రాష్ట్రపతికి ఘనస్వాగతం | Pranab mukherjee receives warm welcome | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతికి ఘనస్వాగతం

Published Tue, Nov 5 2013 2:00 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

Pranab mukherjee receives warm welcome

సాక్షి, హైదరాబాద్: రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సోమవారం రాత్రి బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. రాత్రి 7.45కు ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి  రాజనర్సింహ, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, స్పీకర్ మనోహర్, కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పనబాక లక్ష్మి, బలరాం నాయక్, మంత్రులు బొత్స సత్యనారాయణ, గీతారెడ్డి, జానారెడ్డి, శ్రీధర్‌బాబు, సునీతా లక్ష్మారెడ్డి, డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య, రాంరెడ్డి వెంకటరెడ్డి, సి.రామచంద్రయ్య, పితాని సత్యనారాయణ, దానం నాగేందర్, సుదర్శన్‌రెడ్డి, మండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, మేయర్ మాజిద్ హుసేన్, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు, ఎంపీలు పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, వివేక్, మధు యాష్కి, అంజన్‌కుమార్ యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, డీజీపీ ప్రసాదరావు తదితరులు విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు.

పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కూడా హాజరయ్యారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న సెటిలర్స్‌కు సంబంధించిన అంశాలను రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రత్యేకంగా పరిశీలించాలంటూ తెలంగాణ సెటిలర్స్ ఫోరం కన్వీనర్ కాట్రగడ్డ ప్రసూన ఆయనకు వినతిపత్రం సమర్పించారు. ఇటీవలి తుపాను, వర్షాలను జాతీయ విపత్తుగా పరిగణించి సాయం అందేలా చొరవ తీసుకోవాలంటూ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కూడా వినతిపత్రం సమర్పించారు. నాదెండ్ల భాస్కర్‌రావు తనకు సీటు ఎక్కడని  ప్రోటోకాల్ సిబ్బందిని అడగ్గా, సీనియర్ ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి తన పక్కనున్న సీట్లో కూర్చోవాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement