
బలం..బలగం
ఇంటిపెద్ద మాటకు కట్టుబడి
బంధాలు, బంధుత్వాలకు విలువనిస్తూ
ఆదర్శంగా నిలుస్తున్న కుటుంబాలు
ఉమ్మడి కుటుంబమంటే కొండంత బలం. ఏ ఆపదొ చ్చినా ఒకరికొకరు సాయం చేసుకుంటూ మేమున్నామనే భరోసా ఉంటుంది.. ప్రస్తుత ఉరుకులు పరుగు ల జీవితంలో బంధాలు, బంధుత్వాలు భారమవుతున్నాయి. పెళ్లయిన కొన్నాళ్లకే వేరుకుంపటి వ్యవస్థ పె రుగుతోంది. ఎప్పుడో ఓసారి కలిసినప్పుడు నామమాత్రపు పలకరింపులు.. తర్వాత ఎవరిదారి వారి దే.. అయినా కొన్ని కుటుంబాలు ఉమ్మడిగా ఉంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారు. ఇంటి పెద్దల మాటకు కట్టుబడి, విభేదాలు లేకుండా కలిసిమెలిసి ఉంటున్నారు. ఉమ్మడి కుటుంబమే కొండంత అండా అన్నట్టు ఆదర్శంగా నిలుస్తున్నారు.
భీమనాతి బలగం
తరతరాలుగా ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబంగా కాలం గడుపుతూ ఆదర్శంగా నిలుస్తుంది. ఈ కుటుంబం కోరుట్ల పట్టణంలోని గాంధీ రోడ్‌లో నివాసముంటోంది. కుటుంబ పెద్ద భీమనాతి కాంతయ్య–గంగుబాయి దంపతులకు ఒక కుమార్తె, ఆరుగురు కుమారులు. భీమనాతి శ్రీనివాస్, వేణుగోపాల్, జనార్దన్, శ్రీధర్, దామోదర్, సాయికృష్ణ. కాంతయ్య ఇటీవల మృతిచెందినా ఆయన కొడుకులు తల్లి గంగుబాయితో కలిసే ఉంటున్నారు. వారసత్వంగా వస్తున్న ఐరన్‌హార్ట్‌వేర్ వ్యాపారంలో వీరంతా స్థిరపడ్డారు. వీరందరికీ పెళ్లిళ్లు కావడంతో పాటు పిల్లలు ఉన్నారు. తల్లి గంగుబాయితో కలిసి కొడుకులు–కోడళ్లు, మనుమలు, మనమరాళ్లు అంతా 27 మంది ఉన్నారు. వీరంతా ఒకే ఇంట్లో ఉండటమే కాదు.. ఒకే వంట కావడం విశేషం. రోజూ చిన్నపాటి ఫంక్షన్ తీరుగా ఇల్లంతా పెద్దలతో పాటు పిల్లాపాపలతో కళకళలాడుతుంది. తరతరాలుగా ఈ కుటుంబం ఉమ్మడిగా కాలం గడపటం నిజంగా ఈ కాలంలో ఓ వింతగానే తోస్తోంది.
రెండు దశాబ్దాలుగా..
రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్‌కాలనీ హనుమాన్‌నగర్‌కు చెందిన బైరి రాజేశం–జయలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమారులు. అందరికి పెళ్లిళ్లయ్యాయి. కొడుకులు, కోడళ్లు, వారి పిల్లతో కలిసి రెండు దశాబ్దాల నుంచి ఉమ్మడిగానే ఉంటున్నారు. అంతా కలిసి పండుగలను సంతోషంగా జరుపుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పెద్ద కుమారుడు నాగరాజు, ఎమ్మెస్సీ బీఎడ్ చదివి ప్రైవేట్ టీచర్‌గా పని చేశారు. కరోనాతో స్కూల్ మూతపడడంతో ప్రస్తుతం యైటింక్లయిన్‌కాలనీలో నాగరాజు అండ్ బ్రదర్స్ అనే పేరుతో కిరాణం షాపు పెట్టుకుని ముగ్గురన్నదమ్ములు నాగరాజు, ప్రవీణ్‌కుమార్, సుమన్‌కుమార్ చుసుకుంటున్నారు. ఉమ్మడిగా కలిసి ఉంటేనే ఆనందం ఉంటుందని రాజేశం పేర్కొన్నారు.
ఇంటిపెద్ద మాటే వేదం
జగిత్యాల పట్టణానికి చెందిన కొండేరి అర్జున్–భీమక్క దంపతులకు ఐదుగురు కుమారులు, కుమార్తె. పెద్దకొడుకు, కోడలు గంగాధర్–శారద. గంగాధర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. రెండో కొడుకు, కోడలు వేణుగోపాల్–అన్నపూర్ణ. వేణుగోపాల్ ప్రైవేటు జాబ్. మూడో కొడుకు, కోడలు రాము–సమత. రాము భవన నిర్మాణ రంగంలో పనిచేస్తుంటాడు. నాల్గో కుమారుడు, కోడలు దేవదాసు–భాగ్యలక్ష్మి. ఇతను తన తండ్రి అర్జున్ ఏర్పాటు చేసిన హోటల్ నిర్వహిస్తున్నాడు. ఐడో కొడుకు, కోడలు రాజేందర్–సంధ్య. ఈయన సారంగాపూర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లెక్చరర్. వీరందరికీ ఒకే ఒక్క ఆడపడుచు నవ్వాతు శోభ, బావ రవి. ఇతను మృతిచెందాడు.
కోడళ్లు ఐదుగురు ఇంటి సేవలకే పరిమితమై ఇప్పటికీ అత్తామామల మాట జవదాటరు. వారి ఇంటికి ఆడబిడ్డ వచ్చిందంటే అన్నదమ్ములకు ఎనలేని సంతోషం. ప్రతి ఒక్కరూ తమ వృత్తుల్లో వస్తున్న ఆదాయాన్ని తండ్రికి ఇ వ్వడం విశేషం. ఐదుగురు అన్నదమ్ముల మధ్య ఏనాడు బేదాభిప్రాయాలు రా లేదు. అర్జున్–భీమక్కకు మనుమలు, మనుమరాళ్లు మొత్తం 38 మంది. తా ము ఇప్పటికీ సంతోషంగా ఉన్నామంటే తమ కొడుకుల మధ్య ఏనాడు చిన్న విభేదాలు పొడసూపలేదని, తాము చెప్పిందే వారికి వేదమన్న విధంగా నడస్తున్నారని పేర్కొన్నారు. అందరూ కష్టపడి పనిచేయడం, క్రమశిక్షణతో ఉండడం మాకు కొండంత బలాన్ని ఇస్తుందని, వారి పిల్లలు కూడా కలిసి ఉంటున్నారని అర్జున్–భీమక్క చెప్పుకొచ్చారు.
ఉప్పుల జాయింట్ ఫ్యామిలీ
వారిది నిరుపేద వైశ్య కుటుంబం. అయినా బంధాలు, బంధుత్వాలను గౌరవిస్తారు. ముందునుంచి హోటల్ నడుపుకుంటూ జీవించే వసుధైక కుటుంబం. ప్రస్తుతం టిఫిన్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. పెంకుటింట్లో ఇరుకైన గదుల్లోనే వీరంతా ఉంటూ సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. వేములవాడ పట్టణంలోని ముదిరాజ్‌వీధిలో ఉంటున్న ఉప్పుల శ్రీరాములు– జయలక్ష్మి దంపతులకు నలుగురు కొడుకులు, ఏడుగురు కూతుళ్లు. కొడుకులు, కోడళ్లు కలిసే ఉంటున్నారు. ఇందులో శ్రీరాములు ఇటీవలే మరణించారు. వీరితోపాటు ఇద్దరు కూతుళ్లు ఇక్కడే ఉంటున్నారు. మిగతా ఐదుగురు కూతుళ్లు తమతమ అత్తావారిళ్లలో ఉంటున్నారు. ఈ ఉమ్మడి కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఈ ప్రాంతానికే ఆదర్శంగా నిలుస్తున్నారు.
సమష్టి కృషి
నాకు 13 ఏళ్లకే పెళ్లయింది. నలుగురు కొడుకులు, ఏడుగురు కూతుళ్లు. అందరికీ పెళ్లిళ్లు చేశా ం. ఇప్పటి వరకు ఉమ్మడిగానే ఉంటున్నాం. కుటుంబ సభ్యులమంతా సమష్టిగా కృషి చే స్తూ కాలం వెల్లదీస్తున్నాం. చిన్నపాటి ఇళ్లయినా అనురాగాలు, ఆప్యాయతల మధ్య సంతో షంగా గడుపుతున్నాం. ఇప్పటికీ నా కొడుకులు, కోడళ్లు మా మాటను జవదాటరు. ఉమ్మ డి కుటుంబంతో ఎన్నో లాభాలు ఉంటాయి. కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు, మనువలు, మనుమరాళ్లు, మునిమనువలు మొత్తం 44 మంది అయ్యాం. కానీ, నేటి తరం పెళ్లి కా గానే తల్లిదండ్రులను పట్టించుకోకుండా వేరు సంసారాలు పెడుతున్నారు. ఇది మన సంప్రదాయం కాదు.
– ఉప్పుల జయలక్ష్మి, కుటుంబ పెద్ద
మల్యాల మండలం తాటిపల్లి గ్రామంలోని అట్ల భూమవ్వ–అర్జయ్య దంపతులకు ఇద్దరు కుమారులు తిరుపతి రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి. తండ్రి కొద్ది రో జుల క్రితం మృతిచెందాడు. అ న్నదమ్ములు ఎవరి పనులు వారు చే సుకుంటూ ఒకే ఇంట్లో ఉంటారు. తిరుపతిరెడ్డి–గాయత్రి దపంతుల కు ఇద్దరు కుమారులు అభినయ్, కార్తీక్‌రెడ్డి. శ్రీనివాస్‌రెడ్డి– సంధ్యకు ఇద్దరు కుమారులు అక్షిత్, జశ్వంత్. అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. 15 ఎకరాల వ్యవసాయ భూమిని ఉమ్మడిగానే సాగు చేస్తున్నారు. పిల్లల చదువులుసైతం ఉ మ్మడిగానే భరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
రోజూ పండుగే..
నా కొడుకులు ఎవరి పనులకు వారు వెళ్తారు. కోడళ్లు ఇంటి, వ్యవసాయ పనులు చేసుకుంటూ, అందరం కలిసిమెలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం. నాకు చేతనైనంత ఇంటి పనుల్లో సాయం చేస్తుంటా. కొడుకులు, కోడళ్లు, మనుమళ్లతో కలిసి ఉంటే రోజూ పండుగ వాతావరణం ఉంటుంది.
– అట్ల భూమవ్వ, తాటిపల్లి
అత్తాకోడళ్లు కాదు.. తల్లీకూతుళ్లు
రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన చెల్పూ రి రాజమ్మ– రాములుది ఆదర్శ ఉమ్మడి కుటుంబం. నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. అనోన్యత చాటే తోడికోడళ్లు. అత్త సారథ్యంలో కుటుంబ నిర్వహణ. తల్లీకూతుళ్ల వలె కలిసిమెలిసి ఉంటారు. వైషామ్యాలకు తావులేకుండా పండంటి కా పురాలుగా తీర్చిదిద్దుతున్నారు తోడికోడళ్లు సరిత, అంజలి, గాయత్రి, అంజలి. సరిత భర్త ఓదెలు, అంజలి భ ర్త గట్టయ్య, గాయత్రి భర్త రాజమౌళి, అంజలి భర్త లింగమూర్తి. అన్నదమ్ములందరూ వ్యాపారాలు చేసుకుంటున్నారు. వీరి ఉమ్మడి కుటుంబంలో ఎనిమిది మంది పిల్లలు సాయితేజ, సిందూజ, అమూల్య, అక్షిత, రేవంత్, రుత్విక్, రిషిత, కార్తీకేయ. ఇక ఆడబిడ్డలు శంకరమ్మ– శంకరయ్య, లక్ష్మీకాంత– రవి. వారి కుటుంబాలతో కలిసి ఉంటున్నారు. ఆడబిడ్డ కుమారుడైన లవకుమార్‌కు సిందూజతో వివాహం జరిగింది. ఆడబిడ్డలు, కూతురు వస్తే ఆ ఇంట్లో పండుగే. నలుగురు తోడికోడళ్లును చూసి ఆదర్శవంతమైన కుటుంబం అని గ్రామస్తులు కితాబునిస్తారు.

– కోరుట్ల/సారంగాపూర్/యైటింక్లయిన్‌కాలనీ వేములవాడ/ముత్తారం/మల్యాల