కమాన్‌పూర్(మంథని): అంబేడ్కర్, గాంధీని కేంద్ర మంత్రి అమిత్‌షా అవమానిస్తున్నారని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం బై బాపు, బై భీమ్, బై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్, గాంధీ చిత్రపటాలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, రాజ్యాంగా నిర్మాతలను బీజేపీ ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్, కేంద్ర మంత్రి అమిత్‌షా అవమానిస్తున్నారని అన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వ కుట్రలను ప్రజలకు తెలియజేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. అనంతరం పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో తొట్ల తిరుపతియాదవ్, వైనాల రాజు, కోలేటి మారుతి, గాండ్ల మోహన్, ఇనగంటి రామారావు, పీట్ల గోపాల్, అంబిర్ శ్రీనివాస్, రంగు సత్యనారాయణ, కుక్క రవి తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యన్ని కాపాడటమే లక్ష్యం
ముత్తారం(మంథణి): ప్రజాస్వామ్యన్ని కాపాడడమే లక్ష్యంగా, రాజ్యాంగం ప్రఖ్యాతి తెలిసేలా గ్రామాల్లో కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి పేర్కొన్నారు. గురువారం ముత్తారంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాహుల్‌గాంధీ పిలుపు మేరకు గ్రామాల్లో ప్రతీ కార్యకర్త రాజ్యాంగ ఆవశ్యకతను వివరిస్తూ పాదయాత్రలు చేయలన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతిజ్ఞ చేయించారు. కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చోప్పరి సదానందం తదితరులు పాల్గొన్నారు.