Andhra Pradesh Reorganisation Bill
-
కదం తొక్కిన నిరుద్యోగులు
సాక్షి, డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ) : పంచాయతీ సెక్రటరీ పోస్టుల కోసం విడుదల చేసిన జీవో 39 రద్దు చేయాలని, గ్రూపు – 2 ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా గ్రూపు – 1తో కలిపి డిస్క్రిప్టు విధానంలో పరీక్ష నిర్వహించేందుకు విడుదల చేసిన జీవో 622, 623ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ నిరుద్యోగులు మంగళవారం విశాఖ నగర రోడ్లపై కదం తొక్కారు. పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... సీఎం డౌన్ డౌనంటూ నినదించారు. వందలాది మంది నిరుద్యోగులు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్‌కుమార్ డాబాగార్డెన్స్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో రాష్ట్ర విభజన జరిగన తర్వాత విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాల విభజన కూడా జరిగిందన్నారు. ఖాళీలున్న ఉద్యోగాల సర్వేకు కమల్‌నాథన్ కమిటీని నియమించారన్నారు. ఆ కమిటీ చేసిన సర్వేలో రాష్ట్రంలో సుమారు 1,42,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సూచించారని చెప్పారు. కానీ ప్రభుత్వం మాత్రం 20వేలు ఖాళీలే ఉన్నాయని ప్రకటించి 2016 – 17 ఏడాదిలో 4వేల పోస్టులకు మాత్రమే ప్రకటన జారీ చేసిందని, అన్ని శాఖలు కలుపుకుని ఇప్పటికి 10వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. 42 నోటిఫికేషన్లతో ఇయర్ క్యాలెండర్‌ని కూడా ప్రకటించి ఇప్పటికి ఒక్క నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదని మండిపడ్డారు. కాంట్రాక్టు పద్ధతితో ఉద్యోగ భద్రతకు ప్రమాదం పంచాయతీ కార్యదర్శులుగా ఏడాది కాలపరిమితితో కాంట్రాక్టు పద్ధతిలో 1511మందిని నియమించడానికి జీవో 39ని ప్రభుత్వం జారీ చేసిందని, ఈ కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు నెలకు రూ.15వేలు చెల్లిస్తారని ప్రకటించారని పేర్కొన్నారు. అసలు ఈ ఉద్యోగాలకు కాంట్రాక్టు విధానాన్ని ఎందుకు ఎంచుకుంటున్నారో తెలపాలని డిమాండ్ చేశారు. దీనివల్ల ఉద్యోగ భద్రత కొరవడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శుల పోస్టులను ప్రభుత్వ ఉద్యోగాలుగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ శాఖ మంత్రిగా లోకేష్‌ను నియమించిన తర్వాతే జీవో 39 విడుదల చేశారని గుర్తు చేశారు. అలాగే గ్రూప్ – 2 ఎగ్జిక్యూటీవ్ ఉద్యోగాల భర్తీని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా గ్రూపు – 1తో కలిపి డిస్క్రిప్టు విధానంగా పరీక్షను నిర్వహిస్తామని జీవో 622, 623 విడుదల చేసిందన్నారు. ఇప్పటి వరకు అబ్జెక్ట్ విధానాన్ని అనుసరిస్తూ పరీక్షకు సిద్ధమవుతుంటే కొత్తగా డిస్క్రిప్టుగా పెడతామని ప్రభుత్వం ప్రకటించడం దారుణమన్నారు. జీవో 39, జీవో 622, 623 వల్ల లాభం కంటే యువతకు జరిగే నష్టమే ఎక్కువని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే ఈ జీవోలన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గ్రూప్–1 సిలబస్‌ను మార్చి సివిల్ సర్వీస్ సిలబస్ పెడతానన్న ప్రభుత్వ నిర్ణయం మార్చుకోవాలని, తెలంగాణ తరహాలో వయోపరిమితి 44 ఏళ్లకు పెంచాలని, కానిస్టేబుల్ ఉద్యోగ వయో పరిమితి రెండేళ్లు పెంచాలని, తెలంగాణ రిజర్వేషన్లతో సమానంగా ఏపీలో కూడా నాన్‌లోకల్ రిజర్వేషన్ చేయాలని, వీఆర్వో, వీఆర్ఏ పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థి/నిరుద్యోగ లోకం ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తుందని హెచ్చరించారు. నిరసనకు సెంచూరియన్ విశ్వ విద్యాలయం వీసీ ఆచార్య జీఎస్ఎన్ రాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, డీవైఎఫ్ఐ, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం, ఉత్తరాం«ధ్ర విద్యార్థి సేన సంఘీభావం తెలిపారు. నిరసన కార్యక్రమంలో విజయనగరం జిల్లా జేఏసీ కో ఆర్డినేటర్, రాష్ట్ర కో ఆర్డినేటర్ షేక్ మహబూబ్ బాషా, విశాఖ జిల్లా కో ఆర్డినేటర్ జగన్ విద్యార్థులు పాల్గొన్నారు. -
2019లో వారికి కచ్చితంగా బుద్ధి చెబుతారు..
-
2019లో వారికి కచ్చితంగా బుద్ధి చెబుతారు..
సాక్షి, పాలకొల్లు : రాష్ట్ర విభజన, అనంతర పరిస్థితులపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘విభజన జరిగి నాలుగేళ్లు అయినా ఏపీ రాష్ట్రానికి న్యాయం దక్కలేదు. కేంద్ర, రాష్ట్ర పాలకులు ఏపీని మోసం చేశారు. ఏపీకి న్యాయంగా రావాల్సిన ప్రత్యేక హోదాను తిరస్కరించారు. రాష్ట్రానికి ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు. పాలకులు చేసిన మోసానికి 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారు.’ అని ఆయన హెచ్చరించారు. Even 4 years after bifurcation, justice still eludes AP. Those in power both at the Centre & State have cheated AP & broken their promises by denying the rightful demand of SCS. The people of AP will teach them a fitting lesson in 2019 for their betrayal. — YS Jagan Mohan Reddy (@ysjagan) 2 June 2018 -
‘అభిప్రాయం తీసుకున్న తర్వాతే విభజన నిర్ణయం’
విజయవాడ : నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్న తర్వాతే విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని మాజీ కేంద్రమంత్రి పల్లం రాజు వ్యాఖ్యానించారు. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో పల్లం రాజు విలేకరులతో మాట్లాడారు. నాలుగు సంవత్సరాల తర్వాత కూడా ప్రభుత్వ వాగ్ధానాన్ని నెరవేర్చలేకపోయారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుపై కొన్ని నెలల క్రితం నుంచే చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారని అన్నారు. కేంద్ర ఇచ్చిన నిధులు, చేసిన ఖర్చుల వివరాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని తెలిపారు. సోనియాగాంధీ, ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యేకంగా లేఖలో ఆంధ్ర్ర ప్రదేశ్‌కు కేటాయించవలసిన నిధులు, అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా కోరారని చెప్పారు. మార్చ్ 2న ఏపీలో రాస్తారోకో నిర్వహిస్తామని, అనంతరం ఢిల్లీలో మార్చి 7, 8వ తేదీల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని వెల్లడించారు. రాష్ట్రానికి న్యాయం జరిగే విధముగా ప్రభుత్వాలు కనీస ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరారు. -
15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వండి
⇒ ఎఫ్ఆర్బీఎంను 5 శాతానికి నిర్ధారించాలి ⇒ ఐదేళ్లు దాటినా రెవెన్యూ లోటే ఉంటుంది ⇒ ప్రయివేటు బిల్లులో ప్రతిపాదించిన వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను 15 ఏళ్ల పాటు ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోక్‌సభలో ప్రయివేటు బిల్లును ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని పదో భాగానికి అదనంగా పది–ఏ భాగంలో ఈ అంశాన్ని చేర్చాలని ఆయన ప్రతిపాదించారు. ఈ భాగం కింద సెక్షన్ 94ఏ, 94 బీ, 94 సీ సెక్షన్లను పొందుపర్చాలని కోరారు. రెవెన్యూ లోటు తప్పదు.. ‘14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా గల రాష్ట్రాలకు, సాధారణ రాష్ట్రాలకు ఎలాంటి వ్యత్యాసం చూపకపోయినా విత్త సామర్ధ్యాన్ని పరిగణనలోకి తీసుకుంది. ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు రాష్ట్రాలకు అమలుచేస్తోంది. ఆ రాష్ట్రాలు కాకుండా ఆంధ్రప్రదేశ్ ఒక్కటే వచ్చే ఐదేళ్ల తరువాత కూడా రెవెన్యూ లోటును ఎదుర్కొంటుందని 14వ ఆర్థిక సంఘం తెలిపింది. అందువల్ల ఇతర రాష్ట్రాలతో సమాన బలం చేకూరా లంటే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వర్తింపజేయడం తప్పనిసరి..’ అని వైవీ సుబ్బారెడ్డి బిల్లులో పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల్లో చిక్కిన అవకాశం... ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గత ఏడాది జులై వర్షాకాల సమావేశాల్లో ప్రతిపాదించిన ప్రయివేటు బిల్లును ఎట్టకేలకు బడ్జెట్ రెండో విడత సమావేశాల్లో ప్రవేశపెట్టగలిగారు. వర్షాకాల, శీతాకాల సమావేశాల్లో ప్రయివేటు మెంబరు బిజినెస్ ఎజెండాలో పలు మార్లు చోటు దక్కినా ప్రయివేటు మెంబరు బిజినెస్ రాకముందే సభ వాయిదాపడడంతో ఈ బిల్లును ప్రవేశపెట్టలేకపోయారు. ఎట్టకేలకు శుక్రవారం ఈ బిల్లును ప్రవేశపెట్టారు. లక్ష్యాలు, కారణాలు ఇవీ.. ప్రయివేటు బిల్లు లక్ష్యాలు, కారణాలు అన్న శీర్షికతో బిల్లును ఎందుకు ప్రవేశపెడుతున్నదీ వైవీ సుబ్బారెడ్డి వివరించారు. ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంపై చర్చ జరిగిన సందర్భంలో అప్పటి ప్రధాన మంత్రి రాజ్యసభలో పలు హామీలు ఇచ్చారు. ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని పేర్కొన్నారు. ప్రస్తుత పట్టణాభివృద్ధి మంత్రి ఆనాడు బిల్లు వచ్చిన సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రత్యేక హోదాను ఐదేళ్లపాటు వర్తింపజేయాలని కోరారు. అంతేకాకుండా తాము అధికారంలోకి వచ్చిన తరువాత 10 ఏళ్లపాటు వర్తింపజేస్తామని చెప్పారు. చట్టం 2014 ఫిబ్రవరిలో ఆమోదం పొందింది. ఇప్పటికీ ప్రత్యేక హోదాపై కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ప్రకారం ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఆర్థిక, మౌలిక వసతుల పరమైన వెనకబాటు తనాన్ని, ఆర్థిక లోటును పరిగణనలోకి తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మౌలిక వసతుల లేమితో ఉంది. అలాగే ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉంది. అభివృద్ధి అవసరాలను తీర్చలేని పరిస్థితి ఉంది..’ అని పేర్కొన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే.. పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని సాధించుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని ప్రయత్నాలూ చేస్తామని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన లోక్‌సభలో ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా పట్టించుకోకుండా ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తోందని విమర్శించారు. హోదా సాధన కోసం చేస్తున్న ఉద్యమంలో భాగంగా ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టినట్టు ఆయన తెలిపారు. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెంచుతున్నట్టు చెప్పారు. హోదా సాధనకు ప్రైవేటు మెంబర్ బిల్లుపై చర్చ సందర్భంగా అన్ని పార్టీల మద్దతు కూడగడతామని ఆయన పేర్కొన్నారు. ఆయా సెక్షన్లలో పొందుపరచాలని వైవీ సూచించిన అంశాలు ఇవీ... సెక్షన్ 94 ఏ: ఏ ఇతర చట్టంతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్‌కు 15 ఏళ్ల పాటు ప్రత్యే క కేటగిరీ హోదా వర్తిస్తుంది. ఒకవేళ అవసర మైన పక్షంలో పదిహేనేళ్ల తరువాత కూడా కేంద్ర ప్రభుత్వం పొడిగించేందుకు తగిన ఉత్తర్వుల ద్వారా చర్యలు తీసుకుంటుంది. సెక్షన్ 94 బీ: ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్ కింద సాధారణ కేంద్ర సాయం, అదనపు కేంద్ర సాయం, ప్రత్యేక కేంద్ర సాయం అందించాలి. గాడ్జిల్ ముఖర్జీ ఫార్ములా ప్రకారం ఈ సాయం ఉండాలి. స్పెషల్ స్టేటస్ ద్వారా పన్ను ఆదాయం, ఇతర నిధుల పంపిణీ ఇలా ఉండాలి. 1) ఆంధ్రప్రదేశ్‌లో పెట్టే పరిశ్రమలకు ఆర్థిక శాఖ ఎక్సైజ్, కస్టమ్స్ డ్యూటీలో రాయితీ ఇవ్వాలి. 2) ఇన్కమ్ టాక్స్, కార్పొరేట్ టాక్స్ రేట్లలో రాయితీలు ఇవ్వాలి. 3) పరిశ్రమలు తమ కార్యకలాపాలను, యూనిట్లను విస్తరించాలనుకుంటే వర్కింగ్ క్యాపిటల్‌లో 40 శాతం సబ్సిడీ ఇవ్వాలి. సెక్షన్ 94 సీ: ఏ ఇతర చట్టంతో సంబంధం లేకుండా విత్త బాధ్యత, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) పరిమితిని జీడీపీలో 5 శాతంగా నిర్ధారించాలి. -
రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చింది చంద్రబాబే: జీవన్‌రెడ్డి
హైదరాబాద్‌సిటీ: "రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదని చంద్రబాబే చెప్పారు..అనుకూలంగా లేఖ కూడా ఇచ్చారు.ఇప్పుడెందుకు మళ్లీ నాటకాలు" అని కాంగ్రెస్ ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రశ్నించారు. విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్ర విభజన విషయంపై ప్రజల మనోభావాలు రెచ్చగొట్టేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బిల్లులు ఆమోదం పొందే సమయంలో తలుపులు మూయడం పార్లమెంట్ ఆనవాయితీ అని పేర్కొన్నారు. దేవాదాయ చట్టానికి భిన్నంగా కేసీఆర్ మొక్కులు చెల్లించారని విమర్శించారు. ఏపీ స్పెషల్ స్టేటస్ కు టీఆర్ఎస్ మద్ధతు తెలపడం వారి ద్వంద్వనీతికి నిదర్శనమన్నారు. టీడీపీ, టీఆర్ఎస్ లు కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌ను ఉరితీయాలా? అని ప్రశ్నించారు. "టీఆర్ఎస్ ప్రాజెక్టులు కట్టిందెక్కడ...కాంగ్రెస్ అడ్డుకున్నదెక్కడ?" అని ప్రశ్నించారు. ఉరితీయాల్సి వస్తే అది టీఆర్ఎస్నే తీయాల్సి ఉంటుందన్నారు. నిర్వాసితులకు అండగా నిలవడం ప్రాజెక్టులను అడ్డుకోవడమా? అదే నిజమైతే మిడ్ మానేరు నిర్వాసితులకు గతంలో కేసీఆర్ ఎలా అండగా నిలబడ్డారు? అని నిలదీశారు. -
‘విభజన చట్టం’పై విచారణకు సుప్రీం ఓకే
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకణ చట్టంపై పూర్తిస్థాయి విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రఘురామరాజు సహా 24 మంది వేసిన పిటిషన్లను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అన్ని పిటిషన్లపై ఒకేసారి వాదనలు వింటామని ప్రధాన న్యాయమూర్తితో కూడిన బెంచ్ పేర్కొంది. రాష్ట్ర విభజన హేతుబద్దంగా జరగలేదని పేర్కొంటూ పిటిషనర్లు... పునర్ వ్యవస్థీకణ చట్టంలోని పలు విధానపరమైన అంశాలను లేవనెత్తారు. విభజన చట్టం ఆమోదం పొందిన తర్వాత కూడా తెలంగాణ నుంచి కొన్ని మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపారని తెలిపారు. సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా విభజన జరగలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఈ దశలో తామేం చేస్తామని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. -
కాకినాడలో ఏపీ...బంద్ సంపూర్ణం
-
బంద్ విఫలానికి విషయత్నం
హైదరాబాద్: ఏపీలో గతంలో జరిగిన అనేక బంద్‌లు.. ఆందోళనలు.. పతాక స్థాయికి చేరితే తప్ప పట్టించుకోని పోలీసులు 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష ప్రత్యేక హోదా బంద్‌పై మాత్రం ఎన్నడూ లేని విధంగా ఉక్కుపాదం మోపారు. ఆందోళనకారులపై ఖాకీ క్రౌర్యం చూపించారు. ఇంట్లోంచి బయటకు కదిలితే కేసులు పెడతామని రౌడీలు, గుండాల్లా బెదిరింపులకు దిగారు. ప్రత్యేక హోదా బంద్ విజయవంతం కాకూడదని, బంద్ విఫలం చేసేందుకు నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించాలని శుక్రవారమే డీజీపీ సాంబశివరావు నుంచి ఆయా జిల్లాల ఎస్పీలు, ఐజీలకు ఆదేశాలందాయి. సీఎం చంద్రబాబు సూచనల మేరకు పోలీస్‌బాస్ ప్రత్యేక హోదా బంద్‌ను తీవ్రంగా పరిగణించాలని ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. డీజీపీ ఆదేశాలు అందుకున్న ఐజీలు, ఎస్పీలు కలిసి మీడియా సమావేశాలు నిర్వహించి మరీ బంద్‌లో పాల్గొనవద్దని, బంద్‌లో పాల్గొంటే షీట్లు తెరుస్తామని మరీ హెచ్చరికలు చేశారు. బంద్‌కు సన్నాహాలు చేస్తున్న వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, వామపక్షాల నేతల్ని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లారు. బంద్ విజయవంతమైతే వైఎస్సార్ సీపీకి ఎక్కడ క్రెడిట్ వస్తుందోనని, ప్రత్యేక హోదా ఆకాంక్ష ఎంత బలీయంగా ఉందో కేంద్రానికి అర్ధం అవుతుందని ఉద్దేశ పూర్వకంగా సర్కారు సూచనల మేరకు బంద్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులు ఎవరైనా బయటకు వస్తే కేసులు నమోదు చేస్తామని చెప్పి తెల్లవారుజామున ఇళ్ల వద్దనే అరెస్ట్ చేశారు. వైఎస్సార్ సీపీ నేతల్ని గృహ నిర్బంధం చేశారు. ఎన్ని ఆంక్షలు విధించినా అరెస్ట్‌లకు భయపడకుండా వైఎస్సార్ సీపీ, వామపక్ష పార్టీల నేతలు కదం తొక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 20 వేల మంది ఆందోళనకారుల్ని అరెస్ట్‌లు, గృహ నిర్బంధాలు చేశారు. నెల్లూరు జిల్లాలో 1,500 మందిని అరెస్ట్ చేశారంటే బంద్ విఫలయత్నానికి ఖాకీలు ఎంతగా దృష్టి సారించారో అవగతమవుతుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విద్యాసంస్థలు, వాణిజ్య, వ్యాపార సంస్థలు, అసోసియేషన్ల నేతలు మాత్రం బంద్‌కు స్వచ్ఛందంగా మద్దతు పలికారు. విద్యా సంస్థలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. ప్రత్యేక హోదా కోరుతూ విపక్షాలు నిర్వహించిన బంద్‌ను విఫలం చేసేందుకు సర్కారు ఎన్ని కుయుక్తులు పన్నినా చివరకు విజయవంతమైంది. ప్రత్యేక హోదా ఆవశ్యకతను గుర్తెరిగిన ప్రజలు స్వచ్చందంగా బంద్‌లో పాల్గొన్నారు. అయితే పోలీసులు 144 సెక్షన్, పోలీస్ యాక్టు 30 పేరిట నిషేధాజ్ఞలు విధించి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనేందుకు చేసిన ప్రయత్నాలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసి మరీ పోలీసుల సాయంతో బస్సుల్ని తిప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పోలీసులు ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా బంద్ ప్రశాంతంగా జరిగింది. -
ఏపీ బంద్ సంపూర్ణం
-
నందిగామలో ఉద్రిక్తం
నందిగామ: ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో శనివారం తలపెట్టిన ఏపీ బంద్ కృష్ణాజిల్లాలో సంపూర్ణంగా జరుగుతోంది. వైసీపీ కార్యకర్తలు, నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పేరుతో ఉన్న ఫ్లెక్సీలను దున్నపోతులకు కట్టి పట్టణంలో ర్యాలీ చేపట్టారు. ర్యాలీని పోలీసులు అడ్డుకుని నేతలను అరెస్టు చేశారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి అరుణ్‌కుమార్‌ను గృహ నిర్బంధంలో ఉంచారు. పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు అరుణ్‌కుమార్‌ను తరలించేందుకు యత్నించారు. కార్యకర్తలు వాహనాన్ని అడ్డుకోవటంతోపాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో అక్కడ యుద్ధ వాతావరణం ఏర్పడింది. -
హోదాపై భగ్గుమన్న ఏపీ...బంద్ సంపూర్ణం
-
హోదాపై భగ్గుమన్న ఏపీ...బంద్ సంపూర్ణం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఐదున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష, ఆశయం ప్రత్యేక హోదానేనని వైఎస్సార్సీపీ నేతలు గళమెత్తారు. రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లు, ప్రధాన కూడళ్ల వద్ద నాయకులు బైఠాయించి హోదాపై నినాదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేసి తమ నిరసనను తెలియజేశారు. బంద్‌ను అడ్డుకునేందుకు చంద్రబాబు సర్కారు ఎక్కడికక్కడే నేతలను నిర్బంధిస్తోంది. ఈ బంద్‌కు కాంగ్రెస్, వామపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు సంపూర్ణ మద్దతు తెలపడంతో పాటు బంద్‌లో పాల్గొన్నాయి. వైఎస్సార్ జిల్లా: ఏపీకి ప్రత్యేక హోదా కోసం శనివారం బంద్ కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు పోరుబాటపట్టారు. పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. జమ్మలమడుగులో డా.సుధీర్ రెడ్డి, కడపలో మేయర్ సురేష్ బాబు, రాజంపేటలో పార్టీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి నేతృత్వంలో పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు బంద్‌లో పాల్గొన్నారు. ఉదయాన్నే రోడ్డెక్కి ఆందోళనలకు దిగారు. బాబు స్వార్థ ప్రయోజనాల వల్లే ఏపీకి ప్రత్యేక హోదా రావడం లేదని నేతలు మండిపడ్డారు. బంద్‌కు జర్నలిస్టు సంఘాలు మద్దతు తెలపడంతో పాటు బంద్‌లో పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. శ్రీకాకుళం: జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్మాన ప్రసాద రావు, తమ్మినేని సీతారాం, శాంతి రెడ్డి లను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని పోరాడుతున్న వారిని హౌస్ అరెస్ట్ చేసి ఉద్యమాన్ని అణిచివేయలేరని రెడ్డిశాంతి స్పష్టం చేశారు. సొంత ప్రయోజనాల కోసం ఆంధ్రుల హక్కును చంద్రబాబు తాకట్టు పెట్టాడని వైఎస్సార్ సీపీ నేత ధర్మాన దుయ్యబట్టారు. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. స్కూళ్లు, కాలేజీలు సెలవు ప్రకటించాయి. విజయనగరం: ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ ఇచ్చిన బంద్ పిలుపుతో జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆందోళన నిర్వహిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉదయాన్నే నేతలు రోడ్డెక్కి ఆందోళనలు నిర్వహించారు. విజయనగరంలోని బస్ డిపోల ముందు ఆందోళన నిర్వహించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. జిల్లాలో అర్థరాత్రి నుంచే అరెస్టుల పర్వం కొనసాగుతోంది. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలతో పాటు వామపక్షాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్టణం: జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్ డిపోల వద్ద నేతలు తెల్లవారుజాము నుంచే బైఠాయించడంతో బస్సులు బయటకు రాలేదు. వైఎస్సార్సీపీ నేత గొల్ల బాబురావు ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. వైఎస్సార్ సీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని పోరాడుతున్న వారిని హౌస్ అరెస్ట్‌లు చేసి ఉద్యమాన్ని అణిచివేయలేరన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నేతలు నినాదాలు చేశారు. తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కోరుకుండలో జక్కంపూడి విజయలక్ష్మీ ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. కాంగ్రెస్, వామపక్ష పార్టీల నేతలతో పాటు ప్రజా సంఘాలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో బంద్‌లో పాల్గొని హోదాపై గళమెత్తారు. పశ్చిమగోదావరి: ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా బంద్ కొనసాగుతోంది. బస్ డిపోల ముందు ఆందోళన నిర్వహించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఏలూరులో పార్టీ జిల్లా అధ్యకుడు ఆళ్ల నాని, తణకులో కారుమూరి నాగేశ్వరరావు, నర్సాపురంలో ముదునూరు ప్రసాదరాజు, కొవ్వూరులో తానేటి వనిత, జీలుగుమిల్లిలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నేతృత్వంలో బంద్ నిర్వహిస్తున్నారు. జిల్లాలో అర్థరాత్రి నుంచే అరెస్టుల పర్వం కొనసాగుతోంది. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణాజిల్లా: ప్రత్యేకహోదా కోసం తలపెట్టిన బంద్ కృష్ణా జిల్లాలో సంపూర్ణంగా జరుగుతోంది. వర్తక, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. పాఠశాలలకు ముందస్తుగా సెలవు ప్రకటించాయి. హోదా కోసం బైక్ ర్యాలీ చేస్తున్న వైస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాను పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడలో రాస్తారోకో నిర్వహిస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా విజయవాడ బస్టాండ్ ఎదుట ఆందోళన చేస్తున్న వైఎస్ఆర్సీపీ, వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు: జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా ర్యాలీలు, నిరసనలు చేపట్టారు. గుంటూరులో పార్టీ నేతలు మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మంగళగిరిలో జోరువానలోనూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నినాదించారు. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడిక్కడే అరెస్ట్‌లు చేశారు. ప్రకాశం: ప్రకాశం జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఒంగోలు ఎంపీ వై.వి సుబ్బారెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడంతో.. కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ఇంటి వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హోదా కోసం ధర్నా చేస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని సంతమాగులూరులో పోలీసులు అరెస్ట్ చేసి కురిచేడుకు స్టేషన్ కు తరలించారు. జిల్లాలోని అన్ని బస్ డిపోల ముందు నేతలు ఆందోళనకు దిగారు. చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం ఏపీకి తాకట్టు పెట్టారని నేతలు దుయ్యబెట్టారు . నెల్లూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా వైఎస్ జగన్ ఇచ్చిన బంద్ పిలుపుతో జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆందోళన నిర్వహిస్తున్నాయి. వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీ నేతలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు. చంద్రబాబు తీరు వల్లే ప్రత్యేక హోదా రావడం లేదని నేతలు నినాదించారు. చిత్తూరు: చిత్తూరుజిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డితో పాటు ఇతర పార్టీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. భూమన అరెస్ట్‌కు నిరసనగా కార్యకర్తలు నిరసనగా దిగారు. జిల్లాలో 144 సెక్షన్‌తో పాటు సెక్షన్ 30 అమలు చేస్తున్నారు. హైవేను దిగ్భంధించిన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలమనేరు, జంగాలపల్లిలో బంద్ నిర్వహిస్తున్న నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంద్‌ను అడ్డుకునేందుకు, అరెస్టులను పర్యవేక్షించడానికి డీఎస్పీ స్థాయి అధికారిని నియమించడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం : ప్రత్యేక హోదా కోసం వైస్ జగన్ పిలుపు మేరకు శనివారం బంద్ కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ శ్రేణులు బంద్‌లో పాల్గొన్నారు. అనంతపురంలో గుర్నాథ్ నేతృత్వంలో, గుంతకల్లులో మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నేతలు బంద్‌ను నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తెల్లవారు జాము నుంచే నేతలు రోడ్డెక్కి ఆందోళనలకు దిగారు. బాబు తీరుపై నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కర్నూలు: జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. వైఎస్సార్ సీపీ ఎంపీ బుట్టా రేణుక నేతృత్వంలో బంద్ చేపట్టారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నేతలు నినాదించారు. హోదా సాధించేవరకు వైఎస్సార్ సీపీ పోరాటం కొనసాగిస్తోందని తెలిపారు. అర్థరాత్రి నుంచే బస్ డిపోల ముందు ఆందోళన నిర్వహించి బస్సులు బయటకు రాకుండా నేతలు అడ్డుకున్నారు. కాంగ్రెస్, వామపక్ష పార్టీల నేతలతో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని హోదాపై నినాదించారు. -
హోదా పోరును ఉధృతం చేయాలి
-
రేపు రాష్ట్ర బంద్
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు * అరుణ్ జైట్లీ, చంద్రబాబు వైఖరికి నిరసనగానే... * జైట్లీ ప్రకటనను ఆహ్వానించడానికి చంద్రబాబు ఎవరు? * ఆయన రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి * బాబు సీఎంగా ఉండడానికి వీల్లేదు, వెంటనే రాజీనామా చేయాల్సిందే సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అయిన ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టంగా తేల్చి చెప్పినందుకు, ఆయన ప్రకటనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించినందుకు నిరసనగా ఈ నెల 10వ తేదీన రాష్ట్ర బంద్ పాటించాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమంటూ అరుణ్ జైట్లీ ప్రకటనను ఆహ్వానించడానికి చంద్రబాబు ఎవరని నిలదీశారు. ప్రత్యేక హోదా అనే ది చంద్రబాబు ఒక్కరి భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాదని, 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల భవిష్యత్తు హోదాతో ముడిపడి ఉందని స్పష్టం చేశారు. జైట్లీ ప్రకటనను ఆహ్వానించిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడానికి వీల్లేదని, ఆయన రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి, వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే చరిత్రహీనుడుగా మిగిలిపోతారని హెచ్చరించారు. హోదా పోరును ఉధృతం చేయాలి ప్రజలంతా కలిసికట్టుగా బంద్‌ను విజయవంతం చేసి, మన అసంతృప్తిని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని, చంద్రబాబుపై మరింత ఒత్తిడి పెంచాలని వైఎస్ జగన్ కోరారు. గురువారం అసెంబ్లీకి రావడానికి ముందు తాను కమ్యూనిస్టు పార్టీల నేతలతో మాట్లాడానని, హోదా పోరాటంలో వారి సహకారం కోరానని చెప్పారు. ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ప్రత్యేక హోదా పోరును ఉధృతం చేయాలని అన్నారు. అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి బంద్‌లో పాల్గొనాలని పేర్కొన్నారు. ప్రత్యేక హోదాకు మించిన ప్యాకేజీ ఇస్తామని చెప్పి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ వర్షాకాల సమావేశాల తొలిరోజు గురువారం వైఎస్ జగన్‌తో సహా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల చొక్కాలు ధరించి, ప్లకార్డులు చేతబూని అసెంబ్లీ ప్రాంగణంలోకి పాదయాత్రగా వెళ్లారు. పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి కూడా పాదయాత్రకు సంఘీభావంగా వెంట నడిచారు. అంతకుముందు అసెంబ్లీ సమీపంలోని ప్రకాశం పంతులు విగ్రహం వద్ద వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. జైట్లీ, బాబు కలిసి రాష్ట్ర ప్రజల చెవుల్లో క్యాబేజీలు పెట్టారని ధ్వజమెత్తారు. ఏపీకి సంబంధించి రాత్రిపూట అరుణ్ జైట్లీ ప్రకటన చేయడం, చంద్రబాబు అర్ధరా త్రి తరువాత మాట్లాడటాన్ని ఆయన తప్పు పట్టారు. ఈ సందర్భంగా జగన్ ఇంకా ఏం చెప్పారంటే... యువత ఆశలను ఖూనీ చేశారు ‘‘అర్ధరాత్రి దాటిన తరువాత ప్రకటనలు చేసే పరిస్థితి చూస్తుంటే ఈ రాజకీయ నాయకుల్లో నిజాయితీ లేదనే విషయం స్పష్టమవుతోంది. నిజాయితీ ఉంటే, తాము తప్పు చేయడం లేదని భావిస్తే పట్టపగలే ప్రకటనలు చేసే వాళ్లు కానీ ఇలా అర్ధరాత్రి పూట చేయరు. వాస్తవానికి ప్రత్యేక హోదా అనేది ఏపీ హక్కు. విభజన వల్ల నష్టపోతున్న రాష్ట్రానికి ప్రత్యేక హోదాను పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. బుధవారం అర్ధరాత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనను పరిశీలిస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమని మరింత సుస్పష్టంగా చెప్పినట్లు అర్థమవుతుంది. ప్రత్యేక హోదాకు మించిన ప్యాకేజీ ప్రకటన వస్తుందని బుధవారం ఉదయం నుంచీ చంద్రబాబు మీడియాకు లీకులిస్తూ ఊదరగొట్టారు. అది చూసి ప్రత్యేక హోదాతో కూడిన ప్యాకేజీ వస్తుందని ప్రజలంతా ఆశగా ఎదురుచూశారు. చివరకు ప్రత్యేక హోదాకు మించిన ప్యాకేజీ కాదు కదా... ప్రజల చెవుల్లో క్యాబేజీలు పెడుతూ ప్రకటన చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు తన మంత్రులను జైట్లీ పక్కన కూర్చోబెట్టి ప్రజల చెవుల్లో క్యాబేజీ ఎలా పెట్టాలో చెప్పి మరీ ఆ కార్యక్రమం చేయించారు. ప్రత్యేక హోదా అంటే అదేదో డబ్బుల రూపంలో ఇచ్చి పుచ్చుకునేదన్న అభిప్రాయాన్ని చంద్రబాబు కలిగించారు. కానీ, వాస్తవానికి ప్రత్యేక హోదా అనేది డబ్బులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారం కాదు. హోదా వల్ల రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి. వేల సంఖ్యలో పరిశ్రమలు వస్తాయి. మన పిల్లలకు లక్షల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కేంద్రం చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్‌ను, ఇక్కడి యువత ఆశలను ఖూనీ చేసే విధంగా ఉంది. ప్రజల ఆశలపై నీళ్లు చల్లారు. అరుణ్ జైట్లీ, చంద్రబాబు వైఖరికి నిరసనగా ఈ నెల 10న రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తున్నాం. మనం స్పందిస్తేనే ప్రభుత్వంపై ఒత్తిడి చంద్రబాబును ప్రశ్నిస్తున్నా... అసలు జైట్లీ ప్రకటనను ఆహ్వానించడానికి ఆయనెవరు? ఇదేమైనా చంద్రబాబు ఒక్కరి భవిష్యత్తా? ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తు ప్రత్యేక హోదాతో ముడిపడి ఉంది. జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి అందరమూ ఒక్కటవుదాం. రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేద్దాం. సమయం ఎక్కువ లేదు కాబట్టి ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలి. ఇలాంటప్పుడు మనం వెంటనే స్పందిస్తేనే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. కేంద్రంలో ఉన్న టీడీపీ మంత్రులను ఉపసంహరించుకుంటున్నాను, మీకు మద్దతు కొనసాగించను అని ఏరోజైతే చంద్రబాబు చెబుతారో ఆరోజే మనకు ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు మెరుగవుతాయి. చంద్రబాబుపై ఒత్తిడి పెరగాలన్నా... ఆయన మనసు మారాలన్నా... రాష్ట్ర ప్రజలంతా కలిసి ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలి. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఒప్పుకోబోమని బంద్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలి. రాష్ట్రానికి హోదా కోసం అసెంబ్లీలో కూడా మేము గట్టిగా పట్టుపడతాం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమంటూ కేంద్రం చేసిన ప్రకటనకు నిరసనగా ఇవాళ పాదయాత్ర చేస్తున్నాం’’ అని వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. బాబు ఆమోదం తర్వాతే కేంద్రం ప్రకటన ‘‘చంద్రబాబులో నిజాయితీ, విశ్వసనీయత, విలువలు లేవు. ఆయన తన స్వార్థం కోసం ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలను నడిరోడ్డున పడేశారు. ఒక పద్ధతి ప్రకారం ప్రత్యేక హోదా అంశాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని ఒకసారి చెప్పారు. ప్రజలు తిరగబడేసరికి ప్రత్యేక హోదా జీవన్మరణ సమస్య అన్నారు. గతంలో జైట్లీ చేసిన ప్రకటనతో తన రక్తం మరిగిపోయిందని చంద్రబాబు చెప్పారు. మరి ఇప్పుడు ఆ రక్తం మురిగిపోయిందా? కుళ్లిపోయిందా? చంద్రబాబు స్వయంగా రూపొందించిన డ్రాఫ్ట్‌ను కేంద్రంలోని తన మంత్రులకు పంపించి జైట్లీ చేత చదివించారు. దాన్ని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు డ్రాఫ్టుకు ఆమోదం తెలిపిన తరువాతే కేంద్రం ప్రకటన చేసిందని నేను మీడియాలో విన్నాను. ఓటుకు కోట్లు కేసులో ఆధారాలతో సహా దొరికిపోయిన చంద్రబాబు అందులో నుంచి బయటపడేందుకే జైట్లీ ప్రకటనను ఆహ్వానించారు’’ అని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. 5 కోట్ల మందిని అమ్మేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటుకు కోట్లు కేసుతో రాజీపడి, తన స్వార్థం కోసం ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలను అమ్మేశారని వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన అనంతరం ఆయన తన చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. తొలి నుంచీ ప్రత్యేక హోదా అంశాన్ని నీరుగార్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తూనే ఉన్నారని జగన్ దుయ్యబట్టారు. నిన్న టీవీలు చూసిన వారంతా చంద్రబాబు సీఎంగా ఉండటం ఖర్మగా భావించారని చెప్పారు. విభజన చట్టంలోనే పోలవరం ప్రాజెక్టు ‘‘నిజంగా బుధవారం చంద్రబాబు డ్రామాను బాగా రక్తి కట్టించారు. ప్రత్యేక హోదాను డబ్బుతో ముడిపెట్టడం తగదు. విభజన చట్టంలోని అంశాలనే ప్యాకేజీ అంటూ కేంద్రంతో చెప్పించారు. ప్రత్యేక హోదాకు కత్తెర వేశారు. రాష్ట్రాన్ని మోసం చేసినందుకు ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలి. కేంద్రంలోని తన మంత్రులను ఉపసంహరించుకోవాలి. విభజన చట్టంలోనే పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. మిగిలిన కారిడార్లు కూడా విభజన చట్టంలోనే ఉన్నాయి. చట్టంలోని అంశాల విలువలన్నీ కలిపేసి అదే కొత్తగా ప్యాకేజీ అంటున్నారు. హక్కుగా రావాల్సిన వాటికి, ప్రత్యేక హోదాకు కేంద్రం కత్తెర వేస్తుంటే చంద్రబాబు ఆనందించడానికి ఓటుకు కోట్లు కేసే కారణం. చంద్రబాబు ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పి, ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించాలి’’ అని జగన్ డిమాండ్ చేశారు. -
ఏపీ హైవోల్టేజ్
రేపు ఏపీ బంద్‌కు ప్రతిపక్షం పిలుపు ‘ఓటుకు కోట్లు’ కేసులో రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినచంద్రబాబు రాజీనామాకు జగన్ డిమాండ్ జైట్లీ ప్రకటనను ఆహ్వానించడానికి చంద్రబాబు ఎవరు? ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలన్న ఏపీ ప్రతిపక్ష నేత బాబుపై భగ్గుమన్న ఏపీ.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు బంద్‌కు పది వామపక్షాలు, కాంగ్రెస్ సంఘీభావం వైఎస్సార్సీపీ ఆందోళనతో దద్దరిల్లిన అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ శాసన సభ నేటికి వాయిదా మండలిలో ముఖ్యమంత్రి మొక్కుబడి ప్రకటన ప్రజలకు వెన్నుపోటు, కేంద్రానికి లొంగుబాటు (సాక్షి, ప్రత్యేకప్రతినిధి) ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా లేదని కేంద్రం స్పష్టం చేయడం, ముఖ్యమంత్రి చంద్రబాబు తందానా అంటూ తాళం వేయడం చూసి రాష్ర్టం భగ్గుమన్నది. అరుణ్‌జైట్లీ అర్ధరాత్రి ప్రకటనకు ఐదుకోట్ల గుండెలు మండిపోయాయి. ఆ ప్రకటనను స్వాగతిస్తున్నానని చంద్రబాబు చేసిన వ్యాఖ్యకు ఆంధ్రప్రజల రక్తం సలసలా మరిగిపోయింది. తప్పనిసరిగా అమలు చేయాల్సిన విభజన చట్టంలోని అంశాలను కేంద్ర మంత్రి వరసపెట్టి చదువుతుంటే టీవీల ముందు ఆశగా కూర్చున్నవారి ఆగ్రహం ఆకాశాన్నంటింది. ఏడు పేజీల జైట్లీ ప్రకటనపై చంద్రబాబు ఏడు సంతకాలు చేసి పంపించారని, ఆ తర్వాతే జైట్లీ దానిని చదివారన్న సంగతి కూడా బైటపడింది. దాంతో కేంద్రం, చంద్రబాబు కలిసే తమను దారుణంగా వంచించారని రాష్ర్టప్రజలకు మరింత స్పష్టంగా అర్ధమయ్యింది. అందుకే గురువారం ఉదయం నుంచే రాష్ర్టవ్యాప్తంగా ప్రజలు తీవ్రస్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎక్కడికక్కడ ధర్నాలు, బైఠాయింపులు, ప్రదర్శనలు చేపట్టారు. వైఎస్సార్సీపీ, వామపక్షాల నాయకులు, శ్రేణులు కూడా ఈ కార్యక్రమాలలో భారీ స్థాయిలో పాల్గొన్నారు. ప్రత్యేక హోదా లేదని కేంద్రం మొండిచేయి చూపడం, దానిని స్వాగతిస్తున్నానంటూ చంద్రబాబు రాష్ర్టప్రజలకు వెన్నుపోటు పొడవడానికి నిరసనగా ఈనెల 10వ తేదీన రాష్ర్టబంద్ పాటించాలని ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయి ఐదుకోట్ల మంది ప్రజల భవితవ్యాన్ని ఫణంగా పెట్టిన చంద్రబాబు తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీతో కలసి బంద్ నిర్వహిస్తామని సీపీఎం, సీపీఐ ప్రకటించాయి. మరోవైపు గురువారం ప్రారంభమైన అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రత్యేక హోదాపై దద్దరిల్లిపోయాయి. ప్రత్యేకహోదా ఇవ్వకుండా కేంద్రం అన్యాయం చేస్తున్నా చంద్రబాబు మెతకవైఖరి అనుసరిస్తుండడంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు చేసిన ఆందోళనతో సభ స్తంభించింది. రాష్ర్టంలో ప్రజల నిరసనాగ్రహాలు, బంద్ సన్నాహాలు చూసి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మరోమారు జైట్లీ ప్రకటనలోని అంశాలను వల్లెవేశారు. బాబుతో పలుమార్లు చర్చించి ఆయన ఒప్పుకున్నాకే ఈ ప్రకటన చేశామన్నారు. కాగా శాసనమండలిలో ప్రత్యేకహోదాపై ప్రకటన చేసిన బాబు కూడా విభజన చట్టంలోని అవే విషయాలను తిప్పితిప్పి చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. లొంగుబాటెందుకు బాబూ?: విభజన చట్టంలోని అంశాలనే అమలు చేస్తామని కేంద్రం చెబుతున్నా, ప్రత్యేక హోదాకు పాతరేస్తున్నా చంద్రబాబు వినమ్రంగా తలూపడం చూసి విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తప్పని సరిగా అమలు చేయాల్సిన విభజన చట్టంలోని అంశాలను తప్ప మరో కొత్త అంశం గురించి చెప్పకపోయినా చంద్రబాబు వెన్నెముకే లేనట్లు వంగిపోయి వంతపాడడం చూసి విస్తుపోతున్నారు. సమాఖ్య వ్యవస్థలో కేంద్రంతో పోటీగా బలమైన రాష్ట్రాలు తమకు కావలసిన నిధులను, కేంద్ర సంస్థలను సాధించుకుంటు న్న తరుణంలో విభజన చట్టం ప్రకారం మనకు న్యాయంగా రావలసిన వాటి కోసం రెండున్నరేళ్లు ఆగి కేంద్రంతో ఓ ప్రకటన చేయించుకుని సంతోషించడం, స్వాగతించడం కన్నా దిగజారుడుతనం మరొకటి ఉండదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అవినీతి కుంభకోణాలు, ఓటుకు కోట్లు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోవడం వంటివి చంద్రబాబు కాళ్లూ చేతులు కట్టేశాయని, కేంద్రానికి పాదాక్రాంతం చేసేశాయని, అందుకే ఆయన ఐదు కోట్ల మంది ప్రజల భవితవ్యాన్ని తాకట్టుపెట్టి కేసుల నుంచి తనను తాను కాపాడుకుంటున్నారని విమర్శకులంటున్నారు. ఆర్థిక సంఘం అడ్డుపడగలదా? ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వలేక పోవడానికి 14వ ఆర్ధిక సంఘం సిఫారసులు అడ్డుపడడమే కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బుధవారం ప్రకటించగా కేంద్ర సమాచార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కూడా అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. అసలు ఆర్థికసంఘం పని ఏమిటి? ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలా వద్దా అని నిర్ణయించాల్సిందెవరు? కేంద్ర రాష్ట్రాల మధ్య రెవెన్యూ పంపిణీ బాధ్యతలను ఆర్ధిక సంఘం చూస్తుంది. ప్రత్యేక హోదాపై జాతీయాభివృద్ధి మండలి (ఎన్డీసీ) నిర్ణయం తీసుకుంటుంది. ఎన్డీసీ చైర్మన్ ప్రధానమంత్రే. కేబినెట్ సహా అత్యున్నత విధాన నిర్ణాయక సంస్థలన్నిటికీ ప్రధానమంత్రే చైర్మన్. అందువల్ల ప్రధానమంత్రి ఇవ్వదలుచుకుంటే అడ్డుకునేదెవరు? కానీ ఓటుకు కోట్లు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ చంద్రబాబునాయుడు ఒత్తిడి చేయకపోగా సాగిలపడడం వల్లే కేంద్రం ప్రత్యేక హోదాను నిరాకరిస్తూ రకరకాల కారణాలు చెబుతున్నదని విశ్లేషకులంటున్నారు. మరింత అవమానం... ఏపీకి ఏమేమి ఇస్తున్నామో గురువారం వెబ్సైట్లో పెడతామని జైట్లీ ప్రకటించారు. కానీ ఆర్థికశాఖ వెబ్సైట్లో లేకపోగా సమాచార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో నడిచే పీఐబీ సైట్లో జైట్లీ చెప్పిన అంశాలతో కూడిన ఓ మూడు పేజీల ప్రకటనను ఉంచారు. అందులో కూడా విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తున్నామో.. ఎలా అమలు చేస్తామో వివరించారు. అంతే తప్ప హోదాతో సమానమైన స్థాయిలో ఏపీకి ఇస్తున్న నిధుల గురించిన సమాచారమేమీ లేదు. హోదా ఇవ్వకపోగారాష్ర్టం విషయంలో ఇంత ఆషామాషీగా వ్యవహరించడం మరింత అవమానకరమని ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. మరోవైపు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నేతలు రైల్వే డీఆర్ఎం కార్యాలయాన్ని ముట్టడించారు. అట్టుడికిన అసెంబ్లీ.. అధికారపక్షం జిత్తులకు చెక్... రోమ్ తగలబడిపోతుంటే ప్రశాంతంగా ఫిడేల్ వాయించిన నీరో చక్రవర్తి మాదిరిగా.. చంద్రబాబు శాసనసభ కార్యక్రమాలను యథాలాపంగా నడిపించేయాలని చూశా రు. ఐదుకోట్ల మంది ప్రజల ఆకాంక్షను సమాధి చేసేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని, అన్ని కార్యక్రమాలను పక్కనబెట్టి ప్రత్యేక హోదాపైనే ప్రధానంగా చర్చించాలని ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ పట్టుబట్టింది. సీఎం ప్రకటన చేసిన తర్వాత చర్చిద్దామని అధికారపక్షం ప్రతిపాదించగా సభ్యులు చర్చించిన తర్వాతనే ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని ప్రతిపక్షం కోరింది. ఎందుకంటే సీఎం ప్రకటన చేసిన తర్వాత మాట్లాడడానికి ఏముంటుంది అన్నట్లుగా ప్రతిపక్ష నాయకుడికి, సభ్యులకు మాట్లాడే అవకాశమే లేకుండా చేయాలనేది అధికారపక్షం ఎత్తుగడ. పదేపదే మైక్ కట్ చేస్తూ.. మంత్రులకే అవకాశం ఇచ్చి ప్రతిపక్షంపై దాడి చేయిస్తూ పబ్బం గడుపుకోవాలనేది వారి వ్యూహం. గతంలో అనేక పర్యాయాలు ఇలాంటి చౌకబారు ఎత్తుగడలకు అధికారపక్షం దిగజారడం రాష్ర్టప్రజలంతా చూశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఒకరు పేర్కొన్నారు. అయినా సభ్యులు మాట్లాడిన తర్వాత సీఎం ప్రకటన చేయడమే సాంప్రదాయమని, అయననే ముందుగా మాట్లాడడమంటే ఆ అంశాన్ని ముగించేసినట్లవుతుందని శాసనసభ వ్యవహారాల నిపుణులంటున్నారు. అధికారపక్షం ఎత్తుగడను ప్రతిపక్షం సమర్ధంగా తిప్పికొట్టగలిగింది. స్పీకర్ పదేపదే సభను వాయిదావేస్తూ చివరకు శుక్రవారం నాటికి సభను వాయిదా వేసేసి గట్టెక్కించడంతో అధికారపక్షం ఊపిరిపీల్చుకుంది. కానీ సీఎం మాత్రం శాసనమండలిలో ప్రత్యేక హోదాపై మొక్కుబడి ప్రకటన చేసేసి చేతులు దులుపుకున్నారు. -
రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన కేసీఆర్: జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రయోజ నాలను సీఎం కేసీఆర్ మహారాష్ట్రకు తాకట్టుపెట్టారని సీఎల్పీ ఉపనాయకుడు టి.జీవన్‌రెడ్డి అన్నారు. గురువారం ఇక్కడ ఆయన మాట్లాడు తూ.. తమ్మిడిహట్టి వద్ద 152 మీట ర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మాణం చేపడితే రాష్ట్రానికి ప్రయోజనం ఉండేదన్నారు. 152 మీటర్ల ఎత్తుతో 90 రోజులపాటు 160 టీఎంసీల నీటి వినియోగానికి ప్రతిపాదన, మహారాష్ట్ర ప్రభుత్వంతో సూత్రప్రాయ ఒప్పందం కూడా జరిగిందని, ప్రతిపక్షాలను నిందించినంత మాత్రాన వాస్తవాలు మారిపోవన్నా రు. రాష్ట్ర ప్రయోజనాల కోసం 152 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మించడానికి ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసే ధైర్యం కేసీఆర్‌కు లేదన్నారు. 18 లక్షల ఎకరాలకు నీరు ఎలా ఇస్తారో, మరో 18 లక్షల ఎకరాలను ఎలా స్థిరీకరిస్తారో చెప్పాలన్నారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు కేసీఆర్ అనాలోచిత నిర్ణయమన్నారు. అధికారం శాశ్వతం కాదని, అధికారంలో ఉన్నవారు ప్రజల పక్షాన ఆలోచించి ముందుచూపుతో వ్యవహరించాలన్నారు. -
ఆస్తులు, ఉద్యోగుల పంపిణీపై ముందడుగు
- సంయుక్తంగా కమిటీ ఏర్పాటు చేసిన ఉభయ రాష్ట్రాలు - పదో షెడ్యూల్ సంస్థలపై కేంద్రం మరో కమిటీ - హోంశాఖ అదనపు కార్యదర్శి నేతృత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో తొమ్మిదో షెడ్యూల్లోని ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు, ఉద్యోగుల పంపిణీపై రెండు రాష్ట్రాలు ముందడుగు వేశాయి. ఇందులో భాగంగా తొమ్మిదో షెడ్యూల్లోని 91 ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు, ఉద్యోగుల పంపిణీకి ఉభయ రాష్ట్రాలు సంయుక్తంగా కమిటీని ఏర్పాటు చేశాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునర్విభజన విభాగం ముఖ్యకార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి, పరిశ్రమల శాఖ సంయుక్త డెరైక్టర్ సాధు సుందర్, తెలంగాణ ప్రభుత్వం పునర్విభజన విభాగం కార్యదర్శి రామకృష్ణారావు, ఐఎఫ్ఎస్ అధికారి తిరుపతయ్యలతో కూడిన కమిటీ తొమ్మిదో షెడ్యూల్‌ల్లోని ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు, ఉద్యోగుల పంపిణీ పూర్తి చే యనుంది. ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల పంపిణీపై కేంద్రం ఏర్పాటు చేసిన షీలాభిడే కమిటీ 61 సంస్థల ఆస్తుల పంపిణీని పూర్తి చేసింది. ఆ కమిటీ నివేదిక మేరకు ఇరు రాష్ట్రాలు ఆస్తుల పంపిణీని చేసుకోవాల్సి ఉంది. అయితే ఆస్తుల పంపిణీ పూర్తయితే తెలంగాణ ప్రభుత్వం ఏపీకి చెందిన ఉద్యోగులను పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తుందనే భావనతో ఏపీ ప్రభుత్వం ఆస్తుల పంపిణీ పక్రియను నిలుపుదల చేసింది. ట్రాన్స్‌కోలో ఏపీ స్థానికత చెందిన ఉద్యోగులందరినీ తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేయడంతో మిగతా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను అలాగే చేస్తే ఆయా ప్రభుత్వ రంగ సంస్థలపై ఆర్థిక భారం పడుతుందనే భావనతో ఏపీ ప్రభుత్వం ఆస్తుల పంపిణీతోపాటే ఉద్యోగుల పంపిణీ కూడా పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరింది. అయితే ఇప్పుడు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి వచ్చి ఆస్తులు, ఉద్యోగుల పంపిణీని ఆయా ప్రభుత్వ రంగ సంస్థల్లో చేపట్టాలని నిర్ణయించాయి. పదో షెడ్యూల్ సంస్థలపై కేంద్ర కమిటీ పదో షెడ్యూల్లోని సంస్థల ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల పంపిణీపై ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభేదాలు పరిష్కారం కానందున సుప్రీం కోర్టు తీర్పు మేరకు కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల నుంచి ఇద్దరేసి అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. హెడ్ క్వార్టర్స్ అంటే రాష్ర్ట విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం నిర్వచనం పేర్కొనలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోరిన నేపథ్యంలో హెడ్ క్వార్టర్స్ అంటే నిర్వచనం ఇస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే ఆ నిర్వచనంపై న్యాయస్థానాలను ఆశ్రయించరాదని రెండు రాష్ట్రాలకు కేంద్రం సూచించడం గమనార్హం. -
తెగనున్న మూడో ‘ముడి’?
రాజధాని పేరిట భూములు తీసుకుని రైతులకూ, రోడ్ల వెడల్పు పేరుతో శ్మశానాలను తీసుకుని ఆత్మలకూ, కృష్ణా పుష్కరాల పేరిట గుడులను కూల్చి దేవుళ్లకూ అన్యాయం చేస్త్తున్నా చూస్తూ ఊరుకోలేమని బీజేపీ నేతలు అంటున్నారు. కేంద్ర నిధులను మళ్లించి, లెక్కలు చెప్పకపోగా కేంద్ర సహాయం అందడం లేదన్నట్టు మాట్లాడటాన్ని బీజేపీ జీర్ణించుకోలేక పోతున్నది. పైగా దక్షిణాదిన సొంత బలం పెంచుకోవాలన్న లక్ష్యం కూడా బీజేపీకి ఉంది. కాబట్టి బీజేపీ, టీడీపీల దోస్తీ అప్పుడో ఇప్పుడో కటీఫ్ కాక తప్పదని పరిశీలకుల భావన. రెండేళ్ల క్రితం రాష్ర్ట విభజన అనంతరం మూడోసారి స్నేహితులైన తెలుగు దేశం భారతీయ జనతా పార్టీల బంధం ఇక ఎక్కువ కాలం నిలిచేట్టు కనిపిం చడం లేదు. కేంద్రంలో, ఆంధ్రప్రదేశ్‌లో కలిసి అధికారం పంచుకుంటున్న ఈ రెండు పార్టీలకూ ఈ మధ్య అస్సలు పొసగటం లేదు. గత వారం ఏపీ బీజేపీ నాయకులు జరిపిన ఢిల్లీ పర్యటన మీద ఆ పార్టీకి చెందిన ఒక యువనాయ కుడు... మా రెండు పార్టీల మధ్య తీవ్ర విభేదాలున్నాయి, అయితే అవి నివు రుగప్పిన నిప్పులా ఉన్నాయి. త్వరలోనే బయట పడటం ఖాయం అని వ్యాఖ్యానించడాన్ని బట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గతంలో ఎన్టీ రామారావు హయాంలోనూ, ఆ తరువాత చంద్రబాబు నాయుడు హయాం లోనూ ఈ రెండు పార్టీలు కలిసి పనిచేశాయి. అయితే గతంలో ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో ఈ మూడోసారి సంబంధాలకు విఘాతం కలిగిం దనీ, రెండేళ్లలోనే ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం చంద్రబాబేననీ చాలామంది బీజేపీ నాయకులు బాహాటంగానే వ్యాఖ్యానిస్త్తున్నారు. తలబరువు ‘బంధం’ గతంలో బీజేపీ ఎన్టీఆర్ హయాంలోనూ, ఆ తరువాత చంద్రబాబు హయాం లోనూ టీడీపీతో స్నేహం చేసింది. అయితే అప్పట్లో పార్టీకి వాజపేయి, అద్వానీలు నాయకత్వం వహిస్తుండటంవల్ల, పార్టీ అంత బలంగా లేకపోవ డంవల్ల టీడీపీతో సర్దుకుపోయే రీతిలో వ్యవహరించాం, ఇప్పుడు నరేంద్ర మోదీ, అమిత్ షా నాయకత్వంలో ఎవరి మద్దతూ అవసరం లేనంత బలంగా, పటిష్టంగా ముందుకు పోతున్నాం, ఒక ప్రాంతీయ పార్టీకి లొంగి ఉండాల్సిన అవసరం మాకు లేదని బీజేపీ నేతల వాదన. అంతేకాదు, 1999లో, 2014లో మా కారణంగా టీడీపీ అధికారంలోకి వచ్చిందే తప్ప, చంద్రబాబు వల్ల మేం లాభపడింది ఏమీ లేదని వారి భావన. గతంలో చంద్రబాబు రాష్ట్ర బీజేపీని ఖాతరు చెయ్యకుండా నేరుగా కేంద్ర నే తలతో వ్యవహారం నడిపినట్టే ఇప్పుడు కూడా చెయ్యడం కుదరదన్నది ప్రస్తుత బీజేపీ రాష్ట్ర నేతల వాదన. అందుకే మొన్నటి ఢిల్లీ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తాము నిర్ణయించిన నాయకులతో తప్ప చంద్రబాబు తనకు ఇష్టమైన వారితో మాట్లాడటానికి వీలు లేదని స్పష్టంగా చెప్పినట్టు వార్తలు వచ్చాయి. టీడీపీ, బీజేపీల మధ్య సమన్వయం కోసం వేసిన కమిటీ మొక్కుబడిగా ఒక్కసారే సమావేశం కావడం పట్ల కూడా బీజేపీ జాతీయ నాయకత్వం అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు కూడా వార్తలొచ్చాయి. చంద్ర బాబు నమ్మదగ్గ మిత్రుడేమీ కాదన్న విషయం కొత్తేమీ కాదు, పైగా దక్షిణా దిన స్వంత బలం పెంచుకోవాలన్న లక్ష్యం కూడా బీజేపీకి ఉంది. కాబట్టి ఆ రెండు పార్టీల మధ్య దోస్తీ అప్పుడో ఇప్పుడో కటీఫ్ కాక తప్పదని పరిశీలకుల అభిప్రాయం. భారీ మూల్యం చెల్లించక తప్పదు గత రెండేళ్ళుగా టీడీపీ అధినేత వ్యవహార శైలి మింగుడు పడకపోయినా, అనేక సందర్భాలలో ఆయన తమకు నష్టం జరిగే విధంగా వ్యవహరిస్తున్నా మిత్ర ధర్మంలో భాగంగా బీజేపీ నాయకులు కిక్కురుమనకుండా ఉన్నారు. కానీ తాజాగా జరిగిన దేవాలయాల కూల్చివేత వ్యవహారంతో ఇంకా మిన్నకుంటే అసలుకే ఎసరొచ్చే ప్రమాదం ఉందని గుర్తించారు. కాబట్టే మొన్నటి ఢిల్లీ సమావేశంలో కొన్ని కఠిన నిర్ణయాలే తీసుకున్నట్ట్టు వార్తలొ చ్చాయి. చంద్రబాబు రాజధానిని నిర్మిస్తానని భూములు తీసుకుని రైతు లకూ, రోడ్ల వెడల్పు పేరుతో శ్మశానాలను తీసుకుని ఆత్మలకూ, చివరకు కృష్ణా పుష్కరాల పేరు చెప్పి గుడులను కూల్చి దేవుళ్లకూ అన్యాయం చేస్త్తున్నా చూస్తూ ఊరుకోలేమని బీజేపీ నేతలు బాహాటంగానే చెపుతున్నారు. దొడ్డి దారిన ఎన్నికల ముందు బీజేపీలో చేరి టికెట్ సంపాదించి గెలిచి మంత్రి వర్గంలో చేరిన ఒక నాయకుడు, మరికొద్దిమందిని మినహాయిస్తే బీజేపీ నేతలు చాలా వరకు టీడీపీ ప్రభుత్వంతో స్నేహం కొనసాగించడం వల్ల రానున్న రోజుల్లో భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని మధనపడు తున్నారు. బీజేపీ హిందుత్వ ఆధారంగానే రాజకీయాలు నడుపుతున్న పార్టీ. అటువంటి పార్టీ తాను భాగస్వామిగా ఉన్న ప్రభుత్వమే రోడ్లు వెడల్పు చేసే నెపంతో గుళ్లు కూల్చెయ్యడాన్ని జీర్ణించుకోలేకపోతున్నది. ఏపీ దేవాదాయ శాఖామంత్రి, బీజేపీ నేత పీ కొండల మాణిక్యాలరావుకు ఈ విషయం గురించి కనీస సమాచారం కూడా అందించకపోవడం గమనార్హం. కృష్ణా పుష్కరాల కోసం అన్న కారణంతో అధికారులే నేరుగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హఠాత్తుగా రాత్రికి రాత్రి గుళ్లను కూల్చేయడాన్ని బీజేపీ తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నది. ఒక పార్లమెంట్ సభ్యుడు, ఒక శాసన మండలి సభ్యుడి కోసం ఇదంతా జరిగిందన్న విషయం బీజేపీ రాష్ర్ట నాయకత్వం కేంద్ర నాయకత్వం దృష్ట్టికి తీసుకు వెళ్లింది. దీంతో బీజేపీ రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జ్ సిద్ధార్థ్నాథ్ సింగ్ ఢిల్లీలో చంద్రబాబును కలిసి తీవ్ర అభ్యంతరం తెలిపారు. నిధులు మళ్లించి ఇవ్వలేదని శోకాలా? కేంద్రం నుంచి వస్త్తున్న నిధులకు సరయిన లెక్కలు చెప్పక పోవడమే కాకుండా, కేంద్రం నుంచి అసలు సహాయమే అందడం లేదన్న రీతిలో టీడీపీ తెలుగుదేశం నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మాట్లాడటాన్ని బీజేపీ జీర్ణించుకోలేక పోతున్నది. రాజధాని కోసం ఇచ్చిన నిధులను అందుకు ఖర్చు చెయ్యకపోగా కేవలం చంద్రబాబు ప్రతిభతోనే విదేశీ సహా యంతో అమరావతిని నిర్మించబోతున్నట్టు ప్రచారం చేసుకోవడాన్ని వారు ఆక్షేపిసున్నారు. అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా, అంటే 75 శాతం ఇళ్ల నిర్మాణానికి నిధులను కేంద్రం ఏపీకి మంజూరు చేస్తే ఒక్క ఇల్లు కట్టడమైనా ప్రారంభం కాకపోవడం, పోలవరం ప్రాజెక్ట్ కోసం, ఇతర పనుల కోసం ఇచ్చిన నిధులు ఖర్చు చెయ్యక పోవడం లేదా దారి మళ్ళించడం తదితర అంశాలను బీజేపీ నేతలు ఎత్తి చూపుతున్నారు. తాజాగా రాష్ర్ట విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఉత్తరాంధ్ర, రాయలసీమకు చెందిన ఏడు జిల్లాల కోసం కేంద్రం విడుదల చేసిన రూ. 700 కోట్లను వేరే పనులకు మళ్లించడం పట్ల నీతి ఆయోగ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు, ఆ నిధులన్నీ ఖర్చు చేసినట్టు కేంద్రానికి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించినందుకు ఆక్షేపించిన నీతి ఆయోగ్ ప్రత్యేక తనిఖీ బృందాలను పంపబోతున్నట్టు స్పష్టం చేసింది. ఈ నిధులలో రూ. 8 కోట్లను కేంద్ర మార్గదర్శక సూత్రాల మేరకు ఖర్చు చే సి, మిగతా నిధులను ముఖ్యమంత్రి ప్రయాణాలు తదితర ఇతర ఖర్చుల కోసం కలెక్టర్లకు కేటా యించడాన్ని నీతి ఆయోగ్ తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నది. ఎదురు దాడి వ్యూహం మౌనంగా ఉంటే తమ పార్టీకి జరగబోయే నష్టాన్ని గమనించినందునే ఈ రెండేళ్ల కాలంలో కేంద్రం ఏపీకి అందించిన నిధుల వివరాలతో 45 నిముషాల సీడీని తయారు చేసి బీజేపీ రాష్ర్టంలోని అన్ని జిల్లాల్లో ప్రదర్శిస్తోంది. ఈ సీడీ ప్రదర్శనలు ఏపీ బీజేపీ స్థానిక నాయకుల ఆధ్వర్యంలో జరుగుతు న్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఒకసారి రాష్ట్రంలో పర్యటించి, మాట్లాడి వెళ్ళారు. వికాస్ పర్వ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ఐదు జిల్లాల్లో బీజేపీ కేంద్ర మంత్రులు పర్యటించి పలు సభల్లో మాట్లాడారు. మిగిలిన జిల్లాల్లో కూడా త్వరలో మరికొందరు కేంద్ర మంత్రులు పర్యటించి వాస్తవాలు వివరిస్తారని బీజేపీ నాయకులు చెప్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన నుంచి రాగానే ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించాల్సి ఉంది. కానీ కశ్మీర్ పరిస్థితుల కారణంగా అది కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ ఈసారి చంద్రబాబుకు, ఆయన పార్టీలో అడ్డగోలుగా మాట్లాడుతున్న వారికి ‘మూ తోడ్ జవాబ్’ చెప్పే నాయకుడిని ముందుకు తేబోతున్నట్ట్టు వార్తలు వస్తు న్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వతంత్ర శక్తిగా ఎదగడానికి నిర్ణయిం చుకున్న బీజేపీ నిర్ణయం టీడీపీతో మూడోసారి ముత్యం అన్నట్టుగా ఏర్పడిన స్నేహాన్ని ఎక్కడిదాకా తీసుకుపోతుందో వేచి చూడాల్సిందే. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
న్యాయాధికారుల వివాదంపై కేంద్రానికి కేసీఆర్ లేఖ
హైదరాబాద్: హైకోర్టు విభజన జరగనంత వరకు రాష్ట్ర విభజన పూర్తి కానట్టేనని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. న్యాయాధికారుల వివాదంపై మంగళవారం ఆయన కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జితేంద్రసింగ్‌లకు లేఖలు రాశారు. కేంద్రం వెంటనే హైకోర్టు విభజనకు చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. హైకోర్టు విభజన పూర్తైన తర్వాతే న్యాయాధికారుల కేటాయింపు ప్రక్రియ మొదలుకావాలని కోరారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని అన్నారు. ప్రస్తుతం జరిగిన న్యాయాధికారుల కేటాయింపు వివాదానికి దారి తీసిందనీ, న్యాయాధికారుల కేటాయింపు ఇలానే ఉంటే తెలంగాణ న్యాయాధికారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ విభజన సమయంలో హైకోర్టు విభజనలు జరిగిన తర్వాతే జడ్జీల నియమకాలు జరిగాయని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. -
రెండు కళ్లు... ఎన్నో నాలుకలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో రెండు కళ్ల సిద్ధాంతమంటూ పాట పాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. తన మాటలతో ఎన్నో నాలుకలున్నాయని నిరూపించుకుంటున్నారు. రాష్ట్ర విభజన అంశంలో ఆయన నాలిక మెలికలు తిరిగిన తీరే ఇందుకు నిదర్శనం. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలన పగ్గాలు చేపట్టి రెండేళ్లవుతున్నా, ఏ ఒక్క విషయంలోనూ సరైన దిశలో అడుగువేయలేక, అన్నింటిలోనూ వైఫల్యాలనే మూటగట్టుకున్న చంద్రబాబు.. ఆ వైఫల్యాల నుంచి ప్రజలను పక్కదోవ పట్టించేందుకు ఇప్పుడు విభజన గాయాన్ని మరోసారి రేపే ప్రయత్నం చేస్తున్నారు. విభజన పాపాన్ని వేరే వారి పైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చిత్రమేమిటంటే.. ఆ విభజనకు ప్రధాన కారకుడు చంద్రబాబే. రాష్ట్ర ప్రజల మనోభావాలు, ప్రయోజనాలను పణంగా పెట్టి చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాలే పరమార్ధంగా రాష్ట్ర విభజనకు అనుకూలమంటూ పార్టీ పొలిట్‌బ్యూరోలో తీర్మానం చేసి, విభజనకు సమ్మతమేనంటూ కేంద్రానికి లేఖ కూడా రాశారు. రాష్ట్ర విభజనకు కారణమయ్యారు. తద్వారా ఆంధ్రప్రదేశ్‌కు తీరని నష్టం కలిగించారు. ఆ నెపాన్ని ఇతరులపైకి నెడుతున్నారు. తెలంగాణ ప్రాంతానికి వెళ్తే.. విభజనకు తానే కారణమని, ప్రత్యేక తెలంగాణ తన వల్లే వచ్చిందని చెబుతారు. తెలంగాణ అంశంపై ఆయన వ్యాఖ్యలు ఇవీ.. * తెలంగాణపై మాట ఇచ్చి తప్పలేం. ఇప్పుడున్న వైఖరి నుంచి వెనక్కు వెళ్లలేం. (సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులతో చంద్రబాబు (8-8-13న) * తెలంగాణకు అనుకూలమని రాసిన లేఖకు కట్టుబడి ఉన్నాం. 2008లో మా పార్టీ రాసిన లేఖ ఆధారంగానే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. (1-8-13లో తెలంగాణ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్న అనంతరం పార్టీ నేతలతో). * తెలంగాణపై తేల్చేందుకు అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేయాలి. ఇప్పటికే మా వైఖరి ప్రణబ్ కమిటీకి చెప్పాం.(ప్రధానికి రాసిన లేఖలో 27-09-12). * మా పార్టీ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డిని గెలిపిస్తే ఆయనతోనే చిదంబరానికి లేఖ పంపిస్తా. ఇక్కడి నుంచే ఉద్యమం చేస్తాం. (వరంగల్ జిల్లా పరకాల ఉప ఎన్నికల ప్రచారంలో 24-05-2012న) * తెలంగాణపై కేంద్రం సత్వర నిర్ణయం తీసుకోవాలి(2011 మే 29న మహానాడులో చేసిన తీర్మానం) * ఉత్తరప్రదేశ్ ప్రజలు విభజన వాదాన్ని అంగీకరించలేదు(2011 యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం) * తెలంగాణ, సీమాంధ్ర రెండూ నాకు రెండు కళ్లవంటివి అని నేనెందుకంటానో తెలుసా? రెండు కళ్లంటే రెండు రాష్ట్రాలని అర్థం. (19-06-2010న కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా కార్యకర్తల సమావేశంలో). * తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని ఎన్నికలకు వెళ్లాం. కానీ ప్రజలు సానుకూలంగా స్పందించలేదు(15-12-09). * మా పార్టీ తెలంగాణకు మద్దతు పలుకుతుంది(2009 డిసెంబర్ 7న ఏపీ ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో టీడీపీ ప్రతినిధులు) * నేనెప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు (కామారెడ్డి ఉప ఎన్నికల ప్రచారంలో) * తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ వారి అభీష్టం మేరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా పార్టీ నిర్ణయించింది. (2008 అక్టోబర్ 10న పొలిట్‌బ్యూరోలో చేసిన తీర్మానం) పొలిట్ బ్యూరోలో తీర్మానం చేయించి, ప్రణబ్ కమిటీకి లేఖ రాసి.. తెలంగాణకు అనుకూలమంటూ 2008 అక్టోబర్‌లోనే టీడీపీ పొలిట్‌బ్యూరోలో తీర్మానం చేశారు. దీంతోపాటు అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్, కేంద్రం ఏర్పాటు చేసిన ప్రణబ్ ముఖర్జీ కమిటీకి సైతం బాబు లేఖ రాశారు. ఆ తరువాత 2009 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్, టీడీపీ, సీపీఎం, సీపీఐ మహాకూటమిగా పనిచేశాయి. కేసీఆర్‌తో కలసి పలు బహిరంగ సభల్లో పాల్గొన్న చంద్రబాబు తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పారు. రాష్ట్ర విభజనకు అనుకూలమని కేంద్రానికి లేఖ కూడా ఇచ్చామని చెప్పారు. అదే సమయంలో ఆంధ్రప్రాంతంలో మాత్రం మాట మార్చారు. తనకు రెండు ప్రాంతాలూ సమానమని, రెండు కళ్లలాంటివని ఆ ఎన్నికల సభల్లో ఏకరువు పెట్టారు. ఏ కంటికి దెబ్బ తగిలినా ఓర్చుకోలేనని, రాష్ర్టం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నానని సీమాంధ్ర ప్రజలకు చెప్పారు. అయితే, ఆ ఎన్నికల్లో మహాకూటమి ఓడిపోయింది. సమన్యాయమనే సరికొత్తరాగం మహాకూటమి ఓటమి చెందడంతో బాబు మరో రాగమందుకున్నారు. తెలంగాణ, సీమాంధ్రలో స్థానికుల మనోభావాలకు అనుగుణంగా ఉద్యమాలు చేసుకోవాల్సిందిగా పార్టీ నేతలకు సూచించారు. దీంతో తెలంగాణ నేతలు తెలంగాణ తెలుగుదేశం ఫోరం ఏర్పాటు చేశారు. ఏపీ నేతలు సమైక్యాంధ్రగా కొనసాగించాలని ఉద్యమాలు చేశారు. కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీకి రెండు ప్రాంతాల నేతలు విడివిడి నివేదిక ఇచ్చారు. రాష్ర్ట విభజన ఖాయమని తేలాక చంద్రబాబు రెండు ప్రాంతాలకూ సమన్యాయమనే నినాదాన్ని ఎత్తుకున్నారు. ఇరు ప్రాంతాల పెద్దలను కూర్చోబెట్టి చర్చించి విడదీయాలని సలహా ఇచ్చారు. సమన్యాయం అంటే ఏమిటని విలేకర్లు ప్రశ్నిస్తే వింత సమాధానం ఇచ్చారు. మీకు ఇద్దరు పిల్లలుంటే ఎవరిపక్షాన నిలబడతారంటూ వితండవాదంతో ఎదురు ప్రశ్నించారు. తన పరిస్థితీ అదేనన్నారు. సమన్యాయమంటూ ఢిల్లీలో నిరవధిక దీక్ష పేరుతో హడావుడి చేశారు. ఈ క్రమంలోనే విభజన జరిగిపోయింది. -
'విభజన చట్టం ప్రకారం హైకోర్టు తెలంగాణకే'
న్యూఢిల్లీ: హైకోర్టు విభజన విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ సూచించారు. విభజన చట్టం ప్రకారం ప్రస్తుత హైకోర్టు తెలంగాణకు వెళ్తుందని చెప్పారు. బుధవారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కొత్త హైకోర్టు కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని అన్నారు. ఎన్నికల సంస్కరణలపై లా కమిషన్ రెండు వివేదికలను ఇచ్చినట్టు ఆయన చెప్పారు. పార్టీ ఫిరాయింపుల చట్టంలో సవరణలు చేయాలని లా కమిషన్ సూచించినట్టు సదానంద గౌడ తెలిపారు. -
ఆ ప్రత్యే‘కథే’ వేరు..
♦ హోదాతోనే ‘తూర్పు’లో గణనీయ మార్పు ♦ ఆ దిశగా అడుగులు వేయడంలో సర్కారు విఫలం రాష్ట్రంలో భూమి సారవంతమైంది! సహజ వనరులు పుష్కలం! శ్రమ, మేధోవనరులకూ లోటు లేదు! అరుుతేనేం.. గొడ్డలిపెట్టు తిన్న పచ్చనిచెట్టు వాడిపోరుునట్టు.. రాష్ర్ట విభజనతో ఈ గడ్డ సౌభాగ్యం కుంటుబడింది. ఆ దెబ్బ నుంచి కోలుకునేందుకు పరమౌషధం లాంటిది ప్రత్యేకహోదా అన్న టీడీపీ, బీజేపీలే ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో అధికారంలోకి వచ్చారుు. అరుుతే ఇప్పుడా సర్కార్లు జనాన్ని మోసగిస్తూ ఆ హామీకి నీళ్లు వదిలారుు. ఈ తరుణంలో జనం తరఫున కదనభేరి మోగించింది వైఎస్సార్ సీపీ. నేడు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు పిలుపునిచ్చారు ఆ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి. కాకినాడలో జరిగే ధర్నాలో స్వయంగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పురోగతికి ప్రత్యేకహోదా ఆవశ్యకతను, హోదాపై జిల్లావాసుల ఆశలు, ఆకాంక్షలపై ప్రత్యేక కథనాలు.. చందమామ కథల్లో చదివాం.. రెక్కలగుర్రాలుంటాయని.. నమ్మడానికి ఎంత బాగుందో.. బాలమిత్ర కథల్లో చదివాం.. పగడపు దీవులు ఉంటాయని నమ్మడానికి ఎంత బాగుందో.. ఇవన్నీ నిజమో.. కాదో తెలియదు కానీ.. ‘ప్రత్యే‘కథ’తోనే తూర్పులో పారిశ్రామిక, అభివృద్ధి మార్పులు సాధ్యమంటున్నారు జిల్లావాసులు. అపార సహజవనరులు, సాగరతీరం, గోదా‘వరి’.. సహజవాయువు, చమురు నిక్షేపాలు, ల్యాటరైట్ గనులు, సున్నపు రాళ్లు, రోడ్డు, రైల్వే, నౌకారవాణా వ్యవస్థలు, లక్షలాది ఎకరాల సారవంతమైన భూమి ఉన్న ఈ జిల్లాకు పరిశ్రమలు వెల్లువలా తరలివచ్చి.. స్థానిక యువతకు ఉపాధి దొరుకుతుందని, జిల్లా ఆర్థిక స్వరూపమే మారుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. - అమలాపురం రాష్ట్ర విభజన తర్వాతే కాదు.. ఉమ్మడి రాష్ట్రంలోనే తూర్పు గోదావరిజిల్లా ప్రత్యేకతను సంతరించుకుంది. అధిక జనాభా, రాష్ట్రంలోనే అత్యధిక నియోజకవర్గాలు, వ్యవసాయ పరంగా వరి, కొబ్బరి, ఆక్వా సాగుల్లో ఈ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రాజకీయంగా ఎంతో కీలకమైన ఈ జిల్లాలో మెజార్టీ స్థానాలు సాధించిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం సెంటిమెంట్‌గా మారింది. చివరకు విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో సైతం ఇదే సెంటిమెంట్ నిజమైంది. ఇక్కడ 14 స్థానాలు (స్వతంత్ర, మిత్రపక్ష బీజేపీ)తో కలిసి సాధించడం వల్లే టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. విభజన తరువాత నాలుగు విలీన మండలాలు కలవడంతో జిల్లా విస్తీర్ణం మరింత పెరిగింది. మూడు రాష్ట్రాలు (తెలంగాణ , ఛత్తీస్‌ఘడ్, ఒడిశా)ల సరిహద్దు కలిగిన కీలక జిల్లాగా మారింది. అయినా ఆశించిన స్థాయిలో జిల్లా అభివృద్ధి సాధించలేదనే చెప్పాలి. ప్రధానంగా పరిశ్రమల ఏర్పాటు విషయంలో జిల్లా అన్నివిధాలా వెనకబడి పోయింది. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిపై చంద్రబాబు సర్కారు మాటలకే పరిమితమైంది తప్ప, చేతల్లో చూపించకపోవడంతో జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మారింది. పరిశ్రమల ప్రోత్సహానికి ప్రభుత్వాలు ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసిన పారిశ్రామిక వాడలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నిరుద్యోగానికి చెక్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభిస్తే జిల్లాను పట్టిపీడిస్తున్న నిరుద్యోగ సమస్యకు తెరపడుతుందని నిపుణులు అంటున్నారు. ఎంప్లాయిమెంట్ విభాగంలో నమోదైన వివరాల మేరకు జిల్లా వ్యాప్తంగా 79,776 మందికి పైగా నిరుద్యోగులు ఉండగా, నమోదుకాని వారు మరెందరో ఉన్నారు. సాంకేతిక విద్య, ఇంజనీరింగ్, డిప్లమో, ఐటీఐ, మెకానికల్ విభాగాల వారికి ఉద్యోగాలు వచ్చేది పరిశ్రమల్లోనే. డిగ్రీ, పీజీలకు సైతం ప్రభుత్వ ఉద్యోగాలు పెద్దగా లేనందున వారు ప్రైవేటు పరిశ్రమలపైనే ఆధారపడుతున్నారు. ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసిన వారిలో 30 శాతం మందికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తోంది. - మండపేట జిల్లాలో 28 ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా ఏటా 9,500 మంది క్వాలిఫైడ్ విద్యార్థులు బయటకు వస్తున్నారు. అలాగే 80 వరకు ఎలక్ట్రికల్, ఫిట్టర్, ల్యాబ్ టెక్నీషియన్స్, మెకానికల్ తదితర విభాగాల్లో శిక్షణ ఇచ్చే ఒకేషనల్ కళాశాలలు ఉన్నాయి. వీటి ద్వారా ఏటా 10,500 మందికి పైగా శిక్షణ పొందుతున్నారు. అయితే జిల్లాలో పారిశ్రామికవృద్ధి లేకపోవడంతో నిరుద్యోగ సమస్య పట్టిపీడిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిశ్రమల్లోను కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానాల్లో ఉపాధి కల్పిస్తుండడంతో ఉద్యోగ భరోసా కరువవుతోంది. మరోపక్క ఆంధ్రా, నన్నయ్య, నాగార్జున, ఓపెన్ యూనివర్శిటీల్లో డిగ్రీ, పీజీలు చేస్తున్న వేలాది మంది విద్యార్థులు సరైన ఉద్యోగ అవకాశాలు లేక ప్రైవేటు వ్యాపార, వాణిజ్య సంస్థల్లో అరకొర జీతాలకు పనిచేస్తున్నారు. ఓఎన్జీసీ, గెయిల్, రిలయన్స్, జీఎస్పీసీ వంటి సంస్థలు రూ.వందల కోట్లలో జిల్లాలో కార్యకలాపాలు సాగిస్తున్నా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదు. ఆ స్థాయి శిక్షణ ఇచ్చేటటువంటి పెట్రోవర్సిటీ, లాజిస్టిక్ వర్సిటీలు ఈ ప్రాంతంలో లేకపోవడం ప్రధాన సమస్యగా మారిపోయింది. ఇప్పటికే పెట్రోవర్సిటీ విశాఖపట్నం తరలిపోగా, ద్వారపూడిలో ఏర్పాటు చేయతలపెట్టిన లాజిస్టిక్ వర్సిటీ ప్రతిపాదనల దశలోనే ఉంది. స్థానికంగా పరిశ్రమలు రావడం వల్ల నిరుద్యోగులు ప్రత్యక్షంగా ఉద్యోగాలు పొందితే అంతకు నాలుగు రెట్లు మంది పరోక్షంగా ఉపాధి పొందే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. శరవేగంగా.. హిమా‘చల్’.. ఒకప్పుడు అభివృద్ధిలో అట్టడుగున ఉన్న హిమాచల్‌ప్రదేశ్ ప్రత్యేకహోదాతో శరవేగంగా అభివృద్ధి సాధించింది. 2003లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేకహోదా ఇవ్వడంతో 90 శాతం గ్రాంటుతో కేంద్ర నిధులు వెల్లువెత్తాయి. పారిశ్రామిక ప్యాకేజీలు, రాయితీలు రావడంతో పరిశ్రమలు పోటెత్తాయి. సుమారు 40 వేలకు పైగా పరిశ్రమలతో పారిశ్రామికంగా ముందుకు దూసుకుపోతోంది ఈ రాష్ట్రం. ప్రత్యక్షంగా సుమారు ఆరు లక్షల మందికిపైగా ఉద్యోగ అవకాశాలు దక్కాయి. పరోక్షంగా మరెన్నో లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలిరావడంతో వాటి అవసరాలకు తగిన మానవ వనరులను సిద్ధం చేసేందుకు అక్కడి ప్రభుత్వం ఎన్నో విద్యాసంస్థలను నెలకొల్పింది. స్థానిక విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచి వారికే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ప్రత్యేకహోదాతో పారిశ్రామికంగా, ఉద్యోగ, ఉపాది అవకాశాల్లో రాష్ట్రం సాధించే ప్రగతికి హిమాచల్‌ప్రదేశ్ ఒక ఉదాహరణ. కాకినాడ సెజ్‌లో పరిశ్రమలేవీ? కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలం (కేఎస్ఈజెడ్)ను ప్రభుత్వం 2008లో ఏర్పాటు చేసింది. కొత్తపల్లి మండలం నుంచి తొండంగి మండలం వరకు తీరాన్ని ఆనుకుని సుమారు 20 కి.మీల మేర కేఎస్‌ఈజెడ్‌ను ఏర్పాటు చేశారు. రైతుల వద్ద నుంచి ఏడు వేల ఎకరాల భూములు సేకరించారు. దీంతో జిల్లాలో పారిశ్రామికంగా పెనుమార్పులు చోటు చేసుకుంటాయని జిల్లా వాసులు భావించారు. - ఇక్కడ రూ.రెండు వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమల స్థాపన జరుగుతుందని అంచనా వేశారు. స్థానికంగా సుమారు ఐదు వేల మందికి ఉద్యోగ కల్పన జరుగుతుందని, పదిహేను వేల మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుందని ఆశించారు. - ఇప్పటి వరకు ఇక్కడ ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. చైనాకు చెందిన ఒక సాధారణ సంస్థ బొమ్మల ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. ఖాళీగానే పారిశ్రామిక వాడలు జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలతోపాటు పెద్దాపురం, సామర్లకోట, రాజానగరం వంటి ప్రాంతాల్లో పారిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం పారిశ్రామిక వాడలు (ఇండస్ట్రీయల్ పార్కులు) ఏర్పాటు చేసింది. చాలాచోట్ల ఇవి ఏర్పాటు చేసి దశాబ్దాలు గడిచిపోతున్నా ఆశించిన స్థాయిలో పరిశ్రమలు ఏర్పడలేదు. - కాకినాడ సర్పవరం వద్ద ఏర్పాటు చేసిన పారిశ్రామిక వాడలో ఇప్పటికీ పలు పరిశ్రమల ఏర్పాటుకు స్థలాలు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసి 20 ఏళ్లు దాటింది. - సామర్లకోటలో పారిశ్రామికవాడలో రాక్ సిరామిక్స్, రిలయన్స్ పవర్‌ప్లాంట్, జీవీకే పవర్ప్లాంట్లున్నాయి. రిలయన్స్, జీవీకేలు గ్యాస్ కొరత వల్ల ఆరంభం కాలేదు. మిగిలినవి చిన్న పరిశ్రమలే. - సామర్లకోట ఏపీఐఐసీ 2004 పాలిస్టర్ కంపెనీ పెట్టేందుకు 1,200 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఎకరాకు రూ.20వేలు చొప్పున చెల్లించారు. దీనిని రిలయన్స్ సంస్థ కొనుగోలు చేసి పరిశ్రమ ఏర్పాటు చేయపోవడం గమనార్హం. - పెద్దాపురంలోనూ ఇదే పరిస్థితి. వాలు తిమ్మాపురంలో గిరిజా పవర్‌ప్లాంట్, రెండు రైస్ ఫ్యాక్టరీలున్నాయి. ఇవి అంత పెద్ద పరిశ్రమలు లేవు. - కాకినాడ -రాజమండ్రి కెనాల్ రోడ్డు కడియంలో జీవీకే పవర్‌ప్లాంట్, వేమగిరి (జీఎంఆర్)పవర్ ప్రాజెక్టులు పనిచేస్తుండగా, యువరాజ్ పవర్ప్రాజెక్టు, ఆర్వీకే పవర్‌ప్లాంట్ నిలిచిపోయాయి. కొత్తగా ఈ ప్రాంతంలో పరిశ్రమలు రాలేదు. - రాజమహేంద్రవరం శివారు ధవళేశ్వరం ఇండస్ట్రీయల్ ఎస్టేట్‌లో హార్లీక్స్ ఫ్యాక్టరీ తప్ప చెప్పుకునే స్థాయిలో పరిశ్రమలు రాలేదు. వ్యవ‘సాయం’ నిల్.. వ్యవసాయ రంగ అభివృద్ధికి.. ఆ రంగానికి సాంకేతిక దన్ను అందించేందుకు వ్యవసాయ ఉత్పత్తులు, అనుబంధ ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం ఊదరగొడుతోంది. రాజధానిని విజయవాడలో ఏర్పాటు చేస్తామని ప్రకటించే సమయంలో నిండు సభలో అన్ని జిల్లాల్లో తమ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిశ్రమలపై చంద్రబాబు హామీల వర్షం కురిపించారు. తూర్పు గోదావరి జిల్లాలో కొబ్బరి, ఉద్యాన పంటలకు మేలు చేసేలా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. విదేశాలకు ఎగుమతయ్యే ఆక్వా ఉత్పత్తులకు సైతం పరిశ్రమలు పెడతామన్నారు. గడిచిన రెండేళ్లలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. - రాజమండ్రి సమీపంలో రూ.300 కోట్లతో కొబ్బరి పార్కు ఏర్పాటుకు కార్పొరేట్ కంపెనీ ముందుకు వచ్చింది. ప్రభుత్వంతో ఎంఓయూ కూడా చేసుకుంది. అయితే ఇప్పటి వరకు ఆ కంపెనీ పరిశ్రమ ఏర్పాటు దిశగా ముందడుగు వేయలేదు. - కొబ్బరి సంఘాల ద్వారా కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు (సీడీబీ) రాయితీలతో రుణాలిచ్చి పరిశ్రమల ఏర్పాటుకు ముందకు వచ్చింది. ప్రత్యేక హోదా ఉంటే మరిన్ని రాయితీలు వచ్చి ఇక్కడ పరిశ్రమలు ఏర్పడేవి. నిరుద్యోగ యువతకు ఉపాధి కలగడంతోపాటు జిల్లాలో దాదాపు 50 వేల మంది కొబ్బరి రైతులకు, వేలాది మంది కార్మికులకు ఉపాధికి ఢోకా ఉండేది కాదు. హోదా లేక, రాయితీలందక రైతు కంపెనీలు వెనకంజ వేస్తున్నాయి. - కొబ్బరి సంఘాల ద్వారా కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు (సీడీబీ) రాయితీలతో రుణాలిచ్చి పరిశ్రమల ఏర్పాటుకు ముందకు వచ్చింది. ప్రత్యేక హోదా ఉంటే మరిన్ని రాయితీలు వచ్చి ఇక్కడ పరిశ్రమలు ఏర్పడేవి. నిరుద్యోగ యువతకు ఉపాధి కలగడంతోపాటు జిల్లాలో దాదాపు 50 వేల మంది కొబ్బరి రైతులకు, వేలాది మంది కార్మికులకు ఉపాధికి ఢోకా ఉండేది కాదు. - జిల్లాలో క్వాయర్ మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయి. కొబ్బరి ఉత్పత్తులు, ఉప ఉత్పత్తుల తయారీ పరిశ్రమలేవీ లేవు. కొబ్బరి నీటిని మార్కెట్ చేసేందుకు పెప్సీకో ముందుకు వచ్చిందని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత ఆ ఊసే లే దు. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతికి ప్రైవేట్ కంపెనీలు తాళ్లరేవు, అమలాపురం, కాకినాడ శివారు, తొండంగి మండలాల్లో చిన్నచిన్న కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేశాయి. పెద్ద ఎత్తున ఇటువంటివి ఏర్పాటు చేయాలంటే రాయితీలు అవసరం. హోదా వస్తే ఇవి సాధ్యమవుతాయి. ఆ ‘బడా’యి లేదు? మూడు దశాబ్దాల క్రితం కాకినాడ తీరాన కోరమండల్, నాగార్జున ఫెర్టిలైజర్స్ ఏర్పాటు చేశారు. తరువాత ఈ ప్రాంతంలో పెద్ద పరిశ్రమలేవీ లేవు. వాకలపూడిని ఆనుకుని పరిశ్రమలున్నా అవి అంతపెద్దవికావు కాకినాడ రూరల్‌లో 18 ఫ్యాక్టరీలుండగా, వీటిలో 10 ఆయిల్ ఫ్యాక్టరీలున్నాయి. ఓఎన్జీసీ స్టెంబర్గ్, సిల్క్‌రోడ్డు షుగర్స్, స్పెక్ట్రమ్ విద్యుత్ ప్లాంట్ ఒక్కటే చెప్పుకునేది. కేజీ బేసిన్లో చమురు నిక్షేపాలున్నందున ఇక్కడ పెట్రోలియం అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశముంది. కాకినాడ సర్పవరం ఆటో నగర్లో చిన్నపరిశ్రమలు 154 వచ్చాయి. దీనిలో ఐటీపార్కు ఏర్పాటు చేయగా, ఇన్ఫోటెక్ సంస్థ మాత్రమే ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పెద్ద సంస్థలు వచ్చిన దాఖలాలు లేవు. రాజమహేంద్రిలో పేపరుమిల్లు తప్ప పెద్ద పరిశ్రమలేవీ లేవు. ఉపాధికి మరింత స‘పోర్టు’ కాకినాడ సిటీ : జిల్లా కేంద్రం కాకినాడ తీరంలో యాంకరేజ్, డీప్‌వాటర్ పోర్టులు ఉన్న నేపథ్యంలో ప్రత్యేక హోదా వస్తే జిల్లాలో ఎక్కువగా పారిశ్రామిక సంస్థలు వచ్చే అవకాశం ఉంది. పోర్టులో కార్గో హ్యాండ్లింగ్ 2014-15 సంవత్సరంలో సుమారు 18 మిలియన్ మెట్రిక్ టన్నులు కాగా 2015-16లో 15 వేల మిలియన్ టన్నులు చేశారు. అయితే పోర్టు ఆధారిత పరిశ్రమలు వస్తే కార్గో హ్యండ్లింగ్ మూడు రెట్లు పెరగడంతో పాటు కార్మికులకు ఉపాధి అవకాశాలు విరివిగా ఉంటాయి. తద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని మరింత ఆర్జించే అవకాశాలు ఏర్పడడమే కాకుండా తూర్పుతీరంలో ఎగుమతులు దిగుమతుల రవాణాలోనూ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఇక్కడి తీరంలో పెట్రో కారిడార్, హోర్డ్‌వేర్ హబ్, హార్టీకల్చర్ప్రొడక్ట్స్, కోకోనట్ పీచు పరిశ్రమలు వంటి వాటితో కోస్టల్ కారిడార్ చేస్తామని పాలకులు చెబుతున్నా, ఒక్కఅడుగు ముందుకు పడడంలేదు. రాష్ట్రానికి హోదా వస్తే విదేశీ పారిశ్రామిక సంస్థలు రావడంతో బాటుగా స్వదేశీ పారిశ్రామిక ఉత్వత్తుల ద్వారా విదేశీ మరక ద్రవ్యాన్ని పెంచుకునే అవకాశం పుష్కలంగా ఉంది. పారిశ్రామిక ప్రగతి పెరుగుతుంది ప్రత్యేక హోదా వస్తే జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పెరుగుతుంది. 30 శాతం భారాలు తగ్గే అవకాశం ఉంది. అలాగే 10 శాతం పెట్టుబడికి 90శాతం గ్రాంట్లు వచ్చే వెసులుబాటు కలుగుతాయి. పెట్రోలియం, గ్యాస్, ఎడిబుల్ ఆయిల్, కొబ్బరి వంటివి ఆదాయ వనరుగా ఉన్నా ప్రాజెక్టులు ఏర్పాటు కావడంలేదు. - దూసర్లపూడి రమణరాజు, సామాజికవేత్త, కాకినాడ ఉపాధి అవకాశాలు మెరుగు ప్రత్యేక హోదా వస్తే వచ్చే పన్నుల మినహాయింపులతో జిల్లాలో ఎక్కువగా పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉంది. తద్వారా మహిళలు, కార్మికులు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దీంతో జిల్లా అభివృద్ధే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుంది. - జి.బేబిరాణి, శ్రామిక మహిళా కన్వీనర్,కాకినాడ ప్రయోజనాలకు భంగం కల్గిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో రాజీధోరణిలో వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తోంది. విభజన హామీలను సాధించుకోలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. చిత్తశుద్ధి ఉంటే తక్షణం అన్ని పార్టీలతో కలిపి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెల్లి కేంద్రంపై వత్తిడి తీసుకువచ్చి ప్రత్యేక హోదా సాధించాలి - దడాల సుబ్బారావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగావకాశాలొస్తాయి. హోదాను సాధించకపోతే రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే అవకాశాలు సన్నగిల్లుతాయి. హోదా సాధనకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలి. - గుత్తుల రుద్రమూర్తి, అంగర, కపిలేశ్వరపురం మండలం. హోదాతోనే ఉపాధి అవకాశాలు రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోనే ఉపాధి అవకాశాలు ఉంటాయి. ప్రత్యేక హోదాతో పారిశ్రామిక అభివృద్ధి జరిగి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. - వి. కల్పన, బీఎస్సీ బీఈడీ, పెదపూడి చిత్తూరు జిల్లాలో ఇటీవల కోకో ఉత్పత్తులతో చాక్లెట్ పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఇటువంటివి జిల్లాలో కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఉభయ గోదావరి జిల్లాలో కోకో పంట సుమారు 60 వేల ఎకరాల్లో సాగవుతోంది. పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ధర పెరుగుతోంది. కోకో లాభదాయం కావడంతోపాటు కొబ్బరి రైతులు ఈ పంటను పెద్ద ఎత్తున సాగు చేసి ఆర్థికంగా ప్రయోజనం పొందే అవకాశముంది. -
విభజనలో పోలీసులకు న్యాయం చేయాలి
ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం మేరకు రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని పేరా 14 ప్రకారం తెలంగాణ, ఏపీలకు ఉద్యోగులను పంపిణీ చేసినట్టుగానే 14ఎఫ్ మినహాయింపు కింద నియామకాలు పొందిన హైదరాబాద్ పోలీసులను కూడా పంపిణీ చేయాలని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ చైర్మన్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ విభజన కమిటీని కోరారు. గురువారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ విభజనలో పోలీసు ఉద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టంలోని సెక్షన్ 3(6) కింద నియామకం పొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆరువేల మందిని స్థానికత ఆధారంగా వారివారి స్వస్థలాలకు పంపించాలని శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు. -
ప్రజాస్వామ్యం ఎటుపోతోంది?
ఆంధప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఉన్నదా లేక నియంతృత్వ ధోరణులు సాగుతున్నాయా? అన్న ప్రశ్న ఇక్కడి వాతావరణాన్ని గమనించేవారి కందరికీ తలెత్తుతుంది. రాష్ట్రపతులు, గవర్నర్లు, స్పీకర్లు మొదలైనవారు పార్టీలకు అతీతంగా హుందాగా రాజ్యాంగ తదితర సంక్షోభాలు తలెత్తినప్పుడు తండ్రిలా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ, ఈ మధ్య కాలంలో పరిస్థితులు-రాజకీయాల్లో హుందాతనం కొరవడినట్లు సూచిస్తున్నాయి. స్పీకర్ నిష్పాక్షికంగా గాక, అధికార పక్షం ప్రతినిధిగా వ్యవహరిస్తుండటం దురదృష్టకరం. మన రాష్ట్ర విభజన విషయంలో కూడా అప్పటి లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ నిష్పాక్షికంగా కాక అప్పటి అధికార పక్షానికి దన్నుగా నిలబడి అపఖ్యాతి పాలయ్యారు. మరి లోక్‌సభలో ఆమెక్కూడా పెప్పర్ స్ప్రే ఘాటు తగిలింది. ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌కి- రోజాకు మధ్య వివాదం దానితో పోలిస్తే తక్కువే గదా! మరి అలాంటప్పుడు ఇంత రాజీలేని ధోరణి, న్యాయస్థానాల ఉత్తర్వులను కూడా బేఖాతరు చేసే పరిస్థితి చూస్తుంటే న్యాయమూర్తులు అన్నట్లు ‘‘ఏపీలో అసలేం జరుగు తుంది? - సంథింగ్ రాంగ్, సంథింగ్ రాంగ్!!’’ ఎమ్మెల్యే రోజా ‘సారీ’ చెప్పాలని పట్టుబట్టే వారికి ఒక మౌలి కమైన విషయం అర్థం అవ్వాలి, కోర్టు మధ్యంతర ఉత్తర్వుల దృష్ట్యా ఆమెను సభలోకి అనుమతించి ఉన్నట్లయితే, ఆమె జరిగిన దానికి మర్యాద పూర్వకంగా ‘సారీ’ చెప్పి వుండేవారు కదా! మరికొందరు విపక్ష సభ్యులు వాడిన అన్ పార్లమెంటరీ భాష, హావభావాలను గురించి కూడా ఆమె మాట్లాడేవారు, మరి ప్రతిపక్ష నేతనుద్దేశించి ముఖ్యమంత్రి, అధికార పక్షం మంత్రులు, సభ్యులు ఉపయోగించిన పదజాలం కూడా అన్పార్లమెంటరీనే గదా! అంటే ఒకరికొకరు ‘సారీ’ చెప్పుకోవడం కంటే వీరంతా ప్రజలకు ‘సారీ’ చెప్పాల్సి ఉంటుంది. కొత్త చీర, ఓ పెద్ద కరెన్సీ నోటు కోసం రాత్రంతా ఎదురుచూసి ఓటును అమ్ముకునేవారున్నంత కాలం చట్టసభలు కూడా ఇలాంటి వారికి దర్పణంగా మాత్రమే ఉంటాయనటానికి మన ప్రస్తుత రాజకీయాలు నిదర్శనం. ‘వోట్ ఫర్ నోట్’తోపాటు, రాజకీయ బేరసారాల గురించి మనం ఎన్నికలు అయిపోయాక కూడా వింటున్నాం కదా. రాష్ట్రంలో ఒక పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను అంగట్లో సరుకుల్లాగా కొనేసుకుంటున్న వైనం చూసి జాతీయ నేతలు విస్తుపోతున్నారు. దేశంలోనే ఎక్కడా లేని ఘోర పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తరచుగా మన మెక్కడికి పోతున్నాం అంటుంటారు. ఆయన ఇదే ప్రశ్నను తనపై తాను వేసుకుంటే అందరికీ మంచిది. - డాక్టర్ టి. రామదాసు, సీనియర్ వైద్యులు మొబైల్: 7675958696 నీటి దిగుమతి తప్పదా? నేడు దేశంలో ఎటు చూసినా దాహపు కేకలే, కరవు నీడల్లో, అడుగంటిన నీటి జాడల్తో దేశంలో సింహభాగం అల్లాడుతోంది. అధికార గణాంకాల మేరకు తొమ్మిది రాష్ట్రాలు కరువుబారిన పడ్డాయి. తొంబై ఒక్క పెద్ద జలాశయాలలో నీరు అడుగంటింది. తొమ్మిది జీవనదులు ఒట్టిపోయాయి. లాతూర్ ప్రాంతానికి తాగునీటిని ప్రభుత్వం రైళ్ల ద్వారా పంపిణీ చేయాల్సిన దుర్గతి దాపురించింది. శక్తివంతమైన క్రికెట్ పోటీలు కూడా నీటి ఎద్దడి మేరకు వేరే ప్రాంతాలకు వలసపోవడం తప్పనిసరైంది. వీటన్నింటిని మించి భారతదేశంలో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయిలో అడుగంటుతున్నాయి. తలసరి నీటి లభ్యత 1950లలో మనిషికి ఐదువేల క్యూబిక్ మీటర్లుండగా నేడది పదిహేను వందల క్యూబిక్ మీటర్లు. కనీస స్థాయి పదిహేడు వందల మేరకు లేకపోతే ఆ దేశాన్ని నీటి ఎద్దడి దేశంగా గుర్తిస్తారు. అధికారికంగా ఇక మన దేశం ప్రమాదంలో ఉన్నట్టే కనుక భారత సమాజం కళ్లు తెరవాల్సిన సమయం. వాస్తవాన్ని గుర్తెరిగి నష్ట నివారణకు నడుం బిగించాల్సిన సందర్భం. ఇప్పుడు దేశంలో ‘సుజల భారత్’ ఉద్యమం అవసరం. అందుకు ప్రధానమంత్రి నడుం బిగించి దేశ ప్రజలను నడిపిం చాల్సి ఉంది. విచ్చలవిడిగా భూగర్భ జలాలను తోడివెయ్యడం, ఉపరితల జలాలను వృథాపర్చడం నియంత్రించాలి. నీటి పొదుపు, నీటి నిల్వ నిర్వహణ శాస్త్రీయంగా, సమర్థవంతంగా జరగాలి. ఈ అల వాట్లను వ్యక్తి స్థాయి నుండి వ్యవస్థ స్థాయి వరకూ పాదుకొల్పాలి. ప్రభుత్వం, పౌర సమాజం, మీడియా, యంత్రాంగం, ప్రజానీకం చిత్తశుద్ధితో కదలాల్సిన అత్యవసర పరిస్థితి, ఉదాసీనత వహిస్తే నీరు కూడా దిగుమతి చేసుకోవాల్సిన దినుసుల లిస్టులో చేరడం ఖాయం. - డాక్టర్ డీవీజీ శంకరరావు, మాజీ ఎంపీ, పార్వతీపురం అంబేడ్కరీయం భారతీయుల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత, విశ్వ మేధావి డాక్టర్ బి.ఆర్ . అంబే డ్కర్ 125వ జయంత్యుత్సవం సందర్భంగా తెలుగు రక్షణ వేదిక కవితాంజలి సమర్పి స్తోంది. పొట్ల్లూరి హరికృష్ణ ఆధ్వర్యంలో ‘అంబేద్కరీయం’ పేరుతో ఆ మహనీ యుడిపై కవితా సంకలనం తీసుకురాదలి చాము. అంబేద్కర్ భావజాలం, ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలను ఆవిష్కరిస్తూ కవిత లను పంపవలసిందిగా కవులను ఆహ్వా నిస్తున్నాము. మీ కవితలు 12 నుంచి 27 పంక్తులకు మించరాదు. కవిత స్వంతమేనని హామీపత్రం జతచేసి పంపాలి. కవితలను telugupaluku@yahoo.com కి 1-5-2016 లోగా పంపగలరు. అందరికీ ఆహ్వానం. సంపాదకవర్గం: డాక్టర్ కత్తిమండ ప్రతాప్ (90003 43095), జాబిలి జయచంద్ర, అనిల్ డ్యాని, బొడ్డు మహేందర్ పొట్లూరి హరికృష్ణ జాతీయ అధ్యక్షులు, తెలుగు రక్షణ వేదిక -
'అలా చెప్పడం చంద్రబాబు మోసం చేయడమే'
విశాఖ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి పొరుగు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం మోసం చేయడమే అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ...' రాష్ట్ర విభజన పొరుగు రాష్ట్రాలను అడిగి చేశారా?... పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేసి అమలు చేయకపోవడం ప్రజలను దగా చేయడమే. ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీల్లో స్పష్టత లేదు. జిల్లాకు రూ.50 కోట్లు ముష్టిగా పడేశారు, రైల్వే జోన్‌కు నిధులు ఇవ్వలేదు. చిత్తుశుద్ధి ఉంటే కేంద్రంలో ఉన్న టీడీపీ మంత్రులు రాజీనామా చేయాలి' అని డిమాండ్ చేశారు. -
ఆద్యంతం అప్రజాస్వామికం
పార్లమెంట్లో ఏం జరిగింది -14 (ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదం పొందిన 20.02.2014 నాడు రాజ్యసభ కార్యక్రమాల వివరాలివి. ఆరోజు చిరంజీవి చేసిన ప్రసంగంలోని తదుపరి భాగం.) చిరంజీవి: కానీ జరుగుతున్న విధానం, రాష్ట్రాన్ని విడదీస్తున్న పద్ధతి - చాలా దురదృష్టకరం. తొందరపాటుతో వ్యవహరిస్తూ గబగబా నిర్ణయాలు తీసుకోవటం వల్ల, ప్రజల్లో కోపం, వ్యతిరేకత, బాధ కలుగుతున్నాయి. శ్రీకృష్ణకమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసినా, దానిమీద చర్చేలేదు. శ్రీకృష్ణ రిపోర్ట్‌లో రాష్ట్రం ఒకటిగా ఉండటమే అత్యుత్తమ పరిష్కారంగా సూచించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఒకటిగానే ఉంటుందని అందరూ ఊహించారు. కాని తర్వాత, బీజేపీ, టీఆర్ఎస్లు ప్రత్యేక తెలంగాణ కోసం ఒత్తిడి పెంచారు. టీడీపీ, వైఎస్సార్సీపీలు వేర్వేరు పాదయాత్రల్లో, మీటింగుల్లో ప్రభుత్వమే తెలంగాణను ఆలస్యం చేస్తోందంటూ ప్రజల్ని రెచ్చగొట్టారు. కొందరు ఆ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు. అకస్మాత్తుగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విభజన నిర్ణయం ప్రకటించింది. అందరం హతాశులైనాం. ఒక్క ముఖ్యమంత్రితో తప్ప, ఇతర మంత్రులతో గాని, ఎంపీలతో గాని చర్చించలేదు. కేబినెట్ ముందు టేబుల్ అయిటం చేయటం కూడా చాలా బాధాకరం. ఆఖరుగా, ఆంటోనీ కమిటీ. ఆ కమిటీ ఏర్పాటు చేయగానే, అందరి అభిప్రాయాలూ తీసుకుంటారని ఆశించాం. అదీ జరగలేదు. ‘గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్’ ఏర్పాటు చేసినప్పుడూ, ప్రజల ఆకాంక్షలు పరిగణనలోకి తీసుకుంటారని ఆశించాం. అది కూడా జరగలేదు. ఏ ఒక్కరికీ సంతృప్తి కలిగించలేదు. ఏది ఏమైనా, కాంగ్రెస్ పార్టీనొక్కదానికే బాధ్యుల్ని చేయటం అసమంజసం. ఈ నిర్ణయం తీసుకున్న చివరి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విషయం ఈ సభ జ్ఞాపకం చేసుకోవాలి. ఆఖరుగా కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు, బీజేపీ ఎప్పుడూ తెలంగాణ ఇస్తామని చెప్పినా, ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం దాటవేసి మాట తప్పింది. ఇది సత్యం. రికార్డయిన నిజం. రెండ్రోజుల క్రితం లోక్‌సభలో తెలంగాణకు మద్దతిచ్చిన బీజేపీ, ఇక్కడ రాజ్యసభలో సవరణలు ప్రతిపాదించి అడ్డుకుంటోంది. ఎంఐఎం, సీపీఐ(ఎం) పార్టీలు తప్ప, టీడీపీ, వైఎస్సార్సీపీ, సీపీఐ మొత్తం అన్ని పార్టీలూ ఈ స్థితికి బాధ్యత వహించక తప్పదు. టీడీపీ మద్దతుగా ఉత్తరం ఇచ్చింది. ఇప్పుడు సగం మంది ఎంపీలు వ్యతిరేకిస్తుంటే సగం మంది మద్దతిస్తున్నారు. వైఎస్సార్సీపీ మరో అడుగు ముందుకేసి ఆర్టికల్-3 ఉపయోగించి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయమన్నారు. వారు అనేక వేదికల మీద ఈ విషయం చెప్పారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ వారు రాజకీయ ప్రయోజనాల కోసం యు టర్న్ తీసుకున్నారు. ‘సమన్యాయం’ అనే బదులు టీడీపీ వారు సీమాంధ్ర కోసం ఏమి చేయాలో అడిగితే బాగుంటుంది. కాని వారు అలా చెయ్యలేదు. సీమాంధ్ర ప్రాంతానికి వారు అందరికంటే ఎక్కువ నష్టం చేశారు. మీరు టీడీపీ అగ్రనాయకుణ్ణి అడగండి. ఆయనకే స్పష్టతలేదు. ‘సమన్యాయం’ అంటే ఏమిటి? అదేమిటో స్పష్టత లేదు. ఇప్పుడు బీజేపీ సవరణలు ప్రతిపాదిస్తోంది. నేను కూడా కొన్ని ‘ఎమెండ్మెంట్స్’ ప్రతిపాదిస్తున్నాను. టీడీపీ ‘సుప్రిమో’కు సమన్యాయమేమిటో తెలియదు. వాళ్లేం కోరుకుంటున్నారో చెప్పాలిగదా! మొదట్లో సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకటించినప్పుడు ఆయన ఏం చెప్పారు. ‘రాజధానికి నాలుగు లక్షల కోట్లు ఇవ్వాలి’ అన్నారు. ఇప్పుడు ముందుకు వచ్చి చెప్పమనండి, ఎన్నివేల కోట్లు అవసరమో.. ఆయన సంప్రదింపుల్లో పాల్గొనక పోయివుంటే రాజధానికి 4 లక్షల కోట్లు అని ఎలా అనగలిగారు? ఇదే పత్రికల్లో వచ్చింది. మీ నాయకుణ్ణి అడగండి అన్నారో లేదో.. ఈ పార్టీలు అవలంబించిన అవకాశవాద వైఖరుల వల్లే ఈ పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి నిర్ణయం వారే తీసుకోవాలి. నిర్ణయించే వరకూ ఒత్తిడి చేసి నిర్ణయించాక కాంగ్రెస్‌ని మాత్రమే తప్పుబట్టడం సరికాదు. ప్రతిపార్టీ, ప్రతి ఒక్కరూ ఇందుకు బాధ్యులే! ఆఖరికి బాధపడేది మాత్రం పార్టీలు గాదు తెలుగు ప్రజలే!! ఆఖరికి నష్టపోయింది తెలుగు ప్రజలే. సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకటించిన రోజు నుంచీ నేను హైదరాబాద్‌ను యూటీ చెయ్యమని అడుగుతూనే ఉన్నా, హైదరాబాద్ అభివృద్ధికి కారణం తెలుగు ప్రజల సమష్టి కృషి ఫలితమేనన్న విషయం మర్చిపో కూడదు. గత 58 సంవత్సరాల తెలుగు ప్రజల ఉమ్మడి కృషి ఫలితమే హైదరాబాద్. అది జాయింట్ ప్రాపర్టీ. 1972లో వెంకయ్యనాయుడు విద్యార్థిగా ఉన్నప్పుడు, జైఆంధ్ర ఉద్యమంలో ఎవ్వరూ హైదరాబాద్‌లో ఉండాలని కోరుకోలేదు. ఇప్పుడెందుకు కలిసుందామంటున్నారు? ఎందుకంటే, అందరి ప్రయోజనాలూ హైదరాబాద్‌తో ముడిపడి ఉన్నందువల్ల. అందుకే నేను హైదరాబాద్ యూటీ కావాలంటున్నా. గత ముప్పై ఏళ్లలో సీమాంధ్ర ప్రాంతీయుల వల్ల హైదరాబాద్ అభివృద్ధి చెందింది కాబట్టి. అరుణ్ జైట్లీ : పాయింట్ ఆఫ్ ఆర్డర్ మంత్రివర్గ సభ్యుని హోదాలో సభ్యుడు మాట్లాడుతున్నారు. ఒక మంత్రివర్గ సభ్యుడు, ప్రధానమంత్రి సమక్షంలో, ‘‘నా ప్రభుత్వం తెలంగాణకు అనుకూలం నాకు మాత్రం కొన్ని అభ్యంతరాలున్నాయి’’ అని అనవచ్చా. ఆయన ఎవరి తరఫున మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ తరఫునా? మంత్రివర్గం తరఫునా? మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక మంత్రి మాట్లాడవచ్చా? ఆయన గుండెఘోష చెప్పాలనుకుంటే, ముందు మంత్రి పదవికి రిజైన్ చెయ్యాలి. అది వదిలేసి విలువలు, మాట మీద నిలబడటం అంటూ చదువుతున్నారు. ఆయన తెలంగాణను వ్యతిరేకిస్తున్నారు. కానీ తెలంగాణని సమర్థిస్తున్న మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. ఆయన దృష్టిలో మాట మీద నిలబడటం అంటే అదేనేమో. మేము తెలంగాణకు అనుకూలం. పూర్వమూ ఇప్పుడూ కూడా! మేము ఎందుకు సవరణలు అడుగుతున్నామంటే, ప్రభుత్వం ప్రతిపాదించినట్లు లోపాలతో కూడిన తెలంగాణా ఆపటం కోసం. రాజ్యాంగబద్ధమైన తెలంగాణ ఏర్పాటు కోసం. అదీ మా పాయింట్. సార్, ఒక మంత్రి, మంత్రిమండలి ఉమ్మడి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ సభలో మాట్లాడవచ్చా.. మీ ఆదేశం/ నిర్ణయం కోరుతున్నాను. ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు a_vundavalli@yahoo.com -
'విభజన విషయంలో హడావుడి తగదు'
పార్లమెంట్లో ఏం జరిగింది-13 ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదం పొందిన 20-02-2014 నాటి రాజ్యసభ సమావేశ వివరాల కొనసాగింపు... వెంకయ్యనాయుడు:సార్, తొందర పెట్టకండి. నా బాధ అర్థం చేసుకోండి. నేను ఆ రాష్ట్రంలో పుట్టాను. అక్కడ ఎమ్మెల్యేని! అక్కడ ఒక పార్టీ కార్యకర్తని. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో వేలాది మంది కార్యకర్తల్ని అభివృద్ధి చేశాను. సీమాంధ్ర ప్రాంతం వాళ్లు దోపిడీదారులని కొందరు నినాదాలు చేస్తున్నారు. ఎవరు దొంగలు ఎవరు మోసగాళ్లు - జనం తేలుస్తారు. నా పాయింట్ ఏమిటంటే, (హిందీలో) ఈ తొందరపాటు కుదరదు. హైద్రాబాద్ ఈ దేశంలోనే ఒక ముఖ్యమైన నగరం. ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఇక ముందు కూడా అందరికీ హైద్రాబాద్‌లో నివసించే అధికారముంది. ఆ అధికారాన్ని నిలబెట్టి ఉంచటం కోసం మేము అన్నివేళలా కృషి చేస్తూనే ఉంటాం. అలా చేసేవాళ్లని భారతీయ జనతాపార్టీ సమర్థిస్తూనే ఉంటుంది. సార్, చివరగా నేను ప్రభుత్వానికి చెప్తున్నా.. అన్ని రాజకీయ పార్టీలనూ పిలవండి. అందరితో మాట్లాడి సీమాంధ్రకు న్యాయం చెయ్యండి. డిప్యూటీ చైర్మన్: అలాగే వెంకయ్యాజీ! ఇప్పుడు చిరంజీవి గారికి ముందు సీతారాం ఏచూరి గారు రెండు నిమిషాలు.... వెంకయ్యనాయుడు: ఇది ఇంత హడావుడిగా చేయకండి... మీరు వెళ్లిపోయే సమయం వచ్చేసింది. (అధికార పార్టీ సభ్యులను ఉద్దేశించి) డిప్యూటీ చైర్మన్: మీది అయిపోయింది. ఓకే, ఏచూరీ, రెండు నిమిషాల్లో మీరు చెప్పాలనుకున్నది చెప్పండి. వెంకయ్యనాయుడు: (తెలుగులో) సార్! మేము అధికారం లోకి వస్తున్నాం. ఈ సవాళ్లన్నీ మేము స్వీకరిస్తాం. మేము అడుగుతున్నవన్నీ నెరవేర్చవలసిన బాధ్యత మాపై కూడా ఉంది. అందుకే వారినడుగుతున్నా. నిజమైన ఇబ్బందులని పరిగణనలోనికి తీసుకోండి. మాటలతో సరిపోదు. కేబినెట్ తీర్మానం కావాలి. ప్లానింగ్ కమిషన్ ఆమోదం కావాలి. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రాజకీయాలు నడపటం మానాలి. అధికార పార్టీకి ఇది నా విజ్ఞప్తి. ఈ చరిత్రాత్మక బిల్లు పై చర్చ జరిగే సమయంలో చైర్మన్‌గారు ఉంటారని ఆశించాను.... అంతరాయం. వెంకయ్యనాయుడు: అన్ని పార్టీలకు సమాన అవకాశం ఇవ్వండి. మాకు భయం లేదు. ఆరోగ్యకరమైన చర్చ జరిగిన తరువాత మేమిచ్చిన మూడు నాలుగు సవరణలను పరిగణనలోనికి తీసుకోండి. ప్రభుత్వం కలిసొస్తే సరే... లేకపోతే మా సవరణల విషయమై మేము ఒత్తిడి చేస్తాం. నేను మా ప్రతిపక్ష నాయకుడు లేవనెత్తే చట్టపరమైన విషయాలనూ సవరణలనూ వినాలను కుంటున్నాం. జై తెలంగాణ, జై సీమాంధ్ర. భారత్ మాతాకీ జై. డిప్యూటీ చైర్మన్: చిరంజీవి గారిని పిలిచే ముందు ఏచూరి గారి వివరణ కోసం- రెండు నిమిషాలు. సీతారాం ఏచూరి: సార్! శ్రీ వెంకయ్యనాయుడు మా పార్టీ మీద ఒక ఆరోపణ చేశారు. అది తప్పు. సీపీఐ(ఎం) ఒకే ఒక జాతీయ పార్టీ- నిరంతరమూ ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకించిన పార్టీ. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును మేము సమర్థిస్తున్నాం. కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నాయి. దీనిని మేము ఒప్పుకోం. మా మీద చేసిన ఆరోపణను మేము ఖండిస్తున్నాం. మా పాయింట్ మాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన ప్పుడు చెప్తాం. కానీ మాపై చేసిన ఈ ఆరోపణను రికార్డుల నుంచి తొలగించాలి. ఎందుకంటే ఇది తప్పుడు స్టేట్మెంట్. వక్రీకరించిన మాటలు. తెలుగు ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా; ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్, బీజేపీలు ఏకమై విడదీస్తున్నాయి. ఇది రికార్డులలోకి ఎక్కాలి. కాంగ్రెస్, బీజేపీలు కలసి చేస్తున్న ఈ విభజనకు వారే బాధ్యత వహించాలి. దురదృష్టవశాత్తు రాష్ట్రం విడదీస్తున్నారు. ప్రజల్ని ఇక్కట్ల పాల్జేస్తున్నారు. మేము సమైక్య ఆంధ్రప్రదేశ్‌కే కట్టుబడి ఉన్నాం. భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజనకు మేం అంగీకరించం! డిప్యూటీ చైర్మన్: థాంక్యూ ఏచూరి.. శ్రీ చిరంజీవి.... చిరంజీవి (టూరిజం మంత్రి): డిప్యూటీ చైర్మన్ గారికి కృతజ్ఞతలు. ఈ రోజు నేను చాలా బాధతో మాట్లాడుతున్నాను. నా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నేను మాట్లాడడం, ఒక కాంగ్రెస్ వాదిగా చాలా బాధాకరం. ఇలాంటి సున్నితమైన విషయంలో నా పార్టీ నిర్ణయంతో నేను విభేదించడం నాకు చాలా కష్టం కలిగించే అంశం. ఇది ఈ సభలో నా మొట్టమొదటి ఉపన్యాసం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మాట్లాడుతుంటే విని తీరాలన్నది రూల్. నేనీవేళ తెలుగువారి తరఫున మాట్లాడతాను. ఏ ప్రాంతం వారి తరఫునా కాదు. ఎందుకంటే అన్ని ప్రాంతాల ప్రజల ప్రేమ అభిమానాల వల్లే నేనీ స్థితికి చేరుకున్నాను. కొన్ని రోజులుగా పార్లమెంటులో బాధాకరమైన స్థితి నెలకొని ఉంది. 11 కోట్ల మంది తెలుగు ప్రజల గుండెలు పగిలిన జీవితాల గురించి ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. కోట్లాది తెలుగు ప్రజలు అక్రమంగా తమ హక్కులు కోల్పోతున్నారు. నేను కాంగ్రెస్‌లో చేరగానే, మీడియా అడిగిన ప్రశ్న తెలంగాణ గురించే.. ఒక సమైక్యవాదిగా నా వ్యక్తిగత అభిప్రాయాలు మారలేదని చెప్పాను. నేనొక పార్టీ సభ్యుడిని కాబట్టి, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పాను. వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు: ఉండవల్లి అరణ్ కుమార్ ఈ మెయిల్: a_vundavalli@yahoo.com -
అన్నదమ్ముల బంధం చెడపకండి
పార్లమెంట్లో ఏం జరిగింది- 12 ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదం పొందిన 20-02-2014 నాటి రాజ్యసభ సమావేశ వివరాల కొనసాగింపు. వెంకయ్య నాయుడు: గాలేరు-నగరి, హంద్రీ-నీవా, తెలుగుగంగ, వెలుగొండ ప్రాజె క్టులు సీమాంధ్రకు, నెట్టెంపాడు తెలంగాణకు అత్యావ శ్యకం. ఈ బిల్లులో ఆ ఆరు/ఏడు ప్రాజెక్టుల విషయం, ప్రధానంగా కేటాయిం పులు జరపాలి. సీమాంధ్ర, తెలంగాణ ప్రాం తాలు రెండూ కట్టు బడేలా, భవిష్యత్‌లో తగా దాలు రాకుండా వుండేలా చెయ్యాలి. కృష్ణా జలాల విషయమై అన్న దమ్ముల్లాంటి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల మధ్య గొడవలు రాకుండా ఒక యంత్రాంగాన్ని తయారు చెయ్యాలి. మళ్లీ వెనక్కి వస్తే బీహెచ్ఈఎల్, హెచ్ఏఎల్, హెచ్‌సీఎల్, డిఫెన్స్ సంస్థలూ, దాదాపుగా అన్నీ హైద్రాబాద్‌లోనే వున్నాయి. ప్లానింగ్ కమిషన్ వారు, సీమాంధ్ర ప్రాంతంలో కూడా కొన్ని పబ్లిక్ సెక్టార్ సంస్థలు నెలకొల్పేలా ప్రభుత్వంతో చర్చించి పథకాల రూపకల్పన చెయ్యాలి. తెలంగాణలో కూడా ఉత్తర తెలంగాణ అంతే వెనకబడి ఉంది. ఆ ప్రాంతాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. హైద్రాబాద్‌లో వున్న రైల్వేజోన్ తెలంగాణ ప్రాంత అవసరాలు తీరుస్తుంది. మేము సీమాంధ్ర- విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ ప్రాంతాలను కలిపి కొత్త రైల్వే జోన్ కోరుకుంటున్నాం. సార్! ఇక ఇతర విషయాల్లోకి వస్తే, సరైన వాతావరణం ఏర్పడాలి. దురదృష్టవశాత్తూ భారత ప్రభుత్వం ఆ విషయమే పట్టించుకోవటం లేదు. మొదటి సంవత్సరం సీమాంధ్రకు ఏర్పడబోయే ఆర్థిక లోటును భర్తీ చేయటానికి భారత ప్రభుత్వం రూ. 10,000 కోట్లు కేటాయించాలి. వాళ్లు ఈ విషయాన్ని ఫైనాన్స్ క మిషన్‌కు పంపించి, ఫైనాన్స్ కమిషన్ వారు రిపోర్టు పంపించేంత లోపుగా రాష్ట్రం ఇబ్బందులు పడకూడదు. అందువల్ల ప్రధాన మంత్రి రూ. 10,000 కోట్ల మొత్తాన్ని ఉదారంగా సీమాంధ్రకు ప్రకటించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా హిమా చల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల బాటలో ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోని వెనకబడిన ప్రాంతాలకు కూడా పన్ను రాయితీలు, కేంద్ర సబ్సిడీలు ప్రకటించాల్సిందిగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్‌కు బంగారుగని వంటిది, యావత్ భారతదేశంలోనే అత్యధిక అభివృద్ధి చెందిన ప్రాంతమైన హైద్రాబాద్‌ను కోల్పోతున్న సీమాంధ్ర ప్రాంతానికి సరైన నష్టపరిహారం అందాలి. సీమాంధ్రకు ‘స్పెషల్ కేటగిరి స్టేటస్‘ ప్రకటిస్తే మాక్కూడా ఏదో జరుగుతుందనే నమ్మకం వారికి కలుగుతుంది. ఇక పరిస్థితుల్లోకి వస్తే, నేను అన్ని పార్టీలకూ మనవి చేస్తున్నా. ఇది ఇద్దరు అన్నదమ్ముల మధ్య విభజనకు సంబంధించిన ‘ఇమోషనల్’ అంశం. ఇద్దరూ తెలుగువారే- తెలంగాణకు చెందిన మిత్రులు, సీమాంధ్రకు చెందిన మిత్రులు - మనమందరమూ కలిసే వున్నాం. మనం ఒకే భాష మాట్లాడతాం. ‘‘అనేక భాషలు, వేషాలున్నా మన దేశం ఒకటే’’ (హిందీ) ‘‘భిన్నత్వంలో ఏకత్వం భారత్ యొక్క ఔన్నత్యం’’. కులం, జాతి, లింగ, ప్రాంత, మత వైరుధ్యాలకతీతంగా ఇండియా ఒక్కటే. మనమంతా ఒక దేశం. మనం దేశాన్ని విభజించటం లేదు. పరి పాలన సౌలభ్యం కోసం, త్వరితగతిన అభివృద్ధి కోసం ఒక రాష్ట్రాన్ని మాత్రమే విభజిస్తున్నాం. ఇది మనం మనసులో పెట్టుకోవాలి. ఇంతకు ముందు అనేక రాష్ట్రాల విభజన జరిగింది. అది మనసులో పెట్టుకుని, అనవసరమైన ప్రాంతీయ విద్వేషాలను పెరగనీయకూడదు. నేను రికార్డుని తేటతెల్లం చేయదలిచాను. దాదాపు అన్ని పార్టీలూ సీపీఐ (ఎం)తో సహా, ఎప్పుడో ఒకప్పుడు, రాష్ట్ర విభజనకు అంగీకారం తెలిపాయి. సీతారాం ఏచూరి: అది తప్పు. వెంకయ్యనాయుడు: అవును. ఆ విషయానికొస్తా. సీపీఐ(ఎం) వారు సమైక్య రాష్ట్రాన్నే మేము బలపరుస్తాం - అన్నారు. అయినా మీరు విభజిస్తామంటే మేము అడ్డం రాము అన్నారు. వైఎయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ‘‘ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్ర విభ జన కేంద్రం చేతుల్లో వుంది. మీరు చెయ్యాలంటే చెయ్యండి’’ అన్నారు. తెలుగుదేశం వారు ‘‘విభజన కావాలి కానీ ఇరు ప్రాంతాలకీ న్యాయం జరగాలి’’ అన్నారు. నేను కూడా అది ఒప్పుకుంటాను. ఈ విష యంలో నిజంగా నేరం చేసింది కాంగ్రెస్ పార్టీ. చూడండి నా మిత్రుడు చిరంజీవి నిలబడి ఉన్నారు. ఎందుకు? తన ప్రాంతానికి న్యాయం చేయ లేకపోతున్నారు... తన నియోజకవర్గానికి సమాధానం చెప్పుకోలేరు... అందువల్ల. ఈ అంకంలో ప్రధాన ప్రతినాయకుడు కాంగ్రెస్ పార్టీయే. 2004లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయి. సోనియా గాంధీ, టీఆర్ఎస్ నాయకుడూ వేదిక పంచుకున్నారు. 2004 నుంచి 14 వరకూ పదేళ్లు, ఏం చేశారని కాంగ్రెస్ నాయకత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకు నిద్రపోయారని అడుగుతున్నా. ఇదే విభజన రెండేళ్ల క్రితమే మామూలుగా జరిగుంటే, ఈ స్థాయి పరిస్థితులు ఎదురయ్యేవి కావు. దురదృష్టవశాత్తూ, ఎన్నికల సందర్భంగా మీరీ పని చేస్తున్నారు. ఇంకో 45 రోజుల్లో, ఎన్నికల నామినేషన్లు ప్రారంభమవుతున్నాయి. సహజంగానే, ప్రతి ఒక్కరూ తమ నియోజకవర్గ విషయమై ఆందోళనలో ఉన్నారు. కాంగ్రెస్, టీడీపీ వారు, మంత్రులూ అందరికీ అదే ఆందోళన. అందుకే బాధ్యత లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, అందర్నీ ఒప్పించి కలుపుకుపోయే విధంగా ప్రవర్తించవలసిన మంత్రి, బీజేపీ ద్వంద్వవైఖరి అవలంబిస్తోందంటూ ఆరోపిస్తారు! ఈ దేశంలో మాటకు కట్టుబడే జాతీయ పార్టీ బీజేపీ మాత్రమే. మేము తెలంగాణకు కట్టుబడి ఉన్నాం. సీమాంధ్ర అభివృద్ధికీ కట్టుబడి వున్నాం. సార్! కాంగ్రెస్సే ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. నిన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మీ ముఖ్యమంత్రి. ఆయన మీ నిర్ణయానికి వ్యతిరేకం. ప్రధాని ప్రతిపాదిస్తారు. ముఖ్యమంత్రి వ్యతిరేకి స్తారు. దీన్నేమంటారో కాంగ్రెస్ వివరించగలదా... మీ ప్రతిపాదన మీ సీఎం వ్యతిరేకిస్తారు. మీ పార్టీ తీర్మానాన్ని అసెంబ్లీలో ఓడిస్తారు. మీ సభ్యులు ‘వెల్’లోకి వస్తారు. మీ మంత్రులకి వారి భవిష్యత్ మీద చింత... వారూ ‘వెల్’లోకి వస్తారు. మీరు మాత్రం బీజేపీ మీద ఆరోపణలు చేస్తారు. ఎంత ధైర్యం. సార్, మా పార్టీ తెలంగాణ, సీమాంధ్రలలో ఒకేమాట మీదున్నాం. తెలంగాణ ఏర్పడాలి. సీమాంధ్రకు న్యాయం జరగాలి. అదే మా మాట. సార్- మమ్మల్ని రెచ్చగొట్టినా, మా ఆఫీసుల మీద దాడులు చేసినా మేము లెక్క చెయ్యలేదు. మేము మా ప్రిన్సిపుల్ మీదే నిలబడ్డాం. శాంతి యుతమైన సోదరభావంతో కూడుకున్న విభజన కోరుకున్నాం. సీమాంధ్ర ఇబ్బందుల్ని పరిష్కరించాలని కోరుకుంటున్నాం. (తెలుగులో) తెలంగాణ సీమాంధ్ర బిడ్డలు శాంతియుతంగా కలిసి జీవించాలని కోరుకుం టున్నాను. డిప్యూటీ చైర్మన్: థాంక్యూ వెంకయ్యజీ, థాంక్యూ. వెంకయ్యనాయుడు: నేను కోరుకునేది శాంతి, సోదరభావంతో కూడిన విభజన. సమంజసమైన విభజన, మా నాయకుడు నరేంద్రమోదీ హైద్రాబాద్‌లో ఇటీవల జరిగిన మీటింగ్‌లో జై తెలంగాణ! జై సీమాంధ్ర అన్నారు. తెలంగాణ ప్రజలంతా కేరింతలు కొట్టారు. అలా ఉండాలి నాయ కత్వమంటే, ఈ దేశంలోనే అతి ఉన్నతమైన నాయకుడు లాల్ కృష్ణ అద్వా నీగారు, మా బీజేపీ నేత, ఈ విభజన ప్రజాస్వామ్యయుతంగా, శాంతియు తంగా జరగాలని కోరుకున్నారు- ఉన్మాద పద్ధతిలో కాదు! విషయం తిన్నగా చెప్తున్నా, మా పార్టీది ఒకేగళం. న్యాయం అడగటంలో తప్పులేదు. - ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు a_vundavalli@yahoo.com -
అభిప్రాయాలూ చెప్పనివ్వరా?
పార్లమెంట్లో ఏం జరిగింది -10 ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదం పొందిన తర్వాత 20. 2.2014 నాటి రాజ్యసభ సమావేశ వివరాలు ఇక చూద్దాం. రాజ్యసభ 20-2-2014వ తేదీన 3.08 నిమిషాలకు తిరిగి ప్రారంభమయ్యింది. డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ అధ్యక్ష స్థానంలో ఉన్నారు డిప్యూటీ చైర్మన్: గౌ॥సభ్యులారా, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు 2014 తీసుకోబడుతోంది. శ్రీ అరుణ్‌జైట్లీ- ప్రతిపక్ష నాయకులు, శ్రీ నరేష్ గుజ్రాల్, శ్రీరాజీవ్ చంద్ర శేఖర్, శ్రీ అనిల్ దేశాయ్, శ్రీ దీపక్ ఒబెరాన్, శ్రీ వై.ఎస్.చౌదరి. ... అంతరాయం ... దయచేసి వినండి. ఈ గౌ॥సభ్యులంతా బిల్లు యొక్క రాజ్యాంగ బద్ధతను ప్రశ్నిస్తూ నోటీసులిచ్చారు. మంత్రిగారు బిల్లును సభలో ప్రవేశపెట్టిన తర్వాత, ప్రతిపక్ష నాయకునికి ఈ బిల్లు రాజ్యాంగ బద్ధతను ప్రశ్నిస్తూ, వ్యతిరేకంగా మాట్లాడే అవకాశమిస్తాను. ... అంతరాయం ... నోటీసులిచ్చిన ఇతర సభ్యులకీ అవకాశమిస్తాను. దయచేసి వినండి.. ప్లీజ్ వినండి.. ప్లీజ్ వినండి.. అందుకే ప్రతిపక్ష నాయకునికి అవకాశం.. ప్లీజ్ వినండి. హోంమంత్రి షిండే: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చేయుట, తత్సంబంధిత విషయాలు, లోక్‌సభలో పాసైన విధంగా, ఆమోదం కోరుతూ ఈ సభ ముందుంచు తున్నాను. నా ఉపన్యాసం కాపీని ‘టేబుల్’ చేస్తున్నాను. లోక్‌సభలో చేసిన ఉపన్యాసాన్ని వ్రాసుకొచ్చి టేబుల్ మీద పెట్టేశారు. అక్కడ చెప్పనివి ఇక్కడ కొత్తగా కలిపిన అంశాలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడవాలి. దానికోసం, పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్‌గా, అన్ని అనుమతులూ పొందేలా నిర్వాసితుల పునరావాసం వంటి కార్యక్రమాలు పూర్తి చేసేలా, బిల్లులో మా ‘కమిట్మెంట్’ పొందుపర్చాం. రాయలసీమకు ఉత్తరాంధ్రలకు స్పెషల్ ప్యాకేజీ ఏర్పాటు చేస్తాం. సీమాంధ్రకు మొన్న లోక్‌సభలో చెప్పినట్లుగా, ఆర్థిక ప్యాకేజీ ఇస్తాం. ప్లానింగ్ కమిషన్‌లో స్పెషల్ సెల్ ఏర్పాటుచేసి, డిప్యూటీ చైర్మన్ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తగు ఆర్థిక సహాయం అందేలా చర్యలు గైకొంటాం (ప్రశ్న ప్రతిపాదించబడింది) డిప్యూటీ చైర్మన్: ప్రతిపక్ష నాయకుడు, రాజ్యాంగబద్ధత గురించి, బిల్లును వ్యతిరేకిస్తామన్నారు. ఆ తర్వాత నా నిర్ణయం చెప్తాను. అరుణ్‌జైట్లీ, శ్రీ అరుణ్‌జైట్లీ. ... అంతరాయం ... సభ వాయిదా పడింది. తిరిగి 3.20 నిమిషాలకు ప్రారంభమయ్యింది. డిప్యూటీ చైర్మన్: గౌరవ సభ్యులారా, ప్రతిపక్ష నాయకుడు రాజ్యాంగబద్ధత గురించి పాయింట్ లేవనెత్తుతున్నారు, వ్యతిరేకించటం లేదు. పొరపాటున నోరుజారి, వ్యతిరేకిస్తున్నారన్నాను. నేనాయనను రాజ్యాంగ అంశం లేవనెత్తటానికే పిలిచాను, వ్యతిరేకించటానికి కాదు. ప్రతిపక్ష నాయకుడిని వినండి. మీకనుకూలంగానే ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతుంటే నిశ్శబ్దంగా వినటం సభ సాంప్రదాయం. దయ చేసి మీ సీట్లకి వెళ్లండి. 3.23కి సభ మళ్లీ వాయిదా పడింది. 3.37కి మళ్లీ సభ ప్రారంభమయ్యింది. అధ్యక్షస్థానంలో శ్రీమతి రేణుకా చౌదరి ఉన్నారు. సభ మళ్లీ వాయిదా పడింది. 4.00కి సభ మళ్లీ ప్రారంభమయ్యింది. రాణి లక్ష్మీబాయి అగ్రికల్చరల్ యూనివర్సిటీ బిల్లు, ఢిల్లీలో రాష్ట్రపతి పాలన బిల్లు తీసుకోబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ రి ఆర్గనైజేషన్ బిల్లు తిరిగి ప్రారంభమయ్యింది. డిప్యూటీ చైర్మన్: ఎవరి స్థానాల్లో వారు కూర్చోండి. మిస్టర్ చౌదరి మీరు అటార్నీ జనరల్‌ను సభకు పిలవాలని ఇచ్చిన ఎమెండ్మెంట్ ప్రతిపాదించవచ్చు. దానికో పద్ధతుంది. ముందు జనరల్ డిస్కషన్ అవ్వాలి. ఆ తర్వాతే సవరణలు.. మీ మీద చర్యలు తీస్కోవల్సివస్తుంది. యేచూరిగారూ మీకేం కావాలి.. (నిరంతర అంతరాయం) యేచూరి: బిల్లు మీద చర్చ జరగాలనే ఏకాభిప్రాయానికొచ్చాం. సభను కంట్రోల్ చెయ్యండి. ఎవరి సీట్లకి వారిని వెళ్లమనండి. డిప్యూటీ చైర్మన్: గౌరవ సభ్యులారా.. అటార్నీ జనరల్ విషయమై సవరణ కూడా సరైన సమయంలో ప్రస్తావించాలి.. ముందు డిస్కషన్ ప్రారంభమవ్వాలి. తరవాత సవరణలు.. రూల్ నేను అతిక్రమించలేను.. శ్రీ వెంకయ్యనాయ్డూ మీరు మాట్లాడతారా.. వెంకయ్య నాయుడు: సభ ‘ఆర్డర్’లో వుంటే మాట్లాడతాను. డిప్యూటీ చైర్మన్: నేనేం చెయ్యను. వెంకయ్య నాయుడు: అధికార సభ్యులే సభను ఆటంకపరుస్తుంటే నేనెలా మాట్లాడగలను. నేను మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. సభ వాతావరణం మార్చండి. సభలో ‘ఆర్డర్’ తీసుకురండి. మీ సభ్యుల్ని ‘వెల్’ లోంచి వెనక్కి పిలిపించి చర్చకు వీలైన వాతావరణం కల్పించవల్సిందిగా పాలక సభ్యులకు విజ్ఞప్తి. డిప్యూటీ చైర్మన్: దయచేసి మీ స్థానాల్లోకి వెళ్లి, అవసరమనుకుంటే బిల్లును వ్యతిరేకించండి. ఓటు వెయ్యండి. ఇది ప్రజాస్వామ్యం - ఇలా చెయ్యకండి. వెంకయ్య నాయుడు: మా బీజేపీ వరకూ, మేమెప్పుడూ డిబేట్, డిస్కషన్ కోరుకుంటున్నాం. మేము కొన్ని సవరణలు కోరతాం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని కోరుకుంటాం. మా పార్టీ, మొదటి రోజు నుండి చెప్తున్నాం. మేము తెలంగాణ ఏర్పాటును సమర్థిస్తాం. అలాగే సీమాంధ్ర ప్రయోజనాలను పరిరక్షిస్తాం. దానికోసం, ముందు సభలో ఆర్డర్ తీసుకురావాలి. అలా కాకపోతే, ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసినట్లవుతుంది. డిప్యూటీ చైర్మన్: దయచేసి సీనియర్లు కలగజేసుకుని సభ్యుల్ని వాళ్ల సీట్లకు పంపండి. తప్పు చేస్తున్న సభ్యులకు మనవి - మీ సీట్లలోకి వెళ్లిపోండి. సీతారామ్ యేచూరి: చర్చ జరగాలని, సభ సజావుగా నడవాలని మేమందరమూ కోరుకుంటున్నాం. సభను ఆర్డర్లో పెట్టండి. డిప్యూటీ చైర్మన్: మీ సీట్లకు వెళ్లండి - చట్టబద్ధమో కాదో సభ తేలుస్తుంది - ఏయ్ ఏం చేస్తున్నారు - మిమ్మల్ని సస్పెండ్ చేస్తాను. ఇదిగో మీకే చెప్తున్నా. ఏమిటీ నాన్సెన్స్. డెమోక్రసీని చంపేస్తున్నారు. మీ సీనియర్లు, లీడర్లు చెప్పినట్లు వినరే...! 4.10 నిమిషాలకు సభ వాయిదా పడింది. 4.25కు మళ్లీ ప్రారంభమైంది. డిప్యూటీ చైర్మన్: శ్రీ వెంకయ్యనాయుడూ... వెంకయ్య నాయుడు: శాంతియుతంగా ఈ చర్చ జరగనీయండి. తెలంగాణ సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలను ప్రదర్శితం చేసే అవకాశమివ్వండి. సభలో ‘ఆర్డరు’ తీసుకురండి. ఇది చరిత్రాత్మక చట్టం. దీనిని లోతుగా చర్చించాలి. శాంతియుతంగా అందరూ చర్చలో పాల్గొనే పరిస్థితులు కల్పించమని కోరుతున్నా. డిప్యూటీ చైర్మన్: నాకు సభను క్రమశిక్షణలో పెట్టాలనే వుంది - కానీ ఏం చెయ్యను. వెంకయ్య నాయుడు: అధ్యక్షులే అంత నిస్సహాయస్థితిలో వుంటే, నేను బాధ్యత తీసుకోవాలా, ఏంటి? డిప్యూటీ చైర్మన్: ఏం చెయ్యను, మీరొప్పుకుంటే వీరి మీద చర్య తీసుకుంటా. వెంకయ్య నాయుడు: మీరే అలా నిస్సహాయంగా మాట్లాడితే ఎలా? డిప్యూటీ చైర్మన్: వారి మీద చర్య తీసుకుంటా - మీరు సపోర్టు చెయ్యండి. వెంకయ్య నాయుడు: ఇలాగ ఈ సభ నడుస్తుందా? డిప్యూటీ చైర్మన్: మీరు సపోర్టు ఇస్తానంటే, నేను చర్య తీసుకోవటానికి సిద్ధం. వెంకయ్య నాయుడు: రాష్ట్ర పునర్విభజన వంటి చరిత్రాత్మక చట్టం విషయమై నిష్కర్షగా అభిప్రాయాలు చెప్పకపోతే ఎలా? ప్రభుత్వాన్ని సభానాయకుణ్ణి, మీ సభ్యుల్ని అదుపు చేయమని కోరుతున్నా. అధికార పార్టీ సభ్యులే ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్‌లో ఉన్నారు. అధికార పార్టీ పరిస్థితి బాగోలేదని అర్థమవుతోంది. దేశమంతా చూస్తోంది. ‘లైవ్ టెలికాస్ట్’ ఇస్తున్నారని చెప్పారు. (హిందీలో) తెలంగాణ కావాలని 1969లో, ఆంధ్రా కోసం 1972లో వేరు వేరు ఆందోళనలు జరిగాయి. ఆంధ్రాలో బలి దానాలు చేశారు. ఆంధ్రాలో 360-370 మంది బలిదానం చేశారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన అంశం / (ఇంగ్లీష్‌లో) డిప్యూటీ చైర్మన్‌గారూ ఇలా అయితే మాట్లాడటం చాలా కష్టం. డిప్యూటీ చైర్మన్: నాకు వినపడుతోంది. వెంకయ్య నాయుడు: మీకు వినబడితే సరిపోదు. దేశమంతా వినాలి. ఈ సభ వినాలి. సభ్యులు అలా అరుస్తుంటే... డిప్యూటీ చైర్మన్: దేశమంతా సభ్యుల ఈ అనుచిత ప్రవ ర్తన చూడాలి. వెంకయ్య నాయుడు: (హిందీ) అయ్యా! అలాగైతే ఎలాగండి. సభను ఆర్డర్లో పెట్టండి. మేము బిల్లును సమర్థిస్తున్నాం. కాని మా అభిప్రాయాలు, సమస్యలు, సభ ముందు పెట్టనివ్వండి. వాటికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కానీ ఇలాగైతే కష్టం. అందుకే నేను మిమ్మల్ని, ప్రభుత్వాన్ని కోరుతున్నా సభలో సాధారణ స్థితి వుంటేనే నేను మాట్లాడగలను. డిప్యూటీ చైర్మన్: మాట్లాడండి వెంకయ్య నాయుడుగారు, నాకు వినబడుతోంది. సభ్యులు వింటున్నారు. మాట్లాడండి. వెంకయ్య నాయుడు: (హిందీ) ఉపసభాపతిగారూ! తెలంగాణ ఆంధ్రా ఇద్దరూ అన్నదమ్ములు. కాని ఇప్పుడు ఇద్దరూ కలిసి ఉండే పరిస్థితే లేదు. ఈ విషయమై వేరు వేరు పార్టీలు తమ తమ అభిప్రాయాలు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశాయి. (వెంకయ్య నాయుడు మాట్లాడుతుండగా సభ 4.30 నిమిషాలకు వాయిదా పడింది.) -ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు -
ఇంత అఘాయిత్యమా?
పార్లమెంట్లో ఏం జరిగింది -9 ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదం పొందిన 18.02.14 నాటి లోక్‌సభ సమావేశ వివరాల కొనసాగింపు... క్లాజ్ 49 స్పీకర్: శ్రీ అసదుద్దీన్ ఒవైసీ, మీ 48వ సవరణ, క్లాజ్ 49కి సంబంధించి, ప్రతిపాదిస్తున్నారా? ఒవైసీ: పేజీ 12లో 11-29 వరకు లైన్లు సవరించ ప్రార్థన. (ఆ లైన్లలో ఏముందో ఏమని సవరించాలో ఇచ్చిన వాక్యాలు 16 లైన్లు ఉన్నాయి. దీని తర్వాత ఒవైసీ క్లుప్తంగా సవరణ ఉద్దేశం వివరించారు. అందుకని ఈ 16 లైన్లు ఇక్కడ అనువదించి మీకందివ్వటం లేదు. క్లుప్తంగా నన్ను వివరించనివ్వండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడకముందు హైద్రాబాద్ రాష్ట్రముండేది. హైద్రాబాద్ హవుస్ అనే 8.79 ఎకరాలలో ఉన్న అత్యద్భుతమైన భవనాన్ని భారత ప్రభుత్వం తీసుకుంది. ఈ హవుస్ తీసు కున్నందుకు ప్రత్యామ్నాయంగా హైద్రాబాద్ రాష్ట్రానికి 19 ఎకరాల భూమినిచ్చింది. ఇప్పటి ఈ బిల్లు ప్రకారం - ఏపీ భవన్, పక్కనున్న బహామ్ హవుస్ ఆంధ్రప్రదేశ్‌కు చెందు తాయి. ఇది తెలంగాణకు చేస్తున్న అన్యాయం కాదా? తెలం గాణా గొంతుకలు ఏమైపోయాయి? తెలంగాణ కోసం ప్రాణాలు కోల్పోయిన వారికి, మీరిక్కడ నోరెత్తకుండా, తీవ్ర మైన అన్యాయం చేస్తున్నారు. కొంత మంది ముఖ్యమం త్రులవుదామనుకుంటున్న కాంగ్రెస్ వారు తెలంగాణా ఆస్తుల్ని ముక్కలు ముక్కలు చేస్తున్నారు. స్పీకర్: శ్రీ అసదుద్దీన్ ఒవైసీ 48వ సవరణ ఓటింగ్ కోరుతూ సభ ముందుంచుతున్నాను. ఒవైసీ: తలలు లెక్క పెట్టండి. ప్రపంచానికి తెలియాలి. సవరణ వీగిపోయింది. (ఇంక తలలు లెక్కపెట్టడం కూడా మానేశారు. ఇప్పటి దాకా కనీసం ఏవో లెక్క పెడుతున్నట్లు డ్రామా అన్నా చేశారు ఇప్పుడిక పూర్తిగా తెగించేశారు. అసలు లెక్కే పెట్టక పోతే, ఇక రాజ్యాంగానికి, చట్టసభలకీ, ప్రజాస్వామ్యానికీ అర్థముంటుందా?!) స్పీకర్: ది క్వశ్చన్ ఈజ్ క్లాజ్ 49 బిల్లులో భాగమవుతుంది. ప్రతిపాదన ఆమోదించబడింది. క్లాజ్ 49 బిల్లులో భాగమయ్యింది. క్లాజ్ 50 నుండి 54 వరకూ బిల్లులో భాగమయ్యాయి. క్లాజ్ 55 స్పీకర్: శ్రీ అసదుద్దీన్ ఒవైసీ క్లాజ్ 55కి మీ 49, 50 సవరణలు ప్రతిపాదిస్తున్నారా. (ర్రాష్ట్రాల అప్పులు ఏవిధంగా పంచాలి అనే విషయమై ఒవైసీ సవరణలు 12 లైన్లు ఇక్కడ రాయటం లేదు. ఆయన వివరణ చదివితే అర్థమయిపోతుంది.) ఇది చాలా అసమంజసం. జనాభాను బట్టి అప్పులెలా పంచుతారు? ఎక్కడ ఏ ప్రాజెక్టు వుందో దానిని బట్టి ఆ బకాయి ఆ రాష్ట్రానికి చెందాలి. అలా ప్రాజెక్టుల వారీగా అప్పు విడదీసిన తర్వాత, మిగిలిపోయిన రుణం రెండు రాష్ట్రాలకూ సమానంగా పంచాలి. ఈ విభజన చేసే పద్ధతే తప్పు. ఈ రుణాలు, అప్పులు ఎక్కడికెళతాయి? ఎవరు తీర్చాలి? ఇది తెలంగాణాకు అన్యాయం. ప్రభుత్వం ఈ క్లాజుకి ఎలా ఒప్పుకుంటోంది. తలలు లెక్క పెట్టమని మరొక్కసారి కోరుతున్నాను. స్పీకర్: ఒవైసీ గారి సవరణలు ఓటింగ్ నిమిత్తం సభ ముందుంచుతున్నాను. సవరణలు వీగిపోయాయి. ది క్వశ్చన్ ఈజ్. క్లాజ్ 55 బిల్లులో భాగమయ్యింది. క్లాజ్ 56 నుండి 59 వరకు బిల్లుకు కలపబడ్డాయి. (ఇంక తలలు లెక్క పెట్టడం కూడా ఆపేశారు. విసుగు చెందని విక్రమార్కుడి లాగా అసదుద్దీన్ ఒవైసీ మాత్రం సవరణలు ప్రతిపాదిస్తూనే వున్నారు.) క్లాజ్ 60 = పెన్షనర్లు ఏ ప్రాంతానికి చెందిన వారిని, నేటివిటీ బట్టి ఆ రాష్ట్రానికి చెందినవారుగా చూడాలని క్లాజ్ 76 = పదవ షెడ్యూల్లోని సంస్థల సౌకర్యాల విభజన గురించి క్లాజ్ 78 = సర్వీసెస్ ఆప్షన్ల గురించి క్లాజ్ 84 = స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి క్లాజ్ 91 = ప్రాణహిత-చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని షెడ్యూల్ 8 = సింగరేణి కాలరీస్ గురించి షెడ్యూల్ 11 = ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి షెడ్యూల్ 12 = తెలంగాణ విద్యుత్ లోటు గురించి షెడ్యూల్ 13 = ఎన్టీపీసీ గురించి ప్లానింగ్ బోర్డులు, రీజినల్ బోర్డులు, హైద్రాబాద్ త్రాగునీరు, మెగాపవర్ ప్రాజెక్టులు, హైద్రాబాద్ ఓల్డ్ సిటీని వెనకబడ్డ ప్రాంతంగా గుర్తించాలని, వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలలో ఎయిర్‌పోర్టుల నిర్మాణం, ముస్లిం రిజర్వేషన్లు, ఉర్దూను రెండవ అధికార భాష, మైనారిటీల సంక్షేమం, వెనుకబడ్డ వర్గాల వారి లోకల్ బాడీ రిజర్వేషన్లు, వక్ఫ్‌బోర్డు, ఉర్దూ అకాడమీ, షెడ్యూల్ క్యాస్ట్ మరియు ట్రైబ్స్ సబ్‌ప్లాన్, మైనార్టీ సబ్‌ప్లాన్... ఒవైసీ సవరణలన్నీ, కనీసం తలల లెక్క కూడా పెట్టకుండా ‘వీగిపోయాయని’ ప్రకటించేశారు. 3 గంటల 24 నియొషాలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ 4 గంటల 24 నిమిషాలకు సభ వాయిదా పడటంతో ముగిసింది. ప్రొ॥సౌగత్‌రాయ్ అనే బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు, హైద్రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని కూడా సస్పెండ్ చేసేసి వుండుంటే 3 గంటల 36 నిమిషాలకే సభ ముగిసిపోయేది! నిజానికి ‘‘2 నుంచి 109 క్లాజుల వరకూ మొత్తం అన్ని షెడ్యూళ్ళు సభ ముందు ఓటింగ్‌కు ఉంచుతున్నాను - సభ ఆమోదించింది’’ అని స్పీకర్ ప్రకటించటానికి రెండు నిమిషాలు చాలు.. కొన్ని సవరణలు ప్రభుత్వం కూడా ప్రతిపాదించింది కాబట్టి ఇంకో పది నిమిషాలు పట్టి ఉండేది!! ప్రజాస్వామ్య భారతదేశంలో, రాజ్యాంగం ప్రకారం చట్టసభలు ఏర్పాటు చేయబడిన తర్వాత, మొట్టమొదటిసారి, అత్యున్నత సభ అయిన ‘లోక్‌సభ’లో ఇంతటి అఘాయిత్యం జరిగింది. సభలో ఎంతమంది రాష్ట్ర విభజనను సమర్థించారో, ఎందరు వ్యతిరేకించారో కూడా తెలియదు. సభలో ఎంత మంది సభ్యులున్నారు... నిజంగా ఓటింగ్ జరిగితే బిల్లు పాసవుతుందా... 13వ తారీఖున ‘పెప్పర్‌స్ప్రే’ ఘటన ఎందుకు జరిగివుంటుంది. ఆ వివరాలన్నీ విశ్లేషించే ముందు, పెద్దల సభ రాజ్యసభలో ఏం జరిగిందో, ఎవరేం మాట్లాడారో చూద్దాం. 20-2-2015 నాడు రాజ్యసభ ప్రత్యక్ష ప్రసారాలు ఆపించలేదు. కాని గందరగోళంగా ఉన్న సభలో, ఎవరేం మాట్లాడుతున్నారో టీవీలో మనకు సరిగ్గా అర్థం కాలేదు! మాట్లాడుతున్న సభ్యుడి ముందుండే మైకుతో చెవిలో పెట్టుకునే ‘ఇయర్‌ఫోన్’కు వుండే ‘కనెక్షన్’ వల్ల, రిపోర్టర్లకి ఇతర సభ్యులకీ, సభాపతి అనుమతితో మాట్లాడే వారి మాటలు స్పష్టంగా వినబడతాయి. సభాపతి అనుమతి ఇవ్వగానే, ఆ సభ్యుని ముందుండే మైక్ పనిచేయడం ప్రారంభమవుతుంది. ఇక రాజ్యసభ ‘తంతు’ పరిశీలిద్దాం! -ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు a_vundavalli@yahoo.com -
విభజనతో వేర్పాటు ఉద్యమాలు!
పార్లమెంట్లో ఏం జరిగింది -8 విభజన బిల్లు ఆమోదం పొందిన 18.02.2014 నాటి లోక్‌సభ సమావేశాల వివరాలు మరికొన్ని... స్పీకర్ : ది క్వశ్చన్ ఈజ్ క్లాజ్ 8 బిల్లులో భాగమైంది అనుకూలురు ‘ఆయ్’ అనండి. ప్రతికూలురు ‘నో’ అనండి ఆయ్ 169 నో నిల్ ఆమోదించబడింది క్లాజ్ ది బిల్లులో భాగమైంది. ల్రోక్సభలోనూ, రాజ్యసభలోనూ స్పీకర్ ముందు సెక్రటరీ జనరల్, ఇతర ఉద్యోగులూ కూర్చుని ఉంటారు. వారి లో ‘రిపోర్టర్స్’ అనే వారు ఎప్పటికప్పుడు సభలో జరుగుతు న్న ప్రతి విషయాన్ని రికార్డు చేస్తుంటారు. రికార్డు చేసింది చేసినట్లుగా లోక్‌సభ వెబ్సైట్ లో పెట్టేస్తారు. అయితే దాని మీదే ‘అన్ కరెక్టెడ్ వెర్షన్’ ‘నాట్ ఫర్ పబ్లికేషన్’ అని వ్రాసి ఉంటుంది. చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ లాంటివి ఉంటే, కరెక్ట్ చేసి ‘లోక్‌సభ డిబేట్స్’ అనే పేరుతో పుస్తకం పబ్లిష్ చేస్తారు. ఇప్పుడు నేను అనువదిస్తున్నది ఆ పుస్తకంలోంచే! 15.46 నుంచి అన్ కరెక్టెడ్ వెర్షన్లో ఏమని రికార్డయ్యిందో చూడండి సంసుమ కునగర్ బిశ్వమూర్తి స్పీకర్ టేబుల్ దగ్గర నిల్చున్నారు. స్పీకర్ : ఇప్పుడు అనుకూలురందరూ మీ స్థానాల్లో నిలబడండి. వ్యతిరేకులందరూ తమ స్థానాల్లో నిలబడండి. ఆయ్ : 169 నో : నిల్ సవరణ వీగిపోయింది. స్పీకర్ : ది క్వశ్చన్ ఈజ్ క్లాజ్ 8 బిల్లులో భాగమైంది ప్రతిపాదన ఆమోదించబడింది క్లాజ్ 8 బిల్లులో భాగమైంది ్రఅన్ కరెక్టెడ్ రికార్డింగ్‌లో స్పీకర్ సవరణ మీద తలలు లెక్కబెట్టి 169 అనుకూలం 0 వ్యతిరేకం అని ప్రకటించినట్లు రికార్డు అవ్వగా, ప్రింట్ అయిన పుస్తకంలో, ‘బిల్లులో భాగం చేస్తున్నాను ఎందరు అనుకూలం’ అని స్పీకర్ తలలు లెక్కపెట్టినట్లు సరి చేశారు. అన్ రికార్డెడ్ నిజమైతే, 169 మంది సవరణను బలపర్చినట్లు... వీగిపోయినట్లు స్పీకర్ ఎలా ప్రకటిస్తారు? ప్రింట్ అయిన వెర్షన్ కరెక్ట్ అయితే, తలలు కూడా లెక్క పెట్టకుండా ‘స్పీకర్ సవరణ వీగిపోయింది’ అని ప్రకటించేశారు. 367(3) ప్రొవిజో అనుసరించి, స్పీకర్ గనుక అనవసరంగా ‘డివిజన్’ అడుగుతున్నా రని భావిస్తే, ఎందరు అనుకూలమో, ఎందరు వ్యతిరేకమో తలలు లెక్కపెట్టి సభా నిర్ణయాన్ని ప్రకటించవచ్చు! అసలు లెక్కపెట్టకుండా, రూల్స్ లెక్కే చేయకుండా వ్యవహరించే అధికారం స్పీకర్‌కి లేదు. ఇద్దరు సభ్యులు, అంత గొడవ చేసి తలలు లెక్కపెట్టే స్థితికైనా తీసుకొస్తే.. కనీసం వారిద్దరి తలలైనా వ్యతిరేకిస్తున్నట్లు లెక్కపెట్టాలనే ఆలోచన కూడా చేయలేదు స్పీకర్‌గారు స్పీకర్ : క్లాజ్ 9 నుండి 14 వరకూ బిల్లుకు కలపబడ్డాయి. .. అంతరాయం.. క్లాజ్ 15. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి హోంమంత్రి షిండే ప్రతిపాదించిన సవరణ స్పీకర్ : ది క్వశ్చన్ ఈజ్ ‘సవరించబడ్డ క్లాజ్ 15 బిల్లులో భాగమవుతుంది. ప్రతిపాదన ఆమోదించబడింది క్లాజ్ 15 బిల్లులో భాగమైంది క్లాజ్ 16 బిల్లులో భాగమైంది క్లాజ్ 17 షిండే గారు ప్రతిపాదించిన సవరణలతో బిల్లులో భాగమైంది. షిండే గారు ప్రవేశబెట్టిన రూల్ 80(1) ని సస్పెండ్ చేయనున్న సవరణ సభ ఆమోదిం చింది. తద్వారా క్లాజ్ 17(ఏ) ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి ప్రాతినిధ్యం కల్పించబడింది. క్లాజ్ 18, 19, 20 ఆమోదించబడ్డాయి. క్లాజ్ 21, 23, 24, 25, 26, 27 షిండే గారి సవరణలు ఆమోదించబడి బిల్లులలో భాగమయ్యాయి. క్లాజ్ 22, 28, 29, 30, 31 బిల్లులో భాగమయ్యాయి. స్పీకర్ : అసదుద్దీన్ ఒవైసీ, క్లాజ్ 32 కి మీ సవరణ నెం.46 ప్రతిపాదిస్తున్నారా? అసదుద్దీన్ ఒవైసీ : పేజీ 8, 32 నుండి 35వ లైన్లు ఈ విధంగా సవరించ ప్రార్థిస్తున్నాను. 32(1) అప్పాయింటెడ్ రోజు నుంచి తెలంగాణా రాష్ట్రానికి వేరే హైకోర్టు, హైకోర్టు ఆఫ్ హైదరాబాద్‌గా ఉండాలి. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా ఉండాలి. మేడమ్, కారణమేమిటంటే.. ప్రాంతాల వారీగా బార్, బెంచ్ కూడా నిలువునా చీలిపోయి ఉన్నాయి. కొత్త రాష్ట్రానికి సొంత హైకోర్టు కావాలి. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరు స్తున్న ప్రభుత్వం, తెలంగాణ హైకోర్టు ఏర్పాటు చేయకపోవడం దురదృష్టం. పైకిరావాలనే అడ్వొకేట్ల పరిస్థితి ఏమిటి? గవర్నమెంట్ చెయ్యలేదా? ఎగ్జిక్యూటివ్ హైకోర్టు ఏర్పాటు చేయాలి, జ్యుడీషియరీ జడ్జీల నేర్పాటు చెయ్యాలి. ఇది చెయ్యకపోవడం వల్ల ఒక అసంపూర్ణ తెలంగాణ ఏర్పడి దాని ప్రభావం ‘రిట్లు’ వేస్తారు. ప్రతి చిన్న విషయానికీ స్టే ఇచ్చేస్తారు. నా సవరణ అంగీకరించి తెలంగాణ హైకోర్టు ఏర్పాటు చేయటం అన్ని విధాలా శ్రేయస్కరం. స్పీకర్: అసదుద్దీన్ ఒవైసీ గారి సవరణ సభ ముందు ఓటింగ్ కోసం ఉంచుతున్నాను. సవరణ వీగిపోయింది. ది క్వశ్చన్ ఈజ్ = క్లాజ్ 32 బిల్లులో భాగమైంది ప్రతిపాదన ఆమోదించబడింది క్లాజ్ 32 బిల్లులో భాగమైంది. స్పీకర్ : అసదుద్దీన్ ఒవైసీ 33వ క్లాజ్‌కు 47 నెం. సవరణ ప్రతిపాదిస్తున్నారా? ఒవైసీ : పేజీ 9లో 1 నుండి 8 లైన్ల వరకూ సవరించ ప్రార్థన. 1) ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జీలు, రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏర్పడిన రోజు జడ్జీలుగా వ్యవహరించబడతారు. 2) ఆ రకంగా హైదరాబాద్ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జీలైన వారు, చీఫ్ జస్టిస్‌గా అప్పాయింట్ చేయబడినవారు తప్ప, జడ్జీలుగా తమ నియామకాల ప్రాధాన్యత (ప్రియారిటీ) బట్టి ఎప్పాయింటెడ్ రోజు నాటికి, రాంకింగ్ పొందాలి. మేడమ్, ఆంధ్రప్రదేశ్ జడ్జిలు స్థానికతను బట్టి హైకోర్టు ఆఫ్ హైదరాబాద్‌కు కేటాయించబడాలి. హైకోర్టు ఏర్పాటు చేయకుండా, స్థానికత ఆధారంగా జడ్జీలను నియమించకుండా, మీరు తెలంగాణాకు సమతుల్యం చేయలేరు అందుచేత, సమతుల్యం, న్యాయం జరగటానికి నా సవరణ ఆమోదించవలసిందిగా కోరుచున్నాను. నేను తలలు లెక్కపెట్టమని కోరుతున్నాను. ఇంతకు ముందు సవరణకి మీరు తలలు లెక్కపెట్టడం కూడా ఒప్పుకోలేదు. స్పీకర్ : ఒవైసీ గారి క్లాజ్ 33కి 47వ సవరణ, ఓటింగ్ నిమిత్తమై సభ ముందుంచుతున్నాను. సవరణ వీగిపోయింది క్వశ్చన్ ఈజ్ 33 బిల్లులో భాగమైంది ఆమోదించబడింది. క్లాజ్ 34, 36 కూడా బిల్లులో భాగమయ్యాయి. క్లాజ్ 47 = రెవెన్యూ డిస్ట్రిబ్యూషన్ ప్రభుత్వం తరపున షిండేగారు సవరణలు ప్రతిపాదించారు. స్పీకర్ : ప్రొఫెసర్ సౌగత్‌రాయ్, 43వ సవరణ, 47వ క్లాజుకి ప్రతిపాదిస్తున్నారా? ప్రొ॥సౌగత్‌రాయ్ : ఫీజు 11లో 41వ లైన్ ‘‘అదర్ పెరామీటర్స్’’ (ఇతర ప్రామాణికాలు) పదాన్ని తొలగించాలి. నేను సవరణ ప్రతిపాదిస్తున్నాను గానీ ఆంధ్రప్రదేశ్ విభజనకు మాత్రం మేము తీవ్ర వ్యతిరేకులమని మరోసారి మీ దృష్టికి తెస్తున్నాను. ఈ చర్య, వేర్పాటు వాదానికి, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉనికికి ప్రశ్నార్థకంగా మారుతుంది. కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ఈ పనివల్ల తీవ్ర పరిణామాలుంటాయి. రూల్ 367(3) కింద నా సవరణకు ‘డివిజన్’ చేయించవలసిందిగా డిమాండ్ చేస్తున్నాను. 4-00 ఇది పెద్ద విషయం కాదు. కానీ నేను ప్రజాస్వామ్య ప్రామాణికాన్ని ఈ సభలో నిలపాలని ప్రయత్నిస్తున్నాను. మీరు 367(3)ని అతిక్రమించటానికి 367(2)ని వాడలేరు. మీ నిర్ణయం సవాల్ చేయబడితే, లాబీలు ఖాళీ చేయించి ఓటింగ్ జరిపించి తీరాల్సిందే. మేము ఆంధ్రప్రదేశ్ విభజనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీనివల్ల మరిన్ని రాష్ట్రాల వేర్పాటు ఉద్యమాలు ప్రారంభమై అంతర్యుద్ధం వచ్చే దుస్థితి దాపురిస్తుంది. నేను సవరణ ఎందుకు ప్రతిపాదిస్తున్నానంటే, రెవెన్యూ పంపకం, జనాభా మరియు ఇతర పెరామీటర్స్కు లోబడి జరుగుతుంది అని పెట్టారు. ఏమిటా పెరామీటర్స్? ఎవరు నిర్ణయిస్తారు? మాకిష్టం లేకపోయినా రాష్ట్రాన్ని విడదీస్తున్నారు. జనాభా ప్రకారమే ఆదాయం పంచాలి. ప్రభుత్వం ఆదాయ పంపకం తన చేతుల్లో పెట్టుకుంటోంది. ఈ తరహా పంపకాన్ని నేనంగీకరించలేను. విభజనను వ్యతిరేకిస్తూనే సవరణ ప్రతిపాదిస్తున్నాను. స్పీకర్ : సౌగత్‌రాయ్ గారి సవరణ ఓటింగ్ నిమిత్తం సభ ముందుంచుతున్నా. సవరణ వీగిపోయింది. 47వ క్లాజ్ బిల్లులో భాగమైంది. క్లాజ్ 48 కూడా బిల్లులో కలపబడింది. -ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు -
‘బిల్లు’ను ఆమోదించేది ఇలాగేనా?
పార్లమెంట్లో ఏం జరిగింది-6 ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదం పొందిన ఫిబ్రవరి 18, 2014న లోక్‌సభలో జరిగిన సన్నివేశాల కొనసాగింపును ఇప్పుడు చూద్దాం. స్పీకర్: ది క్వశ్చన్ ఈజ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశం తత్సంబంధిత ఇతర అంశాలు పరిగణనలోకి తీసుకోవటం విషయమై... ప్రతిపాదన ఆమోదించబడింది. స్పీకర్: ఇప్పుడు సభ క్లాజుల వారీగా చేబడుతుంది. ది క్వశ్చన్ ఈజ్: క్లాజ్ 2 బిల్లులో భాగమవుతుంది. ఆమోదించబడింది. క్లాజ్ 2 బిల్లులో భాగమయ్యింది. క్లాజ్ 3 షిండేగారి సవరణ ప్రతిపాదన: పేజి 2 లైన్ 29లో ఖమ్మం అనే చోట, (జీవో నం.111 ఇరిగే షన్ మరియు సీఏడీ, 27.6 2005లో ప్రస్తావించ బడిన రెవెన్యూ గ్రామాలు మరియూ బూర్గం పాడు, సీతానగరం, కొండ్రెక గ్రామాలు మిన హాయించి) స్పీకర్: ది క్వశ్చన్ ఈజ్ క్లాజ్ 3, సవరించిన విధంగా, బిల్లులో భాగం అవుతుంది. ఆమోదించబడింది. క్లాజ్ 3 సవరించిన విధంగా బిల్లులో భాగమ య్యింది. ఈ ప్రక్రియలో పాలు పంచుకోవాలనుకుంటే మీ స్థానాలకు వెళ్లిపొండి. ... అంతరాయం... స్పీకర్: మీ మీ సీట్లకు వెళ్లిపోండి. ‘వెల్’లో మీరేమన్నా పరిగణనలోకి తీసుకోబడదు. ది క్వశ్చన్ ఈజ్ క్లాజ్ 4 బిల్లులో భాగమవుతుంది. ఆమోదించబడింది. క్లాజ్ 4 బిల్లులో భాగమయ్యింది. ... అంతరాయం... టీఆర్‌బాలు ఒక రాష్ట్రం ఏర్పడే బిల్లు పాస్ చేయాల్సిన పద్ధతి ఇది కాదు. ఫెడరల్ వ్యవస్థకు, రాష్ట్ర స్వయం ప్రతిపత్తికి విరుద్ధమిది! నిరసనగా మేము వాకౌట్ చేస్తున్నాం. 13.24: బాలు మరికొందరు సభ్యులూ సభ వదిలి వెళ్లిపోయారు. క్లాజ్ 5 హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. స్పీకర్: సౌగత్‌రాయ్ గారూ 39, 40 సవర ణలు ప్రతిపాదిస్తున్నారా. సౌగత్‌రాయ్: పేజీ 2, లైన్ 37లో ‘‘పదేళ్లకు మించకుండా’’ బదులుగా ‘‘ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని రెడీ అయ్యే వరకూ’’ (39వ సవరణ) పేజీ 2 లైన్ 38లో ‘‘సబ్ సెక్షన్లో ప్రస్తావించిన కాల పరిమితి తీరే వరకూ’’ బదులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని రెడీ అయ్యేవరకూ’’ (40వ సవరణ) స్పీకర్: క్లాజ్ 5కు సౌగత్‌రాయ్ ప్రతిపాదిం చిన 39, 40 సవరణలు సభ ముందు ‘ఓటింగ్’ పెడుతున్నా... సౌగత్‌రాయ్: మేడమ్ ‘డివిజన్’ కావాలి. స్పీకర్: గౌరవ సభ్యులారా, నా ఉద్దేశంలో, డివిజన్ అనవసరంగా అడుగుతున్నారు. రూల్ 367 సబ్ రూల్ (3) అనుబంధం (ప్రోవిజో) ప్రకా రం ‘ఆయ్’ అనుకూలురు, ‘నో’ వ్యతిరేకులూ తమ తమ స్థానాల్లో నిలబడితే లెక్క పెట్టించి, సభ నిర్ణయాన్ని ప్రకటిస్తాను. తమ స్థానాల్లో లేని సభ్యులను లెక్కలోకి తీసుకోం. ‘ఆయ్’ అన్న వారందరూ తమ స్థానాల్లో నిల బడండి. అవును ఆయ్ అందరూ నిలబడండి. ప్రొ॥సౌగత్‌రాయ్: మేడమ్ నేను ‘డివిజన్’ అడుగుతున్నా స్పీకర్: అవును డివిజన్ కోసమే నేను లెక్క పెట్టమంటున్నా. ప్రొ॥సౌగత్‌రాయ్: మేడమ్ నేను ‘డివిజన్’ అడుగుతున్నా, ఏ రూల్ ప్రకారం మీరు డివిజన్ నిరాకరించగలరు? నేను డివిజన్ అడుగుతున్నా. స్పీకర్: గౌరవ సభ్యులారా మీమీ స్థానాల్లో ఉంటేనే లెక్కలోకి వస్తారు. మళ్లీ చెప్తున్నా మీ స్థానంలో ఉంటేనే లెక్క... మీ స్థానాల్లోకి వెళ్లండి. ... అంతరాయం... స్పీకర్: ‘నో’ అనేవాళ్లు మీమీ స్థానాల్లో నిలబడండి. ... అంతరాయం... స్పీకర్: గౌరవ సభ్యులారా... ‘నో’ ‘ఆయ్’ కన్నా ఎక్కువున్నాయి. ‘ఆయ్’ 29 ‘నో’ 230 సవ రణ వీగిపోయింది. స్పీకర్: అసదుద్దీన్ ఒవైసీ మీ 44వ సవరణ ప్రతిపాదిస్తున్నారా... అసదుద్దీన్ ఒవైసీ: ‘ఎప్పా యింటెడ్’ రోజు నుంచి, రెండేళ్ల కాలం మించకుండా ఖైరతాబాద్ రెవెన్యూ మండల ప్రాంతం మాత్రమే. ఆంధ్ర ప్రదేశ్ తాత్కాలిక రాజధానిగాను హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధానిగానూ - 35 నుండి 43 లైన్లు, 2వ పేజీలో మార్చవల్సిందిగా కాలపరిమితి ముగిసిన తర్వాత హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే రాజధానిగానూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఏర్పర్చాలనీ సవరణ ప్రతిపాది స్తున్నాను. నాకొక్క ముప్పై సెకన్లు సమయమిస్తే, ఈ సవరణ వివరిస్తాను. మేడమ్ ఒక రాష్ట్ర రాజధాని మరో రాష్ట్రంలో ఏర్పరచిన సంఘటన దేశంలో ఎక్కడా లేదు. రాజ్యాంగ విరుద్ధమైన ఇబ్బందికరమైన ప్రయోగం చేస్తోందీ ప్రభుత్వం మేడమ్, హైదరాబాద్ తెలంగాణలో భాగం. ఆంధ్రప్రదేశ్ రాజధానిని మీరు హైదరాబాద్‌లో అదీ జీహెచ్ఎంసీ ఏరియాలో ఏర్పాటు చేస్తు న్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల ఆత్మ గౌర వం ఏమయిపోయింది. ఈ ప్రయోగానికి ఎలా ఒప్పుకుంటున్నారు. హైదరాబాద్ ఎప్పటికీ నాశన మైపోతుంది. నేను డివిజన్ కోరతాను మేడమ్! ... అంతరాయం... స్పీకర్: అసదుద్దీన్ ఒవైసీ సవరణ సభ ఓటు కోసం మీ ముందు పెడ్తున్నాను. ఒవైసీ: మేడమ్ ‘డివిజన్’ అడుగుతున్నాను. స్పీకర్: గౌరవ సభ్యులారా డివిజన్ అనవస రంగా కోరుతున్నారని నేను భావిస్తున్నాను. 367(3) అనుబంధం కింద ‘ఆయ్’ మెంబర్లం దరూ తర్వాత ‘నో’ మెంబర్లందరూ నిలబడితే, లెక్కపెట్టి సభా నిర్ణయం ప్రకటిస్తాను. స్పీకర్: ‘ఆయ్’ అనే మెంబర్లు లేచి నిల బడండి. ఆల్ రైట్ ... అంతరాయం... స్పీకర్: ‘నో’ అనే మెంబర్లు 235 సవరణ వీగిపోయింది. ది క్వశ్చన్ ఈజ్: క్లాజు 5 బిల్లులో భాగమ య్యింది. ప్రతిపాదన ఆమోదించబడింది. క్లాజ్-6 (రాజధాని విషయమై నిపుణుల కమిటీ ఏర్పాటు గురించి) స్పీకర్: షిండేగారి సవరణ 3వ పేజీ, 3వ లైన్ ‘45 రోజులు’ బదులుగా ‘ఆరు నెలలు’ ది క్వశ్చన్ ఈజ్: సవరించబడిన విధంగా 6వ క్లాజు బిల్లులో భాగమయ్యింది. క్లాజ్-7 (ఉన్న గవర్నర్ ఉమ్మడి గవర్నర్ గా...) ప్రొ॥సౌగత్‌రాయ్: 3వ పేజీ 7వ లైన్ ‘‘ప్రెసి డెంట్ నిర్ధారించే సమయ పరిమితికి లోబడి’’ బదులుగా ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఏర్పాటయ్యే వరకూ’’ అని మార్చవల్సిందిగా సవరణ ప్రతిపాదిస్తున్నాను. ఈ సవరణ ప్రతిపాదన చేస్తూనే, మీరు తలలు లెక్కపెట్టే పద్ధతిని నిరసిస్తున్నాను. మేం గొర్రెలం కాము. మా ముందు ఒక మీట (బటన్) ఉంది. మేము సవరణల మీద ‘డివిజన్’ కోరుచు న్నాము. ఇలా కాదు వ్యవహరించవలసిన తీరు.. మమ్మల్ని నిలబెట్టి తలలు లెక్క పెట్టడానికి మేము గొర్రెలం కాము. మీరు ఇదే తప్పుడు పద్ధతిలో ఈ బిల్లు ప్రవేశ పెట్టారు. ఇప్పుడు మళ్లీ ఇలాగ అవు తోంది. దయచేసి రాజ్యాంగ బద్ధంగా బిల్లు పాస్ చేయండి. నేను ‘డివిజన్’ కోరుచున్నాను. తలల లెక్కకాదు. బిల్లు ప్రవేశపెట్టినప్పుడు వ్యవహరిం చిన తప్పుడు పద్ధతిలోనే ఇప్పుడూ వ్యవహరిస్తు న్నారు. ఈ సభలో ఇలా జరగకూడదు. చాలా తప్పుడు పద్ధతి నొకదానిని భావితరాలకు దృష్టాం తంగా ఏర్పాటు చేస్తున్నారు. మేము ఆంధ్రప్రదేశ్ విభజననే వ్యతిరేకిస్తున్నాం. భాషాప్రయుక్త రాష్ట్రాల సిద్ధాంతాన్ని భంగపరిచే ఏ రాష్ట్ర విభ జననైనా మేం వ్యతిరేకిస్తాం. స్పీకర్: ఈ సవరణపై ఓటింగ్ వరకు ఏ అతిక్రమణా జరగలేదు. వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్, a_vundavalli@yahoo.com -
‘మాటకు కట్టుబడే మద్దతు’
పార్లమెంట్లో ఏం జరిగింది -4 ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదం పొందిన ఫిబ్రవరి 18, 2014 మధ్యా హ్నం 3.00 గంటల వరకు ఏం జరిగిందో నిన్న మనం చూశాం. ఆ తరువాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. 15.05: సుష్మాస్వరాజ్: అధ్యక్షా! హోంమంత్రిగారు, ఆంధ్రప్రదేశ్ పునర్వి భజన బిల్లుని ప్రవేశపెట్టారు. నేను మా పార్టీ తరఫున మద్దతు తెలపటానికై నిల బడ్డాను. ఈ బిల్లును సమర్థిస్తాం. బిల్లు పాసవ్వటానికి ఓటు కూడా వేస్తాం. ఎందుకంటే, ఈ విషయం మా పార్టీ విశ్వసనీయతతో ముడిపడి ఉంది. తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టమని, మేము దానికి మద్దతిస్తామని, ఇప్పటికే అనేకసార్లు చెప్పాం. అంతేకాదు, ఈ ప్రభుత్వం బిల్లు తేలేకపోతే మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో తెలంగాణ ఏర్పాటు చేస్తామని కూడా మాట ఇచ్చాం. అధ్యక్షా! నేను ఇదే సభలో, మీరక్కడ అధ్యక్షస్థానంలో ఉన్న ప్పుడే, తెలంగాణ విషయమై మాట్లాడుతూ, ‘‘తెలంగాణ కోసం బలిదానాలు వద్దు. తెలంగాణ చూడటానికి బతకాలి బతకాలి’’ అని తెలుగు భాషలో ఆత్మహత్యలు ఆపమంటూ చెప్పిన మాటలకి స్వయంగా మీరే సాక్షి! ఇప్పుడు, వారి కలలు సాకారం చేయటానికి ఈ బిల్లు వచ్చినప్పుడు వ్యతిరేకించి, విశ్వాస ఘాతుకానికి ఎలా పాల్పడగలం! అందుకే, ప్రతిపక్షం మొత్తం ఈ బిల్లును వ్యతిరేకి స్తున్నా మేము మాత్రం ఈ బిల్లుకు మద్దతిస్తున్నాం - ఆ బిడ్డల కలల సాకారం కోసం... ఈ బిల్లు పాసవుతుందని చెప్తూనే, కొన్ని మాటలు ఈ సందర్భంగా ‘రికార్డు’ అవ్వాలని కోరుకుంటున్నాం. నా మొదటి ఆరోపణ కాంగ్రెస్ నాయకత్వం మీద. సోనియాగాంధీ గారికి నేను కనబడనుగాని, వారీ సభలోనే ఉన్నారు. నా మొదటి అభియోగం మీ మీదే సోనియాజీ, 2004లో తెలంగాణ ఇస్తామని చెప్పారు. ఇది 2014. మొదటి పరిపాలనా కాలమంతా ఏమీ చెయ్య లేదు. రెండో టర్మ్ కూడా 15 రోజుల్లో అయిపోతున్న సమయానికి బిల్లు తెచ్చారు. 21వ తారీఖున, 15వ పార్లమెంట్ సమయం పూర్తవుతుంది. మూడ్రోజుల ముందు 18న ఈ బిల్లు పెట్టారు. విష యాన్ని లాగి లాగి ఇంతదాకా తీసుకొచ్చారు. మీ ఎంపీలు, మీ మంత్రులు, మీ ముఖ్యమంత్రిని కూడా ఒప్పించలేకపోయారు. అధ్యక్షా! ఇప్పటి వరకూ ఏ ఎంపీ కూడా ఈ దృశ్యం చూసి ఉం డడు. ప్రధాని కూర్చునే ఉన్నారు - మంత్రివర్గ సభ్యులు ‘వెల్’లో నిలబడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు కూర్చునే ఉన్నారు - కాంగ్రెస్ ఎంపీలే ఆవిడ్ని లెఖ్ఖ చెయ్యకుండా ‘వెల్’లో ఉన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ధర్నా చేస్తున్నారు. ప్రధాన మంత్రి కేబినెట్లో బిల్లు పాస్ చేసి పంపిస్తారు. వారి ముఖ్యమంత్రే ఆ బిల్లును రద్దు చేసి తిప్పి పంపిస్తారు. ఆ దృశ్యాన్ని ఈ సభ చూస్తోంది. అద్వానీ గారు హోంమంత్రిగా ఉండగా మేము మూడు రాష్ట్రాలు విభజించాం. ఒక్క రక్తపు చుక్కగాని, పార్లమెంట్లో ఒక్క క్షణం అశాంతిగానీ లేవు. పూర్తిగా శాంతియుత వాతావరణంలో మూడు రాష్ట్రాలు నిర్మించాం. ఆ మూడూ ఇప్పుడు ప్రగతిపథంలో నడుస్తున్నాయి. అన్ని పార్టీల వారూ ఈ రోజు విడిపోయి ఉన్నారు. తెలంగాణ, సీమాంధ్రా వారు కలసి కూర్చోవటంలేదు. పాపం నామా నాగేశ్వర రావుగారు ఇక్కడున్నారు. నేనాయన్ని ‘శాండ్విచ్’ అంటాను. ఆయన తెలంగాణ కోరే వారితోనూ వస్తుంటారు - తెలంగాణ వ్యతిరేకించే వాళ్లతోనూ వస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీదీ ఇదే పరి స్థితి, జగన్ పార్టీదీ ఇదే పరిస్థితి... అన్ని పార్టీలూ ఇలాగే విడిపోయి ఉన్నాయి. షానవాజ్ హుస్సేన్ (బీజేపీ): లోక్‌సభ టీవీ ప్రసారాలెందు కాపేశారు? ఎందుకు ఆపేశారు? సుష్మాస్వరాజ్: ఈ సంక్షోభంలో కూడా, బీజేపీకి చెందిన తెలంగాణ, సీమాంధ్రా నాయకులు కలసి కూర్చుని సమస్యకు పరి ష్కారాన్ని వెతుకుతున్నారన్న విషయం - నేను గర్వంగా చెప్ప గలను. కేవలం తెలంగాణ ఏర్పడటమే కాదు, హైదరాబాద్ తెలం గాణకే చెందాలని ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్య కర్తలు మాత్రమే చెప్పారు. కానీ మాకు కూడా న్యాయం చెయ్యం డని అడుగుతున్నారు. 15 వేల కోట్ల ‘సర్ప్లస్’ ఆదాయమున్న హైదరాబాద్ వల్ల తెలంగాణ లోటు భర్తీ అవుతుంది గానీ, సీమాంధ్ర లోటు ఎవరు పూడుస్తారు. కేంద్ర ప్రభుత్వమే లోటు భర్తీ చెయ్యాలి. హోంమంత్రిగారు కేవలం మాట చెప్తే కాదు, ఆ మొత్తం కేటాయింపు జరపాలి. రెండోమాట వారడిగేది ఏమిటంటే, హైదరాబాద్‌లో 148 సంస్థలున్నాయి. పదేళ్లు ఉమ్మడి రాజధాని. వారికి కూడా ఏవైతే సంస్థల నిర్మాణాలు జరుపుకోవాల్సి ఉందో, వాటికి ప్లానింగ్ కమిషన్ ప్రిన్సిపల్ ఎఫ్రూవల్ మంజూరు చేసి ఎంతో కొంత సొమ్ము కూడా ఇన్‌టర్మ్ బడ్జెట్లో కేటాయించమని... మూడో విషయం - పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు చేశారు. దానికి సంబంధించి ఏ మండలాలు ట్రాన్స్ఫర్ చెయ్యాలో మా నాయకుడు వెంకయ్యనాయుడుతో ఒప్పందం కుదిరింది. ఒప్పందం కుదిరినట్లు మా దగ్గర జైరాంరమేష్ ఉత్తరం కూడా ఉంది. కానీ కేబినెట్లో అది మారిపోయింది. మన మధ్య జరిగిన ఒప్పందాన్ని పూర్తిగా అమలు చెయ్యాలి. అందుకే, అధ్యక్షా! తెలంగాణ ఏర్పడాలి... హైదరాబాద్ తెలంగాణలోనే ఉండాలి. సీమాంధ్రకూ న్యాయం జరగాలనేదే నేను చెప్పాలనుకుంటున్నా. ఇవన్నీ బిల్లులో రావాలి అనేదే నా కోరిక. నాలుగో మాట: ఈ బిల్లులో చట్టపరమైన లోపముంది. రాజ్యాంగానికి విరుద్ధంగా గవర్నర్‌కి కొన్ని అధికారాలిస్తున్నారు. ఈ విధమైన పనిచెయ్యాలంటే రాజ్యాంగ సవరణ చెయ్యాలి. మేము ప్రభుత్వానికి చెప్పాం. మీరు మామూలు బిల్లు కాకుండా రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టండి, మేము పాస్ చేయిస్తా మని.. తప్పుడు బిల్లు వద్దు అసలైన బిల్లు ప్రవేశపెట్టండని చెప్పాం. నేనింకో మాట మా తెలంగాణ సహచరులతో చెప్పదలచు కున్నా... ఈ బిల్లు పాసయ్యాక బైటకు వెళ్లి ఒకపాట పాడటం మొదలుపెడ్తారు ‘‘కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది. సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది’’ అని. ఆ గొంతుతో మీరు గొంతు కల పొద్దు. ఒకవేళ సోనియమ్మను మరిచిపోకూడదనుకుంటే ఈ చిన్నమ్మను కూడా మరిచిపోవద్దు. మేము కీర్తి పొందాలని ఈ బిల్లును సమర్థిం చడం లేదు. మా అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ ఇచ్చిన మాట మేరకు సమర్థిస్తున్నాం. మా అగ్రనేత అద్వానీ గారు జన చైతన్య యాత్రలో ఇచ్చిన మాట మేరకు తెలంగాణను సమర్థిస్తున్నాం. మా అధ్య క్షుడు, మా అద్వానీ గారిచ్చిన వాగ్దానాల అమలు కోసం, మా విశ్వ సనీయత నిరూపించుకోవటం కోసం ఈ బిల్లుకు మద్దతిస్తున్నాం. కానీ హోంమంత్రిగారు ఈ చర్చకు సమాధానమిచ్చే వేళ, సీమాం ధ్రకు న్యాయం కోసం నేను ప్రస్తావించిన విషయాలను ఈ బిల్లులో పొందుపర్చగలిగితే, సీమాంధ్ర వారు కూడా సంతోషిస్తారు. ఒకవేళ అలా జరగకపోతే నేనిక్కడ నిలబడి మీకు నమ్మకం కలిగేలా చెప్తున్నా రాబోయే ప్రభుత్వం మాది, మేము న్యాయం చేస్తాం, ‘‘సీమాంధ్ర ప్రజలారా ఆందోళన చెందకండి. మీ భద్రత గురించిన మీ గురించిన ఆలోచన మేము చేస్తాం’’ అని నమ్మబలుకుతూ, మేమీ బిల్లును సమర్థిస్తున్నాం. గెలిపిస్తున్నాం - ధన్యవాదాలు. ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు, a_vundavalli@yahoo.com -
ఇటు అంతరాయాలు, అటు సస్పెన్షన్లు
పార్లమెంట్లో ఏం జరిగింది -3 ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదం పొందిన 18-02- 2014న లోక్‌సభలోని కార్యకలాపాలు ఎలా ఉన్నాయో, ఎవరెవరు ఏం మాట్లాడారో చూద్దాం! 11.00కు సభ ప్రారంభమై 12.00 వరకూ వాయిదా పడింది. 12.00కు మళ్లీ ప్రారంభమై 16 నిమిషాలు నడిచింది. ఈ సమయంలోనే జీవీ హర్షకుమార్ (అవిశ్వాస తీర్మానం ఇచ్చిన 13 మందిలో ఒకరు. పెప్పర్ స్ప్రే ఘటన రోజున సస్పెండ్ కాలేదు.) అవిశ్వాస తీర్మానాన్ని సభలో గందర గోళం వల్ల సభ ముందు ఉంచలేకపోతున్నానని స్పీకర్ ప్రకటించారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ సభ్యుడు అందచేసిన నోటీసు సక్రమమైన పద్ధతిలో ఉందని స్పీకర్ భావించిన తర్వాత, సభలో ప్రశ్నోత్తరాల సమయం పూర్తవ్వ గానే, స్పీకర్, ‘అనుమతించే సభ్యులందరూ తమ తమ స్థానాల్లో లేచి నిలబడమని’ కోరాలి. అలా నిలబడిన సభ్యులు 50 మందికి తక్కువ కాకుండా ఉంటే, అవిశ్వాస తీర్మానం చర్చించడానికి అనుమతినివ్వాలి. (రూల్ 198-కౌల్ అండ్ షక్దర్ పేజీ 689) 9-12-2013 నుండి లోక్‌సభ జరిగిన ప్రతిరోజూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబ డటం, స్పీకర్ చదవటం, సభ ‘ఆర్డర్’లో లేదు కాబట్టి 50 మంది ఉన్నారో లేదో లెక్క పెట్టలేకపోతున్నామని ప్రకటించటం.... యథావిధిగా జరుగుతూనే వచ్చింది. రాష్ట్ర విభజన బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టబడిన 13-2-2014న మాత్రం ప్రశ్నోత్తరాల సమయం వాయిదా పడి, 12 గంటలకు సమావేశం ప్రారంభమవ్వగానే అవిశ్వాస తీర్మానం చదవవలసిన స్పీకర్, షిండేగారిని పిలిచి విభజన బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చారు. కౌల్ అండ్ షక్దర్ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ ప్రకారం, అవి శ్వాస తీర్మానం ఉన్నప్పుడు మరే అంశాన్ని చేపట్టక ముందే సభాపతి అవిశ్వాస తీర్మా నాన్ని చదివి సభ అభిప్రాయం తెలుసుకోవాలి. ఆ రోజు మాత్రం షిండేగారు బిల్లు ప్రవేశపెట్టానని, లేదని సుష్మా స్వరాజ్‌గారు సభలో తన్నులాట, లగడపాటి పెప్పర్ స్ప్రే... సభ వాయిదా పడిపోయింది. మళ్లీ 2.00 గంటలకి సభ ప్రారంభమవ్వగానే , రూల్ 374(ఎ) కింద స్పీకర్ విస్తృతాధికారాలను ఉపయోగించి 16 మంది ఆంధ్రప్రదేశ్ సభ్యులను 5 రోజులు సభ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయబడిన వారిలో ఆరోజు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన కాంగ్రెస్‌కు చెందిన సాయిప్రతాప్, తెలు గుదేశం మోదుగుల వేణుగోపాలరెడ్డి, వైఎస్ఆర్సీపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కూడా ఉన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వారిని సభ నుంచి సస్పెండ్ చేసి తర్వాత అవిశ్వాస తీర్మానాన్ని చదవటం విడ్డూరం. బహుశా ఎప్పుడూ ఎక్కడా గతంలో ఇలా జరిగి ఉండదు. సస్పెన్షన్ ప్రకటన చేసి ఆ తర్వాత అవిశ్వాస తీర్మానాన్ని చేపట్టారు. 50 మంది నిలబడండి అని కోరారు. సభ ‘ఆర్డర్’లో లేదంటూ మళ్లీ వాయిదా వేసేశారు. విచిత్రమేమిటంటే, ప్రతిరోజూ అవిశ్వాస తీర్మానానికి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో లెక్క పెట్టడానికి అడ్డం వచ్చిన ‘‘సభ ఆర్డర్లో లేకపోవడం’’ ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు విషయంలో మాత్రం అడ్డురాలేదు. 12.14: హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే: ప్రస్తుతమున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించే అంశమూ తత్సంబంధిత అంశాలున్న బిల్లును పరిగణనలోకి తీసుకోవల సిందిగా మనవి. ... అంతరాయం ... స్పీకర్: యస్, మంత్రిగారూ. షిండే: బిల్లు పాస్ చెయ్యవల్సిందిగా కోరుతున్నాను. స్పీకర్: సభలో కొంచెం ‘ఆర్డర్’ రానివ్వండి. ... అంతరాయం ... స్పీకర్: గౌరవ సభ్యులారా... సభ ఆర్డర్‌లోకి రావాలి. ... అంతరాయం ... స్పీకర్: మనముందు ఒక చట్టం (ఏపీ ఆఫ్ లెజిస్లేషన్) చేయవల్సినది ఉంది. సభ ఆర్డర్లో లేకపోతే నేను ముందుకెలా వెళ్లగలను. దయచేసి సభను ఆర్డర్‌లోకి తీసుకు రండి. ... అంతరాయం ... స్పీకర్: ‘శాంతి’గా ఉండండి. హోంమంత్రి మాట్లాడాలనుకుంటున్నారు. హోంమంత్రి గారూ. షిండే: ఆమోదించమని కోరుతూ బిల్లు ప్రవేశపెట్టాను. ఆమోదించి పాస్ చెయ్యాలి. 12.16 స్పీకర్: సభ 12.45 వరకూ వాయిదా పడింది. 12.45: స్పీకర్: హోం మినిస్టర్ సుశీల్‌కుమార్ షిండే. 12.45 1/2: (కె.బాపిరాజు, ఎ.సంపత్, కె.శివకుమార్ మరికొందరు సభ్యులు స్పీకర్ ‘వెల్’లో ఉన్నారు.) షిండే: ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సుదీర్ఘమైన చరిత్ర కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగమైన ఈ ప్రాంతం ఒక ప్రత్యేక రాజకీయ సాంస్కృతిక ప్రతిపత్తి కలిగి ఉంది. స్పీకర్: సభలో ‘ఆర్డర్’ కావాలి. ... అంతరాయం ... షిండే: 1960-70లలో ప్రత్యేక రాష్ట్రం కోరుతూ తెలంగాణ, అలాగే మిగిలిన ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రమైన ఆందోళనలు నడిచాయి. తాత్కాలిక చర్యలు సంప్రదిం పులతో అవి సద్దుమణిగాయి. ... అంతరాయం ... షిండే: గత పది సంవత్సరాలుగా, ఈ ప్రాంత సాంఘిక, ఆర్థిక, రాజకీయ ఆకాంక్షల ఫలితంగా.. ... అంతరాయం ... 12.47 స్పీకర్: ‘ఆర్డర్’ తీసుకురావాలి. ... అంతరాయం ... సభను 3.00 వరకూ వాయిదా వేస్తున్నాను. 15.00 మళ్లీ సభ ప్రారంభమైంది. (లోక్‌సభ టీవీ చానల్ ప్రత్యక్ష ప్రసారం ఆగిపోయింది. ప్రసారమే కాదు... ఆ గంటన్నర లోక్‌సభలో జరిగిన ప్రహసనాన్ని రికార్డే చేయలేదు. 18-4-1994 నుంచి, లోక్‌సభలో జరిగిన అన్ని ప్రొసీడింగ్స్ రికార్డు చేయబడ్డాయి. యుమాటిక్ / బీటా కామ్/ వీహెచ్ఎస్ క్యాసెట్స్/ వీడియో సీడీ రూపాల్లో ఆడియో విజువల్ లైబ్రరీలో రికార్డు మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. 18-2-2014 ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు సభ ముందుకొచ్చిన 15.00 గంటల నుంచి 16.26 నిమిషాలకు సభ వాయిదా పడే వరకూ మాత్రం... రికార్డింగ్ జరగలేదు.) 15.01 (మంత్రులు కేఎస్ రావు, చిరంజీవి, కనుమూరి బాపిరాజు, రామచంద్ర డోమ్ (సీపీఎం), శైలేంద్ర కుమార్ (సమాజ్‌వాదీ పార్టీ), కళ్యాణ్ బెనర్జీ (తృణమూల్), పి.కరుణాకరన్ (సీపీఎం), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్‌కు చెందిన సంసుమ కునగ్గర్ విష్ణుసభాతియార్, జయప్రద మొదలైన వారు స్పీకర్ ‘వెల్’లో టేబుల్ దగ్గర నిలబడ్డారు.) స్పీకర్: షిండేగారూ మీరు కొనసాగించండి. షిండే: మేడమ్, తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా విభజించడానికై ఈ బిల్లు ఉద్దేశించబడింది. ఈ విభజన వల్ల ఏర్పడబోయే ప్రభావం అన్ని ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేలా పూర్తి కృషి చేశామని సభకు మనవి చేస్తున్నాను. రాష్ట్రంలో నలుమూలల నుండి అందిన ప్రతి సలహాను, సూచనను పరిశీలించి బిల్లులో తగు విధంగా పొందుపరచడం జరిగిందని సగర్వంగా తెలియజేస్తున్నాను. ఆ విధంగా తయారు చేసిన డ్రాఫ్టు బిల్లును రాష్ట్రపతి గారు జనవరి 23లోగా అభిప్రాయం చెప్పమని అసెంబ్లీకి పంపారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు అభిప్రాయం చెప్పే గడువును జనవరి 30 వరకు పొడిగించారు. రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం తెలియజేసిన తరువాత కూడా అనేక సూచనలు వచ్చాయి. ఈ సూచనలను కూడా పరిగణనలోకి తీసుకొని పరిశీలించాం. ఆ విధంగా సవరణలు చేసి, ఆ సవరణలను కూడా సభ ముందు ఉంచుతున్నాం. పార్లమెంటు అసెంబ్లీ ప్రాతి నిధ్యం, రెవెన్యూ పంపకం, ఆస్తులు అప్పుల పంపకం, నీటివనరుల యాజమాన్యం, విద్యుత్, సహజవనరుల పంపకం, శాంతిభద్రతల పరిరక్షణ, వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధి ఈ బిల్లులో ప్రతిపాదనలు. ఆర్థిక లా అండ్ జస్టిస్, విద్యుత్, జలవనరులు, విమానయానం, నౌకాయానం, రోడ్ రవాణా, మానవ వనరులు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, బొగ్గు, సహజవాయువు, సాంఘిక సంక్షేమం, గిరిజన, రైల్వే, ట్రైనింగ్, ప్లానింగ్ కమిషన్, ఎలక్షన్ కమిషన్ మొదలైన అన్ని మంత్రిత్వ శాఖలతోనూ సంప్ర దింపుల తర్వాతే పొందుపరిచాం. ఈ మాటలతో 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు సభ ముందుంచుతూ ఆమోదించి పాస్ చేయవలసిందిగా కోరుతున్నాను. -ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు, a_vundavalli@yahoo.com -
రాష్ట్రపతిజీ... న్యాయం చేయండి
పార్లమెంట్లో ఏం జరిగింది -1 అయ్యా, 18.2.2014న 15వ లోక్‌సభలో, సీమాంధ్రకు చెందిన అత్యధిక ఎంపీల్ని సస్పెండ్ చేసి, టీవీ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేసి, అన్ని నిబంధనలనూ, సభా సాంప్రదాయాల్ని తుంగలోకి తొక్కి ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ఆమోదించిన తీరుకు సం బంధించి, ఆనాటి లోక్‌సభ రికా ర్డులు పరిశీలిస్తే అసలీ బిల్లు చట్టబద్ధంగా ఆమోదిం చబడిందా.. అనే అనుమానం, ఎవ్వరికైనా వస్తుంది. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లోక్‌సభ ఏ విధంగా విభజించిందో తెలుసుకునే అవకాశం కూడా చరిత్రకు దక్కకుండా, ఆ సమయం, వీడియో రికార్డింగ్ కూడా ఆపు చేయాల్సిందిగా లోక్‌సభ సెక్రటేరియట్ ఆదేశించినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, కౌన్సిల్ ఈ బిల్లును తిరస్కరించినప్పటికీ, స్వతంత్ర భారత చరిత్రలో మున్నెన్నడూ లేని విధంగా, దేశ ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకే తలవొంపులు తెచ్చే విధంగా, కేంద్ర ప్రభుత్వం హడావుడిగా ఈ బిల్లు విషయంలో వ్యవహరించింది. సరిగ్గా ఇంకో పది రోజుల్లో దేశవ్యాప్త ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించబోతున్న సమయంలో, పదేళ్లపాలన అంతమవుతున్న ఆఖరి గడియల్లో ఇంత టి ప్రధానమైన నిర్ణయం విషయంలో అంత తొందరగా ఎందుకు వ్యవహరించాలి? ఎన్నికల ముందు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టకుండా ‘ఓట్ - ఆన్- అకౌంట్’ అనే తాత్కాలిక ఏర్పాటు చేసుకుని, రాబోయే కొత్త ప్రభుత్వమే బడ్జెట్ ప్రవేశపెట్టాలనే ఆలోచన చేసేవాళ్లం... దేశంలోని ప్రప్రథమ భాషాప్రయుక్త రాష్ట్రాన్ని విడదీయాలనే తొందరలో ఎన్నికలు పది రోజుల్లో ప్రకటిస్తారు- కొత్త ప్రభుత్వం వస్తుంది కదా అనే ఆలోచన కూడా చేయలేదు. అదృష్టం ఏమిటంటే, కనీసం లోక్‌సభ ప్రొసీడింగ్స్. రిపోర్టర్లు రికార్డు చేసి పబ్లిష్ చేసిన పుస్తకమైనా దొరికింది! దానిని కూడా రిపోర్టర్లు రికార్డు చేసింది చేసినట్లు కాకుండా మార్చేసారనుకోండి..!! ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి లోక్‌సభలో, ఏ రకంగా సభ నడిచిందో రికార్డులు చూస్తుంటే, ఇంతకన్నా దుర్దినం, సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటనా మరొకటి ఉండదని అనిపిస్తుంది. బహుశా, అధికార ప్రతిపక్షాలు కలసి, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు, ఫెడరల్ సిద్ధాంతాలకూ తిలోదకాలిచ్చేయాలనుకున్నప్పుడు, ఇలాగే జరుగుతుందేమో! సస్పెండ్ చేయబడిన ఎంపీలందరూ సస్పెన్షన్లు రద్దు చేయబడి సభలో కొచ్చేదాకా, సభలో పూర్తి చర్చ జరిగేదాకా ఆంధ్రప్రదేశ్ బిల్లును ఆమోదించే సమస్యే లేదని విస్పష్టంగా ప్రకటించిన బీజేపీ, ఏమయ్యిందో ఏమోగాని, ఏ చర్చా లేకుండా అన్ని విలువల్ని సూత్రాల్నీ పక్కకు పెట్టి, ఎంపీల సస్పెన్షన్లు ఉపసంహరణే కోరకుండా, అధికార పార్టీతో చేతులు కలిపి దేశంలోనే ప్రప్రథమ భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ఏకపక్షంగా విడగొట్టేశారు. కొత్త రాష్ట్రం ఏర్పడాలంటే శాసన సభ నుంచి విభజన కోరుతూ తీర్మానంగానీ లేదా దీని కోసం ఏర్పరచబడిన కమిటీ లేదా కమిషన్ సిఫార్స్ గానీ కచ్చితంగా ఉండాలనే నిబంధన సంగతే ప్రస్తావించబడలేదు. ప్రతిపక్ష నాయకు రాలైన శ్రీమతి సుష్మాస్వరాజ్, సభలోనున్న యావత్ ప్రతిపక్షమూ వ్యతిరేకిస్తున్నా బీజేపీ మాత్రం ఇచ్చిన మాటను తప్పకుండా ఉండటంకోసం ఈ బిల్లును సమర్థిస్తున్నామని ప్రకటించడం గమనార్హం. వీరు ఇచ్చేమాట అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగ లేనప్పుడు మరోలాగ మారుతూ ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. లోక్‌సభలో ఈ బిల్లు సరైన రీతిలో నడవలేదని మేమెందుకు బలంగా నమ్ము తున్నామంటే: అనేక సవరణలు సభ్యులచే ప్రతిపాదించబడ్డాయి. ఏ ఆ సవరణల విషయమై సభ్యులు ‘డివిజన్’ కోరారు. స్పీకర్ రూల్ 367(3) ప్రావిజో అనుసరించి ‘డివిజన్’ తిరస్కరించారు. రూల్ 367(3) ప్రావిజో ప్రకారం అనవసరంగా సభ్యులు ‘డివిజన్’ కోరుతున్నారని స్పీకర్ భావించినప్పుడు తిరస్కరించవచ్చు! 1956 తర్వాత, ఏ స్పీకరూ, సభ్యుల ప్రాథమిక హక్కు అయిన ‘డివిజన్’ తిరస్కరించటం జరగలేదు. ఎంతమంది అనుకూలమో ఎంత మంది వ్యతిరేకమో తలలు లెక్కపెడతానని స్పీకర్ అన్నప్పుడు ‘మేం గొర్రెలం కాదు.. అనుకూలం ఎందరో ప్రతికూలం ఎందరో ‘డివిజన్’ చేసి తేల్చండి’ అంటూ సౌగత్‌రాయ్ అనే సభ్యుడు కోరిన ‘ఓటింగ్’ను స్పీకర్ తిరస్కరించారు. ఏ సౌగత్‌రాయ్ ప్రతిపాదించిన క్లాజ్ ‘7’ సవరణ విషయమై ‘డివిజన్’ వ్యతిరేకించిన స్పీకర్ సవరణ వీగిపోయిందంటూ ప్రకటించేశారు. సౌగత్‌రాయ్ పదే పదే ‘డివిజన్’ కోరుతూనే ఉన్నా, కనీసం తలలు కూడా లెక్కపెట్టకుండా స్పీకర్ ప్రక టన చేసేయటం ఏ రూలూ ఒప్పుకోదు.. ఆర్టికల్ 100ను పూర్తిగా ఉల్లంఘించే చర్య! విచిత్రంగా, ఏదో తలలు ‘లెక్కపెట్టినట్లు కథ నడిపించి, సవరణలు వీగిపో యినట్లు ప్రకటించి కొన్నిసార్లు అసలు లెక్కే పెట్టకుండా వీగిపోయినట్లు ప్రక టించి కొన్నిసార్లూ.. బిల్లు అయిపోయిం దనిపిం చేశారు. ‘లెక్కపెట్టినట్లు కథ నడిపించి’ అని ఎందుకు అన్నానంటే, నాలుగుసార్లు స్పీకర్ తలలు లెక్కపెట్టారు. అనుకూలం ఎంత మందో, వ్యతిరేకం ఎంతమందో లెక్కపెట్టి, ప్రకటించాలి. అంటే నాలుగుసార్లు అను కూలం, 4 సార్లు వ్యతిరేకం. ఎనిమిది సార్లు లెక్క పెట్టాలి. 22 నిమిషాల్లో ఎనిమిది సార్లు సభ్యులను లెక్క పెట్టారన్న మాట!! ఏ సౌగత్‌రాయ్, అసదుద్దీన్ ఒవైసీలు ప్రతిపాదించిన ఒక సవరణకు స్పీకర్ ఎలా తలలెక్క తీసుకున్నారో గమనిస్తే.. ఎంత కంగాళీగా సభ నడిపారో అర్థమవుతుంది. వీరిద్దరూ ప్రతిపాదించిన సవరణకు తలలు లెక్క పెట్టినట్లు కథ నడిపించి, 169-0 అని ప్రకటించారు. అంటే, సౌగత్ రాయ్, ఒవైసీ కూడా తమ ప్రతిపాదనను తామే వ్యతిరేకించారన్నమాట..! ఏ 42వ సవరణ విషయంలో, ‘సవరణ వీగిపోయింది’ అని స్పీకర్ ప్రకటించేశారంతే.. డివిజన్ కోరుతున్నప్పటికీ, కనీసం తలలెక్క అయినా పెట్టలేదు. ఏ అలాగే, క్లాజ్ 8 విషయంలో, స్పీకర్ ముందు కూర్చుని స్టెనో గ్రాఫర్స్ రికార్డు చేసిన యథాతథ వాక్యాలకూ, తరువాత మార్చి కరెక్ట్ చేయబడి, ముద్రించబడిన వాక్యా లకూ చాలా తేడా వచ్చేసింది! క్లాజ్ 8 బిల్లులో భాగమవుతుందా లేదా అని స్పీకర్ ‘డివిజన్’ చేసి తలలు లెక్కపెట్టినట్లు .. 169 అనుకూలం 0 ప్రతికూలం అయినట్లు ప్రచురించారు. ఎప్పటికప్పుడు రికార్డు చేసింది యథాతథంగా ‘వెబ్సైట్’లో పెట్టిన దానికి ముద్రించిన ప్రొసీడింగ్స్‌కి అసలు సంబంధమే లేదు. సరిదిద్దబడని ప్రతికి, సరిదిద్ది ముద్రించిన ప్రతికి మధ్య ఉన్న వ్యత్యాసం చూస్తే, ఈ విషయం అర్థమవుతుంది. ఆశ్చర్యకరంగా, ఇదే ప్రక్రియ మళ్లీ రాజ్యసభలో పునరావృతమైంది. టెలివిజన్ ప్రత్యక్ష ప్రసారం నిలుపుదల చేయలేదంతే! లోక్‌సభలో ఏ ఒక్క సవరణా ప్రతిపాదించని బీజేపీ పార్టీ రాజ్యసభలో 20 సవరణలు ప్రతిపాదించటమే కాకుండా, ఏ ఒక్క సవరణ ఆమోదించకపోయినా బిల్లు పాసవ్వదని ప్రకటించారు కూడా, తర్వాత జరిగిన దానికీ వాళ్లన్న దానికీ పొంతనే లేదు. లోక్‌సభలో సహకరించినట్లు గానే, 20 సవరణలలో ఏ ఒక్కటీ ఆమోదించబడకపోయినా బిల్లు పాసయిపోవటానికి సహకరించారు. సీపీఐ(ఎమ్) పార్టీ, ఇతర పార్టీలు ‘డివిజన్’ కోరినా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గారు నిరాకరించారు. సభ సజావుగా లేనప్పుడు ‘డివిజన్’ జరపటానికి నిబంధనలు అంగీకరించవని ఆయన స్పష్టంగా ప్రకటిం చారు. మరి లోక్‌సభ సజావుగా లేకపోయినా తలలు ఎలా లెక్కపెట్టారో, అక్కడ వేరే రూలూ ఇక్కడ వేరే రూలూ ఎలా అమలు చేశారో తెలియదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 100 అనుసరించి, ఏ సభలోనైనా ‘డివిజన్’ చేయటం తప్పనిసరి... ఆ విధంగా అధికార పక్షానికి ప్రతిపక్ష బీజేపీ తోడై ఈ బిల్లు పాస్ అయ్యేలా చేసింది. భారత పార్లమెంటరీ చరిత్రలో, ‘డివిజన్’ అడుగుతున్నా ఇవ్వకుండా బిల్లు పాసయిపోయిందని ప్రకటించబడినది ఒక్క ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు మాత్రమే..! ఈ ప్రక్రియ మొత్తం పరిశీలిస్తే, రాజ్యాంగాన్ని లోక్‌సభ రాజ్యసభ రూల్స్‌ని పరిగణనలోకి తీసుకోకుండా - ఎలాగోలాగ ఈ బిల్లు పాస్ చేయించాలనే ఆత్రుత స్పష్టంగా కనబడటం లేదా? సుష్మాస్వరాజ్ ‘‘సభలోనున్న యావత్ ప్రతిపక్షమూ వ్యతిరేకిస్తున్నా’ అన్న మాటల్ని బట్టి - బిల్లు పాసవటానికి కావాల్సిన మెజార్టీ లేదేమో అనిపించటంలేదా? ఈ సందర్భంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 79లో పొందుపరచబడిన ‘పార్లమెంట్’ నిర్వచనాన్ని మీముందుంచుతున్నాను. ‘పార్లమెంట్ అంటే దేశాధ్యక్షుడు - కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్(రాజ్యసభ) హవుస్ ఆఫ్ పీపుల్ (లోక్‌సభ)’. పార్లమెంట్లో భాగమైన మీరు, భారత దేశాధ్యక్షుడి హోదాలో, నిజానిజాలు పరిశీలించి అసలు ఆంధ్రప్రదేశ్ విభజన పార్లమెంట్లో ఆమోదించబడిందా, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఆ ఆమోదం జరిగిందా అనే విషయం విచారించి అవసరమైన చర్యలు చేపట్టడం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో, రాజ్యాంగ మౌలిక పునాదులకు నష్టం జరగకుండా కాపాడమని కోరుచున్నాను. మన రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించిన మౌలిక విలువలను కాపాడే విధంగా, ఈ భారతదేశ రాజ్యాంగాధిపతి అయిన మీరు - తగు చర్యలు గైకొనమని ప్రార్థిస్తున్నాను. (రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఉండవల్లి అరుణ్‌కుమార్ రాసిన లేఖ పూర్తి పాఠం) -ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు a_vundavalli@yahoo.com -
విభజన బిల్లు పాసయిందా?
ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలయిపోయింది. 18-2-2014న లోక్‌సభలో, 20-2-2014న రాజ్యసభలోనూ ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన బిల్లు ఆమోదం పొంది, యాక్ట్ (చట్టం)గా రూపొందింది. లోక్‌సభలో ఏం జరిగిందో మనమె వ్వరూ చూడలేకపోయాం. కారణం టి.వి. ప్రత్యక్ష ప్రసారాలు ఆగిపోవటం లేదా ఆపుచేయటం! దీనికి కారణమేమిటని లోక్‌సభ సెక్రటేరియట్ వారిని ‘రైట్ టు ఇన్ఫర్మేషన్’ చట్టం ప్రకారం ప్రశ్నించాను. సరిగ్గా, 18వ తారీఖున, 3 గంటల 1 నిమిషానికి, అంటే ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు మీద లోక్‌సభలో చర్చ ప్రారంభమైన మరుక్షణం, లోక్ సభలో అమర్చిన తొమ్మిది ఆటోమేటిక్ కెమెరాలూ ఒకేసారి, హఠా త్తుగా, ప్రసారం చేయటానికి వీలులేకుండా ఆగిపోయాయనీ, సభ వాయిదా పడ్డ తర్వాతే రిపేరు చేయించి సరిచేశామనీ సమాధాన మిచ్చారు. లోక్‌సభ చరిత్రలో ఇలా ప్రత్యక్ష ప్రసారాలకు అంతరా యం కలగటం ఎన్నడైనా జరిగిందా అన్న ప్రశ్నకు 18వ తారీఖు, 3.01 నిమిషానికి మాత్రమే జరిగిందని కూడా సమాధానం ఇచ్చారు. మర్నాడు పత్రికల్లో ప్రచురితమైన వార్తల ప్రకారం గంటా ఇరవై ఆరు నిమిషాల్లో చర్చ, ఆమోదం, సవరణలు, వగైరాలన్నీ పూర్తయి, బిల్లు పాసయిపోయినట్లు తెలిసింది. 20-2-2014న రాజ్యసభలో జరిగిన చర్చనంతా టీవీ ప్రత్యక్ష ప్రసారంలో చూశాం. ఓటింగ్ పెట్టండి, డివిజన్ చెయ్యండి, ఎంతమంది అనుకూలమో ఎంత మంది వ్యతిరేకమో లెక్క తేల్చండంటూ మార్క్సిస్టు సభ్యులు సీతారాం ఏచూరి తదితరులు అడిగినా అధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ కురి యన్ గారు అంగీకరించలేదు. సభ గందరగోళంగా ఉన్నప్పుడు ‘డివిజన్’ చేయటానికి రూల్స్ ఒప్పుకోవు అని తేల్చి చెప్పేశారు! లోక్‌సభలో ప్రత్యక్ష ప్రసారం ఆపు చేసినా, జరుగుతున్న ప్రొసీడింగ్స్ రికార్డు చేసే లోక్‌సభ రిపోర్టర్లు, వెర్బాటం రికార్డింగ్, అంటే ఏ పదానికి ఆ పదం షార్ట్‌హ్యాండ్‌లో రాసుకుని రికార్డు చేసేశారు. ఆ విధంగా తయారైన లోక్‌సభ చర్చా- ఇతర వివరాలూ వెబ్సైట్లో పెట్టారు! తర్వాత పుస్తక రూపంలో కూడా ప్రచురించారు!! వెబ్సైట్ చదివి, ఆ తర్వాత పుస్తకం కూడా చదివిన తర్వాత అర్థమయింది.. బిల్లు లోక్‌సభలో పాస్ కాలేదని. తలుపులు మూసేసి, టీవీ ప్రసారాలు ఆపేసి బిల్లు పాసయి పోయిందనిపించేయటానికి కారణం, రూల్స్ ప్రకారం బిల్లు పాసయ్యే అవకాశమే లేకపోవటం! సుప్రీంకోర్టులో, అనేక దశల్లో, అనేక పిటిషన్లు దాఖలయి ఉన్నాయి. మే 5, 2014న జస్టిస్ దత్తు (ఇప్పుడు చీఫ్ జస్టిస్) పిటిషనర్ల వాదనలు విని, కేంద్ర ప్రభుత్వానికి సమాధానం చెప్పటానికి ఆరువారాలు గడువిస్తూ, ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేశారు. ఆ తర్వాత వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉన్నాయి గానీ, కేంద్ర ప్రభుత్వం వారు ‘కౌంటర్’ దాఖలే చెయ్యలేదు. 18వ తారీఖున లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్, 20న రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు అరుణ్‌జైట్లీ ఇద్దరూ కూడా ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమనే ప్రకటించారు. రాజ్యాంగ విరుద్ధమైనా మేమీ బిల్లును సమర్థిస్తున్నామని కూడా ప్రకటించారు. అంతేకాకుండా, 2014 బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని కొన్ని క్లాజులు రాజ్యాంగానికి లోబడి లేవని పలువురు న్యాయ నిపు ణులు అభిప్రాయపడుతున్నారు; ఈ క్లాజులను కోర్టులు కొట్టివేస్తే, రాజ్యాంగాన్ని సవరించటం ద్వారా బీజేపీ వాటిని పునరుద్ధరి స్తుంది అని ప్రచురించారు. ఈ కారణంగా కేంద్ర ప్రభుత్వం తప్పకుండా వెంటనే కౌంటర్ దాఖలు చేస్తుందనే అనుకున్నాను! సంవత్సరం ఆరు మాసాలు గడచినా అతీగతీ లేదు!! నాలుగు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీలందరికీ లోక్‌సభ ప్రొసీడింగ్స్.. వాటిని బట్టి ఈ బిల్లు పాసయిందని చెప్ప టానికి ఎలా వీలులేదో... ఈ మెయిల్ ద్వారా పంపించాను. కొంత మంది ఎంపీల్ని మెయిల్ చదివారా అని అడిగాను కూడా! ఎవ్వరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. బిల్లు పాసవ్వక పోతే మాత్రం, ఇప్పుడు చేయగలిగిందేముంది? రాష్ట్రాన్ని మళ్లీ కలుపు తారా? ఇదే ప్రశ్న!! ఒక పెద్ద రాష్ట్రాన్ని లోక్‌సభ గడువే రెండ్రోజుల్లో ముగిసి పోతుంటే, విడదీసే తొందర్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు కలసి పోయి, మొత్తం నిబంధనలన్నీ గాలికొదిలి, అయిపోయిందంటే అయిపోయిందంటూ గంటన్నరలో ‘ఓటింగ్’ కూడా నిర్వహించ కుండా పూర్తి చేసేస్తే... కనీసం అడిగేవాడైనా లేకపోతే, భవి ష్యత్‌లో మన పరిస్థితి ఏమిటి... అనిపించింది. అక్టోబర్ 7న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారిని కలసి ఒక మెమోరాండంను ఇచ్చాను. దానితో పాటే లోక్‌సభ, రాజ్యసభల ప్రొసీడింగ్స్‌తో ప్రచురించిన ఒక పుస్తకం కూడా ఇచ్చాను. ‘‘లోక్ సభలో 18.2.2014న ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు పాస య్యిందా?’’ ఆ పుస్తకం ఈ ప్రశ్నతో ప్రారంభమవుతుంది. ఆ పుస్తకం, నేను రాష్ట్రపతి గారికిచ్చిన మెమోరాండం కాపీ, ఢిల్లీలో ప్రెస్ వారికీ, కొంత మంది మిత్రులకూ ఇచ్చాను. ‘సాక్షి’ రామచంద్రమూర్తిగారు ఆ పుస్తకం చదివారు. ‘తెలుగులో ప్రచురించలేకపోయారా’ అని అడిగారు. మీరు చేస్తున్న వాదనకు ప్రతిఫలం ఏమిటి అనే ప్రశ్న పక్కనబెట్టి, ఈ రకంగా పార్లమెంట్ నడిస్తే, ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లదా-అనే ప్రశ్న ప్రజల ముందుంచాలిగదా అన్నారు మూర్తిగారు. 2000 సంవత్సరంలోనే ‘వార్త’ పత్రికలో నా చేత, వారం వారం ‘కాలమ్’ రాయించారు మూర్తిగారు! ఆ చనువుతో ‘మీ సాక్షిలో వేసుకుంటారా... పంపిస్తాను’ అన్నాను. ‘యస్’ అన్నారు రామచంద్రమూర్తి గారు. రేపట్నుంచి ‘‘పార్లమెంట్లో ఏం జరిగింది’’ ప్రారంభమవు తుంది. కొంచెం ‘బోరు’ కొట్టినా చదవాలి. అధికార ప్రధాన ప్రతి పక్ష పార్టీలు కలసిపోతే (పార్టీలే సభ్యులు కాదు) ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతాయో, ఇది చదివితే అర్థమవుతుంది. -ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు మొబైల్: 98881 80171 -
ప్రత్యేక హోదాయే ప్రాణవాయువు
రాష్ట్రాల విభజన సమయంలో ఆర్థిక, భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతోంది. ప్రత్యేక హోదాను కలిగిన రాష్ట్రాలన్నింటికీ ఒకే గీటురాయి కానీ, కొలబద్ద కానీ లేదు. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క అంశానికో లేక మరికొన్ని అంశాలకో లోబడి ప్రత్యేక హోదా పొంది ఉండవచ్చు. అయితే ప్రత్యేక హోదా కల్పించినంత మాత్రానే సకలం సమున్నతం కాకపోవచ్చు. అయితే ఆ హోదా ప్రస్తుత ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించడానికి చేయూతనిస్తుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చల సందర్భంలో అనేక అంశాలను అటు పాలకపక్ష సభ్యులు, ఇటు ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తారు. బిల్లులో పొందుపర్చని అంశం ప్రత్యేక హోదా. అందువల్ల దాన్ని హామీ రూపంలో నాటి ప్రధాని పార్లమెంటులో ప్రకటించారు (20-2-2014). ఆ మేరకు 2014 మార్చి ఒకటవ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మా నించారు. నిర్ణయాన్ని అమలు చేయాలని ప్రణాళికా సంఘాన్ని ఆదేశించారు. నాటి ప్రతిపక్ష పార్టీ, నేటి పాలకపక్షమైన బి.జె.పి.లో సీనియర్ నేత వెంకయ్య నాయుడు వంటివారు కూడా దీన్ని స్వాగతించి, ఒక అడుగు ముందుకేసి పదేళ్ళపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని, రెవెన్యూ లోటును భర్తీ చేయాలనీ, నూతన రాజధానికి సహాయం చేయాలని, పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలనీ, జాతీయ విద్యాలయాలను నెలకొల్పాలని, ప్రత్యేక రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ చేశారు. అలాగే రాజ్యసభలో ఆనాటి ప్రతిపక్ష నాయకుడు, బి.జె.పి సీనియర్ నేత, నేటి కేంద్ర ప్రభుత్వం లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సైతం వెంకయ్య నాయుడి డిమాండ్లకు మద్దతు పలుకుతూ, ఆదాయం రీత్యా నష్టపోతున్న సీమాంధ్రకు పరిపూర్ణ న్యాయం చేయాలని, అవసరమైతే చట్టాన్ని కూడా సవరించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో మౌనమేల? తర్వాత బీజేపీ నేతలు తమ ఎన్నికల ప్రణాళికల్లో ఆ విషయాలను ్రపస్తావించి జనానికి ఎనలేని ఆశలను కలిగించారు. ప్రస్తుత ప్రధాని మోదీ, ఆనాటి ఎన్ని కల ప్రచారంలో ఈ విషయాన్ని ప్రస్తావించి, పార్లమెంటులో నాటి ప్రభుత్వం చేసిన వాగ్దానాలన్నిటికీ కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం బీజేపీ నేతలు ఆంధ్రలో అరుస్తున్నారు. కేంద్రంలో మౌనం పాటిస్తున్నారు. ‘‘ఏ రాష్ట్రానికీ చేయనంత సాయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు అందిం చామని’’ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామాత్యులు వెంకయ్య నాయుడు అంటు న్నారు. ఏ.ిపీకీ హోదా కంటే... రావాల్సిన ప్రాజెక్టులు ముఖ్యమని, ప్రత్యేక హోదాపై అనవసర రాజకీయాలను చేసి అడ్డంకులు సృష్టించవద్దని’’ ఆయన హితవు పలుకుతున్నారు. ఒకవైపున రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందం టూనే, ప్రత్యేక హోదా వద్దంటున్నారు, ప్రాజెక్టులు చాలంటున్నారు. ఈ క్రమంలోనే, పార్లమెంటులో ఒక సభ్యుడు ఏప్రిల్ 24, 2015న లేవ నెత్తిన ప్రశ్నకు కేంద్ర ప్రణాళికా మంత్రి జవాబు చెప్తూ, ఆంధ్రకు ప్రత్యేక హోదా దాదాపుగా లేనట్లేనని ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం ఆంధ్ర ప్రదేశ్తోపాటుగా తెలంగాణా, ఒడిశా, రాజస్థాన్, బిహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి కూడా విజ్ఞప్తులు వచ్చాయని ఆయన చెప్పారు. అంటే, మిగతా రాష్ట్రాలు కూడా అడుగుతున్నాయి కాబట్టి ప్రత్యేక హోదా అసాధ్యమన్నట్లు సూటిగా చెప్పకపోయినా, ఆ అర్ధంలోనే జవాబు చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని గతంలో జాతీయ అభివృద్ధి మండలి పలు రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను కల్పించిందని మంత్రి చెప్పారు. అయితే రాష్ట్రాల విభజన జరిగినప్పుడు ఆర్థిక, భౌగోళిక, సామాజిక, సాంస్కృతికాంశాలతో పాటుగా రాజకీయ అంశాలు కూడా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని మన దేశంలోని పలు రాష్ట్రాల ఏర్పాటులో మనం చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్ విభజన కూడా ఆ అంశాలకు అతీతమైంది కాదు. ప్రత్యేక హోదాను కలిగిన రాష్ట్రాలు అన్నింటికీ ఒకే గీటురాయి కానీ, కొలబద్ద కానీ లేదు. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క అంశానికో లేక మరికొన్ని అంశాలకో లోబడి ప్రత్యేక హోదా పొంది ఉండవచ్చు. మిగతా రాష్ట్రాలతో పోటీ పెట్టడం దేనికి? రాజ్యాంగంలోని అనేక ఆర్టికల్స్ రాష్ట్రాలకు గ్రాంట్లను మంజూరు చేయడానికి అవకాశాన్ని కలిగిస్తున్నాయి. ఉదాహరణకు ఆర్టికల్స్ 258, 275. వీటి క్రింద కొన్ని రాష్ట్రాలకు అదనపు గ్రాంట్లు మంజూరు చేయవచ్చు. ఆర్టికల్ 280, 281, 282 క్రింద కూడా ఆర్థిక సంఘం ద్వారా గ్రాంట్లు మంజూరు చేయ వచ్చు. అయినప్పటికీ ఆర్టికల్ 370 క్రింద అనేక రాష్ట్రాలకు ప్రత్యేక సెక్షన్లను వర్తింపచేశారు. ప్రత్యేక గ్రాంట్లకు జాతీయాభివృద్ధి మండలి ద్వారా గానీ, ప్రణాళికా సంఘం ద్వారా గానీ హోదాను కల్పించారు. ఆ విధంగా చూసినప్పుడు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్‌కూ వర్తిస్తాయి. మిగిలిన రాష్ట్రాలను ఏపీకి పోటీపెట్టడం, సరిపోల్చడం పాలకులకు తగదు. ప్రత్యేక హోదాతో కలిగే లాభాలు.... ప్రస్తుతం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు : 1. అరుణాచల్‌ప్రదేశ్, 2. అస్సాం, 3. హిమాచల్‌ప్రదేశ్, 4. జమ్మూ- కశ్మీర్, 5. మణిపూర్, 6.మేఘాలయ, 7. మిజోరం, 8. నాగాలాండ్, 9. సిక్కిం, 10. త్రిపుర, 11. ఉత్తరాఖండ్. ఈ 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా వల్ల కలుగుతున్న ప్రయోజనాలు ఏమిటంటే.. 1) సాధారణ కేంద్ర సహాయం: దీనిలో అధిక భాగం ప్రత్యేక హోదా కలి గిన 11 రాష్ట్రాలకు అందుతుంది. ఉదా: 2011-12 ఆర్థిక సంవత్సరంలో సుమారుగా 56శాతం నిధులు ఈ రాష్ట్రాలకు అందాయి. మిగతా 17 రాష్ట్రాలకు కేవలం 44శాతం అందాయి. 2) అదనపు కేంద్ర సహాయం: విదేశాల నుంచి వచ్చే నిధుల ద్వారా ఏర్పాటు చేయబడిన ప్రాజెక్టులకు ఇచ్చే నిధులలో సుమారుగా 90 శాతం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు గ్రాంటుగా ఇస్తే, ఇతర రాష్ట్రాలకు అప్పుగా ఇస్తారు. అనగా గ్రాంట్లు తిరిగి చెల్లించనవసరం లేదు. రుణం తిరిగి వడ్డీతో సహా చెల్లించాలి. 3) ప్రత్యేక కేంద్ర సహాయం: ఇది ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు సింహభాగం దక్కుతుంది. 4) కేంద్ర ప్రాయోజిత పథకాలు: ఈ విధమైన పథకాలలో రాష్ట్రాలు భరించవలసిన భాగంలో వ్యత్యాసముంటుంది. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు భరించేది చాలా తక్కువగా, సుమారుగా 10శాతానికి మించదు. మిగతా 90శాతం కేంద్రం భరించవచ్చు. 5) కేంద్ర పన్నుల్లో రాయితీలు: ఎక్సైజ్ పన్నులు, ఆదాయం పన్నుల్లాంటి వాటిలో ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం మినహాయింపులివ్వవచ్చు. కొత్తగా పరిశ్రమలు స్థాపించడానికి, పెట్టుబడిదారులను ఆకర్షించడానికి, ఇతర ప్రాంతాల నుంచి పరిశ్రమలు తరలించడానికి ఈ పథకం తోడ్పడుతుంది. హోదాతో స్వర్గం దిగిరాదు కానీ.... రాష్ట్ర విభజన పర్యవసానంగా ఆంధ్ర ప్రాంతం రాజధానిని కోల్పోయింది. రాజధాని లేకుండా పాలనా యంత్రాంగం అస్తవ్యస్తంగా ఉంటుంది. ఇది తక్షణావశ్యకత. రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు అవసరమవుతాయని ఆర్థికవేత్తల, పాలనాదక్షుల అభిప్రాయం. ఆధునిక హంగులతో రాజధాని నిర్మాణం జరగాలి. ఆంధ్ర ప్రాంతం నలుమూలలకు రాజధాని రాస్తాలు ఏర్పడాలి. దేశంలోని ఇతర ప్రాంతాలతోనూ అనుసంధానించాలి. అందుకు అవసరమైన వనరులను ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సమకూర్చుకోలేదు. దశలవారీగా , త్వరితగతిన సాయానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. సహాయక గ్రాంట్లు మంజూరు చేయాలి. కేవలం ఆర్థిక సంఘాల ద్వారా ఆ పని జరగదు. అందువల్ల ప్రత్యేక హోదా కావాలి. విభజన పూర్వం, తర్వాత కూడా ఆంధ్రదేశంలో అభివృద్ధి చెప్పుకోదగిం దిగా లేదు. పారిశ్రామిక రంగం పతనమైంది. లక్షల సంఖ్యలో నిరుద్యోగులు రోడ్డున పడ్డారు. చిన్న పరిశ్రమలు చితికిపోయాయి. కొన్ని పరిశ్రమలు, ఇక్కడ రాజకీయ పరిస్థితుల రీత్యా ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. సెజ్‌ల ఆస్తులు నిరర్ధక ఆస్తులుగా మారిపోయాయి. అక్కడ పొలాలు బీళ్లుగా మారి పోయాయి. ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే పరిశ్రమలు రావాలి. వాటికి పెట్టుబడులు కావాలి. వ్యవసాయం లాభ సాటిగా మారాలంటే నీటి పారుదల సౌకర్యాలు పెరగాలి. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం జరగాలి. అందుకు ప్రత్యేక హోదా ఉపకరిస్తుంది. అయితే ప్రత్యేక హోదా కల్పించినంత మాత్రానే సకలం సమున్నతం కాకపోవచ్చు. అయితే ఆ హోదా ప్రస్తుత ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించడానికి చేయూతనిస్తుంది. అందువల్లే ఏపీలోని అన్ని రాజకీయ పక్షాలూ విభేదాలు మరిచి ప్రత్యేక హోదా కోసం కలిసికట్టుగా పోరాడాలి. - వ్యాసకర్త మాజీ అధ్యక్షులు కళాశాలల, విశ్వవిద్యాలయాల అధ్యాపక సంఘాల సమాఖ్య సెల్ : 9849435142. - గడ్డం కోటేశ్వరరావు -
హామీలు, ప్రత్యేక హోదా.. రెండూ హక్కే
సాక్షి, హైదరాబాద్: కనీసం రాజధాని కూడా లేకుండా అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తున్నప్పుడు రాష్ట్రప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, నిరసన వ్యక్తమయినపుడు అన్యాయాన్ని పూర్తిగా కాకపోయినా కొంత మేరకైనా సరిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో పలు హామీలు చేర్చింది. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి విభజన చట్టంలో పేర్కొన్న హామీలు సరిపోవన్న ఆందోళనలు పెరగడంతో ప్రత్యేక హోదా కూడా ఇవ్వడం ద్వారా రాష్ట్రాన్ని ఆదుకుంటామని పార్లమెంట్లో సాక్షాత్తూ అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ హామీ ఇచ్చిన విషయం విదితమే. అంటే చట్టంలో పేర్కొన్న హా మీలు అమలు చేయడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత. వాటిని పొందడం రాష్ట్ర ప్రజల చట్టబద్దమైన హక్కు. ప్రత్యేక హోదా కూడా అంతే. హోదాను పొందడం ఆంధ్రప్రదేశ్ హక్కు. రాష్ట్ర బంగరు భవిష్యత్‌కు ఈ రెండూ అత్యావశ్యకం. ఈ రెండిం టిని సాధిస్తే రాష్ట్ర ప్రజలకు సంజీవినిలా ఉపయోగపడతాయి. అలా కాకుండా.. ఏ ఒక్కటి విస్మరించినా రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుంది. హామీలకు ప్యాకేజీ ముసుగు పార్లమెంట్ సాక్షిగా చట్టం ద్వారా సంక్రమించిన హామీలు అమలు చేస్తేనే.. రూ. 2 లక్షల కోట్ల మేర ప్రయోజనం చేకూరుతుంది. ఐఐటీ, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీ లాంటి జాతీయ స్థాయి విద్యాసంస్థల ఏర్పాటు, మెట్రోరైల్ ప్రాజెక్టులు మొదలు భారీ నౌకాశ్రయాలు, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, విమానాశ్రయాలు, ఇండస్ట్రియల్ కారిడార్లు, పారిశ్రామిక ప్రాంతాలు, రాజధాని అభివృద్ధి, ఆర్థిక లోటు భర్తీ.. లాంటి హామీలను విభజన చట్టంలో పొందుపరిచారు. తప్పకుండా అమలు చేయాల్సిన హామీలను గాలికి విడిచి, ఆ హామీల్లో కొంత భాగానికి ప్యాకేజీ ముసుకు తొడిగే ప్రయత్నం చేస్తున్నారు. ఆశ, శ్వాస హోదానే మరోవైపు.. రాష్ట్ర భవిష్యత్‌కు అపర సంజీవిని లాంటి ప్రత్యేక హోదాను పూర్తిగా పక్కకు పెట్టే ప్రయత్నం సాక్షాత్తూ ముఖ్యమంత్రి చేయడం పట్ల రాష్ట్ర ప్రజల్లో విస్మయం వ్యక్తమవుతోంది. రెండూ హక్కులే అయినప్పుడు.. ముందుండి పోరాడాల్సిన ముఖ్యమంత్రి, ఆ పని చేయకపోగా, పోరాడుతున్న ప్రతిపక్ష నేత జగన్‌కు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నారు. ప్రత్యేక హోదా వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదని ముఖ్యమంత్రి అంటున్నారు. ప్యాకేజీ ద్వారానే ఎక్కువ నిధులు వస్తున్నప్పుడు.. హోదా ఎందుకని ప్రశ్నిస్తోన్న ముఖ్యమంత్రి.. చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేస్తే అంతకంటే ఎక్కువే నిధులు వస్తాయనే విషయాన్ని తెలివిగా పక్కకు తప్పిస్తున్నారు. ఈ ప్యాకేజీ ఏదో కొత్తగా సాధిస్తున్నట్లు ప్రజలను మభ్య పెడుతూ.. హామీలు, హోదాను అటకెక్కించే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా సాధిస్తామంటూ ఊరూవాడా ప్రచారం చేసిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ‘ఓటుకు కోట్లు’ కేసులో బయటపడటానికి కేంద్ర ప్రభుత్వం ముందు సాగిలపడి హోదా అంశాన్ని ఫణంగా పెట్టారు. ఇదే చంద్రబాబు.. గత ఏడాది తిరుపతి ఎన్నికల ప్రచార సభలో.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు సరిపోదని, కనీసం 15 సంవత్సరాలు ఉండాలని చెప్పడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనం. విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుకు నిధులు తెచ్చి, ప్రత్యేక హోదా సాధించిన తర్వాతే.. ఆయన చెబుతున్న ప్యాకేజీ గురించి మాట్లాడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హోదా కోసం ప్రయత్నించకపోవడం, చట్టబద్దమైన హామీలకు ప్యాకేజీ ముసుగేయడం.. రాష్ట్రానికి అన్యాయం చేయడమేనని మేధావులు హెచ్చరిస్తున్నారు. హామీల అమలు చట్టబద్ద హక్కు విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుకు రూ. 2 లక్షల కోట్లు అవసరమని అంచనా. ఈ హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. విభజన చట్టంలోని హామీల అమలు ఆంధ్రప్రదేశ్ ప్రజల చట్టబద్దమైన హక్కు. ఈమేరకు కేంద్రం నిధులు ఇచ్చి తీరాల్సిందే. కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా.. ఈ హామీలు అమలు కావాలనే ఉద్దేశంతోనే వాటికి చట్టబద్దత కల్పించారు. అప్పటి అధికార, విపక్షాలతో చంద్రబాబు కుమ్మక్కై అన్యాయంగా రాష్ట్రాన్ని విభజనకు కారకులయ్యారు. ప్రజల నుంచి అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో.. హామీలతో పాటు ప్రత్యేక హోదా కూడా కల్పించాలని పార్లమెంట్ సాక్షిగా హామీ లభించిన విషయం తెలిసిందే. ప్రజా ప్రయోజనాలు ఫణంగా.. విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుకు ప్రయత్నించకుండా.. ప్రత్యేక హోదా సాధనకు పోరాడకుండా.. ప్యాకేజీని టీడీపీ ప్రభుత్వ పెద్దలు తెర మీదకు తీసుకొచ్చారు. ప్యాకేజీ పేరుతో కేంద్రం నుంచి కొన్ని నిధులు తెచ్చుకొని.. విభజన చట్టంలోని హామీలను గాలికి వదిలి.. భారీ ప్రచారంతో ప్రజల మెదళ్ల నుంచి హోదా ఆకాంక్షలను తొలగించడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే కేంద్రం నుంచి భారీగా నిధులు రానున్నాయని, ప్రత్యేక హోదాను మించి లబ్ది జరగనుందని అసత్య ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రం హక్కులయిన హామీల అమలు, హోదా సాధన.. రెండింటినీ విస్మరించి ప్రజా ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారు. హోదా వస్తే.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కితే.. పెద్ద మొత్తంలో పెట్టుబడులు ప్రవహిస్తాయి. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక హోదా చేయూతనిస్తుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఆకర్షించడానికి, పారిశ్రామికంగా ముందడుగు వేయడానికి, మౌలిక సదుపాయాల కల్పనకు దోహదం చేస్తుంది. రాష్ట్రంలో సుస్థిర అభివృద్ధికి, శాశ్వత ఉపాధి అవకాశాలకు మార్గం ఏర్పడుతుంది. 90 శాతం గ్రాంట్లు.. 10 శాతం లోన్లు సాధారణ రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే గాంట్లు 30 శాతం దాటవు. మిగతా 70 శాతాన్ని రాష్ట్రాలే భరిం చాలి. కానీ పత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు 90 శాతం గ్రాంట్లుగా కేంద్ర సాయం అందుతుంది. గ్రాంట్లుగా ఇచ్చే సహాయాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. మిగతా 10% రాష్ట్రం భరిస్తే సరిపోతుంది. చాలా పథకాలు, కార్యక్రమాలు, ప్రాజెక్టులకు రాష్ట్రం భరించాల్సిన 10 శాతాన్ని కూడా కేంద్రం రుణంగా సమకూరుస్తుంది. సత్వర సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ) కింద మంజూరైన ప్రాజెక్టులకూ ఇది వర్తిస్తుంది. 90 శాతం ఖర్చును కేంద్రమే భరిస్తుంది. పారిశ్రామిక యూనిట్లకు నూటికి నూరు శాతం ఎకై్సజ్ డ్యూటీ మినహాయింపు లభిస్తుంది. ఫలితంగా రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులు ముందుకు వస్తారు. -
అభ్యంతరాలుంటే రిలీవ్ చేయవద్దు
ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపులపై స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి కేటాయించిన ఉద్యోగుల విషయంలో ఏమైనా అభ్యంతరాలు వ్యక్తమైతే, కేంద్రం తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు సంబంధిత ఉద్యోగులను రిలీవ్ చేయవద్దని సాధారణ పరిపాలన శాఖలోని రాష్ట్ర పునర్విభజన విభాగం స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్ శర్మల పేర్లతో సంయుక్త ఆదేశాలు జారీ చేసింది. తాత్కాలికంగా మరో రాష్ట్రానికి కేటాయించిన ఉద్యోగుల్లో కింది కేటగిరీల వారిని రిలీవ్ చేయవద్దని ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. - తాత్కాలిక కేటాయింపుల్లో తనకు అన్యాయం జరిగిందని ఎవరైన ఉద్యోగి రెండు వారాల గడువులోపు దరఖాస్తు చేసుకుంటే, సదరు ఉద్యోగిని రిలీవ్ చేయవద్దు. - ఎవరైన ఉద్యోగికి సంబంధించిన తాత్కాలిక కేటాయింపుపై నిర్ణీత గడువులోగా ఇతరుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైతే సదరు ఉద్యోగిని రిలీవ్ చేయవద్దు. - తాత్కాలిక కేటాయింపుల ప్రకటన వెలువడిన తర్వాత రెండు వారాల నిర్ణీత గడువులోగా అభ్యంతరాలు, ఫిర్యాదులు అందితేనే పై రెండు కేటగిరీల ఉద్యోగులను రిలీవ్ చేయకూడదు. గడువులోగా అభ్యంతరాలు అందినా కొందరు ఉద్యోగులను బలవంతంగా రిలీవ్ చేస్తున్నారని వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేసింది. -
రాజధానికి సహకరించాలి
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు, పార్టీలు రాజధాని నిర్మాణానికి సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు. అనుకూల వాతావరణం లేకపోతే ఇన్నాళ్లూ పడిన శ్రమ వృథా అవుతుందని, పెట్టుబడులు రావని చెప్పారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన సీఆర్డీఏ అథారిటీ తొలి సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. కొత్త రాజధానిలో పెట్టుబడులు పెట్టడానికి చైనా, జపాన్, జర్మనీ, సింగపూర్ వంటి పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. తాను ప్రపంచమంతా తిరిగి పెట్టుబడులకోసం ప్రయత్నిస్తుంటే వాళ్లు ప్రజల్ని రెచ్చగొట్టి రాజధాని ప్రాంతంలో ఆందోళనలు చేస్తున్నారని ప్రతిపక్షాలను విమర్శించారు. అలజడులు సృష్టిస్తే పెట్టుబడిదారులు ఎలా వస్తారని ప్రశ్నించారు. ఎటువంటి వివాదాలకు తావు లేకుండా కన్సల్టెంట్లు, ఆర్కిటెక్ట్‌ల ఎంపిక స్విస్ చాలెంజ్ విధానంలో జరుపుతున్నట్లు తెలిపారు. రాజధాని ప్రాంతంలో కాన్సెప్ట్ సిటీల నిర్మాణం చేపట్టాలని యోచిస్తున్నట్లు తెలిపారు. హైకోర్టు, న్యాయ విశ్వ విద్యాలయం ఒకేచోట ఏర్పాటుచేసి అక్కడే ప్రపంచానికి అవుట్సోర్సింగ్ అందించే లీగల్ సర్వీసెస్‌ను కూడా అందుబాటులో ఉండేలా జస్టిస్ సిటీ నిర్మాణం చేపడతామన్నారు. నెలరోజుల్లోపు అటవీ భూముల క్లియరెన్స్ పూర్తి చేయాలని సూచించారు. అవసరమైతే తాను కేంద్రంతో మాట్లాడతానని చెప్పారు. పచ్చదనమే లక్ష్యం: సీఎం రాష్ట్రంలో 23 శాతంగా ఉన్న పచ్చదనాన్ని 40 శాతానికి తీసుకెళ్లే లక్ష్యంతో అందరూ పనిచేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. కృష్ణపట్నం పోర్టు ఆధ్వర్యంలో హెలికాప్టర్ ద్వారా సీఆర్డీఏ పరిధిలోని అటవీ ప్రాం తంలో విత్తనాలు జల్లే కార్యక్రమాన్ని శుక్రవారమిక్కడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎం జెండా ఊపి ప్రారంభించారు. రాజధానిలో కొత్త పరిశ్రమలు: మిశ్రా రాజధాని అమరావతి రీజియన్‌లో ఎనర్జీ, రవాణా, అర్బన్‌డెవలప్‌మెంట్, ఎలక్ట్రిసిటీ సెక్టార్లకు చెందిన పలు పరిశ్రమల స్థాపనకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు పరిశ్రమల శాఖ డెరైక్టర్ మిశ్రా తెలిపారు. -
ఏకాభిప్రాయానికి వస్తేనే పరిష్కారం
విద్యుత్ ఆస్తుల పంపకంపై షీలాభిడే కమిటీ సూచన సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రగులుతున్న విద్యుత్ ఆస్తుల పంపకంపై ఉభయరాష్ట్రాలూ ఏకాభిప్రాయానికి రావాలని, అప్పుడే తాము అవసరమైన సిఫారసులు చేయగలమని షీలాభిడే కమిటీ స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులు, అప్పుల విభజనకు షీలాభిడే నేతృత్వంలో ఓ కమిటీని నియమించడం తెలిసిందే. ఈ కమిటీ ఎదుట ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యుత్ అధికారులు సత్యమూర్తి(డెరైక్టర్, ఫైనాన్స్ ఏపీ), శ్రీనివాస్(జేఎండీ, తెలంగాణ) గురువారం హాజరయ్యారు. ఇరుపక్షాలూ తమ అభ్యంతరాల్ని కమిటీ సభ్యులు కేవీ రావు, ఏకే గోయల్‌కు తెలియజేశారు. యూనిట్లవారీగా ఆస్తుల లెక్కింపుకు తెలంగాణ ప్రభుత్వం సహకరించట్టేదని ఏపీ ఆరోపించినట్టు సమాచారం. అదేవిధంగా పూర్తి ఆడిట్ నివేదికల్ని తమకివ్వకుండా ఇష్టానుసారంగా ఆస్తుల పంపకాలు చేశారని, ఇందుకోసం ఏర్పాటు చేసిన కన్సల్టెన్సీ కూడా ఏపీ అధికారుల అధీనంలోనే ఉందని తెలంగాణ ప్రత్యారోపణ చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు అంతర్గత వ్యవహారాలపై చర్చించుకుని.. ఏకాభిప్రాయానికి రావాలని షీలాభిడే కమిటీ సభ్యులు ఇరుపక్షాలకు సూచించారు. దీంతో సమావేశం అర్ధంతరంగా వాయిదా పడింది. -
ఈ ప్రవర్తన సరికాదు
అందరూ అంచనా వేసినట్టే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ‘వాయిదాల’ పద్ధతిలో సాగుతున్నాయి. జూలై 21నుంచి ఇంతవరకూ మొత్తంమీద పది రోజులు సమావేశాలు జరగ్గా కనీసం ఒక్కరోజైనా సభలు సజావుగా సాగలేదు. సోమవారం ఇది పతాకస్థాయికి చేరుకుంది. ప్లకార్డుల్ని ప్రదర్శించి సభ మధ్యలోకి దూసుకొచ్చిన 25మంది కాంగ్రెస్ ఎంపీలను అయిదురోజులపాటు సస్పెండ్ చేస్తున్నట్టు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. పార్లమెంటు చరిత్రలో ఈ స్థాయిలో సభనుంచి విపక్ష సభ్యుల్ని సస్పెండ్ చేయడం ఇదే ప్రథమం. పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు చర్చకొచ్చిన సందర్భంలో కాంగ్రెస్‌కే చెందిన 18మంది ఎంపీలను నిరుడు ఫిబ్రవరిలో సస్పెండ్‌చేశారు. పార్లమెంటులో పరస్పరం తలపడుతున్న పక్షాలు కాంగ్రెస్, బీజేపీలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికిగానీ, అధికారానికిగానీ కొత్త కాదు. కానీ ఇద్దరూ ప్రజాస్వామ్యాన్ని అపార్థం చేసుకున్నంతగా... అర్థం చేసుకున్నట్టు కనబడదు. తాము ఒక డిమాండుతో సభకు వచ్చి, పట్టుబట్టినప్పుడు దాన్ని ఆమోదించడం మినహా అధికారపక్షానికి గత్యంతరం లేదని కాంగ్రెస్ అనుకుంటున్నది. ఆరోపణలు వచ్చినప్పుడు లేదా ఒక సమస్య విషయంలో చర్యకు విపక్షం పట్టుబట్టినప్పుడు మిన్ను విరిగి మీద పడినా అంగీకరించరాదన్నదే తమ వైఖరిగా ఉండాలని అధికార పక్షం భావిస్తోంది. ఎన్నికలను ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక అవసరంగా కాక జాతరగా మార్చి... గెలుపే ధ్యేయంగా ఏమైనా చేయడానికి సిద్ధపడి చట్టసభల మెట్లెక్కే రాజకీయ పక్షాలనుంచి ఇంతకు మించిన ఆచరణను ఆశించడం సాధ్యం కాదేమో! పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి చాలా ముందే ఇరు పక్షాలూ తమ తమ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో తేల్చిచెప్పాయి. లలిత్‌మోదీ వ్యవహారంలో ఆరోపణలొచ్చిన విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజే సింధియాలు...వ్యాపం, పీడీఎస్ కుంభకోణాల్లో ఇరుక్కున్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌పైనా చర్యకు పట్టుబడతామని, వారి రాజీనామాలకు మినహా మరి దేనికీ అంగీకరించబోమని కాంగ్రెస్ చెప్పింది. ఆరోపణలొచ్చిన మొదట్లో ఏం చేయాలో పాలుబోనట్టుగా కనబడిన బీజేపీ రాను రాను తన వైఖరిని దృఢపరుచుకుంది. ఆరునూరైనా ఆరోపణలు వచ్చిన వారందరినీ కాపాడుకోవాల్సిందేనని నిర్ణయించుకుంది. పర్యవసానంగా చర్చకు సిద్ధమని బీజేపీ...చర్యల తర్వాతే చర్చని కాంగ్రెస్ భీష్మించుకుని కూర్చున్నాయి. ఆరోపణలొచ్చినవారిలో ఒక్క చౌహాన్ మినహా మిగిలినవారెవరూ వాటి గురించి మాట్లాడనే లేదు. చౌహాన్ కనీసం బలహీనమైన వాదనైనా చేశారు. అసలు ఆ కుంభకోణాన్ని బయటపెట్టింది తానేనంటూ దబాయించారు. సుష్మా స్వరాజ్ కేవలం మానవతా దృక్పథంతో లలిత్‌మోదీకి మాట సాయం చేశానని ఒక ట్వీట్లో క్లుప్తంగా చెప్పడం మినహా ఏ వేదికపైనా దాన్ని గురించి వివరణనివ్వలేదు. పాత్రికేయులు ఒకటి రెండు సందర్భాల్లో ఆమెను నేరుగా ప్రశ్నించినా జవాబివ్వకుండా వెళ్లిపోయారు. వసుంధర రాజే మధ్యలో ఒకసారి ఢిల్లీకి వచ్చినా పాత్రికేయులను కలవడానికే ఇష్టపడలేదు. ఇంత గొడవ జరిగాక సుష్మా రాజ్యసభలో సోమవారం ఒక ప్రకటన చేశారు. ఈ వ్యవహారంలో తన తప్పేమీ లేదని వివరణనిచ్చారు. లలిత్ మోదీకి తానసలు సాయమే చేయలేదని చెప్పారు. ఈ ప్రకటన చేసిన తీరుపై కాంగ్రెస్ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాల మాట అటుంచి... ఇన్నాళ్లుగా ఆమె ఎందుకు మౌనవ్రతం పాటించారో, అందుకు కారణలేమిటో సుష్మా చెప్పాల్సి ఉంది. సుష్మా స్వరాజ్ గడిచిన లోక్‌సభలో విపక్ష నేతగా పనిచేశారు. యూపీఏ హయాంలో ఆరోపణలు ఎదుర్కొన్న కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలంటూ ఆమె నాయకత్వంలోనే బీజేపీ పట్టుబట్టింది. కొన్ని సందర్భాల్లో ఆ డిమాండును నెరవేర్చుకుంది. అప్పుడు కూడా విలువైన సభా సమయాలు వృథా అయ్యాయి. అదే పనిని ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంటే బీజేపీకి కంటగింపుగా ఉంది. మొత్తానికి ప్రధాన పక్షాలు రెండూ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నాయి. అధికారంలో ఉండగా వల్లించే సూక్తులకూ, విపక్షంలో ఉండగా ప్రవర్తించే తీరుకూ పోలిక ఉండటం లేదు. ఎదుటి పక్షం అప్రజాస్వామికంగా ఉంటున్నదని ఆరోపించే వారు తమలోని అప్రజాస్వామికతను గుర్తించడంలేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 68 ఏళ్లవుతున్నది. అనుభవం వచ్చిన కొద్దీ మరింతగా పరిణతిని సాధించాల్సిన చట్టసభల తీరు అందుకు విరుద్ధంగా ఉంటున్నది. మొదట్లో ఎంతో అర్ధవంతమైన చర్చలకు వేదికలుగా ఉండే చట్టసభలు ఇప్పుడు గందరగోళానికి మారు పేరవుతున్నాయి. జనం ఒకసారి తమకు మెజారిటీ ఇచ్చారు గనుక ఈ అయిదేళ్లలో తాము ఏం చేసినా ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేదన్నట్టు అధికారంలో ఉండేవారు ప్రవర్తిస్తున్నారు. ఈ ధోరణి పార్లమెంటులో మాత్రమే కాదు...అసెంబ్లీల్లోనూ కనబడుతోంది. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం కీలకమైనదే అయినా అదే అన్నిటినీ నిర్ణయిస్తుంది...నిర్ణయించాలనుకోవడం సరికాదు. అధికార, విపక్షాలు రెండూ ప్రజలకు జవాబుదారీగా ఉండటం ముఖ్యం. తమ ప్రతి అడుగూ బాధ్యతాయుతంగా ఉండాలని గుర్తించడం ముఖ్యం. విపక్షం అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం, తమవైపుగా జరుగుతున్న లోటుపాట్లను సరిదిద్దుకోవడం తమ మనుగడకు మాత్రమే కాదు... ప్రజాస్వామ్యం మనుగడకు కూడా చాలా అవసరమని అధికారపక్షం గుర్తించాలి. అదే విధంగా చట్టసభలను నెలకొల్పడంలోని ప్రధానోద్దేశం చర్చలే తప్ప రచ్చ కాదని...సభలో తమ ఆచరణ అంతిమంగా ఆరోగ్యవంతమైన చర్చకు దోహదపడాలని, ఆ దిశగా అధికారపక్షాన్ని ఒప్పించాలని విపక్షం గమనించాలి. ఇద్దరికిద్దరూ చిత్తం వచ్చినట్టు వ్యవహరిస్తే చివరకు నవ్వులపాలయ్యేది మన ప్రజాస్వామ్యమే. -
ఏడాదిగా అమల్లోనే సెక్షన్-8
* ఇప్పుడు కొత్తగా అమలు చేయాలని మంత్రులే కోరడమేమిటి? * ‘ఓటుకు కోట్లు’ కేసును పక్కదారి పట్టించడం కోసమే హంగామా * వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్-8 ప్రకారమే ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌కు ఇద్దరు సలహాదారుల నియామకం కూడా జరిగిపోయాక, అమలులో ఉన్న చట్టాన్ని కొత్తగా అమలు చేయాలని రాష్ట్ర మంత్రులు కోరడమేమిటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ‘ఓటుకు కోట్లు’ కేసులో తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలు ఇరుక్కున్న తరువాత ఆ విషయం నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకే చంద్రబాబు సర్కార్ ఈ విషయాన్ని తెరపైకి తెచ్చి రాద్ధాంతం చేస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి దుయ్యబట్టారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమకు తెలిసినంతవరకు గత ఏడాది జూన్ 2 వ తేదీ నుంచే విభజన చట్టంలోని అన్ని అంశాలతో పాటు సెక్షన్-8 కూడా అమలులోకి వచ్చినట్టేనని చెప్పారు. ఈ సెక్షన్ అమలులోకి రాబట్టే గవర్నర్‌కు ఇద్దరు సలహాదారుల నియామకం జరిగిందని తెలిపారు. ఏడాది గడిచాక తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నేతలు పట్టుబడిన తర్వాత సెక్షన్ -8 అమలు గురించి మాట్లాడడం హాస్యాస్పదమని విమర్శించారు. ఏపీ సీఎంగా కాకుండా టీడీపీ అధ్యక్ష హోదాలోనో లేదంటే వ్యక్తిగా బాబుకు ఇబ్బందులు ఎదురుకాగానే టీడీపీ నేతలు దీనిని గురించి గగ్గోలు పెడితే జాతీయ స్థాయిలో రాష్ట్రం గురించి ఏమనుకుంటారని బుగ్గన ప్రశ్నించారు. సెక్షన్-8తో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని నిర్మాణంతదితర అంశాల్లో రాష్ట్రానికి న్యాయం జరగాలన్నదే వైఎస్సార్సీపీ ఉద్దేశమని రాజేంద్రనాథ్ స్పష్టంచేశారు. -
మేం వెళ్లిపోతున్నాం
రిలీవ్ లేఖలిచ్చి వెళ్లిపోయిన తెలంగాణ టీచర్లు చింతూరు: రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణకు సర్దుబాటు అయి, తూర్పు గోదావరి జిల్లాలోని విలీన మండలాల్లో పని చేస్తున్న టీచర్లు మంగళవారం స్వచ్ఛందంగా రిలీవ్ లేఖలిచ్చారు. సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు తమను రిలీవ్ చేయాలని వారు కొంతకాలం నుంచి ఆంధ్రా అధికారులను కోరుతున్నారు. తమ ఉద్యోగులను తమ రాష్ట్రానికి పంపాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ సైతం విలీన మండలాల అధికారులకు లేఖలు రాశారు. తమకు రాష్ట్రస్థాయి నుంచి ఆదేశాలు రావాలని ఇక్కడి అధికారులు చెప్పడంతో తెలంగాణ ఉపాధ్యాయులు నిరాహార దీక్షలకు దిగారు. తమను ఆంధ్రా అధికారులు రిలీవ్ చేయడం లేదని, దీనిపై తెలంగాణ అధికారులే ఏదైనా నిర్ణయం తీసుకోవాలని విలీన మండలాల్లోని తెలంగాణ ఉపాధ్యాయులంతా సోమవారం ఖమ్మం కలెక్టరేట్, డీఈఓ కార్యాలయాల ముట్టడి చేపట్టారు. అనంతరం వారంతా మంగళవారం తమ ఎంఈఓ కార్యాలయాలకు చేరుకుని మూకుమ్మడిగా స్వచ్ఛంద రిలీవ్ లేఖలు ఇచ్చి తెలంగాణకు వెళ్లిపోయారు. ఇప్పటికే చింతూరు మండలంలో ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు తెలంగాణకు వెళ్లిపోగా.. తాజాగా జిల్లా పరిషత్‌కు చెందిన 11 మంది, ఎంపీపీ, ఎంపీయూపీ పాఠశాలలకు చెందిన 43 మంది స్వచ్ఛంద రిలీవ్ లేఖలిచ్చి వెళ్లిపోయారు. నెల్లిపాక మండలంలో 138 మంది, వీఆర్ పురం మండలంలో 48 మంది, కూనవరం మండలంలో 33 మంది కలిపి మొత్తంగా 273 మంది ఈవిధంగా లేఖలు ఇచ్చి తెలంగాణకు వెళ్లిపోయారు. తెలంగాణ ఉపాధ్యాయులు వెళ్లిపోవడంతో చింతూరు మండలంలోని 24 ఏకోపాధ్యాయ పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
బాధ్యతను గుర్తిస్తేనే భవిష్యత్తు
నవ్యాంధ్రప్రదేశ్‌కు కావలసిన సౌకర్యాలన్నిటినీ కల్పిస్తామని ఆనాటి ప్రధాని మన్మోహన్సింగ్ పెద్దల సభ సాక్షిగా హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా కల్పించడం అందులో కీలకమైనది. ఆ తర్వాత ఉనికిలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సైతం ఎన్నో తాయిలాలున్నాయి. ఏడాది కావస్తున్నా ఇందులో ఏ ఒక్కటీ అమలు కాలేదు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యతను గుర్తిస్తాయా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను చీల్చడంలో అత్యుత్సాహం ప్రదర్శించినవారు చేసిన బాసలు నెరవేర్చవలసి వచ్చేసరికి నీళ్లు నములుతున్నారు. రకరకాల సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. బాధ్యులు మీరంటే మీరని ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు. ఆనాడు జరిగిందేమిటో ఎవరూ మరిచి పోలేరు. జనం ఎంతగా ఆందోళన చేసినా, రాజకీయ పక్షాలు ఎంతగా నిరసిం చినా రాష్ట్రాన్ని ముక్కలు చేశారు. ఆఖరికి అయిదు ఊళ్లయినా ఇవ్వండని పాండవుల తరఫున కృష్ణుడు రాయబారం చేసినట్టు హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించమని ఆనాటి కేంద్ర మంత్రులు కోరినా అప్పటి యూపీఏ సర్కారు వినిపించుకోలేదు. ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్... ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ రెండూ కలిసి నవ్యాంధ్రప్రదేశ్‌కు బంగారు భవి ష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చి సమైక్యాంధ్రప్రదేశ్‌ను రెండుగా చీల్చారు. ఒక రాష్ర్టం నీటి వనరులలోనూ, ఖనిజసంపదలోనూ, ఆర్థిక పరిపుష్ఠతలోనూ లబ్ధి పొందింది... రెండో రాష్ర్టం ఆర్థిక సంక్షోభంలోనూ, జలవనరుల జంజా టంలోనూ... వైద్య, విద్యా రంగాలలోనూ వెనుకంజలో పడింది. ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి కష్టాలూ ఎదురుకావని, దాన్ని ఆదుకుంటా మని ఆనాటి ప్రధాని మన్మోహన్సింగ్ పెద్దల సభ సాక్షిగా హామీ ఇచ్చారు. అందుకు ఆరుసూత్రాలను కూడా ప్రకటించారు. ప్రత్యేక హోదా కల్పిస్తామని ‘మనసా, వాచా, కర్మణా’ వాగ్దానంచేశారు. ఇప్పుడు ఆ మనసూలేదు....ఆ కర్మాలేదు. వాచకం మాత్రం మిగిలిపోయింది! నిరుడు మార్చి 1న వెలువడిన 71 పేజీల ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం నవ్యాంధ్రప్రదేశ్‌కు మరికొన్ని తాయిలాలు ప్రకటించింది. అయితే ఆ చట్టంలో ప్రధాని ప్రకటించిన వాగ్దా నాల జాడలేదు. పర్యవసానంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడంలో చట్టపరమైన అడ్డంకులు ఏర్పడ్డాయి. అయితే మనసుంటే మార్గముంటుంద న్నట్టు... చట్టంలో మార్పులు చెయ్యవచ్చు, హామీలు నిలబెట్టుకోవచ్చు. నవ్యాంధ్రప్రదేశ్‌కు న్యాయం చెయ్యవచ్చు. అసలు ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టం 2014లో పరిశేష ఆంధ్ర ప్రదేశ్‌కు ఏఏ హామీలు ఇచ్చారో ఒకసారి పరిశీలిద్దాం. చట్టంలోని పదమూ డవ షెడ్యూలులో పొందుపరచినవన్నీ అమలుపరచడానికి తగిన చర్యలు తీసుకుంటామని సెక్షన్ 93 స్పష్టంచేసింది. పదమూడవ షెడ్యూలులో నవ్యాంధ్రప్రదేశ్‌కు సమకురుస్తామన్న సౌకర్యాలు: - ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎమ్, ఐఐఎస్ఇఆర్, సెంట్రల్ యూనివర్సిటీ, పెట్రోలియం యూనివర్సిటీ, అగ్రికల్చరల్ యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటీలను నెలకొల్పడం. - అఖిలభారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ(ఎయిమ్స్)వంటి సూపర్ స్సెషాలిటీ ఆస్పత్రి, వైద్య విద్యా సంస్థలను ప్రారంభించటం. - ట్రైబల్ యూనివర్సిటీని నెలకొల్పడం. - నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్థాపించటం. - 2018 నాటికి మొదటి దశ పూర్తయ్యే విధంగా దుగ్గిరాజుపట్నాన్ని మేజర్ పోర్ట్‌గా చేయడం. - విభజన జరిగిన తేదీ నుంచి ఆర్నెల్లలో వైఎస్ఆర్ జిల్లాలో సెయిల్ సంస్థ ఇంటిగ్రేటెడ్ స్టీల్‌ప్లాంటు నిర్మాణానికి కావల్సిన అవకాశాలను పరిశీలించడం. - ఐఓసీ లేదా హెచ్‌పీసీఎల్ నవ్యాంధ్రప్రదేశ్‌లో విభజన తేదీ నుంచి ఆర్నె ల్లలో గ్రీన్ ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి కావలసిన అవకాశాలు పరిశీలించడం. - ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్ తరహాలో విశాఖ-చెన్నై కారిడార్ నిర్మాణానికి పూనుకోవడం. - విజయవాడ, విశాఖ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి పెంచడం. - కొత్త రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయడం. - ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నుంచి దేశంలోని అన్ని నగరాలకూ రోడ్డు, రైలు రవాణా సదుపాయాల కల్పన. ఇవిగాక సెక్షన్ 94లో మరికొన్ని హామీలిచ్చారు. - రాష్ర్ట పారిశ్రామికాభివృద్ధికి, ఆర్థికాభివృద్ధికి కావలసిన ఆర్థిక సౌకర్యా లను పన్ను రాయితీలతోసహా కల్పించడం. - రాష్ర్టంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, భౌతిక, సామాజిక పర మైన సౌకర్యాలు కల్పించడం, చేయూతనివ్వటం. - ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో అతిముఖ్యమైన రాజభవన్, హైకోర్టు, సెక్రటేరియేట్, శాసనసభ, శాసనమండలి, యితర మౌలిక సదుపాయాలకు ప్రత్యేకమైన ఆర్థిక సహాయం అందించటం. - ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంకోసం అవసరమైతే క్షీణించిపోయిన అటవీ ప్రాంతాన్ని అందుబాటులోనికి తేవడం. సెక్షన్ 95 ప్రకారం నాణ్యమైన ఉన్నత విద్య రెండు రాష్ట్రాల్లోని విద్యా ర్థులకు అందుబాటులో ఉంచడానికి, రాజ్యంగంలోని 371 డి ననుసరించి ప్రభుత్వ రంగంలోనూ, ప్రైవేట్ రంగంలోనూ, ఎయిడెడ్, అనెయిడెడ్ విద్యా సంస్థల్లోనూ... టెక్నికల్, వైద్య విద్యాసంస్థల్లోనూ పది సంవత్సరాల వరకూ ప్రస్తుతమున్న ప్రవేశ పద్ధతులే కొనసాగాలి. అయితే ఈ నిబంధనను ఇప్పు డు ఉల్లంఘిస్తున్నారు. ఇక్కడ రెండు అంశాలున్నాయి. ఒకటి- చట్టంద్వారా నవ్యాంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను అమలుపరచే విధంగా చూడటం. చట్టంలో పొందుపరచినవన్నీ హక్కులవుతాయి. కనుక వాటిని సాధించుకునే దిశగా కృషి చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమైతే...వాటిని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిది. చట్టంలో పొందుపరిచిన హామీలను రాబట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటుచేసి నిరంతరం పాటు బడాల్సి ఉంటుంది. ఇక రెండోది- రాజ్యసభలో నాటి ప్రధాని ఇచ్చిన హామీ లనూ... మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన అంశాన్ని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచేలా చూడ టం. ఇందుకోసం ఆ చట్టానికి సవరణలు తీసుకురావాలి. అలా సవరణ చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని పదమూడు జిల్లాల్లో అసంపూర్తిగా వున్న ప్రాజెక్టులు వేలసంఖ్యలో ఉన్నాయి. వాటిని మొదటి దశలో పూర్తి చెయ్యాలి. ఉదాహర ణకు ఇళ్లు నిర్మించినా కిటికీలూ, తలుపులూ పెట్టనివి ఉన్నాయి. అలాగే, ఓవర్‌హెడ్ ట్యాంకులు కట్టినా మోటారు పంపులు అమర్చనివి ఉన్నాయి. వంతెనలున్నా వాటిని అనుసంధానించే రోడ్లను చేపట్టకపోవడం, ఫ్లై ఓవర్లు అరకొరగా వదిలేయడం, చాన్నాళ్లక్రితమే శంకుస్థాపనలు పూర్తయినా నిర్మా ణాలు చేపట్టకపోవడం...ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. వీటన్నిటిపైనా పెట్టిన పెట్టుబడులు వృథాగా మారాయి. ఈ విషయంలో శ్రద్ధపెట్టి పూర్తిచేయాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. ఒక దీర్ఘకాలిక ప్రణాళిక, మధ్యకాలిక ప్రణాళిక, స్వల్పకాలిక ఆచరణీయ ప్రణాళిక, మినీ ప్లాన్లు, మైక్రోప్లాన్లు వేసుకుని ముం దుకెళ్తే రాష్ట్రాభివృద్ధికి వీలు కలుగుతుంది. అది వేగవంతమవుతుంది. లేనట్ట యితే ఈ అయోమయ పరిస్థితి యిలాగే కొనసాగుతుంది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కొలువు దీరిన ప్రభుత్వాలు తమ బాధ్యతలను గుర్తిస్తాయా? (వ్యాసకర్త విశ్రాంత ఆచార్యులు, మేనేజ్మెంట్ కన్సల్టెంట్) ఫోన్: 9849085411 -
'కుట్రలో కాదు... అభివృద్ధిలో కలిసి రండి'
హైదరాబాద్: రాష్ట్ర విభజనను ఎమర్జెన్సీతో పోల్చిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల్ని మంత్రి హరీష్ రావు ఖండించారు. మీడియాతో శనివారం ఆయన మాట్లాడుతూ... తెలంగాణ టీడీపీ నేతలు రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొనేందుకు అనర్హులని అన్నారు. విభజనను ఎమర్జెన్సీతో పోల్చిన చంద్రబాబు వ్యాఖ్యల్ని టీటీడీపీ నేతలు సమర్ధిస్తారా? లేక వ్యతిరేకిస్తారా? అని మంత్రి హరీష్ ప్రశ్నించారు. టీటీడీపీ నేతలు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి.. కుట్రలో కాదని ఆయన వ్యాఖ్యానించారు. నిజాయితీ ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ద్వారా నిరసన తెలపాలని మంత్రి హరీష్ రావు అన్నారు. -
'చిచ్చుపెట్టేందుకే శివరామకృష్ణన్ కమిటీ!'
-
చిచ్చుపెట్టేందుకే శివరామకృష్ణన్ కమిటీ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకే శివరామకృష్ణన్ కమిటీని నియమించారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీ మంత్రివర్గ సమావేశం అనంతరం కలెక్టర్లతో మాట్లాడుతూ ఆయనిలా అన్నారు. కేవలం అరగంటలోనే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని చంద్రబాబు చెప్పారు. నవంబర్ 2వ తేదీన నవ నిర్మాణ దీక్ష ఎందుకు చేపడుతున్నానో వివరించే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాజధాని కూడా లేకుండా కట్టుబట్టలతో పంపించారని ఆయన అన్నారు. సంక్షేమ పథకాలు తగ్గించడం వంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నా 1999లో ప్రజలు తమను మళ్లీ గెలిపించారన్నారు. దీంతో ఇక మీదట కూడా అలా జరుగుతుందనే సంకేతాలు ఇచ్చినట్లయింది. తెలంగాణ ప్రభుత్వం మనకు సహకరించే పరిస్థితి కనిపించడం లేదని, ఇంకా సెంటిమెంట్‌ను రాజేసే ధోరణే వారిలో కనిపిస్తుందని అన్నారు. జాన్ 2న సెలబ్రేషన్స్‌కు బదులు నవనిర్మాణ దీక్ష చేయనున్నట్లు చెప్పారు. నిన్న మొన్నటి వరకు రాజధాని ఎంపిక విషయంలో కూడా శివరామకృష్ణన్ కమిటీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్నామని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు మాత్రం రాష్ట్రంలోని మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకే కమిటీ వేశారంటున్నారు. -
విభజన సమస్యలు పరిష్కరించండి
కేంద్ర హోంశాఖ మంత్రితో సీఎం చంద్రబాబు గడ్కరీ, జైట్లీతో భేటీ ఛండీగఢ్‌లో నీతిఆయోగ్ సమావేశంలో పాల్గొన్న సీఎం సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి ఏడాది పూర్తి కావస్తోందని, ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, రాజ్‌నాథ్‌సింగ్, నితిన్గడ్కరీలను ఢిల్లీలోని వారి నివాసాల్లో కలిశారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ అంశాలను వారి దృష్టికి తెచ్చారు. అనంతరం నితిన్‌గడ్కరీ నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతిని కోరినట్టు తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో....: ఏపీని ఒక లాజిస్టిక్ హబ్‌గా తయారు చేసేందుకు రోడ్లు, రైలు మార్గాలను అనుసంధానం చేయాల్సి ఉందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌గడ్కరీకి చెప్పినట్టు చంద్రబాబు తెలిపారు. రాజధాని నుంచి కర్నూలు వరకు ఆరు లేన్ల జాతీయ రహదారి ఇవ్వాలని కోరామన్నారు. విశాఖపట్నం, విజయవాడలలోని బైపాస్ రోడ్డులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరినట్టు చెప్పారు. ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీతో...: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో భేటీ అయి పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తయ్యేందుకు అవసరమైన నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ‘రాజధాని నిర్మాణానికి నిధులు విషయంపై చర్చించాం. గతేడాది రెవెన్యూలోటు రావాల్సి ఉందని ఆయన దృష్టికి తెచ్చాం. అన్ని విధాలా సాయం చేస్తామని జైట్లీ హామీ ఇచ్చారు’ అని చంద్రబాబు తెలిపారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీలో ఒక సీటును బీజేపీకి ఇస్తున్నామని, తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుందని విలేకరుల ప్రశ్నకు సమాధానంగా చంద్రబాబు వెల్లడించారు. రాజధాని భూమి పూజకు సమయం తక్కువగా ఉన్నందున ఎవరినీ ఆహ్వానించడం లేదని, పని ప్రారంభించేప్పుడు ప్రధాన మంత్రి నరేంద్రమోదీని ఆహ్వానించనున్నట్టు తెలిపారు. పోలవరం నిర్వాసితులందరికీ వీలైనంత సాయం చేస్తామన్నారు. అందరి భాగస్వామ్యంతోనే స్వచ్ఛ భారత్: ప్రభుత్వంతోపాటు అన్ని పక్షాల భాగస్వామ్యంతోనే ‘స్వచ్ఛ భారత్’ విజయవంతం అవుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చంఢీగఢ్‌లో మంగళవారం నిర్వహించిన నీతిఆయోగ్ స్వచ్ఛ భారత్ ముఖ్యమంత్రుల సబ్‌కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో నలుగురు ముఖ్యమంత్రులు, ఏడు రాష్ట్రాల నుంచి మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఘన, ద్రవ వ్యర్థాలను ఏవిధంగా వాడుకోవాలన్న అంశాలపై సమావేశంలో చర్చించామన్నారు. తదుపరి సమావేశం వచ్చే నెలలో బెంగళూరులో, అనంతరం ఢిల్లీలో ఉంటుందని చంద్రబాబు తెలిపారు. -
'పునర్విభజన చట్టప్రకారం హైకోర్టును విభజించాలి'
ఢిల్లీ: పునర్విభజన చట్టం వివాదాల అంశానికి సంబంధించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాలు కనుక్కోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతో చంద్రబాబు సమావేశమయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన బాబు.. పునర్విభజన చట్ట ప్రకారం హైకోర్టును విభజించాలని తెలిపారు. పునర్విభజన చట్టం వివాదాలకు కేంద్రం తెరదించాలన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుతో రాయలసీమకు నీళ్లు వస్తాయని.. దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. సముద్రానికి వెళ్లే జలాలనే పట్టిసీమకు వినియోగిస్తామన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం సహాయంతో కష్టాల నుంచి బయటపడ్డామన్నారు. ఈ ఏడాదిలో కూడా రెవెన్యూ లోటు ఉందని.. కేంద్రమే ఆదుకోవాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదావస్తే 90 శాతం నిధులు గ్రాంట్ల రూపంలో వస్తాయన్నారు. -
విభజన వివాదాల పరిష్కారం కోసం కేంద్ర బృందం
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ప్రకారం రెండు రాష్ట్రాలు ఏర్పాడిన అనంతరం నెలకొన్న వివాదాల పరిష్కారాలపై కేంద్ర దృష్టిసారించింది. ఈ నేపథ్యంలోనే ఏకే సింగ్ నేతృత్వంలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారుల బృందం హైదరాబాద్ కు రానుంది. గురువారం రాత్రి ఉమ్మడి రాజధానికి చేరుకునే ఈ బృందం.. శుక్రవారం నుంచి ఏపీ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో భేటీ కానుంది. విద్యుత్, నీటి వాటాలు సహా విభజన చట్టంలో పెండింగ్ లో ఉన్న పలు అంశాలపై చర్చించనుంది. విభజన ఇబ్బందులపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు కేంద్రానికి ఫిర్యాదులు చేసిన దరిమిలా ఏకే సింగ్ బృందం పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. -
'పునర్వ్యవస్థీకరణ సమగ్ర బిల్లును లోక్ సభలో పెట్టాలి'
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఖమ్మంలోని ఏడు మండలాల ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని టీఆర్ ఎస్ ఎంపీ వినోద్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి గడిచిన ఏడాది వ్యవధిలో రెండు సవరణలు చేశారని ఆయన తెలిపారు. మంగళవారం ఆయన లోక్ సభలో మాట్లాడుతూ...చీటికీ మాటికీ చట్టంలో సవరణలు చేయకుండా లోపాలను సవరించి సమగ్ర బిల్లును సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఖమ్మంలోని ఏడు మండలాల ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుత పునర్విభజన బిల్లుకు టీఆర్ ఎస్ పార్టీ పూర్తిగా మద్దతిస్తోందన్నారు. -
మాట నిలుపుకోండి.. లేదంటే కాంగ్రెస్ గతే..
హరిశ్చంద్రుడి వేషంలో టీడీపీ ఎంపీ శివప్రసాద్ వినూత్న నిరసన సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే.. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే పడుతుందని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్ హెచ్చరించారు. సత్యహరిశ్చంద్రుడు కాటికాపరి వేషధారణలో మంగళవారం విజయ్‌చౌక్‌లో ఆయన వినూత్నంగా నిరసన తెలిపారు. ‘కష్టములెన్నియున్నను..సత్యవాక్కు పరిపాలన సాగించవలయును కదా..ఇచ్చిన మాట తీర్చవలెను కదా..’అంటూ తన విజ్ఞప్తిని పద్యరూపంలో మీడియా ముందు వినిపించారు. ‘ఆంధ్రా ఎంపీలను కొట్టి..బలవంతంగా బయటకు నెట్టి..టీవీలను సైతం కట్టిపెట్టి..ఏపీని రెండుగా చీల్చినది..అట్టుడుకిన ఆంధ్ర జనం ఆగ్రహించగా..ఏమాయే..సోనియా కాంగ్రెస్ గతి..ఇది ఆదర్శమగు గాక..’ అంటూ తనదైన శైలిలో కేంద్రానికి హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికైనా కేంద్రం రాష్ట్ర ప్రజల ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని చెప్పారు. -
'విభజనతో ఆంధ్రకు అన్యాయమని చెప్పా'
-
'విభజనతో ఆంధ్రకు అన్యాయమని అప్పుడే చెప్పా'
రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రాంతానికి అన్యాయం జరుగుతుందని తాను ఆనాడే చెప్పానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం నాడు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆయన మాట్లాడారు. బీజేపీ- టీడీపీలు ఎన్నికల కంటే ముందే పొత్తు పెట్టుకున్నాయని ఆయన చెప్పారు. దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ పొత్తు కుదిరిందని అన్నారు. రాయలసీమలో 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజి ఇచ్చారని, విశాఖలో రైల్వే జోన్, రాజధాని నిర్మాణానికి నిధులు, రెవెన్యూ లోటు భర్తీ చేయడంపై స్పష్టమైన హామీలు ఇచ్చారని కూడా చంద్రబాబు చెప్పారు. విభజన హామీలు నెరవేర్చే దిశగా కేంద్రంపై తప్పకుండా ఒత్తిడి తెస్తామని ఆయన అన్నారు. నీతి, నిజాయితీలతో ఉండే పార్టీ తమదని, రాజీ పడాల్సిన అవసరం లేదని తెలిపారు. -
మాటలు వద్దు.. చేతల్లో చూపండి
అనంతపురం కల్చరల్ : రాష్ట్ర విభజనతో పూర్తిగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏం చేస్తారన్నది మాటల్లో కాదని చేతల్లో చూపాలని లోకసత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ్ పేర్కొన్నారు. ‘తెలుగు భవిత’ పేరిట నిరశన దీక్షను మంగళవారం స్థానిక సప్తగిరి సర్కిల్ వద్ద ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకులు చెప్పేది ఒకటి చేసేది ఒకటిలా ఉందని, తెలుగు రాష్ట్రాల పట్ల వారికి చిత్తశుద్ధి లేదని అర్థమవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ ఖజానా ఖాళీ అయిందని అభివృద్ధి పనులకు నిధులు లేవని చెప్పడం సత్యదూరంగా ఉందన్నారు. నిజానిజాలను శ్వేత పత్రంద్వారా ప్రజలకు వెళ్లడించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ బూటకమని ఒప్పుకోవాలన్నారు. రాష్ట్రంలో చదువుకున్న వారికి ఉద్యోగాలు లేవు, నానాటికి పెరిగిపోతున్న నిరుద్యోగం దేశంలోనే అత్యధికంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత ఉండాలంటే పరిశ్రమలు రావాలని, కానీ ఇక్కడ కరెంటు ఎప్పుడిస్తారో...ఎప్పుడు తీస్తారో తెలియదని ఎద్దేవా చేశారు. పాలకులకు సమగ్ర అవగాహన లేకపోవడం వల్లే అభివృద్ధి కుంటుపడుతోందని విమర్శించారు. రాయలసీమకు రావాల్సిన నీటి పంపకాల గురించి స్పష్టత తీసుకురాకపోతే భవిష్యత్తు తరాలు కష్టాలలో మునిగిపోతాయన్నారు. దీక్షకు ముందు ఉదయం స్థానిక కెఎస్ఆర్ కళాశాలలో విద్యార్థులతో ముఖాముఖి చర్చ ద్వారా రాష్ట్ర పరిస్థితులు వివరించారు. భవిష్యత్తులో ఆశాకిరణాలు యువత మాత్రమేనని, సమాజంలో ఏం జరుగుతుందో నిత్యం తెలుసుకోవాలని వారికి సూచించారు. వందలాదిగా తరలి వచ్చిన లోకసత్తా అభిమానులతో దీక్ష శిబిరం కిటకిటలాడింది. పలు ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న జేపీకి బాసటగా నిలుస్తామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా యువ కన్వీనర్ సోమనాథరెడ్డి, విద్యార్థి సత్తా జిల్లా అధ్యక్షులు అమర్‌యాదవ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సరస్వతీ, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర పాల్గొన్నారు. -
కొత్త రైల్వే జోన్ లేనట్టేనా?
- రైల్వే బడ్జెట్లో ప్రకటనపై ఆశలు అడియాశలేనా? - ఏపీలో కొత్త రైల్వే జోన్ ప్రకటన ఉండదని సంకేతాలిచ్చిన రైల్వే శాఖ - బాబు, కేంద్ర మంత్రులపై మండిపడుతోన్న - రైల్వే జోన్ సాధన సమితి నేతలు సాక్షి, హైదరాబాద్: కొత్త రైల్వే జోన్‌పై ఆశలు అడియాశలేనా? గురువారం రైల్వే బడ్జెట్ సందర్భంగా ఏపీకి కొత్త రైల్వే జోన్ ప్రకటన ఉండదా? విశాఖ రైల్వే జోన్‌ను ప్రకటిస్తారని ఊదరగొట్టిన ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఆ మేరకు ఒత్తిడి తీసుకురాలేకపోయారా? విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సీఎం చంద్రబాబునాయుడు కేంద్రాన్ని ఒప్పించడంలో విఫలమయ్యారా? రైల్వే మంత్రిత్వ శాఖ, ఆ శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఇస్తున్న సంకేతాల్ని చూస్తే ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు కోరుతూ కేంద్రానికి ఎలాంటి ప్రతిపాదనలు పంపకపోవడంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. ఇటీవల త నను కలిసిన ఉత్తరాంధ్ర ఎంపీలకు.. మంత్రి సురేశ్ ప్రభు ఏపీలో కొత్త రైల్వే జోన్ ప్రకటన ఉండదన్నట్టుగానే చెప్పారు. సమాచార హక్కు చట్టం కింద ఓ కార్యకర్త అడిగిన సమాచారానికి రైల్వే శాఖ ఇచ్చిన వివరణను చూసినా కొత్త జోన్ ఉండబోదనే అభిప్రాయమే కలుగుతోంది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై విశాఖపట్నం, విజయవాడ డివిజన్లు పోటీ పడ్డాయి. ఉత్తర, దక్షిణ భారతావనిలను కలిపే విజయవాడ డివిజన్‌ను కొత్త రైల్వే జోన్‌గా ప్రకటించాలని ఒకవైపు, విశాఖపట్నం కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్ (ఈస్ట్ కోస్ట్ రైల్వే)ను జోన్‌గా ప్రకటించాలని మరోవైపు గట్టిగా డిమాండ్లు వచ్చాయి. రాజధాని ప్రాంత ప్రకటన సందర్భంగా.. విజయవాడ చుట్టుపక్కల రాజధాని ఉంటుందని చంద్రబాబు చెప్పారు. అదే సమయంలో విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని, ఈ మేరకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అయినా సరే జోన్‌ను సాధిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ఏపీలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అధ్యయనానంతరం ఆర్నెల్లలో ఈ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత కొత్త జోన్‌పై ప్రకటన చేస్తామని కేంద్రం అప్పట్లో చెప్పింది. అయితే భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వేలోని ఖుర్ధా రోడ్, సంబల్పూర్, వాల్తేరు డివిజన్లలో మన రాష్ట్రంలోని వాల్తేరు డివిజన్ నుంచే ఈస్ట్ కోస్ట్ రైల్వేకు గణనీయమైన ఆదాయం సమకూరుతోంది. దీంతో ఈ డివిజన్‌ను వదులుకునేందుకు ఒడిశా ప్రభుత్వం ఏమాత్రం సిద్ధంగా లేదు. 2,122 కిలోమీటర్ల ట్రాక్ సామర్ధ్యం ఉన్న ఈ డివిజన్‌కు ఏడాదికి రూ.7 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. ఈ దృష్ట్యానే ఒడిశా ముఖ్యమంత్రి, ఎంపీలు ప్రధాని మోదీని కలిసి వాల్తేరు డివిజన్‌ను ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి తప్పించవద్దంటూ తీవ్రంగా ఒత్తిడి తీసుకువచ్చారు. మరోవైపు కొత్త జోన్ ఏర్పాటుపై నియమించిన కమిటీ కూడా ఇందుకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే విశాఖ రైల్వే జోన్ అటకెక్కిందని ఉన్నతస్థాయి రైల్వే వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒడిశా మాదిరిగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి జోన్ సాధించుకునే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం, కేంద్ర మంత్రులు విఫలమయ్యారనే విమర్శలూ వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి 2003లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే వాల్తేరు డివిజన్ ఈస్ట్ కోస్ట్ రైల్వేలో విలీనం అయ్యింది. అప్పుడూ బాబుపై విమర్శలు ఎదురయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన ప్రతిపాదనల్లోనూ కొత్త జోన్ లేకపోవడం గమనార్హం. కొత్త రైళ్ల ప్రకటనకే పరిమితం! రైల్వే బడ్జెట్లో విశాఖపట్నం మీదుగా మూడు కొత్త రైళ్ల ప్రకటన మాత్రమే ఉంటుందని విశ్వసనీయవర్గాల సమాచారం. అదీ వీక్లీ, బై వీక్లీ రైళ్ళు మాత్రమేనని తెలుస్తోంది. వీక్లీ రైళ్ళుగా విశాఖపట్నం-తిరుపతి, విశాఖపట్నం-న్యూఢిల్లీ (వయా రాయపూర్) సూపర్ ఫాస్ట్, బై వీక్లీగా (వారానికి రెండు సార్లు) భువనేశ్వర్-బెంగళూరు రైళ్లను ప్రకటిస్తారని సమాచారం. -
చంద్రబాబు ఏపీ టీడీపీకే అధ్యక్షుడు
టీడీపీ అధికారిక వెబ్సైట్లో పార్టీ కమిటీల విభజన సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్రానికి 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు సీఎం అయిన చంద్రబాబు పార్టీలో సైతం అదేస్థాయికి చేరిపోయారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగుదేశంను జాతీయపార్టీగా మార్చాలన్న ఆలోచన కార్యరూపం దాల్చకపోవడంతో చంద్రబాబు పార్టీ ఏపీ శాఖకు మాత్రమే అధ్యక్షుడిగా మిగిలిపోయారు. ఈ విషయాన్ని తెలుగుదేశం అధికారిక వెబ్సైట్ (డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.తెలుగుదేశం.ఓఆర్జీ) స్పష్టం చేస్తోంది. పార్టీ వెబ్‌సైట్‌ను ఇటీవలే అప్డేట్ చేసిన ఆ పార్టీ ఐటీ విభాగం 2013లో ప్రకటించిన ఉమ్మడి రాష్ట్ర పార్టీ కమిటీని ప్రాంతాల వారీగా విభజించారు. ఆంధ్రప్రదేశ్ కమిటీకి అధ్యక్షుడిగా చంద్రబాబు(చిత్తూరు జిల్లా) పేరును స్పష్టంగా పేర్కొంటూ ఆ రాష్ట్ర పరిధిలోని 13 జిల్లాలకు చెందిన నేతలకు ఉన్న పదవులను వరుసగా కేటాయించారు. తెలంగాణ శాఖకు సంబంధించి అధ్యక్షుడిగా కరీంనగర్‌కు చెందిన ఎల్.రమణ పేరును వెబ్సైట్లో పొందుపరిచారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయాకర్‌రావును చేర్చి మిగతా పదవులకు ఉమ్మడి రాష్ట్ర కమిటీ నుంచి వేరుచేసి పొందుపరిచారు. కాగా, ఎన్నికల ముందు తెలంగాణ శాఖకు ఏర్పాటు చేసిన తాత్కాలిక కమిటీలో పార్టీ కన్వీనర్‌గా ఉన్న మోత్కుపల్లి నర్సింహులు పదవి ఇప్పుడు లేదు. ఆయనను పొలిట్‌బ్యూరో సభ్యుడిగానే పేర్కొన్నారు. -
విభజన హామీలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా: పొంగులేటి
వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని, ఈ అంశాలను పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావిస్తామని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. తెలంగాణ ఏర్పడి 8 నెలలు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చేవెళ్ల-ప్రాణహితను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి, నిధులు ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. రాష్ర్టంలో భద్రాచలం-కోవూరు, కరీంనగర్-పెద్దపల్లి లైన్లతోపాటు, ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ వంటి పలు రైల్వే ప్రాజెక్టులు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. రాష్ట్రానికి సాగునీటి విషయంలో అన్యాయం జరిగిందని, నదుల అనుసంధానంలో గోదావరి నీటిని కృష్ణా పరీవాహక ప్రాంతానికి తరలించాలని పొంగులేటి సూచించారు. అందుకు చేవెళ్ల-ప్రాణహితతో పాటు, దుమ్ముగూడెం ప్రాజెక్టులను వెంటనే చేపట్టాలని కోరారు. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఏకపక్షంగా ఆంధ్రలో కలపడంతో ఆ ప్రాంత ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. ఈ అంశాన్ని కూడా పార్లమెంట్లో లేవనెత్తుతామని పొంగులేటి చెప్పారు. -
'రాజాగారికి బాగా అర్థమైనట్లుంది'
దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది... ఈ సినిమా డైలాగ్ గుర్తిందా... నూటొక్క జిల్లాల అందగాడు నూతన ప్రసాద్ నోటి నుంచి గతంలో ఈ డైలాగ్ తరచూగా వినే వాళ్లం. కానీ ఇప్పుడు ఇదే డైలాగ్ కొద్దిగా మార్చి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ నోటి వెంట వినాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉందని ఇటీవల విజయవాడలో జరిగిన ఆ పార్టీ మేధోమథన సదస్సులో ఆయన పేర్కొనటం విశేషం. నిజమే రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి శున్య హస్తమైంది. ఇదంతా డిగ్గి రాజాగారి చేతులారా చేసిన పుణ్యకార్యమే. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో తెలంగాణలో అట్టుడుకుతుంటే... ఇలా ఎంత కాలం అంటూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు పార్టీ అధిష్టానం చెవిలో ఊది... రాష్ట్ర విజభనకు ఒప్పించారు. విభజనపై సీమాంధ్ర ప్రజలు ఉద్యమం లేవదీసిన.. ఆ ఏముందిలే ఆంధ్రులు ఆరంభశూరులన్న విషయం తెలిసిందేగా... అన్నట్లు వ్యవహరించారు. ఇవేమీ పట్టించుకోకుండా ఓ చోట పోయినా మరో చోట గెలుస్తామన్న ధీమాతో కూరలో కర్వేపాకులా సీమాంధ్ర ప్రాంతవాసులను పక్కన పెట్టారు. ఇవాళ మీదైతే... రేపు మాది అంటూ సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్ర వాసులు హస్తం ఒక్కసీటు కూడా గెలుచుకోకుండా మట్టి కరిపించారు. ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తెలంగాణలో కూడా 'కారు' స్పీడ్‌కు కాంగ్రెస్ కేవలం 21 సీట్లకే పరిమితమైంది. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు సీమాంధ్ర ప్రజల్లో పార్టీ పస ఎంతుందో తెలుసుకునేందుకు నందిగామ, తిరుపతి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసి దరావత్తు వచ్చిందా రాలేదా అని 'యాసిడ్ టెస్ట్' చేసుకుంటుంది. -
పల్లెపై పన్నుల పిడుగు
విజయనగరం మున్సిపాలిటీ : రాష్ట్ర ప్రభుత్వం పల్లె నెత్తిన పన్నుల భారం మోపుతోంది. రాష్ట్ర విభజన అనంతరం లోటు బడ్జెట్లో ఉన్నామని చెబుతూ పల్లె ప్రజలపై పన్నుల భారం మోపేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం చట్టాలను వెలికితీసింది. 1994 సంవత్సరంలో రూపొందించిన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీల్లో 44 రకాల పన్నుల విధించి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ తరహా విధానాన్ని పక్కాగా అమలు చేసేందుకు ప్రత్యేక మాడ్యుల్‌ను ఏర్పాటు చేసింది. ర్యాపిడ్ అసెస్మెంట్ ఆఫ్ పంచాయత్ రీసోర్స్ పేరిట ఏర్పాటు చేసిన మాడ్యూల్‌ను ఇంటెర్నెట్‌కు అనుసంధానం చేయటం ద్వారా ఆయా గ్రామ పంచాయతీల్లో అన్ని రకాల పన్నులు వసూలు అవుతున్నదీ, లేనిదీ పర్యవేక్షించాలని పంచాయతీరాజ్ కమిషనర్ రామాంజనేయులు ఆదేశాలు జారీ చేశారు. ఇక 44 రకాల పన్నుల వసూలు జిల్లా వ్యాప్తంగా 921 గ్రామ పంచాయతీలు ఉండగా వాటి ద్వారా ఇప్పటి వరకు ఆస్తి, నీటి, భూక్రయవిక్రయాలు, దుఖాణాల లీజులు తదితర 10 రకాల పన్నులు వసూలు చేస్తున్నారు. తద్వారా జిల్లాలో ఏడాదికి సుమారు రూ 4 కోట్ల వరకూ ఆదాయం లభిస్తోంది. తాజాగా నిర్ణయం మేరకు మొత్తం 44 రకాల పన్నులు వసూలు చేయనున్నారు. పల్లెలపై ఈ భారం మరో రూ.2 కోట్ల నుంచి రూ4 కోట్ల వరకూ పడే అవకాశం ఉంటుంది. సంతలు, సెల్టవర్ల లెసైన్స్ పన్ను, ప్రకటనల పన్నుతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ పన్ను, వీధి దీపాల పన్ను ఇలా ప్రతి అవసరంపై పన్ను విధించి పల్లె ప్రజల వద్ద నుంచి ముక్కు పిండి మరీ వసూలు చేయనున్నారు. ఆన్లైన్లో పర్యవేక్షణ పన్నుల వసూలు ప్రక్రియ పక్కాగా నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభమైంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానం అమలుపై పర్యవేక్షణ చేసేందుకు ర్యాపిడ్ అసెస్మెంట్ ఆఫ్ పంచాయత్ రీసోర్స్ పేరిట ప్రత్యేకంగా మాడ్యూల్స్‌ను రూపొందించారు. ఈ విధానం ద్వారా ఏఏ పంచాయతీల్లో పన్నులు వసూలు చేస్తున్నారు. ఎక్కడెక్కడ వసూలు జరగడం లేదు..? అన్న విషయాలను ఆన్లైన్లోనే ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు. ఏ పంచాయతీలోనైనా పన్నుల వసూలు జరగని పక్షంలో నేరుగా ఉన్నతాధికారులే సంబంధిత పంచాయతీ కార్యదర్శితో , ఆ ఉద్యోగి లేని పక్షంలో జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారి, ఈఓపీఆర్డీలతో మాట్లాడనున్నారు. ఈ మేరకు నూతనంగా చేపడుతున్న ఈ కార్యక్రమంపై శుక్రవారం జిల్లా ఇన్చార్జి పంచాయతీ అధికారి జి.రాజకుమారి డివిజనల్ పంచాయతీ అధికారులు, మండలాభివృద్ధి అధికారులు, ఈఓపీఆర్డీలతో సమావేశం నిర్వహించారు. ఇకపై అన్ని పంచాయతీల్లో 44 రకాల పన్నులు విధించే విధంగా పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. -
సామాన్యుడి కి ధరాఘాతం
సాక్షి, కడప : రాష్ట్ర విభజన దెబ్బ నుంచి జనం కోలుకోనేలేదు.. ఇంతలోనే సామాన్యుడికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. రైతులు కరువుతో అల్లాడుతున్నారు.. ధరలు ఆకాశంలో... ఉద్యోగులకు జీతాలు ఎక్కడివక్కడే... ప్రభుత్వం బిల్లుల చెల్లింపులు సైతం నిలిపివేసింది... ఇవన్నీ చాలవన్నట్లు తాజాగా చంద్రబాబు సర్కార్ సామాన్యుడిపై మరో రెండు పిడుగులు కురిపించింది. ఖజానా నింపుకోవడమే తన మొదటి ప్రాధాన్యత అని సీఎం చంద్రబాబు చెప్పకనే చెప్పారు. ఒకపక్క పెట్రోలు, డీజిల్‌పై టీడీపీ సర్కాల్ విలువ ఆధారిత పన్ను (వ్యాట్) మోత మోగించడంతో వాహనదారులపై భారీ వడ్డన పడింది. 100 యూనిట్లు వినియోగం దాటితే విద్యుత్తు ఛార్జీ అబ్బా...అనేలా సర్కారు వారి దెబ్బ తగలనుంది. రానున్న ఏప్రిల్ నాటి నుంచి పెంచిన ధరలు అమలులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్ మోత మోగిన నేపధ్యంలో నిత్యావసర సరుకుల ధరలతోపాటు ఆర్టీసీ ఛార్జీలు సైతం పెరిగే అవకాశాలు లేకపోలేదు. బాబు సర్కార్ తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో విద్యుత్ వినియోగదారులపై దాదాపు రూ.2 కోట్ల మేర అదనపు భారం పడనుందని ట్రాన్స్‌కో అధికారులు తేల్చిచెబుతున్నారు. కరెంటు ఛార్జీల పెంపు నిర్ణయాన్ని అన్ని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 100 యూనిట్లు దాటితే ఓంకారమే! ఊహించినట్టే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు విద్యుత్షాక్ను మిగిల్చింది. ఒక్కో వినియోగదారుడి బిల్లుపై సుమారు రూ.5.6 శాతం పెంచేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో 100 యూనిట్లు పైబడి వాడితే గతంలో యూనిట్‌కు రూ. 3.60 ఉంటే ప్రస్తుతం మారిన టారిఫ్ ప్రకారం రూ. 3.82 భారం పడనుంది. ఇది 150లోపు యూనిట్లకే. ఇక తర్వాత పెరిగే కొద్దీ భారం కూడా భారీగా పెరుగుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన ఆరేళ్లపాలనలో ఏనాడూ ఒక్కపైసా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. ప్రస్తుత సీఎం చంద్రబాబు ఎనిమిది నెలల పాలనలోనే జనం జేబుకు చిల్లులు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 100 యూనిట్లలోపు గృహ వినియోగదారుల పట్ల కనికరం చూపించామని చెప్పుకుంటున్న ప్రభుత్వం 100 యూనిట్లు దాటిన వారికి దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చింది. జిల్లాపై రూ. 3 కోట్ల అదనపు భారం జిల్లాలో గృహ, వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమలకు సంబంధించి 8,94,445 సర్వీసులు ఉన్నాయి. వీటిపై పెంచిన విద్యుత్ ఛార్జీల లెక్క ప్రకారం దాదాపు రూ. 2 కోట్ల మేర అదనపు భారం పడనుంది. ఇది చాలదన్నట్లు పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ పేరుతో ప్రభుత్వం మరోమారు వాహనదారులపై భారం వేసింది. జిల్లాలో రోజుకు 1.50 లక్షల లీటర్ల పెట్రోలు, 20 లక్షల లీటర్ల మేర డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. లీటరు పెట్రోలు, డీజిల్‌పై రూ. 4 వడ్డన పడిన నేపధ్యంలో దాదాపు రూ. కోటి మేర వాహనదారులపై అదనపు భారం పడనుంది. ఇలా ప్రతిసారి అటు కేంద్రమో, ఇటు రాష్ట్రమో దెబ్బమీద దెబ్బ కొడుతూ సామాన్యుడిని కోలుకోనీయకుండా చేస్తున్నారు. పెట్రోలు, డీజిల్‌పై చాలాసార్లు కేవలం రూ.1-2 వరకు మాత్రమే తగ్గించిన కేంద్ర ప్రభుత్వం పెంచే సమయంలో ఏకంగా రూ. 4 పెంచుతూ నిర్ణయించడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. పైగా దీని ప్రభావం నిత్యావసర సరుకులతోపాటు ఆర్టీసీ ఛార్జీలపై కూడా పడనుంది. చంద్రబాబు నిజ స్వరూపం ఇదే! కాకులను కొట్టడం...గద్దలకు వేయడం.. బడా పెట్టుబడి దారులకు లక్షల కోట్ల రాయితీలు ఇవ్వడం...పేదలపై విద్యుత్ ఛార్జీల భారం మోపడం చంద్రబాబుకు అలవాటే! దొంగగా విద్యుత్‌ను వాడుకుంటున్న వారితోపాటు పారిశ్రామికవేత్తలు ఎగరగొట్టిన డబ్బులు వెలికితీస్తే ప్రజలపై విద్యుత్ భారం పడదు. అసలు, కొసరు పెరుతో ప్రజలపై భారం మోపడమే లక్ష్యంగా టీడీపీ సర్కార్ ముందుకు పోతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలు, డీజిల్, క్రూడాయిల్ ధరలు తగ్గాయి. ఇక్కడ సరుకు రవాణా, బస్సు ఛార్జీలపై తగ్గుదల ప్రభావం లేదు. - జి.ఈశ్వరయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి మరో విద్యుత్తు ఉద్యమం తప్పదు ప్రస్తుతం కరువుతో విలవిల్లాడుతున్నారు. ఒకవైపు విభజన జరిగి, మరోవైపు కరువుతో వర్షాలు పడక అల్లాడుతున్నారు. ఈ నేపధ్యంలో కరెంటు ఛార్జీలు పెంచి చంద్రబాబు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అది చేస్తాం...ఇది చేస్తామని మోసాలతో అధికారంలోకి వచ్చిన బాబు ఏమి చేయలేకపోయారు. చివరకు రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి లాంటి వాటికి పంగనామాలు పెట్టిన ఘనుడు చంద్రబాబు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అధికారంలోకి వస్తూనే రైతు కోసం తొమ్మిది గంటల కరెంటు, ఉచిత విద్యుత్ అందించి చిరస్థాయిగా నిలిచిపోయారు. ప్రజలపై భారం మోపాలని చూడటం చాలా భాదాకరం. ఇలా చేస్తే మరో విద్యుత్తు ఉద్యమం తప్పదు. ప్రజా ఉద్యమం చెలరేగకముందే ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. - ఆకేపాటి అమర్నాథరెడ్డి, వైఎస్సార్ సీపీజిల్లా కన్వీనర్ -
విభజన ఎఫెక్ట్!
కర్నూలు(అర్బన్): రాష్ట్ర విభజన ఎవరికి మేలు చేసిందో తెలియదు కానీ.. రెండు రాష్ట్రాల్లో చదువుతున్న బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. విద్యార్థులకు అందాల్సిన ఉపకార వేతనాలు(స్కాలర్షిప్పులు) ఇప్పటికీ అందకపోవడంతో నానా ఇబ్బంది పడుతున్నారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌లో విద్యను అభ్యసిస్తున్న తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ లో చదువుతున్న మన రాష్ట్రానికి చెందిన విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ తదితర వర్గాలకు చెందిన విద్యార్థులు 2014-15 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఈపాస్ వెబ్సైట్ ఓపెన్ అయినా, తెలంగాణ లో ఓపెన్ కాకపోవడం కూడా విద్యార్థులను కలచి వేస్తోంది. కర్నూలు జిల్లా సరిహద్దున వున్న మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపూర్, మానవపాడు, ఐజ, శాంతినగర్, వడ్డెపల్లి తదితర మండలాలకు చెందిన అనేక మంది విద్యార్థులు ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ తదితర కోర్సులన్నీ కర్నూలు జిల్లాలోనే అభ్యసిస్తున్నారు. కాగా ఈ విద్యార్థులందరు సమైక్యాంధ్రలోనే 2013 జూన్ 1వ తేదీ నుంచి 2014 మార్చి 31వ తేదీ వరకు మన జిల్లా విద్యార్థులతో పాటే ఉపకార వేతనాలు, ఫీజుకు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర విభజన 2014 జూన్ 2వ తేదీన జరిగింది. అయితే రాష్ట్రం విడిపోక ముందు దరఖాస్తు చేసుకున్న రెండు రాష్ట్రాల్లోని విద్యార్థులకు నేటికి ఉపకార వేతనాలు అందని పరిస్థితి నెలకొంది. 2013-14 విద్యా సంవత్సరానికి చెందిన తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థుల దరఖాస్తులు ఈ పాస్ వెబ్సైట్ నుంచి తీసివేశారు. దీంతో వీరికి ఉపకార వేతనాలు అందడం లేదు. ఇదే పరిస్థితిని హైదరాబాద్, తెలంగాణ లోని వివిధ జిల్లాల్లో చదువుతున్న మన రాష్ట్రానికి చెందిన విద్యార్థులు కూడా ఎదుర్కొంటున్నారు. ఆయా ప్రాంతాల్లోని మన విద్యార్థుల దరఖాస్తులు ఆ రాష్ట్ర ఈ పాస్ వెబ్సైట్లో కనిపించకుండా పోయాయి. అయితే వీరు అక్కడ చదువుతున్నా, మన జిల్లాలోని సంక్షేమ శాఖల జిల్లా అధికారుల లాగిన్‌లో వారి దరఖాస్తులను అప్లోడ్ చేద్దామన్నా, ప్రభుత్వం ఇంకా ఆప్షన్స్ పెట్టలేదు. ఇబ్బందుల్లో 15 వేల మంది విద్యార్థులు రెండు రాష్ట్రాల్లోని దాదాపు 15 వేల మంది విద్యార్థులు ఈ రకమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రెన్యూవల్స్ చేసుకునేందుకు ఆయా ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులను ఇతర రాష్ట్రాల సమస్య వెంటాడుతోంది. దరఖాస్తు చేసుకునేందుకు మీ సేవ కేంద్రాలు, నెట్ సెంటర్లకు వెళ్తే దరఖాస్తు ఓపెన్ అయినా, ఆధార్‌కార్డు, స్థానికత, తదితర ధృవీకరణ పత్రాలు ఇతర రాష్ట్రానికి చెందినవి కావడంతో వెబ్సైట్ అంగీకరించడం లేదు. దీంతో వేల సంఖ్యలో విద్యార్థులు జిల్లా కేంద్రంలోని ఆయా సంక్షేమ శాఖలకు చెందిన జిల్లా అధికారుల కార్యాలయాల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నా, ఫలితం కనిపించడం లేదు. ఒకవేళ తెలంగాణ లో మరికొద్ది రోజుల్లోై వెబ్సైట్ ఓపెన్ అయినా, అన్ని కళాశాలల లిస్టును వెబ్సైట్లో పెడతారో? లేదో? అనే అనుమానాలను మన రాష్ట్రానికి చెందిన విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఇక్కడే దరఖాస్తు చేసుకునేందుకు బోనోఫైడ్ సర్టిఫికెట్ కూడా అడ్డంకిగా మారుతోంది. ముంచుకొస్తున్న దరఖాస్తు గడువు ఫ్రెష్, రెన్యూవల్ విద్యార్థులు ఉపకార వేతనాలు, ఫీజుకు దరఖాస్తు చేసుకునేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించిన నేపథ్యంలో ఇచ్చిన గడువులోగా దరఖాస్తు చేసుకుంటామా? లేదా? అనే సందిగ్ద పరిస్థితిని తెలంగాణలో చదువుతున్న మన విద్యార్థులు, ఇక్కడ చదువుతున్న తెలంగాణ విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. సమస్య పరిష్కారంపై శ్రద్ధ చూపాలి ఉపకార వేతనాలు పొందేందుకు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. తెలంగాణలో చదువుతున్న మన రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఇక్కడకు వచ్చి దరఖాస్తు చేసుకునేందుకు ఈ పాస్ వెబ్సైట్లో ఆప్షన్ పెట్టాల్సి వుంది. అలాగే తెలంగాణ లో కూడా వెంటనే ఈపాస్ వెబ్సైట్ ఓపెన్ అయితే ఇక్కడ చదువుతున్న అక్కడి విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు వీలవుతుంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు కూడా స్పందించాల్సి వుంది. -
ఈ నెత్తుటి చారికలు.. దేని గురుతులు?
కర్నూలు(అర్బన్): ఈ ఏడాది జూన్ 25.. ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామ సమీపంలోని గడెంతిప్ప వద్ద చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో రక్తం చిందింది. జిల్లాలో అత్యున్నత విద్యా సంస్థ ఏర్పాటుకు సంబంధించిన స్థల పరిశీలనలో ఈ ఘోరం జరిగింది. విద్యా పరంగా జిల్లా ఖ్యాతి రాష్ట్రమంతటా వ్యాపించడంతో పాటు జిల్లాకు చెందిన విద్యార్థుల ఉన్నత సాంకేతిక విద్యకు మార్గం సుగమం అవుతుందని అందరు భావించారు. అయితే ఊహించని ఈ దుర్ఘటనలో ఐదు నిండు ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. రక్తం చిందింది కానీ... జిల్లా వాసుల కోరిక నెరవేరలేదు. జిల్లాకు చెందిన వ్యక్తి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో వున్నా, ఐఐఐటీ (ట్రిపుల్ ఐటీ) పశ్చిమగోదావరి జిల్లాకు తరలిపోతున్నా పట్టించుకోని మాటటుంచి... ఐఐఐటీ ఏర్పాటుకు సంబంధించి మేమేమైనా శిలా ఫలకం వేశామా? అని వ్యంగ్యంగా మాట్లాడిన తీరు, మృతుల ఆత్మలను మరింత క్షోభకు గురి చేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నాడు జరిగిన సంఘటనలో విధి నిర్వహణలో వున్న నలుగురు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మరో వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ సంఘటన మనసున్న ప్రతి మనిషిని కలచివేసింది.ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన తహశీల్దార్ సునీతాబాయి నేటికీ కోలుకోలేని దీన స్థితిలో ఉన్నారు. ఉద్యోగరీత్యా ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు వున్న ఈమె... కదల్లేక మంచంలోనే తన దురదృష్టానికి కుంగిపోతోంది. అయితే ఈ సంఘటన జరిగేందుకు కారణాలేవైనా... జరిగిన ప్రమాదంలో ఐదుగురు ఎందుకు ప్రాణాలు కోల్పోయారు? తహశీల్దారు సునీతాబాయికి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది...? వారందరు ఎందుకు ఆ సమయంలో గడెంతిప్ప వద్ద ఉన్నారు? అనే ప్రశ్నలను ఒకసారి మననం చేసుకుంటే... అయ్యో పాపం అనిపించడంతో పాటు, ప్రభుత్వ చర్యలను, పాలకుల మౌనాన్ని ఎండగట్టక మానరు. వారెందుకు అక్కడున్నారంటే... రాష్ట్ర విభజన జరిగిపోవడం.. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు కావడం... జిల్లాలోని ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామ శివారుల్లో ఐఐఐటీ ఏర్పాటు కానుందనే అధికారుల ఆదేశాలు వారినక్కడకు తీసుకువచ్చాయి. అప్పటికే కేంద్ర, రాష్ట్ర బృందాలు ఐఐఐటీ ఏర్పాటుకు సంబంధించి అక్కడ వున్న 300 ఎకరాల ప్రభుత్వ భూములను పరిశీలించి వెళ్లాయి. మరో దఫా ఆ భూములను పరిశీలించేందుకు 25వ తేదీన ఉదయం అప్పటి జిల్లా కలెక్టర్ సి సుదర్శన్‌రెడ్డి వస్తున్నారనే సమాచారం మేరకు కలెక్టర్‌కు ఆయా భూములను చూపించేందుకు ఓర్వకల్లు తహశీల్దార్ సునీతాబాయి, ఆర్ఐ పీ శ్రీనివాసులుతో పాటు ఆయా గ్రామ తలార్లు గడెంతిప్ప వద్ద ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలోనే సిలికాన్ లోడ్‌తో వస్తున్న లారీ వీరిపైకి దూసుకురావడంతో తహశీల్దారు సునీతాబాయి కొన ఊపిరితో బయటపడగా, ఆర్ఐ శ్రీనివాసులు, తలార్లు వెంకటేశ్వర్లు, శివరాముడు, రామక్రిష్ణతో పాటు హుసేనాపురంకు చెందిన గోపాల్ అనే వ్యక్తి మృతి చెందారు. ఐదుగురు మృతి చెందినా... ఐఐఐటీ స్థల పరిశీలనలో భాగంగానే ఐదుగురు మృతి చెందినా, ఐఐఐటీని సాధించండలో అధికార పార్టీ నేతలు విఫలమయ్యారు. ఈ సంఘటన జరిగిన అనంతరం కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రతినిధులతో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఈ భూములను పలుమార్లు పరిశీలించారు. కానీ ఫలితం దక్కలేదు. ఈ భూముల పరిశీలనలోనే నలుగురు రెవెన్యూ సిబ్బందితో పాటు మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర వేడుకల్లో జెండాను ఎగురవేసేందుకు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఐఐఐటీ విషయంలో జిల్లా ప్రజలను మోసం చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యమైన విషయాల్లో పాలకులు మౌనాన్ని వీడి గళాన్ని విప్పకుంటే రాబోవు తరాలు క్షమించవనే విషయాన్ని గుర్తించుకోవాల్సి వుంది. అమాత్యులదో మాట... కలెక్టర్‌ది మరో మాట... నన్నూరు గ్రామ శివారుల్లో ఏర్పాటు కావాల్సిన ఐఐఐటీని ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లాకు తరలించింది. ఈ విషయంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వాదనలు ఒక రకంగా ఉంటే... జిల్లా కలెక్టర్ సీ హెచ్ విజయమోహన్ వ్యాఖ్యలు మరో విధంగా ఉన్నాయి. సోమవారం కర్నూలులో విలేకరుల సమావేశంలో ఐఐఐటీ పశ్చిమ గోదావరి జిల్లాకు తరలిపోయిందని అమాత్యులు చెబుతున్నా. నన్నూరు దగ్గర గుర్తించిన భూముల్లోనే ఐఐఐటీ ఏర్పాటు అవుతుందని, వచ్చే ఏడాది క్లాసులు కూడా ప్రారంభం అవుతాయని కలెక్టర్ విజయమోహన్ చెప్పడం గమనార్హం. ఎవరి మాట వాస్తవమో తెలియాల్సి ఉంది. -
బాగా వెనుకబడిన జిల్లాలు ఆరు
వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీ కోసం టీసర్కారు కసరత్తు ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్‌ల అభివృద్ధికి అంచనాలు సీఎం ఆమోదం తర్వాత కేంద్రానికి నివేదిక సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బాగా వెనుకబడిన జిల్లాలుగా ఆరింటిని ప్రభుత్వం గుర్తించింది. ఈ జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కోరాలని, ఐదేళ్ల కాలంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం అధికార యంత్రాంగం ప్రతిపాదనలు రూపొందిస్తోంది. ఈ వారంతంలోగా ప్రతి పాదనలు సిద్ధం చేసిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తీసుకుని అధికారులు కేంద్రానికి పంపనున్నారు. ఆరు జిల్లాల్లో ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలను చేర్చారు. తాజా లెక్కల ప్రకారం హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలు పైవాటితో పోలిస్తే అభివృద్ధిలో ముందంజలో ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర విభజన చట్టంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం సాయం అందిస్తుందని పేర్కొన్న నేపథ్యంలో అధికారులు ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి ఐదువేల కోట్ల రూపాయల మేరకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కోసం బడ్జెట్లో పొందుపరిచిన సంగతి విదితమే. అందులో భాగంగా విద్య, వైద్య, రహదారులు, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖల నుంచి ప్రభుత్వం ప్రతిపాదనలు కోరింది. ఒకట్రెండు రోజుల్లో పూర్తి వివరాలతో నివేదికలు ఇవ్వాలని కోరింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రహదారులు, ప్రతీ గ్రామానికి తాగునీటి సౌకర్యం, పం చాయతీ, ఆర్ అండ్ బీ రహదారుల అభివృద్ధితోపాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కోరాలని నిర్ణయించింది. వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక సాయం చేస్తామని చట్టంలో పేర్కొన్నందున, హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలను ఇందులో పొందుపర్చాలని మొదట్లో భావించినా.. ‘సెస్’ ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వం ఆశించిన మేరకు నిధులను కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలోనే విడుదల చేస్తుందా? లేదా అన్నది వేచి చూడాల్సిందే. -
ఐటీడీఏకు పచ్చజెండా
రాష్ట్ర విభజన నేపథ్యంలో సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ను మన్ననూరు కేంద్రంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీఓ 17 విడుదల చేసింది. దీంతో ఇన్నాళ్లూ కర్నూలు ఐటీడీఏలో అంతర్భాగంగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా ఇకపై ప్రత్యేక ఐటీడీఏగా ఆవిర్భవించనుంది. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలు మహబూబ్‌నగర్ ఐటీడీఏలో అంతర్భాగం కానున్నాయి. సంస్థకు పూర్తి స్వరూపం ఏర్పడితే తప్ప స్థానిక చెంచులు సమగ్రాభివృద్ధి సాధించే పరిస్థితి కనిపించడం లేదు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మన్ననూరు కేంద్రంగా సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఏర్పాటు చేయాలంటూ జిల్లా కలెక్టర్ పంపిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలతో కూడిన నూతన ఐటీడీఏను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీఓ 17 విడుదల చేసింది. ప్రస్తుతం జిల్లాలో లంబాడాలు, ఎరుకలులు, ఇతర గిరిజనులకు సంబంధించి మాడా (మాడిఫైడ్ ఏరియా డెవలప్మెంట్ అప్రోచ్) మాత్రమే పనిచేస్తోంది. ఇతర జిల్లాలతో పోలిస్తే జిల్లాలో 12,982 మంది చెంచులుండటంతో నూతన ఐటీడీఏ మన్ననూరు కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నారు. పీటీజీ (అత్యంత వెనుకబడిన గిరిజన సమూహాలు) ప్రాజెక్టు అధికారి నూతన ఐటీడీఏకు ఎక్స్అఫీషియో పీఓగా వ్యవహరిస్తారు. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన గిరిజన సంక్షేమాధికారులు ఎక్స్ అఫీషియో ఏపీఓలుగా వ్యవహరిస్తారు. అయితే జిల్లాలో మాడా, పీటీజీకి పీఓ లేకపోవడంతో సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరక్టర్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఐటీడీఏకు కూడా సోషల్ వెల్ఫేర్ డీడీ ఇన్చార్జిగా వ్యవహరించనున్నారు. నల్లగొండ జిల్లాలోనూ గిరిజన సంక్షేమ శాఖకు పూర్తిస్థాయి అధికారి లేకపోవడం గమనార్హం. సిబ్బంది బదిలీపై రావాల్సిందే! కొత్తగా ఏర్పాటయ్యే ఐటీడీఏ పరిధిలోకి జిల్లాలో ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌తో పాటు 11 పీహెచ్‌సీలు, 46 ఆరోగ్య ఉప కేంద్రాలు, 44 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 11 ఆశ్రమ పాఠశాలలు చేరనున్నాయి. గతంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన విభాగం మాడాకు బదిలీ కాగా, తాజా ఉత్తర్వులతో ఈ విభాగం ఐటీడీఏ అంతర్భాగం కానున్నది. అయితే నూతన ఐటీడీఏ ఏర్పడినా కార్యాలయం ఏర్పాటు, సిబ్బంది నియామక ప్రక్రియ కొలిక్కి వచ్చేందుకు మరికొంత సమయం పట్టనుంది. ప్రస్తుతం కర్నూలు జిల్లా సున్నిపెంటలో ఐటీడీఏ కార్యాలయముండగా, నూతన ఐటీడీఏ కార్యాలయాన్ని మన్ననూరు మాడా ప్రాజెక్టు అధికారి కార్యాలయం లేదా క్యాంపు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సున్నిపెంట ఐటీడీఏ నుంచి సిబ్బందిని బదిలీ చేయాలంటూ త్వరలో లేఖ రాస్తామని మాడా ఇన్చార్జి పీఓ ‘సాక్షి’కి వెల్లడించారు. తొలి సమావేశంలోనే కోరాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీడీఏ మొదటి జనరల్ బాడీ సమావేశంలోనే మన్ననూరు కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరాం. చెంచు జనాభాలో 70శాతం మంది ఈ జిల్లాలోనే ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో చెంచుల తలరాత మారుతుందని ఆశిస్తున్నాం. - శంకరయ్య, ఐటీడీఏ గవర్నింగ్ బాడీ మెంబర్ నేటికీ అభివృద్ధికి దూరంగా.. 25 ఏళ్ల క్రితం చెంచుల కోసం ఐటీడీఏ ఏర్పాటు చేసినా ఎక్కడో దూరంగా పొరుగు జిల్లాలో ఉండటంతో పెద్దగా ఉపయోగపడింది లేదు. అభివృద్ధికి దూరంగా చెంచులు నేటికీ జీవనం వెళ్లదీస్తున్నారు. మన్ననూరు ఐటీడీఓతో అభివృద్ధి చెందుతామనే ఆశ కనిపిస్తోంది. - శ్రీనివాసులు, చెంచు సేవా సంఘం -
విభజన హామీలు అమలయ్యేదెన్నడు?
* ఆరు నెలల నుంచీ కేంద్రం పరిశీలనలోనే 25 అంశాలు సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి సోమవారంతో ఆరు నెలలు కావస్తోంది. విభజన తర్వాత మిగిలే ఆంధ్రప్రదేశ్ కోసం ఇచ్చిన హామీల్లో కేవలం రెండింటిలోనే కదలిక రాగా.. మిగతా 25 అంశాలూ ఆరు నెలలుగా కేంద్ర ప్రభుత్వ ‘పరిశీలనలో’నే ఉన్నాయి. రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంటులో అప్పటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీల్లో.. ఒక్కటి కూడా ఈ ఆరు నెలల్లో నెరవేరలేదు. అలాగే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీల్లో కూడా ఇప్పటి వరకు రెండు హామీలను మాత్రమే కేంద్రం అంగీకరించింది. రాష్ట్రంలో ఎయిమ్స్‌కు మాత్రం అనుమతిస్తూ కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. అలాగే వైజాగ్ - చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు నివేదిక రూపకల్పనకు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకును ఏజెన్సీగా నియమించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏర్పడే రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని పార్లమెంటులో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ప్రకటించారు. కానీ.. ఈ అంశంపై ఇప్పటివరకూ కేంద్రం నుంచి ఎటువంటి ఆశాజనకమైన ప్రకటనా వెలువడలేదు. -
‘విడి’పోని వివాదాలు
* రాష్ట్ర విభజనకు నేటితో ఆరు నెలలు * ఏపీ, తెలంగాణ మధ్య పరిష్కారం కాని విభజన వివాదాలెన్నో * నీరు, విద్యుత్, విద్య వంటి కీలకమైన అంశాల్లో ఎవరి దారి వారిదే * ఇంకా కొలిక్కిరాని ఉద్యోగుల పంపిణీ... కార్పొరేషన్లపైనా పీటముడి * ఉమ్మడి గవర్నర్ వద్ద పంచాయితీ జరిగినా పరిష్కారం కాని ‘పరీక్షలు’ * రెండు రాష్ట్రాల మధ్య పెరుగుతున్న వివాదాలు.. పట్టించుకోని కేంద్రం * ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలనూ నెరవేర్చలేదు సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయి వేర్వేరు రాష్ట్రాలుగా ఏర్పడి అప్పుడే ఆరు నెలలు గడిచిపోయాయి. కానీ.. విభజన సమస్యలన్నీ అపరిష్కృతంగానే మిగిలివున్నాయి. ఇంకా కొత్త వివాదాలు పుట్టుకొస్తున్నాయి. వాటికీ పరిష్కారం లభించడం లేదు. ఉద్యోగుల పంపిణీ జరగలేదు. అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపూ పూర్తికాలేదు. విద్యుత్, విద్య, జల వివాదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న గవర్నర్ ముంగిట పలు అంశాలపై పంచాయితీ జరిగినా.. ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కేంద్ర ప్రభుత్వం ముందు తమ వాదనలు వినిపించినా.. ఏ ఒక్క అంశంలోనూ ముందడుగు పడలేదు. విభజన వల్ల తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా ఒక్క అడుగూ కదలలేదు. పార్లమెంటు ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 మేరకు ఈ ఏడాది జూన్ 2న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. సాంకేతికంగా భౌగోళికంగా వేర్వేరు రాష్ట్రాలుగా ఏర్పడి సోమవారానికి ఆరు నెలలు అవుతున్నప్పటికీ.. ఈ రెండు రాష్ట్రాల మధ్య అనేక అంశాలు పరిష్కారానికి నోచుకోలేదు. విభజన తొలినాళ్లలోనే ఇరు రాష్ట్రాల మధ్య వివిధ అంశాల్లో మొదలైన కొన్ని వివాదాలు ఈ ఆర్నెల్లలో మరింతగా ముదిరాయి. పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అంశాలకు అదనంగా అన్నట్టు ఇరు రాష్ట్రాలు ఆయా సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలు సైతం చిక్కు సమస్యలు తెచ్చిపెట్టాయి. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరు మార్పు, 1956కు ముందున్న వారే స్థానికులుగా నిర్ధారిస్తామంటూ తెలంగాణ ప్రకటించడం, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (నాక్)కు డీజీని నియమించడం, దాన్ని రెండు ప్రభుత్వాలు పునర్వ్యవస్థీకరిస్తూ ఎవరికి వారు ఆదేశాలు జారీ చేయడం, కార్మిక సంక్షేమ శాఖ నిధుల మళ్లింపు, ఎవరికి వారు వేర్వేరుగా ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూలును ప్రకటించడం.. ఇలా అనేక విషయాల్లో ఆయా ప్రభుత్వాల నిర్ణయాలు రెండు రాష్ట్రాల మధ్య అంతరాన్ని పెంచాయి. ఎంసెట్ కౌన్సెలింగ్ విషయంలో ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది. వీటికి తోడు పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10వ షెడ్యూలులో పొందుపరిచిన సంస్థలు ఏ రాష్ట్రానికి చెందుతాయన్న దానిపైనా వివాదం కొనసాగుతోంది. ఇరు రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీ కోసం నియమించిన కమల్‌నాథన్ కమిటీ, ఐఏఎస్, ఐపీఎస్‌ల కేటాయింపునకు సంబంధించి ప్రత్యూష్ సిన్హా కమిటీ ఇంకా ఎటూ తేల్చకపోవడం వంటి అంశాలు ఇరు రాష్ట్రాలకూ ఇబ్బందికరంగానే పరిణమించింది. ముదిరిన విద్యా వివాదాలు... ఉన్నత విద్యా సంస్థలను ఉమ్మడి జాబితాలో చేర్చడంతో ఈ సంస్థలకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు పరిష్కారం కాకపోగా మరింత ముదిరి పాకానపడ్డాయి. వీటిని త్వరితంగా విభజించాలని తెలంగాణ ప్రభుత్వం పట్టుపడుతుండగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడిగానే కొనసాగాలని కోరుతోంది. ఈ వివాదంతో ఆయా సంస్థల్లో కార్యకలాపాలు స్తంభించిపోతున్నాయి. అక్కడి ఉద్యోగులు కూడా రెండు ప్రాంతాల వారీగా చీలిపోవడంతో సంస్థల వ్యవహారాలు ఏమాత్రం ముందుకు సాగడం లేదు. ఉన్నత విద్యా మండలితో మొదలు... రాష్ట్ర విభజన తొలి రోజుల్లో వివాదం తలెత్తింది ఉన్నత విద్యామండలిపైనే. ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహణను ఏపీ విద్యామండలి చేపట్టబోగా.. తమ రాష్ట్రంలోని కాలేజీల ప్రవేశాలకు కౌన్సెలింగ్ తామే నిర్వహించుకుంటామని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. తమ రాష్ట్ర ఉన్నత విద్యామండలిని ప్రకటించింది. చివరకు ఏపీ ఉన్నత విద్యామండ లి సుప్రీంకోర్టును ఆశ్రయించి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటించింది. కౌన్సెలింగ్ నిర్వహణలోనూ వివాదం ఏర్పడటంతో చివరకు ఉన్నత విద్యామండళ్లతో సంబంధం లేకుండా రెండు రాష్ట్రాల సాంకేతిక విద్యాశాఖల కమిషనర్లు కన్వీనర్, కో-కన్వీనర్లుగా వ్యవహరించి కౌన్సెలింగ్‌ను పూర్తిచేశారు. ప్రస్తుతం ఏపీ ఉన్నత విద్యామండలి ఉన్న భవనంలోనే పై అంతస్తులో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఏర్పాటయింది. నిధులు, ఉద్యోగుల అంశంపై ఇరు మండళ్ల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. మరోవైపు వచ్చే ఏడాది ఎంసెట్ ఉమ్మడిగా చేపట్టాలా? వేర్వేరుగా చేపట్టాలా? అన్న అంశంపైన కూడా రెండు మండళ్ల మధ్య భిన్నాభిప్రాయాలుఉన్నాయి. తేలని ఇంటర్ పరీక్షల పంచాయతీ... ఇంటర్మీడియట్ బోర్డుపై కూడా ఇరు రాష్ట్రాల మధ్య ఎడతెగని వివాదం కొనసాగుతోంది. ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఉమ్మడిగా జరగాలని ఏపీ పేర్కొంటుండగా.. తమ రాష్ట్ర పరీక్షలు తాము వేరుగా పెట్టుకుంటామని తెలంగాణ స్పష్టం చేస్తోంది. ఏపీ ఉమ్మడి పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించగా తెలంగాణ ప్రభుత్వం తమ రాష్ట్ర ఇంటర్ బోర్డు పేరుతో ప్రత్యేక షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇరు రాష్ట్రాల విద్యాశాఖల మంత్రుల చర్చల్లోనూ పరిష్కారం లభించకపోవడంతో చివరకు గవర్నర్ వద్దకు ఈ వివాదం చేరింది. ఇంటర్ పరీక్షలపై ఇరు రాష్ట్రాలు తమ వాదనలపై పట్టువీడకపోవడంతో సమస్య అలాగే ఉండిపోయింది. దీంతో గవర్నర్ కేంద్రంతో, ఇతర రాష్ట్రాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆదివారం తనను కలసిన ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు హామీ ఇచ్చారు. ఆరు యూనివర్సిటీలపైనా... విభజన నేపథ్యంలో ఆరు యూనివర్సిటీలను పదో షెడ్యూల్లో చేర్చారు. వీటికి సంబంధించి విభజన వెంటనే జరగాలని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. అయితే పదేళ్ల పాటు ఉమ్మడిగానే ఉండాలని ఏపీ స్పష్టం చేస్తోంది. దీనిపై విద్యాశాఖల కార్యదర్శులు, మంత్రుల స్థాయిలో చర్చ జరిగినా పరిష్కారం లభించలేదు. ఉమ్మడి జాబితాలో రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీ (ఆర్జీయూకేటీ), జవహర్‌లాల్‌నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, ద్రవిడ వర్సిటీ, శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ద్రవిడ వర్సిటీ, పద్మావతీ వర్సిటీలు మినహా తక్కినవి హైదరాబాద్‌లో ఉన్నాయి. ఈ వర్సిటీలు ఏపీలో లేనందున అవి ఏర్పడే వరకు పదేళ్ల వరకు ఉమ్మడిగా ఉండాలని ఏపీ అంటోంది. అయితే.. హైదరాబాద్‌లోని వర్సిటీలు తమ రాష్ట్రానికే చెందాలని, ఏపీలో ఉన్న రెండు వర్సిటీల్లో తమకు భాగస్వామ్యం అక్కర్లేదని తెలంగాణ అంటోంది. హైదరాబాద్‌లోని వర్సిటీల్లో తమకు వాటా ఉందని ఏపీ భావిస్తే ఆ వాటా ప్రకారం విభజన చేయడానికి తమకు అభ్యంతరం లేదని కూడా స్పష్టంచేసింది. ఆస్తులు, ఉద్యోగుల వివరాల జాబితా కూడా రూపొందించినా విభజనపై ఏదీ తేలలేదు. ఆంధ్రప్రదేశ్ ఆర్కైవ్స్ అండ్ రీసెర్చి ఇన్స్టిట్యూట్, హిందీ, తెలుగు, సంస్కృత అకాడమీలు కూడా ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. వీటి పరిస్థితీ అదే మాదిరిగా ఉంది. పాఠశాల విద్యాశాఖ పరిధిలో... పాఠశాల విద్యాశాఖ పరిధిలోని కొన్ని సంస్థలు కూడా ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. అయితే ఉన్నత విద్యను పదేళ్ల పాటు కొనసాగించాలని చట్టంలో పేర్కొన్నందున ఈ సంస్థల విభజనపై వివాదాలను పరిష్కరించుకుంటున్నారు. రాజీవ్ విద్యా మిషన్, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చి అండ్ ట్రయినింగ్ తదితరాలను విభజించుకొని ఎవరి కార్యకలాపాలు వారు నిర్వహించుకుంటున్నారు. -
ఊపిరి పోస్తారా... తీస్తారా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే హవా. 'తెలంగాణలో దాదాపు అన్నీ ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు 'హస్తగతం' ఇది ముమ్మాటికి తథ్యం' అంటూ ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులంతా రాష్ట్ర విభజనకు ముందు హస్తినకు క్యూ కట్టి పార్టీ అధిష్టానం పెద్దల చెవి వద్ద చేరి జోరీగలా ఊదిపెట్టారు. దాంతో రాష్ట్రాన్ని విభజిస్తే ఆంధ్రలో పోయినా... తెలంగాణలో పార్టీకి అదృష్టం పండిపోతుందని అధిష్టానం కూడా భావించింది. అదికాక విభజన తర్వాత పార్టీని హస్తంలో ఐక్యం చేస్తానని గులాబీ బాస్ చెప్పడంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు, అధిష్టానం పెద్దలు సైసై సయ్యారే అన్నారు. అంతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జరాసంధుడిలా చీల్చింది. ఇంతలో ఎన్నికలు వచ్చాయి. ఆ వెంటనే ఫలితాలూ వచ్చాయి. తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్‌కు .. రాష్ట్రంలో 21 ఎమ్మెల్యే సీట్లు ... రెండంటే రెండే ఎంపీ సీట్లతో సరిపెట్టుకుంటే... ఇవే ఎన్నికల్లో గులాబీ రంగు కారు మాత్రం భలే షికారు చేసింది. దాంతో హస్తంతో చెయ్యి కలిపేది లేదని గులాబీ బాస్ ప్లేట్ ఫిరాయించి... రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా గులాబీ బాస్ చేపట్టిన 'అపరేషన్ ఆకర్ష్'తో హస్తం పార్టీ నేతలు వరుసగా కారు ఎక్కేస్తున్నారు. కారు దెబ్బకు హస్తం ఢీలా పడి పోయింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో పార్టీని నడిపించాల్సిన పీసీసీ అధ్యక్షుడుపై సీనియర్ స్థాయి నుంచి బూత్ స్థాయి నేతల వరకు అందరికీ తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దినదిన గండం నూరేళ్ల ఆయూషు లెక్కన తయారైంది. హస్తం పార్టీ పరిస్థితి అంపశయ్యపైకి చేరింది. దీంతో తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు పార్టీ అధిష్టానం నడుం బిగించింది. అందుకోసం తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు నిర్ణయించింది. అందులో భాగంగా అయిదు రోజుల క్రితం హైదరాబాద్‌లో పార్టీ నేతలతో అధిష్టానం పెద్దలు సమీక్షా జరిపారు. ఈ సందర్భంగా ఎంపీ, మాజీ ఎంపీల మధ్య వాగ్వివాదం... మరో ఎంపీ అలిగి వెళ్లిపోవడం... ఈ సమావేశానికి సీనియర్ నాయకులు రాలేదని అసంతృప్తితో రగిలిపోయారు... వీరందరిని అధిష్టానం పెద్దలు బుజ్జగించినా.... మీతో మాకు లెక్కేంటి అన్నట్లు వీరంతా వ్యవహరించారు. ఇక రాష్ట్రంలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల భూముల వ్యవహారంపై అధికార టీఆర్ఎస్ అసెంబ్లీలో ఎండగట్టింది. ఆ విషయంలో అధికార పార్టీని నిలవరించేలా తెలంగాణ సీఎల్పీ నేత వ్యవహారించలేదు. సరికదా ఆ అంశంపై స్పందించేందుకు ప్రయత్నించిన పలువురు సభ్యులను సదరు నేత వారించినట్లు సమాచారం. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ ... ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహారిస్తుంది. ఆ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నెగ్గుకురాగలదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇప్పటికే అంపశయ్యపైకి చేరిన పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు అధిష్టానం చర్యలు చేపడుతున్న తరుణంలో రాష్ట్రంలో నాయకులు ఇలా వ్యవహరించడంతో పార్టీకీ ఊపిరి పోస్తారా లేక ఉన్నది తీస్తారా అన్నది అధిష్టానం పెద్దలకు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. -
5 నెలల్లో రూ.11 వేల కోట్లే!
* తెలంగాణలో వాణిజ్య పన్నుల శాఖ రాబడి లక్ష్యం రూ. 30 వేల కోట్లు * జూన్ నుంచి అక్టోబర్ వరకు వచ్చింది రూ. 11,654 కోట్లు * మార్చి కల్లా రూ.18,500 కోట్లు రాబట్టాలి * ఆదాయం పెంచుకునేందుకు అధికారుల కసరత్తు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వాణిజ్య పన్నుల శాఖ రాబడి మందగించింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన జూన్ నెల నుంచి వచ్చే మార్చి 31 వరకు (పది నెలలు) రూ.30 వేల కోట్లు వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అయితే జూన్ నుంచి అక్టోబర్ (తొలి ఐదు నెలలు) వరకు రూ.11,654 కోట్ల రాబడి మాత్రమే వచ్చింది. అంటే రానున్న ఐదు నెలల్లో రూ.18,500 కోట్లు పన్నుల రూపంలో వసూలు చేయాల్సి ఉంది. ఈ టార్గెట్‌ను చేరుకునేందుకు అధికార యంత్రాంగం సతమతమవుతోంది. కాగా, ఉమ్మడి రాష్ట్రంలో 2013-14 ఆర్థిక సంవత్సరానికిగాను వాణిజ్య పన్నుల శాఖ ద్వారా రూ.50,542 కోట్ల రాబడి వచ్చింది. అలాగే 2014-15 ఆర్థిక సంవత్సంలో కేవలం రెండు నెలల్లో (ఏప్రిల్, మే) రూ.9,186 కోట్లు వసూలైంది. దీనితో పోల్చుకుంటే రాష్ట్రం విడిపోయాక తొలి ఐదు నెలల్లో రూ.11,654 కోట్లు మాత్రమే రావడం గమనార్హం. అక్రమ రవాణాపై దృష్టి.. రాష్ట్ర విభజన తర్వాత రాబడి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కఠినంగా వ్యవహరించాలని వాణిజ్య పన్నుల శాఖ భావిస్తోంది. ఈ మేరకు ఇటీవలే కమిషనర్‌గా నియమితులైన అనిల్ కుమార్ తెలంగాణలోని 12 డివిజన్ల అధికారులతో సమావేశమై రాబడి పెంచుకునే మార్గాలను నిర్దేశించారు. ఆయనే స్వయంగా హైదరాబాద్ పరిధిలోని ఏడు డివిజన్లకు వెళ్లి అధికారులతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌కు ఇతర రాష్ట్రాల నుంచి పన్నులు చెల్లించకుండా దిగుమతి అవుతున్న వస్తువులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఎలక్ట్రానిక్ గూడ్స్, స్టీల్, ప్లాస్టిక్, వివిధ వస్తువుల తయారీకి ఉపయోగించే ముడి సరుకుతో పాటు ఆహార ధాన్యాలు మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ నుంచి జీరో టాక్స్‌తో అక్రమంగా దిగుమతి అవుతున్నాయి. తద్వారా వాణిజ్య పన్నుల శాఖకు ఆదాయం లేకుండా పోతోంది. అలాగే గతంలో ఐదు చెక్ పోస్టులకు తోడు రాష్ట్ర విభజన తర్వాత ఏడు చెక్‌పోస్టులు ఏర్పాటైనా.. అవి పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. ఈ నేపథ్యంలో చెక్‌పోస్టుల వద్ద అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. -
వివాదాలపై ఢిల్లీలో 28న భేటీ
హాజరుకానున్న రెండు రాష్ట్రాల సీఎస్‌లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పలు అంశాల్లో నెలకొన్న వివాదాలను పరిష్కరించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ నెల 28వ తేదీన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్ శర్మతో పాటు సంబంధిత కేంద్ర శాఖల ఉన్నతాధికారులతో.. హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో ఏకపక్షంగా విద్యుత్ ఉత్పత్తి చేయడం, కృష్ణా నదీ యాజమాన్య మండలి ఆదేశాలను అమలు చేయకపోవడం తదితర అంశాలను ఈ భేటీలో కేంద్రం దృష్టికి తీసుకురానున్నట్లు ఏపీ సీఎస్ కృష్ణారావు శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. సాగర్ నుంచి కృష్ణా జలాలను డెల్టాకు విడుదల చేయడంలో టీ సర్కారు అవలంబించిన వైఖరిని కూడా వివరించనున్నట్లు చెప్పారు. ప్రధానంగా.. ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ సంస్థకు చెందిన ఉమ్మడి నిధులు రూ.35 కోట్లను ఏపీకి చెప్పకుండా బదిలీ చేసుకుందని, ఇది రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం నిబంధనల స్ఫూర్తికి విరుద్ధమని వివరించనున్నారు. అదే సమయంలో.. కార్మిక సంక్షేమ నిధికి సంబంధించిన నిధులను ఏపీ ప్రభుత్వం జనాభా నిష్పత్తి మేరకే బదలాయింపు చేసిందని, అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంలో అనుచితంగా వ్యవహరించడమే కాకుండా కార్మిక శాఖ కమిషనర్‌ను పోలీసులతో ప్రశ్నింపజేసి కేసు కూడా నమోదు చేయించడాన్ని గోస్వామి దృష్టికి తేనున్నారు. అలాగే ఉమ్మడి సంస్థలకు చెందిన నిధులను స్తంభింపజేయాల్సిందిగా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేయడాన్నీ, హైదరాబాద్‌లో పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడటాన్ని ప్రస్తావించనున్నారు. విడిగా హక్కుల కమిషన్, లోకాయుక్త.. ఇలా ఉండగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏ షెడ్యూల్లోనూ లేని మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త, ఉప లోకాయుక్త, సమాచార హక్కు కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘంను విడిగా ఏర్పాటు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. -
విభజన హామీల అమలేదీ: రఘువీరా
రాష్ట్ర విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీల అమలు ఇంకా ప్రారంభం కాలేదని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాలపై పోరాడాలంటూ రాష్ట్ర ఎంపీలకు ఆయన లేఖ రాశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఆర్థికలోటు భర్తీ లాంటి హామీలేవీ అమలు కావట్లేదని రఘువీరా చెప్పారు. వీటిపై ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ లేఖ రాసినా.. దానికి ప్రధానమంత్రి నుంచి స్పందన రాలేదన్నారు. హుదూద్ తుపాను బాధితులకు ప్రధాని ప్రకటించిన తాత్కాలిక సాయం కూడా ఇప్పటివరకు అందలేదని గుర్తుచేశారు. దీనిపై కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆయనో లేఖ రాశారు. -
హమ్మయ్య.. ఆయన కనిపించారు!
ఉమ్మడి రాష్ట్రానికి ఆయన చిట్టచివరి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. కానీ రాష్ట్ర విభజన నిర్ణయం అయిపోయి, ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రం ఒక్కసారిగా ఉన్నట్టుండి మాయమైపోయారు. ఆయనే.. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. జై సమైక్యాంధ్ర పార్టీ అనే పేరుతో ఓ రాజకీయ పార్టీని స్థాపించి, ఒక్క సీటు కూడా గెలుచుకోలేక చతికిలబడిన తర్వాత.. కిరణ్ ఏమైపోయారో చాలా కాలం పాటు ఎవరికీ తెలియలేదు. ఈ మధ్య కాలంలో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరతారన్న కథనాలు కూడా వినిపించాయి. కానీ ఎవరేమనుకున్నా.. కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఎవరికీ దర్శనభాగ్యం కల్పించలేదు. అయితే ఇన్నాళ్ల తర్వాత ఉన్నట్టుండి హైదరాబాద్‌లో జరిగిన ఓ పుస్తక పరిచయం కార్యక్రమంలో కిరణ్ దర్శనమిచ్చారు. శేఖర్ గుప్తా అనే పాత్రికేయుడు రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు ఆయన స్వయంగా వచ్చారు. తనకంటే చురుగ్గా, ప్రస్తుతం క్రియాశీలకంగా చాలామంది నాయకులు ఉన్నారని, వాళ్లలో ఎవరినైనా ఎంచుకోవాలని చెప్పినా.. శేఖర్ గుప్తా తననే పిలిచారని కిరణ్ అన్నారు. ఏదైనా గానీ, ఆ పేరు చెప్పి కిరణ్ కుమార్ రెడ్డిని చూశామని చాలామంది రాజకీయ పండితులు అన్నారు. ఇక ఈ సందర్భాన్ని కూడా కిరణ్ చాలా చక్కగా ఉపయోగించుకున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ ఒకటి రెండు మాటలు చెప్పారు. బీజేపీ కురువృద్ధ నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయిని కూడా ప్రస్తావించారు. విలేకరులు అడిగితే మాత్రం.. గుంభనంగా నవ్వి ఊరుకున్నారు తప్ప తన రాజకీయ రంగ పునఃప్రవేశం గురించి ఒక్కమాట కూడా చెప్పలేదు. సమయం వచ్చినప్పుడు అన్నీ అవే తెలుస్తాయన్నారు. -
చంద్రబాబు లెక్కతప్పింది: ఎంపీ జేసీ
విజయవాడ: రాష్ట్ర విభజన వల్ల జరిగే నష్టాన్ని చంద్రబాబు కూడా ఊహించలేకపోయారని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. విభజన తర్వాత జరుగుతాయనుకున్న పంపకాల విషయంలో చంద్రబాబు లెక్కతప్పిందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, అదే సమయంలో రాజధానికి ఉండే హంగులన్నీ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. పంటల రుణమాఫీ వందశాతం జరుగుతుందని, అయితే సమయం పడుతుందని చెప్పారు. టీడీపీలో తమకు ఇవ్వాల్సిన స్వేచ్ఛ ఇస్తున్నారని, ఇక్కడ తనకెలాంటి ఇబ్బంది లేదని దివాకర్ రెడ్డి చెప్పారు. -
‘విభజన’ వేగవంతం చేయండి
రాజ్‌నాథ్‌కు టీఆర్ఎస్ ఎంపీల వినతి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య విభజనకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కి టీఆర్ఎస్ ఎంపీల బృందం విజ్ఞప్తి చేసింది. టీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేత ఏపీ జితేందర్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ ఎంపీలు వినోద్‌కుమార్, బీబీ పాటిల్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కొత్తా ప్రభాకర్‌రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి తేజావత్ రామచంద్రు మంగళవారం నార్త్‌బ్లాక్‌లో హోంమంత్రితో సమావేశమయ్యారు. ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు, ఆర్థిక ప్రోత్సాహకాలు, హార్టికల్చర్, ట్రైబల్ యూనివర్సిటీ, బయ్యారం స్టీల్‌ప్లాంట్, 400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు, రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ తయారీ యూనిట్, పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, వెనుకబడిన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయహోదా, కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఏర్పాటు, తెలంగాణకు ప్రత్యేక హోదా అంశాలను పేర్కొంటూ వినతిపత్రం సమర్పించారు. అనంతరం జితేందర్‌రెడ్డి, వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విభజన పూర్తికాకపోవడంతో రాష్ట్రంలో పాలనాపరంగా ఇబ్బందులు వస్తున్నాయని, వీలైనంత త్వరగా అధికారులను విభజించాలని హోంమంత్రిని కోరినట్టు తెలిపారు. తెలంగాణ, ఏపీ మధ్య తలెత్తుతున్న సమస్యలను వివరించామన్నారు. హోంమంత్రి నుంచి ఎలాంటి స్పందన వచ్చిందని విలేకరులు ప్రశ్నించగా..‘ఇవన్నీ ఇంకా పూర్తికాలేదా’అని రాజ్‌నాథ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారని, అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు జితేందర్‌రెడ్డి చెప్పారు. -
విభజనపై స్పష్టతనివ్వండి: రాజీవ్‌శర్మ
కేంద్రానికి తెలంగాణ సీఎస్ విజ్ఞప్తి ఢిల్లీలో ఉన్నతాధికారులతో భేటీ ప్రభుత్వరంగ సంస్థల విభజన, ఉమ్మడి నిధుల పంపిణీపై చర్చ చట్టాన్ని ఏపీ ఉల్లంఘిస్తోందని ఫిర్యాదు ఢిల్లీలోనే ఏపీ సీఎస్, కేంద్రం దృష్టికి పలు అంశాలు.. తెలంగాణ పోలీసుల తీరుపైనా ఫిర్యాదు సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వరంగ సంస్థల విభజనపై స్పష్టత ఇవ్వాలని, ఉమ్మడి నిధుల పంపిణీకి విధి విధానాలను సూచించాలని రాష్ర్ట ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్ శర్మ కేంద్రాన్ని కోరారు. రాష్ర్ట విభజన చట్టంలోని అంశాలను ఆంధ్రప్రదేశ్ ఉల్లంఘిస్తోం దని ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజిత్ సేథ్, కేంద్ర హోం కార్యదర్శి అనిల్ గోస్వామితో శుక్రవారం ఆయన వేర్వేరుగా సమావేశమయ్యారు. విభజన చట్టంలోని 9, 10వ షెడ్యూల్లోని ఉమ్మడి ప్రభుత్వరంగ సంస్థలు, ఫిక్స్డ్ మొత్తాల విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతో వివాదాలు తలెత్తుతున్నాయని వారి దృష్టికితెచ్చారు. తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. ఉమ్మడి రాష్ట్ర నిధులను ఏపీలోని బ్యాంకులకు ఆ రాష్ర్ట ప్రభుత్వం బదలాయిస్తోందని ఫిర్యాదు చేశారు. ఏపీ చర్యలతో ఫిక్స్డ్ మొత్తాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా దక్కడం లేదని చెప్పినట్టు సమాచారం. రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ నిధులను ఏపీ అధికారులు తరలించిన వివరాలకు సంబంధించిన నివేదికను కూడా అందచేసినట్టు తెలుస్తోంది. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన విద్యుత్ కేటాయింపులు రావడం లేదని, శ్రీశైలంలో విద్యుదుత్పత్తినీ ఏపీ అడ్డుకుంటోందని వివరించారు. కృష్ణపట్నం, సీలేరు నుంచి కూడా వాటా ఇవ్వడం లేదని, దీంతో తెలంగాణలో విద్యుత్ సమస్య తీవ్రమైందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. అఖిలభారత సర్వీసు ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని, వివిధ శాఖలకు అధిపతులు లేకపోవడం వల్ల పాలనా ఇబ్బందులు ఎదురవుతున్నాయని రాజీవ్ శర్మ వివరించారు. మరోవైపు ఏపీ సీఎస్ ఐవీఆర్ కృష్ణారావు కూడా కేంద్ర అధికారులను కలిసి పలు అంశాలపై చర్చించారు. విభజన చట్టాన్ని తెలంగాణ సర్కారు ఉల్లంఘిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. తెలంగాణలో పోలీసుల తీరుపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. -
ఏప్రిల్ తర్వాత శాఖల తరలింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్ నుంచి కొన్ని శాఖలను తరలించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్ఓడీల తరలింపు కమిటీ సచివాలయంలో సోమవారం సమావేశమైంది. బుధవారం మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది. ఏప్రిల్ తర్వాత తొలి విడతగా ప్రభుత్వ శాఖల తరలింపు ప్రారంభించాలని నిర్ణయించారు. ముందుగా 9 శాఖలను తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. హోం, విద్య, వైద్య, వ్యవసాయ, ఆర్థిక, రెవెన్యూ, మున్సిపల్, మత్స్య, అగ్నిమాపక శాఖలను తొలి విడతలో తరలించాలని నిర్ణయించారు. నాగార్జున యూనివర్సిటీ, విజయవాడ, గొల్లపూడి ప్రాంతాల్లో వీటిని ఏర్పాటుచేస్తారు. -
నిధుల బదలాయింపు చేయవద్దు: రాజీవ్ శర్మ
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలాంటి నిధులను బదలాయింపు చేయవద్దని బ్యాంకర్లకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ స్పష్టం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం బ్యాంకర్లతో జరిగిన సమావేశంలో విభజన, నిధుల బదలాయింపు, తదితర అంశాలపై రాజీవ్ శర్మ చర్చించారు. తెలంగాణ ప్రభుత్వ అనుమతి లేకుండా పదవ షెడ్యూల్ లోని సంస్థల బ్యాంక్ ల లావాదేవీలను నిర్వహించవద్దని ఆయన తెలిపారు. విభజనకు సంబంధించిన సంస్థలపై మూడు రోజుల్లో ఓ నివేదిక ఇస్తామని రాజీవ్ శర్మ తెలిపారు. -
'విభజన వల్ల సమస్యలొస్తాయని ముందే చెప్పాం'
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన వల్ల సమస్యలు వస్తాయని ముందే చెప్పామని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు అన్నారు. విభజనతో ఇద్దరు సీఎంలు అయ్యారే తప్ప..ప్రజలు మేలు జరగడం లేదని ఆయన అన్నారు. ఇరు ప్రాంతాల ప్రజలు సమస్యల పాలయ్యారని రాఘవులు తెలిపారు. రాష్ట్రాల శ్రేయస్సు దృష్ట్యా.. నేతలు రాజకీయాలు మాని సమస్యలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని విద్యుత్ సమస్యను పరిష్కరించాలని రాఘవులు విజ్క్షప్తి చేశారు. విద్యుత్ కేటాయింపులపై కేంద్ర జోక్యం చేసుకోవాలన్నారు. నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చాక కార్మికుల హక్కులను కాల రాస్తున్నారన్నారు. ఉపాధి హామీ పథకం పని దినాలు తగ్గిస్తున్నారని ఆరోపించారు. వీటన్నిటిపై ప్రజలను చైతన్య పరిచి ఆందోళన చేస్తామని రాఘవులు హెచ్చరించారు.