Wings India
-
Wings India 2024 Air Show Photos: రెండో రోజూ ‘వింగ్స్ ఇండియా-2024’ (ఫొటోలు)
-
బేగంపేట్ ఎయిర్ పోర్టులో 2వ రోజు వింగ్స్ ఇండియా-2024 షో
-
రాష్ట్రాన్ని ఏవియేషన్ హబ్‌గా మారుస్తాం: మంత్రి కోమటిరెడ్డి
సనత్‌నగర్ (హైదరాబాద్): తెలంగాణను ఏవియేషన్ హబ్‌గా మారుస్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. గురువారం బేగంపేట విమానాశ్రయంలో ప్రారంభమైన వింగ్స్ ఇండియా–2024ను ఆయన సందర్శించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కలిసిన ఆయన హైదరాబాద్ నుంచి అమెరికాకు నేరుగా విమానాలు నడపాలని కోరారు. అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ఎయిర్ షో, గ్లోబల్ ఏవియేషన్ సమిట్‌ను నిర్వహించే అవకాశాన్ని హైదరాబాద్‌కు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఏవియేషన్, ఏరోస్పేస్ రంగం అభివృద్ధికి సానుకూల వాతావరణం హైదరాబాద్‌లో ఉందన్నారు. ప్రపంచంలో నాణ్యమైన జీవనానికి అనువైన నగరాలకు ర్యాంకింగ్స్ ఇచ్చే మెర్సర్ సంస్థ నివేదిక ప్రకారం హైదరాబాద్ భారతదేశంలోనే అత్యంత నివసించదగిన నగరంగా ఎంపికైందని చెప్పారు. అమృత్కాల్ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలోని పాత విమానాశ్రయాలను పునరుద్ధరించడం, కొత్త ఎయిర్‌పోర్ట్‌ల ఏర్పాటుపై దృష్టిసారించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలను అనుసంధానించడానికి హెలిపోర్ట్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రీన్‌ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాలు భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, మహబూబ్‌నగర్ జిల్లా అడక్కల్ మండలం గుడిబండ గ్రామంలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. అలాగే వరంగల్ అర్బన్ జిల్లా మామునూరు గ్రామం, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాలో బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయాలకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. తొలి దశలో ఇప్పటికే వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్ విమానాశ్రయాల పనులు ప్రారంభమయ్యాయన్నారు. ఈ ఆరు విమానాశ్రయాల సాంకేతిక సాధ్యాసాధ్యాలపై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ (ఏఏఐ) ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని, ఇది ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నాగార్జునసాగర్ డ్యామ్‌లో వాటర్ ఏరోడ్రమ్ ఏర్పాటుకు ప్రతిపాదించిందని, దీనికి ఏఏఐ ప్రీ–ఫీజిబిలిటీ నివేదిక కూడా ఇచ్చిందన్నారు. ఇదే కాకుండా మరికొన్నిచోట్ల కూడా వాటర్ ఏరోడ్రోమ్లను ఏర్పాటుచేసే ఆలోచన ఉందని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ సముదాయాల వద్ద శాశ్వత హెలిప్యాడ్ సౌకర్యాలు ఉన్నాయని, ఇలాంటి సౌకర్యాలున్న మొదటి రాష్ట్రం తెలంగాణనే అని చెప్పారు. రాష్ట్రానికి ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ పరిశ్రమలు అత్యంత ప్రాధాన్య రంగాలుగా ఉన్నాయన్నారు. తయారీ సేవలు, ఇంజనీరింగ్, శిక్షణతోపాటు అనుబంధ సంస్థలకు అతిథ్యం ఇవ్వడానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ, టీఎస్ఐఐసీ అనేక ఏరోస్పేస్ పార్కులను అభివృద్ధి చేసినట్లు కోమటిరెడ్డి వివరించారు. లోహ విహంగాల సందడి ఒళ్లు గగుర్పొడిచే వైమానిక విన్యాసాలకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ వేదికైంది. కేంద్ర పౌరవిమానయాన శాఖ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సంయుక్తంగా నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా–2024 గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్య అతిథిగా హాజరై ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఇందులో వివిధ కంపెనీలకు చెందిన దాదాపు 25 విమానాలు, హెలికాప్టర్లు రన్‌వేపై కొలువుదీరాయి. వీటిని తిలకించేందుకు బిజినెస్ విజిటర్స్తోపాటు దేశ, విదేశాల నుంచి వచ్చిన సందర్శకులు ఆసక్తి కనబర్చారు. బోయింగ్ 777, ఎయిర్ ఇండియాతోపాటు ఆకాశ ఎయిర్ 737–8లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. -
Wings Airshow 2024 Photos: అదిరిపోయే ఎయిర్ షో..బేగంపేటలో ‘వింగ్స్ ఇండియా-2024’ (ఫొటోలు)
-
WINGS INDIA 2024: 20 ఏళ్లలో 2,840 విమానాలు కావాలి
రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ఏవియేషన్ రంగానికి భారత్ దన్నుగా నిలుస్తుందని విమానాల తయారీ దిగ్గజం ఎయిర్‌బస్ ఇండియా ప్రెసిడెంట్ రెమి మిలార్డ్ తెలిపారు. గణనీయంగా వృద్ధి చెందుతున్న భారత మార్కెట్‌కు వచ్చే 20 ఏళ్లలో 2,840 కొత్త విమానాలు అవసరమన్నారు. అలాగే 41,000 మంది పైలట్లు, 47,000 మంది టెక్నికల్ సిబ్బంది కావాల్సి ఉంటుందని గురువారం వింగ్స్ ఇండియా 2024 కార్యక్రమంలో ఆయన చెప్పారు. వచ్చే 20 ఏళ్ల పాటు ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందతున్న దేశంగా భారత్ నిలుస్తుందని అంచనాలు ఉన్నట్లు రెమీ తెలిపారు. భారత్ నుంచి రెట్టింపు స్థాయిలో కొనుగోలు చేయనున్నట్లు రెమీ వివరించారు. ప్రస్తుతం 750 మిలియన్ డాలర్లుగా ఉన్న సోర్సింగ్‌ను ఈ దశాబ్దం చివరికి 1.5 బిలియన్ డాలర్లకు పెంచుకోనున్నట్లు చెప్పారు. భారత్ నుంచి గతేడాది 750 విమానాలకు ఆర్డర్లు రాగా 75 ఎయిర్‌క్రాఫ్ట్‌లను దేశీ విమానయాన సంస్థలకు డెలివరీ చేసినట్లు వివరించారు. వీటిలో 41 విమానాలు ఇండిగో సంస్థకు, ఎయిరిండియాకు 19, విస్తారాకు 14, గో ఫస్ట్‌కు ఒకటి చొప్పున అందించినట్లు రెమీ చెప్పారు. తమ ఏ350 రకం విమానాలు భారత్‌లో అంతర్జాతీయ ప్రయాణాలకు ఊతమివ్వగలవని పేర్కొన్నారు. గతేడాది ఎయిరిండియాకు ఆరు ఏ350 విమానాలను అందించినట్లు చెప్పారు. భారత్‌లో విమానాల నిర్వహణ, రిపేర్లు, ఓవరాలింగ్ వ్యవస్థ అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తున్నట్లు తెలిపారు. వింగ్స్ ఇండియా హైలైట్స్ ► హెరిటేజ్ ఏవియేషన్ ఎయిర్‌క్రాఫ్ట్ చార్టర్ కంపెనీ హెరిటేజ్ ఏవియేషన్ తాజాగా హెచ్125, హెచ్130 హెలికాప్టర్ల కోసం ఎయిర్‌బస్‌కు ఆర్డరు ఇచి్చంది. వీటిని ప్రాంతీయ కనెక్టివిటీ స్కీము ఉడాన్ కింద సరీ్వసుల కోసం ఉపయోగించనున్నట్లు సంస్థ సీఈవో రోహిత్ మాథుర్ తెలిపారు. ఎత్తైన, వేడిమి ఎక్కువగా ఉండే వాతావరణాల్లో ప్రయాణాలకు హెచ్125 హెలికాప్టర్ ఉపయోగపడుతుంది. ఇక సైట్ సీయింగ్, అత్యవసర వైద్య సరీ్వసులు మొదలైన వాటి కోసం హెచ్130 సహాయకరంగా ఉంటుంది. ► ఎయిర్ ఇండియా గురుగ్రాంలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆసియాలో అతిపెద్ద ఏవియేషన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఎయిర్‌బస్, బోయింగ్ కోసం 20కిపైగా సిమ్యులేటర్స్‌తో పైలట్లకు శిక్షణ. ఆకాశ ఎయిర్ బోయింగ్ 737 మ్యాక్స్ రకం 150 విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. ఆకాశ ఎయిర్ బోయింగ్ 737 మ్యాక్స్ రకం 150 విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. ఎయిర్ ఇండియా గురుగ్రాంలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆసియాలో అతిపెద్ద ఏవియేషన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఎయిర్‌బస్, బోయింగ్ కోసం 20కిపైగా సిమ్యులేటర్స్‌తో పైలట్లకు శిక్షణ. జీఎంఆర్ ఏరో జ్యోతిరాదిత్య సింధియా చేతుల మీదుగా ఏవియేషన్ స్కూల్ వర్చువల్‌గా ప్రారంభం. టీఏఎస్ఎల్ విడిభాగాల తయారీకై మహీంద్రా ఏరోస్పేస్తో కలిసి ఎయిర్‌బస్ నుంచి ఆర్డర్లను పొందింది. -
Aviation Expo Wings India 2024: విమానయానం ఉజ్వలం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘మనుషులను, మనసులను విమానయాన రంగం అనుసంధానిస్తోంది. జీవితాల్లో మార్పు తెచ్చింది. సామాజిక, ఆర్థిక పురోగతిలో పాలుపంచుకుంటోంది. నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత విమానయాన పరిశ్రమ వెలుగులమయం’ అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గురువారం అన్నారు. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో రెండేళ్లకోసారి జరిగే వైమానిక ప్రదర్శన వింగ్స్ ఇండియా–2024 ప్రారంబోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. సామాన్యుడికీ విమానయాన అవకాశాన్ని అందించే ఉడాన్ 5.3 స్కీమ్‌ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. దేశీయంగా 30 కోట్లకు.. పౌర విమానయాన రంగంలో ప్రపంచంలో అయిదవ స్థానంలో భారత్ నిలిచిందని జ్యోతిరాదిత్య తెలిపారు. ‘2014లో దేశీయంగా 6 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. 2023లో ఈ సంఖ్య 15.3 కోట్లకు ఎగసింది. 2030 నాటికి ఇది 30 కోట్లను తాకుతుంది. విమాన ప్రయాణికుల విస్తృతి ప్రస్తుతం కేవలం 3–4 శాతమే. ఏడేళ్లలో ఇది 10–15 శాతానికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. మిగిలిన 85 శాతం మేర అవకాశాలను అందుకోవడానికి కసరత్తు చేస్తున్నాం. అడ్డంకులు తొలగించడంతోపాటు మౌలిక వసతుల కల్పన చేపడుతున్నాం’ అని వివరించారు. కొత్త విమానాశ్రయాలు.. దేశవ్యాప్తంగా 2014 నాటికి 74 విమానాశ్రయాలు, హెలిప్యాడ్స్, వాటర్ డ్రోమ్స్ ఉన్నాయి. ఇవి రావడానికి 65 ఏళ్ల సమయం పట్టిందని సింధియా తెలిపారు. ‘గడిచిన 10 ఏళ్లలో 75 విమానాశ్రయాలు, హెలిప్యాడ్స్, వాటర్ డ్రోమ్స్ జోడించాం. దీంతో ఈ కేంద్రాల సంఖ్య 149కి చేరుకుంది. 2030 నాటికి ఇవి 200 దాటతాయి. ప్రతి జిల్లా కేంద్రంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలన్నది ప్రణాళిక. ప్రస్తుతం భారతీయ విమానయాన సంస్థల వద్ద 713 విమానాలు ఉన్నాయి. వచ్చే దశాబ్దిలో వీటి సంఖ్య 2,000 దాటుతుంది. విమానాల కొనుగోలులో యూఎస్, చైనా తర్వాతి స్థానాన్ని భారత్ కైవసం చేసుకుంది’ అని అన్నారు. రికార్డు స్థాయిలో మహిళా పైలట్లు.. ప్రయాణికుల వృద్ధి రేటు దేశీయంగా 15.3 శాతం, అంతర్జాతీయంగా 6.1 శాతం ఉంది. 15 ఏళ్లలో విమానాల్లో సరుకు రవాణా దేశీయంగా 60 శాతం, విదేశాలకు 53 శాతం అధికమైందని సింధియా గుర్తు చేశారు. ‘గతేడాది 1,622 మంది కమర్షియల్ పైలట్ లైసెన్స్ అందుకున్నారు. వీరిలో 18 శాతం మహిళలు కావడం విశేషం. భారత్‌లో ఉన్న పైలట్లలో మహిళల వాటా 15 శాతం ఉంది. ఇది ప్రపంచ రికార్డు. డ్రోన్స్ రంగంలో ప్రపంచ కేంద్రంగా భారత్‌ను నిలబెట్టేందుకు నిబంధనలు సరళీకరించాం, ప్రోత్సాహకాలు ప్రకటించాం’ అని చెప్పారు. కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ (రిటైర్డ్) వి.కె.సింగ్, తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో వింగ్స్ ఇండియా ఏవియేషన్ షో
-
Wings India 2024: బేగంపేట్ ఎయిర్పోర్ట్ వేదికగా ‘వింగ్స్ ఇండియా–2024’ (ఫొటోలు)
-
గగనంలో అద్భుత వీక్షణకు
సనత్‌నగర్ (హైదరాబాద్): గగనంలో గగుర్పొడిచే విన్యాసాలకు మరోసారి బేగంపేట విమానాశ్రయం వేదికైంది. వింగ్స్ ఇండియా–2024కు కౌంట్‌డౌన్ మొదలైంది. రెండేళ్లకోసారి జరిగే ఈ వేడుకను కేంద్ర పౌర విమాన శాఖ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సంయుక్తంగా ఈ నెల 18 నుంచి 21 వరకు నిర్వహిస్తున్నాయి. గురువారం ఉదయం 10 గంటలకు జరిగే వింగ్స్ ఇండియా–2024 ప్రారంబోత్సవానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. దాదాపు 25 విమానాలు, హెలికాప్టర్లను ప్రదర్శనకు ఉంచనున్నారు. తొలిసారి ప్రదర్శనకు వస్తున్న బోయింగ్‌తోపాటు ఎయిర్ ఇండియా మొదటి హెలికాప్టర్ ఏ350 లాంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మొదటి 2 రోజులు (18, 19 తేదీలు) వ్యాపార, వాణిజ్యవేత్తలను, ఆ తరువాత రెండు రోజులు (20, 21 తేదీలు) సామాన్యులను అనుమతిస్తారు. ఈ షోలో 106 దేశాల నుంచి 1500 మంది డెలిగేట్స్, 5,000 మంది బిజినెస్ విజిటర్స్ పాల్గొననున్నట్లు అంచనా. ఫ్లయింగ్ డిస్ప్లే సమయం పెరిగిందోచ్.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సారంగ్ టీమ్‌తోపాటు మార్క్ జాఫరీస్ బృందం చేసే వైమానిక విన్యాసాలను కళ్లు ఆర్పకుండా చూడాల్సిందే. గతంలో ఫ్లెయింగ్ డిస్ప్లే సమయాన్ని కేవలం 15 నిమిషాల చొప్పున రోజుకు రెండు పర్యాయాలు నిర్వహించగా, ఈసారి 45 నిమిషాల చొప్పున రోజుకు రెండు సార్లు విన్యాసాలు చేయనున్నారు. చివరి రోజు ఆదివారం సందర్శకులు ఎక్కువగా విచ్చేయనున్న దృష్ట్యా ఆ రోజు మూడుసార్లు విన్యాసాలు నిర్వహించనున్నారు. సారంగ్ టీమ్ వచ్చేసింది.. ముగ్గురు హైదరాబాదీలే.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సారంగ్ టీమ్ మరోసారి తమ వైమానిక విన్యాసాలు ప్రదర్శించేందుకు రెడీ అయ్యింది. ప్రపంచంలోనే ఏరోబాటిక్స్ చేసే ఏకైక జట్టుగా పేరొందిన ఈ టీమ్ ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకుంది. ఐదు హెలికాప్టర్లతో ఏరోబాటిక్స్ ప్రదర్శించే ఈ బృందానికి సీనియర్ గ్రూప్ కెపె్టన్ ఎస్కే మిశ్రా నేతృత్వం వహిస్తున్నారు. ఏరోబాటిక్స్ ప్రదర్శన చేసే ఐదుగురిలో ముగ్గురు హైదరాబాదీలే కావడం విశేషం. హైదరాబాదీలైన వింగ్ కమాండర్లు టీవీఆర్ సింగ్, అవినాష్ సారంగ్ టీమ్‌లో రాణిస్తున్నారు. దేశ, విదేశాల్లో ఈ టీమ్ 350 షోలకు పైగా నిర్వహించి రికార్డు సృష్టించింది. వైమానిక విన్యాసాల వేళలు 18వ తేదీన మధ్యాహ్నం 1 – 2 గంటల వరకు, 4.15–5 గంటల వరకు 19న ఉదయం 11.30–12.15 వరకు, మధ్యాహ్నం 3.30–4.15 వరకు. అనంతరం డ్రోన్ షో జరగనుంది. 20న ఉదయం 11.30–12.15 వరకు, మధ్యాహ్నం 3.30–4.15 వరకు.. 21న ఉదయం 11–11.45 వరకు, మధ్యాహ్నం 3–3.45 వరకు, సాయంత్రం 5–5.45 వరకు -
హైదరాబాద్‌లో వింగ్స్ 24 ఎగ్జిబిషన్ (ఫొటోలు)
-
Wings India 2024: ఎయిర్ షో తేదీలు ఖరారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెండేళ్లకోసారి ప్రతిష్టాత్మకంగా జరిగే వింగ్స్ ఇండియా 2024 కార్యక్రమానికి తేదీలు ఖరారయ్యాయి. బేగంపేట విమానాశ్రయం వేదికగా జనవరి 18 నుంచి నాలుగు రోజులపాటు ఇది జరుగనుంది. పౌర విమానయాన శాఖ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, తెలంగాణ ప్రభుత్వం, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ (ఫిక్కీ) సంయుక్తంగా వింగ్స్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. పౌర విమానయాన రంగంలో ఆసియాలో ఇదే అతిపెద్ద ప్రదర్శన. 2022లో జరిగిన వింగ్స్ ఇండియా ప్రదర్శనలో 125 కంపెనీలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు గవర్నమెంట్ సమావేశాలు 364 జరిగాయి. 12 ఎయిర్‌క్రాఫ్ట్స్ కొలువుదీరాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సారంగ్ బృందం చేసిన ఎయిర్‌షో ప్రత్యేక ఆకర్షణ. -
విజయవంతంగా ముగిసిన ఏవియేషన్ షో (ఫొటోలు)
-
లోహ విహంగాల హంగామా.. 'వింగ్స్ ఇండియా' (ఫోటోలు)
-
విమానాల రిపేర్లకు అనువుగా తిరుపతి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెంపుల్ సిటీగా పేరొందిన తిరుపతిలో విమానాల ఇంజిన్ల నిర్వహణ, రిపేర్, ఓవరాలింగ్ (ఎంఆర్వో) ఫెసిలిటీ ఏర్పాటు పనులను వేగిరం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గురుమూర్తి మద్దిల శుక్రవారం విన్నవించారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎంఆర్వో కేంద్రం ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలు, వ్యాపార ఆవకాశాలను వివరిస్తూ ఇన్వెస్ట్ ఇండియా నివేదిక రూపొందించింది. బేగంపేట విమానాశ్రయంలో జరుగుతున్న వింగ్స్ ఇండియా–2022 వేదికపై కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఈ రిపోర్ట్‌ను ఆవిష్కరించారు. తిరుపతిసహా 8 ఎయిర్‌పోర్టుల్లో ఎంఆర్వో కేంద్రాలను నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించింది. ‘తిరుపతి విమానాశ్రయంలో రన్‌వే నుంచి 440 మీటర్ల దూరంలోనే ప్రతిపాదిత ఎంఆర్వో కేంద్రం కోసం స్థలం ఉంది. ఇటువంటి సౌకర్యం దేశంలో ఏ ఎయిర్‌పోర్టులో కూడా లేదు. ఎంఆర్వో సేవలకు అనువుగా ఉంటుంది’ అని గురుమూర్తి తెలిపారు. రెండు హెలిప్యాడ్స్ సైతం.. తిరుమలకు ఏటా 5.8 కోట్ల మంది భక్తులు, సందర్శకులు వస్తున్నారని గురుమూర్తి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘వీరిలో 40 శాతం మంది ఖర్చుకు వెనుకాడరు. నాలుగైదు రోజులు గడిపేందుకు సిద్ధంగా ఉంటున్నారు. తిరుపతితోపాటు కోస్తా ప్రాంతంలో హెలిప్యాడ్స్ స్థాపించాల్సిందిగా కేంద్రాన్ని కోరాం. ఇవి కార్యరూపంలోకి వస్తే తిరుమల వచ్చిన వారు కోస్తా ప్రాంతంలో ఉన్న సందర్శనీయ స్థలాలకు హెలికాప్టర్లో సులువుగా వెళ్లవచ్చు. రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. తిరుపతి విమానాశ్రయంలో రన్‌వే విస్తరణ పనులు వేగిరం అయ్యాయి. స్థల సేకరణలో తలెత్తిన సమస్యలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చొరవతో సమసిపోయాయి. కడపలో పైలట్ శిక్షణ కేంద్రం రానుంది. ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే దక్షిణాదివారు శిక్షణ తీసుకోవచ్చు. భోగాపురం విమానాశ్రయానికి కావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరాం’ అని వివరించారు. విదేశీ సంస్థలకు సైతం.. ఇన్వెస్ట్ ఇండియా నివేదిక ప్రకారం.. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 2017–18లో విమాన రాకపోకలు 7,094 నమోదయ్యాయి. ఆ తర్వాతి సంవత్సరం ఇది ఏకంగా 10,738కు ఎగసింది. మహమ్మారి కారణంగా 2021–22లో ఈ సంఖ్య 6,613కు వచ్చి చేరింది. 2020–21తో పోలిస్తే ఇది 49% అధికం. 2017–18లో 6.57 లక్షల మంది విమాన ప్రయాణం చేశారు. ఈ సంఖ్య 2018–19లో 8.48 లక్షలకు ఎగసింది. 2021–22లో 47% అధికమై 5.02 లక్షలకు వచ్చి చేరింది. ఇండిగో, స్పైస్ జెట్, ట్రూజెట్, అలయన్స్ ఎయిర్, ఎయిరిండియా, స్టార్ ఎయిర్ సంస్థలు అన్నీ కలిపి వారం లో 131 సర్వీసులు నడిపిస్తున్నాయి. తిరుపతి నుంచి 400 కిలోమీటర్ల పరిధిలో 10 విమానాశ్రయాలు ఉన్నాయి. ఎంఆర్వో సేవలు అందించేందుకు ఈ నెట్వర్క్ దోహదం చేస్తుంది. ఆసియా పసిఫిక్, తూర్పు ఆసియా, మధ్యప్రాచ్య దేశాలకు చెందిన సంస్థలకూ ఈ సేవలు విస్తరించేందుకు వ్యూహాత్మక కేంద్రంగా తిరుపతి ఉంది. ఏటా భారత్‌కు 120 కొత్త విమానాలు: సింధియా దేశంలో విమానయాన సంస్థల వద్ద ప్రస్తుతం 710 విమానాలు ఉన్నాయి. 2013–14లో ఈ సంఖ్య 400 మాత్రమే. రానున్న రోజుల్లో ఏటా కొత్తగా కనీసం 110–120 విమానాలు జతకూడనున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా శుక్రవారం తెలిపారు. ఇక్కడి బేగంపేటలో జరుగుతున్న వింగ్స్ ఇండియా–2022 ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఏడేళ్లలో ఎయిర్‌పోర్టుల సంఖ్య 74 నుంచి 140కి ఎగసింది. మూడేళ్లలో ఇది 220లకు చేరుతుంది. దేశీయంగా 2013–14లో 6.7 కోట్ల మంది ప్రయాణించారు. అయిదేళ్లలో ఈ సంఖ్య 14 కోట్లకు చేరింది. ప్రస్తుతం రోజుకు 3.83 లక్షల మంది విహంగ విహారం చేస్తున్నారు. మహమ్మారి నుంచి ఈ పరిశ్రమ వేగంగా కోలుకుంది. వచ్చే ఏడాది కోవిడ్–19 ముందస్తు స్థాయిలో దేశీయ ప్రయాణికుల సంఖ్య రోజుకు 4.1 లక్షలు దాటనుంది. 2018–19లో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 34.4 కోట్లు. 2024–25 నాటికి ఇది 40 కోట్లు దాటుతుంది’ అని సింధియా తెలిపారు. ఇన్వెస్ట్ ఇండియా నివేదికను జ్యోతిరాదిత్యతో కలిసి ఆవిష్కరిస్తున్న -
WINGS INDIA 2022 : రెక్కలు తొడిగిన గగనం (ఫొటోలు)
-
ఆకట్టుకున్న 'వింగ్స్ ఇండియా 2022' ఏవియేషన్ షో
-
అత్యాధునిక ఇండియన్ హెలికాప్టర్
-
గగనమంత ఉత్సాహం: ఆకట్టుకున్న ‘వింగ్స్ ఇండియా’ ఏవియేషన్ షో (ఫొటోలు)
-
20 ఏళ్లు.. 2,210 విమానాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏవియేషన్ మార్కెట్ పుంజుకుంటున్న నేపథ్యంలో వచ్చే రెండు దశాబ్దాల్లో భారత విమానయాన రంగానికి కొత్తగా 2,210 విమానాలు అవసరం కానున్నాయి. వీటిలో 1,770 చిన్న స్థాయి, 440 మధ్య..భారీ స్థాయి ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉండనున్నాయి. గురువారమిక్కడ వింగ్స్ ఇండియా ఏవియేషన్ షో సందర్భంగా విమానాల తయారీ దిగ్గజం ఎయిర్‌బస్ ఇండియా విభాగం ప్రెసిడెంట్ రెమి మెలార్డ్ ఈ విషయాలు తెలిపారు. భారత మార్కెట్‌పై అంచనాలకు సంబంధించిన నివేదిక ప్రకారం 2040 నాటికి దేశీయంగా ప్రయాణికుల రద్దీ ఏటా 6.2 శాతం మేర వృద్ధి చెందుతుందని భావిస్తున్నట్లు ఆయన వివరించారు. జనాభాపరంగా, ఆర్థికంగా, భౌగోళికంగా భారత్‌కు ఉన్న ప్రత్యేకతలు ఇందుకు దోహదపడగలవని రెమి తెలిపారు. దేశీయంగా మధ్యతరగతి వర్గాలు.. విమాన ప్రయాణాలపై మరింతగా వెచ్చించే అవకాశం ఉందని పేర్కొన్నారు. మెయింటెనెన్స్ .. సర్వీస్ సామర్థ్యాలు, ట్యాక్సేషన్ విధానాలు మొదలైనవన్నీ మరింత అనుకూలంగా ఉంటే భారత్‌లో విమానయాన రంగం గణనీయంగా వృద్ధి చెందగలదని రెమి తెలిపారు. అంతర్జాతీయంగా ప్యాసింజర్ ట్రాఫిక్ వృద్ధి 3.9 శాతం స్థాయిలోనే ఉండగలదన్నారు. అంతర్జాతీయ రూట్లలో వాటా పెంచుకోవాలి గడిచిన పదేళ్లలో దేశీయంగా ఎయిర్ ట్రాఫిక్ దాదాపు తొమ్మిది రెట్లు పెరిగిందని, అంతర్జాతీయ ట్రాఫిక్ రెట్టింపు అయ్యిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ రూట్లలో విదేశీ ఎయిర్‌లైన్స్ వాటా 94 శాతం పైగా ఉంటుండగా.. భారత విమానయాన సంస్థల వాటా 6 శాతం స్థాయిలోనే ఉందని రెమి తెలిపారు. ఈ నేపథ్యంలో దేశీ విమానయాన సంస్థలు తమ మార్కెట్ వాటా మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఉందని రెమి చెప్పారు. ప్రస్తుతం కోవిడ్ సహా పలు సంక్షోభాలు ఏవియేషన్ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని, అయితే పరిశ్రమ వీటి నుంచి ధీటుగా బైటపడగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కోవిడ్ సంక్షోభం నుంచి భారత్ వేగంగా కోలుకుంటోందని.. అందుకే అంచనాలను పెంచామన్నారు. 34 వేల మంది పైలట్లు కావాలి విమానయాన పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందుతుండటంతో 2040 నాటికి భారత్‌లో అదనంగా 34,000 మంది పైలట్లు, 45,000 సాంకేతిక నిపుణులు అవసరమవుతారని భావిస్తున్నట్లు రెమి వివరించారు. భారత్‌లో ఎయిర్‌బస్ 7,000 పైచిలుకు ఉద్యోగాలు కల్పిస్తోందని, ఏటా భారత్ నుంచి 650 మిలియన్ డాలర్ల పైగా కొనుగోళ్లు జరుపుతోందని చెప్పారు. వచ్చే దశాబ్ద కాలంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ నిలుస్తుందని, జీ20 దేశాల్లో అత్యంత వేగవంతమైన వృద్ధి సాధించడం కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాబోయే పదేళ్లలో భారత్‌లో విమానయాన సంస్థలకు వారానికి ఒకటి పైగా ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఎయిర్‌బస్ డెలివర్ చేయగలదని రెమి చెప్పారు. గతేడాది 611 విమానాలను డెలివర్ చేయగా ఇందులో 10% ఎయిర్‌క్రాఫ్ట్‌లు భారత సంస్థలకు అందించినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది 720 విమానాల డెలివరీ టార్గెట్ అని తెలిపారు. సుదూర ప్రయాణాలకు ఏ350 విమానాలు ఏ350 విమానాలను సుదూర ప్రయాణాలకు అనువుగా రూపొందించినట్లు రెమి తెలిపారు. ఇవి ఏకంగా 18,000 కి.మీ. దూరం ప్రయాణించగలవని, 300–410 మంది వరకూ ప్యాసింజర్లు ప్రయాణించవచ్చని ఆయన చెప్పారు. అధునాతన మెటీరియల్స్ వల్ల ఇదే తరహా పోటీ సంస్థల విమానాలతో పోలిస్తే ఏ350 విమానాలు ఇంధనాన్ని 25% మేర ఆదా చేయగలవని, తద్వారా నిర్వహణ వ్యయాలను తగ్గించగలవని రెమి తెలిపారు. ఈ విమానాల కోసం 50 కస్టమర్ల నుంచి 915 ఆర్డర్లు వచ్చినట్లు (సరుకు రవాణా కోసం ఉపయోగించే ఏ350ఎఫ్ సహా) ఆయన పేర్కొన్నారు. వీటి విక్రయాలకు సంబంధించి భారతీయ విమానయాన సంస్థలతో కూడా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. -
WINGS INDIA 2022 : నేటి నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టులో ఏవియేషన్ షో (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా 2022 ఏవియేషన్ షో
సాక్షి, హైదరాబాద్: ఆసియా దేశపు అతిపెద్ద ఏవియేషన్ షో... పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతిష్టాత్మక దైవార్షిక ప్రదర్శన.. వింగ్స్ ఇండియా 2022 నగరంలో కొలువుదీరనుంది. బేగంపేట ఎయిర్పోర్ట్ ఆవరణలో మార్చి 24 నుంచి 4 రోజుల పాటు జరుగనున్న ఈ భారీ ఏవియేషన్ షో కోసం సర్వం సిద్ధమైంది. కరోనా కారణంగా గత మార్చిలో ఈ షోను కేవలం బిజినెస్ మీట్‌గా మాత్రమే పరిమితం చేశారు. రెండేళ్ల కోవిడ్ కాటు నుంచి కోలుకుంటూ... నగరంలో వింగ్స్ ఇండియా పూర్తి స్థాయిలో సందడి చేయనుంది ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో పాటు పలు ప్రభుత్వ విభాగాలు పాలు పంచుకుంటుండగా, నగరానికి చెందిన ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) వింగ్స్ ఇండియా నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. రాజకీయ/ పరిశ్రమ ప్రముఖుల హాజరు... ఈ కార్యక్రమాన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ప్రారంభిస్తారు. మరో కేంద్రమంత్రి వికె సింగ్‌లు హాజరుకానున్నారు. చర్చలు.. సదస్సులు.. ఈ కార్యక్రమంలో హెలికాప్టర్ పరిశ్రమపై రౌండ్ టేబుల్ చర్చ జరుగనుంది. అదే విధంగా ఏవియేషన్ ఫైనాన్సింగ్– లీజింగ్ డ్రోన్స్, ఏవియేషన్ రివైవల్, ఏరో మాన్యుఫ్యాక్చరింగ్ భవిష్యత్తు, నిర్వహణ, మరమ్మతు, కార్యకలాపాలు తదితర అంశాలపై ప్యానెల్ చర్చ నిర్వహిస్తారు. సంబంధిత రంగంతో పాటు అనుబంధ రంగాలకు చెందిన పలు సంస్థలకు వింగ్స్ ఇండియా పురస్కారాలను మార్చి 25న ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమం హోటల్ తాజ్‌కృష్ణాలో జరుగుతుంది. చివరి 2రోజులూ సందర్శకులకు... ఈ ఈవెంట్లో తొలి 2 రోజులూ వ్యాపార కార్యకలాపాల కోసం పరిమితం చేశారు. చివరి 2 రోజులూ సాధారణ ప్రజలను అనుమతిస్తారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించాలనుకునేవారు ఆన్లైన్ ద్వారా మాత్రమే టిక్కెట్స్ కొనుగోలు చేయడానికి వీలుంటుంది. (క్లిక్: ఆకాశంలో నడక.. అక్కడే టీ, కాఫీ, స్నాక్స్ ) విహంగాలు.. విశేషాలు.. ఈసారి ఎయిర్ షోలో సరికొత్త ఎయిర్ బస్ 350 సందడి చేయనుంది. సుదీర్ఘ ప్రయాణాలకు వీలుగా అందుబాటులోకి తెస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ కావడంతో గత కొంతకాలంగా ఎయిర్ బస్ 350పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అదే విధంగా బ్రెజిల్ కు చెందిన ఎంబ్రార్స్ సంస్థ నుంచి అతిపెద్ద కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇ 195–ఇ2 కూడా ప్రదర్శనలో కొలువుదీరనుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న డిమాన్స్ట్రేషన్ టూర్లో భాగంగా ఇది నగర వాసులకు పరిచయం కానుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కు చెందిన సారంగ్ టీమ్ ఆధ్వర్యంలో ఏరోబ్యాటిక్స్ షో సమర్పిస్తారు. (క్లిక్: జీహెచ్ఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంపులు ఎప్పటి నుంచి అంటే..) -
‘వింగ్స్ ఇండియా-2020’ ప్రదర్శనలో కేటీఆర్
-
బేగంపేట ఎయిర్పోర్ట్ : ఆకాశవీధిలో ఆహా!
-
ఆకాశవీధిలో ఆహా!
రాజహంస(ఎమిరేట్స్) రాజసం లేదు.. ఖతర్ మెరుపులు లేవు.. ఎతిహాడ్ హోయలు అసలే కనిపించలేదు.. ఎయిర్ ఏషియా(మలేషియా), థ్రస్ట్ ఎయిర్ క్రాఫ్ట్కో(టీఎస్సీ–003), ఇండిగో (ఏ320–నియో)ల సోయగాలు లేనే లేవు.. ఔను గతంలో సందర్శకులను మైమరిపించిన విమానాలు ఈ ఏడాది కనిపించలేదు. చిన్నా చితకా విమానాలే తప్ప చెప్పుకోదగ్గ పెద్ద విమానాలు రాకపోవడంతో సందర్శకులను ఉసూరుమన్పించింది. ఇదీ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో గురువారం ప్రారంభమైన ‘వింగ్స్ ఇండియా–2020’లోని సీన్.. అయితే ఎయిరోబాటిక్(వైమానిక విన్యాసాలు) మాత్రం సందర్శకులను కనురెప్ప వాల్చనీయలేదు. ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు కాస్తా ఊరటనిచ్చాయి. కరోనా ప్రభావం ‘వింగ్స్ ఇండియా’పై స్పష్టంగా కనిపించింది. గతంతో పోలిస్తే సందర్శకుల(బిజినెస్మెన్) సందడి తక్కువగా కనిపించింది. పట్టుమని 10 విమానాలు కూడా షోకు రాలేదు. అందులోనూ ప్రాఫిట్ హంటర్, ఎయిర్‌బస్ విమానం మినహాయిస్తే మిగతావాన్నీ బుల్లి విమానాలే. ఈ ఏడాది కొత్తగా ‘ప్రాఫిట్ హంటర్’ మాత్రమే వచ్చిచేరింది. సాక్షి, సిటీబ్యూరో/సనత్‌నగర్: ఈ షోకు ఆదివారం వరకు సమయం ఉండటంతో మరికొన్ని వచ్చి చేరే అవకాశం లేకపోలేదని నిర్వాహకులు చెబుతున్నారు. రెండేళ్లకోసారి కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) సంయుక్తంగా ‘వింగ్స్ ఇండియా’ను నిర్వహిస్తూ వస్తున్నాయి. ఈ సారి ఏవియేషన్ షో కేవలం బిజినెస్‌కే పరిమితమైంది. ఆదివారం వరకు జరిగే ఈ షోకు వివిధ విమానయాన సంస్థలతో పాటు తయారీ సంస్థలు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను మాత్రమే అనుమతిస్తున్నారు. అయితే కరోనా వైరస్ భయం కారణంగా గురువారం షోకు హాజరైన కొంతమంది సందర్శకులతో పాటు అక్కడ ఉన్న భద్రత సిబ్బంది మాస్క్‌లు ధరించి కనిపించారు. గగనంలో విన్యాసాలు.. గగనంలో గింగరాలు తిరిగే ఎయిర్‌క్రాఫ్ట్‌లు.. పొగలు చిమ్ముకుంటూ నింగిలో రకరకాల ఆకృతులను ఆవిష్కరించిన దృశ్యాలు కనువిందు చేశాయి. ఏవియేషన్ షో అంటే ముందుగా గుర్తొచ్చేది గగనంలో విన్యాసాలే. ఊపిరి బిగపట్టుకుని కళ్లార్పకుండా విన్యాసాలు వీక్షించేవారు. పొగలు కక్కుకుంటూ ఆకాశంలోకి దూసుకుపోతున్నట్లుగా అనిపించినంతలోనే.. అమాంతం కిందపడుతుందేమోనని భయంతో చూసేవారికి ముచ్చెమటలు పట్టాయి. అంతలోనే మళ్లీ వేరే డైరెక్షన్లో విమానం దూసుకుపోవడం.. దాని వ్యతిరేక దిశలో మరో విమానం దూసుకువచ్చి రెండూ క్రాష్ అయిపోయి కిందపడుతున్నాయోనని ఒళ్లంతా గగుర్పాటుకు గురిచేసే విన్యాసాలు అబ్బురపరిచాయి. సారంగ్ టీమ్ బృందం నాలుగు ‘ధ్రువ’ హెలికాప్టర్లతో, మార్క్జెఫ్రీ బృందం మూడు ఎయిర్‌క్రాఫ్ట్‌లతో వేర్వేరుగా చేసిన ఎయిరోబాటిక్స్ అలరించాయి. ప్రదర్శనకు ఉంచిన విమానాలు ఇవే.. మొత్తం తొమ్మిది విమానాలు ప్రదర్శనలో ఉంచారు. వీటిలో హోండా ఎన్271బీబీ, హెచ్ఏఎల్ ధ్రువ్ (ఏఎల్‌హెచ్) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ హెలికాప్టర్, హెచ్ఏఎల్ డీఓ–228, ప్రాఫిట్ హంటర్, ఎయిర్ ఇండియా, వీటీ–జీహెచ్ఎల్కు చెందిన జీబీఎల్ హెలికాప్టర్, వీటీ–వీబీబీ ఎయిర్‌క్రాప్ట్, డీఏ 42–వీ1 విమానం, ప్రాఫిట్ హంటర్ ఈ195–ఈ2 హెలికాప్టర్లు ప్రదర్శనలో ఉంచారు. ప్రాఫిట్ హంటర్ అదుర్స్.. వింగ్స్ ఇండియా 2020లో ప్రదర్శనకు ఉంచిన విమానాల్లో ఆకట్టుకున్నది ప్రాఫిట్ హంటర్ ఈ 195 ఈ2.. 146 మంది వరకు సీటింగ్ కెపాసిటీ గల ఈ విమానంలో ప్రయాణికుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించారు. ఇతర విమానాల్లా కాకుండా కొంచెం అప్‌గ్రేడ్ చేస్తూ ‘ద కింగ్ ఆఫ్ ద స్కై’గా పిలిచే ఈ విమానంలో ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చునేందుకు సీట్లను 29 ఇంచుల నుంచి 35 ఇంచుల వరకు ఉండేలా చూశారు. సీటులో వెనుకకు ఒరిగి పడుకున్న ఇతరులకు ఇబ్బంది లేకుండా రూపకల్పన చేశారు. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు పెట్టుకునేందుకు ప్రత్యేక ప్యాకెట్లను ఏర్పాటు చేశారు. అలాగే ఎక్కువగా శబ్దం వినబడదు. ఇంధనం కూడా మిగతా వాటికంటే కాస్తా తక్కువగానే ఖర్చవుతుంది. బ్రెజిలియన్ కంపెనీ ఎంబ్రార్ తయారుచేసిన విమానం ప్రపంచంలోనే మూడో అతి పెద్దది కావడంతో బిజినెస్ విజిటర్స్ చూసేందుకు ఆసక్తి కనబరిచారు. గంటలకు 833 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే విమానం 1,450 మీటర్ల నుంచి టేకాఫ్, 1,240 మీటర్ల నుంచి ల్యాండ్ అవుతుందని పైలట్ లూయిస్ సొగారో తెలిపారు. విమాన యాక్సెసరీస్‌కే కంపెనీల పెద్దపీట.. ఏవియేషన్ షోలో భాగంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్‌లో ఎక్కువ శాతం విమాన ఉత్పత్తుల ప్రదర్శనకు ప్రాధాన్యం ఇచ్చేలా పలు సంస్థలు పోటీపడ్డాయి. ముఖ్యంగా ఇంజిన్ ఉత్పత్తుల నుంచి ప్రయాణికులు దిగేందుకు ఉపయోగించే మూవింగ్ స్టెప్స్ వెహికల్ వరకు అన్ని రకాల ఉత్పత్తుల తయారీ సంస్థలు ప్రచారానికి పెద్దపీటనే వేశాయి. విమానాల తయారీ, యంత్ర పరికరాలు, విమానయాన రంగంలో సేవలందించే కంపెనీలు తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించాయి. అలాగే ప్రముఖ హెలికాప్టర్ తయారీ సంస్థలు స్సైస్ జెట్, స్పైస్ ఎక్స్‌ప్రెస్, ఎయిర్‌బస్ హెలికాప్టర్స్‌తో పాటు స్పేర్‌పార్ట్స్‌ను ఎగ్జిబిషన్లో ఉంచారు. ప్రముఖ ఇంజిన్ తయారీ సంస్థలు సీఎఫ్ఎం, యూటీసీ, జీఈ ఏవీయేషన్, రోల్స్ రాయ్సే, ప్రట్ అండ్ వైట్నీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. అలాగే జెట్ ఎయిర్వేస్, కార్పొరేట్స్ జెట్స్ వంటి స్టాళ్ల ద్వారా విమానాలు, హెలికాప్టర్ మోడళ్లపై ప్రచారం కల్పిస్తున్నారు. వీటితో పాటు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఏరోస్పేస్ సైట్స్ ఇన్ తెలంగాణ, సీఎస్ఐఆర్ నేషనల్ ఏరో స్పేస్ లేబరేటరీస్, గుజరాత్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కంపెనీ, టర్బో ఎయిర్‌బస్ హెలికాప్టర్ వంటి సంస్థలు స్టాల్స్‌ను ఏర్పాటుచేసి తమ సేవలను వివరించాయి. మురిపిస్తోన్న బుల్లి విమాన నమూనాలు.. బుల్లి విమాన నమూనాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. ఎగ్జిబిషన్లో వివిధ స్టాల్స్‌లో ఈ విమాన నమూనాల ప్రదర్శనతో పాటు అమ్మకానికి ఉంచారు. వివిధ పరిమాణాల్లో చూడముచ్చటగా వీటిని తీర్చిదిద్దారు. ఏ–380 ఎయిర్‌బస్ విమాన నమూనా రూ.4,040కు విక్రయిస్తున్నారు. అలాగే బోయింగ్ విమానం రూ.23,955, ఎక్స్‌ప్రెస్ విమానం రూ.3 వేలకు లభ్యమవుతున్నాయి. మరోవైపు ఆయా విమాన, హెలికాప్టర్ కంపెనీలకు చెందిన ఎయిర్ హోస్టెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎగ్జిబిషన్లో కొలువుదీరిన విమాన నమూనాలతో పాటు సందర్శకులతో ఫొటోలకు ఫోజులివ్వడం కనిపించింది. విమాన పైలెట్లను అప్రమత్తం చేస్తుంది విమానాశ్రయాల్లో సురక్షితంగా ల్యాండ్ అవడం, టేక్ ఆఫ్ సేవల కోసం ఏవియేషన్ వెదర్ మానిటర్ సిస్టమ్ పనిచేస్తోంది. పొగమంచు బాగా కురిసిన సమయంలో, వర్షం బాగా కురిసిన సమయంలో విమాన సేవలు కొనసాగించాలా, వద్దా అన్న దానిపై అక్కడి వాతావరణాన్ని బాగా అధ్యయనం చేసి ఏటీసీకి చేరవేస్తోంది. మనమిచ్చే సమాచారాన్ని ఆయా విమాన పైలెట్లకు పంపించి అప్రమత్తం చేస్తారు. అలాగే మైన్లను గుర్తించేందుకు మాగ్నెటోను కూడా ఈ ఏడాది మరింత అప్డేట్ చేశాం. ఐదు కిలోమీటర్ల కమ్యూనికేషన్ రేంజ్లో ఇది పనిచేసేలా అభివృద్ధి చేశాం. – కులకర్ణి, సీఎస్ఐఆర్ ప్రతినిధి విమానరంగంలో మహిళలకు బాసట ఇండియన్ ఉమెన్ పైలెట్స్ అసోసియేషన్(ఐడబ్ల్యూపీఏ)లో 300 మంది వరకు సభ్యులుగా ఉన్నారు. విమాన రంగంలోకి వివిధ హోదాల్లో అడుగిడే మహిళా ఉద్యోగులకు మెళకువలు నేర్పుతున్నాం. ఈ రంగంలో వచ్చే ఆధునిక సమాచారం, అభివృద్ధిని కూడా విశదీకరిస్తాం. అలాగే పాఠశాలు, కాలేజీల్లో విమానరంగంపై అవగాహన కలిగిస్తాం. అలాగే ఉపకార వేతనాలు అందిస్తున్నాం. ఇలా ముఖ్యంగా మహిళలు ఈ రంగంలోకి వచ్చేలా ప్రోత్సాహం అందిస్తున్నాం.– డింపుల్ వాలీ, ఐబ్ల్యూపీఏ కమిటీ మెంబర్ -
వింగ్స్ ఇండియా -2020