Peddapalli
-
ఆధునిక యంత్రాల వైపు రైతుల చూపు
జగిత్యాలఅగ్రికల్చర్: వ్యవసాయ రంగం రోజురోజుకూ శాస్త్ర, సాంకేతికతను సంతరించుకుంటూ ముందుకెళ్తోంది. ఒకప్పటి నాగళ్లు, కొడవళ్లు మూలకు పడ్డాయి. వాటి స్థానంలో ట్రాక్టర్లు, డ్రోన్లు వంటి ఆధునిక యంత్రాలు వచ్చాయి. ట్రాక్టర్లతోపాటు వాటికి ఉపయోగించే పరికరాల ధరలు ఆకాశానికి ఎగబాకాయి. దీంతో సామాన్య రైతులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఆధునిక యంత్రాలపై ఆధారం మనిషి శ్రమ లేకుండా.. తేలికగా యంత్రాలతో వ్యవసాయ పనులు చేయాలని రైతులు ఆలోచిస్తున్నారు. వారి ఆలోచనలకు అనుగుణంగా ఆధునాతన యంత్రాలు కూడా రూపుదిద్దుకుంటున్నాయి. ఒకప్పుడు గ్రామానికి రెండుమూడు ట్రాక్టర్లు ఉంటే గొప్ప. అలాంటిది ఒక్కో గ్రామంలో పదుల సంఖ్యలో ట్రాక్టర్లు వచ్చాయి. రైతులకు బ్యాంకులు ఈఎంఐ పద్ధతిలో రుణ సహాయం చేస్తుండటంతో ట్రాక్టర్లు కొనుగోలు చేస్తున్నా వాటికి బిగించే పరికరాలకు మాత్రం రుణ సహాయం అందించడం లేదు. ఫలితంగా చిన్న, సన్నకారు రైతులు యంత్ర పరికరాల కోసం ప్రభుత్వ సబ్సిడీ కోసం ఎదురు చూస్తున్నారు. వ్యవసాయానికి వినియోగించే ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, సీడ్ ప్లాంటేషన్, రోటోవేటర్, గడ్డిని కట్టలుకట్టే మిషన్లు, కేజీవీల్స్ వంటి పరికరాలను సబ్సిడిపై అందించాలని రైతులు కోరుతున్నారు. స్మామ్ పథకం రైతులకు వరం ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద వ్యవసాయ యాంత్రీకరణ పథకం(స్మామ్) ద్వారా ఉమ్మడి జిల్లాకు రూ 2.61కోట్లు కేటాయించింది. వీటి ద్వారా సన్న, చిన్న కారు రైతులతోపాటు మహిళా రైతులకు బ్యాటరీ స్ప్రేయర్స్, పవర్ స్ప్రేయర్స్, రసాయన మందులు పిచికారీ చేసే డ్రోన్లు, రోటోవేటర్లు, ఎరువులు, విత్తనాలు ఒకేసారి వేసే సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్, కల్టివేటర్లు, బండ్ ఫార్మర్ (పొలం మధ్య గట్లను పోసే యంత్రం), పవర్ వీడర్, బ్రష్ కట్టర్, పవర్ టిల్లర్లు, స్ట్రాబాలర్స్ను అందించాలని నిర్ణయించారు. సన్న, చిన్నకారు రైతులకు 40శాతం, ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు. ఇందుకోసం మండల వ్యవసాయాధికారి కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తులను మండల పరిధిలోని తహసీల్దార్, ఎంపీడీఓ, వ్యవసాయాధికారి పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. రాయితీపై ఇచ్చే పరికరాలు రాయితీపై ఇచ్చే పరికరాలు తక్కువగా ఉండటం, దరఖాస్తులు ఎక్కువగా వ స్తుండటంతో అధికారులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. బ్యాటరీ స్ప్రేయర్స్ కరీంనగర్‌కు 94, జగిత్యాలకు 101, రాజన్న సిరిసిల్లకు 64, పెద్దపల్లికి 75, పవర్ స్ప్రేయర్స్ కరీంనగర్‌కు 94, జగిత్యాలకు 102, రాజన్న సిరిసిల్లకు 64, పెద్దపల్లికి 76, రోటోవేటర్లు కరీంనగర్‌కు 55, జగిత్యాలకు 51, రాజన్న సిరిసిల్లకు 24, పెద్దపల్లికి 35, కల్టివేటర్లు కరీంనగర్‌కు 63, జగిత్యాలకు 67, రాజన్న సిరిసిల్లకు 29, పెద్దపల్లికి 34 మంజూరయ్యాయి. ప్రతి జిల్లాకు ఒక్కటి చొప్పున డ్రోన్, మూడు చొప్పున ట్రాక్టర్లు మంజూరయ్యాయి. ఇంకా సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ కరీంనగర్‌కు 9, జగిత్యాలకు 12, సిరిసిల్లకు 4, పెద్దపల్లికి 6 మంజూరయ్యాయి. ఉమ్మడి జిల్లాకు బండ్ ఫార్మర్ 10, పవర్ వీడర్ 7, బ్రష్ కట్టర్ 17, పవర్ టిల్లర్ 10, స్ట్రాబాలర్స్ 9 మంజూరు కాగా ఆయా జిల్లాలకు 2,3 చొప్పున ఇవ్వనున్నారు. పరికరాలకు అందని సబ్సిడీ రాయితీ ఉంటే మరింత మందికి చేరువ ఇటీవల కేంద్రం నుంచి ఉమ్మడి జిల్లాకు రూ.2.61 కోట్లు 50 శాతం సబ్సిడీ ఇచ్చే పరికరాలు యంత్రం ధర ట్రాక్టర్ రూ.4లక్షల నుంచి రూ.13లక్షలు డ్రోన్ రూ.10లక్షలు రోటోవేటర్ రూ.90వేల నుంచి రూ.1.90లక్షలు ఎంబీ ఫ్లవ్ రూ.50వేల నుంచి రూ.1.40లక్షలు కల్టీవేటర్ రూ.36వేల నుంచి రూ.50 వేలు డిస్క్ కల్టీవేటర్ రూ.40వేల నుంచి రూ.50 వేలు బండ్ ఫార్మర్ రూ.40వేల నుంచి రూ.3.50లక్షలు రోటో ఫడ్లర్ రూ.26వేల నుంచి రూ.1.60లక్షలు పవర్ టిల్లర్ రూ.2లక్షల నుంచి రూ.2.40లక్షలు సీడ్కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ రూ.46వేల నుంచి రూ.60లక్షలు పవర్ స్ప్రేయర్ రూ.20వేలు పవర్ వీడర్ రూ.60లక్షల నుంచి రూ.80లక్షలు బ్రష్కట్టర్ రూ.40వేల నుంచి రూ.88వేలు స్ట్రాబేలర్స్ రూ.4లక్షల నుంచి రూ.4.40 లక్షలు మేజ్ షెల్లర్స్ రూ.66లక్షల నుంచి రూ.2.20లక్షలు (ట్రాక్టర్లు, డ్రోన్లు పొందాలంటే తప్పనిసరిగా 2.5 ఎకరాల భూమి ఉండాలి)ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం కొన్నేళ్లుగా సబ్సిడీపై యంత్ర పరికరాలు సరఫరా చేయలేదు. ఇప్పుడు దరఖాస్తు చేసుకుందామంటే జిల్లాకు ఒక్కటి రెండు పరికరాలు మాత్రమే ఉన్నాయి. మండలానికి ఒక్క పరికరం కూడా వచ్చేలా లేదు. రైతులకు అవసరమైన పరికరాలకు సబ్సిడీ వర్తింజేయాలి. – చీటేటి జీవన్‌రెడ్డి, తొంబర్రావుపేట, మేడిపల్లి మండలం దరఖాస్తులు స్వీకరిస్తున్నాం యంత్ర పరికరాల స్కీం కింద దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ప్రతి మండలానికి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. జిల్లా, మండల లెవల్ కమిటీలు లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యంత్రం ధరలో 50 శాతం సబ్సిడీ లభిస్తుంది. – భాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి, జగిత్యాల -
నేరాల నియంత్రణకు నిరంతర పెట్రోలింగ్
ఓదెల(పెద్దపల్లి): నేరాల నియంత్రణ కోసం పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదేశించారు. పొత్కపల్లి పోలీస్‌స్టేషన్‌ను బుధవారం రాత్రి సీపీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఠాణా పరిసరాలు, కేసులు, సీజ్ చేసిన వాహనాలు తదితర వాటిపై ఆరా తీశారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించి సమస్యలను పరిష్కరించాల ని అన్నారు. సమస్యాత్మక గ్రామాలు, అజ్ఞాతంలోని మావోయిస్టుల వివరాల గురించి ఎస్సైని అడిగి తెలుసుకున్నారు. రౌడీషీటర్లు, అనుమానితుల స్థితిగతులు, కదలికలపైనా ఆరా తీశారు. మత్తు పదార్థాలను తయారు చేస్తున్న, నిల్వచేస్తున్న, రవాణా చేస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎస్సై రమేశ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నస్పూర్ పాలిటెక్నిక్‌లో 50 శాతం సీట్లు గోదావరిఖని: పదోతరగతి పూర్తిచేసిన సింగరేణి ఉద్యోగుల పిల్లలకు నస్పూర్ పాలిటెక్నిక్‌లో 50 సీట్లు కేటాయించనున్నట్లు ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్ తెలిపారు. మెరిట్ ప్రాతిపాదికన ఇతరులకూ సీట్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. డిప్లొమా ఇన్ సివిల్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, డిప్లొమా ఇన్ మెకానికల్, డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజినీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నట్లు జీఎం లలిత్‌కుమార్ వెల్లడించారు. బాల, బాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి ఉన్నట్లు తెలిపారు. అలాగే ఆర్జీ–1 సింగరేణి పాఠశాలలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేకించి కొత్తగూడెంలోని మహిళా జూనియర్, మహిళా డిగ్రీ, పీజీ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ కోర్సులు ఇంగ్లిష్, తెలుగు మీడియంలో అందుబా టులో ఉన్నట్లు వివరించారు. ఆసక్తి గలవారు స్థాని క సింగరేణి హైస్కూల్ సెక్టార్–2 ప్రధానోపాద్యాయుడు శ్రీనివాస్ 94908 82498, లేదా స్వర్ణలత టీచర్ 98497 72512 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు. ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు పెద్దపల్లిరూరల్: ఎల్ఆర్ఎస్ గడువును ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు పొడిగించిందని పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ బుధవారం తెలిపారు. లే అవుట్ లేని ప్లాట్లు కొనుగోలు చేసిన వారు తమ ప్లాట్లను 25శాతం రాయితీ ఫీజుతో క్రమబద్ధీకరించుకోవాలన్నారు. ఇందుకోసం ము న్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామని వివరించారు. అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆస్తిపన్ను చెల్లించేవారికి ఐదుశాతం రాయితీ వర్తింపజేస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
పంచ్ కొడితే పతకమే
● అంతర్జాతీయ కరాటే పోటీల్లో గ్రామీణ విద్యార్థిని ప్రతిభ ● మలేషియా ఇంటర్నేషియల్ పోటీలకు హాసిని ఎంపిక ● వరల్డ్ చాంపియన్‌లో దేశానికి మెడల్ తేవడమే లక్ష్యం ముత్తారం(మంథని): ఆమె గ్రామీణ విద్యార్థిని.. ఆర్థిక సమస్యలున్నా కరాటే పోటీల్లో పంచ్ కొడితే పతకం సాధించాలనే తపనతో ప్రతిభకు పదును పెడుతోంది. ఇటీవల జరిగిన జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ చూపి మే నెలలో మలేషియాలో దేశంలో జరిగే ఇంటర్నేషనల్ కరాటే పోటీలకు ఎంపికై ంది మెట్టు హాసిని. పోటీ పడితే పతకం సాధించడమే.. మంథనికి చెందిన మెట్టు దేవి – నర్సింగం దంపతులకు ఇద్దరు కూతుర్లు. పెద్ద కుతూరు మానసకు వివాహం అయ్యింది. చిన్నకుతూరు హాసిని మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు మంథని బాలికల హైస్కూల్లో చదివింది. ముత్తా రం మండలం ధర్య పూర్ మోడల్ స్కూల్లో ఇంటటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రా సింది. నాలుగో తరగతిలోనే సీనియర్ల ను చూసి కరాటే నే ర్చుకోవడమే కాదు.. అందులో రాణించాలని కంకణం కట్టుకుంది. ఇలా ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతూనే కరాటేలో శిక్షణ తీసుకుంది. అదేసమయంలో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో రాణించింది. పోటీపడితే వెండి పతకాలతోపాటు ఇప్పటివరకు 15 బంగారు పతకాలు సాధించింది. 2024లో హరియాణాలోని పంచకుల, మధ్యప్రదేశ్‌లోని గాలియానాలో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో బ్లాక్‌బెల్ట్‌లో గోల్డ్‌మెడల్ సాధించి ఔరా అనిపించింది. గతేడాది 2024 నవంబరులో కరీంనగర్లో జరిగిన ఇంటర్నేషనల్ కరాటే పోటీల్లో బ్లాక్‌బెల్ట్‌లో ఫస్ట్డాన్గా గోల్డ్ మెడల్ కై వసం చేసుకుంది. ఈఏడాది మే 7 నుంచి 12వతేదీ వరకు మలేషియాలో జరిగే అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభ చూపే అవకాశం దక్కించుకుంది. అమ్మ ప్రోత్సాహం.. మాస్టర్ కృషి మా నాన్న మా కుటుంబానికి దూరంగా ఉంటున్నా.. మా అమ్మ కూలీ పనిచేస్తూ అక్క పెళ్లి చేసి, నన్ను చదివిస్తోంది. ఆడపిల్లకు కరాటే పోటీలు అవసరమా అని బంధువులు, ఇరుగుపొరుగువారు సూటిపోటీ మాటలతో ప్రశ్నించేవారు. ఇది మనోవేదనకు దారితీసినా.. కరాటే మాస్టర్ సమ్మయ్య నచ్చజెప్పి మళ్లీ శిక్షణ ఇచ్చారు. ఆడవాళ్లు అంటే కుటుంబానికే పరిమితం కాదనే పట్టుదలతో కరాటేలో రాణిస్తున్నా. మలేషియాలో జరిగే పోటీల్లో మెడల్ సాధించడమే లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నా. నా ప్రతిభ నాలాంటి ఆడపిల్లల కుటుంబాలకు ఆదర్శంగా నిలవాలి. -
భరోసా ఏది?
జిల్లా సమాచారంసాక్షి, పెద్దపల్లి: సాగు పెట్టుబడి కోసం ప్రవేశపెట్టిన రైతుభరోసా అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. విత్తనాలు, నాట్లువేసే సమయంలో ఇవ్వాల్సిన రైతుభరోసాను పంటలు కోతకు వచ్చినా విడుదల చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగు మొదట్లోనే బ్యాంకు ఖాతాల్లో జమచేస్తే ఎరువులు, కూలీలు తదితర ఖర్చులకు ప్రభు త్వం ఇచ్చే పైసలు ఉపయోగపడేవి. విడుదలతో ఆలస్యంతో రైతులపై అప్పులు, వడ్డీభారం పడుతోంది. సాగుకు యోగ్యమైన భూములకే రైతుభరోసా ఇస్తామని జనవరి 26న రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వం.. విడతల వారీగా మార్చి 31వ తేదీ వరకు పలువురు రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని చెప్పింది. అయినా, ఇప్పటివరకు వారి ఖాతాల్లో డబ్బులు పడలేదని, పడుతాయో లేదోనని రైతులు వ్యవసాయశాఖ అధికారులు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. 2,665 ఎకరాలకు రైతుభరోసా కట్ రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఇటుకబట్టీలు తదితర సా గులో లేనిభూములకు గత ప్రభుత్వం పెట్టుబడి సా యం అందించింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ధర ణి పోర్టల్ ద్వారా అనుసంధానించిన పట్టా కలిగిన భూములను వ్యవసాయశాఖ అధికారులతో సర్వే చేయించింది. ఇందులో జిల్లాలో 2,78,555 ఎకరాలకు పట్టా ఉండగా, అందులో 2,655.32 ఎకరాలు సాగులో లేవని గుర్తించారు. కేవలం 2,75,899 ఎకరాలు సాగులో ఉన్నాయని, వాటికి 1,61,032 మంది రైతులకు రైతు భరోసా కింద రూ.165.53కోట్లు జమచేయాల్సి ఉందని తేల్చారు. మూడెకరాలు.. ఐదు విడతలు గత యాసంగి నుంచి ఎకరాకు రూ.6వేల చొప్పున పెట్టుబడి సాయం అందించింది. ఇందులో భాగంగా తొలుత జనవరి 27న పైలెట్ గ్రామాల్లోని రైతు ల ఖాతాల్లో నిధులు జమచేశారు. ఫిబ్రవరి 5న ఎక రం ఉన్న రైతులకు, 10న రెండెకరాలు, 12న మూడెకరాల్లోపు భూములు ఉన్న రైతులకు నిధులను విడుదల చేసింది. ఆపై భూమి కలిగిన వారి ఖాతాల్లో ఇప్పటివరకు పైసలు పడేలేదు. ఇప్పటివరకు 1,14,313 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.82.57కోట్లు జమచేశారు. ఇంకా సుమారు 45వేల మందికిపైగా రైతుల బ్యాంకు ఖాతాల్లో దాదాపు రూ.51కోట్ల వరకు జమచేయాల్సి ఉంది. ఇదే విషయమై డీఏవో ఆదిరెడ్డిని సంప్రదించగా.. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే రైతుల బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా జమ అవుతాయన్నారు. పంటలు కోతకు వచ్చినా స్పష్టత కరువు పెట్టుబడి కోసం నిరీక్షిస్తున్న అన్నదాతలు పట్టా భూమి(ఎకరాల్లో): 2,78,555 సాగుయోగ్యమైనది(ఎకరాలో్ల) 2,75,899 రైతుల సంఖ్య: 1,61,032 మొత్తం పెట్టుబడి సాయం 165.53 (రూ.కోట్లలో) ఇప్పటివరకు ఖాతాల్లో జమైంది 82.57 (రూ.కోట్లలో) సాయం పొందిన రైతుల సంఖ్య 1,14,313 -
టార్గెట్ 76 మిలియన్ టన్నులు
● 2025–26లో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం ● అత్యధికం కొత్తగూడెం ఏరియాకు.. ● నైనీబ్లాక్ నుంచి 4 మిలియన్ టన్నులు ● వార్షిక నివేదిక విడుదల చేసిన సింగరేణి యాజమాన్యంగోదావరిఖని: సింగరేణి సంస్థ 2025–25 ఆర్థిక సంవత్సరం వార్షిక లక్ష్యం నివేదికను విడుదల చేసింది. ఈసారి 76 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని నిర్దేశించింది. ఇందులో సింహభాగం.. 15.7 మిలియన్ టన్నులు కొత్తగూడెం ఏరియాకు కేటాయించింది. ఆ తర్వాతి స్థానంలో మణుగూరు ఏరియా ఉంది. అత్యల్పంగా అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టుకు 1.5 మిలియన్ టన్నులు కేటాంచారు. నైనీబ్లాక్ ద్వారా 4 మిలియన్ టన్నులు సింగరేణి సంస్థకు చెందిన ఒడిశాలోని నైనీబ్లాక్‌లో ఈ ఆర్థిక సంవత్సరం ఉత్పత్తి లక్ష్యాన్ని భారీగా నిర్దేశించింది. బ్లాక్ ద్వారా 4 మిలియన్ టన్నుల బొగ్గు వెలికితీయాలని నిర్ణయించింది. వాస్తవానికి గత ఆర్థిక సంవత్సరంలోనే బొగ్గు ఉత్పత్తి ప్రారంభిస్తామని ప్రకటించినా.. సాంకేతిక కారణాలతో అది సాధ్యం కాలేదు. -
కోతలు దగ్గర పడ్డాయి
నాకు 4.10 ఎకరాలు ఉంది. పెట్టుబడి కోసం ప్రవేశపెట్టి న రైతుభరోసా పైసలు ఇంకా పడలేదు. పంట కోతలు దగ్గరపడ్డా పైసల కోసం ఎదురుచూపులే మిగిలాయి. ప్రభుత్వం పైసలు జమచేస్తే కోతలు, కూలీల అవసరాలకు ఉపయోగపడతాయి. – ముత్యాల తిరుమలరెడ్డి, బొమ్మరెడ్డిపల్లి డబ్బులు పడలేదు ప్రభుత్వం ప్రకటించిన రైతుభరోసా డబ్బులు ఇప్పటివరకు పడలేదు. మూడు ఎకరాల్లో పంటలు వేసిన. ఇంతవరకు పైసలు పడలేదు. రైతుభరోసా ఎప్పుడు పడుతుందో నని బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుడు అవుతుంది. – టి.రాజారాం, రైతు, ఓదెల పైసలు రాలేదు ఇప్పటి వరకు రైతు భరోసా అందలేదు. మరోవారం, ప దిరోజులైతే పంటలు కోతకు వస్తాయి. గత సీజన్లో రైతుభరోసా వేయలేదు. ఈ సీజన్లో భరోసా వేసినా.. కొంతమంది రైతులకే వచ్చాయి. నాలాంటి రైతులకు సైతం ఖాతాల్లో డబ్బులు జమ చేస్తే కోతలకు పనికి వస్తాయి. – అప్పల రాజయ్య, రైతు, కదంబపూర్ -
గ్రూప్–1 ర్యాంకర్‌కు కలెక్టర్ అభినందన
పెద్దపల్లిరూరల్/మంథని: మంథని మండలం ఖాన్‌సాయిపేటకు చెందిన గ్రూప్ – 1 ర్యాంకర్ జక్కుల అరుణ్‌కుమార్‌ను కలెక్టర్ కోయ శ్రీహ ర్ష బుధవారం అభినందించారు. అరుణ కుమా ర్ రాష్ట్రస్థాయిలో 114వ ర్యాంక్, మల్టీజోనల్– 1 స్థాయిలో 64వ ర్యాంక్ సాధించడంపై కలె క్టర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాల్, తల్లిదండ్రులు మల్లేశ్వరి – లక్ష్మీనారాయణతో పాటు అధికారులు తదితరులు పాల్గొన్నారు. కోతలు లేకుండా విద్యుత్ సరఫరా సుల్తానాబాద్(పెద్దపల్లి): వేసవిలో వినియోగదారులకు కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామని ట్రాన్స్‌కో ఎస్ఈ మాధవరావు అన్నారు. మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్ వినియోగిస్తున్న లబ్ధిదారులు కరెంట్‌ను వృథా చేయొద్దన్నారు. అనంతరం ఎస్ఈని సన్మానించారు. అధికారులు రవికుమార్, ప్రభాకర్, ఏడీఈ శ్రీనివాస్, సుగుణయ్య, ఏఈలు కిశోర్, బొంకూరి రవీందర్, సంపత్, శంకరయ్య, సైఫొద్దీన్, మాధవరావు, శంకరయ్య, సుధాకర్, కొమురయ్య, లక్ష్మయ్య, శ్రీనివాస్, వీరయ్య, శ్రీనివాస్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు. పాపన్నగౌడ్‌కు నివాళి పెద్దపల్లిరూరల్: జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. సర్వాయి పాపన్న ఆశయ సాధనకు పాటుపడాలని ఆయన కోరారు. సహాయ బీసీ అభివృద్ధి అధికారి, జిల్లా గౌడ సంఘం అధ్యక్షు డు ఎం.అంజయ్యగౌడ్, ప్రతినిధులు బాలసాని వెంకటేశంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. 232 క్వింటాళ్ల పత్తి కొనుగోలు పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో బుధవారం పత్తి క్వింటాలుకు గరిష్టంగా రూ.7,241 ధర పలికింది. కనిష్టంగా రూ.5,111, సగటు రూ.7,044గా ధర నమోదైందని మార్కెట్ కార్యదర్శి మనోహర్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా తరలివచ్చిన పలువురు రైతుల నుంచి 232 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్టీపీసీ కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలు జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్‌షిప్‌లోని కేంద్రీయ విద్యాలంయలో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శోభన్‌బాబు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. రెండో తరగతిలో 13, నాలుగో తరగతిలో–07, ఐదో తరగతిలో–19, ఆరో తరగతిలో–15, ఏడో తరగతిలో–18, ఎనిమిదో తరగతిలో –22, తొ మ్మిదో తరగతిలో –09 సీట్లు ఖాళీగా ఉన్నా యని ఆయన పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు విద్యాలయంలో రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు దరఖాస్తు చేయాలని, ఈనెల 11వ తేదీ వరకు గడువు ఉందన్నారు. అర్హుల జాబితాను ఈనెల 17న విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. గడువు పొడిగింపు పెద్దపల్లిరూరల్: ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ, జైన, పార్శీ సామాజిక వర్గాల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తుల దాఖలుకు ఈనెల 14వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి రంగారెడ్డి తెలిపారు. అర్హులైన, ఆసక్తిగల అభ్యర్థులు గడువులోగా https:// tgobmms. cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేయాలన్నారు. వివరాలకు 08728–222266, 79933 57097 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు. -
పరిశోధనలు రైతుకు చేరితేనే సార్థకత!
జగిత్యాలఅగ్రికల్చర్: వ్యవసాయ శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు కష్టపడి పరిశోధనలు చేసి.. అత్యుత్తమ విత్తనాలు తయారు చేసినప్పటికీ వాటి ఫలాలు వివిధ కారణాలతో రైతుల చెంతకు చేరడం లేదు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు సమన్వయంతో సాగులో సమస్యలను ఎప్పటికప్పుడు తీర్చాల్సి ఉన్నా.. ముందుకు కదలడం లేదు. ఈ నేపథ్యంలో సాగులో సమస్యలపై చర్చించేందుకు ఉత్తర తెలంగాణ జోనల్ స్థాయి శాస్త్రవేత్తల సదస్సు పొలాస పరిశోధన స్థానంలో గురువారం ప్రారంభం కానుంది. ఈ సదస్సు రెండురోజుల పాటు నిర్వహించనున్నారు. జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, 10 జిల్లాల వ్యవసాయాధికారులు పాల్గొననున్నారు. మూడు ఉమ్మడి జిల్లాలకు కేంద్రం పొలాస జగిత్యాలలోని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం మూడు ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు కేంద్రం. ఈ కేంద్రం పరిధిలోనే ఆయా జిల్లాలోని వ్యవసాయ పరిశోధన స్థానాలు, డాట్ సెంటర్లు, కృషి విజ్ఞాన కేంద్రాలు పనిచేస్తాయి. వీటిల్లో దాదాపు 60 నుంచి 70 మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు పనిచేస్తుంటారు. పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో వరి, వేరుశనగ, నువ్వు పంటల సాగు విధానాలు, సాగు నీటి యాజమాన్యంపై పరిశోధనలు చేస్తుంటారు. కరీంనగర్ పరిశోధన స్థానంలో మొక్కజొన్న, పెద్దపల్లిలోని కూనారం పరిశోధన స్థానంలో వరి, మొక్కజొన్న పంటలు, ఆదిలాబాద్ పరిశోధన స్థానంలో పత్తి, జొన్న, వరి, సోయాచిక్కుడు, ముథోల్ పరిశోధన స్థానంలో వర్షాధార పత్తి, రుద్రూర్ పరిశోధన స్థానంలో చెరుకు, వరి పంటల సాగు విధానంపై పరిశోధనలు సాగుతుంటాయి. అయితే పరిశోధన ఫలాలను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేసేందుకు శాస్త్రవేత్తలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ప్రతి సీజన్లో తమ పరిశోధన స్థానాల్లో సాగు చేసిన పంటలను తిలకించేలా ప్రదర్శన క్షేత్రాలు, సాగు సమస్యలు తెలుసుకునేలా కిసాన్ మేళాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ నిధుల కొరతతో ఎప్పుడో ఒకసారి మమ అన్పించేలా జరుగుతుంటాయి. సమన్వయం అంతంతే.. జిల్లాలోని ఆయా మండలాల్లో పనిచేసే వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తల మధ్య సమన్వయం లోపిస్తోంది. కనీసం ప్రతి పంటల సీజన్లో నెలకోమారు ఉండేలా సమావేశాలు కనిపించడం లేదు. రైతులకు సాగులో సమస్యలు, సందేహాలు వచ్చినప్పుడు ఎక్కడకు వెళ్లాలో తెలియడం లేదు. రైతులు కొత్త పంటలు సాగు చేద్దామనుకున్నా.. ఏ పంట విత్తనం ఎక్కడ దొరుకుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. క్షేత్రస్థాయిలో రైతులు పొలాలను సందర్శించేందుకు వెళ్లినప్పుడు వ్యవసాయాధికారులు అందుబాటులో ఉండటం లేదు. వ్యవసాయాధికారులు ఏదైనా సమస్యపై శాస్త్రవేత్తల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సకాలంలో క్షేత్ర సందర్శనకు రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రైతులు శాస్త్రవేత్తలు, అధికారుల చుట్టూ తిరగలేక ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఫర్టిలైజర్ దుకాణాలను ఆశ్రయించి వారు ఇచ్చిన మందులు పిచికారీ చేస్తున్నారు. పొలాలకు చేరని పరిశోధనలు శాస్త్రవేత్తల పరిశోధనలు రైతుల చెంతకు చేరడం లేదు. శాస్త్రవేత్తలు శ్రమటోడ్చి రూపొందించిన విత్తనాలను రైతులు ఆదరిస్తుంటే.. కొన్ని రకాల విత్తనాల విషయమే రైతులకు తెలియని పరిస్థితి ఉంది. రైతులు ఏం కావాలనుకుంటున్నారు..? ఎలాంటి పరిశోధనలు చేస్తే రైతులకు ఉపయోగం ఉంటుందనే విషయాలపై ఆలోచించకుండా.. మూస ధోరణిలో ఉన్నతాధికారులు అదేశాల మేరకు పరిశోధనలు చేస్తున్నారు. రైతులు ప్రధానంగా కూలీలు, మార్కెటింగ్ సమస్యను ఎదుర్కొంటున్నారు, వాతావరణ మార్పులతో పంటల్లో తెగుళ్లు, పురుగుల విజృంభన ఎక్కువవుతుంది. ప్రతి సీజన్లో అధిక దిగుబడినిచ్చే విత్తనాల కోసం రైతులు వెతుకులాడుతున్నారు. ప్రైవేట్ విత్తన కంపెనీలు రక రకాల పేర్లతో విత్తనాలు తయారు చేసి రైతులకు విక్రయిస్తుంటే.. నిధుల కొరతతో అనుకున్న స్థాయిలో పరిశోధన స్థానాల్లో విత్తనోత్పత్తి జరగడం లేదు. రెండు రోజుల పాటు సాగు సమస్యలపై సదస్సు హాజరుకానున్న ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల శాస్త్రవేత్తలు రైతల కోసం పరిశోధనలు చేయాలి శాస్త్రవేత్తలు మూస ధోరణిలో కాకుండా రైతులకు అవసరమైన పరిశోధనలు చేసి అభిమానాన్ని చూరగొనాలి. వరి పంటకు ప్రత్యామ్నాయ పంటలు, కోతుల సమస్యపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. వాతావరణ మార్పులు రైతులకు పెద్ద సమస్యగా మారింది. వాటిపై పరిశోధనలు చేయాలి. – సత్యనారాయణరెడ్డి, జిల్లా ఉత్తమ రైతు, నాగారం, ధర్మపురి మండలం రైతుల ఆదాయం పెరిగేలా.. రైతుల ఆదాయం పెరిగేలా శాస్త్రవేత్తల పరిశోధనలు సాగాలి. సాగులోని సమస్యలను ఎప్పటికప్పుడు రైతులతో చర్చించాలి. సాగులో వస్తున్న సమస్యలు రైతులకు సవాల్ విసురుతున్నాయి. నామమాత్రంగా సమావేశాలు నిర్వహించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. – వెల్ముల రాంరెడ్డి, వ్యవసాయ వర్సిటీ సలహా మండలి మాజీ సభ్యుడు, పూడూరు -
హంస వాహనంపై ఊరేగింపు
వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయంలో జరుగుతున్న శ్రీరామ నవరాత్రోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి సీతారామచంద్ర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అందంగా అలంకరించిన పెద్ద సేవపై హంస వాహనంపై ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, పురప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. జాతీయ ఖోఖో పోటీలకు కోచ్‌లుగా ఉమ్మడి జిల్లావాసులుకరీంనగర్స్పోర్ట్స్: ఒడిశా రాష్ట్రంలోని పూరిలో ఈనెల 4వ తేదీ వరకు జరుగనున్న 57వ సీనియర్స్ జాతీయ ఖోఖో పోటీల్లో పాల్గొనే తెలంగాణ జట్లకు ఉమ్మడి జిల్లాకు చెందిన పండుగ ఆనంద్ కుమార్, ఇస్లావత్ నరేష్ కోచ్‌లుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర పురుషుల జట్టుకు ఇల్లంతకుంటకు చెందిన రైల్వే క్రీడాకారుడు పూర్వ భారత జట్టు కెప్టెన్ పండుగ ఆనంద్, జాతీయ పోటీల్లో పాల్గొంటున్న భారత పురుషుల రైల్వే జట్టుకు ధర్మారం మండలం బంజరుపల్లి తండాకు చెందిన దక్షిణ మధ్య రైల్వే క్రీడాకారుడు ఇస్లావత్ నరేశ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై.మహేందర్ రావు తెలిపారు. వీరిని సంఘ బాధ్యులు చిట్టి తిరుపతిరెడ్డి, కుమారస్వామి, ఏ.రవీందర్, లక్ష్మణ్, ఎస్కే మోహినుద్దీన్, సీఐ కుమారస్వామి, ఎస్సై రమేశ్, బి.శేఖర్, నవీన్, ఆర్.తిరుపతిరెడ్డి అభినందించారు. కారు ఢీకొని విద్యార్థులకు గాయాలుధర్మపురి: కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్న ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ధర్మపురికి చెందిన సంతోష్ బుధవారం సాయంత్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు. అదే సమయంలో మైదానంలో మహాత్మ జ్యోతిబాపూలే డిగ్రీ కళావాల విద్యార్థులు కూర్మాదాస్, వినయ్ వాకింగ్ చేస్తున్నారు. కారు అదుపు తప్పి వీరిని ఢీకొట్టింది. ప్రహరీ, కారు మధ్యలో విద్యార్థులు ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను 108 అంబులెన్సులో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
బియ్యం పథకంపై పీఎం ఫొటో పెట్టాలి
● బీజేపీ శ్రేణుల డిమాండ్ పెద్దపల్లిరూరల్: పేదలకు పంపిణీ చేసే బియ్యం పథకంపై ప్రధానమంత్రి ఫొటో ముద్రించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో బుధవారం చేపట్టిన సన్నబియ్యం పంపిణీ ప్రారంభ కార్యక్రమంలో వారు నిరసన తెలిపారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాకేశ్‌తోపాటు నాయకులు రాజ్‌గోపాల్, పిట్టల వినయ్ తదితరులు.. పీఎం ఫొటో కూడా ముద్రించాలని డిమాండ్‌చేశారు. అ యితే, వారు లోనికి చొచ్చుకు వెళ్లకుండా సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై లక్ష్మణ్‌రావు, మల్లేశ్ అడ్డుకున్నా రు. ‘ఈ విషయమై మీ విన్నపాన్ని కలెక్టర్ ఇవ్వండి.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు’ అని ఎమ్మెల్యే విజయరమణారావు వారికి నచ్చజెప్పారు. అంతేకాదు.. ‘రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు, అందులో ఇద్దరు మంత్రులుగా ఉండీ ఏం లాభం.. రాష్ట్రాభివృధ్దికి నిధులు సాధించలేక పోయారు.. అదే పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం నలుగురే ఉన్నా నిధుల వరద పారించార’ని ఎమ్మెల్యే విమర్శించారు. రాష్ట్రాభివృద్ధి కోసం నిధులు తెచ్చేందుకు పోరాడాలే.. తప్ప గీ బియ్యం పథకం కాడ ఫొటో కోసం కాదని హితవు పలికారు. అయి నా, మన ప్రధానే.. ఆయనను గౌరవించుకుందామని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే నచ్చజెప్పి వెళ్లిపోయారు. -
పేదలకు సరిపడా సన్నబియ్యం
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సరిపడా సన్నబియ్యం సరఫరా చేస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్ రేషన్ దుకాణంలో బుధవారం తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీని ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని 413 రేషన్‌దుకాణాల ద్వారా ప్రతీనెల సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. ఇందుకోసం 4 లక్షల క్వింటాళ్ల బియ్యం అందుబాటులో ఉంచామని తెలిపారు. జిల్లా అవసరాలు తీర్చడంతోపాటు ఆసిఫాబాద్ జిల్లాకు కూడా ఎగుమతి చేశామని వెల్లడించారు. ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ, పెద్దపల్లి నియోజకవర్గంలోని 55 రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. ఆర్డీవో గంగయ్య, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేందర్, డీఎం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కాగా, రైతులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. నిట్టూరులో రూ.20లక్షల వ్యయంతో చేపట్టిన కల్వర్టు పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పేదల సంక్షేమమే ధ్యేయం జూలపల్లి(పెద్దపల్లి): ప్రజాసంక్షేమమే ధ్యేయంగా, పేదల కడుపునింపేందుకే సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. జూలపల్లి మండలం కాచాపూర్, కుమ్మరికుంటలో అదనపు కలెక్టర్ వేణు, డీఎస్వో రాజేందర్, ఆర్డీవో గంగయ్య, తహసీల్దార్ స్వర్ణతో కలిసి ఆయన సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారు. నాయకులు గండు సంజీవ్, వేణుగోపాలరావు, రమాదేవి, నర్సింహాయాదవ్ తదితరులు ఉన్నారు. తెల్లరేషన్‌కార్డుదారులకు.. ఎలిగేడు(పెద్దపల్లి): పేదల కడుపునింపేందుకే సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఎలిగేడు మండలం ధూళికట్ట, ఎలిగేడులో తెల్లరేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ ప్రారంభించి మాట్లాడారు. అధికారులు రాజేందర్, గంగయ్య, బషీరొద్దీన్, భాస్కర్‌రావు, జయలక్ష్మి, పున్నమయ్య, అంజలి, నాయకులు దుగ్యాల సంతోష్‌రావు, సామ రాజేశ్వర్‌రెడ్డి, బాలుసాని పరుశరాములుగౌడ్, అర్షనపల్లి వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం సుల్తానాబాద్(పెద్దపల్లి): పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పట్టణంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.● కలెక్టర్ కోయ శ్రీహర్ష -
ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు
పెద్దపల్లిరూరల్: యాసంగి ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. హమాలీల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన స్థలం గుర్తించాలని, కేటాయించిన రైస్ మిల్లులకే ధాన్యం తరలించాలని ఆయన సూచించారు. కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ చేయాలని అన్నారు. నాణ్యతా ప్రమాణాలపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. గ్రేడ్– ఏ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 మద్దతు ధర చెల్లిస్తామని ఆయన తెలిపారు. ఈసారి 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలనేది తమ లక్ష్యమని కలెక్టర్ వివరించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని 24 గంటల్లో మిల్లులకు తరలించేలా వాహనాలు సిద్ధం చేయాలని తెలిపారు. ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ, అకాల వర్షాల నుంచి పంటను కాపాడేందుకు టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలన్నారు. చివరి ఆయకట్టుకు సాగునీరు కమాన్‌పూర్(మంథని): మంథని నియోజకర్గంలోని పంటలు ఎండిపోకుండా చివరి ఆయకట్టుకు వరకు సాగునీరు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఎస్సారెస్పీ అధికారులను ఆదేశించారు. రంగాపూర్ ఎస్సారెస్పీ డీ–83 కాలువతోపాటు గుండారం రిజర్వాయర్ నుంచి రామగిరి, ముత్తారం, మంథని పరిఽధిలోని పంటలకు సాగునీరు అందించే ఆర్ఎస్బీ కెనాల్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఎస్సారెస్పీ నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సారెస్పీ ఎస్ఈ సత్యరాజ్‌చంద్ర, అధికారులు శ్రీనివాస్, బలరామయ్య, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.డీఆర్‌యూసీసీ ప్రతినిధి నియామకం రామగుండం: స్థానిక రైల్వేస్టేషన్ ఏరియాకు చెందిన అనుమాస శ్రీనివాస్‌ను దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ(డీఆర్‌యూసీసీ) ప్రతినిధిగా నియమించారు. ఈమేరకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరవింద్‌కుమార్ జైన్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాస్ 2026 ఆగస్టు వరకు ఈ పదవిలో ఉంటారని పేర్కొన్నారు. కలెక్టర్ కోయ శ్రీ హర్ష -
● ఇప్పటికే అనేకసార్లు మరమ్మతు ● అయినా, తరచూ పైప్‌లైన్ ధ్వంసం ● రహదారిపై వృథాగా పోతున్న తాగునీరు ● పట్టని బల్దియా అధికార యంత్రాంగం
కోల్‌సిటీ(రామగుండం): అభివృద్ధి పనుల విషయంలో పారదర్శకత లోపిస్తుందడానికి ఈ చిత్రమే సాక్ష్యంగా నిలుస్తోంది. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని దుర్గానగర్ కాలనీ బోర్డు ఎదుట.. ప్రధాన రహదారిపై మంగళవారం వాటర్ పైప్‌లైన్ లీక్ అయ్యింది. తాగునీరు పెద్ద ఎత్తున రోడ్డపైకి వచ్చి చేరింది. తాగునీరంతా వృథాగా పోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి కాదు.. ఈ ప్రాంతంలో పైపులైన్ మంగళవారం ఒక్కరోజే లీక్కాలేదు. ఇదేచోట ఇప్పటికే అనేకసార్లు పైప్‌లైన్ లీకై ంది. ప్రైవేట్ వ్యక్తులతో అనేకసార్లు మరమ్మతు చేశారు. ఇందుకోసం నిధులు ఖర్చు చేస్తున్నా.. లీకేజీ ఆగడం లేదు. నెల క్రితం ఇదేప్రాంతంలో అధికారులు మరమ్మతు చేయించారు. మంగళవా రం మరోసారి లీకేజీ ఏర్పడింది. 250 డయా సామర్థ్యం కలిగిన వాటర్ పైప్‌లైన్‌కు అమర్చిన జాయింట్ వద్దే తరచూ లీకేజీ సమస్యలు ఏర్పడుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపమా? లేక సాంకేతిక పద్ధతిలో మరమ్మతు చేపట్టడం లేదా? లేదా మరమ్మతుల్లో నాసిరకం సామగ్రి వినియోగిస్తున్నారా? అనే సందేహాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహాలో అనేక కాలనీల్లో మరమ్మతులు చేసిన ప్రాంతంలోనే వాటర్ పైప్లైన్లకు లీకేజీలు ఏర్పడుతున్నాయి. లీకేజీలతో రోడ్లు డ్యా మేజీ కావడంతోపాటు సమీప నివాసాలకు కలుషితమైన తాగునీరు సరఫరా అవుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికై నా స్పందించాలని నగరవాసులు కోరుతున్నారు. -
జైబోలో హనుమాన్‌కీ..
పెద్దపల్లిరూరల్: ‘జై శ్రీరాం.. జైబోలో హనుమాన్‌కీ..’ నినాదాలతో జిల్లా కేంద్రం మార్మోగింది. పట్టణమంతా కాషాయమయమైంది. పట్టణంలోని అయ్యప్ప ఆలయం వద్ద మంగళవారం విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో వీరహనుమాన్ విజయయాత్ర ప్రారంభించారు. పురవీధుల గుండా యాత్ర కొనసాగింది. మినీట్యాంక్‌బండ్ వరకు కొనసాగిన యాత్రలో వీహెచ్‌పీ, బజరంగ్దళ్ నాయకులు, కార్యకర్తలతోపాటు బీజేపీ, బీజేవైఎం తదితర అనుబంధ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కమల్ కిశోర్ శారడ, డీఆర్‌యూసీసీ సభ్యుడు ఎన్డీ తివారీ, బీకే జాకోటియా, జంగ చక్రధర్‌రెడ్డి, సతీశ్, భారీసంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న కవి సమ్మేళనం
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ట్రినిటి డిగ్రీ కాలేజీలో మంగళవారం ఉగాది కవి సమ్మేళనం నిర్వహించారు. ఉదయ సాహితీ, జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో సమ్మేళనం నిర్వహించారు. ఉదయ సాహితీ రాష్ట్ర అధ్యక్షుడు దాస్యం లక్ష్మయ్య మాట్లాడారు. మానవ విలువలను ప్రతిబింబింప జేసే సాహితీవేత్తలు జిల్లాలో అనేక మంది ఉన్నారన్నారు. మనిషి నడవడి, సంస్కృతి, సంప్రదాయాల ను వివరించే ఆలోచన, అభ్యుదయ విలువలను పంచే సత్తా సాహిత్యానికే ఉందని అన్నారు. జిల్లా లోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన కవులు, రచయితలు కవితాగానంతో అలరింపజేశారు. జిల్లా రచయితల సంఘం కన్వీనర్ ఏలేశ్వరం వెంకటేశం, కో కన్వీనర్ బుర్ర తిరుపతితోపాటు అనాసి జ్యోతి, బొమ్మిదేని రాజేశ్వరి, కొమురయ్య, కుమారస్వామి, రాజేశం, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘ఆపరేషన్ కగార్’ను ఆపేయండి : ప్రజాసంఘాలు
పెద్దపల్లిరూరల్: ఆపరేషన్ కగార్ పేరిట దండకారణ్యంలోని ఆదివాసీలపై సాగిస్తున్న దమనకాండను వెంటనే ఆపేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక అంబేడ్కర్ విగ్రహం ఎదుట మంగళవారం సంఘీభావ పోరాట వేదిక కన్వీనర్ ముడిమడుగుల మల్లన్న, జిన్నం ప్రసాద్, గుమ్మడి కొమురయ్య తదితరుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రూ.కోట్ల విలువైన సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కేంద్రప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈక్రమంలోనే ఆదివాసీలపై దాడులు చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ ఈనెల 20న కరీంనగర్లో చేపట్టిన ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ సభను విజయవంతం చేయాలని వారు కోరారు. నాయకులు తాళ్లపల్లి లక్ష్మణ్, రామిళ్ల బాపు, శ్రీపతి రాజగోపాల్, శ్రీనివాస్, వెంకన్న, బాపన్న, సదానందం, గాండ్ల మల్లేశం, రాజు, ఎరుకల రాజన్న తదితరులు పాల్గొన్నారు. పనులు నాణ్యతగా ఉండాలి సుల్తానాబాద్(పెద్దపల్లి): విద్యార్థుల యూనిఫామ్స్‌ను నాణ్యంగా కుట్టాలని డీఆర్డీవో కాళిందిని సూచించారు. స్థానిక ఐకేపీ కార్యాలయంలో కొనసాగుతున్న కుట్టు శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మహిళా సంఘాలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో విద్యార్థుల యూనిఫామ్ స్టిచ్చింగ్ పనులు అప్పగిస్తున్నామని, ఇందుకోసం ఆసక్తిగలవారికి శిక్షణ ఇప్పిస్తున్నామని వివరించారు. ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్, ట్రెయినర్ వసుంధర పాల్గొన్నారు. ఇందిరమ్మ మోడల్ ఇల్లు సిద్ధం సుల్తానాబాద్(పెద్దపల్లి): స్థానిక ఎంపీడీవో కార్యాలయం వెనకాల చేపట్టిన మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం ఇటీవల పూర్తయ్యింది. దీంతో మంగళవారం రంగులు వేసి ప్రారంభానికి సిద్ధం చేశారు. లబ్ధిదారులు ఈ ఇంటిని చూసి తమ ఇళ్లను ఇలాగే నిర్మించుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 8వ డాన్‌గా కరాటే మొండయ్య గోదావరిఖనిటౌన్: సికింద్రాబాద్‌లో ఇటీవల జరిగిన ఆల్ ఇండియా కరాటే సీనియర్ గ్రేడింగ్ టెస్ట్‌లో గోదావరిఖనికి చెందిన కరాటే మొండయ్య 7వ డాన్ నుంచి ఎనిమిదో డాన్‌కు ప్ర మోట్ అయ్యారు. దేశవ్యాప్తంగా పేరొందిన 10మంది డాన్లు ఈ టెస్ట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఏడుగురికి ప్రమోట్ అవకాశం దక్కింద ని ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమానికి ము ఖ్య అతిధిగా హాజరైన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ విజేతలను అభినందించారు. అనంతరం 10వ డాన్ శ్రీనివాసన్ బెల్ట్‌లు, సర్టిఫికెట్లు అందజేశారు. సత్ప్రవర్తనతో మెలగాలి పెద్దపల్లిరూరల్: రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని డీసీపీ కరుణాకర్ సూచించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ గజ్జి కృష్ణతో కలిసి మంగళవారం రౌడీషీటర్లతో సమావేశమై పలు సూచనలిచ్చారు. క్రిమినల్ కేసులు, భూదందాల్లో తలదూరిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఇతరుల హక్కులకు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలకు గురికావాల్సి ఉంటుందని ఆయన అన్నారు. సమావేశంలో సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు లక్ష్మణ్‌రావు, మల్లేశం, లక్ష్మణ్, స్వామి పాల్గొన్నారు. -
ఉపరితల గనులే కీలకం
● 10 ఓసీపీల్లో వందశాతం బొగ్గు ఉత్పత్తి ● నిర్దేశిత లక్ష్యం సాధించిన ఐదు భూగర్భ గనులు గోదావరిఖని: సింగరేణి సంస్థ వార్షిక బొగ్గు ఉ త్పత్తి లక్ష్య సాధనలో ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు(ఓసీపీ)లు ఈ సారి కూడా కీలకపాత్ర పోషించాయి. సంస్థలోని పది ఓసీపీలు వందశాతం ఉత్పత్తి నమోదు చేయగా.. మరికొన్ని లక్ష్యానికి చేరువ లో నిలిచాయి. నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో ఓసీపీలు సింహ భాగంలో నిలవడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నాయి. భూగర్భ గనుల్లోనూ వందశాతం.. ఈసారి వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో ఐదు భూగర్భగనులు కూడా వందశాతం బొగ్గు ఉత్పత్తి సాధించి కార్మికులు, సంస్థలో ఆశలు రేకెత్తించాయి. ఓసీపీల ద్వారా 65.90 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి తీయాలని లక్ష్యంగా నిర్ణయించగా, 64.19 మిలియన్ టన్నులు సాధించాయి. భూగర్భగనుల ద్వారా 6.10 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా 4.80 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాయి. వందశాతం ఉత్పత్తి లక్ష్య సాధనలో ఓసీపీలు అగ్రభాగాన నిలవగా, భూగర్భగనులు వెనుకపడ్డాయి. వార్షిక నిర్దేశిత లక్ష్యం 72 మిలియన్ టన్నులు కాగా అందులో 64మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి ఓసీపీల ద్వారానే సాధించడం గమనార్హం. వందశాతం లక్ష్యం సాధించిన ఓసీపీలు సంస్థ వ్యాప్తంగా 11 ఓసీపీలు వార్షిక లక్ష్యం సాధించాయి. ఇందులో జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీ, ఖైరిగూడ ఓసీ, కోయగూడెం ఓసీ–2, జేకే–5ఓసీ, పీకే ఓసీ–4, మణుగూరు ఓసీ, ఓసీపీ–3, జీడీకే–5 ఓసీపీ, ఓసీపీ–1, ఓసీపీ–2 గనులు ఉన్నాయి. భూగర్భగనులు ఇవే.. వందశాతం బొగ్గు ఉత్పత్తి క్ష్యం సాధించిన భూగర్భగనులు ఐదు ఉన్నాయి. వాటిలో జీడీకే–11, ఆర్కే–6, ఆర్కే న్యూటెక్, ఎస్ఆర్పీ–1గని, ఎస్ఆర్పీ–3, 3ఏగనులు ఉన్నాయి. భూగర్భగనులు లక్ష్య సాధనలో అగ్రభాగాన నిలవడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బొగ్గు ఉత్పత్తి (మిలియన్ టన్నులో్ల) గని లక్ష్యం సాధించింది ఓసీపీలు 65.90 64.19 భూగర్భగనులు 6.10 4.81 మొత్తం 72.00 69.00 -
దేశీయ మొక్కలు నాటాలి
మానవాళికి, పక్షులకు ప్రమా దకరంగా మారిన కోనోకార్పస్ మొక్కలను తొలగించి, వాటి స్థానంలో ఆక్సిజన్ విడుదల చేసే దేశీయ మొక్కలను నాటాలి. తద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా, ఆరోగ్యకరమైన జీవవైవిధ్యాన్ని పెంపొందించవచ్చు. గోదావరిఖనిని పొల్యూషన్ బారినుంచి కాపాడుకోవడమే కాకుండా సుందరీకరణకు అవకాశం ఉంటుంది. – పిట్టల రాజ్‌కుమార్, మదర్ హ్యూమన్ యూత్ సొసైటీ అధ్యక్షుడుఉపయోగం లేదు అందం, ఆకర్షణ తప్ప కోనోకార్పస్ మొక్కలతో ఎలాంటి ఉపయోగం లేదు. మానవాళికి విషంగా తయారైన కోనోకార్పస్ మొక్కలను అధికారులు తొలగించాలి. వీటి ఆకులను పశువులు సైతం తినవు. డివైడర్లపై ఎక్కడ చూసినా ఇవే దర్శనమిస్తున్నాయి. నిత్యం ప్రజలు సంచరించే ప్రాంతా ల్లో ఉన్న మెక్కలను తొలగించి దేశీయ మొక్కలను పెంచాలి. – సూర్య శ్యాం, సుల్తానాబాద్ ప్రజారోగ్యంపై ప్రభావం కోనోకార్పస్ మొక్కలు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఆకుల నుంచి వెలువడే పరాగ రేణువులతో ప్రమాదకర అలర్జీ వస్తుంది. ఆస్తమా అధికం అవుతుంది. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులకు గురవుతాం. టీబీ పేషెంట్లకు ఇవి అత్యంత ప్రమాదకరం. ప్రపంచ దేశాలు తొలుత ప్రోత్సహించినా.. అనర్థాలు వెలుగులోకి రావడంతో ఈ మొక్కలను నిషేధించాయి. – డాక్టర్ పిల్లి కిరణ్, సాయిల్ సైంటిస్ట్, కృషి విజ్ఞాన కేంద్రం -
ప్రభుత్వ ఆస్పత్రిలో గైనిక్ సేవలు
మంథని: స్థానిక మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో మంగళవారం సీ్త్ర వైద్య నిపుణురాలు ఆధ్వర్యంలో గైనిక్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గత డి సెంబర్‌లో ఇక్కడి సీ్త్ర వైద్య నిపుణురాలు రెగ్యులర్ జాబ్‌కు వెళ్లడంతో ఎంసీహెచ్‌లో ఆ సేవలు నిలిచిపోయాయి. సీ్త్రవైద్య నిఫుణులు లేక సుమారు మూ డు నెలలుగా మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలో సీ్త్రవైద్య నిపుణురాలుగా సోనిని నియమిస్తూ కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఆస్పత్రిలో గైనిక్ సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి. మహిళా పేషెంట్లకు మెరుగైన సేవలు అందిస్తారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. కొందరి కోసమే వంతెన నిర్మాణం మంథని: బంధువర్గ ప్రయోజనాల కోసమే గోదావ రి నదిపై వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు విమర్శించారు. పట్టణ సమీపంలోని గోదావరి నదీతీరంలో బ్రిడ్జి నిర్మాణ ప్రతిపాదిత ప్రదేశంలో మంగళవారం ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచిర్యాల జిల్లా శివ్వారం నుంచి మంథని మధ్య గల గోదావరి నదిపై నిర్మించే వంతెనతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. కూచిరాజ్‌పల్లి స మీపంలో 50 ఎకరాలు ఉన్నాయని, రియల్ ఎస్టేట్ లో వాటి ధరలు పెంచేందుకే బ్రిడ్జి నిర్మాణం చేపట్టారని ఆయన ఆరోపించారు. నాయకులు ఏగోళపు శంకర్‌గౌడ్, తగరం శంకర్‌లాల్, ఆరెపల్లికు మార్, కనవేన శ్రీనివాస్, రవీందర్, శేఖర్ ఉన్నారు. -
ఆర్థిక సంఘం గ్రాంట్స్‌కు అర్హత
● 72.50 శాతం ఆస్తిపన్ను వసూలుతో ఘనత ● గతేడాది కన్నా మెరుగైన ఆర్థిక పరిస్థితికోల్సిటీ(రామగుండం): రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 15వ ఆర్థిక సంఘం గ్రాంట్స్‌కు అర్హత సాధించింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 72.50శాతం ఆస్తిపన్ను వసూలు చేసి ఈఘనత సొంతం చేసుకుంది. నిర్దేశిత 100 శాతం ఆస్తిపన్ను వసూలు చేయకపోయినా.. గతేడాదితో పోల్చితే ఈసారి పనితీరు మెరుగుపర్చుకుంది. గతేడాది మార్చి 31 నాటికి 55.58 శాతం ఆస్తిపన్ను వసూలు కాగా, ఈఏడాది 72.50 శాతం వరకు నమోదు చేయడం గమనార్హం. నగరపాలక సంస్థ స్పెషలాఫీసర్‌గా వ్యవహరిస్తున్న కలెక్టర్ కోయ శ్రీహర్ష.. కమిషనర్(ఎఫ్ఏసీ)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అదనపు కలెక్టర్ అరుణశ్రీ ప్రత్యేక దృష్టి సారించడంతో ఫలితం దక్కిందని అధికారులు అంటున్నారు. డిమాండ్ రూ.14.76 లక్షలు బల్దియాలో ఆస్తిపన్ను రూ.14.76 లక్షల డిమాండ్ ఉండగా, ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు రూ.10.70లక్షల వరకు వసూలుచేసి 72.50 శాతం నమోదు చేయగలిగింది. గతేడాది 55.58శాతమే ఆస్తిపన్ను వసూలు చేసింది. గత ఐదేళ్ల స్థూల ఉత్పత్తి సగటు 12.09 శాతానికి మించి ఈసారి ఆస్తిపన్ను వసూలు కావడంతో రామగుండం బల్దియా 15వ ఆర్థిక సంఘం గ్రాంట్స్ పొందడానికి అర్హత సాధించినట్లయ్యింది. వసూళ్లలో వార్డు ఆఫీసర్లు.. గ్రూప్–4 నియామకాలు పూర్తికావడంతో కొంద రు ఉద్యోగులు వార్డు అధికారులుగా ఇటీవల విధుల్లో చేరారు. రెవెన్యూ శాఖ నుంచి వచ్చిన మరికొందరు సిబ్బంది అందుబాటులో ఉన్నారు. దీంతో బల్దియా కమిషనర్ అరుణశ్రీ.. రెండు నెలల క్రితం ఓ మంచినిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు నగరంలోని నివాసాలన్నీ 22 రెవెన్యూ బ్లాకుల్లో భాగమై ఉండేవి. ఒక్కో బ్లాక్‌కు ఒక బిల్ కలెక్టరే ఆస్తిపన్ను వసూలు చేసేవారు. కమిషనర్ నిర్ణయంతో ఎలక్షన్ డివిజన్ల ప్రాతిపదికన 50 డివిజన్లుగా విభజించారు. అందుబాటులో ఉన్న సిబ్బందికి తోడు కొత్తగా నియామకమైన వారికి ఆస్తిపన్ను వసూలు విధు లు కేటాయించారు. ఇలా ఒక్కో డివిజన్‌కు ఒకరు చొప్పున 50 డివిజన్లకు మొత్తం 50 మందిని వార్డు ఆఫీసర్లుగా నియమించారు. వారికి సహాయకులుగా కార్యాలయంలో అదనంగా ఉన్న సిబ్బందిని నియమించారు. ఉదయం 8 గంటల నుంచే ఆస్తిపన్ను వసూళ్ల పురోగతిపై కమిషనర్ సమీక్షిస్తుండడంతో సత్ఫాలితాలు వచ్చాయి. -
సైకిల్ చక్రం.. బతుకు చిత్రం
బతుకు చక్రంలో జానెడు పొట్టకోసం ఎవరి తిప్పలు వారివి. పండుగ అందరికీ ఒక్కటే.. కానీ అందరికీ ఒకేలా ఉండదు. పండుగ అంటే కడుపు నిండాలి.. అందరూ కలవాలి. కానీ వీరికి ఒక పండుగ రోజే కడుపు నిండేది. దాని కోసం ఏడాదిపాటు ఎదురు చూస్తారు. ప్రార్థనలకోసం వచ్చేవారి పాదరక్షలకు కాపలాగా ఉంటే తోచినంత సాయం చేస్తారని వాళ్ల ఆశ. ఉదయాన్నే కుటుంబమంతా సైకిల్‌పై వచ్చి ఈద్గా వద్ద ఎవరికి వారుగా చెప్పులకు కాపలాగా ఉండి యాచిస్తారు.ఇలా సైకిల్‌పై ముందు, వెనక చక్రాలు.. ఏమాత్రం వదలకుండా యజమాని చెప్పులకు కాపలాగా సైకిల్‌ను వినియోగించడం ‘సాక్షి’ కెమెరాకు కనిపించింది. పెద్దపల్లిలోని ఈద్గా వద్ద రంజాన్ ప్రార్థనల సమయంలో యాచకుల కడుపు తిప్పలకు అద్దం పట్టేలా సైకిల్ చక్రం బతుకు చక్రాన్ని తలపించింది.– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంజగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల తీరు మారడం లేదు. ఆస్పత్రికి వచ్చిన వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ధర్మపురి మండలం నక్కలపేట గ్రామానికి చెందిన అభి షేక్ కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడు తున్నాడు. దీంతో అతడిని తండ్రి 108 వాహ నంలో ఆస్పత్రికి తీసుకొచ్చాడు. దారిలోనే 108 సిబ్బంది అభిషేక్‌కు సెలైన్ పెట్టారు. ఆస్పత్రి వద్ద వైద్యులు స్పందించి కుర్చీనో.. స్టెచ్చరో ఏర్పాటు చేయాల్సి ఉండగా.. పట్టింపులేనితనంతో వ్యవహరించారు. కాసేపు వేచిచూసిన ఆ తండ్రి కొడుకు చేతికి ఉన్న సెలైన్ పట్టుకుని ఆస్పత్రిలోకి వెళ్లాడు. తండ్రీకొడుకును చూసిన వారు వైద్యుల తీరుపై మండిపడ్డారు. చదవండి: సింగరేణి.. సూపర్ ప్లాన్ -
కళాకారులకు అందని పింఛన్లు
● స్వరాష్ట్రంలోనూ అన్యాయమేనని ఆవేదన ● పట్నాలు, బోనాల సందర్భాల్లోనే కొంత ఉపాధిపెద్దపల్లిరూరల్: ప్రభుత్వ పథకాల అమలు, ప్రజారోగ్యం కోసం పాటించాల్సిన పద్ధతులపై ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా ఆట, పాటలతో ప్రదర్శనలిచ్చే తమను సర్కారు పట్టించుకోవడం లేదని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవిస్తే తమకు మేలు కలుగుతుందని ఆశించి స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో పాలుపంచుకున్నా తమ కుటుంబాలను పోషించుకోవడమే భారంగా మారిందని వాపోతున్నారు. పట్నాలు.. బోనాలప్పుడే పని.. పల్లెల్లో ఏటా బోనాలు, పట్నాలతో దేవతలకు మొక్కులు సమర్పించుకునే సమయంలోనే తమకు కొంతపని లభిస్తోందని ఒగ్గు కళాకారులు పేర్కొంటున్నారు. గతంలో ఎవరైనా చనిపోయినప్పుడు కూడా తమతో కథలు చెప్పించేవారని, ఇపుడు ఆ పరిస్థితులు కూడా చాలావరకు తగ్గిపోయాయని పేర్కొంటున్నారు. పనిలేకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని, అందుకే వ్యవసాయ కూలీ పనులు చేసేందుకు వెళ్లాల్సి వస్తోందని పలువురు కళాకారులు ఆవేదనతో చెబుతున్నారు. పింఛన్ కోసం నిరీక్షణ.. ప్రభుత్వం కనీసం తమకు పింఛన్లు కూడా అందించడం లేదని కళాకారులు వాపోతున్నారు. ప్రభు త్వం అందిస్తున్న ఆసరా పథకం ద్వారా అర్హత ఉన్న కళాకారులకు పింఛన్లు మంజూరు కావడం లేదంటున్నారు. ఇప్పటికై నా పింఛన్లు అందించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. కళాకారులకు ప్రోత్సాహాన్ని అందించి మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందేలా చూడాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు. -
గ్రూప్–1లో యువకుడి సత్తా
మంథని: ఖాన్సాయిపేట గ్రామానికి చెందిన జక్కుల అరుణ్‌కుమార్ గ్రూప్–1లో రాష్ట్ర స్థాయి లో 114, మల్టీజోన్‌లో–1లో 64వ ర్యాంకు సాధించాడు. గ్రూపు –2లోనూ ఆయన రాష్ట్రస్థాయిలో 35, గ్రూపు–3లో 81వ ర్యాంకు సాధించాడు. అరుణ్‌కుమార్ తల్లి అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నా రు. అదేవిధంగా తండ్రి లక్ష్మీనారాయణ కమాన్‌పూర్ ఎంపీపీఎస్‌లో ప్రధానోపాధ్యాయుడు, సోదరి సాయిప్రసన్న బెంగళూర్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అరుణ్‌కుమార్‌ను తల్లిదండ్రులు, సోదరితోపాటు గ్రామస్తులు అభినందించారు. -
రాయితీ విడుదల కాలేదు
పెద్దపల్లిరూరల్: ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ కింద 2018లో దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరికి యూనిట్ మంజూరైనా రాయితీ వి డుదల కాలేదని కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం పలు జిల్లాల కలెక్టర్లతో రాజీవ్ యువ వికాసంపై వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ, గతంలో దరఖాస్తు చేసుకుని స బ్సిడీ మంజూరు కాని దరఖాస్తులను తిరస్కరించి, మరోసారి దరఖాస్తు చేసుకునేలా అ వకాశం కల్పించామన్నారు. దీంతో డిప్యూటీ సీఎం కలెక్టర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకటేశ్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ అధికారి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. 4న భక్తాంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవం రామగుండం: పట్టణంలోని శ్రీభక్తాంజనేయస్వామి ఆలయ వార్షికోసత్సవం ఈనెల 4వ తేదీన నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆ లయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 6 నుంచి 14వ తేదీ వరకు ప్రతీరోజు ఉదయం, సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తామని పూజారి కమ్మల చంద్రశేఖరశర్మ తెలిపారు. సేవలతోనే గుర్తింపు పెద్దపల్లిరూరల్: అంకితభావంతో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను ప్రజలు ఎప్పటికీ మ ర్చిపోరని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్నకుమారి అన్నారు. రాఘవాపూ ర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెచ్‌ఈవో సాంబయ్య సోమవారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా వైద్యురాలు మమ త అధ్యక్షతన ఏర్పాటైన కార్యక్రమంలో సాంబయ్యను సత్కరించారు. ప్రతీ ఉద్యోగి విధులను సక్రమంగా నిర్వర్తించాలని, సేవలతో నే గుర్తింపు లభిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకుని ముందుకు సాగాలని డీఎంహెవో సూచించారు. జిల్లా మలేరియా అధికారి శ్రీరాములు, డాక్టర్ శ్రీవాణి, కిరణ్‌కుమార్, రాజమొగిలి తదితరులు పాల్గొన్నారు. నేడు కవి సమ్మేళనం పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలో మంగళవా రం ఉగాది కవిసమ్మేళనం నిర్వహిస్తామని ఉ దయ సాహితీ గౌరవ అధ్యక్షుడు దాస్యం సే నాధిపతి, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మయ్య, జిల్లా క న్వీనర్ ఏలేశ్వరం వెంకటేశ్వర్లు, కో కన్వీనర్ బుర్ర తిరుపతి తెలిపారు. జిల్లా రచయితల సంఘం, ఉదయ సాహితీ సంయుక్తంగా ని ర్వహించే ఈ కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు మొదలవుతుందని, కవులు, రచయితలు హాజరు కావాలని వారు కోరారు. -
అగ్రిమెంట్లో ఆలస్యం
● పీపీఏ కోసం పలు రాష్ట్రాల ఆసక్తి ● ముందుకు రాని రాష్ట్రప్రభుత్వం ● నిర్లక్ష్యం చేస్తే 85 శాతం యాక్సెస్ లాస్ అయ్యే అవకాశం ● తెలంగాణ పవర్ ప్రాజెక్ట్ స్టేజ్–2లో కొనసాగుతున్న అనిశ్చితి జ్యోతినగర్(రామగుండం): రామగుండం ఎన్టీపీ సీలో చేపట్టిన తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు స్టేజ్–2పై అనిశ్చితి నెలకొంది. రాష్ట్ర వి భజన చట్టం ప్రకారం తెలంగాణలో 4వేల మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టును కేంద్రప్రభుత్వం నిర్మించేందుకు నిర్ణయించింది. ఒక్కోటి 800 మె గావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో చేపట్టిన రెండు యూనిట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇందులో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌లో రాష్ట్రప్రభు త్వం 80శాతం వినియోగిస్తోంది. స్టేజ్–2 కింద చేపట్టే మిగిలిన 2,400 మెగావాట్ల మూడు యూ నిట్ల ప్రాజెక్టులో తయారయ్యే విద్యుత్ ఉత్పత్తిలో కొనుగోలు ఒప్పందం (పీపీఏ)పై రాష్ట్రప్రభుత్వం ఇంకా సంతకం చేయడం లేదు. దీంతో ఈ ప్రాజెక్టును దక్కించుకునేందుకు పొరుగు రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయి. ఆ రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తి కొనుగోలు చేసుకుంటే.. మన రాష్ట్రం అందులోని 85శాతం విద్యుత్‌ను కోల్పోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముందుకొస్తున్న రాష్ట్రాలు.. దేశంలోని కొన్ని రాష్ట్రాలు పవర్ ప్రాజెక్టును దక్కించుకునేందుకు ముందుకొస్తున్నాయి. వాటి తో పీపీఏ ఒప్పందం చేసుకునేందుకు కరెంట్ కా ర్పొరేషన్ సిద్ధమవుతోంది. ఇలా అయితే.. తెలంగాణ స్టేజ్–2లో ఉత్పత్తి చేసే విద్యుత్‌లో 85 శా తం యాక్సెస్‌ను మనరాష్ట్రం కోల్పోయే ప్రమా దం ఉంది. ఇదే విషయంపై ఎన్టీపీసీ గతేడాది రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాసింది. తెలంగాణ ప్రా జెక్టు స్టేజ్–2 కోసం పవర్ పర్చేజ్(పీపీఏ)పై సంతకం చేయాలని విన్నవించింది. సంతకం చేయడంలో ఆలస్యమైతే తెలంగాణ ప్రాజెక్టు నుంచి విద్యుత్ కోల్పోయే ప్రమాదం ఉందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి గతేడాది రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు కూడా. అయినా పరిస్థితిలో మార్పు రావడంలేదు. -
మాది దయనీయ స్థితి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది కళాకారులకు పింఛన్లు అందేవి. స్వరాష్ట్రంలో మా పరిస్థితి దయనీయంగా మారింది. తెలంగాణ సాంస్కృతిక శాఖ ద్వారా ఎప్పుడోఓసారి డోలుదెబ్బ కళాకారులకు ప్రదర్శలిచ్చే అవకాశం లభిస్తోంది. అయినా, బతుకు కష్టంగానే ఉంది. అర్హులైన కళాకారులకు పింఛన్లు మంజూరుచేసి ఆదుకోవాలి.– కుంట సదయ్య, కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రోత్సహించాలి సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడంలో, సంక్షేమ పథకాల అమలు తీరును ప్రజలకు సులువుగా వివరించేలా మాలోని కళలను సద్వినియోగం చేసుకునే అవకాశం కల్పించాలి. మా కుటుంబ పోషణకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. లేదా పింఛన్లు మంజూరు చేసి ఆదుకోవాలి. – జంగిలి పోచాలు, ఒగ్గు కళాకారుడు, రాఘవాపూర్ -
ఎండాకాలం.. జరపదిలం
● అప్రమత్తమైన జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ● గ్రామీణులకు విస్తృతంగా అవగాహన ● ఎంఎల్‌హెచ్‌పీలకు ఇప్పటికే శిక్షణ ● వడదెబ్బ నియంత్రణకూ పకడ్బందీ చర్యలుపెద్దపల్లిరూరల్: జిల్లాలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతున్నాయి. వివిధ పనులు, అవసరాల కోసం ఇళ్లనుంచి బయటకు వెళ్లే జిల్లావాసులు అత్యంత జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈమేరకు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలోని ఎంఎల్‌హెచ్‌పీలు ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌వో అన్నప్రసన్న కుమారి ఆదేశాలు జారీచేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎండలో వెళ్తే.. వేసవిలో అనారోగ్య సమస్యలు, వడదెబ్బ నివారణ గురించి ఇటీవల జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా సమీక్షించారు. ఎండలో పనిచేయాల్సి వస్తే కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచించారు. ప్రధానంగా గ్రామీణులకు ఈ విషయంలో అవగాహన కల్పించాలని నిర్ణయించారు. అధిక ఎండలో బయటకు వెళ్తే శరీరం వేడెక్కి జ్వరం వస్తుంది. మగతగా ఉంటుంది. ఇలాంటి సమస్యలు తలెత్తితే.. హీట్ పైరాక్సియా అంటారు. శరీర ఉష్ణోగ్రత 102 ఫారాన్ డిగ్రీల వరకు ఉంటుంది. ఎండలో సాధారణ పనులకు వెళ్లే వారికి ఇలా వేడి ఉంటుంది. లవణాలు పోతాయి.. కండరాలు పట్టేస్తాయి చెమట ద్వారా శరీరంలోని నీరు, లవణాలు బయటకు వెళ్తాయి. ఇలాంటి సమయంలో అలసటకు గురైతే హీట్ ఎక్సాస్టెన్ అంటారు. అధిక ఎండ ఉండగా.. పొలం పనులు చేసినా, వేడిగా ఉండే ఇంట్లో పనిచేసినా దీనిబారినపడతారు. ● బొగ్గు, ఇతర గనులు, వేడి తీవ్రతలో పనిచేస్తే కండరాలు పట్టేస్తాయి. దీనిని హీట్క్రాంప్ అంటారు. ● ఎండ తీవ్రత, వడగాలితో శరీర ఉష్ణోగ్రత 110 ఫారన్ డిగ్రీల వరకు పెరిగితే హీట్‌స్ట్రోక్(వడదెబ్బ)కు గురవుతారు. తీవ్రమైన తలనొప్పి, నాలుక తడి ఆరడం, అధిక దాహం వేయడం, కళ్లు గుంజడం, తలతిరగడం లాంటి లక్షణాలు ఏర్పడతాయి. వాంతులు, విరోచనాలకు గురవుతారు. ఈ పరిస్థితులు గుర్తించి వెంటనే చికిత్స అందిస్తే బాధితులకు ప్రాణాపాయం తప్పుతుందని వైద్యులు వివరిస్తున్నారు. ఇలా చేయండి : వైద్యులు ● వడదెబ్బకు గురైన వ్యక్తికి అవసరమైనంత నీరు తాగించాలి. అప్పుడు కూడా లేవలేని పరిస్థితిలో ఉంటే ఓఆర్ఎస్ ద్రావణం తాగించాలి. ఆ తర్వాత బాధితులను వెంటనే సమీప ఆస్పత్రికి తీసుకెళ్లాలి. ● చల్లని నీటిలో ముంచిన గుడ్డను తలపై వేయాలి. శరీరాన్ని తరచూ తుడవాలి. మజ్జిగా, గంజి, నిమ్మరసం లాంటి ద్రవ పదార్థాలు తాగించాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ● ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకూడదు. ప్రయాణాలు మానుకోవాలి. తప్పనిసరి అయితే ఉదయం, రాత్రి వేళల్లో మాత్రమే ప్రయాణం, పనులు చేయాలి. ● బయటకు వెళ్లినప్పుడుడు కచ్చితంగా తాగునీరు వెంట తీసుకెళ్లాలి. ● పిల్లలు, పెద్దలు ఎవరైనా బయటకు వెళ్తే కాటన్‌గుడ్డ తలకు చుట్టుకోవాలి. లేదా గొడుగు, టోపీ ధరించాలి. ● కాళ్లకు చెప్పులు వేసి కోవాలి. వదులుగా వుండే నూలు దుస్తులను వేసుకోవాలి. ● అధికంగా ఎండ ఉంటే ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేయరాదు. ● మసాలా, ఆయిల్, వేపుడు ఆహార పదార్థాలు తినకూడదు. కీరదోస, తర్బూజ, పుచ్ఛపండు లాంటివి తీసుకోవడం ఉత్తమం. పిల్లలు, వృద్ధులకు వడదెబ్బ వడదెబ్బ ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల్లో అధికంగా వచ్చేఅవకాశం ఉంది. వారిని ఎండలోకి వెళ్లనివ్వవద్దు. పిల్లలు ఇంట్లోనే ఆడుకునే ఏర్పాట్లు చేయాలి. ఇలా చేయడం ద్వారా వడదెబ్బ నుంచి బయటపడొచ్చు. – అన్న ప్రసన్నకుమారి, డీఎంహెచ్‌వో -
భూగర్భ డ్రైనేజీకి డీపీఆర్
● రోడ్ల నిర్మాణానికీ ప్రతిపాదనలు తయారు చేయండి ● రామగుండం సుందరీకరణకు అందరూ సహకరించండి ● ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ సూచన కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగర సుందరీకరణకు సహకరించాలని ఎమ్మెల్యే మ క్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, మున్సిపల్ అధికారులను కోరారు. నగరంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిపై కార్పొరేషన్ కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీ తో కలిసి సోమవారం బల్దియా కార్యాలయంలో సమీక్షించారు. వేసవి దృష్ట్యా నీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్ల నిర్మాణానికి డీపీఆర్ తయారు చే యాలని సూచించారు. రూ.200 కోట్ల అంచనా తో 27 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు త్వ రలో ప్రారంభం కానున్నాయని తెలిపారు. రాజీ వ్ రహదారికి ఇరువైపులా ల్యాడ్ స్కేపింగ్ చేయాలని, తద్వారా సర్వీస్ రోడ్లు నిర్మిస్తారని తెలిపా రు. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. 2ఏ మోరీ, ఫైవింక్లయిన్ మోరీలను కలుపుతూ రోడ్డు నిర్మించి వర్షాకాలంలో వరద నిల్వకాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. అవసరమైనచోట్ల వీధిదీపాలు ఏర్పాటు చేయాలని, శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించే శ్రీరామ నవమి వేడుకలకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, సింగరేణి ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్, ఆర్ఎఫ్సీఎల్ డీజీఎం రమేశ్ ఠాకూర్, సీనియర్ మేనేజర్ వెంకటరెడ్డి, సింగరేణి ఎస్ఈ (సివిల్) వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హనుమమాన్ విగ్రహ నిర్మాణం పరిశీలన రామగుండం: శ్రీరామునిగుండాల కొండపై చేపట్టిన 108 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహ నిర్మాణాన్ని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్ ఆదివారం రాత్రి పరిశీలించారు. -
భక్తిశ్రద్ధలతో రంజాన్
మంగళవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025మంథని: రంజాన్ వేడుకలను ముస్లింలు జిల్లావ్యాప్తంగా సోమవారం ఘనంగా జరుపుకున్నారు. తొలుత ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మంథనిలో మంత్రి శ్రీధర్‌బాబు, పెద్దపల్లిలో ఎమ్మెల్యే విజయరమణారావు, పలువురు అధికారులు, రాజకీయ నాయకులు తదితరులు ముస్లింలను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు.. కొన్నిచోట్ల వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ముస్లింలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. న్యూస్‌రీల్ -
స్పందన అంతంతే
● ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించలే ● అవగాహన లోపం.. సాంకేతిక సమస్యలే కారణం ● రాయితీ ప్రకటించి, ప్రచారం చేసినా నేరవేరని సర్కారు లక్ష్యం ● 4,765 మంది ఫీజు చెల్లింపు.. రూ.15.41కోట్ల ఆదాయం ● గడువు పొడిగింపుపైనే ఆశలుసాక్షి, పెద్దపల్లి: లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) గడువు ముగిసింది. జిల్లావాసుల నుంచి స్పందన కరువైంది. ఆదినుంచీ గందరగోళంగా సాగిన ప్రక్రియతో ప్రభుత్వం ఆశించిన మేర ఆదాయం సమకూరలేదు. రామగుండం కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలతోపాటు 266 గ్రామా ల్లో కలిపి 25,543 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 4,765 మందే ఫీజు చెల్లించారు. ఎల్ఆర్ఎస్ ఫీజు రాయితీపై అధికార యంత్రాంగం విస్తృతంగా ప్రచారం చేసినా సాంకేతిక సమస్యలకు తోడు, దరఖాస్తుదారుల్లో అవగాహన లోపంతో ప్రజల నుంచి స్పందన అంతంతమాత్రంగానే వచ్చింది. 25 శాతం రాయితీ ప్రకటించినా.. లే అవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం 2020 ఆగ స్టు 26వ తేదీ వరకు రూ.వెయ్యి ఫీజు చెల్లించిన భూ యజమానుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. వీటికోసం యూజర్ మాన్యువల్ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఎల్ఆర్ఎస్–2020 పేరిట ప్రభుత్వం వెబ్సైట్ రూపొందించింది. అర్జీల పరిష్కారం కోసం మూ డంచెల(లెవల్–1, లెవల్–2, లెవల్–3) విధానాన్ని అమలు చేసింది. దరఖాస్తుదారులు బల్దియాలకు బారులు తీరినా.. సర్వర్ మొరాయించడంతో క్రమబద్ధీకరణ ప్రక్రియ లెవల్–1 వద్దే దరఖాస్తులు ఆగిపోయాయి. కొందరు దరఖాస్తుదారులు ఫీజు చెల్లించేందుకు యత్నించినా వెబ్సైట్లో వివరాలు కనిపించలేదు. ఇంకొందరికి క్షేత్రస్థాయి పరిశీలన పెండింగ్‌లో ఉన్నట్లు చూపించింది. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు చూపిస్తే నీటిపారుదల శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. వీటన్నింటికీ ఎల్ఆర్ఎస్ వెబ్సైట్లో సాంకేతిక సమస్యలే కారణమని అధికారులు చెబుతున్నారు. కొరవడిన సమన్వయం ఎల్ఆర్ఎస్ ప్రక్రియకు మున్సిపల్, రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయం కొరవడింది. నిషేధిత జాబితాలో ఉన్నట్లు కనిపిస్తున్న సర్వే నంబర్లకు సంబంధించి దరఖాస్తుదారులు హెల్ప్‌డెస్క్‌లో సంప్రదిస్తే.. సదరు సర్వే నంబర్ నిషేధిత జాబితాలో లేదని రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి లేఖ తీసుకురావాలని అధికారులు సూచించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సంప్రదిస్తే.. మున్సిపాలిటీ నుంచి సర్వే నంబర్ ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో లేనట్లుగా ధ్రువీకరణపత్రం తీసుకురావాలని చెప్పారు. ఇలా అర్జీదారులు ఇబ్బందులుపడ్డారు. ఈరెండు శాఖల మధ్య సమన్వయ లోపంతోపాటు ఇరిగేషన్ శాఖలో అసలు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ వివరాలు లేకపోవడం శాపంగా మారింది. ఫీజు చెల్లించినవారు 4,765 మందే జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వానికి 25,543 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు అందాయి. ఇందులో 4,765 మంది దరఖాస్తుదారులే క్రమబద్ధీకరణకు ఫీజు చెల్లించా రు. తద్వారా 18.65శాతమే నమోదైంది. సోమవా రం రాయితీ గడువు ముగిసింది. దాదాపు మరో 13,959 మంది ఫీజు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఫీజు రాయితీ గడువు పెంచాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.దరఖాస్తుల వివరాలు ప్రాంతం దరఖాస్తులు అనుమతించినవి ఫీజు చెల్లించినవి ఆదాయం (రూ.కోట్లలో) రామగుండం 7,083 4,187 916 5.3 మంథని 895 732 208 0.6 పెద్దపల్లి 10,278 7,750 2,414 8.71 సుల్తానాబాద్ 1,537 1,156 187 0.79 గ్రామీణం 5,750 4,899 1,040 0.01 -
రోజూ.. తాగునీరు
● నీటి సరఫరాకు ట్రయల్ రన్ ● దశలవారీగా విస్తరణకు చర్యలు ● బల్దియాలో 13 వాటర్ ట్యాంకులు ● నాలుగింటి పరిధిలో డెయిలీ వాటర్ ● ‘ఎల్లంపల్లి’ ద్వారా ప్రతీరోజు 45 ఎంఎల్డీ నీరు సరఫరా ● పర్యవేక్షిస్తున్న రామగుండం బల్దియా కమిషనర్ అరుణశ్రీ రామగుండం నగర సమాచారం డివిజన్లు 50 విస్తీర్ణం(చ.కి.మీ.) 93.47 జనాభా 2,29,644 నివాసాలు 50,956 నల్లా కనెక్షన్లు 40,728 కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగర వాసులకు నల్లాల ద్వారా ప్రతీరోజూ రక్షిత మంచినీరు సరఫరా చేసేందుకు అధికారులు ట్రయల్ రన్ చేపట్టారు. నాలుగు వాటర్ ట్యాంకుల పరిధిలో ప్రతీరోజు తాగునీటిని అందిస్తారు. ఇప్పటివరకు రోజు విడిచి రోజు రక్షిత నీటిని సరఫరా చేసేవారు. ప్రస్తుతం చేపట్టిన ట్రయల్ రన్ విజయవంతమైతే.. భవిష్యత్‌లో మరిన్ని వాటర్ ట్యాంకుల పరిధిలో కూడా రోజూ తాగునీటి సరఫరా అమలు చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. నగరంలో 13 వాటర్ ట్యాంకులు.. నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 13 వాటర్ ట్యాంకులు ఉన్నాయి. రామగుండం, భీమునిపట్నం, ఎన్టీపీసీ హెలిప్యాడ్, శారదనగర్, అశోక్‌నగర్, సంజయ్‌గాంధీనగర్, ఓల్డ్ మున్సిపల్ బ్యాంక్, సీఎస్పీ ట్యాంక్, వెటర్నరీ ఆస్పత్రి ట్యాంక్, విఠల్‌నగర్, ఎలుకలపల్లి, న్యూమారేడుపాక, అల్లూరు పరిధిలోని వాటర్ ట్యాంకుల ద్వారా నగరవాసులకు తాగునీరు అందిస్తున్నారు. నాలుగు ట్యాంకుల పరిధిలో ట్రయల్ రన్.. ప్రతీరోజు రక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు నగరంలోని నాలుగు వాటర్ ట్యాంకులను అధికారులు ఎంపిక చేశారు. భీమునిపట్నం, ఎన్టీపీసీ హెలిప్యాడ్, ఎల్కలపల్లి, న్యూ మారేడుపాక ట్యాంక్‌లను ఎంపికచేసిన అధికారులు.. వాటి ద్వారా వారం రోజులుగా ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఎల్లంపల్లి నుంచి 45 ఎంఎల్డీ సరఫరా.. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నగరానికి వారం క్రితం వరకు 40 మిలియన్ లీటర్స్ పర్ డే(ఎంఎల్డీ) తాగునీరు సరఫరా చేసేవారు. అయితే, ట్రయల్ రన్ కోసం ప్రతీరోజు నాలుగు వాటర్ ట్యాంకుల పరిధిలో మంచి నీటిని సరఫరా చేస్తుండడంతో ఇందుకు అవసరమైన 5 ఎంఎల్డీ నీటిని అదనంగా ప్రాజెక్ట్ నుంచి తీసుకుంటున్నారు. మొత్తం కలిపి రోజూ 45 ఏంఎల్‌డీ నీరు అవసరమతోంది. పర్యవేక్షిస్తున్న కమిషనర్.. ప్రతీరోజు తాగునీటిని సరఫరా చేస్తున్న ట్రయల్ రన్‌పై బల్దియా కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ట్రయల్ రన్ నిర్వహిస్తున్న ప్రాంతాలను కమిషనర్ నేరుగా సందర్శిస్తున్నారు. ఆయా కాలనీల్లో పర్యటిస్తూ స్థానికుల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తున్నారు.సరిపడా అందిస్తాం నగరంలో తాగునీటి సరఫరా మెరుగుపర్చడానికి చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం నాలుగు వాటర్ ట్యాంకుల పరిధిలో ప్రతీరోజు 45 నిమిషాలపాటు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నాం. ప్రెషర్ తక్కువగా ఉండటం తదితర ఇబ్బందులు ఎదురవుతున్న ప్రాంతా ల్లో మరో మూడు వాటర్ ట్యాంకులు నిర్మించడానికి అంచనాలు తయారు చేస్తున్నాం. ప్రతీరోజు సరఫరా చేస్తున్న ప్రాంతాల్లో మీటర్లు ఏర్పాటు చేస్తాం. సమస్యలు తలెత్తకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. – అరుణశ్రీ, కమిషనర్(ఎఫ్ఏసీ), రామగుండం -
అందరూ సుభిక్షంగా ఉండాలి
పెద్దపల్లిరూరల్: విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లావాసులు అందరూ సుభిక్షంగా ఉండాలని ఎ మ్మెల్యే విజయరమణారావు ఆకాంక్షించారు. స్థానిక ప్రగతినగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఉగాది పర్వదినం సందర్భంగా అర్చకు డు కొండపాక శ్రీనివాసాచార్యులు పంచాంగ శ్రవ ణం చేశారు. ప్రగతినగర్‌లో రెసిడెంట్ టీచర్స్ ఏ ర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభిం చారు. ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. అమర్‌నగర్ ప్రాంతంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మైనార్టీలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌కు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. -
ముగిసిన జాతీయ మహాసభలు
గోదావరిఖని: సీఐటీయూ అనుబంధ ఆలిండి యా వర్కర్స్ ఫెడరేషన్(ఏఐసీడబ్ల్యూఎఫ్) జాతీయ మహాసభలు ఆదివారం ముగిశాయి. కోల్‌కత్తాలోని రాంచీలో ఈనెల 28న సమావే శాలు ప్రారంభమయ్యాయి. సింగరేణి నుంచి సీఐటీయూ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి మంద నర్సింహారావు తదితరులు హాజరయ్యారు. చట్టబద్ధత లేనిలేబర్కోడ్స్ అమలు చేయడాన్ని నిరసిస్తూ వచ్చేనెల 20న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్లు నాయకులు వెల్లడించారు. ఈ సందర్భంగా జాతీయ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శ్రీవాత్సవ, ప్రధాన కార్యదర్శిగా డీడీ రామానందం, సింగరేణి నుంచి ఉపాధ్యక్షుడిగా తుమ్మల రాజారెడ్డి, కార్యదర్శులుగా మంద నరసింహారావు, అల్లి రాజేందర్, వర్కింగ్ కమిటీ సభ్యులుగా మెండె శ్రీనివాస్, మేదరి సారయ్య, విజయగిరి శ్రీనివాస్, కంపేటి రాజయ్య, కుంట ప్రవీణ్, వెంగళ శ్రీనివాస్, వేణుగోపాల్‌రెడ్డి ఎన్నికయ్యారు. లెదర్ ఇండస్ట్రీ భూముల సర్వేకు ఆదేశాలు రామగుండం: అంతర్గాం మండలం లింగాపూర్ గ్రా మ శివారులోని సర్వే నంబ రు 132లో లెదర్ ఇండస్ట్రీకి 2023 నవంబర్ 27న కేటా యించిన 25 ఎకరాల్లో సర్వేచేసి హద్దులు నిర్ణయించాల ని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శనివా రం రాత్రి కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చై ర్మన్ బక్కి వెంకటయ్య ఆధ్వర్యంలో ప్రతిని ధులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీ సుకున్నట్లు పలువురు ప్రతినిధులు తెలిపారు. తాగునీటికి తప్పిన తిప్పలు మంథని: మున్సిపల్ పరిధిలో పూర్తిస్థాయిలో మిషన్ భగీరథ పైపులైన్ నిర్మించలేదు. దీంతో ఎత్తులోని ప్రాంతాలు, దిగువన ఉన్నచోట నీరు సన్నటిధారగా వస్తోంది. సరిపడా నీరు లభించక పట్టణవాసులు ఇబ్బందులు పడుతున్నారు. గంగాపురి ప్రాంతంలో గతంలో మంచినీరు, ఇతర అవసరాలకు సరిపడా నీరు సరఫరా అయ్యేది. నీటి వృథాను అరికట్టేందుకు మిషన్ భగీరథ అధికారులు క్లోజింగ్ చేయడంతో కేవలం తాగునీటి అవసరాలకే పైపులైన్ ద్వారా నీరు అందిస్తున్నారు. ఈ క్రమంలో నీటి సమస్య తీవ్రమైంది. ప్రత్యామ్నాయంగా మున్సిపల్ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నా సరిపోవడం లేదు. తాగునీటి సమస్యపై మిషన్ భగీరఽథ అధికారులు ఇటీవల పర్యవేక్షణ చేసి తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం కొన్ని ప్రాంతాలు, సాయంత్రం మిగిలిన ఏరియాల్లో నీటిసరఫరా చేయడంతో పట్టణవాసులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. 96 శాతం ఆస్తిపన్ను వసూలు పెద్దపల్లిరూరల్: జిల్లాలో ఆస్తిపన్ను వసూలుపై ప్ర త్యేక శ్రద్ధ తీసుకుని 96.06 శాతం(మార్చి 29వ తేదీ నాటికి) వసూలు చేశామని జిల్లా పంచాయతీ అధికా రి(డీపీవో) వీరబుచ్చయ్య తెలిపారు. మొత్తం 266 పంచాయతీల నుంచి రూ.7,21,08,240 ఆస్తిపన్ను వసూలు కావా ల్సి ఉండగా 6,92,68,002(96.06శాతం) వ సూలైనట్లు వివరించారు. ముత్తారం(మంథని), కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో నూరు శా తం, అత్యల్పంగా కమాన్‌పూర్ మండలంలో 84.58 శాతం వసూలైనట్లు తెలిపారు. ముత్తా రం మండలంలో రూ.32,55,502 (100.18శాతం), కాల్వశ్రీరాంపూర్‌లో రూ.59,49,326, అంతర్గాంలో రూ.46,53,698, పెద్దపల్లిలో 1,09,12,225, ఎలిగేడులో రూ.21,07,097, పాలకుర్తిలో రూ.57,65,145, రామగిరిలో రూ.54,88,211 , మంథని మండలంలో రూ. 36,36,400, సుల్తానాబాద్ మండలంలో రూ. 84,71,660, ధర్మారంలో రూ. 67,94,884, ఓదెల మండలంలో రూ. 65,18,662, జూలపల్లి మండలంలో రూ.22, 47,490, కమా న్పూర్ మండలంలో రూ.34,67,702 ఆస్తిపన్ను వసూలైందని డీపీవో వివరించారు. -
వాతావరణం ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఉదయం, రాత్రివేళ చల్లని గాలులు వీచే అవకాశం ఉంది. పగలంతా ఎండగా, ఉక్కపోతగా, అసౌకర్యంగా ఉంటుంది.
ఊరూరా ఉగాది సోమవారం శ్రీ 31 శ్రీ మార్చి శ్రీ 2025పెద్దపల్లిరూరల్/కమాన్‌పూర్/ఓదెల: శ్రీవిశ్వావసు నామ తెలుగు నూతన సంవత్సర వేడుకలను జిల్లావ్యాప్తంగా ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఉదయమే స్నానాలు ఆచరించిన జిల్లావాసులు.. మామిడి ఆకులతో ఇళ్లకు తోరణాలు కట్టారు. భక్ష్యాలు, షడ్రుచులతో కూడిన పచ్చళ్లు తయారు చేసి భుజించారు. సాయంత్రం వేళ ఆలయాలకు వెళ్లి పంచాంగ శ్రవణం గావించారు. కొత్త సంవత్సరంలో భవిష్యవాణి గురించి వేదపండితులు వివరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ప్రత్యేక పూజలు చేశారు. ఓదెల శ్రీమల్లికార్జునస్వామి, కమాన్పూర్లోని ఆదివరాహస్వామి, జనగామలోని శ్రీశివాలయం భక్తులతో రద్దీగా మారాయి. బండ్లు తిరుగుట, వాహన పూజా కార్యక్రమాలు జరిగాయి. న్యూస్‌రీల్ -
● ఆన్లైన్ వ్యాపారం పేరిట బురిడీ ● ఆశచూపించి రూ.లక్షల్లో కొల్లగొడుతున్న కేటుగాళ్లు ● ఖాతాలో రూ.లక్షలు కనిపిస్తాయి.. చేతికి పైసా రాదు ● ఇటీవలే ఓ ఉపాధ్యాయుడి నుంచి రూ.57లక్షలు స్వాహా ● రెచ్చిపోతున్న సైబర్ మోసగాళ్లు..
గోదావరిఖని: సైబర్ నేరగాళ్లు ప్రజలను బురిడీ కొట్టించి రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. ఇందుకోసం వారు రోజుకో మార్గం ఎంచుకుంటున్నారు. నిన్నామొటి వరకు డిజిటల్ అరెస్ట్.. గోల్డ్ ట్రేడింగ్ పేరిట మోసాలకు పాల్పడిన దగాకోరులు.. ప్రస్తుతం ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట ప్రజలకు వల విసురుతున్నారు. తొలు రూ.లక్షకు రూ.2 లక్షలు, రూ.2లక్షలకు రూ.4 లక్షల లాభాలు వస్తున్నాయంటూ ఆన్లైన్లో మెసేజ్ చూపిస్తున్నారు. ఆ తర్వాత సైట్ మూసేస్తున్నారు. ఇటీవల ఇలాంటి మోసమే రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడు సైబర్‌మోసగాళ్ల బారినపడి దశల వారీగా రూ.57లక్షలు ఆన్లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెట్టి మోసపోవడం కోల్‌బెల్ట్‌లో చర్చనీయాంశంగా మారింది. మోసాలు.. అనేక రకాలు.. డిజిటల్ అరెస్ట్, జంప్డ్ డిపాజిట్ మనీ, మల్టీలెవల్ మార్కెటింగ్ తదితర వాటి పేరిట సైబర్ మోసగాళ్లు ఇప్పటిదాకా బ్యాంకు ఖాతాలు కొల్లగొట్టారు. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ అరచేతిలో ప్రపంచం చూపిస్తోంది. బ్యాంక్లావాదేవీలన్నీ యూపీఐ, ఫోన్‌పే, గూగుపే.. లాంటివన్నీ బ్యాంక్ లింక్‌ల ద్వారానే సాగుతున్నాయి. ఈక్రమంలో సైబర్‌నేరగాళ్లు ఇప్పుడు ఆన్లైన్ ట్రేడింగ్‌కు ఎంచుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచే.. సైబర్‌నేరగాళ్లు ఎక్కువగా బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు ఉంటున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాంబోడియా కేంద్రంగా సైబర్ నేరగాళ్లు ప్రజలకు వల విసురుతున్నారు. పెద్ద కార్యాలయాలు ప్రారంభించి తమకు సమీప, తెలిసిన వారితో బ్యాంకు ఖాతా లు ప్రారంభిస్తున్నారు. తాము కొట్టేసిన సొమ్ము ను తొలుత ఈ బ్యాంకు ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు. ఖాతాదారులకు సంబంధం లేకుండా ప్రతినెలా రూ.5 వేల నుంచి రూ.10వేల వరకు బ్యాంకు కస్టమర్లకు పంపించడంతో వారు కూడా కిమ్మనకుండా ఉండిపోతున్నారు. అత్యాశకు వెళ్లొద్దు ఆన్లైన్ మార్కెటింగ్‌లో పెట్టుబడి పెడితే పెద్దమొత్తంలో లాభాలు వస్తాయని కొందరు ఆశపడుతున్నారు. ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసగాళ్లు తొలుత రూ.లక్ష వరకు పెట్టుబడి పెడితే రూ.2 లక్షల లాభాలను ఆన్లైన్లో చూపిస్తున్నారు. దీంతో తమకు లాభాలు వస్తున్నాయని ఆశపడుతూ ప్రజలు మళ్లీ పెట్టుబడి పెడుతున్నారు. ఆ తర్వాత మోసపోతున్నారు. ఇటీవల ఓ ప్రైవేట్ ఉద్యోగి ఇలానే ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట రూ.57లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయాడు. జిల్లావాసులు ఇలాంటి వ్యాపారాలపైనా అప్రమత్తంగా ఉండాలి. – వెంకటరమణ, ఏసీపీ, సైబర్‌క్రైం, రామగుండం -
పేద కుటుంబాలందరికీ సన్నబియ్యం
● రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ ● 43వ డివిజన్లో సన్నబియ్యం పంపిణీ ప్రారంభం గోదావరిఖని/గోదావరిఖనిటౌన్: ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. నగరంలోని 43వ డివిజన్లో ఆదివారం ఆయన సన్నబియ్యం పంపిణీ ప్రారంభించారు. తెల్లరేషన్‌కార్డు లోని ఒక్కో కుటుంబ సభ్యుడికి ఆరు కిలోలల చొ ప్పున సన్నబియాన్ని ఉచితంగా అందజేశారు. అ నంతరం ఆయన మాట్లాడుతూ, కార్పొరేషన్‌లోని కార్డుదారులకు 89 వేల కింటాళ్ల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, వీటితోపాటు మరో పదివేల కొ త్త రేషన్‌కార్డుదారులకూ పంపిణీ చేసేందుకు ఏర్పా ట్లు చేశామన్నారు. తహసీల్దార్ కుమారస్వామి, కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి, బొంతల రాజేశ్, ముస్తాఫా, శ్రీనివాస్ పాల్గొన్నారు. విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా పవర్‌హౌస్‌కాలనీలోని శ్రీకాశీవిశ్వేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన చౌరస్తాలో వీహెచ్‌పీ చేపట్టిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ దంపతు లు, వీహెచ్‌పీ ప్రతినిధి అయోధ్య రవీందర్ తదిత రులు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులోనూ షడ్రుచుల పచ్చడి పంపిణీచేశారు. నగరంలోని పలు ఈద్గాలను ఎ మ్మెల్యే సందర్శించి ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
మక్కకు పందుల బెడద
● కంకిదశలోకి పంట.. దిగుబడిపై ఆశ ● చేతికందే దశలో ధ్వంసం చేస్తున్న ఊరపందులు ● రక్షణ కల్పించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు అన్నదాతల మొర రక్షణ కల్పించాలి మా ఊరు శివారులో నాకున్న చేనులో మొక్కజొన్న పంట వేసిన. ఊరపందులు చేనులోపడి కంకిని కొరికి పడేస్తున్నాయి. కర్రలను విరిచేస్తున్నాయి. మాకు తీరని నష్టం కలుగుతంది. వాటి బారినుంచి పంటను కాపాడాలి. నష్టపోయిన పంటకు పరిహారం ఇప్పించాలి. – వైద రమేశ్, రైతు, రంగంపల్లి పంటల బీమా చేయాలి ప్రకృతి వైపరీత్యాలతో కలిగే పంటల నష్టానికి పరిహారం కోసం ప్రభుత్వానికి నివేదించే అవకాశం ఉంది. ఊరపందులు చేసే నష్టం విషయాన్ని సర్కార్ దృష్టికి తీసుకెళ్లడం కష్టమే. పందులు చేనువైపు రాకుండా రైతులే రక్షణ చర్యలు తీసుకోవాలి. లేదా పెంపకందారులతో మాట్లాడి సమస్య పరిష్కరించుకోవాలి. – అలివేణి, ఏవో, పెద్దపల్లి ఈ ఫొటోలోని రైతు పేరు పూదరి లక్ష్మణ్. స్వగ్రామం రంగంపల్లి. తను సాగు చేసిన మొక్కజొన్న పంట కంకిపోసింది. కొద్దిరోజులైతే పంట కోయడం కోసం సిద్ధమవుతున్నాడు. సరిగ్గా ఇదేసమయంలోనే ఊరపందులు చేనులోపడి పంట ధ్వంసం చేశాయి. తీరని నష్టం కలిగించాయి. చేతికందే దశలో పంట నాశనం కావడంతో శ్రమంతా మట్టిపాలైందని, పెట్టుబడి కూడా వచ్చేట్టు లేదని లక్ష్మణ్ ఆవేదన చెందుతున్నాడు. పెద్దపల్లిరూరల్: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మొక్కజొన్న పంటకు అడవిపందులతోపాటు ఊరపందుల బెడద పట్టుకుంది. కొన్ని మారుమూల గ్రామాల్లో ఊరపందులు స్వైరవిహారం చేస్తున్నా యి. గ్రామ శివారులోని మొక్కజొన్న చేనుల్లోకి దూ రి పంట ధ్వంసం చేస్తున్నాయి. అన్నదాతకు తీరని నష్టం కలిగిస్తున్నాయి. పెద్దపల్లి శివారులోని రంగంపల్లిలో ఈ పరిస్థితి తీవ్రస్థాయిలో ఉంది. పంట ప్ర స్తుతం కంకిపోసి కొద్దిరోజుల్లో దిగుబడి చేతికి వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఊరపందులు చేలల్లోకి దూరి మొక్కజొన్న పంటను ధ్వంసం చేయడం రైతుల్లో విషాదం నింపుతోంది. అన్నదాతలు కాపలాగా ఉన్నా.. పందుల బారినుంచి పంటను కాపాడుకునేందుకు రైతు కుటుంబసభ్యుల్లో ఎవరోఒకరు మొక్కజొన్న చేను వద్ద రోజూ కాపలా ఉంటున్నారు. అయినా, వారి కళ్లుగప్పి పందులు గుంపులుగా వచ్చి ఒక్కసారిగా చేనులో పడి ధ్వంసం చేస్తున్నాయి. ఈ విషయాన్ని పందుల పెంపకందారుల దృష్టికి తీసుకెళ్లినా కట్టడి చేస్తామంటున్నా.. క్షేత్రస్థాయిలో తగిన చర్యలు చేపట్టడం లేదని అంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు.. పందుల బెడదతో తమకు జరుగుతున్న నష్టాల గురించి వివరిస్తూ ఫొటోలు, వీడియోలతో అధికారులు, ప్రజాప్రతినిధులకు బాధిత రైతులు ఫిర్యాదులు చేస్తున్నారు. అయినా, తమ విన్నపాలను పట్టించుకున్న పాపాన పోవడం లేదని రైతులు రాజారాం, ప్రభాకర్, నరేశ్, తిరుపతి, కిష్టస్వామి, రవి, శంకర్ తదితరులు పేర్కొన్నారు. పోలీసు అధికారులకు సైతం ఫిర్యాదు చేసి, పందుల పెంపకందారులకు ఆదేశాలు ఇప్పించినా పరిస్థితిలో మార్పు రావడం లేదంటున్నారు. -
నవ విశ్వాసం
ఆదివారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2025● నేడు విశ్వావసునామ ఉగాది పర్వదినం ● ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణాలకు ఆలయాలు సిద్ధంతీపి, చేదు జ్ఞాపకాల క్రోధి నామ సంవత్సరానికి వీడ్కోలు పలుకు తూ.. వనాలన్నీ చిగురించే వేళ, పూల పరిమళాలు వెదజల్లే వేళ.. కోయిలమ్మల కుహుకుహు రాగాలు.. హాయినిచ్చే వెచ్చని గాలులు.. వెలుగులు పంచే విశ్వావసునామ తెలుగు సంవత్సరానికి ప్రజలు ఆదివారం స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. వసంత రుతువు ఆగమనంతో చైత్రశుద్ధ పాడ్యమి సూర్యోదయం నుంచి తెలుగు నూతన సంవత్సర ఉగాది జరుపుకోవడం ఆనవాయితీ. ఉగాది అంటే కష్ట సుఖాల కలయిక. షడ్రుచుల వేడుక. నూతన వస్త్రధారణ, ఆలయాల సందర్శన, ఇష్టదైవాల ఆరాధనతోపాటు.. పంచాంగ శ్రవణాలు, పిండి వంటల తయారీ ప్రత్యేకం. నేడు విశ్వావసునామ సంవత్సరం సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పండితులు, కవులు, అలనాటి వేడుకలు, మారిన కాలంలో ఉగాది ఉషస్సుల ప్రత్యేకతలపై కథనం..పంటలు సమృద్ధిగా.. మంథని: విశ్వావసు నామ సంవత్సరంలో పంటలు సమృద్ధిగా పండే అవకాశం ఉంది. పత్తి, వరి, తెల్లజొన్నలు వంటి పంటలు ఎక్కువగా లాభాలనిస్తాయి. పాలకుల మధ్య విభేదాలతో ప్రజలకు కొంత అసౌకర్యం కలుగుతుంది. అయినా ప్రజల్లో స్నేహభావంతో మేలు పెరుగుతుంది. భయాందోళనకర వాతావరణం ఉన్నా భగవతారాధన వల్ల అందరూ సుభిక్షింగా ఉంటారు. బంగారం, లోహ సంబంధిత వస్తువుల ధరలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. – వొజ్జల గణేశ్ అవధాని, వేద పండితుడు, మంథని 45 వసంతాలుగా.. యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్‌కాలనీ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడిని. 45 ఏళ్ల నుంచి ఉగాది నాడు పంచాంగ శ్రవణం చదివి వినిపిస్తున్న. విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆధ్యాత్మికత పెరుగుతుంది. సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో కార్మికులు, ఉద్యోగులు, అధికారుల మధ్య విశ్వాసం పెంపొందుతుంది. లోక కల్యాణార్థం యాగాలు, హోమాలు చేయడం జరుగుతుంది. రైతులు పంటలు అధికంగా పండిస్తారు. – జగన్నాథచార్యులు, యైటింక్లయిన్‌కాలనీ -
రుణమాఫీపై చర్చకు రండి : ఎమ్మెల్యే విజయ్
సుల్తానాబాద్(పెద్దపల్లి) : రైతులను తప్పుదోవ పట్టించేందుకు రుణమా ఫీ కాలేదని బీజేపీ, బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు అసత్య ప్రచా రం చేస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీ జరిగిందని, అవసరమైతే దీనిపై చర్చించడానికి ఎక్కడికై నా రావడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన సవాల్ చేశారు. నాయకులు శ్రీనివాస్, అంతటి అన్నయ్యగౌడ్, మినుపాల ప్రకాశ్‌రావు, అధికారులు శ్రీమాల, వెంకటేశ్వర్లు, శశిధర్రావు, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాప్రయోజనాల కోసమే ఒకేచోట అన్ని కార్యాలయాలు
● రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మంథని: ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతోనే ఒకేచోట సమీకృత ప్రభుత్వ కార్యాలయ భవనాలు నిర్మిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. మంథని నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి శనివారం మంత్రి పలు అభివృద్ధి ప నులు ప్రారంభించారు. పట్టణంలో ఆర్డీవో కార్యాలయంలోపాటు సుమారు 20 ప్రభుత్వ ఆఫీసులు ఒకేచోట ఉండేలా రూ.4.5 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేసినట్లు మంత్రి తెలిపారు. కమాన్‌పూర్, రామగిరి తహసీల్దార్ కార్యాలయాల భవనాలు ఒకేచోట ఉండేలా ప్లాన్ చేశామని ఆయన అన్నారు. రూ.30 లక్షలతో చేపట్టిన జెడ్పీ హైస్కూల్ రెనోవేషన్, రూ.35లక్షలతో చేపట్టిన కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, రూ.80 లక్షల వ్యయంతో చేపట్టిన మోడల్ స్కూల్ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఆర్డీవో సురేశ్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, అధికారులు పాల్గొన్నారు. అధికారులు జవాబుదారీగా ఉండాలి కమాన్‌పూర్/రామగిరి(మంథని): వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు అధికారులు జవాబుదారీగా ఉండాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సూచించారు. మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. స్థానిక శాఖ గ్రంథాలయానిన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వ కార్యాలయాల సమీకృత భవన నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. ఉగాది పండుగ నుంచి పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఆయన అన్నారు. రాజాపూర్ గ్రామస్తులు ఆందోళన చెందవద్దని, అందరికీ అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. -
ప్రేమ.. పరువు.. ఆత్మహత్య.. హత్య!
ప్రేమ.. త్యాగం నేర్పుతుంది అంటారు. కానీ.. యువతీ, యువకుల మధ్య చిగురించిన ప్రేమ బలికోరుతోంది. సామాజిక సమీకరణాలు కుదరక కులాల కుంపటి రాజుకుంటోంది. గ్రామాల్లో ఈ పోకడ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాము కనీ, పెంచిన పిల్లలు తమకు దక్కకుండా పోతారన్న భయం, పరువు పోతుందన్న ఆందోళనలో తల్లిదండ్రులు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. .. ఇవి హత్యల వరకు దారితీస్తున్నాయి. మరోపక్క తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించన్న భయంతో ప్రేమికులు ప్రాణత్యాగాలు చేసుకుంటున్నారు. దురదృష్టవశాత్తూ ఉమ్మడి జిల్లాలో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండగా.. సామాజిక అంతరాలకు అద్ధం పడుతున్నా యి. వేర్వేరు కులాల యువతీ, యువకులు ప్రేమించుకుంటే వారిపై దాడులు సహజమే అయినా.. అది చంపుకునేదాకా వెళ్తుండడమే ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు ఉత్తరాదికే పరిమితమైన ఈ పోకడ ఉమ్మడిజిల్లాకు పాకడం గమనార్హం.పంతాలతో కుటుంబాలు నాశనంసామాజిక కట్టుబాట్లను ఛేదించలేక, అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల ప్రేమను అంగీకరించలేక పెద్దలు తీసుకుంటున్న తీవ్ర నిర్ణయాలు ఆయా కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. కుటుంబ పెద్ద జైలుకు వెళ్లడంతో ఆర్థికంగా చితికిపోతున్నా యి. వాస్తవానికి ఏ సమాజంలో ఏ పరువు కోసం హత్యలు చేస్తున్నారో.. తరువాత అదే సమాజం ఆయా కుటుంబాలకు అండగా నిలబడని విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో యుక్తవయసులో ప్రేమే సర్వస్వం అంటూ జీవితంలో స్థిరపడక ముందే ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకొని ప్రాణాలు తీసుకుని, తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగుల్చుతున్నారు.ఉమ్మడి జిల్లాలోని పలు ఘటనలు⇒ మార్చి 27న పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటకు చెందిన సాయికుమార్‌ను అదే గ్రామానికి చెందిన ముత్యం సద య్య తన కుమార్తెను ప్రేమిస్తున్నాడని గొడ్డలితో నరికి చంపడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కేవలం కులాలు వేరన్న కా రణమే సాయిని చంపేలా చేసింది.⇒ ఇల్లందకుంట యువకుడు, నిర్మల్ జిల్లాకు చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెద్దల ఆమోదం ఉండదన్న ఆందోళనతో మార్చి 17న జమ్మికుంట పరిధిలోని రైల్వేస్టేషన్లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.⇒ మార్చి 6న చొప్పదండికి చెందిన ప్రేమికులు ఇంట్లోవారు తమ ప్రేమను అంగీకరించరన్న భయంతో కరీంనగర్లో స్నేహితుడి ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.⇒ 2024 ఏప్రిల్‌లో తాను అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కులాంతర వివాహం చేసుకుని వెళ్లిపోయిందన్న బాధతో సిరిసిల్ల జిల్లాలో ఓ తండ్రి తన కుమార్తెకు పిండ ప్రదానం చేశాడు. తమ ఆశలను అడియాశలు చేసిన కూతురు మరణించిందని ఫ్లెక్సీ పెట్టించడం సంచలనంగా మారింది.⇒ 2023 నవంబరులో సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలానికి చెందిన ప్రేమికులు విషం తాగి ప్రాణాలు తీసుకున్నారు.⇒ 2023 ఆగస్టులో కోరుట్ల పట్టణంలో తన ప్రియుడితో పరారయ్యే క్రమంలో ప్రియురాలు తన అక్కనే హత్య చేసి పరారవడం కలకలం రేపింది.⇒ 2021 ఆగస్టులో మంథనికి చెందిన ఓ ప్రేమజంటపై యువతి తండ్రి హేయంగా దాడి చేశాడు. ఈ దాడిలో ప్రేమికులు తృటిలో చావు నుంచి తప్పించుకున్నారు. ⇒ 2017లో మంథనిలో మధుకర్ అనే దళిత యువకుడి అనుమానాస్పద మరణం కూడా పరువుహత్యగా ప్రాచుర్యం పొందింది. అనుమానాస్పద మరణం అని పోలీసులు, ప్రి యురాలి బంధువులే చంపారని మధుకర్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. దళితసంఘాలు ధర్నా చేయడంతో మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించారు. అప్పట్లో ఇది జాతీయస్థాయిలో చర్చానీయాంశంగా మారింది. ఈ కేసు ఇంకా తేలాల్సి ఉంది.⇒ 2016లో తిమ్మాపూర్‌లోని ఓ గుడిలో ప్రేమ వివాహం చేసుకునేందుకు పీటల మీద కూర్చున్న జంటపై యువతి బంధువులు దాడి చేశారు. పెళ్లికూతురు కళ్లముందే పెళ్లి కొడుకును విచక్షణా రహితంగా పొడిచి చంపడం కలకలం రేపింది.ఆలోచన తీరు మారాలి కులం అహంకారంతో జరిగే దారుణాలతో ప్రాణాలుపోతున్నాయి. టెక్నాలజీలో ముందున్న మనం ఆధునికంగా ఆలోచించలేక పోతున్నాం. ఉన్నత చదువులు చదువుకునే..యువత కూడా ప్రేమించుకోవడం.. కాదన్నారని ప్రాణాలు తీసుకోవడం తగదు. ఈ ఘటనలకు కేవలం ఆలోచన తీరే కారణం. తీరుమారితే విపరీత ధోరణులు మారుతాయి. – ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత,సోషియాలజీ విభాగం అధిపతి, శాతవాహన వర్సిటీకుల వివక్షపై అవగాహన కల్పించాలి సమాజంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నా కుల,మత భేదాలు గ్రామాల్లో అలాగే కొనసాగుతున్నాయి. కులాల మధ్య వైరుధ్యాలు పెరిగేలా ప్రభుత్వాలు కులాల ఆధారంగా ప్రవేశపెడుతున్న పథకాలు ప్రజల మధ్య దూరాలను పెంచుతున్నాయి. పిల్లల ప్రేమ కన్నా పరువు, పట్టింపులే ఎక్కువ అనే భావన తొలిగేలా, కులవివక్షపై ప్రజలకు అవగాహన కలిగించేలా ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది.– కల్లెపల్లి ఆశోక్, కేవీపీఎస్ :::సాక్షిప్రతినిధి, కరీంనగర్ -
పుట్టినరోజు నాడే ప్రాణం తీశారు
సాక్షి, పెద్దపల్లి: కుమార్తెను ప్రేమిస్తున్నాడనే కోపంతో ఓ యువకుడిని యువతి తండ్రి కిరాతకంగా హతమార్చిన దారుణ ఘటన గురువారం రాత్రి పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలో కలకలం సృష్టించింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పూరెల్ల సాయికుమార్ (20), అదే గ్రామానికి చెందిన ఓ యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరుకావడంతో వారి ప్రేమకు యువతి తండ్రి ముత్యం సదయ్య అడ్డుచెప్పాడు. తొమ్మిదో తరగతిలోనే చదువు మానేసిన సాయికుమర్ను ఇకపై తన కూతురితో మాట్లాడొద్దని పలుమార్లు హెచ్చరించాడు. అయినా యువతీయువకులు తరచూ మాట్లాడుకోవడంతోపాటు గురువారం ఉదయం కలిసే సాయికుమార్ బర్త్‌డే వేడుకలు జరుపుకున్నారు. ఈ సమాచారం తెలియడంతో రగిలిపోయిన యువతి తండ్రి ముత్యం సదయ్య గురువారం రాత్రి 10 గంటలకు సాయికుమార్‌ను గొడ్డలితో నరికి చంపాడు. పుట్టినరోజు వేడుకల్లోనే.. పెద్దపల్లిలోని హాస్టల్లో ఉంటూ డిగ్రీ సెకండియర్ చదువుతున్న యువతిని సాయికుమార్ గురువారం కలిశాడు. ఆమెతో కలిసి బర్త్‌డే వేడుకలు చేసుకున్నాడు. రాత్రికి గ్రామంలో నలుగురు స్నేహితులు పూరెల్ల అఖిల్, చిలుమల హన్సిక్, కామెర అభిషేక్, చెవుల రాకేశ్‌తో కలిసి కేక్ కట్ చేశాడు. ఆపై స్నేహితులంతా మద్యం తాగేందుకు సిద్ధమయ్యారు. స్నాక్స్ కోసం రాకేశ్, అభిషేక్ కిరాణా దుకాణానికి వెళ్లగా.. అదే సమయంలో అక్కడికి చేరుకున్న యువతి తండ్రి వెంట తెచ్చుకున్న గొడ్డలితో సాయికుమార్‌పై దాడి చేశాడు. సాయికుమార్ ప్రాణభయంతో పరుగులు తీసినా సుమారు 200 మీటర్లు వెంటాడి గొడ్డలితో వేటు వేశాడు. ఈ క్రమంలో స్నేహితుడు అఖిల్ సదయ్యను అడ్డుకొని అతన్నుంచి గొడ్డలిని లాక్కున్నాడు.రక్తపుమడుగులో సాయికుమార్ కొట్టుమిట్టాడుతుండటంతో సదయ్య అక్కడి నుంచి నుంచి పారిపోయాడు. దాడి విషయాన్ని స్నేహితులు సాయికుమార్ తండ్రి పర్శరాములుకు తెలియజేశారు. కుటుంబ సభ్యులతో కలిసి సాయికుమార్‌ను సుల్తానాబాద్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శుక్రవారం పోస్ట్‌మార్టం అనంతరం ముప్పిరితోటలో అంత్యక్రియలు నిర్వహించారు. పర్శరాములు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సదయ్య కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. అయితే నిందితుడు జూలిపల్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడని సమాచారం. సదయ్యగా భావిస్తున్న వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నట్లు ఓ వీడియో క్లిప్ వైరల్‌గా మారింది.వెంటాడిన మృత్యువు..గురువారం తెల్లవారుజామున బాబాయ్ భరత్‌కు కిడ్నీలో నొప్పి వస్తోందని చెప్పడంతో సాయికుమార్ ఆయన్ను తీసుకొని కారులో కరీంనగర్ ఆస్పత్రికి బయల్దేరాడు. మార్గమధ్యలో దుబ్బపల్లి వద్ద కారు బోల్తాపడి రెండు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో భరత్‌కు స్వల్ప గాయాలవగా సాయికుమార్ సురక్షితంగా బయటపడ్డాడు. కానీ రాత్రికి మాత్రం దారుణ హత్యకు గురయ్యాడు. సాయికుమార్ చెల్లెలు 2016లో డెంగీతో మరణించగా ప్రస్తుతం కొడుకు సైతం మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.పథకం ప్రకారమే హత్య.. నా కొడుకు, ఆ యువతి రెండేళ్లుగా ప్రే మించుకుంటున్నారు. దీంతో మాకు టుంబాల మధ్య గొడవలయ్యాయి. నా కొడుకును చంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసి గతేడాది ఆగస్టు 23న పోలీసులకు ఫిర్యాదు చేశా. యువతి తల్లితో హరీశ్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటాన్ని నా కొడుకు చూశాడు. ఇది అందరికీ చెబుతా డనే భయంతో హరీశ్, యువతి తల్లిదండ్రులతో కలిసి చంపినట్లు అనుమానంగా ఉంది. – పర్శరాములు, మృతుడి తండ్రి -
శివాలయం అభివృద్ధికి రూ.6కోట్లు ఇవ్వాలి
గోదావరిఖని: రామగుండం నియోజకవర్గంలోని జనగామ పురాతన శివాలయం అభివృద్ధికి రూ.6 కోట్లు కేటాయించాలని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్‌ఠాకూర్ కోరారు. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకి మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి లేఖలు అందజేశారు. రామగుండంలో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు వస్తాయని అన్నారు. జెన్కో, ట్రాన్స్‌కోలో పనిచేస్తున్న ఆర్టిజెన్లను ఉద్యోగులగా గుర్తించాలని, పెండింగ్ డిపెండెంట్ల మారుపేర్ల బాధితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. -
25 రోజులకు ఇంటికి చేరిన మృతదేహం
గన్నేరువరం: గల్ఫ్‌లో మృతి చెందిన లింగంపల్లి మొండయ్య మృతదేహం 25రోజులకు శుక్రవారం స్వగ్రామానికి చేరుకుంది. మండలంలోని గునుకులకొండాపూర్ గ్రామానికి చెందిన లింగంపల్లి మొండయ్య 17ఏళ్లుగా గల్ఫ్ వెళ్తున్నాడు. ఆనారోగ్యంతో బాధపడుతూ ఈ నెల 3వ తేదీన అక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించాలని కొడుకు క్రాంతి, గ్రామ మాజీ సర్పంచ్ సొల్లు అజయ్‌వర్మ, రజక సంఘం యూత్ రాష్ట్ర అధ్యక్షుడు దుబ్బాక రమేశ్ మార్చి 5న కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌ని కలిశారు. ఆయన చొరవతో 25రోజుల నిరీక్షణ అనంతరం మృతదేహం శుక్రవారం గ్రామానికి చేరుకుంది. దీంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంట్టాయి. మృతుడికి భార్య రేణుక, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. అంత్యక్రియలకు గ్రామస్తులతో సమీప గ్రామ ప్రజలు తరలివచ్చారు. -
రైస్‌మిల్లులో టాస్క్‌ఫోర్స్ అధికారుల సోదాలు
మంథని: సూరయ్యపల్లి రైస్‌మిల్లులో పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్‌ఫోర్స్ అధికారు లు శుక్రవారం సోదాలు నిర్వహించారు. 2022–23 సంవత్సరానికి సంబంధించి సీఎమ్మార్ ప్రకారం రాష్ట్రంలోని పలు రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలపై అనుమానాలు ఉన్న జాబితా ఆధారంగా మంథనికి చేరుకున్నారు. ఈక్రమంలోనే సూరయ్యపల్లి రైస్‌మిల్లులో అధికారులు తనిఖీలు చేశారు. మిల్లులో 41,365 క్వింటాళ్ల ధాన్యం నిల్వలు ఉండాల్సి ఉండగా అక్కడ రైస్‌మిల్లులో ధాన్యం లేదని గుర్తించా రు. కాగా, తాను లీజు తీసుకున్న గంగాపురి సమీపంలో ధాన్యం నిల్వ ఉందని యజమాని చెప్పడంతో అధికారులు అక్కడకు వెళ్లి పరిశీలించారు. అక్క డ 9,689.08 క్వింటాళ్ల ధాన్యం నిల్వ మాత్రమే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మిగతా ధాన్యం నిల్వలు అందుబాటులో లేవని తేల్చారు. నిర్దేశించిన ప్రకారం ప్రభుత్వానికి చెల్లింపులు చేయాల్సి ఉంటుందని, కానీ, అలా చేయక పోవడంతో సోదాల్లో వెలుగుచూసిన అంశాలను కమిషనర్‌కు నివేదిస్తామని స్పెషల్ ఆఫీసర్ లక్ష్మారెడ్డి తెలిపారు. రూ.కోట్ల విలువైన ధాన్యం అందుబాటులో లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పౌర సరఫరాల శాఖ అధికారులు స్ఫష్టత ఇవ్వాల్సి ఉంది. తనిఖీల్లో ఓఎస్డీ ప్రభాకర్, ఎస్ఐ జంగయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు. -
రోజూ తాగునీటి సరఫరా
జ్యోతినగర్/కోల్‌సిటీ(రామగుండం): నగర ప్ర జలకు రోజూ తాగునీరు సరఫరా చేస్తామని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణశ్రీ అన్నారు. భీమునిపట్నం, అన్నపూర్ణకాలనీల్లో రక్షిత మంచినీటి సరఫరా ట్రయల్ రన్, భీమునిపట్నం, హెలిప్యాడ్ ట్యాంకులు, ఇందిరమ్మకాలనీ, దుర్గానగర్‌లోని పార్క్‌లను ఆమె శుక్రవారం పరిశీలించారు. పార్కులు, పట్టణ ప్రకృతి వనాల్లో పచ్చదనం రూపొందించడానికి చ ర్యలు తీసుకుంటున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్, డీఈ షాభాజ్, ఏఈ తేజస్విని తదితరులు పాల్గొన్నారు. రేపు క్రీడాకారుల ఎంపిక రామగుండం: ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫుట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీన గోదావరిఖని సింగరేణి జవహర్లాల్ స్టేడియంలో క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి గణపతి తెలిపారు. అండర్–13, అండర్ –15లో క్రీడాకారుల ఎంపిక ఉంటుందన్నారు. ఉదయం ఎనిమిది గంటలకు ప్రక్రియ ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హులైన క్రీడాకారులు సకాలంలో హాజరుకావాలని ఆయన కోరారు. యంత్రాలను వినియోగించాలి రామగిరి(మంథని): యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించి బొగ్గు ఉత్పత్తికి అటంకం కలుగకుండా చూడాలని సింగరేణి ఆపరేషన్స్ డైరెక్టర్ ఎల్వీ సూర్యనారాయణ సూచించారు. ఆర్జీ–3 పరిధిలోని ఓసీపీ–2 గనిని శుక్రవారం ఆయన సందర్శించారు. బొగ్గు ఉత్పత్తి, రవాణా, యంత్రాల వినియోగం తదితర అంశాల పై అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన క్వారీని పరిశీలించారు. ఇన్చార్జి ప్రాజెక్టు ఆఫీసర్ రఘుపతి, ప్రాజెక్టు ఇంజినీర్ టి.చంద్రశేఖర్, మేనేజర్ రామరావు, ఎస్టేట్ అధికారి ఐలయ్య, ఏరియా సెక్యూరిటీ అధికారి షబ్బీరుద్దీన్, అధికారులు శ్రీనివాస్, రవీందర్, శ్యామల తదితరులు పాల్గొన్నారు. ప్రతిపాదనలు రూపొందిస్తాంముత్తారం(మంథని): ఎస్సారెస్పీ– 22ఆర్ కా లువలోని పూడిక తొలిగింపునకు ప్రతిపాదన లు తయారు చేస్తామని మంథని ఇరిగేషన్ ఈ ఈ బలరాం తెలిపారు. మైదంబండ నుంచి కేశనపల్లి, ముత్తారం, చివరి ఆయకట్టు అమ్రాబా ద్ వరకు ఎస్సారెస్పీ కాలువలను ఆయన శుక్రవారం పరిశీలించారు. కాలువ చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యం మే రకు కాలువలు పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు. నిధుల కోసం కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపుతామని ఈఈ తెలిపారు. డీఈఈ రాజేంద్రనాథ్, జేఈఈలు నితీశ్, ప్రసన్న, కాంగ్రెస్ నాయకుడు బియ్యని శివకుమార్ ఉన్నారు. 433 క్వింటాళ్ల పత్తి సేకరణ పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం పత్తి క్వింటాలుకు గరిష్టంగా రూ.7,153 ధర పలికింది. కనిష్టంగా రూ.5,009, సగటు రూ.7,069గా ధర నమోదైందని మార్కెట్ సెక్రటరీ మనోహర్ తెలిపారు. మొత్తం 433 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన వివరించారు. రైతులు నాణ్యమైన పత్తిని మార్కెట్‌కు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని ఆయన సూచించారు. నిబంధనలు పాటించాలి పెద్దపల్లిరూరల్: జిల్లాలోని స్కానింగ్ సెంటర్లు నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి అ న్నప్రసన్నకుమారి హెచ్చరించారు. తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన అడ్వయిజరీ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. నిబంధనలు పాటించని జిల్లాలోని ఓ స్కానింగ్ సెంటర్‌ను ఇప్పటికే సీజ్ చేశామని ఆమె తెలిపారు. మిగతా 30 స్కానింగ్ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి పలు సూచనలు చేశామని పేర్కొన్నారు. అందులో 15 సెంటర్లకు నోటీసులిచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్లు శ్రీధర్, వాణిశ్రీ, శ్రీదేవి, రవీందర్, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా కన్వీనర్ రాజగోపాల్, సరస్వతి, జిల్లా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. -
ఆటోలో పురుడుపోసిన 108 సిబ్బంది
కోల్‌సిటీ(రామగుండం): పురిటి నొప్పులతో తల్లడిల్లుతున్న ఓ గర్భిణికి సకాలంలో పురుడు పోశారు 108 సిబ్బంది. సప్తగిరికాలనీకి చెందిన బండి వెంకటేశ్ కూలీ పనులు చేసుకుంటున్నాడు. అతడి భార్య పద్మ నెలలు నిండు గర్భిణి. శుక్రవారం వేకువజామున పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆటోలో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే నొప్పులు అధికమమయ్యాయి. ఆమె తల్లడిల్లుతుండగా ఆందోళన చెందిన భర్త.. 108 సిబ్బందికి సమాచారం అందించారు. స్పందించిన ఈఎంటీ రవీందర్, పైలట్ రాజేందర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్‌లో తరలించే పరిస్థితి లేకపోవడంతో ఆటోలోనే గర్భిణాకి పురుడు పోశారు. ఆమె పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. అనంతరం శిశువుతోపాటు బాలింతను జీజీహెచ్ తరలించగా వైద్యులు శిరీష, శివరంజని చికిత్స అందించారు. తల్లీబిడ్డా క్షేమంగా ఉండడంతో కుటుంబసభ్యులు 108 సిబ్బందిని అభినందించారు. -
విద్యుత్ వైరును పట్టుకొని వ్యక్తి ఆత్మహత్య
ధర్మపురి: వెన్నునొప్పి భరించలేక ఓ వ్యక్తి ట్రాన్స్ఫార్మర్ వైరును పట్టుకొని గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఉదయ్‌కుమార్ తెలిపారు. రాయపట్నం గ్రామానికి చెందిన గొల్ల సత్తయ్య(48) ఐదేళ్లుగా వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ఆ బాధ భరించలేక ఆత్మహత్య శరణ్యమని భావించి ఇంటి ఎదుట ఉన్న ట్రాన్ఫ్ఫార్మర్ వైరును పట్టుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. విద్యుదాఘాతానికి గురైన కూలీలు పెద్దపల్లిరూరల్: చీకురాయి గ్రామ సమీపంలో కొనసాగుతు న్న రైల్వేలైన్ బైపాస్ పనులు చేస్తున్న బి హార్‌కు చెందిన ఇద్దరు వలస కూలీలు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ కూలీలు గోవింద్‌కుమార్, బ్రిజేశ్‌కుమార్‌ను సదరు కాంట్రాక్టర్ గోప్యంగా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాంట్రాక్టర్ తన నిర్లక్ష్యాన్ని బయటకు పొక్కకుండా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తోంది. వైరస్‌తో కోళ్ల మృతిగంగాధర: గంగాధర మండలంలోని లక్ష్మిదేవిపల్లి శివారులోని కోళ్లఫారంలో వైరస్సోకి శుక్రవారం వందలాది కోళ్లు మృతి చెందాయి. వాతావరణంలో మార్పులతో పాటు, ఆర్డీ వైరస్‌తో కోళ్లు మృతి చెందుతున్నాయని ఫారం యజమాని ఇప్పలపల్లి నర్సయ్య పేర్కొన్నాడు. ఇప్పటి వరకు ఐదారువేల కోల్లు మృతి చెందాయన్నాడు. ఐఎల్టీ, వీవీఎన్డీ వైరస్ సోకడంతో ప్రస్తుతం కోళ్లు మృతి చెందుతున్నాయని పశువైద్యాధికారి సందీప్‌రెడ్డి తెలిపారు. సినీ ఫక్కీలో చోరీకోరుట్ల: పట్టణంలోని అయిలాపూర్ రోడ్డుకు ఎదురుగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం సినీ ఫక్కీలో జరిగిన ఘటనలో దుండగులు రూ.1.50 లక్షలు చోరీ చేసి బైక్‌పై పారిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. అయిలాపూర్‌కు చెందిన చింతకింది శ్రీహరి శుక్రవారం బ్యాంకు నుంచి రూ,1.50 లక్షలు డ్రా చేసి తన బైక్‌లోని ట్యాంక్ కవర్ ఉంచాడు. తను పార్క్ చేసిన బైక్ వద్ద మరో బైక్ ఉండటంతో బైక్‌ను జరిపేందుకు ప్రయత్నించే క్రమంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి రూ.100 నోటును పడవేశాడు. మీనోటు పడిపోయింది చూడట్లేదా? అని శ్రీహరితో అనటంతో ఆ వంద నోటు తీసుకునేందుకు శ్రీహరి కిందికి వంగాడు. అదే క్రమంలో బైక్ ట్యాంకు కవర్లో ఉన్న రూ.1.50 లక్షల నగదును ఇద్దరు దుండగులు తీసుకొని బైక్ పై పారిపోయారు. దుండగులు పారిపోతున్న దృశ్యాలు పట్టణంలోని సీసీ కెమెరాల్లో కనిపించాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రతిపాదనల్లోనే హరిత హోటల్
● రెండేళ్లక్రితం పరిశీలించిన అధికారులు ● నేటికీ కార్యరూపం దాల్చని వైనం గోదావరిఖని: పెద్దపల్లి – మంచిర్యాల జిల్లాలను కలుపుతూ గోదావరి నదిపై నిర్మించిన రెండు వంతెనలు.. ఆ పక్కనే సమ్మక్క – సారలమ్మ గద్దెలు.. నిత్యం వేలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు వీలుగా నిర్మించిన ఘాట్లు.. తీరంలోనే ఎత్తయిన శివుని విగ్రహం.. ఇవన్నీ గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి వన్నె తెచ్చి పెడుతున్నాయి.. సుందిళ్ల బ్యారేజీలో నీటి నిల్వలు పెంచితే బ్యాక్‌వాటర్‌లో అందుబాటులోకి వచ్చే బోటింగ్ సౌకర్యం.. ఇది పర్యాటకులను ఆకర్షించే ప్రక్రియ. వీరికి విడిది సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో శారదానగర్ సమీపంలో హరిత హోటల్ నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆ శాఖ అధికారులు రెండేళ్ల క్రితం ఇక్కడకు వచ్చారు. హోటల్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలించి వెళ్లిపోయారు. కానీ, ఆ ప్రతిపాదనలు ఇంకా కార్యరూపం దాల్చలేదు. హరిత హోటల్ నిర్మాణం పూర్తయితే పర్యాటకులు అత్యధికంగా తరలివచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజీవ్‌రహదారి పక్కనే హరిత హోటల్ నిర్మిస్తే.. ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రజలకు కూడా అనుకూలంగా ఉంటుందని, మంచి భోజన, వసతి అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. రామునిగుండాలు వద్ద భారీ విగ్రహం రామునిగుండాలు గుట్టపై సుమారు 152 అడుగుల ఎత్తుతో పంచముఖ హనుమాన్ విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ఇందుకోసం 60 అడుగుల వెడల్పుతో సుమారు కిలోమీటరు పొడవున రోడ్డు నిర్మిస్తున్నారు. దీనికోసం రూ.2కోట్ల ఖర్చు చేయనున్నారు. పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. దీంతో రామునిగుండాలుకు కూడా పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రాజీవ్ రహదారిపై రద్దీ.. మంచిర్యాల జిల్లా కోటపల్లి శివారులోని అర్జునగుట్ట వద్ద వంతెన నిర్మించడంతో రాజీవ్ రహదారిపై ప్రయాణించే వారి సంఖ్య పెరిగింది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన ప్రయాణిలకు ఇదే అనువైన మార్గం. అయితే, తమ పనుల్లో అనూహ్యంగా ఆలస్యమైతే.. రోడ్డు వెంట ఉండే హరి తహోటల్లో సేదతీరేందుకు అవకాశం ఉంటుంది. ఈక్రమంలో ఈప్రాంతంలో హరిత హోటల్ నిర్మాణం అత్యంత అవసరమని అంటున్నారు. పర్యాటకాభివృద్ధికి కృషి గోదావరి తీరంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తాం. అసెంబ్లీలో కూడా ఈ విషయం గురించి మాట్లాడా. సింగరేణి సహకారంతో సమ్మక్క–సారలమ్మ గద్దెల సమీపంలో భక్తులు, పర్యాటకులు బసచేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. దీనికోసం సింగరేణి యాజమాన్యం రూ.3 కోట్లు కేటాయించింది. – మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, ఎమ్మెల్యే, రామగుండం -
ఆత్మహత్య.. హత్య!
● దారుణాలకు దారితీస్తున్న కులాంతర ప్రేమలు ● కలకలం రేపుతున్న ప్రేమికుల హత్యలు, ఆత్మహత్యలు ● తాజాగా సాయికుమార్‌ను వెంటాడి నరికి చంపిన వైనం ● ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న ఉత్తరాది కల్చర్ ● మరోసారి పరువు హత్యలపై జోరుగా చర్చసాక్షిప్రతినిధి, కరీంనగర్: ప్రేమ.. త్యాగం నేర్పుతుంది అంటారు. కానీ.. యువతీ, యువకుల మధ్య చిగురించిన ప్రేమ బలికోరుతోంది. సామాజిక సమీకరణాలు కుదరక కులాల కుంపటి రాజుకుంటోంది. గ్రామాల్లో ఈ పోకడ పెరుగుతుండటం ఆందోళన కలి గిస్తోంది. తాము కనీ, పెంచిన పిల్లలు తమకు దక్కకుండా పోతారన్న భయం, పరువు పోతుందన్న ఆందోళనలో తల్లిదండ్రులు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవి హత్యల వరకు దారితీస్తున్నా యి. మరోపక్క తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించన్న భయంతో ప్రేమికులు ప్రాణత్యాగాలు చేసుకుంటున్నారు. దురదృష్టవశాత్తూ ఉమ్మడి జిల్లాలో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండగా.. సామాజిక అంతరాలకు అద్ధం పడుతున్నా యి. వేర్వేరు కులాల యువతీ, యువకులు ప్రేమించుకుంటే వారిపై దాడులు సహజమే అయినా.. అది చంపుకునేదాకా వెళ్తుండడమే ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు ఉత్తరాదికే పరిమితమైన ఈ పోకడ ఉమ్మడిజిల్లాకు పాకడం గమనార్హం. పంతాలతో కుటుంబాలు నాశనం సామాజిక కట్టుబాట్లను ఛేదించలేక, అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల ప్రేమను అంగీకరించలేక పెద్దలు తీసుకుంటున్న తీవ్ర నిర్ణయాలు ఆయా కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. కుటుంబ పెద్ద జైలుకు వెళ్లడంతో ఆర్థికంగా చితికిపోతున్నా యి. వాస్తవానికి ఏ సమాజంలో ఏ పరువు కోసం హత్యలు చేస్తున్నారో.. తరువాత అదే సమాజం ఆయా కుటుంబాలకు అండగా నిలబడని విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో యుక్తవయసులో ప్రేమే సర్వస్వం అంటూ జీవితంలో స్థిరపడక ముందే ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకొని ప్రాణాలు తీసుకుని, తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగుల్చుతున్నారు.ఉమ్మడి జిల్లాలోని పలు ఘటనలు మార్చి 27న పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటకు చెందిన సాయికుమార్‌ను అదే గ్రామానికి చెందిన ముత్యం సద య్య తన కుమార్తెను ప్రేమిస్తున్నాడని గొడ్డలితో నరికి చంపడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కేవలం కులాలు వేరన్న కా రణమే సాయిని చంపేలా చేసింది. ఇల్లందకుంట యువకుడు, నిర్మల్ జిల్లాకు చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెద్దల ఆమోదం ఉండదన్న ఆందోళనతో మార్చి 17న జమ్మికుంట పరిధిలోని రైల్వేస్టేషన్లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మార్చి 6న చొప్పదండికి చెందిన ప్రేమికులు ఇంట్లోవారు తమ ప్రేమను అంగీకరించరన్న భయంతో కరీంనగర్లో స్నేహితుడి ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. 2024 ఏప్రిల్‌లో తాను అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కులాంతర వివాహం చేసుకుని వెళ్లిపోయిందన్న బాధతో సిరిసిల్ల జిల్లాలో ఓ తండ్రి తన కుమార్తెకు పిండ ప్రదానం చేశాడు. తమ ఆశలను అడియాశలు చేసిన కూతురు మరణించిందని ఫ్లెక్సీ పెట్టించడం సంచలనంగా మారింది. 2023 నవంబరులో సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలానికి చెందిన ప్రేమికులు విషం తాగి ప్రాణాలు తీసుకున్నారు. 2023 ఆగస్టులో కోరుట్ల పట్టణంలో తన ప్రియుడితో పరారయ్యే క్రమంలో ప్రియురాలు తన అక్కనే హత్య చేసి పరారవడం కలకలం రేపింది. 2021 ఆగస్టులో మంథనికి చెందిన ఓ ప్రేమజంటపై యువతి తండ్రి హేయంగా దాడి చేశాడు. ఈ దాడిలో ప్రేమికులు తృటిలో చావు నుంచి తప్పించుకున్నారు. 2017లో మంథనిలో మధుకర్ అనే దళిత యువకుడి అనుమానాస్పద మరణం కూడా పరువుహత్యగా ప్రాచుర్యం పొందింది. అనుమానాస్పద మరణం అని పోలీసులు, ప్రి యురాలి బంధువులే చంపారని మధుకర్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. దళితసంఘాలు ధర్నా చేయడంతో మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించారు. అప్పట్లో ఇది జాతీయస్థాయిలో చర్చానీయాంశంగా మారింది. ఈ కేసు ఇంకా తేలాల్సి ఉంది. 2016లో తిమ్మాపూర్‌లోని ఓ గుడిలో ప్రేమ వివాహం చేసుకునేందుకు పీటల మీద కూర్చున్న జంటపై యువతి బంధువులు దాడి చేశారు. పెళ్లికూతురు కళ్లముందే పెళ్లి కొడుకును విచక్షణా రహితంగా పొడిచి చంపడం కలకలం రేపింది. -
అవార్డు రావడం అభినందనీయం
● ఎన్టీపీసీ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత జ్యోతినగర్(రామగుండం): రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టులో హిందీ భాష అమలుకు స్వర్ణశక్తి అవార్డు రావడం అభినందనీయమని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత అన్నారు. ప్రాజెక్టు పరిపాలన భవనంలో అధికారిక భాష అమలు కమిటీ త్రైమాసిక సమావేశం శుక్రవారం జరిగింది. హిందీ వినియోగం, ప్రచారం, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం సాధించడానికి చేసే ప్రయత్నాల గురించి సీనియర్ అధికారులతో ఆయన చర్చించారు. హిందీ మాట్లాడడాన్ని ప్రోత్సహించడంలో అధికార భాషా విభాగం చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. సౌత్ రీజియన్ రీజినల్ హెచ్ఆర్ హెడ్ ఎస్ఎన్ పాణిగ్రాహి మాట్లాడుతూ.. ఎన్టీపీసీ ఉద్యోగుల్లో హిందీ భాషపై ఆసక్తి, అవగాహన పెంచడానికి నాటక ప్రదర్శన నిర్వహించాలన్నారు. అనంతరం వర్చువల్ విధానంలో న్యూఢిల్లీలోని అధికార భాషా విభాగం అధిపతి అతర్సింగ్గౌతమ్ కమిటీ సభ్యులకు మార్గనిర్దేశం చేశారు. అధికారిక భాష –2024–25 వార్షిక పత్రికను విడుదల చేశారు. తెలంగాణ జనరల్ మేనేజర్ (ఓ అండ్ ఎం) దాస్, జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్) సింఘా రాయ్, అధికారులు, పాల్గొన్నారు. -
కొదురుపాకలో దొంగతనం
● ఐదు తులాల బంగారం.. 24 తులాల వెండి చోరీబోయినపల్లి(చొప్పదండి): అంగన్వాడీ కేంద్రంలో కోడిగుడ్లు తెచ్చుకోవడానికి ఇంటికి గడియపెట్టి వెళ్తే తిరిగి వచ్చే సరికి దొంగతనం జరిగింది. ఎస్సై పృథ్వీధర్‌గౌడ్ తెలిపిన వివరాలు. కొదురుపాకకు చెందిన సట్ట జలజ కోడిగుడ్ల కోసం ఇంటికి గడియపెట్టి అంగన్వాడీ కేంద్రానికి వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లోని రెండు బీరువాల తలుపులు తెరిచి ఉన్నాయి. బీరువా వద్దకు వెళ్లి చూడగా అందులో ఉన్న తన అత్తమ్మ బంగారం కనిపించలేదు. గుర్తుతెలియని వ్యక్తులు సుమారు 5 తులాల 9 గ్రాముల బంగారు నగలు, 24 తులాల వెండి ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సంఘటన స్థలాన్ని వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్ పరిశీలించారు. ఫింగర్‌ప్రింట్, డాగ్ స్క్వాడ్ బృందంతో తనిఖీలు చేపట్టారు. -
వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకే ‘జై బాపు.. జై భీమ్’
రామగిరి(మంథని): వాస్తవాలను ప్రజలకు తెలియచేప్పేందుకే జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం చేపట్టామని తెలంగాణ ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగ రాఘవరెడ్డి తెలిపారు. సెంటినరీకాలనీ శ్రీపాదభవన్‌లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోట్ల తిరుపతి యాదవ్దాధ్వర్యంలో శుక్రవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గొప్ప కార్యక్రమన్నారు. నాయకులు ఇంటింటికీ వెళ్లి స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు, స్వాతంత్య్రం వచ్చాక దేశంలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి వివరించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవమానిస్తున్న తీరు గురించి వివరించాలన్నారు. మంథని ముద్దుబిడ్డ దుద్దిళ్ల శ్రీపాదరావు అందించిన సేవలు మరవలేనివన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దుద్దిళ్ల శ్రీనుబాబు, రోడ్డ బాపన్న, గంట వెంకటరమణారెడ్డి, ఆరెల్లి దేవక్క, తోట చంద్రయ్య, కండె పోచం, కోట రవీందర్‌రెడ్డి, వనం రాంచందర్‌రావు, బర్ల శ్రీనివాస్, కాటం సత్యం, ముస్త్యాల శ్రీనివాస్, బంక్ మల్లేశ్, సందెల కుమార్, మాదాసు శ్రీనివాస్, కెక్కర్ల స్వరూప, జాగిరి రజిత తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగ రాఘవరెడ్డి -
పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య కలకలం
సాక్షి, పెద్దపెల్లి జిల్లా: రాష్ట్రంలో మరో పరువు హత్య కలకలం రేపింది. ఎలిగేడు మండలం ముప్పిరితోటలో తన కూతురిని ప్రేమించాడనే కారణంతో సాయికుమార్ అనే యువకుడిని తండ్రి గొడ్డలితో నరికి చంపాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ముప్పిరతోట గ్రామానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పుట్టినరోజు నాడే సాయికుమార్‌ను ప్రత్యర్థులు మట్టుబెట్టారు. దీంతో సాయికుమార్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని మృతదేహాన్ని ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ సుబ్బారెడ్డి పరిశీలించారు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పరారీలో ఉన్న అమ్మాయి తండ్రి కోసం పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. -
సింగరేణిలో మోగనున్న సమ్మె సైరన్
● బొగ్గుగనుల ప్రైవేటీకరణ, లేబర్ కోడ్ల రద్దు కోసం ● మే 20న టోకెన్ సమ్మెకు జాతీయ సంఘాలు సైగోదావరిఖని(రామగుండం): సింగరేణిలో సమ్మైసెరన్ మోగనుంది. ప్రభుత్వ రంగ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఒక్క రోజు సమ్మెకు జాతీయ సంఘాలు సై అంటున్నాయి. మే 20న ఒక్కరోజు టోకెన్ సమ్మె విజ యవంతం చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. జాతీయ సంఘాల పిలుపు మేరకు.. కేంద్రప్రభుత్వం బొగ్గు గనుల్లో కార్మిక చట్టాలను రద్దు చేసి, లేబర్ కోడ్లను ప్రవేశపెట్టింది. దీనిద్వారా కార్మికులకు తీరని అన్యాయం జరుగుతోందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. బొగ్గు వెలికితీత పనులు పూర్తిగా పర్మినెంట్ కార్మికులతో చేయించాలని కోరుతున్నాయి. జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు టోకెన్ సమ్మె చేపట్టాలని, దీనికి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు సింగరేణి కార్మికులు పూర్తి స్థాయి మద్దతు పలికి విజయవంతం చేయాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. కోల్‌బ్లాక్‌ల వేలంలో సత్తుపల్లి ఓసీపీని ప్రైవేట్ సంస్థకు అప్పగించగా ఓసీపీ ఓబీ మట్టిపోయడానికి స్థలం లేదని, సింగరేణి సంస్థ అప్పగించవద్దని, తాడిచర్ల– 2, వెంకటాపూర్ గనులు సింగరేణికే అప్పగించి భవిష్యత్‌కు భరోసా ఇవ్వాలని సంఘాలు కోరుతున్నాయి. ప్రధాన డిమాండ్లు ఇవే.. ● రద్దు చేసిన కార్మిక చట్టాలను తిరిగి కొనసాగించాలి. కోడ్ల విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి. ● ఇది చట్టవిరుద్ధమైన కోల్ ఆపరేషన్ ప్రైవేట్వారితో తీయించడం మానుకోవాలి. ● సత్తుపల్లి ఓసీపీ ప్రైవేట్ సంస్థ ఓబీని సింగరేణి భూమిలో పోయడానికి అవకాశం ఇవ్వొద్దు ● తాడిచర్ల–2, వెంకటాపూర్ గనులను సింగరేణికే ఇవ్వాలి. ● సింగరేణికి రావాల్సిన రూ.40వేల కోట్ల బకాయిలు ప్రభుత్వం చెల్లించి సంస్థను ఆదుకోవాలి. ● సంస్థలో నూతన గనులు ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. -
సమాజ సేవలో ముందుండాలి
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): సమాజ సేవలో యువత ముందుండాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్లో బోస్ ఫెలోషిప్ వలంటీర్లు చేపట్టిన యంగ్ ఓరిటర్ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతీ విద్యార్థికి కనీస అభ్యసన సామర్థ్యాలు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొంతమేర తల్లిదండ్రులు పిల్లల చదువులపై అధికంగా శ్రద్ధ పెట్టలేకపోవచ్చని, దీంతో విద్యార్థులు వెనుకంజలో ఉండకుండా సంబంధిత గ్రామాల యువత ముందుకు వచ్చి సదరు విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు స్వచ్ఛందంగా పనిచేయాలన్నారు. బోస్ ఫెలోషిప్ కార్యక్రమం కింద 8నెలల పాటు వలంటీర్లుగా పనిచేస్తున్న డిగ్రీ కళాశాలల విద్యార్థులు జిల్లాలో ఎంపిక చేసిన 30 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక తరగతి విద్యార్థులకు వివిధ ఆక్టీవిటిస్ ద్వారా విద్యాభోధన చేయడంపై అభినందించారు. డిగ్రీ చదివే విద్యార్థులు నాయకత్వ లక్షణాలను పెంచుకొని దేశానికి ఉపయోగపడే కార్యక్రమాలను కొనసాగించాలని సూచించారు. అనంతరం విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అలరించాయి. జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి, డాక్టర్ పీఎం షేక్, బోస్ ఫెలోషిప్ వలంటీర్లు పాల్గొన్నారు. ● కలెక్టర్ కోయ శ్రీహర్ష -
ఓదెల మల్లన్న ఆదాయం రూ.33.59లక్షలు
ఓదెల(పెద్దపల్లి): ఓదెల మల్లికార్జునస్వామి ఆలయ హుండీని గురువారం లెక్కించారు. రూ33,59,130 నగదు, 40.9గ్రాముల మి శ్రమ బంగారం, 7.2కిలోల మిశ్రమ వెండి సమకూరినట్లు పర్యవేక్షణాధికారి శ్రీనివాస్ తెలిపారు. బ్యాంకుసిబ్బంది, పోలీసులు, రా జరాజేశ్వర సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు. బ్రెడ్ ప్యాకెట్లపై తయారీ తేదీలుకోల్సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని బేకరీలు, స్వీట్హౌజుల్లో నాణ్యతా లోపంతో ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయిస్తున్నారని ఈనెల 21న ‘తింటే బేజారే..’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీంతో సంబంధిత అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టి జరిమానా విధిస్తుండడంతో వ్యాపారుల్లో కూడా మార్పు మొదలయింది. గోదావరిఖని మార్కండేయ కాలనీకి చెందిన ఓ సంస్థ తయారు చేస్తున్న బ్రెడ్‌పై లైసెన్స్ నంబర్‌తోపాటు తయారు చేసిన తేదీ, ఎకై ్స్పరీ డేట్, ధర, బరువు తదితర వివరాలను ముద్రించి విక్రయిస్తోంది. ఈసందర్భంగా వ్యాపారుల్లో మార్పు వచ్చేలా చొరవ తీసుకున్న ‘సాక్షి’ని పలువురు అభినందిస్తున్నారు. తినుబండరాలను విక్రయిస్తున్న వ్యాపారస్తులు తప్పనిసరిగా బాధ్యతతో ఉండాలని కోరుతున్నారు. మతసామరస్యానికి ప్రతీక రంజాన్ సుల్తానాబాద్(పెద్దపల్లి): మతసామరస్యానికి ప్రతీక రంజాన్ అని అదనపు కలెక్టర్ దాసరి వేణు అన్నారు. గురువారం రాత్రి సుల్తానాబాద్ పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. తహసీల్దార్ రాంచందర్‌రావు, జిల్లా గ్రాంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్, ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, మున్సిపల్ కమిషనర్ మహ్మద్నియాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు అక్బర్అలీ పాల్గొన్నారు. విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేయండి● అసెంబ్లీలో రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ గోదావరిఖని(రామగుండం): రామగుండంలో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేయాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ కోరారు. గురువారం అసెంబ్లీ సమావేశాల చివరి రోజు సభలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ సారథ్యంలో 62 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను రామగుండంలో నిర్మించిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పి బీఆర్ఎస్ యాదాద్రికి తరలించిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నుంచే రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు ఈప్రాంతాన్ని సందర్శించిన సమయంలో దీనికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని, ఈక్రమంలో వెంటనే ప్లాంట్ ఏర్పాటుకు తగిన సన్నాహాలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ఇచ్చిన మాట ప్రకారం విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్స్‌ను రెగ్యులర్ చేయాలని కోరారు. -
కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే..
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో పాటు కార్మిక ప్రయోజనాలే లక్ష్యంగా సమ్మె చేపడతాం. దీనికి అన్ని కార్మిక సంఘాలు మద్దతివ్వాలి. కలివచ్చే అన్ని సంఘాలతో ఒక్కరోజు టోకన్ సమ్మెను విజయవంతం చేస్తాం. కేంద్రం తీరుతో సింగరేణి పెద్దమొత్తంలో నష్టపోయింది. భవిష్యత్ తరాలకు భరోసా ఇచ్చేలా పోరాటాలకు సన్నద్ధం అవుతున్నాం. – సీతారామయ్య, ఏఐటీయూసీ అధ్యక్షుడు లేబర్ కోడ్లు రద్దు చేయాలి కార్మిక చట్టాలను మార్పుచేయాలి. లేబర్ కోడ్లనే వెంటనే రద్దు చేయాలి. ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని కేంద్రం ఆలోచన. దీన్ని అడ్డుకోవాలని సమ్మెకు పిలుపునిచ్చాం. బొగ్గు గనుల ప్రైవేటీకరణ మానుకోవాలి. ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న సింగరేణిని కాపాడుకో వాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. సంస్థకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలి. – తుమ్మల రాజారెడ్డి, సీఐటీయూ అధ్యక్షుడు విజయవంతం చేయాలి ఒక్కరోజు సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలి. కార్మిక చట్టాలు రద్దు చేసి, లేబర్ కోడ్లు అమలు చేయడం వల్ల కార్మికులకు తీరని నష్టం కలుగుతుంది. అలాగే బొగ్గు గనులను ప్రైవేట్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కొత్తబ్లాక్లు సింగరేణికే అప్పగించాలి. – రియాజ్‌అహ్మద్, హెచ్ఎంఎస్ అధ్యక్షుడు -
ఆకతాయిల భరతం పట్టాలి
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని మినీట్యాంకు బండ్ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి సీపీ అంబర్‌కిషోర్ ఝా సమక్షంలో పోలీసు అధికారులు డ్రోన్ కెమెరాతో తనిఖీలు నిర్వహించారు. మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలను బహిరంగప్రదేశాల్లో సేవించే ఆకతాయిల భరతం పట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పట్టణంలోని ప్రధానకూడళ్లు, ఎల్లమ్మచెరువుకట్ట ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. మద్యం దుకాణాలు, వ్యాపారసంస్థల సమయపాలన తీరు, ఆ సమయంలో బైక్‌లపై వస్తున్న వారి వివరాలు తెలుసుకున్నారు. ఏటీఎం సెంటర్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని సెక్యూరిటీ గార్డులకు సూచించారు. సీసీ కెమెరాల పనితీరు, భద్రతాచర్యలు, నేరాలు ఇతర శాంతిభద్రతల విషయాలను డీసీపీ కరుణాకర్ వివరించారు. ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు లక్ష్మణ్‌రావు మల్లేశ్, పలువురు అధికారులు ఉన్నారు. ● సీపీ అంబర్‌కిషోర్ ఝా -
అంబేడ్కర్, గాంధీని అవమానించిన అమిత్‌షా
కమాన్‌పూర్(మంథని): అంబేడ్కర్, గాంధీని కేంద్ర మంత్రి అమిత్‌షా అవమానిస్తున్నారని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం బై బాపు, బై భీమ్, బై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్, గాంధీ చిత్రపటాలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, రాజ్యాంగా నిర్మాతలను బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్, కేంద్ర మంత్రి అమిత్‌షా అవమానిస్తున్నారని అన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వ కుట్రలను ప్రజలకు తెలియజేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. అనంతరం పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో తొట్ల తిరుపతియాదవ్, వైనాల రాజు, కోలేటి మారుతి, గాండ్ల మోహన్, ఇనగంటి రామారావు, పీట్ల గోపాల్, అంబిర్ శ్రీనివాస్, రంగు సత్యనారాయణ, కుక్క రవి తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యన్ని కాపాడటమే లక్ష్యం ముత్తారం(మంథణి): ప్రజాస్వామ్యన్ని కాపాడడమే లక్ష్యంగా, రాజ్యాంగం ప్రఖ్యాతి తెలిసేలా గ్రామాల్లో కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి పేర్కొన్నారు. గురువారం ముత్తారంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాహుల్‌గాంధీ పిలుపు మేరకు గ్రామాల్లో ప్రతీ కార్యకర్త రాజ్యాంగ ఆవశ్యకతను వివరిస్తూ పాదయాత్రలు చేయలన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతిజ్ఞ చేయించారు. కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చోప్పరి సదానందం తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం శుభ్రతకు ప్యాడీక్లీనర్లు
పెద్దపల్లిరూరల్: రైతులు పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు అమ్ముకునేందుకు పడుతున్న అవస్థలను దూరం చేసేందుకు వీలుగా ఆధునిక సాంకేతికతతో కూడిన శ్రీప్యాడీక్లీనర్లుశ్రీ అందుబాటులోకి వచ్చాయి. ఈ యంత్ర వినియోగం వల్ల రైతుకు కొంతమేర శ్రమ తప్పుతుంది. ధాన్యాన్ని ఎత్తి ప్యాడీ క్లీనర్‌లో పోసే పని ఉండదు. కింది భాగంలో ఉన్న ప్లేటు వద్దకు ధాన్యాన్ని లాగితే చాలు. యంత్రమే మిగతా పని పూర్తి చేసి నాణ్యమైన ధాన్యాన్ని కుప్పగా పోసేస్తుంది. అంటే రైతుకు కొంత పనిభారం తప్పనుండగా సమయం కూడా ఆదా అవుతుంది. కలెక్టర్ చొరవతో.. జిల్లాలో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్ల కోసం ఏటా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో రైతులు ధాన్యాన్ని ఎత్తి పోస్తేనే నాణ్యమైన ధాన్యం బయటకు వస్తుంది. జిల్లా వ్యాప్తంగా ప్రతి సీజన్లో పలు కేంద్రాల నుంచి 10వేల క్వింటాళ్లకు పైగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. అలాంటి కేంద్రాలను గుర్తించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు జిల్లా వ్యాప్తంగా 154 కేంద్రాలు ఉన్నట్టు తేలడంతో 154 యంత్రాలను తెప్పించారు. ఈ యంత్రాల వినియోగంతో ధాన్యం తూర్పారపట్టడం కొంత సులువుగా ఉంటుంది. ఆధునిక సాంకేతికతతో అందుబాటులోకి.. రైతులకు కొంతమేర తప్పనున్న పని భారం జిల్లాలో.. వరి సాగువిస్తీర్ణం : 1,98,201ధాన్యం దిగుబడి అంచనా 4.37లక్షల మెట్రిక్టన్నులుసన్నరకం 1.79 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డురకం 2.58 లక్షల మెట్రిక్ టన్నులుకొనుగోలు కేంద్రాలు: 334ప్యాడీక్లీనర్లు: 500ఆధునికసాంకేతికతో కూడినవి: 154ఈ ఫొటోలో ఉన్నది రైతులు పండించిన వరి ధాన్యంలో రాళ్లు, మట్టిపెల్లలు, తాలులాంటివి తీసి శుభ్రమైన ధాన్యాన్ని రాశిగా పోసే ఆధునిక ప్యాడీక్లీనర్. ఈ యంత్రానికి కింది భాగంలో అమర్చిన ప్లేటు వద్దకు రైతు ధాన్యాన్ని పారతో లాగితే చాలు.. యంత్రమే ధాన్యాన్ని సేకరించి తూర్పార పట్టి మరో వైపు రాశిగా పోసేస్తుంది. -
ఇక సన్నబియ్యమే
ఉమ్మడి జిల్లాలో రేషన్కార్డులుసాక్షిప్రతినిధి,కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న సన్నబియ్యం పంపిణీకి రంగం సిద్ధమైంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాల్లో ఇప్పటికే రేషన్‌షాపులకు సన్నబియ్యం వచ్చేశాయి. వీటిని ఉగాది రోజు నుంచే పంపిణీ చేయనున్నారు. కార్డులో ఉన్న ప్రతీవ్యక్తికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ జరగనుంది. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో దాదాపు 80 శాతం జనాభాకు తెల్లరేషన్‌కార్డులు (ఫుడ్ సెక్యూరిటీ కార్డులు) ఉన్నాయి. వీరందరికీ సన్నబియ్యం అందనున్నాయి. గతంలోనూ ఇవే కార్డుల మీద ప్రభుత్వం రేషన్‌షాపుల ద్వారా ఉచిత బియ్యం పంపిణీ చేసింది. కానీ... వాటిని లబ్ధిదారులు పూర్తిస్థాయిలో వినియోగించుకోలేదు. బియ్యం దొడ్డుగా ఉన్న కారణంతో వాటిని హోటళ్లు, వ్యాపారులకు విక్రయించేవారు. ఇవే బియ్యాన్ని సదరు వ్యాపారులు పాలిష్ చేసి సన్నబియ్యంగా మార్చి అమ్ముకునేవారు. ఇకపై బియ్యాన్ని లబ్ధిదారులే వినియోగించుకునేలా.. పకడ్బందీగా సన్నబియ్యం పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పంతో ఉంది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమక్కుమార్ రెడ్డి జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా ఉండటంతో అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రేషన్ కార్డులందని, డిలీట్ అయిన వారి కష్టాలు.. కొందరు లబ్ధిదారులకు ఇంకా రేషన్‌కార్డులు అందలేదు. వీరంతా గతేడాది ప్రజాపాలన, మీసేవా, ప్రజావాణి, ఇటీవల మరోసారి ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్నారు. కొత్తగా పెళ్లైన జంట లు తమ పేర్లను కుటుంబాల నుంచి డిలీట్ చేసుకుని, కొత్త వాటికి దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా అర్హులైనా.. ఇంతవరకు రేషన్‌కార్డులు అందలేదు. అయితే దరఖాస్తు చేసుకున్న అర్హులకు ఏప్రిల్‌లో అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే, జనవరి 26 సందర్భంగా నిర్వహించిన ఆరుగ్యారెంటీల అమలు కోసం పైలెట్ ప్రాజెక్టు కింద కొందరు లబ్ధిదారులను అధికారులు రేషన్ జాబి తాలో ఎంపిక చేశారు. వీరికి నెలానెలా సరుకులు వస్తాయనుకున్నా.. నేటికీ ఎలాంటి సరుకులు అందడం లేదు. ఉగాది నుంచైనా కార్డులు పనిచేస్తాయా? లేదా? అన్న సందిగ్ధంలో లబ్ధిదారులు ఉన్నారు. బియ్యం దందా బంద్అయ్యేనా? ఇంతకాలం రేషన్ బియ్యాన్ని కొని మహారాష్ట్రతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో విక్రయించే వారికి జిల్లాలో విస్తృత నెట్‌వర్క్‌ఉంది. ఉమ్మడి జిల్లాలోని ప్రతీ గ్రామం, పట్టణాలలో ఇంటింటికీ మోపడ్ బండ్లపై తిరుగుతూ రేషన్‌బియ్యం సేకరించే వారికి ఇకపై మునపటి స్థాయిలో దందా నడవకపోవచ్చు. గోదావరిఖని, మంథని మీదుగా గోదావరి దాటి మహారాష్ట్రలోకి బియ్యం పంపే వీరు అక్కడ వాటిని ప్రాసెస్, పాలిష్ చేసి కేజీ రూ.50 చొప్పున విక్రయిస్తారు. రెండేళ్ల క్రితం కరీంనగర్ నుంచే రైల్వే వ్యాగన్లలో రేషన్ బియ్యం ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేశారంటే వీరి దందా ఏస్థాయిలో నడిచేదో అర్థం చేసుకోవచ్చు. సన్నబియ్యం సరఫరా నేపథ్యంలో వీరి దందా బంద్ అయ్యేనా? లేక రూట్ మారుస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఉగాది నుంచి పంపిణీకి అధికారుల ఏర్పాట్లు ఉమ్మడి జిల్లాలో 80 శాతం మంది ప్రజలకు ఉపయుక్తం దొడ్డుబియ్యం దందాకు శాశ్వత పరిష్కారం పేర్లు డిలీట్ అయిన వారికి ఇంకా అందని కార్డులు ప్రజాపాలన రేషన్జాబితాలో పేర్లు వచ్చినా అందని సరుకులు -
డెత్‌లైన్ బెట్టింగ్!
గురువారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2025ఒంటరి గువ్వలుఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామానికి చెందిన బండి స్వామి(28) ఆటో నడపడంతోపాటు ఎల్లారెడ్డిపేటలో పాల డెయిరీ పెట్టుకున్నాడు. ఈక్రమంలో ఏర్పడ్డ పరిచయాలతో ఆన్లైన్ బెట్టింగ్‌లో రూ.18లక్షలు పోగొట్టుకున్నాడు. నిండా మునగడంతో పాలడెయిరీ, ఆటోలను సైతం అమ్మేశాడు. అయినా అప్పులు తీరకపోవడంతో మనోవేదనకు గురై 2024 నవంబర్ 11న పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయాడు. స్వామి మృతితో భార్య స్వప్న, ఇద్దరు పిల్లలు సాద్విన్, వర్షిత ఒంటరివారయ్యారు. స్వప్న ప్రస్తుతం బీడీలు చుడుతుండగా.. వారికి ఆసరాగా స్వామి తండ్రి లక్ష్మీనారాయణ మిర్చీ బండి పెట్టుకొని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.బలైన విద్యార్థితిమ్మాపూర్ మండలం మన్నెంపల్లికి చెందిన సిరికొండ నిఖిల్‌రావు(22)హైదరాబాదులో అగ్రికల్చర్ బీఎస్సీ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఆన్లైన్ గేమ్స్ ఆడి భారీ ఎత్తున డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో మనస్తాపం చెంది 10 రోజుల క్రితం గ్రామంలోని ఓ వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాగా చదువుకొని కుటుంబానికి ఆసరాగా ఉంటాడునుకున్న కొడుకు ఆన్లైన్ బెట్టింగ్‌కు బలికావడంతో ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. ●బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు పెడితే నిమిషాల్లోనే ఐదింతలు..పదింతలు అవుతాయనే ప్రకటనలు.. ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తే క్షణాల్లోనే మీ జీవితాలు మారుతాయనే యాడ్స్.. యువతను ఆకర్షిస్తున్నాయి. చదువుకునే విద్యార్థులు.. అప్పుడప్పుడే జీవితాల్లో స్థిరపడుతున్న యువత.. పిల్లాపాపలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న మధ్యవయసు వారు.. అందరూ బాధితులే. కష్టపడి సంపాదించిన సొమ్మును బెట్టింగ్ యాప్‌లు, ఆన్లైన్ ట్రేడింగ్‌లు, ఐపీఎల్ బెట్టింగ్‌లలో పెడుతూ నిండా మునుగుతున్నారు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి బయటకు రాలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాదిలో దాదాపు 10 మంది వరకు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల రాష్ట్రంలో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు.. ఇన్ఫ్లుయన్సర్లు.. బుల్లితెర..వెండితెర నటీనటులపై కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బెట్టింగ్‌యాప్‌లు, ఆన్లైన్ ట్రేడింగ్ బాధిత కుటుంబాల పరిస్థితిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – సాక్షి,పెద్దపల్లి/కరీంనగర్ టౌన్/ఎల్లారెడ్డిపేట/తిమ్మాపూర్/శంకరపట్నంఈజీమనీ వల.. జీవితాలు విలవిల●● అప్పుల ఊబిలోకి లాగుతున్న అత్యాశ ● మనీ సంపాదించవచ్చనే ప్రకటనలకు ఆకర్షణ ● బెట్టింగ్‌యాప్‌లు, ఆన్లైన్ ట్రేడింగ్‌లలో పెట్టుబడులు ● నిండా మునిగాక బయటకు రాలేకపోతున్న యువత ● ప్రాణాలు తీసుకుంటున్న వైనం ● రోడ్డున పడుతున్న కుటుంబాలుసిటీలకే పరిమితమైన బుకీలు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ బెట్టింగ్ దందా సాగిస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో స్థానికంగా ఉండే వారిని ఏజెంట్లగా నియమించుకుంటున్నారు. వీరు బెట్టింగ్‌లకు పాల్పడే వారిని గుర్తించి ఫోన్ నంబర్లతో టెలిగ్రామ్ గ్రూపు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా చేసినందుకు ఏజెంట్లకు కమీషన్ల రూపంలో భారీగానే ముట్టజెప్పుతున్నారు. బెట్టింగ్‌లకు పాల్పడేవారు ఇతరులకు అర్థంకాకుండా కోడ్ భాషలు ఉపయోగిస్తున్నారు. కోడ్ల ప్రకారం బెట్టింగ్‌లు పెడుతున్నారు. గతేడాది ఐపీఎల్ సీజన్ పూర్తయ్యాక వచ్చిన డబ్బులతో గోదావరిఖనికి చెందిన బెట్టింగ్ నిర్వాహకులు పోలీసులకు చిక్కడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసులు నమోదైతే చిక్కులు తప్పవు గతంలో బెట్టింగ్‌లో పట్టుబడితే వారిపై పెట్టి కేసులు నమోదు చేసేవారు. ప్రస్తుతం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. పోలీసుల రికార్డులో పేరు, చిరునామా, ఎలాంటి నేరానికి పాల్పడ్డారు అనే వివరాలు ఉంటున్నాయి. ఒక్కసారి కేసు నమోదైతే ప్రభుత్వ ఉద్యోగం లేదా విదేశాలకు వెళ్లాల్సి వస్తే ఇబ్బందులు తప్పవు. ప్రైవేటు కంపెనీలు సైతం ఉద్యోగావకాశాలు ఇవ్వవు. ఇలా గుర్తించండి బెట్టింగ్‌యాప్ బాధితులు ఎక్కువగా స్నేహితులు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటారని పలు సర్వేలు తెలుపుతున్నాయి. ఎక్కువ సమయం ఫోన్లో లీనం కావడం, తెలిసిన వారు, స్నేహితుల వద్ద అప్పులు చేయడం, ఇంట్లో వారికి తెలియకుండానే డబ్బులు తీసుకెళ్లడం వంటివి చేస్తుంటారు. ఇలా ఫిర్యాదు చేయండి తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్ నిషేధం. బెట్టింగ్‌కు పాల్పడిన, ప్రోత్సహించినా, సహకరించినా చట్టరీత్యా చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బెట్టింగ్‌పై ఆన్లైన్లో www. cybercrime. gov. in వెబ్సైట్లో ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండా టోల్‌ఫ్రీ నంబర్ 1930లోనూ కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. పెద్దపల్లి జిల్లాలో కొన్ని సంఘటనలు ● 2025 మార్చి 21న మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన సాయితేజ ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడటంతో రూ.6లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. ఇంట్లో విషయం తెలియడంతో మళ్లీ బెట్టింగ్‌ల జోలికి వెళ్లనని హామీ ఇవ్వగా నమ్మిన కుటుంబసభ్యులు అప్పులు తీర్చారు. తిరిగి సాయితేజ బెట్టింగ్‌లకు పాల్పడి రూ.4లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ● 2024 జూలై 4న సుల్తానాబాద్‌లో రాత్రి వేళ వాహనాలు తనిఖీ చేస్తుండగా.. రూ.33.10 లక్షల నగదుతో బెట్టింగ్ యాప్ నిర్వాహకులు పట్టుబడ్డారు. దీంతో ముగ్గురిపై కేసు నమోదు చేసి, ఐదు ఫోన్లు సీజ్ చేశారు. ● సుల్తానాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఒకరు క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడి సుమారు రూ.5లక్షల వరకు నష్టపోయాడు. అవి తీర్చేందుకు లోన్‌యాప్స్‌లో అప్పులు చేశాడు. తల్లిదండ్రులకు తెలిసి మందలించడంతో మళ్లీ అటువైపు వెళ్లలేదు. ఐపీఎల్ పేరుతో ప్రతీ ఇంటిలోకి తొంగిచూస్తున్న బెట్టింగ్ భూతం బారినపడకుండా కుటుంబసభ్యులే రక్షించాల్సిన అవసరం ఉంది. న్యూస్‌రీల్ -
ఇదే చివరి తడి..!
● 18 టీఎంసీలకు పడిపోయిన ఎస్సారెస్పీ నీటి నిల్వలు ● ఏప్రిల్ 2 వరకే చివరి నీటి తడంటూ అధికారుల ప్రకటన ● ‘యాసంగి’పై ఉమ్మడి జిల్లా రైతుల ఆందోళనఉమ్మడి జిల్లాలో 7 లక్షల ఎకరాల ఆయకట్టు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎస్సారెస్పీ కింద దాదాపు ఏడు లక్షల ఎకరాల వరకు ఆయకట్టు ఉంది. ఈ యాసంగిలో వరి ఎక్కువగా సాగు చేశారు. పంట పొట్టదశలో ఉంది. ఇప్పుడు సాగునీరు అందకపోతే కష్టం. ఎస్సారెస్పీ నుంచి మరో 8 టీఎంసీలు మాత్రమే విడుదల చేసే అవకాశముంది. దీంతో రైతులు వ్యవసాయ బావులపైనే ఆధారపడి ఉన్న పంటలను కాపాడుకోవాల్సిన పరిస్థితి.ఎందుకీ సమస్య? ఈ ఏడాది ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నీటితో నిండింది. ఓ ప్రణాళికంటూ లేకుండా ఇష్టారీతిన నీటిని వాడటంతో చి‘వరి’కి సాగునీటి గండం ఏర్పడుతోంది. ప్రజాప్రతినిధులు చెప్పారని వానాకాలం, ఎండాకాలం తేడా లేకుండా ఎస్సారెస్పీ అధికారులు నీరు విడుదల చేశారు. ఎస్సారెస్పీ కాలువలకు ఇష్టారీతిన తూములు ఏర్పాటు చేసి, సాగునీటిని చెరువులకు మళ్లిస్తున్నారు. దీంతో చివరి ఆయకట్టుకు నీటి విడుదల సరిగ్గా కాకపోవడంతో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. జగిత్యాల అగ్రికల్చర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా సాగునీటికి వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గుతోంది. బుధవారం నాటికి 18.833 టీఎంసీలకు పడిపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎస్సారెస్పీ జోన్–2 ఆయకట్టు(ఎల్ఎండీ ఎగువ భాగం)కు డీ–54 నుంచి డీ–94 వరకు ఏప్రిల్ 2వ తేదీ వరకు, జోన్–1 ఆయకట్టు(డీ–5 నుంచి డీ–53 వరకు)కు ఏప్రిల్ 9వరకు మాత్రమే చివరి సాగు నీటితడి అందిస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు బుధవారం ప్రకటించారు. దీంతో యాసంగి పంట సాగుపై ఉమ్మడి జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఎవరూ వాటి జోలికి పోవద్దు
ఎవరూ కూడా ఆన్లైన్ బెట్టింగ్ జోలికి పోవద్దు. అవన్నీ మోసపూరితమైనవే. ఆన్లైన్ ఊబిలోకి కూరుకుపోయిన వారు ఎవరూ బాగుపడలేదు. నా భర్త తెలియక డబ్బులు పెట్టి నిండా మునిగాడు. చివరికి ప్రాణాలు సైతం తీసుకున్నాడు. మేము ఒంటరివారమయ్యాం. ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మాలాంటి బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. – బండి స్వప్న, సింగారం తల్లిదండ్రులు నిఘా పెట్టాలి ఐపీఎల్ బెట్టింగ్‌పై నిఘా ఉంచాం. అన్ని పోలీస్స్టేషన్లలో అప్రమత్తం చేశాం. తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారు అనే విషయాలపై నిఘా పెట్టాలి. బెట్టింగ్‌లతో జీవితాలు ఛిన్నాభిన్నం అవుతాయి. కేసులు నమోదైతే భవిష్యత్‌లో ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరూ వాటి జోలికి వెళ్లకూడదు. – కరుణాకర్, డీసీపీ పెద్దపల్లి మానసిక ఒత్తిడితోనే ఈజీగా డబ్బు సంపాదించాలే ఆశతో యువత బెట్టింగ్ ప్రారంభిస్తారు. మొదట డబ్బులు వస్తుంటే ఆశతో ముందుకెళ్తారు. ఆ తర్వాత నష్టపోతుంటే అప్పులు భారంగా మారి అసాధారణమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. ఆర్థిక నష్టాలు వ్యక్తిగత జీవితం, కుటుంబ సంబంధాలపై ప్రభావం చూ పుతాయి. ఈ ఒత్తిళ్లు వారికి అదనపు భయం, ఒంటరితనంతో ఆత్మహత్య ఆలోచనలు కలుగుతాయి. ఇలాంటి వారిని గుర్తించి వారు ఒత్తిడిని జయించాలంటే కుటుంబ సభ్యులు, స్నేహితులు సమర్థవంతమైన మద్దతు ఇవ్వాలి. మానసిక వైద్యులతో కౌన్సెలింగ్ ఇప్పించాలి. – ప్రీతి, సైకియాట్రిస్టు -
వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
● అదనపు కలెక్టర్ అరుణశ్రీ సుల్తానాబాద్(పెద్దపల్లి): జిల్లావాసులు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అ రుణశ్రీ సూచించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో ఎండల తీవ్రత, సీజనల్ వ్యాధుల నియంత్రణ తదితర అంశాలపై బుధవారం సమీక్షించారు. అత్యధిక ఉష్ణోగ్రతల నమోదు లో జిల్లా మూడోస్థానంలో ఉందని, ఈ నేపథ్యంలో ప్రజలు వడగాల్పుల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధిహామీ పనివేళలు మార్చాలని, ఆశ కార్యకర్తల నుంచి జిల్లా అధికారుల వరకు ప్రతీఒక్కరి వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకో వాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు, హమాలీలు, సిబ్బందికి వడదెబ్బ తగలకుండా టెంట్, తాగునీటి సౌక ర్యం కల్పించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి అన్న ప్రసన్న కుమారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళిందిని, సంక్షేమ అధికారి వేణుగోపాల్‌రావు పాల్గొన్నారు. -
నిర్వాసితులకు నగదు చెల్లింపులు
● కలెక్టర్ కోయ శ్రీహర్ష ముత్తారం(మంథని): జాయతీ రహదారి కోసం భూములిచ్చిన నిర్వాసితులకు నగదు చెల్లింపులకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కొయ శ్రీహర్ష తెలిపారు. ధర్యపూర్లోని పదో తరగతి పరీక్ష కేంద్రం, స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన బుధవారం తనిఖీచేశారు. బోర్లు, వ్యవసాయ బావులు, చెట్లు, ఇతర కట్టడాలకు పరిహారం అంది స్తామని, ఇందుకు అవసరమైన నిధుల కోసం జా తీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్‌కు త్వరగా ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. ఎంపీడీవో సురేశ్, ఎంపీవో గోవర్ధన్, ప్రిన్సిపాల్ సంతోష్, మాజీ జెడ్పీటీసీ చోప్పరి సదానందం ఉన్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాలి కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ప్రభుత్వ భూముల ఆక్రమణను అరికట్టి, వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. పాండవులగుట్ట భూములను ఆయన పరిశీలించా రు. ప్రభుత్వ భూములకు బోర్డులు, హద్దులు ఏర్పా టు చేయలని తహసీల్దార్ జగదీశ్వర్‌రావును ఆదేశించారు. కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ శంకర్, రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు పాల్గొన్నారు. యువతకు ఉచిత శిక్షణ సుల్తానాబాద్‌రూరల్: ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి హాజరయ్యే యువతకు ఉచిత శిక్షణ ఇస్తామని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ఇందుకోసం సెంటినరీకాలనీలోని రాణీరుద్రమదేవి స్టేడియంలో దేహదారుఢ్య, మెడికల్, రాత పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి ఉచితంగా శిక్షణ ఇస్తామని ఆయన పేర్కొన్నారు. 17–21 ఏళ్ల మధ్య వయసుగలవారు నేరుగా స్టేడియంలోకి హాజరు కావాలన్నారు. విధులను పకడ్బందీగా నిర్వహించాలి మంథని: అఽధికారులు తమ విధులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. రెవెన్యూ డివిజన్ అఽధికారి, పురపాలక సంఘ భవనం పనులను ఆయన పరిశీలించారు. నిర్దిష్ట సమయంలో పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో సురేశ్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, ఇన్చార్జి తహసీల్దార్ గిరి ఉన్నారు. -
చెట్టంత కొడుకు పోయాడు
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక గ్రామానికి చెందిన భూస కార్తీక్ అనే యువకుడు రెండు నెలల క్రితం గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన భూస శంకరయ్య–స్వరూప దంపతులకు కార్తీక్ ఒక్కగానొక కొడుకు. పెరిగిపెద్దయి అండగా ఉంటా నుకున్న కొడుకు రూ. 6 లక్షలు బెట్టింగ్‌లో పోగొట్టాడు. మనోవేదనతో జమ్మికుంట రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్‌కు బానిసైన కొడుకు చనిపోయాడని.. చదువుకొని ఉద్యోగం చేస్తాడని ఆశపడితే కడుపుకోతే మిగిలిందని తల్లిండ్రులు బోరుమన్నారు. -
నాలుగు ఇళ్లలో చోరీ
మానకొండూర్: అన్నారం గ్రామంలో మంగళవారం రాత్రి నాలుగిళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంటి తాళాలు పగలగొట్టి బంగారు, వెండి, ఓ ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లారు. మానకొండూర్ సీఐ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం.. గొట్టెముక్కుల విజయ ఇంట్లో నిద్రిస్తుండగా.. బంగారు పుస్తెల తాడు అపహరించారు. మధునాల వెంకటమ్మ ఇంట్లో 55 తులాల వెండి, రూ.20వేల నగదు, రుద్రోజు వెంకటాచారి ముప్పావు తులం బంగారం, 18 తులాల వెండి పట్టీలు, పాకాల రాజిరెడ్డి ఇంటి ఎదుట ఉన్న స్కూటీని ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ, క్లూస్ టీం పోలీసులు పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మిర్చి యార్డులో.. తిమ్మాపూర్: మండల కేంద్రంలోని మిర్చియార్డ్‌లో చోరీ జరిగింది. సుమారు రూ.80 వేలు దొంగిలించారని యజమాని శ్రీనివాస్, అంజయ్య తెలిపారు. ఇద్దరు దొంగలు రాత్రివేళ చోరీకిపాల్పడినట్టు సీసీ కెమెరాలో రికార్డు అయింది. యజమాని శ్రీనివాస్, ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదుతో ఎల్ఎండీ ఎస్ఐ వివేక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం క్లూస్‌టీంకు సమాచారం అందించగా సీఐతో సిబ్బంది సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పలు ఆధారాలను సేకరించి విచారణ చేపడతామని తెలిపారు. -
పుట్టెడు దుఃఖంతో ‘పది’ పరీక్షకు..
సప్తగిరికాలనీ: ఓ వైపు పదో తరగతి పరీక్షలు.. మరోవైపు తల్లి హఠాన్మరణంతో ఆ విద్యార్థి తల్లిడిల్లిపోయాడు. బాధతప్త హృదయంతో పదో పరీక్షకు హాజరయ్యాడు. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికి చెందిన అమరం జనార్దన్‌రెడ్డి – మౌనిక దంపతుల కుమారుడు అమన్రెడ్డి కరీంనగర్ మంకమ్మతోటలోని సాయి మానేరు పాఠశాలలో పదో తరగతి చదివాడు. పిల్లల చదువు నిమిత్తం కరీంనగర్ మంకమ్మతోటలోనే నివాసముంటున్నారు. తండ్రి నిమ్మపల్లి ఐకేపీ సెంటర్లో సీసీగా పనిచేస్తున్నాడు. సోమవారం తల్లి లత గుండెపోటుతో మృతిచెందగా మంగళవారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఓ పక్క తల్లిని కోల్పోయిన అమన్ రెడ్డి బుధవారం కరీంనగర్ జ్యోతినగర్‌లోని సెయింట్ ఆల్ఫోన్స్ పరీక్షా కేంద్రంలో పరీక్షకు హాజరయ్యాడు. అమన్ రెడ్డిని బుధవారం ఉదయం పరీక్ష కేంద్రం వద్ద మానేరు విద్యాసంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డి ఓదార్చారు. అమన్ రెడ్డిని ఉపాధ్యాయులు ముకుందం, సుధాకర్ రెడ్డి, సిలివేరి మహేందర్, శ్రీనివాస్, కుమారస్వామి, తోటి విద్యార్థులు, స్నేహితులు ధైర్యం చెప్పారు. ఉన్నత స్థాయిలో రాణిస్తా మా అమ్మ ఎప్పుడు నన్ను ఉన్నతస్థాయిలో రాణించాలని చెప్పేది. బాగా చదవాలి. క్రీడల్లోనూ రాణించాలని సూచించేది. నేను జాతీయ జూడో పోటీలకు ఎంపికై నందుకు చాలా సంతోషపడింది. స్పోర్ట్స్‌లో పాల్గొనేలా ఉత్సాహం నింపింది. ఉన్నత స్థానంలో నిలిచి అమ్మకోరిక నెరవేర్చుతా. – అమన్ రెడ్డి -
వనరుల దోపిడీని ఆపాల్సిందే..
పెద్దపల్లిరూరల్: దేశంలోని బడా కార్పొరేట్‌శక్తులకు సహజవనరుల సంపదను దోచుకునేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడుగులు వేస్తోందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి నక్కనారాయణరావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలోని కోట్లాది రూపాయల విలువైన అటవీసంపదను కార్పొరేట్‌శక్తులకు కట్టబెట్టేందుకు బీజేపీ సర్కార్ చేస్తున్న యత్నాలను విరమించుకుని వనరుల దోపిడీని ఆపాల్సిందేనన్నారు. ఆదివాసీలపై అరాచకం.. అటవీ సంపదను దోపిడీ చేసేకుట్రలో భాగంగానే పసిగుడ్డు మొదలు పండుముదుసలి వరకు అందరిపైనా దాడు చేస్తోందని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. మహిళలపై అత్యాచారాలను సాగిస్తోందని ఆరోపించారు. ఆదివాసీల హక్కులను కాపాడి వారికి అండగా ఉండేందుకు అన్నివర్గాల ప్రజలు, దళితులు, మేధావులు రక్షణగా నిలవాలన్నారు. ఈ సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసీల హననాన్ని ఆపేయాలని, మహిళలపై అత్యాచారాలను నిలిపేయాలని, దండకారణ్యంలో పోలీసు క్యాంపులు ఎత్తేయాలని, పర్యావరణాన్ని కాపాడాలని తీర్మానించారు. కరీంనగర్లో ఏప్రిల్ 20న సభ.. ఆదివాసీహక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో ఏప్రిల్ 20న కరీంనగర్లో బహింరగసభ నిర్వహించనున్నట్లు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, నక్క నారాయణరావు ప్రకటించారు. ఈవేదిక కన్వీనర్లుగా ప్రజాసంఘాల నేతలు ముడిమడుగుల మల్లన్న, మర్రి వెంకటస్వామి, తాళ్లపల్లి లక్ష్మణ్, వెంకటమల్లయ్య, రాజమల్లయ్య, రామిళ్ల బాపు, జిన్నంప్రసాద్, లెనిన్, బాలసాని రాజ య్య, దండు అంజన్న, బాపన్న, సతీశ్, సృజన్, టీపీఎఫ్ జిల్లా క న్వీనర్ గుమ్మడి కొమురయ్య, రాజగోపాల్, రత్నకుమార్, విశ్వనాథ్‌కు బాధ్యతలను అప్పగించినటుల పేర్కొన్నారు. నాయకులు సదానందం, శ్రీనివాస్, వెంకన్న, రాజమల్లన్న, బాపన్న, ర వి, రవీందర్, సదానందం, వినోద్, సంపత్ పాల్గొన్నారు. అడవులను కార్పొరేట్లకు అప్పగించేందుకు కేంద్రప్రభుత్వం కుట్ర ఆదివాసీ మహిళలపై అత్యాచారాలను ఆపండి దండకారణ్యంలో పోలీసు క్యాంపులు ఎత్తివేయండి పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ డిమాండ్ కరీంనగర్లో ఏప్రిల్ 20న బహిరంగసభ -
రామగుండంలో రూ.2 కోట్ల మాఫీ
● ఆస్తిపన్నుపై 90 శాతం వడ్డీ మాఫీ ● ఈనెలాఖరు వరకు గడువు ● జీవో జారీచేసిన ప్రభుత్వం కోల్‌సిటీ(రామగుండం): నగరపాలక, పురపాలక సంస్థల్లో ఆస్తిపన్ను బకాయిలదారులకు రాష్ట్ర ప్ర భుత్వం చల్లటి కబురు చెప్పింది. వన్‌టైం సెటిల్మెంట్(ఓటీఎస్)కల్పిస్తూ జీవో నంబర్ 154ను మంగళవారం రాత్రి పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్ జారీచేశారు. ఆస్తిపన్ను బకాయిలపై 90 శాతం వడ్డీమాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగరపాలికల్లో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈనెల 31 వరకు గడువు.. 90శాతం వడ్డీమాఫీ వర్తించేందుకు ఈనెల 31వ తే దీ వరకు గడువు విధించారు. కేవలం ఐదు రోజులే గడువు మిగిలి ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరం వరకు బకాయిపడిన ఆస్తిపన్నుపై 90 శాతం వడ్డీమాఫీ ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. బకాయిలపై కేవలం 10 శాతం వడ్డీ ఒకేసారి చెల్లించేలా వన్టైన్ సెటిల్మెంట్ స్కీమ్(ఓటీఎస్) తీసుకొచ్చారు. పన్ను చెల్లింపుదారులు 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను బకాయిలను వడ్డీతోసహా ఈనెల 31వ తేదీలోపు చెల్లిస్తే 90 శాతం వడ్డీని మినహాయిస్తారు. మిగిలిన 10 శాతం వడ్డీని ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ మినహాయింపు మొత్తాన్ని భవిష్యత్తు చెల్లింపుల్లో సర్దుబాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నాలుగు బల్దియాల్లో.. రామగుండం నగరపాలక సంస్థతోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీల్లో ఓటీఎస్ స్కీం బకాయిదారుల నుంచి స్పందన వచ్చేందుకు మున్సిపల్ కమిషనర్లు దృష్టి పెట్టారు. గడువు తక్కువగా ఉండడంతో నేరుగా బకాయిలదారుల ఇంటికే వెళ్లి ఆస్తిపన్ను చెల్లించేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. రామగుండం బల్దియాలో రూ.2.28 కోట్లు.. రామగుండం నగరపాలక సంస్థలో రూ.15.22 కోట్ల వరకు ఆస్తిపన్ను డిమాండ్ ఉండగా ఈనెల 25వ తేదీ వరకు రూ.9.88కోట్ల వరకు వసూలైంది. ఆస్తిపన్నుపై సుమారు రూ.2.28కోట్ల మేర వడ్డీ ఉండగా, ఓటీఎస్ స్కీం ద్వారా రూ.2.05కోట్ల వరకు మాఫీ కానుంది. సద్వినియోగం చేసుకోవాలి ఆస్తిపన్ను బకాయిలపై ప్రభుత్వం కల్పించిన 90 వడ్డీమాఫీ పథకం బకాయిదారులకు మంచి అవకాశం. గడువు తక్కువగా ఉండడంతో ఫ్లెక్సీలు, మైకులతో విస్తృంగా ప్రచారం చేస్తున్నాం. రెవెన్యూ ఆఫీసర్లు బకాయిదారుల ఇంటికే వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. – అరుణశ్రీ, కమిషనర్(ఎఫ్ఏసీ), రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ -
సన్నబియ్యం పంపిణీకి సన్నద్ధం
● ఉగాది పండుగ నుంచి అందజేసేందుకు నిర్ణయం ● రేషన్ దుకాణాలకు చేరుతున్న బియ్యం ● కార్యాచరణ రూపొందిస్తున్న జిల్లా పౌర సరఫరాల అధికారులు సుల్తానాబాద్(పెద్దపల్లి): జిల్లాలోని తెల్లరేషన్‌కార్డుదారులకు ఉగాది పండుగ నుంచి సన్నబియ్యం పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ సర్వం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం అవసరమైన ముందస్తు కార్యాచరణ రూపొందిస్తోంది. జిల్లావ్యాప్తంగా ఒకేసారి సన్నబియ్యం పేదలకు అందించేలా ప్రణాళిక తయారు చేస్తోంది. ఈమేరకు జిల్లా సివిల్ స్లయీస్ అధికారి రాజేందర్ డీలర్లు, రైస్‌మిల్లర్లతో ఇటీవల సమావేశమయ్యారు. బియ్యం పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. గోదాంల నుంచి లారీల ద్వారా నేరుగా రేషన్ డీలర్లకు సన్నబియ్యం సరఫరా చేసేలా సూచనలు ఇచ్చారు. ఉచితంగానే సన్నబియ్యం.. జిల్లాలోని పేద కుటుంబాలకు రేషన్‌కార్డు ద్వారా ఉచితంగానే సన్నబియ్యం పంపిణీ చేస్తారు. తద్వారా నిత్యావసరాలపై పేదలు చేసే ఆర్థిక భారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఇప్పటికే కేవైసీ పూర్తిచేసిన తెల్లరేషన్‌కార్డుదారులు అందరికీ ఈ పథకం ద్వారా వచ్చే నెల నుంచి సన్నబియ్యం అందుతాయి. ప్రతినెలా 3,852 మెట్రిక్ టన్నులు అవసరం.. జిల్లా వ్యాప్తంగా 413 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,19,382 తెల్లరేషన్‌కార్డుల ద్వారా ప్రతినెలా రేషన్‌బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం ప్రతీనెల సుమారు 3,852 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం అవసరమని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు అంచనా వేశారు. ఈమేరకు సుల్తానాబాద్, పెద్దపల్లి, మంథనిలోని స్టాక్ పాయింట్ల నుంచి బియ్యం సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లా సమాచారం రేషన్‌కార్డులు 2,19,382 అన్నపూర్ణ 175 అంత్యోదయ 12,297 రేషన్‌దుకాణాలు 413 నెలకు అవసరమయ్యే సన్నబియ్యం(మె. ట) 3,852 శుభపరిణామం మాలాంటి పేదలకు ఉగాది నుంచి సన్నబియ్యం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలకు దీనిద్వారా పౌష్టికారం అందుతుంది. – పత్తి మల్లారెడ్డి, లబ్ధిదారు, కాల్వశ్రీరాంపూర్ డీలర్లకు సరఫరా చేస్తున్నాం తెల్లరేషన్‌కార్డుదారులకు ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గోదాముల నుంచి రేషన్ దుకాణాలకు ఇప్పటికే సన్నబియ్యం సరఫరా ప్రారంభించాం. – రాజేందర్, జిల్లా పౌర సరఫరాల అధికారి -
రూ.కోటి పరిహారం చెల్లించాలి
రామగుండం: టీటీఎస్ అంతర్గాంకు చెందిన ఆలకుంట సంపత్‌ది పోలీసు హత్యగానే భావిస్తున్నామని పౌరహక్కుల సంఘం నేతలు అన్నారు. మంగళవారం మృతుడి కుటుంబాన్ని వారు పరామర్శించారు. మృతికి గల కారణాలపై ఆరా తీశారు. సంపత్ ఆర్థికంగా నష్టపోయి జగిత్యాలలో ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొంది గల్ఫ్ ఏజెంట్‌గా పని చేశాడన్నారు. అతడితోపాటు తోడల్లుడు చిరంజీవితో కలిసి సేవలు అందించారని అన్నాడు. అయితే, గల్ఫ్ వెళ్లిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతోనే సంపత్ మృతిచెందాడని హక్కుల నేతలు ఆరోపించారు. సంపత్ మృతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి, ప్రభుత్వ హత్యగా గుర్తించి మృతుడి కుటుంబ సభ్యులకు రూ.కోటి పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర నేతలు మాదన కుమారస్వామి, నార వినోద్, బొంకూరి లక్ష్మణ్, రెడ్డిరాజుల సంపత్, బండారి రాజలింగయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మృతుడు సంపత్ కుటుంబాన్ని ఆదుకోవాలి పౌరహక్కుల సంఘం నాయకుల డిమాండ్ -
24 గంటల్లో చోరీ కేసు ఛేదన
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని పాతబజార్ ప్రాంతంలో బంగారు ఆభరణాలు తయారు చేసే దుకాణం తాళాలు పగులగొట్టి 100 గ్రాముల బంగారం, రూ.40వేల నగదు అపహరించిన కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక ఏసీపీ కార్యాలయంలో బుధవారం డీసీపీ కరుణాకర్ కేసు వివరాలను ఏసీపీ గజ్జి కృష్ణతో కలిసి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్‌కు చెందిన లోకిని తిరుమల భర్త ఎనిమిదేళ్ల క్రితం మరణించాడు. ఆ తర్వాత పెద్దపల్లిలోని ఓ హోటల్లో కొంతకాలం పనిచేసిన తిరుమల.. పనిమానేసి ఇంటివద్ద ఖాళీగానే ఉంటోంది. ఖర్చులు ఇతర అవసరాలకు డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచనతో దొంగతనాలు చేయాలని నిర్ణయించింది. సుత్తితో తాళాలు పగులగొట్టి.. సోమవారం రాత్రి సుత్తి వెంటతెచ్చుకుని ఫస్ట్‌ఫ్లోర్‌లోని దేవరకొండ కరుణాకర్ నగల దుకాణం షట్టర్ల తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించింది. 100 గ్రాముల బంగారు ఆభరణాలు (చైన్లు, గుండ్లు, గొట్టాలు)తోపాటు రూ.40వేల నగదు చోరీ చేసింది. యజమాని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ ఫుటేజీల సాయంతో మహిళాదొంగగా నిర్ధారించారు. ఆ తర్వాత తిరుమలను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ విషయం బహిర్గతమైంది. నగదులో రూ.12వేలను అవసరాలకు వినియోగించుకుంది. మిగతా రూ.28వేలతోపాటు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాల సాయంతోనే నిందితురాలిని 24గంటల్లోగా పట్టుకున్నామని, వీటి ప్రాధాన్యతను గుర్తించి అందరూ ఏర్పాటు చేసుకోవాలని డీసీపీ సూచించారు. కేసు ఛేదనలో ప్రతిభ చూపిన సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు లక్ష్మణ్‌రావు, మల్లేశం, ఏఎస్సై తిరుపతి, కానిస్టేబుళ్లు ప్రభాకర్, అనిల్‌కుమార్, రాజు, రమేశ్‌ను అభినందించి ప్రోత్సాహకాలు అందించారు. మహిళా దొంగను పట్టించిన సీసీ కెమెరాలు ఆభరణాలు, నగదు రికవరీ చేసిన పోలీసులు వివరాలు వెల్లడించిన డీసీపీ కరుణాకర్ -
జాతీయ పోటీలకు ఎంపిక
వెల్గటూర్: ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన అరిగెల వైశాలి జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికై ంది. ఈ నెల 9న హ్యాండ్‌బాల్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన సెలక్షన్ ట్రయల్స్‌లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికై నట్లు కరీంనగర్ జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వడ్లూరి రాజేందర్, జిట్టబోయిన శ్రీను తెలిపారు. ఈ నెల 26 నుంచి 29వరకు యూపీలోని లక్నోలో జరిగే 47వ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననుంది. ఎండపల్లి నుంచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికవడంపై మాజీ ఎంపీపీ శ్రీనివాసరావు, సాన యాదిరెడ్డి, ఎంఈవో రాంచంద్రం, వెంకటరమణారెడ్డి వైశాలిని అభినందించారు. -
ప్రభుత్వాలు సంపన్నుల కోసమేనా?
కోల్‌సిటీ(రామగుండం): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంపన్నుల కోసమే పనిచేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట మంగళవారం మహాధర్నా నిర్వహించారు. తొలుత టీ జంక్షన్‌లోని అంబేడ్కర్, రాజేశ్ థియేటర్ కూడలిలోని జ్యోతిబా పూలే విగ్రహాలకు జాన్‌వెస్లీతోపాటు బొజ్జా బిక్షమయ్య, భూపాల్ తదితరులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం బల్దియాకు చేరుకుని ఆయన మాట్లాడారు. బల్దియాలో సీపీఎం భూపోరాటం ద్వారా 600 మంది పేదలకు ఇళ్లస్థలాలు ఇప్పించామన్నారు. వీరందరికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పట్టాలు, ఇంటి నంబర్లు ఇవ్వాలని కోరారు. రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, పింఛన్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ ఆయన చేశారు. సింగరేణి, మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు రూ.26 వేలు ఇవ్వాలన్నారు. అనంతరం బల్దియా డిప్యూ టీ కమిషనర్ వెంకటస్వామికి వినతిపత్రాన్ని సమర్పించారు. నాయకులు వై.యాకయ్య, వే ల్పుల కుమారస్వామి, ఎ.ముత్యంరావు, ఎం. రామాచారి, సారయ్య, శ్రీనివాస్, శంకర్, బిక్షపతి, శైలజ, గణేశ్, జ్యోతి, రవీందర్, అశోక్, నాగమణి, ఎ.మహేశ్వరి, ఉపేందర్, సంజీవ్, లక్ష్మారెడ్డి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రజాసమస్యలు పరిష్కరించాలి పెద్దపల్లిరూరల్: జిల్లాలో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరించి ప్రజల ఇబ్బందులను తొలగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సీపీఎం నాయకులు జాన్వెస్లీకి స్వాగతం పలికి బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, పెద్దపల్లి –కూనారం మార్గంలోని రైల్వేక్రాసింగ్ వద్ద చేపట్టిన రైల్వే వంతెన పనులను వేగంగా పూర్తిచేయాలన్నారు. నాయకులు ముత్యంరావు, భూపాల్, భిక్షమయ్య, రమేశ్, అశోక్, రవీందర్, జ్యోతి, శ్రావణ్, ప్రశాంత్, దిలీప్, నవీన్, వెంకటస్వామి, ఖాజా, రాజమల్లు, సాగర్ పాల్గొన్నారు. పేదలకు ఇళ్లు కూడా ఇవ్వడంలేదు తక్షణమే ఇంటినంబర్లు, పట్టాలివ్వాలి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ రామగుండం బల్దియా ఎదుట ధర్నా -
బీఆర్ఎస్ పాలనలోనే నష్టం
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): గత బీఆ ర్ఎస్ పదేళ్ల పాలనలోనే సింగరేణితో పాటు కార్మికులకు నష్టం జరిగిందని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్‌ప్రసాద్ విమర్శించారు. ఆర్జీ–2 ఏరియా యైటింక్లయిన్‌కాలనీ ఐఎన్టీయూసీ కార్యాలయంలో మంగళవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం బొగ్గు గనుల వే లం పాటలో పాల్గొనకపోవడంతోనే ఒక్క బొగ్గుగని రాలేదన్నారు. రూ.35వేల కోట్ల విద్యుత్ బకాయిలను సింగరేణికి చెల్లించలేదన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ఏటా 70 మిలియన్ల బొ గ్గు ఉత్సతి చేయడంతోపాటు కార్మికుల సంక్షేహానికి తమ యూనియన్ కృషి చేస్తోందని తెలిపారు. అనంతరం ఏఐటీ యూసీ నాయకులు ఐఎన్టీయూసీలో చేరారు. నాయకులు శంకర్ నాయక్, నరసింహారెడ్డి, ఽధర్మపురి, ఎండీ అక్ర మ్, వికాస్ కుమార్, సత్యనారాయణరెడ్డి, సంపత్‌రెడ్డి, నవీన్, మల్లేశ్, సదానందం, మోహన్, కనకయ్య, మార్కండేయ పాల్గొన్నారు. ఒప్పందాన్ని అమలు చేయాలి జ్యోతినగర్(రామగుండం): కార్మికుల సమస్య ల పరిష్కారానికి గతంలో కుదుర్చుకున్న ఒ ప్పందాన్ని అమలు చేయకపోగా సమస్యను జఠిలం చేస్తున్నారని కాంట్రాక్టు కార్మిక సంఘం నేత కౌశిక హరి అన్నారు. ఎన్టీపీసీ లేబర్ గేట్ వద్ద మంగళవారం గేట్ మీటింగ్ నిర్వహించారు. ఎన్టీపీసీ యాజమాన్యం కార్మికుల సమస్యలపై స్పందించడం లేదన్నారు. ఒప్పందం జరిగిన అంశాలను పరిష్కరించకపోతే శనివా రం ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. కదంబాపూర్ క్వారీలో విచారణ సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): కదంబపూర్ లోని క్వారీలో ఆర్డీవో గంగయ్య, మైనింగ్ ఏడీ శ్రీనివాస్, ఏడీ సర్వేయర్ శ్రీనివాస్ మంగళవా రం విచారణ చేపట్టారు. సర్వే నంబర్లు 507, 508లోని కేఎస్ఆర్ క్వారీలో అనుమతికి మించి గ్రానైట్ తవ్వకాలు చేస్తున్నారని తమకు ఫిర్యా దు అందిందని ఆర్డీవో తెలిపారు. దీంతో విచారణ చేశామన్నారు. తహసీల్దార్ రాంచందర్‌రావు, గిర్దావర్ వినోద్ పాల్గొన్నారు. పత్తి క్వింటాల్ రూ.7,124 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,124 ధర పలికింది. కనిష్టంగా రూ.5,011, సగటు రూ.6,761 ధర నమోదైందని మార్కెట్ కార్యదర్శి మనోహర్ తెలిపారు. పలువురు రైతుల నుంచి 384 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్ల ఆయన పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపు గడువు పొడిగించాలి పెద్దపల్లిరూరల్: ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ఈనెలాఖరు వరకు ఇచ్చిన గడువును మరోనెల రోజులపాటు పొడిగించాలని రియల్ ఎస్టేట్ ఏజెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎరుకల రమేశ్ కోరారు. మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు చేసిన స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన ఎల్ఆర్ఎస్ను స్వాగతిస్తున్నామని అన్నారు. అయితే, పలుకారణాలతో అందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసు కోలేక పోతున్నారని పేర్కొన్నారు. గడువును పొడిగిస్తే అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని, అధికారులు, ప్రజాప్రతినిధులు ఇందుకోసం చొరవ చూపాలని ఆయన కోరారు. సఖి కేంద్రానికి మహిళ తరలింపు పెద్దపల్లిరూరల్: మతిస్థిమితం లేనిమహిళను మంగళవారం సఖికేంద్రానికి తరలించారు. అ డ్మినిస్ట్రేటర్ స్వప్న, సిబ్బంది ప్రత్యేక వాహనంలో బాధితురాలిని తరలించారు. వెంకటేశ్వర్లు, లక్ష్మీనర్సయ్య, సత్యనారాయణ ఇచ్చిన సమా చారంతో జిల్లా సంక్షేమశాఖ ఇన్చార్జి అధికారి వేణుగోపాల్ ఆ మహిళను సఖి కేంద్ర సిబ్బందితో తరలించారు. ఆ తర్వాత హైదరాబా ద్‌లోని అమ్మనాన్న ఆశ్రమానికి తరలిస్తామని అధికారులు పేర్కొన్నారు. -
ఆదాయం పెంచేలా ప్రణాళికలు ఉండాలి
పెద్దపల్లిరూరల్: ఆదాయాన్ని పెంచేలా మున్సిపల్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. దుబారా ఖర్చులు తగ్గించి పట్టణాభివృద్ధికి అవసరమైన ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్నారు. కలెక్టరేట్లో మంగళవారం అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీతో కలిసి మున్సిపాలిటీలు, రామగుండం కార్పొరేషన్ వార్షిక బడ్జెట్ రూపకల్పనపై అధికారులకు పలు సూచనలిచ్చారు. ఆదాయవనరులు పెరిగితేనే ప్రజావసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టడం సాధ్యమవుతుందని తెలిపారు. పన్నులను నూరుశాతం వసూలు చేయాలని, వార్డుల వారీగా అధికారులు, సిబ్బందిని నియమించి ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. పన్నుల పెంపుపై అవసరమైనచోట రీ అసెస్మెంట్ చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ● కలెక్టర్ కోయ శ్రీహర్ష -
ఆస్పత్రుల ఎదుట బోర్డులు ఉండాలి
పెద్దపల్లిరూరల్: ‘ఇచ్చట లింగనిర్ధారణ చేయరు.. ఇలా చేయడం కూడా చట్టరీత్యా నేరం’ అని రాసిన బోర్డులను అందరికీ కనిపించేలా డయాగ్నొస్టిక్ కేంద్రాల ఎదుట అమర్చాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్నకుమారి సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ డయాగ్నొస్టిక్ కేంద్రాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. మంగళ వారం పట్టణంలోని పలు డయాగ్నొస్టిక్ కేంద్రాల ను తనిఖీ చేశారు. పుట్టబోయేది ఆడబిడ్డ, మగబిడ్డ అని తెలుసుకుని భ్రూణహత్యలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వైద్య పరీక్షల కోసం వచ్చేవారినుంచి నిబంధనల ప్రకారమే ీఫీజుల వసూలు చేయాలని ఆమె సూచించారు. ఫీజుల వివరాలను తెలిపే పట్టికలను కూడా ఆస్పత్రుల్లోని నోటీసు బోర్డులపై అంటించాలని అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులను సైతం తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో.. అగ్నిమాపక పరికరాలను అమర్చుకోవాలని యాజమాన్యాలకు సూచించారు. నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఎవరూ లింగనిర్ధారణ చేయొద్దు నిబంధనల మేరకు ఫీజు వసూలు చేయాలి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్నప్రసన్నకుమారి ప్రైవేట్ డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో విస్తృతంగా తనిఖీలు -
వచ్చే ఎన్నికల్లో విజయం మాదే
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి పెద్దపల్లిరూరల్: రానున్న శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోదీ పాలనను ప్రజలు విశ్వసిస్తున్నారని ఆయన అన్నారు. తె లంగాణలోనూ ప్రజలు ఆదరిస్తున్నారనేందుకు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటుతామన్న విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా కమిటీ ఖరారు.. బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ శ్రే ణులను సమాయత్తం చేస్తున్నామని సంజీవరెడ్డి అన్నారు. పార్టీ పూర్తిస్థాయి జిల్లా కమిటీని ఖరా రు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా అమరగాని ప్రదీప్, కాసగోని ని ర్మల(పెద్దపల్లి), ముస్కుల భాస్కర్‌రెడ్డి(రామగుండం), మత్స్యగిరి రాము(మంథని)ను నియమించామన్నారు. ప్రధానకార్యదర్శులుగా కడారి అశోక్‌రావు, పల్లె సదానందం(పెద్దపల్లి), కోమళ్ల మహేశ్(రామగుండం), కార్యదర్శులుగా జంగ చక్రధర్‌రెడ్డి, మౌఠం నర్సింగం, మహేందర్, కంకణాల జ్యోతిబసు, బిరుదు గట్టయ్య, అధికార ప్రతినిధులుగా శనిగరపు రమేశ్, పిలుమర్రి సంపత్, జక్కుల నరహరిని నియమించామన్నారు. యువమోర్చా జిల్లా అధ్యక్షుడిగా పిన్నింటి విశా ల్, కిసాన్‌మోర్చా అధ్యక్షుడిగా గూడెపు జనార్దన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా చాతరాజు రమేశ్, దళిత మోర్చా అధ్యక్షుడిగా మచ్చవిశ్వాస్తోపాటు ఐదుగురు కార్యవర్గ సభ్యులను నియమించామని ఆయన వివరించారు. -
న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి
గోదావరిఖనిటౌన్: హైదరాబాద్‌లో న్యాయవాది ఇజ్రాయిల్ హత్యను నిరసిస్తూ ఖని న్యాయవాదులు మంగళవారం విధులు బహిష్కరించారు. ము న్సిఫ్ కోర్టు కాంప్లెక్స్ ఎదుట నిరసన తెలిపారు. కార్యక్రమంలో గోదావరిఖని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తౌటం సతీశ్, ప్రధాన కార్యదర్శి జవ్వా జి శ్రీనివాస్, కమిటీ కార్యవర్గ సభ్యులు గోసిక ప్రకాశ్, పులిపాక ప్రవీ ణ్‌కుమార్, వరలక్ష్మి, చందాల శైలజ, గొర్రె రమేశ్, అరుణ్, రాజేశ్, వెంకట్, రంగు శ్రీనివాస్, నూతి సురేశ్, సహనవాజ్, రవీందర్, ప్రసన్న, అంజలి తదితరులు పాల్గొన్నారు. రేపు జాబ్‌మేళా పెద్దపల్లిరూరల్: జిల్లా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈనెల 27న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధికల్పనాధికారి తిరుపతిరావు తెలిపారు. అపోలో ఫార్మసీలో 50 ఫార్మసిస్టు, ట్రైనీ ఫార్మసిస్టు, ఫార్మసీ అసిస్టెంట్, రిటైల్ట్రేనీ పో స్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వివరాలకు 82476 56356, 89853 36947లో సంప్రదించాలన్నారు. -
గంజాయి నియంత్రణకు పటిష్ట నిఘా
● పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝూ గోదావరిఖని: గంజాయి నియంత్రణకు పటిష్టమైన నిఘా ఉంచాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝూ సూచించారు. కమిషనరేట్‌లోని పెద్దపల్లి, గోదావరిఖని, మంచిర్యాల సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో మంగళవారం ఆయన తన కార్యాలయంలో నేర సమీక్ష నిర్వహించారు. పోలీస్ అధికారులు చట్టబద్ధంగా పనిచేయాలని సీపీ సూచించారు. వివిధ కార్యకలాపాలపై ముందస్తు సమాచారం ఉండాలని, ప్రతీ కేసులో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని అన్నారు. ఎస్సీ ఎస్టీ కేసుల్లో న్యాయపరంగా, పారదర్శకంగా విచారణ జరపాలని తెలిపారు. అనంతరం గంజాయి స్వాధీనం కేసుల్లో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి సీపీ రివార్డులు అందజేశారు. మంచిర్యాల, పెద్దపల్లి డీసీపీలు భాస్కర్, కరుణాకర్, అడిషనల్ డీసీపీ(అడ్మిన్) రాజు, స్పెషల్ బ్రాంచ్, గోదావరిఖని, పెద్దపల్లి, ట్రాఫిక్, ఏఆర్ ఏసీపీలు రాఘవేంద్రరావు, రమేశ్, కృష్ణ, మల్లారెడ్డి, ప్రతాప్, ఏవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పర్యవేక్షణ కరువైంది
పార్క్‌ల నిర్వహణపై మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షణ కరువైంది. సాయంత్రమైతే మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయి. పిల్లలు, మహిళలు అటువైపు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలి. – శ్రీనివాస్, పెద్దపల్లి నిర్వహణ విస్మరించారు సుమారు రూ.3కోట్లకుపైగా వెచ్చించి నగరంలో పార్క్‌లు ఏర్పాటు చేశారు. కానీ నిర్వహణ బాధ్యతలు విస్మరించారు. దీంతో చిన్నపిల్లలు ఆడుకునే ఆట పరికరాలు విరిగిపోయాయి. ఎందుకూ పనికిరాకుండా పోయాయి. వెంటనే కొత్త పరికరాలు అమర్చాలి. – ఎండీ ఇబ్రహీం, గోదావరిఖని -
సమస్యల పరిష్కారానికే ప్రజావాణి
పెద్దపల్లిరూరల్: ప్రజాసమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి నిర్వహిస్తున్నామని అదనపు కలెక్టర్ వేణు తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఆయన పలువురు బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ● అడిషనల్ కలెక్టర్ వేణు ప్రభుత్వ, అద్దె గోదాముల్లో టెండర్లతో జరిగే పనులు చేస్తున్న హమాలీలకు పనిభద్రత, ఈ పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలి. ఇందుకోసం కాంట్రాక్టర్, గోదాం యజమానులు, అధికారులు సమావేశం ఏర్పాటు చేయాలి. – తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ నేతలు సుమారు 300మంది రైతులతో కలిసి పెద్దపల్లి ఎఫ్‌ఈడీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ స్థాపించాం. ఈ ప్రాంతంలోని రైతులు పండించిన ధాన్యం దిగుబడులను కొనుగోలు చేసే అవకాశం మాకు ఇవ్వండి. రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తాం. – ఎర్రం మల్లారెడ్డి, ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ ఫేజ్–2తో ఇబ్బంది అంత్యోదయ కార్డు మంజూరు చేయండి నాకు రేషన్ కార్డు ఉంది. దీనిపై ఆరుకిలోల బియ్యం ఇస్తున్నారు. అంత్యోదయ కార్డుకు నాకు అన్ని అర్హతలున్నాయి. విచారణ జరిపి అంత్యోదయ కార్డు ఇప్పించి ఆదుకోవాలి. – శేషగిరిరావు, గోదావరిఖని పరిహారం ఇప్పించండి జాతీయ రహదారి కింద పోయిన మా భూమి కి ప్రభుత్వం నుంచి పరిహారం అందించాలి. రెండో కిస్తీ పరిహారాన్ని వీలైనంత త్వరగా అందించి మా కుటుంబాన్ని ఆదుకోవాలి. – విజయలక్ష్మి, నాగమణి, లక్కారం, మంఽథని మండలం భద్రత కల్పించండి ధాన్యం కొనుగోళ్లకు అవకాశమివ్వండి -
పోలీస్ బాస్.. అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు
● కమిషనరేట్‌లో టాస్క్‌ఫోర్స్ టీంల రద్దు ఎల్ఆర్‘ఎస్’ మేళా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ఈనెల 31వ తేదీలోగా ఫీజు చెల్లించి 25శాతం రాయితీ పొందడంతోపాటు తమ భూ ములు, ప్లాట్లు క్రమబద్ధీకరించుకునేందు కు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో జిల్లాలోని వేలాది మంది అర్జీదా రులు రుసుం చెల్లించేందుకు బల్దియాల్లో బారులు తీరుతున్నారు. పెద్దపల్లిలోని మేళా వద్ద క్యూకట్టిన అర్జీదారులు ‘సాక్షి’ కెమెరాకు ఇలా కనిపించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లిగోదావరిఖని: చోరీల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, రోడ్డు ప్ర మాదాలను అదుపు చేయడం.. మొత్తంగా శాంతి భద్రతల పరిక్షణ కోసం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అర్ధరాత్రి వేళ ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టారు. బాధ్యతలు చేపట్టిన రెండురోజులకే రైల్వే, బస్స్టేషన్లు, బొగ్గు చోరీలు జరిగే ప్రాంతాలను ఆయన అర్ధరాత్రి ప రిశీలించారు. పోలీసుశాఖ ప్రక్షాళనకూ నడుం బి గించారు. కమిషనరేట్‌లో కీలకమైన టాస్క్‌ఫోర్స్ టీంలను పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో పోలీస్ కమిషనర్ ఝా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందులోని అధికారులు, సిబ్బందిని సొంత ప్రాంతాలకు పంపించి వేశారు. మహిళల భద్రతపైనా ప్రత్యేక దృష్టి మహిళల రక్షణ, భద్రతపైనా పోలీస్ కమిషనర్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇందుకోసం కాలేజీల్లో ఈవిటీజింగ్, పలు రద్దీ ప్రాంతాల్లో మఫ్టీ పోలీసులను నియమించాలని నిర్ణయించారు. బ్లాక్స్పాట్లపై చర్యలు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్స్పాట్లపై సీపీ ప్రత్యేక దృష్టి సారించారు. వాహనాదారులను అప్రమత్తం చేసేందుకు సూచిక బోర్డుల ఏర్పాటు, రాత్రిపూట స్పష్టంగా కనిపించే డేంజర్ రేడియం స్టిక్కర్లు అతికించాలని ఆదేశాలిచ్చారు. వాహన వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్లు వేయడం, స్పీడ్గన్లతో నిఘా పెంచడం, రోడ్లపై రిఫ్లెక్టింగ్ లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు పోలీస్ కమిషనర్ సూచించారు. డ్రగ్స్ నియంత్రణకు సీరియస్‌గా ముందుకు రామగుండం కమిషరేట్ పరిధిలో గంజాయి, ఇతర మారకద్రవ్యాలను కట్టడిచేయాలని అధికారులకు సీపీ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో ఎంతటి వారున్నా ఊరుకోబోమని, సీరియస్‌గా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. మహిళల రక్షణ, రోడ్డు ప్రమాదాల నియంత్రణ లక్ష్యం మహిళల రక్షణ, రోడ్డు ప్రమాదాల నియంత్రణ మా లక్ష్యం. టాస్క్‌ఫోర్స్ టీంలను ఎత్తివేశాం. ప్రమాద, గంజా యి రహిత కమిషనరేట్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం. ఇదే సమయంలో యువత ఉపాధిపై దృష్టి సారిస్తాం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. – అంబర్ కిశోర్ ఝా – పోలీస్ కమిషనర్, రామగుండం -
మిగిలింది కొద్దిరోజులే..
● 31 వరకు సీపీఆర్ఎంఎస్ గడువు గోదావరిఖని: వైద్యచికిత్సలపై రిటైర్డ్ కార్మికు లు, వారి కుటుంబాలకు భరోసా కల్పించేందుకు సింగరేణి యాజమాన్యం క్యాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ స్కీం(సీపీఆర్‌ఎస్)ను 2018 నుంచి అమలు చేస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా రిటైర్డ్ కార్మికులు ఇందులో సభ్యులుగా చేరేందుకు అవకాశం కల్పించింది. ఈనెల 31వ తేదీ వరకు మరోసారి గడువు విధించింది. సంస్థలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు ఇదే చివరి అవకాశమని పేర్కొంది. స్కీంలో 35 వేల మంది చేరిక.. పథకం ప్రారంభించిన సుమారు ఏడేళ్లలో దాదా పు 35 వేల మంది రిటైర్డ్ కార్మికులు ఇందులో చే రారు. ప్రతీసభ్యుడు రూ.40వేలు చెల్లిస్తే.. యాజమాన్యం మరో రూ.18వేలు కలిపి ఈ పథకం కింద జమచేస్తోంది. దీనిద్వారా రిటైర్డ్ కార్మికుడు, అతడి భార్య తమ జీవితకాలంలో గరిష్టంగా రూ.8లక్షల వరకు వైద్య సదుపాయం పొందే వీలుంది. అత్యవసర పరిస్థితుల్లో నగదు చెల్లించి వైద్య చికిత్స పొందినా ఆ తర్వాత బిల్లులు క్లెయి మ్ చేసుకునే వీలు కల్పించారు. ప్రాణాంతక, దీర్ఘకాలిక, కాన్సర్ లాంటి వ్యాధులకు గరిష్ట పరిమితి ఏమీ లేదు. మలిదశలో సింగరేణి రిటైర్డ్ కార్మికులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని యాజమాన్యం చెబుతోంది. సీపీఆర్ఎంఎస్ వివరాలు.. పథకంలో చేరిన సభ్యులు 35,000 జమైన సొమ్ము(రూ.కోట్లలో) 400 రిటైర్డ్ కార్మికుల వాటా(రూ.కోట్లలో) 250 యాజమాన్యం వాటా(రూ.కోట్లలో) 150 గతేడాది వైద్యం కోసం చెల్లించిన సొమ్ము(రూ.కోట్లలో) 90 -
రైతులకు పరిహారం ఇవ్వండి
పెద్దపల్లిరూరల్: తన నియోజకవర్గంలో అకా ల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు కోరారు. హైదరాబాద్‌లో సోమవారం సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన కలిసి వినతిపత్రం అందించారు. వరి, మొక్కజొన్న, కూరగాయల రైతులు అకాల వర్షాలతో నష్టపోయారని తెలిపారు. వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో సర్వేచేసి పంట నష్టం అంచనా వేశారని పేర్కొన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం బాధిత రైతులకు పరిహారం అందించాలని సీఎంను అభ్యర్థించారు. ఇందుకు సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. పరీక్ష కేంద్రం తనిఖీ ఎలిగేడు(పెద్దపల్లి): స్థానిక జెడ్పీ హైస్కూల్ లోని పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ తీరు, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలపై ఆయన ఆరా తీశారు. కార్యక్రమంలో చీఫ్ సూపరింటెండెంట్ రమేశ్, డిపార్ట్మెంట్ అధికారి శ్రీనివాసరెడ్డి, ఇన్విజిలేటర్లు పాల్గొన్నారు. అవార్డు గ్రహీతకు అభినందన పెద్దపల్లిరూరల్: కాసులపల్లి గ్రామానికి చెందిన రైతు ఎర్రం మల్లారెడ్డి జాతీయస్థాయి అవార్డు సాధించడం జిల్లాకు గర్వకారణమని అడిషనల్ కలెక్టర్ వేణు అన్నారు. కలెక్టరేట్లో సోమవారం మల్లారెడ్డిని జిల్లా వ్యవసాయాధికారి ఆదిరెడ్డి, మార్కెటింగ్ అధికారి ప్రవీణ్‌రెడ్డితో కలిసి అభినందించారు. సాగు విధానంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుడి సాధించేలా ఆధునిక పద్ధుతులను అవలబించడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ కరాటే పోటీలకు విద్యార్థిని ఎంపిక ముత్తారం(మంథని): ధర్యపూర్ మోడల్ స్కూ ల్ విద్యార్థిని మెట్టు హాసిని మల్లేషియాలో మే 7 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్నేషనల్ కరాటే పోటీలకు ఎంపికై ంది. ఆమెను ప్రిన్సిపాల్ సంతోష్, ఉపాధ్యాయులు సోమ వారం అభినందించారు. హాసిని తల్లిదండ్రులు నర్సింగం, దేవి మంథనిలో నివాసం ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి కరాటే అంటే తనకెంతో ఇష్టమని హాసిని చెబుతోంది. ‘టీబీ ముక్త్ భారత్’ సాధిద్దాం పెద్దపల్లిరూరల్: క్షయ నిర్మూలనపై ప్రజలు అ వగాహన పెంపొందించుకోవాలని జిల్లా వై ద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్నకుమా రి సూచించారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వద్ద సోమవారం అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం టీబీ ముక్త్భారత్ సాధించేలా ప్రణాళిక రూపొందించిందన్నారు. 100రోజుల పాటు నిర్వహించిన నిక్షయ్ శిబిర్ ద్వారా 1,32,944 మందికి పరీక్షలు నిర్వహించి 14,723 మందిని అనుమానితులుగా గుర్తించామని వివరించారు. వారిలో 502 మందిని వ్యాధిగ్రస్తులుగా గుర్తించి మందులు అందించామని పేర్కొన్నారు. ఉత్తమ సేవలందించిన పలువురిని ఈ సందర్భంగా సత్కరించారు. ప్రోగ్రాం అధికారి సుధాకర్‌రెడ్డి, శ్రీరాములు, వాణిశ్రీ, కిరణ్‌కుమార్, శ్రవణ్‌కుమార్, రెడ్‌క్రా స్ సొసైటీ కన్వీనర్ రాజగోపాల్ పాల్గొన్నారు. -
● రేషన్ కార్డు కోసం పేర్లు డిలీట్ చేసుకున్న కొత్త జంటలు ● రాజీవ్ యువ వికాసం, సీఎంఆర్ఎఫ్, ఆరోగ్య శ్రీ పథకాలకు దూరం ● రేషన్‌కార్డులు వచ్చే వరకు పథకాలు లేనట్లే ● లబోదిబోమంటున్న లబ్ధిదారులు
ఈ యువకుడు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన బూస రాకేశ్. వివాహం అనంతరం తన భార్యతో కలిసి కొత్త రేషన్‌కార్డు తీసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. వెంటనే అధికారులు పాతకార్డులో పేరు తీసివేశారు. కొత్త రేషన్ కార్డు జారీచేయలేదు. దీంతో పాత కార్డులో పేరు ఉండక, కొత్త రేషన్ కార్డు ఎప్పుడు వస్తుందో తెలియక ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్నాడు.సాక్షిప్రతినిధి, కరీంనగర్: ప్రభుత్వం అందించే ప్రతీ సంక్షేమ పథకానికి రేషన్‌కార్డును ప్రామాణికం చేయడంతో కొత్తకార్డుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వకాలం నుంచి కొత్త కార్డులు అందించకపోగా చేర్పులు, మార్పులకు నోచుకోని పరిస్థితి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి హామీ ఇచ్చినా.. ప్రకటనలే తప్ప సరైన స్పష్టత ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్తగా పెళ్లయినవారు ప్రభుత్వ పథకాలు పొందడానికి ఉమ్మడి కుటుంబంలో ఉన్న రేషన్‌కార్డు నుంచి పేర్లు రద్దు చేసుకుని కొత్తకార్డుల కోసం దరఖా స్తు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టి న రాజీవ్ యువ వికాసం పథకానికి సైతం రేషన్‌కార్డు ఉన్నవారే దరఖాస్తు చేసుకోవాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో దరఖాస్తుదారుల పరిస్థితి కొండ నాలుకకు మందు వేసుకుంటే ఉన్న నాలుక ఊడిపోయిన చందంలా మారినట్లయింది. కొత్త కార్డులొస్తాయని ఆశతో... ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎంతో మంది కొత్తగా వివాహం అయినవారు రేషన్‌కార్డు పొందేందుకు, తమ తల్లిదండ్రులతో ఉన్న తమ పేర్లను తొలగించుకున్నారు. కొత్తరేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొత్తవి రాకపోగా, ఉన్న పాత రేషన్‌కార్డులో పేరు డిలీట్ కావడంతో ప్రభుత్వం అందించే సీఎంఆర్ఎఫ్, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇండ్లు, తదితర ఆరు గ్యారంటీలతో పాటు తాజాగా ప్రభుత్వం ప్రకటించిన రాజీవ్‌యువ వికాసం పథకం సైతం పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 9,78,620 రేషన్‌కార్డులుండగా, కొత్త కార్డుల కోసం సుమారు 50వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కాగా.. రేషన్ కార్డులు ఉన్న పేదలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నా లేని పేదల సంగతేమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కొత్త రేషన్ కార్డులు జారీ చేసే విషయం ఎలా ఉన్నా.. కనీసం ఆ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేసేందుకు కూడా అవకాశం లేకపోవడంతో పేదలు నష్టపోతున్నారు. -
ముస్లింల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
● రాష్ట్రమంత్రి శ్రీధర్‌బాబు మంథని: ముస్లింల సంక్షేమం, అభివృద్ధికి రూ.3వేల కోట్లకు పైగా బడ్జెట్లో నిధులు కేటాయించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఇఫ్తా ర్ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా యువతకు స్వయం ఉపాధి కల్పిస్తున్నామన్నారు. ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యం అమలు చేస్తున్నామన్నారు. అడిషనల్ కలెక్టర్ వేణు, ఆర్డీవో సురేశ్, ఇన్చార్జి తహసీల్దార్ గిరి, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. నాయకులు తొట్ల తిరుపతి యాదవ్, శశిభూషణ్ కాచే, వొడ్నాల శ్రీనివాస్, కొండ శంకర్, కొత్త శ్రీనివాస్, పెండ్రు రమాదేవి, మూల సరోజన, మంథని సురేశ్, ఆజీంఖాన్, ఖాజామొహినొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
పెద్దపల్లిరూరల్: అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం అ న్నివిధాలా ఆదుకుంటుందని ఎమ్మెల్యే విజయరమణరావు భరోసా ఇచ్చారు. భోజన్నపేట, చీకురాయి, హన్మంతునిపేట, రాంపల్లి గ్రామాల్లో వ డగళ్లకు దెబ్బతిన్న పంటలను ఆదివారం ఆయన పరిశీలించారు. కాలువ చివరి ఆయకట్టుకూ సా గునీటిని అందించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. డీఏవో ఆదిరెడ్డి, ఏవో అలివేణి, రైతులు, నాయకులు ఉన్నారు. ఉదయ్‌నగర్‌లో కమాన్ ప్రారంభం జిల్లా కేంద్రంలోని ఉదయ్‌నగర్ కాలనీకి వెళ్లే ప్ర ధాన రోడ్డుపై మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఈర్ల స్వరూప, సురేందర్ సొంత డబ్బు వెచ్చించి ని ర్మించిన ప్రవేశద్వారం (కమాన్)ను ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు. రైతులను ఆదుకుంటాం జూలపల్లి/ఎలిగేడు(పెద్దపల్లి): పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. జూలపల్లి మండలం జూలపల్లి, కోనరావుపేట, ఎలిగేడు మండలం ధూళికట్టలో ఆయన పర్యటించారు. ఎమ్మెల్యే విజయరమణారావు భరోసా -
బోర్డులున్నాయి.. మైదానాలే లేవు
పల్లెల్లోని ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి వెలుగులోకి తీసుకు రావాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం ఊరూరా క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే, కొందరు అధికారులు.. రూ.లక్షలు వెచ్చించి గ్రామాల్లో హడావుడిగా బోర్డులు ఏర్పాటు చేశారు.. ఇవే క్రీడా ప్రాంగణాలు అని ప్రకటించారు. స్పోర్ట్స్ కిట్లు గ్రామాల వారీగా పంపిణీ చేసేందుకు ఎంపీడీవో కార్యాలయాలకు చేరినా కొన్ని కనిపించడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం మారింది. ఇప్పుడైనా క్రీడామైదానాల్లో సౌకర్యాలు కల్పించి వినియోగంలోకి తీసుకు రావాలని క్రీడాకారులు కోరుతున్నారు. – సుల్తానాబాద్/సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
ఉగాది ఉత్సవాలకు రండి
కమాన్‌పూర్(మంథని): మండల కేంద్రంలోని శ్రీఆదివరాహస్వామి ఆలయంలో ఈనెల 30న నిర్వహించే ఉగాది ఉత్సవాలకు హాజరు కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును ఆలయ అధికారులు ఆహ్వానించారు. ఆదివారం మంథని పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి శ్రీధర్‌బాబును ఆలయ ఈవో కాంతరెడ్డి తదితరులు కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. బీసీ కులగణన చారిత్రకం ధర్మారం(ధర్మపురి): బీసీ కుల గణన చారిత్ర కమని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. బీసీ కుల గణన చేపట్టి, చట్టసభల్లో రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత తొలిసారి ధర్మపురి నియోజకవర్గానికి వచ్చిన విప్‌కు వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు పత్తిపాక క్రాస్‌రోడ్డు వద్ద ఘనంగా స్వాగతం పలికారు. లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కులగణన చేసి కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా అన్యాయం చేసిందని ఆయన విమర్శించారు. అనంతరం ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కృతజ్ఞత సభ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. నాయకులు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, లావుడ్య రూప్లానాయక్ తదితరులు పాల్గొన్నారు. రేపు ‘ఆర్టిజన్ల గర్జన’ పెద్దపల్లిరూరల్: ఆర్టిజన్ల సమస్యలను ప్రభు త్వం సత్వరమే పరిష్కరించాలని ఆ సంఘం జిల్లా కో చైర్మన్ దుర్గం విశ్వనాథ్ డిమాండ్ చేశా రు. సమస్యల పరిష్కారం కోసం ఈనెల 25న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద చేపట్టను న్న ఆర్టిజన్ల గర్జన సభను విజయవంతం చే యాలని ఆయన కోరారు. ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ పోస్టులకు కన్వర్షన్ చేయాలని ఆయ న పేర్కొన్నారు. విద్యార్హతలను బట్టి సబ్ ఇంజినీర్, జేఎల్ఎం, జూనియర్ అసిస్టెంట్, ఆఫీ స్ సబార్టినేట్ పోస్టుల్లో భర్తీ చేయాలని ఆయన అన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ పలుమార్లు ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు విన్నవించామని ఆయన గుర్తుచేశారు. పోరాటాలతోనే కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపుగోదావరిఖని: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుకోసం పోరాటాలకు సిద్ధం కా వాలని ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్ కోరారు. ఆదివారం కాంట్రాక్టు కార్మిక సంఘం సమావేశాన్ని ఆ సంఘం బుర్ర తిరుపతి అధ్య క్షతన నగరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం, యాజమాన్యం ఇచ్చిన హామీ మేరకు తక్షణమే వేతనాలను పెంచాలన్నారు. ఈఎస్ఐ వేతనాలు అమలు చేయాలని, చట్టబద్ధంగా రావాల్సిన హక్కులు, సెలవులను వర్తింపజేయాలని కోరారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎండీ అక్బర్అలీ, ఇన్చార్జి ముస్కే సమ్మయ్య, నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, యర్రగాని కృష్ణయ్య, కిష్టఫర్, రాజరత్నం, చంద్రమౌళి, గౌస్, జెట్టి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. అన్నదాతలను ఆదుకోవాలి పెద్దపల్లిరూరల్: నియోజకవర్గంలో కురిసిన వడగళ్లకు పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, అసెంబ్లీ ఇన్చార్జి దుగ్యాల ప్రదీప్‌కుమార్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి, జూలపల్లి, ఎలిగేడు, సుల్తానాబాద్ తదితర మండలాల్లో వరి, మొక్కజొన్న, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. దిగుబడులు గణనీయంగా తగ్గి పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు లేవని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయాధికారులతో పంట నష్టంపై సర్వే చేయించి ఎకరాకు రూ.50వేల పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఆధ్యాత్మికం.. పర్యాటకం
● టూరిజం స్పాట్‌గా గోదావరి తీరం ● సమ్మక్క – సారలమ్మ గద్దెల అభివృద్ధి ● రూ.3 కోట్లు వెచ్చించనున్న సింగరేణిగోదావరిఖని: మంచిర్యాల – పెద్దపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ గోదావరిఖని సమీపంలోని గోదావరి నదిపై రెండు వంతెనలు నిర్మించారు. గోదావరి తీరంలోనే ప్రతీ రెండోళ్లకోసారి సమ్మక్క– సాలరమ్మ జాతర నిర్వహిస్తారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన వేలాది మంది భక్తులు గోదావరి నదిలోనే పుణ్యస్నానాలు ఆచరించి తరిస్తారు. వీరికోసం పుష్కరఘాట్ నిర్మిస్తారు. ఇక్కడి శివుని విగ్రహం, పరిసరాలను అందంగా తీర్చిదిద్దుతారు. గిరిజన దేవతల జాతర నిర్వహణకు ఆధునిక హంగులతో కూడిన సౌకర్యాలు కల్పిస్తారు. ఇందుకోసం సింగరేణి యాజమాన్యం సుమారు రూ.3 కోట్లు వెచ్చిస్తోంది. ఎండోమెంట్ పరిధిలోకి.. మంచిర్యాల – పెద్దపల్లి జిల్లాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు గిరిజన జాతరకు వస్తున్నారు. దీంతో 1998లో జాతర ఎండోమెంట్ పరిధిలోకి వెళ్లింది. అయితే, అభివృద్ధికి నోచుకోక పోగా.. గోదావరి బ్యాక్‌వాటర్‌తో అమ్మవార్ల గద్దెలు నీట మునుగుతున్నాయి. దీనిని అధిగమించేందుకు సింగరేణి సంస్థ ఓబీ మట్టిని లోతట్టు ప్రాంతాల్లో నింపి సుమారు 2 మీటర్ల ఎత్తున గద్దెలు నిర్మించేలా ప్రణాళిక రూపొందించింది. ఇదేసమయంలో నదీతీరంలోని పుష్కరఘాట్‌ను సుందరంగా తీర్చిదిద్ది పైపులైన్లు నిర్మిస్తుంది. గ్రిల్కూడా బిగిస్తుంది. శ్మశానవాటిక కనిపించకుండా.. సమ్మక్క – సారలమ్మ జాతర ప్రాంగణం సమీపంలోనే హిందూ శ్మశానవాటి ఉంది. ఇది భక్తులకు కనిపించకుండా దాదాపు 200 మీటర్ల పొడవున ప్రహరీ, సుమారు 600 మీటర్ల పొడవున సీసీరోడ్లు నిర్మిస్తారు. భక్తులు సేదతీరడంతోపాటు వంటలు తయారు చేసుకునేందుకు వీలుగా పెద్ద షెడ్లు నిర్మించనున్నారు. వచ్చే రెండు నెలల్లోగా ఈపనులు పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించారు. 1992లో సమ్మక్క – సారలమ్మ జాతర ప్రారంభం గోదావరిఖని శివారులోని గోదావరి తీరంలో 1992లో సమ్మక్క – సారలమ్మ జాతర ప్రారంభమైంది. ప్రతీ రెండేళ్లకోసారి మేడారంలో నిర్వహించే జాతరకు వేల సంఖ్యలో సింగరేణి కార్మికులు తరలివెళ్లేవారు. దీంతో బొగ్గు ఉత్పత్తిపై తీవ్రప్రభావం పడేది. దీనిని దృష్టిలో పెట్టుకున్న సింగరేణి యాజమాన్యం.. గోదావరి తీరంలోనే గిరిజన దేవతల జాతర నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో రెండేళ్లకోసారి మేడారం నుంచి కోయ పూజారులను రప్పించి జాతర నిర్వహిస్తోంది. ఇలా సుమారు 33 ఏళ్లుగా ఇక్కడ జాతర వైభవంగా జరుగుతోంది. 25వేల మంది భక్తులతో ప్రారంభమైన జాతర 5లక్షల మందికి చేరుకుంది.సింగరేణి సంస్థ కేటాయించిన నిధులు(రూ.లక్షల్లో)సీసీరోడ్లు 64 పుష్కరఘాట్ 25 పుష్కరఘాట్ రెయిలింగ్ 19.50 పుష్కరఘాట్ గదుల అభివృద్ధి 5.26 రిటర్నింగ్ వాల్ 42.50 ఓపెన్‌షెడ్(సమ్మక్క గద్దెల వెనకాల) 52 షాబాదిబండతో గద్దెల వద్ద ఫ్లోరింగ్ 34 ఓపెన్‌షెడ్(గద్దెల కుడివైపు) 43 నదీ తీరం.. ఇక పర్యాటకం గోదావరి నదీతీరాన్ని పర్యాటక క్షేత్రంగా తీర్చుదిద్దుతానని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్ ఆధ్వర్యంలో గోదావరితీరంలోని సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద రూ.3 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఆదివారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అంతేకాదు.. ఎకోపార్క్, రోడ్లు, షెడ్ల నిర్మాణం, జీడీకే–5 ఓసీపీ వద్ద రూ.98 లక్షల వ్యయంతో చేపట్టిన ఖబరస్తాన్ పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామగుండం, పాలకుర్తి, అంతర్గాం మండలాలకు చెందిన 148 మందికి కల్యాణలక్ష్మి, 23 మందికి షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. నాయకులు మహంకాళి స్వామి, పెద్ద్దెల్లి ప్రకాశ్, పొలసాని శ్రీనివాస్, బొంతల రాజేశ్, మారెల్లి రాజిరెడ్డి, ముస్తాఫా, బాలరాజ్‌కుమార్, శంకర్‌నాయక్, ఎస్వోటూ జీఎం గోపాల్‌సింగ్, డీజీఎం(పర్సనల్) కిరణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
13 అసెంబ్లీ స్థానాలు గెలవాల్సిందే..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రజతోత్సవ వేడుకల వేళ పార్టీని మరింత బలోపేతం చేస్తామని, కార్యకర్తలకు జిల్లా కార్యాలయాల్లో శిక్షణ శిబిరాలు ఏ ర్పాటు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు అన్నారు. ఆదివారం కరీంనగర్‌లోని వీ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పి లుపునిచ్చారు. బీఆర్ఎస్ హయాంలో వివిధ వ ర్గాలకు జరిగిన అభివృద్ధిని అంకెలతో సహా వివరించేలా కార్యకర్తలు తయారవాలన్నారు. ఇందుకోసం పార్టీ అధిష్టానం నుంచి పరిశీలకులు, సమన్వయకర్తలు వస్తారని వెల్లడించారు. కేసీఆర్‌కు కరీంనగర్ అంటే ప్రత్యేకమైన అభిమానమని, సింహగర్జన నుంచి రైతుబంధు, దళితబంధు వరకు అనేక కార్యక్రమాలు ఇక్కడే మొదలుపెట్టారని గుర్తుచేశారు. గత ఎన్నికల్లో 13 స్థానాల్లో కేవలం ఐదు మాత్రమే గెలిచామని, అందులో జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్‌లోకి వెళ్లారన్నారు. ఈసారి వచ్చే ఎన్నికల్లో 13 అసెంబ్లీ స్థానాలు మనమే గెలవాలని పిలుపునిచ్చారు. చెక్‌పోస్టులు పెట్టి మరీ: గంగుల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చెక్‌పోస్టులు పె ట్టి మరీ ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో మానేరు రివర్ ఫ్రంట్, తీగల బ్రిడ్జి వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు మొదలుపెడితే.. వాటిని ఖతం చేశారని, ఇదేంటని కాంట్రాక్టర్‌ను అడిగితే.. కాంగ్రెస్ హయాంలో అనేక మంది లీడర్లు ఇబ్బందులు పెడుతున్నారని వాపోయాడని చెప్పారు. అమాయక ప్రజలను చెక్‌పోస్టులు పెట్టి పీల్చిపిప్పి చేస్తున్నారని కట్టెలమోపు కథ ద్వారా వివరించారు. ఉద్యమ వ్యతిరేకి చేతిలో.. ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా పదేళ్లు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోయారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఎవరి పాలనలో అయితే సుఖశాంతులతో ఉంటారో దాని కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘ఎన్నో పోరాటాలు, త్యాగాలతో రాష్ట్రం సాధించుకున్నాం. ఉద్యమానికి వ్యతిరేకంగా కరీంనగర్ ప్రజల మీదకు తుపాకీ పట్టుకుని వచ్చిన వాడి చేతిలో రాష్ట్రం ఉంది. ఈ చెర నుంచి విడిపించాల్సిన బాధ్యత మనపై ఉంది’ అని పిలుపునిచ్చారు. ఒక తరాన్ని పరిచయం చేశారు బీఆర్ఎస్ పార్టీకి 25 ఏళ్లు నిండుతున్న సందర్భంగా వరంగల్‌లో గొప్ప సభ ఏర్పాటు చేయనున్నట్లు మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్ పేర్కొన్నారు. పార్టీకి ఎప్పుడు ఇబ్బందులు వచ్చినా ఆదుకునేది ఉమ్మడి వరంగల్, కరీంనగర్లే. కేసీఆర్‌ను శత్రువులు ఇబ్బందులు పెడితే, ఇక్కడికి వచ్చి గాలిపీలిస్తే ఆయనకు ఉత్తేజం వస్తదని తెలిపారు. ‘ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెడితే అందులో కేసీఆర్ లీడర్‌గా ఎదిగారు. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, నేను పోటీ చేశాం. పిల్లగాళ్లు అని కాంగ్రెస్ వాళ్లు ఎగతాళి చేసినా గెలిచి చూపించాం. అలా కేసీఆర్ కొత్త తరాన్ని రాజకీయాలకు పరిచయం చేశారు. 33 శాతం రిజర్వేషన్లను ఆధారంగా చేసుకుని మహిళలు నాయకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్, కల్వకుంట్ల సంజయ్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, కోరుకంటి చందర్, మనోహర్‌రెడ్డి, పుట్ట మధు, బాల్క సుమన్, నాయకులు రాజేశంగౌడ్, చల్మెడ లక్ష్మీనరసింహరావు, నారదాసు లక్ష్మణరావు, తోట ఆగయ్య, కర్ర శ్రీహరి, రాగిడి లక్ష్మారెడ్డి, రవీందర్రావు, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, దావ వసంత, రాకేశ్, తుల ఉమ, కోలేటి దామోదర్, హరీశ్ శంకర్, పొన్నం అనిల్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జోష్ నింపిన బైక్ ర్యాలీ అంతకుముందు కేటీఆర్‌కు ఘనస్వాగతం పలి కిన గులాబీ నాయకులు మంకమ్మతోట సత్యనా రాయణ స్వామి ఆలయం నుంచి బైపాస్ రోడ్డులోని వీ కన్వెన్షన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సమావేశ మందిరం నాయకులతో కిక్కిరి సిపోయింది. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పె ద్దపల్లి జిల్లాల నుంచి భారీగా కార్యకర్తలు, నాయకులు తరలిరావడంతో బైపాస్ రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మొత్తానికి కేటీఆర్ రాకతో బీఆర్ఎస్ నాయకుల్లో కొత్త జోష్ నిండింది. ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ చెక్‌పోస్టులు పెట్టి కాంగ్రెస్ లీడర్లు దోచుకుంటున్నారు : గంగుల ఉద్యమ వ్యతిరేకి చేతిలో రాష్ట్ర పగ్గాలు : ఈశ్వర్ కేసీఆర్ ఒక తరాన్ని పరిచయం చేశారు : వినోద్‌కుమార్ జోష్ నింపిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాలీ, సమావేశం -
సామర్థ్యానికి మించి..
