కమల్‌నాథన్ కమిటీకి టీఎన్జీవో
అధ్యక్షుడు దేవీప్రసాద్ వినతి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన సభ్య సలహా కమిటీ విడుదల చేసిన జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేడర్ స్ట్రెంత్ తప్పుల తడకగా ఉందని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ పేర్కొన్నారు. తాత్కాలిక, ఔట్ సోర్సింగ్, పార్ట్‌టైం, రిటైర్డ్ ఉద్యోగులను కూడా కేడర్ స్ట్రెంత్‌లో రెగ్యులర్ ఉద్యోగులుగా చూపారని విమర్శించా రు. ఉద్యోగసంఘాల నేతలు కారం రవీందర్‌రెడ్డి తదితరులతో కలిసి ఆయన గురువారం సచివాలయంలో కమల్‌నాథన్ కమిటీకి ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కేడర్ స్ట్రెంత్ వివరాలను పునఃపరిశీలించి సరైన గణాంకాలతో సవరణ జాబితాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల కేటాయింపుల విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు కమల్‌నాథన్ కమిటీ పంపిన మార్గదర్శకాలను తక్షణమే ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆర్డర్ టూ సర్వ్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగుల పంపకాలను చేపట్టాలని దేవీప్రసాద్ కోరారు.