ఉదయం 11గంటలకు ప్రధాని మోడీతో కేసీఆర్ భేటీ | kcr to meet narendra modi | Sakshi
Sakshi News home page

ఉదయం 11గంటలకు ప్రధాని మోడీతో కేసీఆర్ భేటీ

Published Sat, Sep 6 2014 10:38 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

ఉదయం 11గంటలకు ప్రధాని మోడీతో కేసీఆర్ భేటీ - Sakshi

ఉదయం 11గంటలకు ప్రధాని మోడీతో కేసీఆర్ భేటీ

న్యూఢిల్లీ :  హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ఆ తర్వాత పలువురు కేంద్రమంత్రులతో సమావేశం అవుతారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రెండు గంటల మధ్య రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలువనున్నారు.

 

రెండు గంటల తర్వాత కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్, విద్యుత్‌శాఖ మంత్రి పీయూష్‌ గోయల్, వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, మానవనరుల మంత్రి స్మృతి ఇరానీలతో సమావేశమవుతారు. రైల్వే మంత్రి సదానంద గౌడ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిలతో శని లేదా ఆదివారం భేటీ అయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement