సాక్షి, జగిత్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని హనుమాన్‌వాడకు చెందిన బొక్కల మనీషతో బలవంతంగా ఫొటోలు దిగి వాట్సప్‌లో పెట్టి బ్లాక్‌మెయిల్ చేస్తున్న కుర్మ శ్రీకాంత్‌పై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై శంకర్‌నాయక్ తెలిపారు. జిల్లాకేంద్రానికి చెందిన బొక్కల మనీషకు జగిత్యాల మండలం పొలాస గ్రామానికి చెందిన కుర్మ శ్రీకాంత్‌కు పరిచయం ఏర్పడింది. దీంతో మనీషను వివాహం చేసుకోవాలని ఒత్తిడి పెంచగా ఆమె నిరాకరించింది.
దీంతో 10.12.2020న హనుమాన్‌వాడలో ఉన్న మనీషను శ్రీకాంత్‌తోపాటు కుర్మ రమేశ్ బలవంతంగా కారులో తీసుకెళ్లి జయ్యారంలో శ్రీకాంత్ వివాహం చేసుకున్నాడు. దీంతో నెలతర్వాత మనీష తప్పించుకుని జగిత్యాలకు చేరుకుంది. వివాహం జరిగినట్లు ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో మనీష ఎవరికి చెప్పలేదు. ఈ నేపథ్యంలో రెండురోజుల నుంచి బలవంతంగా వివాహ సమయంలో దిగిన ఫొటోలు మనీష తమ్ముళ్లు, వినయ్, మణిదీప్‌కు వాట్సప్‌లో పోస్ట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతుండడంతో బాధితురాలు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment