Jagityala
-
జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో అమానుషం
జగిత్యాల: అనారోగ్యం బారిన పడ్డ భర్తను సర్కారు దవాఖానాలో చేర్పించిన భార్య ఆయన బాగోగులు చూసుకుంటోంది. ఓ చేయికి గాయం అయినా భర్త ఆస్పత్రిలో ఉండటంతో ఆయనకు సపర్యలు చేసేందుకు వెంట వచ్చింది. వారం రోజులుగా దవాఖానాలోనే ఉన్న ఆమె హైబీపీతో తన భర్తకు ఇచ్చిన బెడ్‌పై పడిపోయింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఆమెను బయట రోడ్డు పక్కన దింపడంతో భర్త కూడా బయటకు వచ్చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం రాఘవపట్నంకు చెందిన రాజనర్సు అనారోగ్యానికి గురవడంతో వారం రోజుల క్రితం జగిత్యాలలోని పెద్దాస్పత్రికి తీసుకొచ్చి చికిత్స చేయిస్తోంది అతని భార్య మల్లవ్వ. అయితే, ఆమె చేతికి గాయమైనప్పటికీ భర్త ఆరోగ్యం బాగుపడాలని పరితపించి, సపర్యలు చేస్తోంది. ఈ క్రమంలో రెండు రోజులుగా హైబీపీతో బాధ పడుతున్న మల్లవ్వ సొమ్మసిల్లి పడిపోతోంది. తన భర్తకు ఆస్పత్రిలో కేటాయించిన బెడ్‌పై ఉన్న మల్లవ్వను శుక్రవారం గమనించిన వైద్య సిబ్బంది వీల్‌చైర్‌పై బయటకు తీసుకెళ్లి, రోడ్డు పక్కన దింపి వెళ్లిపోయారు. అనారోగ్యానికి గురైన తన భార్యను దవాఖానా సిబ్బంది బయటకు తీసుకెళ్తుండటాన్ని గమనించిన రాజనర్సు తనకు వైద్యం వద్దని బయటకు వచ్చి, రోడ్డు పక్కన పడుకొని ఉన్న భార్య వద్దకు చేరుకున్నాడు. ఈ దంపతులను గమనించిన స్థానికులు జగిత్యాల టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని, బాధితులను ఆస్పత్రిలో చేర్పించారు. ఆర్ఎంవో నవీన్‌ను వివరణ కోరగా ఇలాంటి సంఘటన జరగలేదని, ఏదైనా ఉంటే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.గతంలోనూ ఇలాంటి ఘటనలు..జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణమన్న ఆరోపణలున్నాయి. గతంలో కూడా ఓ వృద్ధుడిని పాత్ బస్‌స్టేషన్‌లో దింపి పోగా.. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో తిరి గి ఆస్పత్రికి తరలించారు. అలాగే, ఓ గర్భిణి కడుపులో వస్త్రాలు మరిచిపోయిన ఘటన వెలుగులోకి రావడం అప్పట్లో సంచలనంగా మారింది. తాజా గా భర్తకు అటెండెంట్‌గా ఉన్న మల్లవ్వ విషయంలోనూ ఆస్పత్రి సిబ్బంది కఠినంగా వ్యవహరించిన తీరు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.చర్యలు తీసుకున్నా మారని తీరు..జగిత్యాల ఆస్పత్రి యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల సూపరింటెండెంట్‌ను సరెండర్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ, జిల్లా ఆస్పత్రి యంత్రాంగం వైఖరిలో మార్పు రాకపోవడం విస్మయం కల్గిస్తోంది. వృద్ధ దంపతుల విషయంలో కఠిన వైఖరిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికై నా దవాఖానా సిబ్బందిని క్రమశిక్షణలో పెట్టాలంటున్నారు. -
జీవన్‌రెడ్డికి యాష్కీ, జగ్గారెడ్డి మద్దతు
సాక్షి, హైదరాబాద్: జగిత్యాల నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత టి. జీవన్‌రెడ్డికి ఆ పార్టీలోని పలువురు నేతలు బహిరంగంగా మద్దతు పలుకుతున్నారు. అనుచరుడి హత్యతో తీవ్ర ఆవేదనలో ఉన్న ఆయన్ను టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ హైదరాబాద్‌లోని జీవన్‌రెడ్డి నివాసంలో శుక్రవారం కలిసి పరామర్శించారు. అనుచరుడి హత్యకు సంబంధించిన వివరాలు తెలుసుకొని సానుభూతి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పారీ్టకి ఎనలేని సేవ చేశారని... ఆయన సేవలు పారీ్టకి మరింత అవసర మని అభిప్రాయపడ్డారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పార్టీ ఎమ్మెల్యేలు ఓడిపోయినా ఆ తర్వాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్‌రెడ్డి గెలిచారని గుర్తుచేశారు. అప్పుడే ఆయనకున్న ప్రజాబలం ఏమిటో అర్థమైందన్నారు. జీవన్‌రెడ్డిని పార్టీ కాపాడుకుంటుందని.. ప్రస్తుత రాజకీయ పరిణామాలతోపాటు ప్రభుత్వ పాలనలో ఆయన తెలిపిన అభ్యంతరాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని యాష్కీగౌడ్ చెప్పారు. ఆయన ఆవేదన చూసి బాధపడ్డా: జగ్గారెడ్డి జీవన్‌రెడ్డి ఆవేదనపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా స్పందించారు. జీవన్‌రెడ్డి ఆవేదన చూసి తాను చాలా బాధపడ్డానని.. మనసు కలుక్కుమందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘మీకు అండగా ఉన్నానని చెప్పడానికి ఈ ప్రకటన మీడియా ద్వారా చేస్తున్నా. నేను ఎవరినీ తప్పుబట్టట్లేదు. కానీ పారీ్టలో మీరు ఒంటరినని అనుకోవద్దు. సమయం వచ్చినప్పుడు నేను మీ వెంట ఉంటా. ఎప్పుడూ జనంలో ఉండే మిమ్మల్ని జగిత్యాల, సంగారెడ్డి ప్రజలు ఎందుకు ఓడించారో అర్థం కావట్లేదు. మీ సమస్యకు అధిష్టానం పరిష్కారం చూపాలని సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాం«దీని కోరుతున్నా’అని జగ్గారెడ్డి ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు -
జగిత్యాల ప్రగతికే కాంగ్రెస్‌లో చేరా
జగిత్యాల: సీఎం రేవంత్‌రెడ్డి రైతు పక్షపాతి అని, జగిత్యాల ప్రాంతాభివృద్ధికి ఆయనతో కలిసి పనిచేసేందుకే కాంగ్రెస్‌లో చేరానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆయన జగిత్యాలలో విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు.తనను విమర్శించిన ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో హుందాతనంతో రాజకీయాలు చేయాలని, తనపై తప్పుడు ఆరోపణలను ఖండించారు. తన ఆర్థిక పరిస్థితి ప్రజలందరికీ తెలుసన్నారు. గతంలో బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నారని సంజయ్ కుమార్ గుర్తు చేశారు. -
మోదీ 3.0.. 100 రోజులు.. మనవి 2 రోడ్లు
సాక్షి, హైదరాబాద్: మోదీ 3.0 తొలి ‘వంద రోజుల ప్రణాళిక’లో తెలంగాణకు చెందిన రెండు కీలక రోడ్ల ప్రాజెక్టులకు చోటు దక్కింది. ఆర్మూరు–జగిత్యాల–మంచిర్యాల యాక్సెస్ కంట్రోల్డ్ హైవే, జగిత్యాల–కరీంనగర్ నాలుగు వరసల జాతీయ రహదారుల ప్రాజెక్టులను ఇందులో ఎంపిక చేశారు. ఈ వంద రోజుల్లో ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. పార్లమెంటు ఎన్నికల ప్రక్రియతో మందగించిన పురోగతిని వేగంగా పట్టాలెక్కించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మూడో విడత పాలనను వంద రోజుల ప్రత్యేక ప్రణాళికతో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ప్రణాళికలో దేశవ్యాప్తంగా 3 వేల కి.మీ. నిడివి గల జాతీయ రహదారులకు సంబంధించిన ప్రాజెక్టులను చేర్చారు. వాటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసే క్రమంలో పనులను ప్రారంభించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తారు. వాటిలో తెలంగాణకు సంబంధించి ఈ రెండు జాతీయ రహదారులుండటం విశేషం. ఇందులో ఆర్మూరు–జగిత్యాల–మంచిర్యాల రోడ్డుకు సంబంధించి గత ఫిబ్రవరిలోనే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇక జగిత్యాల–కరీంనగర్ రోడ్డు విస్తరణకు సంబంధించి ఆరు నెలల క్రితమే టెండర్లు పూర్తికాగా, ఇప్పుడు వాటిని రద్దు చేసి కొత్తగా మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయించారు. వీటికి సంబంధించి భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) వేగంగా చర్యలు తీసుకుంటోంది.రెండు రోడ్ల అనుసంధానంనిజామాబాద్–ఛత్తీస్‌గడ్‌లోని జగ్దల్పూర్ మధ్య విస్తరించి ఉన్న ఎన్‌హెచ్–63ను విస్తరించాలని కేంద్రం గతంలోనే నిర్ణయించింది. ట్రక్కులు అధికంగా తిరిగే ఈ జాతీయ రహదారి రెండు వరసలతో ఇరుకుగా ఉండి ప్రమాదాలకు నిలయంగా మారటంతో నాలుగు వరసలకు విస్తరించనున్నారు. ఇందులో ఆర్మూరు–మంచిర్యాల మధ్య కీలక ప్రాంతాన్ని ఎన్హెచ్ఏఐకి అప్పగించారు. రాష్ట్రం పరిధిలోని మిగతా నిడివిని రాష్ట్రప్రభుత్వ అ«దీనంలోని జాతీయ రహదారుల విభాగం విస్తరిస్తోంది.పట్టణాలు, గ్రామాలున్న చోట బైపాస్‌లు నిర్మించి, మిగతా రోడ్డును విస్తరిస్తారు. ఆర్మూరు, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, లక్సెట్టిపేట మీదుగా సాగే ఈ రోడ్డు నిడివి 131.8 కిలోమీటర్లు. ఆర్మూరు, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, లక్సెట్టిపేట, మంచిర్యాల పట్టణాల వద్ద 6–12 కి.మీ. మేర భారీ బైపాస్‌లు ఉంటాయి. ఇవి కాకుండా మరో 8 ప్రాంతాల్లో చిన్న బైపాస్‌లు నిర్మిస్తారు. ఇతర రోడ్ల క్రాసింగ్స్ ఉన్న ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్లను నిర్మిస్తారు. ఇక వంతెనలు, అండర్‌పాస్‌లు, ఆర్ఓబీలు దాదాపు 46 వరకు ఉంటాయి. ఈ మొత్తం ప్రాజెక్టుకు రూ.3,850 కోట్లు ఖర్చు చేయనున్నారు. భూసేకరణ విషయంలో గతంలో స్థానికులు వ్యతిరేకించి ఉద్యమించడంతో రెండుమార్లు దీని డిజైన్ మార్చాల్సి వచి్చంది. దీంతో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతూ వచి్చంది. ఇప్పుడు ఆలస్యం కాకుండా పనులను వేగంగా పూర్తి చేయనున్నారు.‘ప్రమాదాల రోడ్డు’కు ప్రాధాన్యం జగిత్యాల నుంచి ఖమ్మం వరకు విస్తరించి ఉన్న ఎన్‌హెచ్–563లో కీలక భాగమైన 58.86 కి.మీ. నిడివి కూడా ఇప్పుడు వంద రోజుల ప్రణాళికలో చోటు దక్కించుకుంది. ఈ రోడ్డు రెండు వరసలుగా ఉండి ఇరుగ్గా మారటంతో ప్రమాదాలకు నిలయమైంది. దీన్ని విస్తరించాలని చాలాకాలంగా యతి్నస్తున్నా పనుల్లో వేగం రాలేదు. కరీంనగర్ నుంచి వరంగల్ మధ్య ఎట్టకేలకు పనులు మొదలు కాగా, జగిత్యాల–కరీంనగర్ మధ్య టెండర్ల ప్రక్రియతో ఆగిపోయింది. గతంలో పిలిచిన టెండర్లను రద్దు చేసి మళ్లీ కొత్తగా పిలవాలని ఇప్పుడు నిర్ణయించారు. ఆ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి వంద రోజుల గడువులో నిర్మాణ పనులు మొదలుపెట్టనున్నారు. ఈ నిడివి పనులకు రూ.2,151 కోట్లు ఖర్చవుతుందని గతంలో అంచనా వేయగా, ఇప్పుడు దాని విలువ రూ.2,300 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ జరుగుతోంది. అది కూడా పూర్తికావొచి్చంది. కొన్ని అవాంతరాలున్నా, వేగంగా అధిగమించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
జగిత్యాల జిల్లా: 70వేల మందితో అంగరంగ వైభవంగా మల్లన్నకు బోనాలు (ఫోటోలు)
-
జగిత్యాల జిల్లా కోరుట్లలో భారీ అగ్ని ప్రమాదం
-
గెలిపిస్తే ‘నిజాం షుగర్స్’ తెరిపిస్తాం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/సాక్షి, కామారెడ్డి/ జగిత్యాల/రాయికల్: తెలంగాణలో బీజేపీని గెలిపిస్తే తక్షణమే నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని... ముఖ్యమంత్రి పీఠాన్ని బీసీకే కట్టబెడతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హామీ ఇచ్చారు. సోమవారం నిజామాబాద్ జిల్లా బోధన్, కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్ట ణం, జుక్కల్ నియోజకవర్గంలోని మేనూర్‌లో నిర్వహించిన సభలతోపాటు జగిత్యాల రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఇప్పటికే తెరిపించామన్న నడ్డా... తెలంగాణకు పసుపు బోర్డు ఇచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనన్నారు. ధరణి రద్దు చేసి మీభూమి పోర్టల్ తెస్తాం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అవినీతి, కుంభకోణాలకు మారుపేర్లని, ప్రజల సంపదను దోచు కుంటున్న ఆ రెండు పార్టీలకు చరమగీతం పాడాలని ప్రజలకు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షసుల సమితి అని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ బడాబాబులకు మాత్రమే ఉపయోగపడిందని, డబుల్ బెడ్రూం పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయట్లేదని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సక్రమంగా అందడంలేదని మండిపడ్డారు. ధరణి పోర్టల్ కారణంగా అవినీతి పెరిగిపోయిందని... బీజేపీని గెలిపిస్తే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని, లోపాలను సరిదిద్ది మీ భూమి పోర్టల్ తీసుకొస్తామని నడ్డా చెప్పారు. కాంగ్రెస్ వస్తే అవినీతి రాజ్యమే... గతంలో కేంద్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ నింగి, నేల, నీరు అనే తేడా లేకుండా అన్నింటిలోనూ అవినీతికి పాల్పడిందని... అలాంటి పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అవినీతి రాజ్యమేలుతుందని జేపీ నడ్డా ఆరోపించారు. బీజేపీ మాత్రమే అవినీతిరహిత పాలన అందిస్తుందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామని... అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని నడ్డా హామీ ఇచ్చారు. మోదీ అంటేనే అభివృద్ధి అన్నారు. రోడ్లు, రైల్వే అభివృద్ధి చేశామన్నారు. తెలంగాణ అభివృద్ధికి సైతం బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే బీబీ నగర్లో ఎయిమ్స్ కడుతున్నామని... అధికారంలోకి వస్తే రైతులకు ఎరువుల సబ్సిడీ, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే బీఆర్ఎస్ అవినీతిపై విచారణ చేపట్టి బాధ్యులను జైలుకు పంపిస్తామన్నారు. -
కాంగ్రెస్‌ది గతం.. ఇప్పుడు ఖతం!
జగిత్యాల, జగిత్యాల క్రైం, ధర్మపురి, సిరిసిల్ల, సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీది గతమని, ఇప్పుడా పార్టీ ఖతమైందని, వారంటీ ముగిసిన పార్టీ గ్యారంటీ ఎలా ఇస్తుందని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీస్టేడియంలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. 150 ఏళ్ల కాంగ్రెస్ వారంటీ అయిపోయిందని, ఆరు గ్యారంటీలు ఇస్తే ప్రజలు నమ్ముతారా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు 24 గంటల కరెంట్‌పై అనుమానం ఉందని, జగిత్యాల నియోజకవర్గానికి వచ్చి కరెంట్ తీగలు పట్టుకుంటే తెలుస్తుందని, అప్పుడు కాంగ్రెస్ పార్టీ దరిద్రం పోతుందని వ్యాఖ్యానించారు. రేవంత్ ఆర్ఎస్ఎస్ ఏజెంట్ రేవంత్‌రెడ్డి ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని, ఆ పార్టీ నేత పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సోనియాకు సైతం లేఖ రాశారని కేటీఆర్ గుర్తు చేశారు. బీజేపీ మతపిచ్చి పార్టీ అని, జనాల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు దండుకోవడమే ఆ పార్టీకి తెలుసని ధ్వజ మెత్తారు. పీఎం మోదీని సీఎం కేసీఆర్ విమర్శించినంతగా వేరే ఎవరూ విమర్శించలేరని, మాకు ఆ పార్టీతో, మోదీతో ఎలాంటి మిలాఖత్ లేదనడానికి ఇంత కంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు. మోదీది గాడ్సే వారసత్వమని ఆరోపించారు. బీఆర్ఎస్ అంటే కాళేశ్వరం.. కాంగ్రెస్ అంటే శనీశ్వరం బీఆర్ఎస్ అంటే కాళేశ్వరమని, కాంగ్రెస్ అంటే శనీశ్వరమని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి మాతాశిశు ఆస్పత్రితోపాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. నరేంద్రమోదీ అంటే నమ్మించి మోసం చేసేవాడని విమర్శించారు. కాగా జగిత్యాల జిల్లాకేంద్రంలో నిర్మించిన జిల్లా పోలీసు ప్రధాన కార్యా లయాన్ని మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్‌తో కలిసి హోంమంత్రి మహమూద్‌అలీ ప్రారంభించారు. ఒక్క రూపాయి లంచం లేకుండా.. రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్లో మంత్రి కేటీఆర్ 577 మందికి డబుల్ బెడ్రూం ఇళ్లు, 1,747 మందికి గృహలక్ష్మి పథకం మంజూరు పత్రాలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక్క రూపాయి లంచం లేకుండా నేరుగా ప్రజలకు లబ్ధి కలిగే విధంగా కేసీఆర్ పాలన వర్ధిల్లుతోందన్నారు. మోదీ అబద్ధాల జాతర ఎక్స్(ట్విట్టర్)లో మంత్రి కేటీఆర్ ధ్వజం పీఎం నరేంద్ర మోదీ పదేళ్ల పాలనలో నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలనే కాకుండా 140 కోట్ల మంది భారతీయులను మోసం చేశారని మంత్రి కేటీ రామారావు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో ధ్వజమెత్తారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి విభజన హామీలకు దిక్కులేకుండా పోయిందని ఆరోపించారు. మూడు రోజుల వ్యవధిలో రెండోసారి రాష్ట్రానికి వస్తున్న మోదీ విభజన హామీలకు పదేళ్లుగా పాతరేసి అబద్ధాల జాతర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వంద స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని కేటీఆర్ స్పష్టం చేశారు. -
అనుమానించి.. హతమార్చారు
సారంగాపూర్ (జగిత్యాల): గతంలో ప్రేమించిన ఓ యువతికి పెళ్లయినప్పటికీ మళ్లీ ప్రేమాయణం సాగిస్తున్నాడనే అనుమానంతో ఓ యువకుడిని దుండగులు ఆదివారం నరికి చంపిన ఘటన జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం బీర్పూర్కు చెందిన జువ్వకింది వంశీ (23) తుంగూర్‌లోని ఓ మోటార్ డ్రైవింగ్ స్కూల్లో పనిచేస్తున్నాడు. పని నిమిత్తం బీర్పూర్ మండలం కొల్వాయి వెళ్లి మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో బీర్పూర్ తిరిగి వస్తున్నాడు. అప్పటికే తుంగూర్‌లో మాటు వేసిన కొందరు దుండగులు.. వంశీని ఆపి వెంటతెచ్చుకున్న గొడ్డలి, ఇతర ఆయుధాలతో తలపై నరికారు. తల, నోటికి బలమైన గాయాలు కావడంతో వంశీ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి జేబులోని మొబైల్‌ఫోన్‌ను తీసు కున్న దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ప్రేమ వ్యవహారమే కారణమా? బీర్పూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి, వంశీకి మధ్య చాలాకాలం ప్రేమ వ్యవహారం నడిచింది. మరోసారి యువతి జోలికి రావొద్దని ఆమె కుటుంబ సభ్యులు వంశీని అప్పట్లో మందలించారు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం ఆ యువతికి మరో యువకుడితో వివాహం జరిపించారు. అయినా వంశీ ఆమెకు తరచూ ఫోన్ చేస్తూ మాట్లాడటం, కలవడం చేస్తున్నాడని యువతి కుటుంబ సభ్యులు అనుమానించసాగారు. ఇలా అయితే ఆమె కాపురం కూలిపోయే ప్రమాదం ఉందని భావించి వంశీని హతమార్చేందుకు కుట్రపన్నారు. మృతుడి కుటుంబం ధర్నా.. వంశీ హత్య సమాచారం తెలిసిన వెంటనే మృతుడి బంధువులు తుంగూర్ గ్రామానికి చేరుకొని రోడ్డుపై 2 గంటలపాటు బైఠాయించారు. హంతకులను తమకు అప్పగించకుంటే ఆత్మహత్య చేసుకుంటామని మృతుడి తల్లి భాగ్య, బాబాయ్ అక్కడే ఉన్న లారీ కిందకు వెళ్లారు. అయితే దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఓ గ్రామానికి చెందిన రమేశ్, విష్ణుపై తమకు అనుమానం ఉందని ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. మృతుడి తల్లి దినసరి కూలీకాగా తండ్రి శ్రీహరి ఉపాధి కోసం ముంబై వెళ్లాడు. వంశీకి ఓ సోదరుడు ఉన్నాడు. -
జగిత్యాలలో టెన్షన్ టెన్షన్
-
LIC అమ్మకానికి వ్యతిరేకంగా యువకులు పిడికిలెత్తాలి : సీఎం కేసీఆర్
-
జగిత్యాల : బండి సంజయ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
ఆ బాలుడి ఆత్మవిశ్వాసం నచ్చింది
జగిత్యాల: జగిత్యాలకు చెందిన ఓ బాలుడి మాటలకు కేటీఆర్ ఫిదా అయ్యారు. తన ట్విట్టర్ అకౌంట్లో ఆ వీడియోను షేర్ చేశారు. జగిత్యాలకు చెందిన బండివారి ప్రకాశ్ ఓల్డ్ హైస్కూల్లో 6వ తరగతి చదువుతున్నాడు. చదువుకుంటూనే ఉదయం సమయంలో ఇంటింటా దినపత్రికలు వేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ప్రకాశ్‌ను ప్రశంసించి.. చదువుకునే వయస్సులో పనిచేస్తున్నావని అడుగగా, తప్పేముందని తిరిగి ప్రశ్నించాడు. ‘ఈ వయస్సులో నీవు కష్టపడాల్సి వస్తోంది’అని సదరు వ్యక్తి అనగా, కష్టపడితే ఏమవుతుంది, భవిష్యత్‌లో నాకే మేలు జరుగుతుందని’బదులిచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలుడి ధైర్యాన్ని చూసిన నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కాగా, ప్రకాశ్ ఆత్మవిశ్వాసానికి మంత్రి కేటీఆర్ కూడా ముగ్ధుడయ్యారు. ఆ చిన్నారి భవిష్యత్ బాగుండాలని కోరారు. కష్టపడుతూ చదువుకోవడం అభినందనీయమని, బాలుడి ఆత్మవిశ్వాసం తనకు ఎంతో నచ్చిందని ట్వీట్ చేశారు. బాలుడి తండ్రి క్యాబ్ నడుపుతుండగా, తల్లి అనూష టైలరింగ్ చేస్తుంటుంది. -
‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’.. వధువు వరస మారుతోంది!
పెళ్లికూతుళ్లు సంప్రదాయాలను తిరగ రాస్తున్నారు. పెళ్లిపీటల మీద తల దించుకుని ఉండటం.. కాబోయే భర్త ఎదుట సిగ్గుల మొగ్గ కావడం.. అత్తారింటికి వెళ్లేప్పుడు కన్నీరు మున్నీరుగా ఏడ్వడం.. ఈ ‘సంప్రదాయ ధోరణి’ కాదని పెళ్లి రోజున పూర్తి ఉత్సాహంగా ఉంటున్నారు. జీవితంలో ముఖ్యమైన రోజును అణువణువు ఆనందమయం చేసుకోజూస్తున్నారు. ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ అని పాడుతూ డాన్స్ చేస్తున్నారు. అంతేనా? అత్తారింటికి పక్కన భర్తను కూచోబెట్టుకుని డ్రైవ్ చేస్తున్నారు. నిజంగా వీరు కొత్త పెళ్లికూతుళ్లే. నాలుగు రోజుల క్రితం, ఆగస్టు 22న ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఒక పెళ్లి జరిగింది. వధువు సనా షబ్నమ్, వరుడు షేక్ ఆమిర్. ఇప్పుడు వధువు అత్తారింటికి వెళ్లాలి. సాధారణంగా ఆ సమయంలో పెళ్లిమంటపం గంభీరంగా ఉంటుంది. పెళ్లికూతురి తల్లిదండ్రులు భావోద్వేగాలకు లోనవుతారు. ఇన్నాళ్లు పెంచి పోషించిన బంగారు తల్లి ఇప్పుడు తమ నుంచి వేరుపడి కొత్త జీవితంలోకి అడుగు పెడుతోంది కనుక ఆమె వైవాహిక జీవితం బాగుండాలని ఒక ఆకాంక్ష, ఆమె అక్కడ ఎలా ఉండ బోతోందోననే ఆందోళన... ఇవన్నీ వాతావరణాన్ని బరువెక్కిస్తాయి. పెళ్లికూతురు బొరోమని తన వాళ్లను పట్టుకుని ఏడుస్తుంది. పెళ్లికొడుకు సర్ది చెప్పి బండి ఎక్కిస్తాడు... సాధారణంగా జరిగే ఈ రివాజు మొత్తం ఆ రోజు ఆ పెళ్లిలో ఏమీ జరగలేదు. పెళ్లి ఇంటి దగ్గర బయట ఉన్న మహీంద్రా ఎస్.యు.వి వరకూ పెళ్లి కూతురు హుషారుగా నడిచి వచ్చింది. డ్రైవింగ్ సీట్లో కూచుంది. భర్త ఆమిర్‌ను పాసింజర్ సీట్లో కూచోబెట్టుకుంది. ‘వెళదామా... అత్తారింటికి’ అని బండి స్టార్ట్ చేసింది. బంధుమిత్రులందరూ ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు. ఆ వెంటనే పెళ్లికూతురి ఉత్సాహాన్ని ప్రోత్సహించారు. కశ్మీర్ లోయలో ఇలాంటి ‘విదాయి’ (అంపకాలు) ఎవరూ చూడలేదు. కాని పెళ్లికూతురు సనా షబ్నమ్ గతంలోని స్టీరియోటైప్‌ను బ్రేక్ చేసింది. ‘నేను కశ్మీర్ పెళ్లిళ్ల మూస పద్ధతిని మార్చాలనుకున్నాను. సనా నన్ను కూచోబెట్టుకుని డ్రైవ్ చేయడం తన జీవితంలోని ముఖ్యరోజున విశేషం అవుతుందని భావించాను. ఆమె నన్ను కూచోబెట్టుకుని నడపడాన్ని ప్రోత్సహించాను. కొంతమందికి ఇది నచ్చకపోవచ్చుగాని చాలామంది మెచ్చుకున్నారు’ అని సనా భర్త ఆమిర్ అన్నాడు. అతడు వృత్తిరీత్యా అడ్వకేట్. బారాముల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా. కశ్మీర్ ముస్లింలలో సంప్రదాయాల పట్ల కట్టుబాటు ఉన్నా అక్కడ స్త్రీలు ఆధునికంగా ఆలోచించడాన్ని ఆహ్వానిస్తున్నారని ఈ ఉదంతం వెల్లడి చేస్తోంది. అయితే నెల క్రితం కలకత్తాలో జరిగిన ఇలాంటి సంఘటనే ‘జండర్ మూస’ను బద్దలు కొట్టినట్టయ్యింది. సాధారణంగా భార్య జీవితానికి మార్గం చూపేవాడు భర్తే అవుతాడు సగటు పురుషస్వామ్య భావజాలంలో. భర్త ప్రతిదాన్ని లీడ్ చేస్తే భార్య అనుసరించాలి. ఇది పెళ్లయిన నాటి నుంచి సమాజం మొదలెడుతుంది. అంపకాల్లో పెళ్లికూతురి తండ్రి తన కుమార్తె చేతిని అల్లుడి చేతిలో పెట్టి ‘జాగ్రత్త నాయనా... ఎలా చూసుకుంటావో’నని ఎమోషనల్ అవుతాడు. సమాజం ఇంత ముందుకు వెళ్లినా స్త్రీలు తమ సామర్థ్యాలను నిరూపిస్తున్నా భార్యను భర్త మీద ఆధారపడే వ్యక్తిగా సంకేతం ఇచ్చే ‘అంపకాలను’ ఎందుకు తిరస్కరించకూడదు అని కోల్‌కతాకు చెందిన వధువు స్నేహా సింగ్ అనుకుంది. పెళ్లి అయ్యాక భారీ పెళ్లి లహెంగాలో భర్త సౌగత్ ఉపాధ్యాయను బండిలో కూచోబెట్టుకుని అత్తారింటికి బయలుదేరింది. ఇది దేశంలో చాలా వైరల్ వీడియో అయ్యింది. ‘ఇలా చేయాలని నెల క్రితమే నేను అనుకుని సౌగత్‌ను అడిగాను. అతడు సంతోషంగా అంగీకరించాడు. అయితే ఆ తర్వాత ఆ సంగతి పెళ్లి కంగారులో మర్చిపోయి నేను పాసింజర్ సీట్లో కూచుంటే నువ్వు నడుపుతానన్నావుగా అని అతడే గుర్తు చేశాడు. నిజానికి సౌగత్‌ను కూచోబెట్టుకుని బండిలో తిప్పడం పెళ్లికి ముందు నుంచే నాకు అలవాటు. ఆ పనే ఇప్పుడూ చేశాను. అతని డ్రైవింగ్ నాకు భయం కూడా అనుకోండి’ అని నవ్వింది స్నేహా. ఇరవై ముప్పై ఏళ్ల క్రితం కమ్యూనికేషన్ వ్యవస్థ, ట్రాన్స్‌పోర్టేషన్ సరిగా ఉండేవి కాదు. అత్తారిల్లు పక్క ఊళ్లోనే అయినా దూరం అయినా రాకపోకలు మాటా మంతి అంతగా సాగేవి కావు. ఉత్తరాలనే నమ్ముకోవాల్సి వచ్చేది. పైగా ఆనాటి ఆడపిల్లలు సరైన చదువుకు, ఉపాధికి నోచుకోక భవిష్యత్తంతా అత్తారింటి మంచి చెడ్డల మీద ఆధారపడి ఉండేవారు. అందువల్ల పెళ్లి సమయాలలో పెళ్లికూతుళ్లు ఆందోళనగా, ఉద్వేగంగా, సమాజ పోబడికి తగ్గట్టు బిడియంగా ఉండేవారు. కాని ఇప్పుడు ఎంత దూరం వెళ్లినా, అమెరికాలో ఉన్నా అనుక్షణం తన వాళ్లకు కనపడుతూ వినపడుతూ ఉండే వీలు ఉంది. ఒక్కరోజు తేడాలో ఎంత దూరం అయినా ప్రయాణించవచ్చు. అబ్బాయి అమ్మాయిల మధ్య పెళ్లికి ముందు కొద్దో గొప్పో మాటలు నడిచి పెళ్లి నాటికి స్నేహం కూడా ఏర్పడుతోంది. అందుకే ఇప్పుడు పెళ్లిళ్లలో పూర్తిగా కొత్త ఆలోచనల పెళ్లికూతుళ్లు కనిపిస్తున్నారు. ఇటీవల తెలంగాణలోని జగిత్యాల ప్రాంతానికి చెందిన వధువు సాయి శ్రీయ వరుడు అశోక్‌తో అంపకాల సమయంలో అత్తారింటికి సంతోషంగా వెళుతూ ప్రైవేటు గీతం ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ పాటకు చేసిన నృత్యం దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంది. ఆ వీడియోలో సాయి శ్రీయ తన భర్తను చూస్తూ సంతోషంగా డాన్స్ చేస్తుంటే భర్త కూడా ఎంతో ముచ్చట పడుతూ చూడటాన్ని జనం మెచ్చుకున్నారు. ఆ జంటను ఆశీర్వదించారు. నిన్న మొన్నటి వరకు అబ్బాయికి విందులో ఏది ఇష్టం, మంటపం ఏది బుక్ చేయమంటాడు, పెళ్లి ఎలా జరగాలంటాడు వంటి ప్రిఫరెన్సు దక్కేది. ఇప్పుడు అమ్మాయికి ఏది ఇష్టం, ఏం కావాలంటోంది, ఏది ముచ్చపడుతోంది అని అడిగి అంగీకరించే పరిస్థితికి నేటి ఆడపిల్లలు వీలు కల్పిస్తున్నారు. సంతోషాల ఎంపికలో ఆమెకూ సమాన భాగం దొరికితే ఆ వివాహం మరెంతో సుందరం కదా. -
జగిత్యాలలో రెచ్చిపోయిన ఇసుక మాఫియా
-
బలవంతంగా ఫోటోలు.. ఆపై వాట్సాప్.. కట్‌చేస్తే!
సాక్షి, జగిత్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని హనుమాన్‌వాడకు చెందిన బొక్కల మనీషతో బలవంతంగా ఫొటోలు దిగి వాట్సప్‌లో పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్న కుర్మ శ్రీకాంత్‌పై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై శంకర్‌నాయక్ తెలిపారు. జిల్లాకేంద్రానికి చెందిన బొక్కల మనీషకు జగిత్యాల మండలం పొలాస గ్రామానికి చెందిన కుర్మ శ్రీకాంత్‌కు పరిచయం ఏర్పడింది. దీంతో మనీషను వివాహం చేసుకోవాలని ఒత్తిడి పెంచగా ఆమె నిరాకరించింది. దీంతో 10.12.2020న హనుమాన్‌వాడలో ఉన్న మనీషను శ్రీకాంత్‌తోపాటు కుర్మ రమేశ్ బలవంతంగా కారులో తీసుకెళ్లి జయ్యారంలో శ్రీకాంత్ వివాహం చేసుకున్నాడు. దీంతో నెలతర్వాత మనీష తప్పించుకుని జగిత్యాలకు చేరుకుంది. వివాహం జరిగినట్లు ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో మనీష ఎవరికి చెప్పలేదు. ఈ నేపథ్యంలో రెండురోజుల నుంచి బలవంతంగా వివాహ సమయంలో దిగిన ఫొటోలు మనీష తమ్ముళ్లు, వినయ్, మణిదీప్‌కు వాట్సప్‌లో పోస్ట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతుండడంతో బాధితురాలు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. -
లక్కీ డ్రా గ్యాంగ్..ఇలా చిక్కారు!
జగిత్యాలక్రైం: లక్కీ లాటరీ పేరుతో సామాన్యులకు సభ్యత్వం ఇస్తూ ప్రతీనెల వాయిదాల పద్ధతిలో డబ్బు తీసుకుని డ్రా నిర్వహిస్తూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తుండగా జగిత్యాల రూరల్ ఎస్సై చిరంజీవి, జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామంలో సోమవారం దాడి చేసి 13 మందిపై కేసు నమోదు చేశారు. మోతె గ్రామానికి చెందిన లోకిని చంద్రమౌళి, చైత్రిక ఎంటర్ప్రైజెస్ పేరుతో లక్కీ డ్రా దందా నిర్వహిస్తున్నాడు. అంతే కాకుండా మరో 12 మంది ఆరె ధర్మయ్య, ప్రదీప్, బొల్లం కిరణ్, నర్ర శేఖర్, నాంపల్లి పవన్, చిలుక సతీశ్, నాయిని రాజన్న, వేముల రమేశ్, సతీశ్, రాకేశ్, కొక్కు సందీప్, సామల్ల చందు ఏజెంట్లుగా పని చేస్తున్నారు. ఒక్కో సభ్యుడి నుంచి వారానికి రూ.300 వసూలు చేసి లక్కీ డ్రా నిర్వహిస్తూ పెద్దఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. వీరిని అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి రూ.2.07 లక్షల నగదు, ఆరు రిసీప్ట్ బుక్స్, చైత్రిక ఎంటర్ప్రైజెస్ బుక్లెట్స్ 130, లాటరీ కాయిన్స్ 45, లాటరీ కాయిన్స్ రోలింగ్, ప్లాస్టిక్ కుర్చీలు 70, టెంట్ 1, టేబుల్ ఫ్యాన్స్ 22, పెడెస్టెల్ ఫ్యాన్స్ 2, మిక్చర్ గ్రైండర్స్ 25, గ్యాస్‌స్టౌవ్ 4 స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై తెలిపారు. -
అశ్వాలే అతడి నేస్తాలు..
జగిత్యాలఅగ్రికల్చర్: జీవితమే ఒక ఆట..సాహసమే పూబాట..అంటూ గుర్రంపై చిరంజీవి ఓ సినిమాలో వెళ్లడం చూస్తుంటే భళే మజాగా ఉంటుంది. అట్లాంటిది అశ్వాల మీద స్వారీ చేయాలనే కోరికతో జగిత్యాల ప్రాంతంలోని కొందరు రైతులు వివిధ ప్రాంతాల నుంచి వాటిని కొనుగోలు చేసి సరదా తీర్చుకుంటున్నారు. దీనికితోడు ఇటీవల పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు గుర్రాలపై వెళ్లి పనులు చేసుకోవాలనే నిర్ణయానికి బలం చేకూర్చాయి. అశ్వాలను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నారు. గుర్రాలను పెంచుతున్న ముగ్గురు రైతులు జగిత్యాల ప్రాంతంలో ముగ్గురు రైతులు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల నుంచి గుర్రాలు కొనుగోలు చేసి వాటిని పెంచుతున్నారు. జిల్లాకేంద్రానికి చెందిన అరుణ్ క్రాంతి అంతర్గాం సమీపంలో డెయిరీ ఫాం, చేపలఫాం, కోళ్ల ఫాం, వ్యవసాయం కూడా చేస్తున్నాడు. గుర్రాన్ని లక్షకు గుజరాత్ నుంచి కొనుగోలు చేసి దానిపై తిరుగుతూ సరదా తీర్చుకుంటున్నాడు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన మారిశెట్టి రవి అనే రైతు రెండు గుర్రాలను రూ.50 వేలకు మహారాష్ట్ర నుంచి కొనుగోలు చేశారు. ఆ గుర్రాలపై రోజు పొలం వద్దకు వెళ్లి వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. జగిత్యాల మండలం పెరుకపల్లికి చెందిన బెజ్జంకి హంసయ్య అనే రైతు రెండేళ్లక్రితం చిన్న వయసులో ఉన్న గుర్రాలను రూ.25 వేలకు మహారాష్ట్ర నుంచి కొనుగోలు చేసి వాటిని పెంచుతూ మురిసిపోతున్నాడు. ప్రత్యేకంగా గుర్రాల పెంపకం గుర్రాలను కొనుగోలు చేసిన రైతులు అరుణ్ క్రాంతి, మారిశెట్టి రవి వాటిని ప్రత్యేకంగా పెంచుతూ ప్రాణంగా చూసుకుంటున్నారు. గుర్రాలకు ప్రతీ రోజు స్నానం చేయించడంతో పాటు పల్లిపిండి, తవుడు, వేరుశెనగ చెక్కతో తయారు చేసిన దాణాను రోజు ఇస్తారు. దాణాకు నెలకు ఒక్కో రైతు కనీసం రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు ఖర్చుచేస్తున్నారు. దీనికితోడు ప్రతీరోజు పచ్చి మేత ఆహారంగా ఇస్తున్నారు. గుర్రాల శరీర కండ పరిపుష్టికి రోజు కొద్దిదూరమైనా పరుగెత్తిస్తుంటారు. తారు రోడ్డు, కంకర రోడ్లు ఉండడంతో గుర్రాల కాళ్ల డెక్కలు దెబ్బ తినకుండా, గుర్రాల కాళ్లకు నాడెలు కొట్టిస్తున్నారు. ఎక్కువగా మట్టి రోడ్లపై నడిచేలా శిక్షణ ఇస్తున్నారు. గుర్రాలకు ఏదైనా అనారోగ్యం వస్తే సమీపంలోని పశువైద్యుల వద్ద చికిత్స చేయిస్తున్నారు. గుర్రాల పేడను పంటలకు ఎరువుగా ఉపయోగిస్తున్నారు. -
కమీషన్లకు కక్కుర్తీ..కలెక్టర్ నోటీసులు!
జగిత్యాల/ధర్మపురి: జిల్లాలోని కొన్ని గ్రామపంచాయతీల్లో నిధుల దుర్వినియోగంతోపాటు విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటంతో కలెక్టర్ రవి షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. సరైన కారణంతో సంజాయిషి ఇవ్వని సర్పంచులు, కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. బుధవారం జిల్లాలోని ధర్మపురి మండలం జైన గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్‌తోపాటు గ్రామపంచాయతీ కార్యదర్శులను ఆరు నెలలపాటు సస్పెన్షన్ విధించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రూ.37.03 లక్షల లెక్కలపై నిర్లక్ష్యం జిల్లాలోని ధర్మపురి మండలం జైన గ్రామ సర్పంచ్ జె.ప్రభాకర్‌రావు, ఉపసర్పంచ్ కురిక్యాల మహేశ్, పంచాయతీ కార్యదర్శి పాషా గ్రామపంచాయతీ విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించడంతోపాటు పంచాయతీ నిధులను దుర్వినియోగం చేశారనే కారణాలతో కలెక్టర్ ఆరునెలల పాటు సస్పెన్షన్ ఉత్తర్వులను బుధవారం జారీ చేశారు. గ్రామపంచాయతీకి చెందిన నిధులు రూ.37,03,865 సంబంధించిన రికార్డులు చూపించకపోగా కలెక్టర్ జారీచేసిన షోకాజ్ నోటీసులకు సమాధానం సైతం ఇవ్వలేదు. దీంతో పల్లెప్రగతి పనుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు ముగ్గురిపై సస్పెన్షన్ విధించారు. ప్రతీ నెల రూ.9.17 కోట్లు జిల్లాలోని 380 గ్రామపంచాయతీలకు ప్రభుత్వం ప్రతీ నెల రూ.9.17 కోట్లు మంజూరు చేస్తోంది. గ్రామాల జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తుండగా, ఆయా నిధులను పల్లెప్రగతి పనులతో పాటు వైకుంఠదామాలు, పల్లెప్రకృతి వనాలు, శాని టేషన్, పంచాయతీ నిర్వహణ కోసం పాలకవర్గాలు వినియోగిస్తున్నాయి. గతేడాది జిల్లాలో సుమారు రూ.110 కోట్లు గ్రామపంచాయతీల నిధుల రూపంలో జీపీలకు చేరాయి. కొన్ని గ్రామాల్లో నిధులు పక్కదారి పట్టినట్లు ఆరోపణలున్నాయి. చాలా వరకు గ్రామాల్లో శ్మశానవాటిక పనులు పూర్తి కాలేదు. డంపింగ్‌యార్డులు, సెగ్రిగేషన్ షెడ్లు, కంపోస్ట్‌యార్డుల నిర్మాణాలు సైతం నత్తనడకన సాగుతున్నాయి. గతేడాది పల్లెప్రగతి పనుల్లో నిర్లక్ష్యం చూపడంతోపాటు నిధుల్లో పారదర్శకత లేని 8 మంది సర్పంచులకు కలెక్టర్ రవి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ధర్మపురి మండలం జైన, రాజారం, రాయికల్ మండలం ధర్మాజీపేట, వెల్గటూర్ మండలం గుల్లకోట, చెగ్యాం, వెల్గటూర్, కథలాపూర్ మండలం బొమ్మెన, కోరుట్ల మండలం పైడిమడుగు సర్పంచులకు గతంలో షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. దుర్వినియోగం ఇలా.. ధర్మపురి మండలంలోని జైనాలో హరితహారంలో భాగంగా కొనుగోలు చేసిన ట్రీగార్డులలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. 2019–2020లో 1,600 ట్రీగార్డులను కొనుగోలు చేశారు. ఒక్కో ట్రీగార్డుకు రూ.54 చొప్పున రూ.86,400 చెల్లించాల్సి ఉండగా.. రూ.1.92లక్షల విలువైన ట్రీగార్డులు కొన్నట్లు రికార్డులు చూపించినట్లు నిర్ధారణయ్యింది. సాధారణ నిధుల కింద రూ.1.95లక్షలు, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రూ.7,95,845, 14వ ఆర్థిక సంఘం నుంచి రూ.27,13,020 మొత్తం రూ.37,03,865 నిధుల వినియోగంపై వివరణ ఇవ్వాలని కలెక్టర్ నుంచి షోకాజ్ నోటీలు జారీ చేశారు. వీటిపై 15 రోజుల్లోగా స్పందించకపోవడంతో సస్పెన్షన్ చేస్తున్నట్లు ఈ నెల 3న ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా ధర్మపురి మండలంలోని రాయపట్నంలో రూ.4 లక్షలు, బుగ్గారం పంచాయతీలో రూ.2.40 లక్షలు దుర్వినియోగమైనట్లు ఆరోపణలు రావడంతో షోకాజ్ నోటీస్‌లు జారీ అయ్యాయి. 15 రోజుల్లోగా సంజాయిసీ ఇవ్వాలని కోరారు. -
పీసీసీపై జీవన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, జగిత్యాల : తెలంగాణా రాజకీయాల్లో పరిచయం అక్కరలేని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ కరడుగట్టిన కాంగ్రెస్ నేతగా, రాజకీయాల్లో మచ్చలేని నాయకునిగా ప్రాచుర్యం పొందిన జీవన్ రెడ్డికి పుట్టిన రోజు కానుకగా అధిష్టానం పీసీసీ అధ్యక్ష పదవిని బహుమానంగా ఇవ్వనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో జగిత్యాల చేరుకుని ఆయన ఇంటి ముందు సంబరాలు చేసుకుంటున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ముందుగా ఆయన నివాసానికి చేరుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. పొన్నం ప్రభాకర్‌తో పాటు ఉమ్మడి జిల్లాలోని నాయకులు కార్యకర్తలు జీవన్ రెడ్డి ఇంటికి చేరుకొని సందడి చేస్తున్నారు. ఆయన పుట్టిన రోజు కూడా ఈరోజే (మంగళవారం) కావడంతో కేక్ కట్ చేసి శాలువాలు, పూలదండలతో సత్కరించి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తెలంగాణా పీసీసీ అధ్యక్షునిగా జీవన్ రెడ్డిని పార్టీ అధిష్టానం ఖరారు చేసిందనే వార్తల సంగతి ఎలా ఉన్నప్పటికీ, యాధృచ్ఛికంగా ఆయన బర్త్ డే కూడా కలసి రావడం విశేషంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభివర్ణిస్తున్నాయి. (రేవంత్‌కు షాక్.. టీపీసీసీ చీఫ్‌గా సీనియర్ నేత!) పీసీసీ పదవి అప్పగింతపై జీవన్‌రెడ్డి స్పందించారు. నాలుగు దశాబ్దాలుగా ప్రజాజీవితంలో సేవ చేస్తున్నానని, అధిష్టానం ఏ బాధ్యత అప్పగించిన సమర్థవంతంగా పనిచేస్తానని తెలిపారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. అయితే పీసీసీ పదవిపై ఇప్పటి వరకు పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదన్నారు. వ్యక్తిగతంగానూ తనకు పిలుపు అందలేదని తెలిపారు. అయితే ఢిల్లీ పెద్దల పిలుపు మేరకు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశానని వెల్లడించారు. కాగా టీపీసీసీ పదవికి ఎంపీ రేవంత్ రెడ్డితో పాటు, కోమటిరెడ్డి తీవ్రంగా పోటీ పడిన విషయం తెలిసిందే. అయితే ఇరువురి ఏ ఒక్కరికి నిరాశ మిగిల్చిన పార్టీలో చీలికలు వస్తాయని భావించిన హస్తం అధిష్టానం.. సీనియర్ నేతైన జీవన్‌రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దీనిపై నేడోరేపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. టీ-పీసీసీ అధ్యక్షుని ఎంపికపై రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరుల పేర్లను ఉటంకిస్తూ వార్తలు వస్తున్న నేపథ్యంలోనే జీవన్ రెడ్డి పేరు ఖరారు కావడం గమనార్హం. మంగళవారం సోనియాగాంధీ తుది నిర్ణయం తీసుకుంటారనే వార్తలు వస్తున్నాయి. అయితే పీసీసీ అధ్యక్షునిగా జీవన్ రెడ్డి ఎంపికకు సంబంధించి నియామక పత్రంపై సోనియాగాంధీ సోమవారం రాత్రి సంతకం కూడా చేశారనేది తాజా సమాచారం. ఈ విషయంలో వారం రోజుల క్రితమే జీవన్ రెడ్డినీ పార్టీ అధిష్టానం పిలిపించుకునీ చర్చించినట్లు సమాచారం. అర్జంటుగా ఢిల్లీకి రావలసిందిగా రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ ఫోన్ చేయగ ఈమేరకు జీవన్ రెడ్డి ఢిల్లీ కూడా వెళ్లి వచ్చారని ఆయన అనుయాయులు చెబుతున్నారు. పార్టీ సారథ్య బాధ్యతల అంశం ప్రస్తావన వచ్చినపుడు, తాను పార్టీకి విధేయుడినని, అప్పగించిన ఏ బాధ్యతనైనా నిర్వహిస్తానని జీవన్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది. అయితే పార్టీ నిర్వహణకు అవసరమైన ఆర్థిక బలం అనే అంశంపైనా పార్టీలో చర్చ జరిగినట్లు సమాచారం. జీవన్ రెడ్డి మంచి ప్రజానాయకుడిగా పేరుగాంచినప్పటికీ, పార్టీ నిర్వహణకు అవసరమైన ఆర్థిక వనరుల అంశం ప్రస్తావనం కూడా వచ్చిందంటున్నారు. అయితే కొందరు నాయకులు అండగా ఉంటారని పార్టీ ముఖ్యులు భావించినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో జీవన్ రెడ్డి కొత్త పీసీసీ చీఫ్ గా ఎంపిక పూర్తయిందని, ప్రకటన లాంఛనమేనంటున్నారు మంగళవారం వస్తుందని భావిస్తున్న అధికారిక ప్రకటన జీవన్ రెడ్డికి బర్త్ డే కానుకగా కాంగ్రెస్ శ్రేణలు భావిస్తున్నాయి. ఈ విషయంపై జీవన్ రెడ్డి ని మీడియా ప్రతినిధులు సంప్రదించగా మాట్లాడడానికి నిరాకరించారు. ఇంకా తనకు ఏ విషయం తెలియదని స్పష్టం చేశారు. 1981లో రాజకీయాల్లో ప్రవేచించిన "జీవన్" మల్యాల పంచాయితీ సమితి ప్రెసిడెంట్‌గా ఎన్నికై అంచెలంచెలుగా ఎదిగారు. 6 సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పనిచేసిన జీవన్ రెడ్డి ప్రస్తుతం కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. -
మిత్రుడికి సాయం చేయబోయి ప్రాణాలు కోల్పోయారు
సాక్షి, జగిత్యాల: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా రొంపిచర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంతో జగిత్యాల జిల్లా ధర్మపురి లో విషాదం అలుముకుంది. రొంపిచర్ల వద్ద ఒక కారు కాలువలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. అందులో ముగ్గురు ధర్మపురికి చెందిన వారే కావడంతో ధర్మపురి లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల్లో ధర్మపురికి చెందిన కటకం మహేష్, అతని బావమరిది రాయపట్నంకు చెందిన ఆనంద్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీరు గౌడ్, అతని కుమారుడు శివ బాలాజీ ఉన్నారు. ఆంధ్రకు చెందిన మేస్త్రీ మాధవ్ తన స్వగ్రామమైన ప్రకాశం జిల్లా రఘునాథపురంలో ఉన్న ఇంటికి పెయింటింగ్ వేసేందుకు మిత్రుడి కారులో నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరాడు. కారులో మాధవ్‌తో పాటు మహేష్, ఆనంద్, బీరుగౌడ్, శివబాలజీ కూడా ఉన్నారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత రొంపిచర్ల సమీపంలో మూలమలుపు వద్ద కారు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. డ్రైవింగ్ చేస్తున్న మాధవ్ తప్పించుకొని సమీపంలోని పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కారు తో సహా నలుగురు మృతదేహాలు వెలికితీశారు. ప్రమాద విషయం తెలియడంతో ధర్మపురిలోని మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గత 15 ఏళ్లుగా ధర్మపురి లో ఉంటున్న బీరు గౌడ్ స్థానికంగా పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. లాక్ డౌన్ ముందు భార్యతో పాటు కుటుంబ సభ్యులంతా యూపీకి వెళ్లడంతో బీరు గౌడ్ అతని కుమారుడు మాత్రమే ఇక్కడ ఉన్నారు. మేస్త్రి మాధవ్‌కు వీరంతా మంచి మిత్రులు కావడంతో అతని సొంత ఇంటికి కలర్ వేసేందుకు ధర్మపురిలోకలర్ మిక్సింగ్ చేసి తీసుకెళ్తుండగా ప్రమాదానికి గురై నలుగురు ప్రాణాలు కోల్పొయారు. ఇంతమంది ఓకేసారి ప్రాణాలు కోల్పొవడంతో స్థానికంగా ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. చదవండి: విషాదం: ఇద్దరు పిల్లలతో చెరువులో దూకిన తల్లి -
ఎమ్మెల్యేకు కరోనా, నిన్ననే కవితకు విషెస్
సాక్షి, హైదరాబాద్: జగిత్యాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కరోనా బారినపడ్డారు. అసెంబ్లీలో కరోనా పరీక్ష చేయించుకున్న ఎమ్మెల్యేకు మంగళవారం పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత రెండు రోజులుగా ఎమ్మెల్యే సంజయ్ పలువురిని కలిసినట్టుగా తెలిసింది. నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఎన్నికైన కల్వకుంట్ల కవితను ఆయన సోమవారం కలిసి అభినందించారు. కొద్ది రోజుల కిందట ఆయన కరోనా రోగులకు సేవలందించారు. ఎమ్మెల్యే సంజయ్ త్వరగా కోలుకోవాలని పార్టీ నేతలు ఆకాక్షించారు. ఇక ఇటీవల కరోనా బారినపడ్డ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, కోరుకంటి చందర్ బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల సంతోష్ గుప్త, కేపీ వివేకానంద్, మంత్రి హరీష్‌రావు, హోంమంత్రి మహమూద్ అలీ తదితరులు కోలుకున్న సంగతి తెలిసిందే. (చదవండి: ఎమ్మెల్సీ ఉపఎన్నికలో సత్తా చాటిన టీఆర్ఎస్ ) -
వలస కార్మికులొచ్చారు
నిజామాబాద్ అర్బన్: /జగిత్యాలక్రైం/కరీంనగర్ రూరల్: నిజామాబాద్ జిల్లా కేంద్రానికి శనివారం తొలి శ్రామిక్ రైలు వచ్చింది. ముంబై నుంచి మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో వచ్చిన ఈ ప్రత్యేక రైలులో 214 మంది ప్రయాణికులు దిగారు. ఇందులో నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు 162 మంది, కామారెడ్డి జిల్లాకు చెందిన వారు 23 మంది ఉన్నారు. అలాగే.. జగిత్యాల రైల్వేస్టేషన్లో 842 మంది, కరీంనగర్ స్టేషన్లో 44 మంది దిగారు. వలస కార్మికులు ప్లాట్‌ఫాంపై చేరుకోగానే పోలీసు భద్రత మధ్య ఆయా మండలాల వారీగా వైద్య ఆరోగ్య శాఖ పేరు, అడ్రస్, సెల్‌నంబర్లు సేకరించి, జూన్ 15 వరకు హోం క్వారంటైన్లో ఉండేలా చేతులపై స్టాంపులు వేశారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుల్లో వలస కూలీలను వారి స్వగ్రామాలకు తరలించారు. -
‘జువ్వాడి’ కన్నుమూత
సాక్షి, జగిత్యాల: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు (92) కన్నుమూశారు. అనారోగ్యంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. జువ్వాడి అంత్యక్రియలను ఆయన స్వస్థలం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్‌లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. గోదావరి నది తీరంలో సాయంత్రం 5.30 గంటలకు అంత్యక్రియలు జరిగాయి. జువ్వాడి పార్థివ దేహం వద్ద మంత్రులు టి.హరీశ్‌రావు, ఈట ల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు, మాజీ హోం మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్, కలెక్టర్ రవి, ఎమ్మెల్యేలు సంజయ్‌కుమార్, విద్యాసాగర్‌రావు, శ్రీధర్‌బాబు తదితరులు నివాళులర్పించారు. సర్పంచ్ నుంచి మంత్రి దాకా..:జువ్వాడి రత్నాకర్‌రావు మొదట సర్పంచ్‌గా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1967 నుం చి తిమ్మాపూర్ సర్పంచ్‌గా 12 ఏళ్లు పని చేశా రు. 1979లో జగిత్యాల బ్లాక్ సమితి అధ్యక్షుడిగా పని చేశారు. 1983లో జగిత్యాల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి టీడీ పీ అభ్యర్థి జీవన్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. 1989లో బుగ్గారం సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించి స్వతం త్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండాకుల గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్లీ 1994 ఎన్నికల్లో ఓటమి పాలైన జువ్వాడి.. 1999, 2004లో అసెంబ్లీ ఎన్నికల్లో బుగ్గారం నుంచి గెలుపొందారు. వైఎస్.రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2007–09 వరకు దేవాదాయ, స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా కొనసాగారు. ఆ తరువాత 2009లో అసెంబ్లీ సెగ్మెంట్ల పునర్విభజన తరువాత 2009, 2010 అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. సీఎం కేసీఆర్ సంతాపం: మాజీ మంత్రి రత్నాకర్‌రావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తంచేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రత్నాకర్‌రావు అంత్యక్రియలు అధికారిక లాంచనాలతో నిర్వహించాలని ప్రభుత్వ సీఎస్ సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు. టీపీసీసీ నేతల సంతాపం: రత్నాకర్‌రావు మృతి పట్ల రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సంతాపం ప్రకటించారు. సంతాపం తెలిపిన వారిలో టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ తదితరులు ఉన్నారు. రత్నాకర్‌రావు పార్థివ దేహం వద్ద మంత్రి హరీశ్ రావు తదితరులు -
మద్యం మత్తులో వీరంగం.. అంతలోనే విషాదం
సాక్షి, జగిత్యాల : మద్యం మత్తులో ఓ యువకుడు చేసిన వీరంగం చివరికి అతని ప్రాణాల మీదకు తెచ్చింది. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఓ యువకుడు పుటుగా మద్యం తాగి మత్తులో ట్రాన్స్ఫార్మర్ను పట్టుకున్నాడు. రోడ్డుపై జనం చూస్తుండగానే కరెంట్‌షాక్‌తో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్లకు చెందిన ఓ యువకుడు ఆదివారం కావడంతో పూటుగా మద్యం సేవించాడు. అనంతరం సోగుకుంటూ వస్తూ రోడ్డుపై వెళ్లే వారి మీద రాళ్లు రువ్వాడు. పెద్దగా కేకలు పెడుతూ.. కాసేపు వీరంగం సృష్టించాడు. తమపై ఎక్కడ దాడి చేస్తాడనే భయంతో చుట్టపక్కనున్న ఎవరూ అతన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. ఈ క్రమంలోనే రోడ్డు పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ను పట్టుకున్నాడు. కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆ యువకుడు వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. -
పొలాస స్టుడెంట్స్ అదుర్స్..
సాక్షి, జగిత్యాల: వ్యవసాయ విద్యతో పాటు క్రీడా, సాంస్కృతిక పోటీల్లో జాతీయ, రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరుస్తూ ‘పొలాస’ విద్యార్థులు ముందుకు సాగుతున్నారు. ఇక్కడ నాలుగేళ్ల బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు ఏ క్రీడా పోటీల్లో పాల్గొన్నా ఓవరాల్ చాంపియన్ షిప్‌లతో పాటు వ్యక్తిగత బహుమతులు గెలుచుకుంటూ రాష్ట్రంలోని మిగతా వ్యవసాయ కళాశాలలకు సవాల్ విసురుతున్నారు. ఇటీవల జనవరి 19 నుంచి 24 వరకు హైద్రాబాద్‌లో నిర్వహించిన వ్యవసాయ వర్సిటీ రాష్ట్రస్థాయి క్రీడా సాంస్కృతిక పోటీల్లో 20 విభాగాల్లో ప్రథమ, ద్వితీయ బహుమతులు గెలుచుకొని, ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించారు. కళాశాల ప్రాంగణంలోనే ఆటస్థలం సాధారణంగా ప్రొఫెషనల్ కోర్సు విద్యార్థులు ఆటలంటే పెద్దగా ఆసక్తి చూపరు. కానీ వీరిని ఆటల వైపు తీసుకువచ్చి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున జరిగే అన్ని ఆటల పోటీల్లో బహుమతులు గెలుచుకోవడంలో కళాశాల ఫిజికల్ డైరెక్టర్ రాజశేఖర్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఉదయం, సాయంత్రం విద్యార్థులు హాస్టళ్లలో సమయాన్ని వృథా చేయకుండా ఉండేందుకు వారిని గ్రౌండ్‌కు తీసుకొస్తున్నారు. కళాశాల ప్రాంగణంలోనే ఆట స్థలం ఏర్పాటు చేసి, పలు క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. దీంతో ఇప్పటివరకు బాల్ బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, షటిల్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, అథ్లెటిక్స్‌లో రన్నింగ్, లాంగ్‌జంప్, డిస్కస్ త్రో, హై జంప్, షాట్‌పుట్ తదితర ఆటల్లో విద్యార్థినీ, విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు ఓవరాల్ చాంపియన్ షిప్ కూడా సాధించారు. అశోక్‌కుమార్ అనే విద్యార్థి అథ్లెటిక్స్‌లో వ్యక్తిగతంగా ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించాడు. సాంస్కృతిక పోటీల్లోనూ సత్తా ఒక్క క్రీడా పోటీల్లోనే కాకుండా, సాంస్కృతిక కార్యక్రమాల్లో సైతం తమ సత్తా చాటుతూ బహుమతులు సాధిస్తున్నారు. రంగోళి, కార్టూన్ మేకింగ్, స్పాట్ పెయింటింగ్, పోస్టర్ మేకింగ్ విభాగాల్లో శ్రావణి అనే విద్యార్థిని అనేక బహుమతులు గెలుచుకుంది. పలువరు విద్యార్థులు సోలో క్లాసికల్ డ్యాన్స్, క్విజ్, తెలుగు ఉపన్యాసం, ఇంగ్లిష్ ఉపన్యాసం విభాగాల్లో ప్రథమ, ద్వితీయ బహుమతులు గెలుచుకున్నారు. విద్యార్థిని మానస రెడ్డి మార్షల్ ఆర్ట్స్‌లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోంది. జాతీయస్థాయిలో విజయాలు జాతీయ స్థాయి పోటీల్లో సైతం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2011లో మహారాష్ట్రలోని అకోలాలో జరిగిన జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో రాజశేఖర్ ప్రథమ, అథ్లెటిక్స్‌లో మహేశ్ ప్రథమ స్థానంలో నిలిచారు. 2009లో మహారాష్ట్రలోని పర్భనిలో నిర్వహించిన జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో రాజు, రవీందర్‌లు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. నీలకంఠ రాజరుషి 10 క్రీడా విభాగాల్లో సత్తా చాటి, రాష్ట్రస్థాయిలో అథ్లెటిక్స్ చాంపియన్‌గా నిలిచి, జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. జాతీయ స్థాయి క్విజ్‌లో ఏఎస్.అభిరామ్ సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించారు ఇటీవల హైద్రాబాద్‌లో జరిగిన క్రీడా, సాంస్కృతిక పోటీల్లో బాలికల విభాగంలో మా విద్యార్థినులు ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించారు. అథ్లెటిక్స్‌లో, సాంస్కృతిక పోటీల్లో చాలామంది సత్తా చాటారు. వారు జాతీయ స్థాయిలోనూ రాణిస్తారన్న నమ్మకం ఉంది. – డాక్టర్ కేబీ.సునీతాదేవి, అసోసియేట్ డీన్, పొలాస -
పనిభారం.. పర్యవేక్షణ లోపం
రాయికల్ మండలంలో 32 గ్రామాలుండగా ఒక్కో పోలీస్ కానిస్టేబుల్‌కు నాలుగేసి గ్రామాల బాధ్యతలు అప్పగించారు. స్టేషన్లో ఒక ఎస్సై, ఏఎస్సై, ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు ఉండగా ఏఎస్సైకి రాయికల్ మున్సిపాలిటీ అప్పగించారు. మిగతా సిబ్బందిలో ఒక్కొక్కరికీ నాలుగేసి గ్రామాల బాధ్యతలు ఉండడంతో పర్యవేక్షణ కరువైంది సాక్షి, జగిత్యాల : పల్లెలపై పోలీసులకు పట్టు సడలిపోతోంది. ఠాణాల్లో సరైన సంఖ్యలో సిబ్బంది లేకపోవడం, ఉన్నవారిపైనే పనిభారం పడుతుండడంతో గ్రామాలపై దృష్టి కేంద్రీకరించడం లేదు. ఒక్కో పోలీసుకానిస్టేబుల్కు మూడు నుంచి నాలుగు గ్రామాల బాధ్యతలు ఉంటుండడంతో ఏ ఒక్క గ్రామంపై పట్టు సాధించడం లేదు. ఫలితంగా గ్రామాల్లో పోకిరీల బెడద ఎక్కువైపోతుంది. గ్రామాలపై పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థ ని నిర్వీర్యమవుతోంది. ఫలితంగా గ్రామాల్లో దొంగతనాలు, దోపిడీలు, ఉత్సవాల సమయంలో గొడవలు సర్వసాధారణమయ్యాయి. హైదరాబాద్‌లో దిశ అత్యాచారం, హత్య కేసు గ్రామస్థాయిలో పోలీస్ వ్యవస్థ పనితీరుపై చర్చలేపింది. వీపీవో నిర్వీర్యం గ్రామస్థాయిలో పలుశాఖలతో పాటు కీలకమైన పోలీస్‌శాఖ అధికారిగా వీపీవోలను కేటాయిస్తుంది. గ్రామానికో పోలీస్ అధికారి ఉంటే విధిగా తమ గ్రామాల్లో కొంత సమయం కేటాయించే అవకాశం ఉంటుంది. ఎన్నికలు, పండుగలు, జాతర సమయాల్లో వీరు గ్రామాల్లో శాం తిభద్రతలను పర్యవేక్షిస్తారు. సిబ్బంది కొరతతో జిల్లాలో వీపీవో వ్యవస్థ నిరీ్వర్యమవుతోం ది. జిల్లాలో 380 గ్రామపంచాయతీలతోపాటు 103 పల్లెలను కలుపుకొని నాలుగు గ్రామాలకు ఒక వీపీవో ఉండగా వారి పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పోలీస్ సిబ్బంది సంఖ్య పెరగకపోవడం సమస్యగా మారింది. సిబ్బంది తక్కువగా ఉండడం, సెలవులు లేకపోవడంతో శాంతిభద్రతల పర్యవేక్షణపై ప్రభావం చూపుతోంది. పోలీసు సిబ్బందికి ఆర్టీసీ సమ్మెకాలం నుంచి ఇప్పటి వరకు సెలవులు మంజూరుచేయడం లేదు. ఉన్న సిబ్బందిపైనే అదనపు పనిభారం పడుతోంది. కోర్టు డ్యూటీలు, రిసిప్షన్ విభాగాలకు పోనూ రక్షణ బాధ్యతలు నిర్వర్తించేందుకు అతి కొద్ది మందే మిగులుతున్నారు. రెచ్చిపోతున్న పోకిరీలు, అక్రమ వ్యాపారులు గ్రామాల్లో పోలీసుల పర్యవేక్షణ కరువవడంతో పోకిరీలు రెచి్చపోతున్నారు. గుట్కా, గంజాయి స్మగ్లర్లు సైతం ఇటీవల జిల్లాలోని మారుమూల ప్రాంతాలే లక్ష్యంగా వ్యాపారాలు చేస్తున్నారు. ఇటీవల నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి గుట్కా, గంజాయి వ్యాపారులు జిల్లాలోని మారుమూల గ్రామాలకు వచ్చి గంజాయి విక్రయిస్తున్న సంఘటనలు వెలుగుచూశాయి. అంతేకాకుండా హుక్కా కోసం యువకులు గ్రామ శివారు ప్రాంతాలను అడ్డాలుగా మార్చుకుంటున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. వీటన్నింటికీ పోలీస్ పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడమని అర్థమవుతుంది. ► మేడిపెల్లి పోలీస్‌స్టేషన్‌లో ఒక ఎస్సైతోపాటు ఇద్దరు ఏఎస్సైలు, ఒక హెడ్ కానిస్టేబుల్, 11 మంది హెడ్ కానిస్టేబుళ్లు మాత్రమే పనిచేస్తున్నారు. ఇందులోనూ ఒక ఏఎస్సై, ఐదుగురు కానిస్టేబుళ్లను డిప్యూటేషన్‌పై అటాచ్ చేశారు. దీంతో స్టేషన్లో పోలీసులే కరువయ్యారు. దీంతో వీపీవోలు గ్రామాలకు వెళ్లే పరిస్థితి లేదు. ► కొడిమ్యాల పీఎస్‌లో ఒక ఎస్సై, ఇద్దరు ఏఎస్సైలు, నలుగురు హెడ్కానిస్టేబుల్లు, 21 మంది పీసీలు పనిచేయాల్సి ఉండగా.. రెండు హెడ్‌కానిస్టేబుళ్లు, ఆరు కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మండలంలో ఉన్న 24 గ్రామాలకుగానూ 13 గ్రామాలకు మాత్రమే వీపీవోలు ఉన్నారు. మిగతా గ్రామాల్లోని శాంతిభద్రతల పరిస్థితిని ఇన్‌ఛార్జి వీపీవోలు చూసుకుంటున్నారు. ► కథలాపూర్ మండలంలో 19 గ్రామాలుండగా మూడు గ్రామాలకు కలిపి ఒక వీపీవోను నియమించారు. ఇక్కడ పోలీస్ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఠాణాలో 30 మంది పోలీస్ కానిస్టేబుళ్లకు గాను నలుగురు మాత్రమే ఉన్నారు. మూడు ఏఎస్సై పోస్టులకు గాను ముగ్గురు ఉన్నా, ఐదుగురు హెడ్‌కానిస్టేబుళ్లకు ఇద్దరే ఉన్నారు. ► సారంగాపూర్ మండలంలో మొత్తం 18 గ్రామాలు ఉన్నాయి. మండల ఠాణాలో ఎస్సై, ఇద్దరు ఏఎస్సైలు, నలుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, 22 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహించాలి. కానీ ప్రస్తుతం ఎస్సై, ఏఎస్సై, ఒక హెడ్‌కానిస్టేబుల్‌తోపాటు 15 మంది కానిస్టేబుళ్లు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో ప్రస్తుతం నలుగురు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. ఇందులో ఒకరు కరీంనగర్, ఇంకొకరు జగిత్యాల కోర్టు కానిస్టేబుల్, మరొకరు రైటర్‌గా పనిచేస్తుండగా, ఒకరు మాత్రమే స్టేషన్లో ఉంటున్నారు. మిగిలిన వారు వేర్వేరు చోట్ల డెప్యూటేషన్లపై విధులు నిర్వహిస్తున్నారు. ఉన్న వారిపైన అదనపు బాధ్యతలు పడడంతోపాటు వారికే మూడు, నాలుగు గ్రామాల బాధ్యతలు అప్పగిస్తున్నారు. వీపీవోలను పునరుద్ధరిస్తాం జిల్లాలోని పోలీస్ సిబ్బంది బదిలీలతో విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. పెరిగిన గ్రామపంచాయతీలకు అనుగుణంగా వీపీవోలను కేటాయిస్తాం. త్వరలోనే మళ్లీ వీపీవోల వ్యవస్థను పునరుద్ధరిస్తాం. – దక్షిణమూర్తి, అడిషనల్ ఎస్పీ, జగిత్యాల -
నకిలీ గల్ఫ్ ఏజెంట్‌పై పీడీయాక్ట్
గల్ఫ్‌కు పంపిస్తానని మోసం చేసిన మునుకుంట్ల వెంకటేశ్‌పై పీడీయాక్ట్ నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల మండలం యెకిన్‌పూర్ గ్రామానికి చెందిన మునుకుంట్ల వెంకటేశ్ గల్ఫ్ దే శాలకు పంపిస్తామని వీసాలు, ఉద్యోగాలు ఇస్తామని అమాయక ప్రజలు, నిరుద్యోగ యువత నుంచి భారీ మొత్తంలో వసూలు చేయడంతో పాటు అనేక నేరాలకు పాల్పడ్డాడు. గల్ఫ్ ఏజెంట్లు, గల్ఫ్ దేశాల వీసాల ప్రక్రియ, ఆన్లైన్ సేవల గురించి పరిజ్ఞానం కలిగిన వెంకటేశ్ నకిలీ వీసాలు, టికెట్లను సృష్టించి ధనవంతులైన వ్యక్తుల నుంచి, నిరుద్యోగ యువకుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేశాడు. జిల్లా పరిధిలో ఇతనిపై వ ఫ్రాడ్ కేసులు నమోదు అయ్యాయి. ఈక్రమంలో అతడిపై జగిత్యాల కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్భంద ఉత్తర్వులు చేశారు. దీంతో కరీంనగర్ జిల్లా జైలు అధికారి సమక్షంలో మల్యాల సీఐ నాగేందర్ పీడీ యాక్ట్ ఉత్తర్వులు అందజేశారు. పీడీయాక్ట్ నమోదు చేయడంలో కీలకపాత్ర పోషించిన మల్యాల సీఐ, ఎస్సై ఉపేందర్‌ను ఎస్పీ సింధూశ ర్మ అభినందించారు. గురువారం వెంకటేశ్‌ను కరీంనగర్ నుంచి వరంగల్ జైలుకు తరలించారు. -
నలుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్/ధర్మపురి/మాచారెడ్డి: రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వార్షిక పరీక్షల్లో ఫెయిల్‌కావడంతో మానసికంగా కుంగిపోయి బలవన్మరణాలకు పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు విద్యార్థినులున్నారు. ఆత్మహత్యకు పాల్పడినవారిలో జగిత్యాల జిల్లాలో ఇద్దరు, హైదరాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్కరు ఉన్నారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని వాసవీభువన అపార్ట్‌మెంట్స్‌లో నివసించే «ధనుంజయనాయుడు, విజయలక్ష్మి కుమారుడు ధర్మారాం(17) అమీర్‌పేట నారాయణ కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 18న వెలువడిన పరీక్షాఫలితాల్లో గణితంలో ఫెయిలయ్యాడు. మొబైల్‌ఫోన్, ఐప్యాడ్ వాడటం వల్లే చదువులో వెనుకబడిపోయావని, ఇక నుంచి వాటిని వాడవద్దని కుటుంబసభ్యులు అతడిని హెచ్చరించారు. కొద్దిసేపటికే ధర్మారాం అపార్ట్మెంట్ ఆరో అంతస్తు నుంచి కిందకు దూకాడు. రక్తమడుగులో ఉన్న అతడిని వెంటనే సోమాజిగూడ యశోదా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ధర్మారాం ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఎంపీ సీఎం రమేశ్ మేనల్లుడు. జగిత్యాల జిల్లాలో... జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం రాములపల్లికి చెందిన దొంతరవేని కొమురయ్య, భూదమ్మ దంపతులకు కుమారుడు ప్రశాంత్ (19)ను మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో సీఈసీ చదువుతున్నాడు. సెకండియర్‌లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెందిన ప్రశాంత్ శుక్రవారం బైక్‌పై ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. గ్రామశివారులోని చెట్టుకు ఉరేసుకున్నాడు. కుటుంబసభ్యులు వెతకగా శనివారం మృతదేహం లభించింది. అదే జిల్లా సారంగాపూర్ మండలం పోచంపేటకు చెందిన ఒడ్నాల భూమారెడ్డి కుమార్తె శివాని(17) జగిత్యాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. మూడు సబ్జెక్ట్‌ల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది శనివారం వేకువజామున ఇంట్లో ఉరేసుకుంది. కామారెడ్డి జిల్లాలో... కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో నివాసముంటున్న దేవాసత్ పంగి, రూప్లా కూతురు నీరజ(17) మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం (బైపీసీ) చదువుతోంది. బాటనీ సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకుంది. ఇంటర్ బోర్డుపై సమగ్ర విచారణ జరపాలి తెలంగాణ ఇంటర్ బోర్డు లీలలపై సమగ్ర విచారణ జరిపించి, నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మామిడికాయల పరశురాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బోర్డు తప్పిదాల ఫలితంగా మెరిట్ విద్యార్థులు ఫెయిల్ అయ్యారని, విద్యార్థుల భవిష్యత్తుతో ఇంటర్ బోర్డు ఆటలాడుకోవడం తగదన్నారు. మెరిట్ విద్యార్థులకు సైతం సున్నా మార్కులు రావడం ఆశ్చర్యకరమన్నారు. తప్పిదాలకు పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు చేపట్టి, నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విచారణ జరపకుండానే ఏలాంటి తప్పిదాలు జరగలేదని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆశోక్ నిర్లక్ష్య ధోరణితో సమాధానాలు చెప్పడం దురదృష్టకరమన్నారు. ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. -
బీభత్సం సృష్టించిన వడగళ్ల వాన
సాక్షి, కరీంనగర్: మండే ఎండలు ఒకవైపు.. అకాల వర్షాలు మరోవైపుతో తెలంగాణ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. అప్పటివరకూ ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమైన రైతన్నలకు అపారనష్టాన్ని కలగజేసింది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వరుసగా మూడోరోజు కూడా గాలివాన, వడగళ్లు పడడంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జిల్లాలోని మేడిపల్లి, మల్యాల, గన్నేవరం, బెజ్జంకి, కోహెడ మండల్లాలో వడగళ్ల వాన కురిసింది. గాలులు వీచడంతో జగిత్యాల, నిజామాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. అకాల వడగండ్ల వానతో పంటనష్టం సంభవించి నష్టపోయిన బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది .. ఆకాశం మేఘావృతమై…మబ్బులు కమ్ముకున్నాయి. మధ్యాహ్నం సమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వడగళ్ల వాన కురిసింది. హైదరాబాద్ నగరంలో నగరంలోని ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్‌లో భారీ వర్షం సంభవించింది. దీంతో పలుచోట్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. -
బస్సు ప్రమాదం: జగిత్యాల ఆస్పత్రి వద్ద తీవ్ర విషాదఛాయలు!
-
అప్డేట్స్: బస్సులో మొత్తం 101 మంది.. 60 మంది దుర్మరణం..!
సాక్షి, కొండగట్టు : జగిత్యాల జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయ ఘాట్ రోడ్డులో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఘోర రోడ్డు ప్రమాదంలో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 30పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 101 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారుల సమాచారం. సంఘటనా స్థలానికి బస్సు చేరుకునే సమయానికి కండక్టర్ 82 మందికి టికెట్ ఇచ్చారు. మిగతావారికి టికెట్ ఇవ్వాల్సి ఉంది. అంతలోపే ఈ ఘోరం జరిగిపోయింది. జగిత్యాల జిల్లా శనివారంపేట నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి.. కొండగట్టు ఘాట్ రోడ్డులోయలో పడిపోవడంతో ఈ ప్రదేశంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్... సాయంత్రం 5. 30 గంటలు: కొండగట్టు ఘాట్‌రోడ్డులో చోటుచేసుకున్న ఘోర బస్సుప్రమాదం కేసులో విచారణ ప్రారంభమైంది. ఈ ఘటన నేపథ్యంలో జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ హనుమంతరావుపై సస్పెన్షన్ వేటు వేశారు. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సాయంత్రం 5. 30 గంటలు: కొండగట్టు ఘాట్‌రోడ్డులో ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంఘటనాస్థలాన్ని ఆపద్ధర్మ మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, ఎంపీ కవిత పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలను అధికారులు వారికి వివరించారు. మృతుల కుటంబాలను ఆదుకుంటామని, గాయపడిన వారికి పూర్తి చికిత్స అందించడంతోపాటు అండగా ఉంటామని కేటీఆర్, మహేందర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. సాయంత్రం 5.30 గంటలు: కొండగట్టు బస్సుప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. The bus accident in Telangana’s Jagtial district is shocking beyond words. Anguished by the loss of lives. My thoughts and solidarity with the bereaved families. I pray that the injured recover quickly. — Narendra Modi (@narendramodi) 11 September 2018 సాయంత్రం 4.30 గంటలు: కొండగట్టు అంజన్న దర్శనానికి వెళ్లిన తమవారు.. రోడ్డుప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాలను తరలించిన జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణ బంధువుల రోదనలతో ఉద్విగ్నంగా మారిపోయింది. ఆస్పత్రి వద్ద తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. తమవారిని మృత్యువు కబళించడంతో.. అయినవారు, ఆత్మీయులు బంధువులు గుండెలు అవిసేలా విలపిస్తున్నారు. ఆస్పత్రి వద్ద మహిళలు గుండెలు బాదుకొని రోదిస్తున్న దృశ్యాలు చూపరులను సైతం కంటతడి పెట్టిస్తున్నాయి. కొండంత విషాదం.. ఎవరిది నిర్లక్ష్యం.. ఎన్నెన్నో ప్రశ్నలు.. చదవండి కొండగట్టు బస్సుప్రమాదంపై పూర్తి కథనాలు అంజన్న భక్తులకు విషాదం ఊపిరాడకపోవడం వల్లే ఎక్కువ మంది మృతి దేశంలో అతి పెద్ద బస్సు ప్రమాదాలు కొండగట్టు బస్సు ప్రమాదం; మృతుల వివరాలు బస్సు ప్రమాదం: అడ్డదారే కొంప ముంచింది! కొండగట్టు ప్రమాదం: డ్రైవర్ తప్పిదం వల్లే? సాయంత్రం 4 గంటలు: కొండగట్టు ఘాట్‌రోడ్డులో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘తెలంగాణలో జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు, గాయపడిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం క్షతగాత్రులను ఆదుకుంటోందని ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. ఈ ఘటనపై తెలుగులో, ఆంగ్లంలో ఆయన ట్వీట్ చేశారసు. తెలంగాణలో జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు మరియు గాయపడిన వారికి నా ప్రఘాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం క్షతగాత్రులను ఆదుకుంటోందని ఆశిస్తున్నాను. — President of India (@rashtrapatibhvn) 11 September 2018 Shocked to learn about the bus accident in Jagtial, Telangana. Thoughts with the bereaved families and those injured. I understand local authorities are making efforts to rescue and help passengers who have suffered #PresidentKovind — President of India (@rashtrapatibhvn) 11 September 2018 మధ్యాహ్నం 3.30 గంటలు: కొండగట్టు బస్సు ప్రమాదం పట్ల నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆమె కోరారు. మధ్యాహం 3 గంటలు: కొండగట్టు వద్ద బస్సు ప్రమాదంలో ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అరవింద్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, మరణించిన వారి కుటుంబాలకు ప్రకటించిన రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియాను వెంటనే అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాదంలో పసిపిల్లలు కూడా ఉన్నారని, గాయపడిన పిల్లలు అత్యవసరస్థితిలో ఉంటే ఆసుపత్రులు వారిని వెంటనే చేర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్షతగాత్రులు పేదవారైతే వారికి అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ తరఫున సహాయం అందిస్తామని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలు: జగిత్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్న మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత, మంత్రి మహేందర్‌రెడ్డి.. మరికాసేపట్లో హెలికాప్టర్లో వెళ్లనున్న నేతలు -
జగిత్యాలలో సీఎన్జీ సరఫరా హక్కులు ఐఓసీకి
న్యూఢిల్లీ: తెలంగాణలోని జగిత్యాలలో సీఎన్జీ సరఫరా లైసెన్స్ ఐఓసీకి దక్కింది. జగిత్యాలతో పాటు ఔరంగాబాద్(బిహర్), రేవా (మధ్య ప్రదేశ్)ల్లో ఈ కంపెనీ వాహనాలకు సీఎన్జీని, గృహాలకు పైపుల ద్వారా సీఎన్జీని సరఫరా చేసే హక్కులను పొందింది. పెట్రోలియమ్ అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్...48 నగరాల్లో సీఎన్జీ గ్యాస్ సరఫరా బిడ్ల వివరాలను వెల్లడించింది. అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ గ్యాస్‌కు 11 నగరాల్లో సీఎన్జీ సరఫరా లైసెన్స్‌లు లభించాయి. అలహాబాద్ సహా మొత్తం 11 నగరాల్లో సీఎన్జీని సరఫరా చేసే హక్కులను అదానీ గ్రూప్ సాధించింది. దీంట్లో ఆరు నగరాల్లో సొంతంగానూ, ఇతర నగరాల్లో ఐఓసీతో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్‌తో అదానీ సీఎన్జీని సరఫరా చేస్తుంది. బీపీసీఎల్‌కు చెందిన భారత్ గ్యాస్ రీసోర్సెస్ సంస్థకు ఆరు నగరాల్లో లైసెన్స్‌లు లభించాయి. టొరంట్ గ్యాస్ కంపెనీకి కూడా ఆరు నగరాల్లో గ్యాస్ సరఫరా చేయడానికి లైసెన్స్‌లు వచ్చాయి. గెయిల్‌కు చెందిన గెయిల్ గ్యాస్ మూడు నగరాల్లో గ్యాస్ రిటైలింగ్ లైసెన్స్‌లు పొందింది. -
ట్రిమ్మర్‌కు బదులు కండోమ్స్ ప్యాకెట్లు!
కోల్‌సిటీ(రామగుండం): ఆన్లైన్ సంస్థల మోసం మరోసారి వెలుగు చూసింది. గడ్డం గీసుకోవడానికి ఉపయోగించే ఎలక్ట్రిక్ షేవర్ (ట్రిమ్మర్) మిషన్ కోసం ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే... కస్టమర్‌కు కండోమ్ ప్యాకెట్లు పంపించిన విడ్డూరమైన సంఘటన గోదావరిఖనిలో ఆదివారం చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు... గోదావరిఖని లక్ష్మీనగర్‌లో ఎనగందుల శ్రీనివాస్ సెలూన్‌నిర్వహిస్తున్నాడు. కస్టమర్లకు మెరుగైన సేవలందించడం కోసం ఇటీవల ఎలక్ట్రిక్‌షేవర్ మిషన్ కొనుగోలు చేయాలని స్మార్ట్‌ఫోన్ ద్వారా ఓ ప్రముఖ ఆన్లైన్ కంపెనీలో ఆర్డర్ చేయడంతో పంపించారు. షేవర్‌ను వాడకముందే అది పని చేయలేదు. దీంతో ఆన్లైన్ సంస్థకు ఫిర్యాదు చేయడంతో, షేవర్‌ను స్వాధీనం చేసుకొని డబ్బులు తిరిగి పంపించారు. సదరు కంపెనీపై నమ్మకం ఏర్పడడంతో ఈనెల 11న మరో షేవర్ మిషన్ కొనుగోలుకు అదే సంస్థకు ఆర్డర్ ఇచ్చారు. ఆదివారం కొరియర్ బాయ్ ఇంటికి వచ్చి పార్సిల్ ఇచ్చాడు. తీరా దాన్ని తెరిచి చూడగా దాంట్లో కండోమ్ ప్యాకెట్లు కనిపించాయి. విస్తూపోయిన బాధితుడు హుటాహుటిన సదరు కొరియర్ కార్యాలయానికి వెళ్లి నిలదీశాడు. తమకు సంబంధం లేదని, ఆర్డర్ ఇచ్చిన ఆన్లైన్ సంస్థకే ఫిర్యాదు చేయాలని చెప్పి తప్పించుకున్నారు. దీంతో సదరు సంస్థకు ఆన్లైన్లో ఫిర్యాదు చేయడంతో, ఆర్డర్ చేసిన వస్తువుకు మరోసారి పరిశీలించి పంపిస్తామని అప్పటి వరకు డబ్బులు తిరిగి ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. కస్టమర్ చేతికి రిటన్ ఆర్డర్‌గా బుక్ చేసిన షేవింగ్ మిషన్ పార్సిల్ వచ్చాక, కండోమ్ ప్యాకెట్లను తిరిగి పంపించాలని సంస్థ ప్రతినిధులు సూచించారని బాధితుడు తెలిపాడు. తక్కవ ధరలో లభిస్తున్నాయనే ఆశతో ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇలాంటి మోసాలే జరుగుతాయని పలువురు వెల్లడిస్తున్నారు. అయితే ఇలాంటి మోసాలపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. -
చేయని నేరానికి శిక్ష
కోండ్ర సుబ్బారెడ్డి, సారంగాపూర్ (జగిత్యాల జిల్లా): రెక్కాడితే డొక్కాడని కుటుంబం అది. ఉన్న కొద్దిపాటి భూమిని తల్లిదండ్రులు సాగు చేస్తుండగా.. వారి ఇద్దరి కొడుకులు జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లారు. అయితే, పెద్ద కుమారుడు చేయని నేరానికి శిక్ష అనుభవి స్తున్నాడు. రెండున్నర నెలలుగా దుబాయ్ జైళ్లో మగ్గుతున్నాడు. జైలు నుంచి తన కొడుకును విడిపించాలని ఆ యువకుడి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పోతారం గ్రామానికి చెందిన గుర్రం రాజేశం, లక్ష్మీలకు ఇద్దరు కుమారులు. వీరికి ఉన్న ఎక రం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా.. పెద్దకుమారుడు శ్రీనివాస్, చిన్న కుమారుడు మహేష్ జీవనోపాధి కోసం గల్ఫ్ వెళ్లివస్తున్నారు. పెద్ద కొడుకు శ్రీనివాస్‌కు మూడు సంవత్సరాల క్రితం లావణ్యతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. శ్రీనివాస్ రెండు సంవత్సరాల క్రితం దుబాయ్ వెళ్లి కొద్ది రోజులకు తిరిగి వచ్చాడు. ఆ తర్వాత ఆరునెలల క్రితం మస్కట్‌కు కంపెనీ వీసా మీద వెళ్లాడు. అదే కంపెనీలో పనిచేస్తుండగా.. బంగ్లా దేశ్‌కు చెందిన కొంత మంది తమకు మద్యం తీసుకురావాలని శ్రీనివాస్‌కు సూచిం చడంతో శ్రీనివాస్ వారికి మద్యం తీసుకవచ్చి ఇచ్చాడు. అయితే వ్యక్తిగత కక్షలు మనసులో పెట్టుకున్న బం గ్లాదేశ్ యువకులు శ్రీనివాస్‌కు మద్యం తీసు కవచ్చిన డబ్బులు చేతికి ఇస్తూనే ఆ డబ్బుల్లో డ్రగ్స్ ప్యాకెట్‌ను ఉంచారు. శ్రీనివాస్ వద్ద డ్రగ్స్ ప్యాకెట్లు ఉన్నాయని పథకం ప్రకారం అక్కడి పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు వచ్చి శ్రీనివాస్ వద్ద డ్రగ్స్ ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకొని అతడిని అరెస్టు చేశారు. రెండున్నర నెలలుగా శ్రీనివాస్ జైల్లో ఉన్నాడు. తనకు బయటకు తీసుకురావాలని అక్కడి నుంచి శ్రీనివాస్ రెండు రోజులకోసారి ఫోన్‌చేస్తూ రోదిస్తుండడంతో.. ఇక్కడ తల్లి లక్ష్మీ, తండ్రి రాజేశం, భార్య లావణ్య కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ విషయంపై స్థానిక నాయకుల సహాయంతో రాజేశం ఎంపీ కవితను కలిసి తమ కొడుకును స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. కుటుంబ సభ్యులంతా శ్రీనివాస్ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. -
తండ్రిని హత్య చేశాడని పగతో భర్తను చంపేసిన భార్య
-
డీఎన్ఏ కలిపింది ఇద్దరినీ..
జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గతనెల 21న శిశువుల మార్పిడి జరిగిందనే అనుమానాలు నిజమయ్యాయి. 15 రోజుల అనంతరం డీఎన్ఏ రిపోర్ట్లు రావడంతో బుధవారం ఎవరి శిశువులను వారికి అప్పగించారు. ఈ ఘటనపై జాయింట్ కలెక్టర్ రాజేశం, ఆర్డీవో నరేందర్ విచారణ చేపట్టారు. బాధ్యులైన నలుగురిపై సస్పెన్షన్‌కు ఆదేశించారు. బుగ్గారం మండలం మద్దునూర్‌కు చెందిన బొంగురాల చామంతి గతనెల 19న జగిత్యాల ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అదే సమయంలో మేడిపల్లి మండలం కొండాపూర్‌కు చెందిన ఎర్ర రజిత సైతం మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. సిబ్బంది నిర్లక్ష్యంతో కవల పిల్లలంటూ ఇద్దరు శిశువులను రజిత కుటుంబసభ్యులకు అప్పగించారు. చామంతి కుటుంబ సభ్యులు తమ బిడ్డ ఏడని నిలదీయడంతో పొరపాటును గుర్తించిన సిబ్బంది.. వెంటనే రజిత వద్దనున్న రెండో బిడ్డను తీసుకొచ్చి వీరికి అందజేశారు. ఈ శిశువు తమ బిడ్డ కాదంటూ చామంతి కుటుంబ సభ్యులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో వైద్యసిబ్బంది డీఎన్ఏ రిపోర్ట్ తీసుకుంటే ఎవరి బిడ్డ అనేది తెలుస్తుందని తేల్చారు. ఈ క్రమంలో జూన్ 2న రిపోర్ట్లు వచ్చాయి. సదరు ఆస్పత్రి సిబ్బంది మళ్లీ తప్పు చేశారు. శిశువుల మార్పిడి జరగలేదని పేర్కొన్నారు. అయితే.. చామంతి, మహేందర్ దంపతులకు మొదటి నుంచీ అనుమానాలు ఉండటంతో వారు కలెక్టర్ శరత్‌ను కలసి మొర పెట్టుకున్నారు. దీంతో ఆయన సమస్య పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్‌ను విచారణ అధికారిగా నియమించారు. జేసీ సమక్షంలో మళ్లీ శాంపిల్స్ తీసుకుని పంపించడంతో మంగళవారం రిపోర్ట్లు వచ్చాయి. శిశు మార్పిడి జరిగింది వాస్తవమేనని తేలింది. ఇరువురు దంపతులను ఆసుపత్రికి పిలిపించి.. ఎవరి బిడ్డలను వారికి అందించారు. కాగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డుబాయి, ఆయాతోపాటు నర్సు, సూపరింటెండెంట్లపై చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. తల్లిదండ్రుల్లో ఆనందం మద్దునూర్‌కు చెందిన బొంగురాల మహేందర్, చామంతి దంపతులు మాట్లాడుతూ మొదటి నుంచీ శిశుమార్పిడి జరిగిందని చెబుతున్నామని, డాక్టర్లు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. 15 రోజుల పాటు ఇంటికి వెళ్లకుండా ఆస్పత్రిలోనే ఉన్నామని, ఉన్న పొలాన్ని కుదవపెట్టి డీఎన్ఏ రిపోర్ట్ కోసం రూ.21 వేలు ఖర్చు చేశామని పేర్కొన్నారు. మరో రూ.9 వేల వరకు శిశువు చికిత్స కోసం వెచ్చించామని తెలిపారు. డీఎన్ఏ రిపోర్ట్ కోసం ఇచ్చిన డబ్బులను ఇవ్వాలని చామంతి కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. రెండు, మూడు రోజుల్లోగా ఖర్చులు ఇచ్చేలా చూస్తామని సూపరింటెండెంట్ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. సూపరింటెండెంట్ సమక్షంలో శిశువులను మార్చుకుంటున్న తల్లిదండ్రులు -
జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా కవిత పోటీ ?
-
అంజనీపుత్రుడిని దర్శించుకున్న పవన్
సాక్షి, కొండగట్టు(జగిత్యాల) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌కల్యాణ్ సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి రూ. 11 లక్షల నగదును విరాళంగా అందజేశారు. రాజకీయ యాత్రను ఆరంభించబోయే ముందు కొండగట్టులో వెలసిన అంజనీపుత్రుడిని దర్శించుకుంటానని పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి 50 కార్ల భారీ కాన్వాయ్‌తో కొండగట్టు చేరుకున్న పవన్‌కు అభిమానులు, జనసేన కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం పవన్ కరీంనగర్ చేరుకున్నారు. సాయంత్రం రాజకీయ యాత్రపై మీడియాతో మాట్లాడనున్నారు. -
సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు
సాక్షి, జగిత్యాల: పంటలకు సాగునీరు అందించాలని కోరుతూ జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి రైతులు కోరుట్ల-జగిత్యాల రహదారిపై మంగళవారం ఉదయం రాస్తారోకో నిర్వహించారు. శ్రీరామ్‌సాగర్ కాలువకింద ఉన్న తమ భూములకు నీరందక పంటలు ఎండిపోతున్నాయని, తమ విద్యుత్ మోటార్ల కనెక్షన్లను విద్యుత్ అధికారులు తొలగించారని వారు ఆరోపిస్తున్నారు. ఎస్సారెస్పీ నీళ్లు తమ పంటలకు అందకుండా అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వారు అన్నారు. రహదారిపై రైతులు భైఠాయించడంతో వాహనాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. దాంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తాటిపల్లి రైతుల ఆందోళనకు జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మద్దతు ప్రకటించారు. విద్యుత్ మోటార్లకు కనెక్షన్ పునరుద్ధరించి సాగునీరు ఇచ్చేంతవరకూ ఆందోళన విరమించేది లేదని వారు స్పష్టంచేశారు. -
జగిత్యాల ప్రజావాణిలో కలకలం
సాక్షి, జగిత్యాల: జగిత్యాల ప్రజావాణిలో సోమవారం కలకలం రేగింది. తండ్రి ఆస్తిని తనపేర విరాసత్ చేయడానికి రెవెన్యూ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తూ దంపతులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. రెవెన్యూ అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని, పైగా భారీ మొత్తం డబ్బులు లంచంగా డిమాండ్ చేస్తున్నారని ఎండి మౌలా అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. మౌలా దంపతులు సోమవారం ఉదయం జగిత్యాలకు వచ్చి రెవెన్యూ కార్యాలయం ఎదుట ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన స్థానికులు, అధికారులు వెంటనే వారి వద్దకు వెళ్ళి వారించారు. వారిని ప్రజావాణి నిర్వహిస్తున్న అధికారుల వద్దకు తీసుకెళ్ళారు. సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. -
ఎస్సారెస్పీ నీటి కోసం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ధర్నా
సాక్షి, జగిత్యాల: తిప్పనపేట గ్రామానికి చెందిన పంటపొలాలకు ఎస్ఆర్ఎస్పి నీళ్లు అందడంలేదని నీటిపారుదల శాఖ కార్యాలయం ముందు రైతులతో కలిసి ఎమ్మెల్యే టి. జీవన్ రెడ్డి మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ఎస్సారెస్పీ అధికారులకు నీటి విడుదలపై కార్యాచరణ లేదన్నారు. అలాగే చివరి ఆయకట్టుకు నీరందించే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. అంతేగాక సింగూర్ నుంచి నీళ్ళు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని, మిడ్ మానేరుకు 14 టీఎంసీల నీళ్లు ఎలా ఇస్తారో చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. భారీ సంఖ్యలో హాజరైన రైతులు నీటిపారుదలశాఖ ఈఈ దరూర్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. -
ప్రేమజంటను బెదిరించి అత్యాచారం
సాక్షి, జగిత్యాల : జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ జంటను బెదిరించిన ముగ్గురు యువకులు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత యువతి కుటుంబసభ్యులకు జరిగిన దారుణాన్ని వివరించడంతో వారు యువకులకు దేహశుద్ధి చేశారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది. -
విద్యుత్ అధికారుల నిర్బంధం
సాక్షి, కథలాపూర్ : విద్యుత్ బిల్లులు చెల్లించలేదని విద్యుత్ సరఫరా నిలిపివేడంతో ఆగ్రహించిన రైతులు విద్యుత్ అధికారులను గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషన్‌రావుపేటలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వ్యవసాయానికి కరెంట్ సరఫరా నిలిపివేయడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించమని ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోలేదు. ఆదివారం ఉదయం బిల్లుల వసూలుకు వచ్చిన విద్యుత్ అధికారులను గ్రామస్తులు చుట్టుముట్టి పంచాయతీ కార్యాలయంలో వారిని నిర్బంధించారు. -
పిల్లలు కాదు.. పిడుగులు!
సాక్షి, జగిత్యాల: వారు వివిధ పాఠశాలలకు చెందిన పదో తరగతి విద్యార్థులు.. ఐదొందల మందికి పైగా ఒకే చోటుకు చేరారు. ఒకరి తర్వాత ఇంకొకరు అధికారులపై ప్రశ్నలవర్షం కురిపించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నల తీరును చూసి సమాధానం ఇవ్వలేక జిల్లాస్థాయి అధికారులే తడబడ్డారు. విద్యార్థినులు సమాజంలో బాలికల వివక్షపై ప్రశ్నల వర్షం కురిపిస్తే.. విద్యార్థులు విద్యాహక్కుపై ప్రశ్నించారు. సుమారు గంటసేపు పలు రకాల ప్రశ్నలతో వివిధశాఖల జిల్లాస్థాయి అధికారులకు ముచ్చెమటలు పట్టించారు. దీంతో కార్యక్రమం పూర్తయ్యేంత వరకు అధికారులందరూ నిలబడే ఉన్నారు. విద్యార్థులు అడుగుతున్న ప్రశ్నల తీరును చూసి అక్కడున్న వారంతా చూసి నివ్వెరపోయారు. చివరకు అధికారులు.. ‘వెరీ గుడ్ క్వశ్చన్స్.. చాలా బాగా వేశారు..’అంటూ విద్యార్థులను ప్రశంసించారు. దీనికి జగిత్యాల జిల్లా కేంద్రంలోని వాసవీకల్యాణ మండపం వేదికైంది. బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా గురువారం బాలల అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించారు. మెట్పల్లి సబ్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారిని సుగంధిని, ఉప వైద్యాధికారి జైపాల్, ఎంఈవో నారాయణ, సీడీపీవోలు అరవింద, విజయలక్ష్మి తదితరులున్నారు. విద్యార్థులు, సబ్‌కలెక్టర్ మధ్య జరిగిన సంభాషణ ఇలా.. విద్యార్థి: భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్స్ పాఠశాల లకు సరఫరా అవుతుంటే మీరేం చేస్తున్నారు..? సబ్ కలెక్టర్: మీ స్కూళ్లకు డ్రగ్స్ వస్తే మాకు సమాచారం ఇవ్వండి. చర్యలు తీసుకుంటాం. విద్యార్థి: సమాజం ఆడపిల్లల్ని చిన్నచూపు చూస్తోంది. గ్రామాల్లో చదువుకునే హక్కు కల్పించడంలేదు. దీనికి మీరేం చర్యలు తీసుకుంటున్నారు.? సబ్‌కలెక్టర్: గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థినుల కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు.. కేజీబీవీలు ప్రభుత్వం ఏర్పాటుచేసింది. వీటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి దాటవేశారు. విద్యార్థి: సర్.. ఆడపిల్ల అనగానే చిన్నచూపు చూసి కడుపులోనే చంపేస్తున్నారు.? సబ్‌కలెక్టర్: భ్రూణహత్యలకు పాల్పడటం పెద్ద నేరం. అది ఏ ఆస్పత్రో మా దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటాం. విద్యార్థి: మా ఊర్లో చిన్న పిల్లలు స్కూలుకు వెళ్లకుం డా పనులు చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు ? సబ్‌కలెక్టర్ : మీది ఏ ఊరమ్మా..? చిన్నపిల్లల్ని ఎక్కడ పని చేయిస్తున్నారు.? (విద్యార్థిని రాజారాం గ్రామం అని చెప్పగా. వెంటనే జగిత్యాల ఎంఈవో, ఐసీడీఏస్ అధికారులను చర్యలకు ఆదేశించారు.) విద్యార్థి: ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు విపరీతంగా వసూలు చేస్తున్నారు. మీరేం చర్యలు తీసుకుంటున్నారు..? సబ్ కలెక్టర్: ప్రభుత్వ స్కూళ్లలో అన్ని రకాల సదుపాయాలున్నాయి. వాటిని వదిలి ప్రైవేట్ స్కూళ్లకు ఎందుకు వెళ్తున్నారు.? విద్యార్థి: సర్.. స్వచ్ఛ భారత్ అని గొప్పగా చెప్తారు. కానీ మా పాఠశాలలో ఇప్పటి వరకు టాయిలెట్లు లేవు.? సబ్ కలెక్టర్: (పాఠశాల వివరాలు అడిగి తెలుసుకున్న తర్వాత) అమ్మా.. నువ్వు నా డివిజన్ పరిధిలోని వెంకట్రావ్పేట స్కూళ్లోనే చదువుతున్నావు. నేను రేపే మీ స్కూలుకు వస్తా. సమస్యను పరిష్కరిస్తా. -
సర్కార్ బడి సక్సెస్..మూతపడ్డ ప్రైవేట్ స్కూల్స్
-
సామాన్యుడి వినూత్న ఐడియాలు
-
అతని కోసం ఆమె.. ఆమె కోసం అతను!
ఒకరిని విడిచి ఒకరు ఉండలేక ప్రాణాలు విడిచిన వైనం ప్రేమ త్యాగాన్ని కోరుకుంటోంది. కానీ జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం పోరుమల్లా గ్రామంలో ప్రాణాలను కోరింది. పొరుమల్ల గ్రామానికి చెందిన కుంట రాజశేఖర్, పక్క గ్రామానికి చెందిన యువతి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇద్దరిదీ ఒకటే సామాజికవర్గం కావడంతో...పెళ్లికి ఒప్పుకుంటారని భావించారు. కానీ అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఆస్తి లేదని దూరం పెట్టారు. దీంతో పరువుగా ఫీలైన రాజశేఖర్ ....డబ్బు సంపాదన కోసం గల్ఫ్ వెళ్లాడు. ఈ క్రమంలో యువతిపై తల్లిదండ్రులు పెళ్లి ఒత్తిడి తెచ్చారు. తాము చూపించిన అబ్బాయిని చేసుకోవాలని కోరారు. దీంతో వలచిన ప్రియుడ్ని మరవలేక....తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకోలేక...ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ప్రియురాలు లేదని తెలిసిన రాజశేఖర్ 2 నెలల కిందట.. గల్ఫ్‌లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అతని మృతదేహాం శనివారం స్వగ్రామానికి చేరడంతో.. బాధిత కుటుంబంలో రోదనలు మిన్నంటాయి. -
రద్దయిన పాత నోట్లతో పట్టుబడ్డ ముఠా
-
హంతకుడికి జీవితఖైదు
జగిత్యాల కోర్టు సంచలన తీర్పు జగిత్యాల: హత్య కేసులో నిందితుడికి జీవితఖైదు విధిస్తూ జగిత్యాల జిల్లా రెండో అదనపు కోర్టు న్యాయమూర్తి పి.రంజన్‌కుమార్ గురువారం సంచలన తీర్పుచెప్పారు. సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాంబశివరెడ్డి కథనం ప్రకారం.. మెదక్ జిల్లా జిన్నారం మండలం అన్నారం గ్రామానికి చెందిన మోతె పుల్లయ్య ఉపాధి కోసం 20 ఏళ్ల క్రితం తన కుటుంబంతో కలిసి మెట్పల్లి మండలం మెట్లచిట్టాపూర్ అనుబంధ గ్రామమైన విట్టంపేటకు వచ్చాడు. ఈయనకు కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు మోతె బంగారం గ్రామంలో 7వ తరగతి వరకు చదివాడు. ఉపాధి కోసం చూస్తుండగా విట్టంపేట గ్రామానికి చెందిన ఆరెల్ల చిన్నరాజగౌడ్ మెట్పల్లి–కమ్మర్పల్లి రోడ్డులో సత్తక్కపల్లె శివారులో శివ హోట్‌ల్ పేరుతో దాబా ఏర్పాటు చేశాడు. ఈ హోటల్లో బంగారం సర్వర్‌గా చేరాడు. ఇదే హోటల్లో ప్రస్తుతం మెట్పల్లి మండలం కోనారావుపేట గ్రామానికి చెందిన బండ్ల దేవదాసు సైతం సర్వర్‌గా పనిచేసేవాడు. 2015, ఏప్రిల్ 14వ తేదీ రాత్రి 10 గంటల వరకు హోటల్లో పనిచేసిన ఇద్దరూ అక్కడే పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం హోటల్ యజమాని రాజగౌడ్ వచ్చి చూసేసరికి బంగారం తల హోటల్ వెనుకభాగంలో, మొండెం హోటల్ సమీపంలో పడి ఉంది. బంగారం యువకుడితో ఆ రోజు హోటల్లో పడుకున్న బండ్ల దేవదాసు కనిపించకుండా పోయాడు. దీంతో యజమాని బంగారం తల్లితండ్రులకు విషయం తెలుపగా, సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం, మృతుడి తండ్రి మోతె పుల్లయ్య ఫిర్యాదు మేరకు అప్పటి ఇబ్రహీంపట్నం ఎస్సై రాజిరెడ్డి కేసు నమోదు చేసుకోగా, అప్పటి మెట్పల్లి సీఐలు కె.రాజశేఖర్ రాజు, వి.సురేందర్ విచారణ చేశారు. విచారణలో దేవదాసే నిందితుడని, ఇద్దరి మధ్య ఏర్పడ్డ చిన్నపాటి వివాదం తలెత్తడంతో ఓ పదునైన కత్తితో హత్య చేసి, తల, మొండెం వేరుచేశాడని నిర్ధారించారు. దీంతో, పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో చార్జిషీట్దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్ అధికారి సత్యనారయణ, హెడ్ కానిస్టేబుల్ రవీందర్‌రెడ్డి 11 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. సాక్షులను విచారించిన అనంతరం, నిందితుడు బండ్ల దేవదాసుకు జీవితఖైదుశిక్షతోపాటు రూ.100 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
ఆ సంఘటన దురదృష్టకరం : ఉత్తమ్
హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం రోజు జగిత్యాలలో జరిగిన సంఘటన దురదృష్టకరమని.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన ఆదివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సెక్యులర్ దేశంలో మతశక్తులను ప్రోత్సహించడం సరికాదన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో గణతంత్ర దినోత్సవం రోజు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు జెండాలతో సహా పాల్గొనడం దీనికి జిల్లా కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించడం విస్మయానికి గురిచేసిందన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో అర్థం కావడం లేదన్నారు. దీనికి కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతికి లేఖ రాశామన్నారు. గణతంత్ర దినోత్సవం రోజు ఓ కలెక్టర్ ప్రభుత్వాన్ని పొగుడుతూ మాట్లాడడం.. మరో కలెక్టర్ ఎంపీ కవిత కాళ్ల దగ్గర కూర్చోవడం సిగ్గుచేట్టన్నారు. -
ప్రశాంతంగా నవోదయ పరీక్ష
కోరుట్ల / కోరుట్ల టౌన్/ మల్యాల/మెట్పల్లి: నవోదయ పరీక్షలు ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. జగిత్యాలలోని మూడు పరీక్ష కేంద్రాల్లో 1080 మందికి గాను 1024 మంది, కోరుట్లలో రెండు పరీక్ష కేంద్రాల్లో 377 మందికి గాను 366 మంది, మెట్పల్లిలో రెండు పరీక్ష కేంద్రాల్లో 595 మంది విద్యార్థులకు గాను 545 మంది పరీక్షలు రాశారు. ఉదయం 11.30 నుంచి మ«ధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు జరిగాయి. పరీక్ష కేంద్రాలను నవోదయ అబ్జర్వర్ మంగతాయారు, డీఈవో వెంకటేశ్వర్లు సందర్శించారు. -
చెంబు.. ముంత ఛీ.. ఛీ..!
సంపూర్ణ మరుగుదొడ్ల జిల్లా కోసం కలెక్టర్ ప్రత్యేక ప్రణాళిక ఇప్పటికే 36/820 మరుగుదొడ్ల నిర్మాణాలతో రికార్డు గణతంత్ర దినోత్సవం రోజు స్వచ్ఛ జగిత్యాల’ ప్రకటన ముందుకొస్తున్న లబ్ధిదారులు జగిత్యాల : చెంబు.. ముంత.. ఛీ.. ఛీ..! ఇది వింటేనే ఏదో వింతగా ఉందని కదూ..! రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా.. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ శ్రీకారం చుట్టిన ప్రత్యేక కార్యక్రమమిది. ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించుకునేలా.. ప్రజలను చైతన్యవంతుల్ని చేయడం ద్వారా సంపూర్ణ మరుగుదొడ్లు కలిగిన జిల్లాగా జగిత్యాలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారాయన. ఇప్పటికే గత నెల 27 ఉదయం 8:20గంటల నుంచి 28వ తేదీ రాత్రి 8:20 (36గంటలు) లోపు జిల్లా పరిధిలోని ఓబుళాపూర్ (మల్లాపూర్)లో 200, నడికుడ (మల్లాపూర్)లో 130, భూపతిపూర్ (రాయికల్)లో 200, అంతర్గాం (జగిత్యాల)లో 100, వెంగళాయిపేట (పెగడపల్లి)లో 190 చొప్పున మొత్తం 820 మరుగుదొడ్లు నిర్మించి దేశంలోనే రికార్డు సాధించారు. ఇప్పుడు ఇదే స్ఫూర్తితో జిల్లావ్యాప్తంగా.. అన్ని ఇళ్లలో మరుగుదొడ్డు నిర్మించుకునేలా ప్రజలను చైతన్యపరుస్తున్నారు. అన్ని మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తూ.. క్షేత్రస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షలు.. సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో ‘ ఇంకా చెంబు.. ముంతతోనా.. ఛీ.. ఛీ.. సిగ్గు.. సిగ్గు..’ అనే వినూత్న పోస్టర్‌ను విడుదల చే శారు. వీటిని అన్ని గ్రామాల్లో అంటించారు. దీంతో ఇప్పటి వరకు మరుగుదొడ్లు నిర్మించుకోని లబ్ధిదారులు ఈ పోస్టర్లు చదివి ప్రేరేపితులవుతున్నారు. ఈ పోస్టర్లో బహిర్భూమికి ఆరుబయటకు వెళ్తే తలెత్తే బాధలు.. వచ్చే సమస్యలను స్పష్టంగా పేర్కొన్నారు. విషపురుగులతో ప్రమాదం.. వృద్ధులు, వికలాంగులకు, గర్భిణులకు వచ్చే కష్టం, పరిసరాల దుర్గంధం, తినే ఆహారం, నీరు కలుషితం, వర్షాకాలంలో వచ్చే ఇబ్బందులు అన్నింటి కంటే ముఖ్యంగా మహిళల పరువు ప్రతిష్టలకు భంగం కలగడం వంటి ఈ పోస్టర్‌ను విడుదలచేశారు. వీటì విముక్తి కోసం.. మరుగుదొడ్డి నిర్మించుకుందాం అనే నినాదంతో ఆవిష్కరించిన పోస్టర్‌తో ప్రజలు స్వచ్ఛదంగా ముందుకొస్తున్నారు. ఇదీ కార్యక్రమం.. జిల్లాలో 2,53,619 ఇళ్లు ఉన్నాయి. జిల్లా అవతరించేనాటికి 59,179 ఇళ్లకు మరుగుదొడ్లు లేవు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వకరు 28వేల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది. 22వేల నిర్మాణాలు ముగింపు దశలో ఉన్నాయి. 10 వేల మరుగుదొడ్ల నిర్మాణాలు పునాదుల దశలో ఉన్నాయి. వచ్చే 19 రోజుల్లోగా 32 వేల ని ర్మాణాలు పూర్తి చేయాలని అధికార యంత్రాంగం పూ నుకుంది. ఈనెల 26.. రిపబ్లిక్‌డే వేడుకల్లో .. సంపూర్ణ మరుగుదొడ్లు కలిగిన జిల్లా ప్రకటించాలని అధికారు లు, ప్రజాప్రతినిధులు నిర్ణయం తీసుకున్నారు. గడువులోగా నిర్మాణాలన్నీ పూర్తి చేసే దిశగా.. కలెక్టర్ పం చాయతీ వార్డుల మొదలు.. పట్టణాల వరకు అధికారులకు పర్యవేక్షణ బాద్యతలు అప్పగించారు. జిల్లా అధికారులను మండలాలకు ఇన్ఛార్జీలుగా నియమించిన కలెక్టర్.. మండల స్థాయి అధికారులను గ్రామ పంచాయతీలకు, గ్రామ స్థాయి అధికారులను వార్డులు, ఆవాసా ప్రాంతాలకు ఇన్ఛార్జీలుగా నియమించారు. అలాగే.. జిల్లా నుంచి గ్రామీణ స్ధాయి వరకు ఉన్న స్వచ్చంద సంస్థలు... స్వయం సహాయక సంఘాలు, ప్రేరక్‌ల సేవలూ వినియోగించుకుంటున్నారు. పెరిగిన పోటీ.. స్వచ్ఛ గ్రామం.. స్వచ్ఛ మండలం.. స్వచ్ఛ జగిత్యాల లక్ష్యంతో జిల్లాలో ఉద్యమంలా జరుగుతోన్న మరుగుదొడ్ల నిర్మాణాల విషయంలో జిల్లాలో స్థానిక ప్రజాప్రతినిధుల మధ్యా పోటీతత్వం పెరిగింది. అధికారుల సమీక్షలు, సమావేశాలతో పాటూ స్థానిక ప్రజాప్రతినిధులూ తమ ప్రాంతాల్లో సాధ్యమైన ంత త్వరగా నూరుశాతం మరుగుదొడ్డ నిర్మాణాలు పూర్తి చేసేలా ^è ర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ తన నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో విస్తృతంగా పర్యటించి సమీక్ష, సమావేశా లు సైతం నిర్వహించారు. ఈ నెల రెండో తేదిన.. వెల్గటూరులో సమీక్ష నిర్వహించిన ఆయన మరో ఎనిమిది రోజుల్లో వంద శాతం మరుగుదొడ్లు నిర్మించి.. సం పూర్ణ పారిశుద్ద్య మండలంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులను ఆదేశించారు. జిల్లాలోని స్థానిక ప్రజాప్రతినిధులు సైతం ఇదే పోటీతో తమ తమ ప్రాంతాల్లో పని చేస్తున్నారు. -
మరిచిపోలేని ఏడాది
కొత్తగా జిల్లా..డివిజన్ ఏర్పాటు కోరుట్ల/జగిత్యాల : 2016..పరిపాలన పరమైన పెనుమార్పులకు జీవం పోసిన ఏడాదిగా నిలిచింది. కొత్త జిల్లా..డివిజన్..మండలాల ఏర్పాటుతో పాత జగిత్యాల డివిజన్ వాసులకు మరవలేని మధురక్షణాలను అందించింది. సుదూరంగా ఉన్న పాలనను అందుబాటులోకి తెచ్చింది. ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం ప్రతీ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వెసులుబాటు దక్కింది. దసరా సంబరాల్లోనే కొత్త జిల్లా ఏర్పాటు ఉత్సాహాన్ని నింపింది. కొత్త జిల్లా..డివిజన్..మండలాలు టీఆర్ఎస్ సర్కార్ మేనిఫెస్టోకు అనుగుణంగా ఏడాది కాలంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తులు చేసింది. చివరకు అంతా ఊహించిన రీతిలోనే జిల్లాగా పురుడుపోసుకుంది. జగిత్యాల జిల్లాను డెప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎంపీ కవితలు దసరా రోజున ప్రారంభించారు. జిల్లా మొత్తం 18 మండలాలతో రెండు రెవెన్యూ డివిజన్లతో రూపుదిద్దుకుంది. నూతనంగా జగిత్యాల అర్బన్, బీర్పూర్, బుగ్గారం మండలాలు ఏర్పడ్డాయి. మూడు మున్సిపాలిటీలతో జగిత్యాల అతిపెద్ద జిల్లా కేంద్రంగా ఏర్పడింది. జనాభాలో 10 లక్షలతో 3044.23 విస్తీర్ణంతో జగిత్యాల జిల్లాగా ఆవిర్భవించింది. జిల్లాలో కొండగట్టు ఆలయంతో పాటు ధర్మపురి ఆలయం చేరింది. 50 కి.మీ పరిధిలో కరీంనగర్ జిల్లా విడిపోయి జగిత్యాల జిల్లాగా అన్ని మండలాలకు దగ్గరగా చేరుకుంది. కొత్తగా ఏర్పడిన జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల సేవలు అందుబాటులోకి వచ్చాయి. కొత్త జగిత్యాల జిల్లా కేంద్రానికి చేరడానికి ఏ మండలం నుంచి అయినా కేవలం 40 కిలో మీటర్లు ప్రయాణిస్తే సరిపోతుంది. ఇంతకు ముందు కరీంనగర్ జిల్లా కేంద్రానికి చేరుకోవడాని ధర్మపురి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ వంటి దూరంగా ఉన్న మండలాల ప్రజలు ఎంత తక్కువ అనుకున్నా 120 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. గతంలో ఉన్న జగిత్యాల డివిజన్లోని 14 మండలాల్లో అక్కడక్కడ ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ల మేరకు మరో నాలుగు మండలాలు బీర్పూర్, బుగ్గారం, జగిత్యాల రూరల్ మండలాలు ఏర్పాటు కాగా..వెల్గటూరును జగిత్యాల జిల్లాలో కలిపారు. నిత్యం..అధికారుల సందడే: కొత్త జిల్లాలు విస్తీర్ణపరంగా చిన్నవి కావడంతో ప్రజలకు ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం అందుబాటులోకి వచ్చింది. గతంలో రెండు మూడు నెలలకు ఓ సారి కనిపించే కలెక్టర్, ఎస్పీ స్థాయి అధికారులు ప్రస్తుతం రోజు గ్రామాల్లో పర్యటిస్తూ పర్యవేక్షణ పరమైన భాద్యతల్లో మునిగి తేలుతున్నారు. జిల్లాస్థాయి అధికారులు ఒకే రోజు జిల్లాలోని సగం మండలాలను సులభంగా పర్యటించే అవకాశం ఉండటంతో ఎటు చూసినా అధికారుల హాడావుడి కనబడుతోంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో కలెక్టర్ శరత్, మెట్పల్లి రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ముషారఫ్ అలీలు ఇద్దరు ఐఏఎస్‌లే కావడంతో కింది స్థాయి అధికార యంత్రాంగం పనితీరు చాలా మేర మెరుగుపడింది. మొత్తం మీద 2016 సంవత్సరం జిల్లా కేంద్రాన్ని..అధికార యంత్రాంగాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చి ప్రత్యేకతను సంతరించుకుంది. -
యువకుడ్ని చితక్కొట్టిన జగిత్యాల ఎస్సై
-
కార్యాలయాల కోసం కసరత్తు
న్యాక్‌పై పునరాలోచన భవనాలను పరిశీలించిన కలెక్టర్ నీతూప్రసాద్ జగిత్యాల అర్బన్ : కొత్త జిల్లాలో పరిపాలన దసరా నుంచి మొదలు కానుండడంతో ఈ దిశగా అధికారులు పనులు వేగవంతం చేశారు. జిల్లా కార్యాలయాల తాత్కాలిక ఏర్పాట్ల కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా కలెక్టర్ నీతూప్రసాద్ జగిత్యాలలోని పలు భవనాలను శనివారం పరిశీలించారు. సబ్‌కలెక్టర్ కార్యాలయంతో పాటు గెస్ట్‌హౌస్, ఎస్సారెస్పీ క్యాంపులోని కార్యాలయాలు, న్యాక్ భవనాన్ని సైతం పరిశీలించారు. భవనాలకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యాక్ కేంద్రాన్ని తాత్కాలిక కలెక్టరేట్ కోసం ఇప్పటికే ప్రతిపాదించారు. అయితే ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితోపాటు పలువురు న్యాక్ భవనం దూరమవుతుందని, రోడ్డు సైతం బాగా లేదని, గుట్టలు, చెట్లపొదల మధ్య ప్రజల వెళ్లడం ఇబ్బందిగా ఉంటుందని అభ్యంతరం తెలిపారు. దీంతో కలెక్టర్ మరోసారి భవనాలను పరిశీలించారు. న్యాక్ భవనం కాకుండా కలెక్టరేట్‌కు ప్రత్యామ్నాయ భవనం ఎక్కడ ఉందని ఆరా తీశారు. ఎస్సారెస్పీ క్వార్టర్లు శిథిలావస్థకు చేరాయని తెలిపారు. ఇవి కలెక్టర్ కార్యాలయానికి అనుకూలంగా లేవని తెలిపారు. కలెక్టర్ వెంట సబ్‌కలెక్టర్ శశాంక, డీఎస్పీ రాజేంద్రప్రసాద్, తహసీల్దార్ మధుసూదన్‌గౌడ్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. -
జగిత్యాలకు చేరిన బాలికలు
విచారణ అనంతరం తల్లికి అప్పగింత జగిత్యాల అర్బన్ : పట్టణంలోని వసతి గృహం ఆనంద నిలయం నుంచి గతనెల 30న వెళ్లిపోయిన వొల్లెపు వీరమణి, వొల్లెపు గంగమణిని అధికారులు శనివారం జగిత్యాలకు తీసుకువచ్చారు. ముంబయ్‌లో తన తల్లివద్ద ఉన్న వీరిని అక్కడి పోలీసుల సహాయంతో అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాలకు తీసుకువచ్చి స్థానిక పోలీస్ స్టేషన్లో విచారణ చేశారు. అనంతరం తల్లిదండ్రులు వెంకటి, లక్ష్మికి కౌన్సెలింగ్ చేశారు. తర్వాత పిల్లలను తల్లికి అప్పగించారు. తమ మధ్య తలెత్తిన గొడవలతో పిల్లలిద్దరూ తండ్రి వద్దే ఉంటున్నారని, వారిపై ఉన్న ప్రేమతో కూతుళ్లను తీసుకుని ముంబయ్ వెళ్లానని లక్ష్మి తెలిపింది. హాస్టల్ అధికారులను అడిగితే పంపించరని, బయటకు రప్పించి ఆటోలో తీసుకెళ్లానని చెప్పింది. తర్వాత తానే హాస్టల్ అధికారులకు ఫోన్ చేసి విషయం చెప్పానని పేర్కొంది. అదృశ్యం కథ సుఖాంతమవడంతో సంక్షేమశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
నో సిగ్నల్
ట్రాఫిక్ సిగ్నల్స్ లైట్స్ ఏర్పాటయ్యేనా... కాబోయే జిల్లా కేంద్రం... ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ కరువు పాతబస్టాండ్‌లో ట్రాఫిక్ లైట్లు లేకపోవడంతో అస్తవ్యస్తం జగిత్యాల అర్బన్ : కాబోయే జిల్లా కేంద్రం. గ్రేడ్–1 మున్సిపాలిటీ. అయినా ఇప్పటివరకు ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ సక్రమంగా లేదు. పట్టణ జనాభా నానాటికీ పెరుగుతోంది. ప్రధాన కేంద్రం టవర్‌సర్కిల్ నుంచి చుట్టూ మూడు కి లోమీటర్ల మేరకు విస్తరించి ఉంది. పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకోసం పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. 1989 మాస్టర్‌ప్లాన్ ఇప్పటికీ అమలుకావడంతో ఇరుకైన రోడ్లతో పార్కింగ్ సమస్య తీవ్రంగా ఉంది. ప్రధాన సెంటర్లు అయిన కొత్తబస్టాండ్, పాతబస్టాండ్, తహసీల్ చౌరస్తా, టవర్‌సర్కిల్ సమీపంలో కూడళ్ల వద్ద కనీసం ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ లేకపోవడంతో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతీచోట ట్రాఫిక్ పోలీసులను నియమించినా ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయలేకపోతున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు మున్సిపల్ సమావేశంలో ప్రతిపాదన తీసుకొచ్చినప్పటికీ నీటిమూటలుగానే మిగిలిపోయాయి. గతంలో ఎమ్మెల్యే ఎల్.రమణ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. అయినా అమలుకు నోచుకోలేదు. ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చొరవ చూపి ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
కంట్లో నలక ఉందని వెళ్తే..
ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తన్నపల్లికి చెందిన దొమ్మాటి సునీత(28) కంట్లో నలక ఉందని మంగళవారం జగిత్యాల పాత బస్టాండ్ ప్రాంతంలోని ఓ కంటి ఆసుపత్రికి వచ్చింది. వైద్యుల నిర్లక్ష్యంతో ఆమె మృతి చెందింది. దీంతో సునీత కుటుంబ సభ్యులకు రూ.5.50 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నట్లు సమాచారం. జగిత్యాల మండలం అనంతారానికి చెందిన సమత గత శుక్రవారం ప్రసూతి కోసం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి, మృతి చెందింది. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో ఆస్పత్రి నిర్వాహకులు బాధిత కుటుంబానికి రూ.2.50లక్షలు చెల్లించినట్లు వివాదం నుంచి బయటపడ్డట్టుతెలిసింది. జగిత్యాల మండలం గుల్లకోటకు చెందిన నరేశ్ ఎండ్లబండి పైనుంచి పడడంతో అతడిని పట్టణంలోని పార్క్ సందిలో గల ఓ ఆర్థోపెడిక్ ఆస్పత్రికి తీసుకొచ్చారు బంధువులు. అతడిని పరిశీలించకుండానే ఆపరేషన్ చేయాలని వైద్యులు తేల్చారు. అనస్థీషియా మోతాదుకు మించి ఇవ్వడంతో నరేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. చనిపోయిన విషయాన్ని కప్పిపెట్టి.. మరో ఆస్పత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నట్లు నటించారు. చివరకు చావు కబురు చల్లగా చెప్పి.. రూ.2లక్షలు చెల్లించి గొడవ జరగకుండా జాగ్రత్తపడ్డారు. ఇవి.. మచ్చుకు కొన్ని మాత్రమే. ఇలాంటి ఘటనలు జగిత్యాల పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో తరచూ వెలుగుచూస్తున్నాయి. ఎవరైనా అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చారంటే అంతే సంగతులు. అవసరం లేకున్నా ఆపరేషన్ చేయాలంటున్న వైద్యులు.. చివరకు వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రాణాలకు విలువే లేదు? అనారోగ్యం బారిన పడితే ఆసుపత్రికి వస్తుంటారు. వైద్యులు పరీక్షించి అవసరమైన మందులు ఇవ్వాల్సి ఉంటుంది. పరిస్థితి విషమిస్తే అన్ని సౌకర్యాలున్న ఆసుపత్రికి రెఫర్ చేస్తే ప్రాణాలు దక్కే అవకాశం ఉంటుంది. కానీ..జగిత్యాలలో ఇలాంటి పరిస్థితులు కనిపించవు. అనారోగ్యంతో వచ్చిన వారిని పరీక్షించకుండానే ఆపరేషన్‌కు సిఫార్సు చేస్తున్నారు. ఇది ఒక్కరోఇద్దరో కాదు.. ప్రతి ఆసుపత్రి వైద్యుడూ ఇదే పంథాను ఎంచుకుంటున్నారు. వారి వైద్యం కాస్త వికటించి మరణిస్తే ప్రాణాలకు వెలకట్టి చేతులు దులుపుకుంటున్నారు. కుటుంబాలు విచ్ఛిన్నం వైద్యుల నిర్లక్ష్యంతో చనిపోయిన గుల్లకోటకు చెందిన రమేశ్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబ పెద్ద చనిపోవడంతో ఆ కుటుంబం వీధిన పడింది. అలాగే కంటి ఆస్పత్రిలో చని పోయిన సునీతకూ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అతడిని స్వదేశానికి పంపేందుకు అక్కడి స్నేహితులు చందాలు వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా వైద్యుల నిర్లక్ష్యానికి కుటుంబంలోని చిన్నారులు అనాథలవుతున్నారు. తెలిసీ తెలియని వైద్యం స్థానికంగా ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్న వారికి వైద్యంపై అవగాహన లేదంటున్నారు స్థానికులు. ఆపరేషన్ చేసినప్పుడు అనస్థీషియా ఇస్తుంటారు. దీనికి ప్రత్యేకంగా ఓ వైద్యుడు ఉండాలి. దీనిని విస్మరిస్తున్న స్థానిక వైద్యులు మోతాదు తెలియకుండానే.. మత్తు ఇస్తుండడంతో రోగుల ప్రాణాలు గాలిలో కలస్తున్నాయి. ఒక్కోసారి ఆసుపత్రి కంపౌండర్ సైతం మత్తు ఇన్‌జక్షన్ ఇస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తనిఖీలు శూన్యం గతంలో అపెండిసైటిస్ ఆపరేషన్లను ఇష్టానుసారంగా చేయడంతో స్థానిక ప్రైవేటు ఆస్పత్రులపై వైద్యాధికారులు నిఘా పెట్టారు. తనిఖీలు చేపట్టేందుకు ఓ కమిటీని వేశారు. ఆ కమిటీ నామమాత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంది. ఇప్పటివరకు అధికారులు ఒక్క ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిన దాఖలాలు లేవు. పట్టణంలో మొత్తంలో 71 ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. ఇందులో 17 ఆసుపత్రులకు ఇప్పటికీ రిజిస్ట్రేషన్ లేదు. కొన్ని రిజిస్ట్రేషన్లు చేసుకున్నా.. డాక్టర్లందరూ అందుబాటులో లేరు. రిజిస్ట్రేషన్ ఒకరిపేరిట ఉంటే.. వైద్యం చేసేది మరొకరు. ఇక మల్టీస్పెషాలిటీ, క్రిటికల్ కేర్ ఆస్పత్రులు ఐదు వరకు ఉన్నాయి. ఇలా పలు ఆస్పత్రుల్లో సైతం సరైన నైపుణ్యం లేనివారే స్పెషలిస్ట్‌లుగా చలామణి అవుతున్నట్లు ఆరోపణలున్నాయి. కంట్లో నలక ఉందని వెళ్తే.. కంట్లో నలక ఉందని వెళ్తే ఓ మహిళ ప్రాణం తీశారు జగిత్యాలలోని ఓ కంటి ఆసుపత్రి వైద్యులు. మృతురాలి సోదరి కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తన్నపల్లికి చెందిన దొమ్మాటి సునీత(28) కంట్లో నలతగా ఉందని సోమవారం జగిత్యాల పాత బస్టాండ్ ప్రాంతంలోని ఓ కంటి ఆసుపత్రికి వచ్చింది. వైద్యుడు ఎలాంటి పరీక్షలు చేయకుండానే ఆపరేషన్ చేయాలన్నాడు. ఆ సమయంలో తన వెంట ఎవరూ లేకపోవడంతో తన అక్కను తీసుకుని మంగళవారం మళ్లీ ఆసుపత్రికి వచ్చింది. మత్తు డాక్టర్‌తో మత్తు ఇప్పించాల్సిందిపోయి కాంపౌడర్తో ఇప్పించారు. మోతాదు మించడంతో సునీత అక్కడికక్కడే చనిపోయింది. ఆమె చనిపోయిన విషయాన్ని కప్పిపెట్టిన సదరు వైద్యుడు కరీంనగర్ ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు అక్కడి వైద్యులు నిర్ధరించారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే సునీత చనిపోయిందని బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పరిస్థితి చేయిదాటిపోతుండడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాత్రి 11 గంటల సమయంలో ఐఎంఏ సభ్యులు సునీత కుటుంబానికి పరిహారం ఇప్పించేలా ఒప్పించినట్లు సమాచారం. దీంతో సదరు వైద్యులు ఆమె ప్రాణానికి రూ.5.50 లక్షలు వెలకట్టి శవాన్ని అక్కడినుంచి పంపించినట్లు తెలిసింది. అనాథలైన చిన్నారులు సునీత భర్త శ్రీహరి ఆర్నెల్ల క్రితమే ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. ప్రస్తుతం సునీత చనిపోవడంతో వారి పిల్లలు వైష్ణవి, వేణు అనాథలయ్యారు. దుబాయ్ నుంచి శ్రీహరి వచ్చేందుకు చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో తోటి స్నేహితులే చందాలు వేసుకుని స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. -
ఆటో బోల్తా: 9 మందికి గాయాలు
జగిత్యాల: వేగంగా వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టిన ఘటనలో 9 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం అనంతారం వద్ద మంగళవారం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా ముల్కలగూడెంకు చెందిన హనుమాన్ భక్తులు ఆటోలో కొండగట్టు నుంచి ధర్మపురికి వెళ్తుండగా.. ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. -
నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి
జగిత్యాల రూరల్: కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం అంతర్గామ్ గ్రామంలో విషాదం అలముకుంది. ఓ చిన్నారి నీటి తొట్టిలో పడి ప్రాణాలు కోల్పోయింది. జలేందర్, సుమంత దంపతుల కుమార్తె సుష్మిత(3) బుధవారం ఉదయం ఆడుకుంటూ ఇంటి సమీపంలోనే ఉన్న పెద్దమ్మతల్లి ఆలయం వద్దకు వెళ్లింది. అక్కడే ఉన్న నీటితొట్టిపైకి ఎక్కి ఆడుకుంటూ అందులో పడిపోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. అరగంట సేపు తల్లిదండ్రులు తమ కూతురు కోసం వెతకగా చివరికి ఆలయం వద్ద నీటితొట్టిలో విగతజీవిగా కనిపించడంతో కన్నీరుమున్నీరయ్యారు. -
మిషన్ కాకతీయ పనులు ప్రారంభం
జగిత్యాల: కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం వెల్దుర్తిలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు. గ్రామ చెరువులో రూ. 20.38 లక్షలతో చేపట్టే పనులకు గురువారం ఆయన శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మానస, సర్పంచి సత్యనారాయణ పాల్గొన్నారు. -
కొడుకు మృతిని తట్టుకోలేక తల్లి మృతి
జగిత్యాల: కొడుకు మృతిని తట్టుకోలేక ఓ తల్లి ప్రాణాలు వదిలింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం ఇల్లంతకుంటలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వెంకన్న (50) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం రాత్రి వరంగల్‌లో మృతి చెందాడు. అతని మృతదేహాన్ని గురువారం స్వస్థలానికి తీసుకురాగా అది చూసి తట్టుకోలేక తల్లి నాగమ్మ(70) కొడుకు మృత దేహం వద్దే ప్రాణాలు వదిలింది. ఒకే ఇంట్లో ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
జగిత్యాలలో భారీ అగ్ని ప్రమాదం
-
జగిత్యాలలో భారీ అగ్ని ప్రమాదం
జగిత్యాల: కరీంనగర్ జిల్లా జగిత్యాల పట్టణంలోని టవర్ సర్కిల్ వద్ద ఓ షాపులో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏబీ వరల్డ్ పేరుతో ఉన్న గిఫ్ట్ షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రూ. 5 లక్షల మేర ఆస్టి నష్టం జరిగినట్టు సమాచారం. ఈ షాపును నెల రోజుల క్రితమే ప్రారంభించారు. -
ఏటీఎంలో దొంగతనానికి యత్నం
కరీంనగర్జిల్లా జగిత్యాల పట్టణంలో ఎస్బీఐ ఏటీఎంలో బుధవారం అర్థరాత్రి దొంగతనానికి ప్రయత్నించారు. బైపాస్‌రోడ్డులో ఉన్న ఏటీఎంలోకి కిటికీ అద్దాలు పగులగొట్టి ప్రవేశించిన దుండగులు.. లాకర్ ఓపెన్ చేసేందుకు విఫలయత్నం చేశారు. గురువారం ఉదయం బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఏటీఎంలోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు. -
గ్రామాల మధ్య చిచ్చుపెట్టిన శ్మశానం
కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల శివారులో ఉన్న శ్మశాన వాటిక రెండు గ్రామాల మధ్య చిచ్చు పెట్టింది. శ్మశానానికి చెందిన భూమి విషయంలో వివాదం తీవ్ర రూపం దాల్చింది. శ్మశాన వాటికకు ఇచ్చిన స్థలం తమ గ్రామానికి చెందిందని మోతే గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో జగిత్యాల- మోతే గ్రామస్థుల మధ్య వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. ఈ క్రమంలో గురువారం రెండు గ్రామాలకు చెందిన వ్యక్తులు ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడం కోసం శ్మశాన వాటికలో సమావేశమయ్యారు. చర్చల మధ్యలో ఇరు వర్గాలు దూషణలకు దిగడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శ్మశానం పరిధిలో మోతే గ్రామస్తులు తవ్విన బావిని జగిత్యాల వాసులు పూడ్చేయడంతో వివాదం ముదిరినట్లు తెలుస్తోంది. రెండు గ్రామాల మధ్య ఉద్రిక్తతలు తగ్గేలా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఏసీబీకి చిక్కిన మండల సర్వేయర్
కరీంనగర్: కరీంనగర్ జిల్లా జగిత్యాలలో మండల సర్వేయర్ శ్రీనివాస్ లంచం తీసుకుంటుండగా మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు(ఏసీబీ) చిక్కాడు. రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. -
విద్యుదాఘాతానికి యువరైతు బలి
జగిత్యాల రూరల్: విద్యుదాఘాతంలో ఓ రైతు పొలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా జగిత్యాల రూరల్ మండలం పెరకపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది. రవి (22) అనే రైతు ఉదయం పొలానికి వెళ్లి నీరు పెట్టేందుకు మోటార్ ఆన్ చేయగా విద్యుత్ షాక్‌కు గురై కుప్పకూలిపోయాడు. పక్క పొలంలోని రైతులు వచ్చి చూసేసరికి అతను చనిపోయాడు. చేతికి అందిన కొడుకు మృతిచెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
త్వరలోనే... జగిత్యాల జిల్లా
జగిత్యాలను అతి త్వరలోనే జిల్లా కేంద్రంగా మారుస్తానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. ‘నేను గతంలో జగిత్యాలను జిల్లా కేంద్రంగా మారుస్తానని చెప్పిన. నేను మాట ఇస్తే తలతెగిపడ్డా సరే మాట తప్పను. రాబోయే కొద్దిరోజుల్లోనే జిల్లాగా ప్రకటిస్తా. వాస్తవానికి ఐఏఎస్, ఐపీఎస్ కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. ఈ విషయాన్ని ప్రధాని, హోంమంత్రి దృష్టికి తీసుకుపోయిన. రాష్ట్రానికి అదనంగా ఐఏఎస్, ఐపీఎస్‌లను కేటాయిస్తామని చెప్పిండ్రు. రెండు మూడు నెలల్లో ఇది జరిగే అవకాశముంది. ఆ మరుక్షణమే జగిత్యాలను జిల్లాగా మారుస్తా. జిల్లా కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే అంశంపై స్వయంగా నేనే రెండు, మూడు గంటలపాటు పాదయాత్ర చేస్తా. మాస్టార్ప్లాన్ రూపొందిస్తా. ప్రస్తుతం పట్టణంగా ఉన్న జగిత్యాల త్వరలోనే సిటీగా రూపుదిద్దుకోవడం తథ్యం’ అని స్పష్టం చేశారు. -రాయికల్ సోమవారం కేసీఆర్ మహారాష్ర్ట గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్‌రావు, కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జోయల్ ఓరాం, త్రిదండి చిన్నజీయర్‌స్వామితో కలిసి రాయికల్‌లో పర్యటించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించారు. గిరిజన ఆడిటోరియం, కళ్యాణమండపాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో విద్యాసాగర్‌రావు స్థాపించిన విద్యాపరిశోధన, శిక్షణా సంస్థలను చినజీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్టుకు అప్పగించడంతోపాటు సంబంధిత పత్రాలను సీఎం చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతూ.. జగిత్యాల తాను, ఎంపీ కవిత స్వయంగా జగిత్యాలకు వచ్చి రెండు గంటల పాటు పాదయాత్ర చేసి ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం సర్వే చేస్తామన్నారు. బీడీ కార్మికులూ.. ఆందోళన వద్దు కరీంనగర్ జిల్లాలో బీడీ కార్మికులు అధికంగా ఉన్నారని వారి సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఎవరూ అడగకున్నా తానే స్వయంగా బీడీ కార్మికులను ఆదుకునేందుకు ప్రణాళిక రూపొందించానని తెలిపారు. బీడీ కార్మికులకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల జీవనభృతి ఇవ్వడం కోసమే పథకాన్ని ప్రారంభించామన్నారు. గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో బీడీ కార్మికులుగా పేరు నమోదు చేయించుకున్న వారికి మొదటిదశలో పింఛన్లు ఇస్తున్నామన్నారు. భృతి రాని బీడీ కార్మికులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మండల కేంద్రంలోని తహశీల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే పది పదిహేనురోజుల్లో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి గతంలో లబ్దిపొందుతున్న బీడీ కార్మికులతో సమానంగా జీవనభృతి అందజేస్తామని భరోసా ఇచ్చారు. దీనికోసం అధికారులు కూడా పూర్తిస్థాయిలో సహకరించి బీడీ కార్మికులకు న్యాయం చేయాలని సీఎం ఆదేశించారు. 2017 నుంచి ఏకధాటిగా 12 గంటల కరెంటు 2017 సంవత్సరానికి తెలంగాణ రైతాంగానికి ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు నిరంతర కరెంటు అందజేస్తామన్నారు. ప్రభుత్వంపై 1400కోట్ల రూపాయల భారం పడుతున్నప్పటికీ ఆహారభద్రత పథకం కింద పేదలకు కుటుంబంలో ఒక్కొక్కరికి 6కిలోల చొప్పున బియ్యాన్ని అందజేస్తున్నామని తెలిపారు. తాగునీటి సమస్యను నివారించడం కోసం వాటర్‌గ్రిడ్ వంటి బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఆదుకోవడం కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్నిప్రవేశపెట్టి ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకుంటుందని గుర్తుచేశారు. ప్రతి ఇంటిలో ఏదో ఒక రూపంలో ప్రభుత్వం నుంచి అర్హులైన వారు లబ్దిపొందేలా చూడడమే ధ్యేయమన్నారు. రాయికల్‌లోని చిన్నజీయర్‌స్వామి ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న వృత్తివిద్యా కళాశాలకు అన్ని రకాల సదుపాయాలను ప్రభుత్వం నుంచి అందజేస్తామన్నారు. ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గిరిజన విద్యాలయాలను అన్నిరకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాయికల్‌లో ఐటీడీఏ ఏర్పాటు :కేంద్రగిరిజన శాఖ మంత్రి జోలోరాం తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమం కోసం కృషిచేస్తామని, త్వరలోనే రాయికల్‌లో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జోయల్ ఓరాం అన్నారు. రాయికల్‌లో చిన్నజీయర్‌స్వామి ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గిరిజనుల పోరాట యోధుడు కొమురం భీం విగ్రహాన్ని కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. ప్రభుత్వం నుంచి గిరిజనులకు ఎన్నో రకాల రాయితీలను కల్పిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సభా ప్రాంగణంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి రాయికల్ మండలం జగన్నాథ్పూర్లోని గిరిజనుల సౌకర్యార్థం వంతెన నిర్మాణం చేపట్టాలని కోరగా, దానికి అవసరమయ్యే నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ట్రస్టు కోసం కృషి చేసిన చిన్నజీయర్‌స్వామి, విద్యాసాగర్‌రావులకు రుణపడి ఉంటానన్నారు. ఎడ్యుకేషనల్ ట్రస్టు అభివృద్ధి చేయడమే నా కల :గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్‌రావు రాయికల్‌లోని చిన్నజీయర్‌స్వామి ఎడ్యుకేషనల్ ట్రస్టును అభివృద్ధి చేయడమే తన కల అని మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్‌రావు అన్నారు. పన్నెండు సంవత్సరాల క్రితం గిరిజనుల అభివృద్ధి కోసం రాయికల్‌లో చిన్నజీయర్‌స్వామి ఆధ్వర్యంలో ట్రస్టుకు భూమిపూజ చేశామని, దాని తర్వాత అప్పటి మంత్రులు రత్నాకర్‌రావు, జీవన్‌రెడ్డి దశలవారీగా అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. తాను కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి చేయాల్సిన సమయంలో పదవి కోల్పోవడంతో ట్రస్ట్ మూలనపడిందన్నారు. గవర్నర్ అరుున తర్వాత ఎడ్యుకేషనల్ ట్రస్టు ద్వారా గిరిజనుల విద్యార్థులకు ఉపయోగపడడంతో పాటు రాయికల్ మండల ప్రజలకు గుర్తుండిపోయేలా ఒక ఫంక్షన్‌హాల్‌ను నిర్మించాలని సంకల్పించానన్నారు. మై హోమ్స్ అధినేత జూపెల్లి రామేశ్వర్రావు కోటి రూపాయల వ్యయంతో కల్యాణమండపం నిర్మాణానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి జోయల్ ఓరాంను ఆహ్వానించగా వీరి రాకతో కార్యక్రమం విజయవంతమైందని అన్నారు. త్వరలోనే ట్రస్టులో వృత్తివిద్యా కళాశాలను ప్రారంభించి నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించేలా కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, గిరిజన శాఖ మంత్రి చందులాల్, ఎంపీ కవిత, చిన్నజీయర్‌స్వామి, సాంస్కృతిక సారధి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, విద్యాసాగర్‌రావు, గంగుల కమలాకర్, బొడిగె శోభ, సతీష్‌బాబు, పుట్ట మధు, జెడ్పీ చైర్పర్సన్ ఉమ, కలెక్టర్ నీతూకుమారిప్రసాద్, ఎమ్మెల్సీలు భానుప్రసాద్, సుధాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ సంజయ్‌కుమార్, రాయికల్ సర్పంచ్ రాజరెడ్డి, ఎంపీపీ పడాల పూర్ణిమ, జెడ్పీటీసీ గోపిమాధవి పాల్గొన్నారు. -
బాలింత మృతికి కారణమైన వైద్యులను శిక్షించాలి
జగిత్యాల : బాలింత మృతికి కారణమైన రాయికల్ పీహెచ్సీ వైద్యులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ మృతురాలి బంధువులు శుక్రవారం జగిత్యాల తహశీల్ చౌరస్తాలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మల్లాపూర్ మండలం వేంపల్లివెంకట్రావ్పేటకు చెందిన మోత్కుల విజయ(20)ను తొలికాన్పు కోసం కుటుంబసభ్యులు రాయికల్ పీహెచ్సీలో చేర్పించారు. రెండు రోజులు ఆసుపత్రిలో ఉంచగా, గురువారం సాయంత్రం నొప్పులు రావడంతో అపరేషన్ చేశారు. మగబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తీవ్రరక్తస్రావం కాగా, జగిత్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా విజయ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహించిన బంధువులు వెంటనే రాయికల్ ఆసుపత్రిపై దాడి చేశారు. విజయ మృతికి కారణమైన వైద్యులపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని శుక్రవారం జగిత్యాల ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేయడానికి గ్రామస్తులు, బంధువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆర్డీవో కార్యాలయంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో స్థానిక తహశీల్ చౌరస్తాలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సదరు వైద్యులు, సిబ్బంది వెంటనే విధుల నుంచి తొలగించాలని, వారిపై కేసు నమోదు చేయాలని, విజయ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న వారి వద్దకు జగిత్యాల ఆర్డీవో ఎస్.పద్మాకర్ వచ్చి విజయ మృతికి కారణాలు తెలుసుకున్నారు. ఫిర్యాదు స్వీకరించి, కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ కోసం వైద్యుల బృందాన్ని నియమించినట్లు వెల్లడించారు. కలెక్టర్‌తో మాట్లాడి బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున సాయం అందించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు. నేడు త్రీమెన్ కమిటీ విచారణ రాయికల్ : విజయ మృతిపై విచారణ కోసం కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య ఆదేశాల మేరకు త్రిసభ్య కమిటీని నియమించారు. ఈ కమిటీలో డాక్టర్లు కొండల్‌రెడ్డి, వెంకటేశ్వర్రావు, భానుప్రియ ఉన్నారు. వీరు శనివారం రాయికల్ ఆసుపత్రిలో విజయ మృతిపై విచారణ చేపట్టనున్నారు. -
ఉలిక్కిపడ్డ జగిత్యాల
జగిత్యాల: తెల్లవారు జామున జరిగిన హత్యతో జగిత్యాల ఉలిక్కిపడింది. పట్టణంలోని పార్క్‌లైన్ రోడ్డులో మంగళవారం నడి రోడ్డుపై ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుడు.. సిద్దిపేటలోని కాళ్లకుంట ప్రశాంత్‌నగర్ చెందిన ఎండీ.లాల్‌మహ్మద్(40). తలపై రాయితో మోది హత్య చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నెల రోజుల క్రితం పాత బస్టాండ్‌లో యాచకుడి హత్య ఘటన మరిచిపోకముందే మరో హత్య జరగడంతో పట్టణ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వివరాలు కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. లాల్‌మహ్మద్, అతని తమ్ముడి యాకుబ్ కుటుంబాలు బతుకుదెరువు కోసం గ్రామాల్లో తిరుగుతూ పాతసామగ్రిని బాగు చేస్తుంటారు. బిందెలకు రంద్రాలు, చొట్టలు పడితే తీస్తుంటారు. ఈక్రమంలో గత నెల 19న సిద్దిపేట నుంచి బయలుదేరారు. పలు పల్లెలు తిరుగుతూ ఉపాధి పొందుతున్నారు. బక్రీద్ పండుగ కోసం ఇంటికెళ్లాలనుకున్నారు. ఈక్రమంలో ధర్మపురి మండలం తిమ్మాపూర్ నుంచి సోమవారం రాత్రి బస్సులో బయలుదేరి జగిత్యాల బస్టాండ్‌కు చేరుకున్నారు. భార్య, బిడ్డలను బస్టాండ్‌లో ఉంచి ఇద్దరన్నదమ్ములు పక్కనే ఉన్న కల్లుపాకలోకి వెళ్లారు. కల్లు తాగిన తర్వాత భార్య, బిడ్డలకు అన్నం తెచ్చి పెట్టమని తమ్ముడిని పంపించి, లాల్‌మహ్మద్ అక్కడే కూర్చున్నాడు. బస్టాండ్‌కు వచ్చిన యాకూబ్ కుటుంబసభ్యులకు తినుబండారాలు ఇచ్చి తను రాత్రి 11 గంటల వరకు అక్కడే ఉన్నాడు. అప్పటికీ అన్న రాకపోవడంతో యాకూబ్ కల్లుపాకకు వెళ్లి చూడగా లాల్‌మహ్మద్ అక్కడ కనిపించలేదు. చుట్టుపక్కల పరిశీలించిన ఆచూకీ లభించకపోవడంతో తిరిగి బస్టాండ్‌కు వెళ్లి ఈ విషయాన్ని వదినకు చెప్పి పడుకున్నాడు. పెట్రోలింగ్‌తో వెలుగులోకి.. తెల్లవారుజామున పోలీసులు పెట్రోలింగ్‌కు బయలుదేరడంతో ఈ హత్య విషయం వెలుగుచూసింది. స్థానిక పార్క్సంధిలో నడిరోడ్డుపై మృతదేహం కనిపించింది. రాయితో మోది హత్య చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. వీరి జీపును చూసి పరుగెత్తిన మతిస్థిమితం లేని వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్టాండ్ వద్ద నిలిచిన జాగిలం హత్య ఘటనను పరిశోధించేందుకు పోలీసులు కరీంనగర్ నుంచి జాగిలాన్ని తీసుకొచ్చారు. జాగిలం సంఘటన స్థలం నుంచి బస్టాండ్ వరకు వచ్చి ఆగిపోయిందని సీఐ నరేశ్‌కుమార్ తెలిపారు. తన మరిది యాకూబ్ రాత్రి రెండు గంటల ప్రాంతంలో బస్టాండ్ నుంచి లేచి వెళ్లాడని మృతుడి భార్య బీజానా భేగం ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పజెప్పారు. -
పసికందు కిడ్నాప్, మహిళల అరెస్ట్
-
పసికందు కిడ్నాప్, మహిళల అరెస్ట్
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా జగిత్యాలలో ఓ పసికందును కిడ్నాప్ చేసి ఇద్దరు మహిళలు అడ్డంగా దొరికిపోయారు. స్థానిక జయ నర్సింగ్‌హోమ్‌లో వారం రోజుల పసికందును ఇద్దరు మహిళలు అపహరించుకు వెళ్లారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించటంతో వారు రంగంలోకి దిగారు. పోలీసుల అప్రమత్తతో కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని, పసికందును తల్లిదండ్రులకు అప్పగించారు. -
నిధులున్నా.. మరమ్మతు జాడేది?
జగిత్యాల రూరల్ : ‘అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని..’ అన్న చందంగా ప్రభుత్వం పాఠశాలల మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేసినా అధికారుల మధ్య సమన్వయం లేక పనులు ముందుకు కదలడం లేదు. దీంతో ప్రధానోపాధ్యాయుల ఖాతాల్లోనే నిధులు మూలుగుతున్నాయి. వంట గదుల నిర్మాణానికి మంజూరైన నిధులను డిజైన్ లేదనే సాకుతో మురగబెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 218 ప్రభుత్వ పాఠశాలల మరమ్మతు కోసం ఆర్వీఎంఎస్ ద్వారా ఒక్కో పాఠశాలకు రూ.2 లక్షల చొప్పున రూ.4.36 కోట్లను ప్రధానోపాధ్యాయుల ఖాతాలో తొమ్మిది నెలల క్రితం జమ చేసింది. పనులు ప్రారంభించాలని డీఈవో పంచాయతీ రాజ్ శాఖ ఎస్ఈకి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ని ధులు ఆ శాఖ ఆధీనంలో లేవంటూ పనులు చేపట్టేం దుకు ముందుకు రాలేదు. మండలస్థాయిలో ఒకరికి టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ అప్పగిస్తామని చెబుతూ కాలం వెల్లదీస్తున్నారు. మరోవైపు జిల్లావ్యాప్తంగా పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వర్షం పడితే ఊరుస్తున్నాయి. ఎప్పుడు కూలుతాయో ఎవరికీ తెలియడం లేదు. నిధులు మంజూరై.. ఖాతాల్లో మూలుగుతున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ప్రమాదం సంభవించి.. జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే పాఠశాలలకు మరమ్మతు చేయించాలని కోరుతున్నారు. వంట గదులదీ అదే పరిస్థితి జిల్లా వ్యాప్తంగా వంట గదులు నిర్మించాలని ప్రభుత్వం 874 పాఠశాలలకు రూ.13.11 కోట్లు విడుదల చేసింది. వాటిని సీసీవో ఖాతాలో జమచేసింది. అయితే వంట గదుల డిజైన్ లేకపోవడంతో నిర్మాణం ఎలా చేయాలో ఆదేశాలు రాకపోవడంతో ఆ డబ్బులు నిరుపయోగంగా మారుతున్నాయి. దీంతో ఆరుబయటనే వంటలు చేస్తూ వర్షం పడిన రోజు నిర్వాహకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. -
పుష్కరాలకు ప్రణాళిక
జగిత్యాల : తెలంగాణలో వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు అవసరమైన ఏర్పాట్లకు యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్ల ఖర్చు చేస్తామని టీఆర్ఎస్ నేతగా కేసీఆర్ గతంలో ధర్మపురిలో హామీ ఇచ్చారు. నేడు ఆయనే సీఎం కావడంతో భారీగా నిధులు కేటాయిస్తారని ప్రజలు, అధికారులు ఆశిస్తున్నారు. ఈ పుష్కరాల ఏర్పాట్లపై గోదావరి నది పరివాహక ప్రాంతం లో గల దేవాలయాల అధికారులు ఇప్పటికే ఓ ప్రణాళిక తయారు చేశారు. 2015లో గోదావరి పుష్కరాలు 2003, జూలై 30 నుంచి 12 రోజులపాటు గోదావరి పుష్కరా లు జరిగాయి. అప్పుడు జిల్లాలో మల్లాపూర్ మండలంలోని వాల్గొండ, ధర్మపురి, కాళేశ్వరం, మంథని, కోటిలింగాల ప్రాంతంలో పుష్కరాలకు ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్‌లో ప్రధానంగా బాసర, గూడెం, మంచిర్యాల ప్రాంతాల్లో జరి గాయి. ఈ సారి 2015, జూలై 14 నుంచి 12 రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా పుష్కరాలు జరగనున్నాయి. ఏర్పాట్లపై ప్రణాళికలు గతంలో పుష్కరాల ఏర్పాట్లు హడావుడిగా నెల ముందు చేపట్టేవారు. కానీ ఈసారి ప్రభుత్వం ఏడాది ముందుగా అవసరమైన ప్రణాళిక తయారు చేయాలని అధికారులను ఆదేశించడంతో దేవాదాయశాఖ అధికారులతోపాటు రెవెన్యూ అధికారులు ప్రణాళిక తయారీలో నిమగ్నమయ్యారు. ధర్మపురిలో భారీ ఏర్పాట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్మపురికి తాను స్వయంగా రావడంతోపాటు జాతీయస్థాయి నాయకులను కూడా తీసుక వస్తాన ని ప్రకటించడంతో ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం అధికారులు భారీ ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నా రు. టీఆర్ఎస్లో కీలక వ్యక్తిగా ఎదిగిన ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ సైతం నిధులు ఎక్కువగా తెస్తారనే భావనతో అధికారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో పుష్కరాలకు ధర్మపురిని కేం ద్ర బిందువుగా మార్చాలని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రణాళిక తయారు చేసి సబ్ కలెక్టర్ శ్రీకేశ్ లట్కర్‌కు అందించారు. ఈ ప్రణాళికకు త్వరలో కలెక్టర్ సమక్షంలో జరిగే సమీక్ష సమావేశంలో ఆమోదముద్ర పడే అవకాశం ఉందని, ఒక్క ధర్మపురిలోనే రూ.100 కోట్లకుపైగా అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. ప్రణాళికలోని ముఖ్యాంశాలు * ధర్మపురి దేవాలయంలో శ్రాద్ధ మండపంతోపాటు కోనేరు(బ్రహ్మపుష్కరిణి) శుభ్రత, మరమ్మతులు, దేవాలయ ఆవరణలో కొత్త నిర్మాణాలు, పాతవాటిని తొలగించి కొత్తగా ఏర్పాటు చేయడం * పుష్కరాల సందర్భంగా తాత్కాలికంగా చలువ పందిళ్లు, షామియానాల ఏర్పాటు * నది దగ్గర 500 మంది ఒకేసారి కేశఖండన చేయించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు * విద్యుత్ సౌకర్యాలు, క్లాక్ రూముల ఏర్పాటు * దేవాలయం, ధర్మశాలలకు రంగులు వేయడం * వివిధ రూట్ మ్యాపులు, హెచ్చరిక బోర్డులు, సూచనల ప్లకార్డుల ఏర్పాటు * లడ్డు/పులిహోర ప్రసాద విక్రయకేంద్రాల ఏర్పాట్లు * 32 గదుల్లో వీఐపీల సేవలకు అవసరమైన సిబ్బంది. ప్రచార ఏర్పాట్లు. దేవాలయ భద్రత, ప్రముఖుల భద్రతా ఏర్పాట్లు * దర్శన సౌకర్యాలు(క్యూలైన్ల ఏర్పాట్లు) * 12 రోజులపాటు నిరంతర అన్నదానానికి ఏర్పాట్లు * నది ఒడ్డునున్న జిల్లాలోని ఇతర దేవాలయాల్లో ఏర్పాట్లు * పుష్కర ఘాట్లు వెడల్పు చేయడం, అదనంగా నిర్మించడం * నదిలో బారికేడ్ల నిర్మాణం. * బాత్రూంలు, టాయిలెట్ల నిర్మాణాలు * శానిటేషన్‌కు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం * మంచినీటి సౌకర్యాలు కల్పించడం * పర్యాటకశాఖ ఆధ్వర్యంలో చింతమణి చెరువును సుందరంగా తీర్చిదిద్దడం * వైద్య సౌకర్యాల కల్పనకు చర్యలు, గజ ఈత గాళ్లను ఎంపిక చేయడం * వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు నడిపే విధంగా చర్యలు * ధర్మపురి పట్టణాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దడం * పోలీసు బందోబస్తుకు ప్రత్యేక బలగాల ఏర్పాటు * మద్యనిషేధాన్ని కొనసాగించడం * వచ్చే ఏడాది గోదావరి పరివాహక ప్రాంతాల్లో పంటలకు క్రాప్ హాలీడే ప్రకటించేలా చర్యలు చేపట్టాలని ప్రణాళిక రూపకల్పన చేశారు. -
ఆరుతడికీ కరెంట్ షాక్
జగిత్యాల అగ్రికల్చర్ : వర్షాభావ పరిస్థితులతో దిక్కుతోచని రైతులు ఆరుతడి పంటలైనా వేసుకుందామంటే.. అదీ కొలిసొచ్చేలా కనిపించడం లేదు. ఎడాపెడా కరెంటు కోతలు అన్నదాలను అయోమయానికి గురిచేస్తున్నాయి. రాష్ట్రంలో విద్యుత్ కొరత తీవ్రం కావడంతో ఆ శాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారు. వర్షాభావంతో జలవిద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడం, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సరిపడా లేకపోవడం, ఇప్పటికిప్పుడు ఇతర రాష్ట్రాలనుంచి కొనుగోలు చేసే పరిస్థితి లేకపోవడంతో వర్షాకాలంలోనూ విద్యుత్ కోతలు తప్పడం లేదు. రానున్న రోజుల్లో కరెంటు సమస్య మరింత జటిలమయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆరుతడి పంటలు వేసినా.. వాటిని కాపాడుకోవడం ఎలాగా అని రైతులు ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతం వేసిన పంటలను రక్షించుకునేందుకే నానా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా అవసరాలకు రోజుకు 12 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం. రాష్ట్రంలోనే అత్యధికంగా మన జిల్లాలో 3.27 లక్షల వరకు వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి. వీటికి త్రీఫేజ్ కరెంటుకు రోజుకు ఆరు మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమవుతుంది. భారీ పరిశ్రమలకు రెండు మిలియన్ యూనిట్లు, గృహావసరాలకు 2.5 మిలియన్ యూనిట్లు, చిన్నతరహా పరిశ్రమలు, ఇతర వాటికి 1.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమవుతుంది. మొత్తం 12 మిలియన్ యూనిట్లు కాగా, జిల్లాకు రోజూ 8.5 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా అవుతోంది. 3.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉండటంతో తరచూ కోతలు తప్పడం లేదు. షెడ్యూల్ ప్రకారం విద్యుత్ సరఫరా చేస్తే డిమాండ్ ఎక్కువ, సరఫరా తక్కువ అయి సరఫరా వ్యవస్థ(గ్రిడ్) మీద ప్రభావం పడి కుప్పకూలే ప్రమాదముంది. దీంతో తరచూ కరెంట్ ట్రిప్ చేస్తున్నారు. 132 కేవీ లాంటి భారీ సబ్‌స్టేషన్లలోనే ఇలా కరెంట్ ట్రిప్ చేస్తున్నారు. దీంతో కరెంటు ఎప్పుడు వస్తుందో... ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉంటోంది. మార్చి, ఏప్రిల్‌లో విద్యుత్ వినియోగం అధికంగా ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఎదురుకాగా... ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులతో జూలైలోనూ ఇదే స్థితి కొనసాగుతోంది. రైతులు సహకరించాలి విద్యుత్ ఉత్పత్తి అనుకున్న స్థాయిలో లేకపోవడంతో, అవరసరమైనంత కరెంట్ ఇవ్వలేకపోతున్నామని... రైతులు సహకరించాలని విద్యుత్‌శాఖ అధికారులు కోరుతున్నారు. వ్యవసాయ బావుల్లో నీరున్నప్పటికీ కరెంటు ఇచ్చే పరిస్థితి లేదని పేర్కొంటున్నారు. ఇప్పటికే భూమిలో వేసిన విత్తనాలను కాపాడుకునేందుకు పంపుసెట్లను ఎక్కువగా వినియోగిస్తుండటంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని, ఓవర్‌లోడ్‌తో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని చెబుతున్నారు. మరోవైపు వరిపొలాలు సాగుచేసేందుకు సిద్ధమవుతున్న వారిని వారించలేక విద్యుత్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దిక్కుతోచని స్థితిలో అన్నదాత ఓవైపు వర్షాలు లేక, విద్యుత్ అందక రైతుల పరిస్థితి అగమ్యగోచరంలా తయారైంది. బావుల్లో నీరున్నా వినియోగించుకోలేని దుస్థితి. జిల్లాలో ప్రధాన పంట అయిన వరి సుమారు ఐదు లక్షల ఎకరాల్లో సాగవుతుంది. ఇప్పటికి 20 శాతం కూడా నార్లు పోయకపోవడంతో సాగుపరిస్థితి ఆందోళనకరంగా మారింది. గతంలో ఎస్సారెస్పీ ద్వారా సాగునీరందగా... ఆయకట్టు రైతులు అప్పుడప్పుడు మాత్రమే విద్యుత్ మోటార్లపై ఆధారపడేవారు. ఇప్పుడు వర్షాలు లేక... కాలువ నీరు రాక పూర్తిస్థాయిలో విద్యుత్ మోటార్లపై ఆధారపడే పరిస్థితి వచ్చింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే విద్యుత్ అందించే అవకాశాలు లేవని అధికారులు ముందుగానే రైతులను హెచ్చరిస్తున్నారు. దీంతో ఏం చేయాలో తోచక రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు. -
జగిత్యాలలో మాజీమంత్రి జీవన్ రెడ్డి గెలుపు
కరీంనగర్ : మాజీమంత్రి జీవన్ రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ తరపున జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జీవన్ రెడ్డి పోటీ చేశారు. ఆయన తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థిపై విజయం సాధించారు. ఇక ధర్మపురి, కోరుట్ల, పెద్దపల్లి నియోజకవర్గాలను టీఆర్ఎస్ గెలుచుకుంది. *ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్ (టీఆర్ఎస్)గెలుపు *కోరుట్లలో విద్యాసాగర్‌రావు(టీఆర్ఎస్) గెలుపు *పెద్దపల్లిలో మనోహర్‌రెడ్డి (టీఆర్ఎస్) గెలుపు -
జగిత్యాల జిల్లాపై ఆశలు
జగిత్యాల, న్యూస్‌లైన్ : జగిత్యాల కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుపై ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్లలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ప్రస్తుతం ఉన్న పది జిల్లాలను విభజించి మరో పద్నాలుగు కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నాయి. ఇటీవల జగిత్యాలలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు జగిత్యాలను జిల్లా కేంద్రంగా మారుస్తామని ప్రకటించారు. ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీ నాయకులు సైతం జగిత్యాల కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు భౌగోళికంగా అన్ని వసతులు ఉన్నాయని పలు సభల్లో పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జగిత్యాలను జిల్లా కేంద్రంగా మారుస్తామని అన్ని పార్టీల నేతలు హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ మరో అడుగు ముందుకేసి జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల జాబితాను ప్రకటించింది. ఇందులో జగిత్యాల సైతం ఉండటంతో ఈ ప్రాంత ప్రజల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. దశాబ్దాల క్రితమే ప్రతిపాదన దశాబ్దాల క్రితం నుంచే మంచిర్యాలను, జగిత్యాలను ప్రత్యేక జిల్లాలుగా ఏర్పాటు చేయాలనే డిమాండ్లున్నాయి. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో ఈ ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలన దాకా వెళ్లాయి. అప్పటినుంచి ఆర్ఎస్ఎస్ తమ కార్యకలాపాలను మంచిర్యాల, జగిత్యాల జిల్లాల పేరిటే నిర్వహిస్తుండటం తెలిసిందే. ఇంతకాలం మరుగుపడిన జిల్లాల పునర్విభజన అంశం తిరిగి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెరపైకి వచ్చింది. రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్ని పార్టీలకు ప్రచారాస్త్రంగా మారింది. ఐదు నియోజకవర్గాలతో.. జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోకవర్గాలతో జగిత్యాల కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. జగిత్యాల, కోరుట్ల, వేములవాడ, ధర్మపురి, చొప్పదండి నియోజకవర్గా లు కొత్త జిల్లా పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం మెట్పల్లి ప్రాంత ప్రజలు కరీంనగర్ వెళ్లాలంటే వంద కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోంది. జగిత్యాల కేంద్రంగా ఎటూ యాభై కిలోమీటర్ల పరిధిలోనే జిల్లా విస్తరించి ఉంటుంది కాబట్టి దూరభారం తగ్గుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేముల వాడ రాజేశుడు, కొండగట్టు ఆంజనేయస్వామి, ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి జగిత్యాల జిల్లాకు తలమానికంగా నిలువనున్నారు. జగిత్యాల మండలం పొలాస వ్యవసాయ పరిశోధన స్థానాన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయంగా మార్చాలనే ప్రతిపాదనలున్నాయి. -
నేరాలు, చోరీలకు చెక్
జగిత్యాల/టవర్‌సర్కిల్, న్యూస్‌లైన్: వివిధ రకాలైన నేరాలతో పాటు బ్యాంకుల్లో, వ్యాపార సంస్థల్లో జరుగుతున్న చోరీలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర డీజీపీ బి.ప్రసాదరావు తెలిపారు. ఈమధ్య కాలంలో బ్యాంకులు, నగల దుకాణాల్లో జరుగుతున్న చోరీల్లో స్థానిక పోలీసుల వైఫల్యం ఉందన్నారు. ఇలాంటి నేరాలను అదుపు చేయడానికి కొత్తగా పబ్లిక్ యాక్ట్ తీసుకొచ్చామని చెప్పారు. ఇందులో భాగంగా ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. బ్యాంకు లు, వ్యాపార సముదాయాల్లో సంఘటనలు జరిగినప్పుడు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అలారం మోగే ప్రక్రియకు రూపకల్పన చేస్తున్నామని చెప్పారు. దీనికితోడు స్థానికంగా సెక్యూరిటీ విభాగాల్ని ప్రైవేట్, పోలీస్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడానికి యోచిస్తున్నారు. వీటన్నింటిని పకడ్బందీగా అమలు చేయడం ద్వారా సత్ఫలితాలు వస్తాయని ఆయన వివరించారు. జగిత్యా ల, గొల్లపల్లిలో నూతనంగా నిర్మించిన పోలీస్‌స్టేషన్ భవనాలను ప్రసాదరావు ఆదివారం ప్రారంభించారు. అనంతరం పోలీస్హెడ్కార్వర్స్లో కంట్రోల్‌రూమ్‌ను ప్రారంభించారు. ఈ ఆయన సందర్భంగా మాట్లాడుతూ.. రానున్న ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టామని, అంతరాష్ట్ర సరిహద్దుల్లో హెలిక్యాప్టర్ ద్వారా జాయింట్ ఆపరేషన్‌కు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పదివేల మంది పోలీసు సిబ్బంది భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని, దశలవారీగా నియామకాలు జరుగుతాయని అన్నారు. పోలీసులు ప్రజలతో మమేకమై సేవాదృక్పథంతో పనిచేయాలని ఆయన సూచించారు. ప్రజలు తమ సమస్యలు తీర్చాలని పోలీస్‌స్టేషన్‌కు వచ్చినపుడు మర్యాదపూర్వకంగా ఫిర్యాదు స్వీకరించి సమస్యను పరిష్కరించాలన్నారు. బాధితుడికి న్యాయం చేయడమే పోలీసుల కర్తవ్యం కావాలన్నారు. సివిల్ కేసులో పోలీసులు జోక్యం చేసుకోరాదని ఆదేశించారు. ఒకవేళ తలదూర్చితే చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణలో కరీంనగర్ అభివృద్ధి చెందాలి తాను పనిచేసినప్పటికీ, ఇప్పటికీ కరీంనగర్ జిల్లా బాగా ప్రగతి సాధించిందని డీజీపీ అన్నారు. వ్యవసాయ రంగంలో జిల్లా బాగా అభివృద్ధి సాధించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వనరులున్న కరీంనగర్ ఇండస్ట్రీయల్ హబ్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో జగిత్యాల ఎమ్మెల్యేల ఎల్.రమణ, మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి, నార్త్‌జోన్ ఐజీ రవిగుప్తా, డీఐజీ భీమానాయక్, ఎస్పీ శివకుమార్, ఓఎస్డీ సుబ్బరాయుడు, అడిషనల్ ఎస్పీ జనార్దన్‌రెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల డీఎస్పీలు పరమేశ్వరెడ్డి, దామెర నర్సయ్య, సీఐ నరేష్కుమార్ తదితరులున్నారు. ఎస్పీ కృషి భేష్ డీజీపీ ప్రశంస టవర్‌సర్కిల్, న్యూస్‌లైన్: ఆధునిక సాంకేతిక టెక్నాలజీని వినియోగించుకోవడంలో ఎస్పీ శివకుమార్ కృషి ప్రశంసనీయమని డీజీపీ బి.ప్రసాద్‌రావు అన్నారు. ప్రజలకు మరింత చేరువై సేవలందించడంలో ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు. కరీంనగర్ పోలీస్‌హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్, ఈ-శోధన టెక్నాలజీని ఆదివారం ఆయన ప్రారంభించారు. డీజీపీ మాట్లాడుతూ.. జిల్లాలో నేరాల అదుపు కోసం మూడు వందలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో అవాంఛనీయ సంఘటనలు జరిగి నప్పుడు వాటి రికార్డులు నేర పరిశోధనకు తోడ్పడుతాయన్నారు. ఈ-శోధన టెక్నాలజీలో పోలీసు సమాచారాన్ని పొందుపరచి, వెబ్‌సైట్‌కు అనుసంధానం చేయడం వల్ల వివిధ రకాల సేవలు సత్వరం అందించేందుకు ఉపయోగపడుతుందన్నారు. కోర్టు కేసులు, పోలీసుల పనితీరు, ఆన్లైన్ వెరిఫికేషన్, పాస్‌పోర్ట్ దరఖాస్తుల విచారణ, స్టేషన్ల రిపోర్టును ఎప్పటికప్పుడు సరిచూసుకునే అవకాశం కలుగుతుందన్నారు. జిల్లాలో అరవై రక్ష క్ పెట్రోలింగ్ వాహనాలుండగా, జీపీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా వాటిని అనుసంధానం చేయడం జరిగిందన్నారు.