సాంకేతిక సమస్యలు తలెత్తాయేమోనని హడలిపోయారు. తీరా ఎయిర్ పోర్టు అధారిటీని సంప్రదించగా... అసలు విషయం తెలిసింది. ఎయిర్ ఇండియా పైలెట్లు శిక్షణ నిమిత్తం ల్యాండింగ్ చేస్తున్నట్లు చెప్పడంతో స్థానికులంతా ఊపిరి పీల్చుకున్నారు. -
బేగంపేట ఎయిర్‌పోర్టు వాడలేం: అశోక్ గజపతిరాజు
సాక్షి, న్యూఢిల్లీ: బేగంపేట విమానాశ్రయాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగించలేమని పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్ గజపతి రాజు తెలిపారు. శుక్రవారం ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. బేగంపేట ఎయిర్‌పోర్టును వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే పబ్లిక్ ప్రయివేటు భాగస్వామ్యానికి ఇబ్బందులు ఎదురవుతాయని, ప్రైవేటు ఆపరేటర్లు వ్యతిరేకిస్తారని పేర్కొన్నారు. పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీమేరకు తిరుపతి, విజయవాడ, విశాఖ ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. -
వెంకయ్య నాయుడుకు ఘన స్వాగతం
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడుకు ఘన స్వాగతం లభించింది. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన తొలిసారిగా నగరానికి చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో వెంకయ్యకు ఆ పార్టీ ఎంపీలు బండారు దత్తాత్రేయ, విశాఖపట్నం ఎంపీ కె.హరిబాబుతోపాటు పలువురు సీనియర్ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన బేగంపేట నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరారు. ఆ ర్యాలీలో బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తిరుమలలో ఈ రోజు తెల్లవారుజామున కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుడిని వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. అనంతరం బీజేపీ స్థానిక నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమైయ్యారు. ఆ తర్వాత రేణిగుంట చేరుకుని అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్‌కు పయనమైన సంగతి తెలిసిందే. -
షో ముగిసింది
-
‘ఇండియా ఏవియేషన్-2014’
-
షో మొదలైంది..
‘ఇండియా ఏవియేషన్-2014’ నగరంలో బుధవారం ప్రారంభమైంది. లోహవి‘హంగామా’కు బేగంపేట విమానాశ్రయం వేదికయింది. విదేశీ అతిథులతో కళకళలాడింది. తొలిరోజు బిజినెస్ సందర్శకులు సందడి చేశారు. ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన స్టాళ్ల ప్రత్యేకతలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. గగనతలంలో ప్రదర్శించిన విన్యాసాలు గగుర్పాటు కలిగించాయి. - బేగంపేట, సనత్‌నగర్ చూడడానికి ఈ లోహవిహంగాలన్నీ చిన్నవే. కానీ ఆధునిక హంగులు వీటిసొంతం. గాలిలో ఎగురుతూనే మీటింగ్ పూర్తి చేయొచ్చు. హాయిగా నిద్రపోవచ్చు. విలాసవంతంగా విందారగించే సదుపాయాలెన్నో వీటిల్లో ఉన్నాయి. వీటిలో సీట్ల అమరిక.. మార్చుకునే విధానం చూస్తే పాతాళ భైరవి సినిమా కచ్చితంగా గుర్తొస్తుంది. ఆపరేషన్ అంతా రిమోట్‌తోనే. సీట్లను 180 డిగ్రీల కోణంలో తిప్పుకోవచ్చు. ప్రత్యేక ఫర్నిచర్‌ను వినియోగించడంతో లుక్ జిగేల్మంటుంది. ( 51 వేల అడుగుల ఎత్తులో 12 గంటలు ఏకధాటిగా ప్రయాణించే సామర్థ్యం దీని సొంతం. (ఉదాహరణకు ఫ్రాన్స్‌లో బయలుదేరి ఆగకుండా ఇండియా చేరుకోవచ్చు) ( దీని తయారీదారు డసల్ట్ ఏవియేషన్. ఇందులో మొత్తం సీట్లు 14( ప్రయాణంలో ఉన్నామనే భావన దరి చేరనీయకుండా ప్రత్యేక టెక్నాలజీని వినియోగించారు. ( రేంజ్: 5950 నాటికల్మైళ్లు( సర్వీస్ సెయిలింగ్: 15,545 మీటర్లు ( పొడవు: 29.19 మీటర్లు ( ఎత్తు: 7.83 మీటర్లు ( బరువు: 15,545 కేజీలు ( టేకాఫ్ వెయిట్: 31,300 కేజీలు( ల్యాండింగ్ వెయిట్: 28,305 కేజీలు పసిగట్టేస్తా న్సర్ పరిజ్ఞానంతో ఎయిర్‌పోర్ట్‌లోని ఏ మూలన ఎలాంటి కదలిక జరిగినా క్షణాల్లో టీవీ స్క్రీన్‌పై చూపించడమే కాదు.. అలారం సాయంతో హెచ్చరికలు జారీ చేసే సరికొత్త పరిజ్ఞానం ‘ఫెన్స్ షాక్ డిటెక్షన్ సిస్టమ్’ ప్రత్యేకత. ఒక్క ఎయిర్‌పోర్ట్‌లోనే కాకుండా మనకు కావలసిన నిర్దేశిత ప్రదేశాల్లో ఈ సిస్టమ్ సాయంతో అజ్ఞాత వ్యక్తులు కదలికల్ని గమనించి క్షణాల్లో అప్రమత్తం చేస్తుంది. ఎవరికీ కనిపించకుండా ఉండేలా సెన్సర్లను భూమిలో అమరుస్తారు. ఇవి మాస్టర్ నోడ్‌కు అనుసంధానమై ఉంటాయి. మాస్టర్ నోడ్ ఎన్కోడర్కు కనెక్టై సెంట్రల్ కంట్రోల్ సహాయంతో స్క్రీన్‌పై కదలికలను చూపిస్తుంది. ఒక్కో మాస్టర్ నోడ్‌కు 30 మీటర్ల దూరంలో 30 వరకు సెన్సార్లను అమర్చుకుంటూ వెళ్లవచ్చు. దీని ద్వారా