మంథని: అసలే ప్రైవేట్ వాహనాలు.. ఆపై అస్తవ్యస్తమైన రహదారులు.. అనేక మూలమలుపులు.. నిబంధనలు సరిగా అమలుకు నోచుకోవు.. సా మర్థ్యానికి మించి ప్రయాణికులను చేరవేస్తున్నాయి.. అనూహ్యంగా ప్రమాదాలకు కారణమవుతున్నాయి.. ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న పలు రోడ్డు ప్రమాదాలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. ప్రధానంగా ఆటోలు, టాటా ఏస్ వాహనదారులు ప్రయాణికుల తరలింపులో నిబంధనలు అతిక్రమిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం జిల్లాలో ని పెద్దకల్వల వద్ద ఆగిఉన్న లారీని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పదో తరగతి విద్యార్థులు గాయపడ్డారు. శనివారం మంథని మండలం నాగెపల్లి వద్ద వ్యవసాయ కూలీలను తరలిస్తున్న టాటా ఏస్ వాహనం అదుపుతప్పి బోల్తాపడిన ప్రమాదంలో 16 మంది మహిళా కూలీలు గాయపడ్డారు. సౌకర్యం లేక.. తప్పనిసరై.. ప్రతీవ్యవసాయ సీజన్లో కూలీ పనుల కోసం పొరుగు జిల్లాలకు వెళ్లే వారు అనేకమంది ఉంటారు. అంతేగాకుండా స్థానికంగా పని లభించని పరిస్థితుల్లో మరికొందరు కూలీలు ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం తరలివెళ్తున్నారు. ఇంకా కొందరు కొరత ఉన్న ప్రాంతాలకు వెళ్లడం సహజం. మిర్చి ఏరేందుకు వెళ్తూ.. ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం మల్లారం, గాదంపల్లి, పెద్దతూండ్ల తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున మిర్చి సాగవుతోంది. అక్కడ కూలీల కొరత ఉంది. దీంతో సమీప గ్రామాల నుంచి కూలీలు.. ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో అక్కడకు వెళ్లి పనులు ముగించుకుని తిరిగి వస్తున్నారు. టాటా ఏస్ లాంటి వాహనంలో 10 నుంచి 12 మందిని తరలించాల్సి ఉండగా 20 మందిని తరలిస్తున్నారు. అలాగే ఐదు, ఆరు సీట్ల సామర్థ్యం గల ఒక్కో ఆటోలో 15 మందిని తరలిస్తున్నారు. మిర్చి ఏరే ప్రాంతాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులు, ఇతర రవాణా సౌకర్యం ఏమీలేదు. కొన్ని ప్రాంతాలకు ఆర్టీసీ, ఇతర వాహనాల సౌకర్యం ఉన్నా.. సమయానికి అందుబాటులో ఉండవు. తప్పనిసరి పరిస్థితిల్లో.. అదికూడా ప్రమాదకరమని తెలిసినా.. వ్యవసాయ కూలీలు ఆటోలు, టాటా ఏస్‌లు, ఇతర వాహనాల్లో ప్రయాణిస్తూ ప్రమాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కండిషన్ లేదు.. పర్యవేక్షణ లోపం నిత్యం ప్రయాణికులను చేరవేసే ప్రైవేట్ వాహనా ల కండిషన్‌ను పర్యవేక్షించాల్సిన అధికారులు ప ట్టించుకోవడంలేదు. పరిమితికి మించి ప్రయాణికు లు, విద్యార్థులను తరలిస్తున్నా నిర్లక్ష్యం చేస్తున్నా రు. ఫిట్నెస్ లేకున్నా, మరమ్మతుల్లోని వాహనాలు రోడ్లపై తిరుగుతున్నా తనిఖీలు చేయరు. ఈ క్రమంలోనే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలు అతిక్రమిస్తున్న ప్రైవేట్ వాహనదారులు ఆటోలు, టాటా ఏస్‌లలో పరిమితికి మించి ప్రయాణం తరచూ ప్రమాదాలు.. ప్రాణాలు కోల్పోతున్నా పట్టని యంత్రాంగం బోల్తాపడిన ఆటో కమాన్‌పూర్(మంథని): మండల కేంద్రంలోని పిల్లిపల్లె గ్రామంలో ఆదివారం ఆటో అదుపుతప్పి బోల్తాపడిపోయింది. జూలపల్లి గ్రామానికి చెందిన అరుణ్ తన కుటుంబసభ్యులతో కలిసి ఆటోలో పిల్లిపల్లె గ్రామంలో రేణుక ఎలమ్మ ఆలయానికి బయలు దేరారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో ఆటో పిల్లిపల్లెలోని మూలమలుపు వద్దకు చేరగా.. కుక్క అడ్డురావడంతో అదుపుతప్పిన ఆటో రోడ్డు పక్కన కందకంలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
వందల ఏళ్ల రక్షణ స్థావరం.. రామగిరి కోట!
అభివృద్ధికి అవకాశం ఉన్న పర్యాటక ప్రాంతాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా.. తెలంగాణలో తొలిసారిగా రోప్‌వే పర్యాటకానికి అవకాశం కల్పించింది. భువనగిరి జిల్లా యాదగిరి గుట్టపై 2 కిలోమీటర్ల రోప్‌వేను తొలిసారిగా ఏర్పాటు చేస్తుండగా.. రాష్ట్రంలో మరో నాలుగు ప్రతిపాదిత రోప్‌వేలలో పెద్దపల్లి జిల్లా రామగిరి కోటకు చోటు కల్పించారు. – మంథనిప్రాచీన శిల్పకళా సంపదకు చిరునామా.. రామగిరి ఖిలా జిల్లాలోని రామగిరి ఖిలాను జాతీయస్థాయిలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్‌ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. ఇక్కడి ప్రాచీన ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయించింది. రామగిరి ఖిలా (Ramagiri fort) క్రీస్తు శకం ఒకటో శతాబ్దంలో రామగిరి కోటగా రూ పుదిద్దుకుంది. ఈ కోట శత్రుదుర్భేద్యమైన రక్షణ స్థావరంగా వందల ఏళ్లపాటు వివిధ వంశాల రాజులకు ఆశ్రయమిచ్చింది. ఎంతో ఎత్తున్న దుర్గం, అనేక రాతి కట్టడాలు, బురుజులు, ఫీనాలతో విరాజిల్లుతోంది. దుర్గం అంతర్భాగంలో సాలుకోట, సింహాల కోట, జంగేకోట, ప్రతాపరుద్రుల కోట, అశ్వాల, కొలువుశాల, మొఘల్శాల, చెరసాల, గజశాల, భజనశాల, సభాస్థలితో పాటు రహస్య స్థలాలు, రహస్య మార్గాలు, సొరంగాలు, తీపులు, ఫిరంగి గుండ్లు ఇక్కడ దర్శనమిస్తాయి.తెలంగాణలోని దుర్గాల్లో ఈ దుర్గం పటిష్టంగా ఉండి.. వజ్రకూటంగా ప్రసిద్ధి చెందింది. సీతమ్మ కొలను గుంటపై పసుపు, ఎరుపు రంగు నీరు దర్శనమివ్వడం విశేషం. పిల్లల ఫిరంగి నుంచి దూరితే సంతానప్రాప్తి లభిస్తుందని పర్యాటకుల విశ్వాసం. రామగిరి ఖిలాపై సుందర దృశ్యాలు, ప్రాకారాలు.. సందర్శకులను ఆకర్షిస్తాయి. శ్రీరాముని మూల విగ్రహాలున్న స్థలంలో కొండ చరియకింద వెయ్యిమంది తలదాచుకోవచ్చు.రామగిరి కోటలో ఇరువైపులా 9 ఫిరంగులు, 40 తోపులు ఉన్నాయి. శ్రీరాముడు వనవాసకాలంలో రామగిరికోటపై తపస్సు చేసి గుహలో శివలింగాన్ని ప్రతిష్టించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడి కొండపై నుంచి వచ్చే నీటిధార.. బిలం నుంచి లోయలోకి ప్రవహిస్తోంది. ఈ ద్వా రం వద్ద సీతాదేవి స్నానమాచరించినట్లు భక్తుల నమ్మకం. కొండపై సీతారాముల విగ్రహాలతో పాటు నంది విగ్ర హం ఉంది. నీటిధార నేరుగా శివలింగం, నంది విగ్రహాలపై పడటం విశేషం. రామగిరి కొండ పైనుంచి వర్షాకాలం జలపాతాలు కనువిందు చేస్తాయి. రోప్‌వే (Rope Way) ద్వారా పర్యాటకుల్ని గుట్టపైకి తీసుకొచ్చేలా ప్రతిపాదనలు చేశారు. కేంద్రం నుంచి అనుమతి రాగానే.. రామగిరి ఖిలాకు పర్యాటకుల సందడి పెరగనుంది.లోయలాంటి సరస్సు ఎల్‌మడుగు గోదావరి నది మధ్య సహజసిద్ధంగా ఏర్పడిన అతి పెద్ద లోయలాంటి సరస్సే ఎల్‌మడుగు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల మధ్య మంథని మండలం ఖాన్సాయిపేట – శివ్వారం అటవీ ప్రాంతంలోని ఎల్‌మడుగు రెండు గుట్టల నడుమ ప్రవహిస్తోంది. ఈ సరస్సు చుట్టూ ఆనుకున్న దట్టమైన అటవీ ప్రాంతం, ఎత్తయిన కొండలు, గుట్టలు.. రెండు కొండల మధ్యనుంచి ప్రవహించే గోదావరి నది.. ఆ సరస్సులో సందడి చేసే పక్షుల కిలకిలారావాలు, నీటిలో ఎగిరే చేపల విన్యాసాలు కనువిందు చేస్తాయి. చిన్న చిన్న చేపపిల్లలు గుంపుగా కదులుతున్న దృశ్యం.. కళ్లెదుటే ఆక్వేరియం ఉన్నట్టు అనిపిస్తుంది. సుమారు రెండు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉండే ఈ సరస్సులో.. ఈ సుందర దృశ్యాలను కచ్చితంగా చూడాల్సిందే అనడం అతిశయోక్తి లేదు.ప్రకృతి అందాలతో కనువిందు చేసే ఎల్‌మడుగును ఇకో పార్కుగా అభివృద్ధి చేసేందుకు రూ.2 కోట్లు కేటాయించారు. ఇప్పటికే మంథని (Manthani) మండలం ఖానాపూర్ పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి గోదావరి వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. కాళేశ్వరంలో పర్యాటక అభివృద్ధికి రూ.115 కోట్లు, మంథనిలోని గోదావరి నది తీరంలో గౌతమేశ్వర ఘాట్ అభివృద్ధికి రూ.2 కోట్లు కేటాయించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ఇటీవల మంథనిలో పర్యటించగా, పర్యాటక శాఖ కమిషనర్ న్యాలకొండ ప్రకాశ్‌రెడ్డి సైతం రామగిరిని సందర్శించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్.. మంత్రి శ్రీధర్‌బాబు సతీమణి కాగా, పర్యాటక శాఖ కమిషనర్ ఈ ప్రాంతానికి సంబంధించిన ఐపీఎస్ అధికారి కావడం.. మంథనికి కలిసివస్తుందన్న ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతోంది.చదవండి: ఇక్కడ చదివిన వారెవరూ ఖాళీగా ఉండరు! -
అనుమానాలకు తావిస్తోంది
కొందరు వ్యాపారులు లాభాపేక్షతో అనారోగ్యానికి గురైన వాటిని వధించి విక్రయిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. మేకలు, గొర్రెలను పరిశీలించిన తర్వాతనే స్లాటర్ హౌస్‌లో వధించాలి. – మార్కపురి సూర్య, వినియోగదారు ప్రాణాలతో చెలగాటమా? బర్డ్స్ఫ్లూకు భయపడి ధర ఎక్కువైనా మటన్ కొంటున్న ప్రజల ప్రాణాలతో వ్యాపారులు, అధికారులు చెలగాటమాడుతున్నారు. మేకలు, గొర్రెలు ఆరోగ్యంగా ఉన్నాయా? అనేది ఎవరు ధ్రువీకరిస్తున్నారు? మాంసంపై ఎక్కడా మున్సిపల్ స్టాంప్ కనిపించడం లేదు. – ఈదునూరి శంకర్, వినియోగదారు చర్యలు తీసుకుంటాం మాంసం విక్రయాల్లో నిబంధనలు ఉల్లంచేవారిపై చర్యలు తీసుకుంటాం. రామగుండంలోని స్లాటర్‌హౌస్‌ను త్వరలో వినియోగంలోకి తీసుకొస్తాం. చనిపోయిన మేకలు, వధించిన తర్వాత వ్యర్థాలను నాలాల్లో వేస్తున్న వ్యాపారులపై జరినామా విధిస్తున్నాం. – అరుణశ్రీ, కమిషనర్, రామగుండం బల్దియా -
స్లాటర్‌హౌస్‌కు మరమ్మతు చేయండి
● బల్దియా కమిషనర్ అరుణశ్రీ కోల్‌సిటీ(రామగుండం): రామగుండం బల్దియాలోని స్లాటర్‌హౌస్ భవన మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీ ఆదేశించారు. నగరంలో పురోగతిలో ఉన్న వివిధ అభివృద్ధి పనులను ఆమె శనివారం పరిశీలించారు. మల్కాపూర్ శివారులోని పశువధశాల కిటికీలు చోరీకి గురవడంతోపాటు గోడల నుంచి తొలగించిన కిటికీల ప్రాంతాల్లో మరమ్మతులను వేగంగా పూర్తిచేయాలన్నారు. అనంతరం 39వ డివిజన్ ఖాజీపల్లిలో చేపట్టిన రోడ్డు పనులు, 29వ డివిజన్ బాపూజీనగర్ ప్రధాన రహదారిలో చేపట్టిన నీటిసరఫరా పైప్‌లైన్ లీకేజీలను పరిశీలించారు. పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి నీటికొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామన్, డీఈఈ షాభాజ్, శానిటరీ ఇన్స్పెక్టర్లు నాగభూషణం, కుమారస్వామి తదితరులు ఉన్నారు. రాయితీని సద్వినియోగం చేసుకోవాలి ఎల్ఆర్ఎస్ ధరఖాస్తుదారులు రుసుంలో 25 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని రామగుండం నగర సంస్థ కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీ సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. ఆమె మాట్లాడుతూ, ఈనెలాఖరుతో గడువు ముగుస్తుందని, ఈలోగా రుసుం చెల్లించాలన్నారు. టౌన్‌ప్లానింగ్ విభాగం అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీధర్ ప్రసాద్, అధికారి నవీన్ పాల్గొన్నారు. -
వర్షార్పణం
● 2,627 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం ● 1,514 ఎకరాల్లో దెబ్బతిన్న వరి పంట ● 1,084 ఎకరాల్లో ధ్వంసమైన మొక్కజొన్న ● క్షేత్రస్థాయిలో సర్వేచేసిన వ్యవసాయాధికారులు ● పరిహారం అందించాలని అన్నదాతల డిమాండ్ పెద్దపల్లిరూరల్/ఎలిగేడు/జూలపల్లి/కాల్వశ్రీరాంపూర్/సుల్తానాబాద్‌రూరల్: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవా రం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో వరి, మొక్కజొ న్న, మామిడిపంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రధానంగా పెద్దపల్లి, జూలపల్లి, ఎలిగేడు, సుల్తానాబాద్ మండలాల్లోనే పంటలకు అత్యధికంగా నష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధి కారులు గుర్తించారు. జిల్లా మొత్తంగా 1,896 మంది రైతులకు చెందిన సుమారు 2,627 ఎకరాల్లోని వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అత్యధికంగా 1,035 మంది రైతులకు చెందిన 1,514 ఎకరాల్లో వరి, 828 మంది రైతులకు చెందిన 1,084 ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలవాలిందని వారు వివరించారు. దెబ్బతిన్న పంటలు పరిశీలించిన అధికారులు.. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను జిల్లా వ్యవసాయాధికారి ఆదిరెడ్డి, ఏడీఏ శ్రీనాథ్, ఏవో అలివేణితో పాటు ఏ ఈవోలు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నష్టం వివరాలను ప్రాథమికంగా అంచనావేశారు. పెద్దపల్లి మండలం భోజన్నపేట, హన్మంతునిపేట, చీకురాయి, రాంపల్లి, గౌరె డ్డిపేట, ముత్తారం తదితర గ్రామాల్లో పర్యటించి పంట నష్టం వివరాలు సేకరించి రైతులతో మాట్లాడారు. అత్యధికంగా వరి 1,514 ఎకరాల్లో నష్టం జరగ్గా, ఆ తర్వాత మొక్కజొన్న 1,084 ఎకరాల్లో నేలవాలిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. మరో 20 ఎకరాల్లో కూరగాయలు, ఇంకో 10 ఎకరాల్లో పెసర, మిరపలాంటి పంటలు నష్టపోయాయని గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. చేతికందే దశలో.. చేజారింది వరి, మొక్కజొన్న కొద్దిరోజుల్లోనే చేతికి వచ్చేవని, ఈలోగా అకాల వర్షాలకు వరి, మొక్కజొన్న పంటలు పాడై తీరని నష్టాన్ని కలిగించాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మంచి దిగుబడులు సాధిస్తామన్న తమ ఆశలన్నీ అడియాసలయ్యాయని వాపోయారు. అకాల వర్షాలకు పంట నష్టం కలిగి.. దిగుబడులు తగ్గి పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు లేవని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వర్షపాతం వివరాలు జిల్లాలో సరాసరి వర్షపాతం 15.3 మి.మీ.గా నమోదైంది. అత్యధికంగా ధర్మారం మండలంలో 46.8 మి.మీ. వర్షం కురరవగా అత్యల్పంగా 2.2మి.మీ. వర్షపాతం ముత్తారం (మంథని) మండలంలో నమోదైందని ముఖ్యప్రణాళికాధికారి రవీందర్ తెలిపారు. పెద్దపల్లిలో 33.0 మి.మీ., ధర్మారంలో 46.8 మి.మీ., అంతర్గాంలో 27.3 మి.మీ., పాలకుర్తిలో 3.6 మి.మీ., రామగుండంలో 8.1 మి.మీ., రామగిరిలో 19.2 మి.మీ. వర్షపాతం నమోదు అయ్యింది.ఈ రైతు పేరు గుర్రం సతీశ్. పెద్దపల్లి మండలం హన్మంతునిపేట స్వగ్రామం. తనకున్న 1.5 ఎకరా లతోపాటు మరో ఆరెకరాలను కౌలుకు తీసుకుని వరి, మొక్కజొన్న వేశాడు. శుక్రవారం రాత్రి కురి సిన వడగండ్లకు రెండు పంటలూ నేలవాలాయి. కొద్దిరోజుల్లోనే పంట చేతికొస్తుందని ఆశపడితే ప్రకృతి పగబట్టిందని సతీశ్ వాపోయాడు. -
టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దాలి
గోదావరిఖని: తన నియోజకవర్గాన్ని టూరిజం ప్రాంతంగా తీర్చిదిద్దాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ కోరారు. శనివారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. తన నియోజకవర్గం పరిశ్రమలకు, ఆధ్యాత్మికతకు నిలయమన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో నిరంతరం 5 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని తెలిపారు. ఇక్కడ రిసార్ట్స్ ఏర్పాటు చేయాలన్నారు. రామునిగుండాల గుట్ట, శ్రీత్రిలింగ రాజరాజేశ్వరస్వామి ఆలయం, గోదావరి నదీపరీవాహక ప్రాంతం ఆధ్యాత్మికతకు సూచికగా ఉన్నాయని అన్నారు. సింగరేణిలోని 7ఎల్ఈపీ బొగ్గు గనిని మైనింగ్ టూరిజంగా గతంలో ప్రకటించినా.. ప్రస్తుతం మూసివేశారని తెలిపారు. దానిని యథావిధిగా కొనసాగించేలా చూడాలని ఆయన కోరారు. పారాగ్లైడింగ్, హట్ బెలూన్స్, మైనింగ్ టూరిజం, టెంపుల్స్ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. నదీ ప్రాంతంలో బోటింగ్ తదితర ఏర్పాట్లను చేయాలని ఆయన కోరారు. -
నేడు బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం● ముఖ్య అతిథులుగా కేటీఆర్, హరీశ్‌రావు
కరీంనగర్: తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లపాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సన్నాహాక సమావేశం ఆదివారం కరీంనగర్ జిల్లాకేంద్రంలోని వీ–కన్వెన్షన్‌లో జరగనుంది. ఉమ్మడి జిల్లాస్థాయి సమావేశాన్ని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు హాజరు కానున్నారు. శనివారం వీ– కన్వెన్షన్ ఫంక్షన్‌హాల్ వద్ద ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఏర్పాట్లు పరిశీలించారు. సమావేశానికి పార్టీ మాజీ కార్పొరేటర్లు, మాజీ కో– ఆప్షన్ మెంబర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ కమిటీల ప్రతినిధులు, కార్యకర్తలు హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రత్యేక పరిస్థితుల్లోనే గర్భస్రావానికి అనుమతి పెద్దపల్లిరూరల్: గర్భస్రావాన్ని ఇష్టానుసారంగా చేస్తే చర్యలు తప్పవని, ప్రత్యేక పరిస్థితుల్లోనే అనుమతినిస్తారని డీఎంహెచ్‌వో అన్నప్రసన్నకుమారి అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో శనివారం ప్రైవేట్ ఆస్పత్రుల గైనకాలజిస్టులకు పలు సూచనలు చేశారు. జిల్లా లో 12 ఆస్పత్రులకే అనుమతి ఉందని, అందు లో ఇటీవల ఓ ఆస్పత్రిని సీజ్ చేశామన్నారు. గర్భవతికి మానసిక, శారీరక ఆరోగ్యానికి హాని కలిగే అవకాశమున్నప్పుడు, వైకల్యం గల బిడ్డ పుట్టే అవకాశం ఉన్నప్పుడు, బలత్కా రానికి గురై గర్భం దాల్చినప్పుడే గర్భ స్రావం చేసేందుకు అనుమతి ఉంటుందన్నారు. నీటిని పొదుపుగా వినియోగించాలి జ్యోతినగర్(రామగుండం): నీటిని పొదుపుగా వినియోగించాలని రామగుండం ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్‌కుమార్ సమంత సూచించారు. ప్రపంచ జలదినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీపీసీలో శనివారం నిర్వహించిన కార్యక్రమాన్ని చందన్‌కుమార్ సమంత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణపై శిక్షణ, పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త, సాంకేతిక సలహాదారు డాక్టర్ ఎన్.రవీందర్ ‘నీటి ప్రాముఖ్యత –నీటి దినోత్సవం ప్రాముఖ్యత’ అంశంపై ప్రసంగించారు. నీటి సంరక్షణపై ఉద్యోగులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది, కుటుంబ సభ్యులకు ఆన్లైన్లో వ్యాసరచన పోటీలు నిర్వహించగా విజేతలకు బహుమతులు అందజేశారు. జీఎం(ఓఅండ్ ఎం) ఏఆర్ దాస్, జీఎం(ఆపరేషన్స్) కేసీ సింఘారాయ్ తదితరులు పాల్గొన్నారు. టెన్త్ హిందీ పరీక్షకు 7,374 మంది హాజరు పెద్దపల్లిరూరల్: జిల్లాలో పదో తరగతి హిందీ పరీక్ష శనివారం ప్రశాంతంగా జరిగింది. జిల్లావ్యాప్తంగా 7,383 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 7,374 మంది విద్యార్థులు హాజరయ్యారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఫ్లయింగ్‌స్వాడ్ బృందాలతోపాటు ఉన్నతాధికారులు పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారని పేర్కొన్నారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని శంకర్‌గంజ్ ప్రాంతంలో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాస్ శనివారం తెలిపారు. విద్యుత్ మరమ్మతు ల నిర్వహణ కారణంగా ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఆయన పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు. -
రామగుండం బల్దియా క్లీన్‌పై క్యూసీఐ నజర్
● నగరంలో పర్యటించిన ఢిల్లీ ప్రతినిధుల బృందం కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థను చెత్త రహిత ప్రాంతం(జీఎఫ్‌సీ)గా అభివృద్ధి చేస్తున్న తీరును ఢిల్లీ నుంచి వచ్చిన క్యాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(క్యూసీఐ) ప్రతినిధులు రంజిత్ పుత్ర, జీవన్ కిశోర్ నాయక్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలిరోజు స్థానిక 21వ, 22వ డివిజన్లలోని పాత రామగుండం, అయోధ్యనగర్‌లో పర్యటించిన ప్రతినిధులు.. పలు ఇళ్లలో తడి, పొడి చెత్తను సేకరిస్తున్న తీరుపై ఆరా తీశారు. ఈ ప్రక్రియకు సంబంధించిన వివరాలు, ఫొటోలను వారు సేకరించారు. స్థానికులతో మాట్లాడి పారిశుధ్యం పనితీరుపై అభిప్రాయాలను తీసుకున్నారు. రహదారులపై వీధి దీపాలు, ఫుట్‌పాత్‌లు, రోడ్లపై చెత్త కుప్పలను ప్రతినిధులు పరిశీలించారు. సుమారు వారం నుంచి పది రోజులపాటు క్యూసీఐ ప్రతినిధులు రామగుండం నగరంలోనే ఉంటారని సమాచారం. వీరి వెంట ఎన్విరాల్మెంట్ ఇంజినీరు మధూకర్, అధికారి శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. రౌడీషీటర్లు ప్రవర్తన మార్చుకోవాలి ● పెద్దపల్లి ఏసీపీ కృష్ణ సుల్తానాబాద్‌రూరల్: రౌడీషీటర్లు త మ పద్ధతులు మార్చుకుని సత్ప్రవర్త నతో వ్యవహరించాలని ఏసీపీ గజ్జి కృష్ణ సూచించారు. సుల్తానాబాద్ పోలీస్ సర్కిల్లోని సుల్తానాబాద్, జూలపల్లి, కాల్వశ్రీరాంపూర్, పొత్క పల్లి పోలీస్స్టేషన్ల పరిధిలో గల రౌడీషీటర్లతో శనివారం సుల్తానాబాద్ సర్కిల్ కా ర్యాలయంలో సమావేశం నిర్వహించారు. సీఐ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఏసీపీ కృష్ణ మాట్లాడుతూ, ప్రజలపై గొడవలు, అల్లర్లు, బెదిరింపులకు పాల్పడితే రౌడీషీట్ తెరుస్తామన్నారు. ఇలా చేయడం ద్వారా పదేపదే జై లుకు వెళ్తారని, అలాకాకుండా సత్ప్రవర్తనతో మెలగాలని ఆయన సూచించారు. రౌడీషీటర్లు మళ్లీ గొడవలకు దిగి తమ కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకోవద్దని కోరారు. అందరితో కలిసి సంతోషంగా గడపాలని ఆయన అన్నారు. -
ప్రభుత్వమే ఆదుకోవాలి
నాకున్న నాలుగున్నర ఎకరాల్లో వరి, మొక్కజొన్న వేసిన. రాళ్లవానకు పంటలన్నీ నేలవాలాయి. చేతికి అందుతుందనుకున్న దశలో తీరని నష్టం జరిగింది. ప్రభుత్వమే ఆదుకోవాలి. – ఎనగందుల శ్రీనివాస్, రైతు, పెద్దబొంకూర్ పెట్టుబడి కూడా రాదు నాకున్న రెండున్నర ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశా. కంకి, పాలుపోసే దశలో ఉండగా వడగండ్లకు పంట నేలవాలింది. దాదాపు రూ.90 వేల దాకా నష్టం వాటిల్లింది. ప్రభుత్వమే పరిహారం అందించాలి. – మల్లెత్తుల బక్కయ్య, రైతు, ధూళికట్ట ప్రభుత్వానికి నివేదిస్తాం అకాల వర్షానికి సుమారు 2,627 ఎకరాల్లోని వరి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. ఏఈవోలు, క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ వివరాలు సేకరించారు. వివరాలను ప్రభుత్వానికి వెంటనే నివేదిస్తాం. – ఆదిరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి -
వస్త్రోత్పత్తి ఆర్డర్లు సకాలంలో పూర్తి చేయాలి
సిరిసిల్ల: వస్త్రోత్పత్తిదారులు ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్లో శుక్రవారం వస్త్రోత్పత్తిదారులతో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ సమగ్ర శిక్ష అభియాన్, సంక్షేమశాఖల వస్త్రోత్పత్తి ఆర్డర్లను వెంటనే అందించాలన్నారు. ఇందిరా మహిళాశక్తి చీరల ఆర్డర్లను వేగంగా పూర్తి చేయాలన్నారు. చేనేత, జౌళిశాఖ ఏడీ రాఘవరావు, టెస్కో ప్రతినిధి శంకరయ్య, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆడెపు భాస్కర్, టెక్స్టైల్ పార్క్ అధ్యక్షుడు అన్నల్దాస్ అనిల్‌కుమార్ పాల్గొన్నారు. కారుణ్య నియామకాలు సిరిసిల్ల మున్సిపాలిటీలో ప్రజారోగ్య విభాగంలో పనిచేస్తూ మరణించిన ఉద్యోగుల వారసులకు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కారుణ్య నియామకపత్రాలు అందించారు. ప్రజా ఆరోగ్య విభాగంలో పబ్లిక్ హెల్త్ వర్కర్‌గా పనిచేసే సిరిగిరి నర్సింహులు అనారోగ్యంతో 2020లో మరణించగా.. అతని కుమారుడు సిరిగిరి రాజుకు ఉద్యోగ నియామకపత్రం అందించారు. నగునూరి నాంపల్లి 2023 మరణించగా అతని భార్య నగునూరి లతకు నియామకపత్రం అందించారు. మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, కలెక్టరేట్ ఏవో రాంరెడ్డి పాల్గొన్నారు. అర్హులకు ఓటుహక్కు కల్పించాలి జిల్లాలో 18 ఏళ్లు నిండిన వారికి ఓటుహక్కు కల్పించాలని కలెక్టర్ కోరారు. శుక్రవారం రాజకీయ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఓటర్ జాబితా సవరణ పకడ్బందీగా చేయాలన్నారు. ఎన్నికల సమయంలో కాకుండా ఓటర్ జాబితా సవరణపై రాజకీయ నాయకుల ప్రతినిధులు ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవాలని సూచించారు. జిల్లాలో 2,30,157 మంది పురుషులు, 2,47,977 మంది మహిళా ఓటర్లు, 38 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారని తెలిపారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు రాధాభాయి, రాజేశ్వర్, రాజకీయ పార్టీల ప్రతినిధులు నాగుల శ్రీనివాస్, సంపత్, రాజన్న, రమేశ్, రమణ, ఎన్నికల సిబ్బంది రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా -
సందడిగా అల్ఫోర్స్ ‘ఫ్లిక్కర్’
కొత్తపల్లి: వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ మైదానంలో శుక్రవారం శ్రీఫ్లిక్కర్శ్రీ పేరిట నిర్వహించిన భగత్‌నగర్ అల్ఫోర్స్ ఈటెక్నో స్కూల్ వార్షికోత్సవం సందడిగా సాగింది. వేడుకలను ఎస్సారార్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ వి.మధుసూదన్‌రెడ్డితో కలిసి అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్‌రెడ్డి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ 35ఏళ్లుగా అల్ఫోర్స్ విద్యా సంస్థల ద్వారా రాష్ట్ర విద్యారంగానికి విశిష్ట సేవలు అందిస్తూ తలమానికంగా నిలుస్తున్నామని తెలిపారు. అల్ఫోర్స్ ఈటెక్నో పాఠశాల, కళాశాలలో విద్యనభ్యసించిన హర్షిత్‌రెడ్డి ఇటీవల గేట్–2025లో ఆల్ఇండియా 60వ ర్యాంకు సాధించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. బిల్లుల కోసం మంత్రుల చుట్టూ ప్రదక్షిణలుకరీంనగర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన నిర్వహిస్తున్నదా లేక రాక్ష స పాలన సాగిస్తున్నదా అని మాజీ స ర్పంచుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు లక్ష్మీరాజం ప్రశ్నించా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ అభివృద్ధి బి ల్లుల విడుదలకు మోకాలడ్డుతున్న ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తప్పుబడుతూ, ఆందోళనలకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించా రు. బిల్లుల కోసం మంత్రుల చుట్టూ తిరిగినా, నిరాశే మిగి లిందని విమర్శించారు. నాయకుల ఎదుట మా సమస్యలు చెప్పుకోవడం తప్పేనా అన్నారు. అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలను కలవడం అనైతికమా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని, లేదంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. -
రాములోరికి తలంబ్రాలు
జ్యోతినగర్(రామగుండం): కల్యాణం కోసం తలంబ్రాల తయారీకి సాధారణంగా మరపట్టిన బియ్యం వినియోగిస్తారు. కానీ, శ్రీసీతారాముల కల్యాణం కోసం గోటితో వొలిచిన తలంబ్రాలు వినియోగించడం ఆనవాయితీగా వస్తోంది. ఈక్రమంలోనే ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీలోని శ్రీసీతారామ సేవా సమితి సభ్యులు గోటితో వొలిచిన తలంబ్రాలను శ్రీసీతారామ కల్యాణం కోసం పంపించడం ఆనవాయితీగా వస్తోంది. ఈఏడాది కూడా భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి సన్నిధిలో ఏప్రిల్ 6న శ్రీరామ నవమి నిర్వహించనున్నారు. స్వామివారి కల్యాణోత్సవం కోసం మహిళలు గోటితో వొలిచిన తలంబ్రాలను పంపించి భక్తిని చాటుకుంటున్నారు. గోటితో కోటి తలంబ్రాలను వొలిచే ఈ కార్యక్రమానికి సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీసీతారామ సేవా సమితి సభ్యులు కంది సుజాత, కొండు రమాదేవి, జనగామ రాజేశ్వరి, ఆలయ కమిటీ సభ్యుడు చెప్యాల సత్యానారాయణరావు తదితరులు పాల్గొన్నారు. కోటి తలంబ్రాలు ఒలిచే కార్యక్రమానికి శ్రీకారం -
ఇఫ్తార్‌కు ఏర్పాట్లు చేసి వెళ్తుండగా..
శంకరపట్నం(మానకొండూర్): రంజాన్ మాసం సందర్భంగా శుక్రవారం సాయంత్రం నిర్వహించే ఇఫ్తార్ విందుకు తండ్రికొడుకులు ఏర్పాట్లు చేశారు. అంతలోనే జరిగిన రోడ్డుప్రమాదంలో అసులువుబాసారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో ఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని మక్త గ్రామానికి చెందిన తండ్రికొడుకులు షేక్ అజీమ్ (35), షేక్ రెహమాన్ (10) శుక్రవారం కేశవపట్నంలో ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు చేసి ఇంటికి బైక్‌పై వెళ్తున్నారు. అదే సమయంలో మండలంలోని మెట్పల్లి గ్రామానికి చెందిన మందాడి శ్రీనివాస్‌రెడ్డి, ఇజ్జిగిరి హరీశ్ కూడా కేశవపట్నం నుంచి బైక్‌పై వెళ్తుండగా వరంగల్ నుంచి కరీంనగర్ వస్తున్న లారీ కేశవపట్నం బ్రిడ్జి సమీపంలో ఇరువురి బైక్‌లను ఢీకొంది. ఈ ప్రమాదంలో అజీమ్, రెహమాన్ తీవ్రంగా గాయపడ్డారు. మందాడి శ్రీనివాస్‌రెడ్డికి తీవ్ర, హరీశ్‌కు స్వల్పగాయాలయ్యాయి. కేశవపట్నం ఎస్సై రవి, సిబ్బంది 108వాహనంలో క్షతగాత్రులను హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో అజీమ్, రెహమాన్‌ను పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన లారీ ఆగకుండా వెళ్లడంతో పోలీసులు, స్థానికులు వంకాయగూడెంలో పట్టుకున్నారు. ప్రమాద స్థలాన్ని ఏసీపీ శ్రీనివాస్‌జీ, హుజూరాబాద్ రూరల్ సీఐ వెంకటి పరిశీలించారు. సాయంత్రం వేళ ఇఫ్తార్ విందులో పాల్గొనాల్సిన తండ్రికొడుకుల దుర్మరణం స్థానికులను కలచివేసింది. రెండు బైక్‌లను ఢీకొన్న లారీ తండ్రీకొడుకులు మృతి మరో ఇద్దరికి తీవ్రగాయాలు -
మూత్రశాలలు శుభ్రంగా ఉన్నాయా?
కోల్‌సిటీ(రామగుండం): కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ, స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో దేశంలోని పట్టణాలు, నగరాలు, మహానగరాల్లో పారిశుధ్యా న్ని మెరుగుపర్చడం కోసం ఏటా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈసారి రెడ్యూస్–రియూజ్–రీసైకిల్(ఆర్ఆర్ఆర్) పేరిట ‘స్వచ్ఛ సర్వేక్షణ్–2024’ పోటీలు చేపట్టారు. ఇందులోనూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ బరిలో నిలిచింది. ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణ్కు కీలకమైన ప్రజప్రాయా(సిటిజన్ ఫీడ్‌బ్యాక్) సేకరణ చేపట్టిది. మరో కీలకమైన బ హిరంగ మలవిసర్జన రహితం(ఓడీఎఫ్) పరిస్థితిని తనిఖీ చేయడానికి ఢిల్లీ నుంచి క్యాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(క్యూసీఐ) ప్రతినిధులు శుక్రవారం రామగుండం చేరుకున్నార. శనివారం నుంచి బల్దియాలో ఓడీఎఫ్ స్థితిని నేరుగా తనిఖీ చేస్తారు. ఓడీఎఫ్ – ప్లస్ ప్లస్ కోసం ఆశలు.. రామగుండం బల్దియాకు ప్రస్తుతం ఓడీఎఫ్ ప్లస్(బహిరంగ మలవిసర్జన రహితం) గుర్తింపు మాత్రమే ఉంది. 2023లో ఆ గుర్తింపు వచ్చింది. ఓడీఎఫ్–ప్లస్‌ప్లస్ గుర్తింపు కోసం ఇటీవల దరఖాస్తు చేసింది. అయితే, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ) పూర్తయినా వినియోగంలోకి రాలేదు. మల్కాపూర్‌లో వినియోగంలోకి వచ్చిన ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎఫ్ఎస్టీపీ) ద్వారా ఓడీఎఫ్ ప్లస్‌ప్లస్ గుర్తింపు వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఓడీఎఫ్‌కు 1,200 మార్కులు.. ఈ ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్–2024 పోటీలో మొత్తం 12,500 మార్కులు కేటాయించారు. ఇందులో ఓడీఎఫ్‌కు 1,200, గార్జెబ్ ఫ్రీ సిటీ విభాగానికి 1,300, ఇతర విభాగాలకు 10,000 మార్కులు కేటాయించారు. క్యూసీఐ ప్రతినిధులు ఇచ్చే మార్కుల ఆధారంగా ఓడీఎఫ్‌పై రేటింగ్ రానుంది. జాతీయ స్థాయిలో ప్రకటించే ర్యాంక్క్లకూ ఓడీఎఫ్ మార్కులు కీలకం కానున్నాయి. నేటి నుంచి క్యూసీఐ బృందం పరిశీలన.. ఢిల్లీ నుంచి వచ్చిన క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(క్యూసీఐ)లో రంజిత్ పుత్ర, జీవన్ కిశోర్ నాయక్ ఉన్నారు. తొలిరోజున బల్దియా కార్యాయంలో ఓడీఎఫ్ డాక్యుమెంట్లు పరిశీలించారు. శనివారం నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. దీంతో పారిశుధ్య విభాగం అప్రమత్తమైంది. బల్దియాలో 25 టాయిలెట్స్ పరిశీలన.. బల్దియాలో ఆరు పబ్లిక్, 19 కమ్యూనిటీ టాయిలెట్స్‌తోపాటు ఎఫ్ఎస్టీపీ ప్లాంట్ వినియోగంలో ఉ న్నాయనిఅధికారులుస్వచ్ఛ సర్వేక్షణ్ ఆన్లైన్లో పొందుపరిచారు. వీటి ఆధారంగా క్యూసీఐ వాటిని క్షేత్రస్థాయిలోపరిశీలించి వివరాలు సేకరించనుంది. క్యూసీఐ పరిశీలించే అంశాలు.. సెఫ్టిక్ ట్యాంక్‌ల నిర్వహణ, పబ్లిక్, కమ్యూనిటీ టాయిలెట్స్‌లో అందుబాటులో కేర్ టేకర్, రోస్టర్ పద్ధతిలో క్లీనింగ్, టాయిలెట్స్‌కు వచ్చే ప్రజల ఫీడ్‌బ్యాక్, మహిళలు, పురుషులు గుర్తించేలా టాయిలెట్స్ బోర్డులున్నాయా? లోపల లైటింగ్, వా ష్బేసిన్, మిర్రర్, విడిగా యూరినల్స్, బాత్రూం తలుపులకు లోపలైపు బోల్టులు, వాటర్ సరఫరా, దుర్వాసన రాకుండా ఒడోనిల్, వెంటిలేషన్, ఎగ్జాస్టింగ్, క్యూఆర్ కోడ్ తదితర సౌకర్యాలపై క్యూసీఐ తనిఖీ చేసి ఫొటోలు తీసుకోనుంది. అక్కడికక్కడే ఆన్లైన్లో వివరాలను నమోదు చేయనుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంక్‌లు తలుపులు బిగించారా.. దుర్వాసన వస్తుందా? నేటి నుంచి క్యూసీఐ బృందం క్షేత్రస్థాయి తనిఖీలు రామగుండం బల్దియాకు చేరుకున్న ఢిల్లీ ప్రతినిధులు సెప్టిక్ ట్యాంకులు, టాయిలెట్ల నిర్వహణపై ఆరాకు సన్నద్ధంపారిశుధ్య విభాగం ప్రొఫైల్: మొత్తం డివిజన్లు 50 విస్తీర్ణం(చ.కి.మీ.లలో) 93.87 జనాభా(2011 లెక్కల ప్రకారం) 2,29,644 గుర్తించిన మురికివాడలు 92 స్వచ్ఛ సర్వేక్షణ్–2024 మార్కులు కేటాయించినవి 12,500 గార్జెబ్ ఫ్రీ సిటీ విభాగం 1,300 ఓడీఎఫ్, ఓడీఎఫ్ ప్లస్‌ప్లస్, వాటర్ ప్లస్ 1,200 ఇతర విభాగాలు 10,000 పోటీ పడుతున్న బల్దియాలుసంవత్సరంరామగుండం ర్యాంక్ 2017 434 191 2018 4203 194 2019 4237 192 2020 4242 211 2021 4320 92 2022 4354 136 2023 4416 175 2024 4900 (ప్రస్తుతం ర్యాంక్ సర్వే) -
రోడ్డుప్రమాదాల నియంత్రణే లక్ష్యం
గోదావరిఖని: రోడ్డు ప్రమాదాల నియంత్రణే ల క్ష్యంగా పనిచేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదేశించారు. శుక్రవా రం పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో రోడ్డుసేఫ్టీపై సమీక్షించారు. ఎన్‌హెచ్–63, ఎన్‌హెచ్–363, ఎ స్హెచ్–1, ఎస్‌హెచ్–24, ఎస్‌హెచ్ –8 తదితర రోడ్లను గూగుల్ మ్యాప్ ద్వారా ఆయన పరిశీలించారు. 2022 నుంచి 2024 వరకు జరిగిన ప్రమా దాలు, మృతుల వివరాలు, ప్రమాదానికి గల కా రణాలు, నియంత్రణకు తీసుకొన్న చర్యలపై విశ్లేషించారు. బ్లాక్స్పాట్ల వద్ద రేడియం స్టికర్లతో కూ డిన సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైనచోట స్పీడ్ బ్రేకర్లు, సీసీ కెమెరాలు, లైట్లు, స్పీడ్ కెమెరాలు, జిబ్రా క్రాసింగ్ ఏర్పాటు చేయాలన్నారు. నేరాల నియంత్రణకు విజబుల్ పోలీసింగ్ ముఖ్యమని సూచించారు. సమాచార వ్యవ స్థను పటిష్టం చేసుకోవాలని అన్నారు. డ్యూటీ సమయంలో సిబ్బంది, అధికారులు స్వీయ రక్షణ పాటించాలని సీపీ సూచించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సైదాపూర్(హుస్నాబాద్): ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొని మండలంలోని గొల్లగూడెంకు చెందిన మర్రి సదానందం (47) మృతిచెందాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. హుజూరాబాద్‌కు చెందిన ప్రైవేట్ స్కూల్ బస్సు శుక్రవారం సైదాపూర్ వెళ్తుండగా బొత్తల్లపల్లి వద్ద మర్రి సదానందం ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈప్రమాదంలో సదానందం తీవ్రంగా గాయపడ్డాడు. బ్లూకోల్ట్స్ సిబ్బంది 108లో సదానందంను హుజూరాబాద్ ఆస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించగా మార్గమధ్యలో మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం రామగుండం: రామగుండం–పెద్దంపేట రైల్వేస్టేషన్ల మధ్య గురువారం అర్ధరాత్రి దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం చెందినట్లు జీఆర్పీ ఔట్‌పోస్టు ఇన్చార్జి గంగారపు తిరుపతి తెలిపారు. మృతుడి వయస్సు 35–40 మధ్య ఉంటుందన్నారు. నల్లటి జీన్స్ ప్యాంట్, బ్లూ కలర్ ఫుల్‌షర్టు ధరించి ఉన్నాడన్నారు. తలపగిలి నుజ్జునుజ్జు కావడంతో ముఖాన్ని గుర్తుపట్టలేని విధంగా ఉందని తెలిపారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని, పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి మార్చురీలో భద్రపరిచామని ఆయన పేర్కొన్నారు. సంబంధీకులు ఉంటే సెల్ నంబరు 99493 04574, 87126 58604లో సంప్రదించాలని ఆయన కోరారు. ఎస్సారెస్పీ కాలువలో మృతదేహం లభ్యం హుజూరాబాద్: తుమ్మన్నపల్లి గ్రామంలోని ఎస్సారెస్పీ కాలువలో శుక్రవారం ఓ మృతదేహం లభ్యమైంది. పోలీసుల వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన వాసాల అరవింద్(21) కరీంనగర్ జిల్లా ఎస్సారార్ డిగ్రీ కళాశాలలో ఫైనలియర్ చదువుతున్నాడు. ఈనెల 19న స్నేహితులతో కలిసి ఎల్ఎండీలోని ఎస్సారెస్పీ కాలువ వద్దకు ఈత కోసం వెళ్లి గల్లంతైనట్లు ఎల్ఎండీ పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వృద్ధురాలు అదృశ్యంకొత్తపల్లి(కరీంనగర్): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరెం గ్రామానికి చెందిన సావనపల్లి లక్ష్మి (70) బస్సులో కరీంనగర్‌కు ప్రయాణిస్తూ అదృశ్యం అయింది. నలుపు రంగు, గుండ్రని ముఖం కలిగి, ఎత్తు ఐదడుగులు ఉంటుంది. గులాబీ రంగు చీర, నీలం రంగు జాకెట్ ధరించి ఉంది. ఆమె కోసం బంధువులు, పోలీసులు ఆరా తీస్తూ గాలిస్తున్నారు. అయినప్పటికీ ఆచూకీ లభించడం లేదు. ఆమె కనిపిస్తే కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌కు ఫోన్ నంబర్లు 9494490268/ 8712670765లకు సమాచారం అందించాలని, వారికి నగదు పారితోషికం ఇవ్వబడుతుందని ఎస్‌హెచ్‌వో, శిక్షణ ఐపీఎస్ వసుంధర యాదవ్ తెలిపారు. -
అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వేస్టేషన్ అభివృద్ధి
రామగుండం: అంతర్జాతీయ ప్రమాణాలతో రామగుండం రైల్వేస్టేషన్‌ను ఎయిర్ పోర్ట్‌ను తలదన్నేలా ఆధునికీకరిస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అన్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రధాన ఉద్దేశమన్నారు. రామగుండం రైల్వేస్టేషన్ పనులను శుక్రవారం పరిశీలించారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా రూ.26.5 కోట్లతో రైల్వేస్టేషన్ ఆధునికీకరణ చేపట్టామని, ఈ పనులు తుదిదశకు చేరుకున్నాయని తెలిపారు. పది రోజుల్లోగా రైల్వేస్టేషన్‌ను ప్రారంభిస్తామని అన్నారు. రైల్వేస్టేషన్‌ను కలియ తిరిగిన అనంతరం ఆయన వివిధ శాఖల అధికారులతో సమావేశమై పలు అంశాలపై సమీక్షించారు. -
ఎక్లాస్పూర్ సందర్శన
మంథని: ఎక్లాస్‌పూర్‌లో కొద్దిరోజులుగా తాగునీరు రావడం లేదని అధికారులు దృష్టికి తీసుకెళ్ల.. మిషన్ భగీరథ, గ్రిడ్ అధికారులు శుక్రవారం గ్రామానికి చేరుకున్నారు. తాము కనీసం స్నానం చేయడానికి నీరు లేదని, తినే అన్నంలో మట్టి పోస్తారా? మా పరిస్థితిని అర్థం చేసుకోరా? అని గ్రామస్తులు అధికారులకు ఏకరువు పెట్టారు. గ్రిడ్ ఈఈ పూర్ణచందర్, డీఈ కిరణ్, మిషన్ భగీరథ డీఈఈ రాజ్‌కుమార్‌తోపాటు పలువురు అధికారులు నేరుగా ఇళ్లకు వెళ్లి నీటి సరఫరాను పరిశీలించారు. వాల్వ్‌లో మట్టి, ఇసుక నింపడంతో సమస్య వచ్చిందని వాపోయారు. సమస్య పరిష్కరానికి చొరవ చూపుతామని, గ్రామస్తులు సహకరించాలని అధికారులు కోరారు. -
పదేళ్లలో ఒక్క రేషన్‌కార్డు ఇవ్వలేదు
● అసెంబ్లీలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సాక్షి, పెద్దపల్లి: పదేళ్లలో పెద్దపల్లి నియోజకవర్గంలో ఒక్క కొత్తరేషన్‌కార్డు కూడా ఇవ్వలేదని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఎక్కడ ఉప ఎన్నిక లు నిర్వహిస్తే అక్కడ కొత్త రేషన్ కార్డులు, కొత్త ప థకాలు ప్రవేశపెట్టి ఎన్నికలపైనే దృష్టి సారించార ని, ప్రజలకు న్యాయం చేయలేదన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో ప్రసంగించారు. కాంగ్రెస్ అధి కారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన ద్వారా అ ర్హులైన వారినుంచి దరఖాస్తులు స్వీకరించామన్నా రు. అర్హులైన ప్రతీఒక్కరికి కొత్తరేషన్ కార్డు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని ఎమ్మెల్యే తెలిపారు. త్వరలోనే రేషన్‌కార్డుదారులకు సన్నబి య్యం అందించనున్నామని విజయరమణారావు అన్నారు. గతంలో రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదన్నారు. కాళేశ్వరం పేరిట ప్రజల సొమ్మును నీళ్లపాలు, రాళ్లపాలు చేసిందని ధ్వమెత్తారు. ప్రతిపక్ష నేతలు అసెంబ్లీకి రారు, అభినందించరు, సలహా ఇవ్వరు.. కానీ సీఎం ఇట్లా, భట్టి విక్రమార్క అట్లా అని విమర్శలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. -
ఆర్ఎఫ్సీఎల్ ఆదాయం రూ.500 కోట్లు!
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): దేశీయంగా ఎరువుల ఉత్పత్తి లక్ష్యంగా కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖ మూతబడిన, నష్టాల్లో ఉన్న ఎరువుల కర్మాగారాలను పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో 2015 సంవత్సరంలో ఎఫ్‌సీఐ కర్మగారాన్ని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారంగా పేరు మార్చి పునరుద్ధరించారు. 22 మార్చి 2021న రామగుండం ఎరువుల కర్మాగారం యూరియా కిసాన్ బ్రాండ్ పేరిట వాణిజ్య ఉత్పత్తులను ప్రారంభించింది. ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం రోజూ 3,850 మెట్రిక్ టన్నుల యూరియా, 2,200 మెట్రిక్ టన్నులు. 2022 నవంబర్ 12న భారత ప్రధాని నరేంద్రమోదీ ప్లాంటును జాతికి అంకితం చేశారు. ఆర్ఎఫ్సీఎల్ ఉత్పత్తి చేసిన యూరియాను భారత్ బ్రాండ్‌తో మార్కెట్ చేస్తున్నారు. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారం 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.4,941.60 కోట్ల వ్యాపారం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం(2024–25)లో రూ.440.96 కోట్ల ఆదాయం(లాభం) సమకూరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ 12.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈక్రమంలోనే ఈసారి రూ.500 కోట్ల ఆదాయాన్ని సమకూరుస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తగ్గిన దిగుమతుల భారం.. దేశీయంగా ఎరువుల కొరత అధికంగా ఉండడంతో కేంద్రప్రభుత్వం దిగుమతి తగ్గించేందుకు దేశవ్యాప్తంగా మూతపడిన, నష్టాల్లో ఉన్న ఎరువుల కర్మాగారాలను పునరుద్ధరించింది. తెలంగాణ రాష్ట్రంలోని ఆర్ఎఫ్సీఎల్ (నాటి ఎఫ్‌సీఐ), గోరఖ్‌పూర్(ఉత్తరప్రదేశ్), సింద్రీ (జార్ఖండ్), తాల్చేర్(ఒడిశా) ఎరువుల కర్మాగారాలు పునరుద్ధరించిన వాటిలో ఉన్నాయి. ఇందులోని రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారం ఎరువుల ఉత్పత్తిని 2021 మార్చి 22న, గోరఖ్‌పూర్ యూనిట్లో 2022 అక్టోబర్ 18న, సింద్రీ యూనిట్ లో 2022 నవంబర్ 05న ఉత్పత్తి ప్రారంభించారు. తాల్చేర్ ప్లాంట్‌లో 2025 చివరి నాటికి యూరియా ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్ఎఫ్సీఎల్లో సల్ఫర్ కోటెడ్ యూరియా రామగుండం ఎరువుల కర్మాగారంలో రూ.150 కోట్లతో సల్ఫర్ యూరియా ఉత్పత్తి చేసేందుకు కేంద్రప్రభుత్వం ఆమోదించింది. ప్రస్తుతం నీమ్ కోటెడ్ యూరియా ఉత్పత్తి చేస్తున్నారు. దేశీయంగా వంటనూనెల డిమాండ్ అధికంగా ఉండడంతో దాని కొరత తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పామాయిల్ సాగుకు సబ్సిడీ కల్పించాయి. పామాయిల్ సాగుకు ఉపయోగకరంగా ఉండే సల్ఫర్ కోటెడ్ యూరియాను రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించింది. 7 రాష్ట్రాలకు ఆర్ఎఫ్సీఎల్ యూరియా రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి చేసిన యూరియాలో 50శాతం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు ఈ యూరియా సరఫరా చేస్తున్నారు. ● 50 శాతం యూరియా తెలంగాణ రాష్ట్రానికే -
మతోన్మాద విధానాలను తిప్పికొట్టాలి
కరీంనగర్: దేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం చేయాలని కుట్రచేస్తున్న బీజేపీ ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టేందుకు దేశ ప్రజలంతా సిద్ధం కావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో పార్టీ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామితో కలిసి మాట్లాడారు. పార్లమెంటుస్థాయిలో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయాలని జమిలి ఎన్నికలను తెరపైకి తీసుకువచ్చి దక్షిణాది రాష్ట్రాలకుు తీరని అన్యాయం చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు. కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న నరేంద్ర మోడీ అప్పుల దేశంగా మారుస్తున్నాడని, గతంలో రూ.80లక్షల కోట్ల అప్పు ఉంటే తాజాగా రూ.150 లక్షల కోట్ల అప్పుచేసి కార్పొరేటు వ్యవస్థలకు కొమ్ము కాస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కొంత ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఇంకా అనేక హామీలను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యుడు కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్, అందెస్వామి పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం కావాలని సీపీఐ అభ్యర్థులు సిద్ధం కావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డిభవన్‌లో శుక్రవారం కార్యవర్గసభ్యుడు బత్తుల బాబు అధ్యక్షతన జరిగిన సీపీఐ జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో సీపీఐకి గణనీయమైన చరిత్ర ఉందని, నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేశారని, నేటికీ అనేక గ్రామాల్లో తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, సభ్యులు ఉన్నారని అన్నారు. అదే ఒరవడిని కొనసాగించేందుకు సీపీఐ శ్రేణులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించే దిశగా ముందుకు సాగాలని తెలిపారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి -
మారుపేర్ల పరిష్కారానికి ముఖ్యమంత్రి సానుకూలం
గోదావరిఖని: సింగరేణి కార్మికుల మా రుపేర్ల సమస్య పరి ష్కారానికి ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని రా మగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం వద్ద ఎమ్మెల్యే పలు సమస్యలు ప్రస్తావించగా సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. నియోజకవర్గ సమస్యలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తదితర అంశాలను సీఎం వద్ద ప్రస్తావించారు. సింగరేణి కార్మికుల సమస్యలు, మారుపేర్ల అంశం, కార్మికుల విజిలెన్స్ పెండింగ్ కేసుల గురించి వివరించారు. పారిశ్రామికాభివృద్ధి, పట్టణప్రగతి, రోడ్లు, డ్రైనేజీ, గృహ నిర్మాణం, విద్య, ఆరోగ్య సేవల విస్తరణ వంటి ముఖ్యాంశాలను అసెంబ్లీలో ప్రస్తావించనున్నట్లు వివరించారు. నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే అన్నారు. లంచం అడిగితే సమాచారమివ్వండి పెద్దపల్లిరూరల్: ‘జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో అన్నిసేవలను ఉచితంగా అందిస్తున్నాం.. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం.. ఎవరైనా డబ్బులు అడిగితే సూపరింటెండెంట్ సెల్ నంబరు 84990 61999కు లేదా రీజినల్ మెడికల్ ఆఫీసర్ సెల్ నంబరు 94948 53906కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలి’ అని ఆస్పత్రి ఆవరణలో పోస్టర్లు అంటించారు. నేతల త్యాగఫలమే వర్గీకరణ కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ఎమ్మార్పీఎస్ వ్య వస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ రాజీలేని పోరాటం, అనేకమంది త్యాగాల ఫలితమే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టసభలో ఆమోదం లభించిందని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు అంబాల రాజేందర్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించడంపై మండల కేంద్రంలో శుక్రవారం బాణసంచా కాల్చి, మిఠాయిలు పంపిణీ చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. మందకృష్ణ మాదిగ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మూడు దశాబ్దాల కల సాకారమైందని నాయకులు అన్నారు. నాయకులు వంగళ తిరుపతిరెడ్డి, గంట రాములు యాదవ్, తులా మనోహార్రావు, బండ రవీందర్‌రెడ్డి, సబ్బని రాజమల్లు, దంతెనపెల్లి చిన్నస్వామి, దంతెనపెల్లి ధర్మయ్య, అక్కపాక తిరుపతి, ఉమామహేశ్వర్, తూండ్ల రాజయ్య, బర్ల తిరుపతి, మంతెన రామస్వామి, చలిగంటి స్వరూప, రాజేశం, శంకర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. మౌలిక వసతులు కల్పించాలి రామగిరి(మంథని): లద్నాపూర్ నిర్వాసితుల కు పన్నూర్, రత్నాపూర్లో కేటాయించిన పునరావాస కేంద్రంలో మౌలిక వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ దాసరి వేణు సింగరేణి అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రంలో రూ.2.66 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆర్జీ–3 జీఎం సుధాకర్‌రావుతో కలిసి శుక్రవారం ఆయన భూమిపూజ చేశారు. పునరావాస కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రెండు అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక పాఠశాల, కమ్యూనిటీ హాల్, రామాలయం, రెండు వినాయక మండపాలకు భూమిపూజ చేసి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని వేణు అన్నారు. పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన.. ఇతర సౌకర్యాలు కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మంథని ఆర్డీవో సురేశ్, తహసీల్దార్ సుమన్, ఎంపీడీవో శైలజారాణి, సింగరేణి అధికారులు రఘుపతి, ఐలయ్య, రాజేంద్రకుమార్, సుదర్శనం, శ్రీనివాస్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
ఊరూవాడా చెప్పుకోవాలి
● రైతు రుణమాఫీ, రైతుభరోసా లబ్ధిదారుల పేర్లు ప్రదర్శన ● గ్రామాల్లో ముఖ్య కూడళ్లలో ఫ్లెక్సీల ఏర్పాటుకు నిర్ణయం ● లబ్ధిదారుల వివరాలు, పేర్ల ముద్రణకు రంగం సిద్ధం ● జిల్లాలవారీగా టెండర్లు పిలిచిన వ్యవసాయశాఖ ● ఉగాది నాటికి ఏర్పాటు లక్ష్యంగా ప్రయత్నాలుసాక్షిప్రతినిధి,కరీంనగర్: చేసింది చెప్పుకోవాలి.. అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాము అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలు, అందుకోసం ఖర్చు చేసిన నిధుల వివరాలను ప్రజలకు తెలియజెప్పాలని ప్రణాళికలు రచిస్తోంది. గత ప్రభుత్వం కన్నా అధిక మొత్తంలో ఏకకాలంలో రుణమాఫీ చేశామని, రైతు భరోసా అమలు చేశామని, ఈ విషయాలను గ్రామస్తులు చర్చించుకునే విధంగా చూడాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. అందుకోసం లబ్ధిదారుల పేర్లను గ్రామంలోని ముఖ్యవీధుల్లో ప్రదర్శించడం, తద్వారా తాము చేసిన పనులకు ఇంటింటికి తెలియజేయడం, ప్రజల మనసు గెలుచుకోవాలన్న తాపత్రయంతో వ్యవసాయశాఖ అడుగులు వేస్తోంది. కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగం పొందిన పలువురు యువతకు నియామక పత్రాలు ప్రభుత్వ పెద్దలు స్వయంగా అందజేస్తున్న తరహాలోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిసింది. వచ్చే స్థానిక సంస్థలు, గ్రామపంచాయతీ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకు ఈ ప్రచారాన్ని ముందుకు తెచ్చినట్లు సమాచారం. ఏం చేస్తారు? రైతు రుణమాఫీ, రైతు భరోసా కోసం ప్రభుత్వం రూ.కోట్లు విడుదల చేస్తోంది. అదే సమయంలో తాము అత్యధిక నిధులు విడుదల చేసి చరిత్ర సృష్టించామన్నది కాంగ్రెస్ వాదన. అదే సమయంలో రుణమాఫీ, రైతు భరోసా అమలు తీరుపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అందుకే, ప్రతిపక్షాల వాదనలను సమర్థంగా తిప్పికొట్టేందుకే ప్రభుత్వం తాము చేసిన పనులను ఊరూ, వాడా చెప్పుకునేలా ఈ ఆలోచనకు తెరతీసింది. ప్రతీ గ్రామంలో కనీసం మూడు ముఖ్యమైన కూడళ్ల వద్ద ఆ గ్రామంలో రైతు భరోసా, రైతు రుణమాఫీలో ఏ రైతుకు ఎంత లబ్ధి జరిగింది? ఆ రైతు పేరు, మాఫీ వివరాలు అంకెల్లో పేర్కొంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయనున్నారు. వీటిని వీలైనంత మంది ఎక్కువగా ప్రజలు వీక్షించేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఈ మేరకు ఉగాదిలోగా టెండర్లు, ముద్రణ పూర్తి కావాలన్న లక్ష్యంతో కలెక్టర్లు, వ్యవసాయాశాఖాధికారులు పనిచేస్తున్నారు. ఇప్పటికే అన్ని గ్రామాల రైతుల పూర్తి వివరాలు గణాంకాలతో సహా సిద్ధం చేశారు. టెండర్లు పిలిచిన వ్యవసాయశాఖ రాష్ట్రంలోని అన్నిజిల్లాల వ్యవసాఽయశాఖ అధికారులు రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాల్లో రైతుల పేర్ల ముద్రణకు ఫ్లెక్సీ టెండర్లు పిలిచారు. వాస్తవానికి ఈ టెండర్‌కు అనుకున్నంత ప్రచారం జరగలేదు. ఈ ప్రకటన ద్వారా వచ్చిన టెండర్లను ఖరారు చేసి త్వరలోనే అధికారికంగా ముద్రణకు ఆదేశాలివ్వనున్నారు. ఆరడుగుల పొడవు, మూడు అడుగుల వెడల్పుతో ఈ ఫ్లెక్సీలు ఉండనున్నాయి. ముఖ్యమంత్రి, వ్యవసాయశాఖ మంత్రి ఫొటోలు ఫ్లెక్సీలో ఉండనున్నాయి. ఈ ప్రక్రియ పూర్తి కాగానే, ముద్రణకు ఆర్డర్ ఇవ్వడం, ఫ్లెక్సీలను గ్రామాల్లో కూడళ్లలో ఏర్పాటు చేయడం చకచకా జరిగిపోనున్నాయి. ఉమ్మడి జిల్లాలో 2.46 లక్షల మంది రైతులకు మూడు నుంచి నాలుగు దశల్లో ఇటీవల రైతు రుణమాఫీ జరిగింది. వీరికి దాదాపు రూ.రెండువేల కోట్ల వరకు ప్రభుత్వం రుణమాఫీ చేసింది. ఈ నేపథ్యంలో ఎవరికి ఎంత మాఫీ అయిందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. -
‘పది’ పరీక్షలు ప్రారంభం
పెద్దపల్లిరూరల్: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 14 మండలాల్లో 41 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 7,393 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా.. ఇందులో తొమ్మిది మంది గైర్హాజరయ్యారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఫ్లయింగ్స్వాడ్స్తోపాటు ఉన్నతాధికారులు పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రం మార్పుతో పరేషాన్ మంథని: పదో తరగతి పరీక్ష కేంద్రం మార్పుతో విద్యార్థులకు అసౌకర్యం ఏర్పడింది. గతంలో స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, బాలుర ఉన్నత పాఠశాల, గురుకుల బాలుర వి ద్యాలయంలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో పట్టణ శివారులోని సాంఘిక సంక్షేమ గురు కుల పాఠశాల, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పా ఠశాలలోనే పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇ వి పట్టణ శివారులో ఉండడంతో అక్కడకు వెళ్లేందుకు విద్యార్థులు అవస్థలు పడ్డారు. ఆర్టీసీ బ స్టాండ్‌కు సమీపంలో ఉన్న బాలుర, జెడ్పీ బాలిక ల హైస్కూల్లో ఏర్పాటు చేయకుండా ఈసారి బాలుర జెడ్పీ హైస్కూల్లో పరీక్ష కేంద్రం ఏర్పా టు చేయడంతో విద్యార్థులు తికమకపడ్డారు. స్కూల్‌కు ఇరు వైపులా రోడ్డు ఉన్నా.. ఎటువైపు నుంచి వెళ్లాలో సూచిక బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు. కనీస సౌకర్యాలు కల్పించలేదు. జిల్లాలో 99.87శాతం హాజరు -
నాణ్యమైన వైద్యసేవలు అందించాలి
● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి రూరల్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యౖ మెన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. కలెక్టరేట్లో వైద్య, ఆరోగ్య శాఖ పనితీరుపై శుక్రవారం ఆయన సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ క్షయ శిబిరం, ఎన్సీడీ సర్వే చాలాబాగా చేశారని వైద్యసిబ్బందిని అభినందించారు. టీబీ రహిత గ్రామాలను ప్రకటించాలని కలెక్టర్ సూచించారు. జి ల్లాలో గుర్తించిన బీపీ, మధుమేహం బాధితులు తమ జీవన విధానంలో చేసుకోవాల్సిన మార్పు ల గురించి ఏఎన్ఎం, ఆశ కార్యకర్తల ద్వారా ఏ ప్రిల్‌లో అవగాహన కల్పించాలని అన్నారు. డ యాగ్నొస్టిక్ హబ్ ద్వారా వైద్య పరీ క్షలు నిర్వహించి ఫలితాలు అందించడంలో జిల్లా ముందు వరుసలో ఉందని అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అన్న ప్రసన్న కుమారి పాల్గొన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ జిల్లాలో ఈనెల 22 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అదనపు కలెక్టర్ వేణు, ఆర్డీవోలు, తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎల్‌ఆర్‌యూపీలో జరిగిన పొరపాట్ల సవరణకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ప్రజావాణి ద్వారా అందే ఫిర్యాదులను పరిష్కరించాలని కలెక్టర్ తెలిపారు. భూ వివాదాలపై కోర్టు కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ డివిజన్ అధికారులు సురేశ్, గంగయ్య, కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆశలు.. నీళ్లపాలు
● అన్నదాతకు వడగళ్ల కడగండ్లు ● దెబ్బతిన్న వరి, మొక్కజొన్న పంటలు ● ధ్వంసమైన కూరగాయల తోటలు ● రాలిపోయిన మామిడికాయలు ● లోతట్టు ప్రాంతాలు జలమయం ● జిల్లా కేంద్రంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ● పెద్దపల్లిలో అత్యధికంగా 32.8 మి.మీ. వర్షపాతం నమోదుపెద్దపల్లిరూరల్: అన్నదాతల ఆశలను అకాల వర్షం నీటిపాలు చేసింది. చేతికందే దశలో ఉన్న వరి, మొక్కజొన్న పంటలను తీవ్రంగా దెబ్బతీసింది. కూరగాయాల తోటలకూ తీరని నష్టమే జరిగింది. మామిడిపూత, కాత కూడా నేలరాసింది. శుక్రవా రం సాయంత్రం ఒక్కసారిగా గాలిదుమారంతో కూడిన వడగళ్లు కురవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. పెద్దపల్లి, ధర్మారం, జూలపల్లిలో వర్షం అధికంగా కురిసింది. మిగతా ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. వరి ఇప్పుడిప్పుడే గింజ దశకు చేరుకుంటోంది. దీనికి పెద్దగా నష్టం ఉండకపోవచ్చని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. మొక్కజొన్నకు కొంత నష్టం జరగొచ్చని వారు వివరించారు. అధికారులు ఇలా పేర్కొంటుంటే.. తమకు కనీసం పెట్టుబడి కూడా వచ్చేట్టులేదని రైతులు ఆవేదన చెందుతు న్నారు. పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాంటున్నారు. వివిధ గ్రామాల్లో.. పెద్దపల్లి పట్టంలో రాత్రి 8గంటల వరకు అత్యధికంగా 32.8మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురి సింది. ధర్మారం మండలంలో 29మి.మీ., జూలపల్లి మండలంలో 26మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. పెద్దపల్లి మండలం నిట్టూ రు, నిమ్మనపల్లి, హన్మంతునిపేట, రాంపల్లి, భోజ న్నపేట గ్రామాల్లో రాళ్లవాన కురిసింది. రాంపల్లిలో నేలవాలిన మొక్కజొన్న పంటను మండల వ్యవసాయాధికారి అలివేణి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం.. జిల్లాకేంద్రంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సుభాష్ విగ్రహం వద్ద ఇప్పటికే డ్రైనేజీని మూసివేయగా.. మురుగునీరంతా రోడ్డు పైకి చేరుతోంది. వర్షానికి సైతం సుభాష్విగ్రహం ప్రాంతమంతా మోకాలిలోతులో నిలిచింది. మురుగునీరు రోడ్డుపైనే ప్రవహించింది. పోలీస్‌స్టేషన్ ఆవరణలోకి వర్షపునీరు వచ్చి చేరింది. బస్టాండ్, కమాన్ ప్రాంతాల్లోనూ ప్రధాన రోడ్లపై వర్షపు నీరు నిలిచి రాకపోకలకు తీవ్రఅంతరాయం కలిగింది. విద్యుత్ తీగలపై పడ్డ ఫ్లెక్సీ భారీగాలులతో కూడిన వర్షం ధాటికి జిల్లా కేంద్రంలోని ఓ భవనంపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చిరిగి విద్యుత్ తీగలపై పడింది. దీంతో విద్యుత్ సరఫరాకు తీవవ్ర అంతరాయం కలిగింది. ట్రాన్స్‌కో ఏ ఈ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది వెంటనే దానిని తొలగించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. మంథనిలో..మంథని: అకాల వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కానీ, వివిధ పంటలకు నష్టం కలిగిస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మంథనిలో ఓ మోస్తరు వర్షం కురిసింది. వరి తదితర పంటలు దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు. సుల్తానాబాద్‌లో.. సుల్తానాబాద్(పెద్దపల్లి): మండల కేంద్రంతోపాటు సుగ్లాంపల్లి, పూసాల, ఆరేపల్లి తదితర గ్రామాల్లో భారీవర్షం కురిసింది. ఆయా గ్రామాల్లో మొక్కజొ న్న కర్ర నేలవాలింది. పొట్టదశలోని వరి నీటిపాలైంది. వర్షంతో ఎలాంటి ప్రయోజనం లేదని, నష్టమే అధికంగా ఉందని రైతులు వాపోయారు. ధూళికట్టలో.. ఎలిగేడు(పెద్దపల్లి): ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామంలో ఈదురుగాలులతో కూడి భారీవర్షం కురిసింది. దాదాపు అర్ధగంటపాటు వర్షం బీభత్సం సృష్టించింది. వడగళ్లు భారీగా కురిశాయి. మొక్క జొన్న కర్రలు నేలవాలాయి, పొట్ట, ఈనేదశలోని మొక్కజొన్న కర్రలు, వరి పైరు తీవ్రంగా దెబ్బతి న్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మామిడికాయలు చెట్లపైనుంచి రాలి తీవ్రనష్టం కలిగించాయని అన్నారు. ఎలిగేడు, ముప్పిరితోట తదితర గ్రామాల్లో తుంపర వర్షం కురిసింది. నేలవాలిన మొక్కజొన్న జూలపల్లి(పెద్దపల్లి): కోనరావుపేట, జూలపల్లి, వడ్కాపూర్, పెద్దాపూర్, అబ్బాపూర్, నాగుపల్లె, తెలుకుంట తదితర గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానకు వరి, మొక్కజొన్న పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. ఒక్కసారిగా వచ్చిన గాలివాన అతలాకుతలం చేసింది. ఆరుగాలం కష్టపడిన అన్నదాత శ్రమ మరో నెలరోజుల్లో చేతికి వస్తుందనగా అకాలవర్షం ఆగమాగం చేసింది. పంటంతా పడిపోయింది నాకున్న ముప్పయి గుంటల్లో మక్క ఏసిన. కంకులు పాలు పోసే దశ వచ్చినయి. అకాల వర్షం కర్రలను నెలపాలు చేసింది. మరో నెలరోజుల్లో చేతికొచ్చే పంట తీవ్రంగా దెబ్బతిన్నది. నలభై వేల రూపాయల వరకు నష్టం వాటిల్లింది. – దాడి కుమార్, రైతు, కోనరావుపేట -
27న ఓదెల మల్లన్న హుండీ లెక్కింపు
ఓదెల: ఓదెల మల్లికార్జునస్వామి ఆలయంలో ఈనెల 27న ఉదయం 9గంటలకు హుండీ లెక్కింపు చేపట్టనున్నట్లు ఆలయ ఈవో సదయ్య పేర్కొన్నారు. లెక్కింపు కార్యక్రమంలో ఆసక్తిగలవారు, భక్తులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. 26న శ్రీఆదివరాహస్వామి.. కమాన్‌పూర్: మండల కేంద్రంలోని శ్రీఆదివరాహస్వామి ఆలయ హుండీని ఈ నెల 26 లెక్కించనున్నట్లు ఆలయ ఈవో కాంతారెడ్డి తెలిపారు. ఆసక్తిగల వారు లెక్కింపులో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. అదే రోజు ఆలయానికి కిరాణ సామగ్రి సరఫరా చేయడానికి టెండర్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు. -
రాజస్థాన్ బృందం సందర్శన
మంథని: జాతీయస్థాయిలో ఉమెన్ ఫ్రెండ్లీ అ వార్డు పొందిన మంథని మండలం చిల్లపల్లి గ్రామాన్ని గురువారం రాజస్థాన్ నుంచి 19 మంది ప్రజా ప్రతినిధులు, అధికారుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ప్రతినిధులకు మహిళలు బతుక మ్మ, కోలాటాలతో స్వాగతం పలికారు. గ్రా మంలో ప్రజలకు అందుతున్న సేవలు, అభివృద్ధి పనులు పరిశీలించారు. తమ రాష్ట్ర పంచా యతీరాజ్ మంత్రి సూచనలతో ఇక్కడకు వ చ్చినట్లు రాజస్థాన్ బృందం తెలిపింది. ఇక్కడి మహిళల పనితీరు బాగుందని, ఈ పర్యటన తమకు ఎంతగానో దోహదపడుతుందని పేర్కొంది. స్టేట్ నోడల్ ఆఫీసర్ అనిల్‌కుమార్, జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 11 టీఎంసీలకు ‘ఎల్లంపల్లి’రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. గురువారం నీటిపారుదలశాఖ అధికారులు తెలిపిన నివేదిక ప్రకారం.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 11.28 టీఎంసీల నిల్వ ఉంది. ఇక్కడి నుంచి గూడెం ఎత్తిపోతలు 290 క్యూసెక్కులు, హైదరాబాద్ మెట్రో 331 క్యూసెక్కులు, ఎన్టీపీసీ 242 క్యూసెక్కులు, వేంనూర్ ఎత్తిపోతలు 494 క్యూసెక్కులు మొత్తం 1,357 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉండగా ఇన్‌ఫ్లో మాత్రం లేదు. ముగిసిన ఇంటర్ పరీక్షలుపెద్దపల్లిరూరల్: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని నోడల్ అధికారిణి కల్పన తెలిపారు. గురువారం జరిగిన పరీక్షకు 4,532 మందికిగాను 4,428 మంది హాజరయ్యారని, 104మంది గైర్హాజరైనట్టు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధిత శాఖల అధికారులు సంపూర్ణ సహకారం అందించారని వివరించారు. నిబంధనలు పాటించని వ్యాపారులకు జరిమానాకోల్సిటీ(రామగుండం): రామగుండం బల్దియా పరిధిలో నిబంధనలు పాటిచకుండా మాంసం వ్యాపారులు దుకాణాల వద్దే మేకలు, గొర్రెలను వధిస్తున్నారు. దీంతో అదనపు కలెక్టర్, నగరపాలక కమిషనర్ జె.అరుణశ్రీ ఆదేశాలతో గురువారం డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి నేతృత్వంలో పారిశుధ్య విభాగం అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా దుకాణాల వద్ద మేకలను వధిస్తున్న ముగ్గురు వ్యాపారులను గుర్తించి ఒకొక్కరికీ రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. ఆస్తిపన్ను చెల్లించని దుకాణాలు సీజ్ రామగుండం బల్దియాలో ఆస్తిపన్ను చెల్లించని వ్యాపార సంస్థలను గురువారం అధికారులు సీజ్ చేశారు. స్థానిక లక్ష్మీనగర్ ప్రాంతంలో ఏళ్ల తరబడి ఆస్తి పన్ను చెల్లించకుండా పలుదఫా లుగా నోటీసులు జారీ చేసినా, స్పందించని నా లుగు వ్యాపార సంస్థలను నగరపాలక కమిషనర్ అరుణశ్రీ ఆదేశాల మేరకు రెవెన్యూ విభా గం అధికారులు సీజ్ చేశారు. కార్యక్రమాల్లో శానిటరీ ఇన్స్పెక్టర్ నాగ భూషణం, ఎ న్వి రాన్మెంటల్ ఇంజినీర్ మధుకర్, సూపర్వైజ ర్ దయానంద్, సంపత్, ఆర్వో ఆంజనేయులు, ఆర్ఐ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఆదాయం అంతంతే..
● తలసరి ఆదాయంలో పెద్దపల్లి టాప్ ● అటవీ విస్తీర్ణంలో కరీంనగర్ లాస్ట్, ఉపాధి హామీలో భేష్ ● తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్‌లుక్–2025లో వెల్లడిగనుల ద్వారా ఆదాయం ఉమ్మడి జిల్లా సహజ వనరులకు నెలవైన ప్రాంతం. బొగ్గు, గ్రానైట్, ఇసుక, ఇటుక బట్టీలు తదితర మైనింగ్ కార్యకలాపాలతో రాష్ట్రానికి ఆదాయం సమకూర్చుతుంది. ఉమ్మడి జిల్లా నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ వరకు రూ.190.62 కోట్లకు గాను రూ.156.21కోట్ల ఆదాయం ప్రభుత్వానికి తెచ్చిపెట్టింది.సాక్షి, పెద్దపల్లి: జిల్లాల పురోగతికి సూచికగా భావించే స్థూల జిల్లా దేశీయోత్పత్తి విలువ(జీడీడీపీ)లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు పర్వాలేదన్నట్లుగా ఉండగా.. వ్యక్తుల ఆదాయంగా పరిగణించే తలసరి ఆదాయం విషయంలో జగిత్యాల మినహా మిగతా జిల్లాలు ముందువరుసలో ఉన్నాయి. అర్బన్ జనాభాలో కరీంనగర్లో 3లక్షలు, రామగుండంలో 2.5లక్షలు, జగిత్యాలలో లక్షమంది పట్టణాల్లో నివసిస్తున్నారు. జిల్లా విస్తీర్ణంలో అత్యల్పంగా అడవులు కలిగి ఉండి రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా చివరి స్థానంలో నిలవగా, ఖనిజాల ద్వారా రాష్ట్రానికి ఆదాయం సమకూర్చడంలో ఉమ్మడి జిల్లాలు ముందువరుసలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్‌లుక్– 2025లో ఈ అంశాలన్నీ వెల్లడయ్యాయి. జిల్లా టార్గెట్ వసూలైంది (రూ.లక్షల్లో) (రూ.లక్షల్లో) పెద్దపల్లి 2,465.99 2,264.30 సిరిసిల్ల 1,465.07 1,342.18 కరీంనగర్ 12,872.16 10,658.72 జగిత్యాల 2,259.05 1,356.26 -
ఉపాధి హామీలో మెరుగు..
మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు కల్పించాల్సిన పనిదినాల విషయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు రాష్ట్రంలోని మిగతా జిల్లాలకన్నా మెరుగ్గా ఉండటం విశేషం. ముందుచూపుతో రాష్ట్రంలోనే అత్యధిక పనిదినాలను కల్పించడంలో సక్సెస్ అయ్యారు.ర్యాంకు జిల్లా లక్ష్యం కల్పించిన శాతం (లక్షల్లో) పనిదినాలు 2 కరీంనగర్ 28.4 26.1 92.1 8 సిరిసిల్ల 21.8 19.6 90.0 12 జగిత్యాల 40.0 35.7 89.4 14 పెద్దపల్లి 25.5 22.8 89.4 -
జీడీడీపీలో అంతంతే..
ఒక ఆర్థిక సంవత్సరంలో జిల్లా ఉత్పత్తి చేసిన వస్తు, సేవల మొత్తం విలువే జీడీడీపీ. జిల్లా ఆర్థికాభివృద్ధికి ముఖ్య కొలమానంగా పరిగణించే జీడీడీపీలో కరీంనగర్ మెరుగ్గా ఉంది. సిరిసిల్ల రాష్ట్రంలోనే 29వస్థానంలో నిలిచింది.జిల్లా జీడీడీపీ(రూ.కోట్లలో) ర్యాంకు కరీంనగర్ 30.216 12 పెద్దపల్లి 27,649 13 జగిత్యాల 24,011 18 సిరిసిల్ల 13,981 29 -
41 కేంద్రాలు.. 7,393 మంది విద్యార్థులు
పెద్దపల్లిరూరల్: జిల్లాలో శుక్రవారం నుంచి మొదలు కానున్న పదోతరగతి పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లావ్యాప్తంగా 41 పరీక్షా కేంద్రాల్లో 7,393 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు 586 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఈ సారి 24 పేజీల బుక్లెట్ విధానం ఈ సారి పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు 24 పేజీల బుక్‌లెట్‌ను జవాబులు రాసేందుకు ఇవ్వనున్నారు. దీన్ని ఒకేసారి అందివ్వనుండడంతో పక్కవారికి పేపర్ అందించే అవకాశం ఉండదు. ఈ విషయమై టెన్త్ విద్యార్థులకు అవగాహన కల్పించినట్టు అధికారులు పేర్కొన్నారు. అంతే కాకుండా మాస్ కాపియింగ్ జరగకుండా నిఘా బృందాలను నియమించారు. ప్రతీ కేంద్రంలో సీసీ కెమెరాలు బిగించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. వసతుల కల్పన పరీక్షలు రాసేందుకు వచ్చే విద్యార్థులకు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఎండకాలంలో దాహార్తిని తీర్చేందుకు నీరు, పరీక్ష సమయంలో దూరప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు నడిపించేలా ఆదేశాలిచ్చారు. పరీక్షల నిర్వహణపై సందేహాలుంటే కంట్రోల్ రూం నం. 97015 15725లో సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు.జిల్లా సమాచారం పరీక్షల నిర్వహణ: ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు సమయం: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలల సంఖ్య: 207 (135 ప్రభుత్వ, 72 ప్రైవేట్) విద్యార్థుల సంఖ్య: 7,393 బాలికలు: 3,690, బాలురు: 3,703 ఇన్విజిలేటర్లు: 586 మంది నేటి నుంచి పదో తరగతి పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు సందేహాల నివృత్తికి కంట్రోల్ రూం నం. 97015 15725పకడ్బందీగా ఏర్పాట్లు పదో తరగతి పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇతర శాఖల అధికారుల సహకారంతో వసతులు కల్పించాం. కేంద్రాల వద్ద వైద్యసిబ్బందిని నియమించేలా చర్యలు తీసుకున్నాం. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలన్నీ తీసుకున్నాం. – మాధవి, జిల్లా విద్యాధికారి -
సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలి
● పెద్దపల్లి డీసీపీ కరుణాకర్పాలకుర్తి(రామగుండం): నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదపడతాయని, ప్రతీ గ్రామంలో వాటి ఏర్పాటుకు గ్రామస్తులు పోలీసులకు సహకరించాలని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ కోరారు. గురువారం బసంత్‌నగర్ పోలీసుల ఆధ్వర్యంలో పాలకుర్తి మండలం కుక్కలగూడుర్‌లో ఏర్పాటు చేసిన ‘నేనుసైతం’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత, బ్యాంక్ సమాచారం ఇవ్వకూడదన్నారు. యువత మద్యం, గంజాయి, గుట్కా, ధూమపానం వంటి చెడువ్యసనాలకు అలవాటుపడి విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, చదువు, కెరీర్‌పై దృష్టిసారించి ఉన్నతస్థాయికి ఎదగాలని కోరారు. అలాగే తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈసందర్భంగా గ్రామంలో స్థానికుల సాయంతో ఏర్పాటు చేసిన 12 సీసీ కెమెరాలను ప్రారంభించి గ్రామస్తులను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణయాదవ్, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై స్వామి, మాజీ సర్పంచ్ గోండ్ర చందర్, మాచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 23న సామూహిక గీతా పారాయణంమంథని: సనాతన ధర్మ ప్రచార సమితి, శ్రీసీతారామ సేవాసదన్ ఆధ్వర్యంలో ఈ నెల 23న మంథనిలోని శివకిరణ్ గార్డెన్స్‌లో 5వేల మందితో సామూహిక గీతాపారాయణం నిర్వహించనున్నట్లు సనాతన ధర్మ ప్రచార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంథెన శ్రీనివా్‌స్, ఉత్సవ సమితి అధ్యక్షుడు వొడ్నాల శ్రీనివాస్ తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ, భగవద్గీతను ఇంటింటికీ చేర్చడానికి ఐదేళ్ల క్రితం కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. పారాయణానికి ముఖ్య అతిథిగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రవచకులుగా ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, పలువురు పిఠాధిపతులు విచ్చేస్తున్నట్లు తెలిపారు. ఉదయం 8.30 గంటలకు శోభాయాత్ర నిర్వహించి గీతాపారాయణం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కోరారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరించారు. కొత్త శ్రీనివాస్ గుప్తా, వేడగోని రాజమౌళిగౌడ్, పుప్పాల విక్రమసింహారావు, కొండమేన అశోక్‌కుమార్, బండారి సురేశ్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఈ ఆటో చాలా కూల్ గురూ.. సమ్మర్ స్పెషల్
ఆటో పైకప్పు నిండా పచ్చని పూల మొక్కలు, గడ్డి మొక్కలను పెంచాడు. మొక్కలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు నీరు పోస్తున్నాడు. ఆటో ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాడు. ప్రయాణికులకు చల్లదనాన్ని పంచేందుకు.. మహబూబాబాద్ మండలం దర్గా తండాకు చెందిన భూక్యా హ్యాంజ్యా అలియాస్ ఆటో అంజి వినూత్న ఆలోచనకు దృశ్య రూపమిది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, మహబూబాబాద్చెరువు ఎండింది.. చేప చిక్కింది మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నిజాం చెరువు నీరు అడుగంటిపోయింది. దీంతో కొద్దిపాటి నీటిలోని చేపలను మాధవాపురం గ్రామానికి వలస వచ్చిన సైబీరియన్ కొంగలు (Siberian Cranes) సునాయాసంగా వేటాడుతున్నాయి. కోరుకున్న చేపను కొంగలు పట్టేసుకుని గుటుక్కుమనిపిస్తున్నాయి. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, మహబూబాబాద్ కళ తప్పిన ప్రకృతి ఆకురాలే సమయం వచ్చేసింది. వానాకాలం, చలికాలంలో పచ్చదనంతో ప్రకృతి ప్రేమికులను మురిపించిన గుట్టలు.. ఇప్పుడు ఎండ తీవ్రతతో మాడిపోతున్నాయి. తీవ్రమైన ఎండలతో చెట్లు ఆకురాల్చి మోడువారి కనిపిస్తున్నాయి. రాత్రివేళ కార్చిచ్చుతో మంటల్లో కాలిపోతున్నాయి. పెద్దపల్లి జిల్లా (Peddapalli District) పాలకుర్తి మండలం జయ్యారం శివారు, అంతర్గాం మార్గంలోని బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయ సమీపంలో ఎండిన చెట్లతో గుట్టలు బోసిపోయి కనిపించాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లిపైరు ఎండి.. పశువులకు తిండిహనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో ఎండల తీవ్రతకు భూగర్బ జలాలు అడుగంటిపోయాయి. బావులలో నీళ్లు తగ్గి పంటలకు సరిపడా సాగునీరు అందక పంటలు (Crops) ఎండిపోతున్నాయి. దిక్కుతోచని రైతులు కొంత పంటనైనా కాపాడుకుందామని నీరున్నంత వరకు పారించుకుని.. మిగతా పంటను మూగజీవాలకు వదిలేశారు. – ధర్మసాగర్ఎడ్లకు మేత.. గుండె కోత.. ఎస్సారెస్పీ కాలువ నీరు రాలేదు.. వ్యవసాయ బావిలో నీరు అడుగంటింది. పొట్టదశకు వచ్చిన వరి పైరు ఎండిపోతోంది. పంట చేతికొస్తే పెట్టుబడి కోసం తెచ్చిన అప్పు తీర్చుతామనే రైతు గంపెడాశ ఆవిరైపోయింది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మద్దిర్యాలకు చెందిన ఎండీ షరీఫ్.. తనకున్న నాలుగెకరాల్లో యాసంగి వరి వేశాడు. నీళ్లు అందక రెండెకరాల్లో పంట ఎండిపోయింది. దీంతో రైతు కుటుంబ సభ్యులు.. ఎండిన పైరును ఎద్దులకు మేతగా వినియోగిస్తూ ఇలా కనిపించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లిభగీరథ ప్రయత్నంఆదిలాబాద్ జిల్లాలో భానుడి భగభగలకు చేతిపంపులు, చేద బావుల్లో భూగర్భ జలమట్టం అడుగంటుతోంది. బిందెడు నీటి కోసం ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీలు భగీరథ ప్రయత్నమే చేయాల్సి వస్తోంది. దీంతో ఎప్పుడు వస్తుందో తెలియని మిషన్ భగీరథ నీరే దిక్కవుతోంది. ఆదిలాబాద్ (Adilabad) రూరల్ మండలంలోని పోతగూడ–2 గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి అవసరాల కోసం మిషన్ భగీరథ పైపులైన్ ద్వారా సరఫరా అయ్యే పైపువాల్ వద్ద చుక్కనీటిని ఒడిసిపట్టేలా ప్రత్యేకంగా ఓ రేకును అమర్చి బొట్టుబొట్టు నీరు డ్రమ్ముల్లో పడేలా ఏర్పాట్లు చేసుకోవడం నీటి సమస్యకు నిదర్శనంగా నిలుస్తోంది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్చదవండి: బిందెడు నీటికి బావిలోకి.. భగవంతుడా! -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు
● సమస్యల పరిష్కరానికి పోలీస్‌దర్బార్ ● రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా గోదావరిఖని: విధుల్లో నిర్లక్ష్యం వహించి పోలీస్‌శా ఖ ప్రతిష్టకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా హెచ్చరించారు. కమిషనరేట్‌లో బుధవారం సీపీ పోలీస్‌దర్బార్ నిర్వహించారు. ఎ లాంటి సమస్యలు ఉన్నా దర్బార్ దృష్టికి తీసుకురావడం ఇబ్బందిగా ఉంటే నేరుగా తన ఆఫీస్‌కు రా వాలని సీపీ సూచించారు. ఒకే కుటుంబం స్ఫూర్తి తో సమన్వయం, క్రమశిక్షణ, ప్రణాళికా బద్ధంగా వి ధులు నిర్వహించాలన్నారు. పోలీస్‌శాఖ, యూనిఫాంపై గౌరవం ఉంటే చట్ట వ్యతిరేకమైన పనులపై ఆలోచన రాదన్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ ఉండాలని, క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. త ద్వారా మానసిక, శారీర ఒత్తిడి నుంచి దూరం కావచ్చన్నారు. వ్యక్తిగత కారణాలతో ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లు చాలా ప్రమాదకరమని, వాటిని తట్టుకోలేక క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ గురించి ఆలోచించాలని సూ చించారు. ప్రతి రెండు నెలలకోసారి మెడికల్ క్యాంపు నిర్వహించి హెల్త్ చెకప్ చేయిస్తామని సీపీ వివరించారు. అడిషనల్ డీసీపీ(అడ్మిన్) రాజు, స్పెషల్ బ్రాంచ్, ఏఆర్ ఏసీపీలు రాఘవేంద్రరావు, ప్రతాప్, ఆర్ఐలు దామోదర్, వామనమూర్తి, సంపత్, ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. జనగామ ఆలయంలో పూజలు.. గోదావరిఖనిటౌన్ : సీపీ అంబర్ కిశోర్ ఝా దంప తులు జనగామలోని శ్రీత్రిలింగేశ్వరస్వామి ఆల యంలో బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. -
కార్మిక సంక్షేమానికి ప్రాధాన్యం ఏది?
బడ్జెట్లో కార్మిక సంక్షేమాన్ని విస్మరించింది. వేతన పెంపు ఊసేలేదు. కార్మికుల సంక్షేమానికి కనీస ప్రాధాన్యత కూడా ఇవ్వలేదు. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికై నా నిధులు కేటాయించక పోవడం బాధాకరం. – ముత్యంరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి విద్య, వైద్యరంగాలను విస్మరించారు పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు కలిగేలా విద్య, వైద్య రంగాలకై నా నిధులు కేటాయించక పోవడం సరికాదు. గతంలో విద్యారంగానికి 7.3శాతం నిధులు కేటాయిస్తే ఈసారి 0.2శాతం మాత్రమే పెంచి 7.5శాతం కేటాయింపులు చేయడం విడ్డూరం. నిరుద్యోగులకు రూ.3వేల భృతి సంగతిని ప్రస్తావించనేలేదు. – సదానందం, సీపీఐ జిల్లా కార్యదర్శి -
ప్రజారంజకంగా ఉంది
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంజకంగా ఉంది. స్పష్టమైన వైఖరి, అద్భుతమైన విజన్‌తో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. కేటాయింపులు కూడా అలాగే ఉన్నాయి. ఇరిగేషన్, విద్యుత్, చిన్నతరహా పరిశ్రమలు, వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేశాం. రామగుండం నియోజకవర్గానికి కేటాయింపులు జరిగాయి. దేశంలోనే అత్యున్నతస్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లేలా ఉంది. – ఎంఎస్ రాజ్‌ఠాకూర్, ఎమ్మెల్యే, రామగుండం సంక్షేమానికి ప్రాధాన్యం బడ్జెట్ చాలా బాగుంది. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ కేటాయింపులు చేశా రు. విద్యావంతులైన యువతకు స్వయం ఉపాధి మార్గాలను చూపేలా రాజీవ్ యువ వికాసం పథకానికి రూ.6వేల కోట్లు కేటాయించడం హర్షణీయం. – విజయరమణారావు, ఎమ్మెల్యే, పెద్దపల్లి -
టెన్త్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి
పెద్దపల్లిరూరల్: పదో వార్షిక తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. టెన్త్ పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్లో బుధవారం ఆయన సమీక్షించారు. ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. మొత్తం 7 వేల మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. ఇందుకో సం 41 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని, సమీక్ష సమయాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులను నడిపించాలని ఆదేశించారు. పారామెడికల్ సి బ్బంది అందుబాటులో ఉండాలన్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. డీఈవో మాధవి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. హైస్కూల్లో గ్రీవెన్స్ బాక్స్ రామగుండం: పీఎంశ్రీ పథకం కింద ఎంపికై న స్థానిక ప్రభుత్వ బాలికల హైస్కూల్లో గర్ల్ చై ల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్ ఏర్పాటు చేశారు. హెచ్ఎం చైర్‌పర్సన్‌గా, ఉపాధ్యాయురాలు కన్వీన ర్, ప్రతీ తరగతి నుంచి ఇద్దరు విద్యార్థినులను కమిటీ ప్రతినిధులుగా ఎన్నుకున్నారు. బాలికలపై అఘాయిత్యాలను పాఠశాలస్థాయి నుంచే ఎదుర్కొనేందుకు వీలుగా గ్రీవెన్స్ బాక్సు ఏ ర్పాటు చేశారు. బాలికలపై లైంగిక దాడులు, అసభ్యకర ప్రవర్తన, అవమానకర కామెంట్స్, కించపరిచే చేష్టలు తదితర సమస్యలపై ఇందులో ఫిర్యాదు చేయొచ్చు. ప్రధానోపాధ్యా యురాలు అజ్మీరా శారద చైర్‌పర్సన్‌గా, కన్వీనర్‌గా హిందీ ఉపాధ్యాయురాలు ఎం.హేమలత వ్యవహరించనున్నారు. సుల్తాన్‌పూర్‌లో రాజస్తాన్ బృందం ఎలిగేడు/సుల్తానాబాద్(పెద్దపల్లి): రాజస్తాన్ రాష్ట్ర ప్రజాప్రతినిధులు, అధికారులు సుల్తాన్పూర్, సుల్తానాబాద్‌లో బుధవారం పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులు, పచ్చదనం, పరిశుభ్రతపై ఆరా తీశారు. ఎరువుల తయారీ విధానం గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. స్కూళ్లలో సహజ సిద్ధంగా పెంచుతు న్న కూరగాయలు, సౌరశక్తి పనులను పరిశీలించారు. డీపీవో వీరబుచ్చయ్య, ఎంపీడీవోలు భాస్కర్‌రావు, దివ్యదర్శన్‌రావు, ఎంపీవోలు ఆ రిఫ్, సమ్మిరెడి, ఎస్బీఎం కో ఆర్డినేటర్ రాఘవులు, హెచ్ఎం నరేంద్రచారి పాల్గొన్నారు. పత్తి క్వింటాల్ రూ.7,087 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో బుధవారం పత్తి క్వింటాలుకు గరిష్టంగా రూ.7,087 ధర పలికింది. కనిష్టంగా రూ.5,561, సగటు రూ.6,717గా ధర నమోదైందని మార్కెట్‌కమిటీ కార్యదర్శి మనోహర్ తెలిపారు. 5 వరకు దరఖాస్తు చేయండి పెద్దపల్లిరూరల్: జిల్లాకు చెందిన విద్యావంతులైన బీసీ నిరుద్యోగ వయువతీయువకులు రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా రుణం పొందేందుకు ఏప్రిల్ 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమశాఖ అధికారి రంగారెడ్డి కోరారు. యువతకు స్వయం ఉపాధి క ల్పించి, ఆర్థికాభ్యున్నతి సాధించేందుకు ప్రభు త్వం ఈ పథకం అమల్లోకి తెచ్చిందని పేర్కొ న్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆ యన వివరించారు. వివరాలకు కలెక్టరేట్లోని బీసీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు. ఇంటర్ పరీక్షలకు 96.26 శాతం హాజరు పెద్దపల్లిరూరల్: జిల్లాలో బుధవారం జరిగిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 96.26 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్ విద్య జిల్లా నోడల్ అధికారి కల్పన తెలిపారు. మొత్తం 4,984 మంది విద్యార్థులకు 4,798 మంది హాజరయ్యారని ఆమె వివరించారు. -
రోడ్డు పనుల్లో వేగం పెంచాలి
మంథని: వరంగల్ – మంచిర్యాల మధ్య చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవేలో భాగంగా చేపట్టిన బుష్ క్లియరెన్స్ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ కో య శ్రీహర్ష ఆదేశించారు. పట్టణంలో బుధవారం ప ర్యటించిన కలెక్టర్.. ఆర్డీవో కార్యాలయం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, మాతాశిశు ఆరోగ్య కేంద్రం, అ డవిసోమన్పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. జాతీయ రహదారి ప్యాకేజీ–1లో భాగంగా మంథని మండలం పుట్టపాక వరకు ట్రెంచ్ కటింగ్ పనులు పూర్తిచేశామని, రోడ్డు అలైన్మెంట్ లోపల రోడ్డు నిర్మించేందుకు వీలుగా పిచ్చిమొక్కలు తొలిగించాలని, బుషెస్ క్లియరెన్స్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు. డివిజన్ పరిధిలో కార్యాలయ స ముదాయం నిర్మించుకునేందుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేసి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రెనోవేషన్ పనులను పరిశీలించారు. మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. మంథని ప్రాంతానికి గైనకాలజిస్ట్‌ను కేటాయించామని తెలిపారు. మంథని మాతా శిశు ఆస్పత్రిలో ఈనెల 22 నుంచి సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పు రోగతిని యాప్‌లో నమోదు చేయాలన్నారు. ప్రాథమిక పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. ఆర్డీవో సురేశ్, ఇన్చార్జి తహసీల్దార్ గిరి, మున్సిపల్ కమిషనర్ మనోహర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మ్యాన్‌హోళ్లకు వెంటనే మరమ్మతు చేయాలి కోల్‌సిటీ(రామగుండం): నగర పరిధిలో ప్రమాదకరంగా ఉన్న మ్యాన్‌హోళ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్(ఎఫ్ఏసీ) అరుణశ్రీ ఆదేశించారు. బుధవారం 11, 33వ డివి జన్లలో ప్రమాదకరంగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను ఆమె పరిశీలించారు. యుద్ధప్రాతిపదికన వాటికి మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. ప్రశాంత్‌నగర్‌లోని మల్కాపూర్ చెరువును పరిశీలించారు. చెరువుకు ఇరువైపులా పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించాలని సూచించారు. మల్కాపూర్ చె రువు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశో ర్ ఝాను అరుణశ్రీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖకు సంబంధించిన కట్టడాలు, ఆస్తిపన్ను చెల్లింపులపై సీపీతో చర్చించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఈఈ రామణ్ తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలి పెద్దపల్లిరూరల్: ఇంటింటా పర్యటిస్తూ ప్రజారోగ్య పరిరక్షణలో పాలుపంచుకుంటున్న తమ సమస్యలు పరిష్కరించాలని ఆశ వర్కర్లు డిమాండ్ చేశారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. కలెక్టరేట్ ఎదుట బుధవారం నిరసన చేపట్టారు. అంతకుముందు రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేశారు. పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. ఆశ వర్కర్లకు ఉద్యోగభద్రత కల్పించాలని, నెల వేతనం రూ.18వేలకు పెంచాలని యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షురాలు జ్యోతి డిమాండ్ చేశారు. నాయకులు రవీందర్, శారద, జ్యోతి, సువర్ణ, రూపారాణి, హేమలత, రేణుక, శివలీల, మంజుల, స్వప్న తదితరులు పాల్గొన్నారు. -
పాలన చేతకాక విపక్షాలపై విమర్శలు
పెద్దపల్లిరూరల్: రాష్ట్ర ప్రజలు అధికారం అప్పగిస్తే పాలించడం చేతకాక ప్రతిపక్ష పార్టీ నేతలపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చందర్ విమర్శించారు. గోదావరి గోసపై చేపట్టిన పాదయాత్ర మంగళవారం రెండో రోజు పట్టణ శివారు బందంపల్లి నుంచి బయలుదేరింది. ఆయా ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు యాత్ర కు స్వాగతం పలికారు. ప్రగతినగర్ కూడలివద్ద తె లంగాణతల్లికి, బస్టాండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహాల కు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నాయ కులు ఉప్పు రాజ్‌కుమార్, గంట రాములు, రఘువీర్‌సింగ్, రవీందర్, పెంట రాజేశ్, దాసరి ఉష, గండు రంగయ్య, జుబేర్, నటరాజ్, చంద్రశేఖర్, వైద శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరంపై అసత్య ప్రచారం సుల్తానాబాద్(పెద్దపల్లి): కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతుందని కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ విమర్శించారు. సుగ్లాంపల్లికి చేరుకున్న పా దయాత్రకు మాజీ కౌన్సిలర్ పసేడ్ల మమత మంగ ళహారతితో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చందర్ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. కాళేశ్వరమంటే చిన్న ఆనకట్ట కాదని, మూడు బరాజ్ లు, 15 రిజర్వాయర్లు, 19సబ్ స్టేషన్లు, 21పంపు హౌస్‌లు, 200 కి.మీ. సొరంగాలు, 1,530 కి.మీ. గ్రావిటీ కాలువలతో కూడుకున్నదని వివరించారు. నాయకులు దాసరి ఉష, రఘువీర్ సింగ్, పొన్నమనేని బాలాజీరావు, పాలరామారావు, పారుపల్లి గుణపతి, సూర శ్యామ్, సందీప్‌రావు, బుర్రశ్రీనివాస్ గౌడ్, దీకొండ భూమేశ్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ రెండోరోజు కొనసాగిన ‘గోదావరి గోస’ పాదయాత్ర -
ఇసుక, మట్టి అక్రమ రవాణా
ముత్తారం(మంథని): ఖమ్మంపల్లిలో ఇసుక, మ ట్టి అక్రమంగా తరలిపోతోంది. మానేరు సరి హద్దు గుట్ట, ప్రభుత్వ భూమిలో ఎర్రమట్టితోపాటు ఇసుక రవాణా చేస్తున్నారు. దీనిపై ఫి ర్యాదు చేసినా.. మైనింగ్, రెవెన్యూ అధికారు లు స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పట్టా భూమిలోంచి మట్టి తీస్తే అనుమ తి కావాలంటున్న అధికారులు.. అక్రమ రవాణాపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ మధూ సూదన్‌రెడ్డిని వివరణ కోరగా, అక్రమ రవాణా విషయం తమ దృష్టికి వచ్చిందని, అక్రమార్కులపై చర్యల కోసం మైనింగ్, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. సీఎంవోగా కంపెనీ వైద్యాధికారే కొనసాగుతారు ● సింగరేణి సీఎండీ బలరాం గోదావరిఖని: సింగరేణి సంస్థ చీఫ్ మెడి కల్ ఆఫీసర్‌గా కంపె నీ వైద్యాధికారే కొనసాగుతారని ఆ సంస్థ సీ అండ్ ఎండీ ఎన్.బలరాం పేర్కొన్నా రు. మంగళవారం సింగరేణి అధికారుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీపతిగౌడ్, ప్రధాన కార్యదర్శి పెద్ది నర్సింహులుతో జరిగిన సమావేశంలో ఈ విషయం స్పష్టం చేశారు. సింగరేణి వైద్యాధికారులు ఎలాంటి అపోహ లు, ఆందోళనకు గురికావద్దని సూచించారు. వైద్య సేవలను కార్పొరేట్ స్థాయిలో అందించాలనే ఆకాంక్షను సాకారం చేసేక్రమంలో విలువైన సలహాలు, సూచనలు అందించే బాధ్యతలను మాత్రమే చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ (సీఎంఎస్)గా నిర్వహిస్తారని పేర్కొన్నారు. కార్పొరేట్ తరహా వైద్యాన్ని అన్ని ఏరియాలకు విస్తరించాలన్న లక్ష్యాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి సీఎంఎస్ కృషి చేస్తారని ఆయన వివరించారు. ద్విచక్రవాహనం పైనుంచి పడి యువకుడి మృతి చిట్యాల: ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో కిందప డి ఓ యువకుడు చనిపోయాడు. ఈ ఘటన జయ శంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లక్ష్మీ పూర్తండా గ్రామ శివారులో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పోతనవేన అజయ్‌కుమార్(24) వ్యక్తిగత పనుల నిమిత్తం చిట్యాల మండలం ఒడితల నుంచి మోరంచపల్లి వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. లక్ష్మీపూర్ తండా గ్రామం వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి కింద పడడంతో గాయాలపాలయ్యాడు. స్ధానికు లు 108 అంబులెన్స్‌లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆస్పత్రికి తరలించగా అప్పటికే అజయ్‌కుమార్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి వీరేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రావణ్‌కుమార్ వివరించారు. ఇటలీలో ఎల్లారెడ్డిపేట వాసి..ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఉపాధి కోసం ఇటలీ వెళ్లిన ఓ వలస జీవి రోడ్డు ప్రమాదంలో ప్రాణా లు కోల్పోయాడు. మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ రషీద్(47) రెండేళ్ల క్రితం ఇటలీకి వెళ్లాడు. కారు డ్రైవింగ్ చేస్తుండగా ప్రమాదా నికి గురై సోమవారం రాత్రి మృతిచెందాడు. విషయం అక్కడి మిత్రులు కుటుంబ సభ్యుల కు ఫోన్ ద్వారా మంగళవారం సమాచారం అందించారు. రషీద్ మృతదేహం బుధవారం ఎల్లారెడ్డిపేటకు రానుంది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ
యైటింక్లయిన్‌కాలనీ/సుల్తానాబాద్: పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈసారి ఎలా గైనా వందశాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో ఉపాధ్యాయులు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్నెల్లుగా ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. చదువులో వెనుబడిన విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తత తీసుకుని సందేహాలు నివృత్తి చేస్తున్నారు. 21 నుంచి వార్షిక పరీక్షలు.. జిల్లాలోని మొత్తం 135 హైస్కూళ్లలో 7,393 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. ఈనెల 21 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు నిర్వహించే వార్షి పరీక్షలకు వీరు ఫీజు చెల్లించి ఉన్నారు. రోజూ ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా.. జిల్లాలో మాస్‌కాపీయింగ్‌కు తావులేకుండా జిల్లా విద్యాశాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. చూచిరాతలు, అవకతవకలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు సౌకర్యంగా ఆర్టీసీ అధికారుల సహకారంతో బస్సులు నడిపించేలా చర్యలు తీసుకుంటోంది. అందుబాటులో వైద్య సిబ్బంది.. పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలను నియమిస్తారు. వారి వద్ద ఓఆర్‌ఎస్‌తోపాటు ప్రథ మ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచుతారు. తా గునీటి సౌకర్యం కల్పిస్తారు. నీడకోసం అవసరమై న చోట షామియానాలు ఏర్పాటు చేస్తారు. పరిసరాల పరిశుభ్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తారు. సమీపంలోని జిరాక్స్ సెంటర్లు, బుక్‌స్టాళ్లు మూసివేయాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీచేశారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా జిల్లా విద్యాశాఖ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. నేరుగా హాల్‌టికెట్ల డౌన్లోడ్.. ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులు నేరుగా htto:// bse.telangana.gov.in వెబ్సైట్ నుంచి హాల్‌టికె ల్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తద్వారా ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులకు ఫీజు తిప్పలు ఉండవు.జిల్లా సమాచారం టెన్త్‌లో వందశాతం ఉత్తీర్ణత లక్ష్యం విద్యార్థులను సన్నద్ధం చేస్తున్న టీచర్లు 21 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ఏర్పాట్లు చేస్తున్న విద్యాశాఖ అధికారులు -
ప్రాణాలు పోతున్నాయి..
● ఆందోళన కలిగిస్తున్న రోడ్డు ప్రమాదాలు ● అతివేగం, నిర్లక్ష్యమే ప్రధాన కారణాలు ఈనెల 6న మంథని మండలం బిట్టుపల్లి వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో హైదరాబాద్ గచ్చిబౌలికి చెందిన గుండపాక ఉదయ్‌కుమార్(24) మృతి చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఈనెల 10న మంథని–పెద్దపల్లి మధ్య కమాన్‌పూర్ ఎక్స్‌రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కల్వచర్లకు చెందిన దొంతుల వాణి(48) మృతి చెందింది. బైక్‌ను ఇసుకలారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈనెల 15న ఆర్ఎఫ్సీఎల్ గేట్ మూలమలుపు వద్ద వేగంగా వెళ్తున్న ట్రాలీఆటో అదుపుతప్పి బోల్తాపడింది. అందులోని 8మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈనెల 15న అంతర్గాం ఎంపీడీవో ఆఫీసు సమీపంలో ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొని ఐకేపీ ఉద్యో గి మేర్గు కుమారస్వామి మృతి చెందారు. ఈనెల 17న మల్యాలపల్లి సమీపంలో రాజీవ్ రహదారిపై ఆగివున్న లారీని ఢీకొని అంతర్గాం మండలం పెద్దపేటకు చెందిన సింగరేణి కార్మికుడు బండి ప్రసాద్‌గౌడ్ దుర్మరణం చెందాడు. గోదావరిఖని: జిల్లాలో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. రోడ్డెక్కితే గమ్యం చేరేంత వరకూ భరోసా లేకుండాపోతోంది. అతివేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, సూచికల లేమి, లెక్కకు మించి మూలమలుపులు, డ్రైవింగ్‌లో నిర్లక్ష్యంతో ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని అధికారులు వివరిస్తున్నారు. ప్రధానంగా బ్లాక్స్పాట్ల వద్ద ప్రమాదాల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదని చెబుతున్నారు. గతేడాది 131 మంది.. 221 మందికి గాయాలు గతేడాది జరిగిన ప్రమాదాల్లో 131 మంది మృతి చెందగా 221మందికి తీవ్రగాయాలయ్యాయి. మరో 301మంది స్వల్పగాయాల పాలయ్యారు. రాజీవ్ రహదారిపై 27 బ్లాక్ స్పాట్లను పోలీసు యంత్రాంగం గుర్తించినా.. అక్కడ ప్రమాదాల నియంత్రణకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో ఆ ప్రాంతాల్లోనే ప్రమాదాలు పెరుగుతూ వస్తున్నాయి. కొన్ని ప్రమాదాల్లో గాయాలపాలైన వారు శాశ్వత అంగవైకల్యానికి గురవుతున్నారు. యంత్రాంగం నిర్లక్ష్యం.. ప్రమాదాల నియంత్రణ కోసం రోడ్డు సేఫ్టీ విభాగాన్ని ట్రాఫిక్ యంత్రాంగానికి అప్పగించారు. ఆరేళ్ల క్రితమే జిల్లాలోని బ్లాక్ స్పాట్లను గుర్తించి ఆయా ప్రాంతాల్లో బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో ప్రమాదాల సంఖ్య అప్పట్లో అదుపులోకి వచ్చాయి. ప్రస్తుతం సూచిక బోర్డులు లేకపోవడం, బ్లాక్ స్పాట్లు వాహనదారులకు కనిపించకపోవడం, అతివేగంతో చాలామంది ప్రమాదాల బారినపడుతున్నారు. భారీ వాహనదారుల నిర్లక్ష్యం.. భారీ వాహన డ్రైవర్లతో నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఓవర్‌లోడ్‌తోపాటు అతివేగం ప్రమాదాల కు కారణమని అంటున్నారు. భారీ వాహన డ్రైవర్ల తీరుతో ద్విచక్రవాహనదారులు ప్రమాదాల బారినపడి మృతిచెందుతున్నారు. రాత్రంతా వాహనం నడిపి నిద్రలేకుండా డ్రైవింగ్ చేయడంతోనే డ్రైవర్లు నిద్రలోకి జారుకుంటున్నారని, దీంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని వివరిస్తున్నారు. నియంత్రణలోకి రాక.. ట్రాఫిక్ పోలీసులు నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. అయినా, మద్యం తాగి డ్రైవింగ్ చేసే కేసుల సంఖ్య తగ్గడంలేదు. రోజూ ఏదోఒకచోట మద్యం తాగి వాహనం నడుపుతూ కొందరు పోలీసులకు చిక్కుతూనే ఉన్నారు. కోర్టులు కూడా భారీగా జరిమానా విధించడంతోపాటు జైలు శిక్షణ వేస్తోంది. గతేడాది 6,725 మంది డ్రంక్ అండ్ డ్రైవ్‌లు పట్టుపడగా, అందులో 3,352 మందికి రూ.44.14లక్షలు జరిమానా విధించారు. అయినా, తీరుమారడం లేనేలేదు. జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, మృతులు, గాయపడినవారు ఏడాది మృతులు తీవ్రగాయాలు గాయాలు 2022 128 44 296 2023 112 64 303 2024 131 221 301 నియంత్రణకు చర్యలు నేను గతంలో పోలీస్ కమిషనర్‌గా పనిచేసి వరంగల్‌లో చేపట్టిన అనేక సంస్కరణలో 20శాతం వరకు రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. ఇక్కడ కూడా అలాంటి కఠిన చర్యలు తీసుకుంటాం. బ్లాక్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారిపై చర్యలు తప్పవు. – అంబర్ కిశోర్ ఝా, పోలీస్ కమిషనర్, రామగుండం -
సామర్థ్యానికి మించి రవాణా
రామగుండం: అంతర్గాం నుంచి ఎన్టీపీసీ బూడిద, ముర్మూర్ నుంచి రాజీవ్ రహదారి ద్వారా చెరువుమట్టి భారీగా రవాణా అవుతోంది. గోలివాడ రీచ్ నుంచి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ట్రాక్టర్లతో ఇసుక నిత్యం తరలిపోతోంది. ఈ వాహనాలతో గ్రామీణ రహదారులపై అలజడి రేగుతోంది. సామర్‌ాధ్యనికి మించి మట్టి, బూడిద తరలిస్తున్నారు. బుగ్గ రోడ్డు నుంచి అంతర్గాం మండల పరిషత్ జంక్షన్ వద్ద కూడలి ఉంది. అక్కడ వేగాన్ని నియంత్రించే చర్యలు చేపట్టలేదు. దీంతో ఈ వాహనాలతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతర్గాం జంక్షన్ అంబేడ్కర్ విగ్రహం వద్ద కూడలిలో రద్దీ అధికంగా ఉంటుంది. అయితే, మట్టి, బూడిద, ఇసుక తరలించే వాహనాలతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రజలు, వ్యాపారులు, ఉద్యోగులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. మూలమలుపులు, కూడళ్ల వద్ద భారీ వాహనాల వేగాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఉచిత ఇసుక రవాణాతో ట్రాక్టర్ల ఇష్టారాజ్యం.. గోలివాడ రీచ్ నుంచి స్థానిక అవసరాలకు ఇసుకను ఉచితంగా తరలించే అవకాశంఉంది. దీంతో ట్రాక్టర్ యజమానులు అతివేగంగా రాకపోకలు సాగిస్తున్నారు. కొందరు మైనర్లకు ట్రాక్టర్లు అప్పగించడంతో ద్విచక్ర వాహనాలతో పోటీపడుతూ డ్రైవింగ్ చేస్తున్నారు. తద్వారా తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఓవర్‌లోడ్, అతివేగంతో వెళ్తున్న వాహనాలను నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. దీంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు. ● భారీటిప్పర్లలో బూడిద, ఇసుక, మట్టి తరలింపు -
గోదారి గట్టు మీద..
బుధవారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2025గోదావరిఖని: సింగరేణి రామగుండం రీజియన్ లేడీస్ క్లబ్ సభ్యులు ఎన్‌సీవోఏ క్లబ్లో మంగళవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ వేడుకలు జరుపుకున్నారు. డైరెక్టర్లు, జీఎంల సతీమణులు మాలతి, విజయలక్ష్మి, వనజ, అనిత, అలివేణి, లక్ష్మి, లలిత, వాణి తదితరులు తొలుత కేక్ కట్‌చేసి మిఠాయిలు పంచి పెట్టారు. ఆ తర్వాత సినిమా పాటలపై అదిరేటి స్టెప్పులేసి ఉర్రూతలూగించారు. వేడుకలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.న్యూస్‌రీల్ -
ఏఐతో విద్యాబోధన సులభం
గోదావరిఖనిటౌన్: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) సాయంతో విద్యాబోధన చేయడం ద్వారా వి ద్యార్థులకు సులభంగా పాఠ్యాంశాలు అర్థమవుతాయని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. స్థానిక గాంధీపార్క్ మండల పరిషత్ ప్రాథమిక, ఉర్దూ మీడియం, ఇంగ్లిష్ మీడియం పాఠశాలలను కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. ఏఐ కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన కంప్యూటర్ ల్యాబ్‌లు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలు పెంపొందించడం లక్ష్యంగా ఏఐ పద్ధతి అందుబాటులోకి తెచ్చారని అన్నారు. జిల్లాలోని 20 ప్రభుత్వ పాఠశాలల్లో పైలెట్ ప్రాజెక్టు కింద ఏఐ సాయంతో విద్యా బోధన ప్రారంభిస్తున్నామని తెలిపారు. డీఈవో మాధవి, ఏఎంవో పీఎం షేక్, ఎంఈవో చంద్ర య్య, జిల్లా రిసోర్సు పర్సన్లు ప్రవీణ్, రవి, ప్ర ధానోపాధ్యాయుడు రాంబాబు పాల్గొన్నారు. సాగునీటిని వృథా చేయొద్దు పెద్దపల్లిరూరల్: ఎస్సారెస్పీ నీటిని వృథా చేయొ ద్దని, చివరి ఆయకట్టుకూ అందేలా చూడాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. అప్పన్నపేట ఎస్సారెస్పీ డి–83 ప్రధాన కాలువ నీటి ప్రవాహాన్ని ఈఈ శ్రీనివాస్‌తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. పంటలకు అవసరమైన నీటి వినియోగంపై రైతులకు అవగాహన అవససరమన్నారు. బాలసదనం సందర్శన.. స్థానిక బాలసదనం కేంద్రాన్ని కలెక్టర్ శ్రీహర్ష సందర్శించారు. పిల్లల సంఖ్య, వసతులపై ఆరా తీశా రు. పిల్లలు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయా లని ఆదేశించారు. నిధులు అవసరమైతే తనకు ప్రతిపాదనలిస్తే మంజూరు చేస్తానన్నారు. ప్రతిభావంతులకు ప్రోత్సాహకాలు రామగుండం/కోల్‌సిటీ/ఫెర్టిలైజర్‌సిటీ: చదువు లో ప్రతిభచూపిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. రామగుండంలోని తబితా, వీర్లపల్లిలోని ఈశ్వర కృప వృద్ధాశ్రమాలను ఆయన మంగళవారం సందర్శించారు. గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రితనిఖీ చేశారు. అధికారులు ఉన్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష -
తప్పని తెలిసినా.. తప్పట్లేదు..
చివరి ఆయకట్టుకు సాగునీరు అందక ఎండిపోతున్న వరి పంటను కాపాడుకునేందుకు రైతులు చివరి ప్రయత్నంగా ఎత్తిపోతల పథకానికి ఉన్న ఎయిర్ వాల్వ్‌లకు పైపులు బిగించుకుని సాగునీరు అందిస్తున్నారు. అప్పటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం హైదరాబాద్‌వాసుల దాహం తీర్చేందుకు ఎల్లంపల్లి ప్రాజెక్టు వేమునూర్ పంప్‌హౌస్ నుంచి భూగర్భ పైపులైన్ నిర్మించింది. వీటికి రెండు విద్యుత్ మోటార్లు బిగించింది. ఎల్లంపల్లి నీటిని వీటి ద్వారా నందిమేడారం చెరువులోకి ఎత్తిపోసింది. ప్రస్తుతం ఎస్సారెస్సీ నీరు అందక ఎండుతున్న పంటలకు ఎయిర్‌వాల్వ్‌లు జీవం పోస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడూరు, జయ్యారం, మద్దిర్యాల తదితర గ్రామాల్లో వేలాది ఎకరాల్లోని వరి పంటను ఎయిర్‌వాల్వ్ వృథా నీరు ఆదుకుంటోంది. ఇలా నీటిని తరలించడం తప్పని తెలిసినా తప్పక చేస్తున్నామని కొందరు రైతులు తెలిపారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
‘భట్టి’ బడ్జెట్‌పై ఆశలు!
సాక్షిప్రతితినిధి, కరీంనగర్: నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పలు పెండింగ్, కొత్త ప్రాజెక్టులకు వచ్చే నిధులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్మార్ట్ సిటీ, జగిత్యాల మెడికల్ కాలేజీ, ముత్యంపేట షుగర్స్ ఫ్యాక్టరీ, పత్తిపాక రిజర్వాయర్‌కు ఎంత కేటాయిస్తారన్న దానిపై స్పష్టత రానుంది. ● కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కరీంనగర్ కార్పొరేషన్‌కు నిధులు రావాల్సి ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం కేంద్రం నుంచి రూ.429 కోట్లు, రాష్ట్రం నుంచి రూ.399 కోట్లు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రూ.30 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్‌ను విడుదల చేయాలని ఇటీవల మాజీ మేయర్ సునీల్ రావు సీఎంకు లేఖ రాశారు. ఈ నిధులపై బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని కరీంనగర్ బల్దియా అధికారులు ఆశాజనకంగా ఉన్నారు. ● మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామం నిజాంషుగర్స్ బకాయిలు మొత్తం రూ.250 కోట్లు ఉన్నాయి. తొలుత రూ.43 కోట్లు, తర్వా త అది రూ.192 కోట్లకు చేరింది. మిగిలిన బకాయిలు కూడా త్వరలోనే ఇవ్వనుంది. ఫార్చున్ కన్సెల్టెన్సీ ప్రతినిధులను పిలిచి ముత్యంపేట ఫ్యాక్టరీ రిపేరు చేయాలా? కొత్తది ఇన్స్టాల్ చేయాలా? అన్న విషయాలపై నివేదిక ఇవ్వమంది. మరమ్మతులకు రూ.50 కోట్ల వరకు ఖర్చవుతుందని.. ఒకవేళ నడిపినా పదేపదే మరమ్మతుల కారణంగా నష్టాలు వస్తాయని చెప్పింది. లాభాలు రావాలంటే కొత్త ఫ్యాక్టరీ పెట్టాలని నివేదిక ఇచ్చింది. ఈ బడ్జెట్లో దీనిపై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుదోనని ఉత్కంఠగా మారింది. ● 2022–23 మెడికల్ కళాశాల ప్రారంభం అయ్యింది. దీని హాస్టల్స్ భవన నిర్మాణానికి రూ.500 కోట్లు మంజూరు అయ్యాయి. ధరూర్ క్యాంపులో 27.5 ఎకరాలు కేటాయించారు. ఇప్పటివరకు రూ.30 కోట్లు మాత్రమే విడుదల అయ్యాయి. ఇంకా 360 బెడ్స్ ఆసుపత్రి నిర్మాణం కావాల్సి ఉంది. ప్రస్తుతం వంద పడకల ఆసుపత్రిలోనే కొనసాగుతుంది. ఈ సారి బడ్జెట్లో మరిన్ని నిధులు కేటాయించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ● ఉమ్మడి జిల్లాలోని ఎస్సారెస్పీ ఆయకట్టు భూములకు నీరు అందించి స్థిరీకరణ చేసేందుకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక వద్ద ఒక రిజర్వాయర్‌ను నిర్మించాలని ప్రతిపాదించారు. దానికి బడ్జెట్లో చోటు ఇస్తారని పెద్దపల్లి జిల్లా వాసులు ఎదురుచూస్తున్నారు. ఇందుకు సంబంధించి డీపీఆర్ కు ఆదేశించారు. సుమారు రూ.2 వేల కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుపై ఎలాంటి ప్రకటన ఉంటుందో వేచిచూడాలి. స్మార్ట్ సిటీకి నిధులు దక్కేనా? నిజాం షుగర్స్ పై ప్రకటనపై ఉత్కంఠ పత్తిపాక రిజర్వాయర్ పనులు మొదలయ్యేనా? రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆసక్తి -
రోడ్డుపైనే నిర్మాణాలు
పెద్దపల్లి పట్టణంలోని కూనారం రోడ్డులో సెట్‌బ్యాక్ లేకుండా చేపట్టిన నిర్మాణాలను తొలగించాలి. అసలే ఇరుకుగా ఉన్నరోడ్డును ఆనుకుని చేస్తున్న నిర్మాణాలకు మున్సిపల్ అధికారులు సహకరించడం సరికాదు. ఈ విషయంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. – చిలారపు పర్వతాలు, పెద్దపల్లి మెట్ల సౌకర్యం కల్పించాలి పెద్దపల్లి బస్టాండ్ ప్రాంతంలోని జగ్జీవన్‌రాం విగ్రహం వద్ద పూలమాల వేసేందుకు వీలుగా మెట్లు లేవు. మూడేళ్లుగా ఏటా జయంతి, వర్ధంతి సందర్భంగా ఇబ్బంది పడుతున్నాం. అధికారులు ఈ విషయంలో స్పందించాలి. తక్షణమే మెట్లు నిర్మించేలా చూడాలి. – కై లాసం, పెద్దపల్లి -
కాంగ్రెస్ తీరును ఎండగడతాం
గోదావరిఖని/రామగుండం: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గోదావరినదికి జీవం పోస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ ఎడారిగా మార్చిందని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ విమర్శించారు. గోదావరిగోస.. ప్రజలు, రైతుల బాధలను మాజీ సీఎం కేసీఆర్ విన్నవించేందుకు ‘గోదావరి గోస మహాపాదయాత్ర’ను ఈశ్వర్ సోమవారం ప్రారంభించా రు. జెడ్పీ మాజీ చైర్మన్ పుట్ట మధుకర్, మాజీ ఎ మ్మెల్యే దివాకర్‌రావు హాజరయ్యారు. ఈశ్వర్, చందర్ మట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమ యంలో ఎండిన గోదావరి నదితో రైతన్నల కన్నీ ళ్లు, కష్టాలను చూసి చలించిన కేసీఆర్.. కాళేశ్వ రం ప్రాజెక్టుతో కన్నీళ్లను తుడిచారని గుర్తుచేశా రు. ఆచరణకు యోగ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కేసీఆర్‌పై అక్కసుతో కా ళేశ్వరం ప్రాజెక్టును అస్తవ్యస్తం చేసిందని ధ్వజమెత్తారు. కాళేశ్వరం విశిష్టత, కాంగ్రెస్ సర్కారు ని ర్లక్ష్య వైఖరి ఎండగడుతూ ఈనెల 22వరకు ఎర్రవెల్లికి మహా పాదయాత్ర నిర్వహిస్తున్నామని తెలి పారు. నాయకులు మూల విజయారెడ్డి, అముల నారాయణ, కౌశిక హరి, పెంట రాజేశ్, బాదె అంజలి, కల్వచర్ల కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. మహాపాదయాత్రకు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రామగుండం బైపాస్ వద్ద ఘనస్వాగతం పలికారు.● మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ -
పాసుబుక్కు ఇప్పించాలి
మా ఊరు శివారులోని సర్వే నంబరు 315/2లో నాకు వారసత్వంగా వచ్చిన భూమి పట్టాదారు పాసుపుస్తకం ఇప్పించాలి. ప్రభుత్వం రైతులకు అంది స్తున్న ఫలాలను అధికారుల తప్పిదంతో పొందలేక పోతున్న. వీలైనంత త్వరగా పొరపాటును సవరించి పాసుపుస్తకం అందించి నాకు న్యాయం చేయాలి. – దేవ లాలయ్య, భోజన్నపేట కార్యదర్శి లేక కష్టాలు రామగిరి మండలం వెంకట్రావుపల్లికి పంచాయతీ కార్యదర్శిలేరు. ఏ పనీ ముందుకు సాగడం లేదు. కనీసం పారిశుధ్య పనులు కూడా చేపట్టడంలేదు. గ్రామస్తులు రోగాల బారిన పడుతున్నారు. పంచాయతీ కార్యదర్శిని నియమించేలా చర్యలు తీసుకోవాలి. – బత్తిని శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ, వెంకట్రావుపల్లి వంతెన నిర్మించాలి మా ఊరు పంట పొలాల్లోకి వెళ్లేందుకు ఊరచెరువు వద్ద వంతెన నిర్మించాలి. చెరువు వద్ద నిర్మించిన మత్తడి నుంచి వచ్చే వరదతో అటువైపు వెళ్లలేకపోతున్నాం. కాల్వపై వంతెన నిర్మించేలా నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశాలివ్వాలి. – నిట్టూరు గ్రామ రైతులు -
బయోమైనింగ్ అవసరం
జిల్లాలోనే అతిపెద్ద, ఒకేఒక నగరపాలక సంస్థ రామగుండం. పరిశ్రమలకు నిలయం. ఇరవై ఏండ్లుగా డంపింగ్‌యార్డ్‌కు స్థలం లేదు. గత ప్రభుత్వమూ పట్టించుకోలేదు. ఈ సర్కారైనా పట్టించుకోవాలి. ప్రభుత్వం బయో మైనింగ్ ఏర్పాటు చేయాలి. – మద్దెల దినేశ్, అధ్యక్షుడు, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ టెండర్లు పిలిచాం ఆర్ఎఫ్సీఎల్కు చెందిన ఖాళీ స్థలాన్ని తాత్కాలికంగా డంపింగ్ యార్డుగా వినిగిస్తున్నాం. ఇందుకోసం డ్రై రీసోర్స్ కలెక్షన్ సెంటర్(డీఆర్సీసీ) కోసం టెండర్లు పిలిచాం. బయో మైనింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తాం. సేంద్రియ ఎరువు తయారు చేస్తాం. – అరుణశ్రీ, కమిషనర్(ఎఫ్ఏసీ) -
‘చెత్త’కు పరిష్కారం
● స్థానికుల వ్యతిరేకతతో ఓసీపీ–4 ప్రాంతంపై యూటర్న్ ● గతంలో చెత్త వాహనాలను అడ్డుకున్న ఆర్ఎఫ్సీఎల్ ● తాజాగా అదే స్థలాన్నే చెత్త నిల్వలకు వినియోగిస్తున్న వైనం ● ఊపిరి పీల్చుకుంటున్న రామగుండం నగర పాలక సంస్థ అధికారులుకోల్సిటీ(రామగుండం): చెత్త సేకరణలో రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిన రామగుండం మున్సిపల్ కా ర్పొరేషన్‌కు శాశ్వత డంపింగ్ యార్డు లేక ఇన్నాళ్లూ అనేక సమస్యలు ఎదురయ్యాయి. ఎట్టకేలకు గోదావరి తీరంలోని ఆర్ఎఫ్సీఎల్ ఖాళీ స్థలం వినియోగానికి అడ్డంకులు తొలిగినట్లు సమాచారం. ఊపిరి పీల్చుకున్న బల్దియా అధికారులు.. ఇంటింటా సేకరించిన చెత్తను యార్డుకు తరలిస్తున్నారు. బమోమైనింగ్ ఏర్పాటు కూడా.. యార్డులో బయో మైనింగ్ యూనిట్ ఏర్పాటు చే యడంతోపాటు తడి, పొడి చెత్త వేరు చేసే ప్రక్రియ చేపడతారు. సేంద్రియ ఎరువూ తయారు చేస్తారు. ఇందుకోసం అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇదేస్థలంలో గతంలో చెత్త పోయడానికి వెళ్లే వాహనాలను ఆర్ఎఫ్సీఎల్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో మూసివేసిన సింగరేణి ఓసీపీ–4 స్థ లాన్ని రెండు నెలల క్రితం చదును చేశారు. స్థానికు ల నుంచి తీవ్ర వ్యతిరేకంత ఎదురైంది. తాజాగా క లెక్టర్ ఆదేశాలతో బల్దియా అధికారులు ఇక్కడే తాత్కాలిక డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తున్నారు. అనేక అవాంతరాలు.. బల్దియాకు సుమారు ఇరవై ఏళ్లుగా శాశ్వతపు డంపింగ్ యార్డుకు స్థలం లభించడంలేదు. 15ఏళ్ల క్రి తం రామగుండంలో ఏర్పాటు చేయగా స్థానికులు అడ్డుకున్నారు. ఆ తర్వాత జల్లారం శివారులో పదెకరాలను కేటాయించిన సింగరేణి.. ఓసీపీ–5 ఏర్పా టు కావడంతో మళ్లీ స్వాధీనం చేసుకుంది. పీకే రా మయ్యకాలనీ సమీపంలోని రామునిగుండాలగుట్ట సమీప క్వారీ స్థలాన్ని రెవెన్యూ అధికారులు సూచించగా.. స్థానికులు అడ్డుకున్నారు. ఆ తర్వాత లక్ష్మీపురం గ్రామ సమీప ఆర్ఎఫ్సీఎల్ ఖాళీస్థలంలో చెత్త డంప్ చేయగా స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో గోదావరి ఒడ్డున సమ్మక్క–సారలమ్మ జాతర, హిందూ శ్మశానవాటిక దారిలో రోడ్డు పక్కన చెత్త పారబోయగా స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత సుందిళ్లగ్రామ శివారులోని సింగరేణి స్థలాన్ని వినియోగించినా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఫలితంగా కొంతకాలంగా గోదావరి నదీతీరంలోని ఆర్ఎఫ్సీఎల్ ఖాళీ స్థలాన్ని డంపింగ్ యార్డుకు వినియోగిస్తున్నారు. రోజూ 118 మెట్రిక్ టన్నుల చెత్త.. నగరంలోని 50 డివిజన్ల నుంచి రోజూ సుమారు 118 మెట్రిక్ టన్నుల వరకు చెత్త వెలువడుతోంది. దీంతోపాటు సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, జెన్కో పరిశ్రమలకు చెందిన కాలనీల నుంచి మరో 50 మెట్రిక్ టన్నుల వరకు వెలువడుతోంది. ఈ మొత్తం చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాల్సి ఉంది. ఇప్పటిదాకా డంపింగ్‌యార్డ్ అందుబాటులో లేక ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడే పారబోశారు.బల్దియా సమాచారం డివిజన్లు 50 నగర వైశాల్యం(చ.కి.మీ.లలో) 93.87 జనాభా(2011 లెక్కల ప్రకారం) 2,29,644మొత్తం నివాసాలు 64,000 రోజూ వెలువడే చెత్త(మెట్రిక్ టన్నుల్లో) 118 పారిశుధ్య కార్మికుల సంఖ్య 448 ర్యాగ్ పిక్కర్లు 100 స్వచ్ఛ ఆటోలు 53 ట్రాక్టర్లు 18 జేసీబీలు 03 బ్లేడ్ ట్రాక్టర్లు 05 చర్యలు వేగవంతం చేస్తేనే.. రాష్ట్రంలోని డంపింగ్ యార్డుల్లో సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త నిల్వలు ఉన్నట్లుగా అధికారులు రెండేళ్ల క్రితమే అంచనా వేశారు. దీంతో పురపాలక, నగరపాలక సంస్థల్లో వెంటనే బయోమైనింగ్ విధానాన్ని అమలు చేయా లని సూచించారు. తొలత చెత్తను శుద్ధిచేసి తడిచెత్తను సేంద్రియ ఎరువు తయారీకి, పొడి చెత్తను సిమెంటు, ఇతర కర్మాగారాల అవసరాలకు తరలించాలని ఆదేశించారు. -
ఎన్‌హెచ్ 563లో కొత్త మలుపు
● జగిత్యాల – కరీంనగర్ సెక్షన్ పాత టెండరు రద్దు ● సాంకేతిక కారణాలతోనే రద్దయినట్లు సమాచారం ● తాజాగా రూ.1,779 కోట్లతో మరో టెండరు ● రూ.276 కోట్ల వరకు పెరిగిన అంచనా వ్యయం ● వేగంగా కరీంనగర్ – వరంగల్ సెక్షన్ పనులు సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఛత్తీస్‌గఢ్ నుంచి మహా రా ష్ట్ర.. రెండు రాష్ట్రాలను కలిపే ప్రతిష్టాత్మక జాతీయ రహదారి ఎన్‌హెచ్ –563 టెండర్ కొత్త మలుపు తి రిగింది. గత జూలైలో కరీంనగర్–జగిత్యాల సెక్షన్ కు సంబంధించి రెక్వెస్ట్ ఫర్ ప్రపోజల్(ఆర్ఎఫ్పీ) టెండర్ల అంచనా వ్యయాలు ఖరారు అయ్యాయి. దాదాపు రూ.2,227 కోట్లతో టెండరుకు అంచనా వ్యయం కూడా రూపొందాయి. ఈ మేరకు టెండర్లు వేసేందుకు కూడా సిద్ధమయ్యారు. విశ్వసనీయ స మాచారం మేరకు.. వివిధ సాంకేతిక కారణాలతో పాత అంచనాలతో రూపొందించిన టెండర్లు రద్దు అయ్యాయి. తాజాగా రూ.1,779 కోట్లతో ఆర్ఎఫ్పీ టెండర్లు పిలిచారు. మొత్తం 58.86 కిమీ పొడవైన ఈ రహదారి కరీంనగర్ బైపాస్ (కొత్తపల్లి సమీపంలో) నుంచి జగిత్యాల వరకు నాలుగు లేన్ల రహదా రిగా వేయనున్నారు. గతంలో ఈ రోడ్డు ఖర్చు ప్రతీ కి.మీ.కు రూ.37 కోట్ల వరకు అంచనా వ్యయంగా ఉండటం గమనార్హం. అధునాతన సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ జాతీయ రహదా రి నిర్మాణం కానుంది. ఈ మార్గంలో దాదాపు 241 హెక్టార్ల భూసేకరణ కోసం దాదాపు రూ.387 కోట్లు కేటాయించారు. వాస్తవానికి గతంలో అంచనా వ్య యం రూ.1,503 కోట్లు మాత్రమే. (వీటికి జీఎస్టీ, భూసేకరణ కలుపుకుంటే అది రూ.2,227 కోట్ల వ రకు చేరింది.) తాజాగా టెండరు ప్రకారం.. రూ. 1,779 కోట్ల వరకు అంచనా వ్యయం పెరిగినట్లు సమాచారం. ఈ లెక్కన రూ.276 కోట్ల అంచనా వ్యయం పెరిగిందని సమాచారం. తాజా టెండర్ అంచనా వ్యయంలో జీఎస్టీ కలిసిందా? లేదా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. మార్కెట్లో పలు ముడిసరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో అంచనా వ్యయం పెరిగి ఉండవచ్చని సమాచారం. వేగంగా రహదారి పనులు.. ఈ సెక్షన్లో కీలకమైన కరీంనగర్–వరంగల్ సెక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. గతంలో మోదీ వంద రోజుల యాక్షన్ ప్లాన్ కింద ఈ పనులు చేపట్టారు. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ముఖ్య నగరాలైన వరంగల్– కరీంనగర్ పట్టణాలను కలిపే 68 కి.మీ.ల ప్రతిష్టాత్మక రహదారి. దీన్ని 2025 జూలై నాటికి పూర్తి చేయాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్తగట్టు మత్స్యగిరీంద్రస్వామి ఆలయం సమీపంలో టోల్గేట్ పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. అదే సమయంలో మానకొండూరు, తాడికల్, హుజూరాబాద్, ఎల్కతుర్తి, హసన్‌పర్తి వద్ద నిర్మించతలపెట్టిన బైపాస్ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి.వరంగల్–కరీంనగర్ సెక్షన్ దూరం 68 కి.మీ అంచనా రూ.2,146 కోట్లు గడువు 16–7–2025 మానకొండూరు బైపాస్ 9.44 కి.మీ తాడికల్ బైపాస్ 6.65 కిమీ హుజూరాబాద్ బైపాస్ 15.05 ఎల్కతుర్తి బైపాస్ 4.60 కిమీ హసన్‌పర్తి బైపాస్ 9.57 కిమీ మైనర్ జంక్షన్లు 29కరీంనగర్–జగిత్యాల సెక్షన్ దూరం 58.8 కిమీ అంచనా రూ.1,779 కోట్లు (జీఎస్టీపై స్పష్టత రావాల్సి ఉంది) బ్రిడ్జిలు 24 ఆర్వోబీ/ఆర్యూబీ 03 మేజర్ జంక్షన్లు 27 మైనర్ జంక్షన్లు 29 టోల్‌ప్లాజా గంగాధర– తుర్కాశీనగర్ సమీపంలో (అంచనా) ట్రక్ బే టోల్‌ప్లాజా సమీపంలోనే (2 కి.మీలోపే) రెస్ట్ ఏరియా జగిత్యాల సమీపంలో.. -
ప్రారంభానికి రైల్వేస్టేషన్ సిద్ధం
రామగుండం: స్థానిక రైల్వేస్టేషన్ ప్రారంభానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అభివృద్ధి, సుందరీకరణ పనులు శరవేగవంతంగా సాగుతున్నాయి. ఈనెల 21న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పనులను తనిఖీ చేసే అవకాశం ఉంది. సికింద్రాబాద్ డివిజన్ స్థాయి ఉన్నతాధికారులు ప్రస్తుతం పనులు పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 30లోగా పనులు పూర్తిచేయాలని ఆదేశాలు ఉన్నాయి. అమృత్ భారత్‌లో భాగంగా రూ.26.50 కోట్ల అంచనా వ్యయంతో 2023 ఆగస్టు 6న ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ విధానంలో పనులకు పచ్చజెండా ఊపారు. ‘కాంట్రాక్టు కార్మికుల పర్మినెంట్ ఘనత మాదే’ రామగుండం: థర్మల్ విద్యుత్ కేంద్రాల్లోని కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయించిన ఘనత తమకే దక్కుతుందని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ (1535) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రం కుమారస్వామి అన్నారు. పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడారు. వేలాది మంది ఆర్టిజన్ కార్మికులను పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించేందుకు తమ యూనియన్ విశేషంగా కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో నాయకు లు అబ్దుల్ తఖీ, యూనుసొద్దీన్, దుర్గయ్య, నీలం శంకర్, ఖమరొద్దీన్, రషీద్, బంగారి రా జు, రాధ, వెల్లుల స్వామి, ఎ.రాజేందర్, జ్ఞాన శేఖర్, చక్రవర్తి, చంటి, ఆసిఫ్, పోచం, కృష్ణ, గౌతమ్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు. ‘ఆర్ఎఫ్సీఎల్ బాధితుల యాత్ర’ చేయాలి రామగుండం: గోదావరి గోస పాదయాత్ర క న్నా ముందు ఆర్ఎఫ్సీఎల్ బాధితుల యాత్ర చేపడితే మోసపోయిన వారికి న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేశ్ సూచించారు. అంతర్గాంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ హ యాంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కనీసం తా గు, సాగునీరందించలేదన్నారు. ఎల్లంపల్లి ఎత్తిపోతలకు అప్పటి నేతలు శంకుస్థాపన చేసి మ ధ్యలోనే వదిలేస్తే.. మోటార్లు, సబ్‌స్టేషన్ పను లు పూర్తిచేసిన ఘనత తమదన్నారు. అధిష్టా నం మెప్పుకోసం, రాజకీయ లబ్ధికి కోరుకంటి చందర్ గోదావరి గోస పేరిట పాదయాత్ర చేపట్టారని ఆరోపించారు. ప్రతినిధులు ఉరిమెట్ల రాజలింగం, గాదె సుధాకర్, పూదరి సత్తయ్య గౌడ్, ముచ్చకుర్తి రమేశ్, శ్రీకాంత్ పాల్గొన్నారు. వేలం డబ్బు జమచేయాలి పెద్దపల్లిరూరల్: యాసంగి(2022–23 సీజన్) ధాన్యం వేలం పాట ద్వారా సమకూరిన సొమ్మును ప్రభుత్వ ఖజానాకు సకాలంలో జమచేయాలని అడిషనల్ కలెక్టర్ వేణు మిల్లర్లకు సూచించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో మిల్లర్లు, సంబంధిత శాఖ అధికారులతో సోమవారం ఆయన సమావేశమై పలు సూచనలు చేశారు. యాసంగి(2022–23) పంట దిగుబడులను ప్రభుత్వం వేలం వేసిందని, వాటిని దక్కించుకున్న మిల్లర్లు సత్వరమే డబ్బు చెల్లించాలని అన్నారు. సమావేశంలో డీఎస్వో రాజేందర్, సివిల్ సప్లయి డీఎం శ్రీకాంత్, రైస్‌మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షలకు 96.4శాతం హాజరు పెద్దపల్లిరూరల్: జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు 96.4శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి కల్పన తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ ఫిజిక్స్/ఎకనామిక్స్ పరీక్షకు 5,500 మంది హాజరుకావాల్సి ఉండగా 5,304 మంది హాజరయ్యారని ఆమె వివరించారు.