ప్రధాని మోదీతో రేవంత్‌ భేటీ.. మెట్రో, ఆర్‌ఆర్‌ఆర్‌పై చర్చ | Telangana CM Revanth Meeting With PM Modi AT Delhi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీతో రేవంత్‌ భేటీ.. మెట్రో, ఆర్‌ఆర్‌ఆర్‌పై చర్చ

Published Wed, Feb 26 2025 10:39 AM | Last Updated on Wed, Feb 26 2025 12:37 PM

Telangana CM Revanth Meeting With PM Modi AT Delhi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బృందం సమావేశం ముగిసింది.  సుమారు గంటన్నర పాటుగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌ సహా మంత్రి శ్రీధర్‌ బాబు, చీఫ్ సెక్రటరీ శాంత కుమారి, తెలంగాణ డీజీపీ జితేందర్ కూడా పాల్గొన్నారు. 

ప్రధాని మోదీతో సమావేశం సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి తెలంగాణకు సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో చేపట్టిన పలు ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. మెట్రో ఫేజ్‌-2 లైన్ ఎయిర్‌పోర్ట్ పొడిగింపు, దానికి కావాల్సిన ఆర్థిక సహాయం అనుమతులు, మూసీ నది సుందరీకరణ నిధులు, కేంద్రం నుంచి వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు, తెలంగాణకు ఐటీఐఆర్, ఐఐఎం, రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతులు, ఆర్థిక సహాయం గురించి చర్చించినట్టు తెలుస్తోంది. 

 

ప్రధాని నరేంద్రమోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement