Peddapalli District Latest News
-
నిరాశ్రయులపై ‘శీత’కన్ను
● నగరాల్లో లక్ష జనాభాకు ఒక నైట్‌షెల్టర్ (షెల్టర్ ఫర్ అర్బన్ హోం లెస్) ఉండాలి. రామగుండం జనాభా సుమారు 3లక్షలు. అక్కడ మూడు షెల్టర్లు ఉండాలి. కానీ, ఒక్కటే అందుబాటులో ఉంది. పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథనిలో వాటి ఊసేలేదు. వివిధ పనులు, అవసరాల కోసం వచ్చిన వారు, రాత్రివేళల్లో రైలు, బస్సు ప్రయాణం చేసి వచ్చేవారు గమ్యస్థానాలకు చేరుకునే సౌకర్యాలు లేక ప్లాట్‌ఫామ్స్‌పైనే బిక్కుబిక్కుమంటున్నారు. చలి తీవ్రతకు గజగజ వణికిపోతున్నారు.● ఈ వృద్ధురాలి పేరు పెద్దమ్మ. స్వగ్రామం జయ్యారం అని చెబుతోంది. గోదావరిఖని బస్టాండ్‌లో చలిలో గజగజ వణుకుతూ ఇలా కనిపించింది. పల్చటి చెద్దరు కప్పుకొని కనిపించింది. తన భర్త, ఇద్దరు కొడుకులు గతంలోనే చనిపోయారని, ఇంటి పైకప్పు రేకులను కోతులు పగులగొట్టాయని, అందుకే ఇక్కడ ఉంటున్నానని చెబుతోంది.● గోదావరిఖని గాంధీచౌక్ చౌరస్తాలో పారిశుధ్య పనులు చేస్తున్న కార్మికులు వీరు. అర్ధరాత్రి ఎముకలు కొరికే చలిలో రోడ్లను ఇలా శుభ్రం చేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరికి స్వెట్టర్లు, శాలువాలు, మంకీ క్యాపులు అందజేస్తే చలినుంచి ఉపశమనం లభిస్తుందని అంటున్నారు.● వీరు చిరువ్యాపారులు. సూర్యోదయానికి ముందే పెద్దపల్లి మార్కెట్లోకి కూరగాయలు సరఫరా చేయాలి. ఇందుకోసం వేకువజామున 2 గంటలకే మార్కెట్‌కు చేరుకోవాలి. చలిని సైతం లెక్కచేయకుండా మార్కెట్లో ఇలా పనులు చేస్తున్నారు.సాక్షి, పెద్దపల్లి/కోల్‌సిటీ(రామగుండం): నగరవాసులు గాఢ నిద్రలో ఉంటే దిక్కుమొక్కులేని అభాగ్యులు చలికి గజగజ వణుకుతూ రోడ్ల వెంట, బస్టాండ్లలో, రైల్వేప్లాట్ఫారమ్లు, ఫుట్‌పా త్‌లపై తలదాచుకుంటున్నారు. వారం రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. దీంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఫుట్‌పాత్, ఆలయ ఆవరణల్లో ఆశ్రయం పొందుతున్నవారు కప్పుకోవడానికి కనీసం దుప్పట్లు కూడా లేక నరకం అనుభవిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి ‘సాక్షి’ జిల్లాలోని రామగుండం నగరం, పెద్దపల్లి జిల్లా కేంద్రం, మంథని, సుల్తానాబాద్ బల్దియాల్లో పర్యటించింది. పదుల సంఖ్యలో ని రాశ్రయులు చలి తీవ్రతతో కునుకు పట్టక, తలదాచుకునేందుకు వసతి లేక వణుకుతున్న దృశ్యా లు వెగులు చూశాయి. చిరువ్యాపారులు, మున్సిపల్ కార్మికులూ వణుకుతూనే తమ పనుల్లో నిమగ్నమై కనిపించారు.కేంద్రాల ఏర్పాటుపై నిర్లక్ష్యంబతుకు దెరువు కోసం వచ్చేవారు కొందరు.. ఆ ధారం లేక బతుకు దుర్భరమైన వారు మరికొందరు.. వైద్యం కోసం వచ్చే ఇంకొందరు.. అలనా పాలనా లేనిపండుటాకులు.. ఇంట్లోంచి నెట్టి వేయబడిన తల్లిదండ్రులు.. యాచనతో బతుకు నెట్టుకొచ్చే వారు.. గూడు లేకదిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడే అభాగ్యులు.. ఇలా ఎందరెందరో బల్దియాల్లో చీకటిరోజులు గడుపుతున్నారు.వీరందరికీ షెల్టర్ ఫర్ అర్బన్ హోంలెస్ ద్వారా నీ డకల్పించాల్సిన బాధ్యత ఉన్నా అధికారులు ఆ విషయాన్ని విస్మరించడంపై విమర్శలు వస్తున్నా యి. రామగుండం నగరంపాటు పెద్దపల్లి, సు ల్తానాబాద్, మంథని బల్దియాల్లోని మెప్మా అధికారులు ఈ బాధ్యతలు విస్మరిస్తున్నారు.తూతూ మంత్రంగా సర్వేలు..● గోదావరిఖని బస్టాండ్, రామగుండం రైల్వేస్టేషన్ వద్ద ఒక్కో నైట్‌షెల్టర్ ఉంది. అధికారుల పర్యవేక్షణలోపంతో రామగుండంలోని నైట్‌షెల్టర్ నిరుపయోగంగా మారింది. గోదావరిఖని ఆశ్రయంలో సౌకర్యాలు అంతంతే ఉన్నాయి. నిరాశ్రయుల గుర్తింపుకోసం చేసే సర్వేలు తూతూమంత్రంగానే మారుతున్నాయి. ఒక్కో నైట్‌షెల్టర్‌లో 50 మంది వరకు ఆశ్రయం పొందే వీలుంది. ఇందులో 10 మందికి భోజనం పెడతారు.జిల్లాలో మంగళవారం నమోదైన కనిష్ట ఉష్ణోగత్రలు(డిగ్రీల సెల్సియస్‌లో)ధర్మారం 9.7ఓదెల 9.7రామగుండం 10.4సుల్తానాబాద్ 10.5అంతర్గాం 10.6కమాన్‌పూర్ 10.6మంథని 11.0పాలకుర్తి 11.1పెద్దపల్లి 11.4ఎలిగేడు 11.5జూలపల్లి 11.7రామగిరి 11.9 -
జీవో నంబరు 22 అమలు చేయాలి
● అసెంబ్లీలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ గోదావరిఖని: పారిశ్రామిక ప్రాంతంలోని కాంట్రా క్టు కార్మికుల కోసం జీవో–22 అమలు చేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ కోరారు. అసెంబ్లీ సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. రామగుండం నియోజకవర్గం పూర్తిగా కార్మిక ప్రాంతమన్నారు. ఇక్కడి సింగరేణి, ఎన్టీపీసీ, కేశోరాం సంస్థల్లో వేలాది మంది కాంట్రాక్టు కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. వారికి సరైన వేతనాలు అందడం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించి.. కాంట్రాక్టు కార్మికుల కోసం జీవో నంబర్ 22 జారీచేశామన్నారు. దీనిని త్వరితగతిన అమలు చేసి కాంట్రాక్టు కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని తాము విన్నవించామని ఎమ్మెల్యే అన్నారు. దీంతో పాటుగా మున్సిపల్ కార్మికులకు సంబంధించిన వేతనాల గురించి త్వరగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పల్లెప్రాంత క్రీడాకారులను గుర్తించి జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం కూడా క్రీడాకారులను అన్ని రకాలుగా ప్రోత్సాహిస్తున్నారని ఠాకూర్ తెలిపారు. -
‘విండో’లో అవినీతిపై విచారణ
సుల్తానాబాద్‌రూరల్: గర్రెపల్లి ప్రాథమిక వ్య వసాయ సహకార సంఘంలో జరిగిన అవినీ తిపై మంగళవారం విచారణ జరిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీసీవో కార్యాలయ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు ఈ విచారణ చేపట్టా రు. సంఘం నూతన భవనానికి అవసరమై భూమి కొనుగోలు విషయంలో సింగిల్‌విండో పాలకవర్గం అవినీతికి పాల్పడగా, భూమి విక్రయించిన వ్యక్తిని బెదిరించినట్లు అధికారులకు ఫిర్యాదు అందింది. ఈ విషయంలో సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు.. రికార్డులను పరిశీలించారు. భూమి విక్రయించిన సందెవేని శ్రీనివాస్ నుంచి కూడా వివరాలను సేకరించారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనన్నుట్లు సూపరింటెండెంట్ తెలిపారు. 19న ప్రజాభిప్రాయ సేకరణ జ్యోతినగర్(రామగుండం): రామగుండం ఎ న్టీపీసీలో స్థాపించబోయే 2,600 మెగావాట్ల సా మర్థ్యంగల తెలంగాణ స్టేజీ–2 రెండోదశ సూ పర్ థర్మల్ పవర్ ప్రాజెక్టుపై ఈనెల 19న ప్ర జాభిప్రాయ సేకరణ చేపడతామని అధికారు లు మంగళవారం తెలిపారు. ఎన్టీపీసీ సహకా రంతో పర్యావరణ విభాగం అధికారులు ఈమేరకు విస్త్రత ఏర్పాటు చేస్తున్నారు. ఎన్టీపీసీ టెంపరరీ టౌన్‌షిప్‌లోని జెడ్పీ హైస్కూల్ క్రీడా మై దానంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. -
టీబీ రహిత సమాజం నిర్మిద్దాం
● డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి డాక్టర్ విష్ణు ● రాగినేడు పీహెచ్సీలో సర్వే పెద్దపల్లిరూరల్: క్షయ రహిత సమాజ నిర్మాణా నికి ప్రజలు అందరూ తమ బాధ్యతగా తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రతినిధి డాక్టర్ విష్ణు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిక్షయ్ శిబిర్– 100 రో జుల కార్యక్రమంలో భాగంగా రాగినేడు ప్రాథమి క ఆరోగ్య కేంద్రం పరిధిలోని మేరపల్లిలో మంగళవారం సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ విష్ణు మాట్లాడారు. దేశంలో క్షయను పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు కేంద్రప్రభుత్వం తె లంగాణలోని 9 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిందన్నారు. దీనిద్వారా నిక్షయ్ శిబిర్ – 100 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్ కింద జిల్లాలోని మేరపల్లిలో అనుమానితులను పరీక్షించామని తెలిపారు. క్షయ లక్షణాలు బయటపడితే వాహనాల్లో అనుమానితులను నేరుగా ఆస్పత్రికి తరలించి మరిన్ని వైద్యపరీక్షలు చేస్తామని వివరించారు. ఆ తర్వాత అవసరమైన వారికి మందులు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. జిల్లా ప్రోగ్రాం అధికారి కేవీ సుధాకర్‌రెడ్డి, మెడికల్ ఆఫీసర్ శ్రావణ్ కు మార్, టీబీ యూనిట్ సీనియర్ చికిత్స పర్యవేక్షకుడు డి.తిరుపతి, ఎంఎల్‌హెచ్‌పీ సౌమ్య, లక్ష్మి, జ్యోత్స్న, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. నిక్షయ్ శిబిరం సందర్శన పాలకుర్తి(రామగుండం): రాణాపూర్లో చేపట్టిన నిక్షయ్ శిబిరాన్ని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధులు విష్ణు, బ్లెస్సీ సందర్శించారు. క్షయ నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. -
మరింత మెరుగ్గా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ
● నిర్వహణ తీరు మారకుంటే చర్యలు తప్పవు ● కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు పెద్దపల్లిరూరల్: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు మరింత మెరుగ్గా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో మహిళా, శిశు, ది వ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులతో వివిధ అంశాలపై మంగళవారం కలెక్టర్ సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాల పనితీరు, వాటి సేవలు, లబ్ధిదారుల వివరాలు, ప్రీ స్కూల్ నిర్వహణ, ఎనీమియా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పిల్లలకు యూనిఫామ్స్ లేవని, టీచర్లు సమయపాలన పా టించడం లేదని, అపరిశుభ్రత తాండవిస్తోందన్నా రు. తక్షణమే మార్పు రావాలని సూపర్వైజర్లకు సూచించారు. ఏమాత్రం తేడా వచ్చినా టీచర్ల నుంచి సూపర్వైజర్, సీడీపీవో వరకు బాధ్యులవుతార ని, వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గర్భిణులకు పౌష్టికాహారం, ఐరన్ మాత్రలు సకాలంలో అందించాలని, గర్భిణుల ఏఎన్సీ రిజిస్ట్రేషన్, చెక్ ప్ సకాలంలో పూర్తిచేయాలని సూచించారు. ప్రీ స్కూళ్లలో పిల్లల హాజరు శాతం తగ్గకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. వచ్చే సంక్రాంతి పండుగ నాటికి జిల్లాలో అనాథ శరణాయాలు, పిల్లల సమగ్ర వివరాలను సేకరించి తనకు నివేదించాలని అన్నారు. ఆర్బీఎస్కే వైద్యులు అందిస్తున్న సేవలు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారి వివరాలను తన దృష్టికి తీసుకుని రావాలని కలెక్టర్ పేర్కొన్నారు. పలువురు అధికారులు పాల్గొన్నారు. సఖి కేంద్రం సందర్శన.. రంగంపల్లిలో నిర్మిస్తున్న సఖి కేంద్ర భవనాన్ని కలెక్టర్ కోయ శ్రీహరర్ష సందర్శించారు. పెండింగ్ ప నులు వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. కొత్త సంవత్సరంలో భవనం ప్రారంభించేలా చర్యలు తీ సుకోవాలని పంచాయతీరాజ్ ఈఈని ఆదేశించా రు. అనంతరం ఎస్సీ రెసిడెన్షియల్ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనం నాణ్యతపై ఆరా తీశారు. సుల్తానాబాద్‌లోని వృద్ధాశ్రమం, బాల సద నం భవన పనులు పరిశీలించారు. పంచాయతీరాజ్ ఈఈ గిరీశ్‌బాబు, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాల్‌రావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 17జీడికె76: మాట్లాడుతున్న కలెక్టర్ కోయ శ్రీ హర్ష 17జీడికె77:సఖీ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రజలకు చేరువయ్యేలా ఉండాలి ప్రజలకు చేరువయ్యేలా వైద్య, ఆరోగ్య శాఖ ప నితీరు మరింత మెరుగుపర్చుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో వైద్య, ఆరోగ్య శాఖ పనితీరుపై ఆయన సమీక్షించా రు. కంటిశస్త్ర చికిత్సలు, డెంటల్, ఆర్థోపెడిక్, ఫిజియోథెరపీ, సైకాలజీ, డయాగ్నొస్టిక్ హబ్ తదితర సేవలను పేషెంట్లు వినియోగించేలా చూడాలని అన్నారు. క్షయ నియంత్రణకు జిల్లా లో 100 రోజులపాటు చేపట్టిన నిక్షయ శిబిరం ద్వారా సత్ఫలితాలు సాధించాలని సూచించా రు. గర్భిణులకు 102 వాహన సేవలు పక్కాగా ఉండాలన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధి కారి అన్న ప్రసన్నకుమారి, జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్ శ్రీధర్, సంక్షేమ అధికారి వేణుగోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
నేడు వినతుల స్వీకరణ
పెద్దపల్లిరూరల్: వర్గీకరణపై బుధవారం ఎస్సీ కమిషన్ వినతులు స్వీకరిస్తుందని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి నాగలైశ్వర్ మంగళవారం తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వ రకు కమిషన్ వినతులు స్వీకరిస్తుందన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకస భ్య కమిషన్‌ను ఏర్పాటు చేసిందని, కమిషన్ చై ర్మన్ జస్టిస్ షమీం అక్బర్.. షెడ్యూల్డ్ కులాల ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరిస్తారన్నా రు. ఎస్సీ వర్గీకరణపై జరిగే బహిరంగ విచారణకూ ఆసక్తిగలవారు హాజరై తమ అభిప్రాయాలు వ్యక్తం చేయాలని సూచించారు. జనారణ్యంలోకి నెమలి జూలపల్లి(పెద్దపల్లి): కుమ్మరికుంటలోని వ్యవసాయ పొలాల్లో మంగళవారం ఉదయం నె మ లి ప్రత్యక్షమైంది. తీవ్ర అస్వస్థతతో కనిపించిన జాతీయ పక్షి నెమలిని గమనించిన రైతులు పొన్నం వెంకటేశ్, ఎర్రం జగన్ దానిని పెద్దపల్లి బీట్ అఫీసర్ రాంమూర్తికి అప్పగించారు. చికిత్స తర్వాత అటవీ ప్రాంతంలో వదిలేస్తామని అటవీ అధికారులు తెలిపారు. కుట్టు మెషన్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం జ్యోతినగర్(రామగుండం): జిల్లాలోని మైనారిటీ మహిళలు ఉచిత కుట్టు మిషన్ల కోసం ఈనెల 31వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాల ని మైనారిటీ సంక్షేమ శాఖ జిల్లా ఇన్చార్జి అధి కారి రంగారెడ్డి మంగళవారం తెలిపారు. ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ మతాలకు చెందిన మహిళలు అర్హులన్నారు. ఆసక్తిగలవారు tgobmms.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుని, హార్డ్‌కాపీలను పెద్దపల్లిలోని తమ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. తెల్లరేషన్, ఆ హారభద్రత కార్డు కలిగి గ్రామీణంలో రూ. 1.50లక్ష లు, పట్టణాల్లో రూ.2 లక్షల వార్షికాదాయం ఉండి, 18 – 55 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు, కనీస విద్యార్హత ఐదో తరగతి చదివినవారు అర్హులని ఆయన వివరించారు. నేడు క్రాస్‌కంట్రీ పోటీలు సుల్తానాబాద్(పెద్దపల్లి): స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బుధవారం జిల్లాస్థాయి క్రాస్ కంట్రీ పోటీలు నిర్వహించనున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, కార్యదర్శి గట్టయ్య తెలిపారు. 16, 18, 20 ఏళ్ల బాల, బాలికలు అర్హులన్నారు. పోటీల్లో ఎంపికై న వారు ఈనెల 22న నాగర్‌కర్నూల్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు హాజరవుతారన్నారు. ఆసక్తి గలవారు ఎస్సెస్సీ మెమోతో రావాలని, వివరాలకు పీడీ ప్రణవ్, సెల్ : 96183 36976 నంబరులో సంప్రదించాలని వారు సూచించారు. రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపిక సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): గర్రెపల్లి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయురాలు కవిత మంగళవారం తెలిపారు. బా లికల విభాగంలో టి.అక్షిత, డి.ప్రణవి, జి.శశిప్రియా, బాలుర విభాగంలో ఆదిత్య, వీరబ్ర హ్మం, పి.ఆదిత్య, రాకేశ్, రావణ్బహుళ, ధను శ్ ప్రతిభ చూపారని, వీరు ఈనెల 28 నుంచి హైదారాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు హాజరవుతారని హెచ్ఎం వివరించారు. ముందస్తు క్రిస్మస్ వేడుకలు గోదావరిఖనిటౌన్: స్థానిక సాక్రెడ్ హార్ట్ హైస్కూల్లో మంగళవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సింగరేణి ఆర్జీ–1 జనరల్ మేనేజర్ లలిత్‌కుమార్ కేక్‌ను కట్ చేసి చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం తబిత, ఈశ్వర కృప ఆశ్రమాల్లో దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సింగరేణి డిప్యూటీ జీఎం కిరణ్‌బాబు, పాఠశాల కరస్పాండెంట్ మరియ గోరేటి, ప్రిన్సిపాల్ ఆరోగ్యమేరీ, టికలా, ఎన్సీసీ ఫస్ట్ ఆఫీసర్ జ్యోత్స్న, ఉపాధ్యాయులు విజయ, పద్మజ, ఉష, విద్యార్థులు పాల్గొన్నారు. -
బంగారానికి పూతపెడతామని నమ్మించి చోరీ
కోరుట్ల రూరల్: బంగారానికి పూత పెడతామని నమ్మించి ఇద్దరు నిందితులు మండలంలోని నాగులపేట గ్రామంలో ఓ మహిళ నుంచి రెండు తులాల బంగారం అపహరించారు. స్థానికుల కథనం ప్రకారం.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం ఉదయం 9గంటల ప్రాంతంలో గ్రామానికి చేరుకున్నారు. వారిని నమ్మిన నక్క జమున తన బంగారు గొలుసుకు పూత పెట్టాలని ఇచ్చింది. వాళ్లు గొలుసుకు పూతపెడుతున్నట్టు నటించి గొలుసును జేబులో వేసుకుని నకిలీ గొలుసు ఇచ్చారు. అరగంట తర్వాత పసుపులో పెట్టి తీస్తే మంచి పూత వస్తుంద ని చెప్పి వెళ్లిపోయారు. వారు చెప్పినట్టే జము న పసుపులో వేసి బయటకు తీయగా నకిలీ గొలుసు అని గుర్తించింది. ఈ విషయమై గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గ్రామంలో సీసీ కెమెరా పుటేజీని పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. సీసీ పుటేజీ వీడియోను విడుదల చేసిన పోలీసులు నిందితులను గుర్తిస్తే.. తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
హోమం చేసి.. గోశాల శుద్ధి చేసి
వేములవాడ: హనుమకొండకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు రాకేశ్‌రెడ్డి మంగళవారం వేములవాడలో హోమం నిర్వహించి, గోశాలను శుద్ధి చేసి, తాను తెచ్చిన నిజకోడెను రాజన్నకు అప్పగించారు. మంత్రి కొండా సురేఖ సిఫారసుతో అక్రమంగా కబేళాలకు తరలించిన పాపానికి పాప ప్రక్షాళన, ప్రాయశ్చిత్తం కోసం రాజన్న సన్నిధిలో శాంతిహోమం నిర్వహించి, కోడెను సమర్పించినట్లు వివరించారు. శివుడి వాహనమైన నందినే కబేళాలకు తరలించి కాంగ్రెస్ పార్టీ తన గొయ్యి తానే తీసుకుందన్నారు. మంత్రి సురేఖ కాశీకి వెళ్లినా ఆమె పాపం పోదన్నారు. రాజన్న సన్నిధిలో వరుసగా జరుగుతున్న అపచారాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కోడెల అమ్మకంలో ప్రధాన పాత్రదారులందరిపై పీడీ యాక్ట్ నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. వేములవాడలో కొనసాగుతున్న కోడెల రగడ -
ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలు ఇవ్వాలి
కరీంనగర్: ఆశవర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలు ఇవ్వాలని ఆశవర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి.జయలక్ష్మి, ఆర్.నీలాదేవి డిమాండ్ చేశారు. ఈ నెల 15 నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్న సంఘం రాష్ట్ర కమిటీ బస్సు జాత మంగళవారం కరీంనగర్ చేరుకుంది. కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు డప్పుచప్పుళ్లు, బతుకమ్మలు, బోనాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట యూని యన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ల శ్రీలత మాట్లాడారు. ప్రతీ అంశంలో టార్గెట్స్ పెట్టి, ప్రభుత్వం ఆశవర్కర్లను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేశ్, ఆశవర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి గంగమణి, ఉపాధ్యక్షురాలు ఆర్.సాధన, సహాయ కార్యదర్శి సునీత, జిల్లా అధ్యక్షురాలు రంగవేణి శారద, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గీట్ల ముకుందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఐటీ.. మనమూ పోటీ
● హైదరాబాద్, వరంగల్ తర్వాత కరీంనగర్‌కే అవకాశాలు ● గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌గా ఎదిగే నగరమంటున్న సర్వేలు ● ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియాలుగా కొత్తపల్లి, మంథని ● తక్కువ ఖర్చులో బతికేయొచ్చట ● తాజాగా నాస్కామ్ జీసీసీ ప్లేబుక్ తెలంగాణ బ్లూ ప్రింట్‌లోనూ వెల్లడిసాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా హవా కొనసాగుతోంది. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ నగరాల తర్వాత కరీంనగర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్(జీసీసీ)గా ఎదిగే దిశగా అడుగులు వేస్తోందని సర్వేలు చెబుతున్నాయి. తా జాగా నాస్కామ్ జీసీసీ ప్లేబుక్ తెలంగాణ బ్లూప్రింట్ నివేదిక సైతం ఈ విషయాన్ని వెల్లడించింది. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగానికి కావాల్సిన ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు, కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, ఐటీ టవర్, లక్ష చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్, ఐటీ సేవలు, పలు ఇంజినీరింగ్, పీజీ కాలేజీలున్న కారణంగా ఈ మేరకు పాత కరీంనగర్ జిల్లాకు గుర్తింపు దక్కింది. మంచి వేతనంతోపాటు అందుబాటులో అద్దెలు, తక్కువ ఖర్చులో బతికేయొచ్చని నివేదిక చెప్పింది. జీసీసీ అంటే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు అంతర్జాతీయ కంపెనీలకు ఐటీ సేవలందించే కేంద్రాలను గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు అని పిలుస్తారు. కరీంనగర్ నుంచే యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు ఐటీ సేవలు, ఉత్పత్తుల ఎగుమతి కేంద్రంగా(హైద రాబాద్, బెంగళూరు తరహాలో) అడుగులు పడుతున్నాయి.అనుకూలతలు ఇలా..అర్హతలు సదుపాయాలు హాట్‌స్పాట్స్ కరీంనగర్ ఐటీ టవర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా (ఐడీఏ)లుగా కొత్తపల్లి, మంథని ప్రాంతాలు అవతరించనున్నాయి. ఐటీ కంపెనీ/జీసీసీ 50కి పైగా టెక్ సర్వీసెస్, కొన్ని స్టార్టప్ కంపెనీలు, జీసీసీలు ఇప్పటికి లేవు. మానవ వనరులు 15 వేల మందికి పైగా టెకీలు, ఆర్అండీ ప్రొఫెషనల్స్ విద్యాసంస్థలు/కాలేజీలు ఏటా 7–9 వేల మంది గ్రాడ్యుయేట్లు, 20 కాలేజీలు/యూనివర్సిటీ. రవాణా సదుపాయాలు వరంగల్ ఎయిర్పోర్ట్ (70 కి.మీ. దూరం) ఎన్‌హెచ్–563 కరీంనగర్–వరంగల్ నివాసం/రెసిడెన్స్ 5–10 మిలియన్ చదరపు అడుగులు అందుబాటులోకి రానుంది. రూ.9 వేల–రూ.15 వేల అద్దెలో 1,000 చదరపు అడుగుల ఫ్లాట్. స్కిల్స్ టీ–స్కిల్స్ ప్రోగ్రాం, ఫ్రీడిజిటల్ ఆన్లైన్ స్కిల్స్, కోడింగ్, సాఫ్ట్ స్కిల్స్, జాబ్ రెడీనెస్. ఇన్ఫ్రా పార్ట్నర్స్ సీబీఆర్ఈ, జేఎల్ఎల్, కరీంనగర్ ఐటీ టవర్. టాలెంట్ పార్ట్నర్స్ బొంపాట్ రిక్రూటర్స్ ప్రై.లి. ఇనాయ్ టాలెంట్ 500, ఉపాధి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ స్టార్టప్ పార్ట్నర్స్ ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్, కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఇన్నోవేషన్ సెంటర్ -
ఆశ వర్కర్లకు రూ.18వేల వేతనం చెల్లించాలి
● తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి పెద్దపల్లిరూరల్: అసెంబ్లీ సమావేశాల్లోనే ఆశ వర్క ర్లకు నెల వేతనం రూ.18 వేలు చెల్లించేలా తీర్మానించాలని తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బస్సుజాత మంగళవారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈసందర్భంగా స్థానిక ఐటీఐ గ్రౌండ్ నుంచి అమరవీరుల స్థూ పం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ఆమె మాట్లాడారు. ఆశ వర్కర్లకు కనిష్ట వేతనం రూ.18 వేలు చెల్లిస్తామని కాంగ్రెస్ గత ఎన్నికల్లో హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని ఆమె కోరారు. రజిత, జ్యోతి, స్వప్న, శివలీల, స్వప్న తదితరులు పాల్గొన్నారు. -
ఎగుమతి చేసేస్థాయికి చేరితేనే రైతుకు ఆదాయం
జగిత్యాలఅగ్రికల్చర్: అమెరికా, ఇంగ్లండ్ వంటి దేశాలకు పంట ఉత్పత్తులు ఎగుమతి చేసేస్థాయికి రైతులు ఎదిగితేనే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందని సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో మంగళవారం ఆయన పర్యటించారు. రైతులతో సమావేశమయ్యారు. రైతులు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడి ఆదాయం ఎలా పొందుతున్నారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు నిర్మించుకున్న గోదాం, సాగుచేస్తున్న పసు పు, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతీరైతు వ్యాపారిలా ఆలోచించి పంటలు పండిస్తేనే ఆశించిన ఆదాయం సమకూరుతుందని తెలి పారు. అధిక ఆదాయం పొందేందుకు విభిన్న పంటలు పండించడంలో లక్ష్మీపూర్ రైతులు రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. ఇదేసమయ ంలో సంఘటితంగా ఏర్పడి తమ పంటను తామే మార్కెటింగ్ చేసుకునే స్థాయికి ఎదగాలని సూచించారు. ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి విలువ జోడించి విక్రయిస్తే మంచి ఆదాయం లభిస్తుందని అన్నా రు. రైతులు రాజకీయాలను పక్కన పెడితే రైతు సహకార సంఘాలు అభివృద్ధి బాటలో పయనిస్తా యని చెప్పారు. ప్రభుత్వాలను అడుక్కునే బదులు ప్రభుత్వాలే రైతల వద్దకు వచ్చేలా బాధ్య త తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఏడీఏ అశోక్‌కుమార్, యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ కన్వీనర్ రాజేందర్, సహకార సంఘం అధ్య క్షుడు పన్నాల తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షుడు గర్వందుల చిన్నగంగయ్య, డైరెక్టర్లు పాల్గొన్నారు. సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ -
సౌదీలో గుండెపోటుతో వలస జీవి మృతి
ధర్మపురి: జీవనోపాధి కోసం సౌదీ వెళ్లిన ఓ వలస జీవి అక్కడే గుండెపోటుతో మృతి చెందిన ఘటన మండలంలోని జైనా గ్రామంలో విషాదం నింపింది. స్థానికుల కథ నం ప్రకారం.. గ్రామానికి చెందిన కోడూరి నారాయణ (53) 13ఏళ్లుగా సౌదీ వెళ్తున్నాడు. అక్కడ వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. ఈనెల 13న పనులు చేస్తుండగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. నారాయణకు భార్య సత్తవ్వ, కొడుకు వెంకటేశ్, కూతురు ఉన్నారు. కొడుకు కూడా ఏడాది క్రితం ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. తండ్రి మరణవార్త తెలియగానే స్వగ్రామానికి చేరుకున్నాడు. నారాయణ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య● నేత్రాలు దానం చేసిన కుటుంబ సభ్యులు జగిత్యాల క్రైం: జగిత్యాలలోని తులసీనగర్‌కు చెందిన పసులేటి సాయిరోషన్ (15) మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయిరోషన్ జగిత్యాలలోని పురాతన పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. కొన్ని రోజుల క్రితం రోషన్ తలనొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబసభ్యులు వైద్యుల సూచనల మెరకు బ్రెయిన్ సర్జరీ చేయించారు. అయినా తలనొప్పి తగ్గలేదు. తిరిగి నొప్పి రావడంతో మరోసారి సర్జరీ చేయిస్తారేమోనని ఆందోళన చెందుతున్నాడు. దీనికితోడు ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి కృష్ణవేని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ మోహన్ తెలిపారు. రోషన్ నేత్రాలను ఎల్వీ.ప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేశారు. పే..ద్ద కొండచిలువ కమాన్‌పూర్(మంథని): స్థానిక ఎక్స్‌రోడ్డు వద్ద మంగళవారం కొండచిలువ ప్రత్యక్షమైంది. రహదారి సమీపంలోని కామెర నర్సయ్య ఇంటి వద్ద కొండచిలువ సంచరిస్తుండగా చూసిన నర్సయ్య.. కల్వచర్ల కు చెందిన పాలు పట్టే శ్రీనివాస్‌కు సమాచారం ఇచ్చాడు. ఆయన చేరుకుని కొండచిలువను పట్టుకున్నాడు. ఆ తర్వాత రామగిరి సమీపంలోని అటవీ ప్రాంతంలో వదివేసినట్లు తెలిపాడు. -
నేడు ఉమ్మడి జిల్లాకు ఎస్సీ ఏకసభ్య కమిషన్ రాక
సిరిసిల్లకల్చరల్: ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్ బుధవారం కరీంనగర్‌కు రానున్నారు. డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ షెడ్యూల్డ్ కులా ల ఉప వర్గీకరణపై వివరణాత్మక అధ్యయనం కోసం బహిరంగ విచారణ జరపనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని పెద్దపెల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్లకు సంబంధించిన ఎస్సీ కులాల సంఘ నాయకులు హాజరు కావాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అభ్యంతరాలు, ప్రతిపాదనలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. -
ఎల్లమ్మ ఆలయం వద్ద మరోమారు వివాదం
భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు సమావేశమైన గ్రామస్తులు మెట్‌పల్లిరూరల్: మెట్పల్లి మండలం వెల్లుల ఎల్ల మ్మ తల్లి ఆలయం వద్ద మరోమారు వివాదం చోటుచేసుకుంది. ఆలయాన్ని దేవాదాయశాఖలో విలీనం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారం క్రితం అధికారులను అడ్డుకున్న వీడీసీ, గ్రామస్తులు.. మంగళవారం మరోమారు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. సీఐ నిరంజన్‌రెడ్డి, ఆలయ ఈవో కాంతారెడ్డి గ్రామస్తులతో చర్చించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని, సిబ్బందిని కూడా కేటాయించారని, తమ విధులు తాము నిర్వర్తించాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే 15 రోజులు సమయం ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. దీంతో వచ్చే సోమవారం వరకు సమయం ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏళ్ల తరబడి వీడీసీ ఆధ్వర్యంలో కొనసాగే ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని ఎలాగైనా దేవాదాయశాఖ నుంచి తప్పించేందుకు ప్రభుత్వ పెద్దలను కలవాలని నిర్ణయానికొచ్చారు. దేవాదాయశాఖ నుంచి తప్పించాలని గ్రామస్తుల డిమాండ్ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ముందుకెళ్తామని అధికారుల వెల్లడి -
అదృశ్యమైన బాలుడిని పట్టించిన సెల్‌ఫోన్
మెట్పల్లి: పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాల నుంచి అదృశ్యమైన బాలుడిని పోలీసులు పెద్దపల్లి జిల్లా కొలనూర్‌లో పట్టుకున్నారు. పోలీసుల కథ నం ప్రకారం.. మెట్‌పల్లికి చెందిన బాలుడు స్థానిక ప్రైవేట్ పాఠశాల హాస్టల్లో ఉంటూ పదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం వేకువజా మున 3.30గంటల సమయంలో వార్డెన్ సెల్‌ఫోన్ తీసుకుని వెళ్లిపోయాడు. విషయాన్ని వార్డెన్ బాలుడి తండ్రికి సమాచారం చేరవేయగా.. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు బాలుడి వద్దనున్న సెల్ నంబర్‌కు సీడీఆర్ టెక్నాలజీని ఉపయోగించారు. పెద్దపల్లి జిల్లా కొలనూర్ రైల్వే స్టేషన్లో ఉన్నట్లు గుర్తించి పొత్కపల్లి పోలీసులకు సమాచారం అందించా రు. వారు అక్కడకు వెళ్లి బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడు మెట్పల్లి నుంచి రైలులో అక్కడకు వెళ్లినట్లు తెలిసింది. పది గంటల్లోనే బాలుడిని పట్టుకున్న సీఐ నిరంజన్‌రెడ్డి, ఎస్సై కిరణ్‌కుమార్‌ను ఉన్నతాధికారులు అభినందించారు. అవార్డులకు రెస్క్యూ బ్రిగేడియర్ల ఎంపిక గోదావరిఖని: రెస్క్యూ బ్రిగేడియర్లు అవార్డులు అందుకోనున్నారు. రెస్క్యూలో 25 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న సింగరేణిలోని 28మందిని ఈ వార్డుకు ఎంపిక చేశారు. కోలిండియా హెడ్‌క్వార్టర్స్, ధన్బాద్లో ఈనెల 20న జరిగే ఆలిండియా రెస్క్యూ పోటీల సందర్బంగా వీరికి అవార్డులు అందజేయనున్నారు. కార్యక్రమంలో పాల్గొనడానికి రామగుండం ఏరియా నుంచి వారు అయోధ్యకు తరలివెళ్లారు. అక్కడ నుంచి కాశీకి వెళ్లి తర్వాత ధన్‌బాద్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. గృహ హింస కేసులో ఒకరికి జైలుసిరిసిల్ల కల్చరల్: అదనపు కట్నం ఆశించి శారీరకంగా, మానసికంగా భార్యను వేధించిన వ్యక్తికి న్యాయస్థానం ఏడాదిన్నర జైలు శిక్ష విధించింది. వివరాలు.. 2015 జనవరి 22న సిరిసిల్లలోని బద్దం ఎల్లారెడ్డినగర్‌కు చెందిన అఫ్రీన్ అనే మహిళ అదనపు కట్నం కోసం తన భర్త, అతడి బంధువులు శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు చార్జ్‌షీటు సమర్పించిన తర్వాత కేసు విచారణ పూర్వాపరాల పరిశీలన అనంతరం న్యాయస్థానం నిందితుడు షేక్ నవాజ్‌కు ఏడాదిన్నర సాధారణ జైలు శిక్ష, రూ.3,000 జరిమానా విధిస్తు తీర్పు వెలువరించినట్లు పట్టణ సీఐ కె.కృష్ణ తెలిపారు. వృద్ధుడిపై కోతుల దాడి రామగుండం: అంతర్గాం మండలం కుందనపల్లి ఇందిరమ్మ కాలనీలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. మంగళవారం ఉదయం ఇంటి ఎదుట కూర్చున్న రసానంద్ అనే వృద్ధుడి ఒక్కసారిగా దాడి చేశాయి. ఎడమ కాలును కరవడంతో తీవ్రగాయాలయ్యాయి. భయంతో వృద్ధుడు కేకలు వేయడంతో స్థానికులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. వారిరాకతో కోతులు పారిపోయాయి. -
కళాకారులకు వేదిక రాజన్న క్షేత్రం
● వచ్చేనెల 18 నుంచి త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు ● ఏడు దశాబ్దాలకుపైగా ఎములాడలో ఉత్సవాలు ● ఈనెల 25లోగా దరఖాస్తులకు ఆహ్వానం వేములవాడ: రాజన్న ఆలయంలో ఏడు దశాబ్దాలుగా సద్గురు శ్రీత్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు, కళాకారుల ప్రదర్శనలు, కూచిపూడి నృత్యాలతో స్వామి వారికి నైవేద్యం సమర్పించడం జరుగుతోంది. ఏటా ఐదు రోజులపాటు జరుపుకునే ఉత్సవాలను ఈసారి వచ్చేనెల 18 నుంచి 22 వరకు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. అయితే ఈసారి కళాకారుల నిబంధనల్లో మార్పులు చేశారు. సుప్రసిద్ధ కళాకారులచే శాసీ్త్రయ, భక్తి, సంగీత, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. 73 ఏళ్లుగా.. వేములవాడ రాజన్న సన్నిధిలో 73 ఏళ్లుగా నాదబ్రహ్మ, లయబ్రహ్మ, సద్గురు శ్రీత్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు ఆడంబరంగా నిర్వహిస్తున్నారు. కళలకు పుట్టినిల్లుగా పేరుగాంచిన వేములవాడలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఇక్కడి చవుటు సాంబయ్యశాస్త్రి స్ఫూర్తితో ప్రారంభమయ్యాయి. 1951లో తిరువయ్యూర్‌కు వెళ్లి స్వయంగా ఉత్సవాలను తిలకించిన సాంబయ్యశాస్త్రి ఆ మరుసటి సంవత్సరమే వేములవాడలో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు జరుపుకునేందుకు శ్రీకారం చుట్టారు. 1966లో సుప్రసిద్ధ గాయకుడు స్వర్గీయ ఘంటసాల, ప్రఖ్యాత సంగీత విధ్వాంసుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, రామకృష్ణ, పీబీ శ్రీనివాస్, ఆనంద్, శోభరాజ్, వేదావతి ప్రభాకర్, బాలకృష్ణ ప్రసాద్, కూచిపూడి నృత్యానికి ఆధ్యులు వేదాంతం సత్యనారాయాణ, రాధేశ్యాం, ప్రపంచ మాండలిన్ మాంత్రికులు శ్రీనివాస్, గాయని జిక్కి, సినీనటి జమున ఉత్సవాల్లో పాల్గొన్నారు. నిబంధనలు.. ● శాసీ్త్రయ సంగీత కచేరీల్లో పాల్గొను కళాకారులు: టాప్ గ్రేడ్, ఏ గ్రేడ్, బీ హైగ్రేడ్, పదేళ్లు వేదికలపై గానం చేసిన అనుభవం ఉండాలి. వాద్య, సోలో కచేరీలు ఇచ్చువారు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు దరఖాస్తుతో జత చేయాలి. ● జూనియర్ సంగీత కచేరీలు ఇచ్చు కళాకారులు: మ్యూజిక్ కోర్సు, మ్యూజిక్ డిప్లొమా, రేడియో బీ హైగ్రేడ్, బీ గ్రేడ్లతోపాటు పదేళ్లపాటు వేదికలపై కచేరీలు ఇచ్చిన అనుభవ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ● నాటకాలు, నృత్యాలు ప్రదర్శించే కళాకారులు: 15 ఏళ్లపాటు వేదికలపై ప్రదర్శనలు ఇచ్చిన అనుభవం ఉండాలి. నృత్య ప్రదర్శనలు ఇచ్చువారు లైవ్ ప్రోగ్రాంలు మాత్రమే అనుమతించబడతాయి. ● హరికథ కళాకారులు: రేడియో గ్రేడ్, టాప్ గ్రేడ్, బీ హైగ్రేడ్ అర్హత కల్గిన మంచి అనుభవం, గతంలో నిర్వహించిన సంస్థల ద్వారా పొందిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. ఘనంగా నిర్వహిస్తాం వచ్చేనెల 18 నుంచి 22 వరకు రాజన్న ఆలయంలో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు గతంలోకంటే ఘనంగా నిర్వహిస్తాం. స్థానిక కళాకారులకు అవకాశం కల్పిస్తాం. ఈసారి ప్రత్యేక నిబంధనలు ఏర్పాటు చేశాం. వాటికి అర్హత ఉన్న కళాకారులు మాత్రమే ఈనెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలి. – కొప్పుల వినోద్‌రెడ్డి, ఆలయ ఈవో -
ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తికి జైలు శిక్ష
సిరిసిల్లకల్చరల్/కోనరావుపేట: నిర్లక్ష్యంగా వాహ నం నడిపి ఇద్దరి వ్యక్తుల మృతికి కారకుడైన వ్యక్తికి ఏడాదిన్నర జైలు శిక్ష పడింది. వివరాలు.. గత జనవరి 12న కోనరావుపేట మండలానికి చెందిన గడిపెల్లి మల్లేశం, తాటకర్ల శంకర్ సొంత పని నిమిత్తం సింగరవేణి కిషన్ నడుపుతున్న ట్రాక్టర్ ఎక్కారు. కిషన్ తన ట్రాక్టర్‌ను నిర్లక్ష్యంగా, అతి వేగంగా నడపడంతో బోల్తా పడి అందులో ప్రయాణిస్తున్న మల్లేశం, శంకర్ అక్కడికక్కడే మృత్యువాత పడ్డా రు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణ అధికారి మాలకొండ నాయుడు చార్జ్‌షీట్ వేయగా ప్రాసిక్యూషన్ తరఫున పీపీ సందీప్ కేసు వాదించారు. కేసు పూర్వాపరాల పరిశీలన అనంతరం మేజిస్ట్రేట్ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ కిషన్ జిల్లాకోర్టుకు అప్పీలుకు వెళ్లాడు. నిందితుడు కిషన్‌కు ఏడాదిన్నర జైలు శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత మంగళవారం తీర్పు వెల్లడించారు. -
పండుగలకు కల్తీ నూనెలు!
● క్రిస్మస్, సంక్రాంతికి టన్నులకొద్దీ విడి నూనె నిల్వలు ● అనధికారిక గోదాంలే అడ్డాలు ● కల్తీ చేసి, పొద్దుతిరుగుడు, పల్లినూనె పేరిట విక్రయాలు? ● జిల్లాలోని పలు ప్రాంతాల్లో జోరుగా వ్యాపారం ● అధికారుల మధ్య సమన్వయలోపంతోనే అని ఆరోపణలుకరీంనగర్ అర్బన్: క్రిస్టమస్, సంక్రాంతి పండుగల నేపథ్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంగా అక్రమార్కులు టన్నులకొద్దీ విడి నూనెను అనధికారిక గోదాంలలో నిల్వ చేశారన్న ఆరోపణలున్నాయి. అరికట్టాల్సిన ఆహార నియంత్రణ, తూనికలు, కొలతల శాఖల అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంతో ఈ మాఫియాకు అడ్డూఅదుపు లేకుండా పోతోందన్న విమర్శలున్నాయి. గతంలో జరిపిన తనిఖీల్లో భారీగా కల్తీ నూనె వెలుగుచూసినా పండుగలకు ముందు తనిఖీలు లేకపోవడం గమనార్హం. పత్రికల్లో కథనాలు రావడం.. పలువురు అధికారులు ‘మామూలు’గా వ్యవహరించడం.. విడి నూనె విక్రయాలు లేవని చెప్పే వ్యాపారులు చాటుమాటుగా విక్రయించడం ఎప్పుడూ జరిగేవేనని పలువురు చర్చించుకుంటున్నారు. ఏళ్లుగా ఇన్చార్జుల పాలన.. ఆహార తనిఖీ విభాగం ప్రతీ నెల తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది. గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు ఒక్కొక్కరికి నిర్ణీత లక్ష్యం ఉంటుంది. కానీ, ఏళ్లుగా పూర్తిస్థాయి అధికారులు లేక కార్యాలయం వెలవెలబోతోంది. ఇన్చార్జి అధికారులతో నెట్టుకొస్తున్నారు. ఒక గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్తోపాటు ఇద్దరు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, ఒక క్లర్క్, ఇద్దరు అటెండర్లు కార్యాలయంలో ఉండాలి. అయితే, 1985లో అప్పటి జనాభా ప్రతిపాదికన పోస్టులను మంజూరు చేశారు. నేడు జనాభా పదింతలు పెరిగినప్పటికీ ఆ స్థాయిలో పోస్టులను పెంచలేదు. మంజూరైనవాటి ప్రకారం కూడా అధికారులు లేరు. గతంలో వివిధ శాఖల అధికారులతో పౌరసరఫరాల విజిలెన్స్ విభాగం ఉండేది. ఆహార తనిఖీలపై ప్రధానంగా దృష్టిసారించి, కఠినచర్యలు తీసుకునేవారు. ఎప్పటికప్పుడు దాడులు చేస్తూ కల్తీ వ్యాపారులకు చెమటలు పట్టించేవారు. ఈ విభాగంలో ఒక డీఎస్పీ, ఒక సీఐ, ఎస్సై, పౌరసరఫరాల సిబ్బంది ఇందులో ఉండేవారు. 2002లో దీన్ని రద్దు చేయడం అక్రమార్కులకు కలిసొచ్చిందన్న చర్చ జరుగుతోంది. ఆహార తనిఖీ విభాగానికి కూడా ఇదే పరిస్థితి రాబోతోందా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్యాకెట్లు, డబ్బాల్లో నింపి.. పండుగల సమయంలో అక్రమార్కులు తక్కువ ధరకు దొరికే వివిధ రకాల నూనెలను కొనుగోలు చేసి, నాణ్యమైన నూనెలను తక్కువ మొత్తంలో తీసుకొని కలిపేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఏటా క్రిస్టమస్, సంక్రాంతి, బతుకమ్మ, దసరా, తొలి ఏకాదశి పండుగల సమయాల్లో పొద్దు తిరుగుడు, పల్లి నూనె పేరిట విక్రయిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఆయా శాఖల అధికారులతో ముందే ఒప్పందాలు కుదుర్చుకొని, తనిఖీలు లేకుండా జాగ్రత్త పడుతున్నారని, సీజన్ ముగిశాక అరకొర దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాలని వారే సూచిస్తున్నారని సమాచారం. కరీంనగర్‌లోని ప్రకాశంగంజ్, మంకమ్మతోట, రాంనగర్ ప్రాంతాల్లో ఎక్కువగా కల్తీ నూనె విక్రయాలు సాగుతున్నాయని తెలిసింది. చింతకుంట, బొమ్మకల్, బైపాస్ ప్రాంతాల్లోని గోడౌన్లలో విడి నూనెను దించుకోవడం, అక్కడి నుంచి ప్యాకెట్లు, డబ్బాల్లో నింపి, దుకాణాలకు తరలిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం క్రిస్టమస్, సంక్రాంతి నేపథ్యంలో హుజూరాబాద్, జమ్మికుంట, గంగాధర, తిమ్మాపూర్ ప్రాంతాల్లోని పలువురు వ్యాపారులు భారీగా నూనెలు నిల్వ చేసినట్లు తెలిసింది. ఇతర ప్రాంతాల నుంచి కరీంనగర్‌కు? హైదరాబాద్, రాజమండ్రి, కాకినాడ నుంచి ట్యాంకర్ల ద్వారా ఎలాంటి వే బిల్లులు లేకుండా నూనెను కరీంనగర్‌కు దిగుమతి చేస్తున్నారని సమాచారం. ఎముకల నూనెను కూడా మిశ్రమంగా వాడుతున్నట్లు గతంలో తేలింది. తక్కువ ధరకు లభించే సోయాబీన్ నూనెను పొద్దుతిరుగుడు, వేరుశనగ నూనెలో కలిసి, మంచి వాసన వచ్చేందుకు రసాయన పదార్థాలను వినియోగిస్తున్నట్లు తెలిసింది. 48 కిలోల సోయాబీన్ నూనెలో 2 కిలోల పల్లి నూనెను కలిపి, డబ్బాలలో నింపి, పల్లి నూనె పేరిట విక్రయిస్తూ రూ.కోట్లలో సంపాదిస్తున్నట్లు సమాచారం. అనుమతి లేని దుకాణాలు వందల్లో! కల్తీ నూనెల విక్రయాలు, ధరలు, జీరో వ్యాపారాన్ని నియంత్రించడంలో అధికారుల మధ్య సమన్వయలోపం అక్రమార్కులకు వరంగా మారుతోందన్న చర్చ జరుగుతోంది. కిందిస్థాయి ఉద్యోగులు రూ.లక్షల్లో మామూళ్లు తీసుకుంటూ దందాను ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. 5 క్వింటాళ్ల కంటే ఎక్కువ నూనె నిల్వ చేయాలంటే పౌరసరఫరాల శాఖ అనుమతి తప్పనిసరి. హోల్‌సేల్ వ్యాపారులు జిల్లా కేంద్రంలో అయితే 600 క్వింటాళ్లు, ఇతర ప్రాంతాల్లో అయితే 377 క్వింటాళ్లు, జిల్లా కేంద్రంలో రిటైల్ అయితే 50 క్వింటాళ్లు, ఇతర ప్రాంతాల్లో 30 క్వింటాళ్లు నిల్వ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. కానీ, అనుమతి లేని దుకాణాలు వందల్లో ఉన్నాయని తెలుస్తోంది. ఒక్క జిల్లా కేంద్రంలోనే 100 వరకు దుకాణాలను నిర్వహిస్తున్నట్లు తెలిసింది. వ్యాపారుల్లో కొందరు హోల్సేల్వారే రిటైల్ వారని సమాచారం. తమ పరిధిలో కేసులు కూడా నమోదు చేయని ఆహార నియంత్రణ, పౌరసరఫరాలు, రెవెన్యూ శాఖల అధికారులు.. తనిఖీలు నిర్వహిస్తామని, కల్తీ వ్యాపారాన్ని అరికడతామని చెబుతున్నారు. -
ఉద్యోగాల భర్తీకి కౌన్సెలింగ్
గోదావరిఖని: సింగరేణిలోని వివిధ బొగ్గు గనుల్లో ఖాళీగా ఉన్న షాట్‌ఫైరర్ పోస్టుల భర్తీ కోధా ఆ సంస్థ అధికారులు సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. అంతర్గత అభ్యర్థుల కోసం వారు ఈ కౌన్సెలింగ్ నిర్వహించారు. స్థానిక టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్(టీటీసీ)లో ఈ కార్యక్రమం చేపట్టారు. సింగరేణి సంస్థ వ్యాప్తంగా సుమారు 79 ఖాళీలు భర్తీ చేసేందుకు కౌన్సెలింగ్ ఏర్పాటు చేశారు. దీనికి ఆర్జీ–1, 2, 3తోపాటు భూపాలపల్లి ఏరియాకు చెందిన 28 మంది అంతర్గత ఉద్యోగులు హాజరయ్యారు. కౌన్సెలింగ్ కమిటీ ఇన్చార్జి ఆంజనేయప్రసాద్, పర్సనల్ మేనేజర్ రవీందర్‌రెడ్డి, అధికారులు రాజన్న, రామయ్య తదితరులు అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎంపికైన వారి జాబితాను త్వరలో వెల్లడించే అవకాశం ఉందని తెలిసింది. -
● 48.22 శాతం మంది అభ్యర్థుల హాజరు
గోదావరిఖని: జిల్లావ్యాప్తంగా ఈనెల 15, 16వ తేదీల్లో నిర్వహించిన గ్రూప్–2 పరీక్షలకు 9,018 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ఈనెల 15న ఉదయం నిర్వహించిన పరీక్షకు 4,450మంది, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 4,410 మంది అభ్యర్థులు హాజరయ్యారు. జిల్లాలో మొత్తం 18 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈమేరకు ప్రభుత్వ యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. నిర్ణీత సమయంలోగా చేరుకున్న వారిని తనిఖీ చేసి పరీక్షహాల్లోకి అనుమతించారు. ఉదయం హిస్టిరీ, సాయంత్రం పొలిటికల్ సైన్స్ పరీక్షలు నిర్వహించినట్లు ఎగ్జామినేషన్ అధికారులు తెలిపారు. రెండోరోజు నిర్వహించిన పరీక్షలకు 9,018 మంది హాజరవుతారని భావించినా.. ఉదయం పరీక్షకు 4,349 మంది, మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 4,346మంది హాజరయ్యారు. రెండోరోజు ఉద యం ఎకానమీ, మధ్యాహ్నం తెలంగాణ ఉద్య మం పరీక్షలు నిర్వహించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో సగం మందికిపైగా పరీక్షలకు దూరంగా ఉండడం గమనార్హం. దీంతో కొన్ని పరీక్ష కేంద్రాలు అభ్యర్థులు లేక ఖాళీగా కనిపించాయి. కలెక్టర్, రామగుండం పోలీస్ కమిషనర్ సారథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రెండురోజులు పాటు పరీక్షలు సజావుగా కొనసాగాయి. జేఎన్టీయూలో.. రామగిరి(మంథని): సెంటినరీకాలనీలోని మంథని జేఎన్టీయూ పరీక్ష కేంద్రంలో సోమవారం గ్రూప్– 2 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 932 మంది అభ్యర్థులకు 482 మంది హాజరైనట్లు ప్రిన్సిపాల్ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. అదనపు కలెక్టర్ అరుణశ్రీ,, ప్రత్యేక పరిశీలకుడు సురేశ్ పరీక్షలు పర్యవేక్షించారు. సీఐ రాజుగౌడ్, ఎస్సై చంద్రకుమార్ ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు నిర్వహించారు. -
గ్రూప్–2లో ఉమ్మడి జిల్లా ప్రస్తావన
● ప్రశ్నపత్రంలో దాదాపు 13 ప్రశ్నలు ● జగపతిరావు నుంచి వినోద్‌కుమార్ వరకు ప్రస్తావన ● జగిత్యాల జైత్రయాత్ర నుంచి మల్హర్రావు హత్య వరకు కూడా..సాక్షిప్రతినిధి, కరీంనగర్: గ్రూప్–2 పరీక్షలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన సమాచారంపై ప్రశ్నలు అడిగారు. ముఖ్యంగా పేపర్–3లో మూడు ప్రశ్నలు, పేపర్–4లో 10 ప్రశ్నలు అడగడం తెలంగాణ ఉద్యమ చరిత్రలో జిల్లా ప్రాధాన్యం చెప్పినట్లయ్యింది. ఉమ్మడి జిల్లాలోని వనరులు, ఆర్థిక స్థితిగతులు, రాజకీయ నాయకుల పాత్ర తదితర అంశాలపై ప్రశ్నలు అడగడం విశేషం. పేపర్ –4లోనూ.. పేపర్–4లో దాదాపు 10 వరకు ప్రశ్నలు పాత జిల్లా ప్రస్తావన అధికంగా కనిపించింది. పేపర్–4లో చొక్కారావు– తెలంగాణ హక్కుల రక్షణ సమితి అధ్యక్షుడిగా పనిచేశారా? అని 29 ప్రశ్నగా అడిగారు. బెజ్జంకి జాతరలో లక్ష్మీనరసింహస్వామి గురించి 48వ ప్రశ్నకింద అడిగారు. మా జీ ఎమ్మెల్యే జగపతిరావు రాజకీయ ప్రస్థానంలో మైలురాళ్లపై 68వ ప్రశ్నగా ఇచ్చారు. తెలంగాణ సభ్యుల ఫోరం ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడిందన్న సందర్భంలో మరోసారి వెలిచాల జగపతిరావు పేరును ప్రస్తావించడం విశేషం. సిరిసిల్ల, జగిత్యా ల తాలూకాలను 1978లో కల్లోలిత ప్రాంతాలు గా పరిగణించారు అని 83వ ప్రశ్నలో చర్చించా రు. 84వ ప్రశ్నలో జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో వ్యవసాయ కార్మికుల సమావేశం, మంథనిలో కొండపల్లి సీతారామయ్య ‘గ్రామాలకు వెళ్లండి’ అని విద్యార్థులకు ఇచ్చిన పిలుపు గురించి అడిగారు. తాడిచర్ల మండలం అధ్యక్షుడు మల్హర్‌రావును అప్పటి పీపుల్స్‌వార్(ప్రస్తుత మావో యిస్ట్) పార్టీ హత్య చేసిన విషయాన్ని 91వ ప్రశ్నలో అడిగారు. 93వ ప్రశ్నలో 1978లో జగిత్యాల జైత్రయాత్ర విశేషాల గురించి ప్రస్తావించారు. 102లో కరీంనగర్ ప్లార్లమెంట్కు ఎన్నికై న టీఆర్ఎస్ నాయకుల పేర్లు అడిగారు. టీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ కదనభేరీ పేరిట నిర్వహించిన సభపై 131వ ప్రశ్నగా అడిగారు. 116వ ప్రశ్నలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రస్తావన వచ్చింది. ఇక పేపర్–3లో పేద జిల్లాలను గుర్తించే క్రమంలో కరీంనగర్ ప్రస్తావన 78వ ప్రశ్నలో, పంట వైవి ధ్యంపై ప్రస్తావించిన క్రమంలో పెద్దపల్లి చర్చ 85వ ప్రశ్నగా, వరి పంట విస్తీర్ణం విషయంలో 85వ ప్రశ్నలో చర్చించారు. మొత్తానికి ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేతలు చొ క్కారావు, వెలిచాల జగపతిరావు, మల్హర్రావు, వినోద్‌కుమార్ ప్రస్తావన రావడం, జగిత్యాల జైత్రయాత్ర, సిరిసిల్లలో టీఆర్ఎస్ ఉద్యమ సభ, జగిత్యాలలో రైతు పోరాటాలు, మంథనిలో పీపుల్స్‌వార్ కార్యకలాపాలపై అడిగిన ప్రశ్నలు పాతజిల్లా జ్ఞాపకాలను తట్టిలేపాయి. నాడు జరిగిన ఉద్యమాలు, దుర్ఘటనలు, హత్యలు నేటి యువత చరిత్రగా చదువుకుంటున్న తీరును సీనియర్ సిటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్న ప్రభుత్వం
● మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్రామగిరి(మంథని): ప్రజల ఆకాంక్షతో సాధించుకున్న తెలంగాణ అస్తిత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ విమర్శించారు. సెంటినరీకాలనీలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనపై దృష్టి పెట్టకుండా పేర్లు, రూపాలను మార్చడంపై దృష్టి కేంద్రీకరించడం శోచనీయమన్నారు. ప్రధానంగా తెలంగాణతల్లి రూపుమార్చి తెలంగాణ ఆత్మగౌరవన్ని దెబ్బతీస్తోందని ధ్వజమెత్తారు. రామగిరిగడ్డపై త్వరలోనే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శంకేశీ రవీందర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణగౌడ్, నాయకులు మ్యాదరబొయిన కుమార్ యాదవ్, కాపురబొయిన భాస్కర్, దర్శుల రాజసంపత్, రోడ్డ శ్రీనివాస్, ఆసం తిరుపతి, దేవ శ్రీనివాస్, లడ్డు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
పీడీకిలి బిగిస్తున్నారు
● గూండాలు, రౌడీలు, దొంగలపై పోలీసుల ఉక్కుపాదం ● రామగుండం కమిషనరేట్ పరిధిలో 151 పీడీ కేసులు నమోదు ● శాంతిభద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు తప్పవంటున్న సీపీగోదావరిఖని: అక్రమార్కులపై రామగుండం కమిషనరేట్ పోలీసులు పిడికిలి బిగిస్తున్నారు. సమాజంలో ఉద్రిక్తతలు సృషిస్తూ శాంతిభద్రతలకు విఘా తం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే పాత నేరస్తులపై నిఘా పెంచారు. ఇప్పటికే గుర్తించిన వారిపై పీడీయాక్టు నమోదు చేస్తున్నారు. మరికొందరిపై ఈ యాక్టు నమోదు చే సేందుకు సిద్ధమయ్యారు. కమిషరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఇప్పటివరకు పీడీయాక్ట్‌లు 151కి చేరాయి. పీడీయాక్టు నమోదు చే యడంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ రాష్ట్రంలోనే రెండోస్థానంలో నిలిచింది. హైదరాబాద్ తర్వాత రామగుండం కమిషనరేట్ అగ్రస్థానంలో నిలిచిందని పోలీసు అధికారులు చెబుతున్నారు. నిఘా తీవ్రతరం రౌడీషీటర్లపై పోలీసు నిఘా తీవ్రతరం చేశారు. ఠాణాల వారీగా నేరస్తుల జాబితా తయారు చేసిన పోలీసు అధికారులు.. తోక ఊపితే పీక నొక్కుతామని హెచ్చరిస్తున్నారు. వరుస హత్యలు, అల్లర్లతో ఇప్పటిదాకా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై రామగుండం పోలీస్ కమిషనరేట్ ఉక్కుపాదం మోపుతోంది. దీంతో ప్రస్తుతం శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. భూమాఫియా, రౌడీయిజం, గుట్కాదందా, అక్రమ కలప రవాణా, రేషన్ బియ్యం దందా, దొంగలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. పాత నేరస్తులు మళ్లీ నేరాలకు పాల్పడితే పీడీయాక్టు నమోదు చేయాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఒక్కరోజే ముగ్గురిపై.. రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై దృష్టి సారించిన పోలీసులు.. ఒక్కరోజే ముగ్గురిపై పీడీయాక్టు నమోదు చేశారు. ప్రజాశాంతికి భంగం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని, నేరస్తుల ఏరివేత ద్వారానే సమాజంలో శాంతి ఏర్ప డుతుందని స్పష్టం చేస్తున్నారు. ఈక్రమంలో గత శుక్రవారం జిల్లా కేంద్రంలో పీడీయాక్టు నమోదైన, రౌడీషీటర్లకు రామగుండం పోలీస్‌కమిషనర్ శ్రీనివాస్ కౌన్సెలింగ్ ఇచ్చారు. పాత నేరస్తులపై నిఘా తీవ్రతరం చేశామని, మళ్లీ నేరాలకు పాల్పడితే ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. 151కి చేరిన పీడీ యాక్టు కేసులు.. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పీడీయాక్టు కేసులు ఇప్పటివరకు 151కి చేరాయి. పెద్దపల్లి జిల్లాలో 86, మంచిర్యాల జిల్లాలో 65 పీడీయాక్టు కేసులు నమోదు చేశారు. ఇందులో అత్యధికంగా దొంగలపైనే పీడీ కేసులు నమోదు కావడం గమనార్హం. రెండోస్థానంలో సమాజంలో భయాందోళనలు సృష్టించే రౌడీలపై పీడీయాక్టు పెట్టారు. మూడు కేసులు నమోదైన నిందితులపై పీడీయాక్టు అమలు చేస్తున్నారు. వరుస దొంగతనాలు, రౌడీయిజం, హత్యలు, పేకాట గ్యాంగ్‌లు, కలపస్మగ్లర్లు, అక్రమ భూదందాలు నిర్వహించే వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తూ పాతనేరస్తుకు హెచ్చరికలు జారీచేస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో నమోదైన పీడీ యాక్ట్ కేసులు నేరాల తీరు గూండాలు 34 చోరీల్లో నిందితులు 69 రేషన్ బియ్యం సరఫరా 01 డ్రగ్ నేరస్తులు 07 అక్రమ కలప రవాణా 03 వైట్‌కాలర్ నేరస్తులు 10 సెక్స్‌వల్ నేరస్తులు 03 గేమింగ్ 01 నకిలీ విత్తనాలు 18 భూమాఫియా 05 కమిషనరేట్ పరిధిలో .. రౌడీ షీటర్లు 456 హిస్టరీ షీటర్లు 1,288 ఏడాది పెద్దపల్లి మంచిర్యాల మొత్తం 2017 01 0 01 2018 05 02 07 2019 16 11 27 2020 27 16 43 2021 10 14 24 2022 0 0 0 2023 07 02 09 2024(ఇప్పటివరకు) – 01 01 ఎవరినీ ఉపేక్షించేదిలేదు శాంతిభద్రతలకు విఘా తం కలిగించే ఎంతటి వారినైనా ఉపేక్షించేదిలేదు. వరుసనేరాలకు పాల్పడే వారిపై డేగకన్ను వేశాం. కమిషనరేట్ పరిధిలో 151 వరకు పీడీ యాక్టు కేసులు చేరాయి. ప్రజలు శాంతియుతంగా జీవించాలనేదే పోలీస్‌శాఖ లక్ష్యం. ఈవిషయంలో రాజీపడే ప్రసక్తేలేదు. సత్ప్రవర్తన కలిగిన వారిపై రౌడీషీట్ ఎత్తివేసేందుకు కూడా యోచిస్తున్నాం. – శ్రీనివాస్, పోలీస్ కమిషనర్, రామగుండం -
ప్రజా సమస్యలు పరిష్కరించాలి
● కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లిరూరల్: ప్రజావాణి ద్వారా అందిన అర్జీలను సంబంధిత అధికారులు పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభాగ్యుల నుంచి ఆయన అదనపు కలెక్టర్ వేణుతో కలిసి పలు సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణిలో అందించే అర్జీలకు తప్పకుండా పరిష్కారం లభిస్తుందనే నమ్మకంతో చాలామంది ఇక్కడకు వస్తుంటారని, వారి నమ్మకాన్ని నిలబెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. అర్జీల్లోని కొన్ని సమస్యలు ఇవీ..