బేగంపేట ఎయిర్‌పోర్టులో జరుగుతున్న వింగ్స్ ఆఫ్ ఇండియా 2022 ఏవియేషన్ షో రెండో రోజు సందండిగా సాగింది. ఏవియేషన్ సెక్టార్‌కి చెందిన కీలక కాన్ఫరెన్సులు రెండో రోజు జోరుగా కొనసాగాయి. మరోవైపు ఏవియేషన్ షో చూసేందుకు బిజినెస్ విజిటర్లు భారీగానే వచ్చారు. హెలికాప్టర్లు, హిందూస్తాన్ విమానాలు మొదలు ఎయిర్‌బస్ వరకు అనేక విహాంగాలను ఈ షోలో ప్రదర్శించారు. హర్యాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తిరుపతి ఎంపీ గురుమూర్తి తదితరులు ఈ షోకు హాజరయ్యారు.
గ్లోబల్ ఏవియేషన్ సమ్మిట్‌లో భాగంగా రెండో రోజు ఫ్యూచర్ ఆఫ్ ట్రావెల్, ఎయిర్‌పోర్ట్ పర్‌స్పెక్టివ్, ఎయిరో మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ ఎంఆర్‌వో, ఇండో యూఎస్ రౌండ్ టేబుల్ తదితర అంశాలపై విస్త్రృత చర్చలు జరిగాయి. వింగ్స్ ఆఫ్ ఇండియా చివరి రెండు రోజులు సాధారణ సందర్శనకు అనుమతి ఇస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ షోకు రావాలనుకునే వారు వింగ్స్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్, బుక్ మై షో ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలు, సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక ఎయిర్‌షో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment