హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెండేళ్లకోసారి ప్రతిష్టాత్మకంగా జరిగే వింగ్స్ ఇండియా 2024 కార్యక్రమానికి తేదీలు ఖరారయ్యాయి. బేగంపేట విమానాశ్రయం వేదికగా జనవరి 18 నుంచి నాలుగు రోజులపాటు ఇది జరుగనుంది.
పౌర విమానయాన శాఖ, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, తెలంగాణ ప్రభుత్వం, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ (ఫిక్కీ) సంయుక్తంగా వింగ్స్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. పౌర విమానయాన రంగంలో ఆసియాలో ఇదే అతిపెద్ద ప్రదర్శన. 2022లో జరిగిన వింగ్స్ ఇండియా ప్రదర్శనలో 125 కంపెనీలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు గవర్నమెంట్ సమావేశాలు 364 జరిగాయి. 12 ఎయిర్‌క్రాఫ్ట్స్ కొలువుదీరాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సారంగ్ బృందం చేసిన ఎయిర్‌షో ప్రత్యేక ఆకర్షణ.
Comments
Please login to add a commentAdd a comment