కిలోమీటర్ల మేర నిర్దేశించుకున్న పరిధిలో వాహనాలు, మనుషులు ఇతరత్రా కదలికలు తెలుసుకునే అవకాశం ఉంది. ఏవియేషన్ ఎగ్జిబిషన్లో ఓ స్టాల్లో వీటి గురించి వివరిస్తున్నారు. ఏం దాచారో చెప్పేస్తా సాధారణంగా విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు, షాపింగ్‌మాళ్లు, సినిమా హాళ్లలో భద్రతా కారణాల దృష్ట్యా మనం తీసుకెళ్లే లగేజీని స్కానర్లతో తనిఖీ చేస్తారు. మనుషులకోసం లోహాలను పసిగట్టే మెటల్‌డిటెక్టర్‌ను వినియోగిస్తారు. మరి అసాంఘిక శక్తులు ఆర్డీఎక్స్, నిషేధిత వస్తువులు, రహస్య సమాచారం కలిగిన పెన్‌డ్రైవ్‌లు, సీడీలను తాము వేసుకున్న దుస్తుల్లో పెట్టి తరలిస్తుంటారు. మరి అలాంటి వారి సంగతేంటి అనేగా మీ ప్రశ్న... ఇలాంటి వారిని పసిగట్టి భద్రతా వ్యవస్థను తట్టిలేపే అధునాతన టెక్నాలజీతో తయారైన ‘బాడీస్కానర్’ను ఏవియేషన్ షోలో ప్రదర్శిస్తున్నారు. స్క్రీన్ ముందుభాగంలో నిర్దేశిత ప్రదేశంలో నిలబడితే... దేహాన్ని మొత్తం ఈ పరికరం కేవలం సెకెండ్ల వ్యవధిలో స్కాన్ చేస్తుంది. కడుపులో ఉన్న వస్తువుల్ని సైతం టీవీ స్క్రీన్‌పై చూపిస్తుంది. గుండుసూది కంటే చిన్నవైన వస్తువుల్ని సైతం గుర్తించగలిగే పరిజ్ఞానం దీని సొంతం. దీని వినియోగం వలన ఎటువంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవని తయారీదారులు చెబుతున్నారు. -
ప్రారంభమైన తెలంగాణ విజయోత్సవ యాత్ర
-
కేసీఆర్ ఘన స్వాగతానికి సిద్ధమైన టీఆర్ఎస్
-
రాష్ట్రపతికి ఘనస్వాగతం
సాక్షి, హైదరాబాద్: రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సోమవారం రాత్రి బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. రాత్రి 7.45కు ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి రాజనర్సింహ, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, స్పీకర్ మనోహర్, కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పనబాక లక్ష్మి, బలరాం నాయక్, మంత్రులు బొత్స సత్యనారాయణ, గీతారెడ్డి, జానారెడ్డి, శ్రీధర్‌బాబు, సునీతా లక్ష్మారెడ్డి, డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య, రాంరెడ్డి వెంకటరెడ్డి, సి.రామచంద్రయ్య, పితాని సత్యనారాయణ, దానం నాగేందర్, సుదర్శన్‌రెడ్డి, మండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, మేయర్ మాజిద్ హుసేన్, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు, ఎంపీలు పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, వివేక్, మధు యాష్కి, అంజన్‌కుమార్ యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, డీజీపీ ప్రసాదరావు తదితరులు విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కూడా హాజరయ్యారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న సెటిలర్స్‌కు సంబంధించిన అంశాలను రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రత్యేకంగా పరిశీలించాలంటూ తెలంగాణ సెటిలర్స్ ఫోరం కన్వీనర్ కాట్రగడ్డ ప్రసూన ఆయనకు వినతిపత్రం సమర్పించారు. ఇటీవలి తుపాను, వర్షాలను జాతీయ విపత్తుగా పరిగణించి సాయం అందేలా చొరవ తీసుకోవాలంటూ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కూడా వినతిపత్రం సమర్పించారు. నాదెండ్ల భాస్కర్‌రావు తనకు సీటు ఎక్కడని ప్రోటోకాల్ సిబ్బందిని అడగ్గా, సీనియర్ ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి తన పక్కనున్న సీట్లో కూర్చోవాలని కోరారు. -
భత్కల్ను హైదరాబాద్ తీసుకువచ్చిన ఎన్ఐఏ అధికారులు
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లలో ప్రధాన నిందితుడు యాసిన్ భత్కల్ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ఆదివారం హైదరాబాద్ తీసుకువచ్చారు. న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో భత్కల్‌తోపాటు ఎన్ఐఏ అధికారులు ఆదివారం ఉదయం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం అతడిని రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. కాగా భత్కల్ను రేపు నాంపల్లి కోర్టులో ఎన్ఐఏ అధికారులు హాజరపరచనున్నారు. యాసిన్ భత్కల్ను హైదరాబాద్‌లో విచారించేందుకు న్యూఢిల్లీలోని కోర్టు శనివారం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. యాసిన్ భత్క్లల్తోపాటు మరోకు ఇటీవల భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీహార్ పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. గతంలో భారత్‌లో పలు ప్రధాన నగరాల్లో బాంబు పేలుళ్లలో భత్కల్ కీలక పాత్ర పోషించిన విషయం విదితమే.